తమిళనాడులో ఇప్పటికీ తెలుగువాళ్ళు నాలుగోవంతు ఉన్నారు.చెన్నై మహాపట్నమే చెన్నప్ప అనే తెలుగువాడి పేరు మీద వచ్చింది.400సంవత్సరాల పైచిలుకు చరిత్ర గల ఈ నగరంలో తొలినాళ్ళ నుంచీ తెలుగువారు తమిళులతో కలిసి ఎదిగారు.రాష్ట్రాలుగా విడిపోక ముందు నుంచీ మొత్తం దక్షిణ భారత భాషలకి సంబంధించిన చలనచిత్ర మహామహులంతా ఇక్కడే తమ తమ భాషలతో పాటూ తమిళంలో కూడా మాట్లాడ్య్తూ బతికారు.అన్ని రాష్ట్రాలూ విడిపోయిన తర్వాత కూడా చాలా కాలం వరకూ వీరంతా మద్రాసుని వదలకుండా ఉన్నారంటే ఆ నగరపు వాతావరణం తోనూ తమిళ సంస్కృతి తోనూ ఆత్మీయతలు ఎంతగా పెనవేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు!
2006లో తమిళనాడు ప్రభుత్వం తమిళ విద్యాబోధన చట్టం చేసింది.దాని ప్రకారం మైనారిటీ వర్గాలకి సంబంధించిన విద్యాసంస్థలతో సహా అన్ని విద్యాసంస్థలలో నర్సరీ,ప్రైమరీ,మిడిల్,హయ్యర్ మరియూ హయ్యర్ సెకందరీ స్థాయిలలో తమిళ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన భాషగా నిర్ధారించారు - సీబీయస్సీ మినహా!మాధ్యమం విషయంలో కూడా తమిళేతర భాషల పట్ల చాలా నిర్దయగా ఉన్నది చట్టం.ఇంగ్లీషునీ తమిళాన్నీ తప్ప మిగిలిన వాటిని ఆప్షనల్ గ్రూపుకి బదలాయించారు.పైగా ఈ సబ్జెక్టుల మార్కులు పరీక్షా ఫలితాల్లో కలపరు.అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమిళనాడులో తమిళాన్ని తప్ప ఇంకే భాషనీ ప్రోత్సహించడం మాట అటుంచి బతకనివ్వకూడదని నిర్ణయించుకున్నట్టు అర్ధమవుతున్నది.దీనితో తమిళేతర వర్గాలలో యెక్కువశాతం ఉన్న తెలుగువాళ్ళకి ఇబ్బంది ఎదురవుతున్నది.ఇందులో ఉన్న దుర్మార్గం ఏమిటంటే తమిళనాడు ప్రభుత్వం నిరాదరిస్తున్నది ఇతర భారతీయ భాషల్ని మాత్రమే,అసలు మన దేశానికే సంబంధించని విదేశీ భాష అయిన ఇంగ్లీషు పట్ల మాత్రం అభిమానపూర్వకంగా వ్యవహరిస్తున్నది!
ఇప్పటికే చాలమంది సీబీయస్సీకి మారిపోయారు,తెలుగు మీడియం స్కూళ్ళు మూసివేతకి దగ్గిరయ్యాయి.బీ ఎ రోమన్ ఇన్ రోం అన్నారు పెద్దలు.తమిళనాడు ప్రభుత్వం అంత గట్టిగా తమ భాషని ప్రోత్సహించుకోవాలనుకున్నప్పుడు విమర్శించీ ఉద్యమాలు చేసీ సాధించగలిగింది ఏమీ లేదు.తమిళ ప్రజలకి తమ సంస్కృతి పట్ల అభిమానం ఎక్కువ.దేవాలయాల్లో సైతం దేవభాష అయిన సంస్కృత శ్లోకాలు ఉపయోగించటం కన్నా తమిళ మంత్రాలు ఉపయోగించితే గానీ సంతృప్తి పడనంతగా వారు తమిళ భాషని ఇష్టపడతారు.తమిళనాడులో శాశ్వతంగా ఉండాలంటే అనధికారికంగా అయినా సరే ప్రతివారూ తమిళులుగా మారిపోక తప్పదు.వయ్యాపూరం గోపాలకృష్ణ వైగో అని ఎందుకు పేరు మార్చుకున్నాడు?భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ఏర్పడినా తెలుగుని అధికార భాషగా చేసుకోవటానికి పట్టుదల లేని తెలుగువాళ్ళలా అందరూ ఉండాలని కోరుకోవటం వెర్రితనం!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జాబు రాశాడట,అయితే యేమిటట?ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కలిసి విజ్ఞాపన చెయ్యాలి గానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం తెలుగు వాళ్ళందరికీ ఏవిధంగా బాధ్యత వహిస్తాడు?ఇక తమిళనాడులోని తెలుగువాళ్ళు ఇప్పటికే తమని తాము తమిళీకరించుకున్న మిగతా వాళ్ళ మాదిరిగానే తమ ప్రత్యేక అస్తిత్వాన్ని వొదులుకోక తప్పదు.
తమిళులది నిజంగా చాలా వింతైన మనస్తత్వం - మొత్తం భారతీయుల కందరికీ ఇంగ్లీషు అనే విదేశీ భాషకి బదులు హిందీ అనే భారతీయ భాషని లింక్ లాంగ్వేజిగా పేడదామని ప్రతిపాదించినప్పుడు మిగతా భారతీయు లందరికన్నా గట్టిగా వ్యతిరేకించి తమిళ ప్రాంతీయాభిమానం పొడుచుకొచ్చి అల్లరల్లరి చేసి ఒక భారతీయ భాషనే తిరస్కరించి వీళ్ళ ధాటికి ప్రభుత్వమే వెనక్కి తగ్గి ఆ ప్రతిపాదనని ఉపసంహరించుకునేలా చెయ్యగలిగిన వాళ్ళు ఇవ్వాళ మిగతా భారతీయ భాషల్ని కూడా తిరస్కరించేసినప్పటికీ ఇంగ్లీషు అనే విదేశీ భాషని మాత్రం అంతగా ముద్దు చేయడం చూస్తుంటే అయితే తమిళ భాష లేకుంటే ఇంగ్లీషు భాష నేర్చుకోవాలి తప్ప సాటి భారతీయ భాషల్ని నేర్చుకోకూడదనే మనస్తత్వాన్ని యెలా అర్ధం చేసుకోవాలో తెలియటం లేదు నాకు!భారతీయ భాషలు అన్నిట్లోనూ తమ భాషే గొప్పది అనే అహంకారం,ఆంగ్లేయుల పట్ల మమకారాన్ని చూపించే ఇంగ్లీషు పట్ల భావదాస్యం రెంటినీ ఫిఫ్టీ ఫిఫ్టీ చేసేశారు.దీనికి పూర్తి భిన్నమైన మనస్తత్వంలో ఉన్న తెలుగువాళ్లకి వీళ్ళెప్పటికీ అర్ధం కారు - ఆలు అర్ధమే కానప్పుడు వాళ్ళని మార్చడం సాధ్యమా?
దక్షిణాపధాన్ని అంతా ఆక్రమించిన శాతవాహనుల సామ్రాజ్యంలో ఈ చిన్న ముక్క మాత్రం ఖాళీగా ఉండిపోయింది.ఎందుకో?వొదిలేశారా, లొంగి రాలేదా!పాండ్య,చేర,చోళ వంశాలకి చెందిన రాజూల గురించే తమిళ సాహిత్యం ఎక్కువగా వర్ణించింది.తొలి నుంచీ మిగతా భాషల వారికన్నా అధికంగా ఒకచోట సంగం పేరుతో గుమిగూడి పట్టుదలతో తమ భాషనీ సంస్కృతినీ వృధ్ధి చేసుకోవటంలో ఐకమత్యాన్ని ప్రదర్శించడం విశేషం!అయితే, స్వాతంత్ర్యానంతరం పుట్టిన బ్రాహ్మణ వ్యతిరేక తమిళ స్వాభిమాన ఉద్యమాల వల్ల ఏర్పడిన ద్రవిడ మున్నేట్ర కజగం వారి రాజకీయం ముదిరే వరకూ వీరు కూడా భారత జాతీయతకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు.ద్రవిడ ఉద్యమాలకి బీజాలు బ్రిటిషు వారితో పూర్తిగా మమేకం అయిపోయి, దేశానికి స్వతంత్రం రాకూడనీ బ్రిటిషువాళ్ళ ప్రభుత్వమే కొనసాగాలని వాదించి స్వాతంత్రపోరాటానికి సకల విధాలుగా ఎదురొడ్డి లిలిచిన జస్టిస్ పార్టీలో ఉన్నాయి.ఇందులో ఉన్నవాళ్ళంతా ఇంగ్లీషువాళ్ళ వల్ల పైకొచ్చిన చెట్టియార్లూ భూస్వాములూ కదా - యూనియన్ జాక్ నులివెచ్చని నీడలో పెరిగినవారు రాజభక్తిని ప్రదర్శించకుండా యెట్లా ఉంటారు?ఇంగ్లీషు వాళ్ళు ఈ దేశంలో ప్రభువులుగా పాతుకుపోయనాటికి అప్పటి భారతీయ సమాజంలో విద్యకి అధిపతులుగా ఉన్న బ్రాహ్మణులు సహజంగానే ఇంగ్లీషు విద్య ముందుగా నేర్చుకుని ప్రభుత్వోద్యొగాలు తెచ్చుకుని దూసుకుపోతుంటే అసంతృప్తితో రగిలిపోతున్న బ్రాహ్మణేతరులకి బ్రాహ్మణాధిక్యత గురించి చెప్పి తమవైపుకి లాక్కున్నారు.కళ్ళముందు కనబడుతున్న దృశ్యం అలాగే ఉంది గాబట్టి మూలకారణాల్ని శోధించకుండా బ్రాహ్మణేతరులూ నమ్మేశారు.తన శక్తిమేర జస్టిస్ పార్టీ చెయ్య్యగలిగినది బ్రాహ్మణేతరుల్ని స్వాతంత్ర్య పోరాటం వైపుకి నడవనివ్వకపోవటం.అయితే గాందీ సూటిగా సామాన్యులని ఉద్యమంలోకి లాగే కార్యక్రమాల్ని ప్రవేశపెట్టడంతో జస్టిస్ పార్టీ పునాదులు బలహీన పడినాయి.1935 నాటి రాజ్యాంగం ప్రకారం జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీకి సంబంధించిన దిగ్దంతులు కూడా మట్టి కరిచారు.అసలైన వింత యేంటంటే హిందీని కంపల్సరీ చేసింది 1937లో తమిళనాడు ముఖ్యమంత్రి అయిన చక్రవర్తి రాజగోపాలాచారి,ఆయన తమిళుడే కదా!నిజానికి హిందీ నేర్చుకుంటే తమిళాన్ని అవమానించడం అని యెక్కడయినా బతకాలనుకున్న ఏ తమిళుదూ అనుకోడు,అది ఆప్పటికే బ్రాహ్మణాధిక్యతకి వ్యతిరేకంగా తమిళ స్వాభిమానం పేరుతో రాజకీయ పునాదిని నిర్మించుకోవాలనుకున్న జస్టిస్ పార్టీ మరియూ పెరియార్ ద్వయం తమ యొక్క వ్యతిరేకతని మొత్తం తమిళులకి అంటగట్టేసి చేసిన రభస.ముఖ్యమంత్రి యెంత గట్టివాదయినా అలాంటి సున్నితమైఅన విషయంలో వెనుకడుగు వెయ్యక తప్పదు,ఆయన వెనుకడుగును వీళ్ళు తమ గెలుపుగా చూపించి తమ బలాన్ని మరింత పెంచుకోగలిగారు.ఎన్నో పురాణాలు చదివిన పండితుడూ,కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన రాజనీతిజ్ఞుడూ అయిన రాజాజీ కొంచెం గట్టిగా ప్రయత్నించి ఉంటే సమస్య చల్లారిపోయి ఉండేదేమో!కానీ కాంగ్రెసువాడు కదా - ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకోవడానికి ఏ రాజకీయవాదీ.ముఖ్యంగా కాంగ్రెసువాడు ధైర్యం చెయ్యడు!రెండవ ప్రపంచయుధ్ధం జరుగుతున్నప్పుదు జస్టిస్ పార్టీ బాహాటంగానే అమితోత్సాహంతో ఇంగ్లీషువాళ్ళకి తమ మద్దతును తెలిపారు.అన్నాదురై అయితే జస్టిస్ పార్టీకి మైకులాంటి విడుదలై దినపత్రికలో ఇంగ్లీషువాళ్ళకి పూర్తిగా బాకారాయుదే అయిపోయాడు.వీరికి విదేశీయులైన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కన్నా స్వదేశీయులైన బ్రాహ్మణులు మరింత ప్రమాదకారులుగా కనపడ్డారు,ఒకసారి ఆ దృక్కోణంలోకి మనము వెళ్ళినా వీరంతా స్వాతత్ర్యోద్యమాన్ని వ్యతిరేకించటానికి చేసిన ప్రయత్నాల్నీ ఇంగ్లీషువారితో అంటకాగడాన్నీ న్యాయమేనని చక్కగా సమర్ధించవచ్చు!కానీ చరిత్రలో నిజంగా జరిగినదే అయినా తర్వాతిరోజుల్లో ఎక్కడా ప్రముఖంగా ప్రస్తావించబడకపోవటంతో తమిళేతరులకి అంతగా తెలియని ఒక విషయం - సరిగ్గా ఉత్తర భారతంలో ముస్లిం లీగ్ పాకిస్తానును ప్రతిపాదించిన సమయంలోనే దక్షిణ భారతంలో వీరు ప్రత్యేక ద్రవిడస్థాన్ ప్రతిపాదించారు,మద్రాసు ప్రెసిడెన్సీని మిగిలిన భారతదేశం నుంచి విడగొట్టి యూనియన్ జాక్ చల్ల్లని నీడలో యెక్కడో లండన్ లో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలోనే కొనసాగించాలని ప్రతిపాదించారు, వీళ్ళకన్నా ముస్లిములే నయం కదూ తమకంటూ సార్వభౌమాధికారం గలిగిన స్వతంత్ర దేశాన్ని కోరుకున్నారు!కాంగ్రెసువాళ్ళు అప్పట్లో ఇలాంటి సిధ్ధాంతాలు ప్రమాదకరం అని చూచాయగా తెలిసినప్పటికీ దేశమంతటా అతివేగంగా పెరుగుతున్న కమ్యునిష్టు భావజాలపు ప్రభావానికి భయపడి ప్రజలు వాళ్ళ వైపుకి వెళ్ళకుండా ఉండటానికి ఇలాంటి వర్గాల్ని ముందుచూపు లేకుండా ప్రోత్సహించటంతో అగ్నికి వాయువు తోడయినట్టు చెలరేగిపోయారు.1952 ఎన్నికల్లో డియంకే పోటీ చెయ్యకుండా ఏ అభ్యర్ధి ద్రవిడస్థాన్ కోసం నిజాయితీగా కృషి చేస్తారో ఆ అభ్యర్ధికి తాము సహాయం చేస్తామని ప్రకటించింది - బహుశా వోట్లు వేసి ప్రచారం చేసి గెలిపించడమే ఆ సహాయం కాబోలు!!ఆఖరికి ద్రవిదస్థాన్ కోసం ఐక్యరాజ్యసమితిని కూడా కదిలించాలని ప్రయత్నించింది.1957 ఎన్నికల్లో పాత నిర్ణయాని మార్చుకుని సొంతంగ అభ్యర్ధుల్ని నిలబెట్టి 14 స్థానాల్ని గెలుచుకుంది.1962 నాటికి బాహాటంగా ద్రవిదస్థాన్ ప్రస్తావన తీసుకురాకపోఇనా అంతర్లీనంగా ఇప్పటికీ తగినంత మెజారిటీ వస్తే ద్రవిడస్థాన్ వాదనని ముందుకు తీసుకొచ్చి స్వతంత్రదేశంగా ఆవిర్భవించాలనే ఆశ వారిలో పూర్తిగా పోయిందని చెప్పలేం.ఇవ్వాళ భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయితే మాత్రం ఏమంత ప్రత్యేకత యేముంటుంది గనక, పైన ప్రధానమంతి ఉన్నాడు గద, జనం తమ వాదనల్ని నమ్మి ఆదరిస్తే ఇవ్వాళ్టి ఉద్యమనేత రేపటి రోజూన ఒక స్వతంత్ర దేశానికి ప్రధానమంత్రియే కావచ్చు - అబ్బ!
ఇంతటి ఘనకీర్తి గలిగిన ద్రవిడ ఉద్యమ నేతల తమిళ స్వాభిమాన బలప్రదర్శనా కౌతుకం ముందు తెలుగువాళ్ళ ఆవేదన అరణ్యరోదన కాక తప్పదు.2006లోనే ప్రణాళికలు వేసుకుని ఇంత పటుదలగా ముందుకు వెళ్తున్నవాళ్ళు అంత తేలిగ్గా వెనక్కి తగ్గరు.మీరు తెల్లవారు ఝామున తమిలనాడు మొత్తంలో యెక్కడయినా వీధుల్లో కొంచెం దూరం తిరిగితే ఒక చిత్రమైన దృశ్యం కనబడుతుంది.ఇంటిలోపల యెటూ పూజ గది ఉంటుంది,గాబట్టి అక్కడ యెంతసేపు చేస్తారో గానీ అది అయిపోయాక వీధిలోకొచ్చి ఇంటి ప్రహరీ గోడలో అమర్చుకున్న చిన్న చిన్న ప్రతిమల ముందు కూడా హారతులూ గంటలూ మంత్రాలూ కలిసి వీధి మొత్తాన్నీ మారుమోగిస్తూ ఉంటారు.ఇంత భక్తిగా ఉండేవాళ్ళు దేవుణ్ణి బూతులు తిట్టటం ఒక్కటి తక్కువగా ద్వేషించిన పెరియారును యెట్లా ఆదరించారో తల్చుకుంటే అయోమయంగా ఉంటుంది.తమిళ సమాజమంతా బ్రాహ్మణులూ బ్రాహ్మణేతరులూ స్పష్తంగా విడిపోయి ఉన్నారని నాకు తెలుసు గానీ తమిళులలో ఉన్న స్వజనదోషసహిష్ణుత గురించి ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది నాకు!ఆ మధ్యనెప్పుడో కొందరు యం.జీ.ఆర్ మీద తమకున్న అభిమానాన్ని చూపించుకోవటానికి రోడ్డు మీద విస్తళ్ళలో కాకుండా నేలమీద అన్నమూ కూరలూ వడ్డించుకుని సుబ్బరంగా తినేశారు!అన్నం పరబ్రహ్మస్వరూపం అనే సుత్తి సుదాణం కబుర్లు దేనికి గానీ సరిగ్గా వీళ్ళు ఆ పని చేస్తున్న చోట ఇదివరలో మనుషుల నుంచీ జంతువూల వరకూ మలమూత్రవిసర్జన కార్యక్రమాలు జరిగి ఉండొచ్చుననే ఆలోచన కొంచెం కూడా లేకుండా ఇతర్లకి వినడానికే అసహ్యంగా అనిపించే పనులు యెట్లా చెయ్యగలుగుతున్నారు?ఈ మధ్యన జరిగిన తాళితెంపుడు కార్యక్రమం కూడా అలాంటిదే కదా!తమ బుధ్ధికి ఏం తోస్తే అది నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అనుకుంటూ చెయ్యగలగడమూ,చేసింది సాటి తమిళులు గనక మనవాడు ఏం చేసినా విమర్శించకూడదు అనే పైకి కనబడని ఒక కట్టుబాటూ ఈ భూప్రపంచం మొత్తమ్మీద తమిళులలో మాత్రమే కనిపించే ప్రత్యేక లక్షణాలు.కాబట్టి ఈ భూమి మీద తమిళ సంస్కృతియే గొప్పదని అనుకునే స్వానురాగపు అతి ధోరణి నుంచీ సాటి భారతీయ భాషల్ని తిరస్కరించేస్తూ ఇంగ్లీషును ఆదరించే వలస ప్రభువుల పట్ల మమకారపు ధోరణి నుంచీ వారు యేనాటికీ కొంచెం కూడా పక్కకి జరగరు.
తమిళనాడులోని తెలుగువారు రెండు రకాలు - తమిళ తెలుగులు,ఆంధ్ర తెలుగులు.మొదటి రకం వైగో లాంటివారు- తమ తెలుగు మూలాల్ని మర్చిపోయి పూర్తిగా తమిళుల వలె మారిపోయిన వాళ్ళు,వీరు పొరపాటున కూడా ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించరు,వ్యతిరేకించటం లేదు కూడా!రెండో రకం తమిళనాడులో ఉంటున్నా మూలాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్త్రంలో వెతుక్కుంటున్న వాళ్ళు - తెలంగాణ వాళ్ళు ఎవరయినా ఉన్నా వాళ్ళూ ఈ ఆందోళనల్లో కలవకపోవచ్చు.2006 నుంచీ చేస్తున్న విధానపరమైన ఆలోచనలకి తోడు ఇటీవల యెర్రచందనం అక్రమ నరికివేతని ఆపుతున్న సమయంలో తమిళ కూలీల మీద దాడి జరిగిన తర్వాత ఆ ఎర్రచందనం స్మగ్లర్లలో కొందరు తమిళులూ ఉన్నారు గదా,ఆ పలుకుబడి గలిగిన తమిళ స్మగ్లర్ల వల్ల తమిళనాట ఆంధ్రావాళ్ళంటే వ్యతిరేకత వచ్చింది,ప్రభుత్వపెద్దల లోనూ అది ఆంధ్రప్రదేశ్ తన రాష్ట్రపు వనరుల్ని దోపిడీకి గురి కాకుండా చూసుకోవడానికి చేసిన పని అయినా ముందుగా ఒక మాట తమ చెవిలో వేస్తే దిద్దుబాటు చర్యలు తీసుకోవటానికి పనికొచ్చేది గదా అని తమకి కలిగిన ఇబ్బంది నుంచి తప్పుకుని ప్రతిపక్షాల కన్నా తామే ఎక్కువ లాభం పొందాలన్న రాజకీయం ప్రవేశించింది.కాబట్టి ఇకముందు తెలుగువాళ్ళ పరిస్థితి తమిళనాడులో ఇంకా దుర్భరం అవ్వడమే తప్ప అంత ఆందోళన చేసి రాష్ట్రం విడిపోయినా తెల్లవారి నుంచీ ఏమీ జరగనట్టు కలిసిమెలిసి బతికినగతకాలపు అనుబంధాలు ఇక కలలోని మాటే అవ్వచ్చు!
ఈ దేశంలో ఏదీ శాశ్వతం కాదు పరాధీనతా ఇంగ్లీషు భాషా తప్ప?!
-----------------------------------------------------------------------------------------------------------------ఈ నాడు శాలివాహన శకం 1937 మన్మధ నామ సంవత్సరం కార్తీక మాసము 30వ తేదీ శనివారము
very good article.Tamilians are behaving like talibans. Any language is just a tool for communication. It is foolish to think that one language is greater than another. Tamils invited trouble in Sri lanka due to this kind of narrow-mindedness. There should be absolute freedom for anyone to study in any language.
ReplyDeleteతమిళుల జాతీయ స్థాయి లో ఎక్కువగా గుర్తింపు వచ్చి ఉంటే అందుకు కారణం బ్రాహ్మమణులే! క్రికేట్ లో క్రిష్ణ మాచారి శ్రీకాంత్, కమల హాసన్,హేమ మాలిని, రేఖ,శంకర్ మహదేవన్, K. Balachander, చెస్ విశ్వ నాథ్ ఆనంద్, రాజకీయాలలో రాజాజి, సుబ్రమన్య స్వామి, జయలలిత . కాని తమిళ నాడు లో ఉండేవారు వేరే విధంగా ఊహించుకొంటారు.
ReplyDeleteతమిళులకి ప్రాంతీయ అభిమానం ఎక్కువ అంటారు కాని, వాళ్ళు ఆరాధించే MGR, రజనీకాంత్, జయలలిత పుట్టుకతో తమిళులు కాదు.
ReplyDeleteబోనగిరి గారూ,
ReplyDeleteతమిళులే కాదు,యెవరయినా తమకు నచ్చడానికీ నచ్చకపోవడానికీ ప్రాంతాల పట్ట్టింపులు పెట్టుకోరు,కానీ ప్రాంతీయ వితండవాదులు అలా పెట్టుకోవాలని దొడ్డీదారిన శాసిస్తారు,అదే అసలు సమస్య!