Thursday, 12 November 2015

తెలుగు బ్లాగుల్లో నీరసానికి కారణాలు ఏమిటట?ఆడబ్లాగర్లని నిషేధించడం మంచిదని నా ఉబోస!

     ఈ మధ్యన ఒక మంచి యాగ్రిగేటర్ మూతబడింది!మిగిలిన యాగ్రీగేటర్ నిర్వాహకులు కూడా పెదవి విరిచేస్తున్నారు?విషయం బ్లాగుల్లో సందడి తగ్గిందని,కామెంట్లు వరదల్లా పొంగుకురావడం లేదని,పోష్టులకి హిట్లు ఉధృతంగా తగలట్లేదని - బోల్డు కంపెయింట్లు!?నేను బ్లాగుల్లోకి వచ్చిన కొత్తల్లో ఆంధ్రా ఆకాశరామన్న నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నట్టుండేది.ఒక్కో వాదన చదువుతుంటే వీళ్ళు గనక యెదురెదురుగా తారసపడితే ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటారేమో అన్నట్టుండేది వాతవరణం!అపట్లో సొంత బ్లాగు యెలా ఓపెన్ చెయ్యాలో తెలీదు గనక పొడుగాటి కామెంట్లతో నేనూ దూకాను.రాష్ట్రం విడిపోవటంతో ఆయన నిరాశ పడిపోయి ఇక సెలవనేశాడు!మోద్ట్లో తెలుగులో యెట్టా రాయాలో గూడా తెలీదు,మెల్లమెల్లగా కామెంట్లు తెలుగులో యెట్టా రాయాలో తెల్సుకుని చాలాకాలం పాటు కామెంరుగానే గడిపా,హఠాత్తుగా వనజ వనమాలి బ్లాగులో ఆమె కూడా వేరేవాళ్ళు క్లూ ఇస్తే బ్లాగు ఓపెన్ చేఇనట్టు తెలిసి అడిగితే దేవరహస్యం కాస్తా మీ ఐడియే దాన్ని పట్టుకుని మందుకెళ్ళమన్నారు.ఈ బ్లాగులు మామూలుగా గూగుల్లో డైరెక్టుగా రావు.వీటికి యాగ్రిగేర్లు ఉండాలి.బ్లాగుల్ని తిరగటానికి జల్లెడ దగ్గిర మకాం వేసేవాణ్ణి.అందులో అయితే ఒక రచయిత కనెక్ట్ అవడం అంటూ జరిగితే మొత్తం అన్ని పోస్టులూ పర్మనేంటుగా కనబడతాయి.రీడబిలిటీ బాగుంటుంది.కానీ నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా నా బ్లాగు మాత్రం అక్క కనెక్ట్ అవ్వలేదు,బహుశా అప్పటికే కిక్కిరిసిపోయి ఉండొచ్చు?యాగ్రిగేటర్లని మెయింటెయిన్ చెయ్యడం కేవలం ఆసక్తి కొద్దీ చేసే శ్రమ తప్ప ఆదాయం ఉండదు.ఆదాయం లేకపోయినా ఉత్సాహం రావాలంటే బ్లాగుల్లో పోష్టులు త్వరత్వరగా పడుతూ ఉండాలి,లెక్కకోసం హిట్లు కనబడాలి,పోష్టులు బాగున్నాయని తెలియడానికి కామెంట్లు యెక్కువ పడాలి!

     ప్రస్తుతం బ్లాగుల్లో నిరాశకి రాష్త్ర విభజన ఒక ముఖ్యకారణం అని నా అనుమానం!ఏది రాసినా ప్రాంతీయం అయిపోతుందేమో అనే భయం బ్లాగర్లని ధైర్యంగా టాపిక్కుల్ని యెన్నుకోవడానికి ఉషారు నివ్వట్లేదని నా అనుమానం!ఈ మధ్యన ఆంధ్రజ్యోతిలో ఒకాయన విశ్వనాధ సత్యనారాయణ గారి గురించి ఒక ఆర్టికిల్ రాశారు.ఆయన విశ్వనాధ వారి ప్రతిభ గురించి చెప్పిన విషయం బాగానే ఉంది గానీ మాటిమాటికీ ఆయన స్మారక మందిరం హైదరాబాదులో ఉంది ఓ తెలంగాణ బాబులూ ఆయన్ని కేవలం ఆంధ్రావాడని ముద్ర వెయ్యకండి బాబూ ప్లీజ్ అని బతిమిలాడుకునే ధోరణిలో ఉంది - బహుశా తెలంగాణ ముఖ్యమంత్రీ ఆయన అనుంగు అభిమానులూ ట్యాంకుబండు మీద ప్రాతస్మరణీయుల్ని పెకలించి ఆంధ్రాకి తరలించాలన్న నాటి హ్యాంగోవరు ప్రభావం అనుకుంటా!నిన్ననో మొన్ననో ఒక మహిళారత్నం వ్యాస రచయితకే నీతులు చెప్తూ విసుర్లు విసరనే విసిరారు.నాకు మాత్రం ఆ ఇద్దరి మీదా జాలి వేసింది!అయితే విశ్వనాధకి ఈ ప్రాంతీయ భేదాలు ఉండవు.ఆయన మాందలికాల జోలికి పోకుండా రచనలో సరళగ్రాంధికం వాడాడు!వాళ్ళ పేర్లతో శకాలు ఉన్నయ్యంట పోష్టులో నేను వాడిన తెలుగు అర్ధం అయితే విశ్వనాధ సాహిత్యం కూడా తేలిగ్గా చదవొచ్చు!విషయం కూడా ప్రాంతీయం కాకుండా మొత్తం భారతీయం, అదీ చరిత్ర గురించి స్పెషలైజ్ చేశాడు గాబట్టి కంటెంటుని బట్టి లెక్కేస్తే కేవలం తెలుగువాళ్ళే కాదు ,భారతీయుడైన ప్రతివాడూ గర్వంగా చెప్పుకోదగినవాడు!ముఖ్యంగా హాస్యాన్ని ఇష్టపడేవాళ్ళకి విశ్వనాధ సైలెంటుగా వేసే జోకులు గొప్పగా కితకితలు పెదతాయి:-) అలాంటి హాస్యం రచనల్లో తగ్గడం కూడా బ్లాగులు పాప్యులర్ కాకపోవడానికి ఒక కారణం అని నా అభిప్రాయం. 

     ఇంకొక ముఖ్యాతి ముఖ్యమైన కారణం మగబ్లాగర్లంతా ముసలాళ్లయిపోయారు.ఆడబ్లాగర్లు వాళ్ళ పోష్టులన్నిట్నీ ఆడాళ్ళ కష్టాలతో నింపేస్తున్నారు.పెళ్ళీడు కొచ్చిన అమ్మాయో అబ్బాయో సరదాగా తెలుగు బ్లాగుల్లో కొస్తే "వ్యాసుడు బ్రాహ్మణుడా?అబ్రాహ్మణుడా?" అని పోట్లాడుకుంటుంటే దడుచుకుని పారిపోరా?పైగా దున్నడం దున్నించుకోవడం అని డైరెక్టు కామప్రకోపాల భాష వాళ్ళమీద వొదిలితే వాటికి అలవాటు పడి చెడిపోనన్నా చెడిపోవాలి,లేదా అసహ్యం పుట్టి యే ఫేసుబుక్కు వైపుకో పారిపోవాలి.అందుకే నేను ట్రాక్ మార్చేస్తున్నా.పొలిటికల్ సెటైర్లకీ, తింగరి చర్చలకీ పులిస్టాప్ పెట్టేసి రొమాన్సూ,క్యామెడీలకి రంగం సిధ్ధం చేశా.యాభయ్యేళ్ళు,అరవయ్యేళ్ళు అంగలార్చి కొత్తగా రాష్ట్రం సాధించుకున్నాం అని డాబుసరి కబుర్లు చెప్పుకుంటూ తన రాష్ట్రం గురించి మాత్రం నా మసీదు,నా గుడి, నా నగరం అని ముడ్డీ నోటా పులకించి పోతూ పొరుగు రాష్ట్రం యేర్పడి రెండేళ్ళు కూడా గడవక ముందే ముక్కలు చెక్కలవ్వాలని కోరుకుంటూ అక్కడ పుట్టే వేర్పాటు ఉద్యమాలకి ఆల్ ది బెస్ట్ చెప్పే కిరాతకులు ఉండగా యెన్ని నీతులు చెప్పినా యేమి ప్రయోజనం?ఆంధ్రాకి హక్కుగా చెయ్యాల్సిన పని గట్టిగా చెయ్యటానికి కూడా చెయ్యాల్సిన వాళ్ళకి చేతులు రాక బీహారులో భాజపా ఓడిపోవాలని కోరుకోవాల్సిన పరిస్థితిలో రాజకీయం ఉంటే యేమి అనాలిసిస్సులు రాసినా యేమి ఉపయోగం?ఆ ద్వేషమూ ఈ నిర్లక్ష్యమూ ఇప్పుడప్పుడే పోయేవి కావు - బిడ్డ చచ్చినా పురిటికంపు వెంటనే పోదన్నట్టు ఆంధ్రావాళ్ళు ఈ రెంటినీ కొంతకాలం భరించాల్సిందే, బహుశా అనంతకాలం వరకూ?!మొదట వాత్స్యాయన కామసూత్రాలు పరిచయం చేస్తా.తర్వాత అర్ధశాస్త్రం పరిచయం చేస్తా.బోరు కొట్టకుండా నా మార్కు క్యామెడీ లాంగ్వేజి ఉండనే ఉంది.కురాళ్లకి భవిష్యత్తుని యెట్లా తీర్చి దిద్దుకోవాలి అనేది చెప్పకుండా సోది టాపిక్కులన్నీ యెత్తుకుంటే యెవడు చదువుతాడు?ఈ విషయంలో కష్టేఫలి మాస్టార్ని ఒక్కర్ని మినహాయించెయ్యాలి,బాతాఖానీ లక్ష్మీఫణి మాస్టార్ని కూడా!

     ఒక్క నేను తప్ప దాదాపు ప్రతి మగబ్లాగరూ నీహారికతో యేదో ఒక సందర్భంలో చివాట్లు తిన్నవాళ్ళే!అది కూడా నీరసానికి ఒక కారణం అయ్యుండొచ్చు,మగబ్లాగర్లంతా ఇంత బతుకూ బతికి ఈ అమ్మాయితో తిట్లు తినడమా అన్న ఫీలింగుతో బితుకూబితుకూ మంటున్నారని నా అనుమానం!ఈ నీహారికా ఆంటీలో చాలా మ్యిస్టేరీ ఉంది సుమండీ!నేను విడాకులు అడిగినా మా అయన ఇవ్వట్లేదు అంటుంది చూశారూ,అది అసలైన ఆడ తెలివి,జాణతనం!నిజంగా విడాకులే కావాలంటే ఆయన్ని బతిమిలాడుకోవడం దేనికండీ,లాయరు దగ్గిరకెళ్ళి డైరెక్టుగా నోటీసు పంపించాలి గానీ?!పెద్ద ఘొప్ప - మా అయన చూడండి నేను విడాకులడిగినా ఇవ్వకుండా నన్ను ఎంత గారాబంగా చూసుకుంటున్నాడో అని రివర్సు ఫిట్టింగులు వేస్తున్నాది - అది అర్ధం చేసుకోకుండా ఈవిడ శూర్పణఖ అభిమాని కాబోలు అబ్బో,అమ్మో,ఓహోహో అనేసుకుని అపార్ధం చేసుకుంటే కళ్ళు పోతాయి - నిజం,ఒట్టు,అమ్మతోడు!యేమైనా నీహారిక దెబ్బ తగలకుండా చూసుకోవడం విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల వల్లనే మగబ్లాగర్ల పోష్టులు తగ్గాయనేది నా పరిశోధనాత్మకమైన వివరణ!అయితే,ఆడబ్లాగుల్ని నిషేధించాలనే నా ఉబోసని అందరూ ఒప్పుకోకపోవచ్చు,బొత్తిగా సెక్సప్పీలు ఉండదేమోనని ఫీలయ్యే పుంగవాలు కూడా ఉండే ఉంటారు మగబ్లాగర్లలో, పైకి చెప్పరు గానీ కుర్రతనంలో ప్రతి మగబ్లాగరూ గ్రంధసాంగుడే - అబ్బో!ఇక ఆడబ్లాగర్లలో యెవ్వరిని ఆపినా నీహారికని మాత్రం అస్సలు ఆపలేం:-)

     పోస్టు పట్ల కుతూహలం పుట్టాలంటే టైటిలు లోనే కిక్కు ఉండాలి!కధామంజరి మాస్టారు ఈ మధ్యన ఈ విషయంలో ఆరితేరి పోయారు,అట్లాగన్న మాట!టైటిలుకీ కంటెంటుకీ రిలేషన్ లేకపోయినా పర్లేదు.విజిటరు టైటిలు చూడగానే "హర్రె!ఇదేమిటి?" అని కంగారు పడయినా సరే బ్లాగుకి వచ్చిపడేట్టు ఉంటే చాలు!అయితే వచ్చిన విజిటరు నీరసంగానో,కోపంగానో యెంత ఫాస్టుగా వచ్చాడో అంత ఫాస్టుగా పారిపోకుండా ఎంటర్టెయిన్ చెయ్యగలగాలి.ఎంటర్టెయిన్మెంటు గిట్టుబాటయితే ఫర్వాలేదని సరిపెట్టేసుకుని టైటిలుకీ పోష్టుకీ సంబంధం లేకపోయినా విజిటరు క్షమించేస్తాడు గానీ బోరు కొడితే మాత్రం అస్సలు క్షమించడు,టైటిలూ టాపిక్కూ యెంత అన్యోన్యంగా ఉన్నా విసుక్కుంటాడు!పోష్టులో మనం వాడే భాష కూడా ముఖ్యమే,నా మట్టుకు నేను చాలా ప్రయోగాలు చేశాను.తెలంగాణ మాండలికం నుంచీ సరళ గ్రాంధికం వరకూ యేమాత్రం రసాభాస కాకుండా రాయగలిగాను!ఇదంతా జరగాలంటే పోష్టు గురించి సమయం యెక్కువ కేటాయించాలి.నాది ఇన్వాల్వ్మెంటు కీలకమే అయినా ఆఖర్లో వచ్చే అరణ్యమెంటు గాబట్టి తీరిక యెక్కువ,మిగతా బ్లాగర్లకి ఉద్యోగ బాధ్యతల వల్ల అంత తీరిక ఉండట్లేదు గాబోలు!

     విజిటర్లు గూడా కొంచెం ఓపిక చేసుకుని నచ్చిన బ్లాగు పోష్టుల్ని మెచ్చుకుంటూ,నచ్చని వాటిని ఎందుకు నచ్చలేదో చెప్తూ ఉంటే బ్లాగర్లకి కూడా ఆ రెస్పాన్స్ మరింత హుషారు ఇస్తుంది,కదా!నచ్చితే యెలాగూ భేషులూ శభాషులే ఉంటాయనుకోండి,నచ్చనప్పుడు ఇచ్చే సూచనలు మాత్రం కొంచెం సరళంగా లోపం ఏమిటో చెప్పి తప్పుకుంటే బాగుంటుంది,ఎంతయినా బ్లాగరు హోస్టూ కామెంటరు గెస్టూ కదా,మనం ఒకరింటికి వెళ్ళి వాళ్ళనే తిట్టి రాము కదా!కామెంటర్లకి రెస్పాన్స్ ఇవ్వడంలో శ్యామలీయం బెస్టు!పబ్లిష్ చేసిన ప్రతి కామెంటుకీ కృతజ్ఞతలు చెప్తూ అయినా తప్పనిసరిగా రెస్పాండ్ అవుతూ ఉంటారు.ఇంకా కొందరు ఉన్నారు,కానీ ఇక్కడే ప్రముఖంగా చూశాను.నాకేమో మొదట్లో పనుల వొత్తిడి యెక్కువైనప్పుడు హడావిడిగా వొచ్చి నేను కూడా విజిటరులాగా ఒక లుక్కేసి పోవడం జరిగేది,ఇప్పటికీ బధ్ధకం ఒకటి ఉండటం వల్ల కర్టెసీ రిప్లై కామెంట్లు ఇవ్వడంలో శ్యామలీయం అంత నిష్ఠగా ఉండలేకపోతున్నాను.అయితే, నా బ్లాగులో అన్ని పోష్టుల్లోనూ నాకు నచ్చిన కామెంటు ఒకటి ఈ మధ్యనే పడింది!"వాళ్ళ పేర్లతో శకాలు ఉన్నయ్యంట,వాళ్ళు మాత్రం ఈ భూమ్మీద లేరంట!య్యో,యేందయా నీ చరిత్రా నువ్వూనూ?" పోస్టులో ఒక ఆజ్ఞాత వేసిన జోకు, అది ఇది:రెండు కళ్ల సిద్దాంతం తెలంగాణ వాళ్లు తిప్పి కొట్టి బాబు ను ఎగతాళి చేయని రోజు లేదు. తెలుగు సినీ పరిశ్రమ ఎమిటి, ఆంధ్రా వాళ్లు అందరు ముందూ వెనుకో తెలంగాణాను వదులుతారు. ఖాళి గా ఉన్న హైదరాబాద్ రోడ్లలో జై, శ్రీకాంత చారి, విశ్వరూప్, గుండు గారు, ప్రభాకర్ మందార, బుద్దా మురళి, కంచా ఐలయ్య తో కలసి క్రికేట్ ఆడుకొని, పోటొలను గుండు బ్లాగు లో అప్ లోడ్ చేసి కింద తెలంగాణ భాష లో పద్యాలు రాసే రోజు చాలా దగ్గరలో ఉంది. - ఎప్పుడు గుర్తొచ్చినా మొహాన దహాలు పూయించే సరదా కామెంటు:-)ఇట్లాంటి సరదా మనుషులు ఒక పదిమంది ఉంటే చాలు ఆంధ్రోళ్ళూ తెలంగాణోళ్ళూ పదిమంది కేసీఆరులూ వందమంది గొట్టిముక్కలలూ యేడ్చి కుళ్ళుతున్నా పట్టించుకోకుండా ఘొల్లుఘొల్లున నవ్వేసుకుంటూ కలిసిపోతారని నా నమ్మకం?!నిజంగా అలా జరిగే అవకాశం లేదు,హాస్యోత్ప్రేక్ష అది:-)కాకపోతే సీరియస్ విశ్లేషణలో నేను కూడా ఆంధ్రా వాళ్ళు ఎప్పటికయినా తెలంగాణలో వెనక్కి వెళ్ళకతప్పదనీ,ఆ తర్వాత తెలంగాణ వాళ్ళు ఆ చోటుని భర్తీ చెయ్యడానికి కొంచెం టైము పడుతుందనీ రాసి ఉన్నాను.నా అంచనా అయితే పదేళ్ళు,వాళ్ళ చురుకుదనాన్ని బట్టి ఇరవయ్యేళ్ళు పట్టినా పట్టొచ్చు,ఇంకా అధికారంలో ఉన్నవాళ్లని ఉదారంగా అన్ని మంచిపన్లూ వాళ్ళనే చెయ్యనిస్తే వచ్చేసారికి మనం పవరులోకి రావడం యెట్లా అనే రంధితో ఉన్నవాళ్ళు గట్టిగా కృషి చేస్తూ ఉంటే మరో యాభయ్యేళ్ళు పట్టినా పట్టొచ్చు,ఏమంటారు?నీహారికని ఆంటీ అనడం వల్ల కామెంటరు కుర్రాడే అనిపిస్తుంది,ఇలాంటివాళ్ళ కోసమైనా మోడరేషన్ యెత్తెయ్యాలనిపిస్తుంది.కొందరు వాళ్లకున్న ఆబ్లిగేషన్స్ వల్ల ఐడీతో ఇలాంటి కామెంట్లు వెయ్యరు,అది అందరికీ తెలుసు.యెలాగూ ట్రాక్ మారుస్తున్నాను గాబట్టి మళ్ళీ చెత్త కామెంట్లు రాకపోవచ్చు,చూడాలి!

     యాగ్రిగేటర్ల వారు కూడా మరీ ఇటీవలి రెండు పోష్టులతో సరిపెట్టెయ్యకుండా ఒక నాలుగైదు పోష్టులకైనా ఆ సంఖ్యని పెచితే బాగుంటుంది.యెందుకంటే కొందరు విజిటర్లు సబ్జెక్టుని బట్టీ టైటిలుని బట్టీ కొంచెం పాతవైనా సరే చూడాలని ఆశించటం సహజం!వెంటవెంటనే పోష్టులు రాసేస్తే,వెంటవెంటనే రెండు మూడు మాత్రమే ఉండి పాతవి మాయమైపోతూ ఉంటే పోష్టు యెంత మంచిదైనా యెక్కువమంది చూడలేరు గదా!బహుశా దానివల్ల యాగ్రిగేటర్ సిస్టం యొక్క మెమొరీ మీద బరువు పడుతుందేమో,అయినా పరిశీలించి చూస్తే మంచిది!విజిటర్ల వైపు నుంచి చూస్తే అదొక ఇబ్బంది అనిపిస్తున్నది నాకు!అన్ని యాగ్రిగేటర్ల లోనూ కామెంట్ల సెక్షను లేదు.నేను ఈ మధ్యన కంచె సినిమా గురించి ఒకరు వేసిన కామెంటుని బట్టే చూశాను,అట్లా బ్లాగుల్ని వెదికేవాళ్ళూ ఉంటారు విజిటర్లలో.


ఆడవాళ్ళు తిట్లకి లంకించుకుంటే యెంతటి మగాడికయినా గుండెలు జార్తాయి - ఇంక ఆపేస్తాను!
-----------------------------------------------------------------------------------------------------------------

ఈ ప్రసంగం శాలివాహన శకం 1937 కార్తీక మాసము 22వ తేదీ శుక్రవారము నాడు ప్రచురించబడినది.

22 comments:

  1. Find blogillu here in the given URL. Have remembered me :)

    http://blogillu.blogspot.com/

    ReplyDelete
  2. I want to give a lengthy reply if u wont publish it.

    ReplyDelete
    Replies
    1. why the condition "if you wont publish it.",why,why?
      :-(

      Delete
  3. మా ఆయనేమన్నా రాముడా విడాకులివ్వడానికీ ?మీ ఇలాకాలో ఒక మంచి గట్టి లాయర్ ఉంటే చూడండి. పందెం వేసుకుందామా ? నాకు విడాకులిప్పించినవారికి 100 కోట్లు !

    ReplyDelete
    Replies
    1. 1000 కోట్లకి లింకు పెడితే రామకార్యం కూడా కలిసొస్తుంది,లెక్క సరిచెయ్యి:-)

      Delete

    2. ఆ కోర్టు కేసు కి పణం గా ఒంటి పై ఉన్న గుడ్డలు కూడా పెట్టేసి ఉంటా డని నీహారిక గారు వంద కోట్లు అన్నట్టున్నారు :)

      జిలేబి

      Delete
    3. నీహారిక చెప్తున్నది లాయరు ఖర్చు కాదు,ఇప్పించినవారికి చెప్తున్న పందెం,అవునా అమ్మణ్ణి గారు?
      నీహారికకి విడాకులిప్పించడానికి పందెం ఒప్పుకుంటే,ఆయన గబుక్కున ఇచ్చేస్తే బుక్కయ్యేది యారు!

      Delete
    4. మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాలి .... విడాకులివ్వడం అంత తేలికా ? మీ బంగారాన్ని మీరు వదులుకుంటారా ? మనిషి మీద నమ్మకమే లేకపోతే వివాహమే అనవసరం కదా ? లాయరు ఖర్చులు కాదు విడాకులు ఇప్పించినవారికే !

      Delete
    5. zilebi is confused,not me!

      zilebi:ఆ కోర్టు కేసు కి పణం గా ఒంటి పై ఉన్న గుడ్డలు కూడా పెట్టేసి ఉంటా డని నీహారిక గారు వంద కోట్లు అన్నట్టున్నారు

      you:లాయరు ఖర్చులు కాదు విడాకులు ఇప్పించినవారికే !
      me:I have explained the same to zilebi and asked you just to confirm

      take it easy:-)

      Delete
    6. నేను చెప్పిందల్లా పందెం 1000 కోట్లకి పెంచితే యెవరన్నా పాపాత్ముడు ధైర్యం చేస్తే రామకార్యం కలిసొస్తుంది కదా పాపానికి పోతే పుణ్యం ఎదురైనట్టు అని,అంతే!మన బంగారం ఎంత మంచిదైతే మనకంత ధీమా,అంతే అంతే?!

      Delete
  4. అసలు బ్లాగులు వ్రాసే ఆడబ్లాగర్లు ఎక్కడున్నారు ? ఉన్నవాళ్ళనీ నిషేదిస్తే మీ తిట్లు చదివేవారెవరు ?

    ReplyDelete
  5. < "ఆడబ్లాగర్లని నిషేధించడం మంచిదని నా ఉబోస!"

    (తెలుగు సినిమా పరిభాషలో చెప్పాలంటే) మీరు అయిపోయారు, అయిపోయారు :))

    ReplyDelete
    Replies
    1. నిజంగానే బుక్కయిపోయానా?
      ఎరక్కపోయి ఇరుక్కుపోయానా!

      Delete

    2. 'ఏడ' బ్లాగర్లని నిషేదిస్తున్నారు ? :)

      ఈడ ఎవరో ఆడ బ్లాగర్లని నిషేదిస్తున్నారట ! రండి రండి కామింటు దాడులు మోహరించండి :)

      జిలేబి

      Delete

    3. కాదా మరి !

      జిలేబి

      Delete
  6. హరిబాబు
    మరీ అంతొద్దు :)

    ReplyDelete
    Replies
    1. శర్మ గారు --> ఇంకొక ముఖ్యాతి ముఖ్యమైన కారణం మగబ్లాగర్లంతా ముసలాళ్లయిపోయారు. :)

      ఇట్లా హరి బాబు వ్రాస్తారేమిటి ! మీరు అప్పోజ్ చేయాలి !

      జిలేబి

      Delete
    2. ఆయనేం పదారేళ్ళ బాలాకుమారుడేం కాదు :) అదీ అరవై దాటిన సరుకే

      Delete
    3. వయసుతో పని యేముంది?
      మనసు లోనే అంతా ఉంది!

      Delete
  7. < "నిజంగానే బుక్కయిపోయానా?
    ఎరక్కపోయి ఇరుక్కుపోయానా!"

    ఆహా, సంశయమేల :)
    చిన్నప్పుడు సినిమా హాల్ వాళ్ళ రిక్షాబండి పంచిపెట్టే సినిమా కరపత్రాలు గుర్తున్నాయా? "షరా మామూలే" అనే హెచ్చరికతో బాటు "తరవాతి కథ వెండితెరపై చూడండి" అని వ్రాసేవాళ్ళు. అదే పరిస్ధితి. అప్పుడే మొదలయిపోయింది కూడా గదా :) All the best.

    ReplyDelete
  8. నేను విశ్రాంత బ్లాగర్ను. నీహారిక ఎవరు? ఆమె అంటే భయం ఎందుకు?

    ReplyDelete
    Replies
    1. "రమ్యంగా కుటీరాన" ఉంటూ సీతని పొగుడుతూ రాముడి మీద రాళ్ళేస్తూ ఉంటుంది:-(
      మళ్ళీ నాకెవరన్నా 1000 కోట్లు ఇస్తే అయోధ్యలో రామాలయం కడతానని అంటుంది:-)

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...