ప్రపంచంలో ఎంతోమంది ధనవంతులైన వ్యాపారులు ఉండగా ప్రత్యేకించి ఈ John Rokefelar గురించే ఎందుకు చెప్పదల్చుకున్నానో తెలుసా!ఒక మనిషి ఎంతటి ప్రతిభాశాలి అయినప్పటికీ ఇతన్ని మించి డబ్బు సంపాదించటం అసాధ్యం అని నిర్ద్వంద్వంగా తేలిపోయింది గనక!
పుట్టి నాలుగేళ్ళయినా నిండక ముందునుంచే వూరికూరికే వూళ్ళను మార్చే దేశదొమ్మరి బతుకు అలవాటైపోయి నాలుగిళ్ళలో పాలేరు పన్లు చేస్తే తప్ప పొట్ట గడవని దుర్భర దారిద్య్రం నుంచి నక్కని తొక్కి వచ్చినట్టు నదమంత్రపు సిరి పట్టి మట్టిని ముట్టుకుంటే బంగారమౌతూ నట్టింట నవధాన్యాల పొంగులను చవిచూడటం వరకు ఎదిగిన అన్ని కధల్లాగే John Rockefellar యొక్క కధ కూడా అతి సామాన్యంగానే మొదలైంది.డాబుసరి కోసం కావచ్చు, తనని తను "botanic physicist"నని చెప్పుకునే ఆనాటి కాలంలో ఈనాటి హోమియోపతిని పోలిన సంప్రదాయ వైద్యం చేస్తూ "తోటకు తోబుట్టువును... ఏటికి నే బిడ్డను, పాట నాకు సైదోడు.. పక్షి నాకు తోడు, విసుగు రాదు.. ఖుషి పోదు.. వేసట లేనే లేదు, విసుగు రాదు.. ఖుషి పోదు.. వేసట లేనే లేదు, అసలు నా మరో పేరు ఆనంద విహారి, నా దారి ఎడారి నా పేరు బికారి, నా దారి ఎడారి నా పేరు బికారి" అని పాడుకునే తండ్రికి 1839లో ఇతను పుట్టినప్పుడు గ్రహాలు కంపించలేదు, పిశాచ గణాలు పగలబడి నవ్వలేదు, దుశ్శకునాలు గోచరించలేదు,జ్యోతిష్కులు పరుగులు పెట్టుకుంటూ వచ్చి ఈ బిడ్డ భవిష్యత్తులో నీచకార్యాలు చేసి లోకాలను హింసించే దుర్మార్గుడు అవుతాడు కాబట్టి లోకహితం కోసం చంపెయ్యమని సలహాలు ఇవ్వలేదు - అంతా మామూలుగానే ఉంది, మీదు మిక్కిలి తొలి కాన్పు కాబట్టి తల్లి గర్వంతో సెలవివార నవ్వింది కూడాను.
ఆ తండ్రికి ఇతని తల్లి ఒకతే కాదు వేరే చోట ఇంకో భార్య ఉంది, సంతానంతో సహా మనవాడి తండ్రి శ్రీమాన్ కుచేల స్వామియే!తండ్రి ఒకసారి ఇల్లు దాటి వెళ్తే మళ్ళీ రావటానికి వారాలు పట్టేది - అందర్నీ ఓకచోటకి చేర్చి కుదురైన జీవితం గడపాలనే చిన్న కోరిక కూడా తీరని దురదృష్టం ఆ తండ్రిది!
ఈ తరహా గందరగోళపు కుటుంబ జీవితం వల్ల చిన్నప్పటి నుంచే ఇతరుల్ని రుబాబు చేస్తూనే ఎలా బుజ్జగించాలో, చిన్న చిన్న ట్రిక్స్ నుంచి పెద్ద పెద్ద ప్రాఫిట్స్ ఎలా కొట్టెయ్యాలో నేర్చుకున్నాడు. చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడే తనకి దక్కిన ప్రతి పైస నుంచీ పది పైసల్ని పిండటంలో అఖండప్రజ్ఞని సాధించాడు.మూడేళ్ళ వయసు నుంచే ఆటపాటల గురించి ఆలోచించి ప్రలోభపడి సమయం వృధా చేసుకోకుండా తల్లికి సాయపడటానికి పనిపాటల్లోకి దిగిపోయాడు.బాతుల్ని పెంచటం దగ్గిర్నుంచీ పక్కింట్లో పాచిపని చెయ్యటం వరకు దేనినీ నామోషీ అనుకుని ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పని చేశాడు - అప్పటి రాక్ ఫెల్లర్ ఇలాంటి కొడుకు నాకూ ఉంటే బాగుండునని ప్రతి తల్లీ కోరుకునే బుద్ధిమంతుడైన పెద్ద కొడుకు.
