Friday, 10 May 2019

భారతదేశం మోయలేని ఋణభారం నుంచి విముక్తి పొందడానికి సరైన మార్గం ఏమిటి?

        ఆర్ధికశాస్త్రం మీద గౌరవం ఉండి సత్యం పట్ల నిబద్ధులై ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకుందామనే నిజాయితీ గల అనుభవజ్ఞులైన ఆర్ధిక శాస్త్ర విశ్లేషకులు సూచించిన "కరెన్సీ తయారీని బ్యాంకుల నుంచి తొలగించి ప్రభుత్వమే మూలధనపు ద్రవ్యనిల్వల నుంచి తయారుచేసి అందించడం - ఇది ప్రభుత్వాధినేతలు చెయ్యాల్సిన పని,అనుత్పాదక రంగాలను ప్రోత్సహించి inflation సృష్టించటానికి బదులు పెట్టుబడుల్ని/ఋణాల్ని ఉత్పాదక రంగాలకు మళ్ళించాలి - ఇది బ్యాంకర్లు చెయ్యాల్సిన పని,  మొదట పొదుపు చేసి పిదప మదుపు పెట్టటం - ఇది సామాన్యప్రజలు చెయ్యాల్సిన పని." అనేది అబ్రహాం లింకన్ కాలంలో ప్రయత్నించి చూశారు.కానీ అతను హత్యకు గురవడంతో మిగిల్మినవాళ్ళు నీరసించి పోయారు.ఇలాంటి దుష్కర కార్యాలు చెయ్యాలనుకునేవాళ్ళు శత్రువుల నుంచి వచ్చిపడే ప్రమాదాల నుంచి ఆత్మరక్షణకి సంబంధించిన వ్యూహ రచనలు కూడా చేసుకోవాలిసుమారు 2000 సంవత్సరాల నుంచి అద్భుతమైన వ్యూహనిర్మాణదక్షతను ప్రదర్శిస్తున్న బలమైన శత్రువుని అమాయకమైన ప్రధమ ప్రయత్నంలోనే గెలవడం అసాధ్యం!

        వాళ్ళ భావజాలమే "మేము ఇతరుల మీద అధికారం చెలాయించడానికే పుట్టాము,ఇతరులు మాకు అణిగిమణిగి పడి వుండాల్సిందే,ప్రపంచంలోని జ్ఞానం అంతా మా దగ్గిరే ఉంది.ఇతరులు మాకు సమవుజ్జీలు కాదు" అనే అహంభావంతో నిండి ఉంటుంది. క్రైస్తవం, ఇస్లాం, మాసన్రీ, ఇల్యూమినాటీ వంటి మతశాఖల సాహిత్యం ప్రజలకు తమపట్ల విధేయతను అలవాటు చేసేటట్టు రూపొంచించబడ్డాయి - మేము తయారు చేసిన వస్తువునే కొనాలి అనటానికి మేము చూపించిన దేవుణ్ణే పూజించాలి  అనేది ప్రత్యామ్నాయం,మాకు ఎవరూ పోటీ రాకూడదు అనటానికి ఇతర దేవతల్ని ధ్వంసం చెయ్యమనటం ప్రత్యామ్నాయం, మా సరుకులో క్వాలిటీ లేకపోయినా చచ్చినట్టు కొనాలి అనటానికి నమ్మితే స్వర్గం-నమ్మకపోతే నరకం అనేది ప్రత్యామ్నాయం!

      అమెరికన్ డాలర్ మీద ఉన్న రెండు శంఖువులూ ఆర్ధిక రంగంలో వారు ఆశిస్తున్న గుత్తాధిపత్యానికి చిహ్నాలు - కింది భాగంలో ఇటుకలతో కట్టినట్టు ఉన్న మూడొంతులు పూర్తయిన పెద్ద శంఖువు మాసన్రీకి చెందుతుంది, పై భాగంలో కన్నును ఇముడ్చుకున్న చిన్న శంఖువు ఇల్యూమినాటీలది. ప్రకృతిలోనూ సమాజంలోనూ ఆహార శంఖువు, కీర్తి శంఖువు, అధికార శంఖువు వంటివి ప్రతి చోటా కనపడతాయి గానీ వీళ్ళు తీసుకున్నది సంపద శంఖువు. ఆహార శంఖువు ఎట్లా ఉంటుందో తెలుసుకుంటే మిగిలిన శంఖువుల గురించి అర్ధం చేసుకోవడం తేలికగా ఉంటుంది.దేహం పైన పత్రహరితం ఉండి సూర్యకాంతిని ఉపయోగించుకుని తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగలిగిన వృక్షజాతులు  అట్టడుగున ఉంటాయి.ఇలాంటి సౌకర్యం లేని జీవులు వృక్ష సంబంధమైన ఆహారం తింటూ శాకాహారులు వృక్షజాతులకి పైన ఉంటాయి.వృక్ష సంబంధమైన ఆహారం జీర్ణం కావడం కష్టం కాబట్టి కొన్ని ఈ శాకాహారుల్ని తినే మాంసాహారులై శాకాహారులకి పైన ఉంటాయి.సంఖ్యని బట్టీ విస్తృతిని బట్టీ అంతస్థుల సైజుని సూచిస్తే మూడు అంతస్థుల పిరమిడ్ మనకి కనబడుతుంది.కళా రంగంలో కీర్తి ప్రతిష్ఠల విషయంలోనూ రాజకీయ రంగంలో అధికారం బిషయంలోనూ ఈ శంఖువులు కనబడతాయి.N.T.R అనే ఒక నటుడు దైవసమానుడిగా పేరు తెచ్చుకోవడం వెనక అతను దేవుడి పాత్రలు ధరించిన సినిమాలకి పనిచేసిన అన్ని శాఖల సాంకేతిక నిపుణుల కృషి కూడా ఉంటుంది - కాకపోతే చూస్తున్న దృశ్యమే ప్రధానం అని భ్రమపడటం వల్ల మిగిలినవాళ్ళు మనకి గుర్తు రావడం లేదు, అంతే!

        చిత్రం ఏమిటంటే, ఇల్యూమినాటీలూ మాసన్రీలూ ఇంత హడావిడి చేసి ఇన్ని మాయకబుర్లు చెప్పి గందరగోళం సృష్టించినప్పటికీ ఈ restricted competetion monopalistic economics ప్రకారం రాక్ ఫెల్లర్ లాంటివాళ్ళతో సహా ప్రతి ఒక్కరికీ శిఖరాగ్రం చేరడానికి ఉన్న ఒకే ఓక పద్ధతి ఎట్లా ఉంటుందో "వేలాదిమందిలో ఒక్కరు ఉద్యమిస్తారు, ఉద్యమించిన  వేలాదిమందిలో ఒక్కరు శ్రద్ధని కుదిరించుకోగలుగుతారు, శ్రద్ధను కుదుర్చుకోగలిగిన వేలాదిమందిలో ఒక్కరు నన్ను చేరుకోగలుగుతారు" అనే గీతావాక్యం చెప్తుంది. నేను వేదాంతం చెప్పడానికి ఈ పోలిక తీసుకు రాలేదు,వాళ్ళ మనసుల్లో సర్వలోకాధిపత్యం, అజరామరత్వం వంటి భావనలు లేకపోతే 1900 నాటికి ఒకడు ప్రపంచ సంపదలో సగభాగమూ మరో ఆరుగురు ప్రపంచ సంపదలో నాలుగో భాగమూ కూడబెట్టి సాధించేది ఏమిటి?రోజుకి మిలియన్లు సంపాదిస్తున్నవాడు రోజుకి టన్నుల లెక్కన తిండి తినగలడా?ఇతరుల మీద పెత్తనం చెయ్యాలన్న దురదే New World Order అనే పిచ్చితో ఇన్ని యుద్ధాల్నీ ఇంత భీబత్సాన్నీ సృష్టించేలా చేస్తున్నది.

      ఇతరుల మీద అధికారం చెలాయించడానికి కూడా ఒక పద్ధతి ఉంది - ఇతర్లకి వాళ్ళ ఎదుగుదలకి సాయం చేస్తారనీ వాళ్ళకి ప్రమాదం వచ్చినప్పుడు రక్షిస్తారనీ నమ్మకం కలిగితే కావల్సిన గౌరవాదరాల్ని అడక్కుండానే ఇస్తారు.కానీ ఇతర్లకి ఏదీ ఇవ్వకుండానే ఇతర్లనుంచి వాళ్ళ కష్టారితాన్ని లాక్కోవాలనుకుంటున్నారు, గాలిలోనుంచి పుట్టించిన డబ్బుని మనకి అప్పుగా ఇవ్వడానికి మన దగ్గిర్నుంచి అన్ని సెక్యూరిటీలు తీసుకుంటున్న వీళ్ళు మనకి  అప్పు ఇస్తున్న డబ్బు ఎక్కణ్ణించి తెస్తున్నారో చూపించమని అడిగితే ఏమి చేస్తారు?

       రిజర్వ్ బ్యాంక్ నోట్లు ఎలా ముద్రిస్తుందో చెప్పిన భాగంలో చెప్పని ఒక కొత్త విషయాన్ని ఇక్కడ చెప్తాను. కొత్త కరెన్సీ అవసరం అనుకుంటే ప్రభుత్వం ట్రెజరీ శాఖని లెక్కలు చూసి చెప్పమని అడుగుతుంది.ఆ లెక్కలు తేలాక ప్రభుత్వం బాండ్లను తయారు చేస్తుంది - ఇవి కమర్షియల్/ప్రైవేట్ బ్యాంకులో అక్కవుంట్ ఉన్న వ్యక్తి రాసే విత్డ్రాయల్ స్లిప్ లంటిది. ప్రభుత్వం ఒకోసారి వీటిని ప్రజలకి కూడా ఇస్తుంది.ప్రజలు తమంతట తాము గానీ ప్రభుత్వం అధికారుల ద్వారా గానీ రిజర్వ్ బ్యాంకుకు అప్పగిస్తే రిజర్వ్ బ్యాంక్ ఆ మొత్తానికి చెక్కు ఇస్తుంది.అది ప్రజలు కానీ ప్రభుత్వం కానీ క్యాష్ చేసుకోవడం ఎలాగో మీకూ తెలిసిందే కదా.కానీ, రిజర్వ బ్యాంక్ చెక్కు రాసే ముందు తన అక్కవుంటులో అంత డబ్బును ఉంచుకోవాల్సిన అవసరం లేదు.అదే పని, మన ఎక్కవుంటులో ఉన్నదానికన్న ఎక్కువ డబ్బుకు చెక్ ఇస్తే ఫ్రాడ్ అవుతుంది - ఇదెక్కడి న్యాయం, చెప్పండి! 

       ప్రైవేట్/కమర్షియల్ బ్యాంకులు కూడా అంతే!వాళ్ళు మనకి లోనుగా ఇచ్చే డబ్బు వాళ్ళ అధీనంలో ఉండాల్సిన పని లేదు, వాళ్ళు తమ దగ్గర లేని వంద రూపాయల్ని మనకిస్తూ మన కష్టార్జితం నుంచి నూట యాభై రూపాయలు గోళ్ళూడగొట్టి వసూలు చేసుకుంటున్నారు!అధికారంలో ఉన్నది మోదీ గానీ రాహుల్ గానీ మరో గొట్టాం గానీ ఒకోసారి, "ఆర్ధిక వ్యవస్థ బాగు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం, సహకరించండి!" అని బుజ్జగిస్తూ చెప్తున్న మాటల వెనక ఉన్న అసలైన అర్ధం "బ్యాంకింగ్ వ్యవస్థ బాగు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం, సహకరించండి!" అని తప్ప అవి ప్రజలకు మేలు చెయ్యడం కోసం తీసుకునే నిర్ణయాలు కావు.Inflation, deflation అనుకోకుండా ఉనికిలోకి రావు - Reserve Bank అవసరమైన దానికన్న ఎక్కువ కరెన్సీ ప్రింట్ చేస్తే inflation  వస్తుంది, Reserve Bank అవసరమైన దానికన్న తక్కువ కరెన్సీ ప్రింట్ చేస్తే deflation  వస్తుంది.మొదటి దానివల్ల తక్కువ వస్తువుల వెనక ఎక్కువ కరెన్సీ పరుగులు పెట్టటం జరుగుతుంది,రెండవ దానివల్ల వస్తువుల్ని కొనడానికి చేతిలో కరెన్సీ ఉండదు - మొదటి దానికన్న రెండోది పదింతలు భయానకమైనది,అప్పుడప్పుడు మనకి మీడియాలో కనపడుతున్న నడి రోడ్డు మీద వందలాది జనం మీద కాల్పులు జరిపే పిచ్చోళ్ళు వీటి వల్లనే పుడతారు!

      ఇక ప్రైవేటు బ్యాంకులకి జనం అనుత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెట్టటమే ఎక్కువ లాభం అని ఎందుకు చెప్పానో తెలుసా!ఒక చోట నల్ల టులిప్ పూలతో ఆర్ధిక విధ్వంసం సృష్టించారు.రంగుల్లో పూచే టులిప్ పూలు నల్లరంగులో పూస్తుండేసరికి అవి జెనెటికల్ ఇంజనీరింగ్ ద్వారా సృష్టించబడిన మేలురకమనీ వాటిని ఫ్లవర్ వాజుల్లో పెట్టుకుంటే అదృష్టం కలిసొస్తుందనీ మోతెక్కించేశారు.ఇంకేముంది, విత్తనాల్ని అమ్మేవాళ్ళూ అంట్లు కట్టేవాళ్ళూ ఎరువుల్ని సప్లయి చేసేవాళ్ళూ జనం మిడతల దండులా వచ్చిపడి పెట్టుబడులు పెట్టారు - బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని.దీన్ని boom అంటారు.తర్వాత "అబ్బే!వాటికంత సీను లేదు, ఏదో వైరస్ వల్ల రంగు మారింది" అనే వార్త  పొక్కడంతో bust అయ్యింది - ఈ దిక్కుమాలిన జంటపనులకి ముద్దుపేరు bubble creation, అంటే బుడగల్ని పేల్చటం!ఒక్కో బుడగ పేలినప్పుడు ఒక మెట్టు పైకి ఎక్కుదామనే పేరాశతో అక్కడ చేరిన అనేకమంది బడుగుజీవుల కష్టార్జితం అప్పటికే బలిసి ఉన్న బ్యాంకర్లని మరింత బలిసేటట్టు చేస్తుంది.

        సామాన్య ప్రజలు తమకి తెలియని చోట్ల పెట్టుబడులు పెట్టకూడదు - అదీ బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని.ఇక్కడ ఇల్యూమినాటీ మ్యాసన్రీ వంటి క్రూరమైన సంస్థలు లేవు గనక మన ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం కన్న స్వతంత్రతనే అనుభవిస్తున్నది, అంతవరకు సంతోషమే! World Bank ఇప్పటికిప్పుడు తీర్చమని ఒత్తిడి పెట్టడం లేదు గనక జాతీయ ఋణం గురించి కంగారు పడనక్కర లేదు గానీ లండను బ్యాంకర్లు కోరుకుంటున్నట్టు ఒక్కో రంగానికి ఒకే ఒక అతిపెద్ద పిరమిడ్ అన్నట్టు గాక ప్రజల్లో పోటీతత్వాన్ని పెంచి చిన్న చిన్న పిరమిడ్ల కింద విడగొట్టి ఎంత చెట్టు కంత గాలి అన్నట్టు ప్రజలు తమ శక్తికి తగ్గట్టు సంపాదించుకునే వీలుని కల్పించాలి,ప్రజల పట్ల నిజాయితీ గల ఆర్ధికవేత్తలు ప్రజలకి ఇలాంటి విషయాల పట్ల అవగాహన పెంచాలి.అజ్ఞానం నుంచి పుట్టే సమస్యలకి జ్ఞానం వైపుకి ప్రయాణించడం ద్వారానే పరిష్కారం సాధ్యపడుతుంది.

     We, only, are illuminated అనే అహంకారంతో మిడిసి పడుతున్న లందను బ్యాంకర్లు నిర్మించిన దుర్జన శంఖువును all of us, are, equally illuninated అనే వినయభావంతో ఒదిగి నిలుచున్న గీతాచార్యులు నిర్మించే సజ్జన శంఖువులు మాత్రమే నిర్జించగలవనేది సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన వ్యాసపరాశరాదిషిర్డిసాయినాధపర్యంతం ఉన్న ఆచార్య పరంపర పాదాల మీద ప్రమాణం చేసి చెబుతున్న  సార్వకాలిక సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

12 comments:

  1. హరిబాబు గారూ నమస్తే. మీరు ప్రస్తుతం రాస్తున్న వ్యాసపరంపర వృత్తాంతం ఆసక్తికరంగా ఎంచుకున్నారు.

    ఒకటే సలహా: మీరు ఉటంకిస్తున్న పుస్తకాల చిట్టీ (list of reference books) ముద్రిస్తే బాగుంటుంది.

    ReplyDelete
    Replies
    1. "Creature from Jekyll Island" is very very famous.You can get it just by googling.

      other books I will provide very soon!

      Delete
    2. Thanks a lot for the reference. All the best for your research.

      Delete
  2. Sir, Genuine Questions. Why did you miss the Andhra People Pulse? Why do you hate Modi? Do you think, there is no mistake from CBN? I hope you will answer these questions.

    ReplyDelete
    Replies
    1. Caste factor, babu neglected that people identifying tdp as kamma party.

      Just at the time of election I was in Andhra. My relatives already told that thing but I dismissed as they were bjp fans, they will tell it in that way.

      That too, I have mentioned two or three times that cbn has no guts to play affensive - that was the real suicide factor! All the three enemies ycp, kcr, bjp shamelessly playing affensive and this idiot is playing defensive seeking every time for a safe deck like a ship wrecked soldier igmoring that hee is in power! My suggestion to any politician including pawan is - we need to play defensive until we get a sate foothold, and once we get the safe side we need to be affensive to catch power and continue in power.

      Why he invited kcr to andhra on the opening day and put his name on the keystone even after kcr called him donga babu and no god can save CNN from his clutches?

      Even though BJP side lined, joining with congress also fired badly - analysts like me supported after seeing the neccessity, but people didn't see the background and simply hated it.

      So many people give so many reasons, but I stick to the one poinnt - babu is unfit to fight affensive game, whereas current politics want a leader with guts, just like modi!

      I am enjoying the victory of modi!Why because, Hindus started playing affensive just now, from the rise of modi, if cangress came into power, these dogs like chiranjivi Y and Sreekaanth M will raise their voice with 10 folds strength - with tgis reasom I wanted his victory!

      Any way, my entry in politics is sure, first move also planned. But it may not be before this December. Playground also changed from TN to AP - I will wait for some time how jagan will perform, and then will enter with a bang!

      Delete
    2. Will it be a good idea for good leaders from TDP should join BJP under the leadership of Ram Madhav?

      Delete
    3. @JG
      Will it be a good idea for good leaders from TDP should join BJP under the leadership of Ram Madhav?

      hari.S.babu
      for whom you want to make it as a good idea?Why those good leaders cold not win or save the TDP?How the men who are defeated by an young boy will be an asset to BJP, the party which had enough god leaders to carry on its own weight?

      I hate such ideas of jumble bumble nitty gritty time pass games which satisfies the sadistic pleasure in waste candidates like you and give income to election results betting rajas!

      Delete
    4. Jai,
      నువ్వు ఏం చదువుకున్నావో తెలియదు గానీ చదువుకు తగ్గ సంస్కారం మాత్రం లేదు.మన విద్యావ్యవస్థలో చదువుతో పాటు సంస్కారం నేర్పట్లేదు గాబట్టి ఆశించడం తప్పే, కానీ ఆ చదువు కోసం రకరకాల చోట్లు మారి రకరకాల వ్యక్తులను చూసి ఎంతో కొంత సంస్కారవంతులు కావడం సహజం కదా!

      నేను చదువుకునే రోజుల్లోనూ నువ్విప్పుడు చేస్తున్న "పాత ఎన్నికల ఫలితాల్ని అన్నిటినీ వడబోసి కొత్త ఎన్నికల ఫలితాల్ని చెప్పడం" లాంటి పనులు చేసేవాళ్ళని తట్టల కొద్దీ చూశాను.నీలాంటి ఆ కుర్రాళ్ళు మొదటి టరములో చేసే పని లైబ్రరీకి వెళ్ళి పాత క్వశ్చెన్ పేపర్లని ముందేసుకుని ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చెన్లకి టాప్ మోస్ట్ ప్రిఫరెన్సూ తక్కువ సార్లు రిపీటి అయిన వాటికి లీస్ట్ ప్రిఫరెన్సూ ఇచ్చి ఒక టేబుల్ తయారు చేసుకోవటం!

      ఇక రెండవ టరములో 3 గంటల సమయంలో ర్యాంకులూ డిస్టింక్షన్లూ కొట్టగలిగిన స్థాయిలో వాటిని పేపరు మీద కక్కడం కోసం సాధన చేసేవాళ్ళు.అక్కడ చదువుతున్న దాంట్లో సారం ఏమిటిఈ అది దేనికి పనికొస్తుందీ అనేది వాళ్ళకి అనవసరం, ఉన్నది ఉన్నట్టు దించెయ్యగలగడమేముఖ్యం!

      ఈ నీ ప్రతిభ వల్ల బెట్టింగు కడితే నీకు తప్ప ఇంకెవరికీ లాభం వుండదు,బెట్టింగు కట్టకపోయి ఉంటే నీ కష్టం నీకు కూడా పనికి రానట్టే!

      అక్కడ ఓడిపోయిన TDP మంచి నేతలకి తెలియదా వాళ్ళకేది గుడ్డు అయిడియానో - నువ్వూ నేనూ చెప్పాలా!నీకు కావల్సిందీ నువ్వు కోరుకుంటున్నదీ తెదెపా సర్వనాశనం కావడాన్ని కళ్ళారా చూసి వికటాట్టహాసాలు చెయ్యడం!

      నీ సాడిస్టు పైత్యం కొద్దీ నీకు అర్ధం కావడం లేదు గానీ ఈ ఎన్నికల ప్రక్రియ సమస్తం ముందే నిర్ణయించబడిన గెలుపు గుర్రానికి ప్రజల నుంచి ఆమోద ముద్ర వేయించి "మనం ఎన్నుకుంటే ఇతను అధికారంలోకి రాగలిగాడు కాబట్టి అతను మనకి న్యాయం చేస్తాడు" అనే సంతృప్తిని ఇవ్వడానికి ఉద్దేశించిన గందరగోళపు వ్యవహారం - నామినేషన్లు, ప్రచారం, స్పాన్సరింగ్, ఒపీనియన్ పోల్స్, స్వింగ్ ఫ్యాక్టర్, పబ్లిక్ పల్స్ - ఇవ్వన్నీ శాస్త్రీయమైనవనీ నికార్సయిన ప్రజాభిప్రాయ సూచీ అనీ అనుకుంటే అది నీ అజ్ఞానం!ఇప్పుడున్న economic framework ఏ వ్యవస్థనీ ప్రజలకి ఉపయోగపడేలా ఎవరినీ నడపనివ్వదు!ప్రత్యర్ధులు ముగ్గురూ నైతికంగా అధమాధమ స్థాయికి దిగజారి ఎఫెన్సివ్ గేం ఆడుతుంటే అభివృద్ధిని నమ్ముకుని డిఫెస్న్సివ్ గేం ఆడటం వల్లనే చంద్రబాబు ఇప్పటి ఎన్నికల్లో ఓడిపోయాడనేది తిరుగు లేని నిజం - సిగ్గుపడి తల దించుకోవాల్సింది చంద్రబాబు కాదు, అతని ప్రత్యర్ధులే!

      నీ స్థాయి చవకబారు GOOD అయిడియాలు నాకు రావు, నేను నీలాంటివాణ్ణి కాదు.

      మరి, నేనెలాంటి కుర్రాణ్ణో తెలుసా!మోద్టి టర్మ్ పూర్తయ్యేసరికి అన్ని పుస్తకాలూ ఒకసారి చదివెయ్యడం - రూపం, సారం బుర్రకి ఎక్కించుకోవడం నా పని!

      ప్రజలకి పనికొచ్చే విషయం ఏదన్నా ఉంటే చెప్పడం, విని విన్నవాళ్ళు బాగుపడితే సంతోషించడం,వినక వాళ్ళు చెడిపోతే జాలిపడడం తప్ప నాకు అంకెల గారడీలూ లెక్కల మతలబులూ చూపించి జబ్బలు చరుచుకోవటం చేత కాదు.

      Delete
    5. మా నాన్నగారు M.R.అప్పారావుకు సన్నిహితుడై రాష్ట్రం మొత్తం తిరిగేవారు, కనీసం నూజివీడు లోక్ సభ, శాసనసభ రేంజిలో ఉన్న పెద్దమనుషులు అందరూ తెలుసు.కానీ డబ్బు వెదజల్లటం కుదరక పంచాయితీ రేంజి దాటి పైకి ఎదగలేదు!ఈ మధ్యనే వెయ్యి వోట్లు దాటిన కుగ్రామానికి సంబంధించి సుదీర్ఘకాలం పాటు ఓటమి అనేది లేకుండా పంచాయితీ ప్రెసిడెంట్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు మా నాన్నగారు.

      ఆయన ఓడిపోయిన ఆఖరి ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని చిత్రమైన సన్నివేశాలు ఇప్పటి రాష్ట్ర స్థాయి తెదెపా వర్గాల పరిస్థితినే గ్రాం స్థాయిలో అచ్చు గుద్దినట్టి నడిచాయి! ఎలెక్షన్ డ్యూటీ కోసం వచ్చిన పోలీస్ ఆఫీసరుకి సిట్టింగ్ ప్రెసిడెంట్ కాబట్టి మా నాన్నగారే ఆతిధ్యం ఇచ్చారు.మ ఐల్లు చిన్నది కాబట్టి మా బాబాయి గారి ఇంట్లో పోలీస్ ఇన్సెక్టరుకి విడిది ఏర్పాటు చేశారు.భోజనాలు అయ్యాక అందరూ కూర్చుని కులాసా కబుర్లు చెప్పుకుంటున్నారు.గత కొద్ది కాలం వరకు మా నాన్నగారి మీద పోటీ చేసి ఓదిపోవటం దేనికని వూళ్ళో సంఖ్యలోనూ ఆస్తుల్లోనూ బలమైన కమ్మవాళ్ళు అసలు పోటీయే చేసేవాళ్ళు కాదు.చాలా కాలం క్రితం అయిదో తరగతి వరకు నాకు ఆప్తమిత్రుడైన లక్ష్మణరావు వాళ్ళ నాన్నగారు పోటీ చేసి ఓడిపోయారు.ఆయన మంచివాడే, మా నాన్నకున్న మంచితంతో పోటీ పడగలిగిన పెద్దమనిషి తరహా వ్యక్తియే!మా నాన్నగారితో వ్యక్తిగత స్పర్ధ కూడా లేదు.ఓడిపోయినా చాలా హుందగా మర్యాదగా ఉన్నారు.కొన్నాళ్ళు మా ప్రైవేటు మాస్టారు క్లాసుల్ని వాళ్ళింట్లో నడిపినప్పుడు ఒకసారి ఇల్లంతా అకలయదిరిగాం.లక్ష్మణ రావు వాళ్ళ అమ్మగారూ అక్కయ్యా "నువ్వు చలపతి రావు గారి అబ్బాయివా?" అని మొదలుపెట్టి నవ్వుమొహంతో కొన్ని కూపీ ప్రశ్నలు అడిగిన సన్నివేశం ఇప్పటికీ గుర్తుంది.

      అయితే ఇప్పుడు పోటీ చేసింది మాత్రం ఎట్లాగయినా మా నాన్నని ఓడించి తీరాలన్న కసితోనే!దానితో మావాళ్ళు కూడా పట్టుదల తెచ్చుకున్నారు. ఇక్కడొక తమాషా వుంది, వాళ్ళు అంత కసితో కుట్రలూ కుహకాలతో రెచ్చిపోతునప్పుడు కూడా కమ్మవారిలో కొందరు మా నాన్నగారి వైపు నిలిచారు - వాళ్ళలో బలమైన గోపాల రావు గారనే పెద్దమనిషిని "వెలమల కుక్క!" అని అటువైపువాళ్ళు అనడమూ అది ఆయనకీ తెలియడమూ ఆయనే దాన్ని చెప్పి పగలబడి నవ్వడమూ లాంటి చిత్రమైన సన్నివేశాలు కూడా అప్పటికే చాలా నడిచాయి.ఆ కబుర్లే మాట్లాడుకుంటున్నారు.వాళ్ళ కబుర్లలో గెలుపు మనదే అన్న ధీమా కనబడుతున్నది.ఇంతలో పోలీస్ ఆఫీసరు చాలా సరదాగా "అంత ధీమాగా ఉన్నారా?మీ సారు ఓడిపోతారని నన్ను పందెం కాయమంటారా!" అని జోకులకి దిగాడు - నాకు ఆశ్చర్యం అనిపించింది, బందోబస్తు కోసం వూరంతా తిరుగుతూ పరిస్థితి అటువైపు వాళ్ళకి అనుకూలంగా ఉందని పసిగట్టినట్టు అనుమానం కూడా వచ్చింది!అనుమానం కూడా మిగతావాళ్ళు మొదట కంగుతిని తర్వాత సర్దుకుని అలా జరగటానికి వీలేదని వాదిస్తున్న లాంటిది కాదు, అప్పటి వరకు నేను ఆ రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాలేదు గానీ పట్టించుకుని పని చేస్తూ ఉండి ఉంటే, "ఎందుకలా అంటున్నారు?పరిస్థితి మాకు ప్రతికూలమా?మీరు చూసినదేమిటో చెప్పండి!" అని అడిగి ఉండేవాణ్ణి!

      అయితే, వల్లమాలిన ధీమాతో రెచ్చిపోయి ఆయన్ని చాలెంజి చేస్తున్న మావాళ్ళని "నా డబ్బులు పోగొట్టుకోవటం దేనికిలే!", "డ్యూటీలో వుండి బెట్టింగులు చేస్తే నా వుద్యోగానికి దెబ్బ!" అనే తరహా జోకుల్తో చల్లబరిచేశాడు.తెల్లవారి ఎన్నికలు కూడా ఎలాంటి అనుమానమూ లేకుండా నడిచాయి కానీ ఫలితాలు మాత్రం ఇప్పటి తెదెపా వాళ్ళకి మల్లే మావాళ్ళనీ నిర్ఘాంత పరిచాయి.

      P.S:మా నాన్నగారి తరపున ఎన్నికల విధుల్లో పనిచేసిన ఒక కమ్మ కుర్రాడు చేసిన తమాషా పని మా నాన్నగారి ఓటమి వెనక ఉన్న కారణాల్ని చూపించింది.

      అతను ఎన్నికలు రోజున జనాన్ని బూత్ దగ్గిరకి పంపించేటప్పుదు కొందరు ముఖ్యమైన వ్యక్తుల వోటింగ్ నంబర్లని ఒక కాగితం మీద రాసుకున్నాడు.మళ్ళీ లెక్కింపు దగ్గిర ఆ నంబర్లకి చెందిన వోటు ఎవరికి పడిందో రాసుకున్నాడు - వాళ్ళందరూ గొల్ల, చాకలి, మంగలి, భట్రాజు కులస్థులు!ఆ వోట్లు మామూలు లెక్క ప్రకారం మా నాన్నగారికి పడతాయని అనుకున్నారు,కానీ మా నాన్నగారికి పడలేదు!

      విషయం ఏమిటంటే, మా నాన్నగారు మాలపల్లికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ supportతోనే అన్నేళ్ళూ ఎదురు లేకుండా గెలిచారు.కాలక్రమంలో పనుల కోసం మా నాన్నగార్ని ఓడించాల్ని అనుకుంటున రాజకీయ కమ్మవారిని ఆశ్రయించిన మాలలు వాళ్ళ వైపుకి జరగడంతో ఆ మాలపల్లి వోట్లు చీలాయి.ఇంక పైన చెప్పిన ఇతర కులాల వాళ్ళు మా యిళ్ళు దివాణాలుగా వునప్పుడు మమ్మల్ని ఆశ్రయించుకుని బతికినవాళ్ళే. క్రమేణా మా నాన్నగారు మాలల్ని నెత్తిన పెట్టుకోవటం నచ్చని పరిస్థితి వచ్చింది, దివాణం సంస్కృతి శిధిలం అయ్యేసరికి వాళ్ళు ఆర్ధికంగా ముందుకు వెళ్ళి ఉండటంతో దానివల్ల వాళ్ళకి నష్టం లేదు కాబట్టి మొహమాటం కొద్దీ మా నాన్నగారికే వోటు వేస్తూ ఉందేవాళ్ళు.అయితే, వాళ్ళు కూడా ముందునుంచే పొలిటిసైజ్ అవుతూ వచ్చారో ఎగస్పార్టీ వాళ్ళు కెలికారో గానీ ఆ మొహమాటం వొదిలించుకుని తమ కోపాన్ని చూపించారు!
      TO BE CONTINUED

      Delete
    6. CONTINUING FROM ABOVE
      సీనియర్ విశ్లేషకులు తెదెపా, ముఖ్యంగా చంద్రబాబు పరిస్తితి మరీ దయనీయం అవుతుందని జోస్యం చెబుతున్నారు, అధికారంలో లేనప్పుడు ఎంత చాణక్యం ఉండి మాత్రం అధికారంలో ఉన్న ముగ్గురు క్రూరమైన శత్రువుల్ని ఎట్లా నిగ్రహించగలడు?

      అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకుని ఎఫెన్సివ్ గేం ఆడి మంచి ఫలితాల్ని సాధించగలిగిన ఎన్నో అవకాశాల్ని ఎంత మూర్ఖంగా వదిలేసుకున్నాడు!నా బ్లాగులో నేనే ఎన్నోసార్లు మొత్తుకున్నానే బీజేపీ మిత్రుల్ని ముంచేసి పైకెక్కాలని చూస్తున్నది, ఆ పార్టీని అంటకాగవద్దని, శత్రుత్వమే మంచి ఫలితాల్ని ఇస్తుందని ప్రతిసారీ చెప్తూనే వచ్చాను!

      "ఇప్పుడో రేపో జైలు కెళ్తాడు!" అని చిడతలు వాయించటం తప్ప అతన్ని జైలుకి పంపడానికి తెదెపా/చంద్రబాబు చేసిన ప్రయత్నం ఏమిటి?వెనకాల పది పదిహేను బలమైన అవినీతి కేసుల్ని పెట్టుకున్న ఒక బచ్చాగాడు ముఖ్యమంత్రిని "నడి రోడ్డు మీద షూట్ చెయ్యాలి!" అని వాగడం కన్న అరెస్టు చేసి బొక్కలో తోసి కుళ్ళబొడవడానికీ కుదిరితే లేపెయ్యడానికీ పనికొచ్చే మంచి అవకాశం ఏం కావాలి?ఎంతసేపూ జనం ముందు వాణ్ణీ వీణ్ణీ ఎక్స్పోజ్ చేసి బద్నాం చేద్దామనే డెఫెన్సివ్ స్ట్రాటజీయేనాయె!!

      అధికారం చేతిలో ఉండి కూడా డిఫెన్సివ్ స్ట్రాటజీని ఎంచుకున్న చంద్రబాబు స్థానంలో కేసీయార్ ఉండి ఉంటే తెదెపా వోడిపోయేది కాదు, ఇంత దయనీయమైన పరిస్థితి మాత్రం ఎదురయ్యేది కాదు.

      ఇప్పుడు కేసీయార్ పరిస్థితి కూడా ఒకప్పుడు ఉన్నంత ధీమాగా లేదు - తను బాబుని దుంపనాశనం చేస్తున్నానాన్న సరదాలో పట్టించుకోలేదు గానీ ఇప్పుడు బీజేపీ దాడి కేసీయార్ వైపుకి తిరిగింది!బాబుని భూస్థాపితం చెయ్యాలనే పిచ్చలో పడి బీజేపీకి అనుకూలమై తను సాధించింది శూన్యం!ఇవ్వాళ చంద్రబాబుకి ఉన్న ముగ్గురు శత్రువుల్లో ఒకడిగా ఉండి తెదెపా అబ్యర్ధుల్ని వైకాపాకి పంపిణీ చేసిన ఘనకార్యం నెత్తిన పెట్టుకుని మొయడం తప్ప రిటర్న్ గిఫ్టు ఇచ్చానని చెప్పుఓఅవ్డానికి కూడా ముఖం చెల్లని దిక్కుమాలిన స్థితిలో నిలబడ్డాడు!

      తను ఎక్కువ లాక్కున్నది తెదెపా, కాంగ్రెసుల నుంచే కానీ బీజేపీ వైపు నుంచి ఒక్కడు కూడా తన వైపుకి రాలేదు.తన పార్టీతో తనతో సెంటిమెంటు వున్నవాళ్ళని అందర్నీ చాలా కాలం క్రితమే కూరలో కరివేపాకులా తీసిపారేశాడు!డబ్బు కోసం, లాభం కోసం తన వైపుకి వచ్చిన వాళ్ళు రేపు భాజపా పిలిస్తే అటువైపు వెళ్ళరని గ్యారెంటీ ఉందా?లేదు!

      మిగతా విశ్లేషకులు చంద్రబాబుకి ఉన్న ప్రత్యామ్నాయాలలో జగన్ ఎటూ పగవాడు, కేసీయార్ కూడా పగవాడే, కుదిరితే మోదీతో సంధి చేసుకోవడమే ఉత్తమం అంటున్నారు గానీ నాకైతే బాబు చొరవ తీసుకుని కేసీయారును కలిస్తే బాగుంటుందని అనిపిస్తున్నది!బాబుకి తనుగా ఎఫెన్సివ్ స్ట్రాటజీకి వెళ్ళే దమ్ము లేదు, ఆ దమ్ము ఉన్న కేసీయార్ కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నటు ఒక్కసారి ముఖ్యమంత్రిత్వానికే కళ్ళు నెత్తికెక్కిపోయి చేసిన తప్పుదు పనులు వికటించి ఇప్పటికే ఒంటరివాడై రేపు అత్యంత అవమానకరమైన ప్రవాసానికి దగ్గిర కాబోతున్నాడు - భాజపాయేతర పక్షాలను అన్నిట్నీ శత్రువుల్ని చేసుకున్నాక ఎంత స్ట్రాటజిక్ మాస్టర్ అయినప్పటికీ సాధించగలిగేది శూన్యం!

      బాబు, కేసీయార్ ఇద్దరిలో ఇప్పుడు బాబే క్షేమం!ఓటమి కరారు అయిపోయింది.కొత్త అవమానాలు ఏమీ వుండవు.కానీ, కేసీయార్ వధ్యశిల వైపుకి బలవంతంగా నెట్టబడుతున్నాడు - తప్పించుకోగలడో లేడో అనే టెన్షన్ అతన్నీ అతని అభిమానుల్నీ నిద్ర పోనివ్వటం లేదు!భాజపా వైపు నుంచి దాడి తీవ్రం అవుతూ ఉన్నది!ఆంధ్రలో మిత్రపక్షంగా ఉన్న తెదెపాని బైటికి తరమడానికి వైకాపా ద్వారా ప్రత్యేక హోదాని ఉపయోగించుకున్నట్టు ఒవైసీ అనే తురుపుముక్కని వాడుతున్నారు!కేసీయార్ ఒవైసీని వదుల్చుకున్నా మరింత దగ్గిరైనా బాజపాకి హుషారు తెచ్చిపెట్టినట్టే!తెలంగాణని పట్టుకోవడం అనే చదరంగంలో భాజపా ఓపెనింగ్, మిడిల్ గేముల్ని పూర్తి చేసేసి చెక్ చెప్పడం అనే ఆఖరి దశకి తీసుకెళ్ళింది!బాబుని దెబ్బ కొట్టాలనే పిచ్చిలో నిన్నటివరకు ఆట మొత్తాన్ని భాజపాకి అప్పజెప్పి తన పావుల్ని తనే బలిపెట్టుకున్న తెలివి తక్కువ ఆటగాడు కేసీయార్ తన మహాప్రష్థానం కొంచెం గౌరవప్రదంగా వుండేటట్టు చూసుకోవడం తప్ప మరో దారి లేదు!

      Delete
  3. Thank you for answers. All the best for your future endeavors.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...