Monday, 18 May 2015

పనిలేక బ్లాగు యెందుకు మూతపడింది?అందులో నా ప్రమేయం యెంత!నేను దొంగనాయకమ్మ బ్లాగులో కామెంట్లు వెయ్యడం తప్పా?!

హఠాత్తుగా వరూధిని బ్లాగులో మే 13న ఒక బాంబు పేలింది - నేటితో "పనిలేక" బ్లాగు మూతపడింది అనే కామేంటుతో!నిజంగా ఇది సంచలనమే,యెందుకంటే కొత్తగా తెలుగు బ్లాగుల్లో కడుగుపెట్టినవాళ్లకి తెలియదు గానీ పాతకాపు లందరికీ బాగా తెలిసిన బ్లాగే అది!రొజుకోసారయినా ఆ బ్లాగుని తొంగి చూడకుండా ఉండలేరు, అక్కడి విషయానికి తగ్గట్టు కామెంటు వెయ్యకుండానూ ఉండలేరు!నేనయితే ఆగ్రిగేటరు వరకూ వెళ్ళడం యెందుకని నా ఆడ్మిన్ అక్కౌంటులోనే ప్రతిరోజూ చూడడానికి వెలుగా ఫ్యావరేట్ బ్లాగుల లిస్టులో యెప్పుడో చేర్చేశాను.

అసలు ఇవ్వాళ తెలుగు చదవాలని యెంతమంది అనుకుంటున్నారు?భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే నినాదంతో విడిపోయిన తొలి రాష్ట్రం తెలుగుని రాష్త్రంలో అధికార భాషగాచేసుకోలేకపోయింది, పైగా తర్వాత విడిపోయిన రాష్ట్రాలు త్వరపడి వారి వారి రాష్ట్రాలలో అధికార భాషలుగా తమ తమ  మాతృభాషల్ని చేసుకోవదం చూశాక గూడా సిగ్గుతోనయినా తొందరపడలేదు మనం, యెందుకని?మాతృభాష అధికార భాషగా లేనిది కేవలం మనకేనా, ఇంకా యే దిక్కుమాలిన రాష్ట్రాలైనా మనకి తోడు ఉన్నాయా!ఇప్పుడీ గొల యెందుకంటే మామ్మూలుగానే భాష మీద ఇంత నిరాదరణ ఉండగా పనిగట్టుకుని ఆగ్రిగేటరు అవసరమైన తెలుగు బ్లాగుల్ని యెంతమంది చూస్తున్నారు - ప్రమాదవశాత్తూ రావడమే తప్ప తెలిసి వచ్చిన వాళ్ళెంతమంది?

నా బ్లాగులో నేనెప్పుడూ నా వ్యక్తిగత విషయాలు ఇంతవరకూ రాయలేదు,భవిష్యత్తులో మరోరకంగా రాయాలనే ఉద్దేశం ఉంది గానీ ఇట్లా రూలు మార్చవలసి వస్తుందని అనుకోలేదు.అనుకోనివి జరగడమే కదా జీవితం!దాదాపు మనకొచ్చే కష్టాలన్నీ అనుకోకుండానే వస్తాయి,ముందే తెలిస్తే తప్పుకునేవాణ్ణి గదా అనిపించేటట్టు వస్తాయి!కానీ యెవరో అన్నట్టు,"మనం పడే తిప్పలకి చాలామటుకూ మనకున్న వ్యామోహాలతోనూ భయాలతోనూ మనం చేసే తప్పులే కారణం" అనేది తెలుసుకోగలిగీతే వ్యామోహాల్నీ భయాల్నీ జయించి తప్పులు చెయ్యకుండా తిప్పలు పడకుండా బతకొచ్చు.ఇవ్వాళ నేను పడుతున్న కష్టాల్లో పదిశాతం గురించి చెప్పినా చాలామంది తట్టుకోలేరు, అయినా నేనెట్లా చిదానందమూర్తిలాగా సీరియస్ పోష్టుల్ని గూడా బోరు కొట్టనివ్వకుండా రాయగలుగుతున్నాను అంటే నేను గతంలో చేసిన తప్పులకీ నేనిప్పుడు పడుతున్న తిప్పలకీ లింకు ఉందని తెలుసు గాబట్టి, నా కష్టాలకి యెవణ్ణో బ్లేం చేసి నా ఇగోని సాటిస్ఫై చేసుకునే అవలక్షణాలు గానీ చిన్న చిన్న కుక్కజట్టీలకి హృదయం బద్దలు చేసుకుని కిందామీదా పడి మూర్చరోగాలు తెచ్చుకునే బలహీన మనస్తత్వం గానీ లేదు గాబట్టి!అట్లాగే నాకు సంబంధం లేని విషయాల్ని పనిగట్టుకుని మనసుకి పట్టించుకుని ఆక్రోశపడి మనశ్శాంతిని కోల్పోను, మనంతట మనమెందుకు మన జుట్టు యెదటివాళ్ళ చేతికిచ్చి తీరా వాళ్ళు మన జుట్టుకి రిబ్బన్లు కట్టాక అదుగో వాడు నన్ను అవమానించాడని యేవటం?

రమణ గారు చేసిందీ అదే!తన పాటికి తను బ్లాగులో యే విషయమైనా రాసుకునే స్వేచ్చ ఆయనకి ఉన్నది నిజమె!కానీ అవి కేవలం తన కంప్యూటరు ముందు కూర్చుని తను మాత్రం చదువుకుని పులకించిపోవడానికి రాయడం లేదు గదా?పబ్లిష్ చేసిన ప్రతి పోష్టూ ఆగ్రిగేటరు ద్వారా అందరికీ కనబడుతున్నప్పుడు ఆ పోష్టు చదివిన వాళ్ళలో అది కలిగించే ప్రభావాన్ని కూడా తెలుసుకోవాలి గదా, తెలియకపోవడానికి ఆయన నిరక్షరకుక్షి కాదుగా!చదివినవాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు, ఆ పోష్టు తమకి ఇబ్బందికరంగా ఉంటే యే మాత్రమూ సంకోచించరు - అది మానవనైజం!తమ చేతల వల్ల యెదటివాళ్ళకి ఇబ్బంది కలిగీతే యెవరయినా సహజంగా యేమి చేస్తారు?యందుకు యెదటివాళ్ళు ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని తన పోష్టుల్లో ఆ ఇబ్బందికరమైన విషయాల్ని సృశించకుండా నిగ్రహంగా ఉంటారు,అవునా కాదా!లేదు నేనిలాగే రాస్తాను అంటే యెదటివాళ్ళ ఇబ్బందిని అసలు పట్టించుకోవాల్సిన పనిలేదు కదా!మరో మార్గం అంటూ ఉంటే అది దొడ్డిదారి మాత్రమే, ఆ దారినే యెంచుకున్నారు ఆయన , కామెంట్లు బందు జేస్తున్నానని ప్రకటించారు 2014 అక్టోబరులో అనుకుంటాను.అది కూడా మళ్ళీ వరూధిని బ్లాగులోనే చూశాబు.ఆ పోష్టు బహుశా వరూధిని బ్లాగరు ఆ సంగతి గురించి సరదాగా రాసిన వాటిలో రెండవది అనుకుంటాను,యెందుకంటే అదే విషయంతో మరొక పాత పోష్టు గూడా చూశాను ఆ బ్లాగులోనే!

యేమయితేనేం అక్కడి సరదా కామెంట్లని చూసి నేనూ కొంచెం క్యామెడీగా ఒక కామెంటు వేశాను - - అప్పుడూ ఇప్పుడూ కూడా చెప్తే యెవరూ నమ్మరు గానీ కొంచెం రెచ్చగొట్టి అయినా రమణ గారు మళ్ళీ కామెంట్లు ఓపెన్ చేసేటట్టు చూడాలనేది నా వుద్దేశం. అయితే పుణ్యానికి పోతే పాప యెదురయినట్టు ఆయన కామెంట్లకి తలుపులు తెరిచారు గానీ నన్ను మాత్రం అపార్ధం చేసేసుకున్నారు!ఆయన రెస్పాన్సు చూసి కంగారు పడి అక్కడే ఒక కామెంటు వేశాను,అయినా డ్యామేజీ జరిగిపోయింది,చెయ్యగలిగినది వేడికోలు మాత్రమే గదా?నా మట్టుకు నాకు మిగతావాళ్ళతో ఆయన యెన్ని తలనొప్పులు పడ్డారో తెలియదు గానీ, నేనెప్పుడూ ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు కామెంట్ల ద్వారా!ఒకోసారి ఆయన గూడా మీరు వాడిన మాటలే బాగున్నాయి వాటితో పోష్టుని అప్డేట్ చేస్తున్నానని గూడా అన్నారు, చేశారు గూడా - చేప్పాను గదా దేన్నీ అతిగా తలకెక్కించుకోనని!

నా సమస్య అంతా నా సొంత గొదవ మాత్రమె కదా,ఆ బ్లాగులో ఈ బ్లాగులో వెళ్లబోసుకుని ప్రయోజనమేమిటి?అక్కడికీ వరూధిని బ్లాగులోనే ఒకసారి చిన్నగా నసిగీతే "ఆగండి ఆగండి" అంటూ వారించడం జరిగింది,నేను కూడా అప్పటికి ఆగిపోయాను. ఆగక చేసేదేమిటి - అప్పటికే "డాక్తరు గారికి నమస్కారం" అంటూ మొదలుపెట్టి వినయంగా నావైపునుంచి నేను చెప్పుకోవలసిన ముఖ్యమయిన విషయాలన్నీ నివేదించుకున్నాను.ఆ కామెంటు కనబడకపోయినా "అది పబ్లిష్ చెయ్యడం వల్ల యేమి వొరుగుతుంది నాకు, చదివే ఉంటారు యెటూ తర్వాతి కామెంట్లు వేస్తారు గదా" అని సరిపెట్టుకుని తర్వాతి పోష్టులోని విషయం నన్ను బాగా కదిలించి ఒక మంచి కామెంటు వేసి అది పబ్లిష్ కాకపోవడం వల్ల ఆయన నా పేరుతో వచ్చిన కామేంట్లేవీ కనీసం హరిబాబు యేమైనా వివరణ ఇస్తున్నాడేమో చూద్దాం అనే అనుమానం కూడా తెచ్చుకోకుండా తొలగించివేస్తున్నారని అర్ధమైపోయింది గదా!

ఈలోపు "నా బ్లాగులో నా ఇష్తమొచ్చినట్టు నేను రాస్తాను,చదివడం వరకే తప్ప విమర్శించే అధికారం యెవరికీ లేదు,ప్రశంసల్ని మాత్రమే ప్రచురిస్తాను" అనే ఆయన ధోరణికి వ్యతిరేకంగా దొంగనాయకమ్మ బ్లాగుని కొందరు తెరవడం జరిగింది,నేను అక్కడ దీని గురించే కాదు మిగతావాట్ని గుఇంచి కూడా కామెంట్లు వేశాను.నాకు నేను పెట్టుకున్న రూలు - విషయాన్ని గురించి విమర్శించదమూ,ధోరణిలో ఉన్న లోపాన్ని యెత్తి చూపించడం తప్ప వ్యక్తిగతంగా నేను యేనాడూ యెవర్నీ విమర్శించకూడదనే దానికి కట్టుబడే ఉన్నాను!దొంగనాయకమ్మ బ్లాగు వుద్దేశం కూదా వ్యతిరేకించదగినంత క్రూరంగా యేమీ లేదు!నా పోస్టుల్లో సరదాగా జగదేక వీరుని కధ సినిమా గురించి రాసిన భాగాల్ని మెలితిప్పి రాముడు సీతని వొదిలెయ్యటానికి లింకు కలుపుతూ వాడకూడని చోట వాడటం చూశాను.నా మామూలు పధ్ధతిలోనే ప్రతిస్పందించాను గూడా, ఆ అధికారం అందరికీ ఉండటం ప్రజాస్వామ్యానికి యేమి చెరుపు చేస్తుందో మరి?

ఈ మధ్యనే "కళింగ కేక" అనే బ్లాగుని చూశాను.అక్క కేక బలంగా వెయ్యాలనుకుంటున్నారా?నెమ్మదిగా వెయ్యాలనుకుంటున్నారా? అనే ఆప్షన్లని చూసి ఆవేశపడిపోయి టాప్ లెవెలు కేకకే బటన్ నొక్కాను!తీరా కొంచెం వివరంగా చూస్తే ఆయన ఒకపోష్టులో కృష్ణదేవరాయల స్పోకం మచ్చల మొహాన్నీ తక్కువకాలం బతకడాన్నీ అదోరకమయిన విధంగా ప్రస్తావించటం చూసి కంగుతిన్నాను? ఆయన కళింగ గజపతులతో మమేకమై వాళ్ళని ఓడించిన దుర్మార్గుడు గనక కృష్ణదేవరాయల్ని మేమెందుకు పొగడాలి అంటున్నాడు?కృష్ణదేవరాయలకి స్పోకం మచ్చలు ఉందటం వాస్తవమే గానీ పెద్దనని "పెద్దిరాజు" అనటంలో ఆయన యేమి చెప్పదల్చుకున్నాడో మీకు తెలుస్తూనే ఉంది గదా!చూశాక నేను వూరుకోను గదా!"యేమిటిది?గజపతులంతా అందగాళ్లేనా?వాళ్లలో ఉన్న అవకరాల్ని వెతికి ఒక పోస్టు నేనూ వెయ్యగలను,చరిత్రలో సొంతపైత్యాలు జోడించకండి,రాయలైనా గజపతులైనా చేసింది ఒకటే - అందరూ ఒక తానులో ముక్కలే.ఇవ్వాళ మనం ఉన్న సువిశాల భారతదేశం గురించి వాళ్లలో యెవరూ వూహించను గూడా వూహించలేదు.వాళ్ళ అధికారాన్ని తమప్రాంతంలో బలంగా వుంచుకోవడం కొత్తప్రాంతాలకి విస్తరించడం తప్ప?ఇప్పటి కాలంలో బతుకుతూ అప్పటి వాట్ని తవ్వి తలకెత్తుకోవదం ఈ రాజు మాప్రాంతం వాడు గనక పొగుడుతాం అతన్ని ఓడించిన రాజుని తిడతాం అనటం అనవసరం కదా!" అని కామెంటు వేసాను.షరా మామూలే కామెంటు పలేదు.కొంతకాలానికి ఆ బ్లాగరు కళింగరాష్ట్రసాధనాపితామహుడు కూడా కావొచ్చు,ఆలోచించుకోండి?!

ఒక విషయాన్ని చూసీ చూడగానే అందులో యేదయినా తమకి నచ్చనిది ఉంటే స్పందించకుండా ఉంటే యేమి జరుగుతుంది?యెవరూ ప్రతిస్పందించలేదు గాబట్టి ఒకనాటికి అది న్యాయమైన వాదనగా మారుతుంది!ఉదాహరణకి తెలంగాణా వాదుల పైత్యకారి వాదనలు చాలామటుకు సరయిన సమయంలో స్పందించాల్సిన వాళ్ళు స్పందించి సరయిన జవాబులు చెప్పి ఉంటే యెట్లా ఉండేది?ఇక్కడ బ్లాగుల్లో జరిగిన వాదనల ప్రకారం చూసినా అవి చాలామటుకు ఆధారం లేనివే - ముఖ్యంగా ఆంద్రోళ్ళ దోపిడీ అనేది!కాబట్టి యేవడేమి రాసినా వ్యతిరేకించకుండా ఉండిపోవటమే ప్రమాదకరం - ఆ బ్లాగరు వ్యతిరేకించడానికి అవకాశం ఇవ్వకపోతే ఆ అవకాశాన్ని సృష్టించుకుని అయినా వ్యతిరేకించి తీరాల్సిందే!


అసందర్భం వచనం బృహస్పతిరపి బ్రువన్ విద్వజ్జన మవామానం లభతే!

Thursday, 14 May 2015

విన్నారా?విన్నారా?ఈ వింతను విన్నారా?దేముడి దయవల్లనె ఇంగిలీజులరాజ్య మొచ్చెనంట!

          ఇదివర్లో గంధం వాసనేస్తూ ఉండే ఒక సబ్బుకి సాంప్రదాయబధ్ధమైన నురుగు అని వచ్చేది ప్రకటనల్లో?ఇప్పుడు బూతు వెబ్సైట్లని వర్గీకరించిన చిహ్నం లాంటి పేరుతో ఉన్న ఒక సబ్బుకి కూడా సంస్కారవంతమైన సబ్బు అని టముకేస్తున్నారు!సాంప్రదాయం,సంస్కారం అనే మాటల్ని ప్రతిదానికీ తగిలిస్తే యేమవుతుంది?అవి కూడా తొందర్లోనే బూతుమాటలైపోతాయి!కళ్ళముందు ఒక ఆడది తనకింకా ఆయుష్షు ఉన్నా బలవంతంగా మొగుడి చితిమీద తను కూడా తగలబడిపోవటం అన్యాయమని చెప్పటానికి కామన్ సెన్సు చాలదా!అయినా అంత నిష్ఠగా వాట్ని అంతకాలం యెందుకు కొనసాగించారు?ఒక మనిషి పట్టుదలగా దాన్ని ఆపాలని నిలబడితే అతన్ని ఆజీవ పర్యంతం యే వాదనతో వ్యతిరేకించారు?అది దుష్టమైనది అని తెలిసినా సాంప్రదాయం - పెద్దలు యెందుకు చెప్పారో చెప్పారు,పెద్దలు చూపిన దారిలో నడవటం అనే వాదనతోనే కదా!