1854లో కుటుంబం Cleveland చేరుకున్నప్పటినుంచీ బుజ్జిగాడి తెలివితేటలకి తగ్గ గుర్తింపు రావటం మొదలైంది.స్కూల్లో చేరి చదవటం,రాయటం కూడా నేర్చుకున్నాడు, కానీ సంవత్సరం తిరిగేసరికి బయటి కొచ్చేసి HEWITT & TUTTLE అనే Produce broker(కిరాణా కొట్టు లాంటిది)లో జమాఖర్చులు రాసే గుమస్తా ఉద్యోగానికి కుదిరాడు.ఎంత గింజుకున్నప్పటికిన్నీ బాసు $0.50 కన్న ఎక్కువ ఇచ్చేవాడు కాదు.అదనపు ఆదాయం కోసం చాలాచోట్ల పని చేసీ చేసీ చచ్చి ముతమారినా జీతం పెంచేది లేదని భీష్మించుకుని కూర్చున్న బాసుల మీద కడుపు రగిలిపోయి వాళ్ళ మీద కసి కొద్దీ రెండేళ్ళ తర్వాత సొంత వ్యాపారం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
బాసులు పిసనార్లయ్యి జీతం పెంచలేదు గానీ పనిమంతుడని అందరికీ తెలియడంతో $4000 అప్పుని కిట్టించుకోగలిగాడు - గడ్డి,ధాన్యాలు,మాంసాలు అమ్మడం మొదలుపెట్టి సంవత్సరం తిరిగేసరికి అర మిలియన్ డాలర్లు వెనకేశాడు!మెరుగూ తరుగూ లెక్కలు తీస్తే తనకి దక్కింది తక్కువే గానీ గెలుపు మాత్రం తక్కువది కాదు!Clevelandలో పేరున్న బ్యాంకులన్నీ అప్పులివ్వటానికి పిలుపులు మొదలెట్టాయి - తీరా చూస్తే అతనికి పద్ధెనిమిదేళ్ళు మాత్య్రమే, అప్పటి రాక్ ఫెల్లర్ ఇలాంటి మొగుడు నాకూ వస్తే బాగుండునని ప్రతి ఆడపిల్లా కోరుకునే కత్తిలాంటి కుర్రాడు!
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టు ఆ 1859లో Clevelandకి తూర్పున వంద మైళ్ళ లోపున చమురుబావి ఉన్నట్టు తెలిసింది, మొత్తం అమెరికాకే అది మొదటి చమురుబావి, కెపాసిటీ ఏడాదికి 4,500 బ్యారల్సు!అప్పట్లో ఇప్పటిలా పెట్రోలు వాడకం లేదు, దీపాలు వెలిగించుకునే కిరోసిన్ కోసం మాత్రమే పనికొచ్చేది, అయితే మాత్రమేం, దాని విలువ కూడా తక్కువేం కాదు.మన కధానాయకుడు అన్నివైపుల నుంచీ పరిశీలించి ఆయిల్ తవ్వి తియ్యటానికి గండభేరుండాలు పోటీ పడటం చూసి అక్కడ దూరే దమ్ము లేక నిదానించి చూస్తే తీసిన ఆయిల్ని శుద్ధి చేసే refinaryని గనక పెడితే తవ్వేవాళ్ళంతా చచ్చినట్టు తన దగ్గిరకే వస్తారని పసి కట్టాడు - అప్పటికి గండభేరుండాల చూపు ఇటు పడకపోవటమే రాక్ ఫెల్లర్ జీవితాన్ని వూహించని మలుపు తిప్పింది!
వేట మీదకి వేసే ఆఖరి దూకు కోసం పులి ఎదురు చూసినంత సహనంతో 1863లో ప్రభుత్వం Pennsylvania oil fields నుంచి Cleeland వరకు రైలు వేసేవరకు ఆగి అప్పటికే భాగస్తుల్ని కలుపుకుని బ్యాంకుల్ని మచ్చిక చేసుకుని ఉన్న రాక్ ఫెల్లర్ వెంటనే రంగంలోకి దిగిపోయాడు.రిఫైనింగ్ కోసం పేరు మోసిన కెమిస్టుల్ని తీసుకోవడంతో వాళ్ళు ఖర్చుని తగ్గించటంతో పాటు కిరోసిన్ ఒక్కటే గాక paraffin wax, tar, naphtha వంటి కొత్త ఉత్పత్తుల్ని కూడా వేరు చెయ్యొచ్చునని కనుక్కున్నారు.దీంతో కేవలం రెండేళ్ళలో రాక్ ఫెల్లర్ డెబ్భయి వేల డాలర్ల ఆదాయంతో శిఖరం చేరాడు!
శిఖరం చేరిన రాక్ ఫెల్లర్ అంబరం కోరాడు:1865 నాటికి తనది కాక మిగిలిన 26 రెఫైనరీల్లో అయిదేళ్ళు గడిచేసరికి కొరుకుడు పడని నాల్గింటిని తప్ప అన్నింటినీ మింగేశాడు - జీర్ణం చేసుకుని బ్రేవుమని త్రేన్చాడు.అప్పటికే వ్యాపారం పెద్దదైపోయి భాగస్వామ్యపు లిటిగేషన్లని తట్టుకోవటానికి 1870లో తన రిఫైనరీని Standard Oil of Ohio అనే సంస్థ రూపం తీసుకొచ్చాడు.కొరకరాని కొయ్యల్ని మెత్తబరచటానికి అతడెన్నుకున్న వ్యూహం చాలా చిత్రమైనది.చాలా మర్యాదగా తన దగ్గిరకి పిలిపించుకుని చూపించాల్సిన అన్ని లెక్కల్నీ చూపించి ఖర్మ కాలి మొత్తం పరిశ్రమ నష్టాల్లోకి వెళ్తే నష్టాన్ని భరిస్తూ తను కొనసాగినంత సుదీర్ఘ కాలం వాళ్ళు కొనసాగలేరు కాబట్టి వాళ్ళ కంపెనీల్ని తనకి అమ్మితే బాగుంటుందని సూచించేవాడు.ఇక్కద మెలిక ఏమిటంటే అతను చెప్తున్న "పరిశ్రమకి వచ్చే నష్టాలు" వాతంతటవి రావు, బ్యాంకుల సాయంతో ఇతను రప్ప్పిస్తాడు!డబ్బే కావాలనుకుంటే ఎక్కువ రేటుకి అమ్మొచ్చు, లేదంటే తక్కువకి అమ్మి తన కంపెనీలో ఉద్యోగం చెయ్యొచ్చు అనే పద్ధతిలో వ్యవహారం నడిపేవాడు - మొదటి ఆప్షన్ మామూలు తెలివి ఉన్నవాడు ఎవడయినా ఇస్తాడు గానీ రెండో ఆప్షన్ మాత్రం రాక్ ఫెల్లర్ లాంటి కాలాంతక నరాంతక దేవాంతకుడు తప్ప ఇంకెవడూ ఇవ్వలేడు!
ఈ ఎత్తుగడతో అంబరం కోరుకున్న రాక్ ఫెల్లర్ పతనం వైపుకి మొదటి మెట్టుని దిగాడు!ఎలాగంటే, ఆయిల్ తవ్వకాల దగ్గిర ఉన్న గండభేరుండాలతో పోటీ పడలేకనే కదా అప్పటికి పోటీ లేని శుద్ధి చెయ్యటాన్ని ఎంచుకున్నాడు, తనే గండభేరుండం అయ్యాక కొత్తవాళ్ళు తనకి గట్టి పోటీ ఇస్తున్నారంటే వాళ్ళు తనకన్న మెరుగైన క్వాలిటీనో చవకైన రేట్లనో కస్టమర్లకి ఇవ్వడం వల్లనే కదా తను వెనకబడిపోయింది,వాళ్ళకన్న నీకు అనుభవమూ ఆదాయమూ సాంకేతికతా ఎక్కువ ఉండి కూడా మెరుగైన క్వాలిటీని గానీ చవకైన రేటును గానీ ఒచ్చి నీ సామర్ధ్యాన్ని నిరూపించుకునే బదులు కస్టమర్లకి నీ సరుకుని ఏడుస్తూ కొనాల్సిన దుస్తితిని కల్పించడంలోని అర్ధం ఏమిటి?అప్పటి రాక్ ఫెల్లర్ కేవలం సంపదా వైభవమే కాక సమాజంలో గౌరవం కూడా కోరుకునే ప్రతి వ్యాపారవేత్తా తను ఇలా ఉండకూడదని కోరుకునే పులిలా మారుతున్న లేడి!
ఎంత సంపాదించావు అనే ప్రశ్నతో పాటు ఎలా సంపాదించావు ఆనె ప్రశ్నకి కూడా జవాబు చెప్పాలి కదా!ఆ ప్రశ్న అనవసరం అనుకుంటే ఇవ్వాళ లైటు స్తంభం పక్కన అయిదు రూపాయలకు మానం అమ్ముకున్న ఆడమనిషి పదేళ్ళు గడిచేసరికి సామ్రాజ్యాధినేతల్ని పాదాక్రాంతం చేసుకోగలిగిన మాతాహరీ క్లియోపాట్రాల సరసన నిలబడగలదు- అయినప్పటికీ అలాంటివాళ్ళ ముందు నిలబడాల్సి వస్తే చావుకి భయపడి శిరస్సు వంచవచ్చును గానీ మనస్సులో కులస్త్రీ స్థానం ఇవ్వరు కదా!రాక్ ఫెల్లర్ నీచత్వాన్నే ఇప్పటికీ కొందరు కొనసాగిస్తున్న take-over నాటకాన్ని ప్రజలూ ప్రజల మేలు కోరిన నాయకులూ సహించకూడదు - అది వాళ్ళ అంతరంగిక విషయమో వ్యాపార మెళకువయో కాదు,కస్టమరుని మోసం చెయ్యడం అనే దుర్మార్గం అక్కడ నడుస్తున్నది.
వ్యాపారంలొకి ప్రవేశించిన ప్రతివాడికీ శిఖరం చేరుకోవాలని ఉంటుంది - అది అతని హక్కు కూడాకస్టమర్లని మోసం చెయ్యని వ్యాపారులకి కీర్తి కిరీటాలు పెట్టడం ఎంతమాత్రం తప్పు కాదు.అయితే, ఈ రహదారిని వదిలి దొడ్డిదారికి మళ్ళిన రాక్ ఫెల్లర్ చేసిన మొదటి దాడికి అందరూ లొంగలేదు -.ఆ మిగిలిన వాళ్ళని తన దారి నుంచి తప్పించటానికి రాక్ ఫెల్లర్ పతనం వైపుకి రెండో మెట్టును దిగాడు.తన సరుకుల రేట్లని అమాంతం తగ్గించాడు, కొన్ని చోట్ల 80 % వరకు తగ్గించేశాడు!ఈ వ్యూహం తిరుగులేని ఫలితాన్ని ఇచ్చింది.కంపెనీల బోర్డు రూముల్లో జరిగే రహస్యమైన కుట్రలు వీటిమీద ఆసక్తి గానీ వీట్ని పట్టించుకునే తీరిక గానీ లేని కస్టమర్లకి ఎలా తెలుస్తాయి?అలా 1880 నాటికి అమెరికా లోని Northeastern oil belt మొత్తం రాక్ ఫెల్లర్ హస్తగతమయి మొత్తం దేశంలోని ఆయిల్ నిల్వలు 90% ఇతని అధీనంలోకి వచ్చేశాయి.
కధ ఈ మలుపు తీసుకునే సమయానికి అతని శక్తి సామర్ధ్యాలు అందరికీ తెలిసిపోవటంతో రైలు మార్గాల అధినేతల్ని వ్యక్తిగత పరిచయాలతో మచ్చిక చేసుకుని వారి రైళ్ళలో సరఫరా అయ్యే తమ సరుకులకి రవాణా ఖర్చుల్లో రాయితీలని సాధించుకోగలిగాడు.అప్పటికే అతని ఆదాయపు విస్తృతిని బట్టి చూస్తే ఇఒది కక్కుర్తి పనిలానే తోస్తుంది.కానీ రాక్ ఫెల్లర్ మరియూ అతన్ని ఇమిటేట్ చేస్తున్న వాళ్ళు ఒక ప్రత్యేకమైన ధోరణిలో ఉంటారు."నేను పెట్టాలనుకున్న పరిశ్రమకి కావలసిన భూవసతి అయితే ఉచితంగా గానీ లేదంటే అతి తక్కువ ఖర్చుతో గానీ సమకూడాలి,నాకు అవసరమైన కార్మికులూ సాంకేతిక నిపుణులూ అయితే ఉచితంగా గానీ లేదంటే అతి తక్కువ జీతాలకి గానీ పని చెయ్యాలి,సరుకుల్ని తయారు చెయ్యటానికి అవసరమైన ముడిసరుకులూ అదనపు వనరులూ అయితే ఉచితంగా గానీ లేదంటే అతి తక్కువ ఖర్చుతో గానీ వచ్చి పడాలి, నాతో పోటీ పడి నన్ను ఒత్తిడికి గురి చేసే పాపాత్ములు రంగంలో ఉండకూడదు,ప్రభుత్వం నా లాభాల మీద పన్నులు వెయ్యకూడదు!" - మనకి ఇవన్నీ కలలో తప్ప ఇలలో జరగటానికి వీల్లేని గొంతెమ్మ కోరికలు అనిపిస్తాయి గానీ వీళ్ళకి అప్పులిచ్చి ప్రోత్సహించే బ్యాంకింగ్ వ్యవస్థ మాయాజాలం వల వీళ్ళ కోరికలు చక్కగా నెరవేరుతూనే ఉన్నాయి!
అయితే కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లి నన్నెవరూ చూడలేదనుకున్నట్టు జరిగిన ఈ తెరచాటు భాగోతం కేవలం ఆయిల్ పరిశ్రమ ఒక్కటే గాక అన్ని రంగాల పరిశ్రమల అధిపతుల్నీ ఉలిక్కి పడేలా చేసింది - వ్యతిరేకులు బలం పుంజుకున్నారు,కోర్టుల్లో antitrust క్లాజులతో కేసులు వేశారు, మీడియాలో వ్యతిరేక ప్రచారం వూపందుకుంది, రాజకీయ నాయకులు కూడా Standard Oil సంస్థ విజృంభణని కట్టడి చేసే కొత్త చట్టాలను చెయ్యటానికి సిద్దహమయ్యారు.రాక్ ఫెల్లర్ మాత్రం నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు, నా ఇఛ్చయే గాక నాకేటి వెరపు అన్న చందాన తన విజయ పరంపరని కొనసాగిస్తూనే ఉన్నాడు.1882లో New Jersey నగరంలో Standard Oil Trust అనే సంస్థని స్థాపించాడు.ఈ సంస్థ 40 స్థానిక కంపెనీల్లో వాటాల్ని కొనుగోలు చేసింది.ఇది నిజానికి రాక్ ఫెల్లర్ సాధించిన విజయాలకి మకుటాయమానమైనదని చెప్పవచ్చు - రాక్ ఫెల్లర్ కూడా తన విజయామృత దరహాస రుచుల్ని చూసుకుని పులకించి పోవటం కోసం బ్రాడ్వేలో హెడ్ క్వార్టర్స్ కట్టాడు - ఆ మధుర క్షణాల నాటికి అతను 20,000 బావులకి యజమాని, అతను వేసిన పైప్ లైన్ల పొదవు 4,000 మైళ్ళు, అతని ఉద్యోగులు 100,000 పైన ఉన్నారు!
ఆ మధుర క్షణాలను అనుభవించిన కొద్ది కాలంలోనే కరి మింగిన వెలగపండులా అతని ప్రాభవం ఇంటా బయటా సన్నగిల్లిపోవటం కూడా మొదలైంది.రష్యాలోనూ ఆసియాలోనూ పెద్ద స్థాయిలో బయటపడిన ఆయిల్ నిక్షేపాలతో జువ్వలా రంగంలోకి దూసుకొచ్చిన Rothschild కుటుంబం అమెరికాని కూడా ఆక్రమించాలని చూస్తున్నది.పులి మీద పుట్రలా 1890 కల్లా Sherman Antitrust Act సభలో ఆమోదం పొంది బ్యాంకింగ్ వ్యవస్థలోని complex legal structure వల్ల అన్ని కంపెనీల వ్యవహారాల్నీ లొసుగులు లేకుండా నిర్ధారించుకోవటం వంటి ప్రక్రియలు కొనసాగి కొనసాగి ఎట్టకేలకి 1911 నాటికి Standard Oil కంపెనీని ముక్కలు ముక్కలు చేసి రాక్ ఫెల్లర్ దూకుడుని ఆపగలిగారు!
అయితే విచారణ ఇలా నత్తనదక నడవటం వల్ల రాక్ ఫెల్లర్ ప్రతికూలతని అనుకూలత కింద మార్చుకుని తంతే గారేల్ బుట్టలో పడ్డట్టు ఇతరులు తనని దెబ్బ కొట్టాలనుకున్న ప్రయత్నం నుంచి కూడా రెట్టింపు లాభాల్ని పిండుకుని చచ్చేవరకూ చిద్విలాసంగానే బతికాడు.తన ఆస్తుల్నీ వాటాల్నీ క్యాష్ చేసుకుని కంపెనీతో అధికారికమైన సంబంధాన్ని తెంచేసుకున్నాడు - చివరి ఇరవై సంవత్సరాల్లో షేర్ హోల్డర్లకి అర బిలియన్ డాలర్లు డివిడెండ్ అతని కంపెనీ ఇవ్వగలిగిందంటే అతని తెలివితేటలూ చురుకుదనమూ ఎంత గొప్పవో కదా!సుప్రీం కోర్టు anticompetitive practices అనే కారణంతో Standard Oilని రద్దు చేస్తూ 34 చిన్న చిన్న ముక్కల కింద విడగొట్టినప్పటికీ రాక్ ఫెల్లర్ ఆ కంపెనీల్లో కొనుగోలు చేసిన stakes మాత్రం అలాగే ఉంచేసింది - బ్యాంకింగ్ చట్టాల ప్రకారం అది కోర్టు పరిధికి అతీతమైనది.అంతటితో రాక్ ఫెల్లర్ నడక ఆగిపోయింది, కానీ అతను పరాజితుడు కాదు.ఎందుకంటే, నష్టాన్ని కూడా లాభం కింద మార్చుకున్న చతురత వల్ల అక్కడ విడగొట్టి ఏర్పాటు చేసిన చిన్న చిన్న కంపెనీల పరిమాణమే చాలా ఎక్కువ. తర్వాత వాటిలో అవి విలీనం అయిపోయిన మార్పులు చేర్పులతో సహా రాక్ ఫెల్లర్ అధిపత్యం కింద ఉన్న అన్ని కంపెనీల మొత్తం విలువ $400 బిలియన్లు!
ఇప్పటికే మీకు బ్యాంకింగ్ వ్యవస్థ నడుస్తున్నది సామాన్యుల సంక్షేమం కోసం కాదనీ ప్రజలను దోచుకునే రాక్ ఫెల్లర్ లాంటి వారికే అవి ప్రోత్సాహం ఇస్తాయనీ అర్ధమై ఉంటుంది.బ్యాంకింగ్ వ్యవస్థని అలా రూపు దిద్దింది యూదులు.ఇప్పటికీ ఆ లక్ష్యాన్ని మార్చటానికి వ్యతిరేకించే యూదుల వెనక ఇల్యూమినాటీ భావజాలం ఉంది - ఈ మూడిళ్ళ ముచ్చట్లని వచ్చే భాగంలో చెప్తాను.

(this is the seventh part of a series on macro economy!)
No comments:
Post a Comment
సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు