Friday, 18 December 2015

కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?! (శ్రీమతి ఇందిరా గాంధీ)

        "నేను ఇందిర కోడల్ని!ఎవరికీ భయపడను?" - ఒక కేసులో ముద్దాయిగా పేర్కొనబడి,కోర్టు వారు ఫలానా తేదీన హాజరు కమ్మని శ్రీముఖం పంపితే 2015లో అంతకు ముందు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని అప్పగించిన రెండు విడతల దశాబ్ద కాలపు అధికారంలో అవినీతిని ఇంటిపేరుగా చేసుకున్నంత ధీమాగా కుంభకోణాల పరంపరని ప్రోత్సహించి, ఆఖరి దశలో తత్వం బోధపడి కూడా ఆంధ్రప్రదేశ్ రాస్ట్రాన్ని ఆ రాష్ట్రానికి చెందిన సొంత పార్టీ వాళ్ళు ఎంత మొత్తుకుంటున్నా వినకుండా చీల్చగూడని విధంగా చీల్చి లాభం పొందాలన్న పరమ బేఖారీ వ్యూహాలతో, దిక్కుమాలిన ఎత్తుగడలతో ఎన్నికలకి సిధ్ధమై కాగితాలు చూసి ప్రసంగాలు దంచే తనూ తను మాట్లాడుతున్నవి ఎన్నికల ప్రసంగాలు అని తెలియక "మా అమ్మ ఏడ్చింది" అంటూ "వుడ్వర్డ్స్ పట్టమని చెప్పు" అన్న జోకు మాదిరి ప్రసంగించే తన పుత్రుడూ చాలు పార్టీని ఉధ్ధరించడానికి అనుకుని, తీరా ఎన్నికల్లో అనుకున్నది ఒకటీ అయినది ఒకటీ అయి బండి బోల్తా కొట్టి అధికారం పోగొట్టుకుని అసహనం పెంచుకున్న శ్రీమతి సోనియా గాంధీ ఈవిధంగా ప్రతిస్పందించింది - భయపడనని చెప్తూ భయాన్ని దాచుకోవడానికా అనేది నా అనుమానం!నిజమే, ఈ కోడలి స్థానంలో ఉన్నమరుగుజ్జు ప్రస్తావించిన మహాకీర్తికాయురాలు శ్రీమతి ఇందిరా గాంధి తను భయపడకపోవటమే కాదు, ఇతర్లని భయపెట్టి ప్రతికక్షులతో "కాళిక" అనిపించుకుంది.స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధాని రాజకీయంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని అభాసుపాలై ఉందవచ్చు గానీ,పదవిని స్వప్రయోజనాలకి వాడుకోవటానికి వీలయినంతవరకు దూరంగానే ఉన్నాడు,చాలాసార్లు తనని వ్యతిరేకించిన ఎదటివారి అభిప్రాయాలకి విలువనిచ్చి తన వరకూ తను ప్రజాస్వామ్యాన్ని గౌరవించాడు.కానీ అతని శిష్యరికంలో ఎదిగిన అతని కూతురు శ్రీమతి ఇందిరా గాంధి మాత్రం పూర్తి విరుధ్ధమైన దారిలో నడిచి శుభకీర్తినీ అపకీర్తినీ సరిసమానంగా సంపాదించుకుంది!
        తెలిసో తెలియకో శ్రీమతి సోనియా గాంధీ రెండు పరస్పర విరుధ్ధమయిన చారిత్రక సన్నివేశాల్ని తను గుర్తు చేసుకుని మనకి గుర్తు చేసి అనాటి ఫలితాన్ని మళ్ళీ సాధించాలని ఆశిస్తున్నది. కానీ అప్పుడు శ్రీమతి ఇందిరా గాంధీ అనూహ్యమయిన ఫలితాన్ని అందుకున్న పరిస్థితికీ ఇప్పుడు శ్రీమతి సోనియా గాంధీ నిలబడి ఉన్న పరిస్థితికీ తేడాలు కూడా ఉన్నాయి.పోలికలు కలిసొచ్చి కాలం అనుకూల ఫలితాన్ని ఇస్తుందని కాంగ్రెసు ఆశిస్తున్నది,కానీ తేడాలు కలిసొచ్చి పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంభట్టు అన్నరీతిన ఎదురు తంతే?!ఈవిడ పోల్చుకుని మురిసిపోతున్న సన్నివేశం యేమిటంటే, శ్రీమతి ఇందిరా గాంధీ తను 1971 నాటి ఒకానొక ఎన్నికల్లో తప్పుడు పధ్ధతుల్లో గెలిచానని ఒక కోర్టు నిర్ధారించుకుని ఆ ఎన్నిక చెల్లదని తీర్పు ఇవ్వటంతో, అల్లాటప్పా గోంగూర కట్ట పొలిటీషియన్ మాదిరిగా సిగ్గుపడి పదవి నుంచి దిగిపోకుండా, అప్పటి దాకా అమాయకంగా నడిచిన భారత రాజకీయ చరిత్రని బట్టి చూస్తే ఏ భారత రాజకీయ నాయకుడైనా ఇలాంటి పని చేస్తాడా అని సందేహమొస్తే చేస్తాడని ఎవరూ వూహించని ఒక మహాసాహసోపేతమైన నిర్ణయం తీసుకుని, 1975లో భారతదేశపు రాజకీయ చరిత్రలో చీకటియుగం అని పిలవదగిన అత్యయిక పరిస్థితిని దేశం మొత్తం మీద రుద్దేసి, 21 నెలల పాటు జంకూ గొంకూ లేకుండా తను దొరికిపోతాననుకున్న చీకటి తప్పులకి సంబంధించిన సాక్ష్యాల్ని చెరిపేసి, తర్వాతి ఎన్నికల్లో జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో అప్పటి ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడి ఓడించి ఎమర్జన్సీ రోజుల్లో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్న కాలంలోనే - శత్రువర్గం చేసిన చిన్న పొరపాటును అమోఘమైన చాణక్యనీతి ప్రదర్శించి తన కనుకూలంగా మలుచుకుని జైలుపాలవ్వాల్సిన భవిష్యత్తుని లాఘవంగా వెనక్కి తిప్పి దెబ్బతిన్న ఆడపులిలా తిరగబడి ఇక ఎన్నటికీ రాదనుకున్న అధికార పీఠాన్ని తిరిగి అధిష్ఠించింది!
        ఈ రెండు సన్నివేశాల్లో ఉన్న మొదటి తేడా శ్రీమతి ఇందిరా గాంధీ కున్న రాజకీయ పరిణీతీ వ్యూహాత్మక చాతుర్యమూ ఈవిడకి లేకపోవటం!రెండవది ఆనాడు శ్రీమతి ఇందిరా గాంధీ కున్న ఎమర్జనీ నాటి తప్పిదాలకి తాను కారణం కాదని తప్పించుకోగలిగిన "బెనిఫిట్ ఆఫ్ డౌట్" ఈనాడు ఈవిడకి లేదు - విదేశీ హస్తం అన్నమాటతో అన్ని విమర్శల్నీ కొట్టిపారేస్తే జనం పిచ్చోళ్ళ మాదిరి నమ్మేశారు!ఇప్పటి కేసు స్వయంగా తనూ తన కొడుకూ ఒకటో నెంబరూ రెండో నంబరుగా ఉదహరించబడిన అవినీతి కేసు - గొడవ ఎక్కువ చేస్తే జనానికి కేసు బలంగా ఉందేమో రుజువైతే జైలుకెళ్ళాల్సి వస్తుందని గోల చేస్తున్నారేమో నని అనుమానం వచ్చే ప్రమాదం ఉంది!అప్పుడు కూడా అనుభవ రాహిత్యం వల్ల అధికారంలో ఉన్నవాళ్ళు వ్యక్తిగత ప్రతిష్ఠల కోసం ఒకరినొకరు విమర్శించుకుని అప్పటికే జనంలో పలచన అయ్యారు,చరణ్ సింగ్ ఏమో మురార్జీ కన్నా నేనే పుడింగిని అని అనుకుని అన్యాపదేశంగా చురకలు వేస్తూ ఉండేవాడు,మధు లిమాయే రాజ్ నారాయణ్ ద్వయం ఎప్పుదూ భారతీయ జన సంఘ్ నాయకులతో పోట్లాడుతూ ఉండేవాళ్ళు,ఈ గొదవల్లో ఒకానొక దురదృష్టకరమైన సమయంలో ఇంత జరుగుతుందని అనుకోకుండా చరణ్ సింగ్ ఇందిరాగాంధీ మీద కేసు వెయ్యటం అన్యాయం అని చిన్న ఫీలర్ వదిలాడు - ప్రతి రాజకీయ నాయకుడికీ ఉండే తను మిగిలిన వాళ్ళ కన్నా ప్రత్యేకం,నేనైతే అలా చేసేవాణ్ణి కాదు అని చాటుకోవాలనే దురద కొద్దీ!మామూలు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళకయితే దాన్ని అంత గొప్పగా ఉపయోగించుకోవటం అస్సలు సాధ్యపడి ఉండేది కాదు,కానీ అక్కడ ఉన్నదెవరు?పూర్వకాలం రాజులకి చిన్నప్పణ్ణించీ నువ్వు పెద్దయ్యాక రాజువి కావాలి,అందుకోసం ఇవన్నీ నేర్చుకోవాలి అని శిక్షణ ఇచ్చి తయారు చేసినట్టు పెరిగిన రాజవంశపు తయారీ!
        ఇందిరా గాంధీని దేశప్రజలందరూ నమ్మి ఓట్లేసి గెలిపించారు గాబట్టి ఎమర్జన్సీలో అసలేమీ జరగలేదని అనుకోగలమా?లేదు,జరిగినాయనడానికి గట్టి సాక్ష్యాలే ఉన్నాయి,ఆవిడ శత్రువులు బలహీనులై వాటి సాయంతో ఆమె ఆతని కట్టించలేకపోయారు, అంతే!కేవలం రెందేళ్లలో తన మీద ఎమర్జన్సీ నేరాలకి సంబంధించి నిజనిర్ధారణ కమిటీ విచారణ జరుపుతుండగానే,తనని వారం రోజులు జైలులో ఉంచినా, మరెన్నో విధాలుగా ఈమెని డ్యామేజి చెయ్యాలని వాళ్ళూ తమ శక్తి కొద్దీ ప్రయత్నించినా ఎన్నికల నాటి పరిస్థితి "ఒక సివంగికి ఎదురుగా కోతుల గుంపు" అనే విధమైన వాతావరణాన్ని సృష్టించుకోగలిగిన శ్రీమతి ఇందిరా గాంధీ ఆధునిక కాలపు నాగమాంబ - మాయురే
