Tuesday 10 November 2015

ఆంధ్రాకి న్యాయంగా ఇవ్వాల్సిన వాట్ని కూడా బీహారు యెన్నికల పేరుతో తొక్కిపట్టేసినందుకు భాజపాకి మంచి శాస్తి జరిగింది?!

    డిల్లీలో యెన్నికల్లో ఆప్ గెలిచినప్పుదే చెప్పాను "ఆంధ్రావోళ్ళకి అన్యాయం చెయ్యదల్చుకున్నవాడు యెవడూ బతికి బట్టకట్టడు" అని!ఇప్పుడు రెండో సారి రెందేళ్ళ తర్వాత మోదీకి తగిలిన చావుదెబ్బలో ఆంధ్రాకి చేస్తున్న అన్యాయం కూడా ఒక కారణమే!లేకపోతే విభజన సమయంలో భాజపా స్వయంగా సమర్ధించిన ప్రత్యేక హోదాని కట్టబెట్టటానికి వెనకాడటం గురించి భాజపా చూపిస్తున్న సాంకేతిక కారణాలు నిజమైనవేనా?హోదా ఇవ్వకుండా తప్పుకోవడానికి వెంకయ్య్య నాయుడు దగ్గిర్నుంచీ ప్రతీ అడ్డగాడిదా చెప్పిన యే ఒక్క కారణంలోనూ సహేతుకత లేదు!నోరు తెరిస్తే చాలు హోదా కన్న యెక్కువే ఇస్తాం,గట్టి ప్యాకేజీయే ఇస్తాం అని సొల్లుకబుర్లు చాలా చెప్పారు.కానీ సరిగ్గా విభజన తర్వాత జరిగిన యెన్నికల్లోనే వాళ్ళూ అధికారంలోకి వచ్చారు.మాట్లాడితే బిల్ల్లులో యెందుకు పెట్టలేదు అని కాంగ్రెసు మీద రంకెలు వెయ్యదం తప్పిస్తే విభజన బిల్లుని గట్టిగా అమలు చెయ్యడంలో మాత్రం యేమి ఆసక్తి చూపించారు?రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్ కష్టం ఉందని తెలిసి కూడా హోదానో ప్యాకేజీయో ప్రకటించటానికి రెండేళ్ళు సమయం కావాలా?రెండు ఆర్ధిక సంవత్సరాలు యేమీ తేల్చకుండా ఉండటం అంటే  అది నిర్లక్ష్యం కాదా?

     గట్టిగా అడిగినప్పుడల్లా లోపాయికారీగా బీహారు యెన్నికల తర్వాత అని సర్దిచెప్పడం వెనక మతలబు యేంటి?ఆంధ్రాకి ఇవ్వాల్సిన ఖాతాని బీహారు యెన్నికల్లో లబ్దికి ఫిరాయించారా?గెలిచి ఉంటే యెటూ బీహారులో గెల్చేశాం గాబట్టి ప్యాకేజీ ప్రకారం బీహారిలకి ఇవ్వాలి గాబట్టి ఏపీకి అడుగూ బొడుగూ ముష్టి విదిల్చితే చాలుననా భాజపా పెద్దల ప్లాను?ఒకప్పుడు కాంగ్రెసు ఇలాంటి చేత్తపన్లు చేసి ఇప్పటి స్థితికి దిగజారింది,అది తెలిసి కూడా భాజపా అదే దారిలో నడుస్తున్నది,అదే గతి పడుతుంది,కాదు కోరి కోరి అదే గతిని నెత్తి మీదకి తెచ్చుకుంటుంది!

     ప్రపంచం పొలిమేరలు దాటి సొల్లుకబుర్లు చెప్పి చప్పట్లు కొట్టించుకోవడం తప్ప మోదీ ఈ రెండేళ్లలో  నెరవేర్చిన ఘనకార్యం యేదయినా ఉందా?ఆంధ్రాకి ఇవ్వాల్సిన హక్కు ఉన్నా ఇవ్వకుండా బీహారుకి అడక్కపోయినా యెందుకు ఇస్తున్నారు నేది ఆలోచించ్నంత దద్దమ్మలా జనం?!ఆంధ్రాని రెండేళ్ళూ అయోమయంలో ఉంచటం అనే ప్రమాదకరమైఅన యెత్తుగడ ఇప్పుడు భాజపాని మొత్తం జాతీయ స్థాయిలో దిక్కు తోచని స్థితిలో నిలబేట్టేసింది - వయంకృతాపరాధం!ఇప్పటి వరకూ తెదెపా భయం భయంగా ఒదిగి ఉంది - యే కొంచెం గట్టిగా మాట్లాడినా తనకి టాటా చెప్ప్పేసి జగన్ కేసులు రద్దు చేసి ప్రభుత్వాన్ని మార్చిపారేస్తుందేమోని ప్రతి ఒక్కరూ అనుమానించేటంత గొప్ప స్నేహం భాజపా తెదెపాలది?!బాబుకి ఇప్పుడా భయం పోయింది.భాజపా గనక ఆ పని చేస్తే బాబు కూడా వెంఠనే భాజపాకి మతతత్వం ముద్ర పులిమేసి ఒంటరిని చేసేస్తాడు, ఖాయం!ముందు ముందు యెన్నికలు జరగబోయే అయిదు రాష్ట్రాల్లో యెక్కడా భాజపాకి స్థానబలిమి లేదు,బాబుని కూడా దూరం చేసుకుని ఒంటరి అయితే ఒకప్పుడు కమలమే సకలం కావాలి అని వారు కన్న కలకి విరుధ్ధంగా కమలం కాకావికలం అవుతుంది!

     సరిగ్గా ఒకనాడు ఇలా ఒంటరిగా ఉన్న స్థితి నుంచి రామాలయ నిర్మాణం అనే హదావిడితో మంచి వూపును తెచ్చుకుంది,కానీ అధికారం వచ్చాక అసలు ఆ వూసే యెత్తకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ రామాలయ నిర్మాణం యెత్తుకుందామనుకుంటే అస్సలు గిట్టుబాటు కాదు!ఒకవేళ మూర్ఖంగా ఆ ప్రసక్తి తెస్తే ప్రభుత్వం కుప్పకూలిపోయి మధ్యంతరం వస్తుంది.చెప్పుకోవడానికి ఒక్క మంచిపనీ లేని స్థితిలో యెన్నికలకి వెళ్తే యేమవుతుంది - చిరిగి చాటవుతుంది:-)కాబట్టి మోదీ నుంచి వెంకయ్య వరకూ గయ్యాళి కబుర్లు ఆపి కాస్త కాళ్ళు నేలమీదకి దించి వాస్తవిక దృష్టితో ప్రభుత్వం నడిపితే తప్ప మరుసటి యెన్నికలకి తలెత్తుకు తిరగలేని దుస్థితి!వార్తాపత్రికల్లో వాళ్ళ ఆత్మవిమర్శనాత్మకమైన స్టేటుమెంట్లు చూస్తుంటే బింకం ఇంకా సడిలినట్టు లేదు.ప్రచారం అంతా మోదీతో చేయించి గెలిస్తే మోదీకి అంటగట్టేవాళ్ళు,ఇప్పుడు ఓటమికి మాత్రం సమిష్టిగా బాధ్యత వహించాల్ట!రాముడికి గుడి కడతామని చెప్పి రాముణ్ణి మర్చిపోయి ఆవుతోక పట్టుకుని యెన్నికల గోదారి ఈదాలనుకున్నారు,గోమాతకి సహనం నశించి ఈడ్చి తన్నింది!కాఫీలకీ టీలకీ ఆవుపాలు బాగుండకనో యేమో జనం గేదెపాలకి రుచి మరిగారు,ట్రాక్టర్లు వచ్చి దుక్కిటెద్దులతో పని లేకుండా పోయింది.వీళ్ళిప్పుడు గోరక్షణ చెయ్యాలంటే వాటికి మేత యెవడు పెట్టాలి?ఆర్ధికంగా ఆవులూ ఎద్దుల ప్రయోజనం తగ్గిపోవడం వల్ల వచ్చిన సమస్యకి ముస్లిముల మీద పడి యేడిస్తే ఇట్లాగే ఉంటుంది మరి - కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక వూడింది!

     ఇప్పుడు తక్షణం భాజపా ఆంధ్రాకి గట్టి సాయం చేసి మాట నిలబెట్టుకోకపోతే ఇకముందు చెప్పుకోవటానికి ఒక్క మంచిపని కూడా ఉండదు.కాబట్టి బుధ్ధిగా నీతి ఆయోగ్ పెద్దలకి చురుకు పుట్టించి వీలయినంత తొందర్లో ఒక నికరమైన ప్రకటన జరిగితీరాలి!బాబు కూడా మారిన పరిస్థితిని సరిగ్గా అంచనా వేస్తే వేగంగా తనకి అనువుగా మలుచుకుని భాజపా మీద తను పైచేయి సాధించగలిగితే మరీ మంచిది!

హిందూత్వం బోడిగుండుకీ గోవధ మోకాలికీ ముడిపెట్టబోతే కమలానికి గూబ గుయ్యిమంది!

15 comments:

  1. sir,
    ఈరోజు ఈనాడు హెడ్లైన్స్ చూసారా ?

    బాబు కూడా మారిన పరిస్థితిని సరిగ్గా అంచనా వేస్తే వేగంగా తనకి అనువుగా మలుచుకుని భాజపా మీద తను పైచేయి సాధించగలిగితే మరీ మంచిది!
    start chesaru mana cm garu
    a.v ramana

    ReplyDelete
  2. There is a difference between political party and government... Party can play politics but govt should NEVER play politics with its people..

    Unfortunately, difference between party and govt became narrow and central govt is playing politics with its people and people of Andhra in particular..

    Congress did that, BJP is continuing that.. It seems BJP is not willing to learn from Congress's mistakes. It wants to reinvent again by repeating Congress's mistakes.

    ReplyDelete
  3. హరిబాబు గారూ, భాజపాతో కూటమి & మోడీ వేవు లేకుంటే ఆంధ్రలో చంద్రబాబు ఓడిపోయే వారు. అలా జరిగుంటే మీకు ఈ టపా రాయాల్సిన అవసరం వచ్చేది కాదు!

    ReplyDelete
    Replies
    1. అప్పటి పరిస్థితి నాకెందుకు తెలియదు?నేను ఆ పరిస్థితి మారిందనే ఇప్పుడు చెప్తుంటే ఇంకా అప్పటి సపోర్టు లేకపోతే గెల్వడం గురించి చెప్తూ మీరు ఈ పోష్టు రాయాల్సిన వసరం అదీ ఇదీ అంటారేమిటి?

      Delete
    2. పరిస్తితులు మారాయి నిజమే కానీ ఈ మార్పులు ఇరు పక్షాలకూ ఉన్నాయి (ఉంటాయి) కదండీ. అట్లాగే మేమే గెలిచుంటే ఇవన్నీ కొట్లాడి సాదించే వాళ్ళమని జగన్ కూడా దూసుకు పోవొచ్చు.

      Delete
    3. అనొచ్చు,ఎందుకనగూడదు?కాకపోతే అధికారంలో ఉన్నవాడు,తను తన పరిస్థితిని అన్వ్హనా వేసుకుంటే భయం భయంగా ఉందనఖ్ఖ్కర లేదు అని బాబుకి ఇచ్చిన సలహాలో తేడా లేదుగా!మోదీ హవా మీద అతి నమ్మకంతో భాజపా ఇన్నాళ్ళూ వూహల్లో తేలిపోయింది.ఇప్పుడు పరిస్థితి మారిందనేదీ నిజమే,బాబుకి కొంచెం వెసులుబాటు ఉంటుందనేదీ నిజమే,భాజపా తనకే ఇబ్బందికరమైన పరిస్థితి ఉండగా జగన్ వైపుకి చేరితే ఖచ్చితంగా బాబు తను కూడా మతతత్వ ముద్ర వేసి తప్పుకునే వీలు ఉంది.వీటిలో దేన్ని కాదంటున్నారు మీరు?

      Delete
    4. నిజానికి గత ఎన్నికలలో కూడా జగన్ కాంగ్రెస్ & వామపక్షాలను కలుపుకుంటే గెలిచేవాడు. దీనికి జగన్ వైఖరి & శైలి మాత్రమె అడ్డంకులు.

      జగన్ (మరియు ఇతర ప్రతిపక్షాలు) కేంద్రం నుండి రాయితీలు తెచ్చుకోవడంలో టీడీపీ వైఫల్యాన్ని ఎండకట్టితే టీడీపీ వోటర్లను ఆకట్టుకునే అవకాశం బానే ఉంది. జగన్ నిద్ర మేలుకొని దూకుడు పెంచితే బీజీపీ నుండి టీడీపీకి జరిగే మార్పిడి కంటే ఎంతో ఎక్కువ టీడీపీ వోటు బాంకు నుంచి దండుకోవొచ్చు.

      చంద్రబాబు బీజీపీని వదులుకోవాలంటే కూడా ఇదే మంచి అదను. కాలం కలిసి వస్తే మూడో కూటమిలో చక్రం కూడా తిప్పవచ్చు కానీ ఇప్పటికే అక్కడ ఎందరో దస్తీలు వేసున్నారు. ఏది ఏమయినా ఆట్టే సమయం లేదు.

      Delete
    5. 1.దీనికి జగన్ వైఖరి & శైలి మాత్రమె అడ్డంకులు.
      now also there is no difference in his mindset.
      2.జగన్ (మరియు ఇతర ప్రతిపక్షాలు) కేంద్రం నుండి రాయితీలు తెచ్చుకోవడంలో టీడీపీ వైఫల్యాన్ని ఎండకట్టితే టీడీపీ వోటర్లను ఆకట్టుకునే అవకాశం బానే ఉంది.
      jagan's main drawback is his corruption charges and his monarch behaviour.It won't change immediately.
      3.చంద్రబాబు బీజీపీని వదులుకోవాలంటే కూడా ఇదే మంచి అదను.
      No,without any prper justification he would be cruel to jump out breaking the sensitivity that he is also a part and parcel of central ministry.Only when BJP created tussle,then babu will be justified.

      justification of the move is very important in politics!

      Delete
    6. @Hari: my response (from the angle of practical politics)

      Jagan's corruption allegations don't count much with voters. This is proven in all elections right from India Gandhi to Laloo.

      His main problems are lack of proper guidance & negative attitude.


      Jagan seems to think he "peaked too early" last time. This is a "wrong lesson". He under-estimated the strength of his opponents (not just Babu but also Modi, Pavan, almost the entire media & white collar IT folks) and became complacent. If he accommodated smaller parties & kept up his tempo he could have still won.

      Justification is not important in my opinion. Babu (Nitish more recently) broke away from NDA with "proper justification" but it failed to gain dividends. On the other hand, people like Mayawati, Jayalalitha or Patnaik break alliances without any apparent reason and people lapped it up. BJP broke off with Shiv Sena abruptly without loss of face. Even Babu earlier jumped from third front to NDA effortlessly & successfully.

      I agree timing is important but don't think there is too much time. Anti-incumbency will start kicking in anytime now. A "new act" is required sooner rather than latter.

      Delete
    7. @Jai Gottimukkala,

      అంత సీన్ లేదేమోనండీ ! టీ.ఆర్.ఎస్ కు బాగా బలం పెరిగింది విభజన తరువాతనే. ఎందుకంటే అంతా టి.ఆర్.ఎస్ ను హీరోలా చూశారు. లేకపోతే తెలంగాణలో టీ.డీ.పీ ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. ఆ కట్టే జతేదో టి.డి.పీ వామపక్షాలు తెలంగాణాలో కట్టి ఉంటే ... టి.డీ.పీ అధికారములోకి వచ్చి ఉండేది సమైఖ్యాంద్రలోనే !

      Delete
    8. తెలంగాణా నిర్ణయం కంటే ముందు జరిగిన ఉప ఎన్నికలలో టీడీపీ గల్లంతు అయింది, కాంగ్రెస్ పరిస్తితి కొంచం నయం. సంప్రదాయ వోటు బాంకులు కూడా పడలేదు. ఆ తరువాతే ఈ రెండు పార్టీలు యథాస్థితికి చేరుకున్నాయి.

      బీజీపీకి రెండు రాష్ట్రాలలో కలిపి షుమారు 20 లక్షల వోట్లు పడ్డాయి. టీడీపీతో పొత్తు లేకుంటే ఇంకా బాగా వచ్చేవి. వామపక్షాలకు అంత సీను లేదు అనుకుంటా. ఏతావాతా బీజీపీతో పొత్తే టీడీపీకి లాభం.

      Delete
  4. @జై గొట్టిముక్కల

    సోనియాగాంధీకి రాహుల్ ను PM గా చేయాలని లేకపోతే, తెలంగాణా వచ్చేది కాదు. నువ్వు ఇంకా ఏడుస్తూ వుండేవాడివి , ఈ కామెంట్లు రాసే పనిలేకుండా .

    ReplyDelete
    Replies
    1. మీరంటే మీరేనండి బాబూ!

      తెలంగాణా రావడం వల్లే రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. లేకపోతె ఎటువంటి కూటమికి అయినా మాజిక్ ఫిగర్ దాటడం కుదిరేది కాదు. అప్పుడు (ఇప్పుడు కాలం చెల్లిపోయి చరిత్ర చెత్తబుట్టిలో పడ్డ) ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండే ప్రత్యామ్నాయాలు: తెలంగాణా ఏర్పాటు లేదా తిరిగి మళ్ళీ ఎన్నికలు (i.e. అవే ఫలితాలతో చక్రం తిరగడం) .

      కేంద్రంలో గెలిచిన బీజీపీ కూడా తెలంగాణాకు కట్టు పడి ఉందన్నారు కనుక ఆ నెపంతో వారు, ఆంధ్రలో జగన్ చంద్రబాబులలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే అధికార దాహంతో వారు కలిసి తెలంగాణా ఇవ్వక తప్పేది కాదు. ఝార్ఖండ్ విషయం గుర్తు తెచ్చుకోండి.

      ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అన్న కాంగ్రెస్ వాదనను తెలంగాణా ప్రజలే పెద్దగా పట్టించుకోలేదు వారికి ఈ క్రెడిట్ ఇవ్వడం ఎందుకు?

      Delete
  5. @గొట్టి ముక్కాలా,

    నేను నేను కాక, కామెంట్ బాక్స్ కనపడ్డా ప్రతి బ్లాగ్లో అబద్దాలు రాసే నువ్వేట్లయితా. మొత్తానికి నీ అబద్దపు దొంగ కబుర్ల తెలంగాణా పోరాటాన్ని చెత్త బుట్టలో వేసినావు? గుడ్ చివరకి దార్లో పడ్డావ్. ఇంకా నయ్యం తెలంగాణ రావటం వల్ల ఈదినమ్ పోద్దుగాలా సూర్యుడోచ్చావ్ అనలెదు. మాజిక్ ఫిగారా, హుస్సేన్ సాగర్ లో కంపా ఏది ఆగేది కాదు, సోనియా గాంధీ కొడుక్కోసం తెగపడకపోయింటే నువ్వు ఇంకా ఆ దొంగ ఏడుపులు ఏడుస్తానే ఉండవాడివి గానీ నీ సొల్లు దొంగ ఏడుపు కబుర్లాపు.
    నువ్వు ఎంత ఏడ్చినా ఇది జగమెరిగిన సత్యం - కేవలం రాహుల్ గాంధి కోసం తెలంగాణా ఇచ్చింది - జరిగిన తప్పుడు కార్యక్రమం ప్రపంచమంతా చూసింది .

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...