Tuesday 31 March 2015

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు కేంద్రప్రభుత్వంలో వున్నా ఏపీకి రావల్సినవి కూడా రావడం లేదు!

          కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక వూడినట్టు చంద్రబాబు తమకేమీ సాయం చెయ్యకపోయినా భాజపాకి మాత్రం ఇబ్బందులు కలిగించవద్దని సొంత మనుషుల్నే కట్టడి చేస్తుంటే ఆనక జనం దీన్ని నపుంసకత్వంగా అర్ధం చేసుకుని సహేంద్ర తక్షకాయ అన్న చందాన భాజపాతో పాటూ కాంగ్రెసు లాగా నువ్వూ ఆవల ఉండు నాయుడూ అంటే యేమి చేయవలె?అప్పుడే సూర్యారావు మాస్టారి గెలుపు ద్వారానూ మిశ్రమ ఫలితాన్ని చూపించటం లోనూ సంకేతాలు పంపించారు - తెదెపాకి ప్రజాభిమానం తగ్గిందని!అది ప్రజాగ్రహం గా ముదరక ముందే చురుకు తెచ్చుకోవాలి, తెచ్చుకుంటాడా కేంద్రంలో మోదీ అవసరం అనే పాతపాటతో తమ్ముళ్ళకి ఇంకా కళ్ళాలు బిగించి పూర్తిగా పుట్టి మునిగాకే కళ్ళు తెరుస్తాడా?

            ఒకసారి కేసీఆర్ ఉద్యమంలో ఆంధ్రోళ్లని తిట్టే పైత్యకారి వాదనని గట్టిగా యెదుర్కునే అర్హతలు అన్నీ ఉన్నా గోడమీదపిల్లివాటం రాజకీయంతో మొత్తం ఆంధ్రప్రజానీకం యొక్క నిజమైన ప్రతినిధిగా నిలబడి తెలుగుప్రజలలో తిరుగులేని ఆమోదాన్ని పొందే గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు,మళ్ళీ భాజపాతో మెతక రాజకీయమాడి మరోసారి ప్రజాభిమానానికి దూరమవుతాడా!

             మొన్నటి పార్లమేంటు సమావేశాల్లో (ఉగాదికి ముందు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రస్తావనకి వీరప్ప మొయిలీ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వ్యతిరేకిస్తారనుకున్న ఇతరులు యెవరూ అతనితో గొంతు కలపలేదు. పైగా బెంగాల్ సభ్యుడు సౌగతా రాయ్ అయితే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మించడం గురించీ రాష్ట్రానికి సహాయం చెయ్యడం గురించీ కొంత అనుకూలంగానే మాట్లాడాడు!అయినా పిల్లిమెడలో గంట కట్టేదెవరు అన్న దోబూచులాటతో అధికార ప్రతిపక్ష పార్టీలు మీనమేషాలు లెక్క పెట్టటానికి కారణం యేమిటో ఆ పార్టీ అధిష్ఠానాలకే తెలియాలి!వ్యతిరేకించాలని అనుకున్నవాళ్లు యెవరయినా చొరవ తీసుకోదల్చుకుంటే వీరప్ప మొయిలీ ప్రకటనకి అనుకూలంగా మాట్లాడే అవకాశాన్ని వొదులుకుని వుండేవారు కాదు గదా!

        సాంకేతికంగా ప్రత్యేక హోదాకి ఇదివరలో నిర్వచించిన కొండ ప్రాంతాలు వుండటం లాంటివి లేకపోయినా విభజన కారణంగా ఆవిర్భవించిన యేడాదికే లోటు బడ్జెట్ వుండటం,మాతృరాష్ట్రం అయినా రాజధానిని పూర్తి ఆదాయంతో సహా కొత్తగా యేర్పడిన పిల్ల రాష్ట్రానికి వొదిలేసి రాజధాని లేకుండా ఆదాయాన్ని కోల్పోయి నిలవటం కూడా వాటితో పోల్చదగ్గ బలహీనతలే, ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వటం సబబే అని వెంకయ్య నాయుడు అంటుంటే అందరూ తలలూపుతున్నారు - అయినా అది దఖలు పర్చేటందుకు తొలి అడుగు మాత్రం పడటం లేదు,కారణ మేమిటి?అప్పటి ప్రధాని చేసిన వాగ్దానాన్ని ఇప్పటి ప్రభుత్వం మన్నించి తీరాలనే సభా సాంప్రదాయం కూడా అనుకూలంగానే వుంది కదా?అట్లా మన్నించకపోతే ఆ పదవికి ప్రత్యేకత యేముంటుంది?నిండుసభలో ఒక ప్రధాని చేసిన ప్రకటన కేవలం ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయి మరో పార్టీ అధికారంలోకి రావడం మూలంగా అమలుకి నోచుకోకపోతే ఆ స్థానానికి రాజ్యాంగపరమయిన గౌరవం తగ్గినట్టే గదా!

        ప్రభుత్వంలో ఉన్న భాజపా తొలి అడుగు వేస్తే అధికారం పంచుకుంటున్న మిత్రపక్షానికి మేలు చేస్తున్న అపప్రధ మొయ్యాల్సి రావచ్చునన్న భయం ఉందొచ్చు,కానీ విభజనలో దేన్ని ఆశించి అంత మొండిగా తెలంగాణా ఇచ్చి దాన్ని పొందలేక చతికిలబడిన కాంగ్రెసు కనీసం పరువు నిలబెట్టుకోవడానికైనా ఇప్పుడు ఏపీకి ప్రత్యెక హోదా రప్పించాల్సిన అవసరం వుంది కదా! యేదో ఒకరోజున చర్చ+ఓటింగు తీర్మానం కాంగ్రెసు ప్రవేశ పెడితే ఆ రోజుతో ఐసాపైసా తేలిపోతుంది గదా యెందుకీ యెదురు చూపులు?ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాడతామని అన్నిసార్లు వాగుతున్నా తిరపతి యెన్నికల నుంచి మొన్నటి యెం.యెల్.సీ యెన్నికల వరకూ ఒక్క చొట కూడా ఒంటికాలు మీద నిలబడే చోటు కూడా ఇవ్వడం లేదంటే "ముందు సాధించుకురా అప్పుడు చూస్తాం" అని చెప్తున్నారని అర్ధం చేసుకోకపోతే పూర్తిగా చచ్చాక మేలుకుంటారా యేంటి?

          తెదెపా నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్న ఆడంగి పేరుగల మగాడు ఒకడు కాసేపు హోదా రావడం కష్టమనీ యెక్కువ నిధులతో సరిపెట్టుకుందామని సన్నాయి నొక్కులు నొక్కుతూనూ ఆ నిధులు కూడా సరిపడినన్ని ఇవ్వకపోవడం తెలుస్తూనే ఉన్నా వచ్చేస్తున్నాయి అధిక నిధులు అనీ బహురూపుల వేషాలతో సొంత పార్టీ వాళ్ళనే మోసం చేస్తున్నాడు,అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంకా కళ్లు తెరవడం లేదు,యెందుకనో?ప్రజలు మాత్రం గమనిస్తూ నిశ్శబ్దంగా వున్నారు, అవకాశం కోసం యెదురు చూస్తూ తుఫాను ముందరి ప్రశాంతతని చూపిస్తున్నారు  - ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులూ కొంచెం చురుకు తెచ్చుకోవాలి?!

ప్రజలతో క్రూర పరిహాసాలు ఆడిన ప్రతివాడూ పరిహాసాస్పదుడయ్యాడనేది చరిత్ర చెప్తున్న సత్యం!

1 comment:

  1. "అప్పుడే సూర్యారావు మాస్టారి గెలుపు ద్వారానూ మిశ్రమ ఫలితాన్ని చూపించటం లోనూ సంకేతాలు పంపించారు - తెదెపాకి ప్రజాభిమానం తగ్గిందని"

    మిగిలిన టపా అంశాల గురించి నా అభిప్రాయం తెలిసిందే కనుక మళ్ళీ చెప్పను.

    అయితే మాస్టారు గెలవడం హర్శనీయమయినా దాన్ని టీడీపీ ఓటమి/తగ్గిన ప్రజాదరణగా అనుకోలేము. ఎంఎల్సీ ఎన్నికలు ప్రజాభిప్రాయ దర్పణం కావు. అందునా టీచర్స్ ఎన్నికలలో సాధారణంగా పీయార్తీఎఫ్, యూతీఎఫ్ లాంటి ఉపాధ్యాయ సంఘాల అభ్యర్తులే గెలవడం ఆనవాయితీ. కృష్ణా జిల్లా సీట్ నుండి గెలిచిన రామకృష్ణ టీడీపీ మద్దతుతో పోటీ చేసినా ఆయన కూడా టీచర్స్ యూనియన్ నాయకులే.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...