        ఎమర్జన్సీ విధించటానికి కారణమైన అలహాబాద్ హైకోర్టు తీర్పులో ప్రస్తావించబడిన 1971 నాటి ఎన్నికలలో ప్రతిస్పర్ధి రాజ్ నారాయణ్ కోర్టు తీర్పుతో అధ్భుతమైన విజయాన్ని సాధించినట్టు,సాంకేతికంగా చూస్తే ఇందిరాగాంధి రెండు సార్లు ఓడిపోయినట్టు!అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా "firing prime minister for traffic ticket" అని వర్ణించినంత దిక్కుమాలిన పరిస్థితి తనది,కానీ వెంటనే సుప్రీం కోర్టులో ఆ తీర్పుని చాలెంజ్ చేసింది.సుప్రీం కోర్తు కూడా పార్లమెంటు సభ్యురాలిగా తను పొందుతున్న సకల సౌకర్యాల్నీ రద్దు చెయ్యాలనీ,వోటింగులో పాల్గొనరాదనీ కఠినంగా తీర్మానించి ప్రధానమంత్రిగా కొనసాగడానికి మాత్రం ధారాళంగా అనుమతి ఇచ్చింది,యెందుకో మరి?హై కోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచే నిరసనలు జరుగుతూనే ఉన్నాయిగా, ఆ నిరసన కార్యక్రమలో ఈ తీర్పు వచ్చిన మరుసటి రోజు జయపకాశ్ నారాయణ్ ఏ ప్రభుత్వాధికారి యైనా పోలీసు అధికారి అయినా పరిపాలించడానికి అర్హత లేని ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్ని అమలుపరచాల్సిన అవసరం లేదనేశాడు,సరిగ్గా లాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న శ్రీమతి ఇందిరా గాంధీ కేవలం 24 గంటల్లో అప్పటికి ఆనవాళ్ళు కూడా లేని పాకిస్తానుతో యుధ్ధప్రమాదాన్నీ ఎప్పటి నుంచో ఉన్న ఏలిన్నాటి శనిలాంటి కరువు భెబత్సాన్నీ కారణాలుగా చూపించి రబ్బరు స్టాంపు కన్నా విధేయుడైన ఫక్రుద్దీన్ ఆలీ అహమద్ చేతుల మీదుగా అత్యయిక పరిస్థితిని ప్రకటించి ప్రతి ఆరునెల్లకూ ఒకసారి వుత్తుత్తినే పొడిగింపు తతంగం చేస్తూ తనకి బోరుకొట్టి 1977లో ఎన్నికలు ప్రకటించే వరకూ కొనసాగిన ఈ రాజ్యాంగ రమణీ మానహరణ దుశ్శాసన పర్వంలో జరిగిన దారుణాలు  సమాచార వ్యవష్తని కూడా నిర్వీర్యం చెయ్యటంతో ప్రజలు తెలుసుకోలేకపోయారు - అదె ఈ అనైతిక రమణికి వరమైంది!ఎమర్జన్సీలో జరిగినది కేవలం ప్రజాస్వామ్యానికి పాతర వెయ్యటం మాత్రమే కాదు,అదొక వల్లకాటి అధ్వాన్న శకం!తల్లి అధికారంలో ఉండడం వల్ల తాను అనుభవిస్తున్న వైభవాల కొవ్వు అంగుళం మందాన పేరుకుపోయి తల్లి తర్వాత ఈ దేశానికి తనే అధినేతనని అనుకుంటున్న ఈవిడ సుపుత్రుడు జనాభా పెరుగుదలని అరికట్టటానికి చేసిన వికృత ప్రయోగం ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యనిది - తప్పనిసరి వంధ్యత్వం?!
        ఒకసారి సంజయ్ గాంధీ హిందీ చిత్రసీమకి చెందిన ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ని కాంగెసు ప్రచార గీతాలు పాదమంటే అతను తిరస్కరించాడు.దాని ఫలితం 1974 మే 4 నుంచీ ఎమర్జన్సీ ఎత్తివేసేవరకు ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న ఆల్ ఇండియా రేడియో,దూర దర్శన్ కార్యక్రమాలలో కిషోర్ కుమార్ గొంతు వినిపించకుండా పోయింది అప్పటి  ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ శాఖకి మంత్రిత్వం వెలగబెడుతున్న విద్యా చరణ్ శుక్లా అనధికారిక నిషేధం విధించదంతో!చూస్తున్న వెర్రిజనాలకి ఇదేమీ తెలియదుగా,వెర్రిమొగమేసుకుని చూపించినది చూట్టం తప్ప:-)అసలీ తల్లీ కొడుకుల మధ్యన ఉన్న అనుబంధం చాలా చిత్రమైనది.మామూలుగా మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో చిన్నప్పటి నుంచీ తల్లిదండ్రుల్ని విధిగా గౌరవించమనే సంప్రదాయపు సూక్తుల్ని నూరిపోయ్యటం,తలిదండ్రుల పట్ల కొంచెం విసుగుతో మాట తూలితేనే మనల్ని పంచమహాపాతకాలు చేసిన వాళ్ళలాగ తూర్పారబట్టి రౌరవాది నరకాల గురించి భయపెట్టి హడావిడి చేసే వాతావరణంలో పెరిగిన వాళ్ళకి ప్రధానమంత్రి పదవిలో ఉన్న తల్లిని నిట్టాడిలా ఎదిగిన కొడుకు పదిమందీ చూస్తుండగా కొట్టాడని వింటే నమ్మలేం?!కానీ నమ్మి తీరాలి,ఎందుకంటే ఆ విషయం చెప్పినది పులిట్జర్ బహుమతి గ్రహీత Lewis M Simons.అతని కధనం ప్రకారం ఒకసారి పొరపాటున చెయ్యి విదిల్చినట్టు అనుకోకుండా జరిగినది కాదట, కావాలని పోట్లాడుతున్నట్టుగానే కొట్టాడట - ఆరు సార్లు!ఒక ప్రైవేటు పార్టీలో ఆ సంఘటన జరిగితే ఆ పార్టీకి అటెందయిన ఇద్ద్దరు నమ్మదగిన వ్యక్తుల నుంచి వచ్చిన వివరం అది.వాళ్ళిద్దరూ తను ప్లాంట్ చేసిన వాళ్ళు కాదని కూడా చెప్తున్నాడు.అదీ గాక ఒక వ్యక్తి తమ ఇంట్లో పిచ్చాపాటీ కబుర్ల మధ్యన ఆ తల్లీ-కొడుకుల ప్రస్తావన వచ్చినప్పుడు తను స్వయంగా చూసిన ఈ సంఘటన గురించి చెప్పాడనీ,రెండవ వ్యక్తి తను అడిగితే కన్ఫర్మ్ చేశాడనీ చెప్తున్నాడు, నమ్మాల్సిందే!
        ఈ తల్లీ కొడుకుల చిత్రమైన వ్యవహార శైలిని అర్ధం చేసుకోవటానికీ పుత్రరత్నం తల్లి మీద ఎందుకు పెత్తనం చేస్తూ ఉండేవాడో తెలుసుకోవటానికీ తక్కిన వాళ్ళందరి మీదా పెత్తనం చేసే మహారాణి అతని పెత్తనాన్ని ఎలా సహించిందనే ప్రశ్నకి జవాబు వెతుక్కోవటానికీ సంజయ్ గాంధీ దుర్మరణం తర్వాత జరిగిన కొన్ని యాదృచ్చికంగా కనిపించే ఒకదాని కొకటి సంబంధం లేని వింత విషయాలు ఉపయోగపడతాయి!ప్రమాద వార్త విన్న వెంఠనే శ్రీమతి ఇందిరా గాంధీ అతని చేతి కున్న వాచీని గురించి వాకబు చెయ్యటం ఇప్పటికీ మిస్టరీయే - దుఃఖంతో సంచలించి పోవాల్సిన తల్లి స్థానంలో ఉన్న స్త్రీ ముఖంలో దుఃఖానికి బదులు ఆరా!అదే సమయంలో వీరి కుటుంబానికి ఏ మాత్రమూ సంబంధం లేని ముహమ్మద్ యూనస్ రక్తసంబంధీకుడు చనిపోయినట్టు తట్టుకోలేని దుఃఖంతో విల విల లాడటం చూస్తే ఎవరికయినా ఏమనిపిస్తుంది?పైగా సంజయ్ గాంధీ పుట్టింది దంపతు లిద్దరూ ఒకరి నొకరు ద్వేషించుకుని విడాకులు తీసుకోవటం ఒకటే తక్కువగా వేరువేరు జీవితాలు గడుపుతున్న కాలంలో?!ఈ ముహమ్మద్ యూనస్ రాసిన పుస్తకం Persons, Passions & Politics చదివితే అతనికి సంజయ్ గాంధీ అంటే ఉన్న అపారమైన ఆత్మీయత వెనుక ఉన్న నిగూఢత అర్ధమవుతుంది!
        శ్రీమతి ఇందిరా గాంధీ ఒకానొక చోట విలేఖరులు అడిగిన ప్రశ్నలలో తండ్రినీ తననీ పోల్చుకుంటూ "I am not new kid to plitics,my father is my teacher - he is saint but not me" అన్నది,నాకు నిజంగా మొదట షాకూ పిదప స్మైలూ వచ్చాయి.ఎందుకంటే అంతటి స్వేచ్చావిహారి బైరాగిలా కనిపిస్తే ఈమె ఇంకెంత ఘనాపాటీ అయి ఉండాలి!అయితే, రాజకీయ రంగంలో మాత్రం,మరీ ముఖ్యంగా విదేశాంగ నీతి విషయంలో తండ్రి కన్నా భిన్నంగా ఉండటం నాకు నచ్చింది.చైనా విషయంలో తండ్రి తత్తరపాటునీ దాని ఫలితాన్నీ చాలా దగ్గిర నుంచి చూసి ఉండటం వల్ల గాబోలు దేశరక్షణకి సంబంధించిన విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవటంలోనూ, ప్రపంచ వేదికల మీద ప్రసంగించేటప్పుడు మన దేశపు గొంతును బలంగా వినిపించటంలోనూ అద్వితీయమైన ప్రతిభని చూపించింది!అటు ప్రపంచ దేశాల ముందు అమాయకంగా మాట్లాడుతూ ఇటు రహస్యంగా అణ్వస్త్ర సముపార్జనని జరిపించటమూ, యుధ్ధ సమయాల్లో ఆమె చూపించిన తెగువా నిజంగా కొనియాదదగ్గవే!తండ్రి పొరపాట్లని చూసి ఉండటం కాఠిన్యాన్ని పెంచిందనుకోవటానికి వీలు లేకుండా తన రాజకీయ జీవితపు లేత యవ్వనప్రాయం లోనే ఇప్పటికీ ఆ తండ్రీ కూతుళ్ళలో ఎవరిని విమర్శించినా కారల్ మార్క్సుని విమర్శించిన దానికన్నా లబలబ లాడిపోయి మీదబడి తంతారేమోననే స్థాయిలో రెచ్చిపోయి తిట్లకి లంకించుకునే కమ్యునిష్టుల యేలుబడి లోని కేరళ ప్రభుత్వాన్ని మహిషాసుర మర్దినిలా తొక్కేసిన సంఘటన సాక్ష్యంగా ఉంది కదా, తన సహజ స్వభావమే స్త్రీ రూపంలో ఉన్న పురుషత్వం కావచ్చు - ఆడ చాణక్యుడు?!కానీ తండ్రి సమయంలో భయపడుతూ భయపడుతూ చాటుగా మాటుగా జరిగిన అవినీతి తన హయాములో రెక్కలు విప్పుకుని ఎగురుతుంటే చూస్తూ వూరుకోవటం, అధికారాన్ని ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించటానికి కాకుండా తనకు అంగరంగ వైభవాల్ని సనకూర్చుకోవటానికి ఉపయోగించుకోవటం లాంటివాట్ని ఎలా క్షమించగలం?
        ఎప్పుడైతే ఒక కోర్టు తన ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చిందో స్వాభిమానం ఆభిజాత్యం అనే పెద్ద మాటలు వాడకుండా సిగ్గూశరం ఉన్నవాడు ఎవడయినా అక్కడ ఉండి ఉంటే కోర్టు తీర్పుకి కట్టుబడి పదవి నుంచి దిగిపోయి ఉండేవాడు,కనీసం తను అప్పీలు చేసుకున్న సుప్రీం కోర్తు కూడా దయదల్చి ప్రధానమంత్రిగా ఉండనిచ్చి పార్లమెంటు సభ్యత్వానికి సంబంధించిన సమస్త సౌకర్యాల్నీ వూడబెరికి, బిల్లుల మీద వోటు చెయ్యడానికి వీలు లేదని తీర్పు ఇచ్చినప్పుడయినా వెనక్కి తగ్గలేదు,ఎమర్జన్సీ కాలంలో పుత్రరత్నం అమాయక ప్రజల మీద చేసిన ఘాతుకాలు తెలిసినప్పుడు పశ్చాత్తాపం ప్రదర్శించ లేదు - ఇంత విపరీతమైన స్థాయిలో అధికారం పట్ల వ్యామోహం ధర్మాధర్మవిచక్షణజ్ఞానం గల సత్పురుషుడిలో ఉండటానికి ఆస్కారం ఉంటుందా?నీతి లేదు,రీతి లేదు,చట్టం లేదు,న్యాయం లేదు - తను అధికారంలో ఉండాలి, అంతే!

        అధికారం ఉన్నచోట బెల్లం చుట్టూ ఈగల్లాగ జనం గుమిగూడటం సహజమే గాదా,ఈ మాత్రం దానికే ఇదైపోవాలా,ఎమర్జన్సీ కాలంలో హరిత విప్లవమూ, 20 సూత్రాల కార్యక్రమమూ, ఇంకా కొన్ని మంచిపనులూ జరిగాయిగా, ఆమె పూనుకుని చేసిన మంచిపనులతో పోలిస్తే ఆవిడే సమర్ధించుకున్నట్టు అంతటా ఉన్న అవినీతిని పెద్దగా పట్టించుకోవటం అనవసరం పోనిద్దురూ అనుకుంటారు కొందరు!కానీ అట్లా ఆమె చుట్టూ చేరి ఆమెకి విధేయులుగా ఉంటూ "ఇందిరయే ఇండియా, ఇండియాయే ఇందిర" అని భజనలు చేసేవారు ఏ లాభమూ లేకుండా చేరుతారని అనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు.ఒకసారి ఆమె తను వెళ్తున్న విమానంలో వూరికే కలయదిరుగుతూ కార్గో విండో నుంచి లోపలికి చూస్తే రకరకాల సామాన్లతో మొత్తం నిండిపోయి ఉంది.అవి ఎవరివి అని ఆరా తీస్తే "మీ అంతరంగిక రక్షణ సిబ్బందివి!" అని జవాబు వచ్చింది.ప్రధానమంత్రి రక్షణ సిబ్బందిగా ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని ఆయా దేశాల్లో వారు చేసిన షాపింగు అది - అలా తక్కువ రేటుకి దక్కించుకున్న వాటిని అమ్మితే ఎంత తక్కువ లాభం కిట్టించుకున్నా లాభమేగా!ఒక దేశప్రధాని అంతరంగిక భద్రతా సిబ్బందిగా ఉన్న వాళ్ళకి పొరలుపొరలుగా ఉండే రాయితీల్ని లెక్కేస్తే వారిలో ఎవరూ తమ పర్సులో నుంచి ఒక్క రూపాయి కూడా బైటికి తీసి ఉండకపోవచ్చు, డౌటా?అసలు ఎమర్జెన్సీ అంత హఠాత్తుగా విధించినది తను చట్టానికి పట్టుబడకుండా ఉండటం కోసం ఆధారాల్ని చెరిపేసుకోవటానికే అయి ఉండవచ్చు!ఆవిడ హయాంలో మన దేశసంపద అంతకుముందు ఉన్న 70 రూపాయల కన్నా కొంచెం పెరిగి 100 రూపాయలు అయ్యిందనుకుంటే తనూ తన వందిమాగధులూ 40 రూపాయలు నొక్కేసి మిగతా దేశజనాభా కంతటికీ 60 రూపాయలు పంచితే దాన్ని యే రకంగా సమర్ధించాలి?!

        15 ఏళ్ళపాటు పాటు అధికారంలో ఉన్నా లేకపోయినా ఇతర్ల దృష్టిని తన మీద ఉండేలా చూసుకుని ఈ దేశపు రాజకీయ వ్యవస్థ నంతా తన గుప్పిట్లో పెట్టుకుని తను సాధించిన ఘనకార్యం ఏమిటి?బతికి ఉన్నంత కాలం తనవల్ల లాభం పొందిన వాళ్ళే చచ్చిన మరుక్షణం నుంచి అన్ని రాజకీయ నిర్ణయాలకీ తననే బలిచేసి, తమకు పేరు తెచ్చుకోవడం కోసం తన మీద బురద జల్లుతూ పుస్తకాలు రాయడం లాంటి సిగ్గులేని పనులు చేశారు!భారతదేశపు రాజకీయ చరిత్రలో దుర్మరణానికి గురయిన తొలి ప్రధానిగా వినుతి కెక్కడం వెనుక ఉన్నది ఆమెని చంపిన శత్రువుల దుర్మార్గమా తన స్వయంకృతాపరాధమా ఏది సరైన కారణం అని నిగ్గదీసి అడిగితే ఎంత గట్టి సమర్ధకుడైనా నీళ్ళు నమలాల్సిన పరిస్థితి - నిరంతర విజయాలని కోరుకుని ఎవరికీ సాధ్యం కాని అలాంటిదాని కోసంఎండమావుల వెంట పరిగెత్తి ఎప్పటికప్పుడు పాతనీతులన్నీ పరగడుపే నన్నట్టు నీతిగల వాడెవ్వడూ చెయ్యగూడని తప్పులు చేస్తూ ఒక తప్పు బయటపడుతుంటే ఆ తప్పుని కప్పి పుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తూ ఆత్మని సుఖాలకి బలిపెట్టి పగ వాడికి కూడా కోరుకోగూడని బతుకు బతికింది!దేహాన్ని ప్రేమించేవాళ్ళకి ఆమె అందం అచ్చెరువు గొలుపుతుంది,భోగాన్ని ప్రేమించేటట్లయితే ఆమె కట్టిన చీరలు ప్రతి ఆడదానికీ నచ్చుతాయి,విజయాన్ని ప్రేమించేవాళ్లకి ఆమె సాధించిన విజయాలు అధ్భుత మనిపిస్తాయి - కానీ ఆత్మని విలాసాలకి బానిసని చెయ్యకుండా నైతికతకి విలువ నిచ్చేవాళ్ళకి పంజాబీలు శ్రీమతి ఇందిరా గాంధీని ఎందుకు అసహ్యించుకుంటున్నారో తెలిస్తే ఆమె చరిత్ర వెగటు పుట్టిస్తుంది - మళ్ళీ ఇటువంటి రాజకీయ వేత్త ఈ భూమి మీద పుట్టకుండా ఉంటే బాగుండు ననిపిస్తుంది!

        సహజంగా సిక్కులు శాంతిప్రియులు,సాధుజీవనులు!ప్రతి జాతిలోనూ ఇవి మామూలుగా ఉండే మంచి లక్షణాలే,కానీ వారిలో ఇంకే జాతిలోనూ కనిపించని మరో రెండు విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి - హాస్యప్రియత్వం,పోరాటతత్వం!మీరూ నేనూ మరెవరయినా సరె మనల్ని ఎవరయినా అవహేళనగా ఒక చిన్న మాట అంటేనే రోషం పొడుచుకొస్తుంది, అక్కడికక్కడ అవతలి వాణ్ణి చంపెయ్యాలన్నంత పగతో రగిలిపోతాం.కానీ సర్దార్జీ జోకుల పేరుతో ఎన్ని వందల జోకులు వేసినా వారు కోపం తెచ్చుకోలేదు,పైగా ఎంతో స్పోర్టివ్ మెంటాలిటీని చూపించారు.ఒకాయన అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటున్న సందర్భంలో ఒక సర్దార్జీ జోకును వారిలో ఒక సర్దార్జీ కూడా ఉన్నందువల్ల మొహమాట పడి బీహారీ బాబుల పేరుతోనో మరో పేరుతోనో చెప్తుంటే ఆ సర్దార్జీ "ప్రపంచంలో ఉన్న సర్దార్జీలంతా చచ్చారనుకున్నావా ఏం?అది మా జోకు,మరొకళ్ళ కెట్లా కలుపుతావు!" అని గద్దించాడట.అంతటి హాస్యప్రియులు ఖలిస్థాన్ ఉద్యమ కాలంలో కనబడిన ప్రతి సిక్కునీ ఇతను కూడా ఖలిస్థాన్ ఉగ్రవాదియేమో అనే విధంగా చూస్తుంటే వారెంత క్షోభించి ఉంటారో!కాకతాళీయంగా జరిగిందో లేక సిక్కులు మనస్థాపానికి గురవడం వల్ల జరిగిందో తెలియదు గానీ అప్పటినుంచీ దేశంలో సిక్కులు కనబడటం అదివరకటికన్నా తగ్గిపోయిందనిపిస్తున్నది నాకు!ఖలిస్థాన్ ఉగ్రవాదం పూర్తిగా శ్రీమతి ఇందిరా గాంధీ బ్రెయిన్ చైల్డ్ అనటానికి ప్రముఖ పాత్రికేయుడు కుల్ దీప్ నయ్యర్ ప్రస్తావించిన ఒక సన్నివేశం తిరుగులేని సాక్ష్యం!తమ ఇద్దరి అంతర్గత సంభాషణలో తను అప్పుడే ఈ వ్యూహం మంచిది కాదు,ఫలితం వికటించి భవిష్యత్తు దారుణంగా ఉండవచ్చు,సిక్కులని ఇలా హింసపేటవద్దు అని తను చెప్పినట్టూ దానిని ఆమె బేఖాతరు చేసి తన వ్యూహానికే కట్టుబడినట్టూ తన వ్యాసాల్లో ఒక చోట ప్రస్తావించారు.భారతదేశం లోనేకాదు,ప్రపంచంలోని జర్నలిష్టు లందరిలోనూ ఎన్నదగిన వ్యక్తి అబధ్ధం చెప్పడు.కేవలం జల్లో ఉన్న అభిమానంతో అధికారం చేపట్టిన అకాలీదళ్ ప్రాప్యులారిటీని తగ్గించి తన పార్టీ మాత్రమే పంజాబును పరిపాలించగలదు అని ప్రకటించుకోవటనికి పంజాబీల్ని ప్రపంచం ముందు ఉగ్రవాదులుగా నిలబెట్టిన దుష్ట రాజకీయాన్ని ఒక వివేకం గల వ్యక్తి చెప్పినా వినకుండా ఏళ్ళ తరబడి సాగించిన వ్యక్తిని మహమ్మారి అని గాక ఇంకేమి అనగలం?!

       ఆఖరికి గత చరిత్రలోని అలాంటి వ్యూహాలన్నీ బెడిసికొట్టినట్టుగానే,కుల్ దీప్ నయ్యర్ గారు హెచ్చరించినట్ట్టుగానే ఏకు మేకయి తను సృష్టించిన భూతం తన పరిధిని దాటి పెరుగుతున్నప్పుడు కోర్టు తీర్పును గౌరవించటానికి బదులు ఎమర్జన్సీ పెట్టిన పధ్ధతిలోనే ఆ భూతాన్ని చంపటానికి సైన్యాన్ని పంపించింది - అదీ తిన్నగా సిక్కులు పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయం పైకి!ఏమి రాజకీయం అది?అడుసు తొక్కనేల, కాలు కడుగ నేల!ఒక వ్యక్తి తను చేసిన పాపం కట్టికుడిపి తన తప్పులకి పరిహారంగా ప్రాణం పోగొట్టుకుంటే కాంగ్రెసు పార్టీ వాళ్ళు దాన్ని కూడా ఒక త్యాగశీలిని హతమార్చిన సిక్కుల దుర్మార్గంగా పులిమేసి ఒక్క ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనే 2,000 మంది సిక్కుల్ని దిక్కులేని వాళ్ళుగా చేశారు!ప్రజలు వాళ్ళంతట వాళ్ళు ఈవిడ మీద అభిమానంతో చేసిన దారుణాలు కావవి, చోటా మోటా కాంగ్రెసు నాయకుల దగ్గిర్నుంచి మంత్రులు, పార్లమెంటేరియన్లు దగ్గరుండి పర్యవేక్షిస్తూ చేసిన దుర్మార్గాలు.తరవాతెప్పుడో పెదవి చివరి క్షమాప్నలు రెండు ముక్కలు గాల్లోకి వదిలారేమో గానీ ఏ మాత్రమూ సిగ్గు పడకుండా ఇప్పటికీ ఆ దారుణాలు చేసిన తమ పార్టీ వారిని ఈషణ్మాత్రపు మందలింపులు కూడా చెయ్యకుండా కోర్టు శిక్షల నుంచి తప్పించటానికి పదరాని పాట్లు పడుతున్నారు.అయినా ఈ దేశంలో కాంగ్రెసుకి జనం వోట్లు వేస్తున్నారు - ఆశ్చర్యం?!

        నాస్తికులూ కమ్యునిష్టులూ ఎప్పటికీ అర్ధం చేసుకోలేరు గానీ ఏ మతం వారైనా తాము ఇంట్లో పూజించే చిన్న ప్రతిమ లాంటిది పొరపాటున తమ చేతినుంచే జారి కిందపడితే ఆ రోజంతా ఎంత ఆందోళన పడతారు?తమ వల్ల జరగరాని అపరాధం ఏదో జరిగిపోయిందని కంగారు పదతారు గదా!అలాంటిది ప్రతి రోజూ స్వర్ణ దేవాలయ సందర్శన చేస్తున్నప్పుడు ఆ గోడల మీద తుపాకీ గుళ్ళకి పెచ్చులూడిన భాగాల్ని చూస్తుంటే మనసు దుఃఖంతోనూ కోపంతోనూ దహించుకుపోదా?తన తప్పుడు వ్యూహానికి మన జాతిని కించపరిచిందని తెలిసిన వాళ్ళెవరయినా ప్రతీకారం తీర్చుకోకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటారా - అందులోనూ సిక్కులు?!సిక్కులు ఎంతటి శాంతిప్రియులో అంతటి వీరయోధులు, వారి పోరాటతత్వం ఇతరు లెవరికీ సాధ్యం కానిది!ఒకసారి ఉద్దాం సింగ్ సాహసాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఈ పేరును తల్చుకుంటుండగానే నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి!డయ్యర్ నేరాల్ని విచారిస్తున్న కోర్టులో మొదటి నుంచీ చివరి వరకూ తను కూడా ఉన్నాడు.లాయరుగా ఆ కేసు పట్ల ఉన్న ఆసక్తిని చూపించి పిటిషను వేసి వెళ్ళీ కూర్చున్నాడు.తీర్పు ఎటూ డయ్యరుకి అనుకూలంగానే వస్తుందని తెలుసు.ఆఖరి నిముషంలో చేసిన పనినే అక్కడ ఏ క్షణంలోనైనా చెయ్యగలడు, కానీ చెయ్యలేదు!మనస్సులో జ్వాలలు రగుల్తున్నా మొహంలో భావాలు కనబడనివ్వకుండా ఉండటం మామూలువాడికి సాధ్యం కాదు.పక్కనున్న వాళ్లకి ఏ మాత్రం అనుమానం రాకుండా సొల్లు కబుర్లు చెప్తూ కూర్చోవటం కూడా అలాంటిలాంటివాళ్ళు చెయ్యలేరు.కానీ ఆ ఉద్దందపిండం మాత్రం తను కోరుకున్న క్షణం తన కళ్ళ ముందు నిలబడేవరకూ చాలా ప్రశాంతంగా ఉండి ఆఖరి క్షణంలోనే తను చెయ్యాలనుకున్నది చేశాడు - గెలిచానని విర్రవీగుతూ అట్టహాసంగా కోర్టుమెట్లు దిగుతున్నప్పుడే య్యర్ని  చంపాడు, సరిగ్గా బియాంత్ సింగ్ ద్వయం చేసింది కూడా అదే కదా!

        శ్రీమతి ఇందిరా గాందీ నివాసగృహాన్ని ఆమె చనిపోయిన చోటుతో సహా స్మారకస్థలంగా మార్చిన తర్వాత 2014లో రెందవసారి సందర్శిస్తున్న ఒక సందర్శకురాలికి చాలా చిత్రమైన అనుభవం కలిగింది.ఆమె పేరు దీప్తా రాయ్ చక్రవర్తి ప్రముఖ న్యాయవాది,గణితశాస్త్రజ్ఞురాలు,అతీంద్రియ అనుభవాల మీద పరిశోధనలు చేస్తున్న వ్యక్తి - రచయిత్రి కూడా!ఆమె అనుభవాన్ని ఆమె మాటల్లోనే వింటే ఏమి కనబడి అతీంద్రీయ శక్తులతోనూ అలాంటి అనుభవాలతోనూ పరిచయం ఉన్న అంతటి మనిషి కూడా భయపడిందో తెలిస్తే మనకీ ఒళ్ళు జలదరిస్తుంది:

        "నేను మొదటిసారి పన్నెండేళ్ళ వయసప్పుడు  వెళ్ళాను.బుల్లెట్లకి చిద్రమైన కాషాయ వర్ణపు చీరనీ అక్కడి గాలిలో ఉన్న దిగులునీ ఇప్పటికీ మర్చిపోలేను.ఇదే ఇల్లు ఇదే కుటుంబంలోని మరొక హత్యకు గురైన ప్రధానమంత్రికి కూడా స్మారకస్థలమే.శ్రీమతి ందిరా గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ 1991లో ఒక ఆత్మాహుతి దాడిలో తునాతునకలై పేలిపోయి గుర్తుపట్టటానికి వీల్లేనంత దయనీయమైన చావుకి గురయితే దొరికిన మట్టుకు శకలాల్ని ఏరి ఒక గాజు పెట్టెలో ఉంచారు.గాజుపెట్టె అడుగున పక్కపక్కన నిలబెట్టిన రెండు శిధిలమైన బూట్లు ఒక చచ్చిన సైనికుడు ఇంకా నడకలోనే ఉన్నట్టు కనబడుతున్నాయి..

        రెందవసారి నేను వెళ్ళీంది కొంచెం పెద్ద్దయ్యాక కాలేజి రోజుల్లో.ఢిల్లీలో ఉన్న జీసస్ అండ్ మేరీ కాలెజిలో మ్యాధమేటిక్స్ చదివేటప్పుడు వారాంతాల్ల్లో కొన్ని ముఖ్యమైన స్థలాల్లో తిరుగుతూ అలాంటి ప్రత్యేకమైన చోటుల్లో  ఉండే అతీంద్రీయ వాతావరణాన్ని పరిశీలిస్తూ ఉండేదాన్ని.అది నడివేసవి కావటంతో బైట ఉన్న 40 డిగ్రీల వేడితో పోలిస్తే చల్లగా అనిపించింది.గోడల నిండా పేపర్ క్లిప్పింగులు పరుచుకుని ఉన్నాయి.శ్రీమతి ఇందిరా గాంధీ ఆఖరి క్షణాల్లో ధరించిన ఆ పాత చీర  నాకు గుర్తున్నట్టే గాజు తెరల వెనక నుంచి కనబడుతూనే ఉంది.


   ఈసారి కొంచెం దగ్గిర కెళ్ళి చూశాను.ఆ వతావరణంలో నేను ఇదివరకు వచ్చినప్పుదు ఫీలైన అదో రకమైన దిగులు అలాగే ఉన్నా ఎందుకో ఇప్పుడా చోటులో కొత్తగా నూతనోత్సాహం కనబడుతుండటం నాకు కుతూహలాన్ని కలిగించింది.ఆ కాటన్ చీర మీద పరుచుకున్నబుల్లెట్ కన్నాలూ నెత్తుటి మరకలూ కాలం దాని ప్రభావం అది చూపించటం వల్ల ఒక శాశ్వతమైన ముద్రని వేసినా,ఇప్పుడా చీర కొత్త రకం శక్తి తరంగాల్ని సకారణంగానే వెదజల్లుతున్నట్టు కనిపిస్తున్నది.ఆ చీరను ఒకప్పుడు ధరించిన శ్రీమతి ఇందిరా గాంధీ ఇప్పుడు ఆ చీరలోకి ఆమెయొక్క ఆశయాలూ వ్యామోహాలతో అమాంతంగా వచ్చేసి నట్టుంది.ప్రస్తుతం తనున్న స్థితిలో తన ఆశలు నెరవేరే అవకాశం లేదని తెలిసిన నిరాశ కూడా ఉంది.అపరిమితమైన అధికారాన్ని కోరుకుని,దాన్ని కన్నబిడ్దల కన్నా ఎక్కువగా ప్రేమించి,దానిమీదనే బతికిన ఒక స్రీని హఠాత్తుగా దానినుంచి లాగేస్తే ఆ స్త్రీ ఎలా ఉంటుందో ఈ చీర కూడా అలాగే ఉంది.


        అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బియాంత్ సింగ్ ద్వయం తమ వ్యూహం అమలు చెయ్యటానికి సరిగ్గా ముందురోజున ,అంటే అక్టోబర్ 30,1984న ఒరిస్సా లోని భువనేశ్వర్ దగ్గిర ప్రసంగిస్తూ "నా తుది శ్వాస వరకూ ఈ దేశానికి సేవ చేస్తూనే ఉంటాను,ఒకవేళ నేను చనిపోతే నా ప్రతి రక్తపు బొట్టూ ఈ దేశాన్ని శక్తివంతం చేసి సమైక్యంగా నిలబెడుతుంది" అన్నది.

        అదే ఆమె ఆఖరి ప్రసంగం!శ్రీమతి ఇందిరా గాంధీ మనసులో కూడా తనకిక చావు తప్పదని తెలిసిన సంచలనం మొదలైందా!దుర్మార్గుల నోతినుంచి తన చావును తనతోనే చెప్పించే హరిమాయ లీలావినోదమా అది?ఇద్దరు రాజ వంశీయుల దేహాల నుంచి గగుర్పాటును కలిగించే విధంగా జారిన రక్తాన్ని ఇముడ్చుకున్న ఈ భవనం కనబడుతున్న వాటికన్నా నిగూఢమైన వాటిని వేటినో గొప్పగానే దాస్తున్నది.


        అక్కడికి కొన్ని మీటర్ల దూరంలోనే శ్రీమతి ఇందిరా గాంధీ చివరిసారి నడిచినంత మేర స్ఫటికంతో కప్పి ఉంచారు.ఒక నదీప్రవాహపు దిశని సూచిస్తున్నట్టు అక్కడొక సైన్ బోర్డ్ ఉంది.అలలు కదుల్తున్నట్టు కనబడే స్పెషల్ ఎఫెక్టు గూడా ఉంది.సరిగ్గా శ్రీమతి ఇందిరా గాంధీ కూలిన చోటుని మార్క చేశారు.చెట్ల మధ్యనుంచి ప్రతిఫలించే సూర్యకాంతిలో స్నానమాడుతూ ఆ ప్రదేశమంతా చాలా అందంగా ఉంది.ఇక్కడి వరకూ మనం నడిచి వచ్చిన స్థలాల వల్లా మనం చూసిన వస్తువుల వల్లా మనలో కలిగిన భావావేశాలన్నిటికీ ఇది పతాక సన్నివేశం!1854లో ప్రముఖ శాస్త్రవేత్తా వేదాంతీ అయిన Baron Von Reichenbach స్ఫటికంలో ఒక రకమైన జీవశక్తి ఉంటుందని చెప్పాడు.స్ఫటికానికి జ్ఞాపకాల్ని నిక్షిప్తం చేసుకునే శక్తి ఉందట.ఇక్కడి లౌడ్ స్పీకర్ల నుండి మళ్ళీ మళ్ళీ వినబడుతున్న శ్రీమతి ఇందిరా గాంధీ ఆఖరి ప్రసంగం ఆమె ప్రభని తిరిగి పైకెత్తటానికి జపిస్తున్న ఉచ్చాటన మంత్రం లాగుంది.


        ఇంటి లోపల ఉన్న చీకటికీ దిగులుకీ భిన్నంగా ఈ ఆరుబయట మెరుస్తున్న నీరెండ వింతగా ఉంది.ఈ కనిపిస్తున్న దృశ్యమంతా ఒక అధికార దాహంతో తపించిపోతున్న శక్తిలో ఉండే అసంతృప్తి చేత ఆవరించబడి ఉన్నట్టుంది.నేనంతా తన లోకి ప్రవేశించిన జీవించి ఉన్నవారి నుంచి  ఆశల్నీ వాంచల్నీ పీల్చుకుని బలపడే ఒక తిమింగలం కడుపులో ఉన్నట్టు ఇబ్బందిగా ఆనిపించి ఆ దారికి చివర్న కనపడుతున్న బైటికి వెళ్ళే గేటు వైపుకి గబగబా నదవటం మొదలుపెట్టాను.
బైట రోడ్డు మీద హారన్లు మోగించుకంటూ తిరుగుతున్న కార్ల చప్పుళ్ళు వినిపిస్తూ మళ్ళీ మానవప్రపంచంతో సంబంధం కలిగినట్టయి రిలీఫ్ అన్పించింది.ఇంతలో నా వెనక ఇంకో విజిటరు కాబోలు పరిగెత్తుకొస్తున్నట్టు అడుగుల చప్పుడు వినబడింది - వగరుస్తున్న చప్పుడు కూడా!నాకు ఆశ్చర్యమనిపించింది,ఈ పరిసరాల్లో ఎవరికైనా అంత వేగంగా పరిగెత్తాల్సిన అవసరం ఏముంది?అంతలోనే అంతా నిశ్శబ్దం, బహుశా ఆ మనిషి నా ఆలోచనల్ని చదివి ఆగి నిశ్చలంగా ఉండిపోయినట్టు, అపుడు, మళ్ళీ ఒక నిట్టూర్పు!కుతూహలం ఎక్కువై వెనక్కి తిరిగి చూశాను నేను అప్పుడే తిరిగి వచ్చిన మలుపు వైపుకి. యెన్ని నిమిషాలు గడిచినా ఎవరి అలికిడీ లేదు.మళ్ళీ స్ఫటిక శిలాప్రవాహం వరకూ వెళ్ళాను.ఇప్పుడు నేనున్న చోటు నుంచి చూస్తే ఎవరైనా రెండో వైపు ఉన్నవాట్ని కూడా స్పష్టంగా చూడొచ్చు.ఒక ఖాకీ డ్రస్సులో నిశ్చలంగా నిలబడ్డ గార్డు ఉన్నాడు,ఇద్దరు కాలేజి కుర్రాళ్ళు గాజు ప్లాక్ లొపలికి తొంగి చూస్తూ కనిపించారు.వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరు.

        సరిగ్గా అప్పుడే రెండు మానవాకారాలు యేదో మాట్లాడుకుంటూ ఆ ఇంటివైపుకి వెళ్తుండటం చూశాను.ఈ చెట్లూ చేమల మధ్యనుంచి హఠాత్తుగా నడకదారిలో ప్రత్యక్షమయ్యారు.వాళ్ళిద్దరూ ఇప్పుడు నేనున్న వైపుకి వస్తున్న కాలేజి కుర్రాళ్ళ జంటని దాటుకుని వెళ్లారు,కానీ ఒకరినొకరు పట్టించుకున్నట్టు కనిపించ లేదు.ఒకానొక క్షణంలో భుజాలూ భుజాలూ తగుల్తాయేమో అన్నంత దగ్గిరగా వెళ్ళినా ఏ జంటా రెండో జంట వైపు తల తిప్పలేదు,మర్యాదకయినా చూపులు కలపలేదు.ముఖాలు ఎటూ నాకు కనపదవు గనక వాళ్ళని వెనక నుంచే పరిశీలనగా చూశాను.తల్లి పొట్టి జుట్టుతో దృఢమైన ఆకృతితో ఉంది.కొడుకు కొంచెం భారీగానే కనబడుతూ ఉండి కుర్తా - పైజమాలో ఉన్నాడు.నిజంగా వీళ్ళు ఆ తల్లీ కొడుకు లేనా?ఇంకా అధికారం నిలబెట్టుకోవటం ఎట్లా అని వ్యూహాలు పన్నుతూనే ఉన్నారా?ఇప్పటికీ కోతరెలు ఏర్పాటు చహెసుకోవటం కోసం,సపోర్తర్లని పెంచుకోవటం కోసం లాబీయింగులు చేస్తూ రాజ్యాధిపత్యం తమ వంశం నుంచి జారిపోకుండా ఉండేటందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారా?మళ్ళీ తమ ప్రాభవం చిగురించ బోతున్నదని తెలిసి హదావిడిగా రహస్య సమావేశానికి వెళ్తున్నారేమో!
"

        పోనీ శ్రీమతి ఇందిరా గాంధీ అనే ఒక వ్యక్తి చేసిన దారుణాలకి మొత్తం పార్టీని నిదించడం దేనికి అనుకున్నా,పొనీ మిగిలిన వారు చెసిన దారుణాలకి శ్రీమతి ఇందిరా గాంధీ అనే ఒక్క వ్యక్తిని బాధ్యురాల్ని చెయ్యడం దేనికి అనుకున్నా ఆ రెంటికీ విడివిడి ఆస్తిత్వం లేదు గదా!ఒక రాజకీయ పార్టీలో గానీ ఒక సమాజంలో గానీ అగ్రభాగాన కనబడే ఆ ఒక్క వ్యక్తీ కింది నుంచి పైకి విస్తరించుకుని ఉన్న ఒక సంస్కృతికి దర్పణం అయినప్పుడు దశాబ్దాల తరబడి జరిగిన తప్పులకి ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ఉంటుంది.ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల సమయానికే కాంగ్రెసు ప్రజాభిమానాన్ని పూర్తిగా కోల్పోయింది.అప్పుడు అంతులేని ప్రజాభిమానాన్ని పెంపొందించుకుని ప్రచండశక్తిలా కాంగ్రెసుని ఢీకొన్నది ఎవరో తెలుసా!ఇపుడు కాంగ్రెసుకి ఎడమభుజాల్లా మారిన వామపక్షాలు అని పిలువబడే రెండు రాజకీయ పక్షాలూ కలిసి ఉన్న భారత కమ్యునిష్టు పార్టీ!అప్పటి వాతావరణాన్ని గురించి పెద్దలు చెప్పినదాని ప్రకారం కమ్యునిష్టులు వస్తున్నారని తెలిస్తే పల్లెటూళ్ళల్లో వారిని పోలేరమ్మ గంగానమ్మ లాంటి గ్రామదేవతలకి కట్టినట్టు ప్రభలు కట్టి వూరేగిస్తూ తోడ్కొని వెళ్ళేవాళ్ళు సామాన్య ప్రజలు!అయినా కమ్యునిష్టులు ఎందుకు వోడిపోయారు?ఆనాటి చరిత్ర తెలియని కుర్రాళ్ళు ఇవ్వాళ ఎన్నికల్లో కులప్రసక్తి,ధనబలం,వ్యసన ప్రేరేపణం లాంటివాటి గురించి విసుక్కుంటూన్నారు గానీ ఆనాటి తొలి ఎన్నికల నుంచే కాంగ్రెసు వాటిని తారాస్థాయిలో ప్రయోగించింది - ప్రజాభిమానం లేకపోయినా అధికారం మనకే కావాలి అనే పట్టుదలతో!వింతేమొటంటే ఎన్నికలు సజావుగా జరిగితే ప్రపంచంలోనే మూడో కమ్యునిష్టు దేశంగా భరతదేశాన్ని నిలబెట్టేటందుకు తమకు దక్కాల్సిన పూర్తి అర్హత ఉన్న స్థానం నుంచి అంత కిరాతకమగా నెట్టివేసిన కాంగ్రెసు పట్ల కమ్యునిష్టు పార్టీ ఏ మాత్రమూ కోపాన్ని చూపించకపోవటం!కామన్ సెన్సుతో కూడిన మామూలు పొలిటికల్ స్ట్రాటజీ పరంగా చూసినా కాంగ్రెసు యొక్క దుర్నీతిని ప్రజల ముందు ఎండగట్టి ఉండాల్సింది పోయి న్యాయంగా తనకి దక్కాల్సిన అధికారాన్ని తమనుంచి గుంజుకున్నవారిని అపరిమితమైన పొగడ్తలతో ముంచెత్తడం బుర్రలో గుజ్జు ఉన్నవాడెవడయినా చేస్తాడా:-)

        ఏ ఒక్క చారిత్రక తప్పిదం నుంచీ ఏ ఒక్క గుణపాఠమూ నేర్చుకోకుండా మళ్ళీ మళ్ళీ చారిత్రక తప్పిదాలు చేస్తూ అనంతకాలం వరకూ వర్గరహితసమాజం కోసం పోరాడుతూనే ఉండగలిగిన గతితార్కిక చారిత్రక భౌతికవాదపు సిధ్ధాంతుల గురించి మనకెందుకు గానీ అసలు కాంగ్రెసు పార్టీ వాళ్ళు తమ పార్టీకి నేతృత్వం వహించడానికీ వారిని అగ్రభాగంలో ఉంచుకుని వారి ప్రభావక శక్తిని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చి భారతదేశాన్ని పరిపాలించడానికీ ఆ ఒక్క కుటుంబాన్నే ఎందుకు అప్రకటిత వంశపారంపర్య సంప్రదాయంతో ముందుకు తీసుకొస్తున్నారు?ఈ దేశాన్ని పరిపాలించడానికి ఇంకెవ్వరికీ లేని శక్తియుక్తులు కేవలం ఆ కుటుంబానికే ఉన్నట్టు ఆ కుటుంబంలోని వారు కాకుండా ఇంకెవ్వరు పరిపాలించినా ఈ దేశానికి ప్రమాదం అనే భావనని ప్రజల్లో ఎందుకు పెంచి పోషిస్తున్నారు?వేరే పార్టీ ప్రభుత్వంలో ఉన్నంత కాలం భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి నేలకొనదనే మూఢనమ్మకాల్ని గూడా ప్రచారం చెయ్యడం అటుంచి తమ పార్టీలోనే ఇంకెవ్వరూ సమర్ధులు లేనట్టు మాటిమాటికీ ఆ కుటుంబం నుంచి వస్తే చాలు ఎంతటి దేభ్యమ్మొహాన్నైనా సరే మోసి తరిస్తూ అన్ని ప్రజాస్వామ్య సంప్రదాయాల్నీ గాలికొదిలేసి రాజభక్తి లాంటి విధేయతని ప్రదర్శించడానికి కారణం ఏమిటి?శ్రీమతి ఇందిరా గాంధీ అంటే తొలి యవ్వన కాలం నుంచీ రాజకీయ నాయకులతో అతి దగ్గిరగా తిరిగింది గాబట్టి ఇంకా తన తండ్రికి సహాయకూరాలిగా కూడా పని చేసింది కాబట్టి అప్పటికి రాజకీయ రంగంలో చాలాకాలం ఉంచి ఉన్నదని సరిపెట్టుకోవచ్చు,కానీ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే సమయానికి కనీసం కాంగ్రెసు పార్టీ కార్యకర్తగానే లేడు - రాజకీయాలకి దూరంగా విదేశాల్లో తన బతుకు తను బతుకుతున్నవాణ్ణి తీసుకొచ్చ్జి ప్రధానమంత్రిని చేశారు.అంత హడావిడి చేసి తీసుకొచ్చినందుకు దక్కిన ఫలితం ఏమిటి?షాబానో కేసులో ముస్లిముల మనోభావాలకి వ్యతిరేకంగా మాట్లాడి కాంగ్రెసుకి అప్పటివరకూ ఉన్న బలమైన వోటుబ్యాంకుని దూరం చేసేశాడు.అంతగా కాంగ్రెసు పార్టీ ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకు వస్తున్నప్పుడు ఆ కుటుంబం యొక్క చరిత్రని గురించి కూడా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఇంతవరకూ మేధావులమనుకునేవారికి ఎందుకు కలగలేదు?
        ఈ వంశవృక్షంలో రెండు అతి ముఖ్యమైన వైరుధ్యాలు ఉన్నాయి.ఒక రకంగా చెప్పాలంటే వాస్తవం ఏమిటనేది ఎప్పటికీ తెలియని మిస్టరీలు.సాధారణంగా హిందువులలో అందులోనూ వీరు కాశ్మీరీ బ్రాహ్మణులు అని చెప్తున్నారు గాబట్టి బ్రాహ్మణులలో ఇంటిపేర్లు హఠాత్తుగా పుట్టుకు రావు.ప్రతి  బ్రాహ్మణుడికీ గోత్రం అనేది ఖచ్చితంగా ఉంటుంది అది భరద్వాజ,కశ్యప,కౌండిన్య లాంటి ఒక వైదిక ఋషికి సంబంధించిన ధార!ఇంటిపేర్లు వారికి అంత ముఖ్యం కాదు గాబట్టి అవసరార్ధం కొత్త ఇంటిపేర్లుగా చీలితే చీలవచ్చు - కానీ దానికి అవకాశాలు చాలా చాలా తక్కువ?!ప్రాచీన కాలం నుంచీ ఉన్న ఇంటిపేరు అయితే ప్రతి ఇంటిపేరుతోనూ ఒకటి కన్నా ఎక్కువ కుటుంబాలు కనబడతాయి.కానీ కాశ్మీరు భూఖండం మొత్తాన్ని కంచుకాగడా వేసి వెతికి అయినా సరే ఈ ఇంటిపేరుతో మరో కుటుంబం ఎక్కడయినా ఉందేమో ఎవరయినా కనిపేట్టి చూపించగలరా?శ్రీమతి ఇందిరా గాంధీ ఆడపిల్ల గాబట్టి వేరేవాళ్ళని పెళ్ళి చేసుకోవడం  వల్ల ఇంటిపేరు మారింది గానీ ఆమె తండ్రి శ్రీమాన్ జవహర్ లాల్ నెహ్రూకి తాతగారైన శ్రీమాన్ గంగాధర నెహ్రూ నుంచి కిందకి దిగుతూ వస్తున్న ఈ కొద్దిమందే తప్ప ఇంకెవరూ ఈ ఇంటిపేరుకి సంబంధించిన వారు కనబడటం లేదు,ఎందుకని?గంగాధర నెహ్రూ తలిదండ్రుల గురించి గానీ అన్నలూ తమ్ముళ్ళూ అక్కలూ చెల్లెళ్ల గురించిన వివరాలు ఏమీ తెలియడం లేదు, ఎందుకని?కరువు లొచ్చినా వరద లొచ్చినా ఇంకేమి జరిగినా ఆ ఇంటిపెరుతో ఉన్న మిగతా అందరూ నశించిపోయి ఈ ఒక్క కుటుబమే బతికి బట్టకట్టడం అయితే మిస్టరీ అయినా కావాలి లేకుంటే ఫాంటసీ అయినా కావాలి గానీ హిస్టరీ మాత్రం ఇలాంటి కట్టుకధల్ని ఒప్పుకోదు కదా!
        భారతదేశంలోని వంశచరిత్రలకి సంబంధించి అసలు పరిశోధనలు జరగడం లేదని కాదు,కానీ ఈ కుటుంబ చరిత్రని గురించి మాత్రం అధికారికంగా ఎటువంటి పరిశోధనలూ జరగవు.స్వతంత్రించి కొందరు ఔత్సాహికులు తమంత తాము పరిశోధనలు చేసి తేల్చిన విషయాలు మాత్రం నమ్మలేనివి గా ఉన్నాయి.1857 తిరుగుబాటుకి ముందు ఢిల్లీలో ఘియాసుద్దీన్ ఘాజి అనే ఒక కొత్వాలు ఉండేవాడు.అయితే తిరుగుబాటును అణిచివేసే సమయంలో శత్రుశేషం మిగలకూడదని ఇంగ్లీషువాళ్ళు సిటీలో ఉన్న మొఘల్ ప్రభుత్వంతో సంబంధం ఉన్న వాళ్ళందర్నీ వెతికి పట్టుకుని మరీ చంపుతూ ఉండటంతో చాలామంది మొఘల్ సర్దారులు ప్రాణాలరచేత బట్టుకుని పారిపోయారు.అయితే మొఘలులకి అనుకూలంగా ఉన్నారని నిర్ధారణగా తెలిసిన వాళ్ళు తప్ప మిగిలిన హిందువులు ఇంగ్లీషువాళ్ళ దృష్టిలో లేరు గనక ఫ్రెంచ్ విప్లవం నాడు ఆడవేషాలేసుకుని సరిహద్దులు దాటి లండను కొచ్చి పడిన ఫ్రెంచ్ జమీందారుల మాదిరి హిందువులుగా పేర్లు మార్చుకుని ప్రాణాలు కాపాడుకున్న బతకనేర్చిన వాళ్లలో ఈ ఘియాసుద్దీన్ ఘాజి ఒకడు, అప్పటికి బుర్రకి తగిలిన గంగాధర్ అనేదాన్ని ఒంటిపెరుగానూ ఎర్రకోట పక్కన ఉన్న ఒక కాలవని ఇంటిపెరుగానూ మార్చుకుని బతికిపోయాడు!Through out the world, we do not find any descendant other than that of Gangadhar, having the surname Nehru. The 13th volume of the “Encyclopedia of Indian War of Independence” (ISBN:81-261-3745-9) by M.K. Singh states it elaborately.

        ఇవన్నీ చాలాకాలం నుంచీ చాలామంది కాంగ్రెసువాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ అడుగుతూనే ఉన్నారు.కానీ ఇదంతా కాంగ్రెసు మూలస్తంభాలని అవమానించటానికి హిందూ మతతత్వవాదులు చేస్తున్న విషప్రచారం అని కొట్టిపారేసి మేము జవాబు చెప్పం పొండి అని భీష్మించుకోవటమే తప్ప వీటిని ధైర్యంగా అబధ్ధాలని ఖండించనూ ఖండించడం లేదు,కనీసం అసలు నిజమేమిటో సాక్ష్యాధారాలతో నిరూపించి వీళ్ళ నోళ్ళు మూయించనూ మూయించడం లేదు.ఎన్నిసార్లు తప్పించుకోవాలని చూసినా ఈ ప్రశ్నలు కాంగ్రెసువాళ్ళని మళ్ళీ మళ్ళీ వెంటాడుతూనే ఉంటాయి.ఒకనాటికి జవాబు చెప్పక తప్పనిసరి అయినప్పుడు అప్పటికి ఉన్న కొన్ని ఆధారాలు కూడా గాలిలో కలిసిపోయి బిక్కమొగం వెయ్యాల్సిన దిక్కుమాలిన పరిస్థితి రావచ్చు.ఎప్పటికైనా జవాబులు చెప్పాల్సిన అవసరాన్ని గుర్తించి ఇప్పటికయినా కాంగ్రెసువాళ్ళు జవాబుల కోసం పరిశోధన మొదలుపెడితే బాగుంటుంది.పోయిన అధికారం తిరిగి దక్కించుకోవడానికి ఆమె పధ్ధతుల్ని వాడితే అధికారం దకించుకున్నాక మళ్ళీ ఎన్నిక చెల్లదని కోర్టులు తీర్పులిస్తే ఎమర్జన్సీ పెట్టటం, తనకి నచ్చని అకాలీదళ్ ప్రభుత్వాన్ని బలవంతంగా లాగిపారేసి ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టటం లాంటివి చెయ్యదని గ్యారెంటీ ఉందా?అదీగాక తల్లీ కొడుకు లిద్దరూ మ్మెమ్మెమ్మే బెబ్బెబ్బేలని తెలిసి కూడా ఆ కుటుంబం నుంచే నాయకత్వాన్ని మన మీద రుద్దాలనుకుంటున్న ఇప్పుడు అసలు కుటుంబం యొక్క మూలాల్ని గురించి మనం కూడా నిగ్గదీస్తే తప్పేమిటి?

        రాచపీనుగ తోడు లేకుండా వెళ్ళదన్నట్టు తన పాపాలకి తను ఆహుతై చస్తూ చావులో కూడా కొన్ని వేల మంది అమాయకుల్ని బలి తీసుకున్న మనిషిని పొగుడుతున్న వాళ్ళు, ఆ మనిషి వల్ల సిక్కు జాతికి జరిగిన అన్యాయం పట్ల మనస్పూర్తిగా సానుభూతిని కూడా ప్రకటించలేని వాళ్ళు, మళ్ళీ మళ్ళీ అవే పధ్ధతుల్లో అవే నికృష్టమైన పనులు పునరావృతమయినా పరవాలేదనుకుంటున్నవాళ్ళు దేశంలో ఎంతమంది వున్నారు అని లెక్క తెలియాలంటే ఇప్పటికీ కాంగ్రెసుకి పడుతున్న వోట్లని లెక్కిస్తే చాలు!


అబధ్ధాలతో చరిత్రని నిర్మించాలనుకునేవాళ్ళు అధికారంలో ఉండకూడదు - ప్రమాదం!
________________________________________________________

1    2    3    4    5    6                                     (తేదీల వివరాలు:వికీ పీడియా,చిత్రాలపీటిక:గూగుల్)

15 comments:

  1. నమస్కారం హరిబాబు గారు,
    అయిదేళ్ళ క్రితం ఒక శిక్కు నాతో కలిసి పని చేసాడు. అతని తండ్రి, ఇండియన్ కాన్సులేట్, న్యూయార్క్ లో పనిచేసే టైం లో, అంటే, 1970 ప్రాంతాల్లో ఇతను తండ్రితో పాటుగా అమెరికా కి వచ్చాడు. 1973-74 సమయంలో, అతని తండ్రి డెప్యుటేషన్ అయిపోయి, మళ్ళీ ఇండియాకి బయలుదేరే టైములో, ఇతన్ని ఇండియన్ కాన్సులేట్, న్యూయార్క్ లో ఏదో చిన్న ఉద్యోగంలో తన పలుకుబడితో వేయించాడు. అతని తండ్రి, ఫారిన్ సర్వీసెస్ లో ఎంత పెద్ద స్థాయి అధికారి అంటే, ఏదైనా రహస్య సమాచారం వస్తే, అతనే స్వయంగా ప్రధానిని ఏకాంతంలో కలిసి ఆ సమాచారం అందించేవాడట. ఇతను కూడా, ఇండియన్ కాన్సులేట్, న్యూయార్క్ లో పనిచేసే టైం లో, ఇందిరను వ్యక్తిగత స్థాయిలో కలిసాడట. ఇందిరను ఔటింగ్ కు తీసుకెళ్ళటం, కావలసిన అవసరాలు చూడటం, ఇలా. ఇందిరతో కలిసి పని చేయదం తన అద్రుష్టంగా చెప్పేవాడు తప్ప ఎప్పుడూ ఇందిరపై ద్వేషంతో మాట్లాడలేదు.
    మీరు ప్రస్తావించిన సంజయ్ గాంధీ - ఇందిరల మధ్య రహస్యం (ఇందిరను సంజయ కొట్టడం, సంజయ్ జన్మ వ్రుత్తాంతం) అతనూ నాకు మాటల మధ్యలో చెప్పేవాడు. అతను చెప్పిన మరొక రహస్యం ఎమిటంటే, ఇందిర హత్యలో ఆంటోనియా ఆల్బినా మైనో కి సంబంధం ఉందట. అతని కధనం ప్రకారం, సంజయ్ మరణం తరవాత ఇందిర ఎలా రియాక్ట్ అయిందో, ఇందిర హత్య తరువాత రాజీవ్ (అప్పుడు కలకత్తా లో ఉన్నాడని ఇతను అంటాడు, కాదు బొంబై అని కొన్ని చోట్ల చదివాను) కూడా అంతే రియాక్ట్ అయ్యాడట. హత్యా వార్త తెలిసిన మరుక్షణంలో రాజీవ్ నోటి వెంట వచ్చిన ప్రశ్న, "ఆర్ ద శిక్క్స్ స్టిల్ అలైవ్?" "Are the Sicks still alive".

    ఆంటోనియా ఆల్బినా మైనో (సోనియా) ని చూసి, ఆమె వేష భాషలు చూసి, రాజీవ్/ఇందిరా కుటుంబ మిత్రులు చాటుమాటుగా నవ్వుకునేవారట. ఆ కారణంతోనే సోనియా ఇందిర కుటుంబ సభ్యులతో ఎక్కువగా కలవడానికి ఇష్టపడేదికాదట. ఇందిరా సోనియాకి ఇంగ్లీష్ నేర్పడానికి ఒక ట్యూటర్ ని, సోషల్ పార్టీలల్లో ఎలా మెలగాలో నేర్పడానికి, ఒక ప్రధాన మంత్రి కోడలు ఎలా ఉండాలో నేర్పడానికి ఇంకో ట్యూటర్ ని ఏర్పాటు చేసింది. ప్రధానిగా ఇందిర వైభవం, లభించే గౌరవం, అధికారం చూసి సోనియా బెదిరి పోయేది. తనకూ అలాంటి వైభోగం పట్టాలని లోలోపలే కోరుకునేది, దానికి ఉన్న ఒకేఒక మార్గం రాజకీయాల్లో రాజీవ్. కానీ, సంజయ్ మరణం, రాజకీయాలపై రాజీవ్ నిరాసక్తత సోనియాని మరో ఆలొచన వైపుకి పురిగొల్పాయి. ఇందిర ఉన్నన్నాళ్ళు రాజీవ్ కి అధికారం దక్కదు, ఒకవేళ, ఇందిర సహజ మరణం పొందితే, ఆనాడు పదవి చుట్టూ గుంటకాడి నక్కల్లా పొంచి కూచున్న సిండికేటులో ఎవరో ఒకళ్ళు అది అందుకుపోతారు, వాల్లని ఎదిరించే శక్తి రాజీవ్/సోనియల దగ్గర లేదు. కానీ, ఇందిర అర్దాంతరంగా పోతే, సెంటిమెంటల్ గా అయిన వారసత్వంగా రాజీవ్ కి పదవి దక్కొచ్చేమోనన్న అలోచన ఇందిరకి ప్రాణగండం తెచ్చిపెట్టింది. అయితే, ఇదంతా సోనియా సొంత తెలివి కాదని నా మిత్రుడి వాదన. బలమైన ఇటాలియన్ మాఫియా సోనియ వెనకుండి, ఇందిరా హత్యకి కుట్ర పన్నిందని అతని లాజిక్. ఇందిరా హత్య కేసు నివేదిక 100 యేళ్ళ దాకా అధికార రహస్యాల చట్టం కింద భద్రపరచాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట.

    ReplyDelete
    Replies
    1. స్పందనకి కృతజ్ఞతలు!
      వ్యక్తిగత వివరాలను తరచకుండా వాళ్ళ మూలంగా దేశానికి జరిగిన నష్టం మీదనే దృష్తి పెట్టాబ్ను.పూర్తిగా తాపించుకోవదమ సలు కుదర లేదు.అందుకే ఈ భాగం పూర్ర్తి చేయటానికి ఇంత కాలం పట్టింది.

      "అయితే, ఇదంతా సోనియా సొంత తెలివి కాదని నా మిత్రుడి వాదన. బలమైన ఇటాలియన్ మాఫియా సోనియ వెనకుండి, ఇందిరా హత్యకి కుట్ర పన్నిందని అతని లాజిక్." - ఈ మాఫియా కూడా ప్రయత్నించి ఉందవచ్చు.ఇంతెలిగెన్స్ విభాగంలో పనిచేసిన మనిషి మాటలు కొట్టెయ్యలేం.కానీ జరిగిన్ అసన్నీవేశంలో మాత్రం సిక్కుల ద్వేషం,ప్రతీకార వాంచనే చూస్తున్నాం.గట్టి ఆధారాలు లేనివన్నీ వూహాగానాల కింద కొట్టిపారేసే ప్రమాదం ఉంది కదా.అందుకే నేను ఇలాంటి కుట్ర కధనాల్ని ప్రస్తావించ లేదు.

      Delete
  2. హరిబాబూ! ఇంత ఓపిక ఎలా వొస్తుంది నీకు? అస్సలు నువ్వు మనిషివేనా అని చాలాసార్లు డౌట్ వొస్తుంది నాకు

    ReplyDelete
    Replies
    1. పొగిడారా,తిట్టారా? :)

      Delete
    2. ఆయన పొగిడినా తిట్టినట్టే అనిపిస్తుంది నాకు:-)

      Delete
    3. నీకు ముందే చెప్పా హరిబాబూ.. నీకున్న పెద్ద ఫానుల్లో నేనుకూడా ఒకడిని అని. నిన్ను తిట్టడానికినేనెప్పుడూ మొహమాటపడలేదు. కాబట్టి మెచ్చుకున్నాననే తీసుకో.

      ఆవు మాంసం గురించిన నీ ముందు పోష్టులో నావుద్దేశం ఎంటో అన్వేశు కర్రెక్టుగానే చెప్పాడు. అది నువ్వు అర్ధం చేసుకున్నావులే అనుకున్నా. ఇప్పుడూ చూస్తే బూతులు మాట్లాడాడు అన్న కారణం చూపి డిలీట్ చేసానన్నావ్. అంతాచేసి తనన్నది "నీ బొంద" అని. నువ్వు మాట్లాడే దాంట్లో తప్పో, పొరపాటో ఐతే నువ్వు వాడే టెక్నిక్కు ఇదే. దిద్దుకుంటాను అంటే సరే. లేకపొతే నీ ఇష్టం.

      Delete
    4. విషయం సూటిగా చెప్పకుండా "నేనెందుకు అంటున్నానో అర్ధం చేసుకోకుండా" అనే సుత్తెందుకు వేశావో ముందది చెప్పు.

      ఏమాత్రం క్లూ ఇవ్వకుండా "సెల్ఫ్ గోలు చహెసుకున్నావు" అనేస్తే ఎదటివాడికి నీ బ్రెయిన్ వేవ్ ఎలా తెలుసుతుందనుకున్నావు?

      ప్రతి బ్లూకేక్కూ ప్రతి ఎర్రదుంపా ఏ విధంగా అలోచంచి ఏ కామెంటు వేస్తున్నారో తెలుసుకోవడానికి నాకు మైండ్ రీడింగ్ లేదు కదా!

