Monday 6 April 2015

ఒక్క మాటకి వంద వక్రభాష్యాలు యెందుకు వస్తున్నాయో సరిగ్గా గమనించారా వనజ గారూ?

వనజ వనమాలి గారు దీపికా పడుకోనే "My choice" వీడియోలో వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలని సమర్ధిస్తూ ఒక పోష్టు వేశారు.అక్కడ కామెంటు వెయ్యాలని చూడగా ఒక చిత్రమైన సమస్య యెదురయింది.
"బృందం సభ్యులకు మాత్రమే ఈ బ్లాగులో వ్యాఖ్యలు పరిమితించబడ్డాయి.

మీరు ప్రస్తుతం Hari Babu Suraneniకు లాగిన్ అయ్యారు. మీరు ఈ ఖాతాకు వ్యాఖ్యను చేర్చలేరు."అనే సమాచారంతో నా వ్యాఖ్య నిరాకరించబడింది.ఇదివరకు కొన్ని వ్యాఖలౌ అక్కద వేసి ఉన్నాను,ఈ కొత్త ఇబ్బంది యెందువల్ల అవచ్చిందో నాకు అర్ధం కావడం లేదు? సాంకేతికంగా ఆమె వ్యాఖ్యల విషయంలో యేమి ప్రాధాన్యత ఇచ్చారో తెకియదు గానీ ఆమెకి నా అభిప్రాయం తెలియజెయ్యడానికి మరెమార్గం లేక ఇట్లా పోష్టుగా వేస్తున్నాను!వనజ వనమాలి గారు గనక అమర్యాదగా అనిపిస్తే వెంఠనే పోష్టుని తొలగిస్తాను - అందులో యెలాంటి అనుమానం అక్కర లేదు.

నేను ఆమెని అడగాలనుకున్న ప్రశ్నలు ఇవి:

దీపిక వ్యాఖ్యల్ని ఖండించిన వారిలో మరో నటి సోనాక్షి అభిప్రాయం గురించి యేమి చెప్తారు మీరు?
ఒక బ్లాగరు అయితే సోనాక్షిని "హిపోక్రాట్" అనేసాడు,మీ అభిప్రాయం కూడా అదేనా?

ఇంతకీ పెళ్ళికి ముందు సెక్సు సంబంధాలు అనేవి అంత అవసరమా?ఆ అమ్మాయి వాటిని సమర్ధిస్తూ మాట్లాడ లేదా?ఇవ్వాళ పెళ్ళికి ముందు సెక్సు సంబంధాలు యేర్పరచుకున్నా యెవరూ మమ్మల్ని ప్రశ్నించకూడదు అనే మాటని సమర్ధిస్తే దీనికి కొనసాగంపుగా పెళ్ళయిన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకోవడాన్ని కూడా సమర్ధించాల్సి వస్తుంది!యెందుకంటే పెళ్ళికి ముందు కోరికల్ని నిగ్రహించుకోలేక తాత్కాలికంగా కోరిక తీర్చుకున్న వాళ్ళు పెళ్ళయిన తర్వాత పవిత్రంగా ఉండాలనే నిష్ఠకి కట్టుబడి ఉండగలరా?

ఒక గుడ్డివాడు ఒక స్తంభాన్ని గుద్దుకున్నాడనుకోండి,ఆ స్తంభాన్ని తిడతామా అక్కడ యెందుకు ఉందని?ఇక్కడ చూస్తే "కామాలలో ధర్మావిరుధ్ధ కామాన్ని నేను" అని గీతలో ఉండగా కామసూత్రాలలో "ధర్మబధ్ధ శృంగారం","పార్దారికం","వేశ్యాధికరణం' లంటి విప్లవాత్మకమైన విషయాలతో నిండిన విజ్ఞానం ఉంటే దాని గురించి తెలుసుకుందామనే జిజ్ఞాస లేదు, పైగా శృంగారం గురించి నిజంగా తెలుసుకోవాలనుకుంటే యెంతో విజ్ఞానం వుండగా యే గంభీరమైన తాత్విక చింతనా లేకుండా కేవలం తమ విచ్చలవిడి తనానికి ఆమోదముద్ర కోసం అంగలార్చే వాళ్ళని మీలాంటి వాళ్ళు కూడా సమర్ధించితే ఇంక నైతికత అనే పదానికి అర్ధమేమిటి?ఆలోచించండి!

10 comments:

  1. హరిబాబు గారూ, దీపిక సొనాక్షి ఇద్దరికీ సొంత అభిప్రాయాలు ఉండడం, వాటి మధ్య అంగీకారం లేకపోవడం రెండు విషయాలు మామూలే. మనుషులలో అభిప్రాయ బేదాలు ఉంటాయి అది సహజమే.

    వివాహేతర సంబంధాలు తద్వారా ఉత్పన్నమయ్యే తగాదాలు భార్యాభర్తల మధ్య వారివురు తేల్చుకోవాల్సిన విషయమా లేదా సమాజం తేల్చాలా అన్నదాంట్లో కూడా అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి.

    ReplyDelete
    Replies
    1. వివాహేతర సంబంధాల విషయంలో యెవరి అభిప్రాయాలు వాళ్లకి ఉండవచ్చు నంటే పెళ్ళి,విడాకులు అనే విషయాలు చట్టంలోకి యెందుకు యెక్కాయి?

      Delete
    2. I will answer in English if it is OK.

      Marriage is an enabling provision. The law can't force anyone to get married. Purely the choice of individuals.

      Divorce (on grounds like unfaithfulness/cruelty) is a relief available to an aggrieved spouse. It is not automatic but can be exercised if the individual wants it.

      There is no contradiction between individual choice & law in this regard.

      Delete
    3. @jai
      I got full text of dipika voice over

      "It’s my choice to be a size zero, or a size fifteen. They don’t have a size for my spirit,” says the voiceover done by Deepika.
      We wonder who is the “they”? And we are happy to see, it HAS ALWAYS BEEN women’s “choice” to lose or gain weight, for last we remember, even Kareena Kapoor became “size zero” because “she” wanted to.
      “My choice… to marry, or not to marry. To have sex before marriage. To have sex outside of marriage. To not have sex.” And we must say, the choice is of the MEN too; to marry, not to marry, to have sex before marriage, to have sex outside of marriage, to not have sex. Or to love temporarily or to lust forever.
      Equality is all about putting the men and women on the same pedestal, right? So yeah, if a man wants to have sex outside marriage, we’ll let him. No calling him names then.

      మొత్తం పెళ్ళికి ముందరి సెక్స్ గురించీ పెళ్ళి తర్వాత అక్రమ సంబంధాల గురించీ యే మాత్రం తడుముకోకుండా చెప్పేసింది!

      దీనివల్ల ఆఖరికి మగాడికే లాభం - ఇప్ప్పుడు కడుపొస్తే అబార్షన్ ఖర్చులూ,లేకపోతే నష్ట పరిహారం అదీ కాకపోతే చచ్చినట్టు ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది!

      ఈ కాలంలో ఆడవాళ్ళు యెట్లా ఆలోచిస్తే పెళ్ళి,బాధ్యతలూ,బరువులూ లేకుండా పూల తోతలఓని తుమ్మెదలా స్వైరవిహారం చెయ్యాలనుకునే మగవాడికి వాటంగా ఉంటుందో అట్లాంటి విప్లవాత్మకమైన చిలక పలుకులు పలుకుతున్నది,గమనించారా?

      అతనికి లాగే నాకూ కోరిక పుట్టింది గాబట్టి నా ఇచ్చాపూర్తిగానే ఆ పని చేశాను,కాబట్టి అతను చేసినది తప్పు అయితే ఆ తప్పులో నాకూ భాగం ఉన్నట్టే అని మగవాడు కానీ ఆడది కానీ తప్పు చేశానేమో అని సిగ్గు పడకుండా బాహాటంగా వ్యభిచరించహ్టానైఅకి పనికొస్తుంది ఆ అభిప్రాయం.

      కానివ్వండి,తమ తప్పులకి తామే బాధ్యత వహించటం మంచిదే గదా?!యవ్వనంలో పొంకాలు బాగున్నంత వరకూఒ వీలున్నంతవరకూ కడుపు రాకుండా చూసుకుంటూ ఒకవేళ వస్తే తమ అకడుపుల్ని తామే తీయించుకోవటూ,ఇక పిల్లలు పుట్టరేమోననే స్థాయి కొచ్చాక అప్పటికి కండూతి తగ్గుతుంది గాబట్టి పెళ్ళయ్యాక బుధ్ధిగా వుంటారేమో లెండి?

      Delete
    4. ఆవిడ అభిప్రాయం ఆవిడది. ఆవిడ ఆడా మగా ఇద్దరికీ ఒకటే హక్కు అనడం మాత్రం బాగుంది.

      వివాహం (లేదా దాంతో సామానమయిన సంబంధం) చేసుకున్న మహిళ (పురుషుడు) పర పురుషుడితో (స్త్రీతో) సంబంధం పెట్టుకోవడం గురించి ఆవిడ భర్త (ఆయన భార్య) ఎటువంటి అభ్యంతరం చెప్పకూడదని నేను ఒప్పుకోలేను. స్త్రీపురుష సంబంధాలలో mutual good faith & loyalty ఖచ్చితంగా అవసరమే. అయితే ఇందులో పరాయి వారి (అత్తామామలు, సమాజం వగైరా) జోక్యం ఉండకూడదని నా అభిప్రాయం. This is & should be treated as a civil matter, not an issue of public morality and/or criminal offense.

      PS: మీరు వ్యభిచారానికి విచ్చలవిడితనానికి మధ్య తేడా మర్చినట్టున్నారు.

      Delete
    5. @jai
      PS: మీరు వ్యభిచారానికి విచ్చలవిడితనానికి మధ్య తేడా మర్చినట్టున్నారు.
      I got full text of dipika voice over

      "It’s my choice to be a size zero, or a size fifteen. They don’t have a size for my spirit,” says the voiceover done by Deepika.
      We wonder who is the “they”? And we are happy to see, it HAS ALWAYS BEEN women’s “choice” to lose or gain weight, for last we remember, even Kareena Kapoor became “size zero” because “she” wanted to.
      “My choice… to marry, or not to marry. To have sex before marriage. To have sex outside of marriage. To not have sex.” And we must say, the choice is of the MEN too; to marry, not to marry, to have sex before marriage, to have sex outside of marriage, to not have sex. Or to love temporarily or to lust forever.
      Equality is all about putting the men and women on the same pedestal, right? So yeah, if a man wants to have sex outside marriage, we’ll let him. No calling him names then.

      మొత్తం పెళ్ళికి ముందరి సెక్స్ గురించీ పెళ్ళి తర్వాత అక్రమ సంబంధాల గురించీ యే మాత్రం తడుముకోకుండా చెప్పేసింది!

      దీనివల్ల ఆఖరికి మగాడికే లాభం - ఇప్ప్పుడు కడుపొస్తే అబార్షన్ ఖర్చులూ,లేకపోతే నష్ట పరిహారం అదీ కాకపోతే చచ్చినట్టు ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది!

      ఈ కాలంలో ఆడవాళ్ళు యెట్లా ఆలోచిస్తే పెళ్ళి,బాధ్యతలూ,బరువులూ లేకుండా పూలతోటలో తుమ్మెదలా స్వైరవిహారం చెయ్యాలనుకునే మగవాడికి వాటంగా ఉంటుందో అట్లాంటి విప్లవాత్మకమైన చిలక పలుకులు పలుకుతున్నది,గమనించారా?

      అతనికి లాగే నాకూ కోరిక పుట్టింది గాబట్టి నా ఇచ్చాపూర్తిగానే ఆ పని చేశాను,కాబట్టి అతను చేసినది తప్పు అయితే ఆ తప్పులో నాకూ భాగం ఉన్నట్టే అని మగవాడు కానీ ఆడది కానీ తప్పు చేశానేమో అని సిగ్గు పడకుండా శృంగారానుభవం అందుకోవటానికి పనికొస్తుంది ఆ అభిప్రాయం.

      కానివ్వండి,తమ తప్పులకి తామే బాధ్యత వహించటం మంచిదే గదా?!యవ్వనంలో పొంకాలు బాగున్నంత వరకూఒ వీలున్నంతవరకూ కడుపు రాకుండా చూసుకుంటూ ఒకవేళ వస్తే తమ అకడుపుల్ని తామే తీయించుకోవటూ,ఇక పిల్లలు పుట్టరేమోననే స్థాయి కొచ్చాక అప్పటికి కండూతి తగ్గుతుంది గాబట్టి పెళ్ళయ్యాక బుధ్ధిగా వుంటారేమో లెండి?

      PS: ఇట్లా మారిస్తే అభ్యంతరం లేదు గదా?

      Delete
    6. @jai
      వివాహం (లేదా దాంతో సామానమయిన సంబంధం) చేసుకున్న మహిళ (పురుషుడు) పర పురుషుడితో (స్త్రీతో) సంబంధం పెట్టుకోవడం గురించి ఆవిడ భర్త (ఆయన భార్య) ఎటువంటి అభ్యంతరం చెప్పకూడదని నేను ఒప్పుకోలేను.
      ?
      మీ వాక్యనిర్మాణం గందరగోళంగా ఉంది!బ్రాకెట్ల గోల తీసేసి భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే మీరు భర్త అభ్యంతరం చెబితే ఒప్పుకుంటారా అభ్యంతరం చెప్పకపోతే ఒప్పూంటారా లేక అభ్యంతరం చెప్పకపోతే మీరు కూడా ఆవిడ ప్రియుల గుంపులో కలుస్తారా?కొంచెం వివరంగా చెప్తే సంతోషిస్తాం:-)

      Delete
    7. Sorry for my poor translation. Maybe it is better if I restate in English.

      A spouse (partner) has the complete right to insist the other partner remain faithful to the relationship. Other individuals including parents & society have no interest in this.

      భార్య వివాహేతర సంబంధాలకు అభ్యంతరం చెప్పే హక్కు భర్తకు ఉంది. తగాదాలో మనం తల దూర్చడం అనవసరం.

      Delete
  2. వాళ్ల జీవితం వారి చాయిస్ అనుకొవచ్చు. వివాహమైన తరువాత ఎవరితో నైనా సంబంధం కలిగి ఉంటే, నెల్లురు లొ ఈ రోజు జరిగిన సంఘటనకి ఎవరు బాధ్యత వహిస్తారు? భర్త కి ఎవరు న్యాయం చేస్తారు? వివాహేతర సంబంధాలలో ఇలా చనిపోవటమే జరిగితే, ఇక సమాజం చేయగలిగేదేముంది?

    నెల్లూరు: వివాహితను కత్తితో పొడిచి చంపిన ప్రియుడు
    http://www.andhrajyothy.com/Artical.aspx?SID=98494&SubID=119

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...