Saturday, 10 February 2018

జంబూ ద్వీప రహస్యం అను ప్రాచీన భారతీయ భూభౌతికశాస్త్ర పాఠము!

సనాతన ధార్మికులు దృశ్యమాన ప్రపంచంలోని సమస్తాన్నీ గణితశాస్త్రం యొక్క సహాయంతోనే ఎక్కువ అర్ధం చేసుకున్నారు.దైవాన్నీ ప్రకృతినీ జీవాన్నీ దైవానికీ జీవునికీ మధ్య ఉండే అనుబంధాన్ని కూడా గణితశాస్త్రం సహాయంతోనే నిర్వచించారు.దైవాన్ని స్తుతించే ప్రార్ధనల్లో కూడా వైజ్ఞానిక విషయాలు,ముఖ్యంగా గణితశాస్త్రపరమయిన విషయాలు స్ఫురణకి రావడం చాలా మామూలు విషయం!ప్రాచీన భారతీయ ఋషులు గణితశాస్త్రానికి "1" నుంచి "9" వరకు అంకెలనీ వాటికి "0" అనే శూన్యాంకం/పూర్ణాంకం అనే మరొకదాన్ని కలిపి విడదీసి చూసి వాటి వల్ల వచ్చే అన్ని రకాల సంభావ్యతలనీ కలిపి కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగహారాలు, వర్గాలు, వర్గమూలాలు, జ్యామితి వంటి విషయాలను ఎట్లా ప్రతిపాదించగలిగారో తల్చుకుంటే ఆశ్చర్యం వేస్తుంది!
ఎందుకంటే, ఒక విషయానికి శాస్త్రం హోదా ఇవ్వాలంటే ఆ విషయాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఇతరులు ఆ విషయాన్ని గురించి అడిగే "1.దీనితో ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యని ఎలా పరిష్కరించగలవు?2.నువ్వు చెప్పే విషయం సమస్యని పరిష్కరిస్తుందనే నమ్మకం ఏమిటి?3.మేము దీనిని ఎందుకు నమ్మాలి?" వంటి ప్రశ్నలకి జవాబు చెప్పాలి.శాస్త్రం అని చెబుతున్న దేనికైనా ప్రయోజనమే పరమార్ధం కాబట్టి శాస్త్రసంబంధమయిన విషయాల్లో నేను చెప్పాను గాబట్టి మీరు నమ్మితీరాలనే అనవసరమయిన సుత్తిని ఎవరూ ఒప్పుకోరు - "అసందర్భం వచనం బృహస్పతి రపి బ్రువన్ విద్వజ్జన మవమానం లభతే,తధ్యం" అని మన పెద్దలు కుండ బద్దలు కొట్టి చేప్పేశారు!
"1" అని మనం చూసేది కేవలం గుర్తు మాత్రమే - దాని వెనక ఉన్న భావానికి ఇది రూపం. ఈ భావం ప్రకృతిలో ఉన్నదాన్ని చూసి వర్ణించటం కాదు,వ్యక్తం నుంచి అవ్యక్తం వరకు ఎంత వెతికినా ఒకటి అనేదానికి అస్తిత్వం లేదు!మరి ఏమిటి దీని స్వరూపం?నేను మిమల్ని గందరగోళానికి గురి చెయ్యడం లేదు - తొలినాడు ఓక ఋషి గానీ కొందరు ఋషులు గానీ అంతకుముందు లేనిదీ ఇప్పుడు అది లేకపోతే మనం ఇక్క క్షణం కూడా బతకలేనిదీ అయిన ఒకటి అనేదాన్ని కనుక్కోవడం ఎట్లా సాధ్యపడిందో అర్ధం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను!ఈ ఒకటి అనేది మన చుట్టూ ఉన్న ప్రకృతిని అర్ధం చేసుకుని దానినుంచ్గి ప్రయోజనం పొందటానికి ప్రాచీన భారతీయ విజ్ఞానుల మేధస్సు నుంచి పుట్టిన జ్ఞానరాశికి సంకేతమే తప్ప భౌతిక ప్రపంచంలో గానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో గానీ దీనికి అస్తిత్వం లేదు - అర్ధమైందా! ప్రాచీన భారతీయ విజ్ఞానులు సిద్ధాంతీకరించిన ఈ ఒకటి అనే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, దానిని ఉపయోగించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఉపయోగించితే కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి - అన్నింటి కన్న విచిత్రం ఏమిటో తెలుసా, వారు ప్రతిపాదించిన తర్వాతనే ఇది ఉనికిలోకి వచ్చింది తప్ప అంతకు ముందు దీనికి అస్తిత్వమే లేదు!అంతకు ముందు ఎలా బతికారో తెలియదు గానీ ఇప్పుడు మాత్రం దీన్ని తల్చుకోకుండా ఒక్క క్షణం కూడా బతకలేం:-)
"2" నుంచి "9" వరకు ఉన్న అంకెలు "1"కి బహువులే గానీ ప్రతి అంకెకీ దేనికి ఉండే ప్రాధాన్యత దానికి ంది.సప్తమం అనే "7" గుర్తుకు రాగానే మొదట సప్తస్వరాలు గుర్తుకు వస్తాయి,ఇంకొంచెం ముందుకు వెళితే గంగ. యమున, సరస్వతి, గోదావరి, నర్మద, సింధు, కావేరి అనే సప్తనదులూ రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్ర అనే సప్త ధాతువులూ సువర్ణ, రజత, కాంస్య, తామ్ర, సీస/నాగ, వంగ, లోహ అనే సప్త లోహాలూ బ్రాహ్మి, మహేశ్వరి, కుమారి, వైష్ణవి, వారాహి, ఐంద్రీ, చాముండి అనే సప్త మాతృకలూ జంబూ, ప్లక్ష ,శాల్మలి, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపాలూ వస్తాయి.సంధ్యావందనం చేసే ప్రతి బ్రాహ్మణుడూ జంబూద్వీపే భరతవర్షే అని మొదలుపెట్టి తను ఉన్న ప్రాంతం అడ్రసు చెప్పి ఇక్కణ్ణించి నేను ఈ సంకల్పం చెబుతున్నాను అని తన రెక్వెస్టుని పోష్తు చేస్తాడు.
అదేమిటో గానీప్రకృతి మొత్తం లెక్కల మయమే - ఎక్కడ చూస్తే అక్కడ జామెట్రీ రఫ్ఫాడించేస్తంది దాన్సిగదరగ!అంతకి ముందు ఎట్టా బతికారో తెలీదు గానీ ఈ దిక్కుమాలిన హిండియా గడ్డాల వెధవలు కనిపెట్టాక మోనాలిసా చిరుబవ్వు యెనకాతల సెక్రెట్టుకీ ట్రయాంగిల్సూ, గోల్డెన్ రేషియోలూ, ఫ్రాక్టల్ మేధమేటిక్సూ కారణం అనేస్తన్నారు - ఎదవ గోల! "తొక్కలో సైన్సు!" అనీ "తొక్కలో హిందూత్వం!" అనీ "తొక్కలో కమ్యూనిజం!" అనీ "తొక్కలో క్యాపిటలిజం!" అనీ అనగలిగిన వాళ్ళు కూడా "తొక్కలో డబ్బు!" అని అనలేరు గదా!అలా అనగలిగినవాళ్ళు కూడా "తొక్కలో సున్నా!" అనీ "తొక్కలో ఒకటి!" అనీ ఆనలేరు గదా!అదీ ఇండియన్ బ్రామిన్స్ పవర్!మెళ్ళో వేసుకునే జంఝప్పోగుకి కూడా అనేకానేక రకాలైన లెక్కలు వేసి భక్తినీ ,లెక్క తప్పావో చస్తావనే భయాన్నీ మేళవించి సాటి బ్రాహ్మల్నే బెదరగొట్టి అదుపులో ఉంచగలిగిన ఘనాపాటీలకి మి=గతా కులాల వాళ్లని భయపెట్టటం ఒక లెక్కా!భయపెట్టడంలో గూడ ఒక లెక్కుంది,నువ్వంటే భయమో భక్తో లేంది ఏడేళ్ళ పిల్లాడు కూడా నీ మాట వినడు:-P)భక్తి ఉండాలంటే నువ్వు వాడికి మేలు చెయ్యాలి దానికి రాజ్యం చేతులో ఉండాలి!ఎదటివాళ్ళకి మేలు చెయ్యకుండా వాళ్ళని నీకు గులామును చేసుకోవాలంటే భయపెట్టటం ఒక్కటే దారి - నీకు తెలియనిది నాకు తెలుసు, దానితో నీకు ప్రమాదం కలిగించగలను అని చెప్పటం!అందరూ సమానమే అంటారు, కొందరు మాత్రమే అందలాలు ఎక్కుతారు.అందరిలోనూ దేవుడు ఉన్నాడంటారు,కొందరు మాత్రమే ఐశ్వర్యాలను పొందుతారు.వాడు గతజన్మలో పుణ్యం చేశాడు గాబట్టి ఈ జన్మలో భోగాలు అనుభవిస్తున్నాడు అంటారే గానీ వాడు ఈ జన్మలో పాపాలు చేస్తూ డబ్బు సంపాదించడం తప్పని చెప్పరు!వాళ్ళు తప్పులు చేస్తున్నారని తెలిసి కూడా తప్పులు చెయ్యొద్దని చెప్పకుండా శిక్షను మాత్రం తగ్గించడానికి వీళ్ళు పూజలు చెస్తారు - ఔరా బ్రాహ్మణు లెంతటి డాష్ డాష్ డాష్ గాళ్ళు!ఏడేళ్ళ పిల్లాడికి వచ్చే అనుమానాల్ని కూడా తీర్చలేనివాళ్ళు మాకు అన్నీ తెలుసునంటారు - హ్హేవిటో!సాఖ్యం సాప్తపదీనం అని ఏడుని శుభప్రదం చేశారా!మరిరైతులు ధాన్యం కొలిచేటప్పుడు మాత్రం "ఆరున్నొకటి!" అంటారు.ఎందుకయ్యా అంటే "ఏడుస్తూ ఏడు అనటం దేనికి?" అంటారు - ఎవరు చెప్పారు వాళ్లకి ఏడులో ఏడుపు ఉందని!రైతులు వాళ్ళకి వాళ్ళు అనుకున్నారా?అది కూడా బ్రాహ్మలే చెప్పారా?మిగిలిన అన్ని నంబర్లకీ లేని వివక్ష ఏడుకే ఎందుకు తగులుకుందో పాపం - దాని ఖర్మ అట్లా కాలింది కాబోలు!
చెప్పినపుడు ఒక్కొక్క అంకెకీ ఎంత గంభీరమైన అర్ధం చెప్పినా ఇవ్వాళ ఎవడిక్కావాలి?ఉచ్చకి "ఒకటికి పోవాలి సారూ!" అని ఒకవేలు చూపించడం ఇంకోదానికి రెండువేళ్ళు చూపించడం పిలగాయలకి ఎవరు నేర్పుతున్నారో!ముడుచుకు పడుకుంటే "మూడంకె వేశావేం?" అంటారు."నాలుగో ఎక్కం రాదు గానీ నా అంత పండితుడు లేడన్నట్టు!" అని వెక్కిరిస్తారు."అయిదు వేళ్ళూ నోట్లోకి పోతున్నాయా లేదా?" అని ఆరా తియ్యకపోతే సంపాదన సరిపోతున్నదా లేదా అని సూటిగానే అడగొచ్చుగా!పనీ పాటా లేకపోయినా హదావిడి చేస్తూ మిగిలినవాళ్లకి అడ్డమొచ్చేవాళ్ళని "వీడో ఆరో వేలు గాడు!" అని విసుక్కుంటారు.
అంకెల్ని గురించి తెలుసుకోవటం విసుగు పుట్టకుండా ఉండాలంటే, లెక్కలు హుషారుషారుగా చెయ్యగలగాలంటే వైదికగణితం చదవడం/నేర్చుకోవడం తప్పనిసరి - స్కూళ్ళలో కాలేజీల్లో ఎలాగొ చెప్పరు,హిందూ ప్రార్ధనే బూతు లెక్కన మారిపోయింది,సొంతంగా చదువుకోవడమే మంచిది!ఒకసారి దానికి అలవాటు పడితే క్యాలిక్యులేటర్లూ కంప్యూటర్లూ వాటి మూలాన జరిగే వ్యాపారాలూ ఢమాల్ - మరి ప్రభుత్వం వారు ఎట్లా సపోర్టిస్తారు?
అన్నీ వేదాల్లో ఉన్నాయిష గాళ్ళు అని వెక్కిరిస్తారు గానీ రైలూ,బస్సూ,పిజ్జా లాంటి సమస్తమూ ఉంటేనే అన్నీ ఉన్నట్టా?ఏది తెలుసుకుంటే మనిషి సుఖంగా బతకగలడో అది తెలిస్తే చాలదా?తీరిక ఉండి తెలుసుకోవాలని అనిపిస్తే అన్నీ తెలుసుకోవచ్చు!కానీ తీరిక ఎప్పుడు వస్తుంది?అప్పటికప్పుడు నువ్వొక పని చెయ్యకపోతే చస్తావు అని తెలిస్తే మొదట ఆ పని పూర్తి చేశాకనే తీరిక వస్తుంది - అవునా?మాతలు నేర్చిన వెంటనే చదువు మొదలుపెట్టాలి.చదువు పూర్తవగానే ఉద్యోగం తెచ్చుకోవాలి.ఉద్యోగజీవితం ఎపుడు ముగిసిపోతుందో అని భయపడినప్పుడు కూడా తీరిక రాదు.ఉద్యోగజీవితం భద్రమైనది అయితే అపుడు మిగిలిన విషయాల గురించి పట్టించుకోవచ్చు!ఇంతవరకు మనం సంపాదించే జ్ఞానం సమస్తం ధనం చుట్టూరానే తిరుగుతుంది,తిరగాలి,తిరకపోతే కుదరదు.ఇది చతురాశ్రమాల్లో మొదటి రెండూ అయిన ధర్మార్ధ సాధన,ఇది పూర్తి కాకుండా మిగిలిన విషయాలని గురించి ఆలోచిస్తే వీటికి చిల్లు పడుద్ది - పంబ రేగిపోద్ది!
సనాతన ధర్మానికి ఆదికాలంలో తీరికెక్కువ - సోమరితనం కాదండోయ్!పని ఉన్నప్పుడు రాక్షసంగా చేసేసి పనయ్యాక తీరికసమయంలో కళాత్మకతని పోషించారు - లెక్కల్ని కూడా చందస్సులో ఇరికించేటంత తీరిక దొరికేది.ఇప్పటివాళ్ళకి తామెందుకు పరిగెడుతున్నారో కూడా తెలుసుకోలేనంత మూర్ఖపు పరుగులో ఉన్న మతి కూడా పోయి చస్తంది,ఇంక అప్పటివాళ్ళ స్థాయిలో ఆలోచించడం కుదిరేనా పెట్టేనా?
గంగా సింధు సరస్వతీ ప్రాంతం ప్రపంచంలోని అత్యనత్ సారవంతమైన భూముల్లోకలా అతి శ్రేష్ఠమైనది!మనుషులు చూస్తే పాత రాతి యుగం నుంచే మిగిలిన అన్ని చోట్ల కన్న అన్ని పనుల్లోనూ ఆరితేరిపోయిన వాళ్ళు!సారవంతమయిన భూమిని రియల్ ఎస్టేట్/సెజ్/ఎకనమిక్ కారిడార్ పేరుతో ధ్వంసం చేయడం తప్పు అనేది ఇప్పటివాళ్ళకి చెవినిల్లు గట్టుకు పోరినా ఆర్ధం కాదు గానీ అప్పటివాళ్ళు మాత్రం ఏ భూమి ఏ రకమయిన ఉత్పత్తికి శ్రేష్ఠమో దానికే ఉపయోగించేవాళ్ళు!ఏ పని చేసినా తెలిసి చేసేవాళ్ళు గాబట్టి కష్టమో అయోమయమో అనిపించేది కాదు,పూర్తయ్యాక కలిగే గర్వాన్ని ఇతర్లతో పంచుకోవాలని అనిపిస్తుంది కదా - అందుకోసమయినా తీరిక కల్పించుకునే వాళ్ళు!"చూశావా,ఎంత ఘనకార్యం చేశానో!" అని ఒకడంటే "దీనికేనా?నేను చేసింది చూశావా!" అని మరొకడు అంటాడు.ఎవరు తక్కువ?అందరూ అందరే!
యుద్ధం మొదలవటానికి ముందు నిద్రపట్టక సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు చాలా విషయాలు అడుగుతాడు - వాటిల్లో ఒకటి ఈ రాజులందరూ ఇలా కొట్టుకు చచ్చే భూమి గురించి చెప్పే భూమిపర్వం.ఆ సమయంలో సంజయుడు రోదసి నుంచి చూస్తే భూమి ఎల అకనబడుతుందో వివరించాడు ఒక శ్లోకంలో:
यथा हि पुरुषः पश्येदादर्- शे मुखमात्मनः- ।
एवं सुदर्शनद्व- ीपो दृश्यते चन्द्रमण्ड- ले॥
द्विरंश- े पिप्पलस्तत- ्र द्विरंशे च शशो महान्।।-
(भी- ्म पर्व, महाभारत)
Meaning:-
अर्थ- जैसे पुरुष दर्पण में अपना मुख देखता है, उसी प्रकार यह द्वीप (पृथ्वी) चन्द्रमण्ड- ल में दिखाई देता है। इसके दो अंशों में पिप्पल (पीपल के पत्ते) और दो अंशों में महान शश (खरगोश) दिखाई देता है।
Just like a man sees his face in the mirror, so does the Earth appears in the Universe. In the first phase, you see Peepal leaves and the next phase you see a rabbit.

ఈ శ్లోకంలోని భావాన్ని గ్రహించి రామానుజాచార్యులు ఒక బొమ్మని గీస్తే చూసీన్వాళ్ళు నవ్వారు.కానీ ఇందులో ఉన్న నిజం తెలియాలంటే ఈ బొమ్మని పైకీ కిందకీ తిరగేసి చూడాలి - చూస్తున్నది రోదసి నుంచి గనక కుడి,ఎడమ,పైన,కినద్ అనేవి తారుమారు కావచ్చు ఒకోసారి!
ఎంత తీరిక దొరికితే మాత్రం ఇంత విచిత్రమా?ఒకాయన భూమిని రోదసి నుంచి చూస్తే ఎట్లా ఉంటుందయ్యా అని అడిగితే తడుముకోకుండా ఇట్లా ఉంటుందయ్యా అని చెప్పినవాడు అప్పటికే రోదసి నుంచి భూమిని చూశాడనే అనుకోవాలి గదా!ఆధునిక విజ్ఞానశాస్త్ర పారంగతులూ గతితార్కికభౌతికవాద సిద్ధాంతుల ప్రకారం యూరోపియన్లు జెట్లూ జాకెట్లూ రాకెట్లూ కనుక్కున్నాకనే రోదసియాత్రలు మొదలైనాయి కదా - మరి, మహాభారత రచన ఎప్పుడు జరిగింది?
అప్పటికే భూమి మీద ఏడు ఖండాలు ఉన్నాయనీ వాటి ఆకారాలు ఇలా ఉంటాయనీ తెలియడమే కాకుండా తన కావ్యంలో పొడుపుకధలా ఒక రచయిత వాడుకున్నాడంటే ఏమిటి అర్ధం?రామాయణ,భారత,భాగవత కధల్లో ప్రస్తావనకి వచ్చే ఇలాంటి ఖగోళ భూగోళ అసంబంధమైన విషయాలు రచయిత తనకి తెలిసిన మొత్తం విషయంలో అక్కడక్కడా ఏరుకుని చెబుతున్న టిట్ బిట్స్ మాత్రమే!వాల్మీకి కానివ్వండి,వ్యాసుడు కానివండి,భాసుడు కానివ్వండి - వీళ్ళ ప్రధానమైన వ్యాపకం రచన,వీళ్ళని శాస్త్రకర్తలు అని యెవరూ అనలేదు!తనలోనూ తనచుట్టూ అసలు జ్ఞానం చాలా ఉంటే ఇవ్వాళ్టి డాన్ బ్రౌన్ మాదిరి కధలో ఇరికిస్తే బాగుంటుందని చెప్పినవి కూడా మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయంటే అప్పటికి తెలిసిన మొత్తం విషయం ఎంత ఉంటుందో ఆలోచించండి!
ఇప్పుడు మనం చూస్తున్న ఖండాలు ఏడూ అప్పటి వాళ్ళు చెప్తున్న ద్వీపాలు ఏడూ వేరు వేరు , కొందరు పొరబడుతున్నట్టు ఈ రెండింటికీ ఎలాంటి సంబంధమూ లేదు!పోతన గారు తెనిగించిన వ్యాసప్రోక్తమైన బాగవత పురాణం యొక్క పంచమస్కంధంలో ప్రియవ్రతుడనే గొప్ప రాజు ఈ సప్తద్వీపాలు ఏర్పదటానికి కారణం అని చెప్తున్న కధ ఉంది.ఈ ప్రియవ్రతుడు స్వాయంభువ మనువు కుమారుడు.
5.1-13-ఆ.
సత్యసంధుఁడైన స్వాయంభువుం డను
మనువు బ్రహ్మచేత మన్ననఁ దగ
నంది యంత నారదానుమతంబునఁ
దనదు సుతుని రాజ్యమునను నిలిపె.
రాజైన ప్రియవ్రతుడు భగవంతుని ఆదేశంతో కర్మతంత్రపరుడైనా శ్రీహరి పాదపద్మాలను స్మరిస్తూ, రాగద్వేషాలను వదలిపెట్టి అనుదినం నిత్యానందాన్ని అనుభవిస్తూ ప్రజలను గొప్పగా పరిపాలించాడు.విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె అయిన బర్హిష్మతి అనే యువతిని పెళ్ళాడి ఆమెవల్ల శీలంలోను, ప్రవర్తనలోను, గుణంలోను, రూపంలోను, పరాక్రమంలోను, ఔదార్యంలోను తనతో సమానులైన ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనే పదిమంది కొడుకులను, ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు. వారిలో కవి, మహావీరుడు, సవనుడు అనేవారు చిన్నవారైనా బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మవిద్యా నిష్ణాతులై శాంతమే స్వభావంగా గలవారై పరమహంస యోగాన్ని పొందినారు. సమస్త జీవులకు ఆవాసమైనవాడు, సంసార భయ భ్రాంతులకు శరణ్యమైనవాడు, సర్వాంతర్యామి, భగవంతుడు అయిన వాసుదేవుని పాదపద్మాలను సర్వదా స్మరించడం వల్ల లభించిన భక్తియోగం ప్రభావంతో మనస్సు మరింత పరిశుద్ధం కాగా ఈశ్వర తాదాత్మ్యం పొందారు.
ఆ ప్రియవ్రతుడు మరొక భార్యవల్ల ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనే ముగ్గురు కుమారులను కన్నాడు. వారు చాలా గొప్పవారు. మనువులై మన్వంతరాలకు అధిపతులయ్యారు. ముందు పుట్టిన కవి, మహావీరుడు, సవనుడు నాశనం లేని మోక్షపదాన్ని అందుకున్నారు. తరువాత ప్రియవ్రతుడు తన బాహుబలంతో సమస్త శత్రుసమూహాన్ని ఓడించాడు. బర్హిష్మతి మీద అతిశయించిన అనురాగంతో యౌవన వికాసాలైన హాసలీలావిలాసాలలో మనస్సును లగ్నం చేసి వివేకం కోల్పోయిన వానివలె అఖండ భోగాలను అనుభవించాడు.ఈ విధంగా ప్రియవ్రతుడు పదకొండు అర్బుద సంవత్సరాలు రాజ్యం చేశాడు. 
ఒకనాడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్న సూర్యునికి ఆవలి భాగంలో కనిపించే చీకటిని రూపుమాపాలని అనుకున్నాడు. భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించడం వల్ల కలిగిన శక్తితో సూర్యుని రథంతో సమానమై తేజోమయమైన రథం ఎక్కి రాత్రులను పగళ్ళుగా మారుస్తానంటూ రెండవ సూర్యునిలాగా వెలిగిపోతూ ఏడుమార్లు సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేశాడు. అప్పుడు ప్రియవ్రతుని రథచక్రాలు గాళ్ళ వలన పడిన దారులు సప్త సముద్రా లయ్యాయి. ఆ గాళ్ళకు నడుమ ఉన్న భూమిపై సప్తద్వీపాలు ఏర్పడ్డాయి.
జంబూద్వీపం, ప్లక్షద్వీపం, శాల్మలీద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం, శాకద్వీపం, పుష్కరద్వీపం అనేవి సప్తద్వీపాలు. వాటిలో జంబూద్వీపం ఒక లక్ష యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇలాగే ఒకదాని కొకటి రెట్టింపు వైశాల్యం కలిగి వరుసగా ఏడు ద్వీపాలు ఉన్నాయి. వాటి నడుమ ఉప్పు సముద్రం, చెరకు సముద్రం, మద్యసముద్రం, ఘృతసముద్రం, పాల సముద్రం, పెరుగు సముద్రం, మంచినీటి సముద్రం ఏడు సముద్రాలు ఉన్నాయి. ఒక ద్వీపంతో మరొక ద్వీపం కలిసిపోకుండా ఉండడానికి సముద్రాలు ఏర్పడ్డాయి. అవి ద్వీపాల చుట్టూ అగడ్తల లాగా ఉన్నాయి. ఈ ద్వీప సముద్ర నిర్మాణాలు సకల జీవులకు ఆశ్చర్య జనకాలు.అటువంటి ద్వీపాలలో ప్రియవ్రతుడు తనంతటివారైన ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, మేధాతిథి, వీతిహోత్రుడు అనే కుమారులకు పట్టం కట్టించాడు.
ఒక్క జంబూద్వీపమే లక్ష యోజనాలు,వరస ప్రకారం ప్లక్షద్వీపం రెండు లక్షల యోజనాలు ఉంటుంది,శాల్మలిద్వీపం నాలుగు లక్షల యోజనాలు - అంత ఏరియాను కలిగియుండే సీను మనం ఉంటున్న భూమికి ఉందా?లేదు గాక లేదు!సనాతన ధార్మిక సాహిత్యంలోని ప్రతి ముక్కనీ ఆధునిక విజ్ఞానశాస్త్రం యొక్క గీటురాయితో పరీక్షించి చూసి దాని ప్రకారం నిజమని తెలిస్తేనే ఒప్పుకోవాలనే దురద నాకు లేదు - మీకు ఆ దురద ఉంటే వొదిలించుకోవడం తప్ప మరో మార్గం లేదు.
ప్రియవ్రతుడు తన కొడుకులను ఈ ద్వీపాలకు అధిపతులను చేశాడని చెప్పటాన్ని బట్టి భూమి కాక మానవులు నివసించదగిన గ్రహాలు విశ్వంలో మరొక ఆరు ఉన్నాయనీ వీటి మధ్యన రాకపొర్కల సంబంధాలు కూడా ఉండేవనీ లెక్కవేసి చెబుతున్నట్టు అర్ధం కావడం లేదూ!
సనాతనధార్మికసాహిత్యంలో భూమిని గురించిన పదజాలంలో బూమండలం, భూగోళం, భూలోకం, భూఖండం అని రకరకాల వర్ణనాత్మకమైన వైవిధ్యం కనబడుతుంది.వీటిమధ్యన తేడా తెలిస్తే ప్రాచీనులు చెప్పిన సప్తద్వీపాలకీ ఆధునికులు చూస్తున్న సప్తఖండాలకీ ఉన్న వ్యత్యాసం తెలుస్తుంది.ఆధునిక విజ్ఞానశాస్త్రం ఇప్పటికీ భూకేంద్రక సూర్యకేంద్రక సిద్ధాంతాలను రెంటినీ వాడుతున్నట్టే ప్రాచీన భారతీయ మేధావులు కూడా విశ్వనిర్మాణానికి రెండు విధాలైన విశ్లేషణలు చేశారు.దేవీభాగవతం మొదలుకుని దాదాపు అన్ని పురాణాల్లోనూ అనంతకోటి విశ్వాలలోని అని విశ్వాలకు వలెనే మన విశ్వానికి కూడా పధ్నాలుగు లోకాల విరాట్పురుష నిర్మాణానికి భూమియే కేంద్రం! బీరువా అరల్లా కనిపించే బ్రహ్మాందభాండపు నిర్మితిలో ఈ భూమి ఉన్న అరను భూలోకం అంటారు.ఈ నిర్మితి ప్రకార్మ్ సూర్యుడు,చంద్రుడు,ఇతర గ్రహతారకలూ పైన ఉన్న అరలో ఉంటాయి - విశవ్సృష్టి రహస్యం గురించి చెప్పిన చోట విస్తరించి చెప్పాను కదా!అంటే,ఈ భూలోకంలోని విశ్వసాగరంలో వలయాల అమరిక ఉంది,ఒకో వలయంలో ఒక్కో ద్వీపం ఉన్నది,లేదా వలయమే ద్వీపం కూడా కావచ్చు!
వీటిని విదియ్యటం కోసం విశ్వద్రవ్యం సప్త సాగరాల రూపం దాల్చింది - ఇది బ్రహ్మాండంలోని భూలోక వర్ణన.ఈ విశ్వనిర్మాణం ప్రకారం భూమియే విశ్వానికి కేంద్రంలో ఉండి తన చుట్టూ తాను కూడా తిరగకుండా అచలమై ఉంటే సూర్యుడు భూమికి నిలువునా సాగుతున్న విశ్వాక్షం చుట్టూ పెద్ద వలయ మార్గంలో అక్షానికి కట్టివేయబడిన గానుగెద్దు వలె ఏకచక్రరధంతో తిరుగుతూ ఉంటాడు.చంద్రుడు మరొక అంతరువులో చిన్న వలయంలో విశ్వాక్షం చుట్టూ తిరుగుతూ ఉంటాడు.అయితే,సూర్య సిద్ధాంతిక వంటి శాస్త్ర సంబంధమయిన గ్రంధాలు మాత్రం సూర్యుడు స్థిరంగా ఉండి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్న నమూనాని స్వీకరించి గణితశాస్త్రపరమైన విషయాలతో నిండి ఉన్నాయి.అంత మాత్రాన పురాణకధల్లో బ్రహ్మాండవర్ణన చేసినవాళ్ళకి  శాస్త్రజ్ఞానం లేదని కాదు - పురాణ కధలు స్థితిజ రూపాన్ని వర్ణిస్తే శాస్త్రచర్చలు గతిజ వేగాన్ని విశ్లేషిస్తునాయి
"ఇంతకీ ఇప్పుడు మనం చూస్తున్న భూఖండాల సంగతి ఏమిటి?కేవలం తిరగేసిన మ్యాపును పొడుపుకధలా చెప్పేసి వదిలేస్తే యెట్లా?చల్లకొచ్చి ముంత దాచినట్టు అవీ ఇవీ ఒకటి కాదోచ్, ఇంక ఇంట్టికెళ్ళిపోండి - తూచ్!" అనిగాని హరిబాబు ఇంతటితో వొదిలేస్తాడేమోనని మీరు బెంగ పెట్టుకోకండి.నేను నాగ సినిమాలో కుర్ర యంటీయార్ లాంటోణ్ణి - "నేను ఏదీ ఒకంతట మొదలెట్టను, మొదలెడితే కంపుకంపు చేసేవరకు ఆగను!"
నిజానికి ప్రాచీన భారతీయ మేధావులు భూమిపైన తొమ్మిది భూఖండాలు ఉన్నాయని చెప్పారు.దాదాపు అన్ని పురాణ కధల్లోనూ చిన్న చిన్న తేడాలతో ఒకే రకమైన విశ్లేషణలు కనబడుతున్నాయి.మొదట ఈ ముఖ్యమైన సారూప్యతలని గురించి తెలుసుకుంటే తర్వాత చెప్పబోయే విషయాలని అర్ధం చేసుకోవడం తేలికౌతుంది - అప్పుడు భరతవర్షం అన్నది గంగ, సింధు, బ్రహ్మపుత్ర, నర్మద, కావేరి, గోదావరి వంటి స్వాదుజలనదీప్రవాహాల మధ్యన కొలువై ఇప్పుడు మనం నివసిస్తున్న భారతదేశం,ఉత్తరధృవం నుంచి పైకి సాగి బ్రహ్మలోకం వరకు విస్తరించి మేరు శిఖరం ఉన్నది,ఇప్పుడు కనిపిస్తున్న భూఖండాలు కూడా మేరుశిఖరం మొదలవుతున్న చోట ఉన్న ఉత్తరధృవం మందారకేసరసదృశమై ఉంటే నాలుగు వైపులకీ విస్తరించిన సముద్రం మీద తేలియాడుతున్నట్టు కనిపించే భూఖండాలు కుసుమదళాల వలె అమరి ఉన్నాయి.
రెండు మూడు వరసల వలయాల ఈ అమరికలో భరత,కేతుమల,భద్రాశ్వ,కురు అనేవి ముఖ్యమైనవివ్.దక్షిణదిశకు సాగితే మొదట కింపురుషవర్షం,దాని తర్వాత హరివర్షం,ఆఖరున భరతవర్షం వస్తాయి.ఇక మేరుశిఖరబీజస్థానం నుంచి ఉత్తరానికి సాగితే మొదట రమ్యకవర్షం వస్తుంది, దాని తర్వాత హిరణ్మయవర్షం,దాని తర్వాత ఉత్తరకురువర్షం వస్తుంది. అప్పుడు  తూర్పుకు సాగితే భద్రాశ్వవర్షం ఉంటుందని చెబుతున్న చోట ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రం, అప్పుడు పడమరకు సాగితే కేతుమలవర్షం ఉంటుందని చెబుతున్న చోట ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి.తర్వాత కాలంలో జరిగిన భూఖండాల స్థానచలనం వల్ల ఇవి మనం గుర్తించలేని మార్పులకి లోనై ఉండవచ్చు, లేదా సముద్రగర్భంలో మునిగిపోయి ఉండవచ్చును.
జంబూద్వీపం గురించి మార్కండేయ పురాణం పైనా కిందా కొంచెం నొక్కబడి మధ్యన వెడల్పుగా ఉన్నట్టు వర్ణించింది.భాగవాత్ పురాణంలో భొమికి ఒకవైపున పగలు అయితే రెండో వైపున రాత్రి రాత్రి అవుతుందని చెబుతున్నది.జైన,బౌద్ధ మత సాహిత్యాలలో కూడా జంబూద్వీపమే విశ్వంలో స్వర్గనరకాలకు మధ్యన ఉన్న మధ్యమండలానికి కేంద్రస్థానంలో ఉన్నదని చెబుతున్నాయి.
ఒకప్పుడు పర్వతాలకి రెక్కలు ఉండేవనీ అవి అలా ఏగురుతూ ఎక్కద పడితే అకక్ద వాలుతూ ప్రజల్ని భయపెడుతుంటే ఇంద్రుడు వాటి రెక్కలు నరికేశాడనీ అప్పట్నుంచీ ఎక్కడి పర్వతాలు అక్కదే ఉండిపోయాయనీ వర్ణిస్తే నవ్వడం చాలా తేలిక,మన జ్ఞానానికి అతీతమైనది సమస్తం హేతువిరుద్ధమే అని అనుకోగలిగిన అహంకారం ఉంటే దేనినైనా అవమానించవచ్చును.ఒకప్పుడు భూమి మొత్తం ఏకఖండంగా ఉండేదనీ సూర్యకానితి మొత్తం భూమికి ఓకవైపునే పడుతూ ఉండేదనీ ప్రియవ్రతుని రధచక్రాల ధాటికి పగిలి ముక్కలైందనీ చెబితే నవ్వే వస్తుంది, నిజమే!కానీ అది సాహిత్యరూపం - ఇవ్వాళ సైన్స్ ఫిక్షన్ పేరుతో కార్ల్ సగన్,అసిమోవ్ లాంటివాళ్ళు రాసింది కూడా నిజమైన సైన్సు కాదు, అవునా?
ఆధునిక విజ్ఞానశాస్త్రం 250 మిలియన్ల సంవత్సరాల క్రితం ఇప్పుడు ఉతరధృవం ఉన్నచోట Pangea Proxima అనే పేరుతో ఆదిమ భూఖండం ఉండేదని చెబుతున్నారు.ఈ ఆదిమ భూఖండం Continental drift వల్ల జరుగుతూ వచ్చి ఇప్పుడు మనం చూస్తున్న అమరిక ఏర్పడిందనీ చెబుతున్నది నిజమే అయితే పురాన కధల్లో పోలికలుగా చెబుతున్నవాళ్ళకి అవి యెట్లా తెలిసాయనేది ఆలోచిస్తే మనిషైనవాడికి నవ్వు రాదు!మానవ్జాతి ఆఫ్రికా ఖండంలో ఆవిర్భవించిందని ఇప్పుడు అనుకుంటున్నది కూడా నిజం కాదోమో!భూమి ఏకఖండంగా ఉన్నప్పుడే ఆవిర్భవించి ప్రకృతిలో జరుగుతున్న ప్రతి మార్పునీ చూసి గుర్తు పెట్టుకుంటూ తర్వాతి తర్లకి అందిస్తూ వచ్చినప్పుడే వాటిని గురినంచి చెప్పగలగడం సాధ్యపడుతుంది - మరో విధమైన విశ్లేషణతో వీటిని అర్ధం చేసుకోవడం అసాధ్యం!
నిజానికి Continental drift theoryని కూడా అందరూ ఒప్పుకోవట్లేదు.ఈ సైంటిఫిక్ ధియరీ ప్రతిపాదనలే కొన్ని అసంగతమైనవిగా ఉంటున్నాయి,అన్ని రకాల సంభావ్యతలనీ విశ్లేషించలేకపోతున్నది. హిందువులు అటు సైన్సు గురించి గానీ ఇటు మతం గురించి గానీ ఏమీ తెలుసుకోకుండా ఎర్రిపపల్లా జకీరు నాయక్కూలకీ కంచె ఐలయ్యలకీ గోగినేని బాబులకీ జడిసిపోతూ ఉలిక్కిపడుతూ పిడుక్కీ బియ్యానికీ తేలుమంత్రమే అన్నట్టు "వీళ్ళ వల్ల ఏమీ కాదులే!సనాతనధర్మం మహత్తరమైనది!!" అని వీపులు చరుచుకుంటూ ఉంటే మట్టానికి మునిగిపోవడం ఖాయం.
క్రీ.శ 1990లో ఆగస్టు 10వ తేదీన Idaho Air National Guard సభుయ్డైన Bill Miller అనే పైలెట్ Oregon ప్రాంతపు గగనతలంలో గస్తీ విమానం నడుపుతూ ఒక ఎండిపోయిన సరస్సు మధ్యన నేలమీద ఒక విచిత్రమైన మరికని చూశాడు.పొడవూ వెడల్పూ కూడా మైలులో నాలుగోవంతు ఉండి 13 మైళ్ళ పొదవున్న గీతలతో ఏర్పడిన ఆకారం అది.విచిత్రం ఏమిటంటేఅరగంటకు ముందు ఆ ప్రాంతం మీద ఎగురుతున్నప్పుడు కనిపించని అంత పెద్ద ఆకారం అరగంటలోనే స్పష్టమై రూపు దాల్చింది!
Miller వెంటనే సమాచారం పై అధికారులకి తెలియజేశాడు.అయితే సుమారు 30 రోజుల పాటు జనానికి తెలియలేదు.సెప్టెంబర్ 12Boise TV station ఒక ప్రత్యేక కధనాన్ని పర్సారం చెయ్యడంతో అది హిందువులకి సంబంధించిన శ్రీచక్రయంత్రం అని అందరూ గుర్తు పట్టేశారు - అయితే,అంత సంక్లిష్టమైన హిందూమతానికి అసంబంధించిన నిర్మాణం అమెరికాలో ఎందుకు కనబడిందనేది ఎవరికీ అర్ధం కాలేదు!సెప్టెంబర్ 14కల్లా Associated Press, Bend Bulletin, the Oregonian లాంటి ప్రముఖ పత్రికలు వార్తలను ప్రచురించి మరింత దానికి ప్రచారం కల్పించాయి.
శ్రీచక్ర నిర్మాణం ఎంత సంక్లిష్టమైనదంటే ఒక రష్యన్ మేధావి దాన్న్ని అర్ధం చేసుకుని ఒక పుస్తకం రాయటానికి జీవితకాలం పాటు శ్రమించాడు!మధ్యభాగం పైకి చూస్తున్నట్టు అనిపించే ఒకదానిలో ఒకటి అమిరి ఉన్నట్టు కనిపించే నాలుగు త్రికోణాలు(శివ రూపం) ,అదే మాదిరి అమరికతో కొందకి చూస్తున్న అయిదు త్రికోణాలు(శక్తి రూపం) ఒకదాని నొకటి ఖండించుకుంటున్న గీతలతో కనిపించే చిక్కురొక్కురు రూఅపం - ఈ త్రికోణాల అమరిక చుట్టూ ఒక వృత్తం ఉంటుంది,ఈ వృత్తం పరిధి మీద పద్మదళాలు ఉంటాయి.సృష్టిలోని సమస్త విజ్ఞాన సారమూ శ్రీయంత్రంలో ఇమిడి ఉంది. దృశ్యమాన ప్రపంచంలోని ప్రతి అంశమూ ఒక్కొక్క చోట ఏర్పడిన చిన్న పెద్ద త్రికోణాలకు మధ్య ఉన్న పరస్పర సంబంధాల్ని విశ్లేషించి తెలుసుకోవచ్చు! సనాతన ధార్మిక సాహిత్యం మీద మంచి పట్టున్న ఘనాపాటీలే "నాకు దాని గురించి పూర్తిగా తెలుసు!" అని చెప్పలేని సంక్లిష్టమైన నిర్మాణాన్ని ఒక గొట్టంగాడు నెలరోజులు గూగులించి ఒక ట్రాక్టర్నీ,కొన్ని తాడు ముక్కల్నీ, కొందరు పిలకాయల్నీ తీసుకెళ్ళి గీసేశానని చెప్పేశాడు - అంతటితో సంతృప్తిపడిపోయి పరిశోధన ఆపేశారు, తమ పొట్టల కోసం డాల్ర్లు సంపాదించుకోవడానికీ తానా తందానా గన బజానాలకీ తప్ప ఎందుకూ పనికిరారు అమరికన్ హిందువులు!
సెప్టెంబర్ 15Don Newman, Alan Decker అనే ఇద్దరు UFOల మీద పరిశోధన చేస్తున్న మేధావులు ఆ ప్రాంతం కలయదిరిగి మనుషుల పాదముద్రలు గానీ వాహనాల టైర్ల గుర్తులు గానీ కనిపించడం లేదని నిర్ధారించారు.వీళ్ళిద్దరూ చేసిన పరిశోధనల్ని Oregon State Universityకి చెందిన Atmospheric Science Departmentలో పనిచేస్తున్న Dr. James Deardorff సంకలించి UFO magazine వాళ్ళకి పంపించాడు - అది ప్రచురించబడింది."అహో! అదరహో!!హిందూమతం గొప్పదనం అందరికీ తెలిసిపోయిందహో!!!" అనుకుంటున్నారు గదూ - ఆస,దోశ,అప్పడం.సరిగ్గ అ40వ రోజుకల్లా Bill Witherspoon అనే పెద్దమనిషి కల్టివేతరూ,తాళ్లూ,కుర్రాళ్ళూ వంటి గహ్నమైన పనిముట్లని ఊపయోగించి పది రోజులు కష్తపడి తనే గీశానని చెప్పాడు.సైంటిస్టులూ ప్రభుత్వమూ అది నమ్మేసి జనాన్ని కూడా నమ్మమని చెప్పేసి గెన్నె బోర్లించేసారు - కధ కంచికి,మనమింటికి."హాచ్!తూచ్!వూచ్!" అని ఎన్ని మూలుగులు మూలిగినా ఏమీ లభం లేదు.చచ్చిన సవమైనా లేస్తుంది గానీ కావాలని మొదునిద్ర పోయేవాణ్ణి ఎవరు లేపగలరు?
మొదటిసారి చూసి రిపోర్టు చేసినవాడు అరగంట క్రితం లేదని బల్లగుద్ది చెప్పాడు.ఆ పది రోజుల్లో ఈ పెద్దమనిషి కొందరు కుర్రాళ్ళని వెంటేసుకుని తిరుగుతుంటే మిగిలిన గస్తీ పైలెట్లు కూడా ఎవరూ రిపోర్టు చెయ్యలేదు.నమ్మేవాడు ఉంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అని కూడా అనొచ్చు.గవర్నమెంటూ సైంటిస్టులూ వొదిలేసినా మీడియా వదల్లేదు.Bill Witherspoon గార్ని మీడియా సాక్షిగా UFO పరిశోధకులు కుళ్ళబొడిచేశారు,లోపాయకారీ విచారణలో శ్రీవారికి శ్రెచక్రయంత్రాన్ని అర్ధం చేసుకోగలిగిన పాండిత్యం లేదని తేల్చిపారేశారు!
జనాన్ని చీల్చడానికి పనికొచ్చే రాజకీయ దృక్కోణం లేకుండా సనాతనధార్మికసాహిత్యాన్ని పరిశీలిస్తే ఒక్క భారతదేశపు చరిత్రనే కాదు ప్రపంచ చరిత్రను పునాదులతో సహా పెకలించి కొత్త చరిత్రలని రాసుకోవాల్సిన బాస్తవాలు ఎన్నో బయటపడతాయి!అయితే, ఆ పని ఎవరు చెయ్యాలి?హిందువులే చెయ్యాలి.
మరి  హిందువులకి ఎవరు చురుకు పుట్టించాలి?దేవుడే దిగి రావాలి!

1 comment:

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...