      అక్కడ చేసిన తప్పే మళ్ళీ ఇక్కడా చేస్తున్నావు -మళ్ళీ "దిద్దుకుంటాను..." అంటూన్నావు.ఆ అన్వేషు బూతుమాట వాడితే గానీ చెప్పలేని పాయింటు నువ్వు ముందే చెప్పొచ్చు గదా - మెంటల్ మంద:-)

      నువు నా పోష్టులో నచ్చినిదేఅదన్నా ఉంటే చాలా తిన్నాగనే చెప్ప్పొచ్చు.ఈ డొంక తిరూగుఎందుకు?మళ్ళీ నీకొకడు వెనకాల తోకలా వచ్చి నువ్వు ఏ అర్ధం ప్రకారమ న్నావో ఎక్స్ప్లెయిను చెయ్యటానికి - ఎందుకీ టైం వేస్ట్!

      శ్రీకాంత్ చారి నన్ను "వూకదంపుడు,పొడుగాటి సుత్త్తి కామెంట్లు" అంటున్నాడు,నేనేఅమైనా అబ్జెక్ట్ చేశానా?

      నువ్వు న అ సహనం/ఓపిక గురించి కామెంటు వేశావు గాబట్టి పాజిటివ్ టోను లోనే వాదవని అర్ధమయింది,అతనికి జవాబు చెప్తూ వేసిన స్మైలీ చూశావుగా.

      నేను నా పోష్టుల్లో ఎక్కడా అసభ్యమైన పదాలు వాడటం లేదు.ప్రతి పోష్టునీ కనీసం నాలుగైదు సార్లయినా ప్రత్యేఅకంగా ఆవేశంలో గానీ ఆలోచించేటప్పటి ఫ్లో ప్రకారం గానీ అనకూదని మాటలు పడినాయేమోనని చూస్తాను.


      నువ్వు సెల్ఫ్ గోలు గురించి కామెంటు వేసిన పోష్టుకి సంబంధించిన మెయిన్ పాయింటులో తప్పు పాట్టడానికి ఏమైనా ఉందా?నువ్వు నాకు అంటగ్డుతున్న సెల్ఫ్ గోలుకి పనికొస్తున్న స్టేట్మెంటు ఆవుమాంసం పనిగట్టుకుని పండగలా చేసుకుని తినడానికి సంబంధించిన పార్టులో వస్తుంది.

      "అతి సర్వత్ర వర్జయేత్" అని పెద్దవాళ్ళు ఎందుకన్నారో నీకు తెలిస్తే అన్వేషు ఏదో క్లూ ఇచ్చాడు అని నువ్వంటున్న "శాఖాహారం కూడా మొక్కల్ని చంపాకే పళ్ళెం లోకి వస్తుంది కదా" అనేది తెలివితక్కువ వాదన అని నీకే అర్ధం అవుతుంది.వాస్తవానికి ఈ పాయింటుని కూడా నేనే టచ్ చేసి దాన్ని పోష్టులో పూర్వపక్షం చేద్దామనుకుని కూడా కొందరు పోష్టులు పెద్దవైపోతున్న్నాయంటున్నారు,ఎందుకొచ్చిన గోల అనిపించి "మరీ ఇంత వెర్రిపుల్లాయిలా ఏవడు వాదిస్తాడులే" అని కూడా అనుకుని వొదిలేసిన పాయింటు:-)


      P.S::ఇంకెప్పుడూ చెప్పాలనుకున్నది సూటీగా చెప్పకుండా డొంకతిరుగుడుగా చెప్పకు - ఈమాత్రం రెస్పాన్సు కూడా ఉందదు,సంఝే!

      Delete
    5. This comment has been removed by a blog administrator.

      Delete
    6. అసలు అన్వేషు నీకు సపోర్టు రావాల్సిన అవసరం ఏంటి?మొదటే నా పాయింటు ఇదీ అని నాకు అర్ధం అయ్యేటట్టు చెప్పే తెలివి నీకు లేకపోయిందేం?

      నువ్వు "దీని మూలంగా సెల్ఫ్ గోలు చేసుకున్నావు" అని చెప్పకుండా అర్ధం కాని సుత్తి వెయ్యడం ఎందుకు?

      నా రెస్పానసును బట్టి నాకౌ అర్ధం కాలేదని తెలిసినప్పుడు నువ్వు రెస్పాండ్ అయిన పధ్ధతేమిటి?

      నువు చెప్పకుండానే నీ బుర్రలోకి దూరి కనుక్కోవాలా?నీ పాయింటు నువ్వు తిన్నగా చెప్పలేవు గానీ ఏంటో పెద్ద పోజులు కొడుతున్నావు.

      నువ్వు తిక్కగా మాట్లాడితే జవాబు సూటిగా ఉండదు.ఏనికైనా ఒక పధ్ధతి ఉంటుంది.

      Delete
  3. ఎమర్జెన్సీ విధించి ఇప్పటికి సరిగ్గా నలభై సంవత్సరాలు అయ్యింది. ఆ సందర్భంగా ఎమ్బీయస్ ప్రసాద్ గారు అప్పటి పరిస్థితులు,పార్టీలు, నాయకులు,వారి నేపథ్యం అన్నీ సవివరంగా ఒక ధారావాహికలా వ్రాస్తున్నారు. మీకు ఆసక్తిగానే ఉండవచ్చు. కావాలంటే ఇక్కడ చదవండి.

    http://telugu.greatandhra.com/tags/emergency-at-40.html

    పైన నీలి కేకు వారి మాటే నాది కూడా! "హరిబాబూ! ఇంత ఓపిక ఎలా వొస్తుంది నీకు? అస్సలు నువ్వు మనిషివేనా అని చాలాసార్లు డౌట్ వొస్తుంది నాకు :) "

    ReplyDelete
  4. ఘియాసుద్దీన్ అనేవాడు నిజంగా ఉన్నాడా? అందుకు ఆధారాలున్నాయా? ఉంటే అతనూ గంగాధర నెహ్రూ ఒకే వ్యక్తి అని నమ్మడానికి ఆధారాలున్నాయా? కాశ్మీరీలందరూ ఒకప్పుడు బ్రాహ్మణులేననీ ఆ కారణం చేత మిగతా దేశంలో హిందూ-ముస్లింల మధ్య పాటించబడే భేదాల్ని కాశ్మీరీలు పాటించేవారు కాదనీ ప్రతీ కాశ్మీరీ బ్రాహ్మణుడికీ ఒక హిందూ భార్యతో పాటు ఒక ముస్లిం భార్య కూడా తప్పనిసరిగా ఉండేదనీ విన్నాను.

    ReplyDelete
    Replies
    1. అసలు ఆ విషయం గురించి ఏదయినా అధికారికంగా తేలాలంతే స్పందన కాంగ్రెసు వైపు నుంచి రావాలి.వాళ్ళు మొండిగా కొట్టిపాఎయ్యటమే తప్ప సానుకూలంగా స్పందించహ్టం లేదు,అదే కదా అసలు అనుమానాస్పదమయిన విషయం!

      Encyclopedia of Indian War of Independence అనేది భారత ప్రభుత్వం వారి అధికారీఅక ప్రచూర్ణ.కాంగ్రెసువాళ్ళు కూడా చ్చ్చినట్టు ఒప్పుకుంటున్న్నారు,ఒప్పుకోవాలి.అందులో చాలా వివరంగా ఉంటుంది కాబోలు.అది దొరికితే దాన్ని అబ్ట్టి ముందుకెళ్తే గానీ పరిశోధన నిక్కచ్చిగా జరగదు.

      Delete
  5. సిక్కుల తో పెట్టుకోవద్దు అని స్వామి ఇందిరా గాంధిని హెచ్చరించాడట. కొంత కాలం తరువాత ఒకరోజు పార్లమెంట్ లాబి లో స్వామి తారసపడితే, ఇందిరా గాంధి చేయి పట్టుకొని ఆపి నువ్వు చెప్పింది నిజం. వాళ్ళు నన్ను వదలరు అని సుబ్రమన్య స్వామితో చెప్పిందట.

    Subramanian Swamy and Operation Blue Star

    https://www.youtube.com/watch?v=RCDAw5xCWPw (8min)

    https://www.youtube.com/watch?v=kMaXnHkvTFI(1hr:20min)

    ReplyDelete
  6. హరిబాబు గారు!! ఈ ధారావాహిక ఆపేసారాండి. కొనసాగించగలరు. ఎన్నో తెలియని విషయాలున్నాయిందులో. త్వరలోనే ధారావాహిక కొనసాగిస్తారని ఆశిస్తూ...
    - శశికుమార్

    ReplyDelete
    Replies
    1. అవును,

      ధారావాహిక మొదలు పెట్టేటప్పుడు తిలక్, గాంధీ, నెహ్రూ,ఇందిర,సంజయ్, రాజీవ్, సోనియా, రాహుల్ అనే ఎనిమిది మందిని తీసుకుని ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులు కాంగ్రెసుని అంటిపెట్టుకుని దేశప్రజల్ని ఎలా ప్రభావితం చేశారు అని విశ్లేషించి చెప్పాలని అనుకున్నాను.తర్వాత సంజయ్, రాజీవ్ ఇద్దర్నీ కలిపేసి ఏడు భాగాలు చేశాను.

      ఆపెయ్యటం కాదు గానీ ఆసక్తి తగ్గిపోయింది.టాపిక్ ఎత్తుకుంటే పూర్తి పరిశోధన చెయ్యాలి.తర్వాతి వాళ్ళు ఈ నలుగురి స్థాయిలో ప్రజల్ని ప్రభావితం చెయ్యలేదు.ఇంకొకటి ఇతర విశ్లేషకులు చెప్పేసినవి మళ్ళీ నేను చెప్పడం ఆనవసరం కదా!ఈ నలుగురి గురించీ ఇక్కడ నేను చెప్పినవి కూడా సీనియర్ విశ్లెషకులు టచ్ చెయ్యనివే.సంజయ్ నుంచి రాహుల్ వరకు అలాంటి కొత్త పాయింట్లు కనిపించకపోవడం కూడా ఒక కారణం.

      నేను సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినవాణ్ణి కాబట్టి వర్క్ ఫ్రం హోం అంతకు ముందునుంచీ అలవాటే నాకు.కరోనా మా పనులకి అడ్డంకి కాలేదు. ఆఫీసు పన్లు ఉన్నాయి.ఈ మధ్యనే సొంత ఐడియాలతో కొత్త ప్రాకెక్టులు మొదలు పెట్టాను.అంటే వాటిని మార్కెట్ చేసుకుంటే నెలజీతంలా కాకుండా ఎక్కువ ఆదాయం వస్తుంది.

      అదీ గాక, ఎప్పటికప్పుడు కొత్త గొడవలు తగులుకుంటున్నాయి.గత రెండేళ్ళ నుంచీ ఎప్పుడు ఏ పెంట మన నెత్తిన పడుతుందో తెలియట్లేదు.ఈ సైకో పాలన ఎప్పుడు పోతుందో తెలియట్లేదు.వీటి పట్ల స్పందించటానికే టైం సరిపోవట్లేదు, పాత కధలు తవ్వడానికి కుదరట్లేదు.

      కొంచెం తీరిక వచ్చాక పూర్తి చేస్తాను.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...