Monday, 7 September 2015

నవ్యాంధ్రలో ఈ చిందర వందర రాజకీయాలు యెందుకు నడుస్తున్నాయి?ఆదిలోనే తుంచకపోతే భవిష్యత్తు అంధకార బంధురమై పోతుంది గదా!

     ప్రత్యేక హోదా కోసం అంతమంది ఆత్మహత్యలు యెందుకు చేసుకున్నారు?ఆ చేసుకున్న వాళ్లలో ప్రత్యేకహోదా గురించి అర్ధం చేసుకోగలిగిన తెలివితేటలు యెవరికైనా ఉన్నాయా?వాళ్ళ  బయోడాటా చూస్తుంటే అలా కనిపించడం లేదు మరి!ఆంధ్రాకి హక్కుగా రావల్సినది యేదో రావడం లేదంటున్నారు,అది రాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని కూడా అంటున్నారు అన్న ఆందోళనే తప్ప దాని అసలు స్వభావం కూడా పూర్తిగా తెలియదు వాళ్ళకి,అయినా చచ్చిపోతున్నారు - అజ్ఞానం+దారిద్ర్యం+అయోమయం కలిస్తే ఇలా ఉంటుంది!?దీనికి ప్రతిపక్షాల మీద పూర్తిగా తోసెయ్యకుండా అధికార పార్టీ కూడా బాధ్యత వహిణాలి,అసలు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ప్రతిపక్షాలు దాన్ని ఆయుధంగా చేసుకుని ఇంత గందరగోళం సృష్టించాయి!చావగూఒడని వాళ్ళంతా చచ్చిపోయాక జరగాల్సిన డ్యామేజి అంతా అజరిగిపోయాక ఇప్పుడు చేసిన తీర్మానం మొదటి శాసనసభ సమావేశాల్లోనే చేసి ఉండొచ్చు,యెందుకు చెయ్యలేదు?

     ప్రత్యేక హోదాకి ప్రతికూలతలు ఉన్నాయని యే కొంచెం బుర్ర ఉన్నవాడికయినా ముందు నుంచే తెలుసు!తెలియని వాళ్లకి కొంచెం వివరంగా చెప్తే బాగుండేది కదా!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి ఈ అయిదేళ్ళూ దినదినగండం నూరేళ్ళాయుష్షు అన్నట్టు తయారైందనిపిస్తుంది ఇప్పుడు నడుస్తున్న చీదర రాజకీయాల వ్యవహారం చూస్తుంటే!అటువైపు ప్రతిపక్షనాయకుడి మీద అన్ని కేసులు నడుస్తున్నా అతనికి ప్రజల్లో పుల్ ఉంది!"కేసులు చిన్నవైనా పెద్దవైనా ఆధారాలు ఉంటే ఇంతకాలం యెందుకు సాగుతాయి?ఆధారాలు దొరికి ఉంటే యెప్పుడో విచారణ పూర్తి చేసి ఉండేవాళ్ళు,అది లేకపోవడం వల్లనే కదా కేసులు తేలడం లేదు - కాబట్టి జగన్ అమాయకుడు!కావాలనే ఈతన్ని కేసుల్లో ఇరికించారు అని తెలుస్తున్నది,అవునా కాదా?" - యెన్ని సార్లు జగన్ రేపో మాపో  జైలు కెళ్తాడు అని తెదెపా వాళ్ళు డప్పు కొట్టినా జనంలో పనిచేస్తున్న వాదన అది!చంద్రబాబు ద్రోహం చేస్తే ప్రత్యామ్నాయం కోసం ఇతర రాజకీయ పక్షాల వైపుకు చూద్దామంటే కాంగ్రెసు యధావిధిగా దివాళాకోరు వాదనలతో తలనెప్పి తెప్పిస్తున్నదే తప్ప నిర్మాణాత్మకంగా వ్యవహరించటం లేదు,తండ్రి నుంచి రాజకీయ వార్సత్వాన్ని అందిపుచ్చుకోవటం కోసం చీలిన పిల్ల కాంగ్రెసును రాజాధిరాజులాగా ఫలితాలన్నీ యెదురు తన్నేస్తున్న గందరగోళం నిండిన వ్యూహాలతో నడిపిస్తున్న ప్రతిపక్ష నాయకుడు కూడా తెలివితక్కువ యెత్తుగడలతో అభాసుపావుతున్నాడు.ఆ తెలివితక్కువ యెత్తుగడలతో తను కూర్చున్న కొమ్మని తనే నరుక్కునే కన్నా రాహుల్ గాంధీ చేసినట్టు కొన్నాళ్ళు శెలవులో గడిపి రావచ్చు కదా?యే సైకియాట్రిస్టు దగ్గిర కౌన్సిలింగ్ తీసుకున్నాడో యే గ్రహశాంతి పూజలు చేశాడో ఇదివరకటికన్నా కొంచేం మెచ్యూరిటీ కనబడుతున్నాది మొద్దబ్బాయిలో!?

     ఈ ప్రతిపక్ష నాయకుడు పట్టిసీమని యెందుకు వ్యతిరేకిస్తున్నాడో యెన్ని కోణాల నుంచి చూసినా అర్ధం కావడం లేదు,బహుశా లైలాని మజ్ఞూ కళ్ళతో చూస్తేనే అందంగా కనబడుతుందన్నట్టు అతని దృక్కోణం నుంచే చూడాలేమో!నాకయితే "పట్టిసీమని బాబు పూర్రిచేసి సీమలో గుడ్ విల్ కొట్టేస్తే,అప్పుదు నా గతేంటి?" అనే రాజకీయమే ఉందా?ఇంకేమీ లేదా!అలా అయితే పట్టిసీమని వ్యతిరేకించినందుకే రాయలసీమ ప్రజలు తన చేతికి చిప్ప ఇస్తారు - అది ఖాయం!


