Sunday, 5 May 2019

"అప్పు చేసి అప్ప్పుకూడు తినరా ఓ నరుడా!" అని ప్రజాప్రతినిధులే బరితెగించి చెప్తుంటే దేశపు జాతీయఋణం ఎట్లా తీరుతుందిరా దేవుడా?

      ఆర్ధికశాస్త్రం మీద గౌరవం ఉండి సత్యం పట్ల నిబద్ధులై ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకుందామనే నిజాయితీ గల అనుభవజ్ఞులైన ఆర్ధిక శాస్త్ర విశ్లేషకులు ప్రస్తుతం మనల్ని కలవరపెడుతున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కల్పిస్తున్న సమస్యలకు సూచించిన అన్ని పరిష్కారాల్ని క్రోడీకరించి చూస్తే నాకు మూడు ముఖ్యమైన సూచనలు కనిపించాయి.కరెన్సీ తయారీని బ్యాంకుల నుంచి తొలగించి ప్రభుత్వమే మూలధనపు ద్రవ్యనిల్వలనుంచి తయారుచేసి అందించడం - ఇది ప్రభుత్వాధినేతలు చెయ్యాల్సిన పని,అనుత్పాదక రంగాలను ప్రోత్సహించి inflation సృష్టించటానికి బదులు పెట్టుబడుల్ని/ఋణాల్ని ఉత్పాదక రంగాలకు మళ్ళించాలి - ఇది బ్యాంకర్లు చెయ్యాల్సిన పని,  మొదట పొదుపు చేసి పిదప మదుపు పెట్టటం - ఇది సామాన్యప్రజలు చెయ్యాల్సిన పని.వినగానే బాగుండి ఆచరిస్తే మేలు జరుగుతుందనే ఆశను రగిలిస్తున్నప్పటికీ ఇవి మన దేశపు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల వంటివే!

        ఎందుకంటే, ప్రాచీన కాలపు venitian blaack oligarchy ఎప్పటి కెయ్యది ప్రస్తుతమో అప్పటి కయ్యది సుకృతం అన్నట్టు అనేక చారిత్రక దశలలో knights templar, freemaasontry, illuminati వంటి  రాజకీయం,ఆర్ధికం,ఆధ్యాత్మికం కలిసిపోయి రూపు దిద్దుకున్న చిన్న చిన్న సాలీళ్ళను సృష్టించుకుని నేటికి వీటన్నిటి సంకీర్ణ రూపమైన పెద్ద సాలీడును తలపిస్తున్న British financial oligarchy యొక్క స్వభావం కొన్ని వందల యేళ్ళ పాటు నక్కలో ఉండే జిత్తులమారి తనాన్నీ, ఎలుగుబంటిలో ఉండే మొండితనాన్నీ, తోడేలులో ఉండే క్రూరత్వాన్నీ, వేటకుక్కలో ఉండే తెగింపునీ, పులిలో ఉండే ఓపికనీ, కోతిలో ఉండే వెకిలితనాన్నీ, ఒంటెలో ఉండే సోమరితనాన్నీ, ఏనుగులో ఉండే భారీతనాన్నీ, సింహంలో ఉండే గర్వాన్నీ అలవాటు చేసుకునే ప్రయత్నంలో మానవత్వాన్ని పోగొట్టుకోవడం వల్ల అలా తయారైంది - సుభాషితాలతోనూ సంధి ప్రతిపాదనలతోనూ మార్చడం గానీ ఏమార్చడం గానీ సాధ్యం అయ్యే పని కాదు. మానవమాత్రులకి వాళ్ళని గెలవటమే కాదు, వాళ్ళకి ఎదురు నిలబడటం కూడా సాధ్యం కాదు. Europeలో,Britainలో కూడా కొందరు ప్రయత్నించారు. కానీ, సమయం చాలకనూ వనరులు లేకనూ విరమించుకున్నారు.అసలు ఎదిరించాలని అనుకోని బుద్ధిమంతులు మాత్రం చాలా సౌకర్యాలు పొందారు!

         ప్రాచీన కాలపు అమెరికా చరిత్ర చాలా చిన్నది.కొలంబస్ ఇండియాకు దారి కనుక్కోవడానికి బయల్దేరి దారి మధ్యలో సరిగ్గా తనకు తెలిసిన అప్పటి భారతీయ సంస్కృతిని పోలిన సంస్కృతిని ప్రతిబింబిస్తున్న జనసమూహాన్ని చూసి గమ్యం చేరినట్టు మురిసిపోయి అక్కడి ప్రజలకు "రెడ్ ఇండియన్లు" అని పేరు పెట్టి తాను ఆశించిన వైభవం కనబడక  అసలైన ఇండియాను కనుక్కోవడం కోసం అక్కడినుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలాకాలం పాటు నిశ్శబ్దం రాజ్యమేలింది.అయితే, బోస్టన్ టీ పార్టీ అనే సంచలనాత్మకమైన సన్నివేశం నుంచీ మనకు తెలుస్తున్న ఆధునిక కాలపు ఆమెరికా చరిత్ర సమస్తం సామాన్యులు బ్యాంకింగ్ వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలతో ముడిపడి ఉంటుంది!

        అప్పటికి చాలాకాలం క్రితమే అమెరికాలో కాలనీలు ఏర్పాటు చేసుకుని ఆఫ్రికా నుంచి బానిసల్ని తెచ్చుకుని పని చేతించుకుని తెగ బలిసిన అమెరికన్ కాలనిస్టులు బ్రిటిష్ ప్రభుత్వం తమ మీద విధించిన పన్నులకి అలిగి December 16, 1773న 342 బ్రిటిష్ టీ కార్టన్లని సముద్రంలోకి విసిరి ముంచేసి నిరసన ప్రకటించడంతో నిప్పురవ్వ రగులుకుని క్రమేణ అంతర్యుద్ధం కింద మారి తర్వాత స్వాతంత్య్రపోరాటం రూపం తీసుకుని జార్జి వాషింగ్టన్ నేతృత్వంలో స్వతంత్రదేశపు హోదాని పొందింది.అయితే, ఇది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల నుండి ఉద్భవించిన ధర్మయుద్ధం కాదు, కేవలం తమ మీద ప్రభుత్వం పెత్తనం చెయ్యడాన్ని సహించలేని అమెరికాలోని 13 కాలనీల వ్యాపారుల కూటమి ఇల్యూమినాటి, ఫ్రీ మాసన్రీ వంటి మతసంస్థల సాయంతో తమ స్వార్ధానికి ప్రజల క్షేమం అనే ముసుగు తొడిగేసి చేసిన మర్మయుద్ధం - అమెరికన్ కరెన్సీ మీద ఇల్యూమినాటి పిరమిడ్ కొట్టొచ్చినట్టు కనబడటమే అందుకు బలమైన సాక్ష్యం!

         ఆదినుంచీ అనేకమంది అమెరికన్ మేధావులు ప్రజల తరపున ఈ దుర్మార్గమైన బ్యాంకింగ్ సిస్టం మీద పోరాడుతూనే ఉన్నారు, ఒకసారి గెలుస్తున్నారు, అంతలోనే అటువైపున ఉన్నవారి చాటుదెబ్బలకి బలై ఓడిపోతున్నారు.దాదాపు 19వ శతాబ్దపు చివరి దశకంలో Rothschilds అత్యంత ధనిక దేశమైన అమెరికాని తన పట్టులోకి తెచ్చుకోవాలని అనుకుంది. 1900 దరిదాపుల Paul Warburg అనే సమర్ధుణ్ణి Kuhn Loeb & Co అనే banking firmతో కలిసి పనిచెయ్యమని U.Sకి పంపించింది.  మొదట Jacob Schiff, Paul Warburg కలిసి FEDERAL RESERVE BANK పేరుతో ఒక private central bank స్థాపించటం కోసం ప్రచారం మొదలుపెట్టారు.

        1907లో New York Chamber of Commerce ముందు Jacob Schiff గంభీరంగా “If we don’t get a central bank with sufficient credit control, this country will experience the most severe and far-reaching financial panic in its history!” అని ప్రకటించాడు. వాళ్ళు ఇలా చెప్పారు, అది అలా జరిగింది! monetary crisis మొదలైంది, financial market అల్లకల్లోలమైంది, దేశం మొత్తంలో పదిల వేల సంఖ్యలో జనం సర్వనాశనమైపోయారు - ఒక్క దెబ్బకి రెండు పెట్టలు, ఇక్కడి నష్టం లాభం రూపంలో Rothschildsకి వెళ్ళడమూ central bank  ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలియజెయ్యడమూ వెంటవెంటనే జరిగిపోయాయి.  FEDERAL RESERVE SYSTEM (the private central bank of the U.S.) యొక్క విధి విధానాలకి సంబంధించిన final version మొత్తం Georgiaలోని Jekyll Islandలో ఉన్న Morgan Estateలోనే రూపు దిద్దుకుంది.

         అది December of 1910, Nelson Aldrich అనే senator  Paul Warburg,Frank Vanderlip, Benjamin Strong, Henry Davidson, Charles Norton, Abe Andrews  అనే ఆనాటి ప్రపంచపు మొత్తం సంపదలో నాలుగో వంతును మూటగట్టిన ఆరుగురితో కలిసి New York నగరంలోని ఒక private train car ఎక్కాడు.వాళ్ళు Georgiaలోని Jekyll Islandలో ఉన్న Morgan Estate వెళ్ళారు.అక్కడ తొమిది రోజులు గడిపి తమను అక్కడికి పిలిపించుకున్న మేధావి సూచనల ప్రకారం,federal reserve sustemకి ముసాయిదా ప్రతిని రూపొందించారు.ఈ ముసాయిదా ప్రతిలో ఉన్న దుర్మార్గం తెలియాలంటే తర్వాత కాలంలో wanderlip తమ Jekyll Island ప్రయాణం గురించి చెప్పిన మాటల్ని వింటే చాలు - "I was aas secretive - indeed, as furtive - as any conspirator.Discovery, we knew, simply must not happen , or else all our time and effort would be wasted.If it were to be exposed that our particular group had got together and written a banking bill, that bill would have no chance whatever of passage by congress." అంటే, వాళ్ళు అంత రహస్యం పాటించటానికి కారణం అమెరికన్ ప్రజలకి వీళ్ళ అసలు సంగతి తెలిసి వ్యతిరేకించే కృతనిశ్చయంతో ఉండటమేనని తెలుస్తూనే ఉన్నది కద!అప్పటికే "Wherever a central bank went, there would be wealth inequality, wild swings between economic booms and bursts and after each burst, those in the top of cociety mysteriously came out richer,while everyone else got poorer" అనే సత్యాన్ని Bank of England చరిత్రని బట్టి తెలుసుకుని ఉన్నారు.

         చాలా మామూలుగానే  Aldrich Bill సభలోకి వచ్చినప్పుడు అప్పటికే "తగినంత స్థాయిలో అప్పు ఉండటం ఆర్ధికరంగానికి ఉత్సాహం తీసుకొస్తుంది, అసలు అప్పు లేకపోతే భద్రత ఎక్కువైపోయి ప్రజలకు బద్ధకం పెరిగిపోయి ఆర్ధికాభివృద్ధి నిలవనీరులా ఉంటుంది" అని ప్రగల్భిస్తున్న ఈ మహనీయతేజుడైన ఋణదార్శనికుడి ప్రమేయాన్ని చూసి ప్రమాదం పసికట్టిన ఇటువైపు మేధావులు బిల్లుని తిరక్కొట్టెయ్యాలని అనుకున్నారు.అటువైపు మేధావులు కూడా ప్రమాదం పసికట్టి ఇద్దరు మిలియనీర్ మిత్రుల్ని రాయబారం పంపించి Federal Reserve Act అని పేరూ రూపూ మార్చి పై స్థాయిలోని వారి వ్యతిరేకతని తగ్గించారు.దీని తర్వాత కింది స్థాయిలో ఉన్న అసంఖ్యాక ప్రజానీకాన్ని మోసం చెయ్యటానికి ఒక బహుముఖీనమైన అంతర్నాటకం నడిపించారు.దాని ప్రకారం దేశంలోని బ్యాంకర్లు అందరూ ఈ బిల్లు అవ్ల తమకు ముప్పు వస్తుందన్నట్టు ఆందోళన నటించారు.పేపర్లలో ఈ బ్యాంకర్ల ఏడుపుల్ని చూసిన అమాయకులకి బ్యాంకులు ఇంత వ్యతిరేకతను చూపిస్తున్నాయంటే అది తమకు అనుకూలమైనదని అనుకున్నారు.ఈ సజీవ నటనని మరింత తారాస్థాయికి తీసుకెళ్తూ బ్యాంకుల తోకల్ని కత్తిరిస్తున్నట్టు కనిపించే క్లాజుల్ని బిల్లులో చేర్చారు.ఆఖరికి 1913 డిసెంబర్ 23న అమెరికన్ కాంగ్రెసు సభ్యులలో చాలామంది శెలవులో ఉన్న శుభదినాన ఫెడరల్ రిజర్వ్ యాక్ట్ సభ ఆమోదం పొంది చట్టరూపం దాల్చేసింది!

         అమెరికాతో వ్యాపార వ్యవహారాలు జరపాలని కోరుకునే వారంతా తమ లావాదేవీల కోసం సంప్రదించాల్సిన  Federal Reserve Systemని ఏర్పాటు చేసేశారు - Paul Warburg మొదటి chairman అయ్యాడు.FEDERAL RESERVE SYSTEM (the private central bank of the U.S.) యొక్క విధి విధానాలకి సంబంధించిన final version మొత్తం Bank of England  యొక్క విధి విధానాలకి ప్రతిరూపం.శ్రీమాన్ అంబేద్కర్ మన దేశపు రిజర్వ్ బ్యాంక్ రూపకల్పనలో ఇదే చట్రాన్ని అనుసరించారు. పాటిస్తున్న ఆర్ధిక చట్రం మనసా వాచా కర్మణా ప్రజల కోసం కాక బ్యాంకుల యజమానుల కోసం నడిచేటట్టు  ఉంటే ఆర్ధిక విశ్లేషకులకు గానీ రాజకీయ నాయకులకు గానీ ప్రజల పట్ల ఎంత నిజాయితీ ఉన్నా ఏమి లాభం?

         ఇంతకీ, Georgiaలోని Jekyll Islandలో ఉన్న Morgan Estate ఎవరిదో కాదు, John Rockefellar అనే ఇతరుల నుంచి చిన్న స్థాయి పోటీని కూడా సహించలేని మోనాపలిస్ట్ ఎకానమీ సిద్ధాంతకర్త గారిది - "Comptetion is a sin!" అనేది ఆయనగారి సుస్థిరమైన అభిప్రాయం.ఆ తరహా వ్యాపారస్థుల జీవితాలకు దర్పణం పట్టే ఆయన గారి సంక్షిప్తజీవితచరిత్రను వచ్చే భాగంలో చెప్తాను. 

(this is the sixth part of a series on macro economy!)

3 comments:

  1. హరి బాబు గారు పూర్వము భారతదేశంలో ఒకటే భాష ఉంటే అందరు ఐక్యంగా ఉండి బ్రిటిష్ వాళ్లకు లొంగి ఉండే వారు కాదు ముస్లిం రాజులు కూడా మన దేశం లో అడుగు పెట్టె వారు కాదు పూర్వము ఐక్యత లేక భారతదేశం విదేశీ పాలు అయి ముస్లిం క్రిస్టియన్సు కులస్తులు మత మార్పిడిలు గత్యత్రం లేక కొందరు ప్రజలు మతం మార్చు కున్నారు అని నా అనుమానం ..

    ReplyDelete
  2. ఒకే భాష మాట్లాదే తెలుగువాళ్ళని ఎంత క్రూరంగా విదదీశారో చూశారుగా!ఇల్యూమినాట్టి బ్యాచ్ తల్చుకుంటే ఎంత నీచమైన పనిని కూదా సిగ్గు లేకుండా చేసేస్తుది.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...