Wednesday 2 September 2015

రాజు లేనప్పుడూ సారంగో సారంగా!దులపర బుల్లోడో రంగనాయకి దుమ్ము దులపర బుల్లోడా?!

     ఈ మధ్యనే చలసాని ప్రసాద్ అనే ఒక మంచి కమ్యునిష్టు పెద్దాయన పోయారండి!మంచాయనే,యెందుకంటే భ్రమల్లో కూరుకుపోకుండా వాస్తవాలు తెలుసుకుంటేనే విప్లవానికి మంచిది అనే ఉద్దేశంతో చాలాకాలం క్రితమే "ఇలా మిగిలేం" అని ఒక పుస్తకం రాశారు.అందులో పేరుగల కమ్యునిష్టు నాయకులు వ్యక్తిగత జీవితాల్లో విప్లవ చైతన్యానికి దూరంగా ఉండటం గురించి చెప్పారు.కొన్ని సినిమాల్లో "ఈ చిత్రంలోని పాత్రలూ సన్నివేశాలు కల్పితం,యెవరినీ ఉద్దేశించినవి కావు" అని ముందు సూచన ఇచ్చినట్టు పనిగట్టుకుని అసలు పేర్లతో సహా ప్రస్తావించారు!అసలు పుస్తకం చదవలేదు గానీ పరిచయం కోసం యెవరో వ్రాసిన వ్యాసంలో ఇచ్చిన ఉదాహరణలు చదివాను.నెహ్రూ ఇందిర ద్వారా మిత్రులుగానే ఉంటున్న కమ్యునిష్టుల్ని మోసం చేస్తూ కేరళ మంత్రివర్గాన్ని కూల్చేసినప్పుడు సాక్షాత్తూ చలసాని ప్రసాద్ గారే దానికి వ్యతిరేకంగా కార్టూను వేస్తే ఒక సీనియర్ నాయకుడు మరీ అంత ఘాటుగా విమర్శించవద్దన్నాడట!ఇతరుల బానిసత్వపు సంకెళ్లని తెంచి మొత్తం ప్రజలందర్నీ బూర్జువా సమాజం నుంచి వర్గరహితసమాజం వైపుకి నడిపించాల్సిన పార్టీలో ఉన్న వాడు ఒక బూర్జువా పార్టీ సభ్యుదైన నెహ్రూకి యెంత విధేయత(?)/బానిసత్వం(!) చూపించాడు?!

     జాతీయ స్థాయిలో కొడవలిని కామన్ సింబల్ మాదిరి అట్టే పెట్టుకుని ఒకరు కంకినీ ఒకరు సుత్తినీ పంచుకుని యెందుకు CPI మరియూ CPM అనే రెండు విప్లవ పార్టీలుగా విడిపోయారో తెలియదు గానీ ఆంధ్రాలో మాత్రం తెలంగాణా సాయుధపోరాటం జరిగిన తీరు సరిగ్గా లేదు(ట!) అని ఒకరు అభిప్రాయపడటం ఒక కారణం అని చూచాయగా తెలుసు నాకు,రూఢిగా తెలియదు గనక ఆట్టే మాట్టాడగూడదు గానీ అదే నిజమైతే కమ్యునిష్టు అనేవాడు యెవడూ అనగూడని మాట కదా అది,కాదంటారా!ఒరేయి గాడిదా ప్రజలు వాళ్ళమీద జరిగిన దోపిడీని భరించలేక తిరగబడితే దానికి వంకలు పెడతావేంట్రా అని యెవడయినా అన్నాడో లేదో గానీ నేను అక్కడ ఉంటే తప్పనిసరిగా అలాగె మాట్లాడి ఉందేవాణ్ణి!యెందుకంటే కమ్యునిష్టు తరహా విప్లవమైనా సరే అక్కడ కమ్యునిష్టు పార్టీ వెయ్యేళ్ళుగా పని చేస్తున్నా సరే విప్లవాన్ని ఫ్యాక్టరీలో సబ్బునో టూత్పేష్తునో తయారు చేసినట్టు తీసుకురాలేరు!ఫ్రెంచ్ విప్లవం బాస్టిల్లీ జైలు ముట్టడితో మొదలైంది!అక్కడ రేగినది దావానలంలాగ వ్యాపించిందే తప్ప సరైననాయకుడు లేక గిలటైస్ భీబత్సాలతో చెలరేగిపోయి అరాచకత్వానికి దారి తీసింది!నెపోలియన్ అనుకుంటాను ఆ అరాచకత్వాన్ని అణిచేసి సుస్థిరతని తీసుకొచ్చాడు.రష్యాలో లెనిన్ ఒక చిన్న నిప్పురవ్వ రగలగానే ఒక రకంగా హైజాక్ చేసినత వేగంగా దాన్ని కమ్యునిష్తు విప్లవంగా మార్చాడు!చైనాలోనూ ప్రపంచాన్ని కుదిపేసిన పదిరోజుల్లో మావో నాయకత్వం ఉందబట్టి సరిపోయింది,లేకుంటే అక్కడా ఫ్రెంచ్ విప్లవం నాటి అరాచకత్వం మిగిలేది!

     వస్తుతః నాకు కమ్యునిజం అంటే ద్వేషం లేదు.శ్రీశ్రీ మూలంగా మా తరంలో ఆ ప్రభావం సోకని వాడు లేడు?!కష్టజీవికి న్యాయం జర్గాలనే ఆదర్శం ఖచ్చితంగా ఉన్నతమైనదే!అయితే తొలిసారి ముప్పాళ రంగనాయకమ్మ రాసిన విషవృక్షం కొంచెం చదవగానే అసహ్యం వేసింది!ఆవిడే చెప్పుకున్నట్టు గుర్తు శ్రీశ్రీ దగ్గిర ఆ విషయం కదిలిస్తే రామాయణ భారతాల జోలికెళ్ళటం గురించి వ్యతిరేకించాడని.జంఝెం తెంపేసినా బ్రాహ్మణుడైన శ్రీశ్రీకి తెలియదా రామాయణం గురించి?అప్పటికి నేను నాస్తికత్వంలో ఉన్నా చిన్నప్పటినుంచీ రామాయన కధ వివరంగా తెలుసు గనక రామాయణాన్ని విమర్శించటం ఇంత అధమస్థాయిలోనా అనిపించింది నాకే!తను నిజంగా సైధ్ధాంతిక నిబద్ధ్ధతతో విమర్సించదల్చుకుని ఉంటే ఆ పధ్ధతి వేరుగా ఉందేది.రామాయణంలో ప్రాస్తావికంగా యెన్నో విషయాలు చెప్పినా సీతారాములు దాంపత్యంలో పాటించిన నిష్ఠ ప్రధానమైన అంశం,కదా!దాన్ని విమర్శిస్తూ యేకపత్నీవ్రతం తప్పు అని వాదించిందా అంటే అదీ చెయ్యలేదు,ఇదే మనిషి మావో దాంపత్యాన్ని గ్లాసుడు మంచినీళ్ళ ఉదాహరణతో వెక్కిరించింది!అంటే మద్దెలకి అటో దరువూ ఇటో దరువూ అన్నట్టు మావోగారి గ్లాసుడు మంచినీళ్ళ పధ్ధతీ నచ్చలేదు,సీతారాముల పధ్ధతీ నచ్చలేదు,మరి ఈవిడ యేదైనా సరికొత్త పధ్ధతిని ప్రతిపాదించిందా - అదీ లేదు?!వాస్తవజీవితంలో యెవరూ సీతారాముల వలె నిష్ఠగా ఉండటం కుదరదు అని ఉదాహరనలు చూపించి యెవరూ ఆచరించలేని లక్ష్యం కాబట్టి ఇది చెత్త అని చెప్పినా గంభీరమైన తాత్విక చింతనతో కూడిన విమర్శ అయి ఉండేది!వెకిలితనం అనిపించుకునే రీతిలో రాముడు శూర్పణఖని లొట్టలేసుకుంటూ చూశాడు,సీత రావణుణ్ణి కోరికగా చూసి కన్ను కొట్టింది అని రాయటం యేపాటి సైధ్ధాంతిక విమర్శయో ఇప్పటికీ ఆమెని సమర్ధిస్తున్న వీరాభిమానులు చెప్పాలి,చెప్పి తీరాలి!నేను సారంగలోని పోష్టు దగ్గిర వేసిన వ్యాఖ్యలో చెప్పినట్టు జానకివిముక్తి కధకి మరో వెర్షను రాస్తే యెలా ఉంటుంది?చెత్తగా ఉంటుందని నా అంతట నాకే తెలుసు,అయినా వాళ్లకెలా ఉంటుందో తెలియాలి గాబట్టి అడుగుతున్నాను,దీనికీ జవాబు చెప్పి తీరాలి!శ్రీశ్రీ వల్ల కమ్యునిజం అనే ఆదర్శం పట్లా ఆకర్షితులైనవాళ్లలో చాలామంది మురంనా వల్ల వికర్షితులయ్యారు - ఆరకంగా మురంనా వల్ల పార్టీకి మంచి కన్నా చెడే యెక్కువ జరిగింది!

     వర్గరహితసమాజం యేర్పడితే నా కష్టానికి తగిన ఫలితం నాకు వస్తుందంటే కాదనటానికి నాకేమయినా పిచ్చా?కానీ మనం విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్ళాలంటే యేమి చేస్తాం?బస్సెక్కుతాం,యేదో ఒక బస్సు యెక్కుతామా!ఆ బస్సు హైదరాబాదు వెళ్తుందో లేదో ఒకటికి పదిసార్లు సరిచూసుకుని మరీ యెక్కుతాం.మరి వీళ్ళు తీసుకెళ్ళాలనుకుంటున్న వర్గరహితసమాజం ఆనవాళ్ళు చెప్పమంటే నిలువుగుడ్లేసుకుని చూట్టం తప్ప ఒక్క శాస్త్రీయమైన ముక్క చెప్పలేకపోతున్నారు,వీళ్ళని యెట్లా నమ్మాలి?కమ్యునిజంలో శాస్త్రీయత ఉందని నిరూపించాలంటే నమ్మకంతో పనిలేని ఆధారాలతో కూడిన వాస్తవిక వర్ణన కావాలి,అది మార్కుగారి దొసో కెపిత్యలో బుక్కులో అయినా ఉందా!గట్టిగా నిలదీస్తే అసలు సిధ్ధాంతానికే శాస్త్రీయత లేనప్పుడు ఈ  విరగబాటు దేనికి?

     అయినా మురంనా మరియూ మురంనా వీరాభిమానులకీ కమ్యునిష్టు చైతన్యం అంటే కనీసపు సంస్కారం కూడా లేకుండా ఉండటం అనీ మానవ సహజమైన మర్యాదలు కూడా దిక్కుమాలిన హిందూ మతతత్వానికి ప్రతీకలే గాబట్టి విప్లవ వ్యతిరేకుల పట్ల యెంత అమర్యాదగా వ్యవహరించినా తప్పు లేదనీ కొన్ని అభిప్రాయాలు స్మశానంలో దిగ్గొట్టిన మేకుకన్నా గట్టిగా యెముకల మూలుగల్లోకంటా యెక్కిపోయినాయని నా నమ్మకం!అందుకే బాపు గారు చనిపోయినప్పుడు మురంనా పాదరేణువు యేనాడో జరిగిన పాత విషయాన్ని కూడా కెలికి రచ్చ రచ్చ చెయ్యగలిగాడు!వాళ్ళ అభిమాన రచయిత్రి విషవృక్షం రాసేనాటికే బాపుగారు యెంతటి రామభక్తుడో లోకానికంతా తెలుసు!అయినా రాముణ్ణి బద్నాం చేసే తన పుస్తకానికి ఆయనగారు బొమ్మలు వేస్తాడని యెలా అనుకుంది?అప్పటికి తెలియకపోతే అప్పుడైనా తెలిసింది గదా,తెలిశాక సిగ్గుపడే రకం గాదే బాపూ?ఆయన చెక్కు వెనకాల రామ రామ అని రాయడం గురించి కూడా చెత్తవాదనలు చేశారు.అసలు ఆఫర్ తిరస్కరించినప్పుడే ఆ చెక్కు చెల్లనిదే గదా!ఒకసారి సంతకం గూడా చేసి పంపిన చెక్కు మరొకరికి ఇవ్వడం కుదురుతుందా?చెక్కుని చెల్లగొట్టడానికి నువ్వు బ్యాంకులో వేసిన దబ్బు పదిలంగానే ఉంటుంది గదా,క్రాస్ చేసి ఇచ్చిన చెక్కుని మరొకరికి ఇవ్వగలవా?మరి చెల్లని దాని మీద యేమి రాస్తే యేమి గోరం జరుగుతుందట!?ఆ కొంటెబొమ్మల బాపు అట్లాంటి కొంటెపని చెయ్యకపోతేనే హాశ్చెర్యపడాలిస్మీ:-)

     ఇప్పుడీ చెత్తపని - సరిగ్గా ఇప్పుడే ఇదే మంచి సమయమూ మించినన్ దొరుకదూ అని యేగేసుకుంటూ వొచ్చి చలసాని ప్రసాద్ పోయినప్పుదు వరవరరావు  పాతసంగతుల్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఈమెగారు అందులో వేలుపెట్టి కెలక్కపోతే యేమవుతుంది?!బాపుగారి విషయంలో అంటే కొందరికి పాయింటు ఉంటే ఉండొచ్చు,కానీ ఇక్కద తను వాగినవన్నీ అబధ్ధాలే గదా!అసలు జరిగింది వేరు, చరిత్రలో రికార్ద్ అయి ఉంది!తను పులుముడు ద్వారా చూపించినది వాస్తవ విరుధ్ధం అని చెప్పడానికి వాల్మీకిలాగా చచ్చి స్వర్గాన లేరు  ఈవిడ చెప్పిన కుట్రదారులు - అదే కొంపముంచింది ఈసారి!ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల అంటే దృశ్యం సరదాగా ఉంది గాబట్టి చూశాము గానీ అదంతా నిజమేనని నమ్మేవాళ్ళు యెంతమంది?ఇప్పుడు మురంనా పరిస్థితీ అదే!అందుకే ఇప్పుడు వాతలు పడుతుంటే వ్యక్తిగత ద్వేషం చూపిస్తున్నారని యెడుపుముఖాలకి దిగారు.నిజం నిప్పులాంటిది,దాంతో ఆడుకోవాలనుకంటే ఇలాగే కాల్తుంది!శ్రీశ్రీ వీరపూజని సమర్ధిస్తూ ఒక చిన్న నినాదం ఇవ్వగానే తప్పు చేశాడని వెక్కిరిస్తూ మీరు మురంనాకి చేస్తున్నదేంటి - భూతపూజయా?అయినా యెక్కడ జరగలేదు వీరపూజ!రష్యాలో మసోలియం లెనిన్ ఒక్కడికే యెందుకు కట్టారు?అందరికన్నా అతడు మరింత గొప్పవాడు అని కదా!చైనాలో మావో ఫొటోలు మాత్రమే కనబడుతున్నాయేమిటి - లాంగుమార్చిలో పాల్గొన్నవారిలో మిగులినవారు తాజమహలు నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల పాటి చెయ్యలేదా?ఆస్తికులు దేవుడి విగ్రహం ముందు చేతులు జోడించి నమస్కరించటం హేతువిరుధ్ధమయితే మీరు యెర్రజండా ముందు నిలబడి పిడికిళ్ళు బిగించి వందనం చెయ్యడం హేతువిరుధ్ధం కాదా?మీ తప్పులు తెలుసుకోకుండా వూరికే విరగబడకండి,మీ కాళ్లకింద భూమి మీకు తెలియకుండానే కదిలిపోయి అందాక దక్కిన అధికార పీఠం కూడా జారిపోతుంది.చరిత్ర యెవడికీ వలపక్షం చూపించదు - బహుపరాక్!

