Thursday, 15 February 2018

మోదీ అనే ఒకే ఒక వ్యక్తిని నమ్ముకుని శవాసనం వేసిన భాజపా ఇక శవప్రాయమేనా?

అధికారం వచ్చిన మరునాటి నుంచే చెయ్యాలసిన పని తీరిగ్గా ఎన్నికల ముందు మొదలుపెట్టడంలోని తెదెపా నాయుడి రాజకీయం అబ్బురపరిచేలా ఉంది!హోదా ఇవ్వలేం,ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు థాంక్సు చెప్పింది తనే కదా!అన్నిసార్లు మొండిచెయ్యి చూపిస్తున్నప్పుడు మర్యాదకి రెండుసార్లు చూసీ చూడనట్టు పోయినా మూడోసారి నుంచే చెయ్యాల్సిన గొడవ అన్ని లెక్కలూ వేసుకుని తినడానికి భాజపాతో అవసరం ఉన్నంతవరకు వూరుకుని ఇంక తినడానికేం లేదన్నట్టు ఇప్పుడు రెచ్చిపోవడం నిజంగా తినమరిగిన రాజకీయ లక్షణమే!ప్రజలకి నిబద్ధుడైనవాడు ఎవ్వడూ ఇంతకాలం కేంద్రం రాష్ట్రం మీద చూపుతున్న వివక్షని భరించడు!

తెలుగుదేశం పట్ల నాకు ఎలాంటి అనుమానమూ లేదు - అన్ని రాజకీయ పార్టీల లాగే సొంత ప్రాభవం కోసం అంగలార్చే మనుషుల గుంపు మాత్రమే.జగన్ ఒక్కడే అవినీతిపరుడని తెదెపా పులుగడిగిన ముత్యమని నేనెప్పటికీ అనుకోను - వాడు దొరికిన దొంగ వీళ్ళు దొరకని దంగలు, అంతే!నైతికత అనేది వ్యక్తిగత స్థాయిలో గౌరవాన్ని పెంచుతుంది గానీ మొత్తం సమాజానికి సంబంధించిన సంస్థల విషయంలో ఆ సంస్థ ఆదాయాన్ని పెంచే సమర్ధతయే గౌరవాన్ని తెస్తుంది.

అధికారంలో ఉన్నవాడు పవిత్రంగా ఉండాలనేదిది ఆదర్శం అయితే సమర్ధత అనేది వాస్తవంలో అవసరమైనది.చిన్నప్పుడు చదివిన చందమామ కధలోనే ఆ రచయిత పెద్దయ్యాక కూడా పనికొచ్చే ఒక ఉదాహరణని కధలో చెప్పాడు.ఒక కుటుంబపెద్ద చనిపోయాక పెద్దకొడుకు కుటుంబం మొత్తానికి చెందాల్సిన ఆస్తుల్లో సొంతానికి దాచుకోవడం మొదలుపెట్టాడు.ఒక పదేళ్ళు చూశాక చిన్నకొడుకు తిరగబడి తను పెత్తనం తీసుకున్నాడు.రెండేళ్ళు కూడా గడవకముందే మిగిలినవాళ్ళు ఇతనిమీద తిరబడి పెద్దకొడుకునే మళ్ళీ రమ్మని అతని పెత్తనం కిందకి వెళ్ళిపోయారు.కీలకం ఎక్కడుంది?పెద్దకొడుకు కుటంబానికి ఆదాయం రప్పించడంలో సమర్ధుడు - పది రూపాయలు తెప్పించి నాలుగు రూపాయలు సొంతానికి దాచుకున్నా మిగిలిన వాళ్ళకి ఆరు రూపాయలు వస్తాయి గదా!చిన్నకొడుకు అన్నగారి అన్యాయం మీద తిరగబడినా కుటుంబానికి ఆదాయం పెంచడంలో అసమర్ధుడు.అసలు ఆదాయమే అయిదు రూపాయలు అయినప్పుడు తను ఎంత నీతిగా ఉండి అందరికీ పంచినా ఇదివరకటితో పోలిస్తే తక్కువే వస్తుందిగా!

ఈ రకమైన లెక్కలు మిగిలినవాళ్ళకన్న చంద్రబాబుకి ఎక్కువ తెలుసు - అందుకే అతని ఎత్తుగడలన్నీ మంచి ఫలితాల్ని ఇస్తున్నాయి!ప్రత్యేకహోదా వస్తే ఇన్‌కం టాక్స్ కట్టక్కర్లేదని అనే జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు, స్టాంపు పేపరు మీద రాసిమ్మన్నా రాసిస్తా - అజ్ఞానముతో కూడుకొన్న అహంకారము శ్రీవారిది, అతని కంటె ఘనులు అతని అభిమానులు!విభజనలో అన్యాయం చేశారని కాంగ్రెసువాళ్ళని ఇరుకున పెట్టడంతో ప్రతిపక్షం ఆనేది లేకుండా ఆడుతూ పాడుతూ నెట్టుకొచ్చేసిన చంద్రబాబుకి ఎన్నికలు దగ్గిర కొచ్చాక గానీ తను ఈ ఎన్నికల లోపు పూర్తి చేస్తానన్న వాటిలో ఏదీ పూర్తి కాలేదని తెలిసింది.విభజన సమయపు అన్యాయానికి కాంగ్రెసుని బలి తీసుకున్న తెలివితోనే విభజన తర్వాత జరిగిన అన్యాయానికి బాజపాని బలి పెడుతున్నాడు - రెండింటిలోనూ తన ప్రమేయం ఉంది,కానీ బ్లేం తన మెదకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు!

జనంలో మతావేశం రగిల్చే తక్కువరకం ఎత్తుగడలు మాత్రమే తెలిసిన భాజపా వాళ్ళు క్రౌచింగ్ టైగర్ లాంటి చంద్రబాబు మొదట్లోనే ఎందుకు రెచ్చిపోలేదో అర్ధం చేసుకోలేకపోయారు - అది వాళ్ళ అజ్ఞానముతో కూడిన అహంకారము!ఒకప్పుడు కాంగ్రెసువాళ్ళు నెహ్రూనీ ఇందిరనీ చూపించి పబ్బం గడుపుకున్నట్టు ఇప్పుడు మోదీని చూపించి పబ్బం గడుపుకుందామనే సత్రకాయలే బీజేపీ నిండా ఉన్నారు తెప్పలుగ నిండిన చెరువున చేరిన కప్పల వలె- దీనివల్ల ఇవ్వాళ కాంగ్రెసుకి పట్టిన గతియే రేపటి రోజున భాజపాకీ పడుతుంది,అది ఇప్పటికే కనబడుతూనే ఉంది,అయినా వాళ్ళకి తెలియడం లేదు!అసెంబ్లీకీ పార్లమెంటుకీ తమకి కేటాయించిన నియోజకవర్గంలో తమ సత్తాను చూపించి గెలవాల్సిన చోట కూడా పైవాళ్ళ మీద ఆధారపడితే కింది స్థాయి జనంతో టచ్ పోతుంది - అన్నీ అనుకూలించి సాగినంత కాలం బాగానే ఉంటుంది గానీ ఒకవేళ హఠాత్తు పరిణామం వల్ల జనం మారిపోతే తెలుసుకోవడం కష్టమవుతుంది.కళ్ళు తెరిచి నిజం తెలుసుకునేసరికి కాళ్ళ కింద నేల కదిలిపోయి కూలిపోవడమే మిగులుతుంది.ఇవ్వాళ ఆంధ్రా నుంచి ఎంతమంది భాజపా వాళ్ళు తెదెపా బాబు పేరు తీసెయ్యండి,మోదీ పేరు చెప్పకుండా పార్లమెంటుకి సొంత బలంతో వెళ్ళగలరు?

మిగిలిన అన్ని పార్టీలకీ వాళ్ళు ఎందుకు అట్లా చేశారనే విషయంలో క్లారిటీ ఉంది.ఆఖరికి ఎందుకు అంత చెత్తగా విడగొట్టారు అనే ప్రశ్నకి కాంగ్రెసు కూడా ఎన్నికల లోపు తెలంగాణ ఇచ్చేసి ఆ గుడ్విల్ హుషారుతో రాహుల్ బుజ్జాయిని ప్రధానమంత్రిని చేసెయ్యాలనే జవాబు ఉంది,కానీ ఆంధ్రాకి అన్యాయం జరిగందని ఒప్పుకుని కూడా అదీ ఇక్కడ అధికారంలో ఉన్నది మిత్రపక్షం అని తెలిసి కూడా భాజపా ఆంధ్రాకి ఇంత అన్యాయం ఎందుకు చేసింది అనే ప్రశ్నకి మాత్రం జవాబు లేదు!

"ఒళ్ళు బలిసి!" అని తప్ప నాకైతే తిన్ననైన జవాబు కనిపించటం లేదు.బీజేపీ అనే రాజకీయ పార్టీకి ఆంధ్రాలో ఓట్లు అక్కరలేదు కాబోలు!అధికారంలో ఉన్న తెదెపాని కాదని ప్రజలు తమకి ఓటు వెయ్యాలంటే ఏం చెయ్యాలి?బుర్రలో గుజ్జున్న మనుషులైతే తాము చెయ్యాల్సింది చేసి చూపించి బాబు సొంతానికి తంటున్నాడనో,మేమయితే అంతకన్న ఎక్కువే చేస్తామనో చెప్పుకోవాలి - అది తిన్ననైన రాజకీయం!చూడబోతే మోదీ దగ్గిర్నుంచి ఆంధ్రాలో గల్లీ స్థాయి కార్యకర్తల వరకు అధికారంలోకి రావడానికి పనికొచ్చే తిన్ననైన రాజకీయం అంటే ఏమిటో తెలిసినవాడు ఎవడూ లేనట్టుంది.ఇప్పుడు చూడండి, నిన్నటివరకు గమ్మునున్న అన్ని మిత్రపక్షాలూ బాబు వెనక చేరి గొంతు పెంచాయి!సందట్లో సడేమియా అన్నట్టు దక్షిణాది రాష్ట్రాలు అన్నీ బీమారీ రాష్ట్రాల పేరుతో మా పీక నొక్కితే వూరుకోం అని ఆల్టిమేటం కూడా ఇచ్చాయి.కన్నడ ముఖ్యమంత్రి లింగాయతుల గోలని రేపెట్టింది బీజేపీకి చుక్కలు చూపించడానికే.తమిళనాడులో ఇప్పటికే ఉత్తరాది పార్టీ పేరుతో బ్యానర్లు కట్టి తిడుతున్నారు.ప్రస్తుతానికి దక్షిణాదిలో గట్టి స్నేహితుడు చంద్రబాబు ఒక్కడే.అపారమైన రాజకీయ పరిజ్ఞానం ఉన్న అతన్ని భాజపా తక్కువ అంచనా వేసి ఇప్పటికే పీకలోతున ముణిగిపోయింది.ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని అతన్ని సంతృప్తి పరచకపోతే వచ్చే ఎన్నికల్లో అధికారం కష్టమే!

ఇప్పుడిక అతన్ని తప్పులు పట్తడం లాంటి చెత్తపనులు కూడా మరింత ప్రమాదం.ఏ విధమైన బేరసారాలూ లేకుండా చంద్రబాబు అడిగినవన్నీ ఇవ్వడం వల్లనే ఇప్పుడు బీజేపీ ముప్పుని తప్పించుకోగలదు.ప్రస్తుతానికి గండం గడిచి గట్టెక్కినాక భాజపా అధిష్ఠానం చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఆంధ్రా భాజపాలో ఉన్నవాళ్లని మెడపట్టి వేరే పార్టీల్లోకి పోయినా పర్లేదని నిర్ణయం తీసుకుని గెంటెయ్యాలి - సొంత ప్రతిభ మీద గెలవలేక మోదీ జపం చేసే ఈ దద్దమ్మలు పార్టీలో ఉండటం వల్ల నష్టమే తప్ప లాభం లేదు.రెండు స్థానాల నుంచి రెండు వందల పైచిలుకు స్థానాలు తెచ్చుకున్నప్పుడు పనిచేసిన అంకితభావం ఉన్నవాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి.క్షేత్రస్థాయిలో తిరిగి పని చేస్తే మంచి ఫలితం ఉండేచోట ఈ దద్దమ్మ మీద ఆధారపడటమే ఆంధ్రాకి సంబంధించి భాజపా అధిష్ఠానం చేస్తున్న అతి పెద్ద తప్పు!

"కారే రాజులు?రాజ్యముల్ గలుగవే?వారేరీ?సిరి మూటగట్టుకు పోవంజాలిరే!" అన్న కవివాక్యం హిందూత్వం రంగరించుకున బాహజపాకి తెలియకపోవడమే విచిత్రం!మోదీ చరిష్మా తగ్గిపోయింది,అతను ముళ్యమంత్రి స్థానానికి తప్ప ప్రధానమంత్రి స్థానానికి తగడని తెలిసిపోయేలోపు భాజపా తన తప్పుల్ని తను తెలుసుకుని సరిదిద్దుకోకపోతే కాలం కొట్టే దెబ్బకి గింగిరాలు రిరిగి మళ్ళీ రెండు సీట్లకి పరిమితం కావాల్సి ఉంటుంది - కాలం ఎవరికీ రెండు అవకాశాలు ఇవ్వదు


ఆంధ్రాకి అన్యాయం చెయ్యాలనుకున్నవాడు ఎవ్వడూ బతికి బట్ట కట్టడు!

15 comments:

 1. మనుష్యులు ఎవరు పుట్టినా ఈ 12 నెలలలో నే పుడ్తారు. ఏ నెలలో పుట్టిన వ్యక్తులు ఆయా కాలానికి తగ్గట్టు శరీర తత్వాన్ని కలిగి ఉంటారు. మనిషి కానీ జంతువు కానీ శరీర తత్వానికి భిన్నంగా వ్యవహరించడం సాధ్యపడదు. నాకు 12 రాశులవారూ ఎలా ప్రవర్తిస్తారో కొంత అవగాహన ఉంది. ఆ అవగాహన తోనే నేను వారితో వ్యవహరిస్తాను. చంద్రబాబు నాయుడు గారి కంటే కే సీ ఆర్ సమర్ధుడు అని ఆయన పుట్టిన రాశిని బట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మొదటి నుండీ విభజన కంటే కే సీ ఆర్ ని ముఖ్యమంత్రిని చేసి ఉంటే బాగుండేదని వాదిస్తూ వచ్చాను. అనుభవం వేరు సమర్ధత వేరు. పట్టిన పట్టు విడువకపోవడం కే సీ ఆర్ తత్వం. ఆ పట్టు ఉండడం వల్లే అన్ని పనులూ దబాయించి చేసుకుంటూ వస్తున్నారు. ఆయన మాట వినకపోతే నోటికి వచ్చినట్లు తిడతారు. అదొక్కటే ఆయన బలహీనత. అపుడు ఆంధ్రావారిని ఇష్టమొచ్చినట్లు తిట్టి ఉండకపోతే ఈ రోజున కే సీ ఆర్ ని అందరూ నెత్తినపెట్టుకుని ఉండేవారు. మళ్ళీ తెలంగాణా రేంజ్ లో ఉద్యమం సాగితే తప్ప విభజన సమస్యలు తీరవు. అంతటి సమర్ధుడు ఆంధ్రాలో ఇపుడున్న నాయకుల్లో నాకు కనిపించడం లేదు. గల్లా జయదేవ్ లాంటివారు ఉపన్యాసాలకే పరిమితం. కే సీ ఆర్ లాంటి వారు కావాలి. మీరు ట్రై చేయకూడదూ ?

  ReplyDelete
 2. టీడీపీకి జన్మతః కలిగిన విచిత్రమయిన సంకటం ఒకటుంది. కేంద్రంలో అధికారం ఆటలో మూడు విభిన్న ప్రత్యామ్నాయాలు ఉన్నాయి: వీటిలో టీడీపీకి రెండే అప్షన్లు కుదురుతాయి.

  ఈ పరిస్థితి టీడీపీ, ఆర్జేడీ & అకాలీ మినహా వేరే ఎవరికీ లేదు. శివసేన కూడా ఒకప్పుడు ఇంతే ఇప్పుడిప్పుడే దీన్నించి విడుదల అవుతుంది.

  ప్రత్యామ్నాయాలు తక్కువ అయినప్పుడు బేరాలు చేసే బలం తగ్గుతుంది. మేము కాంగ్రెస్ వైపు వెళ్తాం అని బెదిరించి లాక్కోవడం కుదరదు, మూడో సమాఖ్య అవకాశం అంతంత మాత్రం!

  2014 అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ బీజేపీ రెంటికీ కలిసి 46.9% ఓట్లు వచ్చాయి, అంటే అతిస్వల్ప (2.7%) తేడా. దేశవ్యాప్త నరేంద్ర మోడీ వేవ్ లేకుండా ఉంటె చంద్రబాబు గద్దె ఎక్కడం కష్టమే అయి ఉండేది. అదే సమయంలో మోడీకి సొంత మెజారిటీ రావడం వలన కేంద్రంలో చక్రం తిప్పాలన్న బాబు కల అడియాస అయింది.

  Far from Babu becoming a king maker at the center, BJP almost became a kingmaker in the state. అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా పడ్డావులే బుల్బుల్ పిట్టా! అన్నట్టు మారింది వ్యవహారం

  ReplyDelete
  Replies
  1. మరి 2014 ఎలక్షన్స్‌కి కాస్త ముందు జరిగిన జిల్లా పరిషత్, మండల్ పరిషత్ ఎన్నికల్లో తేదేపా బీజేపీ, పవన్ కల్యాణ్ సీన్లో లేకపోయినా ఎలా మెజారిటీ సీట్లు సాధించిందంటారు. ఆ ఎన్నికల ఫలితాలు కోర్ట్ తీర్పుతో ఆగకుండా బయటకి వచ్చుంటే బాబు బీజేపీతో పొత్తు పెట్టుకునేవాడే కాదు.

   రాష్ట్రం విడిపోయి ఉన్న స్థితిలో చంద్రబాబు కన్నా అనుభవం ఉన్నవాడు లేడని జనాలు ఆల్రడీ ఫిక్సయ్ ఉన్నారు, బాబుకే ఆవిషయం తెలీక పొత్తుకు దిగాడు.

   తేదేపాకి జన్మత కాంగ్రెస్తో కలవలేని సంకటం నిజమే, కానీ ఆ చరిత్రంతా వొదిలేస్తే బెటర్. పార్టీ వ్యవస్తాపకుడినే వదులుకుని ఇన్నేళ్ళు నెగ్గుకురాగల పార్టీకి ఈ సంకటం మాత్రం ఎందుకుండాలి.

   మెజారిటీ ఉన్న కేంద్రంతో పెట్టుకోటం రాష్ట్రానికి నష్టం, చెంబూ తపేలా కూడా లేని స్తితిలో. అందుకే చివరి బడ్జెట్ వరకు ఆగటం, విన్నపాలతో లాగటం. ఇక వచ్చేదారి లేదు కాబట్టి, ఎలక్షన్ ఏడాది కాబట్టి గొడవకి దిగటం. ప్రతిపక్షాలు రోడ్ల మీదకొచ్చి కేంద్రం మీద ఎన్ని రంకెలైనా వేయొచ్చు, వేయాలి కూడా. కానీ ప్రభుత్వానికి, ఏమీ లేని స్తితిలొ కూడా ఎంతో కొంత చేసి చూపించి, ఎలాగోలా పాలన నడపాల్సిన బాధ్యత ఉంటుంది. కేంద్రం మీద వీరోచిత పోరాటాలు అనుకోటానికి బావుంటాయి కానీ, ఇంత మొండి ప్రధానితో పెట్టుకుని రావాల్సిన కాస్తా చెడగొట్టుకుని పాలన పడకేయిస్తే జనం వైకాపాని, జనసేనని అడగరు, తేదేపాని అడుగుతారు. ఇంత లోటులో ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం కేంద్రంతో పెట్టుకోదు, పెట్టుకోకూడదు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు రోడెక్కాలి, అది చూపించి ప్రబుత్వం కేంద్రాన్ని బెల్లించి రావల్సింది రాబట్టుకోవాలి. మన ప్రతిపక్షం కేంద్రాన్ని ఏమనదు, ప్రభుత్వం నడిపే పార్టీని అనమంటుంది. దానివల్ల చివరకి రాష్ట్రానికే నష్టం.

   Delete
  2. @Anonymous16 February 2018 at 03:07
   మెజారిటీ ఉన్న కేంద్రంతో పెట్టుకోటం రాష్ట్రానికి నష్టం,

   hari.S.babu
   I agree with you!

   Delete
 3. What Alexander, Ashoka and the western missionaries had failed to do was accomplished by Macualay's educational minutes, decreeing that India was to receive through English education, the language of the West. "The very foundations of her ancient civilization began to rock and sway. Pillar
  after pillar in the edifice came crashing down." But Macaulay did a more harmful thing, which is not generally known. He adopted the "downward filtration method" for educating the Indians. What is this method? The problem facing Macaulay was that Indians were numerous and The British were a handful. How were they going to educate the Indians? How could this nation be weakened so that in self forgetfulness it would support the British Raj?

  "భారతదేశం మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ కిందకి వచ్చేసి ఎలిజబెత్ రాణి అది గమనించి వ్యాపారస్తుల చేతుల్లో ప్రభుత్వం ఉండినట్లయితే బోస్టన్ టీ పార్టీ తిరుగుబాటు జరగవచ్చని తమ ప్రభుత్వాన్ని పెట్టిన కాల్మ్ నడుస్తున్నప్పుడూ క్రీ.శ 1947లో వాళ్ళు తట్టా బుట్టా అస్ర్దుకుని వెళ్ళేనాటికీ కూడా దేశ జనభాలో 5% మించని వాళ్ళు ఏ ట్రిక్కు వేసి అంత స్థాయిలో పెత్తనం చెయ్యగలిగారు?" అనేది నాకు ఎక్కువ కుతూహలం పుట్టించిన విషయం.దానికి కార్ణం ఇక్కడ తెలుస్తున్నది.

  TO BE CONTINUED FROM ABOVE

  ReplyDelete
 4. CONTINUED FROM THE ABOVE
  The story goes that once when he was in Ooty, in his residence, he saw an Indian officer coming and touching the feet of a peon sitting outside his office (which was near his residence.) and was obviously surprised. Why was an officer touching the feet of a peon? He was told, "You don't know, this Indian society is a peculiar one. Here the Brahmins are respected and the peon belongs to that caste." The changes that Macaulay brought after this are well documented and authenticated in books. The downward filtration method was formulated according to which the forward caste (even this was much later) was given preference in schools. To put it in his own words," But it is impossible for us with our limited means to educate all in English. We must at present do our best to form a class of persons Indian in blood and colour but English in tastes, in opinion, in morals, and in intellect.' To gauge how much he succeeded in hismission, we only need to look into the history of the Indian educated classes since that time onwards. The fact is that we have not tackled the Macaulayian issue even after Independence, and graver still, few realise that the problem exists at all. The system of giving preference to Brahmins in the govt. and missionary run schools went on for nearly hundred yrs. In the meantime other castes practicing any trade had lost their business due to the flooding of Indian markets with British goods and also due to the deliberate strangulation of their business by the British. Due to the land policy of the British, born out of their greed, the farmers had become landless labourers in their own lands, and the landlords the cruel stooges of the British. The systematic destruction of the Indian system of education deprived certain castes of education. Thus over a hundred years these castes had become impoverished and ignorant and the Brahmins who were supposed to lead the society became distorted in their understanding of things, due to foreign education.

  ఔర!ఔర!ఏమి తెలివి?ఏమి ప్రణాళిక?వాళ్ళు మొదట్ అక్కున జేర్చుకున్నది బ్రాహ్మణుల్నీ అగ్రవర్ణాల వాళ్ళనే!ఎవరైతే ఇంగ్లీషువాళ్ళు మమ్మల్ని అక్కున జేర్చుకోకపోతే ఈ బ్రాహ్మణ.అగ్రవర్ణాల వాళ్ళ చేతుల్లో చచ్చిపోయి ఉండేవాళ్ళం అని ఇవ్వాళ గగ్గోలు పెడుతున్నవాళ్ళని కాదు!మొదట బ్రాహ్మణూల్నీ అగ్రవర్ణాల వాళ్ళనీ ఉద్యోగాల్లోకి లాగేసుకున్నారు.ముస్లిముల కాలంలో పోయిన అధికార్మ్ చేతుల్లోకి వచ్చేసరికి వాళ్ళు చెయ్యలనుకున్న ఓవర్ యాక్షన్ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు.వాళ్ళు ఇంగ్లీషు నేర్చుకుని చేస్తున్న హడావిడి చూసి కింది కులాల వాళ్ళు చచ్చీ చెడి ఇంగ్లీషు నేర్చుకునేసరికి ఉద్యోగాలు భర్తీ అయిపోయి వీళ్ళకి నిరుద్యోగం మిగిలింది.వీళ్ళలో పుట్టిన కడుపుమంట కులాల్ని చీల్చింది - స్వతంత్రం వచ్చాక కూడా పరిపాలనలో ఇంగ్లీషువళ్ళ పద్ధతులనే పాటించిన కాంగ్రెసు,కమ్యూనిష్టు,ముస్లిం లీగ్ అన్నీ తమకి పనికివస్తాయని ఇంగ్లీషువాళ్ళు చెప్పిన అబద్ధాలు అన్నింటినీ ఇంక అనిష్ఠగా చెబుతూ వచ్చారు.కంచె అయిలయ్య నుంచీ గోగినేని బాబు వార్కూ మెకాలే విద్యావిధానం తయారు చహెసిన మూసలే - చిలక పలుకులు వినదానికి ఎంత కమ్మగా ఉంటాయో,గోగినేని బాబు అయితే చిన్న పిల్లాడిలా ముఖం పెట్టి ముద్దు ముద్దు మాటలతో ఎంత మురిపిస్తాడో!

  ReplyDelete
 5. dear sir very good blog and very good content
  Latest Telugu Cinema News

  ReplyDelete
 6. This is what PM Modi spoke in his Lok Sabha speech today. He for the first time disclosed that the total amount of NPA in the banks and said they were not 36% as claimed by the Congress but a whopping 82% of bank loans were NPA, which means that 52 lakh crores bank money was given to industrialists by the Congress government without guarantee.

  PM Modi said the economy was in a disaster when he took over and if he had disclosed the real state of Banks and economy, every investor in India would have left the country which would have caused a catastrophic effect on the country.

  PM Modi said…“Earlier calls used to be made for facilitating loans to their people (close to those in power). Crores of money was given (through loans)…. Had I kept the facts before the nation earlier, it would have hurt the economy.” “ I have remained silent for the sake of Nation, despite knowing what Congress has done, but time has come to reveal truth as banks were getting back into good health and people should know what Congress did in 10 years.”

  After the NDA took over, not a single loan was passed which could turn into an NPA, added Modi.

  So, one may now realise what is the extent of damage Congress did to our country and economy. This just one scandal lead to a loss of Rs 52 lakh Crore to the Nation.

  Yes….520,00,00,00,00,000 crore was the total amount given to these industrialists, now compare this with 2G, CWG Coal and NH scams!

  To all Non Bhakts. After hearing the PM speech in parliament today, I hope all must have realized why the Angry Middle Class has been left without any *benefits*. 82% NPA's are the legacy of the *Congress* due to which the present government is *still* struggling to get the economy on track. I hope you realize that the present government is not penalizing you _(by not giving more freebies and tax exemptions)_ but is forced due to the various economic blunders, nepotism and corruption of the *Congress* whom you all are suddenly considering to be your *savior* from the *honest BJP government*. If today, you still believe that the BJP government does not deserve a 2nd term, then *you* are really not deserving of an honest government and country. If you still believe that you need to vote out the BJP then God bless you all because then *even God cannot save this country*.

  ReplyDelete
 7. ''NPA in the banks and said they were not 36% as claimed by the Congress but a whopping 82% of bank loans were NPA, which means that 52 lakh crores bank money was given to industrialists by the Congress government without guarantee.''

  Is it not implementation of socialism

  “ I have remained silent for the sake of Nation, despite knowing what Congress has done, but time has come to reveal truth as banks were getting back into good health and people should know what Congress did in 10 years.”

  What to do now

  ReplyDelete
 8. Is this the same reason why central government is delaying assistance to Andhra? Common man is not bothered about these things even if they are technically correct. There has to be balance between welfare and other development, correction activities. How do you classify people who are not for BJP, not for Congress, not for Modi. BJP has a chance to rule this country for next 20 years atleast but they should get rid of their arrogance first. Their behavior in dealing with ordinary citizens of this country will decide their destiny. Alternatives to Congress/BJP will definitely come out of system itself.

  ReplyDelete
 9. Only BJP can save this country
  Only Trump can save America
  Only TRS can save Telangana
  Only TDP can save Andhra
  Only Jesus can save this world

  What a blind faith sirjee? Out of 150 crore Indians, there is nobody except BJP fighting for this country

  ReplyDelete
 10. Add the following.

  Only islam can bring peace and tranquility in the world.
  Only communism can bring equality.
  Only communists are empowered to speak any nonsense.
  Only communists can spew venom on any thing relates to Bharat.

  ReplyDelete
  Replies
  1. Add this also..
   Only Hinduism can bring integrity

   Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు