Wednesday 25 November 2015

నేనూ ఈ మధ్యన చిత్రకారుణ్ణి అయిపోయానండోయ్!మీరు కాస్త వోపిక చేసుకుని ఎలా ఉందో చెప్తారాండి?

     నేను నిజంగా మంచి చిత్రకారుణ్ణే అయి ఉంటే ప్రోగ్రామింగ్ సైడుకి చచ్చినా వచ్చి ఉండేవాణ్ణి కాదు!ప్రోగ్రామింగు వర్కు చాలా చెత్తగా ఉంటుంది - ఎట్లా ఇరుక్కుపోయానోమొదట విజువల్ బేసిక్ నేర్చుకున్నా,యెక్కడో తెలుసా!హైదరాబాదు అమీర్ పేట గ్యాంగులో నేను కూడా ఉన్నా.అన్నీ హడాబిడిగా నేర్చేసుకుని నేల రోజుల్లోగా ప్రపంచం మొత్తంలో ఎక్కడయినా సరే దున్నేద్దామని ట్రయనింగు కోసం డబ్బులు పోగొట్టుకున్న పిచ్చిపుల్లయల్లో నేనూ ఒకడిని. - సింగపూరులో మొదటి ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు నేను పని చేస్తున్నానని చెప్పిన కంపెనీ పేరు విని ఒక పాతికేళ్ళ అమ్మాయి నన్ను పట్టుకుని నవ్వుమొహంతో యెగాదిగా చూసిన చూపుకి అర్ధం నెలరోజుల తర్వాత వుత్తచేతుల్తో వెనక్కి తిరిగొస్తున్నప్పుడు గానీ తెలియలేదు!ఆ తర్వాత  అదృష్టవశాత్తూ అనాలో ప్రమాదవశాత్తూ అనాలో తెలియనంత అగమ్యగోచరమైన స్థితిలో చెన్నైలో ASP ప్రోగ్రామరుగా చేరా, ఒక సంవత్సరం తర్వాత మా కంపెనీకి టెక్నికల్ కన్సల్టేంటుగా ఉండి నన్ను ఇంటర్వ్యూ చేసి ఆ ఉద్యోగం రావడానికి కారణమైన పెద్దమనిషి తన సొంత కంపెనీ లోకి తీసుకున్నారు.అక్కడ అయిదేళ్ళపాటు నిరాఘాటంగా పనిచేసి ఆ డాటాబేస్ వర్కులో ఉండే క్రడ్ ఆపరేషన్లు తప్ప మరేమీ లేని వర్కుకి విసుగెత్తి ఫ్లాష్ నేర్చుకున్నాను.

     యెకాయెకిన ఫ్లాష్ నేర్చుకుందామని వెళ్ళలేదు - అది ఇల్లస్ట్రేటరు నుంచి మాయా3డి వరకూ ఒక పూర్తి ప్యాకేజీ,కానీ మాయా వరకూ వెళ్ళడానికి సొమ్ములు చాలక అప్పటికి పూర్తి చేసినవాటిల్లో ఫ్లాష్ నాకు నచ్చి కోర్సు ఆపేసి ఫ్లాష్ డెవలపర్ అయిపోయాను.నేర్చుకునేటప్పుడు ఇల్లస్ట్రేటర్,ఫొటోషాప్ ఇంటరెస్టుతోనే నేర్చుకున్నా గానీ చాలాకాలం టచ్ లేకపోవడంతో ఇప్పుదసలు అయోమయంగా ఉంటుంది.యేమయినా డిజైనర్ల పని హాయి,తలతో ఆలోచించి సాల్వ్ చెయ్యాల్సిన ప్రాబ్లెంస్ ఉండవు!కాంప్లికేటెడ్ ఇమగెస్ షట్టర్ స్టాక్ నుంచి అరువు తెచ్చుకోవటం,వాటికి సొంత సెట్టింగులతో బిల్డప్పు ఇవ్వటం,కంటికింపుగా ఉండే రంగుల గురించి తెలుసుకోవడం,చతురస్రాలూ త్రికోణాలూ వృత్తాలూ గీసి వాటిల్లో గ్రడియంట్ కలర్ నింపటం,వబ్ లేఅవుట్లూ కొల్లాతర్ల్సూ తయారు చెయ్యడం - ఏదో ఒకటి అటూ ఇటూ జరుపుతుంటారు గాబట్టి పని చేస్తున్నటు తెలుస్తుంది!లోగోలు చేసే కళ గానీ అబ్బితే సొంతంగానే యెదగొచ్చు - కొన్ని లోగోలకి మనం వూహించనంత క్రేజు ఉంటుంది!ఫ్రీలాన్సరుగా చేసేవాళ్లకి ప్రత్యక్షంగా అది తెలుస్తుంది గాబట్టి క్రేజుని బట్టి డిమాండ్ చెయ్యొచ్చు.నా సంగతే తీసుకుంటే నా వర్కుకి సంబంధించిన ఆలోచనలు మైండులో జరుగుతాయి కాబట్టి డిజైనింగు పూర్తయి వర్కు నా దగ్గిర కొచ్చేవరకూ ఖాళీగా కూర్చున్నట్టు కనిపిస్తాను?అయినా అపుడప్పుడూ కాగితాలు ఖరాబు చేస్తుంటాను,వాటిల్లో చాలాకాలం క్రితం చాలా ముతగ్గా వేసినా నాకు నచ్చిన బొమ్మ ఇది!
పేపరు చూస్తే కలర్ పపర్,అదీ కార్డ్ బొర్డు!మా బంగారం స్కూలు పన్ల కోసం తెచ్చి దానిమీద నాతో అరవ చాకిరీ చేయించుకుని అంతా అయిపోయాక నా మొహాన పారేసింది నువ్వు వాడుకోమని పర్మిషన్ ఇచ్చేసి.అంతకు ముందు నుంచే ఈ బొమ్మ వూహలో కదుల్తుంటే వెయ్యగలనా అని డవుటు పడుతూ అప్పటి వరకూ నానుస్తున్నాను గదా అది దొరికేసరికి దానిమీదే నా ప్రతాపం చూపించాను.పెన్సిలు వీలయిననత సన్నగానే చెక్కినా పోను పోనూ అరిగిపోవటం,మళ్ళీ చెక్కడం,విసుగొచ్చి ఆ బండముక్కుతోనే పని కానిచ్చేశాను.ఇంకో డ్రాబ్యాక్ పేపరు రఫ్ కదా చెరిపితే గుంటల్లో ఉన్నది చెరగక పోవటం - అయితే అంతా అయ్యాక చూస్తే అది నాకు గ్రడియంట్ మాదిరి కనబడ్డంతో అదీ ఒకరకంగా కలిసొచ్చినట్టే అనిపించింది.మూతి సరిగ్గా రాలదని అనిపించింది,ఏం చేద్దాం?ఇక్కడ చెరిప్తే పేపరు ఖరాబు అయ్యి ఉన్న ఈ కాస్త అందం కూడా పోతుంది!కొంచెం ఆలోచించాక అయిడియా వచ్చింది,ఆ సైజులో ఉన్న వేర కార్డ్ బొర్డ్ ముక్క మీద మూతి వరకూ గీసి అతికించాను.భుకాల పరిస్థితీ అంతే!ఇప్పుడు మీరు చూస్తున్నది స్కానింగు తీసిన ఇమేజి కదా,,స్కానింగు కోసం తీసుకెళ్ళటానికి కవరు లోపల కొంచెం ఫోల్డ్ చేసేసరికి ఆ ఫోల్డింగ్ మరక ఇందులోకి కూడా వచ్చేసింది.నా అలోచన మెల్లగా ఫొటోషాప్ ఉంది కదా నా కన్=ంప్యూతరులో,దాన్ని మల్ళీ గుర్తు తెచ్చుకుని అందులో ఎడిట్ చేద్దామని.తీరా నేను స్కాన్ చేసి ఎడిటింగ్ పని మొదలు పెడదామనుకున్నస్కాన్  టైములోనే మా చిన్న బంగారం పరిక్షల పేరుతో కంప్యూటర్ని హైజాక్ చేసేసింది!

     మళ్ళీ ఇంత సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు మొదలుపెట్టాను,కారణం ఉంది!ఈ మధ్యనే ప్రింటరు అమిరింది.దాంతో ప్రింటు తీసి చూసుకుందామనే దురద పుట్టి మెల్లగా పని మొదలు పెట్టాను.అయితే ఈలోపు కంప్యూటరు కేదో ప్రాబ్లం వచ్చి ఓయస్ అప్డేట్ చేసినపుడు ఫొటోషాప్,ఫ్లాష్,డ్రీం వీవర్ లాంటివన్నీ యెగిరిపోయాయి.ఈ మధ్యనే నా చెస్ బోర్దు సైటు పని కోసం ఫ్లాష్ ఒక్కటే ఫ్రండ్ దగ్గిర్నుంచి తెచ్చి లోడ్ చేసుకున్నాను.అందులో కూడా పెన్ టూల్ లాంటి కొన్ని గ్రాఫిక్ ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి గదా!పెన్ టూల్ వాడి నా పెన్సిల్ లైన్ల మీదనే కొత్తగా లైన్లు గీదామని నా అయిడియా,కానీ నా కౌశలం సరిపోక నాకే యేళు పట్టేటటు ఉందనిపించింది!ఇక చేసేది లేక ఎరేజర్ టూల్ వాడి సెంటర్లో ఉన్న బొమ్మని మట్టుకు లేపి ఇంకో లేయర్ మీదకి తెచ్చాను.బోసిగా వొదిలయ్యడం కన్నా బోర్డరు తగిలిస్తే బాగుంటుందనిపించింది.దాంతో ఈ షేపుకి వచ్చింది!. 
     ఆ ముతక బొమ్మ కన్నా ఈ చిత్రరాజం కొంచెం బాగుండటంతో ప్రముఖ చిత్రకారుడిలా ఆలొచించటం మొదలు పెట్టాను.ప్రముఖ చిత్రకారులు వెర్షన్లు ప్రయత్నిస్తారు గదా అని వూహించి మధ్యలో బ్యాక్ కలరు మార్చాను.ఫ్లాష్ లోపల ఒక ఇమేజిని షేపుగా బ్రేక్ చెయ్యొచ్చు.ఆ ంతక మోదల్ని అలా బ్రేక్ చేసి ఈ ఎడిటింగ్ అంతా చేశాను.ఫైనల్ వెర్షను పెద్దది చేసి చూస్తే చుట్టూ ఖాళీ చాలా ఉంది.అది కూడా కత్తిరించేశాను.ఆ మార్పులతో ఈ మోడల్ తయారయ్యింది!
     ఇక్కడ పెట్టటానికి ధైర్యం ఎలా వచ్చిందనుకుంటున్నారు?నా పాటికి నేను నాగురించి ఓవరుగా వూహించేసుకుని బ్లాగులో పెట్టి మీతో చివాట్లు తింటానా!ప్రింటరు ఉందిగా,ప్రింటు తీసి చూపిస్తే బంగారం బానే ఉందని సర్టిఫికెట్ ఇచ్చింది,అయినా మీరు కూడా ఓ మాట చెప్తే ఇంకొంచెం హంగులు చేసి క్యాలెండరుగా రిలీజ్ చేద్దామనే ఆలోచన ఉంది!హంగులు అంటూ పెద్దగా యేమీ చెయ్యన్ను,నాకేందుకో కళ విషయంలో భారీగా పోవడం నచ్చదు,నేను చూసి మెచ్చుకోవాలన్నా సింపులుగా ఉండాలి!రంగులు వేస్తాను,అంతే!బ్యాక్ డ్రాప్ రంగులు మార్చి చూస్తాను,గ్రడియంట్ రప్పించగలనో లేదో చూడాలి!ఈ ఆంజనేయ భగవాన్లుని హరిమర్కటం అంటారు గదా - దేహానికి లైట్ గ్రీన్ కలరు వేస్తాను,అన్ని దేవాలయ్యాల్లోనూ చూస్తున్నాను గాబట్టి మూతికి ఎరుపు రంగు ఫిక్స్ చేసేశాను,పంచెకీ తలపాగాకీ కాషాయం రంగు వేస్తాను,చాలు గదా!

నాకేమో పైది నచ్చింది,మా బంగారానికేమో ఈ బ్లూ కలర్ ఉన్నది నచ్చింది,మరి మీ వోటు ఎవరికి?

15 comments:

  1. కార్యశూరులకు వందనం ?!

    ReplyDelete
    Replies
    1. అభివందనం,ప్రత్యభివందనం!!

      Delete
    2. రాజమౌళి మీ ఆర్ట్ చూసుంటే మిమ్మల్ని వదులుకునేవారే కాదు. ఈ ప్రపంచం ఒక మేధావిని గుర్తించడం లేదు.ఇంకో 9 సార్లు ట్రై చేసారంటే మీరే పోటుగాడయిపోతారు.

      Delete
  2. మీ సంతకం కూడా సైజు చిన్నది చేసి ఒక చోట పెట్టండి. నా ఓట్ తెలుపు దానికే .

    ReplyDelete
    Replies
    1. కృతజ్ఞతలు,ఒకటి అప్డేట్ చేస్తే రెండోది కూడా చెయ్యవచ్చు!

      Delete
    2. సంతకం మొదటి వెర్షన్లో హరి అని నా పేరునే ఒక మూల కూర్చుని యేడుస్తున మనిషి లెక్కన వేశాను,అది ఓకేనా:-)

      Delete
    3. అది చూసే చెప్పాను. మీ సంతకం కాబట్టి మీకు నచ్చితే పెట్టేసేయ్యండి

      Delete


  3. Dislike the post and the drawing

    ReplyDelete
    Replies
    1. why?any preconceived hatred!Are you any one of those conspiracy theorists?Can't yoou be decent in languagae for a piece of art?

      Delete
  4. హరిబాబు గారు ...
    చిత్రం బాగుందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది.
    విషింగ్ యు మోర్ స్కెచింగ్ ...
    :)

    ReplyDelete

  5. ఔరా ! ఇది ఏమన్నా "హరిహరాదుల" 'సూక్షి' యా :) తమిళ్ కడవుళ్ పట్ట నామాల ఓం మధ్య పంగనామాలు పెట్టి నారు హరి బాబు గారు :) దీని వెనుక ఉన్న 'సూక్షి' ని వెంటనే కనుక్కోవాలి :)

    చెక్: జేకే !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబీ!
      ప్రత్యేకంగా "సూక్షి" అంటూ యేదీ లేదూ!నాకున్న చిన్న చిన్న అశక్తతలకి నేను వెతుక్కున్న తరుణోపాయాలు!అందరూ పెట్టినట్టు కిరీటం పెడదామంటే మణులు, మాణిక్యాలు, సూక్ష్మమయిన నగిషీలు చెక్కాలి,నాబోటి సామాన్య చిత్రకారుడికి అంతటి సంక్లిష్టతలు సాధ్యమా?మరో మార్గం కోసం ఆలోచిస్తుంటే శ్రీ త్యాగరాజస్వామి గుర్తుకొచ్చ్చారు - వారి తలపాగా,పట్టెవర్ధనాలు బాగుంటాయని అనిపించింది!ఇంక వాలమును తెలుగు ఓంకారం లోకి లాగాలంటే చివరి కొమ్మును ఒకే సాగదీతలో రప్పించడం కుదరేటట్టు లేదు,దాంతో తమిళ ఓంకారం సరిపోతుందనిపించింది,అంతే!

      యేమయితేఅనేం,విజ్ఞుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు - సంతోషం!
      త్రీ చీర్స్
      హరికాలం

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...