Friday, 24 April 2015

మద్రాసు నుంచి హైదరాబాదు మీదుగా అమరావతికి చేరుకున్నారు మనవాళ్ళు!ఇక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తారు వీళ్ళు?

    క్రీ.పూ 1వ శతాబ్దిలో ఉత్తర దక్షిణ భారతాలను రెంటినీ యేకం చేసి పరిపాలించిన మౌర్యసామ్రాజ్యం కాలవశాన బలహీన పడగా స్వతంత్రించి రాజ్యాలను యేర్పరచుకున్న వారిలో "యేకరాట్" అనే బిరుదునామం కలిగిన శ్రీముఖుడి ద్వారా స్థాపించబడిన శాతవాహన సామ్రాజ్యంలో ఇప్పటి నవ్యాంధ్ర తెలంగాణా రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలను హృదయస్థానంలో వుంచుకుని అమరావతి ఒక రాజధానిగా తొలి తెలుగు సామ్రాజ్యం అవతరించింది!

     సుదీర్ఘకాలం పాటు పరాధీనతని అనుభవించిన తర్వాత ఆంగ్లేయుల నుంచి స్వతంత్రం ప్రకటించుకున్న తొలి దశాబ్దిలో తెలుగు వాళ్ళంతా ఒక రాష్ట్రంగా "ఆంధ్రప్రదేశ్" యేర్పడినా గ్రూపులు కట్టడం, ముఠా రాజకీయాలలో పైచేయి కోసం పైస్థాయిలో జరిపే పైరవీల ద్వారా పదవుల్ని సంపాదించటం,ప్రజాబలం లేనంతకాలం అలా వచ్చిన పదవులు యెక్కువకాలం నిలవకపోవటం మళ్ళీ మళ్ళీ కళ్ళముందు కనబడుతున్నా సరే ఒకడి బదులు మరొకడు స్థానాలు మారడమే తప్ప అసలు సూక్ష్మాన్ని గ్రహించకపోవటం,ప్రజలతో సంబంధం లేని అధికారం సజావుగా సాగటం కోసం తన ప్రాంతాన్ని మాత్రమే జాగ్రత్తగా చూసుకోవడం లాంటి రాజకీయాలతో కాంగ్రెసు పార్టీ ప్రాంతాల మధ్య అసమానతల్ని పెంచగా స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో కాంగ్రెసుకి గట్టిపోటీ ఇచ్చి అప్పటి మేధావుల్లో మరో ప్రపంచాన్ని సృష్తిస్తారని నమ్మకం కలిగించిన కమ్యునిష్టులు పల్లెటూళ్ళలోని అమాయక జనం పోలేరమ్మలకీ గంగానమ్మలకీ చేసినట్టు ప్రభలు కట్టి వూరేగించి గౌరవించినా తమ బలం పెంచుకోకుండా బూర్జువా పార్టీలకి పక్కతాళం వేస్తూ సైధ్ధాంతిక వ్యభిచారం చేస్తూ కాలం గడపటంతో తెలంగాణా ప్రాంతపు మేధావులు కలిసి వుండటం వల్లే నష్టపోయామని భావించి ప్రత్యేక రాష్ట్రం కోసం వుద్యమించి సాధించగా విడిపోయిన రెండు భాగాల్లో మాతృరాష్ట్రానికి క్రీ.శ2015లో అమరావతి రాజధానిగా అమిరింది!

    తొలి శాతవాహనుల్లో శ్రీముఖ శాతకర్ణి రాజ్యాన్ని స్థాపించి నిలబెట్టినా 1వ శాతకర్ణి మహా బలంతో పరాక్రమించి అన్నివైపులకీ వ్యాపించి "దక్షిణాపధపతి" అనే గొప్ప బిరుదు సంపాదించాడు.ఖారవేలుణ్ణి జయించి మగధ వరకూ వ్యాపించాడు!తూర్పున నర్మద వరకూ వ్యాపించి శకుల నుంచీ గ్రీకుల నుంచీ జరుగుతున్న దండయాత్రల్ని నిరోధించి దేశాన్ని శాంతియుతంగా నిలబెట్టాడు.రెండు అశ్వమేధాలూ ఒక రాజసూయం చేసిన ఘనుడు!

    మలి శాతవాహనుల్లో తన పూర్వీకులు పోగొట్టుకున్న భూభాగాల్ని శకుల నించి మళ్ళీ సాధించి నిలబెట్టిన క్రీ.శ 1వ శతాబ్ది నాటి గౌతమీపుత్ర శాతకర్ణి ప్రముఖుడు. బౌధ్ధులకి చెప్పుకోదగిన రీతిలో దానాలు చేసినా తను బ్రాహ్మణుడు కావటం వల్లనో యేమో "యేక బ్రాహ్మణ" అనే బిరుదును సాధించాడు!

    రాజు దైవాంశ సంభూతుడనే మూఢనమ్మకాలు లేకుండా ధర్మశాస్త్రాల కనుగుణంగా సామాజిక సాంప్రదాయాలకు విలువనిచ్చి కడుచక్కని పరిపాలన సాగించారు శాతవాహన ప్రభువులు.రాజుకు సలహాలు ఇవ్వడానికి మంత్రిమండలి ఉండేది,రాజ్యం పెద్దది కావడంతో భాగాలుగా విభజించి ప్రాంతాలకు "రాజ","మహాబోజ","మహారధి" నామాలతో అధిపతుల్ని నియమించారు.సమాజం లోని ప్రజానీకం నాలుగు తరగతులుగా వర్గీకరించబడి ఉంది - పైన చెప్పుకున్న అదిపతులు పైస్థాయిలోని ప్రభు వర్గం,దానికి కింది అంతరువుగా అమాత్యులూ మహామాత్రులూ వంటి ఉద్యోగశ్రేణులూ తమ వ్యాపారకౌశలంతో రాజ్యపు సంపద పెంచే ప్రజ్ఞ వుండి సమాజంలో మంచి పరపతి గల్గిన వణిక్ప్రముఖులూ,మూడవ అంతరువులో ఇప్పటి మధ్యతరగతి కుటుంబాలతో పోల్చదగిన వైద్యులూ కవిగాయక శిఖామణులూ రైతులూ కుమ్మర్లూ కమ్మర్లూ,అన్నిటికన్నా కింది అంతరువుల్లో ప్రధాన వృత్తులకి అనుబంధమైన వృత్తి పనివాళ్ళయిన వడ్రంగులూ జాలర్లూ వంటివాళ్ళు వుండేవాళ్ళు!స్త్రీలు విద్యావంతులు కావడమే కాకుండా యెలాంటి అభ్యంతరమూ యెదుర్కొనకుండా మతసంబంధమైన కార్యక్రమాలకి అధ్యక్షత వహించగలిగేవాళ్ళు,చిన్నవాళ్లయిన కొడుకుల కోసం రాజ్యాన్ని రక్షించి యుధ్ధాలు చేసి అశ్వమేధాలు చేసిన రాణులూ ఉన్నారు?ప్రభువులే తమని తాము "గౌతమీపుత్ర","వాసిష్ఠీపుత్ర","కౌశికీపుత్ర" అనే పేర్లని గౌరవసూచకంగా భావించారు గదా!

    వ్యవసాయం,వ్యాపారం రెంటినీ సమానంగా సంరక్షించడంతో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లిన కాలమది!వ్యాపారస్థులకీ అన్ని రకాల వృత్తుల వారికీ ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సంఘాలు వుండి - అవి మొత్తం ఆ వర్గానికి చెందినవారి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉండేవి.ఇక్కడి తీరప్రాంతానికి చెందిన సుపార, కళ్యాణి వంటి ప్రముఖమైన రేవుపట్నాల ద్వారా అరేబియా,ఈజిప్టు,రోము వంటి ప్రాంతాలతో ఖండాంతర వ్యాపారం కూడా జరిగింది. పైఠాన్,నాసిక్ లాంటి మహారాష్ట్ర నగరాలు ఈ కాలంలో పెరిగినవే!ఆ రకంగా ఇవ్వాళ ప్రపంచాన్ని శాసిస్తున్న అమరికా వలె భౌతిక జీవనంలో అత్యున్నత స్థితిని అనుంభవించారు మన పూర్వీకులు.

   ఇక ఆధ్యాత్మికంగా చూస్తే స్వయంగా బ్రాహ్మణులైనా సర్వధర్మసమభావనతో ఇతర మతాల్ని కూడా ఆదరించారు - దాదాపుగా వీరి రాజ్యంలోని అందమైన గుహాలయాలన్నీ బౌధ్ధుల చైత్యాలూ విహారాలూ స్థూపాలతో నిండిపోయాయి!అసలైన అధ్భుతమూ సహిష్ణుతకి పరాకాష్ఠగా చెప్పుకోవలసిన విషయం శకులూ గ్రీకులూ కుషానుల వంటి విదేశీయుల్ని కూడా హిందూమతంలోకీ బౌధ్ధమతంలోకీ ఆహ్వానించి కలిపేసుకోవటం ఆనాడే జరిగిందంటే ఇవ్వాళ ఘర్ వాపసీ అనే చిన్న విషయానికే కొందరు హడిలి చస్తూ కొందరు గొడవలు చేస్తూ అఘోరిస్తున్నారంటే ఆనాటి మనవాళ్ళని చూసి మనం పొంగిపోకుండా ఉండలేము గదా!

    ఒకప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు ఉదయంలో విన్నవాళ్లకి శాలివాహన శకం పేరుతో సంవత్సరం చెప్పడం గుర్తుండే ఉండాలి - దాని ప్రారంభకులు శాతవాహనులే!ఇవ్వాళ క్రీ.శ అనేది యెందుకు విశ్వవ్యాప్తమైన కాలమానంగా గుర్తించబడుతున్నది?యెక్కడికి వెళ్ళినా తమ సంస్కృతి గొప్పది కావటం వల్లనే తాము గొప్పవాళ్ళమైనామనే అహంకారంతో తమవైన వాటిని అక్కడి స్థానికుల మీద రుద్దెయ్యటం వల్ల జరిగింది!మన ప్రభుత్వం అధికారికంగా ఆకాశవాణిలో వినిపించే ఆ రెండు కాలమానాల్లో శక సంవత్సరం మొత్తం భారతదేశానికి సంబంధించినదయితే శాలివాహన శకం మనం ఉన్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినది.మనం కూడా నిజాయితీతో కూడిన వ్యాపారంతో సరిపెట్టుకోకుండా ఇంగ్లీషు వాళ్ళలాగే దుర్మార్గంగా వ్యాపించి ఉంటే ఇవ్వాళ ప్రపంచ మంతటా క్రీ.శ బదులుగా శాలివాహన శకం ప్రకారం సంవత్సరాల్ని చెబుతూ ఉండేవాళ్ళేమో?!ఇవ్వాళ ప్రపంచం సంగతి దేముడెరుగు మనవాళ్ళకి చెప్పడానికయినా బలవంతంగా రుద్దాల్సిందేనేమో!?ప్రాదేశికంగా ఉత్తర దక్షిణ భారతాలను కలుపుతూ ఉన్న భూమిని పరిపాలించటం వల్లనూ మౌర్యులకి చాలాకాలం పాటు విధేయులుగా వుండినందువల్లనూ ఆర్య సంస్కృతి దక్షిణానికి విస్తరించటానికీ ఆ రకంగా మొత్తం దేశమంతా సాంస్కృతికంగా యేకత్వాన్ని సాధించటానికీ శాతవాహనులే కారణమైనారు!

    రక్తం పంచుకుపుట్టిన వాళ్ళు కూడా విడిపోయేటప్పుడు ఒకరు ఇంకొకర్ని నువ్వు నాకు ఇంత ద్రోహం చేశావు గనకనే నేను విడిపోయేవరకూ వచ్చానని లేని తప్పుల్ని కూడా వెదికి తిట్టడం,ఇంతకాలం కలిసున్నామనే మొహమాటం కూడా లేకుండా మరీ ఇంత దుర్మార్గంగా తిడుతున్నారేమిటని కష్టపెట్టుకోవడం,విడిపోయాక యెవరింట్లో శుభకార్యం జరిగినా పాత గొడవలు మర్చిపోయి అందరూ కలిసిపోవడం అప్పుడూ ఇప్పుడూ అక్కడా ఇక్కడా జరగడం చూస్తూనే ఉన్నాం గనుక యెక్కువకాలం అవతలివారు ఉద్యమకాలపు విద్వేషభావాన్ని కొనసాగించకుండా సామరస్యానికి దిగివస్తారని ఆశిద్దాం. విడిపోయే వరకూ గతం  పట్ల వుండే వ్యామోహంతోనో భవిష్యత్తు పట్ల అయోమయంతోనో ఇవతలి వైపున కూడా విభజనని కొందరు వ్యతిరేకించినా విడిపోయిన ఈ కొద్ది కాలంలోనే ఒక్కసారి కళ్ళు నులుముకుని చూస్తే నవ్యాంధ్ర భవిష్యత్తు నవనవోన్మేషంగానే కనబడుతున్నది!

    ముందునుంచీ అనుకునే చేశారో అనుకోకుండా జరిగిందో మళ్ళీ రాజధానికి అమరావతి పేరుని తగిలించడంతో ఒక్కసారిగా పాతరోజుల నాటి సంగతులు గుర్తుకొచ్చి మనస్సులో మళ్ళీ అలనాటి వైభవం సాధించాలనే ఉత్సాహం వురకలేస్తున్నది!సాధించగలమా అనే సందేహం యేమాత్రం అక్కర్లేదు - ఆనాడు సాధించినది ఈనాడు యెందుకు సాధించలేము?ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రపంచ దేశాలన్నీ కలయదిరిగి వెళ్ళిన ప్రతిచోటా సాధికారికమయిన వాగ్దానాలు తీసుకున్నాడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యాపార సంస్థలన్నీ యెప్పుడెప్పుడు ఆంధ్రలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాల్ని విస్తరించుదామా అని యెదురు చూస్తున్నాయి.రాజధానిని కూడా ఆదాయమార్గంగా మార్చడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్భుతమైన ప్రజ్ఞని చూపించాడు.అంతమంది రైతులు స్వచ్చందంగా తమ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించడం చరిత్రలో ఇదే మొదటిసారి!అది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని అసంఖ్యాక జనం నమ్మి చేసిన ప్రమాదకరమన పని,తను ప్రజల్ని మోసం గనక చేస్తే మాత్రం అదే స్థాయిలో అపకీర్తి ఖాయం!బయటి నుంచి వచ్చిన స్వామి అగ్నివేశ్,బృందా కారత్ లాంటి వాళ్ళు ఇక్కడి వాళ్ళని తలాతోకా లేని మాటల్తో రెచ్చగొట్టాలని చూసినా పూచికపుల్ల విలువ కూడా ఇవ్వకుండా మన రైతులు తమ పరిణితిని ప్రదర్శించారు!

    రాజధాని ప్రస్తావన వచ్చినప్పుడు మొదట అడవుల్ని కొట్టి బాగుచేస్తామని వాగి అభాసుపాలయి అతని కంటె ఘనుడు అన్నట్టు శివరామకృష్ణన్ అనేవాణ్ణి పంపిస్తే అదేదో అష్టావధానంలో నిషిధ్ధాక్షరి వ్యవహారం లాగ అక్కడ వద్దు ఇక్కడ వద్దు అని చెత్త పోగేసి దొనకొండ,వినుకొండ,అనకొండ అని లిష్టు చదివి యేమీ తేల్చకుండానే అంతా తేల్చేసినట్టు పోజులు కొట్టి ఇప్పుడు తను చెప్పని చోట కడుతున్నారని యేడుపొచ్చి మల్లెలూ జొన్నలూ పేరిగే చోటును పట్టుకుని "రైస్ బౌలుని క్యాపిటల్ చెయ్యటం యేమిటి?" అని అఘోరిస్తే ఆ ముక్క పట్టుకుని ప్రజలకి తిన్నగా వోటు వెయ్యడం నేర్పిస్తే పొయ్యేదానికి  ప్రజా ప్రతినిధుల మీద లోక్ అదాలత్ అనేదాన్ని కాపలా పెట్టి అదీ చాలకపోతే మరో కాపలా పెట్టే రకం గందరగోళపు ఉద్యమంతొ కొంచెం పాప్యులారిటీ తెచ్చుకున్న అన్నా హజారే గారు కూడా ఆవేశం తెచ్చుకుని గర్జనలు చేస్తున్నాడు,యేమిటో వీళ్ళ బాధ?!

    రాష్త్ర శాసనసభకి విలువ ఇవ్వకుండా ఆర్టికిల్ 3 ద్వారా కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే విడగొట్టటం,అదీ ఒక ప్రాంతం నాయకుల మీద మరో ప్రాంతం నాయకులు వారికన్నా వేగంగా అభివృధ్ధి చెందడమే నేరమన్నట్టు అనరాని మాటలు అంటుంటే వాటికి జవాబు చెప్పుకోవడానికి చట్టసభలలో యెక్కడా అవకాశం కూడా ఇవ్వకపోవటం,ఆఖరికి మాతృ రాష్ట్రాన్ని కనీస మర్యాద కూడా ఇవ్వకుండా పదే పదే అవశేషంగా అభివర్ణించటం,మిగిలిన ముక్కనన్నా అట్లా ఉంచకుండా సీమవాసులు అడక్కపోయినా రాయల తెలంగాణా పేరుతో ఆ ప్రాంతాన్ని కూడా అప్పనంగా తెలంగాణాకే దఖలు పర్చాలని ప్రయత్నించటం,రాజధాని కట్టుకోవటానికి నికరమైన నిధులూ లోటు బడ్జెట్టును యెదుర్కోవడానికి తగ్గ యేర్పాట్లు యేవీ అధికారికంగా బిల్లులో ఉంచకపోవడం చూస్తుంటే ఈ రాష్త్ర విభజనలో తెలంగాణా అనే కొత్త రాష్ట్రాన్ని యేర్పరచడంతో పాటు ఈ మిగిలిన ఆంధ్ర ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలనే దుర్మార్గపు వ్యూహం కూడా వున్నదని నాకు అనుమానం!చెప్పుకుంటే జనం మెచ్చుకునే గొప్ప సంగతి కాదు గనక ఆ కుట్రలో పాల్గొన్నవాళ్ళు యెవరూ బయటికి చెప్పరు గనక నిర్ధారణగా చెప్పలేము గానీ అరిభీకరంగా చెలరేగిపోతున్న ఉద్యమవీరులు కూడా తెలంగాణా నడిబొడ్దునే ధరావతులు పోగొట్టుకుంటున్న కాలం నుంచీ మొదలు పెట్టి ఇస్తానని చెప్పి తొమ్మిదిన్నరేళ్ళు సాగదీసి తెలంగాణా వాళ్లనీ యేడిపించిన కాలంలో జరిగిన సంఘటనలనన్నిట్నీ కలిపి విభజన బిల్లు పార్లమెంటులో చట్టంగా రూపుదాల్చేవరకూ తేదీల వారీగా వ్యక్తుల ప్రకటనల్నీ పత్రికల వాళ్ళు కూపీలు లాగిన రహస్య సమావేశాల వివరాల్నీ అమరిస్తే చాలా తేలికగా తెలుసుకోవచ్చు గుండుగుత్తంగా తెలంగాణాకి లాభం చేకూర్చే ఉద్దేశంతో కావాలనే ఆంధ్రా రాయలసీమ ప్రాంతాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని,యెందుకో మన మీద అంత పగ!

    మొదటినుంచీ కలిసుండటానికే ఇష్టపడుతూ రాయల తెలంగాణాని కూడా వ్యతిరేకించిన సీమ సోదరులు ఈ రాష్ట్రం మరోసారి ముక్కలవుతే చూద్దామని అనుకున్న వాళ్లని పూర్తిగా నిరాశపర్చేశారు.నవ్విన నాపచేను పండదా అన్నట్టు అన్ని పగల్నీ దాటుకుని ఆఖరికి ఆంధ్రోళ్ళు మిడిమేలపు సెంటిమెంట్లని వొదుల్చుకుని వెనకపీకుడు లేకుండా ముందుకే పరుగులు పెట్టగలిగే శుభకాలంలోకి అడుగుపెట్టారు!తొలిదశ రాజధాని పూర్తయితే చాలు ప్రభుత్వం పూర్తిగా సొంత రాష్ట్రం నుంచే నడుస్తుంది - కొత్తగా వ్యాపార పారిశ్రామిక వేత్తలతో కుదుర్చుకున్న అంగీకార పత్రాలు వాస్తవరూపం దాల్చటం అనే ముఖ్యమైన వ్యవహారాలు పొరుగు రాష్ట్రంలో యెందుకు జరగాలి?వాళ్ళిక్కడ పరిశ్రమలూ వ్యాపార సంస్థలూ స్థాపించి మనుషుల్ని తమ సొంత దేశం నుంచి తెచ్చుకోరు గాబట్టి ఇక్కడి వాళ్లకి ఉపాధి ఖాయం!పైగా శిక్షణ అంటూ ఒకటి ఉంటుంది గాబట్టి అది గట్టిగా జరిగితే మనవాళ్ళు ఇక్కడి నుంచి యెక్కడి కయినా వెళ్ళగలరు.వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండిపోయినా అక్కడికీ ఇక్కడికీ తిరుగుతూ కులాసాగా గడిపినా ఆమేరకు సంపద పెరుగుతుంది!మరో శాతవాహన యుగం మొదలవుతుంది!


వీళ్ళు ఇంకెక్కడికీ వెళ్లరు - ప్రపంచమే వీళ్ల దగ్గిర కొస్తుంది!

22 comments:

 1. కట్టెవంకరను పొయ్యి తీర్చును
  మనిషిద్రోహాన్ని కాలం మార్చును
  ఎంతకాలం మిడిమేలపు ప్రజ్ఞావంతులు
  వేస్తూ పోతారు అంహకారపు గంతులు

  ReplyDelete
 2. @vkbabu
  అచ్చతెలుగు తీసేశానండి!నేను అంత సీరియస్సుగా "హిందూ పురాణాల అశాస్త్రీయత సంగతి సరే గానీ మీరు పాటిస్తున్న మార్క్సిజం శాస్త్రీయమైనదేనా?ఎర్ర మేధావు లందరికీ ఇదే నా సవాల్!" అంటూ చాలేంజి చేసినా ఒక్క పండితుడూ చర్చకి రాకపోయేసరికి ఇట్లా రెచ్చగొడితేనన్నా వస్తారేమో అనుకున్నా.ఆ పోష్టు రాసింది మాత్రం యెవరయినా వాదనతో మెప్పిస్తే నిజంగానే కమ్యునిజం గొప్పదని ఒప్ప్పుకునే సిన్సియారిటీ తోనే రాశాను,యేం లాభం?కానీ మొత్తం భావం చూసుకోకుండా దాని గురించి రెఫరెన్సు ఉండటంతో మీరు వేసిన మంచి వ్యాఖ్యని కూడా తొలగించేశాను,యేమనుకోకండి!

  ReplyDelete
  Replies
  1. ఫర్లేదు హరిబాబు గారు.

   Delete
 3. There is a OIL and gas pipeline going through andhra to Maharastra/Guj. Till that time that pipe is there andhra would get funding. i think CBN knows it well.

  ReplyDelete
 4. హరిబాబు గారు, రాసే ఓపిక లేక లింక్ ల ను ఇస్తూంటాను. మీరు వాటిని చూశారా? మీకేమైనా ఉపయోగపడ్డాయా?

  ReplyDelete
  Replies
  1. @UG Sriram
   అవును,ఇటీవలి పోస్టు "బ్రాహ్మణుణ్ణి సంస్కరించాలనే క్రైస్తవుల లక్ష్యం నుంచే బ్రాహ్మణ వాదం పుట్టింది?" మీరిచ్చిన లింకు ఆధారంగానే రాశాను!కంచి స్వాములు వైదిక భాష గురించి చెప్పడం చాలా శ్రధ్ధగా చదివాను.

   Delete
  2. నేను ఇచ్చిన లింక్ లను మీరు తప్పకుండా చూడండి.

   Delete
 5. what ever happened is for good.
  Did you think we got these many central institutions to andhra ?
  Did you think vijayawada airport was smaller than a small railway station? now its going to get focus. and it would be proper international airport in 2 years.

  The biggest problem with andhra is zero trade and black trade. nobody (or most people) in vijayawada around trade in black or only cash.

  They does not pay vat properly. they does not pay registration tax properly... go and see in bangalore for 40L apartment there will be 18% more will be added in vat, registration, water, power and all. these things wont be paid in andhra.

  Capital between vza and guntur is perfect. that will rope in these towns and all other mid size towns. And once it is capital it will get focus, and people must pay taxes....

  Telangana shows more in budget but actually they are not getting the revenue now like expected(70-90 % of united andhra's).

  Chandra babu knows that singapore or japan will not do the actual work. Its for the publicity. When i talk to my non andhra friends they are attracted to these catchy words singapore japan... thats what we want. to be in the eyes of the world.

  ReplyDelete
 6. Also we need to get pattiseema and Veligonda 1&2 done ASAP in a year. these are key to get andhra in safe zone in water case.

  There could be 200 issues created by YSR. Veligonda and potireddipadu were real gems he invested.

  ReplyDelete
 7. అయ్యా! మీరు బాగా వ్రాశారు. కానీ ఆవేశంలో కాబోలు, అర్థం కాని వాక్యాలనేకం కూర్చారు. వాటిని కాస్త చిన్నచిన్న వాక్యాలుగా విడగొట్టి మరింత స్థిమితంగా నింపాదిగా వివరణాత్మకంగా వ్రాయమని నా సలహా.

  మీరు యువకులు. ఉత్సాహవంతులు, ఆశావాదులు. మేమా, వయసైపోయినవాళ్ళం. ఈ వయసులో రాష్ట్రానికి ఈ గతి పట్టడాన్ని చూస్తూ షాకులో ఉన్నవాళ్ళం. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం ప్రస్తుతం పొలాలూ, పొదలూ, కొండలూ, గుట్టలూ, గోతులూ, చెరువులూ తప్ప ఇంకేమీ కాదు. అదంతా ఎప్పుడు ఊరవ్వాలి? ఎవరు చేయగలరు? వట్టి కోర్ క్యాపిటల్ ( 8 - 12 చ.కి.మీ.లలో) మాత్రమే కట్టాలన్నా నాకు తెలిసి, నా అంచనాలో 30 వేల కోట్లు కావాలి. ఎక్కణ్ణుంచి వస్తాయి? ఎవరిస్తారు? జీతాలివ్వడానిక్కూడా నిధుల్లేని ప్రభుత్వమిది రాజధాని ఎలా కట్టబోతోంది? ఆ విదేశీ కాంట్రాక్టింగ్ కంపెనీలకి ఎలా ఏ మార్గంలో చెల్లించబోతోంది? ఈ ఖర్చులు రోజురోజుకీ పెరిగేవే తప్ప అంచనాకి కరెక్టుగా అలాగే ఉండేవి కాదు గదా! ఏమీ అర్థం కావడం లేదు. ఎప్పటికి ఈ నవ్య అమరావతి మరో మద్రాసో, హైదరాబాదో అవుతుంది? దాని బదులు విజయవాడలోనో, గుంటూరులోనో అవసరమైనంత మేరకు భవంతులు కట్టుకుని ఊరుకోక ఈ భూసేకరణలెందుకు? దొనకొండలాంటి అడవిలో రాజధాని పెడతానన్న జగన్ కీ, తుళ్ళూరులో పెడతానంటున్న నాయుడుకీ ఏమిటి తేడా? అంతా అయోమయం. అక్కడైనా ఇక్కడైనా రిస్కూ, ఖర్చూ అన్నీ ఒకే స్థాయిలో కనిపిస్తున్నాయి. అసలు ఆ తుళ్ళూరు గొడవ తలపెట్టకుండా కేవలం విజయవాడ-గుంటూరునే రాజధానిగా ప్రకటించినా అవి మరో మద్రాసో, హైదరాబాదో అవ్వాలంటే ఎంత లేదన్నా 30 ఏళ్ళు పడుతుంది. అప్పటి దాకా మా తరంవాళ్ళం ఉంటామో లేదో! పోనీలెండి. కనీసం మీరైనా చూస్తారు భావి అమరావతీ నగర అపురూప శిల్పాలు.

  ReplyDelete
  Replies
  1. Dear ది ఆంధ్రా హ్యూమనిస్ట్,
   out of 30,000 acres, 11000 acres will be distributed to famers in form of layouts. ~7000 acres will be with government in layouts.

   these 11000 acres in layouts will be investment seed for the entire andhra. Now we dont need to invest in HYD,BLR,Chennai or anywhere else.

   Why our government is not moving to vijayawada/guntur/amaravati? because they dont have residential space. Now we have space to construct. If our govt officials from hyderabad come to vja it would be 20k employees. with families they would make 60,000 people . With services , shops and small groceries business itself our capital will start with 1L population in 2 years.

   More over it would be the only city in India with water supply. With pattiseema/polavaram feeding delta, pulichintala with 20TMC can feed ~10milloin people in our capital...
   Capital construction will be 30,000 cr is too much over estimate. with 10,000 crore we can build as good capital as Delhi/Hyd...

   Be positive.

   Delete
  2. AndhraBoy గారు! కృతజ్ఞతలు. నా వ్యాఖ్య ఈ పోష్టు మీద. మీరు చెప్పినదంతా వాస్తవమే కావచ్చు గానీ అది మరీ అంత త్వరగా సాకారమయ్యేట్టు కనిపించడం లేదనే నేనంటున్నది. ఒక 15 - 20 ఏళ్ళ లోపలైతే బహుశా మేమూ చూడగలుగుతాం. ఇందులో ఇంకా చాలా variables ఉన్నాయి. ఉదాహరణకి - అక్కడా ఇక్కడా ఒకటే కూటమి అధికారంలో ఉండడం, ఇదే టి.డి.పి. 2019 లో కూడా అధికారంలోకి రాగల్గడం, మధ్యలో హుద్ హుద్ తుఫాన్ లాంటి వైపరీత్యాలు విజయవాడ-గుంటూరులని తాకకుండా ఉండడం etc. మొత్తమ్మీద మన ఆకాంక్షలు ఫలించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

   Delete
 8. అయ్యా! ఈ బ్లాగు యొక్క టైమ్ సెట్టింగులు అమెరికా టైమ్ కి సరిపోలుతున్నాయి. మీరు గాని అమెరికాలో ఉండట్లేదు గదా! లేకపోతే కాస్త సవరించండి.

  ReplyDelete
  Replies
  1. నేను చెన్నైలోనే ఉంటున్నానండి,కానీ టైం సెట్టింగ్స్ అమెరికాకు యెందుకు వెళ్ళాయో మరి?మార్చడానికి ప్రయత్నిస్తాను.యెక్కడుందో లింకు వెదకాలి!

   Delete
 9. టపా బాగుంది. అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాము.

  ReplyDelete
 10. "వీళ్ళు ఇంకెక్కడికీ వెళ్లరు - ప్రపంచమే వీళ్ల దగ్గిర కొస్తుంది"

  హరిబాబు గారూ, కొస మెరుపు (tag line) చాలా బాగుంది. అలాగే జరగాలని మనసారా కోరుకుంటాను.

  పైని andhra humanist వ్యాఖ్యకు కొనసాగింపుగా నావో రెండు సలహాలు. 1. పారాల నిడివి కాస్త తగ్గిస్తే బాగుండేది 2. సబ్-హెడింగులు వాడితే విషయం మార్చడం సులువు అవుతుంది.

  మీ వివరణ అంత స్పీడులో చర్చను అర్ధం చేసుకోలేని వారికి సహాయం అయేది. Not everyone can think (or comprehend) at your speed. I for instance had to read your post twice :)

  ReplyDelete
  Replies
  1. @jai
   మీరు పారాల గురించి చెప్పింది ఒక ఇబ్బంది మూలంగా వచ్చింది.గత పోష్తులో యెలా జరిగిందో గానీ అడ్మిన్ సెట్టింగ్సులో ఫాంట్ సైజు నార్మల్ బదులుగా లార్జి అని వచ్చింది.నేను కొత్త పోస్టు వేసేతప్పుదు వర్డ్ రాప్ చేస్తున్నాను గాబట్టి పాత పోష్టు లోంచి ఒక పేరాని కాపీ చేసి ఇక్కడ పేష్టు చేసి లేఖిని లోంచి అక్కడికి పేష్టు చెయ్యడం చేస్తున్నా.శ్యామలీయం మాస్టారు "ప్రముఖ్" గురించి చెప్తున్నారు.కాస్త హాయిగా డైరెక్టుగా తెలుగులోనే రాసుకుపోయే పద్ధ్ధతి ఉంటే బాగుణ్ణు!యేది వాడాలన్నా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చెయ్యటం అనే పని ఒకటి ఉంది కదా,ట్రై చేసి చూడాలి!

   మీరు నా గత పోష్టులో "?!" గురించిన ఇబ్బందిని చెప్పారు.ఒక వాక్యంలో అర్ధం నేను ప్రశ్నించేటట్టుగా ఉంటే "?" గుర్తునీ నాకున్న ఆశ్చ్ర్యాన్ని చూపాలంటే "!" గుర్తునూ వాడ్తూ రెండూ కలిపి చెప్పాలంటే "?!" గుర్తుల్నీ అన్నిచోట్లా వాడుతూనే ఉన్నా.కాకఓతే ఆ పోష్టులో అలాంటి విషయం యెక్కువగా ఉంది.అయినా మీ సూచన బాగానే ఉంది.ఇంతకీ ఫార్మటింగుకి సంబంధించి సూచనలు ఇస్త్న్నారు గాబట్టి అడుగుతున్నాను.వర్డ్ రాప్ నేను తప్ప ఇంకెవరూ చేస్తున్నట్టు లేదు.పారాలో తొలి వాక్యం మార్జిన్ కూడా నేనే యెక్కువగా వాడుతున్నాను.అది యెలా అనిపిస్తున్నది?

   Delete
  2. ప్రముఖ్ Install చేయవలసిన పని లేదు. Extract చేసి వాడుకోవటమే! మీరు direct గానే తెలుగులో వ్రాసుకోవచ్చును. అక్కడా ఇక్కడా type చేసి cut & paste చేయ నవసరం లేదు. ఒక short cut మాత్రం desktop మీద create చేసుకోండి - సదుపాయంగా ఉంటుంది.

   Delete
  3. from where could i extract it?
   can you give me the link, sir!

   Delete
  4. ప్రముఖ్ డౌన్ లోడ్ లింక్:
   ప్రముఖ్ IME

   Delete
 11. లేఖిని లో టైప్ చేసి కట్ అండ్ పేస్ట్ చేసే కన్నా క్రింద నేనిచ్చిన టూల్ " Microsoft indic language input tool telugu" లో చాలా తేలిక. ప్రయత్నం చేసి చూడండి.

  http://www.bhashaindia.com/ilit/Telugu.aspx

  ReplyDelete
  Replies
  1. తెలుగు లో 'ఘీం'కరించ డానికి గూగుల్ ఇన్పుట్ టూల్ అంత పవర్ఫుల్ వేరే ఏదీ లేదు !

   జిలేబి

   Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు