Sunday, 13 December 2015

రూపాయిపెరుగువడ తయారీ విధానం గురించి తెలుసుకుందాం!దేశానికి ఫారిన్ ఎక్స్చంజి నిల్వల్ని విపరీతంగా పెంచేద్దాం?

        ఇది అతి రహస్యమైన లక్ష్మీపురాణము లోని ప్రసాద పరిషేచన మను ప్రధమాధ్యాయములో చెప్పబడీన అత్యంత ఫలప్రదాయకమైన పిండివంటకం.కావున ధనార్ధులు భక్తిశ్రధ్ధలతో పచనం గావించి భుజించిన యెడల సకల సంపదలూ వాటంతటవే దరి చేరగలవు!

1).మొదట రూపాయిని స్వార్ధము,పీడన,ధూర్తత్వము,దోపిడి,మోసము వంటి మలినాలు లేకుండా గట్టి సంకల్పంతో శుభ్రపరచి దేశభక్తి ద్రావణమున నిలవ ఉంచి దాన్ని చూస్తేనే రాముడూ జీసస్సూ ప్రవక్తా కనబడేటంత కాలం నానబెట్టాలి.

2).తర్వాత అధికఫలితం కొరకు విదేశీ మారక ద్రవ్యం అనే లవణాన్ని కొంచెం చేర్చి అంతర్జాతీయ వాణిజ్య విధాన సంప్రదాయం అనే రుబ్బురోలుతో బాగా రుబ్బి మెత్తగా చెయ్యాలి.

3).ఇపుడు జాతీయ ఆర్ధిక విధానం అనే నూనెని అంతర్గత కలహాలు అనే దోషగుణాలు పోయి ఉత్సాహపూరిత వాతవరణం అనే పొగలు కక్కే వరకు మరిగించి అందులో ఇంతకు ముందు తయారు చేసి పెట్టుకున్న మెత్తగా రుబ్బిన రూపాయిని వెయ్యాలి.

4).వేగుతున్న రూపాయి ఒక మోస్తరుగా గట్టిపడి మరీ మాడువాసన రాకముందరే లాఘవంగా బయటికి తీసి పోటాపోటె పెట్టుబడులు అనే ఉల్లిపాయలూ విస్తరణ వ్యూహాలు అనే పచ్చి మిరపకాయలూ అంతర్జాతెయ ద్రవ్యనిధి నుంచి పొందే సహాయాల వంటి మసాలా దినుసులూ కలిసిన ఎగుమతులు దిగుమతుల వ్యాపారం అనే పెరుగులో ముంచి ఉంచాలి.

ఇప్పటికే వంటకం యొక్క ఘుమఘుమలు మీ ముకుపుటాలని చేరి ఉంటాయి,ఇక వడ్డించడమే మిగిలి ఉంది!

        లక్ష్మీపురాణము లోని ప్రసాద పరిషేచన మను ఈ అధ్యాయమునకు ధనవిద్యా ధనగుహ్య యోగము అను నామాంతరము గూద కలదు,కాన దీనిని తాము వండి ఇతర్లకు తినిపించు వారికీ దీని విధి విధానమును ప్రచారము చేయు వారికీ ధనప్రాప్తి తధ్యము.వారు షేర్లు కొన్న కంపెనీలు మార్కెట్టును అప్రతిహతంగా దున్నేయగలవు,వారి ఇంట క్రెడిట్ కార్డుల వర్షము కురియగలదు! 

ఇతి శుభం!

7 comments:

  1. నేను మొదటి నించే మొత్తు కుంటున్నా కదండీ ? ఇవన్నీ బాజాపా వారి కుట్రలే అని :)
    ఇదే కాంగిరేసు హయాములో అయ్యుంటే పెళ్లి భోజనము దక్కేది :)


    ReplyDelete
    Replies
    1. పెళ్ళి భోజనమేం ఖర్మ,తిన్నదరక్క చావుకీ లంఖణానికీ మధ్య వూగిసలాదుతూ ప్రాణం మీదకి వచ్చేది:-)

      Delete

    2. హరిబాబు గారి చెణుక్కులు జిలేబి కామింట్లని మించి పోతున్నాయి :) చీర్స్ జిలేబి

      Delete

  2. బై ది వె, రాబోయే టపా ఎగ్ మంచూరియా గురించా ?

    జిలేబి

    ReplyDelete
  3. కల్తీ పిండి, కల్తీ నూనె, వున్న సరంజామాని దొంగచాటుగా వంటిల్లు దాటేసే సేవకులు(ఇప్పుడు వాళ్ళని నాయకులు ఆనాలి. ఖర్మ) వున్నంతకాలం.. ఈ వడ.. ఓ కల

    ReplyDelete
    Replies
    1. ఏం చేస్తాం,కోరి తెచ్చుకున్న దురద కదా,గోక్కోవాల్సిందే!
      తగ్గించే డాక్తరు కూడా దొంగ సర్టిఫికెట్లతో డిగ్రీ తెచ్చుకున్నవాడే:-)

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...