Monday, 19 March 2018

తెదెపా పెట్టిన అవిశ్వాసం నెగ్గుతుందా?వీగిపోయి మిత్రులు శత్రువులై యుద్ధం చేస్తారా?

రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో జరిగిన మొదటి ఎన్నికల సంగ్రామం నుంచీ తెలంగాణ ముఖ్యమంత్రి చడీ చప్పుడు లేకుండా ఉండి ఇప్పుడు జాతీయ స్థాయికి ఎదగాలని ఉందని బాంబు పేలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాలుగేళ్ళ పాటు వార్తల్లో నాని తడిసిపోయిన తర్వాత ఇప్పుడు భాజపా కొట్టిన దెబ్బకి తుస్సుమంటుందేమోనన్న దీపావళి టపాసులా కనబడుతున్నాడు!చంద్రబాబు కున్న అనుభవం వల్ల అతను పైచేయి సాధిస్తాడనే కించిత్తు ఆశ ఉన్నప్పటికీ ఎంత అభిమానంతో లెక్కలు వేసినా  అతను మోదీ-షా ద్వయం మొదటి నుంచీ సూచనలు ఇస్తూ కొట్టిన ఇప్పటి దెబ్బకి బిత్తరపోయి ఆత్మరక్షణ కోసమే అవిశ్వాసమనే బలహీనమయిన ఎత్తు వేసినట్టు నాకు అనిపిస్తున్నది.

కుటుంబాల స్థాయిలోనే అప్పటివరకు తియ్యపెట్టకుండా కలిసిపోయి బతికిన అన్నదమ్ములు విడిపోయినప్పుడు వీలయినంత తొందరగా అన్ని లెక్కలూ సరిచూసుకుని రావల్సినవి పట్టుబట్టి వెంటనే సాధించుకునే తెలివి లేక తాత్సారం చేస్తే ఎన్ని సంసారాలు గల్లంతు అయిపోలేదు?ప్రత్యేక హోదా ఒక్కటేనా, గవర్నరు పదవి దగ్గిర్నుంచి ఉమ్మడి  రాష్ట్రపు ప్రభుత్వ శాఖల ఆస్తుల వరకు ఏది నిక్కచ్చిగా తేలిందో చెప్పమనండి!మరి ఒక రాష్ట్రం అనే కుటుంబపెద్దగా ఇంత తాత్సారం చెయ్యడానికి ఉన్న బలమయిన కారణం ఏమిటి?విభజన ప్రక్రియ నాలుగేళ్ల కింద మొదలవడమే తప్ప సాంకేతికంగా విభజన పూర్తి కాలేదన్నది ఎవరికయినా అర్ధమవుతున్నదా?రావలసిన వాటి గురించి కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగడం లేదని అడిగినప్పుడల్లా తెదెపా వాళ్ళు నోరు తెరిస్తే మేము గట్టిగా అడిగితే భాజపా వయ్యస్సార్ కాంగ్రెసు మీదున్న కేసుల్ని తీసేసి మాకు పోటీ పెడదామని చూస్తున్నది,అందుకే భయపడుతున్నాం అంటారు - ఇదొక చెత్త జవాబు!ఇవ్వాళ టీ  షాపుల దగ్గిర కూడా రాజకీయాలు మాట్లాడుకునే పరిస్థితి ఉంది - నిన్నటి వరకు a1,a2 అని పేర్లు పెట్టి ఆస్తులు కూడా జప్తులు చేయిస్తూ సరిగ్గా ఎన్నికల ముందు కేసులు ఎత్తేయించితే అది యెందుకు జరిగిందో చిన్నపిల్లాడు కూడా చెప్పగలడే!అంత సిల్లీ కారణంతో భాజపాకి భయపడటం తెదెపా తెలివితక్కువతనమే.

అవిశ్వాసం ప్రతిపక్షానికి అనుకూలమయితే కేంద్రప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తాయి - అందరూ ఎన్నికల సంరంభంలో ఉన్నా గానీ ఇప్పటికిప్పుడు ఈ రకమయిన పద్ధతిలో వచ్చే ఎన్నికలకి ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ సుముఖం కాదు గాబట్టి వీగిపోవడానికే అవకాశాలు ఎక్కువ.అమిత్ షా "మూడు నెలల్లో పరిస్థితి మనకి అనుకూలం అయ్యాకే అన్నీ ఇద్దాం" అని ధీమాగా చెప్పటాన్ని బట్టి ఈ మూడు నెలల డెడ్లైను ఉద్దేశించిన ఎన్నికల సర్దుబాట్ల బేరసారాల్లో భాజపా పైచేయి సాధించేసింది - 2014లో తమ మీద నమ్మకం లేక తెదెపాకి సంఖ్య తగ్గించడానికి వేసిన చెత్త ఎత్తు ఈసారి వెయ్యకపోవచ్చు.ఈసారి గెలిచే వాళ్ళనే నిలబెట్టి ఆంధ్రలో బలం పెంచుకోవడానికే చూస్తుంది.

నేను ఇక్కడ కూర్చుని పత్రికల్లో వచ్చే స్టేట్మెంటుల్ని బట్టి ఆలోచించడమే తప్ప నాకు ప్రత్యక్ష పరిచయం లేదు గాబట్టి నేను వూహించనిది జరిగే అవకాశం కూడా ఉంది. అవేవీ జరక్కపోతే అవిశ్వాసం వీగిపోతుంది,ఆంధ్రలో సీట్ల సర్దుబాటు భాజపాకి అనుకూలంగా ఉంటుంది,ఆంధ్రకి రావలసినవన్నీ వస్తాయి,ఎలాగూ ఆంధ్రకి ఇవ్వాలసినవి ఇచ్చేశారు గాబట్టిఎన్నికల నాటికి పోట్లాటలు తగ్గుతాయి, ఎన్నికల తర్వాత  తెదెపా,భాజపా ఇప్పటివలెనే మిత్రామిత్ర సంబంధంతో కలిసిపోతారు.

ఆంధ్రా వోటర్లకి నేను ఇచ్చే సలహా యేమిటంటే శాసనసభకి తెదెపాకి ఫుల్ మెజారిటీ ఇవ్వాలి.జనసేన,జగనసేన రెండూ వేస్ట్ క్యాండిడేట్ల నాయకత్వంలో ఉన్నాయి గాబట్టి వోటు వెయ్యడం కూదా దండగే!ఆంధ్రాకి న్యాయం చెయ్యకపోతే పుట్ట గతులుండవని తెలిసేలా భాజపాకి సున్నం పుయ్యాలి!లొక్ సభలో కాంగ్రెసుకి బలం పెంచాలి.భారత జాతీయ కాంగ్రెసుకి మాత్రమే పెంచాలి , వయ్యస్సార్ కాంగ్రెసుకి కాదు.

ఇంకొక చిత్రమైన విషయం కూడా నాకు కనబడుతున్నది.తెలంగాణ భాజపా రెడ్డి ఆంధ్రకి సాయం చేస్తే దేశంలో అంతర్యుద్ధం వస్తుందన్నట్టు మాట్లాడుతున్నాడు.మొదటి నుంచీ భాజపా ఆంధ్రకి సాయం చెయ్యాలని మాకూ ఉంది,కానీ ఇతరుల నుంచి వ్యతిరేకత రావచ్చు అని చెబుతున్నారు.దాన్ని కూడా పూర్తిగా కొట్టెయ్యలేం.జయలలిత బతికున్నప్పుడు బయటపడి అనేసింది కూడా.కర్ణాటక ముఖ్యమంత్రి అనుకుంటాను మొదట కుళ్ళుమోతు స్టేట్మెంటు ఇచ్చి నిలదీస్తే సర్దుకున్నాడు.ఏ సహాయమూ చెయ్యకుండానే అంధ్ర ఇంత ధీమాగా ఉంది ఆ కాస్త సాయమూ చేస్తే ఇంక పట్టలేం అనే ఈర్ష్య ఉన్నదని ఆయా రాష్టాల ప్రాంతీయ మీడియా కబుర్ల వల్ల తెలుస్తున్నది.ఒకవేళ ఇప్పటికి అది అబద్ధమే అనుకున్నా ఇప్పుడు తెదెపా పేట్టిన అవిశ్వాసం వీగిపోయినప్పటికీ దీనికి మద్దతు ఇచ్చిన పార్టీలు తర్వాత ఆ పని చెయ్యలేవు కదా!అందుకే, ఈ విధమైన ఎత్తుగడని తెదెపా,భాజపా కలిసే ప్రయోగిస్తున్నాయని నాకు అనిపిస్తున్నది.

అయితే, ఈ వ్యూహంలో కూడా వీటన్నింటి వల్ల ఒకవేళ చంద్రబాబు పట్ల వ్యతిరేకత పెరిగితే భాజపా దాన్ని ఉపయోగించుకుని బాబు మీద పైచేయి సాధించడానికే చూస్తుంది.అవిశ్వాసం తర్వాత భాజపా ఇతర పార్టీలు ఆంధ్రకు సాయం చెయ్యడాన్ని సమర్ధించాక కూడ ఆంధ్రకి న్యాయం చెయ్యకపోతే బాబుకి జాతీయ రాజకీయాల లోకి వెళ్లడం తప్పనిసరి అవుతుంది.అమాయకత్వంతో ఉంటే భాజపా కూడా దెబ్బ తింటుంది.గోరక్షపురం దెబ్బ చాలదా?ఆంధ్రకి చెయ్యాల్సిన సాయం చెయ్యనంతవరకు ఆంధ్రలో భాజపాకి వోట్లు పడవు. భాజపా ఈసారి బాబుని జాతీయ స్థాయి రాజకీయాల వైపుకి చూడనివ్వదు.కేసీయార్ బాబు నుంచి పోటీ విషయంలో ధీమాగా ఉండొచ్చు.  నిజానికి ఆంధ్రకి చట్టప్రకారం చెయ్యాల్సిన మామూలు పనికి ఇంత నీచమయిన వ్యూహాలు పన్నాల్సిన అవసరం లేదు - కానీ అన్ని పార్టీలలోని నాయకులూ ప్రజల గురించి కాకుండా తమ వ్యక్తిగత వైభవాల కోసం ఆలోచిస్తున్నారు గాబట్టి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఇలాంటి పరిష్కారాలూ అవసరం అవుతున్నాయి.

ఎన్నికల ముందు గానీ ఎన్నికల తర్వాత గానీ,అంటే ఎన్నికలతో సంబంధం లేకుండా మోదీ-షా ద్వయం దూకుడు తగ్గించాలంటే అద్వానీని కదిలించి రామాలయ నిర్మాణం కొసం మళ్ళీ రధయాత్రని మొదలు పెట్టించాలి అన్నది నా వ్యూహం.నా కారణాలు ఏమిటో వచ్చే టపాలో చెబుతాను.దాని గురించి మీరూ ఆలోచించండి.

7 comments:

  1. 1.అద్వానీ కే సీ ఆర్ గారితో కలిసే చాన్స్ ఏదన్నా ఉందా ?
    2. తెలంగాణాలో కే సీ ఆర్ గారు కన్‌ఫర్మ్, జాతీయంగా అద్వానీ, కే సీ ఆర్, ఒవైసీ కాంబినేషన్ సూపర్ !

    ReplyDelete
    Replies
    1. ఆ చాన్స్ వాళ్లు అలా ఆలోచించడాన్ని బట్టి ఉంటుంది.మొన్నటి సబహ్లో అద్వానీని అవమానించహ్డం కేవలం అక్ల్ళు నెత్తికెకిన అహంకారం వల్లనే తప్ప మరో విధంగ అసమర్ధించలేనిది.భాజపా వ్యతిరేకులు కూదానిర్ఘానత్పోయారు!అద్వానీ కూడా రాజకీయవాదియే - సాధువేం కాదు.కేసీయార్ పూనుకుని కదిలిస్తే కదిలే అవకాశం ఉంది.అద్వానీని తిప్పుకుంటే కేసీయార్ కూడా ఉత్త్రాది వారికి దగ్గర కావ్చ్చు.సామాన్యుల అద్గ్గిర రాజకీయ విశ్లషనల కన్న సెంటిమెంటు రగ్లించడం ముఖ్యం - మోదీ పెద్దా చిన్నా చూడకుండా అద్వానీని అవమానిస్తే కేసీయార్ గౌరవించాడు అనే పాయింటు పని చ్సెస్తుంది.కేసీయార్ ఆలోచనలు ఎట్లా ఉన్నాయో?

      Delete
    2. @neehaarika
      జాతీయంగా అద్వానీ, కే సీ ఆర్, ఒవైసీ కాంబినేషన్ సూపర్ !

      hari.S,babu
      మొదట్లో నాకు ఇర్రిటేటింగ్ అనిపించింది ఈ కాంబినేషన్.ముగ్గురూ మూడు పూర్తి విరుద్ధమైన వ్యక్తిత్వాలు గలవాళ్ళు.

      అద్వానీ RSS మనిషి,మోదీ ప్రతినమస్కారం కూడా పెట్టనంత అవమానించాడని మనకు అనిపిస్తున్నా ఆసలు అద్వానీ మనస్సులో ఏముందో మనకి తెలియదు గదా!RSS,BJP మనుషులు పైకి ఎంత అరాచకంగా కనిపీంచినా RSS వారసత్వం అయిన క్రమశిఖణ ఒకటి అఘోరిస్తుంది.అతనూ ఒకప్పుడు ప్రధాని పదవి కోసమే రామజన్మభూమి ఉద్యమం మొదలుపెట్టాడు గాబ్ట్టి అవమానం తొలుస్తూనే ఉంటుంది,అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడని కూడా అనుకోవచ్చు.అవకాశం రానప్పుడు ఒదిగి ఉన్నప్పటికీ అవకాశం వస్తే ఇప్ప్టికీ తన ప్రసంగాలతో ప్రజల్ని రెచ్చగొట్టే శక్తి ఉన్న ప్రతిభాశాలి.
      కేసీయార్ పక్కా రాజకీయవాది.అతనికి హిందూత్వం,తెలంగాన సంస్కృతి,జాతీయాత్ అనేవి ఉపయోగపడుతాయని అనుకుంటేనే నెత్తిన పెట్టుకుంటాడు.భాషలో మోటుతనం,ప్రవర్తనలో దురుసుతనం,ఎత్తుగడల్లో జిత్తులమారితనం ఉన్నవాడు.ఇవన్నీ తిట్లు కావండోయ్,అతనికి ఉన్న ఎస్సెట్లు!
      ఒవైసీ కూడా కేసీయార్ తరహా వ్య్క్తియే.కాక్పోతే కేసీయార్ హిందువు,ఇతను ముస్లిం - అంతే తేడా!

      వాళ్ళల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ ముగురికీ ఒకచోట కలిసే ఉద్దేశం ఉందో లేదో తెలియదు.కానీ నాకు మాత్రం వీళ్ళు ముగ్గురూ కలిసి మొదట రామాలయం సమస్యని పరిష్కరించగలిగ్తే అది వీళ్ళకి శుభారంభం అవుతుంది!

      భాజపా రామాలయం కట్టడం అనేది జర్గని పని.దానికి కారణాలు
      1).అలహాబాదు కోర్టు తీర్పు ద్వారా ఆలయం కట్టడానికి ఆవ్సరమైన భూమిలో కొంత ముస్లిం వక్ఫ్ బోర్డుకి దఖలు పడింది.అది మనం మన ఇంటి స్థలాన్ని హక్కుభుక్తం రిజిస్టరు చేసుకున్నంత నిఖార్సైన వ్యవహారం.
      2).ఆ భూమిని మనం వాళ్ళ దగ్గిర్నుంచి బలం ప్రయోగించి స్వాధీనం చేసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు.
      3).సాధు సంతులూ ఆరెస్సెస్సూ విశ్వ హిందూ పరిషత్తూ భజరంగ దళమూ స్వామి లాంటి కొందరు మూర్ఖపు భాజపా నాయకుల వాదన యేమిటంటే మన ఆలయాన్ని మనం స్వాధీనం చేసుకోవటానికి వాళ్ళని బతిమిలాడటం దేనికి అని.తాతల నాటి భూమి కదా అని తండ్రి అమ్మేసిన భూమిలో మనకి ఏమి హక్కు ఉంటుంది?అలాంటప్పుడు కళినగ్ కేక బ్లాగులో గజపతులు ఆ ప్రాంతం వాళ్ళు కాబట్టి వాళ్ళని ఓడించిన శ్రీకృష్ణదేవరాయల్ని స్పోటకం మచ్చలవాడు అని అంటుంటే నేను వ్యతిరేకించడమూ అనవసరమే అవుతుంది.ఆ దారిలో వెళ్తే చాలా ఎయ్యాలు పైకి లేస్తాయి.
      4).వీళ్ళు నిజంగానే అది సాధ్యపడుతుందని నమ్ముతున్నారో జనాన్ని మోసం చెయ్యడానికి చెబుతున్నారో తెలియదు గానీ భాజపాకి ఫుల్ మెజారిటీ వస్తే ప్రత్యేక చట్టం తెచ్చి చిటికెలో కట్టవచ్చునని చెబుతున్నారు.
      5).అమాయకత్వం వల్ల గానీ మదోన్మత్తత వల్ల గానీ వాళ్ళకి తెలియనిది యేమిటంటే ముస్లిముల సంఖ్యాబలం,ఐకమత్యం గొప్పవి కాబట్టే కేవలం పదేళ్ళలో పాకిస్తాన్ సాధించుకున్నారు.అప్పుడు ఇక్కడే ఉండిపోయినవాళ్ళు ఇప్పుడు మరింత బలపడి ఉన్నారు.వీళ్ళు మొండికి పోయి చట్టం తెస్తే వాళ్ళు మొండికి పోయి మళ్ళీ మోప్లా వూచకోతలూ కలకత్తా భీబత్సాలూ మళ్ళీ రుచి చూపిస్తారు.అవతల ప్రపంచ స్థాయిలోనే ముస్లిముల జనాభా విపరెత స్థాయిలో పెరుగుతున్నది.అప్పటి కన్న ఇప్పుడు మరింత భీబత్సం చలరేగడం ఖాయం!
      6).అసలు వీళ్ళు చేసిన చట్టం కోర్టులో పిటిషన్ వేస్తే వీగిపోతుంది.ఇవ్వళ అయోధ్య లోని ముస్లిములకి దఖలు పడిన భూమి రాజ్యాంగం ఇచ్చిన ఆస్తిహక్కుకి సంబంధించిన వ్యవహారం.దానికి భంగం కలిగించే చట్టం చెల్లదు.

      ఈ కారణాల వల్ల రామాలయం కడుతుందేమోనని నమ్ముతున్న హిందువులు భాజపా గురించి మర్చిపోవడమే మంచిది.

      TO BE CONTINUED

      Delete
    3. CONTINUEING FROM ABOVE
      అద్వానీ ప్రధాని పదవి కోసమే రామాలయం గురించి ఎత్తినా జిన్నాను పొగిడి సొంత మనుషుల చేతనే తిట్టించుక్కున్నా మోదీ నుంచి ంబహిరంగ తిరస్కారం పొందినా సామాన్య హిందువులకి మాత్రం ఒక రకమైన ఆత్మీయత ఉంది అతని పట్ల.హిందువులు తమ రాజకీయపరమైన అస్తిత్వం గురించి ఆలోచించడం అద్వానీ రధయాత్ర వల్లనే మొదలైంది.

      కేసీయార్ గనక ఒవైసీ ద్వారా ముస్లిములని పరిష్కారానికి ఒప్పించి ముస్లిముల నుంచి భూమిని హిందువులకి అప్పగించేటట్లు చెయ్యగలిగితే అతను జాతీయస్థాయిలో తొలి అడుగులోనే ఒక అద్భుతం చేసినట్టు అవుతుంది.కేసీయార్ మొదట అద్వానీని కలిసి సమస్యని పరిష్కరించడానికి హిందువుల ప్రతింధిగా నిలబెట్టాలి.ఒవైసీకి చెప్పాల్సినది ఒకటే.ఎంతకాలం పాతబస్తీని పొదుగుతూ కూర్చున్నా అతనికి ఎదుగూ బొదుగూ ఉండదు.దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన అహడావిడి చేస్తున్నాడు గానీ అతని మెయిన్ లేబుల్ "హైదరాబాదు పాతబస్తీ సాయిబు!" అనే కదా.అదే అయోధ్య సమస్యని పరిష్కరించడంలో కేసీయారుకి హెల్ప్ చేస్తే తను ఒక మెట్టు ఎదగవచ్చు!ఇప్పటి వరకు తను ఉన్న రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి పక్కతాళం వేస్తూ గడుపుతున్నవాడు తనే అధికార పీఠానికి ఎక్కవచ్చు.

      ఇప్పుడు కేవలం ముస్లిముల వోట్ల మీద ఆధారపడినవాడు అప్పుడు హిందువూ వోట్లని కూడా ఆశించవచ్చు!కేసీయార్ లాంటి మాటలమాంత్రికుడికి అటు అద్వానీని ఇటు ఒవైసీని ఒప్పించదం పెద్ద్ద కష్టం కాదు,కానీ కేసీయారుకి ఈ ఆలోచన రావాలి కదా.లేదంటే,ఎవరైనా నా ఆలోచనని చేరవెయ్యాలి.

      కాగల కార్యం తీర్చే గందర్వులు ఎవరో?ఎక్కడ ఉన్నారో!

      Delete
  2. ఈ వయసులో అద్వానీ గారు యాత్రలు చేయగలరా? తాత గారి కంటే యోగీ ఆదిత్యనాథ్ నయం అనుకుంటా. మొన్నటి ఉప ఎన్నికలలో కాస్త నెత్తికి బొప్పి కట్టినా ఆయన ఇమేజీ బ్రహ్మాండం. మోడీ తరువాత ఆయనే అంటూ ప్రచారం ఇప్పటికే మొదలయ్యింది.

    ReplyDelete
  3. కొంతమందికి ఈ ఒవైసీ obsession ఎందుకు?

    ReplyDelete
    Replies
    1. కొందరికి రామాలయం అబ్సెషన్!
      కొందరికి హేతువాదం అబ్సెషన్!
      ఉదీ అంతే!
      మడిసన్నాక అబ్సెషనంటూ లేపోతే ఎట్టాగండీ!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...