Friday, 19 April 2019

అప్పుని ఎవరు తీర్చగలరు?అప్పుని ఎలా తీర్చగలరు?అప్పుని తీర్చడానికి డబ్బుని ఎలా వాడుకోవాలి - అప్పునుంచి విడుదల ఎప్పుడు!

     అసలు స్వతంత్రం తెచ్చుకునేటప్పుడే "మీరు చేసిన అప్పులతో మాకు సంబంధం లేదు,మాకు ఋణం లేని దేశం కావాలి" అని మెలిక పెట్టడం కుదిరే పని కాదు, ఎందుకంటే ద్వితీయ స్వాతంత్య్ర సంగ్రామం అని స్కూలు పుస్తకాల్లో చదువుతున్న వ్యవహారం మొత్తం ఇంగ్లీషువాళ్ళని "బాబ్బాబూ!మా దేశం మాకిచ్చి పోరాదూ - మీకు పుణ్యముంటుంది,మా పిల్లలకి మీ గురించి మంచిగా చెప్పుకుంటాం!" అని కాళ్ళూ గడ్డాలూ పట్టుకుని బతిమిలాడ్డం తప్ప కనీస స్థాయి బెదిరింపులు కూడా చెయ్యని పద్ధతిలో నడిచింది!

           అసలు "అహింసాయుత పోరాటం" అనే పదం ప్రపంచంలో ఏ భాషలోని ఏ వ్యాకరణ నియమాలకీ పొసగని దుష్టసమాసం - "అహింస" అంటే ఇతర్లని హింసించకుండా నిగ్రహించుకోవటం, "పోరాటం" అంటే శత్రువుని హింసించి లొంగదీసుకోవటం. మరి  ఆ రెంటికీ లింకు ఎట్లా కలిపాడో ఈ విచిత్ర వ్యక్తి! నమ్మినవాళ్ళు ఎట్లా నమ్మారో!కలిపినవాడు పిచ్చివాడు అందామా అనుకుంటే నమ్మినవాళ్ళని ఏం అనాలి?ఒక రోజు కాదు,ఒక వారం కాదు, ఒక నెల కాదు, కొన్ని దశాబ్దాల పాటు ఆ దుష్టసమాసాన్ని శిష్టజనసమ్మతం చేసేశారే అంత మంది మేధ్ధావులూ పండిత్తులూ చరిత్రక్కారులూ కలిసి!

            ఇంగ్లీషువాళ్ళకి నెప్పి పుట్టకుండా వాళ్ళ ఒంట్లోనుంచి ఒక రక్తపు బొట్టు కూడా చిందకుండా స్వాతంత్య్రం తీసుకు రావాలన్న తన దిక్కుమాలిన సిద్ధాంతం కోసం లాఠీ దెబ్బలకి తలలు పగలగొట్టుకునీ ముస్లిముల చేతులో చచ్చిపోయీ మానభంగాలకి గురయ్యీ తన పరువు నిలబెట్టిన హిందువుల రక్తం రక్తమే కాదన్నట్టు ప్రవర్తించి మత పిశాచుల చేతుల్లో దెబ్బలు తిని మూల్గుతున్న హిందువులకే మతతత్వాన్ని అంటగట్టటానికి మూలకారకుడైన కపటిని ఏనాడో చెత్తబుట్టలోకి విసిరేయాల్సింది పోయి "కొల్లాయి గట్టితేనేమి మా గాంధి కోమటైతేనేమి" అని కీర్తిస్తూ గొఱ్ఱెల వలె అతని వెంట నడిచి స్వాతంత్య్రం వచ్చాక  జాతిపిత హోదా ఇచ్చి జయంతులు వర్ధంతులు జరుపుకుంటూ  కూడళ్ళలోనూ బ్రాందీ షాపుల కెదురుగానూ విగ్రహాలు పెట్టుకుంటూ  ఒక శతాబ్దమే గడిచిపోయింది! ఇంకా "అహింసాయుత పోరాటం!" అనే పదం ప్రజల్ని ఉర్రూత లూగిస్తున్నది - ఎంత అజ్ఞానం, ఎంత మూర్ఖత్వం, ఎంత దారుణం!

         మోహన దాసు గాంధీకి సంబంధించిన ఒక వింత నన్నెప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది - అంత తీవ్రస్థాయిలో ఏ ముస్లిముల్ని ఆకట్టుకోవటానికి హిందువుల్ని బలిపశువుల్లా వాడుకున్నాడో ఆ ముస్లిముల నుంచి కనీసపు ప్రశంసల్ని కూడా పొందలేకపోయాడు, పాపం!

          గాంధీ ఆలోచనలు ఎంత వింతగా ఉంటాయో గాంధీని మూలస్తంభం చేసుకున్న కాంగ్రెసువాదుల ఆలోచనలూ వాదనలూ అంత వింతగానే ఉంటాయి - వాళ్ళ అదృష్టం బాగుండి వినేవాళ్ళు ఏదో గందరగోళంతో కూడిన పరధ్యానంలో ఉంటే అద్భుతం అని అనిపిస్తాయి గానీ పూర్తి స్పృహలో ఉంటే మాత్రం మొహం మీదనే ఫకాల్న నవ్వాలనిపిస్తుంది!

          పెళ్ళాన్ని చంపి యాసిడ్ పీపాలో కరిగించేశాడనే కేసులో ఇరుక్కుని కొంతకాలం పరేషానీ అయిన ఒక కాంగ్రెసువాది ఎక్కడ పడితే అక్కడ ఇంగ్లీషువాళ్ళు మన దగ్గిర నుంచి దోచుకున్న సొత్తుకి లెక్కలు చెప్పి అదంతా కక్కమని అడిగితే ఎలా వుంటుందని జోకులేస్తూ చప్పట్లు కొట్టించుకుంటున్నాడు - ఇవ్వాళ్టి లెక్కలతో చూసినా బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆదాయం మొత్తం తూచినా అప్పు పూర్తిగా తీరక మనకి వాళ్ళు వెట్టి చాకిరీ చెయ్యాల్సి వస్తుంది కాబట్టి ఇంగ్లీషువాళ్ళు అలాంటి పిచ్చిపని చెయ్యరని అతడికి తెలుసా తెలియదా?

          ఇంగ్లీషువాళ్ళ జేబు సంస్థ అయిన అంతర్జాతీయద్రవ్యనిధి మనకి ఇచ్చే అప్పు తిరిగి రాబట్టుకోవాలనే ఆశతో ఇస్తున్నది కాదు, తీర్చలేని అప్పులో ఇరికించి మనచేత వెట్టి చాకిరీ చేయించుకోవటానికి పనికొచ్చే బెల్లం ముక్క!మన దేశపు రిజర్వ్ బ్యాంక్ ముద్రించినవి అనుకుని మనం ఆత్మీయత ఒలకబోస్తున్న రూపాయి నోట్లకి సంబంధించిన మూలద్రవ్యం మన దేశానికి అవతల రహస్య మాళిగలో ఉంది.మనం చిన్నప్పుడు ఆటల్లో పేకముక్కలకీ ఖాళీ సిగిరెట్టు ప్యాకెట్ల కవర్లకీ 5, 10 రూపాయల హోదాల్ని ఇచ్చేవాళ్ళం - గుర్తుందా?మనకి మనం పెట్టుకున్న రూల్సు వల్ల ఆటలో ఉన్నంతసేపు ఆ విలువ ఉంటుంది గానీ ఆట ముగిశాక వాటి విలువ ఎంత?మనం అమ్మడానికీ కొనడానికీ ఉపయోగించుకుంటున్న ఈ ధనస్వరూపం కూడా అంతకు మించింది కాదు.

          ఇక్కడ ఒక లిటిగేషన్ ఉంది, బ్రిటిష్ ప్రభుత్వానికి బాహ్య ఆదాయం,రహస్య ఆదాయం అని రెండు రకాల ఆదాయాలు ఉన్నాయి.రహస్య భాగం నుంచి భారత్దేశానికి తను తగిలించిన అప్పుని చెల్లగొట్టెయ్యాలన్న నిజాయితీ బ్రిటిష్ వాళ్ళకి ఉంటే భారతదేశం అప్పు నుంచి బయటపడటానికి ఒకే ఒక సంతకం చాలు - కానీ, ఆ ఒక్క సంతకం రాబట్టుకోవటానికి జియోనిస్టు యూదులకున్న వ్యూహరచనానైపుణ్యం ఉండాలి! మన దేశంలోని ఏ రాజకీయ నాయకుడిలో అంతటి ధీశక్తి ఉంది?

          ఏ రాజుకీ ఏ దేశానికీ ఏ సైన్యానికీ యుద్ధంలో గెలవటానికి దేశభక్తీ రాజభక్తీ పుష్కలంగా ఉంటే చాలదు, రాజులో గానీ మంత్రిలో గానీ సేనాధిపతిలో గానీ వ్యూహనిర్మాణచాతుర్యం ఉంటే ఒక్క సైనికుణ్ణి కూడా బలిపెట్టకుండా గెలుపుని కైవసం చేసుకోవచ్చు, ఓటమిని కూడా గెలుపు కింద మార్చుకోవచ్చును.అర్ధశాస్త్రం పుట్టిన గడ్డలోని పుట్టంధులకి పట్టుబడని కౌటిల్యుడి రాజనీతిని పాటించడం వల్లనే ఇంగ్లీషువాళ్ళు we are illuminated అని చెప్పుకుంటూ అన్ని వలస రాజ్యాలతో కూడిన అంత పెద్ద సామ్రాజ్యాన్ని అంత సుదీర్ఘకాలం పాటు తమ పట్టు నుంచి జారిపోకుండా ఉంచుకోగలిగారు.సాగినంత కాలం నా అంతవాడు లేడన్నట్టు నడిచి కాలం ఎదురు తన్ని రాజకీయాధికారం చేజారిపోయే ప్రమాదం  కనబడగానే బుద్ధికి పదును పెట్టి ఆర్ధికపరమైన ఎత్తుగడతో వలస రాజ్యాల్ని బానిస దేశాల కింద మార్చుకోగలిగారు!

      ప్రస్తుతం ప్రపంచం మొత్తం లూసిఫర్ సృష్టికర్త అని భావించే ఇల్యూమినాట్టి మతాధిపతులూ గాలిలోనుంచి డబ్బుని సృష్టించే లండన్ బ్యాంకర్లూ థ్రీ పీస్ సూట్లలో తిరుగుతున్న మధ్యయుగాల నాటి రాజవంశీకుల వంటి పార్లమెంటేరియన్లూ కలిసిన ఒక సాలీడు అధీనంలో ఉంది.దాని కేంద్రం మనకు కనిపించే లండన్ నగరంలో ఉన్న కనిపించని లండన్ నగరంలో ఉంది. "The City of London, London's financial district is a peculier place.It has been called a city within a city, a state within a state.It is run by an organisation called the City of London Corporation, a private company that performs all the functions of a local council with a private police force and private courts.THe City of London is a seperate entity to the wider London, and it has its own head, the Lord Mayor, who is distinct from the mayor who runs the rest of London. The City of London has long had the curious legal status of complete autonomy inside the city of london,because back in 1066 when william the conqueror came over, the City was one of the only portions of England that he failed to conquer.And he struck a deal with the City in 1067 that allowed them to continue functioning.To this day the City of London is exempt from numerous laws that govern the rest of Britain.Its political system derives from the Middle ages.The City's electorate is dominated not by its residents, but by the private businesses operating within the City,its Lord Mayor is selected by the heads of medieval guilds.They have a representative in te House of commons,caled the Remembrancer, apart from the clerks of the court of the House of Commons he is the only unelected person there.All other lobbyists have to stop in the lobby.The City of London has a permenant representative in the House of Commons, whose role is to report back to the City of London Corporation and to lobby parliament on behalf of the City." - దీని పనితీరు తెలుసుకుంటే జగన్ లాంటివాళ్ళ "అత్యంత తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ డబ్బుని సంపాదించగలిగిన సమర్ధత!" ఏమిటో తెలుస్తుంది.మిగిలిన భాగాల్ని అర్ధం కాలేదని వదిలేసినా పర్లేదు గానీ ఈ భాగాన్ని మాత్రం విశేష శ్రద్ధతో చదివి తీరాలి!

           రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం క్రమేణ ప్రాభవం కోల్పోయి తిరుగుబాట్ల గ్రహణాలు పట్టుకుని అమావాస్య నీడలలోకి జారుతున్నవేళలో బ్రిటిష్ వలస రాజ్యాలలోని ఒక్కొక్క ప్రముఖ నగరమూ తన సంపదనీ  సౌకర్యాల్నీ అధికారాన్నీ మసక చీకట్లలోకి నెట్టేస్తూ ఉండటం చూసి తట్టుకోలేక నేలలో ఇంకిపోయిన నేతిని పిండిన కర్ణుని వలె చేజారిన ప్రపంచాధిపత్యాన్ని తిరిగి దక్కించుకోవదానికి కొత్త దారుల కోసం వెతుకుతుంటే కనబడిన ఆశాకిరణమే credit based economy అనే మాయాజాలం!

          బ్యాంకింగ్ సిస్టం కొత్తది కాదు, rothschilds కుటుంబం అప్పటికే  అష్టపదిలా విస్తరించుకుని ఉంది - అన్ని ప్రముఖ వ్యాపార కూడళ్ళలోనూ local apex bank వాళ్ళదే.ఇప్పుడు చేర్చిన కొత్త ఆకర్షణ ఏమిటంటే, తమ మీద తిరుగుబాటు చేస్తున్న వాళ్ళకి వాళ్ళ మనోభావాల్ని గౌరవించి స్వతంత్రం  ఇచ్చేస్తున్నట్టు మొహం పెట్టి అప్పటికి తమ నిర్వాకం వల్ల దఖలు పడిన అప్పుల్ని నియంత్రించుకోవడానికి ఒక సెంట్రల్ బ్యాంకును ప్రతిపాదించి వాళ్ళ బడ్జెట్ లోటును  తీర్చటానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి ద్వారా అప్పులిస్తూ వాళ్ళని పాక్షిక స్వాతంత్య్రం గల వలస రాజ్యం స్థాయినుంచి సంపూర్ణ పారతంత్య్రం గల బానిస దేశం స్థాయికి దిగజార్చెయ్యటం - అదీ ఆయా దేశాల స్వాతంత్య్ర వీరుల ఆమోదంతోనే!

          దీనితో వలను అల్లడం పూర్తయ్యింది.ఇది వాళ్ళకి కొత్తపని కాదు,మూడవ శతాబ్దం నుంచీ వాళ్ళు చేస్తున్న పనినే మరికొంత సృజనాత్మకతను జోడించేశారు, అంతే!ఇది పని చేసే విధానం ఎట్లా ఉంటుందో తెలియాలంటే ఒక ఉదాహరణ చెప్పాలి.1956లో ఈజిప్ట్ అధ్యక్షుడు అప్పటి వరకు బ్రిటిష్ అధీనంలో ఉన్న Suez Canalను తను స్వాధీనం చేసుకుని జాతీయం చేస్తున్నట్టు ప్రకటించాడు - ఈ జిప్టు ప్రజలు కూడా హర్షధ్వానాలతో తమ ఆమోదం ప్రకటించారు.కానీ బ్రిటిష్ ఫ్రెంచ్ ప్రభుత్వాలు కోపగించుకుని శరవేగాన ప్రతిస్పందించి 12 గంటల్లోపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ultimatum ఇచ్చి అవధి దాటిన మరుక్షణమే యుద్ధ విమానాల్ని ఈజిప్టు మీదకి పంపించి కైరోతో సహా అన్ని ప్రముఖ నగరాలనీ బాంబుదాడులతో అతలాకుతలం చెయ్యటం మొదలుపెట్టేశాయి.అయితే అమెరికా గారు మాత్రం "There will be no United States involvement in these present hostilities.It is our hope and intent that this matter wil be brought before the United Nations General Assembly. There, the openion of the world can be brought to bear in our quest for a just end to this tormenting problem." అని ప్రకటించి ఈ యుద్ధానికి దూరం జరిగారు.

          దీంతో బ్రిటిష్ ప్రభుత్వం కొంత ఇబ్బంది పడి ఇది అమెరికా వారి శాంతి ప్రియత్వానికి గుర్తులా కాక తమ పౌండును దెబ్బ తియ్యటానికి చేసిన కుట్రలా భావించింది.అది సహజమే!ఈ మహా సాలీడు గారు అల్లిన వల ప్రభావమే అది - మోదీ, కేసీయార్, చంద్రబాబుల మాదిరి వలలోని ప్రతి nodal point దగిర ఉన్న ప్రతి జీవీ తన రేంజిలో తను చిన్న సాలీడులా ప్రవర్తిస్తుంది!బ్రిటన్ వూహించినట్టుగానే అంతర్గత పెట్టుబడులు తగ్గిపోయాయి, సీమాంతర వ్యాపారం మందగించింది, స్టెర్లింగ్/పౌండ్ విలువ దిగజారటం నిశ్చయమై పోయింది.దీన్ని సరిచేసుకోవటానికి బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ బ్యాంకర్లు సరిహద్దుల కవతల ఉన్నవారికి అప్పులు ఇవ్వడం మీద మారటోరియం విధించింది.వీసమెత్తు నష్టాన్ని కూడా భరించలేని లండన్ బ్యాంకర్లు Bank of England ముందు ఒక ప్రతిపాదన పెట్టి వారు కూడా బ్యాంకర్లే కావటంతో సానుకూల స్పందనని రాబట్టుకున్నారు.నిజానికి, చిన్న బ్యాంకుల ప్రతిపాదన మరియు పెద్ద బ్యాంకు ప్రతిస్పందన అనేవి ఆర్ధికానికి సంబంధించినవి కాబట్టి ఒప్పందం రూపంలో రికార్డు చెయ్యాలి - కానీ ఇక్కడ అది జరగలేదు, దాని అర్ధం ఏమిటో తెలుసా!"if banks intermediated between two non-residents, in a foreign currency, in that case the dollar - This particular intermediation, this particular deal would not be considered by the Bank of England as under its own jurisdiction." అనే ఈ అలిఖితమైన తిలకాష్ఠమహిషబంధనమే జగన్ ఒక్కడే కాక ప్రపంచంలోని అనేకమంది మహా సాలీడు గారి అభిమానులకి "అత్యంత తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ డబ్బు సంపాదించగల సమర్ధత"ని కట్టబెడుతున్నది.

          డాలర్లతో సంబంధం పెట్టుకోవడం కోసం Eurodollar market అనేదాన్ని సృష్టించి దీన్ని domestic banking activities నుంచి పక్కకి పెట్టడం కోసం రెండు ఎక్కవుంట్లు నడపటం మొదలుపెట్టారు లండన్ బ్యాంకర్లు.స్విస్ బ్యాంకుల్లో ఎక్కవుంట్ వివరాలు మాత్రమే రహస్యం అయితే ఇక్కడ మొత్తం అంతా రహస్యమే! లోపల ఏం జరుగుతుందో బయటివాళ్ళకి తెలియదు గానీ బ్యాంకింగ్ వర్గాల్లో ప్రతి ఒక్కరికీ ఏ మారుమూల ఎవరు ఏ fraud చేసినా తెలిసిపోతూనే ఉంటుంది - అయితే ఫ్రాడ్ చేస్తున్న వ్యక్తుల సమూహం తమ పనిని పూర్తి చేసుకునే దాక ఆగి అప్పుడు (ఓటర్ల తొలగింపు తప్పును సరిదిద్దుకుంటామని ప్రామిస్ చేసి ఎన్నికలయ్యాక సారీ కుదర్లేదని చెప్పి సరిపెట్టేసిన  తె'లంగా'ణ ఎలక్షన్ కమిషన్ లాగ) తమ నిస్సహాయతను వెలిబుచ్చి సరిపెడతారు!లండన్ బ్యాంకర్ల సృజనాత్మకమైన ఏర్పాటులోని వెసులుబాటు ఏమిటంటే, ఒక వ్యక్తి శూన్యం నుంచి లక్షల కోట్ల మిలియన్ల ఆస్తిని కేవలం కొద్ది నెలల్లోనే, అన్నీ కలిసొస్తే కొద్ది రోజుల్లోనే సంపాదించుకోవచ్చును.

          ఒక వ్యక్తి మొదట ఏ విధమయిన లొసుగులూ లేని ఒక చట్టబద్ధమైన వ్యాపార సంస్థని స్థాపిస్తాడు. ఆ ఒక్కటీ అలా ఉండటం చాలా అవసరం కాబట్టి ఆ కొంత ఖర్చూ ఆ కొంత నీతీ తప్పదు!తర్వాత కొన్ని నేం ప్లేట్ తప్ప ఇంకేమీ లేని బుల్లి బుల్లి కంపెనీల్ని అతనే మారుపేర్లతో సృష్టిస్తాడు.వీటి స్థాపిత ఆస్తుల్ని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటాడు.ఈ సంస్థల ద్వారా బ్యాంకుల నుంచి తీసుకున్న ఋణం ప్రధానసంస్థకు బదలాయించితే అది ఆ ప్రధానసంస్థ యొక్క మూలధనమూ ఆదాయమూ అవుతుంది - ప్రధాన సంస్థలో పోగయిన డబ్బుని ఆర్ధికచట్రంలోని ప్రధానస్రవంతిలోకి పంపించి సకల సౌఖ్యాలూ అనుభవించ వచ్చును!ఇక్కడే రెండు తమాషాలు జరుగుతాయి. ఈ గొడుగు కంపెనీలకి ఉన్న మూలధనం యొక్క భౌతిక అస్థిత్వాన్ని నిర్ధారించుకోవటం, వాటి ఆస్తుల విలువల్ని మదింపు చెయ్యటం ఒక పెద్ద తమాషా - తమ బ్యాంకును ఎలా మోసం చెయ్యాలో కూడా ఆ బ్యాంకు యజమానులూ ఉద్యోగులే చెబుతారు!వీళ్ళకి అప్పు ఇవ్వడానికి బ్యాంకులకి ఇదివర్లో నోట్లు ముద్రించాల్సి వచ్చేది, ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాక ఆ కాస్త ఖర్చూ శ్రమా తప్పింది.బ్యాంకుకి సంబంధించిన డాటాబేస్ సర్వరుకి అనుసంధానించబడిన బ్యాంకు ఉద్యోగి ఆ సంస్థ పేరున ఒక అక్కవుంట్ క్రియేట్ చేసి ఆ సంస్థకి తను ఇవ్వదల్చుకున్న అప్పు అంకెల్లో ఇన్‌పుట్ ఇచ్చి సబ్మిట్ బటన్ నొక్కితే చాలు!

          అవతలి వైపున ఋణం తీసుకున్న గొడుగు సంస్థ నుంచి ప్రధానసంస్థకి నిధుల మార్పిడి జరిగాక గొడుగు సంస్థల్ని ఎత్తేసినా ఏమీ కాదు.వాటికిఅప్పు ఇచ్చిన బ్యాంకులు కూడా ఆ అంకెని గాలిలో నుంచి సృష్టించి ఇవ్వడమే తప్ప మూలధనం రాశిని కదిలించి ఇవ్వలేదు గాబట్టి వాటికి కూడా ఒక్క రూపాయి నష్టం ఉండదు.ఇవన్నీ ఇలాగే జరుగుతాయా అనేది కూడా అసలు అక్కడ "input capital assets->constructive manpower manipulation->product generation proceess->marketing activty->taxable income" అనే డబ్బుని సృష్టించే మామూలు ప్రక్రియలు లేకపోవటం వల్ల చేస్తున్న వూహలే తప్ప లోపల మనం వూహించలేనంత స్థాయిలో మాయాజాలం నడుస్తుందని ఆర్ధిక నిపుణులు చెప్తున్నారు.ఈ వ్యవహారం నడిపించాలనుకున్న వ్యక్తి మొదట మహా సాలీడు గారి భక్తుడై ఉంటాడు, అంటే సిగ్గూ లజ్జా మానమూ మర్యాదా రోషమూ మానవత్వమూ లేనివాడై ఉంటాడు కాబట్టి  జగన్ కూడా విజయ్ మాల్యా, నీరవ్ మోడీ పోయినట్టే లండన్ పోయి నిష్పూచీగా బతికెయ్యగలడు!ఎటొచ్చీ, వాళ్ళు గాలిలోనుంచి సృష్టించిన అప్పుని బహిరంగ మార్కెట్టు దగ్గిర శక్తిని ద్రవ్యం కింద రూపాంతరం చెందించినట్టు డబ్బు కింద మార్చి వదలడం వల్ల దాని స్పర్శకి గురయిన సమస్త జనులకీ వాళ్ళ పాపంలో భాగం ఉంటుంది. ధర్మబద్ధమైన సంపాదనతో సంతృప్తిగా జీవించాలనుకునేవాళ్ళకి మాత్రం నిత్యం నరాలు తెగిపోయేలా ఇరవై ముప్పై సంవత్సరాలు కష్టపడిన తర్వాత కూడా దరిద్రం, అసంతృప్తి, నైరాశ్యం,అనారోగ్యం తప్ప సుఖం అనేది అనుభవంలోకి రాదు, అంతే!

          "The main secret of this modus operandi is providing a legal space in which you pretend activity is taking place.And the importance of that is:you pretend it is not taking place in the economy where it really is taking place.So, you are taking activity from the place where it is regulated and taxed, and pretending that it is happening elsewhere.Now, where doesn't really matter, it is just elsewhere." అనేది కేవలం ఏ ఒక్క చోటనో కాదు Bank of Englandకి అనుసంధానించబడిన బ్యాంకులు ఉన్న అన్ని చోట్లా జరిగే సామాన్యమైన వ్యవహారమే - మన రిజర్వ్ బ్యాంక్ కూడా ఆ తానులో ముక్కే కదా, కాబట్టి బ్యాంకో రక్షతి రక్షితః

          అన్ని వ్యవస్థల మాదిరే బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ప్రజాశ్రేయస్సుకి పనికివచ్చే లక్షణం ఉంది, కానీ మహా సాలీడు గారు తమ సృజనాత్మకతని ఉపయోగించి అలా చెయ్యనివ్వటం లేదు.పైన చెప్పిన వ్యవహారం మొత్తం మొదట్లో ఆర్ధిక శాస్త్రాన్ని ప్రజల శ్రేయస్సు కోసం ఊపయోగించాలనే తపన ఉన్న ఆర్ధిక శాస్త్రవేత్తలకి తెలియలేదు - రహస్యంగా జరిగిన వ్యవహారం కదా!వాళ్ళకి తెలిసేసరికి వల నిర్మాణం పూర్తయిపోయింది. ఇప్పుడు వారికి కూడా మొత్తం వలని చేదించటం అసాధ్యమైపోయింది.అయితే హానిని తగ్గించటానికి ప్రజలకీ ప్రభుత్వాలకీ కొన్ని సూచనలు ఇస్తున్నారు.అవేమిటో వచ్చే భాగంలో చెప్తాను.


(this is the fifth part of a series on macro economy!)

14 comments:

  1. hi sir
    i read total after i put comets

    ReplyDelete
  2. మీ స్పందన లభించడం లేదు పలక రిచండి మాకోసం

    ReplyDelete
  3. బ్లాగ్మిత్రులకు వికారి శుభ కామనలు!

    నేను బ్లాగులోకం నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాను.ఇదివరలో కొన్నిసార్లు ఇలా ప్రకటించి మళ్ళీ వచ్చాను.కానీ, ఇప్పుడు అట్లా చెయ్యను.ఈసారి ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి.

    మొదటిసారి నేను బ్లాగు ఆపేస్తాననడానికి భరద్వాజ్ గారి ప్రవర్తనయే ముఖ్యమైన కారణం.మొత్తం ఆ గోలంతా ఎత్తుకునే ఉద్దేశం లేదు గానీ, క్లుప్తంగానైనా చెప్పాలి కదా! బ్లాగిల్లు శ్రీనివాస్ గారికీ KSC అని పేరును కత్తిరించుకున్న సత్యనారాయణ చౌదరికీ మధ్య జరిగిన గొడవలో నా బ్లాగు దగ్గిర ఒక అనామక వ్యక్తి వేసిన కామెంటు కారణం, అవునా?అది నేను వేశాననే మాట కూడా వచ్చింది అప్పట్లో, ఎవరయినా అట్లా ఎట్లా అనుకోగలరో నాకిప్పటికీ అర్ధం కాదు - వాళ్ళిద్దరి మధ్యనా చాలా యేళ్ళ క్రితం జరిగిన రహస్యమైన విషయాలు నాకెట్లా తెలుస్తాయి!దాని ప్రాముఖ్యత ఏమిటో తెలిసి ఒక కామెంటుకి రెస్పాండ అవటం తప్పిస్తే నా ప్రమేయం ఎంత మాత్రం లేదు. తను చేసిన ఎదవ పన్లు శ్రీవాస్ గారికి తప్ప ఇంకెవరికీ తెలియవనుకుని శ్రీనివాస్ గారిని కెలకటం, ఆయనకి మండి KSC చేసిన ఇంకొన్ని ఎదవ పన్లని బయటపెట్టటం - ఇదే కదా జరిగింది?

    అయితే, నా సమస్య ఇది కాదు.అప్పట్లో KSC నా గురించి ఒక మాట అన్నాడు, "ఒక బ్లాగరు ఫోనులోనో మెయిల్లోనో హరిబాబు అంతే! చాలా దుర్మార్గుడు.మీరు చాలా మంచివారు - బాధపడకండి" అని తనని ఓదార్చినట్టు చెప్పాడు.నేను పట్టించుకున్నది దీనినే.KSC మెయిల్ ఐడి నాకు తెలియదు, నా మెయిల్ ఐడి తనకి తెలియదు.అయినా అంతకుముందే మరొక విషయం ఏదో నేను తనకి చెప్పినట్టు కూశాడు KSC.అది పబ్లిక్ కామెంట్ కాబట్టి నేను దానికి జవాబు చెప్పేశాను.అయిపోయింది.మరి, ఎవరో నా గురించి ఏదో చెప్పాడని అంటున్నదాన్ని నేనెలా ఖండించుకోగలను?

    ఆ పని చెయ్యాల్సింది యాగ్రిగేటర్లే.వీక్షకులకీ బ్లాగర్లకీ మీరు ఇచ్చిన సౌకర్యాన్ని వాడుకుంటున్నవాళ్ళలో నేను నా గురించి KSCతో అలా అన్న బ్లాగరు ఎవరో తెల్సుకోవాల్ని ఉందని అడిగితే భరద్వాజ గారు స్పందించిన పద్ధతి ఏమిటి?మలక్ పేట రౌడీ అని ముద్దు పేరు పెట్టుకుని ప్రచండా, మార్తాండాల్తో వాగ్యుద్ధాలు చేస్తే చాలా?హరిబాబు అనే సాటి హిందువు మీద ప్రత్యర్ధులు దాడి చేస్తుంటే సహాయం అడిగిన తర్వాత కూడా నిస్తబ్దంగా ఉండిపోవటం దేన్ని సూచిస్తుంది?

    చెరొక సందర్భంలో KSC, చిరంజెవి y నన్ను చెన్నై వరకు వచ్చి తంతామని బెదిరించారు బ్లాగు ముఖంగానే!అయినా సరే, యాగ్రిగేటర్ల నుంచి ఎటువంటి స్పందనా లేదు!ఇతరులు ఎట్లా స్పందిస్తారో చూద్దామని సాయం అడిగానే తప్ప నా ప్రతీకారం నేను తీర్చుకోలేని అసమర్ధుణ్ణి అనుకున్నారా?"అరేయ్,ఓరేయ్" అని నన్ను పిల్చిన ప్రతి కుక్కనీ నన్ను తిట్టిన తిట్లకి పదింతలు తిట్టాను.నా అవమానానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఏ గొట్టాం సాయమూ నాకక్కర్లేదు.
    TO BE CONTINUED...

    ReplyDelete
    Replies
    1. శర్మగారు నమస్కారం

      మీరు భాదపడకండి కొందరు అజ్ఞానులు ఏదో అన్నారు అని మీరు భాద పడకండి మీరు పెట్టె ప్రతి బ్లాక్ చాలా బాగున్నాయి తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం..

      అతి పురాతనమైన శివలింగం తెలుగురాష్ట్రాల లో ఉంది అంట అది ఎక్కడ ఉందో ఆ గుడి చరిత్ర గురించి తెలియ చేస్తారా శర్మగారు

      ఇట్లు మీ శ్రేయభి లాషి
      జె వేంకటేశ్వర రెడ్డి

      Delete
    2. @jvreddy29 April 2019 at 08:35
      అతి పురాతనమైన శివలింగం తెలుగురాష్ట్రాల లో ఉంది అంట అది ఎక్కడ ఉందో ఆ గుడి చరిత్ర గురించి తెలియ చేస్తారా ...

      hari.S.babu
      ప్రస్తుతానికి గుడిమల్లం ఆలయంలోని పరశురామేశ్వర లింగమే అతి ప్రాచీనమైనది - ప్రవీణ్ మోహన్ దీని గురించి రెండు మూడు వీడియోలు చేశాడు, వెతికితే దొరకవచ్చును.

      Delete
  4. CONTINUIMG FROM ABOVE.
    శర్మ గారు పెద్దవారు.వారంటే నాకూ గౌరవం ఉంది.కానీ నీహారిక లేవనెత్తిన వివాదం వరకు చూస్తే తను చేసిన తప్పు ఏమిటి?ఒక బ్రాహ్మణుణ్ణి ఇబ్బంది పెట్టినందుకు నీహారికని గెంటేశారు.ఒకడు నన్ను అనకూడని మాటలు అంటున్నాడంటే అవి మా లిస్టులో లేవన్నారు.నేను బ్రాహ్మణుణ్ణి కాదు గాబట్టే కదా, హిందూమతాన్ని సమర్ధిస్తున్నందుకు నేను తిట్లు తింటుంటే చూస్తూ కూర్చున్నారు!నీహారిక బ్లాగుల్ని బ్రాహ్మణాగ్రహారం అనడంలో వింతేముంది - చెప్పండి?శ్యామలీయం నన్ను అడిగాడని తన తరపున ఇతరులతో పోట్లాడానా నేను?అదే శ్యామలీయం తొట్టిముక్కలని సమర్ధించి నన్ను తప్పు పడితే ఎలా రెస్పాండ్ అయ్యానో చూశారుగా!అదీ సత్యానికి కట్టుబడి హిందూధర్మాన్ని రక్షించే యోధుడికి ఉండాల్సిన ముఖ్యమైన స్వాభిమానం, అది లేనప్పుడు మలకపేట రౌడీ అని పేరు పెట్టుకున్నా గిలకపేట వస్తాదు అని పేరు పెట్టుకున్నా వేస్ట్!

    రెండవ విషయం గత కొద్ది కాలం నుంచి నా బ్లాగు మీద అప్రకటిత నిషేధం కొనసాగుతున్నట్టు వ్యాఖ్యాతల వల్ల తెలిసింది.మొదట్లో సాంకేతికపరమైన సమస్య అయి ఉండవచ్చునని అనుకున్నాను.కానీ అది సుదీర్ఘం కావటంతో అది కావాలని చేసినట్టు అనుకోవలసి వస్తున్నది."ఎందుకు?ఏమిటి?ఎలా?" అని క్యామెడీ డౌట్లు వెయ్యటానికి నేను బాబూ మోహన్ని కాదు.

    కత్తి మహేష్ రాముణ్ణి దగుల్నాజీ అంటే అతన్ని శిక్షిస్తే హైందవేతర సూడో సెక్యులరిష్టుల ఓట్లు పోతాయని జడిసి నిజాము కాలం నాటి నగర బహిష్కరణతో సరిపెట్టేసి పన్లో పనిలా కత్తి మీరు తీస్తారా నన్ను తియమంటారా అన్న శ్రీ పరిపూర్ణానంద స్వామికి కూడా నగర బహిష్కరణ శిక్ష వేసిన కేసీయారులా చిరంజీవి వై అనే హిందూమతద్వెషితో తలపడిన నన్నూ హిందూమతద్వెషితో సమం చేశారని నేను అనుకుంటున్నాను.అదే కారణమైతే అప్పుడు కూడా యాగ్రిగేటర్ల వారి పద్ధతి సరైనది కాదు.

    యాగ్రైగేటర్లు అనే వ్యవస్థని ఏర్పాటు చేసింది మా సౌకర్యం కోసమే కదా!ఆ సౌకర్యాన్ని తీసెయ్యాలని అనుకునప్పుడు మాకు కారణాలు చెప్పి ఆ పని చెయ్యడం సరైన పద్ధతి.మీరు ఏకపక్షంగ కారణాలు చెప్పేసి ఆ పని చేసినా మిమల్ని ఎవరూ తప్పు పట్టరు.ఎదటివారు మర్యాదను తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు దాన్ని వారికి చెప్పి దూరం పెట్టడం మనం పాటించవలసిన మర్యాద, కదా!
    TO BE CONTINUED...

    ReplyDelete
  5. CONTINUIMG FROM ABOVE.
    అది కారణం అని అనుకుంటున్నాను గనక మీరు అడగకపోయినా నా వైపునుంచి నేను జవాబు చెప్పదల్చుకున్నాను.ఏ విషయం గురించి అయినా చొప్పదంటు ప్రశ్నలకు కప్పదాటు జవాబులు అన్నట్టు చెప్పడం నాకు ఇష్టం ఉండదు.నావైఖరి మొదటినుంచీ ఒక్కలానే ఉంది - నేను ముందుకు ముందు ఎవ్వర్నీ తూలనాడను, నన్ను ఎవరయినా అవమానిస్తే ప్రతీకారం తీర్చుకోకుండా ఉండను, ఉండలేను.చిరంజీవి yతో కూడా నేను కొలిచినట్టు నా లెక్క ప్రకారమే ప్రవర్తించాను.

    నా బ్లాగు దగ్గిరే చాలామంది ఇతనిలాగే చీకాకు పెడుతున్నప్పుడు UG శ్రీరాం లాంటివాళ్ళు అలాంటివాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తారు అని అడిగినప్పుడు కూడా స్పష్టమైన జవాబునే చెప్పాను.దూషణలకి చివాట్లు పెడుతూ అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పడం వరకూ నేనే కాదు మీరు కూడా చెయ్యాల్సిందే!ఒకప్పుడు మార్తాండా పర్వీణూ కత్తి మహెషుల్తో ఆనాటి వీరయోధులు చేసింది కూడా అదే కదా!

    అంతే కాదు, చిరంజీవి yతో కూడా తొలిదశలో హుందాగానే వాదించాను.తను భాషని మార్చాకనే నేను కూడా భాషని మార్చాను.అదీ గాక,నేను భరద్వాజ గారికి రిపోర్ట్ చేసినప్పుడు "అతను వాడుతున్న పదాలు మా లిస్టులో లేవు!" అనే చెత్తాతిచెత్త వింత కారణంతో తప్పుకు పోకుండా యాగ్రిగేటర్ నిర్వాహకులు నాకు సహాయం వచ్చి ఉంటే నేను "ల..భాష" వాడాల్సిన అవసరం ఉండేది కాదు - ఒక బ్లాగరు నన్ను పరిధి దాటి అవమానిస్తుంటే నా స్వాభిమానం కాపాడుకోవటం కూడా తప్పేనా?

    ఆ చిరంజీవి yనే అడిగాను, "నేను వాడిన ల..భాషకి నీకు ఇంత నెప్పి పుట్టి ఇలా గుంజుకుంటున్నావే, మరి అరేయి, ఒరేయి, పిచ్చ మా లోకం అని అంటున్నప్పుడు నాకు నెప్పి పుట్టదని ఎందుకు అనుకున్నావు?నీకు నువ్వు హేతువాది లేబుల్ తగిలించుకోగానే ఎవణ్ణి పడితే వాట్టి తిట్టగలిగే హక్కూ నిన్ను ఎవరూ తిరిగి తిట్టగూడని హంగూ వచ్చేస్తాయా?" అని.మనిషి కాదు గాబట్టి అది వాడికి ఇప్పటికీ అర్ధం కాకపోవచ్చు - మనుషులైన మీకెందుకు అర్ధం కాలేదు?

    బూతులు వాడటం గురించి నీహారిక పట్టుబడుతున్నందుకు తనని బ్లాగుల నుంచి తొలగించటం వల్లనే ఆ కుక్కకి అట్లాంటి భాష వాడే ధైర్యం వచ్చిందని నా అనుమానం!కళ్ళముందున్న గందరగోళంలో దేన్ని పట్టించుకోవాలో దేనికి ఎవర్ని శిక్షించాలో తెలియని అజ్ఞానంతో కూడిన అసమర్ధత యాగ్రిగేటర్ల నిర్వాహకులది.వారి అసమర్ధతకి మొదట నీహారిక బలయ్యింది, ఇప్పుడు నా వంతు వచ్చింది!
    TO BE CONTINUED...

    ReplyDelete
  6. CONTINUIMG FROM ABOVE.
    దేవరాజు మహారాజు వ్యాసంతో పెట్టిన పోష్టు దగ్గిర జరిగిన వాగ్యుద్ధానికి పిలిస్తేనే వెళ్ళాను.అంతకు ముందరి గొడవలో వాడికే చెప్పాను నీ బ్లాగుకి ఇక రాను, నీతో ఏ చర్చలోనూ పాల్గొనను అని - ఆ మాట మీదే ఉన్నాను.నేను ఇంత హుందాగా వుంటే నన్ను తనతో ఎలా సమానం చెయ్యగలిగారు?అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ "నేను ఎవర్నీ అవమానించను,ఎవరైనా నన్ను అవమానిస్తే సహించను!" అనే పద్ధతికి కట్టుబడి ఉన్నాను.ఇవన్నీ ఆలోచించి నా బ్లాగును యాగ్రిగేటర్లకి కలుపుతారా?

    నా బ్లాగు Template నుంచి మీ లోగో code తీసి నా వైపు నుంచి కూడా సంబంధం తెంచుకోబోయేముందు ఈ అప్రకటిత నిషేధానికి కారణం తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.చెబుతారా?
    TO BE CONTINUED...

    ReplyDelete
  7. CONTINUIMG FROM ABOVE.
    ఇవి యాగ్రిహేటర్ల నుంచి తప్పుకోవడానికి సంబంధించిన కారణాలు.ఇక పూర్తిగా బ్లాగు వ్యాసంగాన్ని ఆపెయ్యడానికి ఉన్న కారణం చాలా చిత్రమైనది!ఇంతకాలం నేను రకరకాల విషయాలను గురించి రాసినవి అసలు మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని పైపైన తడమటమే తప్ప పరిష్కారం కోసం వెదుకులాట కానే కాదు.

    ఇప్పుడు నేను ఎత్తుకున్న 7 వ్యాసాలూ అత్యంత ముఖ్యమైనవి.నా దృష్టిలో, వీటితో పోలిస్తే ఇప్పటివరకు నేను రాసిన పోష్టులు అన్నీ చెత్తతో సమానం!అయినా, వీటి పట్ల మిత్రుల ప్రతిస్పందన నిరాశను కలిగించింది.ఎలా ఉన్నాయో చెప్పండని అడిగి కూడా రెస్పాన్స్ తెచ్చుకోవటంలో ఫెయిలయ్యాను.మరీ దగ్గరి మిత్రులని అనుకున్నవాళ్ళకి మెయిల్ పంపినా జవాబు లేదు.ఎందుకంత నిశ్శబ్దంగా ఉన్నారో అర్ధమే కావటం లేదు!

    నా పోష్టులు సుదీర్ఘం అని కొందరు బ్లేం చేస్తున్నారు - అదే విషయాన్ని అంతకన్న తక్కువ చెప్తే అసలు విషయమేమిటో అర్ధం కాదు.ఉదాహరణకి ఇప్పుడు ప్రస్తావిస్తున్న ఇల్యూమినాట్టి కుట్ర గురించి మొదటిసారి నేనే చెప్తున్నాను.కొత్త విషయం చెప్పేటప్పుడు కూడా "కట్టె, కొట్టె, తెచ్చె" అన్నట్టు చెప్తే ఎంతమందికి అర్ధం అవుతుంది?అసలు నేను రాసేదే ఇతరులు స్పర్శించనివీ అయినప్పటికీ ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాల్సినవీ అయినప్పుడు కూడా "అంతే నాకు చాలు!తమలపాకు తొడిమే పదివేలు!" అనటంలో అర్ధం లేదు.
    TO BE CONTINUED...

    ReplyDelete
  8. CONTINUIMG FROM ABOVE.
    నేను ఈ వ్యాసాల్లో టచ్ చేస్తున్న అసలు శత్రువు ఇల్యూమినాట్టి గ్యాంగు ఎకనామిక్సు, ఇంజనీరింగ్ అనే రెండు సైంటిఫిక్ బ్రాంచిల్ని ఇష్టారాజ్యం వాడేసుకోవటం వల్లనే ఇవాళ మనం చూస్తున్న ఆర్ధిక అసమానతలు, నిరుద్యోగం, అశాంతి,అధికార పిపాస, అవినీతి, యుద్ధాలు,టెర్రరిజం, కరువులు, రోగాల వంటి సమస్యలు పట్టి పీడిస్తున్నాయి.వాళ్ళ సింబల్సులో ఒక పిరమిడ్ రెండు డివైడర్లతో కలిసి ఉంటుది.ఒకటి గుర్తుంచుకోండి ద్రవోల్బణం(inflation) మన దేశంలో కూడా చాలాసార్లు వచ్చింది కదా - అది దానంతటది రాదు, ప్రభుత్వమే బ్యాంకులకి మేలు చెయ్యటం కోసం తీసుకునే కొన్ని కీలకమైన నిర్ణయాల వల్ల ఉనికిలోకి వస్తుంది!ఇలాంటివి తెలుసుకోకుండా రామాలయం కడితే చాలు రాముడే అన్నీ చూసుకుంటాడు,మోదీ ప్రధానిగా ఉంటే చాలు ఆయనే అన్నీ చూసుకుంటాడు, హిందువులు ఐక్యంగా ఉంటే చాలు అద్భుతాలు జరిగిపోతాయి అనుకుంటే కుదరదు.

    రెండవ పోష్టులో మూడు పేరాలు రిపీట్ అయ్యాయి - దాన్ని ఎవరూ ఎత్తి చూపించలేదు. అంటే అసలు చదవడమే లేదని అర్ధం కావడం లేదూ!ఈ రకమైన కారణాలతో నేను బ్లాగు మూసేస్తున్నాను.కొత్త పోష్టులు ఉండవు, ప్రస్తుతం ఉన్నవి కూడా ఒక నెల తర్వాత తీసేస్తాను.ఎవరికైనా నచ్చిన పోష్టులు ఉంటే పోష్టు టైటిల్ కాపీ/పేస్ట్ చేసి తమ మెయిల్ ఐడి ఇస్తూ కామెంట్ పెడితే వాటిని డాక్యుమెంట్ రూపంలో వారికి మెయిల్ చేస్తాను.Moderation ఉంది గాబట్టి మీ మెయిల్ ఐడీలు భద్రమే!

    ఇంతే సంగతులు - చిత్తగించవలెను!

    ReplyDelete
  9. ఈ వ్యాఖ్యలు వరూధిని బ్లాగు దగ్గిర వేస్తే "your comment was published" అనే message కనపడింది గానీ కామెంటు మాత్రం కనపడలేదు, నారదా నారదా అంటూ అందరికీ తంపులు పెట్టే ముసలిదానికి కూడా లోకువైపోయానా?చావుకి దగ్గిరైనప్పుడు బతికొస్రే బాగుండునని కోరుకునందుకు బలే ప్రత్యుపకారం చేసిందిలే!

    ఎలాగైనా మాలికలో పడేట్టు చేద్దామని ప్రజ దగ్గిర వేస్తే వీడ్కోలు కామెంటు అనే మర్యాద కూడా లేకుండా తీసి పారేశాడు ఆ ఇలిటరేట్!

    చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అన్నిసార్లు అడిగినా రెస్పాండ్ అవ్వక ఇప్పుడు ఆవేశపడితే లాభం ఏంటి?కొత్త పోష్టులు ఉండవు గాక ఉండవు.శ్యామలీయం ఇచ్చిన సలహా ప్రకారం పాత పోష్టుల్ని తొలగించే కార్యక్రమం మాత్రం ఆపేశాను.

    ReplyDelete
  10. Haribabu don't go. Keep telling ur views whether good or bad or anyone cares or don't care.

    ReplyDelete
  11. బ్లాగ్మిత్రులకు రెండు శుభవార్తలు!

    బ్లాగిల్లు,మాలిక లోగోల్ని నా బ్లాగ్ టెంప్లేట్ నుంచి పీకి పారేశాను.ఇంక నావైపునుంచి మళ్ళీ చేరే అవకాశం లేదు!

    బ్లాగులో పోష్టులు ఆగవు, ప్రస్తుతం రాస్తున్న మాక్రో ఎకనామిక్స్ సీరీసుని 7 నుంచి 9 భాగాలకి పెంచాను.ఈ తొమ్మిదీ పూర్తయ్యాక అన్నిటినీ ఒకేసారి వరసగా చదివితే గానీ మొత్తం పరిస్థితి అర్ధం కాదు - అంత సంక్లిష్తమైన విషయం ఇది!

    మీవైపునుంచి నేను ఆశించిన స్థాయిలో ఉత్సాహపూరితమైన స్పందన లేదని కొంచెం అతి చేసినందుకు మీరు నన్ను క్షమించాలి!ఇక మీదట అలాంటి తిక్క పుట్టదు లెండి!నా తిక్క కుదరటానికి నేను చూస్తున్న వీడియోలల్లో ఒక అమెరికన్ విశ్లేషకుడు కూడా నాలానే అమెరికన్ ప్రజల్ని విసుక్కున్నాడు, , "ప్రమాదం ముంచుకు వస్తుంది!తొందర్లోనే మన వ్యవస్థలన్నీ కుప్ప కూలిపోబోతున్నాయని మాపాటికి మేం గొంతు చించుకుని అరుస్తున్నా గొర్రెల్లా ఉండిపోతున్నారు, కర్మ!" అని.అది చూశాక నాకు ఎంత నవ్వొచ్చిందో!అక్కడా ఇక్కడా అని లేదు ఎక్కడైనా 90% మంది అమాయకత్వమే 10 % మంది మాయగాళ్ళని మోసం చెయ్యడానికి ప్రేరేపిస్తుంది కాబోలు!

    ఆ నవ్వులోనే నా తిక్క ఎగిరిపోయింది.ఈ సీరీస్ పూర్తయ్యాకనే వేరే టాపిక్స్ గురించి ఆలోచిస్తాను."The Muslims" అని ముస్లిం పునరుజ్జీవనం కోసం ఒక పుస్తకం రాశాడు ఓ పెద్దాయన చాలా నిజాయితీగా.నేను కూడా అంతే నిజాయితీగా దాన్ని పరామర్శిస్తూ ఒక సీరీస్ వేస్తాను.

    మొదటి 5 భాగాల్లో అంకెలూ తేదీలూ గణాంకాలూ ఎక్కువయ్యాయి - అవి అక్కడ తప్పనిసరి కదా!తర్వాతి నాలుగు భాగాల్లో చరిత్రా పరిశోధనా విశ్లేషణా ఎక్కువ ఉంటాయి కాబట్టి నా సహజశైలిలో ఉండి బోరు కొట్టకపోవచ్చునుటాయి కాబట్టి నా సహజశైలిలో ఉండి బోరు కొట్టకపోవచ్చును.

    మళ్ళీ వచ్చెను మధుమాసం నా బ్లాగుకి!!
    హరి.S.బాబు

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...