Friday, 30 March 2018

కేసీయార్ జాతీయ రాజకీయాలలోకి ఐక్య ఫ్రంట్ ద్వారా వెళ్తే బాగుంటుందా,ఒంటరి దారిలో వెళ్తే బాగుంటుందా?

ఇప్పుడు ఉత్తరాది నేతలొ దక్షిణాది నేతలూ ఉనన్ స్థితిలో అసలు కేసీయార్ అందర్నీ కలుపుకుని ఇదివరకటి నేషనల్ ఫ్రంట్ ఆలోచన చెయ్యదమే తెలివితక్కువ పని.ఎందుకంటే,ఈయన ఎంత చానక్యపు కబుర్లు చెప్పినా ఈయనతోఅకలిసి వచ్చేవాడు ఒక్కడు కూడా లేడు.వాళ్ళలో ప్రతి ఒక్కడూ తనే ప్రధాని కావాలని ఆశిస్తున్నాడు.నితిష్ కుమార్ చూడండి,అమెరికా వెళ్ళి వస్తువులనై అమ్మే తెలివితేటలతో తనై అమ్ముకుని ప్రధాని అయిన మొదీ కన్న నితిశ్ ముఖ్యమంత్రిత్వం చాలా గొప్పగా  నడిచింది.ఇదిఓక్ ఉత్తరాది వ్యక్తి చాలా విశ్లేషణాతమకంగా నాకు పోలికలు చెప్పి ఒప్పించాడు!మరి అపుడు మిసయిన వ్యక్తి ఇపుడు ఆశించహడా?కేసీయార్ కూడా ఇక్కద ఇనత్ వైభవం చూసి వేరేవాళ్ళకి ప్రధాని పదవి ఇచ్చి చిరంజీవిలా టూరిజం శాఖతో సర్దుకుపోగలడా?

కాబట్టి ప్రతికూలతలు ఎన్నిఉన్నపప్టికీ ఒంతరి పోరు ఒక్కతే దారి.ఫ్రంట్ అంటూ ఉంటే టీం ఉంటుంది,ఒంతరి పోరు అంటే ఫోకస్ అంతా తన మీదే ఉంటుంది,తెలుగ్ మీడియాలా జాతీయ మీడియా తనకి గాలి కొట్టదు,పైన ఏ కొంచెం పొరపాటు మాట్లాడినా వాయించి పారేస్తుంది - వాళ్ళకి ఇప్పటికే ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది కాబటి డబ్బుతో కొనడం కూడా కష్టమే.మీడియాని కొనేతంత స్థాయిలో ఏ స్పాన్సరారూ కేసీయార్ మీద పెట్టుబడి పెట్టడు.కేసీయార్ ప్రధాన్ అయ్యే లక్ష్యాన్ని ప్రభావితం చహెర్సే పొలిటికల్,మీడియా,మార్కెట్ రంగాలలో వూడలు దించుకుని ఉన్న నార్త్ లాబీయింగ్ చాలా చాలా చాల బలమైన అడ్డుగోడ.కేసీయర్ దాన్ని ప్రసన్నం చహెసుకోవదమో బద్దలు కొట్టడమో చేస్తే తప్ప ప్రధాని కాలేడు - ఈ నార్త్ లాబీయింగ్ లేదని అమాయమగా ఉంటే నేను చెప్పగలిగినది శూన్యం!

ఎందుకంటే,మనం చిన్నప్పుడు చదువుకున్న చరిత్రనిఒకసారి గుర్తుకు తెచ్చుకోండి.అంతకు ముందు అసలు చరిత్రయే లేనట్టు విదేశీ దందయాతర్లతోనే మాన్ దేశపు చరిత్రని నింపేశారు.అవన్నె దాదాపు ఢిల్లీ చుట్టూరానే తిరుగుతాయి.బాబ్రూ శ్రీకృష్నదేవరాయలూ సమకాలికులని నాకు ఈ మధ్యనే బాబ్రు నుంచి ఔరంగజేబు వార్కు మొఘల్ చరిత్ర మీద ఒక పోష్టు రాయ్డానికి వెతుకుతుంటే బాబరుకి సంబంధించిన వెతుకులాతలో తెలుసుకోవలసిన దౌర్భాగ్యం పట్టింది నాకు!గుప్తూల గురించీ మౌర్యుల గురించీ అధ్యయాలు కేతాయించినవాళ్ళు శాతవాహనుల గురించీ పాండ్యుల గురించీ నాలూగైదు పేరాగ్రాపులతో సరిపెట్టేశారు.ఇవ్వాళా సమైక్య ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంత జ్=క్రూరంగా విడగొట్టటానికీ విడిపోయిన తర్వాత కొత్త ఆంధ్ర రాష్ట్రానీ 14వ ఆర్ధిక అసంఘం కేటాయింపుల్ని కూడా ఇవకుండా ఏడిపించహ్టానికీ ఆ రెండు పార్టెలనీ స్పాన్సర్ చేసిన నార్త్ లాబీయింగ్ పంతమే కారణం!

తను తెలంగాన తెచ్చుకోవడానికి సాయపడి తనకి గిట్టని దొంగబాబుని ఏదిపిస్తున్నది గనక నార్త్ లాఎబీయింగుని తను మచ్చిక చేసుకోగలనని కేసీయార్ అనుకుంటూన్నాడు కాబోలు!రాజ్కీయ వ్యూహాలకి సంబంధించిన సాధ్యాసాధ్యాలలో ఢె కొట్టిబద్దలు కొట్టదం కన్న సామరస్యం మంచిదే గానీ రేపటిన్రోజున తనని మెర్ జాఫర్ స్థానంలో నిలబెట్టదన్న గ్యారెంటె ఏముంది?తన వైఔనుంచి తను మచ్చీక్ చేసుకుంటున్నది నేను కదా అనుకున్నప్పటికీ నార్త్ లాబీ మీద పూర్తి కంట్రోలు మాత్రం కేసీయారుకి రానివ్వరనేది ఖాయం.ఒకవేళ ధైర్యం చేసి వెళ్ళినా రిలాక్సుడుగా ఉండే పరిస్థితి లేదు.

ఈ నార్త్ లాబీ విశ్లేషణ కొందరికి నమ్మశక్యం కాకపోయినా కేసీయార్ ఒంటరి ప్రయాణం చెయ్యాలంటే మొదట తన మీద నమ్మకం కలిగించుకోవాలి.మోదీ గుజరాత్ మోడల్ని చూపించినట్టు తెలంగాణ మోడల్ని చూపించటం కాపీ/పేష్టు చీప్ ట్రిక్ అవుతుంది.నేను నమ్మకం కలిగించాలి అంటే ప్రజలకి నమ్మకం కలిగించాలని అంటున్నానని మీరు అనుకుంటే అది పొరపాటు.ఇవ్వాళ ఎన్నికల ఖర్చు సొంత జేబు నుంచి ఎవడూ పెట్టుకోవటం లేదు,ఆ పెటుబడి పెట్టే స్పాన్సరర్లని కేసీయార్ నమ్మించాల్సింది. వాళ్ళని నమ్మించాలంతే జనాన్ని కదిలించాలి,తన వెంట తిప్పుకోవాలి,పిచ్చోళ్ళని చెయ్యాలి,వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీయారుకి తప్ప ఇంకొకళ్లకి వోట్లు వెయ్యరు అని స్పాన్సరర్లు నమ్మాలి.జనాన్ని మోసం చెయ్యడం కన్న స్పాన్సరర్లని మోసం చెయ్యడం చాలా కష్టం!

రాష్ట్ర స్థాయిలో అధికారం తెచ్చిపెట్టిన తెలంగాణ ఉద్యమం లాంటిది జాతీయ స్థాయిలో నడపాలంటే కేసీయార్ వెతుక్కోవాలసిన పని లేకుండా అయోధ్య ఉద్యమం రెడీగా ఉంది - రామాలయం కతామని అధికారానికి వచ్చాక ఆ వూసే ఎత్తని వాళ్ళు కేసీయారు కోసమే అలా ఉంచేశారేమో అనుకునేటంత అనుకూలంగా ఉంది పరిస్థితి కేసీయారుకి.

భాజపాకి తన రధయాత్రతో వూపు తెచ్చి ఆ గుర్తింపు లేకపోగా అవమానాలు ఎదుర్కొంటున్న అద్వానీని కలుపుకుంటే అగ్నికి వాయువు తోడైనట్టు ఉంటుంది.అయితే ఎంతమందిని కలుపుకున్నా రామాలయం కట్టటానికి ముస్లిముల వైపునుంచి పూర్తి సహకారం తప్పనిసరి.బీజేపీ చేతులు ముడుచుకుని కూర్చున్నది రెండు కారణాలతో - ఒకటి ఆ సమస్య నానుతూ ఉన్నంతకాలం హిందువులని మోసం చెయ్యడం కుదురుతుంది కాబట్టి, రెండవది వాళ్లు చొరవ చూపించినా మూర్ఖపు సాధుసంతులూ బురతక్కువ స్వయంసేవకులూ ముస్లిములని బతిమిలాడటానికి ఇష్టపడకపోవటం.

పాతబస్తీ కామందులు ఒవైసీలు తనకి మిత్రులు కాబట్టి ముస్లిములని సుముఖం చెయ్యటం భాజపా కన్న కేసీయారుకి చాలా తేలిక!జాతీయంగా అద్వానీ, కే సీ ఆర్, ఒవైసీ కాంబినేషన్ సూపర్ !మొదట్లో నాకు ఇర్రిటేటింగ్ అనిపించింది ఈ కాంబినేషన్.ముగ్గురూ మూడు పూర్తి విరుద్ధమైన వ్యక్తిత్వాలు గలవాళ్ళు, కలయికే వికారం అనుకున్నాను గానీ జనసేన+జగసేన కన్న మెరుగే కదా అనిపిస్తున్నది:-)

ద్వానీ RSS మనిషి,మోదీ ప్రతినమస్కారం కూడా పెట్టనంత అవమానించాడని మనకు అనిపిస్తున్నా ఆసలు అద్వానీ మనస్సులో ఏముందో మనకి తెలియదు గదా!RSS,BJP మనుషులు పైకి ఎంత అరాచకంగా కనిపీంచినా RSS వారసత్వం అయిన క్రమశిఖణ ఒకటి అఘోరిస్తుంది.అతనూ ఒకప్పుడు ప్రధాని పదవి కోసమే రామజన్మభూమి ఉద్యమం మొదలుపెట్టాడు గాబట్టి అవమానం తొలుస్తూనే ఉంటుంది,అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడని కూడా అనుకోవచ్చు.అవకాశం రానప్పుడు ఒదిగి ఉన్నప్పటికీ అవకాశం వస్తే ఇప్పటికీ తన ప్రసంగాలతో ప్రజల్ని రెచ్చగొట్టే శక్తి ఉన్న ప్రతిభాశాలి.

కేసీయార్ పక్కా రాజకీయవాది.అతనికి హిందూత్వం,తెలంగాణ సంస్కృతి,జాతీయత అనేవి ఉపయోగపడుతాయని అనుకుంటేనే నెత్తిన పెట్టుకుంటాడు.భాషలో మోటుతనం,ప్రవర్తనలో దురుసుతనం,ఎత్తుగడల్లో జిత్తులమారితనం ఉన్నవాడు.ఇవన్నీ తిట్లు కావండోయ్,అతనికి ఉన్న ఎస్సెట్లు!

ఒవైసీ కూడా కేసీయార్ తరహా వ్యక్తియే  కేసీయార్ హిందువు,ఇతను ముస్లిం - అంతే తేడా!వాళ్ళల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ ముగురికీ ఒకచోట కలిసే ఉద్దేశం ఉందో లేదో తెలియదు.కానీ నాకు మాత్రం వీళ్ళు ముగ్గురూ కలిసి మొదట రామాలయం సమస్యని పరిష్కరించగలిగితే అది వీళ్ళకి శుభారంభం అవుతుంది!

భాజపా రామాలయం కట్టడం అనేది జరగని పని.దానికి కారణాలు
1).అలహాబాదు కోర్టు తీర్పు ద్వారా ఆలయం కట్టడానికి అవసరమైన భూమిలో కొంత ముస్లిం వక్ఫ్ బోర్డుకి దఖలు పడింది.అది మనం మన ఇంటి స్థలాన్ని హక్కుభుక్తం రిజిస్టరు చేసుకున్నంత నిఖార్సైన వ్యవహారం.
2).ఆ భూమిని మనం వాళ్ళ దగ్గిర్నుంచి బలం ప్రయోగించి స్వాధీనం చేసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు.
3).సాధు సంతులూ ఆరెస్సెస్సూ విశ్వ హిందూ పరిషత్తూ భజరంగ దళమూ స్వామి లాంటి కొందరు మూర్ఖపు భాజపా నాయకుల వాదన యేమిటంటే మన ఆలయాన్ని మనం స్వాధీనం చేసుకోవటానికి వాళ్ళని బతిమిలాడటం దేనికి అని.అయితే,తాతల నాటి భూమి కదా అని తండ్రి అమ్మేసిన భూమిలో మనకి ఏమి హక్కు ఉంటుంది?అలాంటప్పుడు గజపతులు మా, ప్రాంతం వాళ్ళు కాబట్టి వాళ్ళని ఓడించిన శ్రీకృష్ణదేవరాయల్ని స్పోటకం మచ్చలవాడు అని కళింగాంధ్రులు అంటుంటే వ్యతిరేకించడమూ అనవసరమే అవుతుంది.ఆ దారిలో వెళ్తే చాలా దెయ్యాలు పైకి లేస్తాయి.లింగాయతుల కధ కనపడుతూనే ఉంది కదా - అది భాజపా పుణ్యమే కదా!
4).వీళ్ళు నిజంగానే అది సాధ్యపడుతుందని నమ్ముతున్నారో జనాన్ని మోసం చెయ్యడానికి చెబుతున్నారో తెలియదు గానీ భాజపాకి ఫుల్ మెజారిటీ వస్తే ప్రత్యేక చట్టం తెచ్చి చిటికెలో కట్టవచ్చునని చెబుతున్నారు.
5).అమాయకత్వం వల్ల గానీ మదోన్మత్తత వల్ల గానీ వాళ్ళకి తెలియనిది యేమిటంటే ముస్లిముల సంఖ్యాబలం, ఐకమత్యం గొప్పవి కాబట్టే కేవలం పదేళ్ళలో పాకిస్తాన్ సాధించుకున్నారు.అప్పుడు ఇక్కడే ఉండిపోయినవాళ్ళు ఇప్పుడు మరింత బలపడి ఉన్నారు.వీళ్ళు మొండికి పోయి చట్టం తెస్తే వాళ్ళు మొండికి పోయి మళ్ళీ మోప్లా వూచకోతలూ కలకత్తా భీబత్సాలూ మళ్ళీ రుచి చూపిస్తారు.అవతల ప్రపంచ స్థాయిలోనే ముస్లిముల జనాభా విపరీత స్థాయిలో పెరుగుతున్నది.అప్పటి కన్న ఇప్పుడు మరింత భీబత్సం చలరేగడం ఖాయం!
6).అసలు వీళ్ళు చేసిన చట్టం కోర్టులో పిటిషన్ వేస్తే వీగిపోతుంది.ఇవ్వళ అయోధ్య లోని ముస్లిములకి దఖలు పడిన భూమి రాజ్యాంగం ఇచ్చిన ఆస్తిహక్కుకి సంబంధించిన వ్యవహారం అయినప్పుడు దానికి భంగం కలిగించే చట్టం చెల్లదు.

ఈ కారణాల వల్ల రామాలయం కడుతుందేమోనని నమ్ముతున్న హిందువులు భాజపా గురించి మర్చిపోవడమే మంచిది.అద్వానీ ప్రధాని పదవి కోసమే రామాలయం గురించి ఎత్తినా జిన్నాను పొగిడి సొంత మనుషుల చేతనే తిట్టించుక్కున్నా మోదీ నుంచి ంబహిరంగ తిరస్కారం పొందినా సామాన్య హిందువులకి మాత్రం ఒక రకమైన ఆత్మీయత ఉంది అతని పట్ల - హిందువులు తమ రాజకీయపరమైన అస్తిత్వం గురించి ఆలోచించడం అద్వానీ రధయాత్ర వల్లనే మొదలైంది.

కేసీయార్ గనక ఒవైసీ ద్వారా ముస్లిములని పరిష్కారానికి ఒప్పించి ముస్లిముల నుంచి భూమిని హిందువులకి అప్పగించేటట్లు చెయ్యగలిగితే అతను జాతీయస్థాయిలో తొలి అడుగులోనే ఒక అద్భుతం చేసినట్టు అవుతుంది.కేసీయార్ మొదట అద్వానీని కలిసి సమస్యని పరిష్కరించడానికి హిందువుల ప్రతింధిగా నిలబెట్టాలి.ఒవైసీకి చెప్పాల్సినది ఒకటే.ఎంతకాలం పాతబస్తీని పొదుగుతూ కూర్చున్నా అతనికి ఎదుగూ బొదుగూ ఉండదు.దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన అహడావిడి చేస్తున్నాడు గానీ అతని మెయిన్ లేబుల్ "హైదరాబాదు పాతబస్తీ సాయిబు!" అనే కదా.అదే అయోధ్య సమస్యని పరిష్కరించడంలో కేసీయారుకి హెల్ప్ చేస్తే తను ఒక మెట్టు ఎదగవచ్చు!ఇప్పటి వరకు తను ఉన్న రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి పక్కతాళం వేస్తూ గడుపుతున్నవాడు తనే అధికార పీఠానికి ఎక్కవచ్చు.

ఇప్పుడు కేవలం ముస్లిముల వోట్ల మీద ఆధారపడినవాడు అప్పుడు హిందువుల వోట్లని కూడా ఆశించవచ్చు!కేసీయార్ లాంటి మాటలమాంత్రికుడికి అటు అద్వానీని ఇటు ఒవైసీని ఒప్పించదం పెద్ద్ద కష్టం కాదు,

అద్వానీ ఒకవేళ భాజపా లోనూ RSS లోనూ ఉన్న స్నేహితుల మొహమాటం వల్ల ఇవతలికి రాకపోవచ్చు,అయినప్పటికీ కేసీయార్,ఒవైసీ కలయిక హిందువులకీ ముస్లిములకీ మధ్యన స్నేహభావం ఏర్పడటానికి పనికొస్తుంది.ప్రస్తుతానికి జాతీయస్థాయిలో ముస్లిముల వైపునుంచి అయోధ్య సమస్యలో కలగజేసుకోవటానికి ఒవైసీల కన్న గట్టివాళ్లు లేరు.ఏది ఏమైనా ఇప్పుడు రాబోయే ఎన్నికల లోపే మొదటి అడుగు వెయ్యాలి - ఎన్నికల తర్వాత కొత్త ఉద్యమాన్ని నాలుగైదేళ్ళు డేకించాల్సి వస్తుంది - డబ్బూ టైమూ రెండూ వేస్టే! కానీ కేసీయారుకి ఈ ఆలోచన రావాలి కదా.లేదంటే,ఎవరైనా నా ఆలోచనని చేరవెయ్యాలి.

కాగల కార్యం తీర్చే గందర్వులు ఎవరో?ఎక్కడ ఉన్నారో!

Wednesday, 28 March 2018

ప్రపంచ ప్రసిద్ధి గల హిందూ ఆలయాలు - తిరుమల

1.ఆలయం పేరు (Name of the temple)
శ్రీ వేంకటేశ్వర స్వామి 
2.ఆలయ చరిత్ర (history of the temple)
          చారిత్రక పరంగా చూస్తే తిరుమల ఆలయంలోని మొదటి ప్రాకారమైన ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని చెబుతారు.ఈ తొండమాన్ చక్రవర్తి స్వామివారికి మామగారైన ఆకాశరాజుకు సోదరుడు.
          కలియుగంలో భక్తులను తరింపజేయటానికి శ్రీ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించి తిరుమలను కలియుగ వైకుంఠంగా నిలబెట్టాడు.ద్వాపరయుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషుడు వారించి నిలబెట్టినాడు.అప్పుడు వారిరువురి మధ్యన పెద్ద యుద్ధం జరుగుతుంది.శ్రీమహావిష్ణువు వారి దగ్గిరకి వచ్చినప్పుడు వారిరువురు ఎవరి గొప్పతనం వారు చెప్పుకుంటూ ఉంటే వారికి గర్వభంగం కలిగీంచాలని ఒక పరీక్ష పెడతాడు.మేరుపర్వతం ఉత్తరభాగంలో ఉన్న ఆనందశిఖరాన్ని గట్టిగా చుట్టుకోమని ఆదిశేషునికి చెప్పి వాయుదేవునితో ఆ పర్వతాన్ని అక్కడ నుంచి కదల్చగలవేమో ప్రయత్నించమని చెబుతాడు.

         ఈ పరీక్షలో తన బలాన్ని ప్రదర్శిస్తున్న వాయుదేవుని ధాటికి సమస్త లోకాలూ తల్లడిల్లుతుంటే బ్రహ్మ అభ్యర్ధన మేరకు ఆదిశేషుడు తన పట్టును కొంచెం సడలిస్తాడు.అంతట వాయుదేవుని ప్రభావం వల్ల ఆనంద శిఖరం కదిలిపోయి సర్వముఖి నది ఒడ్డున పడుతుంది.ఇది తెలిసి ఆదిశేషుడు బాధ పడుతుంటే బ్రహ్మ ఆ వేంకటాద్రిలో నిన్ను విలీనం చేస్తాను, అక్కడ శ్రీమహావిష్ణువు వెలుస్తాడు అని చెప్పి సముదాయించాడు. ఆదిశేషుడు విలీనం అయిన వేంకటాద్రి మీద విష్ణువు  పడగ అయిన శేషాద్రి పైన శ్రీనివాసుడుగా, మధ్యభాగమైన అహోబిలంలో శ్రీ నారసింహ స్వామిగా వెలిస్తే తోకభాగమైన శ్రీశైలంలో శివుడు శ్రీమల్లికార్జునుడుగా వెలిశారు అని పురాణాలు చెబుతున్నాయి.
          ఇది ఆదిశేషుడు తిరుమలగిరిగా నిలిచి ఉండటానికి సంబంధించిన కధ,ఇక శ్రీమహావిష్ణువు శ్రీనివాసునిగా అవతరించటానికి మరొక కధను చెబుతారు. ఒకానొకప్పుడు ఋషివర్యులు ఒక యజ్ఞఫలాన్ని అందుకోవడానికి త్రిమూర్తులలో సత్వరజస్తమో గుణాలను అధిగమించిన శ్రేష్ఠునికి ఇవ్వాలని నిశ్చయించారు.అది తేల్చుకొనడానికి అరికాలిలో మూడవ నేత్రం ఉన్న త్రిలోక సంచారి భృగు మహర్షిని నియోగించారు. భృగు మహర్షి మొదట సత్యలోకం వెళ్ళాడు.అక్కడ చతుర్ముఖుడు సృష్టికార్యంలోనూ వాగ్దేవి కచ్చపీ గానంలోనూ లీనమై ఉండి ఇతని రాకను గమనించనే లేదు.బ్రహ్మ తమోగుణాన్ని ప్రదర్శించాడు గనక ఆలయదైవంగా ఉండే అర్హత లేదని శపించి నిరాశతో అక్కడి నుండి కైలాసం వెళ్ళాడు భృగు మహర్షి.అక్కడ శివపార్వతులు ఆనందనృత్యం చేస్తూ ఇతనిని గమనించకపోవడంతో నిరాశ ఆగ్రహంగా మారింది.శివుడు రజోగుణాన్ని ప్రదర్శించాడని భావించి మూర్తిపూజకు తగడని శపించి అసహనంతో అక్కడి నుండి బైటపడి వైకుంఠం దారి పట్టాడు.

          వైకుంఠం చేరిన భృగు మహర్షి అక్కడ శేషతల్పం మీద పవళించి ఉండి శ్రీమహాలక్ష్మి పాదాలు ఒత్తుతూ ఉండగా యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును చూసి ఆగ్రహం పట్టలేక పాదంతో గుండెలపైన తన్నినాడు.శ్రీమహావిష్ణువు ఏమాత్రం కోపాన్ని ప్రదర్శించకుండా లేచి కూర్చుని భృగువును ఆదరించి ఆసనంపై కూర్చుండబెట్టి సేవలు చేస్తూ భృగువు పాదంలోని మూడవ నేత్రాన్ని చిదిమివేశాడు.దానితో భృగువు అహంకారమూ నశించింది,త్రిమూర్తులలో యజ్ఞఫలానికి విష్ణువే అర్హుదని తెలిసింది.
          అయితే లక్ష్మీదేవి తన నివాసస్థలాన్ని తన్నిన భృగువు చేసిన అవమానాన్ని సహించలేక అతనిని శిక్షించని భర్తపైన కూడా ఆగ్రహించి ఆవెదనతో వైకుంఠం విడిచి వెళ్ళింది.శ్రీమహావిష్ణువు యదార్ధం తెలపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. శ్రీమహాలక్ష్మి భర్త ఎంత నచ్చజెప్పినా సమాధాన పడలేక భూలోకానికి దిగివచ్చి తన పుట్టినింటికి సమమైన గొల్లాపురం చేరి తపోనిష్ఠలో ఉండిపోయింది.లక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేక నారయణుడు కూడా వైకుంఠం విడిచి భూమిపై అడుగుపెట్టి వరాహగిరిపై వెలసిన ఆది వరాహమూర్తిని కొంతకాలం అక్కడ నివసించటానికి అనుమతి పొంది ఒక పుట్టలో అమరి తపోధ్యానంలో మునిగిపోయాడు.

          శ్రీహరి ఆకలిని తీర్చడానికి ఈశ్వరుడూ బ్రహ్మదేవుడూ గోవత్సములుగా మారితే పార్వతి వాటిని వరాహగిరి ఉన్న ప్రదేశానికి రాజైన చోళ మహారాజుకు సమర్పించింది.రాజుగారి ఆలమందలో చేరిన బ్రహ్మమహేశ్వరులు విష్ణువు తపస్సు చేసుకుంటున్న పుట్టపైన పాలధారను కురిపించి అతని ఆకలిని తీర్చసాగారు.కొత్తగా వచ్చిన ఆవు పాలివ్వడం లేదని తెలిసి పశువుల కాపరి వాటిని రహస్యంగా వెంబడించి విషయం గ్రహించి రాజుకు నివేదించాడు.మరుసటి రోజు ఇద్దరూ వాటి వెనక వచ్చారు.ఆవు పాలు కురిపించే దృశ్యం చూడగానే పశువుల కాపరి కోపం పట్టలేక ఆవును తన కొడవలితో కొట్టాడు.అదే సమయానికి ఆవు తప్పించుకుని పుట్టనుండి బయటకు వస్తున్న విష్ణుమూర్తి తలకు గాయమై రక్తం ధారగా కారడం మొదలైంది.
          అది చూసిన గొల్లవాడు బెదిరి మూర్ఛిల్లాడు, రాజు చెట్టుచాటు నుంచి బైటికొచ్చి క్షమించమని వేడుకున్నాడు. కానీ వేదనలో ఉన్న విష్ణుమూర్తి రాజును పిశాచమై తిరుగునట్లు శపించాడు.బహువిధాల ప్రాధేయపడిన రాజుకు మరుజన్మలో ఆకాశరాజుగా జన్మించి అతని పుత్రికయైన పద్మావతిని తను విహాహమాడినప్పుడు శాపం పోతుందని అనుగ్రహించినాడు.భువిపైన తొలిసారి తనను దర్శించిన గొల్లవానికి తన క్షేత్రంలో తొలి దర్శనం గొల్లవారికే లభిస్తుందని అనుగ్రహించినాడు. తలకు తగిలిన గాయానికి మందు కోసం వెతుకుతూ శ్రీహరి కృష్ణభజన చేసుకుంటున్న వకుళమాత ఆశ్రమం చేరాడు.అమ్మా అని పిలుస్తూ తలుపు తటిన శ్రీహరిని ఆమె గాయానికి కట్టుకట్టి శ్రీనివాసుడనే పేరు పెట్టి కన్నతల్లిలా ఆదరించింది.
          చోళ మహారాజు తన శాపవిముక్తి కోసం ఆకాశరాజుగా జన్మించి చాలాకాలం పాటు సంతానం లేక సంతానప్రాప్తి కోసం యజ్ఞం చేస్తూ యజ్ఞభూమిని దున్నుతుండగా భూమినుండి ఒక పెట్టె బయటపడింది.పెట్టెను తెరిచి చూడగా అందులో సహస్రదళపద్మంలో పరుండి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఆడపిల్ల కనిపించింది.పద్మంలో ఉండి కనిపించింది గనక పద్మావతి అని పేరు పెట్టాడు ఆకాశరాజు.పద్మావతి నవయవ్వనవతియై ఒకనాడు చెలికత్తెలను వీడి విహరిస్తూ ఉండగా ఏనుగు తరుముతుంటే అదే వనంలో వేటకోసం తిరుగుతూ ఉన్న శ్రీనివాసుడు ఆమెను రక్షించాడు.శ్రీనివాసుని వివరాలు తెలియగానే పద్మావతికి అతనిపై ప్రేమ పుట్టింది.ఆమె ఎవరో తెలియకుండానే మోహించిన శ్రీనివాసుడు సోదెమ్మ వేషంలో నగరానికి వెళ్ళి ఆమె ఆకాశరాజు కూతురని తెలుసుకున్నాడు.శ్రీనివాసుని చూసిన తదాది బెంగగా కనబడుతున్న కుమార్తె గురించి తెలుసుకోవాలని రాణి సోదెమ్మని పిలిస్తే నీ బిడ్డ వనంలో చూసిన పురుషుని ప్రేమించింది,అతడు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే,సందేహం లేకుండా పెళ్ళి జరపించమని ఆ సోదెమ్మ చెప్పింది.
          దానితో ఆకాశరాజు శ్రీనివాసునితో పద్మావతికి వివాహం నిశ్చయించాడు.శ్రీనివాసుడు తన వివాహ వేడుకను తిలకించి కొత్త దంపతులను ఆశీర్వదించడానికి సకల దేవతలను శుకమునీంద్రుల వారిని పంపి ఆహ్వానించాడు.పెండ్లి ఖర్చుల నిమిత్తం కుబేరుని వద్దనుండి ధనాన్ని అప్పుగా తీసుకున్నాడు.కలియుగాంతంలో చెల్లు చేస్తాను. అంతవరకు వడ్దీ ఇచ్చుకుంటూ వస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.మునీశ్వరులు ఆశీస్సులూ దేవతలు పుష్పవృష్టీ కురిపిస్తూ పర్జన్యుడు మంగళతూర్యనాదాలు చేస్తూ పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణం కన్నులపండువుగా జరిగింది.
          నారద మహర్షి వలన శ్రీనివాసపద్మావతుల కళ్యాణవార్తను విని గొల్లాపురంలో తపస్సు చేసుకుంటున్న మహాలక్ష్మి అప్పుడు శ్రీనివాసపద్మావతులు అతిధులుగా ఉంటున్న అగస్త్యాశ్రమం చేరి తనకు జరిగిన అన్యాయం గురించి నిలదీసింది.రామావతారంలో తనకు బదులుగా అగ్నిజ్వాలలను భరించిన వేదవతియే పద్మావతి అనీ,ఆమె చేసిన త్యాగానికి ప్రతిగా ఆమెను కూడా వివాహమాడమని సీతగా తనకు మాత్రమే సాధ్యపడిన సహజసిద్ధమైన ఔదార్యంతో సూచించినప్పుడు అప్పటి ఏకపత్నీవ్రతనిష్ఠని భగ్నం చెయ్యకూడదని చెప్పి శ్రీనివాసుడిగా ఆమెను వివాహమాడతానని తను చేసిన వాగ్దానం గుర్తు చేశాడు శ్రీనివాసుడు.అంతటితో లోకమాత శాంతించి తిరిగి తన నిజనివాసమైన భర్త వక్షస్థలాన్ని చేరడంతో శ్రీనివాసుడు తిరుమల గిరిపైన తనను భక్తితో కొలిచేవారికి భవసాగరాన్ని మోకాలిలోతును మించి పైకి రానివ్వనని వాగ్దానం చేస్తూ శ్రీ వేంకటేశ్వర స్వామిగా వెలిశాడు.
          పద్మావతీ దేవి తిరుచానూరులో వెలిసి బ్రహ్మేంద్రాది దేవతలు సైతం ఎవరి దర్శనానికి వేత్రహస్తుల దెబ్బల్ని కూడా తట్టుకుంటూ పడిగాపులు పడుతూ ఉంటారో ఆ కందర్పదర్పహరసుందరదివ్యమూర్తిని తలచినదే తడవుగా తన వద్దకే రప్పించుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ భక్తుల్ని కటాక్షిస్తున్నది.అప్పుడు అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఒక్క పెళ్ళినీ కూడా చూడలేని కొరతని ఇప్పుడు వకుళమాతగా జన్మించి తీర్చుకున్న యశోదమాతను తులసిమాలగా కంఠసీమలో అలంకరించుకున్నాడు శ్రీచక్ర శుభనిలయుడైన శృంగార శ్రీనివాసుడు!
          రామాయణ,భారత,భాగవతాది కధలలోని తన సంపూర్ణకృపకు నోచుకోని భక్తశిఖామణులను చరితార్ధులను చేస్తూ తన సాన్నిధ్యాన్ని మాత్రమే కోరుకున్నవారికి బ్రహ్మేంద్రాదులకు కూడా సాధ్యపడని తన నిజతనుస్పర్శను కూడా ప్రసాదించిన విశేషం ఈ శ్రీనివాసుని కధలో అంతర్లీనమై ఉండి భక్తవరదుని శిష్టజనవాత్సల్యాన్ని నిరూపిస్తున్నది!
3.ఆలయ విశిష్టత (importance of the deity)
          ఇక్కడి స్వామికి ఆపద మొక్కుల వాడు అని పేరు.ఏదయినా కోరిక నెరవేరాలంటే స్వామివారికి సమర్పించడం కోసం ముడుపు కట్టుకుని ఆ కోరిక తీరగానె స్వామిని దర్శనం చేసుకుని ఆ ముడుపు కట్టిన దాన్ని స్వామికి సమర్పించడం ఆనవాయితీ.

          శ్రీవారి దివ్యమంగలవిగ్రహం ఎత్తు పది అడుగులు.శిలాతోరణద్వారం ఎత్తూ ఈ ఎత్తూ సమానం - అంటే ఈ మూర్తి అలా నడుచుకుంటూ శిలాతోరణాన్ని దాటితే వంగనక్కరలేదు,తల మీద ఖాళీ ఉండదు.విగ్రహం మెద ఉలి చెక్కడపు ఆనవాళ్లు కనపడవు - ఒక మనిషి తనకు తానే శిలారూపం దాల్చినంత జీవకళ కనపడుతుంది ఆ మూర్తిలో!అసలు శిల్పులు అర్చామూర్తులని చెక్కదానికి సంబంధించిన ఆగమశాస్త్రనియమాలు ఈ మూర్తికి వర్తించవు.ఈ మూర్తి స్వయంభువు అని చెప్పడానికి ఈ సాక్ష్యాలు చాలు.ఎప్పుడు ఎవరు కొలిచినా శ్రీవారి విగ్రహం యొక్క ఉష్ణోగ్రత 110 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుంది.ఎన్ని రకాల నిత్యాభిషేకాలు జరిగినప్పటికీ వెంటనే ఆరిపోతాయి,ఆవన్నీ ఆరిపోయిన వెంటనే మూర్తి 110 డిగ్రీలకి చేరుకుంటుంది!
          మనం క్యూలో వెళ్తున్నప్పుడు విగ్రహం ద్వారానికి ఎదురుగా అంటే గుడి లోపల మధ్యకి ఉన్నట్టు కనబడుతుంది,కానీ వాస్తవానికి విగ్రహం గర్భగుడిలో కుడివైపు మూలన  ఉంటుంది,మరి నాకి మధ్యలో ఉన్నట్తు ఎలా కనబడుతున్నది?గర్భగుడిలోనే స్వామివారికి వెనక ఒక జలపాతం ఉంటుంది.స్వామివారికి సమర్పించిన పువ్వుల్ని బయటికి తీసుకురారు,ఆ జలపాతంలోకి విడుస్తారు.అవి అకక్ద పోగుపదవు,జలపాతం వెంబడి పోయి పోయి వేర్పేడు దగ్గిర బయటకి వచ్చి కనబడతాయి.స్వామి వెనక వైపు నుంచి ఎప్పుడూ సముద్రపు అలల హోరు వినబడుతూ ఉంటుంది.స్వామివారి వీపుని ఎన్నిసార్లు తుడిచినా సరే మళ్ళీ కొద్ది సేపట్లోనే చెమటతో తడిసినట్టు అయిపోతుంది.

          స్వామివారికి ప్రతి రోజూ పూసే పచ్చ కర్పూరం చాలా ఘాటైనది,ఒక మామూలు రాతికి రోజూ దాన్ని పూస్తే కొద్ది రోజులకే పగుళ్ళు రావటం ఖాయం - మరి,ఇన్ని సంవత్సరాల నుంచి ధృవబేరుకి మాత్రం ఏమీ కావడం లేదు,ఎందుకని?
          రమణ దీక్షితులు గారు చెప్పిన దాని ప్రకారం స్వామివారి ముఖం ఉదయం బాలకుని పసితనాన్ని చూపిస్తుంది,మధ్యాన్నం నడివయస్కుని గాంభీర్యాన్ని చూపిస్తుంది,సాయంకాలం శతవృద్ధుని వైరాగ్యాన్ని చూపిస్తుంది.ఆయా వేళల్లో దర్శించిన భక్తులు కూడా  ఈ భేదాన్ని తెలుసుకోవచ్చు!ఊదయవేళ దర్శించినవారికి విద్యలో వృద్ధీ చిరాయువూ, మధాహ్నవేళ దర్శించినవారికి ధృఢదేహమూ ఐశ్వర్యప్రాప్తీ, సాయంవేళ దర్శించినవారికి జ్ఞానవృద్ధీ మోక్షమూ ప్రాప్తించడం అనుభవైకవేద్యమే!
          అసలు కన్న కొసరు ముద్దు అన్నట్టు స్వామి వారి కన్న లడ్డు ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది - GI certificate కూడా ఉంది!పెద్ద లడ్లూ చిన్న లడ్లూ అలిపి రోజుకి రెండున్నర లక్షల లడ్లు వినియోగం అవుతున్నాయి - పురుషులందు పుణ్యపురుషుల వలె లడ్డులందు తిరపతి లడ్డు వేరయా!చిటికెడు కొకైనుకి లక్షలు తగలేసేవాళ్ళకి,గుక్కెడు పులిసిన ఫ్రెంచి మద్యానికి వేలం పాడి కోట్లు కుమ్మరించేవాళ్ళకి ఈ లడ్డుకున్న గొప్పదనం తెలియదు - కొయ్యబొమ్మల మెచ్చు కళ్ళకు కోమలుల సౌరెక్కునా అన్నట్టు.వూరికే కరకరమని నమిలి మింగదం కాదు,స్వామిని తలుచుకుంటూ తినాలి - అప్పుడే వస్తుంది అసలైన కిక్కు!

          శ్రీవారి మూర్తికి గోళ్ళు పెరుగుతున్నాయనీ జుట్టు ఉందనీ అనుకుంటున్నవి పూర్తి అసత్యాలు - అలాంటివాటితో కూడుకుని ఉండటానికి అది భౌతిక అదెహం కాదు,అఖిలాందకోటి బ్రహ్మాండనాయకుడి తేజూమయరూపం!రామ్న దీక్షితులు గారు చెబుతున్న అసలైన అద్భుతం శ్రీవారి మూర్తికి పది అడుగుల దూరంలో పది అడుగుల వ్యాసం కలిగిన ప్రదేశంలో జరుగుతుందట!దేసాద్యక్షులు గానీ,పారిశ్రామికాధిపతులు గానీ,ప్రజాస్వెవారనంలో ఉన్నవారు గానీ ఆ ప్రదేశంలో నిల్బడినప్పుడు అంతకుముందు వారికి అపరిష్కృతమైన సమస్యలకి సమాధానాలు లభిస్తున్నాయట - అలా వారి వల్ల జరగాల్సిన లోకకల్యాణ యాత్రకు విఘ్నాలు తొలగుతున్నాయి!బహుసా దీనికి కారనం ఒకటి కావ్చ్చు - శ్రీవారు తిరుమలలో ఆవ్తరించాల్ని సంకల్పించిన అత్ర్వాత తొలి అడుగును ప్రస్తూతం శ్రీవారి పాదాలు అని పిలుస్తున్న చోత ఉంచారు,రెందవ అడును శిలాతొరనద్వారం దగ్గిర మోపారు అంటున్నారు,కానీ త్రిగుణ సాంఖ్యం ప్రకారం పడాల్సిన మూడవ అడుగు ఏది?బహుశా అవతరణ వేదిక మీదకై ఎక్కి ఇటువైపుకి తిరిగి దర్సనం ఇచ్చే ముందు అటువైపుకి వేసిన మూడవ అడుగును ఇక్కద మోపి ఉండవచ్చు - అందుకే ఆ పర్దేసానికి అనత్ మాహ్త్వం వచ్చింది!

          దాదాపు ప్రతి భక్తుడికీ భక్తురాలికీ తిరుమల యాత్రలో కలిగే ఒక ప్రత్యేకమైన అనుభూతి యేమిటో తెలుసా!తిరుమల అనే కాదు ఏ అలయానికి వెళ్ళినా ఎదో ఒక తీరని కోరికని స్వామికి నివేదించడానికే వెళ్తాము,అవునా?కానీ మనం ఎంత పెద్ద లిస్టుతో వెళ్ళినా సరే స్వామిని చూస్తున్నప్పుడు మాత్రం ఆ కోరికల్ని చెప్పుకోవాలనే స్పృహయే ఉండదు,కదా!గోవింద నామస్మరణ వల్లనో మూర్తి సౌందర్యం వల్లనో అనుకుంటాం మనం.కానీ అది కాదు అసలు రహస్యం! స్వామి వారి చుట్టూ సిద్దులు,తాపసులు దేవతలు  నిరంతరం ఆయనను అర్చిస్తూ ఆవరించి ఉంతారు - అదృశ్యలైన వారి తపఃఫలం మనకు కూడా నిరపేక్షతని అంటిస్తుంది.

          ఇంకొక విశేషం ఏమిటంటే చూస్తున్నంత సేపు ఆ రూపం ఎంత ఆనందం కలిగించినా ఆ మూర్తి నుంచి చూపు మరల్చిన తర్వాత ఒక్క క్షణం సైతం ఆ రూపం మనస్సులో నిలవదు అదేమిటో,అజ్ఞానం కొద్దీ ఇహలోకపు యావలో పడిపోయామని మనల్ని మనం తిట్టుకుంటాం,కానీ అది కూడా ఒక లీలయే - మళ్ళీ మనస్సులో ఆ రూపం నిలవాలంటే మళ్ళీ ఆ మూర్తిని చూడాల్సిందే,మళ్లీ తిరుమల రావల్సిందే!

          రోజుకి యాభై వేల మంది నుంచి లక్ష మంది వరకు వస్తున్నారు స్వామిని అరక్షణం చూసినా చాలుననే తపనతో - వీరిలో దశాబ్దాల ముందు నుంచి రావాలని అనుకున్న వారు,ఆరు నెలల మునదే ప్రణాళికలు వేసుకున్నవారు,అసహాయుల నుంచి దేశాద్యక్షుల వరకు సంవత్సరానికి 30 నుంచి 40 మిలియన్లు ఉంటారు!స్వామివారి వీదెశీమారకద్రవ్యం,అదే బంగారు నిల్వలు ఇప్పటికి 52 టన్నులు - తెలుపు లెక్కల ప్రకారం!స్వామివారి వార్షికాదాయం 6 బిలియన్ డాలర్లు - మరి, పన్ను కడుతున్నాడో లేదో?కట్తమంటే విజయ్ మాల్యాలాగ పారిపోడు గద!
          తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే.అయితే,బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది.శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొత్తం 9రోజులు కన్నులపండువగా జరుగుతాయి. 'నానాదిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి' అంటూ అన్నమాచార్యుడు వర్ణించిన తీరులో- అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా వస్తారు.
          స్వామివారి బ్రహ్మోత్సవాలు 'అంకురార్పణ'తో ప్రారంభమవుతాయి.బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం 'ధ్వజారోహణం'.ధ్వజారోహణం తర్వాత, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామిని పుష్పమాలాలంకృతుల్ని చేసి, వాహన మంటపంలో ఉన్న పెద్ద శేష వాహనంపై ఊరేగిస్తారు. మూడోరోజు ఉదయం శ్రీవారికి సింహ వాహనసేవ జరుగుతుంది. నాలుగోరోజు ఉదయం, స్వామివారు తన కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనం ఇస్తారు.బ్రహ్మోత్సవాలలో నడిమిదైన అయిదోరోజున, స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ అవతార వూరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన అన్ని వాహనసేవలూ స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే, మోహినీ అవతార వూరేగింపు శ్రీవారి ఆలయంనుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. స్వామివారి ప్రధాన వాహనం గరుడుడు. అందుకే గరుడుడిని 'పెరియ తిరువాడి' (ప్రధాన భక్తుడు, ప్రథమ భక్తుడు) అంటారు. అయిదోరోజు రాత్రి జరిగే ఈ సేవకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదిలో అన్నిరోజులూ ధృవబేరానికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడవాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్పస్వామికి అలంకరింపజేస్తారు. ఆరో రోజు రాత్రివేళలో- స్వామివారు గజ వాహనం మీద తిరువీధులలో మెరిసి భక్తులను మురిపిస్తారు. పోతనామాత్యుని విరచితమైన శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్ష ఘట్టాన్ని తలపింపజేస్తూ సాగే వూరేగింపు ఇది.ఏడోరోజు ఉదయం- మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతారు. స్వామి రథసారథి అనూరుడు ఆరోజు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తాడు. అదేరోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంమీద స్వామి రావటంతో, దివారాత్రాలకు తానే అధినేతనని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు.ఎనిమిదోరోజు జరిగే రథోత్సవానికి హాజరయ్యేంత భక్తజనం మరేరోజునా కానరారు. భక్తులు ప్రత్యక్షంగా పాలుపంచుకోగలిగే స్వామివారి వాహన సేవ అదే మరి. ఇక రథం విషయానికొస్తే... దానికి సారథి దారుకుడు. శైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వాలహకం రథానికి పూన్చిన గుర్రాలు. సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులను పరవశింపజేస్తారు.'రథస్థ కేశవం దృష్టా పునర్జన్మ నవిద్యతే' అనేది శృతివాక్యం.బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన తొమ్మిదోనాడు, స్వామివారికి చక్రత్తాళ్వార్ రూపంలో చక్రస్నానం చేయిస్తారు. ముందుగా వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవితో సహా అభిషేకసేవలు జరిపిస్తారు. ఆ తర్వాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు. ఇదే 'చక్రస్నాన ఉత్సవం'. చక్రస్నానం జరిగే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.చక్రస్నానాలు అయిన తర్వాత ఆరోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజ స్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం(దించడం) చేస్తారు. 
          ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్లే. బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు లెక్క. మళ్ళీ బ్రహ్మోత్సవాలు సరిగ్గా సంవత్సరం తర్వాతే!
4.ఆలయ మార్గము (how to reach)
          తిరుపతి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా లోని ప్రముఖ నగరం.ఇక్కడికి రాష్ట్రము లోని అన్ని ప్రముఖ నగరాల నుండి బస్సు సౌకర్యము కలదు.

Friday, 23 March 2018

చంద్రుడు బుధుడి ఇంట్లో ఉండటం,గురువు పైకి చూడటం,శని వంకర చూపు చూడటం - అంతా ట్రాష్, గోగినేని బాబు ఈజ్ ఆల్వేస్ రైట్!

గోగినేని బాబు గొప్ప మేధావి!మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పోరాడుతున్న గొప్ప మానవవాది!అప్పట్లో ఒక చిన్నపిల్లని సొంత తల్లే దేవతని చేసి ఒక ఆశ్రమం పెట్టి వ్యాపారం చెయ్యాలనుకున్నప్పుడు అప్రస్తుతవీరవరేణ్యుడిలా పోరాడి ఆ పిల్లని ఆధ్యాత్మిక వ్యాపారానికి బలి కాకుండా కాపాడిన మంచి మనిషి!అయితే,అప్పట్లో నేనూ మీడియాలో జరుగుతున్న హడావిడిని చూశాను గానీ అప్పుడు ఇతని గురించి మాత్రం ఎక్కువ తెలియలేదు - ఇప్పుడు చూస్తే తెలుగు చానల్స్ అన్నింటిలోనూ కనబడుతున్నాడు - పుష్కరాల గురించీ గ్రహణాల గురించీ జ్యోతిషం గురించీ ఎదటివాళ్లని జవాబు చెప్పలేని చిక్కు ప్రశ్నలతోనూ తప్పులు పట్టలేని విశ్లేషణలతోనూ అదరగొడుతున్నాడు!

తనకి అహంభావం చాలా ఎక్కువ, దాచుకోను కూడా దాచుకోవడం లేదు.ఏ విషయం గురించయినా ఫుల్ క్లారిటీ ఉండి ఎదురుగా ఎవరున్నా సరే వాదనలో నేనే గెలుస్తాను అన్న ధీమా ఉన్నవాడికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, నిజమే!ఎదటివాళ్ళు తాము సపొర్ట్ చెయ్యదలుచుకుంటున్న అంశం మీద ఇతను తన వాదనని సమర్ధించుకోవడానికి చేసినంత రీసెర్చి చెయ్యకుండా వచ్చి ఇతని జిత్తులమారి తనానికి బలి కావడం వల్ల పదే పదే గెలవడం అలవాటైపోయినప్పుడు ఆత్మవిశ్వాసం ఆత్మస్తుతి కింద మారడం కూడా సహజమే - అందుకు నేను కూడా మినహాయింపు కాదు.

కానీ నేను సత్యానికి కటుబడి వాదిస్తున్నాననె ధీమాతో నన్ను నేను పొగుడుకుంటే అతను తన పాప్యులారిటీని చూపించి పొగుడుకుంటున్నాడు - "నాది ఇంటర్నేషనల్ లెవెల్!మీది గల్లీ లెవెల్!" అనీ "పోపుని అరెస్ట్ చెయ్యాలని వాళ్ళ కాంగ్రెగేషను దగ్గిరే డిమాండు చేశాను" అనీ "సౌదీ అరేబియా రాజుని నీకిక్కడేం పని అని గద్దించాను!"అని చెప్పుకోవడమే తప్ప ఆ విజృంభణ వల్ల అతను సాధించింది ఏమిటి?పోప్ అరెస్టయ్యాడా?సౌదీ అరేబియా రాజు హోదా ఏమైనా తగ్గిందా?ఏమీ జరగ లేదు!

నాకు మీడియా ఎక్స్పోజరు అక్కర్లేదు అంటున్నప్పుడు ఇంత ఎక్కువ ఎక్స్పోజరు ఎలా వస్తున్నది?జ్యోతిషం శాస్త్రీయమా కాదా అని తేల్చుకోవడానికి సుప్రీం కోర్టులో కేసు వేసినది శ్రీనివాస గార్గేయ కాదని చెప్పి కేసు వేసిన వ్యక్తి వివరాలు చెప్పడం అద్భుతమే కావచ్చు!శ్రీనివాస గార్గేయ ఆ కేసు తనే వేసినట్టు చెప్పుకుంటే అవతలి వ్యక్తి చెప్పిన అబద్ధాన్ని యెత్తి చూపించడం కూడా కరెక్టే,నైతిక విలువలు లేని వ్యాపారం చెయ్యడాన్ని ఖండించితే మెచ్చుకోవాల్సిందే.కానీ ఇతరులకి  తెలిసే అవకాశం లేదని నిర్లక్ష్యం చేశాడో,తనకి తెలిసిందే నిజం అన్న అహంకారం వల్ల ఎక్కువ తెలుసుకోకుండా వదిలేశాడో గానీ కొన్ని ముఖ్యమైన విషయాల్లో తను కూడా అబద్ధాలు చెప్తున్నాడు!

అతని వాదనాశైలిలోనూ కొన్ని స్ఖాలిత్యాలు ఉన్నాయి - ఆ వాదనల్ని మైండులో ప్రిపేర్ చెసుకుంటున్నప్పుడు "this logic will definitely bunk my opponents!They are not so brilliant like me - this is enough.I am great!" అని చెప్పేసుకుంటున్నాడు గాబట్టి అతనికి తెలియడం లేదు కాబోలు!ప్రస్తుతం అతని ముందు కూర్చుని వాదిస్తున్నవాళ్ళకి వాటిని పట్టుకోగలిగిన పాండిత్యం లేదు.శబ్దాన్ని చూపించండి,కాంతిని రుచి చూపించండి అని నిలదీసి ఏ శక్తి అయినా దాన్ని రిసీవ్ చేసుకోగలిగిన సెన్సరీ ఎలిమెంట్స్ ద్వారానే తెలుసుకోగలం అని సూత్రీకరణలు కూడా తనే చెప్పి ఇతర్ల అజ్ఞానాన్ని పోగొట్టి ఘనకార్యం చేస్తున్నట్టు మురిసిపోతున్న ఇతను దేవుడి విషయంలో కూడా అదే వర్తిస్తుందని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు?కాంతిని వినలేనట్టే శబ్దాన్ని చూడలేనట్టే దేవుణ్ణి కూడా మొండి బండ కుతర్కాలతో తెలుసుకోలేము కదా!కాంతిని గ్రహించటానికి కన్ను ఉన్నట్టే శబ్దాన్ని గ్రహించటానికి చెవి ఉన్నట్టే దైవం గురించి తెలుసుకోవటానికి బుద్ది ఉంది.దాన్న్ని ఉపయోగించాల్సిన పద్ధతిలో ఉపయోగిస్తే దేవుణ్ణి చూడవచ్చు - నేను చూస్తున్నాను కదా!నాకు దొండకాయ కూర అంటే చాలా అసహ్యం!"దేవుడా!జీవితంలో ఒక్కసారి కూడా దొండకాయ కూర తినకుండా చూడు!" అని దేవుడికి దణ్ణం కూడా పెట్టుకున్నాను,ఏం లాబ్ఘం?మా బంగారానికి దొండకాయ వేపుడు చాలా ఇష్టం, చేస్తుంది, తింటూన్నాను - నాలాగా ఎందరో!అదృష్టం బాగుండి భార్యకి కూడా దొండకాయ ద్వేషం ఉంటే వాళ్ళు దొండకాయని తప్పించుకోగలుగుతారు గోగినేని బాబు దేవుడితో సంబంధం లేకుండా బతికినట్టు - అలా అందరికీ కుదిరి చావదే,నేను నా దురదృష్టం ఇంతే అని సరిపెట్టుకుంటున్నానే గానీ దేవుడు ఉన్నాదని నమ్మేవాళ్ళంతా అజ్ఞానులే అంటున్న గోగినేని బాబు లాగ దొండకాయ తినేవాళ్ళంతా దుష్ట దుర్వార నీచ నికృష్ట కబంధులు అని హుంకరించటం లేదే!నేను చెప్పిన జవాబుకి అతడు వాడుతున్న లాజిక్కునే వాడాను - జస్ట్ కామన్ సెన్సుని మాత్రమే వాడాను!

సనాతన ధార్మిక సాహిత్యం అత్యంత విస్తారమైనది.మానవ జాతి ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అనెది ఇప్పటికీ రూఢి కాలేదు.క్రీ.శ 2003లో చెప్పిన తొలి మానవ జాతి ఆవిర్భావం రెండులక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో జరిగిందనీ మూడుసార్లు ఫెయిలయ్యి ఆలుగోసారి 80,000 సంవత్సరాల క్రితం ఒక గుంపు భారతదేశం చేరిందనీ ఇక్కడి నుంచే మానవులు అన్ని ఖండాలకీ వెళ్ళడం వల్ల సకల నాగరికతలకీ భరతఖండమే పుట్తినిల్లు అనే నిర్ధారణ కూడా పూర్తి యదార్ధం కాదు.ఎందుకంటే,కంభంపాటి అస్త్యనారాయణ లాంటివారు రాసిన ఆంధ్రుల చరిత్ర గురించిన పుస్తకాల్లో పెద రావూరు,చిన రావూరు లాంటి తెలుగు ప్రాంతాల్లో అయిదు లక్షల సంవత్సరాల క్రితమే మానవ నివాసాలు ఉన్నట్టు శిలాజాల ద్వారానూ అక్కద దొరికిన పనిముట్లని విశ్లేషించడం ద్వారానూ నిర్ధారించి చెప్పారు.ఇంకా వెనక్కి వెళ్తే ఉత్తర దేశంలోని భీం బైట్కా గుహాల్లో ఏడు లక్షల సంవత్సరాల క్రితం మనుషులు గీసిన బొమ్మలు కనిపిస్తునాయి - ఇవన్నీ ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ఫలితాలే!

సనాతన ధార్మిక స్సహిత్యంలోని కొన్ని వర్ణనలూ సంఘటనలూ కధాంశాలూ భ్హూమి మీద ఇపుడు విడి ఖండాలుగా కనబడుతున్న ఒకప్పటి ఏకఖండం గురించి ఆధునికులు చెబుతున్న pan geo,Gondwana లాంటి విషయాలు వారికీ తెలుసునని నిరూపిస్తున్నాయి.వాస్తవానికి అవి కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితపు సంగతులు - అప్పటికి మానవావిర్భావం జరగలేదని ఆధునిక శాస్త్రవిజ్ఞానం చెబుతున్నది.కేవలం రెండు వందల యేళ్ళ్ళ క్రితం నుంచే తప్పటడుగుల దశని దాటి కుదురైన నడకను నేర్చుకుంటున్న ఆధునిక  పాశ్చాత్య విజ్ఞానశాస్త్రం ఇచ్చిన మిడి మిడి జ్ఞానంతో కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే "అధాతో విశ్వ జిజ్ఞాసా అధాతో బ్రహ్మ జిజ్ఞాసా"" ఆనె సంకల్పం చెప్పుకుని "కేనేషితం ప్రతతి?" వంటి నిగూఢమైన ప్రశ్నలని తనకి తానే వేసుకుని చాలా ప్రశ్నలకి ఖచ్చితమైన జవబౌలు సాధించిన ప్రాచీన భారతీయ విజ్ఞానశాస్త్రం యొక్క ప్రతిపాదనల్ని తప్పు పడుతున్నాడు - అనంతమైన సాగరాన్ని తన బుడి బుడి అడుగులతో కొలవాలని చూస్తున్నాడు!

భగవద్గీత 10వ అధ్యాయం 10వ శ్లోకంలో "దదామి బుద్ధి యోగం" అని చెప్పిన దాన్ని బట్టి  దేవుణ్ణి చూడాలనే ఆలోచన కూడా మనంతట మనం ప్రయత్నిస్తే రాదు,జన్మజన్మల పుణ్యవిశేషం తగిన స్థాయికి చేరితే ఆయన సంతృప్తి పడి దయ తల్చి ఇస్తే తప్ప రాదు.గోగినేని బాబుకి అసలు చూడాలనే కోరికయే లేనప్పుడు "నాకు చూపించండి,అప్పుడే ఉన్నాదని నమ్ముతాను!" అని మనల్ని వేధిస్తే మనం అతనికి చూపించడం ఎట్లా సాధ్యం?ఇతరులు కూడా ఆతన్ని మార్చుదామని తపన పదకుండా అతని విధికి అతన్ని వదిలెయ్యడమే ఉత్తమం!

ఇతను చెప్తున్నవాటిలో నాకు తెలిసిన అతి పెద్ద అబద్ధం రాశుల గురించి గ్రీకుల నుంచి తెలుసుకున్నారనీ అంతకు ముందు మనవాళ్ళకి రాశుల గురించి ఏమీ తెలియదనీ దబాయించి మరీ చెప్పడం.గ్రీకుల వైభవం వారు చెప్పుకున్న చరిత్ర ప్రకారమే క్రీ.పూ 776 నుంచి మొదలవుతుంది.అప్పటికప్పుడు హఠాత్తుగా మొదలవదు కదా అని వెనక్కి వెళితే  క్రీ.పూ 1200 నుంచి క్రీ.పూ 1000కి మధ్యలో చిన్న స్థాయిలో మొదలై ఉండవచ్చు.అయితే మొదటి ఒలింపిక్స్ జరిగిన క్రీ.పూ 776 నాటికి ఇతరులకి తెలిసేటంత స్థాయిలో గుర్తింపు పొంది వారు కూడా ఆ సంవత్సరాన్నే తమ చరిత్రలో మొదటి సంవత్సరం అని చెప్పారు.అంటే,విద్య గానీ వ్యాపారం గానీ ప్రాభవం గానీ ఇప్పుడు మనం తెలుసుకోవాలనుకుంటున్న రాశుల గురించిన జ్ఞానం గానీ శైశవ దశలోనే ఉండి ఉండాలి - చరిత్రకారులు చెప్తున్న విషయం కాబట్టి నమ్మి తీరాలి.

గోగినేని బాబుకి గ్రీకుల పట్ల ఉన్న భక్తి వల్ల "వారు ఎంతటి సంక్లిష్టమైన విషయాలను కూడా అత్యంత వేగంగా అర్ధం చేసుకుని మరింత వేగంగా సూత్రీకరణలు చెయ్యగలిగిన అఖండప్రజ్ఞానిధులు!" అని తీర్మానిస్తే తప్ప ఇపుడు గ్రెకుల నుంచి వచ్చినదిగా చెప్పబడుతున్న రాశిచక్రం అప్పటికే ఏర్పడి ఉండటానికి వీల్లేదు.Yavanesvara (149/150 CE),Sphujidhvaja (269/270 CE) వంటి గ్రీకుల రచనలుగా చెప్పనడుతున్న జోడియాక్ క్యాలెండర్లు సుమారు క్రీ.పూ 550 నుంచి క్రీ.పూ 330 మధ్యన రాసినవిగా కనబడుతున్నాయి.

అతనికి తెలియదో లేక తెలిసినా తన ఆత్మీయల చిక్కుల్నీ ఇబ్బందుల్నీ లోపాల్నీ నష్టాల్నీ చూపించడం ఇష్టం లేక చెప్పడం లేదో గానీ ఆనాటి గ్రీకు రాశి చక్రాన్ని క్రైస్తవం పెరుగుతున్న తొలి దశ లోని అంధ యుగం మింగేసింది!అంధయుగం పోయి వెలుగు యుగం వచ్చి టాలెమీ కాలం తర్వాత కొత్త విషయాలు తెలుస్తున్నప్పుడు మర్చిపోయిన పాత విషయాల్ని గుర్తు చేసుకుని పేర్చిన రూపమే ఇప్పటి గ్రీకో రోమన్ జోడియాక్ చక్రం.కానీ క్రీ.పూ 3000 నాటి రుగ్వేద కాలానికే ఇక్కడి మేధావులు ఉండవలసిన అన్ని అంశాలతో కూడిన క్యాలెండరును తయారు చసేశారు - రాశిచక్రపు వివరాలతో సహా!

"సూర్యుడు నక్షత్రం అని తెలియదా నవగ్రహాల్లో చేర్చారు?నవగ్రహాల్లో భూమిని ఎందుకు చేర్చలేదు, మర్చిపోయారా?" అని తెలివినీ వెక్కిరింతనీ జోడించి అమాయకమైన ముఖంతో ప్రశ్నలు వేస్తున్నాడు - ఇతని కంటె అజ్ఞానులైన ఇతని అభిమానులు భలే ప్రశ్నలు వేస్తున్నాదని మురిసి ముక్కలయ్యేటట్టు.కానీ ప్రాచీన భారతీయ విజ్ఞానులు అక్కడ ఉదహరించిన "గ్రహం" ఆనె మాటకి ఆధునిక శాస్త్రవేత్తలు పెట్టిన "planet" ఆనె మాటకి ముడిపెట్టుకుని కన్ఫ్యూజ్ అవుతున్నది "పురాణం,చరిత్ర వేరు వేరు.ప్రతి మాటకీ ఒక నిర్దిష్టమైన అర్ధం ఉంటుంది.ఒక అర్ధాన్ని డిఫరెంట్ అర్ధాలు వచ్చే మాటల్ని ఒకే ఇన్సిడెంట్ గురించి వాడితే ఎవరైనా మీలాగే కన్ఫ్యూజ్ అవుతారు" అని సుభాషితాలు చెప్తున్న తనే అని తెలియదు పాపం!

ప్రాచీన భారత్తీయుల దృష్టిలో భూమి నుంచి చూస్తే ఆకాశంలో కదులుతూ కనపడుతున్న వాటినే నవగ్రహాలలో చేర్చారు.సూర్యుడు అనే నక్షత్రమూ, చంద్రుడు అనే భూమి యొక్క ఉపగ్రహమూ, సౌరమండలంలో కంటికి కనబడుతున్న అయిదు గ్రహాలూ కలిసిన ఏడింటినీ మొదట ఒక గ్రూపులో అనుకున్నారు.సూర్యుని యొక్క కక్ష్య చంద్రుని యొక్క కఖ్యతో intersect అవుతున్న రెండు nodal pointsనీ రాహు కేతువులు అన్నారు.అవి imaginary mathmatical points మాత్రమే కనుక చాయాగ్రహాలు అన్నారు.కాల గననాన్ని నిర్దేశించటానికి అవసరమైన ఈ తొమ్మిదింటిని మాత్రమే పట్టించుకుని పనిలేని వేతనశర్మలా ఇతను లెక్కపెట్టి చెప్తున్న లక్షా తొంభై మిలియన్ల పనికిరాని వాటిని ఉన్నాయని తెలిసి కూడా ఈ లిస్టులో చేర్చలేదు, అంతే!

సనాతనధార్మికులు వేదసాహిత్యాన్ని అర్ధం చేసుకోవడానికి అనుపలబ్ది అనే సూత్రం చెప్పారు.దాని అర్ధం నువ్వు ఒక విషయం గురించి అనంతమైన వైదిక సాహిత్యంలో ఫలానా చోట ఉండొచ్చునని నీకు నువ్వే అంచనా వేసుకుని నీకు దొరికిన ఒక మూల వెదికి అక్కడ లేకపోతే మొత్తం వైదిక సాహిత్యంలో ఎక్కడా లేదని తీర్మానించకూడదు అని.ఎందుకంటే,ఇవ్వాళ వైదికయుగం అని అనుకుంటున్న కాలం ఆ సాహిత్యం మొత్తం అపుడు పుట్టిన కాలం కాదు,కొన్ని లక్షల సంవత్సరాల వెనక నుంచి గురుశిష్యపరంపర ధారణ చేసుకుంటూ వచ్చిన దాన్ని గ్రంద్జస్థం చేసిన కాలం మాత్రమే!గురుశిష్యపరంపరలో నడిచిన జ్ఞానప్రవాహం యొక్క స్వరూపం ఎలా ఉంటుందొ తెలుసా!ప్రతి విషయానికి సంబంధించి ఒక సూత్రం, దాని విశ్లేషణ,వాస్తవ జీవితంలో ఉపయోగించాల్సిన విధానం ఉంటాయి కదా - మొదటి తరం గురువు సూత్రాన్ని మాత్రం చందస్సులో బిగించి మొదట శిష్యులతో దాని కంఠస్థం చేయించి అప్పుడు మిగిలిన రెండింటినీ తను వివరించి చెప్పేవాడు.శిష్యుల్లో ఆచార్యత్వాన్ని స్వీకరినంచినవాళ్ళు కూడా తర్వాత తరపు శిష్యులకి మొదట సూత్రాల్ని కంఠస్థం చేయించి వివరణల్మి చెప్పేవాళ్ళు.వేదాల్లో ఒక అక్షరాన్ని కూడా మార్చకూడదన్నది కూడా అందుకే.ఆ శ్లోకాల్లోని ప్రతి పదానికీ ఒక కోడింగ్ ప్యాటర్న్ ఉంటుంది.ఆ కోడింగ్ ప్యాటర్న్ అలా ఉన్నది అలా ఉంటేనే దాన్ని డీకోడ్ చేసి విశ్లేషణని కొనసాగించటం కుదురుతుంది.

వేదకాలంలో రాశులను గురించి మనవాళ్ళకి తెలియదు గ్రీకులు కనుక్కున్న తర్వాతనే వాళ్ల నుంచి నేర్చుకున్నాక పుట్టిన సాహిత్యంలోనే కనబడుతున్నాయి అని బల్లగుద్ది చెప్తున్న గోగినేని బాబు వాటి గురించి ఎక్కడ వెతకాలో అక్కడ వెతకలేదు.లేని చోట వెతికి అక్కడ లేవు గాబట్తి వాళ్ళకి రాశుల గురించి తెలియదని వదరుతున్నాడు.`ఋగ్వేదంలో దీర్ఘతమసుడు చెప్పీన సూక్తాల(RV I.140 – 164)లో స్పష్టమైన  వివరణలు ఉన్నాయి.`ఋగ్వేదకాలం, క్రీ.పూ 4,000 నుంచ్గి క్రీ.పూ 1500 మధ్య అని ఇప్పటికే నిర్ధారంచారు.మరి గ్రీకుల నాగరికత క్రీ.పూ 700 నుంచే మొదలైందనేది కూడా నిర్ధారణ అయ్యింది - మరి నిన్నటి గ్రీకులు చెప్తేనే మొన్నటి వైదీక ఋషులకి రాశుల గురించి తెలిసింది అని ఇతను ఎట్లా చెప్తున్నాడు?

పోనీ ఈయన అహాన్ని చల్లార్త్చడానికీ ఈయన మాటని నిలబెట్టడానికీ వైదిక కాలంలో ప్రిమిటివ్ నాలెడ్జి మాత్రమే ఉంది,గ్రీకులు ఆ నాలెడ్జిని డెవలప్ చెసుకోవడానికి సహాయం చేశారు అని అనుకోవడానికి కూడా వీల్లేదు.360 డిగ్రీల చక్రం గురించి చెప్పాడు.(RV I.140 – 164) దగ్గిర రాశులకి సంబంధం ఉన్న 12, 24, 36, 48, 60, 72, 108, 432, 720 వంటి సంఖ్యల మధ్యన ఉన్న సంబంధాల్ని కూడా వివరించాడు.720 అంటే ఏమిటో తెలుసా ప్రతి డిగ్రీ దగ్గిర ఒక జంట అస్తిత్వాలు ఉంటాయి.దీన్ని సగం చేస్తే 360 వస్తుంది కదా!(RV I.155.6) దగ్గిర "With four times ninety names (caturbhih sakam navatim ca namabhih), he (Vishnu) sets in motion moving forces like a turning wheel (cakra)." అని చెప్పాడు.మరొక చోట ముగ్గురు సోదరులను గురించి చెబుతాడు.వారి వర్ణనలని బటి చూస్తే 12 రాశులనీ నాలుగేసి చొప్పున మూడు భాగాలు చేసినప్పుడు మొదటి నాలుగు రాశులూ సూర్య తత్వాన్నీ రెండవ నాలుగు రాశులూ వాయు తత్వాన్నీ మూడవ నాలుగు రాశులూ అగ్నితత్వాన్నీ ప్రదర్శిస్తాయనీ తెలుస్తుంది.మరి ఇవన్నీ ఇతనికి ఎందుకు కనిపించలేదు?

అందరికీ అన్నీ మేమే నేర్పాం అనడం సాంస్కృతిక సామ్రాజ్యవాదం అని మాటిమాటికీ చిలకపలుకులు పలికే ఇతనికి కేవలం సైంటిస్టులే కాదు ప్రపంచంలో అనేక దేశాల నాగరికతల్నీ చరిత్రల్నీ తులనాత్మకమైన అధ్యయనం చేసిన ప్రతి మేధావీ భరతఖండమే సకల నాగరికతలకూ మాతృభూమి అని ఒప్పుకోవడం తెలియదా?ఒకవేళ మన దేశపు గొప్పదనం సందేహాస్పదం అయితే అప్పుడు తప్పు పట్టవచ్చు గానీ అందరూ ఒప్పుకున్న మన గొప్పని మనం చెప్పుకుంటుంటే ఇతనికి కంటగింపు దేనికి?అక్కడెక్కడో ఏదో యూనివర్సిటీలో జ్యోతిషం సబ్జెక్టుని తీసేశారు,ఇక్కడ కూడా ఆర్ట్స్ గ్రూపులో చేర్చారు, ఎంటర్టెయిన్మెంట్ కింద చేర్చారు అంటాడు ఎక్కడైనా బోటనీ,జువాలజీ,కెమిస్ట్రీ,ఫిజిక్స్,ఇంజనీరింగ్ సబ్జెక్టుల్ని మాత్రమే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నారు.ఇతని లెక్కన ఆర్ట్స్ గ్రూపులో ఉన్న ఎకనమిక్స్,సైకాలజీ లాంటివి కూడా జ్యోతిషం లాంటివేనా?తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నట్టుంది ఇతని వ్యవహారం.

క్రీ.శ 550 నాటి వరాహమిహిరుడు ఇప్పటి ఇరాన్ ప్రాంతం నుంచి భారతదేశానికి వలస వచ్చి ఉజ్జయినిలో స్థిరపడిన కుటుంబం లోనివాడే!మ్లేచ్చులు,యవనులు అనే పదాల్ని మనవాళ్ళు తిట్ల కింద  వాడుతున్నారని ఎర్ర మేధావులు ఎగిరెగిరి పడతారు గానీ వాళ్లు కూడా మనవాళ్ళే.యయాతికి దేవయాని వల్ల ఇద్దరూ శర్మిష్ఠ వల్ల ముగ్గురూ కొడుకులు పుట్టారు - యదు,తుర్వసు,ద్రుహ్యు,అను,పూరు అనే వాళ్లనుంచి వరస ప్రకారం యదు వంశం,యవన(Turkish)వంశం,భోజ వంశం,మ్లేచ్చ(Greek)వంశం,పౌరవ వంశం పెరిగి భూమి సమస్తానికి వ్యాపించి సనాతనధర్మాన్ని విశ్వవ్యాప్తం చేశారు.ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు అప్పటి వరకు ఇక్కడ పోగుపడిన జ్ఞానరాశిని తీసుకువెళ్ళి అక్కడ తమ ప్రజ్ఞతో దానిని పెంచారు.తిరిగి ఇక్కడి వారికి పరిచయం చేశారు.ఇక్కడి వారు కూడా ఈ మధ్యన పెంచిన జ్ఞానరాశికి దానిని కూడా జత చేశారు.ఇప్పటి హిందూద్వేషుల వలె వారు వీరిని కానీ వీరు వారిని కానీ ద్వేషించలేదు,అవమానించలేదు - అందరిదీ ఓకే కుదురు అన్నది తెలుసు గనక వసుధైవకుటుంబభావన వారిలోనూ వీరిలోనూ మారాకులు వేసి పెరిగింది!

గోగినేని బాబు లాంటివాళ్ళు గ్రహాల్ని గురించి మొదట గ్రీకులే చెప్పారు అంటున్నారు గానీ ఆ గ్రీకులు వాటికి ఉన్న ఉపగ్రహాల గురించి ఏమి చెప్పారు?అదే వైదిక సాహిత్యం "yamagraha is luminous and together with dhooma and parivesha has crossed over to jyeshta the bright asterism ruled by Indra." అని చెప్తున్నది!మనాళ్లు వాటిని ఎట్లా చూస్తే స్పష్టంగా కనపదతాయో లెక్కలు కూదా వేసి చెప్పారు.the location of Dhooma, the upagraha of Mars can be obtained by adding 4 rashis  – 13 degrees and 20 minutes to the true rashi- degree-minute position of the Sun in a given day.పెట్టిన గడ్డి చాలునా?Parivesha, the upagraha of Moon can be obtained by adding 6 rashis to Vyatipada (the upagraha of rahu) which is already obtained by deducting 12 rashis from Dhooma!ఇవేవీ గ్రీకుల రచనలలో కనపడటం లేదు - ఎందుకు?చెప్పొచ్చేదేమిటంటే ఆదాన ప్రదానాలు రెండు వైపులకీ జరిగీనప్పటికీ ఏవరు ముందు తెలుసుకున్నారు,ఎవరి సిద్ధాంతం సమగ్రం అనే కొలతలతో నిష్పక్షపాతంగా కొలిస్తే త్రాసు భారతీయుల వైపుకే దిగుతుంది - UNDERSTAND!

"When the Gemini ascendant is occupied by a lonely Mars, not receiving any aspect and the 9th house is occupied by Saturn with its aspect falling on the 3rd house of siblings, there will be 4 brothers and 2 sisters having long life. The native will be in a high profile job from his 18th to 48th year of his age. He will enjoy great popularity and Raja yoga in the period of the 6th and 11th lord Mars." - ఈ ప్రిడిక్షన్ Gary Sobers విషయంలో ఎంత ఖచ్చితంగా సరిపోయిందో ఎలుసా!Gary Sobers is the famous cricketer of West Indies having the same planetary combination of Mars and Saturn.  He was the 5th child out of 6. He was at the peak of his career between 1954 and 1974 (18th  - 38th year when he ended his cricketing career ) but continued to enjoy popularity during  the said period of Nadi. దీన్ని అశాస్త్రీయం అంటున్న గోగినేని బాబు ఆధునిక విజ్ఞానశాస్తం తనకి నేర్పిన శాస్త్రీయతతో ఇటువంటి ప్రిడిక్షన్ చెయ్యగలడా?

అందరికీ అన్నిసార్లూ ఇంత ఖచ్చితమైన ఫలితం వస్తుందనే గ్యారెంటీ లేదనేదీ నిజమే.అయితే అది చెప్పేవాడి ప్రజ్ఞని బట్టి ఉంటుంది.చదివే శాస్త్రం ఒకతే అయినా నేర్పే గురువు ఒకరే అయినా అందరు శిష్యులూ ఒకే స్థాయి పాండిత్యాన్ని సాధించలేరు కదా!అవే సైన్సు పుస్తకాలు అదే టీచర్లూ అదే రకం ఎగ్జామ్సూ అయినా కొందరికే నోబుల్ ప్రైజులు ఎందుకు వస్తున్నాయి అని అడిగితే గోగినేని బాబు ఏమి జవాబు చెబుతాడు?దానికి ఆయన చెప్పిన అవాబే దీనికీ సరిపోతుంది!

శ్లో||ఫలాని గ్రహచారేణ సూచయంతు మనీషిణ
కో వక్తా తారతమ్యస్య తమేకం వేధసం వినా?
భా||మనీషులైనవారు గ్రహచారాన్ని గమనించి ఫలితాను సూవ్హనమాత్రంగానే చెప్పగలరు.ఖచ్చితమైన ఫలితం బ్రహ్మదేవునికి మాత్రమే సాధ్యం.అయితే, జ్యోతిషం అభాసుపాలు కావటానికి డబ్బు యావతో పంచె కట్టి పిలక పెట్టి జంఝం చూపించి వేళ్ళు ముడవటం తెరవటం లాంటి యాక్షను చాలు జనాన్ని నమ్మించడానికి అని మనీషులు కానివాళ్ళు కూడా జ్యోతిష్కుల వేషం కట్టడమే కారణం - అటువంటివాళ్ళని ఉతికి ఆరెయ్యదం మంచిదే!అతని మాటల్లో "నీ జిప్పు వూడిపోయింది పెట్టుకోమంటే నా పక్కవాడికి చెప్పకుండా నాకు చెబుతున్నావు గాబట్టి నువ్వు వాడికి కూడా చెప్పేవార్కు నేను నా జిప్పు పెట్టుకోను అనడం తప్పు!" అన్న పాయింటు నాకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. అయితే, తన్ జిప్పు కూడా వూడిపోయే ఉందని తెలియదు పాపం - బుచికి బుచికోయమ్మ బుచికి!

కృష్ణస్వామి లాంటి వాళ్ళు ఎందుకు జవాబులు చెప్పలేక తడబడి పారిపోయారో తెలియదు గానీ రాశులు,గ్రహాలు,గృహాలకి సంబంధించి నేను చదివి తెలుసుకున్న ఈ కొంచెం జ్ఞానానికే జ్యోతిషంలో చెబుతున్న మానవరూప నవగ్రహాలకీ సౌరమండలంలోని గోళాకారపు నవగ్రహాలకీ పేర్లూ లక్షణాలూ కలుస్తున్నాయే తప్ప ఇవీ అవీ ఒకటి కావని తెలుస్తున్నది! ఇక్కడ ఆయా గృహాలలో ఉంటాయని చెబుతున్న గ్రహాలు మనిషి జీవితంలో ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించే కొన్ని అంశాలకి ప్రతిరూపం కల్పించి గణితశాస్త్రం ప్రకారం నిర్ధారించిన స్థిరాంకాలు.జ్యామెట్రీలో పై ఒక స్థిరాంకం,కదా!అలాగే ఇవి కూడా ఆ మనిషి జన్మించిన రేఖాంశలూ అక్షాంశాలూ జన్మతిధితో కలిసి అతని జీవితం మీద ప్రభావం చూపించే శక్తులకి ప్రతిరూపాలు.

1st: SELF, e.g. physical attributes, personality, fame & well being.
2nd: RESOURCES, e.g. family, wealth & status.
3rd: EFFORTS, e.g. younger siblings, actions, speech & courage.
4th: INTERESTS, e.g., mother, education, inner harmony & home.
5th: CREATIVITY, e.g. children, romance, speculation & trading.
6th: OPPOSITION, e.g. enemies, fixity of views, debts, health & conflict.
7th: PARTNER, e.g. husband/wife, foreign trips & leisure.
8th: ENDINGS, e.g. obstacles, death, inheritance, fathers income & beliefs.
9th: SUPPORT, e.g. father, guidance, higher thought, fortune & foreign things.
10th: CAREER, e.g. public persona, professional activities & fame.
11th: GOALS, e.g. elder brother, friends, plans, hopes, ideals & income.
12th: SEPARATION, e.g. grandfather, losses, far away places & prison.

మొదటి అంశం మనిషి యొక్క జీవితంలో అతి ముఖ్యమైనది కాబట్టి సకల జీవరాశులకీ ముఖ్యమైన సూర్య గ్రహపు లక్షణాలు ఈ అంశం యొక్క లక్షణాలతో కలుస్తున్నాయి గనక ఆ అంశానికి సూర్యుడికి సంబంధం కలిపి చెప్పారు.ఆరవ అంశంలో ఉండే నిగూఢమైన అంశాలకి అవే లక్షణాలను ప్రతిబింబించే శనితో కలిపారు.మిగిలినవి కూడా ఇలాంటి సంబంధాన్నే కలిగి ఉంటాయి.శని నెమ్మదిగా కదులుతాడు కాబట్టి మందుడు అన్నారు.ఇవి కూడా అందరు మనిషుల వ్యక్తిత్వంలో చాలా తక్కువ స్థాయిలో ప్రభావం చూపిస్తాయి కానీ కొందరిలో మిగిలిన వాటితో కలిసినప్పుడు  మాత్రం అవే జీవితానికంతటికీ ముఖ్యమైనవిగా ఆ మనిషిని ప్రభావితం చేస్తాయి.ఇవి సూటిగా ప్రభవాన్ని చూపించవు గనక వీటికి సంబంధించిన శనిది వక్రదృష్టి అన్నారు.ఇతనికేమో సనికి మెల్లకన్నా అని వెక్కిరించాలని అనిపిస్తున్నది - ఇతరుల పట్ల వారు అజ్ఞానంలో ఉన్నారని జాలి పడుతూనే మర్యాద ఉట్టిపడుతున్న ముఖంతో వెక్కిరించటం ఇతని జన్మగత సంస్కారం కాబోలు!

ఇతను నమ్ముతున్న మోడ్రన్ సైన్సులో కూడ ఐలాంటి పోలికలు ఉన్నాయి.సైకాలజీలో స్టాటిక్/స్ట్రక్చరల్ సైకాలజీ,డైనమిక్ సైకాలజీ అని రెండు ఉన్నాయి.డైనమిక్ సైకాలజీ ఎదిగుతున్న దశలలో మనస్తత్వం ఎలా మారుతుంది అన్నది చెబుతుంది.స్ట్రక్చరల్ సైకాలజీ దశలతో సంబంధం లేకుండా మొత్తం మనిషి యొక్క మూర్తిమత్వం ఎలా నిర్మించబడి ఉంటుంది అనే వివరాలతో నిండి ఉంటుంది.ఇందులో తరచు వినబడే సాంకేతిక పదాలు ఇడ్,ఇగో సూపర్ ఇగో,కాన్షస్,సబ్ కాన్షస్ వంటివి.ఇడ్(ఇదం) అంటే మనిషిలోని పశువాంచల సమాహారం.చూసిన ప్రతిదాన్నీ కోరుకునే లక్షణం.ఇగో(అహం) అనేది ఇడ్ యొక్క ప్రతిపాదనల్ని లాభమా నష్టమా అని బేరీజు వేసి లాభం అనుకుంటే ఒప్పుకోవడం,నష్టం అనుకుంటే తిరస్కరించడం చేస్తుంది.ఇడ్ వలె మనిషి పుట్టిన క్షణం నుండి ఉనికిలో ఉండదు.బయటి సమాజం విధించే శిక్షలూ సన్మానాల్ని నింపుకున్న సూపర్ ఇగో దీని మీద పెత్తనం చెయ్యడం మొదలు పెట్టాక సూపర్ ఇగోకీ ఇడ్ ప్రచోదనలకీ మధ్యవర్తిలా పనిచేస్తుంది.

ఈ మూడింటి కలయిక వల్లనే మనిషి మనస్తత్వం ఏర్పడుతుంది.ఈ మూడంటితోనూ వర్తమానంలో జరిగే అన్ని సంగతులకీ ఆ మనిషి ప్రవర్తించే పద్ధతులకి సంబంధించిన మొత్తం నిర్మితిని కాన్షస్ మైండ్(చేతన) అంటారు.అయితే,ఒకప్పుడు ఎంతో ప్రధానమై ఆ మనిషిలో విపరీతమైన స్పందనల్ని రగిలించిన సన్నివేశాల తాలూకు ప్రభావం కాలం గడిచే కొద్ది మర్చిపోయినప్పటికీ వర్తమానంలో వాటికి సంబంధం ఉన్న సంఘటన జరిగినప్పుడు గుర్తుకు వచ్చి ఆ మనిషినే ఆశ్చర్యపరుస్తాయి.అటువంటి జ్ఞాపకాల సమాహారమైన సబ్ కాన్షస్(అంతశ్చేతన) బలమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు సృజనాత్మక రంగాలలో ఎక్కువ కనిపిస్తారు.మామూలు వ్యక్తులలో చేతనకీ అంతశ్చేతనకీ మధ్య అతి ఇరుకైన నడవా ఉంటే సృజనాత్మక వ్యక్తులలోఅది విశాలమైన రహదారిలా ఉంటుంది.

అంతశ్చేతన యొక్క ప్రభావాన్ని చెప్పటానికి మనోవైజ్ఞానికులు ఒక పోలిక కూడా చెబుతారు.ఒక బీకరులో అంచు వరకు నీళ్ళు ఉన్నాయనుకోండి.అందులో ఒక క్యూబ్ ఆకారంలో ఉన్న మంచుగడ్డ వేశామనుకోండి.మంచు గడ్డ నీటిలో మునగటానికీ బైటికి కనబడటానికీ 3:1 నిష్పత్తి ఉంటుంది,అవునా?ఆ పోలికలో మన మనస్సులోని చేతన మనకు తెలుస్తుంది గానీ మనలోనే ఉన్నప్పటికీ మన చేతన ఎల్లప్పుడూ  అంతశ్చేతన వల్ల ప్రభావితం అవుతూనే ఉన్నప్పటికీ ఎప్పుడో తప్ప దాని ఉనికి మంకు తెలియదు.ఇది మనోవైజ్ఞానికులు చెప్పిన పోలికయే కదా అని ఈ పెద్దమనిషి కనిపించిన ప్రతి మనిషి శరీరంలోనూ బీకరు కోసం, అందులో ఉన్న నీళ్ళ కోసం, వాటి మీద తేలుతున్న మంచుగడ్డ కోసం ఎక్కడ వెతుకుతాడు?


తన  కొవ్వును చూసుకోలేని idiot మతానికి కొవ్వు పట్టిందని అంటున్నాడు -Shit! 

Thursday, 22 March 2018

ప్రపంచ ప్రసిద్ధి గల హిందూ ఆలయాలు - చిత్రకూటం

1.ఆలయం పేరు (Name of the temple)
సీతా సమేత శ్రీ రామచంద్ర స్వామి 

2.ఆలయ చరిత్ర (history of the temple)
చిత్రకూటం శ్రీరాముడు అక్కడ నివసించటానికి ముందే అత్రి,అనసూయ,దత్తాత్రేయ,శరభంగ వంటి ఎంతోమంది ఋషిసత్తములు ఆశ్రమాలను నిర్మించుకుని ఉన్న పవిత్రమైన ప్రదేశం.రామాయణ కధలోనే భరద్వాజ మహర్షి చిత్రకూటాన్ని ఎంతగానో ప్రశంసించి అక్కడ నివసించమని శ్రీరామునికి సూచించినాడు.కాళిదాస మహకవి తన మేఘదూత కావ్యంలో అప్పటికే రామా నామాంకితం అయిఉండటం వల్ల కాబోలు, రామగిరిగా పేర్కొన్నది ఈ చిత్రకూటమునే!

చిత్రకూటము ఆలయాల సమాహారం.ఈ ఆలయాలన్నీ చాలా ప్రాచీనకాలంలో నిర్మించబడినవి గనకఎవరు ఏ ఆలయాన్ని నిర్మించారో తెలుసుకోవడం కష్టం.

కామదగిరి లోని కామతనాధుడు
కామద గిరిపై వసించి  కామితము దీర్చే ఈ కామత నాధుడు మొతం చితర్జ్కూటానికే ప్రధాన దైవం.శ్రీరాముదు భార్యాసోదరసమేతుడై వనవాస కాలంలోని అధికబహాగాన్ని గడిపినది ఇక్కడే!ఈ గిరి పరదక్షిణ మార్గంలోనే అని ఆలయాలూ ఉంటాయి.

భరత మిలాప
ప్రదక్షిణ మార్గంలోని తొలి మజిలీ ఇది.ఇక్కడే రామకధలోని అత్యంత ఉద్విగ్నభరితమైన సహోదర సమాశ్రయణం జరిగింది.నిజంగా జరిగిన కధని విని రాయడమో,కేవలం వాల్మీకి మహకవి స్వకపోలకల్పితమో తెలియదు గానీ శ్రీరాముని వనవాసం అనే ఒక విచిత్రమైన సంవిధానం ప్రపంచంలోని మరే సాహిత్యరూపంలోనూ కల్పించబడని విశిష్టమైన సన్నివేశం.లౌకిక దృస్జ్టితో చూస్తే తెల్లవారితే ఒక సామ్రాజ్యానికి మూర్ధాభిషిక్తుడు కావలసిన సమయంలో అన్నీ వదులుకుని అడవల్లోకి పోవాలనడం ఎవరికయినా అశనిపాతమే!అయినా చిరునవ్వుతోనే అంగీకరించి, అపరిమితంగా దుఃఖిస్తున్న తల్లిని ఓదా ర్చి, తనని ఖైదు చేసి రాజువు కమ్మన్న తండ్రిని మందలించి విహారయాత్రకు వెళ్తున్నంత ఆనందంగా తరలి వెళ్ళడం సామాన్య మానవులు చెయ్యలేని దుష్కరకార్యం - అందుకే శ్రీరాముడు విగ్రహవాన్ ధర్ము డయ్యాడు!

అయోధ్యకాండలో మనకు మూడు రకాల తల్లులు కనిపిస్తారు.కౌసల్య: తన బిడ్డ సింహాసనం ఎక్కుతున్నాడని తెలిసినప్పుడు సంతోషంతో పొంగిపోయింది.ఆ బిడ్డయే అరణ్యానికి వెళ్తున్నాడని తెలి యగానే గోలుగోలున ఏడ్చింది.తమ బిడ్డల వృద్ధికి పొంగిపోయి క్షయానికి కుంగిపోయే తల్లులు లోకంలో అసంఖ్యాకంగా ఉన్నారు,ఉంటారు కూడా!సుమిత్ర: తన్ను మాలిన ధర్మంలా అన్నగారికి సేవలు చెయ్యడానికి తనకు తనుగా భోగాలని వదులుకుని వెళ్తున్న బిడ్డని 'రామం దశరధం విద్ధి,మాం విద్ధి జనకాత్మజం,అయోధ్యా మటవీం విద్ధి,గఛ్చ తాత యధా సుఖం' అని దీవించి పంపగలిగిన తల్లులు దేశానికి ఒక్కరున్నా చాలు,నిజంగా ఉంటారా!కైకేయి: తన బిడ్డ పెద్ద పదవిలో ఉండి భోగభాగ్యాలతో అలరారడం చాలదు,పొరుగింటి పిల్లలకు అడుక్కుతినే దశ రావాలని కోరుకునే తల్ల్లి ఏ దేశంలోనూ ఒక్కరు కూడా ఉండకూడదు.

తన వైభవం కోసమే చేసినా తప్పు చేసిన తల్లినే ఛీత్కరించి రాజ్యాన్ని తిరిగి అన్నగారికే అప్పజెప్పాలని వచ్చిన భరతు డు, భరతుడే రమ్మని పిలవడం వల్ల సాంకేతికంగా చిక్కులన్నీ తొలగినా కూడా మృదువుగా వారించి వనవాసాన్నే కొనసాగించిన రాముడు - వీరిద్దరిలో ఎవరు గొప్ప అని తేల్చడం ఎంతటి ధర్మతత్వకోవిదులకైనా అసాధ్యమే.అలాంటి అపూర్వసహోదరసమాగమానికి శిలలు కూడా కరిగాయి కాబోలు నన్నట్లు వారి పాదముద్రలు ఇక్కడ శాశ్వతమైనాయి.

లక్ష్మణ పర్వతం
వైకుంఠవాసులైన ఆదిదంపతు లిద్దరూ సామాన్య దంపతుల వలెనే పన్నెండేళ్ళు అయోధ్యానగరంలో సుఖభోగాలు అనుభవించిన తర్వాత పధ్నాలుగేళ్ళ వనవాసంలో కూడా అయోధ్యలో ఉన్నంత సంతోషంగా గడిపారంటే దానికి తమ్ముడు లక్ష్మణుడే కారణం!సీతారాముల శుశ్రూష అనంతరం లక్ష్మణ దాశరధి విశ్రమించిన స్థలం ఇది!

యుద్ధకాండలో రావణుడు శక్తిని ప్రయోగించింది లక్ష్మణుని మీదికి కాదు,వైరిపక్షంలో చేరి కనబడుతున్న సోదరుడైన విభీషణుని మీదికి.అది చూసిన లక్ష్మణుడు క్షణమాత్రంలో అన్నగారు విభీషణునికి లంకానగర సామ్రాజ్యాన్ని ధారపోస్తూ వాగ్దానం చెయ్యడం గుర్తుకు తెచ్చుకుని అన్నగారి మాటకి భంగం రాకూడదని తను అడ్డు వెళ్తాడు!అసదృశమైన శక్తి ఘాతానికి విస్మృతుదైన తమ్ముణ్ణి చూసిన రాముడు అపరిమితమైన దుఃఖంతో ;దేశే దేశే కళత్రాణి,దేశే దేశే చ బాంధవాః,తం తు దేవ న పశ్యామి యాత్ర బ్రాత సహోదరః' అని పరమ దయనీయంగా విలపిస్తాడు.ఈ ఒక్క కరుణరసార్ద్రమైన సన్నివేశం చాలు వాల్మీకి రామాయణం ఎందుకు అందరికీ ప్రీతిపాత్రమైందో తెలుసుకోవడానికి!

ఇక్కడ లక్ష్మణ పర్వతం మీద ఒక స్తంభం ఉంటుంది.రాత్రిపూట కూడా నిద్ర మానుకుని ఈ స్తంభానికి చేరగిల నిలబడి కామదగిగిరికి కాపలా కాస్తూ ఉండేవాడట!యాత్రికులు ఈ స్తంభాన్ని స్పృశించి ఆ త్యాగమూర్తిని స్పర్శించినంత ఆనందం పొందుతారు.

హనుమాన్ ధార
సీతాన్వేషణ సమయంలో హనుమంతుడు పడిన కష్టాలను తెలుసుకున్న శ్రీరామ్ముడు చలించి అతనికి విడిదిగా నిర్ణయించిన ప్రకృతి సౌందర్యం విలసిల్లే సుంధర ధామం ఇది.ఇక్కడ రావణక్రౌర్యంతో దహించబడిన పవనసుతుని దేహబాధను ఉపశమింపజేయడానికి తన శరాగ్రంతో జలధారను కూడా సృష్టించినాడు కరుణాపయోనిధి దాశరధి!వాగ్విదాంవరుడైన కపివరుని మకుటంపైనుండి జారిన ఈ జలధార మెల్లమెల్లగా కిందికి ప్రవహించి అక్కడ ఒక సరస్సును ఏర్పరచి బహు సుందర దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నది.

సీతా దేవి స్నానమాచరించిన స్థలంగా విఖ్యాతమైన జానకీ కుండ్,ఆమె శరీరానికి అరగదీసి పూసుకునేటందుకు వాడిన స్ఫటికశిల మొదలైనవి కూడా ముఖ్యమైనవే.ఈ ఆలయాలను అన్నింటినీ కలుపుతూ ఒక రేఖని గీస్సినట్లయితే పైన త్రిభుజాకారం కింద చతురస్రం కలిసి శ్రీరాముడు ఆకర్ణాంతం లాగి విడిచిన బాణంలా గోచరిస్తుంది!

3.ఆలయ విశిష్టత (importance of the deity)
బనారస్ హందూ యూనివర్సిటీ కల్చరల్ జ్యాగ్రఫీ శాఖలో ప్రొఫెసర్ అయిన శ్రీమాన్ రాణా.పి.బి.సింగ్ గారు అమెరికా లోని కొలరాడో యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన జాన్ మాల్విల్లె గారితో కలిసి భారతదేశంలోని ప్రాచీన కాలపు ఆలయాల నిర్మాణంలో భారతీయులు ఉపయోగించిన వైజానిక శాస్త్ర రహస్యాలను గురించి ఎన్నో పరిశోధనలు చేసి భారతీయ విజ్ఞాన శాస్త్రానికి ప్రపంచ స్థాయిలో ఎంతో గుర్తింపును తీసుకొచ్చారు. మన పూర్వులు నిర్మించిన ఆలయాలు ఏవీ గుడ్డిగా ఏదో ఒక స్థలాన్ని ఎన్నుకుని యెలా పడితే అలా కట్టేసిన రాతిగోడల భవనాలు కావు.కేవలం వృత్తాలు, చతురాలు, ఒకదానినొకటి ఖండించుకునే రేఖలు లాంటి మామూఉ ఆకారాలను తీసుకుని రేఖాగణిత సూత్రాలను ఉపయోగించి విశ్వశక్తిని కేంద్రీకరింపజేసి పట్టి ఉంచే విశ్వశక్తి గ్రాహకాలు(Cosmic Energy Reservoirs)గా నిర్మించారు.

ప్రతి ఆలయానికి క్షేత్రపరంగా అది భౌమ అయస్కాత శక్తి ప్రవాహాల మధ్యన ఏ అక్షాంశ రేఖాంశాల మధ్యన ఉన్నది అనేది అత్యంత ప్రధానమైన విషయం.అక్కడి భౌమ అయస్కాంత శక్తి ప్రభావాన్ని అంచనా వేసి దానిని క్షేత్రగణితశాస్త్రపు నిర్మాణాలతో వంపులు తిప్పడం ద్వారా ఆలయపు అవరణలో ఉన్న భక్తులకు విశ్వశక్తి యొక్క స్పర్శ అనుభవంలోకి వచ్చి ప్రశాంతత నిచ్చే విధంగా ఆలయనిర్మాణంలో ఉపయోగించుకుంటారు.గర్భగృహం,విమాన శిఖరం,ధ్వజస్తంభం,ముఖద్వారం పైన ఉందే గోపురం,మూలవిరాట్టు ఏ దిక్కుని చూడాలి,ముఖద్వారం ఏ దిక్కున ఉండాలి - ఇవన్నీ కూడా ఆలయ నిర్మాణానికి సంబంధించి ప్రముఖమైన విషయాలే!ఆ రకంగా చూస్తే చిత్రకూటం గురించిన విశ్లేషణలో ఒక విషయం గురించి చెప్పారు. ఇక్కడ క్షితిజం పైన సూర్యోదయం సూర్యాస్తమయం అనే రెండు అంశాల మధ్యన ఎక్కుపెట్టబడి ఉన్న ఒక బాణం వలె గోచరిస్తుందట ఈ చిత్రకూటంలోని ఆలయమాలిక!

ఆధునిక భౌతికశాస్త్రజ్ఞుల కన్నా చాలా ముందుగానే స్థల,కాల ద్వయానికి ఉన్న సాపేక్షతని మనవారు తెలుసుకోగలిగారనేదానికి ఎన్నో సాక్ష్యాలు ఉనాయి.ఆలయనిర్మాణలో వారు వాడిన విజ్ఞానానికి ఇప్పటి పేరు కల్చరల్ కాస్మాలజీ!కాశీ నగరాన్ని తమ రేఖాగణిత మరియు విశ్వవిజ్ఞాన శాస్త్ర సాంకేతికాంశాలతో ఒక వామనవిశ్వం(Bosai Universe)వలె నిర్మించారు!చిత్రకూటంలో కనబడుతున్న శ్రీరామశస్త్రం ఏకంగా కాలస్వరూపమే!

కాలానికి ఉండే అన్ని లక్షణాలూ శ్రీరామశస్త్రానికి ఉన్నాయి.దివారాత్రాలు రెండు కొసలు!శ్రీరామశస్త్రం కాలస్వరూపాన్ని కనుగొనలేని అసురుల మీదకి వెళ్ళీ అంతం చెయ్యటం  తప్ప సాధుపుంగవుల మీదకి ఏనాడూ వెళ్ళదు!ప్రయోగం జరిగాక విఫలం కాదు!శ్రీరామశస్త్రం తగిలి అంతమైపోయిన వారు కూడా ధన్యులే,శాశ్వతులే అవుతారనేది కూడా నిజం!బుద్ధిమంతులు అలాంటి భగవంతుని మీది పగ వల్ల వచ్చే నకారాత్మకమైన శాశ్వతత్వం కోరుకోకుండా రామనామాంకిత ధ్యానులై సగుణాత్మకమైన బ్రహ్మస్వరూపాన్ని అర్చిస్తూ శాశ్వతానందాన్ని పొందటం శ్రేయోదాయకం! అయోనిజయైన సీతతో కలిసి పాంచభౌతిక దేహంతో తిరుగాడిన స్థలకాలాతీతుడైన వాని కాలస్వరూపమైన ఆయుధ రూపమే చిత్రకూట ధామం!!

శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి!

4.ఆలయ మార్గము (how to reach)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లాలో అలహాబాద్ నుండి సుమారు 125 కిమీ దూరంలో మందాకినీ నదీతీరంలో చిత్రకూటం ఉన్నది. మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్యనున్న పర్వతసీమలో ఉండటం వలన 1996లో ఏర్పాటు చేయబడిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ జిల్లా మరియూ  మధ్యప్రదేశ్ రాష్త్రంలోని సత్నా జిల్లా రెంటికీ చొత్రకూటంతో సంబంధం ఉన్నది.

Monday, 19 March 2018

తెదెపా పెట్టిన అవిశ్వాసం నెగ్గుతుందా?వీగిపోయి మిత్రులు శత్రువులై యుద్ధం చేస్తారా?

రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో జరిగిన మొదటి ఎన్నికల సంగ్రామం నుంచీ తెలంగాణ ముఖ్యమంత్రి చడీ చప్పుడు లేకుండా ఉండి ఇప్పుడు జాతీయ స్థాయికి ఎదగాలని ఉందని బాంబు పేలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాలుగేళ్ళ పాటు వార్తల్లో నాని తడిసిపోయిన తర్వాత ఇప్పుడు భాజపా కొట్టిన దెబ్బకి తుస్సుమంటుందేమోనన్న దీపావళి టపాసులా కనబడుతున్నాడు!చంద్రబాబు కున్న అనుభవం వల్ల అతను పైచేయి సాధిస్తాడనే కించిత్తు ఆశ ఉన్నప్పటికీ ఎంత అభిమానంతో లెక్కలు వేసినా  అతను మోదీ-షా ద్వయం మొదటి నుంచీ సూచనలు ఇస్తూ కొట్టిన ఇప్పటి దెబ్బకి బిత్తరపోయి ఆత్మరక్షణ కోసమే అవిశ్వాసమనే బలహీనమయిన ఎత్తు వేసినట్టు నాకు అనిపిస్తున్నది.

కుటుంబాల స్థాయిలోనే అప్పటివరకు తియ్యపెట్టకుండా కలిసిపోయి బతికిన అన్నదమ్ములు విడిపోయినప్పుడు వీలయినంత తొందరగా అన్ని లెక్కలూ సరిచూసుకుని రావల్సినవి పట్టుబట్టి వెంటనే సాధించుకునే తెలివి లేక తాత్సారం చేస్తే ఎన్ని సంసారాలు గల్లంతు అయిపోలేదు?ప్రత్యేక హోదా ఒక్కటేనా, గవర్నరు పదవి దగ్గిర్నుంచి ఉమ్మడి  రాష్ట్రపు ప్రభుత్వ శాఖల ఆస్తుల వరకు ఏది నిక్కచ్చిగా తేలిందో చెప్పమనండి!మరి ఒక రాష్ట్రం అనే కుటుంబపెద్దగా ఇంత తాత్సారం చెయ్యడానికి ఉన్న బలమయిన కారణం ఏమిటి?విభజన ప్రక్రియ నాలుగేళ్ల కింద మొదలవడమే తప్ప సాంకేతికంగా విభజన పూర్తి కాలేదన్నది ఎవరికయినా అర్ధమవుతున్నదా?రావలసిన వాటి గురించి కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగడం లేదని అడిగినప్పుడల్లా తెదెపా వాళ్ళు నోరు తెరిస్తే మేము గట్టిగా అడిగితే భాజపా వయ్యస్సార్ కాంగ్రెసు మీదున్న కేసుల్ని తీసేసి మాకు పోటీ పెడదామని చూస్తున్నది,అందుకే భయపడుతున్నాం అంటారు - ఇదొక చెత్త జవాబు!ఇవ్వాళ టీ  షాపుల దగ్గిర కూడా రాజకీయాలు మాట్లాడుకునే పరిస్థితి ఉంది - నిన్నటి వరకు a1,a2 అని పేర్లు పెట్టి ఆస్తులు కూడా జప్తులు చేయిస్తూ సరిగ్గా ఎన్నికల ముందు కేసులు ఎత్తేయించితే అది యెందుకు జరిగిందో చిన్నపిల్లాడు కూడా చెప్పగలడే!అంత సిల్లీ కారణంతో భాజపాకి భయపడటం తెదెపా తెలివితక్కువతనమే.

అవిశ్వాసం ప్రతిపక్షానికి అనుకూలమయితే కేంద్రప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తాయి - అందరూ ఎన్నికల సంరంభంలో ఉన్నా గానీ ఇప్పటికిప్పుడు ఈ రకమయిన పద్ధతిలో వచ్చే ఎన్నికలకి ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ సుముఖం కాదు గాబట్టి వీగిపోవడానికే అవకాశాలు ఎక్కువ.అమిత్ షా "మూడు నెలల్లో పరిస్థితి మనకి అనుకూలం అయ్యాకే అన్నీ ఇద్దాం" అని ధీమాగా చెప్పటాన్ని బట్టి ఈ మూడు నెలల డెడ్లైను ఉద్దేశించిన ఎన్నికల సర్దుబాట్ల బేరసారాల్లో భాజపా పైచేయి సాధించేసింది - 2014లో తమ మీద నమ్మకం లేక తెదెపాకి సంఖ్య తగ్గించడానికి వేసిన చెత్త ఎత్తు ఈసారి వెయ్యకపోవచ్చు.ఈసారి గెలిచే వాళ్ళనే నిలబెట్టి ఆంధ్రలో బలం పెంచుకోవడానికే చూస్తుంది.

నేను ఇక్కడ కూర్చుని పత్రికల్లో వచ్చే స్టేట్మెంటుల్ని బట్టి ఆలోచించడమే తప్ప నాకు ప్రత్యక్ష పరిచయం లేదు గాబట్టి నేను వూహించనిది జరిగే అవకాశం కూడా ఉంది. అవేవీ జరక్కపోతే అవిశ్వాసం వీగిపోతుంది,ఆంధ్రలో సీట్ల సర్దుబాటు భాజపాకి అనుకూలంగా ఉంటుంది,ఆంధ్రకి రావలసినవన్నీ వస్తాయి,ఎలాగూ ఆంధ్రకి ఇవ్వాలసినవి ఇచ్చేశారు గాబట్టిఎన్నికల నాటికి పోట్లాటలు తగ్గుతాయి, ఎన్నికల తర్వాత  తెదెపా,భాజపా ఇప్పటివలెనే మిత్రామిత్ర సంబంధంతో కలిసిపోతారు.

ఆంధ్రా వోటర్లకి నేను ఇచ్చే సలహా యేమిటంటే శాసనసభకి తెదెపాకి ఫుల్ మెజారిటీ ఇవ్వాలి.జనసేన,జగనసేన రెండూ వేస్ట్ క్యాండిడేట్ల నాయకత్వంలో ఉన్నాయి గాబట్టి వోటు వెయ్యడం కూదా దండగే!ఆంధ్రాకి న్యాయం చెయ్యకపోతే పుట్ట గతులుండవని తెలిసేలా భాజపాకి సున్నం పుయ్యాలి!లొక్ సభలో కాంగ్రెసుకి బలం పెంచాలి.భారత జాతీయ కాంగ్రెసుకి మాత్రమే పెంచాలి , వయ్యస్సార్ కాంగ్రెసుకి కాదు.

ఇంకొక చిత్రమైన విషయం కూడా నాకు కనబడుతున్నది.తెలంగాణ భాజపా రెడ్డి ఆంధ్రకి సాయం చేస్తే దేశంలో అంతర్యుద్ధం వస్తుందన్నట్టు మాట్లాడుతున్నాడు.మొదటి నుంచీ భాజపా ఆంధ్రకి సాయం చెయ్యాలని మాకూ ఉంది,కానీ ఇతరుల నుంచి వ్యతిరేకత రావచ్చు అని చెబుతున్నారు.దాన్ని కూడా పూర్తిగా కొట్టెయ్యలేం.జయలలిత బతికున్నప్పుడు బయటపడి అనేసింది కూడా.కర్ణాటక ముఖ్యమంత్రి అనుకుంటాను మొదట కుళ్ళుమోతు స్టేట్మెంటు ఇచ్చి నిలదీస్తే సర్దుకున్నాడు.ఏ సహాయమూ చెయ్యకుండానే అంధ్ర ఇంత ధీమాగా ఉంది ఆ కాస్త సాయమూ చేస్తే ఇంక పట్టలేం అనే ఈర్ష్య ఉన్నదని ఆయా రాష్టాల ప్రాంతీయ మీడియా కబుర్ల వల్ల తెలుస్తున్నది.ఒకవేళ ఇప్పటికి అది అబద్ధమే అనుకున్నా ఇప్పుడు తెదెపా పేట్టిన అవిశ్వాసం వీగిపోయినప్పటికీ దీనికి మద్దతు ఇచ్చిన పార్టీలు తర్వాత ఆ పని చెయ్యలేవు కదా!అందుకే, ఈ విధమైన ఎత్తుగడని తెదెపా,భాజపా కలిసే ప్రయోగిస్తున్నాయని నాకు అనిపిస్తున్నది.

అయితే, ఈ వ్యూహంలో కూడా వీటన్నింటి వల్ల ఒకవేళ చంద్రబాబు పట్ల వ్యతిరేకత పెరిగితే భాజపా దాన్ని ఉపయోగించుకుని బాబు మీద పైచేయి సాధించడానికే చూస్తుంది.అవిశ్వాసం తర్వాత భాజపా ఇతర పార్టీలు ఆంధ్రకు సాయం చెయ్యడాన్ని సమర్ధించాక కూడ ఆంధ్రకి న్యాయం చెయ్యకపోతే బాబుకి జాతీయ రాజకీయాల లోకి వెళ్లడం తప్పనిసరి అవుతుంది.అమాయకత్వంతో ఉంటే భాజపా కూడా దెబ్బ తింటుంది.గోరక్షపురం దెబ్బ చాలదా?ఆంధ్రకి చెయ్యాల్సిన సాయం చెయ్యనంతవరకు ఆంధ్రలో భాజపాకి వోట్లు పడవు. భాజపా ఈసారి బాబుని జాతీయ స్థాయి రాజకీయాల వైపుకి చూడనివ్వదు.కేసీయార్ బాబు నుంచి పోటీ విషయంలో ధీమాగా ఉండొచ్చు.  నిజానికి ఆంధ్రకి చట్టప్రకారం చెయ్యాల్సిన మామూలు పనికి ఇంత నీచమయిన వ్యూహాలు పన్నాల్సిన అవసరం లేదు - కానీ అన్ని పార్టీలలోని నాయకులూ ప్రజల గురించి కాకుండా తమ వ్యక్తిగత వైభవాల కోసం ఆలోచిస్తున్నారు గాబట్టి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఇలాంటి పరిష్కారాలూ అవసరం అవుతున్నాయి.

ఎన్నికల ముందు గానీ ఎన్నికల తర్వాత గానీ,అంటే ఎన్నికలతో సంబంధం లేకుండా మోదీ-షా ద్వయం దూకుడు తగ్గించాలంటే అద్వానీని కదిలించి రామాలయ నిర్మాణం కొసం మళ్ళీ రధయాత్రని మొదలు పెట్టించాలి అన్నది నా వ్యూహం.నా కారణాలు ఏమిటో వచ్చే టపాలో చెబుతాను.దాని గురించి మీరూ ఆలోచించండి.

Saturday, 24 February 2018

ఎందుకిలా చేస్తారో! ఈ మనుషు లెందుకిలా మనసులతో ఆడుకుంటారో!

ఎందుకిలా చేస్తారో!
ఈ మనుషు లెందుకిలా మనసులతో ఆడుకుంటారో!

మాకది ఇస్తే మీకిది ఇస్తాం అని ఆశలు రేపుతారు -
మనం ఇస్తే పుచ్చుకుని నవ్వుకుంటారు గానీ,
మనకి ఇవ్వాల్సింది ఇవ్వడానికి ఏడుస్తారు!
చేసిన పాపం ఇంగువ కట్టిన మూట.
ఏం బావుకుంటారు?

మీరూ మేమూ ఒకటే అంతా సమానమే అంటారు -
మనల్ని కటికనేల మీద కూర్చోబెడతారు,
వాళ్ళు పట్టు బాలీసుల మీద కూర్చుంటారు!
మరొకడొచ్చి కిందకి లాగేవరకే పటాటోపం.
ఏం సుఖపడతారు?

కాలు కందకుండా చూసుకుంటానని కబుర్లు చెబుతారు -
మూరెడు మల్లెలు కొనలేని వెధవలు కూడా
మల్లెపూల మంచం కోసం కలలు గంటారు!
మంచం దిగాక తెలుస్తుంది మగతనం.
ఏం ఉద్దరిస్తారు?

తనని ప్రేమిస్తే స్వర్గం చూపిస్తానని కోతలు కోస్తారు -
ప్రేమిస్తే ఇంకాస్త ప్రేమించమని అంటారు,
కాదంటే వాళ్ళే చంపి స్వర్గానికి పంపిస్తారు!
చిప్పకూడు తినేప్పుడు తెలుస్తుంది నిజం.
ప్రేమంటే బతికించడం తప్ప
చంపడం కాదని,ఏం లాభం?

ఇతరుల్ని మోసం చెయ్యడమే గొప్ప తెలివి అనుకుంటారు -
ఇతరుల్ని మోసం చేస్తూ మీసాలు మెలేస్తారు,
ఇతరులు మోసం చేస్తే పళ్ళు కొరుకుతారు!
ఏం మూర్ఖత్వం వాళ్ళది?
ఎంత సిగ్గులేని తనం!

ఎందుకిలా చేస్తారో!
ఈ మనుషు లెందుకిలా ఆత్మల్ని అమ్ముకుని బతుకుతారో!

Tuesday, 20 February 2018

భవిష్యత్తులో రోబోట్లు నిజంగా మనుషుల మీద తిరగబడతాయా?అసలు యంత్రానికి స్వంతబుద్దిని ఇవ్వడమూ ఆలోచన నేర్పడమూ సాధ్యమా?


సనాతన ధర్మం మనుషుల్ని మూడు రకాల కింద కుదించింది - తామసులు,రాజసులు,సాత్వికులు అని!మీరు ఆన్‌లైన్ షాపింగ్ కోసం వెబ్ ముందు గానీ ఫోను ముందు గానీ కూర్చుంటే వాళ్ళు మీముందు రేడియో బటన్లూ చెక్ బాక్సులూ కలిపి ఒక వెబ్ ఫార్మ్ పెడతారు.మీ ముక్కూ మొహం వాళ్ళకి తెలియకపోయినా మీరు నొక్కిన బటన్లని బట్టి వాళ్ళు మీకు కావలసిన వస్తువుని మీకు పంపిస్తారు - లెక్క ప్రకారం పని జరిగిపోతుంది.వ్యాపారం చేసి లాభం పొందాలనుకున్నవాడు గానీ ఓట్లు సంపాదించి అధికారం పొందాలనుకునేవాడు గానీ ప్రతి మనిషినీ పట్టించుకోవాలంటే గిట్టుబాటు కాదుఅలాగని అసలు పట్టించుకోకపోతే మట్టానికి మునిగిపోతాడు.
ఇద్దరికీ సులువైన పద్ధతి యేంటంటే వాళ్ళు ఏ సమూహాన్ని సంతృప్తి పరచాలనుకుంటున్నారో ఆ సమూహాన్ని కొన్ని సామాన్య లక్షణాలను ప్రదర్శించే చిన్న చిన్న గ్రూపులుగా విడగొట్టి ఏ గ్రూపుకి ఏ అంశం నచ్చుతుందో తెలుసుకోవటం తేలిక.అయితే, తొలిప్రేలుడు సిద్ధాంతకర్తల లాగే అంతకుముందు ఏమీ లేదనీ ఉండటానికి వీల్లేదనీ అనుకున్నాడో యేమో కార్ల్ మార్క్స్ మానవ జాతి యొక్క తొలిదశ అని చెప్పిన ఆదిమ కమ్యూనిజపు కాలం నుంచీ ఇప్పటివరకూ మానవ సమూహాలు అన్నీ సనాతన ధర్మం చెప్పిన తామసం,రాజసం,సాత్వికం అనే మూడింటిలో ఏదో ఒక లక్షణాన్ని ప్రతిబింబిస్తున్నాయి.ఎంత కఠినంగా విశ్లేషించినా నాలుగో గ్రూపు కనబడటం లేదు.
రోబోట్ల గురించి తలకట్టు పెట్టి వ్యాపారం,రాజకీయం అంటున్నానేమిటా ఆని ఆశ్చర్యపోతున్నారా?నేను ఇక్కడ కూర్చుని రాసినదాన్ని మీరు అక్కడ కూర్చుని చదివేలా చెయ్యగలుగుతున్న కంప్యూటర్ టెక్నాలజీ ఎందుకు ఉనికిలోకి వచ్చిందో రోబోట్ల వాడకం కూడా అందుకే ఉనికిలోకి వచ్చింది - వ్యాపారం కోసమే!వ్యాపారం అనగానే మూర్ఖపు కమ్యునిష్టుల మాదిరి ముఖం చిట్లించకండి,కస్టమర్ని మోసం చెయ్యని వ్యాపారం చాలా అవసరం - మనం జంతువుల నుంచి విడిపోయి ఒక ప్రత్యేకత సాధించడానికి కారణం మనకి వ్యాపార సూత్రాలు తెలియడమే!
మిగిలిన జంతువుల కన్న మానవుడిలో భిన్నమైన లక్షణం అత్యద్భుతమైన జ్ఞాపకశక్తి - ఇవ్వాళ తెలిసిన విషయాన్ని రేపటికి గుర్తుపెట్టుకోగలగడం వల్లనే మానవుడు ఇంత ప్రగతిని సాధించాడు. కార్ల్ మార్క్స్ దానికి ఆదిమ కమ్యూనిజం అనే పేరు పెట్టి తన సిద్ధాంతాన్ని అక్కడినుంచే మొదలుపెట్టడానికి కారణం కూడా వస్తువుల వినిమయం మొదలైన తొలిదశ కాబట్టి కావచ్చు - కానీ అతను దాన్ని మరీ ఎక్కువ ప్రేమించి మానవాళి అంతిమలక్ష్యం కూడా అదే అనటం మాత్రం అశాస్త్రీయమైన ప్రతిపాదనయే!
వ్యాపారం యొక్క ప్రయోజనమూ, దాని వెనక ఉన్న జ్ఞానసంచయం యొక్క అవసరమూ మనిషిని సుఖపెట్టటానికే, సుఖం అంటే సోమరితనం కాదు - అతి తక్కువ శ్రమతో అతి ఎక్కువ ఫలితాన్ని పొందడం. దీనికోసమే చక్రం అనే తొలియంత్రాన్ని కనిపెట్టాడు ఆది మానవుడు.ఇప్పటికీ మానవసమొహం ఉపయోగించే ప్రతి యంత్రంలోనూ ఈ చక్రమే రకరకాల రూపాల్లో ఒదిగిపోయి కనిపిస్తున్నది - ఒకే దైవం అనేక రూపాల్లో సాక్షాత్కరిస్తున్నట్టు!
ఇవ్వాళ మనం రూపాయి అని పిలుస్తున్నది దాన్ని సంపాదించడానికి మనం పడిన శ్రమకి గుర్తు.ఇక్కడ శ్రమ అనడం కన్న జ్ఞానం అనడం వల్ల విషయానికి మరింత స్పస్టత వస్తుంది.అవ్యక్తుడైన పరమాత్మను తెలుసుకోవడానికి ప్రతిమ ఎలా అవసరమో ఒక మనిషి నిన్నటి రోజున చేసిన శ్రమ వెనక ఉన్న జ్ఞానమే ఇవ్వాళ రూపంలోకి వచ్చి రూపాయి/డాలర్/రూబుల్ అనే పేర్లతో అతని ఆదాయం అవుతుంది.కేవలం దేహశ్రమతో చెయ్యలేని పనిని బుద్ధి చాతుర్యంతో చెయ్యగలిగితే ఆ బుద్ధి చాతుర్యమే ఎక్కువ ఆదాయాన్ని తెస్తుంది - అది సహజమే!ఒక మనిషి టన్ను బరువున్న ఇనపగుండుని తనొక్కడే యెత్తగలడా!చాలెంజి రాముడిలా కొన్ని సంవత్సరాల పాటు రకరకాల సాధనలు చేస్తే ఎత్తగలడేమో!కానీ కప్పీలూ గొలుసులూ తయారుచేసుకుని తెలివిని ఉపయోగిస్తే ఎన్నిసార్లు ఎత్తమన్నా ఎత్తగలడు -అదీ కొద్ది నిమిషాల్లోనే!
ఈ రకమైన యంత్రాల వినియోగం పట్ల ఇపటివరకు ఎవరికీ అభ్యంతరం రాలేదు గానీ వీటికి కొంత ఆలోచన నేర్పుదామని అనుకునేసరికి కొందరు కంగారు పడిపోతున్నారు,అలా చేస్తే ఒకనాటికి అవి తెలివి మీరిపోయి మనిషి మీద తిరగబడి మానవజాతిని సర్వనాశనం చేస్తాయని భయపెడుతున్నారు, ఇదే మానవాళి యొక్క ఆఖరి ఆవిష్కరణ/పరిశోధన అని ఇతరుల్ని కూడా భయపెడుతున్నారు.
 నాస్తికులకీ హేతువాదులకీ ఆస్తికుల్నీ భక్తుల్నీ వీళ్ళు చేస్తున్న  తర్కవిరుద్ధమైన,అశాస్త్రీయమైన పనుల్ని చూసి హాచ్చెర్యం పడిపోయి వాళ్ళలో వాళ్ళు అనుక్కుని విసుక్కునే మూసమాటలు "ఈ యంత్రయుగంలో...?!", "ఈ రాకెట్ యుగంలో...?!", "ఈ కంప్యూటర్ యుగంలో...?!","ఈ ఇంటర్నెట్ యుగంలో...?!" అని తరాల పాటు వింటున్నా వీళ్ళు జాలిపడుతున్నవాళ్ళు సుబ్భరంగానే బతికేస్తున్నారు. వీళ్ళ విసుగుకి మాత్రం విసుగు రావటం లేదు.అయినా ముందు ముందు వీళ్ళు అసలు ఉండకపోవచ్చు - PEW వారి లెక్కల ప్రకారం మొదటినుంచీ మానవ సమూహాలలఓ నాస్తికులే అత్యల్ప సంఖ్యలో ఉంటూ వస్తున్నారనీ రాబోయే కాలంలో వీరి సంఖ్యలో మరింత తగ్గుదల కనిపించి ఒక శతాబ్దం తర్వాత వీరి అలికిడే ఉండదనీ తెలుస్తున్నది.అంటే,"ఈ రోబోట్ల యుగంలో...?!" అనేది మనం వినబోయే ఆఖరి వెక్కిరింత అన్నమాట - శుభం అందామా భశుం అందామా!
కొందరు యంత్రాలకు కృత్రిమమేధ ఇవ్వడం గురించి అంత భయపడడానికి బలమైన కారణమే ఉంది.ఇప్పటివరకు తను తన ఉపయోగం కోసం తను తయారు చేసుకుంటున్న యంత్రాలని తను చెయ్యమన్న పనిని మాత్రమే చేసి ఆగిపోయేటట్టు తయారు చేస్తున్నాడు.ఇప్పుడు తను ఫలానా పని చెయ్యమని చెప్పకుండానే స్వంత బుద్ధితో పనులు చేసేటట్టు తయారు చెయ్యాలనుకుంటున్నాడు - మనిషిలో లాగే ఆ బుద్ధి పెడదార్లు పట్టితే?
వీళ్ళ భయాలతో పని లేకుండా intelligent machines కోసం ప్రయత్నాలు కూడా చాలా కాలం నుంచే జరుగుతున్నాయి.ఆధునిక కాలంలో పూర్తి వివరాలతో రికార్డ్ అయి మనకి తెలుస్తున్న తొలి రోబో క్రీ.పూ 250లో సాక్షాత్కరించింది.Ctesibius అనే ఒక గ్రీకు ఇంజనీరు తను తయారుచేసిన ఒక నీటి గడియారంలో అవసరాన్ని అబ్ట్టి తమకు తామే కదిలి నీటి గడియారం ఆగకుండా చలించే యంత్రాలను ఇమిడ్చాడు.అయితే,ఇది కేవలం ఆశను రేకెత్తించిన వింతయే తప్ప దాన్ని అందిపుచ్చుకుని ఎవరూ హడావిడి చేసిన దాఖలాలు లేవు.అన్ని లెక్కలూ వేసుకుని పనిగట్టుకుని క్రీ.శ 1954లో George Devol అనే వ్యక్తి digitally operated and programmable robot అనేదాన్ని కనుక్కోవడంతో రోబోటిక్ ఇండస్ట్రీ అనేది ఉనికిలోకి వచ్చింది.
ఇవ్వాళ మనం వాడుతున్న సెల్ ఫోన్ల లాగే రోబోట్ల గురించి సైన్స్ ఫిక్షన్ రచయితలు చాలా కాలం నుంచే కలలు కంటున్నారు - వస్తే లైఫ్ ఇలా ఉంటుందని ఆశ పడ్డారు, మరోలా అవుతుంతుందేమోనని భయపడ్డారు, దీనితో మాత్రం ఒరిగేదేముందిలే అని విరక్తితో వేదాంతం చెప్పారు,
 మనలో చాలామందికి లీలగా తెలిసిన Frankenstein అనే భూతం క్రీ.శ 1818లో Mary Shelley రాసిన సైన్స్ ఫిక్షన్ నవలలోని పాత్ర. అయ్యవారిని చెయ్యబోతే కోతి అయిందని మనం చెప్పుకునే సామెతలా ఆ నవలలోని ప్రధానపాత్ర అయిన Dr. Frankenstein చేసిన అత్యంత బలశాలిని సృష్టించే ఒక ప్రయోగం వికటించి ఆ భూతం తయారవుతుంది!దీని తర్వాత ఒక శతాబ్దానికి,అంటే క్రీ.శ 1921లో Karel Capek తను రాసిన R.U.R - (Rossum's Universal Robots) అనే నాటకంలో రోబోట్ అనే పేరు పెట్టాడు.ఈ కధలో కూడ రోబో తనని తయారుచేసినవాణ్ణి చంపేస్తుంది.క్రీ.శ 1927లో Fritz Lang తీసిన Metropolis ఆనె సినిమాలో మోద్టిసారి Maschinenmensch ("machine-human") రూపంలో రోబోట్ కనిపించింది.
ఆఖరికి ప్రఖ్యాత రష్యన్ సైన్స్ ఫిక్షన్ రచయిత Isac Asimov క్రీ.శ 1941లో robotics అనే మాటని అది ఉత్పత్తిరంగం అవుతుందనే సూచనతో వాడి ఇప్పటి స్థితిని కూడ వూహించాడు.ఈయన మంచి ఫ్యూచరిస్టు కూడా - భవిష్యత్తులో వచ్చే మార్పుల్నీ వాడకంలోకి వచ్చే వస్తువుల్నీ చాలామటుకు కరెక్టుగానే వూహించాడు - భవిష్యత్తును తెలుసుకోవడానికి అతీతశక్తులూ, మంత్రతంత్రాలూ, జ్యోతిషశాస్త్రమూ అక్కర్లేదని నిరూపించాడు!ఈయన Runaround కదలో సూత్రీకరించిన Three Laws of Robotics అనేవాట్ని రోబోటిక్స్ పరిశ్రమలో వాడుతున్నారో తెలియదు గానీ "I,Robot"తో సహా అన్ని రోబోట్లకి సంబంధించిన సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో నవలల్లో యధాతధం వాడుతున్నారు.నేను చూసిన రోబోట్లకి సంబంధించిన సినిమాల్ల్లో I,Robot కన్న bicentennial man అన్ని విధాల ఉన్నతమైన సినిమా!సినిమాలూ నవల్లూ ఎంత భయపెట్టి వెనక్కి లాగినా క్రీ.శ 1948లో Norbert Wiener అనే పెద్దమనిషి Cybernetics అనే పుస్తకం ప్రచురించడంతో రోబోటిక్స ఒక పరిశ్రమ అయిపోయింది.అదే సంవత్సరం William Grey Walter ఆనె British robotics Engineer మొదటిసారి Elmer, Elsie ఆనె రెండు రోబొట్లని తయారు చేశాడు.పవర్ అయిపోతున్నదని తమకు తామే తెలుసుకుని చార్జింగ్ హెడ్స్ ఎక్కడున్నాయో అవే వెతుక్కుని చార్జ్ చేసుకోవటం వాటి తెలివి:-)
ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చెయ్యాల్సి వస్తూ విసుగు పుట్టించే చోట intelligent robotsని వాడటం మంచిదే కదా!ఏ కొంచెం అడుగు తడబడినా చెయ్యి వొణికినా ప్రమాదాలు జరిగే పనుల్లో వీటిని వాడటం వల్ల మనుషుల ప్రాణాలను కాపాడవచ్చును కూడా.యంత్రాల వాడకం మనుషుల నిరుద్యోగితని పెంచుతుందని కొందరు భయపెడుతున్నారు గానీ సృజనాత్మకత ఉంటే మరో పనిని నేర్చుకుని మరో చోట ఉద్యోగం వెతుక్కోవచ్చు.అదీగాక ఈ యంత్రాలని కంట్రోల్ చేసే కీలకమైన నైపుణ్యాన్ని సాధిస్తే అట్లాంటి చోట పాతుకుపోయిన వ్యక్తులకి ఆదాయమూ ఎక్కువగానే ఉంటుంది. ఒక ప్రముఖ విమానాశ్రయం తమ విమానాలని పార్కింగ్ చెయ్యడం కోసం మనుషులకి బదులు intelligent system వాడటం వల్ల మిలియన్లలో ఆదా అవుతున్నదట - మానవ తప్పిదాలు కూడా దాదాపు శూన్యం!
కాల్పనిక సాహిత్యపు మేధావులు ఎంత భయపెట్టినా సైన్స్ ఫిక్షన్ రచయితలు ధైర్యం చెప్పడంతో మనిషి రోబోలని ఉనికిలోకి తీసుకురానే వచ్చాడు - నష్టం గురించిన భయాల కన్న లాభం గురించిన ఆశలే అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ మనిషిని ముందుకు నడిపిస్తున్నాయి.
మొట్టమొదటి కంప్యూటరును నడిపించిన తొలి ప్రోగ్రామర్ Lady Lovelace క్రీ.శ 1842లోనే అప్పటికి కొత్తొక వింతయిన కంప్యూటరు పని తీరు గురించి సందేహపడుతున్నవారికి,"The analytical engine has no pretentions to originate anything.It can do whatever we know how to order it to perform." అమి జవాబు చెప్పింది.ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పిన ఆ జవాబులోనే కృత్రిమ మేధకి సంబంధించిన ఆశలు ఇమిడి ఉన్నాయి.తర్వాత మళ్ళీ క్రీ.శ 1960లో Marvin Minsky అనే మేధావి "Steps Toward Artificial Intelligence" రాసిన పరిశోధనాపత్రం ఈ రంగంలో ఎంతో ముఖ్యమైన మలుపు. స్వలింగసంపర్కం ఆరోపణల వల్ల ఒతిడికి గురయి ఆత్మహత్య చేసుకున్నాడు గానీ లేనట్లయితే న్యూటన్, గ్రాహం బెల్, ఐన్స్టీన్ లాంటి వాళ్ళందరికన్న ఎక్కువ పేరు ప్రతిష్ఠలు వచ్చేవి!దీని తర్వాత కొద్ది కాలానికే Jim అనే పాక్షిక అంధుడైన ఒక మేధావి సాంకేతీకంగా artificial intelligenceకి మంచి prototype అనదగిన ఒక చిన్న ప్రోగ్రాం రాశాడు.దీనితో యంత్రాలకు కృత్రిమమేధని ఇవ్వగలం అని అందరికీ నమ్మకం కలిగింది.
మానవాళి చరిత్రని భయానకమైన విధ్వంసం నుంచి రక్షించే అపురూపమైన సన్నివేశాలలో నిలిచి పోరాడినవారు గానీ మానవుల సుఖజెవనానికి దారులు వేసే గొప్ప ఆవిష్కరణలలో పాల్గొన్నవారు గానీ - అందరూ మహాబలవంతులో అఖండప్రజ్ఞానిధులో ఆగర్భశ్రీమంతులో కాదు,తమ అవకరాల్నీ బలహీనతల్నీ పరిమితుల్నీ దాటుకుని ముందుకు వచ్చి కీర్తివంతులయ్యారు!ఇవన్నీ ఈతర దేశాలలో జరుగుతున్న కధలు - మన దేశంలో మాత్రం మూడువేల యేళ్ళ క్రితం బ్రాహ్మణులు మా తాతల్ని చదువుకోనివ్వకపోవడం వల్లనే ఇవ్వాళ మేము వెనకబడిపోయామని కొందరూ రెండు వందల యేళ్ళ క్రితం ఇంగ్లీషువాళ్ళ అణిచివేత వల్లనే ఇవ్వాళ మేము వెనకబడిపోయామని కొందరూ గతాన్ని తవ్వుకుంటూ నిలబడుతున్నారే తప్ప ఇప్పటికైనా కదిలి రేపటికి తప్పకుండా ముందుకెళ్తాం అనే హుషారుని చూపించలేకపోతున్నారు.
నిన్నటి తరం గొప్పదనాన్ని చెప్పుకోవటంతో సరిపెట్టేస్తూ ఉంటే ఏ తరమూ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు.వెనకబడిన విషయాన్ని ఒప్పుకుని ముందుకు వెళ్ళటానికి తిందరపడాలి.మన దేశంలో తప్ప ప్రపంచం మొత్తం AI చుట్టూ తిరుగుతున్నది.కొందరు భయపెడుతున్నట్టు యంత్రాలు మనిషిని మించిపోయి తిరగబడే ప్రమాదం ఏమీ లేదు.వాళ్ళ పిచ్చి గానీ మనిషి ఇప్పటికే మచ్చిక చేసుకున్న కుక్కగుర్రంఏనుగు లాంటి జంతువులు జీవమూ ఆలోచనా ఉన్నవే కదా - అవే తిరగబడనప్పుడు యంత్రాలు తిరగబడటం ఎట్లా జరుగుతుంది? తిరగబడితే సాటి మనుషులన్న కనికరం కూడా లేకుండా వేలు,లక్షలు, మిలియన్ల సంఖ్యలో నిలువునా హతమార్చి మీసాలు మెలివేసిన చరిత్ర గల సామ్రాజ్యవాద సిద్ధాంతులకి యంత్రాలని అణిచివెయ్యడం ఒక లెక్కా!
అసలు artificial intelligency ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?అయితే Patrick Winston ఇస్తున్న లెక్చరు  వీడియో చూడండి.ఈ వీడియో మొత్తం చూదగలిగితే మంచిదే గానీ ప్రస్తుతం ముఖ్యమైన విషయం 1:16/49:55 నుంచి 6:42/49:55 వరకు ఉంటుంది.అక్కడ చూపిస్తున్నది తొలిదశలో రాసిన ప్రోగ్రాము.ఏం చేస్తున్నది అది?చెప్పింది చెప్పినట్టు చెయ్యడమే కాకుండా ఫలానా పని ఎందుకు చేశావు అంటే కారణం చెబుతున్నది,అదే తను చెయ్యని పనిని గురించి అడిగితే "Did I do it?" అని రెట్టిస్తున్నది - ఎవరిది ఆ ఘనత, ప్రోగ్రామరుది కాదూ!మనవాళ్ళు కూడా మరీ వెనకబడి లేరు లెండి,ఒక సిక్కు కుర్రాడు పాత Farmer-Fox-Goose-Grain పజిలుని తీసుకుని ఎంత సుదీర్ఘమైన సుత్తి వేశాడో చూదండి - ఆఖర్న artificial intelligent program కూడా రాసేశాడు.కొద్దిమంది అత్యద్భుతమైన విజయాల్ని నమోదు చెయ్యడం తప్పిస్తే ప్రపంచ ఆర్ధిక రంగంలో భారతదేశం యొక్క స్థానం చెప్పుకోదగిన స్థాయిలో లేదు.ప్రపంచ వేదిక మీద రాజకీయపరమైన దౌత్యపరమైన అంశాల్లో మన మాట చెల్లుబడి కాకపోవటానికి ప్రపంచ విపణి మీద మనకి పట్టు లేకపోవటమే అతి ముఖ్యమైన కారణం.
ఈ వెనుకబాటుకి ముఖ్యమైన కారణం మన విద్యావ్యవస్థయే!ప్రస్తుతపు విద్యావిధానం మెకాలే నాటి కాలపు మూస పద్ధతిలోనే నడుస్తూ బిళ్ళ బంట్రోతుల్నీ చిన్న గుమాస్తాల్నీ పెద్ద ఉద్యోగుల్నీ తయారు చెయ్యటానికి తప్ప ఇవ్వాళ్తి పరిశ్రమలకి పనికివచ్చే క్రియేటివ్ కుర్రాళ్ళని పుట్టించటానికి పనికిరాదు,నిజమే - అయినప్పుడు దాన్ని మార్చుకోవాలి, మార్చుకుని బాగుపడాలి!ప్రవచనకారులు ఎన్ని నీతులు చెప్పినా, శాస్త్రజ్ఞులు ఎన్ని గొప్ప వస్తువులు కనుక్కున్నా, కళాకారులు ఎంత వినోదాన్ని పంచినా మనిషి తనకు గౌరవప్రదమయిన జీవనోపాధినీ సంతృప్తికరమయిన ఆదాయాన్నీ ఎవరు ఇస్తారో వారికి మాత్రమే అధికారాన్ని కట్టబెడతాడు - వ్యాపారం,ఆధ్యాత్మికం,రాజకీయం వేరు వేరు కాదు.మనుషులు వాటిని విడివిడి అస్తిత్వాలు అని పొరబడుతున్నారు,అంతే!ధనం యొక్క సృష్టికి వ్యాపారమే మూలం.ఉద్యోగులు కూడా తమ శ్రమని యజమానికి అమ్ముతున్నారు నెలవారీగా- అందుకే ఉద్యోగాలు ఇవ్వడానికీ తెచ్చుకోవడానికీ మధ్య జరిగే వ్యవహారాల్ని కలిపి జాబ్ మార్కెట్ ఆనె పదం పుట్టింది.సంపదని సృష్టించే ప్రతి చోటా అమ్మకందారు, వస్తువు, ఖరీదు, కొనుగోలుదారు, లాభం, నష్టం, అనే అంశాలు ఉండి తీరుతాయి. కొన్నిచోట్ల ప్రస్ఫుటంగా కనబడుతూ అన్నిచోట్లా అంత స్పష్టంగా కనిపించని ఏదో సింహంలా అదనపువిలువ కూడా దాక్కుని ఉంటే ఉందవచ్చు ఆర్ధిక శాస్త్రం మొత్తం ఎవరు దేన్ని ఎంతకి అమ్ముతున్నారు, ఎవరు దేన్ని ఎక్కువ కొంటున్నారు అనే దాని చుట్టూ తిరుగుతుంది తప్ప మతాన్నీ కులాన్నీ ప్రాంతాన్నీ చూడదు.కులానికీ మతానికీ ప్రాంతానికీ అంటుకుపోయి భారతీయులు వ్యాపార సంస్కృతికి దూరం కావదం వల్లనే మన రూపాయి బలహీన పడింది.

యంత్రాలకి కొత్త బుద్ధి వస్తుంటే భారతీయులకి ఉన్న బుద్ధి పోయింది - వీళ్ళకన్న యంత్రాలే నయం!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...