     చూడండి ఇప్పుడేమయిందో - మొత్తం కమ్యునిజం పరువు చిరిగి చాటంతయ్యింది:-)విప్లవ వ్యతిరేకులకి పండగయ్యింది!రంగనాయకమ్మ అభిమానుల కిప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది,ఇదివరకట్లాగ ఢమేల్ ఢమేల్ మంటూ చెలరేగిపోయి గయ్యాళితనంతో పేట్రేగిపోకుండా యేడుపు ముఖాలు వెయ్యడానికి అసలు కారణం అదే!అస్సలు జవాబు చెప్పడానికి దిక్కూదివాణం తెలీని ప్రశ్నొకటి వొచ్చిపడింది,"రంగనాయకమ్మ గారు యెన్ని ప్రజా సమస్యలలో ప్రత్యక్షం గా పాల్గొన్నా"రని?!కమ్యునిష్తు పార్టీ మీటింగులకి సంబంధించిన ఫొటోల్లో చూశాను గానీ ఈవిడకి కనీసం రెండిట్లో యే కమ్యునిష్టు పార్టీలోనన్నా సభ్యత్వం ఉందా అనేది నాకనుమానమే!యూనివర్సిటీల్లో అప్పుడప్పుడూ కుర్రాళ్ళకి విజిటింగు ప్రొఫెసర్లతో గూడా లెక్చర్లు చెప్పిస్తారు మరి,ఆ లెక్కన వాళ్ళు పిలిస్తే ఈమె వచ్చి కూర్చుందేమో!పార్టీలలోనూ సంస్థలలోనూ సభ్యత్వం ఉన్నప్పటికిన్నీ లేనప్పటికిన్నీ ఆమెకి సంబందించినంత వరకూ పెద్ద వ్యత్యాసము లేదు, శ్రీమతి రంగనాయకమ్మలుంగారు ప్రజొద్యమములలో ప్రత్యక్షముగా ఇంతవరకు పాల్గొనలేదు,ఇకముందు కూడా పాల్గొనరు - అయితే యేమిట్ట!వారు వెలమకులమున బుట్టిన రాణీత్వము గలవారు,అలగాజనముతో తిరుగుట వారికి సరిపడదు!అది కేవలము శ్రీశ్రీ,వరవరరావు,చెరబందరాజు వంటి పురుషాధముల పని!ఆ యధముల పరువు పోగొట్టి విప్లవము పరువు నిలబెట్టుటయే వారికి మార్క్సు మహేశ్వరుడు కలలో కనిపించి యప్పగించిన రాచకార్యము! స్వామిని వారి దినచర్య ఇట్లుండును - కనిపించిన ప్రతి పుస్తకమునూ చదివిన ప్రతి విషయమునూ తన బ్రాండు మార్కు వ్యంగ్యమునకు పనికి వచ్చు విషయేమేదేని కలదా యని శోధించుట,దొరికినచో వేణువు వంటి పాదరేణువులూ,ప్రవీణ్ కుమార్ వంటి బభ్రాజమానములూ,వీరబొబ్బిలి వంటి వీరభక్తులూ,మార్క్సిస్ట్ హెగెలియన్ వంటి మూర్ఖ శిఖామణులూ హర్షపులకాంకిత గాత్రులై బాష్పవారి పరిపూర్ణ లోచనులై కిందపడి దొర్లునంతటి వికటహాస్యము రంగరించి ప్రచురణకు పంపుట - అంతకు మించి వారు గడప దాటి బయటకు రారు - ఘోషా సంప్రదాయ మొకటి అఘోరించినది కద వెలమ కులమున?!మీ ఇంటికొచ్చి మిమ్మల్నెవరన్నా విసిగిస్తున్నారనుకోండి,మీరేం చేస్తారు,"వెళ్ళవయ్యా వెళ్ళు పన్లేక నువ్వొచ్చి నా బుర్ర  తింటున్నావు" అని ముఖం మీదనే తలుపేస్తారు మీరే స్వయంగా!కానీ ఈవిడగారు మాత్రం స్వయంగా అలాంటి చెత్తపన్లు చెయ్యరు,చరచరా ఆక్కణ్ణించి అంతఃపురంలోకి వెళ్ళిపోయి "గాంధీ! ఆ మూర్ఖ విజిటరుని బయటికి తరిమికొట్టి తలుపు వేయుము" అని ఆజ్ఞలు జారీ చేస్తారు - రాణీత్వం?!

     వరవరరావు లాగా పొట్టకూటికోసం ప్రభుత్వోద్యోగాలు చేసి అభాసుపాలు కాకుండా,కళ్ళముందు జరుగుతున్న అన్యాయాలకి స్పందించి కార్యాచరణకి దిగి తప్పులు చెయ్యకుండా కాపాడుకుంటూ విప్లవపధగామి అనే పేరుకి యేమాత్రం భంగం రానివ్వకుండా బతకటానికీ తనకొక స్వర్గమందిరాన్ని కట్టుకుని దిగిరాకుండా కూర్చోవడానికీ సరిపడినంత ఆర్జన పుస్తకాల/రచనల ద్వారానే రావాలంటే ఆ పుస్తకాలు/రచనలు యెట్లా ఉండాలో ఆమెకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు - అదే ఆమెలోని ప్రజ్ఞ!చెత్తగా మాట్లాడుతూ కూడా గొప్ప మేధావిలా పేరు తెచ్చుకునే అద్ర్ష్తం అందరికీ ఉంటుందా!కంచె అయిలయ్య అనే మరిఒకాయనకి గూడా ఈదే అదృష్టం పట్టి విరగబడి పోతున్న్నాడు - కులరహితసమాజం,దళితప్రభుత్వం నా లక్ష్యం అంటూనే నా కురుమగొల్ల కులం విశ్వవ్యాప్తం కావాలి అని అంటున్నాడు!యేం,ఆ కోరిక చాకలి,మంగలి,తట్టాయి,బుట్టాయి కులాలన్నిటికీ ఉండొచ్చు గదా?అందరికీ అదే ముచ్చట ఉన్నపుడు ఆ పోటీలో కురుమగిల్ల కులం ఒక్కటే గొప్పది యెట్లా అవుతుంది?అందులోనూ వూరితోనో జిల్లాతోనో ఆగలేదు యేకంగా విశ్వవ్యాప్తం కావాలంట!ఇట్టాంటోళ్ళంతా గొప్పోళ్ళయ్యారంటే కాలానిగ్గూడా గాచ్చారం గాండుమారిందని తెలీట్లా?!

     రంగనాయమ్మ అదృష్టమే అదృష్టం!యే చెత్త రాసినా సైధ్ధాంతిక విమర్శ కింద చెల్లిపోతున్నది!యేనాడూ విప్లవానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడని శ్రీశ్రీని బట్టుకుని "దాటవేతల కవి" అన్నా గౌరవప్రదమయిన తప్పులు పట్టు కార్యక్రమం గానే తేల్చేసారు!జరిగినదొకటయితే మరొకటి జరిగినట్టు పులుముడు పాండిత్యం చూపించి రాసినా ఈమెగారు పరిశోధించి కనుక్కున్న పరమసత్యంలాగ చరిత్రలోకి యెక్కేసింది!ఆమెది కచ్చిబోతు తనం అంటున్నారు సరే ఆమెని విమర్శిస్తే యెవరికి లాభం అనేకాడికి వెళ్ళినా అమాయకులుగానే కనిపిస్తున్నారే తప్ప పొరపాటు ఒప్పుకోకుండా తప్పుకుపోవాలని చూస్తున్నారని యెవరికీ అర్ధమే కావడం లేదు!క్షమాపణ అడగటమే వూహలోకి రానంత దుస్థితిలో ఉన్నారు విమర్శించేవాళ్ళు కూడా!వరవర రావు దగ్గిర్నుంచి హెచ్‌ఆర్‌కే‌హెచ్‌ఆర్‌కే వరకూ "యేమిటి నీ గొప్ప!నువ్వు చేసింది తప్పు!సారీ చెప్పు!" అని గట్టిగా గద్దించి మాట్లాడ్డానికే జంకుతున్నట్టున్నారు - యేమి వైభవం?ఇట్లాంటి వైభవాలన్నీ దేవుణ్ణి నమ్మని ఆవిడకే ఇచ్చిన దేవుడు నన్నెందుకు అవేమీ ఇవ్వకుండా పుట్టించాడు?


దేవుడా!ఇవ్వన్నీ రాంభక్తుడినైన నాకిస్తే నీ సొమ్మేం పోయిందయ్యా?

10 comments:

  1. నీ గోసేంది.

    ReplyDelete
    Replies
    1. దేవుడా!ఇవ్వన్నీ రాంభక్తుడినైన నాకిస్తే నీ సొమ్మేం పోయిందయ్యా?

      Delete

  2. హరిబాబు గారూ,
    నమస్తే..
    'ఇలా మిగిలేం' పుస్తక రచయిత చలసాని ప్రసాద రావు అండీ, చలసాని ప్రసాద్ కాదు. ప్రసాదరావు కథా రచయిత, కాలమిస్టు (ఈనాడు), చిత్రకారుడు, కార్టూనిస్టు.. ఆ పుస్తకం రాసినందుకు ఆయన చాలా విమర్శలే ఎదుర్కొన్నారు. ఆయన గతించి చాలాకాలం అయ్యింది. పేర్లు దగ్గరగా ఉండడం వల్ల మీరు పొరబడినట్టున్నారు..

    ReplyDelete
    Replies
    1. కామమ్మ మొగుదంటే కామోసనుకున్నట్టు?
      పేరు మాత్రం చూసి బోల్తా కొట్టానా,హార్నీ?

      బాపూరమణీయంగా చెప్పాలంటే
      :-)
      కావరాజో రావరాజో యెవడికి తెల్సు?
      యెప్పుడూ ఒకేచోట దూటీ యెయ్యవు గద!
      :-)

      Delete
  3. దే(రా)ముడిని నమ్మనివాళ్ళు తల్చుకున్నన్నిసార్లు మీరు తలుచుకుంటున్నారా ?

    పేడ తో అగరుబత్తీలు చేసి మార్కెటింగ్ చేసే ప్రవీణ్ తొగాడియా ముస్లింలను తిట్టబట్టే చుట్టూ 500ల మంది పోలీసుల కాపలా హంగూ అర్భాటమూనూ....వీళ్ళ మొఖానికి రామభక్తి అంటేనే నమ్మబుద్ధికాదు.

    మీరు కూడా తిట్టేసి ఎవరికీ కనపడకుండా పారిపొండి.బోలెడంత పబ్లిసిటీ !

    ReplyDelete
  4. కమ్మీ లు 68 ముక్కలెందుకయ్యారో ఎప్పుడేనా అడిగారా మీరు :)

    ReplyDelete
    Replies
    1. సిద్ధాంతాలు కలవకపోతే కమ్యూనిష్టులే కాదు దేశమే ముక్కలైంది కదా ?

      నేను కూడా కమ్యూనిస్ట్నే, ఆడవాళ్ళందరూ శ్రామికులే ! మాలో మాకే పడిచావదు.మాకే సఖ్యత ఏడిస్తే మేమే "విమెన్ లిబరేషన్ ఫ్రంట్" ఏర్పాటుచేసుకునేవాళ్ళం కదా ?

      అకాశంలో సగం అని గొప్పలు చెప్పుకోవడమేగానీ చేయి ఎపుడూ క్రిందనే ఉండి అడుక్కోవడం, ఎన్నికల్లో భర్త పేరుని వాడుకోవడమే కానీ సైద్ధాంతికంగా పోరాటం చేసే ఉద్దేశ్యమే(సత్తా) లేదు.

      Delete
    2. ఆ లెక్కన మురంనా కన్నా నేనే మంచి కమ్యునిష్తుని!
      సాటివాళని పరువు పోగొట్టేశారు అని నేనెప్పుడూ అనను!

      Delete
  5. సూరపనేని గారు చెప్పింది నూరుపాళ్ళు నిజం.

    రంగనాయకమ్మకి ఇంకొక విశిష్టత ఉన్నది. అది వారి విద్యాభ్యాసం.

    తమ కళాప్రావీణ్యం , జీవితానుభవం జోడించి కథలు రాస్తే బాగుంటుండె.

    ప్రపంచంలో తగినంత చదువు లేని వారు సిద్ధాంతాల జొలికి వెళ్ళటం తప్పుి

    ఆమె కథలను వదిలి ఆమెకు అందని సిద్దాంతాలను వివరించడానికి దుస్సాహసం చేసింది.

    ఉభయభ్రష్ట అయింది.

    ఒక అల్పగ్నురాలను మార్గదర్శిగా ఎంచుట తెలుగు వారి అధమత్వానికి నిదర్శనం." కానని వాని నూతగొని కానని వాడు.." అనలేదా పోతన.

    అటువంటి వారు కమ్యునిష్టులైతే వారి తెలివితేటలకు శ్రాద్ధకర్మలే బాకి.

    మహాకవి వాల్మీకి ఎక్కడ , ఈ పీపీలకమెక్కడ.

    లావర్- అ- క కఫ్ అని ఒక అరబ్బీ సామెత. అనగా తనను తాను పగ్గము వేసుకొనుటకంటె సద్గుణము లేదు.

    నదీమ్ అన్సారి

    నదీమ్ అన్సారి


    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...