Sunday 29 March 2015

నీ కళ్ళెదుట వేరేవాడు మీ అమ్మని రేప్ చేస్తుంటే ఈ సలహా మీ అమ్మకి ఇవ్వగలవా అనే ప్రశ్న యెందుకు తట్టలేదు?

          అవును,ఆ ఇంటర్వ్యూ చేసిన ఆడమనిషికి గానీ దాన్ని వీడియోగా తీస్తే లేని తప్పు బయటికి చూపిస్తే యేదో ఘోరం జరిగిపోతుందని అల్లరి చేసిన వాళ్లకి గానీ ఆ ప్రశ్న వాణ్ణి అడిగి చూడాలని యెందుకు అనిపించలేదు?ఆ గాడిద రేప్ చేస్తుంటే చెయించుకోవాలి గానీ తిరగబడటం దేనికి అని ప్రశ్నిస్తున్న సన్నివేశాన్ని చూస్తున్న మొదటి క్షణం లోనే నాకు కలిగిన సందేహ మిది!

      లడ్డుని బజారులో పెడితే కుక్కలు ముట్టుకోవా అని కూసిన లాయర్ని వెంనే "నీ భార్య కూడా లడ్డు అనుకో,తను పచారీ కొట్టుకు వెళ్తున్నప్పుడో తలనెప్పి మాత్ర తెచ్చుకోవడానికి వెళ్తున్నప్పుడో సరదాకి ఓ నాలుగు కుక్కల్ని పంపి నాకిస్తాం అప్పుడు కూడా ఇట్లాగే సమర్ధించ గలవా?" అని అడగాలని యెందుకు తోచలేదు అక్కడున్న జనాల్లో యే ఒక్కడికీ?

       రేపటి రోజున వాడు జైలులో తన సాహస కార్యాన్ని గురించి కవిత్వం చెప్పుకుంటే అవి పత్రికల్లో ప్రచురితమై హాట్ కేకులుగా అమ్ముడయినా ఆశ్చర్యం లేదు గదా!విదుదలయ్యాక యెన్నికల్లో పోటీ చేస్తే అఖండమైన గెలుపు కూడా వరించినా ఆశ్చర్యం లేదు గదా!మొగ్గలోనే తుంచగలిగిన దానికి నీరు పోసి పెంచి పోషించి అప్పుడు కత్తులూ గొడ్డళ్ళూ సానబెట్టి ప్రయోజన మేమిటి?పిల్లల్ని యెట్లా పెంచాలో తెలియని వాళ్ళు పిల్లల్ని కనడం దేనికి?!

      సూటిగా గుండెల్ని తాకే ఒక ప్రశ్న వెయ్యి శతఘ్నుల్ని పేల్చగలదు!సరిగ్గా ప్రశ్నించడమే తెలియని వాళ్ళు పరిష్కారాన్ని యెట్లా సాధించ గలరు?ఆ నరపశువుని కన్న తలిదండ్రులే వాడికి స్త్రీ పట్ల చిన్నచూపు కలగడానికి మొదటి కారణమని తెలిశాక గూడా తెల్లమొహం వేసుకుని చూసేవాళ్ళు యేనాటికి కళ్లు తెరుస్తారు?సంస్కారం నేర్పని విద్య ఈ దురవస్థకి మూలకారణం అని యెంతమందికి తట్టింది?!

ధర్మో రక్షతి రక్షితః

8 comments:

  1. బాబూ... హరిబాబు.

    ఈ విషయంలో నీ అభిప్రాయంతో నూరుశాతం ఏకీభవిస్తున్నాను. అలాగని అమ్మలు/అక్కలు అంటూ నువ్వు రెచ్చిపోవడమ్మీదాన్ని నేను సమర్ధించను. నీ అభిప్రాయ వ్యక్తీకరణ విమర్శకు తావిచ్చేదిగా ఉండాలి. నీ అభిప్రాయంతో విభేదించేవారిని స్వాగతించేవిధంగా ఉండాలి. ఇలా ముందస్తుగా అవమానించే విధంగా ఉండకూడదు. అసలు నీ విమర్శలో తర్కంకన్నా, emotionality ఎక్కువగా ఉంది. ఇదే విషయమ్మీద నీకంటే బాగా రాసినవారు సారంగలోనూ, ఇదే కూడలిలోనూ ఉన్నారు. దయచేసి చదువు.


    నాకెందుకో మీరు తప్పతాగి ఈ పోస్టు రాశారనిపిస్తుంది (ఎందుకంటే గతంలో అదే తప్పు నేనూ చేశాను, ఇప్పుడు నా సరళి మార్చుకున్నాను).

    ReplyDelete
  2. వందకి వంద శాతం తప్పులేదు మీరు అడిగిన దానిలొ. పైన వ్యాఖ్యాత భావం చదివిన తర్వాత రాయాలని పించిన్ది. అయ్య... అక్కడ మాట్లాడుతుంది మనుషులైతే కొంచెం సభ్యత గట్రా గురించి ఆలోచించాలి. రేప్ చేస్తుంటే చేయించు కోవాలి అన్న సబ్యత కలిగిన వాళ్ళు మనుషులు ఐతే కారు అని నా అభిప్రాయం. దాన్ని తెగడటానికి తప్ప తాగడం అవసరమైతే తప్పులేదు అంటాను. సాటి మనుషులని లడ్డులతోనో ఇంకో పదార్దం తోనో పోల్చే వాళ్ళను తిట్టడానికి సబ్యత అడ్డొస్తే , అది సభ్యతే కాదు అంటాను.

    ReplyDelete
    Replies
    1. బాబూ... నేను చెప్పినట్లుగానే... నేను రేపిష్టు వెధవనుకాను. రేప్సిష్టులకు అత్యంత తీవ్రమైన శిక్షపడాలని, అలాంటివారికి మరణశిక్ష సరైనశిక్ష కాదని వాదించేవాళ్ళలో నెనొక కోరుకొనేవాళ్లలో నేనొకణ్ణి.

      ఆ లాయర్ల వ్యాఖ్యానం విషయంలోకూడా నేను వాళ్ళతో ఏకీభవించను. వారి వ్యక్తిగత అభిప్రాయాలకిగాను వారిని prosecute చెయ్యాల్సిందే...

      కానీ సర్.... ఒక అభిప్రాయంతో విభేదించే పధ్ధతి ఇది కాదు. For suppose నాకు కాఫీ తాగడం ఇష్టంలేదనుకోండి, నేను "కాఫీత్రాగేవాళ్ళను సమర్ధించేవాళ్లందరూ ఒక అమ్మ, అబ్బకు పుట్టినవాళ్ళుకారు" అని అనొచ్చా?

      Delete
    2. జలంధరుడు ఎలా ఓడాడో కొంచెం వివరిస్తారా సారూ...?

      I would expect a defence lawyer to excoriate the prosicution. Leave the lawers, why don't we attack the bloggers (like manu, praveen), who expressed the similar opinions of the rapists with the equal vehimence? అక్కడ మర్యాదలు అడ్డొస్తాయేం?

      prosecution ఒక పధ్ధతిని పాటించాలన్నదే నా అభిప్రాయం. prosecution ఎప్పుడూ defense మీద వ్యక్తిగత విమర్శలు చేయకూడదు (and vice versa).

      Delete
    3. @Iconoclaust
      జలంధరుడు ఎలా ఓడాడో కొంచెం వివరిస్తారా సారూ...?
      ?
      ఈ జలంధరుడు ఓడిపొవటం యెందుకొచ్చింది ఇప్పుడు?పిల్లికీ పిడుక్కీ ఒకతే మంత్రం అన్నట్టు పెతిచోటా సంస్కృతినే తప్పు పట్టాలా?అన్నిచోట్లా అదే పైత్యకారి తనమా!

      సాంకేతికంగా ఒక లాయరుగ అతను ముద్దాయి రేపు చేసాడా అన్నది తెలియకముందు కేసు టేకప్ చెయ్యటం తప్పూ కాదు,కోర్టు రూములో నా క్లైంటు నిరపరాధి అని వాదించటమూ తప్పు కాదు.కానీ జీవమూ వ్యక్తిత్వమూ ఉన్న ఆదపిల్ల్లని లడ్డుతో పోల్చి అట్లా తిరగనిస్తే మగవాళ్ళు రేప్ చెయ్యకుండా ఉంటారా అని దుర్మార్గంగా మాట్లాడినప్పుడు నేను అక్కడ ఉంటే ఖచ్చితంగా పైన నా బ్లాగులో చెప్పిన ప్రశ్నని అతని ముఖాన్నే అడుగుతాను,అందులో యెలాంటి సందేహమూ లేదు.

      ఇంక మీరు నేను తప్పతాగి రాసి ఉంటాను అని మీరే సభ్యత లేని కామెంటు వేశారు,మీకు మీరు ఆలోచించుకోండి నా పోస్టు అసభ్యంగా ఉందో మీ కామెంటు అసభ్యంగా ఇందో!ఒక తప్పుడు మాట యెవరు యెప్పుడు యెక్కడ మాట్లాడినా అప్పుడు అక్కడ వున్నవాళలో యెవరో ఒకరు కౌంటరు ఇస్తే ఆ తప్పుడు మాట యొక్క ప్రబావం సమాజం మీద పడే సమయం తగ్గుతుంది.ఆ సన్నివేశం జరిగి ఇంత కాలమయ్యాక బాగా ఆలోచించి మరీ రాసిన పోస్టు ఇది!అనాలోచితంగా యేదీ రాయను నేను.

      మీకేమో తప్పతాగి రాసినట్టుగా అనిపించింది?ఒక్క ప్రశ్నతో సరిపోయే ఇవ్వాళ వాయిదా వేసిన యుధ్ధం రేపటికి పదింతల భీభత్సాన్ని తీసుకొస్తుంది,చాలా దారుణాలు అట్లా జరుగుతున్నవే!

      Delete
  3. హరిగారిని ఈ విషయంలో నూటికి నూరుపాళ్ళు సమర్ధిస్తున్నాను. కేవలం డబ్బు కోసం వాదించే ఒక అన్యాయవాది ఏదో వాగితే, దాన్ని విమర్శించడానికి ఎటువంటి ఆలోచనలు చెయ్యనక్కర్లేదు. అవతలి వ్యక్తి మారణాయుధాలతో దాడి చేస్తుంటే, చేతులు కట్టుకుని ధర్మ పన్నాపాలు చెపితే ఉపయోగం ఉండదు. ఒకటి, చేతనయితే మనం కూడా ఎదుర్కోగలగాలి లేదా, వాడి దుర్మార్గానికి బలయిపోవాలి. ఇప్పుడు సమాజం స్తితి రెండో మార్గానికి దగ్గరగా ఉంది. మేధావుల్ని ఏమీ మాట్లాడకుండా నోరునొక్కేస్తే, దుర్మార్గానిదే రాజ్యం అవుతుంది. అందరూ అదే నిజమనుకొనే రోజు వస్తుంది.

    ReplyDelete
  4. ఆ లాయర్ గాడిదగి డిఫెండ్ చేసుకునే అవసరం వచ్చింది వాగాడు ....అంత కన్నా ఘోరమైన అభిప్రాయాలున్నవారు మంచివారిలా చెలామనీ అవుతూనే ఉన్నారు.
    దరిద్రం ఎంటంటే పక్కవాడు తిడితే రెండు ఎక్కువ తిట్లు కలిపి మనల్నే తిట్టుకోవడం దానికి ఆత్మ విమర్ష అని పేరు పెట్టుకోవడం వెర్రి ఆనందాన్ని ఇస్తోంది మనకి!!.

    ReplyDelete
    Replies
    1. ఆ రేపుల కవరేజి ట్యూషన్లా మారిపోయింది కానీ రేపులని తగ్గించేలా లేదు .... ఇంటర్వ్యూ అనే కాదు న్యూస్ చానళ్ళలో చూపించే రేపుల వార్తలు కూడా భయం కల్పించే కన్నా ఎలా చేసారు...ఎలా తప్పించుకున్నారు అనేవే నేర్పుతున్నట్లు అయ్యాయి!.
      అందుకని ఆ ఇంటర్వ్యూకి అంత ప్రచారం అవసరం లేదనేది నా అభిప్రాయం.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...