          ఒక జాతికి తన ప్రాచీన సాంప్రదాయాల పట్ల వ్యామోహం ఉండటం ఒక వ్యక్తికి తన బాల్యం పట్ల ఉండే వ్యామోహానికీ సంబంధం ఉంటుందని యెంతమందికి తెలుసు?మనం చిన్నప్పుడు నెమిలి కన్నుని పుస్తకాల మధ్యన దాచి అది పిల్లల్ని పెడుతుందని యెదురు చూసి నిరాశపడటం ఇవ్వాళ మనకి నవ్వొచ్చినా అప్పుడు యెంత గంభీరంగా ఆ పని చేశామో గుర్తు వస్తే యెట్లా ఉంటుంది?ఆఖరికి ఆ సంస్కర్తలు యేమి చేశారు?జాతి చరిత్రని తవ్వి తీసారు, ఒకనాడు విదేశీ దంయాత్రలలో ముష్కరుల నుంచి యెదురవుతున్న తమ స్త్రీల మానహరణ ప్రయత్నాల్ని నిరోధించడానికి ఆ సాంప్రదాయం పాటించారనీ ఆ చారిత్రక పరిస్థితులు ఇవ్వాళ లేవు గాబట్టి మనం దాన్ని ఇప్పుడు కూడా కొనసాగించనక్కర లేదని నయాన వినేవాళ్ళకి తార్కికంగా ఋజువు చేసి దానినొక ఆర్జనమార్గంగా మార్చుకుని మొండిగా సంస్కరణని వ్యతిరేకిస్తూ భయాన లొంగేవాళ్ళని అప్పటి ప్రభుత్వాలతో శాసనాలు చేయించి శిక్షిస్తే గానీ ఆ దురాచారం యొక్క ప్రభావాన్ని తగ్గించలేకపోయారు, ఒక జాతి చరిత్ర ఆజాతి సామూహిక బాల్యం వంటిది!

          అలాంటి చరిత్రని అబధ్ధాలతో నిర్మిస్తే యెట్లా?చరిత్ర అబధ్దం చెప్తే యెట్లా?అద్దం మోసం చేస్తే యెట్లా?మన తప్పుల్ని సవరించుకునే అవకాశం కల్పించే చరిత్రని కూడా రాగద్వేషాలతో కలుషితం చేస్తే యెట్లా?ఒక జాతి ఒక తరంలో యెన్ని భిన్నమైన పోకడలు పోయినా అది మరో తరానికి తన ముందరి తరం నుంచి అందుకున్న వారసత్వపు సంస్కృతీ విశేషాన్ని పదిలంగా అందిస్తే ఆ జాతి గమనం యేకోన్ముఖంగా సాగుతున్నట్టు లెఖ్ఖ!అట్లా కాకుండా ఒక తరం యొక్క ప్రవర్తన ఒకరికి ఒక రకంగా మరొకరికి మరో రకంగా అర్ధమయితే అక్కడ ఖచ్చితంగా పులుముడు ప్రవేశించిందన్నమాటే గదా?ప్రతి వర్గమూ ఆ తరాన్ని అర్ధం చేసుకోవడానికి ముందుగానే మనం ఈ విధమయిన అర్ధాన్నే లాగాలి అనే వ్యూహంతోనే చరిత్ర నిర్మాణానికి పూనుకున్నారని అర్ధం అవుతుంది గదా!జరిగిన సంఘటనల్ని మార్చడం లేదు, కానీ విశ్లేషణలు మారుతున్నాయి - యేకం సత్ విప్రాని బహుధా వదంతి అనే విభిన్నత పట్ల సహనశీలాన్ని పెంచే మాటని భవిష్యత్తుని యేకోన్ముఖంగా  తీర్చిదిద్దుకోవటానికి పనికివచ్చే చరిత్రకి అంటగట్టవచ్చునా?

         పాఠ్యపుస్తకాల్లోకి యెక్కించి తప్పనిసరిగా తెలుగు చదవటం వచ్చిన ప్రతివాడికీ పరిచయం చేస్తే చదివిన ప్రతివాడూ తలలూపి మెచ్చుకున్న "దేశమును ప్రేమించుమన్నా" అనే మంచి భావాలతో నిండిన గీతం రాసిన కవి గొప్ప దేశభక్తుడనుకుంటాం.కానీ ఆ వ్యక్తి భారతదేశానికి ఇంగ్లీషువాళ్ళ పరిపాలన మరికొంతకాలం అవసరమనే అభిప్రాయంతో వుండేవాడనీ మీదుమిక్కిలి ఇంగ్లీషువాళ్ళ పట్ల కొంచెం కఠినమైన పదాల్ని అప్పటి స్వాతంత్ర్యవీరులు వాడీతేనే వాళ్ళని వ్యతిరేకించేవాడనీ యెంతమందికి తెలుసు?"నతులగుచున్ మహోన్నతి దనర్చుచు నవ్యగుణోక్తిచే గుణోన్నతి బ్రకటించుచుం బరజన ప్రియ కార్యసమర్ధతన్ సముచిత నిజకార్య సంగ్రహము నిష్ఠురవాదులన్ క్షమాధృతి నిరసించుచుం బరగు ధీరులు పుణ్యులు గారె యేరికిన్" అనే విధంగా బతికి "ఒకవంకన్ పదివేల కంఠములతో హుంకారముల్ సల్పి సాంఘికశార్దూలము చప్పరించుటకు లంఘించన్ రవంతేని జంకక దీక్షారధమున్ మరల్పక కళాక్షత్రము రూపించు ధార్మిక వేదండుని ఉక్కుగుండెలు మహాంధ్రీ నీకు ఆదర్శమౌ గాక!" అంటూ కవులు కీర్తించిన కందికూరి వీరేశలింగం కన్నా ఇతనికే నవయుగ వైతాళికుడిగా పేరు రావడం వెనక ఇవ్వాళ్టి కంచె ఐలయ్య లాంటివాళ్లకి "బ్రాహ్మణవాదం" పిలకని అందించిన కోవర్టు పని చేసినందుకేనని నేనంటే మీకు విడ్డూరంగా ఉండవచ్చు.కళ్ళు మూసుకుపోయిన హిందూ మత చాందసత్వంతో పరమ సజ్జనుడైన వ్యక్తికి కూడా దుర్మార్గం అంటగడుతున్నానని మీరు అపార్ధం చేసుకునే అవకాశం కూడా వుంది!

Lives of moderates all remind us
We should wisely keep from crime
Open sedition only finds us
Shelter in a far off clime
Let us then line up and speaking
Speaking at a furious rate
Not always some benefit seeking
Learn to be loyal and to wait.

          ఈ కవి పై కవితలో చెప్పిన హితోక్తిని అప్పటివాళ్ళు పాటించి ఉంటే ఇప్పటికీ మనం యే తిరుగుబాట్లూ చెయ్యకుండా సంస్కారవంతమైన ఇంగ్లీషువాళ్ళ పరిపాలనలోనే ఉండేవాళ్ళ మనుకుంటాను. యెటూ క్రైస్తవం ప్రజాస్వామ్యబధ్ధమైన మతమే కాబట్టి ఐలయ్య లాంటివారికి కూడా ఆమోదయోగ్యంగానే ఉండి ఉండేదేమో!గురజాడ అప్పారావు బతికిన కాలం క్రీ.శ1862 నుంచి క్రీ.శ1915 వరకు,అంటే ఇంగ్లీషువాళ్ళు పరమదుర్మార్గులు అని గ్రహించి వాళ్ళ కబంధహస్తాల నుంచి భారతమాతని విముక్తం చెయ్యాలని సామాన్యులు కూడా ప్రాణాలకి తెగించి పోరాడుతున్న రోజుల్లో వారికి పూర్తి విరుధ్ధమైన అభిప్రాయాలతో ఉన్నాడితను?స్వాతంత్ర్య సమరవీరులు అబధ్ధం చెప్తున్నారా?నవయుగ వైతాళికుడు అబధ్దం చెప్తున్నాడా?ఒక తరం వెనకటి చరిత్ర తిరగేస్తేనే అప్పటి సమకాలికుల్లోనే ఇంత పరస్పర విరుధ్ధమైన అభిప్రాయాలు ఉంటే ఇంకా వెనక్కి వెళ్ళి తాతతాతల నాటి కధల్ని తవ్వితీస్తే ఇంకెంత గందరగోళం బయటపడుతుందో?కురుక్షేత్రం సినిమాలో శకుని వేషం కట్టిన నాగభూషణం మాదిరి ఉభయతారకంగా "ఇదియునూ సూనృతమే అదియునూ సూనృతమే" అనేసి తప్పుకుందామా!

          గురజాడ అప్పారావు కాలానికి మరొక శతాబ్దం వెనక్కి వెళ్తే క్రీ.శ1780 నుంచి క్రీ.శ1835 వరకూ చెన్నపట్నం సుప్రీం కోర్టులో ఇంటర్ప్రిటర్ పని చేసి క్రీ.శ1836లో సన్యసించి యోగసాధనతో తనువు చాలించిన యేనుగుల వీరాస్వామయ్య గారు కూడా తన యాత్రాస్మృతిగ్రంధం "కాశీయాత్ర చరిత్ర"లో ఆంగ్లేయులను చాలా మర్యాదగా ప్రస్తుతించారు.ఇందులో బ్రహ్మణులు శూద్రజాతిని మిక్కిలీ తక్కువ పరచి అవమానించుట ఇతర మతములు వృధ్ధిబొందుటకు హేతువైనదనిన్నీ,పెద్దలు పామరజనులను కడతేర్చవలెనని బింబారాధనను విధించితే భగవంతునికి హేయములైన వికారపు ఉపచారములను లోకులు చేయసాగినందుననున్ను బ్రాహ్మణులు మేము శ్రేష్ఠులమని ఇతరవర్ణాలను ధిక్కరించడము వల్లనున్ను,వీరి దురాచారముల వల్లనున్ను వీరియెడల భగవంతునికి కటాక్షము తప్పినందున సత్యము అహింస మొదలగు సుగుణసంపత్తులు గల ఇంగ్లీషువారు హిందూదేశము యేలేటట్టు వారు దేవుని కృపకు పాత్రులైనారనిన్ని చెప్పబడినది. ఇందులో యీశ్వరుడు పరులకు యీ హిందూదేశమును స్వాధీనపరచినందుకు కారణ మేమంటే అందరున్ను అహింస సత్యము మొదలైన సద్గుణాలతోనే నటిస్తే తన చిద్విలాసానకు వ్యతిరిక్తమని యెంచి ఇచ్చటి వారికి కామక్రోధాదులను వృధ్ధిబొందించి తద్వారా బ్రాహ్మణుల గుండా ఇచ్చటి క్షత్ర జాతిని బొత్తిగా నశింపజేసి వెనక బ్రాహ్మణులకు గర్వభంగము కొరకు తురకలను కొన్నాళ్ళు వృధ్ధిపరచి మళ్ళీ కరుణతో సాత్వికులైన యింగిలీషువారికి యీ దేశాధికారమును యిచ్చినాడని చెప్పియున్నది.

          మరి క్రీ.శ1825 న పుట్టి క్రీ.శ1917 వరకూ జీవించి భారతీయులందరికీ "గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా" పేరుతో పరిచయమైన దాదాభాయ్ నౌరోజీ అయితే నిర్ద్వందంగా సంవత్సరాల వారీగా గణాంకాలతో సహా "Further development was checked by the frequent invasions of India by, and the subsequent continuous rule of, foreigners of entirely different character and genius, who, not having any sympathy with the indigenous literature— on the contrary, having much fanatical antipathy to the religion of the Hindus – prevented its further growth. Priest-hood, first for power and afterwards from ignorance, completed the mischief, as has happened in all other countries" అని తేల్చి చెప్పాడు,అయినా యేందుకీ ఆంగ్లేయులు మంచివాళ్ళు క్రైస్తవం మంచి మతం అనే ముసుగు సిధ్ధాంతాలు మళ్ళీ మళ్ళీ ప్రచారంలోకి తెస్తున్నారు కొందరు వ్యక్తులు?ఈయన క్రీ.శ1892లో బ్రిటిష్ పార్లమెంటుకి యెన్నికై తాను క్రైస్తవుడు కాదు గనక బైబిలు మీద ప్రమాణం చెయ్యడానికి నిరాకరించి "Khordeh Avesta" మీద భగవంతుని పేర ప్రమాణం చేసి సభలో అడుగు పెట్టిన స్వాభిమానం గల భారతీయుడు!

          ఆర్ధిక శాస్త్రంలో అఖండమైన పరిజ్ఞానం కలిగిన నౌరోజీ మహాశయుడు ఆంగ్లేయులు భారత దేశాన్ని యెలా పీల్చిపిప్పి చేశారో సోదాహరణంగా నిరూపించాడు.అక్క 6 అంశాలు ఉన్నాయి:మొదటిది భారతదేశం విదేశీయుల చేత పరిపాలించబడుతున్నది,రెండవది ఇతర్లని ఇక్కడికి వచ్చి సంపద పెంచేటందుకు ఆహ్వానించి పెట్టుబడుల్ని ఆకర్షించే స్థితిలో లేకపోవటం అంటే సర్వసత్తాక సార్వభౌమ ప్రభుత్వం లేకపోవటం,మూడవది బ్రిటిష్ ప్రబుత్వాధికారుల్నీ వారి అవసరార్ధపు సైన్యాన్నీ పోషించాల్సి రావటం,నాల్గవది ఇంటా బయటా సామ్రాజ్య విస్తరణ భారాన్ని మొయ్యటం,ఐదవది విదేశీయులకి అధిక జీతభత్యాలు దొరికే విధంగా స్వేచ్చావాణిజ్యానికి తలుపులు తెరవటం,ఆఖరుదైన ఆరవది ముఖ్యమైన ఆదాయాన్ని పెంచే వర్గాలు విదేశీయులు కావదం వల్ల తమ కొనుగోళ్లని దేశం బయట చెయ్యటం గానీ లేదా తమ ఆదాయాల్ని దేశం బయట దాచటం - కరుణామయుని బోధనల్ని నిత్యమూ జపిస్తూ ఐలయ్యగారు పొగుడుతున్న ప్రజాస్యామ్యబధ్ధమైన మతాన్ని అనుసరించే వాళ్ళు ఈ దేశాన్ని అంత భయంకరంగా దోచుకున్నారు!ఒక అతి పెద్ద స్పాంజిని గంగా నదిలో ముంచి ఆ నీటినంతా ఒడిసిపట్టి ధేంసు నదిలో పిండినంత క్రూరమైన దోపిడీ అది!ఇప్పటికీ మన పాఠ్యపుస్తకాల్లో గొప్పగా చెప్తూ ఉండే రైళ్ళను వేయించడం లాంటివాటి బండారం కూడా అప్పుడే బయటపెట్టాడు - మన దేశపు ఆదాయంతోనే నిర్మించారు,మన దేశపు జనం అటూ ఇటూ తిరగడానికి ఉపయోగపడినాయి,కానీ ఆ డబ్బంతా ఇక్క నిలవలేదు గదా?

          యేనుగుల వీరాసామయ్య గారంటే సత్తెకాలం వాడని సరిపెట్టుకోవచ్చు గానీ గురజాడ కాలానికి స్పష్టంగా తెలిసిపోయింది గాబట్టి అతన్ని మాత్రం అనుమానించాల్సిందే!వీరాసామయ్య గారు చేసింది కోర్టు కాగితాలని తర్జుమా చెయ్యటం - ప్రజలతో రోజువారీ సంబంధం లేని ఉద్యోగం.కీలకమైన ఉద్యోగం కావడం వల్లనూ ఆయన అనువాదంలో మంచి ప్రతిభ గలవాడవటం వల్లనూ ఆర్జన కూడా యెక్కువే ఉండి ఉంటుంది!ఆ ఉద్యోగంలో ఉండటం వల్ల వీలునామాలకి సంబంధించిన భయంకరమైన విషయాలు యెక్కువగా తెలియడం వల్లనే వైరాగ్యం మీదకి మనసు మళ్ళిందని చెప్పడం వల్ల అతనికి ఇంగ్లీషువాళ్ల వల్ల బాగా లాభపడి అట్లా సమర్ధించాడనే విధంగా డబ్బాశని అంటగట్టలేము.దేశాటనలో తనకి కనబడిన విషయాల పట్ల తనకు కలిగిన సందేహాలకి  తనకు తోచిన జవాబులు చెప్పుకోవడం వరకే పరిమితమై పోయాడు గనక అందులోని కొన్నింటిలో శాస్త్రీయత ఉండదు,నిజమే!కానీ క్రైస్తవం మహమ్మదీయం వంటి ఇతర మతాల్ని గురించి కూడా మంచిగానే మాట్లాడాడు గనక హిందూమతోన్మాది అని మాత్రం అనలేము!కానీ గురజాడ అప్పారావు తన కన్యాశుల్కం నాటకంలో బ్రాహ్మణుల్ని వెక్కిరించే కుళ్ళుజోకుల్ని తీసేస్తే గొప్పగా చెప్పడానికి యేం ఉంది?ఆడపిల్లల్ని అమ్ముకోవడం గురించి రాసిన వ్యాసాల్లో గూడా అమ్మకాలు కొనుగోళ్ల లెక్కలు చెప్పడం తప్ప శాస్త్రీయమైన విశ్లేషణ యేదైనా చేశాడా?

          సాంప్రదాయం చెప్పే పితృకర్మల పట్ల వ్యామూహాలూ ఆస్తిపాస్తుల మీద వచ్చిపడే వార్సత్వపు హక్కుల్నీ పట్టించుకోకపోయినా ఒక వయసు రాగానే లైంగికావసరాల కోసమైనా ఖచ్చితంగా స్త్రీ పురుషుల కలయిక అవసరమే!అయితే అన్ని మతాల్లోనూ ఆ కలయిక వివాహ విధి ద్వారానే జరగాలనే నియమం ఉంది కాబట్టి పెళ్ళి తప్పనిసరి - ఇప్పటికీ సహజీవనం అనేది కొద్దికాలానికే తప్ప ఆజీవపర్యంతమూ అట్లా ఉండటం కుదరటం లేదు,అవునా?ఆ పెళ్ళి సమయంలో మొదట "కన్యాం కనక సంపన్నాం" అని సంతోషంగా ఇచ్చేది వరశుల్కమైతే ప్రతివారూ మగపిల్లల కోసమే ఆత్రపడి ఆడపిల్లల్ని నష్టం కింద చూడటంతో ఒకానొక కాలంలో ఆడ-మగ పిల్లల మధ్య ఉండాల్సిన లైంగిక నిష్పత్తి లెక్కల ప్రకారం ఆడపిల్లలకి కరువు రావడం వల్ల ఉనికిలోకొచ్చిన ప్రత్యేకమైన వ్యవహారం "కన్యాశుల్కం" అనేది.దీనికి సంబంధించిన చారిత్రక విశ్లేషణ అతని సాహిత్యమంతా వెతికినా మీకెక్కడయినా కనిపిస్తుందా?పెళ్ళి సమయంలో దబ్బు మార్పిడి "ఓలి","కట్నం" లాంటి రూపాల్లో అన్ని కులాల్లోనూ ఉంది కదా!డబ్బాశతో అన్ని కులాల వాళ్ళూ చేసే చెత్తపన్లకి బ్రాహ్మణుల్ని మాత్రమే కారకుల్ని చెయ్యడం దేనికి?గురజాడ కావాలని చెయ్యకపోవచ్చు - పాత్రల్ని సహజంగా వుంచటం కోసం తను బ్రాహ్మణుడు కాబట్టి తనకి బాగా తెలిసిన వాతావరణాన్ని వాడుకుని ఉండవచ్చు!కానీ అసలు వైతాళికుడు వీరేశలింగాన్ని వదిలేసి గురజాని పరిధికి మించి ఆకాశాని కెత్తిన వాళ్ళు మాత్రం తేనెటీగ పువ్వుల మీదా పోతుటీగ శ్లేష్మం మీదా వాలటం సహజమేనని నిరూపించుకున్నారు.

         భారతదేశపు చరిత్రలోని సంక్లిష్టతల్ని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంటే ఒకోసారి సినేమా కధల్లోని ఆకురౌడీల మధ్యన జరిగే క్యామిడీ ఫైట్లను బోలిన కుక్కజట్టీలు కూడా చాలా గంభీరంగా సిధ్ధాంత ప్రాతిపదికన జరగటం చూస్తే నాకప్పుడప్పుడూ పొట్టచెక్కలయ్యేలా నవ్వు కూడా వస్తూ ఉంటుంది!ఇవ్వాళ పరస్పరం ఘూర్ణిల్లుతున్న "హిందూ జాతీయ వాదం" మరియూ "బ్రాహ్మణ వ్యతిరేక వాదం/దళిద వాదం" అనే రెండు శాఖలూ మొదట్లో ఒబ్బిడిగా కలిసిపోయి ఈ దేశం మీద జమిలిగా పెత్తనం చేసెయ్యాలని కలలు గని అది కుదరకపొయ్యేసరికి తెగదెంపులు చేసుకున్న పాతస్నేహితులు ఒకళ్ళ మీదకి ఒకళ్ళు విసురుకున్న పేడముద్ద్దలు తెలుసా?వ్యాపారం కోసం ఈ దేశానికి వచ్చి ఇక్కడున్న పరిస్థితుల వల్ల మిగతా దేశాల్లో మాదిరిగా కాకుండా పై స్థాయిలోని రాజుల్ని మచ్చిక చేసుకోవడం ద్వారా రాజకీయాధికారం చేజిక్కించుకున్నారు,ఆ తర్వాత సాంస్కృతిక ఆధిపత్యం కూడా బ్రాహ్మణుల్ని మచ్చిక చేసుకుంటే చాలు పనైపోతుందనుకున్నారు - కానీ ఆ ప్లాను బెడిసికొట్టింది!మొదట్లో మతప్రచారానికి ఇక్కడి కొచ్చిన వాళ్ళలో గుండు గీసుకుని కాషాయం కట్టి పేరు మార్చుకుని బైబిలే అసలైన వేదం అని ప్రచారం చెయ్యబోయిన వాళ్ళూ ఉన్నారు,మాక్సు ముల్లరు మహాశయుడు సంస్కృతం నేర్చుకున్నది కూడా మన దేశపు సంస్కృతి మీద ప్రేమతో కాదు మన దేశాన్ని క్రైస్తవీకరించడానికి కావలసిన దారులు వెతికేటందుకు మిగతావాళ్ళకి సహాయం చెయ్యడానికే!

          హిందూ రాజుల మరియూ ముస్లిము నవాబుల రాజ్యాలు పూర్తిగా ఇంగ్లీషు వాళ్ళకి దఖలు పడినా లేక పరస్పరాంగీకారంతో రాజుల పరంగా నడపబడినా ఆ ప్రాంతపు కలక్టర్లే నిజమైన అధికారం చెలాయించేవాళ్ళు.ఆలయాల మీద ఆదాయం కూడా వచ్చేది కాబట్టి ఆలయాల నిర్వహణ విషయాల్లో ఉదారంగానే ఉండేవాళ్ళ్ళు - ఆలయానికి యెంత యెక్కువ ఆదాయమొస్తే వాళ్ళకి అంత యెక్కువ వాటా వస్తుంటే మూర్ఖంగా యెవడు అడ్డుకుంటాడు?తిరుమల లాంటి ప్రముఖ ఆలయాల నిర్వహణ చరిత్ర చూస్తే ఈ సత్యం బోధపడుతుంది.తమ ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా సహనంగా ఉన్నందుకే యేనుగుల వీరాస్వామయ్య గారు అలా పొగిడింది!అయితే పోను పోనూ ఈ హిందూ దేవాలయాలు కలక్టర్ల చేత అట్లా ఆదరించబడుతున్నంత కాలం తమ చర్చిలకి పాప్యులారిటీ మరియూ ఆదాయమూ రాదని తెలుసుకున్న క్రైస్తవ మతప్రచారకులు రివర్స్ గేరులో ఒక ద్విముఖవ్యూహాన్ని పన్నారు - మొదటిది అధికారంలో ఉన్న తమవాళ్ళని హిందూమతాన్ని యెక్కువగా ఆదరించవద్దని ఒత్త్తిడి తీసుకురావటం,రెండవది తమ మామూలు పధ్ధతైన కష్టాల్లో ఉన్నవాళ్ళ మీద ప్రార్ధనలు,పాపక్షమాపణలు,మారుమనస్సు,దేవుని రాజ్యం,శిలువ మహిమ లాంటివాటితో బెదరగొట్టి వూదరగొట్టటం.మొదటి దానివల్ల బ్రాహ్మణులకీ వాళ్ళ ప్రభావంతో వున్న రాజులూ జమీందారులకి ఆంగ్లేయులతో దోస్తీ తెగెపోయి పోయిన ప్రాభవాన్ని తెచ్చుకోవడానికి అప్పటి బ్రాహ్మణుల్లో తెలివైనవాళ్ళు జాతీయవాదం అనేదాన్ని కనిపెట్టి ఇంగ్లీషువాళ్లని దేశంనుంచి వెళ్ళగొట్టెయ్యాలనే ఆవేశం తెచ్చుకుని ద్వితీయ స్వాతంత్ర్యభారతసమరానికి సిధ్ధమయ్యారు.రెండవదానినుంచి కింది కులాలకి బ్రాహ్మణులే మీ కష్టాలన్నిటికీ కారణం అనే ప్రచారంతో కిందికులాల వాళ్లని హిందూసమాజం నుంచి విడగొట్ట్గలిగారు ఇంగ్లీషువాళ్ళు!ఇరువర్గాలూ ప్రజలకి తమ అతితెలివి పులుముడు సిధ్ధాంతాల్ని ప్రచారం చేసి నమ్మించి వాటిని తమ ప్రాభవాల్ని నిలబెట్టుకోవటం కోసమే ప్రయత్నించారు,యెందుకంటే ప్రజలకి నిజంగా ఉపయోగపడే విషయం ఈ రెండు వాదనల్లో దేనికీ లేదు!వాళ్ళ లక్ష్యం ప్రాభవాల కోసం పాకులాడ్డం గనక తాము క్షేమంగా ఉండాల్సిన అవసరం యెక్కువగా ఉంది కాబట్టే మోకంగాంధీ యొక్క దిక్కుమాలిన అహింసాయుత పోరాటం రెండు వర్గాలకీ అంత గొప్పగా నచ్చింది!ఇందులో రెండువైపులా పదునైన కత్తికున్న సులువుంది, అది యే వర్గం వాళ్ళు గెల్చినా ఒకరంటే ఒకరికి తీవ్రమయిన ద్వేషం లేకపోవడం వల్ల ఓడిపోయిన వర్గం నుంచి అందులోకి దూకేసి ప్రాభవాన్ని నిలబెట్టుకోవచ్చు!ఇవ్వాళ్టి పార్టీ ఫిరాయింపుల వెనక ఉన్నదీ వీరందరిలో ఉన్న ఇలాంటి యేకోన్ముఖమైన సంస్కృతీ ప్రభావమే!

          నేను కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?! (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ) అనే పోష్టులో "అంత పిరికిగా  వ్యతిరేకత వచ్చిన రెండేళ్లలోనే అదిరి పడి పారిపోయిన వాళ్ళు, అదీ ఈ దేశజనభాలో 5% మించని వాళ్ళూ అన్నేళ్ళ పాటు అంత మొండిగా అన్ని దుర్మార్గాలు యెట్లా చెయ్యగలిగారు?పైస్థాయిలో వున్న మనుజేశ్వరాధములు అరాచకం పేరుతో హడావుడి చేసి పోలీసుల్నీ సైన్యాన్నీ ఇంగ్లీషువాళ్ళ పేరు మీద పంపిస్తే ఈ బానిసాధముడి నట్టువాంగం మేజువాణీ గాళ్ళు ఆ పోలీసుల్ని ఇంగ్లీషు వాళ్ళ దౌష్ట్యానికి చిహ్నంగా చూపించి డబుల్ గేము యేదయినా అడారా?" అని ఒక చిన్న అనుమానం వ్యక్తం చేశాను.అక్కడ నాకొచ్చిన అనుమానానికి ఇక్కడ జవాబు దొరికింది - ఆంగ్లేయుల్ని దుర్మార్గులుగా చిత్రీకరించిన ఆ పులుముడు జాతీయత ఆంగ్లేయులతో స్నేహంగా ఉన్నప్పటి ప్రాభవాన్ని తిరిగి తెచ్చుకోవడానికి పై స్థాయిలో ఉన్నవాళ్ళు అప్పుడే నిద్రలేచినట్టు నటించి చూపించిన నాటకం!

          ఇవ్వాళ తను క్రైస్తవంలో చేరి ఐలయ్య గారు యెవరి నయితే పొగుడుతున్నాడో వాళ్ళు అనాగరికులు అని విమర్శించినది తమ పూర్వీకులనేననేది చరిత్ర సరిగ్గా చదివితే అర్ధం అవుతుంది యెంతటి పామరుడికైనా,ఆయన కెందుకు అర్ధం కాలేదో?ఆయన యేమి చదివి యే ప్రభావంతో ఆ సూత్రీకరణలు చేస్తున్నాడో గానీ చరిత్రనీ మతాలనీ రాగద్వేషాల కతీతంగా అధ్యయనం చేసిన వాడెవ్వడూ ఆయుధాలు ధరించడం వల్ల హిందూ దేవతలు అప్రజాస్వామికమైనవాళ్లనీ బుధ్ధుడూ జీసస్సూ మానవులుగా పుట్టి వాళ్ళ సొంత ప్రతిభతోనే ప్రపంచ దైవాలుగా యెదిగారనే సూత్రీకరణలు చెయ్యడు!ఆయుధం హింసకే గుర్తయితే ఘనత వహించిన తమ ఆధ్యాత్మిక సామ్రాజ్య ప్రభువులైన అమెరికా దొరతనం  వారు అణ్వస్త్రాల మీద అధిపత్యాన్ని సడలనివ్వకుండా యెందుకు దృఢంగా నిలబెట్టుకుంటున్నారో చెప్పగలడా?శిలువ అనే చిహ్నమూ జీసస్ అనే దైవపుత్రుడూ పూజలందుకుంటున్న విషయం తెలిశాక గూడా క్రైస్తవం విగ్రహారాధనకి దూరంగా ఉందని యే ముఖం పెట్టుకుని అనగలుగుతున్నాడు!క్రైస్తవం లాగ కరుణ గురించి చెప్తూ పైగన్లనీ యూదుల్నీ అంత కిరాతకంగా అణిచివేసే హిపోక్రసీ హైందవధర్మంలో లేదు,ఆయుధం ఇక్కడ దుష్టశిక్షణకి గుర్తు!క్రైస్తవుడైన హిట్లర్ నాలుగు కోట్లమంది యూదుల్ని చర్చి అనుమతితోనే హతమార్చాడని ఐలయ్యకి తెలుసా తెలియదా?యూదులకి ఒక మతం ఉందని యెంతమందికి తెలుసు?దాన్ని అణిచేస్తే తప్ప క్రైస్తవం యెదగదని హిట్లర్ అనే నరహంతకుడికి నిధులిచ్చి క్రైస్తవ మత రక్షకుడని బిరుదు లిచ్చి గాలికొట్టి వొదిలిన మతంలో ప్రజాస్వామ్య స్వభావం కనిపించిందా ఈ ప్రబుధ్ధుడికి?యెన్ని సర్వసత్తాక సార్వభుమత్వం గలిగిన స్వతంత్ర దేశాల్నీ బ్రిటన్ మరియూ అమెరికా ఆక్రమించి వారి సంస్కృతుల్ని శిధిలం చేసి చెలరేగిపోతే ఆ విశ్వవ్యాప్తత వచ్చిందో తెలియని దెవరికి?కొత్తరకం కమ్యునిష్టు సామ్రాజ్యవాదాన్న్ని పాటిస్తున్న చైనా దేశమూ జాత్యహంకారంతో మూర్ఖంగా ప్రవర్తించి అణువిధ్వంసం చెలరేగడానికి కారణమైన జపాను దేశమూ తమిళులకి కనీసం ఓటుహక్కు కూడా ఇవ్వకుండా అంతులేని అత్యాచార పరంపరతో నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించి తీరా దాన్ని యెదుర్కోవడానికి పులిలాంటి ప్రభాకరన్ విరుచుకుపడ్గా ప్రపంచదేశాల్లో ముఖరక్షణ కోసం అతనినే విలన్ అని ప్రచారం చేసిన సిగ్గులేని శ్రీలంకా పరమ ప్రశాంతమైన భౌధ్ధమతాన్ని అనుసరిస్తూనే ఆ పాపకర్మలు చేశాయి గదా - ఇంకా అవి ప్రజాస్వామ్యబధ్ధమైనవేనని వాదిస్తే "వాళ్ళు మొదట కమ్యునిష్టుల కోసం వచ్చారు,నేను కమ్యునిష్టుని కాదు కాబట్టి మాట్లాడలేదు.తర్వాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు,నేను యూదును కాదు కాబట్టి మాట్లాలేదు.తర్వాత వాళ్ళు కార్మికనాయకుల కోసం వచ్చారు,నేను కార్మికనాయకుణ్ణి కాదు కాబట్టి మాట్లాడలేదు.తర్వాత వాళ్ళు కాధలిక్కుల కోసం వచ్చారు,నేను కాధలిక్కును కాదు కాబట్టి మాట్లాడలేదు.చివరకు వాళ్ళు నాకోసం వచ్చారు,అప్పటికి మాట్లాడేందుకు యెవరూ మిగిలిలేరు?" అని అంతా అయిపోయాక ఆక్రోశించిన మార్టిన్ నీమోలర్ మాదిరిగానే అఘోరించాల్సి వస్తుంది ఒకనాటికి!

          పాయింట్లవారీగా "ప్రపంచ మానవాళి ముందు మూడురకాల దేవుళ్ళ ఆలోచన,ఆచరన అరళులు ఉన్నాయి.{1} ఆబ్స్ట్రాక్ట్ దేవుడు, {2} మానవులుగా పుట్టి ప్రవక్తలుగా మారి క్రమంగా పరపంచదేవుళ్ళుగా మారిన వ్యక్తులు, {3} ఊహాజనిత మానవాకార దేవతలు" అని చాలా గొప్పగా వర్గీకరించానని మురిసిపోతున్నాడు.కానీ తన మతమయిన క్రైస్తవంతో సహా అన్ని మతాల్లోనూ అంతర్భాగంగా ఈ మూడురకాల ఆలోచనా ధోరణులూ వున్నాయని కొంచెం బుర్రపెట్టి ఆలోచిస్తే ఈజీగా తెల్సుకోవచ్చు,ఆయనగారు తిన్నగా ఆలోచిస్తే గదా?క్రైస్తవంలోనే యెహోవా - ఆబ్స్త్రాక్ట్ దేవుడు,జీసస్ ప్రవక్త,గాబ్రియేలు - దైవదూత అనే మూడు అంశాలూ ఉన్నాయి కదా!బౌధ్ధంలోనూ తధాగతుడు లేక బోధిసత్త్వుడు - ఆబ్స్ట్రాక్ట్ దైవం,గౌతమ బుధ్ధుడు - ప్రవక్త,మారుడూ అతని కుమార్తెలు - వూహాజనిత మానవాకార దేవతలు అనే మూడు అంశాలు ఉన్నాయి కదా?యెక్కడ ముస్లిము మతాన్ని ప్రస్తావించినా ఇవ్వాళ పూర్తి స్థాయి మతంగా వెలుగొందుతున్నదనే విషయాన్ని గుర్తించకుండా, నేడు ప్రపంచాన్ని ప్రభావితం చేసే మతాల్లో అది కూడా ఓకటని ఒప్పుకోకుండా క్రైస్తవం నుంచి పుట్టిన శాఖగా మాత్రమే చూస్తూ అవమానించటం ప్రజాస్వామ్యయుతమైన మతాన్ని పాటిస్తున్నానని డప్పు కొట్టుకుంటున్న ఇతనికే చెల్లింది?మరి గౌతమబుధ్ధుడు తాను కొత్తమతాన్ని స్థాపించటానికి ముందు ఒక క్షత్రియ హిందువు కాబట్టి బౌధ్ధం కూడా హిందూ మతంలోని శాఖ అని మనమంటే మాత్రం ఒప్పుకోడు, యెందుకనో?ఇంతవరకూ యే హిందూ మేధావీ ఇతను కక్కినంత విషాన్ని ముస్లిము మతం మీద కక్కలేదు - అదీ హిందువుల ఔన్నత్యం!

          ఒకోసారి మనం యెదటివాళ్ళకి మంచిదౌతుందని చేసిన పని అవతలివాడు తనకి ద్రోహం చెయ్యడానికే మనం ఆ పని చేశామని అపార్ధం చేసుకోవచ్చు - పుణ్యానికి పోతే పాపం యెదురైందన్నట్టు!ఒకోసారి యెదటివాడు ఖచ్చితంగా మనకి ద్రోహం చెయ్యాలనే ఉద్దేశంతొనే చేసినా మనకి వూహించని వైభవాన్ని తీసుకురావచ్చు - అంతా మనమంచికే అన్నట్టు?ఆ మధ్యయుగాల నాటి రాజ్యాలతో కాలం యెన్ని యుగాలు గడిచినా దేశంలో యేకత్వం యేర్పడకపోయేది - ఇంగ్లీషు వాళ్ళమీద పోరాడిన వాళ్ళు కూడా తమ రాజ్యపు సరిహద్దుల లోపల తమ పెత్తనం జరక్కపోవటం వల్ల ఇంగ్లీషువాళ్ళ మీద అలగడమే తప్ప విశాల భారతదేశం గురించి ఆలోచించి ఆ యుధ్ధాలు చెయ్యలేదు.పూర్వకాలంలో మౌర్యులూ గుప్తులూ కూడా చెయ్యలేనిది ఇంగ్లీషు వాళ్ళు దేశం మొత్తాన్ని బ్రిటిష్ ఇండియాగా మార్చడంతో సాధ్యపడింది! క్రైస్తవ మిషనరీలు తమ మతానికి వూపు తెచ్చుకోవడానికి పైస్థాయిలో అప్రతిహతంగా సాగిపోతున్న బ్రాహ్మణ-క్రైస్తవ వర్గాల మైత్రిని తెగగొట్టితే అది భారతీయులలో జాతీయత రగుల్కొనడానికి దారితీసి సుదీర్ఘకాలపు పరాధీనతని వదిలించుకోవడానికి సహాయపడింది.తీరా దేశం పరాధీనతని వదిలించుకుని ప్రజలంతా ఒక్కతాటిమీద ప్రగతి కోసం పరుగులు పెట్టాల్సిన వేళ క్రైస్తవ మిషనరీలు బ్రాహ్మణుల సాయంతో వ్యాపించలేకపోవడంతో కిందికులాల్లో వ్యాపించడానికి పుట్టించిన బ్రాహ్మణ వ్యతిరేకత కులస్పృహని పెంచి జనం మానసికంగా విడిపోవటానికి కారణమైంది.యే ఒక్క క్షణంలో నైనా  మనముందు వేనవేల దారులున్నా సారూప్యవిభేదాలన్నిటినీ చూసుకుని ఆలోచిస్తే ఒకసారికి ఒకదారిలోనే వెళ్ళగలం గనక యేదో ఒక్కదారినే యెన్నుకోవాల్సి ఉంటుంది.ఒక ప్రాంతంలో ఒక తరంలో అనేక రకాలైన భావాలు గల వ్యక్తులు ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలోని అత్యధికులు దేన్ని పాటిస్తారో అదే ఆ సమాజపు సంస్కృతీ లక్షణం అవుతుంది - పదుగురాడు మాట పాడియై ధర జెల్లు నన్నట్టు!ఆ పాతకాలం శ్శ్రోత్రియ బ్రాహ్మణుదైన యేనుగుల వీరాస్వామాయ్య గారికున్న వివేకం కూడా లేకపోయిందేమిటి ఈ నూత్నకాలం సామాజిక శాస్త్రవేత్త అయిన కంచె ఐలయ్య గారికి?

         ప్రతి మతంలోనూ తాము చెప్పిన వాట్ని హేతువు కోసం వెదక్కుండా నమ్మితీరాలనీ అలా నమ్మకపోతే మతం నుంచి బహిష్కరిస్తామనే బెదిరింపులతో కూడిన పెత్తందారీ ధోరణి ఉండగా తన కిష్టమైన కొన్ని మతాలని ప్రజాస్వామికమైనవని పొగడుతూ తనకిష్టం లేని మతాల్ని చిన్నబుచ్చుతూ తీర్పులు తీర్చే ఈ అహంభావికి తన మతగ్రంధంలోనే యేనాడో ఒక వ్యక్తి గడ్డిపెట్టాడు, బహుశా బైబిలు కూడా పూర్వాపరాలు సరిచూసుకుంటూ చదివే అలవాటు లేకపోవటం వల్ల తెలిసి ఉండదు:

ఇతరులను నేరముల గురించి తీర్పును లిఖించు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవును నేరస్థుడవేనని తీర్పు తీర్చుకొనుచున్నావు.ఏలయనగా తీర్పు తీర్చుచున్న నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు గనక.అట్టి కార్యములను చేయువారిమీద దేవుని తీర్పు శుధ్ధసత్యము ననుసరించి బయల్పడునని తెలిసికొనుము.అట్టి కార్యములు చేయుచున్నవారికి తీర్పు  నిచ్చుచు వాటినే చేయు నీవు దేవుని తీర్పు తప్పించుకొనగలనని అనుకొందువా?

నీ కాఠిన్యమును, మార్పు పొందని హృదయముననుసరించి ఉగ్రత దినమునందు  - అనగా దేవుని న్యాయమైన తీర్పు బయల్పరచబడు దినమునందు - నీకు నీవే భయంకరమైన శిక్షను విధించుకొనుచున్నావు.నీవు మందుగా ఊహించలేని ఆ దినము నీ జీవితమునందే ఏ క్షనము నందైనను తటస్థించవచ్చును.

ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము నిచ్చును.సత్ క్రియను శ్రధ్ధతో చేయుచు,మహిమను,ఘనతను,అక్షయతను వెదుకువానికి నిత్యజీవమును దయచేయును.సత్యమునకు లోబడక దుర్నీతి ననుసరించువాని మీదికి దేవునిఉగ్రత తప్పక వచ్చును.పరమపితకు పక్షపాతము లేద్.ఆయనను మోసగించుట నీకు శక్యము కాదు.                                                               
 రోమా 2:1-11
JUDGE NOT OTHERS,JUDGE YOURSELF!

Tuesday, 12 May 2015

సందేహం లేదు,ఈ తరం మహానటి నిత్యా మీనన్!

          నటనంటే యేమిటి?మనకు కలగని అనుభూతుల్ని కలిగినట్టు భ్రమింపజెయ్యడం!జీవితంలో యెవరూ యెప్పుడూ నటించరా?అప్పుడప్పుడూ మనమూ నటిస్తూనే ఉంటాం - మనకి నచ్చనివాళ్ళతో తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే నవ్వుతూనే మాట్లాడతాం కదా!అయితే స్టేజి మీదనో తెర మీదనో నటించేవాళ్ళని అంతమంది యెందుకు అభిమానిస్తారు?జీవితంలో నటించడం మోసగించడం అని తెలుసు గనక అతిగా చెయ్యలేం,అవునా?అదే కళ్ళముందు ఒక వ్యక్తి మరో వ్యక్తికి సంబంధించిన అతి సున్నితమైన ఉద్వేగాల్ని సైతం అవి తనకే యెదురవుతున్నాయేమోనని భ్రమింపజేస్తుంటే కొద్దిసేపయినా నిజంగా ఆ అనుభూతులన్నీ ఆ వ్యక్తి సొంత అనుభూతులని నమ్మేసి ఆ మాయలోంచి బయటపడ్డాక ఆ ప్రతిభకి చప్పట్లు కొట్టాలనిపిస్తుంది! ఒకప్పుడు నాటకరంగంలో వేమూరి గగ్గయ్య అనే నటుడు హిరణ్యకశిపుడి వేషం వేసి వికటాట్టహాసాలు చేస్తుంటే చూసే ప్రేక్షకులకి భయం పుట్టేదట.

        నిన్నటి తరం తమిళనటుడు శివాజీ గణేశన్ పరాశక్తి అనే సినిమాతో మొదలెట్టి తను నటించే ప్రతి దృశ్యంలో యెంతమంది ఉన్నా అందులో యెవరు యెంత గొప్పగా నటించినా సరే వాళ్ళందర్నీ నస్మరంతిగాళ్లని చేసే విధంగా చెలరేగిపోయి అప్పటి నుంచీ ఇప్పటివరకూ చూసిన ప్రతివాళ్ళనీ ఒక్కలాగే స్పందింపజేస్తున్నాడు కదా!అతనిది అతినటన అంటారు గానీ అవే పాత్రల్ని అవే సంభాషణల్ని మితనటనతో మెప్పించగలిగిన మరో నటుడు యెవరయినా ఉన్నారా?అక్కడ నటనకి సంబంధించిన రెండో భాగం ఉందని తెలియాలి, ఆ ఉద్వేగాల్ని తను అనుభవిస్తున్నాని నమ్మించటమే గాదు చూసేవాళ్ళలోనూ కలిగించే లక్షణం అది!
          ఉరుమి సినిమా ఆర్టిస్టుల లిస్టులోనూ అలా మొదలైంది సినిమా గురించిన కబుర్లలోనూ నిత్యా మీనన్ మంచి నటి,చాలా బాగా చేసింది అంటుంటే ఓహో అనుకోవడమే తప్ప ఇప్పటివరకూ నిత్యామీనన్ సినిమా ఒక్కటి గూడా చూడలేదు,కానీ మొన్న "మా" చానెల్లో "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" చూశాక ఒక అద్భుతాన్ని చూసినట్టనిపించింది! ఆ సినిమాకి సంబంధించిన వార్తల్లో డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నట్టు గుర్తు,ముస్లిం అమ్మాయి పట్టి పట్టి మాట్లాడిన ఎఫెక్టుతో అధ్భుతంగా చేసింది!డైలాగులదేముంది శ్రమపడితే యెవరయినా బాగానే చెప్పొచ్చు గానీ బురఖాలోంచి గోల్డు మెదల్సు లాంటి రెండు కళ్ళు మాత్రమే కనిపిస్తున్న దృశ్యాల్లో గూడా బురఖా వెనకాల ఆ అమ్మాయి పెదాలు అల్లరిగా విచ్చుకుంటూ నవ్వుతున్నాయని తెలిసేట్టుగా కళ్ళతోనే చూపించడం అంటే అది యెంత గొప్ప నటనో కదా!అలా కళ్ళతో నటించగలిగే నటిని అభినేత్రి అంటారు - వుదాహరణకి సావిత్రి.
        వయస్సుతో సంబంధం లేకుండా ఆడామగా యెవరయినా సరే సినిమా అనేది తెరమీద కనబడే బొమ్మలని తెలిసినా యేడుపు సీన్లలో యెప్పుడో ఒకప్పుడు కనీసం ఒక కన్నీటి చుక్కయినా రాల్చే ఉంటారు!నాకింత వరకూ అలాంటి ఫీలింగ్ యెప్పుడూ రాలేదు గానీ "నాన్నకి దూరంగా ఉండి సుఖపడొచ్చు గానీ నాన్నని దూరం చేసుకుని సుఖపడలేను" అనే దృశ్యంలో మాత్రం చాలా బరువుగా ఫీలయ్యాను.నాకు నదిరా అనే అమ్మాయి అప్పుడు ఇరుక్కుపోయి ఉన్న దౌర్భాగ్యం కనబడింది - ఆ తండ్రి చావకుండా యే పక్కగదిలోనో ఉండి ఉంటే తనే మూర్ఖత్వాన్ని వొదిలించుకుని కధని సుఖాంతం చేసేవాడనిపించింది!ఏరొబిక్స్ లాంటి హిస్ట్రియానిక్స్ యేమీలేవు - 100%లవ్ లో నాగచితన్య క్లైమాక్సులో అట్లా అంతసేపు ఆపకుండా అరుస్తుంటే నాకు యెడుపు రాకపోగా క్యామెడీ సీను చూసినట్టనిపించింది - కూర్చున్న చోటు నుంచి కదలకుండా మామూలుగా మాట్లాడుతున్నట్టే యెంత సులువుగా చూసేవాళ్ళకి ఆ దుఃఖాన్ని చూపించింది!

          ఇవ్వాళ తెలుగు సినిమా పరిశ్రమ తక్కువ పెట్టుబడితో తీసే మంచి సినిమాలు యెక్కువగా హిట్టవుతూ ఉంటే హీరోల చంకల్లో మట్టి దులుపటానికి పనికొస్తూ వాళ్ళకి మార్కెట్టును పెంచే పంచ్ దయలాగుల మోత సినిమాలు యెవడూ చూడడు కాబట్టి "హ్హహ్హహ్హ అసలు హీరోని నా డెన్నుకే రానివ్వను గదా నన్ను ఇంకెట్లా చంపుతాడు నువ్వు నన్నిక తప్పించుకోలేవులే హీరోయిన్నూ" అని యెదవ ప్లాన్లేసి హీరోకి అడ్డంగా దొరికి చచ్చే సదరు సినేమా విలన్ల మాదిరిగానే ఆడించటానికి ధియేటర్లు దొరక్కుండా చేసే ముఠా ఒకటి పని చేస్తుందని తెలిసింది! అది అందరికీ తెలిసి పేర్లతో సహా అడ్డంగా దొరికిపోయాక ఇప్పుడు గుమ్మడికాయల దొంగలేమో భుజాలు తడుముకుంటున్నారు.ఆలీసెంగా సీన్లోకడుగుపెట్టిన సినేమా పోలీసుల్లాగే మిగతావాళ్ళు కొందరు "ఇంకానా ఇకపై సాగదు ఆ దురంతం" అని డయలాగులు దంచుతున్నారు. ఆ వూపు యెన్నాళ్ళుంటుందో తెలియదు గానీ మరి ఈ సినిమా దుర్మార్గుల నుంచి యెలా తప్పించుకుందో తప్పించుకుని మొత్తానికి క్రియేటివ్ కమర్షియల్స్ వారికి ఓ మంచి హిట్టు కొట్టింది!
        ఈ పాలిటిక్స్ పక్కన పెడితే అన్ని అవాంతరాల్ని దాటుకుని రిలీజయ్యి హిట్టయిన చిన్న మంచి సినిమాలన్నిట్లో ఒక విశేషం ఉంది - ఒక సెంట్రల్ పాయింటుని రియాలిటీకి దగ్గిరగా ఎలెవేట్ చెయ్యడం!ఈ సినిమాలో హీరోయిన్ కూతురికి వచ్చిన డౌట్ "నరాల రాపిడి కోసం మాత్రమే చూసుకోకుండా మనసుతో ప్రేమించుకుని ఒక జీవితకాలం పాటు విడిగా ఉన్నా ఒకరికొకరు పూర్తిగా అంకితమవడం సాధ్యమా?" అనేది ఈ తరాన్ని గూడా కదిలించిందనే దానికి గట్టి సాక్ష్యం ఈ సినిమా సక్సెస్.యెక్కడో చదివాను తను కావాలనే ఎక్స్పోజింగుకి దూరంగా ఉంటున్నట్టు - దాన్ని గట్టిగా నిలబెట్టుకుంటే ఖచ్చితంగా సావిత్రి తర్వాత మరో అభినేత్రి అవుతుంది  నిత్యా మీనన్!
చిన్న నిత్య
_______________________________________________________________
(చిత్రాలు:గూగుల్)

Sunday, 10 May 2015

ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెసుని బతికించేటట్టయితే ఆ ప్రత్యేకహోదా నా కక్కర్లేదు!

ఔరా, ఈ ఆంధ్రోళ్ళు యెంత పిచ్చోళ్ళు!ఇందుగ్గాదా అరవ తంబిలు ఈళ్ళని ఒక్కరోజు గూడా మదరాసులో ఉండనియ్యకుండా తన్ని తగలేసింది?అంటే అన్నారంటారు గానీ తెలంగాణోళ్ళు ఆంధ్రా దోపిడీదార్లు అంటే తప్పేంది,నన్నడిగితే ఆంధ్రా వెర్రిబాగులోళ్ళు అన్నా గూడా తప్పు లేదు!ఒకేపున విభజన ఖాయం అని కేంద్రంలో ఉన్న తమ పార్టీ అధినేత్రియే కుండబద్దలు కొట్టినాక గూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ఇక్కడి కాంగ్రెసోళ్ళే అరిభీకరంగా రంకెలేస్తే ఆఖరి నిముషాల్లో ఆళ్ళ లొల్లి దేనికోసరమో గూడ అర్దం జేసుకోకుండా ఆ గాదీదకొడుకుల్ని నమ్మి అన్ని రోజులు డేరాలూ పందిళ్ళూ బిగిచ్చి కూడూ నీళ్ళూ మానుకుని గొంతు నెప్పెట్టేదాక అరిచినారు పిచ్చి పుల్లయ్యల మాదిరి!హైదరాబాదులో తమ యాపారాల్ని రేపు ఆడ పవరు కొచ్చెవాళ్ళు అణగదొక్కకుండా జూసుకోవటానికి అని బైటికి జెప్పకుండ, విడిపోయాక ఆంధ్రాకి యేం గావాల్నో బిల్లులోకి యెక్కియ్యకుండా,యెవడన్నా అట్ట తెలివైన మాట మాట్లాడితే సమైక్యద్రోహిగా ముద్దరేసి నానా గత్తర చేసిందెవడ్రా కాంగ్రెసు బాడుఖావుల్లారా?

సెంటర్లో యెక్కడో ఉన్నోడికి రాష్ట్రం సంగతి తెలుస్తాదో లేదో!కాశ్మీరోడికీ తమిళ్నాడోడికీ ప్రాంతాల మధ్య సంతులనం యెట్లా చెయ్యాలో తెలియక కంగారు పడితే ఓకే,కానీ యెద్దుల్లాగా అంత కాలం రాజకీయ జీవితమంతా జనం మధ్య తిరిగి జనం కోసం బతికి ఉంటే మీకు తెలియక పోయేదా?విభజించటం నాకు సమ్మతమేనని లేఖ ఇచ్చాక గూడా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుని బూచిగా చూపించి వాడు అడ్డం కొడుతున్నాడు వీడు అడ్డం కొడుతున్నాడు అని యేడుస్తూ తొమ్మిదిన్నరేళ్ళు ఇవ్వకుండా తప్పించుకోవాలని సవాలక్ష దార్లు వెతికి మొత్తం అందర్నీ అయోమయంలోకి నెట్టిన దెవడురా ముట్లుడిగిన రాజకీయం నడిపే కాంగ్రెసు దొంగనాకొడుకుల్లారా?

మీకు ఇవ్వాలని ఉంటే బాబు యెప్పుడయితే లెటరు ఇచ్చాడో ఆ తేదీ నుంచి నెలరోజులు చాలదా ఈపాటి గొప్ప విభజనకి?ఇవ్వాళ తెలంగాణా ముఖ్యమంత్రి రహదారి పన్ను అనగానే అంత భీకరమైన గొడవ యెందుకు జరుగుతుందో అమాయకులకి తెలియదు గానీ నాబోటి వాడికి తెలియదా?ఇన్నేళ్ళుగా ఒకచోటి నుంచి ఒకచోటికి తిరిగే జనం పెరుగుతూనే ఉన్నా రోడ్డు రవాణా శాఖకి యెందుకు నష్టాలు వస్తున్నాయి? కేశినేని ట్రావెల్స్ మొదలుకొని దాదాపుగా పైవేట్  ట్రాన్స్పోర్టు నంతా మీ చేతుల్లోనే ఉంచుకుని ఒక ట్రిప్పుకి పర్మిట్ తీసుకుని ఆరు ట్రిప్పులు నడిపి కొట్టిన కొట్టుడు తగ్గుతుందని కాదా సమ్మెలూ ధర్నాలకి దిగుతున్నది?రూటు బస్సులుగా నడపటానికి పర్మిషన్ తీసుకుని పెళ్ళిబస్సులుగా అద్దెలకి తిప్పడం దగ్గిర్నుంచి గత యాభయ్యేళ్ళుగా మీరు చేసిన దోపిడీకి మండి గదరా తెలంగాణోళ్ళు విడిపోతామన్నది?

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గిర్నుంచీ ఈ దేశంలో యెక్కడా చెయ్యని విధంగా ఆంధ్రప్రజలు నిరంతరాయంగా మీకు అధికారాన్ని అప్పగిస్తే దేశం మొత్తం మీద కాంగ్రెసు ఇక చచ్చిందనుకున్న రోజుల్లో కూడా 42కి 41 స్థానాలు పువ్వుల్లో పెట్టి అప్పజెప్తే మీరు రాష్ట్రానికి కేంద్రం నుంచి యెన్ని రైళ్ళని యెన్ని ప్రాజెక్టుల్ని యెన్ని సౌకర్యాల్ని తీసుకు రాగలిగారు?సొంతంగా ఒక్క సీటు కూడా తీసుకురాలేకపోయినా మిగతా రాష్ట్రాల వాళ్ళు కోటరీ పేరుతో అంత బలంగా ఉండి తమ రాష్ట్రానికి మేళ్ళు చేసుకుంటున్న కాలంలో మీరేం చేశారురా బానిస కొడుకుల్లారా?ఇక్కడ ముఖ్యమంత్రి యెవడు అనేది తెలియాలన్నా అక్కడి నుంచే పేరు రావాలి!ఇక్కడ కులాల వారీగా ప్రాంతాల వారీగా మతాల వారీగా ప్రజలు చీలే దుష్ట రాజకీయం మీ మూలంగానే పెరిగింది కదరా అంట్లవెధవల్లారా?ముఠాలు కట్టి వాటితో అధికారాని కెగబాకిన ముఠా దాన్ని పదిలంగా వుంచుకోవటానికి తమ సొంత మనుషులకి వెసులుబాటు కల్పిస్తూ తమ సొంత ప్రాంతాల్ని పెంచుకుంటూ ఉండటం వల్లనే కదరా ప్రాంతాల మధ్య అసమానతలు పెరిగి రాష్ట్రం చీలింది?చెయ్యాల్సిన దిక్కుమాలిన పనులన్నీ సిగ్గులేకుండా చేసి ఇవ్వాళ మళ్ళీ మరోసారి ఇంకోరకం దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు - అంటే మిమ్మల్ని నమ్మి మీవెంట తిరిగిన జనాన్ని యెట్టి పరిస్థితుల్లోనూ సుఖంగా ఉండనివ్వరన్న మాట!

ఇప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే కాపీ స్లోగనుతో జనం ముందు వీరంగాలు వేస్తున్న వాళ్ళకి అసలు ప్రత్యేకహోదా స్వరూపస్వభావాలు తెలుసా?దానివల్ల నికరంగా యెంతమేలు జరుగుతుంది?దాని నిర్ధారిత లక్ష్యం యేమిటి?తెలంగాణా ఇస్తానని అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నరేళ్ళ్ళు కాంగ్రెసు సాగదీస్తున్నప్పుడు తెరాసా వాళ్ళు తెదెపా మీద పడి యాడవటం అసలు విభజనకి వ్యతిరేకంగా ఉన్నది కాంగ్రెసులోని హైదరాబాదు వ్యాపారస్తుల కూటమియేనని తెలియకనే చేశారా?రోడ్డు మీద జండాలు పుచ్చుకు తిరిగే మామూలు కార్యకర్తల కంటే తెలియదనుకోవచ్చు,పై స్థాయిలో జరుగుతున్నవన్నీ తెలిసి గూడా కాంగ్రెసుని అంతగా అంటకాగిన కేసీఆర్ తెలివి యేపాటిది?ఆంధ్రాలో అసలు రాజకీయంగా యేమాత్రం అవగాహన లేనివాళ్ళకి గూడా విభజన హడావిడిగా చెయ్యడం నచ్చలేదు!విడిపోవటం ఖాయమని తెలిశాక సమైక్యం అని మొదలుపెట్టినప్పుడే జనానికి కొంత అర్ధమయింది,దానికి తోడు పరమ నీచాతినీచంగా ముఫ్ఫై సీట్ల కోసం డిల్లీలో ఒకళ్లనొకళ్ళు పరువులు దిగజార్చుకుంటూ నడిపిన రాజకీయం మరింత విసుగు పుట్టించింది,ఇక తమ నియోజకవర్గ ప్రజలకి గౌరవనీయమైన ప్రతినిధులైన పార్లమెంటు సభ్యుల్ని కూడా మార్షల్స్ స్థాయికి దిగజార్చిన వైనం కాంగ్రెసుకి క్రమం తప్పకుండా వోటు వేసే సాంప్రదాయిక వోటర్లని కూడా రెచ్చగొట్టింది!ఇన్ని దుర్మార్గాలు చెస్తున్నప్పుడు కూడా వాళ్ళ వెంట నడిచారు మన జనం తెలివి లేకుండా!ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నారు,యెందుకని?

పాతవీ పనికిరానివీ అని తెలిసి కూల్చి పారెయ్యాల్సిన సందర్భంలో కూడా కేవలం ఆంధ్రాకోసం ప్రత్యేక హోదాని కొనసాగించాలా?ఒక్క ఆంధ్రాకే కాదు ఇదివరలో నిర్వచనాలతో రూపొందించిన విధివిధానాలను మొత్తంగా పక్కకి తోసేసి అసలే రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆంధ్రాకోసం ప్రత్యేకంగా అలోచించి కొనసాగించాలా?ఇకముందు అసలెవ్వరికీ ఇవ్వనంటుందే తప్ప కేంద్రం ఆంధ్రాకి మాత్రమే ఇవ్వనంటున్నదా?విభజన తర్వాత కొత్తగా మళ్ళీ నడక మొదలు పెట్టటం కష్టంగా ఉంటుందనీ తెలుసు,అన్నీ అమర్చి పెట్టేవాళ్ళు యెప్పుడూ ఉండరనీ తెలుసు,మన కష్టంతోనే యెదగాలనీ తెలుసు - అయినా యెందుకీ వెర్రి ఆవేశం?ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన కష్టం తను పడుతున్నాడు,ఇప్పటికే యెన్నో బహుళజాతి కంపెనీల నుంచీ ప్రపంచ ప్రసిధ్ధి గాంచిన వ్యాపార సంస్థల నుంచీ యం.వో.యూలు రాబట్టి ఉన్నాడు.రాజధాని తొలిదశ పూర్తయి ప్రభుత్వం ఇక్కడికి వస్తే గానీ వ్యవస్థాపరమయిన యేర్పాట్లు పూర్తి కావు, ఇంతట్లోకే తొందరపడితే యెలా?నా మనసులో మొదటినుంచీ ప్రత్యేకహోదా పట్ల వ్యామోహం లేదు - వస్తే రానీ పోతే పోనీ అని తప్ప!ఇవన్నీ మనని ప్రశాంతంగా ఆలోచించనివ్వకుండా గందరగోళం సృష్టించే కాంగ్రెసు మార్కు యెత్తుగడలు, మేధావులు కొంచెం వాస్తవికంగా ఆలోచించడం నేర్చుకోవాలి.

దొంగలు దొంగలు చేరి వూళ్ళు పంచుకుంటారు,వాటా కుదరని వాడు వేరే పార్టీ పెడతాడు అన్న దసరా బుల్లోడు సినిమా పాటను నిజం చేస్తూ యే మనిషైతే ఆంధ్రోళ్ళని తిట్టి రాష్ట్రాన్ని విడగొట్టి అధికారంలో కొచ్చి మళ్ళీ ఆ ఆంధ్రోళ్ళ సాయంతోనే బల్ పసంద్ దిల్ పసంద్ అంటూ ఖుషీగా ఉంటే ఆ బటాచోరు మోసాన్ని మాత్రం తెలుసుకోలేని వాళ్ళంతా అతను గాలి పోగేసి మాట్లాడినా రెల్లుదుబ్బుల మాదిరి తలలూపి ఆమోదించారు!ఇప్పటికీ అదే దోపిడీని పేరు మార్చి చేస్తున్నా అదేమని అడగలేని వాళ్ళు అతను అంటగట్టిన ద్వేషపు మత్తుని మాత్రం వొదుల్చుకోలేకుండా వున్నారు, యెందుకని?యెప్పుడో ప్రాస బాగుందని "ప్రాంతం వాడు దోస్తే ప్రాంతం లోనే పాతరేస్తాం ప్రాంతేతరుడు చేస్తే ప్రాంతం దాకా తరిమి కొడ్తాం" అని వాగిన ముక్కని ఇప్పటికీ జపించే వాళ్ళు నిన్నటి రోజున తమ ప్రాంతపు దోపిడిదార్లని యేమి చెయ్యగలిగారు?ఇప్పటి రోజున చేస్తున్న వాళ్ళని యేమి చెయ్యగలుగుతున్నారు?రేపటి రోజునైనా వీళ్ళు దోపిడీ అని పేరుపెట్టిన దాన్ని ఆపు చెయ్యగలరా?హైదరాబాదుని ఆంధ్రోళ్ళ కబంధహస్తాల నుంచి ఇడిపిస్తం మా దమ్ము చూపిస్తం అన్న పెద్దమనిషి ఇప్పుడు ఆంధ్రోళ్ళనే అంటకాగుతుంటే యేమి చెయ్యగలుగుతున్నారు?అసలు రాష్త్రం విడిపొయ్యాక యెంత భూమిని ఆంధ్రావాళ్ళ కబ్జా నుంచి స్వాధీనం చేసుకుని తెలంగాణా ప్రజలకి అప్పగించారు?నూటికి 90 శాతం మంది తెలుగువాళ్ళు ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుని బలవంతంగా రుద్దేస్తున్నారనీ తెలుగుని అధికార భాషగా చేస్తే ఉర్దూకి అన్యాయం జరుగుతుందని అఘోరించేవాడు కూడా మేధావియేనా?

ఆంధ్రప్రజలకి అవమానం అంటూ జరిగితే అది అన్ని రాజకీయ పక్షాల వల్లా సమానంగానే జరిగింది!యే ఒక్క పార్టీ అత్యున్నతమైన ఆదర్శాలకి కట్టుబడి లేదు - అధికారమే పరమావధి!ఇవ్వాళ తెలంగాణలో చెరువుల్ని బాగు చేస్తూ వాట్ని ఆంధ్రా దోపిడీ పాలకులు నిర్లక్ష్యం చెయ్యడం వల్లనే అట్లా జరిగిందంటున్నాడూ తెలంగాణా ముఖ్యమంత్రి - అందులో నిజమేంత అనేది కూడా ఆలోచించకుండా తలలూపుతున్నారు కొందరు తెలంగాణా మేధావులు.మహబూబ్ నగర్ జిల్లాలో తుమ్మిడిగుంట్ల(పేరు కల్పితం) అనే వూళ్ళో వర్షాలు దిట్టంగా కురిసి వూరి చెరువు నిండితే ఆంధ్రా నించి యెవడన్నా వొచ్చి ఆ చెరువుని యెండగట్టగలడా?అట్లా యెండగడితే ఆ వూరివాళ్ళు వూరుకుంటారా?అంతెందుకు జీవనదులే యెండిపోయి ప్రవాహవేగం తగ్గి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇసుకమేటలు వేస్తున్న కాలంలో భూగర్భజలాలు కుంచించుకుకుపోతే అది కూడా ఆంధ్రోళ్ళ మూలంగానే జరిగిందని ఒకడంటే విని నమ్ముతున్న వాళ్లలో విద్యాధికులు కూడా వున్నారంటే ఆ మేధావిత్వాన్ని చూసి నవ్వాలా యాడవాలా?ఆంధ్రాలో యెర్రచందనం స్మగ్లర్లకి యెప్పట్నించో సాయపడుతూ పోలీసుల మీదకి లారీలు యెక్కించి చంపటానికి కూడా తెగబడిన రౌడీకూలీల మీద దాడిని ఈ మధ్యనే మొదలైన చిన్న వివాదం మూలంగా తమిళుడైన నరసింహన్ మీద కోపంతో చేశారని అంటున్నాడు ఒకాయన - నిజంగా విభజన కోసం జరిగినదంతా తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని చేసిన న్యాయపోరాటమేనా?

అప్పట్లోనే చెన్నారేడ్ది అరిభీకరంగా రెచ్చిపోయి కూడా తెలంగాణా ప్రజల్లో డిపోవటానికి గట్టి వూపు రాకపోవటంతో ముఖ్యమంత్రి పోష్టుతో సర్దుకుని వొదిలేశాడు, కాంగ్రెసులో ఉంటూనే ప్రతి కాంగ్రెసు ముఖ్యమంత్రినీ ప్రతిపక్షం వాళ్ళకన్నా యెక్కువగా యేడిపించిన రాజశేఖర రెడ్డి చంద్రబాబు నుంచి అధికారం లాక్కోవటానికి తెలంగాణా వాదాన్ని పైకి తీసుకొచ్చాడు,అధికారంలోకి రాగానే నక్సలైట్లతో పాటూ తెరాసాని కూడా అణిచిపారెయ్యాలని చూశాడు,రెండుసార్లు అధికారానికి దూరమైన చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన వాడు కాస్తా అక్కడున్నది నా పాత ఫ్రెండే కదా అని తనూ తెలంగాణాకి సై అన్నాడు. పోనీ సరే అన్నవాడు ఆంధ్రోళ్ళని యెందుకు తిట్టడం అని గట్టిగానూ మాట్లాడలేదు,యెందుకని?ఆంధ్రోళ్ళ దోపిడీ అనే దుర్మార్గమైన మాటని గట్టిగా వ్యతిరేకించగలిగిన ఒకేఒక్క రాజకీయ నాయకుడు చంద్రబాబు ఆనాడు మాట్లాడకపోవటం వల్లనే కదా ఇవ్వాళ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రితో గాడిద అనిపించుకోవాల్సి వచ్చింది!అంతా అయిపోయాక నిన్న మాపార్టీలో పెరిగిన వాడు ఇవ్వాళ నన్ను విమర్శిస్తున్నాడు అని బుడిబుడి యేడుపులు యేడిస్తే యేమిలాభం?నాలాంటివాడికి తమరి మొదటి పార్టీ కాంగ్రెసు అని గుర్తుకు రాదా?కాంగ్రెసులో యెప్పటి వరకూ ఉన్నావు నువ్వు - పార్టీ పెడుతున్నప్పుడు చేరలేదు,జనం నీరాజనాలు పడుతున్నప్పుడు చేరలేదు,యెన్నికల ఫలితాలు ప్రభంజనాన్ని చూపిస్తున్నప్పుడు చేరలేదు,మామగారు గెలిచి అధికారం ఖాయం అనుకున్నాక దూకావు నీ చరిత్ర యేపాటి శుధ్ధమో మాకు తెలియదా నాయనా!గట్టిగా ఆనాడు కేసీఆర్ విద్వేషపూరిత ప్రచారాన్ని అడ్డుకోలేదు,గట్టిగా ఈనాడు రాష్ట్రం పరిస్థితి పట్ల నమ్మకాన్ని కలిగించి ఆందోళనని చల్లార్చలేడు - ఈ గోపి రాజకీయంవల్ల కాదా కాంగ్రెసు బలపడుతున్నది?ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి,తెలివైన వాళ్ళంతా కాస్త నిదానంగా ఆలోచించండి - భూస్థాపితం చెయ్యాల్సిన కాంగ్రెసుకి ప్రత్యేకహోదా పేరుతో వూపిరు లూదకండి!

స్వాభిమాని యెవడూ అతిగా దేనికోసమూ ప్రాధేయపడడు!

Saturday, 9 May 2015

హిందూ ధర్మ ప్రహేళికలు-రామకధా విమర్శనం

అహల్య పవిత్రత నిజముగ శంకించరానిదేనా?


బాల.48వ సర్గము:విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో

               శ్లో||తస్యాంతరం విదిత్వా తు సహస్రాక్ష శ్శచీపతిః,

               మునివేషధరోహల్యా మిదం వచన మబ్రవీత్,



               శ్లో||ఋతుకాలం ప్రతీక్షంతే నార్ధివ స్సు సమాహితే,

               సంగమం త్వహ మిచ్చామి త్వయా సహ సుమధ్యమే.

అతడు(గౌతముడు) లేని కాలము నెఱిగి యింద్రుదు ముని వేషము ధరించి అహల్యతో నిట్లనేను.

సుందరీ!భోగార్ధులు ఋతుకాలమును నిరీక్షింపరు.నేను నీతే సంగమమును కోరుచున్నాను.



               శ్లో||మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన,
               మతిం చకార దుర్మేధా దేవరాజ కుతూహలాత్,

               శ్లో||అధ బ్రవీత్ సురశ్రేష్ఠం కృతార్ధే నాంతరాత్మనా,
               కృతార్ధాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్ర మిత~హ్ ప్రభో,
మునివేషధారుని యింద్రునిగా నెఱిగి,యింద్రుడు తనయందాసక్తు డగుట వలన దుర్మతియై సమ్మతించేను.

అంతట కోరిక తీరిన మనస్సుతో "ఇంద్రా!కృతార్ధురాల నైతిని.శీఘ్రముగ నిచటి నుండి పొమ్ము,నిన్ను - నన్ను సర్వదా కాపాడుకొనుము" అనేను.

గౌతము డింద్రుని:
               శ్లో||మమ రూపం సమాస్థాయ కృతవా నసి దుర్మతే,
                అకర్తవ్య మిదం తస్మా ద్విఫల స్త్వం భవుష్యసి.

దుర్మతీ!నా రూపమును ధరించి యకృత్యమును చేసితివి.అందువలన వృషణములు లేనివాడవగుదువు.

అహల్య గౌతమునితో
               శ్లో||అజ్ఞానార్ధర్షితా నాధ ద్వద్రూపేణ దివేకసా,
               న కామ కారా ద్విప్రర్షే ప్రసాదం కర్తు మర్హసి.
"నాధా!అజ్ఞానముతో నీ రూపము నందిన ఇంద్రునిచే ధర్షింపబడితిని.కామము వలన గాదు,అనుగ్రహించవలసినది" అని వేడుకొనెను.

గౌతము డహల్యను:
               శ్లో||ఇహ వర్ష సహస్రాణి బహూని త్వం నివత్స్యసి,
                వాయుబక్షా నిరాహారాతప్యంతీ భస్మశాయినీ.
"ఇచట నీవు పెక్కువేల సంవత్సరములు వాయువును భక్షింపుచు నిరాహారవై తపము చేయుచు బూడిదయందు పరుండి సర్వభూతమూ కదృస్యమై ఈ యాశ్రమమందు వసింపగలవు" అని శపించెను.

ఒకే కధకు రెండు సర్గము లందలి తేడాలు: 1).బాలకాండలో అహల్య యిష్టపడియే ఇంద్రునితో సంపర్కము చేసినటులున్నది.3).ఉత్త్రకాండములో ఇంద్రుడు గౌతముని యాకారములో నుండుటచే భ్రాంతిపడినదై సంపర్కము చేసి నటులున్నది.

ఇంద్రుని కిచ్చిన శాపములో బాలకాండలో వృషహీనుడవు కమ్మని,ఉత్తరకాందలో శత్రువులచే జిక్కుదువని యున్నది.

అహల్య కిచ్చిన శాపము బాలకాండలో అదృశ్యవు కమ్మని యుండగా ఉత్తరకాండలో శిలవుగా యుండుమని యున్నది.

రాముని వనవాసమునకు బొమ్మనుట కైక దోషమా?

1.రాజ్యము భరతునిదని రామునికి తెలియునా?
అయోధ్య.107వ సర్గము:రాముడు భరతునితో
               శ్లో||పురాభ్రాతః పితానః స్సమాత్రం తే సముద్వహన్,
               మాతామహే సమాశ్రౌషీ ద్రాజ్యశుల్క మనుత్వమం.
"మున్ను మన తండ్రి నీ తల్లియగు కైకేయిని వివాహమాడునపుడు నీ తాతయగు కేకయ మహారాజునకు 'కైకేయికి పుట్టినవానికే రాజ్యమొసంగెదను' అని వాగ్దానము గావించెను." - దీనిని బట్టి రాజ్యము తండ్రికి పిదప ణరతునికి చెందవలయునని రామునకు తెలియును.

2.కౌసల్య ఆనందంగా పలికిన పలుకుల కర్ధ మేమిటి?
అయోధ్య నాలుగ సర్గము:రాముడు తన తల్లితో తన పట్టాభుషేక వార్త తెలుపగనే కౌసల్య యిట్లు పలికెను.
               శ్లో||వర్స రామ చిరంజీవ హతాస్తే పరిపంధినః
                   జ్ఞాతీన్ మే త్వం శ్రియా యుక్త స్సుమిత్రా యాశ్శ్చనందయః
"రామా!నీ శత్రువులు చంపబడిరి,నీవు సంపదతో గూడి నా జ్ఞాతులను,సుమిత్ర యొక్క జ్ఞాతులను సంతౌషపెట్టుము." దీనిని బట్టి కౌసల్యకు కూడ దశరధుడు కైక కుమారుననకు రాజ్యాధికారము దత్తత చేయుట తెలియును.అందువలననే తన కుమారునకు రాజ్యము సంక్రమించునను ఆశను వదలుకొనినది.కాని రాముడు ఆమెతో తన పట్టాభిషేక వార్త తెలుపగనే తానూహించని కార్యము తన యెదుట జరగబోవుచున్నందుకు హర్షాతిరేకముతో పులకరించినదై పైవిధముగ పలికెను.కౌసల్యకు కైక పైన గల ఈ ద్వేషమునకు కారణము భరతునకు కలగబోవు రాజ్యప్రాప్తి యని వేరే వచింప నవసరము లేదు.

3.దశరధుని ఆందోళనకు కారణ మేమిటి?
అయోధ్య 1వ సర్గము:
               శ్లో||అధ రాజ్ఞో బభూవైవ వృధ్ధస్య చిరజీవనః
                   ప్రీతిరేషా క రామో రాజస్యా న్మయి జీవతి. 
దశరధునకు తాను జీవించి ఉండగా "రాముడెట్లు రాజగునా?" యను నాలోచన కలిగెను.
               శ్లో||ఏషా హ్యస్య వరా ప్రీతిర్హృది సం పరివర్తతే
                  కదా నామ సుతం ద్రక్ష్యా మ్యభిషిక్త మహం ప్రియం.
"నేనెపుడు నా ప్రియపుత్రుడగు రాముడు రాజ్యాభిషిక్తునిగ జూతునా?" యను మిక్కిలి ప్రీతి యెడతెగక దశరధుని హృదయమున నేర్పడెను.దశరధుడు,తాము కైకకు జన్మించిన పుత్రునకే రాజ్య మొసంగుదునని ప్రమాణము చేయుటచే ,దానికి భిన్నముగ రాముని రాజ్యమున ప్రతిష్టించుటకు మార్గము నాలోచించుచు నిరంతర ఖేదము అనుభవించినట్లు తెలియుచున్నది.

అయోధ్య 4వ సర్గము:దశరధుడు రామునితో నిట్లనేను.
"నిన్ను పుష్యమి యందభిషేకింపుమని నా మనస్సు త్వరపెట్టుచున్నది.రేపు నిన్ను యూవరాజ్యమందభిషేకింతును.నీ స్నేహితు లప్రమత్తులై యంతట నిన్ను రక్షింతురు గాక,ఇట్టి కార్యములకు పెక్కు విఘ్నములు కలుగుచుండును.భరతుడు పురమునుండి పంపబడినాడు.అతడు వచ్చులోపల నీ యభిషేకమునకు తగిన సమయము.నీ సోదరుడగు భరతుడు సత్పురుషమార్గమందున్నవాడు,జ్యేష్టుననుసరించువాడు,ధర్మాత్ముడు,జితేంద్రియుడు,దయాహ్ర్దయుడు అయినను మనుజుల మనస్సు స్థిరముగా నుండదని నా అయభిప్రాయము."

పై మాటలను బట్టి దశరధ-రాము లిరువురు రాజ్యార్హత గల భరతుని వలనను,భరతునివైపు వారివలన యేవైన నాటంకములు గల్గునేమో యని యప్రమత్తులై యున్నట్లు తోచుచున్నది.

1.రాజ్యము భరతునిదని రామునికి తెలియును!
2.కౌసల్య ఆనందంగా పలికిన పలుకుల వెనక ఉన్నది కైక పట్ల ద్వేషం!
3.దశరధుని ఆందోళనకు కారణం అక్రమంగా రాముణ్ణి యెట్లా రాజుని చెయ్యాలా అని!
రాజ్యము భరతునకు చెందవలెనని తెలిసియు ,తండ్రితో మంతనములు సలిపి రాజ్యాధికారమును చేజిక్కించుకొనుటకు తాపత్రయపడు రాముని వనవాసమునకు బొమ్మనుట కైక దోషమా?


యుధ్ధమునకు కారకుడెవరు?రావణుడా!శూర్పణఖయా!రాముడా!

అరణ్య.11వ సర్గము:రాముడు లక్ష్మణునితో

              శ్లో||తస్యేద మాశ్రమ పదం ప్రభావాద్యస్య రాక్షసైః

                    దిగియం దక్షిణాత్రా సాద్దృస్యతే నోప భుజ్యతే.

              శ్లో||యధా ప్రబృతి చాక్రాంతా దిగి యం పుణ్యకర్మణా,
                    తదా ప్రకృతి నిర్వైరాః ప్రశాంతా రజనీ చరాః
ఏవని ప్రభావముచే రాక్షసులు ఈ దక్షిణదిక్కు నుపభోగింప జాలకుండిరో,భయముతో చూచుచుండిరో ఆ అగస్త్యుని ఆశ్రమమిది.

పుణ్యకార్యము లాచరించుచు నా అగస్త్యు డెప్పటినుండి యిచట నివసించెనో,అప్పటినుండియు రాక్షసులు ఋషులపై వైరము మాని ప్రశాంతి వహించిరి.

పై విషయములను బట్టి అగస్త్యుడు మహాబలవంతుడని తెలియుచున్నది.అరణ్యకాండము 12వ సర్గలో నగస్త్యుడు రామున కనేక యాయుధము లిచ్చినట్లు గలదు.

దండకారణ్యము రాక్షసుల పాలనలోని ప్రాంతము - ఖరుడు మొదలగు రాక్షసరాజు లచట పాలన సాగించుచుండిరి.అగస్త్యుడు,విశ్వామిత్రుడు మొదలగు నార్యర్షులు దండకారణ్యమునకు వలస వచ్చిరి.అట్లు వచ్చినవారు బలహీనులగు రాక్షసరాజుల జయించి వారి రాజ్యము లాక్రమించుట,రాక్షసపాలితప్రాంతములందు యజ్ఞములనుపేరుతో రాక్షసుల యాచారములకు విరుధ్ధముగ వర్తించుట మున్నగు కార్యము లొనర్చుచు, అవసరమని తోచినప్పు డ్డార్యరాజుల సహాయమును పొందుచుండిరి.

అరణ్యకాండ 6వ సర్గ:ఋషులు రామునితో
              శ్లో||పంపానదీ నివాసానా మను మందాకినీమపి,
                    చిత్రకూటాలయానాంచ క్రియతే కదనం మహత్.
పంపానదీ తీరవాసులును,మందాకిని ననుసరించిన చిత్రకూటాలయములందును ఋషు లధికముగ పీడించబడుచున్నారు.
               శ్లో||తత స్త్వాం శరణార్ధం చ శరణ్యం సముపస్థితాః
                   పరిపాలయనో రామః వధ్యమానా న్నిశాచరైః
అందువలన రక్షకుడవగు నిన్ను శరణుకోరి వచ్చితిమి,రాక్షసులచే హింసింపబడుచున్న మమ్ము రక్షింపుము.

రాముడు ఋషులతో
               శ్లో||కేవలే నాత్మకార్యేణ  ప్రవేష్టవ్యం మమావనం.
                   విప్రకార మపాక్రష్టుం రాక్షసైర్భవ తామిమం.
రాక్షసులు మీకు చేయు నపచారములను తొలగించుటకు  మీ కార్యమునకై నేనీ యరణ్యమునకు వచ్చితిని.తండ్రి యాజ్ఞను పాలించుట కీ వనమునకు వచ్చినను యాదృచ్చికముగ మీ కార్యసిధ్ధి కొరకు వచ్చినట్లయినది.కనుక నా వనవాసము మిక్కిలి ఫలప్రదము కాగలదు.

రాముడీ మాటలు పలుకునప్పటికి సీతాపహరణము జరుగలేదు.రాముడు "ఋషుల కార్యమునకై  యీ అడవికి వచ్చినాన" నుటలో నతడ రణ్యవాస కాలములో రాక్షసుల జయింపదలచినాడని తెలియుచున్నది.రాముడు "తన వనవాసము మహాఫలప్రదము కాగలద" నుటలో ఆ ఫలము - రాక్షసవధ,రాక్షసరాజ్యముల నాక్రమించుట కావచ్చును.

అరణ్య.9వ సర్గము:సీత రామునితో

ఈ లోకమున కామజములగు మూడు వ్యసనము లున్నవి:అందు మొదటిది అసత్యము పలుకుట,రెండవది పరస్త్రీగమనమౌ,మూడవది కారణము లేని రౌద్రము.ఈ చివరి రెండును అసత్యమాడుత కంటెను ఘోరమైనవి.మూడవదైన కారణము లేకయే పరుల ప్రాణములను తీయుత యను రౌద్రము మోహముచే నిపుడు నీకు తటస్థించినది.
               శ్లో||ప్రతిజ్ఞా తస్త్వయావీర! దండకారణ్యవాసినాం,
                     ఋషీణాం రక్షణార్ధాయ వధస్సం యతి రక్షసాం.
               శ్లో||ఏ తన్నిమిత్తం చ వనం దండకా యితి విశ్రుతం,
                     ప్రస్థితస్త్వం సహ భ్రాతా ధృఅత బాణ శరాసనం.
వీరా!దండకారణ్యవాసులగు ఋషుల రక్షణ కొరకు యుధ్ధమున రాక్షసుల చముదునని ప్రతిజ్ఞ చేసితివి.దీనికొఱకే నీవు సొదరునితో ధనుర్బాణములను ధరించి దండకాతవికి బయలుదేరితివని వినికిడి.

మరియు సీత రామునితో
               శ్లో||న కధం చన సా కార్యా గృహీత ధనుషాత్వయా,
                     ముధ్ధిర్వైరం వినాహం తుం రాక్షసాందండ కాశ్రితాన్,
                     అపరాధం వినాహం తుం లోకాన్వీర న కామయే.
నీవీ దండకారణ్య రాక్షసులను పగలేకయే ధనుస్సు దాల్చి వధించుట కిచ్చగింపకుము.అపరాధము లేక యే ప్రాణులను చంపుటకు నే నిష్టపడను.

అని పలుక రాముడు సీతతో:
దండకారణ్యమున రాక్షసులచే పీడించబడుచున్న్న ఋషులు నన్ను కాపాడుమని కోర నేను వారిని రక్షింతునని ప్రతిజ్ఞ చేసితిని.నేను మునులకు ప్రతిజ్ఞ చేసి తద్విరుధ్ధముగ నాచరింప జాలను.నాకెల్లప్పుడు సత్యమే ప్రియము.
అని తన నిర్ణయము తెలిపెను.దీనిని బట్టి రాముని ధ్యేయము రాక్షసవధ యని తెలియుచున్నది.

57వ సర్గము:రాముడు లక్ష్మణునితో
"జనస్థాన నిమిత్తం హి కృతవైరోస్మి రాక్షసైః"
జనస్థాన నిమిత్తమై రాక్షసులతో విరోధము చేసికొంటిని.

ఈ మాటను బట్టి రాముడు రాక్షసులతో కావలెననైయే కోరి విరోధము చెసికొనిన్నట్లు కంపించుచున్నది.అనగా జనస్థానమందలి రాక్షసులతో యుధ్ధమును గోరి శూర్పణఖను కురూపిగ నొనర్చెనా?లేక జనస్థానము నాక్రమించుటకై యేదైన యత్నమొనరించెనా? యను సందేహమును కలుగజేయుచున్నది.వేఅరే యత్నము లేనిచో రాక్షసులతో విరోధము కోరియే శూర్పణఖను విరూపిగ నొనర్చెననుట స్పష్టము.

అరణ్య.17వ సర్గము:శూర్పణఖ రామునితో
              శ్లో||అహం శూర్పణఖా నామరాక్షసీ కామరూపిణీ,
                    అరణ్యం విచరా మీదమేకా సర్వభయంకరా.
నేను శూర్పణఖ యను రాక్షసిని.కామరూపినిని సర్వభయంకరనై ఈ వనమున ఒంటరిగా తిరుగుచుందును.
              శ్లో||రావణో నామమే భ్రాతా బలీయాన్ రాక్షసేశ్వరః,
                    వీరో విశ్రవసః పుత్రో యదితే శ్రోత్ర మాగతః
నా అన్న రావణుడు,రాక్షసులకు రాజు,విశ్రవసుని పుత్రుడు,బలవంతుడు - నీవతని పేరు వినియుండవచ్చును.
              శ్లో||తా నహం సమతిక్రాంతా రామత్వా పూర్వదర్సనాత్
                    సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమం.
రామా! నిన్ను చూచి నావారి నందరిని వదలి నిన్ను భర్తగా పొందవలయునని నీ కడకు వచ్చితిని.
             శ్లో||"చిరాయు మే భర్తా".
             నీవు నాకు చిరకాలము భర్తవు కమ్మ్ము.

18వ సర్గము:రాముడు శూర్పణఖతో
             శ్లో||కృత దారోస్మి భవతి భార్యేయం దయితా మమ,
                    త్వ ద్విధానం తు నారీణాం సు దుఃఖా స సపత్నతా.
నేను వివాహితుడను,ఈమె నా భార్య.నీవంతి స్త్రీలకు సవతు లుండుట చాల దుఃఖము గలిగించును.
             శ్లో|| ఏ నం భజే విశాలాక్షి భర్తారం భ్రాతరం మమ,
                    అసపత్నతా వరారోహే మేరు మర్కప్రభా యధా.
నీవు సవతిపోరు లేనిదానవై నా తమ్ముని భర్తగా పొందుము అని పలుక,శూఒర్పణఖ రాముని మాటలు నిజమని తలచి లక్ష్మణునితో
              శ్లో||అస్యరూపస్యతే యుక్తా భార్యాహం వరవర్ణినీ,
                   మయా సహ సుఖం సర్వాన్ దండకా న్విదరిష్యసి.
...నేను నీ రూపమునకు తగిన భార్యను,నాతో కలిసి నీవు సుఖముగ దండకయందు విహరింపుము.

లక్ష్మణుడు శూర్పణఖతో:
              శ్లో||కధం దాసస్యమే దాసీ భార్యా భ్వతు మిచ్చసి,
                  సోహ మార్యేణ పరవాంభ్రాతా తా కమలవర్ణిని.
నేనే ఇతనికి దాసుడను,నాకు భార్యవై నీవు దాసివగుట కెట్లు తగుదువు?
              శ్లో||సమృధ్ధార్ధ్ధస్య సిధ్ధార్ధా ముదితామలవర్ణినీ,
                   ఆర్యస్య త్వం విశాలాక్షి  భార్యా భవ యవీయసీ.
ఓ విశాలాక్షీ!సమృధ్ధార్ధుదగు నార్య్నకు కనిష్ఠ భార్యవై సిధ్ధార్ధ వగుము.
              శ్లో||ఏనాం విరూపా మసతీం కరాళాం నిర్ణతోదరీయం,
                  భార్యాం వృధ్ధాం పరిత్యజ్య త్వామేవైష భజిష్యతి.
అతడు విరూపయు - వృధ్ధయు,అసతియు,కరాలయు,వ్రేలాడు పొట్ట గలదియు బ్నగు భార్యను వదలి నిన్ను పొందగలడు.
             శ్లో||కోహి రూపమిదం శ్రేష్ఠం సంత్యజ్య వరవర్ణినిః,
                  మానుషీషు వరారోహేః కుర్యాద్భావం విచక్షణః.
ఓ సుందరాంగీ!ఇట్టి నీ శ్రేష్ఠమగు రూపమును వదలి యే బుధ్ధిమంతుడు మనుజస్త్రీల యందనురాగము కలవాడగును?

అని లక్ష్మణుడు పలుక పరిహాసము నెరుగని యా రాక్సహసి అతని మాటలు నిజమని తలచెను.

పై విషయములన్నియు నొక్కసారి పరిశీలించుడు.శూర్పణఖ రాముని జూచి,ఆతడెవ్వరో తెలిసికొని, తన కుటుంబ విషయములు తెల్పి నిర్భయముగ కపటము లేకుండ తాను రాముని భర్తగా కోరి వచ్చితి ననియు,తనను భార్యారూపముతో జూచి - శాశ్వతముగ భర్తవగుమని కోరినది.అట్టి కల్మష మెరుగక మాటలాడు స్త్రీని - రాముడు పొగడి తనకు భార్య గలదనియు,తన తమ్ముడామే కనుకూలుడగు వరుడని వచించెను.లక్ష్మణుడును ఆమె అందమును బొగడి తన వదినెగారి అందమును తూలనాడుచు "నీవు మాయన్నకు రెండవ భార్యవగుమనియు - సుందరాంగివైన నిన్ను విడచి మనుజస్త్రీల యందు అనురాగము కలవాడెట్లగును" అని పలికి ఆమె నింకను రెచ్చగొట్టెను.

పరిహాసము నెరుగని శూర్పణఖ మరల రామునితో తన మనోగతమును వెల్లడించెను.పిమ్మట "నీవంటి స్త్రీలకు సవతులుండుట దుఃఖమును గలిగించు" నన్న రాముని పలుకులను బట్టి రాముడు తనను వలచినాడని సీత లేకున్నచో తనను స్వీకరించునని తలచి సీతను చంపబోయెను,అంత రామలక్ష్మణు లామెను బట్టుకొని విరూపిగ నొనరించిరి.

ఈ విధముగ నొక స్త్రీని యాటలు పట్టించి ఆశ గొలిపి విరూపిగ జేయుట వారి సత్య సంధతయా?క్షాత్ర ధర్మమా?ఆమెతో మొదటనే తా మామెను పరిణయమాడువారము గామని తెలుపవచ్చును గదా!అంతకంటె యామె నచటనుండి వెడలగొట్టు మార్గమా పురుషశ్రేష్ఠులకు గోచరింపలేదా?ఆమె పాలితప్రాంతమునకు వచ్చి ఆమెతో పరిహాసము లాడి ఆమెను విరూపిగ నొనర్పుట యార్యరాజుల కుచితమగు చర్యయా?

ఈ సందర్భమున వాల్మీకి రాముని ప్రశంసించుచు
అరణ్య.17వ సర్గము:
             శ్లో||అనృతం నహి రామస్య కదాచి దపి సమ్మతం,
                 విశేషేణాశ్రమ స్థస్యసమీపే స్త్రీజనస్యచ.
రామున కసత్య మెన్నడును సమ్మతము కాదు.విశేషించి యాశ్రమమందుండుత వలనను,స్త్రీఎల సమక్షమునను - అని వ్రాసెను.రాముడీ సంభాషణమంతయు జరిపినది - స్రీ సమక్షముననే కాదు,స్త్ర్రెతోనే.

దీనిని బట్టి రాముడు శూర్పణఖను విరూపిగ నొనర్చుట రాక్షసులతో వైరము కోరియే యని స్పష్టమగుచున్నది.

అరణ్య.20వ సర్గము:శూర్పణఖ - రామలక్ష్మణులు తనకు చేసిన పరాభవమును తెలుప ఖరుడు వారిపై రాక్షసులను పంపెను.ఆ రాక్షసులతో రాము డిట్లనేను -
             శ్లో||ఫలమూలాశనౌ దాంతో తాపసౌ ధర్మచారిణౌ,
                 వసంతౌ దండకారణ్యే కిమర్ధ ముపహరసధ.
ఫలమూలములను దినుచు జితేంద్రియులమై తాపసవ్ర్త్తి నవలంబించి - ధర్మము నాచరించుచు దండకారణ్యమున నివసించు మమ్మేల హింసించెదరు?
             శ్లో||యుష్మాన్ పాపాత్మకా  ణంతుం విప్రకారా న్మహాహవే,
                  ఋషీణాం తు నియోగేన ప్రాప్తోహం సశరాయుధః.
హింసాస్వభావము గల పాపాత్ములగు మిమ్ము యుధ్ధభూమిలో సమ్హరించుటకై ఋఋషుల నియోగముచే ధనుర్బానములు దాల్చి వచ్చితిని.

ఇచట రాముడు రాక్షసులతో "యుధ్ధభూమియందు మిమ్ముల సమ్హరించుతకై ఋషుల నియోగముచే ధనుర్బానముల ధరించి వచ్చితి" ననుటచే రాముదు కావలయుననియే రాక్షసులతో యుధ్ధమును కోరి శూర్పనఖను విరూపినిగ నొనర్చినటుల విశ్దమగుచున్నది.

ఇందు రాముదు తమ్మునిచే శూర్పనఖను స్త్రీ యనియు తలపక హింసించి రాక్షసులను హింసాస్వభావము గలవారనుత యెంతయు గర్హనీయము.

మరియు వనమున వేటాడి మాంసను భుజించుచు, తమ్ను పరిణ్యమాడుమని వచ్చిన స్త్రీతో పరిహాసము లాడి యామేను విరూపిని గావించి తాము ఫలమూలములను దినువారమనియు,జితేంద్రియులమనియు,తాపసవృత్తి నవలంబించి ధర్మము నాచరించుచున్నామనియు వచించుట యెంతటి గడసరిమాటలో పాఠకు లూహించెదరు గాక!

రామ-రావణుల చర్యలయందు ఈ క్రింది భేదమును పరిశీలింపుడు!

రాముడు తనను వలచి వచ్చిన స్త్రీతో పరియాచకము లాడి యామేను విరూపిగ నొనర్చెను.

రావణుడు సీతను గాఢముగ కామించియు తన యధీనములో - నేకాంతయై దిక్కులేక - దిక్కుచోచక యున్నపుడామెతో 
సుందర.20వ సర్గము
             శ్లో||స్వధర్మో రాక్షసాం భీరు సర్వదైవ న సంశయః,
             గమనం నా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా,

             శ్లో||ఏవం చైత దకామాం తు నత్వాంస్ప్రక్ష్యామి మైధిలి,
             కామం కామశ్శరీరేమేయధాకామం ప్రవర్త్తాం,

             శ్లో||దేవి నేహభయం కార్యం మయి విశ్వసి హి ప్రియే,
              ప్రణయస్వ చ తశ్వేన మైవం భూశ్శోక లాలసా.
పిఱికిదానా,పరస్త్రీలను పొందుట,బలాత్కారముగ తెచ్చుట నిస్సంశయముగ రాక్షసుల ధర్మము,కావున నేనధర్మ మొనరించితినని తలపకుము.

నా శ్శరీరమున కామము యధేచ్చగా ప్రసరించిన ప్రసరించనిమ్ము,నన్ను కామింపని  ఇన్ను స్పృశింపను.

ఓ దేవీ!నీవు భయపడకము,నామాట నమ్ముము,యధార్ధముగ నన్ను ప్రేమింపుము,శోకము నందకుము.

22వ సర్గము:
             శ్లో||ఏ తస్మా త్కారణా న్నత్వాం ఘాతయామి వరాననే,
              వధార్హా మవమానార్ధం  ర్హం మిధ్యా ప్రవ్రజితేర తాం.
 ఓ సుందరీ!నీవు వధింపదగియున్నను, అవమానింపదగియున్నను,కపటముగ వానప్రస్థవేషము ధరించిన రామునియందే ప్రేమకలిగియున్నను, నిన్ను చంపుట కాజ్ఞ నొసంగకున్నాను.

రావణుని ఈ మాటలకు, రాముని చర్యలకు నెంతటి వ్యత్యాస మున్నదో గమనింపుడు.పరస్త్రీలను బలవంతముగా గొనివచ్చుట స్వధర్మమైనను తాను గొనివచ్చిన భయాక్రాంతయగు సీత నోదార్చి "నన్ను కామింపని నిన్ను స్పృశింపను" అని పలికిన రావణుడు ధర్మాచరణుడా?తనను కామించి వచ్చిన స్త్రీతో పరియాచకము లాడి యామెను విరూపిగ నొనర్చిన రాముడు ధర్మాచరణుడా?

పై విషయములనౌ బట్టి రావణుడు సీతను గొనివచ్చుట - రాక్షస ధర్మము చేతను,తన చెల్లెలికి జరిగిన పరాభవమునకు ప్రతీకారముగను అని తెలియుచున్నది.

రాముడు సుగ్రీవుని చేరి నిర్హేతుకముగ - ధర్మరహితముగ వాలిని జంపి, సుగ్రీవుని వానరరాజుగ చేయుట కిష్కింధను తనకు లోబడిన రాజ్యముగ చేసికొను తలంపు గాని వేరుగాదు. ఆ విషయము నెఱిగియే విభీషణుడు రాముని చేరి స్వవంశనిర్మూలన మొనర్చుకొని నిర్వీర్యమగు లంకకు రాజయ్యెను.రాముడు విభీషణుని తోడ్పాటుతో బలవంతుడగు రావణుని జంపి లంకను తన యధీనరాజ్యముగ నొనర్చుకొని నిర్వీర్యుడగు విభీషణుని లంక కలంకారమగు రాజుగ నొనర్చెను.కిష్కింధయు నదేవిధమిగ మహాబలవంతుడు - ధర్మాత్ముడు - ధర్మరక్షకుడు నగు వాలి చంపబడగా అలంకారపు బొమ్మయగు సుగ్రీవుని చేతికి వచ్చి నిర్వీర్యమాయేను.

కనుక రామ-రావణ యుధ్ధనునకు ముఖ్యకారణము రాముని రాజ్యకాంక్ష, దానికి రాముడు "ఋషుల రక్షణ కొరకు" అని ముసుగు వేసెను - అంతియే గాని సీతాపహరణ మెంతమాత్రము కాదని విదిత మగుచున్నది.దీనికి ముఖ్య వుదాహరణము సీతాపహరణమునకు ముందు రాముడు రాక్షసులను చంపెదనని ఋషులతో పలుకుటయే - ఇంకను దీర్ఘముగ నాలోచించిన తన పూర్వీకులగు అనరణ్యుని చమొఇన,మాంధాతతో ఘోరరణమొనర్చిన రాక్షసరాజగు రావణుని చంపుత యను నాలోచన రామునకు వనవాసమునకు బయలుదేరుటకు పూర్వమునుండియే గలదని యూహింపవచ్చును.

రాముడు శూర్పణఖను విరూపిగ నొనర్చి రామ-రావణ యుధ్ధమునకు బీజము వేసెను.సరియగు చారిత్రక అవగాహన లేని పౌరాణికులు, ఆర్యర్షుల పక్షపాత బుధ్ధి గల పండిత ప్రకాండులు సరియగు ముఖ్యవిషయములు గ్రహింపనొల్లక సీతను రావణు డపహరించుటయే రామ-రావణ యుధ్ధమునకు కారణమని ప్రచారము గావించిరి.

రాముడు సీతను భార్యగ నెంత గొప్పగ యాదరించెను!

రాముదు సీతను పెద్దల యెదుత నగ్నిసాక్షిగ పరిణయ మాడెను.సీత చాల అయందమైనదని వాల్మీకి హనుమంతాదులు వర్ణించిరి.రామునకు సీత యందెంతయో మోహము గలదు.అతడామె యందు మిక్కిలి కామాసక్తుడై యనురాగము గలవాదయ్యెను.రామునికి సీతపై గల వ్యామోహము - ప్రేమ వలననా?కామము వలననా? యని ప్రత్యేకించవలసిన కామము వలననే యబి చెప్పవలయును.వనముల యందాతడు దగ్గఱగ నుండి మాంసము తినిపించుట,అయోధ్య యందామెను చేతులతో గ్రహించి చెఱుకురసమును త్రాగించుట మొదలగు చర్యలన్న్నియు నందమగు నామె యందలి కామోద్రేక చర్యలే యనుట నిస్సందేహము.రామున కామెయందు ప్రేమ లేదనుతయు సమంజసము గాదు,కామము వలన ప్రేమ జనించక మానదు గదా!

రాముడు సీతలేక దేవాధిపత్యముగాని,రాజ్యాదిపతముగాని స్వీకరించననియు(అరన్య.58వ సర్గము 5 శ్లో),సీత లేనిచో ప్రానములు విడుతుననియు(అరన్య.58వ సర్గము 9 శ్లో) వచించెను.సుగ్రీవ - హనుమంతాదుల యెదుట తన భార్యను గురించి కన్నీటితోపలవించెను.కాని లంకాపురియందు రావణుని జయీంచిన పిమ్మట కనీసము సీతను చూదవలెనై యైన రాముడు తలపలేదు,రావణునికి సంస్కారము,విభీషణునికి పట్టాభిషేకము జరిగిన పిమ్మట నింపాదిగ తన విజయమును తెలుపుమని జానకి యొద్దకు హనుమంతుని పంపెను.ఆ మాటలకు నీరసపడిన సీత దీనముగ "రాముని చూడదలచినాన"ని వచించెను.

పిమ్మట విభీషణు డామెను తీసుకొని రాగా రాము డామెతో శత్రువును జయించి నేను నిన్ను పొందితిని,నా పౌరుషము చూపితిని,హనుమంతుని గొప్ప కార్యములు సుగ్రీవుని శ్రమ సఫలమైనవని పలుకుచు తన శౌర్యమును వానర-రాక్షస జనుల యెదుట చెప్పుచుండ సీత కన్నీరు గార్చుచు నిలబడెను.రాముడు సీతపై తనకు కలుగుచున్న క్రోధముతో తన యుధ్ధపరిశ్రమను దెలుపుచు సీత నడవడిని గురించి యతినీచముగ మాట్లాడెను.

యుధ్ధ.118వ సర్గము
             శ్లో||పశ్యత స్తాం తు రామస్య భూయః క్రోధో వ్యవర్ధతః,
             ప్రభూతా జ్యావసిక్తస్య పావకస్యేవ దీప్తతః,

             శ్లో||సబధ్ధ్వా భ్రుకుటీం పత్రే తిర్యక్పేక్షిత లోచనః,
             అబ్రవీ త్పరుషం సీతాం మధ్యే వానరరక్షసాం.
ఆమెను చూచుచున్న రామునకు నేతితో తడిసి మండుచున్న యగ్నివలె కోపమతిశయించెను.అతడు కనుబొమలు ముడిచి,కన్ను లడ్డముగా త్రిప్పుచు వానర-రాక్షసుల మధ్యన సీతతో కఠినముగ బలికెను.

యుధ్ధ.118వ సర్గము:రాముడు సీతతో జనమధ్యమున
             శ్లో||ఇతి ప్రవ్యాహృతం భద్రేమయై తత్కృత బుధ్ధినా,
             లక్ష్మణే భరతే వా త్వం కురుబుధ్ధిం యధా సుఖం,

             శ్లో||సుగ్రీవే వానరేంద్రే వా రాక్షసేంద్రే విభీషణే,
             నివేసయ మనస్సీతే యధా వా సుఖమాత్మనః.
భద్రే!లక్ష్మనునియందుగాని,భరతునియందుగాని,వానరేంద్రుదగు సుగ్రీవునియందుగాని,రాక్షసరాజగు విభీషణునియందుగాని నీ యాత్మకు సుఖము గలుగునట్లుగా బుధ్ధి నుంచుము.

తనను వివాహమాడి తనకై సర్వమును పరిత్యజించి యడవుల కేతెంచిన ఇల్లాలి నిట్లు పలికిన రాము నేమనవలయును?ఆమె నగ్నిసాక్షిగ పరినయమాడునా డతడు చేసిన ప్రమాణమేమి?భార్య నట్లు "వారిపై మనసు పడుము - వీరిపై మనసు పడుము" అని పలుకువానికి భార్య యెందుకు?ఏంతటి నీచుడు-హీనుదు-త్రాగుబోతు-దుర్వ్యసనలోలుడు-బుధ్ధిహీనుడు భార్య నావిధముగ పరులయందు మనసుంచుమని మాటలాడును?ఇట్టి రాముని ధర్మజ్ఞుడు,సత్యసంధుడు,బుధ్ధిమంతుడు,జ్ఞానసంపన్నుడు,వేదవేదాంగతత్వము నెఱిగినవాడు,క్షమయందు ధరిత్రీసముడు అని వాల్మీకి వచించుటెంత సమంజసము?

రావణుని సోదరియగు శూర్పనఖను విరూపిగ నొనర్చి రావణునిచే సీతాపహరణమునకు నాంది పల్కినది రాముడు.రావణుడు సీత నపహరిప రాముడు క్రోధము జూఒపవలసినది రావణుని మీదగాని సీతమీద కాదుగదా!

భరతుడు తనకు రాజ్యమొసంగుటకు సంసిధ్ధుడుగా నుండెనా? లేదా అయను విషయమును సేకరించుటకై హనుమంతుని గూఢచారిగ నియమించియు,తన కాప్తులైన భరద్వాజ-గుహుల యొద్ద భరతుని విషయము సేకరించిన రాముడు సీత యొక్క శీలమును గురించియు - సీతకు కాపలాయుండిన స్త్రీలద్వారా గాని,మరి యే ఇతర విధముగ నైన సేకరింపవచ్చు గదా!

ఈ సందర్భమున అగ్ని సీతను తన యంకమందుంచుకొని పై చిదుగులను నెట్టివేసి పైకి వచ్చెననుత సహజవిరుధ్ధముగ నున్నది.అగ్ని ప్రభావమును జూపదలచిన సీత అగ్నియందు దహింపకుందనే యుందవలయును.దహింపబడినచో నా మంటలనుండియే రావలయును.లేదా, యెక్కదనుండియో భూమియడ్గున,అగ్ని యడుగున నుండి వచ్చిన సహజముగనే రావలయును.సీఎతపై చిదుగులను నెట్టివేయవలసిన యగత్యమేమిటి?అంతటి మహాత్మ్యముతో నగ్ని వచ్చునపుడు చిదుగులు వాటంతటవీయె పోవా!కనుక ఇది కల్పితమనుటలో సందేహము లేదు.

అగ్నిలో పదబోవు సీతను - అచటి జనుల యఱపుల చేతను,హాహాకారములచేతను చెంతనుబ్న్న వారాపి యుందురు.రామునకు సీత శీలవతి యని యచటి రాక్షసులు, సీత పరిస్థితి స్వయముగ గాంచిన హనుమంతాదులు నచ్చజెప్పియుందురు.రాముడు తాను త్వరపడి పలికిన మాటలను సమర్ధించుకొనుతకై ఆ సంగతి తనకు తెలియుననియు ప్రజలు తనను నిందింతురని తానట్లు పలికితినని వచించి సీతను స్వీకరించి యుండును.

కనుక రాముడు సీతను పవిత్రురాలని తలచియు పరుల కొరకై యగ్నిపరీక్షకు సమ్మతించెననుట యబధ్ధము.పై విషయములన్నిటిని బట్టి రాముడు సీతనొక భోగవస్తువుగ పరిగణించెను.విలాసవతియగు స్త్రీనివలె యనుభవించెను.యౌవనమదోన్మత్తుడై కామించెను.అంతియే గాని యామేను ప్రేమించె ననునది యవాస్తవముగ గంపించుచున్నది.రాముని మనస్తత్వమును తెలిపరచు  రాముని ఈ క్రింది వాక్యములను చూడుడు.

అరన్య.75వ సర్గము:
             శ్లె||రాజ్యభ్రష్ఠేన దీనేన తస్యా మాసక్త చేతసా,
             కధం మయా వినాశక్యం సీతాం లక్ష్మణ జీవితం.
రాజ్యభ్రష్టుడనై,అందుచే దీనునై,ఆ దీనత్వము పోగొట్టుకొనుటకు సీతపై మనస్సు మళ్ళించుకొంటిని.ఆ సీతకూడ లేనిచో నెటుల జీవింపగలను?

ఈ మాటలను బట్టియు రాజ్యభ్రష్టుడగుట చేతనే తన దిగులు పోగొట్టుకొనుటకై సీతయందు తన మనస్సును మళ్ళించుకొనెను.అందుచేతనే మరల రాజ్యమును బొందిన పిదప సీతకంటె తనకు ప్రియమైనది రాజ్యము గనక ప్రజాభిప్రాయమను నెపముతో సీతను వనముల కంపియుండునని తోచుచున్నది.
_______________________________________________________________
ఈ భావాలు అన్నీ న్యూ విజయ ఆర్టుప్రెస్,గాంధీచౌక్-తెనాలి నుండి సెప్టెంబరు 1995లో ప్రధమ ముద్రణ ద్వారా సర్వహక్కులు గ్రంధకర్తవిగా ముద్రించబడిన డా.స్వర్ణ వాచస్పతి గారి "వాల్మీకి రామాయణ సఔరభాలు" అను గ్రందము లోనివి.

వీరి తండ్రిగారు "విమర్శకాచార్య","శిల్పకళాకోవిద" స్వర్ణ సుబ్రహ్మణ్య కవిగారు మహాకవి కందుకూరి రుద్రయ విరచిత "నిరంకుశోపాఖ్యాన" సుధాతరంగిణీ వ్యాఖ్యాత,భారతీయ మహాశిల్పాద్యనేక గ్రంధకర్త,త్రిశతాధిక దేవతా ప్రతిష్ఠా నిర్వాహకులు మరియు కనకాభిషిక్తులు! 

ఈ మహాద్భుతమైన గ్రంధరాజమునకు పీఠిక వ్రాసిన వారు కూడా "విద్యా విశారధ","సాహిత్య సరస్వతి" బిరుదాంకితులైన డా.కన్నెగంటి రాజమల్లాచ్గారి గారు అచ్చ్గు క్రొవ్విడి స్వైరిణి వలెనే "గుండె ధైర్యమున్నవారు మాత్రమే ఈ పుస్తకమును చదువుడు" అని హెచ్చరిక గూడా చేసినారు?
_______________________________________________________________

Friday, 8 May 2015

శిక్ష పడడానికి 13 యేళ్ళు?బెయిలు దొరకడానికి 4 గంటలు!చచ్చినోడు దిక్కులేనోడు అయితే అంతే మరి?!

"కులము గల్గువాడు,గోత్రంబు గల్గువాడు,విద్యచేత విర్రవీగువాడు పసిడి గల్గువాని బానిసకొడుకులు" అన్నాడు వేమన్న!యెప్పుడు?కొన్ని శతాబ్దాల క్రితం - బహుశా సహస్రాబ్దాలు కూడా దాటిపోయి ఉండొచ్చు!కానీ కొన్ని నిజాలు యుగాల తరబడి మళ్ళీ మళ్ళీ రుజువులతో సహా జరుగుతూనే ఉంటాయి - కొన్ని కొన్ని తప్పుల్ని మనుషులు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు,యెందుకనో?

ఒక రాజుగారబ్బాయి మనుషుల దుఃఖాల్ని చూసి తట్టుకోలేక తనకి కొత్తగా పుట్టిన పిల్లాణ్ణి కూడా "కొత్తగా తగులుకున్న బంధం" అని విసుక్కుని రాజ్యం వొదిలి అడవులకి పోయి చిక్కి శల్యమై ఆఖరికి ఒక పశువులు కాసుకునే అమ్మాయి అమాయకంగా చెప్పిన మాటలతో దారి మార్చుకుని సరైన జ్ఞానాన్ని పొంది తధాగతుదనే పేరున కీర్తి గడించి ఒక కొత్త మతసాంప్రదాయాన్ని సృష్టించినా అతని శిష్యులే అతని బోధనల్ని సరిగ్గా అర్ధం చేసుకోలేక ఆనవాళ్ళు కూడా లేకుండా మార్చిపారేసి లెక్కకు మిక్కిలిగా చీల్చి ముక్కలు చేసి పవిత్రంగా ఉండాల్సిన ఆరామాల్ని "లంజదిబ్బ" లని పిలిచేటంతగా భ్రష్టు పట్టించి యేం చెప్పాడో తెలియకపోయినా యేదో ఒకటి చెప్పాడు గాబట్టి గొప్పోడంటూ ప్రపంచమంతా నెత్తిన మోసినా అతని వల్ల ఈ ప్రపంచంలోని దుఃఖరాశిలో యెంత తగ్గిందని లెక్క తీస్తే యేం మిగులుతుంది?

సకలజనుల సంక్షేమం ఉద్దేశించి సార్వజనీన దృక్పధంతో ప్రవచించిన ధార్మికబోధలు కూడా ఆఖరికి కోమట్లు బేరాలు పెంచుకోవడానికీ రాజులు పెత్తనం చెయ్యడానికీ వూతకర్రలుగా మిగులుతున్నప్పుడు ఓ నాలుగు కేకలూ మరో నాలుగు నిట్టూర్పులూ యేమి సాధించగలవు?

ఏనుగుల వీరాస్వామయ్య గారు తన కాశీయాత్రచరిత్రలో తనకు కలిగిన కొన్ని ధార్మీక సందేహాలకి తన పాండిత్యంతోనే జవాబులు కూడా సాధించి వివరిస్తారు - "హిందువులలో విధవా పునర్వివాహాలు నిషేధించడం వల్ల బాల్యవితంతువులు బాధలు పడితే కిరస్తానం వారు విధవా పునర్వివాహాల్ని సమర్ధించగా విశంఖలత్వానికి దారి తీస్తున్నాది" అని దృష్టాంతాలతో సహా పూర్వులు యెంత మంచిగా ఆలోచించి సాంప్రదాయం చేసినా కొందరు వాటిని భ్రష్టు పట్టించడం అన్నిచోట్లా వుండటం గురించి తర్కించుకుని ఆఖరికి "అందరికీ వొప్పుదలగా వుండే చెడు కలవని మంచి" యెక్కడా ఉండదని తీర్మానించేశారు!

మనం మనకి మంచి అనుకుని చేసిన పని యెవడో ఒకడికి చెడు కావచ్చు,మనం యెంత అహింసాయుతంగా బతకాలనుకున్నా హింస చెయ్యక తప్పదు!అసలు సిసలు తమాషా యేమిటంటే మనం చెడు అనుకునే పనిలో కూడా మంచి ఉంటుంది?కళ్ళముందు జరిగిన ప్రతిదానికీ యేదో ఒకటి మాట్లాడాలనుకుంటే మనం మాట్లాడిన పది మాటలకి తొమ్మిది బూతుల కింద తేల్తాయి,సారమెరిగి మాట్లాడాలన్న పట్టుదల ఉంటే మితంగా అయిదు మాటలే మాట్లాడినా అందులో నాలుగు మాలు నీతిగా ఉంటాయి!మంచిగా కనబడిన ప్రతివాడూ మంచివాడు కాదు,గాలికి కొట్టుకుపోయే యీక మాదిరి నాకు లాభమొస్తుం దనుకుంటే మంచి పనులు చేస్తా నష్టమొస్తుం దనుకుంటే శుక్రనీతిసారం అడ్డుపెట్టుకుని వెధవపనులు చేసయినా నష్టం తప్పించుకుంటా ననే ధోరణిలో ఉన్నవాడు మంచివాడు కాదు,నష్టమొచ్చే చోట కూడా తప్పుడు పని చెయ్యడానికి వెనుకాడి మౌనంగా నష్టాన్ని భరించేవాణ్ణి మాత్రమే మంచివాడుగా లెక్క వెయ్యాలి!

గట్టిగా మంచికి నిలబడేవాళ్ళే ఇవ్వాళ అసలైన మైనార్టీ వర్గం?
వాళ్ళు మెజార్టీ కానంతవరకూ లోకం ఇట్టాగె ఉంటుంది నేస్తం!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...