రాయలసీమ అనాలోచనాపరుల సమితి

     నేనీ మధ్య తరచుగా "రాయలసీమ ఆలోచనాపరుల సమితి" వారి వ్యాసాలు చదువుతూ వస్తున్నాను.వారి ప్రతి వ్యాసమూ రాయలసీమ రాష్త్ర సాధన కోసం చేసే విజ్ఞప్తితో ముగుస్తున్నది,యేమిటి వారి ఉద్దేశం?విడిపోయి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు,విడిపోవటానికి ముందు నుంచే ఆర్ధిక శాస్త్రవేత్తలు రాబోయే కరువు గురించి చేసిన హెచ్చరికలు చదివాను నేను - ఇప్పుడు ప్రత్యక్షంగా కనబదుతున్నది,ప్రభుత్వాదాయం చూస్తే మెరుగంతా తెలంగాణకి పోయి తరుగంతా ఆంధ్రకి మిగిలి శూన్యం నుంచి నడక మొదలు పెట్టాల్సిన స్థితిలో విడిపోయి దరిద్రాన్ని తీసుకెళ్తారా కొత్తగా యేర్పడబోయే రాయలసీమ రాష్ట్రానికి?400 TMCలు దక్కకపోతే చూస్కోండి ఖబడ్దార్ అని ఒకసారీ,రాజధాని మాప్రాంతం నుంచి లాక్కుపోయారు కాబట్టి రెందో రాజధాని రాయలసీమలో పెట్టాలని ఒకసారీ,అసలు మా సంస్కృతియే భిన్నం ఉత్తరాంధ్ర వాళ్ళ పెత్తనం కింద మేము లొంగి ఉండం అని ఒకసారీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు - యేమి ఆశించి?ఆఖరికి ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్య చేసుకున్న మునికోటి గురించి కూడా "ప్రత్యేకహోదా కోసం చావడ మేమిటి?అది ఆంధ్రావాళ్ళ వ్యవహారం - చస్తే రాయలసీమ రాష్ట్ర సాధన కోసం చావాలి గానీ" అని కూడా అనేశారు!అక్షరం సాక్షిగా ప్రత్యేక రాయలసీమ రాష్త్రసాధన కోసం కోసం చావాల్సిన అవసరం ఉందనుకుంటే ముందు ఆ వ్యాసరచయొత ఇప్పుడే చావొచ్చు గదా!వీళ్ళు ఈరకంగా రెచ్చగొడితే యెక్కడో మునికోటి లాంటి తాడూ బొంగరం లేని అమాయకపు గొట్టాం గాళ్ళు చస్తే ఎలిజీల రూపంలో మళ్ళీ వీళ్ళు తమ రచనా చాతుర్యం ఉపయోగించి మరింతమందిని ఉద్రేకింప జేస్తారు - అంతేనా?

     వీరి ఉద్దేశంలో ప్రత్యేక హోదా ఉత్తరాంధ్ర వారు తమ సమర్ధతని నిరూపించుకోవడం కోసం పనికొచ్చే అంశం కాబట్టి దానికోసం రాయలసీమ వాసులు ఆత్మహత్యల వరకూ వెళ్ళడం అనవసరం అని కాబోలు!మరో రకంగా చెప్పాలంటే ఇంగ్లీషులో "Reading between the lines" అన్నదాని ప్రకారం ప్రత్యేక హోదా రాష్త్రమంతటికీ సంబంధంచినది అయినా ప్రయత్నించి సాధించటాన్ని మాత్రం ఉత్తరాంధ్ర వారి మీదికి నెట్టుతున్నదీ వీరే,400 TMCలు రాయలసీమకి తీసుకురావడమూ ఉత్తరాంధ్ర వారి భుజస్కంధాల మీదనే పెట్టేశారు, వీరు కేవలం మాకు 400 TMCలు తీసుకొస్తారా తెలంగాణా వాళ్ళలాగా విడిపొమ్మంటారా అనడం వరకే పరిమితమవుతారు కాబోలు?మరి 400 TMCల పట్ల అంతగా పట్టింపు ఉన్నవాళ్ళు తమ ప్రాంతానికి చెందిన ప్రతిపక్ష నాయకుడు పట్టిసీమని వ్యతిరేకిస్తుంటే కిమ్మనకుండా ఉంటున్నారేమి?ఆ రకంగా పట్టిసీమ రాకపోతే "అదుగో పట్టిసీమ రాలేదు కాబట్టి మేము విడిపోతాం" అనే అవకాశం కోసం యెదురు చూస్తున్నారా?ఈ రకం తెలివితేతలు వీళ్ళలో పుట్టినా ఉత్తరాంధ్ర వాళ్ళే ఆ పాపం మొయ్యాలా?

     మొత్తం మీద చూస్తే రాయలసీమ వాస్తవ సమస్యలు యేమిటి,దానికి పరిష్కారం యేమిటి అనేవి నాకెక్కడా వారి వ్యాసాల్లో కనబడ లేదు మరి,యెంతసేపూ ఉత్తరాంధ్రుల పెత్తనం అనే కాపీ/పేష్తు పాండిత్యం,అది ఇవ్వకపోతే విడిపోతాం జాగ్రత్త,ఇందులో వాటా ఇవ్వకపోతే విడిపోతాం చూస్కోండి అనే బెదిరింపులు తప్ప!నేను మంచివాణ్ణి అనుకునే ప్రతి మనిషికీ తను పుట్టి పెరిగిన వాతావరణమే మూలకారణంగా తోచడం వల్ల తలిదంద్రులూ,బంధుమిత్రులూ,కులగోత్రాలూ,ప్రాంతాలూ గొప్పవిగా కనబడి ఆత్మీయతని చూపించవచ్చు - తప్పు లేదు!కానీ పరిధి దాటితే అది ఖచ్చితంగా దురభిమానం అవుతుంది - అప్పుడే ప్రమాదం!తమ ప్రాంతానికి ప్రభుత్వం నుంచి మరింత వాటా రాబట్టుకోవడం కోసం చేసే వాస్తవిక ప్రయత్నంగా ఉంటేనే వారు ఆలోచనాపరులు అని నిరూఒపించుకుంటారు.లేని పక్షంలో రాయలసీమకి కొత్త సమస్యలని సృష్తిస్తారు!


కళింగాంధ్రుల వారి తింగరి పొలికేకలు

     నేను చాలాకలం క్రితం "కళింగ కేక" బ్లాగులోకి వెళ్ళాను ప్రమాదవశాత్తూ!అలా యెందుకంటున్నానంటే మామూలుగా తెలుగువాళ్ళలో తెలుగు గురించి ఔదార్యంతో ఆలోచించే వాళ్ళే తక్కువ,అందులోనూ బ్లాగులు అనేవి ఉన్నాయని తెలిసిన వాళ్ళు మరింత తక్కువ,తెలిసినా అలవాటుగా చూసేవాళ్ళు మరీ తక్కువ!ఆ కొద్దిమందీ చేసేది యేదో ఒక ఆగ్రిగేటరుని పట్టుకుని అక్కణ్ణించి వాళ్ళ మైండ్ సెట్ అంటే వాళ్ల మనసులో ఉన్న మాయరోగాలూ బలహీనతలూ అన్నిటికీ మ్యాచ్ కుదిరే సైటు దొరికితే ఇక అక్కడ ఆజన్మాంతం యేకసైటుదృగీక్షణ వ్రతం చేస్తూ సెటిలైపోతారు!మొదట్లో నేనూ అంతే లెండి!జల్లెడ ద్వారా వెతికే వాణ్ణి,రోజుకో కూసిన్ని బ్లాగులు చూసేసి సరిపెట్టుకునే వాణ్ణి - బతుకు తెరువు కోసం చెయ్యాల్సిన వెధవ ఉద్యోగం ముఖ్యం గదా!యే మాత్రమూ సారము లేని ఈ అపార సంసారములో శ్వశురగృహం లాంటి సారభూతమైన తెలుగు బ్లాగులు అనేవి కూడా ఉన్నాయని యెలా తెలిసిందీ అనే ఋషిమూలం నాకిప్పుడు  గుర్తు లేదు గానీ ప్రవేశించిన కాలం మాత్రం తెలంగాణా ఉద్యమం చివరి రోజుల్లో!ఆంధ్రా అకాశరామన్న బ్లాగు దగ్గ్గిర మరింత కోలాహలం హోరాహోరీ హాలాహలం అన్నట్టు నడుస్తూ ఉండేది!ఇప్పుడు బ్లాగయితే ఉంది గానీ కొత్త పోష్టులు వెయ్యడం లేదు పాపం!నేను బ్లాగరు హోదా తెచ్చుకున్నాక నాకిష్టమైన ఒక ముఫ్ఫయి బ్లాగుల్ని అడ్మిన్ రీడర్స్ లిష్టులోకి చేర్చి అక్కణ్ణించే వాళ్ళు వేసిన కొత్త పోష్టుల కోసం వెతికేవాణ్ణి,దాంతో ఆగ్రిగేటర్ల అవసరం లేకపోయింది.ఇప్పుడు కొత్త ఫ్యాషన్ యేంటంటే మాలిక వారి వ్యాఖ్యల సెక్షనుకి వెల్ళి పోట్లాడటానికి పనికొచ్చే కామెంట్లు వెతుక్కుని అక్కడికి వెళ్ళటం - వృషభరాశి మహత్యం?!

     ఆ పాత వెతుకుడులో ఈ బ్లాగు తగిలింది,మొదటి రెండు పోష్టులూ వారి ప్రాంతం చరిత్రని చెప్పేవి కావడంతో నాకు చరిత్ర అంటే వెర్రెత్తిపోయే లక్షణం ఉందటంతో సూపరుగా అనిపించినాయి."కొంచెం నచ్చిందా?,ఫరవాలేదా?బాగా నచిందా?" అనే ఆప్షన్లతో కేకలు నమోదు చెయ్యమనే వారి అభిప్రాయ సేకరన పధ్ధతి ప్రకారం పొలికేకలే పెట్టేశాను!తీరా ఒక్కొక్క పోష్టూ అలా చూస్తూ ఉంటే "మూల విరాట్టులు ముష్టెత్తుకుంటే..ఉత్సవ విగ్రహాలకి దధ్యోజనాలట." అనే పోష్టు దగ్గిర కొచ్చేసరికి అనుకోని యెదురుదెబ్బ తగిలేసింది,"చచ్చితిని!అనవసరముగా ఆవేశపడి మెచ్చుకుంటిని?!" అనిపించింది!కృష్ణదేవరాయల గురించీ పెద్దన గురించీ యెంత దుర్మార్గంగా వర్ణించారో చూడండి!

కళింగ జాతికి అవమానం జరిగిందని బాధపదే రచయిత ఒక వ్యక్తి యెత్తునీ ,స్పోటకం మచ్చల మొహాన్నీ ప్రస్తావించి యే రకమైన సంస్కారాన్ని ప్రదర్శిస్తున్నారో తెలుసుకోవచ్చా?పాతకాలంలో యే ఒక్క ప్రాంతమూ శతాబ్దాల తరబడి ఒకే రాజు పాలనలో లేదు,ఉన్నదని రచయిత సాక్ష్యాలు చూపించగలరా?రాజు విజిగీషువు తనకు శక్తి ఉన్నదని అనుకుంటే మొత్తం భూమండలాన్నంతా ఆక్రమించేటందుకు అర్హుడు - అనే చాణక్య నీతినే గజపతులూ ఇతర నరపతులూ పాటించారు,అవునా కాదా?అలాంటప్పుడు గజపతులూ రాయలూ యుధ్ధాలు ఒక రకంగానె చేసి ఉండాలి.అయినా మీరు గజపతులతో ఆత్మీయత పెంచుకుని రాయలని ద్రోహి అనటం అతని స్పోటకం మచ్చల్ని ప్రస్తావించటం అనవసరం కాదా?గజపతు లంతా సర్వాంగ సుందరులా?రాజులకి సౌందర్యమా వీరత్వమా ప్రధానం?పెద్దలు అన్ని ప్రాంతాల్లోనూ అందరూ ఆచరించదగిన ఒకే ఒక మంచి మాటగా "ఇతరులు నీకు యేది చేస్తే బాధ కలుగుతుందో అది ఇతర్లకి చెయ్యకుండా ఉండటం" అని చెప్పారు.గజపతుల్ని మోసంతో ఓడించటం గురించి బాధపదేవాళ్ళు అక్కడ ప్రస్తావించనక్కర్లేని స్పోటకం మచ్చల వాడు అనే విశేషణాన్ని యెందుకు కలిపారు?ఆలోచించండి!చరిత్రని ఒకవైపు నుంచే చూసి అర్ధం చేసుకోకుండా తులనాత్మకంగా చూడగలిగితే మంచిది!

     చెత్త మాట కనబడితే ప్రతిస్పందించకుండా ఉండలేని బలహీనత నాది, అది అక్కడ వేసిన కామెంటు!మొదట కనబడింది,తరవాత మాయమైపోయింది,అర్ధం యేమిటి?ఆ రచయిత నా భావాన్ని చదివాడు,కానీ తన భావంలో మార్పు రాలేదు - కామెంటుని మాత్రం తొలగించాడు!ఈ ఒక్కటే అయితే ఫరవాలేదు,కళింగ యుధ్ధం తర్వాత అశోకుడు పశ్చాత్తాప పడటం గురించి "ఆయన గారు ఆ పశ్చాత్తాపమేదో మామీద యుధ్ధం చెయ్యకముందు పడినా బాగుందేది" అని వగపోస్తూ ఒకాయన ఆంధ్రజ్యోతిలో వ్యాసం కూడా రాశాడు,ఇదంతా ప్రాంతీయాభిమానమేనా?ఈ కళింగయుధ్ధం గురించీ అశోకుడి పశ్చాత్తాపం గురించీ మరొక పోష్టులో చెప్పాలనుకుంటున్నాను గనక ఇక్కడ విస్తారంగా చెప్పటం లేదు గానీ అసలు అశోకుడు కళింగ యుధ్ధం వల్లనే పశ్చాత్తాపపడ్డాడనేటందుకు గట్టి ఆధారాలు లేవు,తర్వాత బౌధ్దమతావలంబి అయ్యాడనేటందుకు తిరుగులేని సాక్ష్యాలు లేవు!అలాంటిది ఇవ్వాళ నడుస్తున్న రాజకీయ వ్యవస్థలో వారి ప్రాంతానికి యేమి కావలో తెలుసుకుని దాన్ని సాధించుకంటే రేపటికి పనికొస్తుంది గానీ ఇవ్వాళ్టి కష్టాలకి నిన్నటి అశోకుడో మొన్నటి మరొకడో కారణం అనటం యేమి తెలివి?

పవనదేవుడి కాపుకుల కళ్యాణ దీక్ష

     పవనిజం ఇవ్వాళ్టి అవసరమని నేనూ ఒకప్పుడు ఆశించాను,నిజమే!కానీ మొన్నటి వరకూ బాగానే ఉండి నిన్నటి రోజూన భూసేకరణ చట్టం గురించి ఇతను చేసిన  హడావిడి చూశాక తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన కొన్ని అతి ముఖ్యమైన అనుమానాలు వచ్చినాయి!నాకు ఇప్పుడు రైతులు ఇచ్చిన భూములకి చట్టపరమైన రక్షణ యేదీ లేదనే బెంగ మొదటి నుంచీ ఉంది!ఇతను వద్దంటున్న భూసేకరణ చట్టం దుర్మారగమైనదీ కాదు!ఆ చట్టం రూపొందించినదే ప్రభుత్వం తీసుకునే భూమికి సంబంధించి రైతుల హక్కుల్ని కాపాడటం కోసం పెట్టినది దాని ప్రకారం కూడా బలవంతంగా యెవరూ లాక్కోలేరు!నిజానికి చట్టం ద్వారా తీసుకుంటే ప్రభుత్వానికి పరిహారం బరువు కావటం వల్లనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం చేసిన విధానాన్ని ప్రజల ముందు పెట్టింది - అందరికీ అర్ధమయ్యేలా చెప్పాలంటే ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది కౌలుకి తీసుకుంటున్నట్టు,అంతేనా?రాజధానికి అవసరమైన భవనాల నిర్మాణం యే అడ్దంకులూ లేకుండా కొనసాగి పూర్తయ్యాక తిరిగి భూమిని రైతులకే దఖలు పరుస్తారు,ఇప్పుడు ముందస్తు పరిహారమూ ఇస్తున్నారు కదా!ఒక రైతు నుంచి తీసుకున్న భూమిలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడితే తిరిగి భూమి స్వాధీనమయ్యాక దానిమీద వచ్చే రెంటల్స్ అతని ఆదాయం అవుతుంది,అవునా!ఒకవేళ బాబు చేస్తున్నది లొసుగుల వ్యవహారమే అనుకుందాం,అలాగయితే ఈ పెద్దమనిషి అరిభీకరంగా "ఒకవేళ వచ్చే యెన్నికల్లో తెదెపా వోడిపోతే?" అన్నది చాలా న్యాయమైన ప్రశ్న!అతను గనక దానిమీద గట్టిగా నిలబడి పోరాడితే ఇప్పుడు భూములిచ్చిన రైతులందరికీ ప్రయోజనం చేకూరుతుంది కదా!కానీ ఇప్పటివరకూ భూములిచ్చిన వారు యే గంగలో కలిసినా నేను పట్టించుకోను గానీ ఇవ్వం అంటున్న వీళ్ళ నుంచి బలవంతంగా తీసుకోకపోతే చాలు నేను గొడవ చెయ్యను అని మాత్రమే యెందుకు సరిపెట్టుకుంటున్నాడు?

     ఆ రైతులు నాలుగైదు పూలబట్టలు చూపించి రోజుకి 5,000 సంపాదిస్తున్నాం,30,000 యే మూలకి వస్తాయి అనటం కూడా నమ్మబుధ్ధి కావటం లేదు!రోజుకి 5,000 అంతే నెలకి 1,50,000 - ఇవ్వాళ డాబుసరిగా చెప్పుకునే యే సాఫ్ట్వేర్ ఇంజనీరుకి వస్తున్నాయి?ఇవ్వాళ మాయా లాంటి 3డి అప్లికషన్లు నేర్చుకుని గేంసూ\సినిమాలూ తీసే కంపెనీల్లో పనిచేసేవాళ్ళకి గూడా 75,000 మించటం గగనం!మరి వీళ్ళు యెంతకాలం నుంచి రోజుకి 5,000 ఆదాయం తీస్తున్నారో,ఇంకా మీడియా ముందు కనబడినట్టు అంత బీదగా యెందుకున్నారో యెవరికీ అనుమానమే రావడం లేదా?మొదటిసారి భూసేకరణ ద్వారా ప్రభుత్వానికి భూములిస్తున్న రైతులకి భరోసా ఇచ్చే యాత్రలోనూ మిగతా వాళ్ళ నందర్నీ హడావిడిగా చూసేసి కొందరి దగ్గిర మాత్రం యెక్కువ శ్రధ్ధ చూపించి సమస్యల్ని చెవియొగ్గి ఆలకించటానికీ ఇప్పుడు కూడా కేవలం వీరి మనొభావాలు దెబ్బతినకుండా ఉండటానికి మాత్రమే పోరాడటానికీ ఉన్న బాదరాయణ సంబంధం యేమిటి?ఇలాంటి చేష్టల ద్వారా నేను కొందరివాడినే అని తనే నిరూపించుకుంటున్నా కూడా అందరూ ఇతన్ని దేవుడు అనుకోవాలా!

     ఆ రోజూన వచ్చిన జనసమూహం కూడా "మా రంగా వచ్చాడు" అనటం విన్నాక గూడా ఇంకా అనుమానాలు దేనికి?యేదో మాటవరసకి అన్నట్టుగా కొందరు నన్ను కులానికే పరిమితం చెయ్యాలనుకుంటున్నారు,కానీ నేను అందరివాణ్ణే అంటే యెవరు నమ్ముతారు?మంత్రుల దగ్గిరుంచి నటుదు శివాజీ వరకు ప్రత్యేకహోదా గురించి ప్రధాని దగ్గిర మాట్లాడమని అభ్యర్ధించినా కదలని వాడు ఈ కందరికోసం యెంత వీరావేశంతో కదిలాడు?ఆఫ్టరాల్ అన్నందుకే ఆవేశపడిపోయినవాదు ఓవరాల్ రైతుల కోసం ఆవేశపడితే అందరికీ గట్టి రక్షణలు దక్కేవి కదా?!అసలు నిజంగా ఇతనికి అంత హవా ఉందా,లేక మంచివాడు గదా అని మర్యాద కోసం బాబూ,మోదీ ఇలా ప్రవర్తిస్తున్నారా?నాకయితే ఇతనికి సంబంధించి అందరూ యెక్కువ చేస్తున్నారని అనుమానంగా ఉంది!

     సరే,ప్రస్తుతానికి పాష్త్రప్రభుత్వం ఆ మూడువేల యెకరాలకి సంబంధించి పవన్ అళ్యాణ్ మాటనే నెగ్గించింది!మొత్తం రాజధాని నిర్మాణాన్ని దశలవారీగా విడగొట్టారు గనక ప్రస్తుతానికి మొదటి దశ రాజధానికి వీళ్ళు అడ్డం రారు,కానీ కానీ పవన్ కళ్యాణ అధికార పక్షానికి పక్కలో బల్లెమే తప్ప ప్రేమానురాగాలు తొణికిసలాడే మితపక్షం కాదు అని తేలిపోయింది - అంతవరకూ ఖాయం


ఇప్పటి నవ్యాంధ్రకి కావలసినది ఐకమత్యం విడిపోవాలనే దురాలోచన కాదు

     విభజనకి వ్యతిరేకంగా కికురె ఆనాడు పెట్టిన తీర్మానం వల్ల యేమి ఒరిగిందో ఇవ్వాళ హోదా కోసం చెసిన తీర్మానానికీ అదే గతి పడుతుంది!ఒకవైపున ఆ ప్రత్యేక హోదాకి కోతలు పడుతున్నాయి,అసలు ముందు మందు యే రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఐవ్వటం కుదరదు అని చెప్తున్నారు,అయినా దానికోసం పాకులాడటం దేనికో నాకర్ధం కావ్డం లేదు!ప్రత్యేకహోదా మాత్రం ఇచ్చి మిగతావి ఇవ్వకపోతే సరిపెట్టుకుందామా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అడిగీన్ ప్రశ్న అర్ధమయితే దానికోసం ఇంతగా వెంపర్లాట్ ఔండేది కాదు.ఇప్పుడు మనకి ప్రత్యేకహోదా ద్వారా వచ్చేవి యే మూలకీ సరిపోవు,అదనంగా చాలా కావాలి,కేంద్రం కూడా సుముఖంగానే ఉది,రొపాయి రావాల్సిన చోట అర్ధరూపాయి చాలు అనటం వల్ల రాష్ట్రం బాగుపడుతుందా?

     విడిపోయి రెండేళ్ళు కావస్తున్నా విభజన చట్టంలో ఉన్న యే అంసంలోనూ పంపకాలు జరగలేదు!తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటికే షెడ్యూలు 9,10 కంపెనీలన్నీ తెలంగనవే అని తేల్చిపారేసాడు యేకపక్షంగా,అదెట్లా కుదురుతుంది?ఆంధరప్రాదెశ్ ముఖ్యమంత్రి యెన్నిసార్లు చర్చలకి పిల్చినా రావ్దం లేదు,సాంకేతికంగా చూసినా చర్చలకి పిలవాల్సింది ఇద్దరు వాదుల్లో ఉన్న ఒక ముఖ్యమంత్రి కాదు,కేంద్రం మధ్యవర్తిగా ఉండేటందుకు అంగీకరించి చొర్వ చూపించి తను ఇరుపక్షాలనీ ఒకచ్ఘోట కూర్చఓబెట్టాలి!కేంద్రం ఆచొరవ చూపించాలి అంతే రెండు రాష్ట్రాల లోని అన్ని రాజకీయ పక్షాలూ యెజెండా పాలితిక్స్ కోసం పాప్యులారిటీ కోరుకున్న యెత్తుగడలకి పోకుండా తమ తమ ప్రభుత్వాలకి పూర్తి సహకారం ఇవ్వాలి - కనీసం విభజన ద్వారా తమ రాష్ట్రానికి రావలసిన వాటి విసహ్యంలో నైనా!ఈ లెక్కా డొక్కా తేలితే వచ్చిన వాటిలో యేవి యెక్కడ పెట్టాలో స్పష్టత వస్తుంది!మనకి నికరంగా దక్కిన వనరుల్ని ఉపయోగించుకుని ముందుకి కదలొచ్చు.లెక్కలు తేలనంతకాలం ఈ రెండు రాష్ట్రాల ప్రజలలో అసహనం వల్ల ద్వేషాలు ఇంకా పెరుగుతుంది!అశాంతి ఉన్నచోట అభివృధ్ధి ఉండదు.

     ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవహార శైలిని పరిశీలించి చూస్తే అతను మాత్రం అభివృధ్ధికి సంబంధించిన ప్రయత్నాల్లో వీటిని యేమాత్రం పట్టించుకోకుండా తన దారిలో తను ధైర్యంగా ముందుకు వెళ్తున్నట్టు అర్ధమవుతుంది.ఒకసారి అభివృధ్ధ్గి మొదలయితే ఈ పెదధోరణులు వాటంతటవే సమసిపోవచ్చు,కానీ అప్పటికీ ఆగకపోతే?చంద్రబాబు తను ఒకానొకప్పుడు అభివృధ్ధి నంతా ఒకేఒక్క భాగ్యనగరంలోనే పోగెయ్యడం వల్ల జరిగిన అనర్ధాన్ని గుర్తించాడనేటందుకు సాక్ష్యాలు ప్రతిరోజూ కనిపిస్తూనే ఉన్నాయి!పట్టిసీమ కోసం అతను చేస్తున్న ప్రయత్నాల్ని ఆంధ్రప్రాంతపు నాయకులు వ్యతిరేకించకపోయినా రాయలసీఅమకి సంబంధించిన నాయకులే వ్యతిరేకిస్తున్నా ఆపలేని "రాయలసీమ ఆలోచనాపరుల సమితి" వారు అనాలోచితంగా విడిపోవటం గురించి మాట్లాదకుండా ఉంటే బాగుంటుంది.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాటల్లో కూడా మొత్తం 13 జిల్లాల గురుంచి ప్రస్తావిస్తున్నప్పుడు కళిగాంధ్ర వారు మాత్రం యెందుకు విడిపోవాలని కోరుకుంటున్నారు?పైగా వారిద్దరి ధోరణీ కేసీఆర్ అధ్వర్యంలో నడిచిన ప్రాంతీయ ద్వేషానల జ్వాలలు రేకెత్తించే రక్తబీజాసుర యజ్ఞం పధ్ధతిలో ఉంది,దానివల్ల తెలంగాణ రావ్దమయితే వచ్చింది గానీ ఇవ్వాళ్టి తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా తయారయింది!ఇప్పుడు వీరిద్దరూ ఇదే దారిలో ముందుకెళ్తే సీమలో ఒక కేసేఅరూ కళింగలో ఒక కేసీఆరూ పుడతారు - దానివల్ల వారి ప్రాంతాలకె నష్టం!


చెప్పడమే మన ధర్మం వినకుంటే నవ్యాంధ్ర ఖర్మం!

46 comments:

 1. రాష్ట్ర ముఖచిత్రం ఆశాజనకంగా లేదు.
  రాష్ట్రంలో బలమైనవారు రెడ్లు,చౌదరిలు, కాపులు
  పేరు చివర రెడ్డి, చౌదరి ఉన్నవారంతా సగం మంది కిరస్తానీలే. మిగిలినవారిలో మేధావులంతా జగనన్న వెనక చేరారు, బతకడానికి దారిలేక. చౌదరిలున్నచోట మరొకరిని బతకనివ్వరు.
  పార్టీల పరంగా కాంగ్రెస్ చచ్చిపోయింది, ఇప్పటిలో బతకదు.
  కమ్యూనిస్ట్ పార్టీలు కమ్మవారి చేతుల్లో చిక్కుపోయి చావడానికి సిద్ధంగా ఉన్నాయి, మరి బతకవు.
  తెలుగుదేశం బతుకు ఐదేళ్ళ తరవాతేమో తెలియదు, వీళ్ళు మరొకరిని బతకనివ్వరు. వారి సంస్థలలో మరొకరికి స్థానం ఉండదు.
  జగనన్న బయట ఉండే రోజులు తక్కువగానే ఉన్నట్టున్నాయి. జగనన్నని మినహాఇస్తే అక్కడా పార్టీలో మరేమీ లేదు.
  కాపులు పవనన్న వెనకుంటారో లేదో, అసలు పవనన్న ఏం చేయబోతున్నాడో దేవునికే ఎరుక.
  రాష్ట్రానికి ఆదాయ వనరులు లేవు, అప్పులు మాత్రం ఉన్నాయి. ప్రజలకి ఉద్యోగావకాశాలూ లేవు, వస్తాయనేది నక్కాశే.
  భాజపా వారు తెలుగు దేశం తో కుస్తీయో దోస్తీయో తెలియని పరిస్థితి, వారు ఊడపొడిచేదేం కనపడటం లేదు.
  ఇప్పుడు ఆంద్రరాష్ట్రం దిక్కులేక నాలుగురోడ్ల కూడలిలో అడుక్కునే స్థితిలో ఉంది.

  ReplyDelete
 2. http://10tvnelloore.blogspot.com/2013/09/blog-post_4778.html ఇక్కడ ఇంకా చాల విషయాలు ఉన్నాయి.

  ReplyDelete
 3. హరిబాబు గారు,

  మీరు ప్రజ బ్లాగు లో వాదిస్తూ సమయం వృథా చేసుకోకుండా, ఈ వీడియో ను చూడండి. చాలా కొత్త విషయాలు తెలుస్తాయి.

  Hindu Temples and Government Control

  https://www.youtube.com/watch?v=URCNmj2Gmkk


  Regds,

  SriRam

  ReplyDelete
  Replies
  1. A very good suggestion to Haribabu.
   Really it is waste to argue with......

   Delete
  2. మిత్రులారా,

   నేను కాలక్షేపం కోసం మాత్రమే వాదిస్తున్నాను.దైవదత్తం గురించి శ్రీకాంత్ చారితో వాదించిన పధ్ధతి చూశారు గదా!అప్పుడే తెలిసిపోయింది సరుకులేని వాళ్లతో వాదిస్తున్నానని.

   దైహికశ్రమ/బౌధ్ధికశ్రమ విషయంలో నేను కవితాత్మకంగా కప్లెట్స్ వాడుతూ యెందుకు కెలికాను?నేను సరదాగా ఉన్నప్పుదు మాత్రమే అలా కామెంటుతాను!

   వూరికే ఒక పోష్టు రాసి పబ్లిష్ చేసి కామెంట్ల కోసం యెదురు చూట్టం బోరుగా ఉంది.నాలెడ్జిలో ప్రవీణ్ గానీ శ్రీకాంత్ చారి గానీ నాకు సమవుజ్జీలు కాదని నాకు తెలుసు!అది మీకూ తెలుసు,అవునా కదా?

   మనం వ్యాయామం యెందుకు చేస్తాం,దేహం దృఢంగా ఉండటానికి!ఇదీ అంతే!చిత్రకవితలూ,బంధకవితలూ,అవధానం ఇవన్నీ దేనికి?భాష మీద పట్టును పెంచుకోవడానికి చేసే వ్యాయామం,అవునా?అందంగా మధురసనిష్యందంగా కవిత చెప్పడానికి అవన్నీ అవసరం లేకపోయినా ఉషారు కోసం చేస్తాం,కదా?

   అయినా కొందల రావుకి ఒక విజ్ఞాపన లాంటి ఫైనల్ వార్నింగు ఒకటి ఇచ్చాను ప్రవీణ్ అనే మూర్ఖుణ్ణి బాయ్కాట్ చేస్తావా,నన్ను కూడా ప్రజ నుంచి తప్పుకోమంటావా అని!.తను యేదో ఒక జవాబు ఇచ్చేవరకూ వెయిట్ చేస్తాను.తను ప్రవీణ్ ఉందాల్సినదే అంటే అప్పుడే శాశ్వతంగా ప్రజకి వీడుకోలు చెప్పేస్తా!

   ప్రవీణ్ మరియూ శ్రీకాంత్ చారితో వాదించటానికి నేను బుర్ర బద్దలు కొట్టుకోనక్కర లేదు!ఒక ఇంగ్లీషు బ్లాగు చూశాను,శాతవాహనులు ఆంధ్రులు కారనీ కన్నడిగులనీ వాదిస్తున్నాడు బ్లాగు రచయిత!అతను కన్నడిగుడు కాబట్టి శాతవాహనుల్ని కన్నడిగులుగా క్లెయిం చేసుకోవాలని చూస్తున్నాడు.ప్రస్తుతం ఆ తలనెప్ప్పిలో ఉన్నా.

   తెలుగు ముస్లిం దగ్గిర శ్యామలీయం వ్యాఖ్యనీ చూశాను.ప్రస్తుతం అంతర్జాతీయంగా వాళ్లమధ్యన జరుగుతున్న ఆధిపత్య పోరు తెలుగు బ్లాగుల్లోకి కూడా యెక్కేసింది,మధ్యలో వచ్చీరాని సంస్కృత పాండిత్యంతో మాటల్ని వంకర తిప్పటం,ఇక బ్లాగులోకం ప్రశాంతంగా ఉండటం అసాధ్యం!వాదన మొదలెడితే చివరివరకూ నిలబడాల్సి వస్తుంది,కొన్నిసార్లు వెనక్కి తగ్గకుండా గట్టిగా నిలబడటానికి కూడా సిధ్ధంగా ఉందండి.

   ఉత్తిష్ఠత!జాగృత!ప్రాప్యవరాన్నిబోధత!!

   Delete
  3. ప్రవీణ్ అనే మూర్ఖుణ్ణి బాయ్కాట్ చేస్తావా,నన్ను కూడా ప్రజ నుంచి తప్పుకోమంటావా అని!

   మీరు ఇంత అమాయకులను కోలేదు. షాజహాన్ ను అనార్కలి కావాల? నేను కావాల? అని అక్బర్ అడిగితే ఏమంటాడు? అనార్కలి కావలంటాడు గాని, ముసలి తండ్రి అక్బర్ ను కావాలంటాడా? ఆయన ప్రవీణ్ ను బాయ్ కాట్ చేసే పనైతే ఎప్పుడో చేసేవాడు. అక్కడ వేసే ప్రశ్నలలో ఎక్కువ భాగం ప్రవీణ్ వే కదా! ఆ బ్లాగుకు అనధికార ఓనర్ ప్రవీణే అన్నా తప్పులేదేమో!


   బాబు ప్రవీణ్, పెళ్ళి అనే ప్రక్రియ పై సమాజా ప్రభావం పూర్తిగా ఉంట్టుంది. ఎవరైనా పిన్నితో పెళ్ళి చేసుకొన్నా వాళ్లకి పిల్లలు అవసరం లేదా? ఒకవేళ పిల్లలు పుడితే వాళ్లని పెళ్ళి చేసుకోవటానికి ఎవరు ముందుకు వస్తారు? ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయవయ్యా!   SriRam

   Delete
  4. మీరక్కడికి వెళ్ళకపోతే అతనితోవాదించేవారే ఉండరు. ప్రజ అతన్ని వదలలేదు. ఇప్పటికే రెండు మూడు సార్లు మీరిలా వార్నింగులివ్వడం జరినట్టుంది :)

   Delete
  5. >>> ప్రవీణ్ గానీ శ్రీకాంత్ చారి గానీ నాకు సమవుజ్జీలు కాదని నాకు తెలుసు!అది మీకూ తెలుసు,అవునా కదా?

   మీ బ్లాక్కు మీరే సుమన్. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. నా పేరు వచ్చింది కాబట్టి స్పందిస్తున్నాను.

   నేను నమ్మిన విషయంపై వాదిస్తానే తప్ప, ఎవరిపైనో ఎలాగైనా గెలవాలనే తాపత్రయంతో కాదు. కొన్ని విషయాల్లో మీ వాదననికూదా నేను సమర్థించినట్టు గుర్తు. నా వాదన నచ్చితే దారే పోయేవారు కూదా వచ్చి బాగుందని చెప్తారు. అలా కాకపోతే నేను ఎంత సొంత డబ్బా కొట్టుకున్నా ఎవరితోనూ అలా చేప్పించలేను.

   మరొక విషయం చెప్పదలుచుకున్నా. ఫలనా వాదనలో గెలిచామా ఓడామా అన్నది మనకు మనం డాబ్బా కొట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు!

   Delete
  6. శ్రీకాంత చారి సుత్తి వాదన తెలుగు బ్లాగర్లకు సుపరిచితం. అప్పట్లో తెలంగాణ సాకుతో అయన నోటికి అడ్డులేకపోయింది. ఎంతో సమయం వెచ్చించి ,ఇటువంటి జగమొండి ఘటాలను ఢీ కొనటానికి హరిబాబు రంగం లో దిగాడు. నిహారిక, ప్రవీణ్, శ్రీకాంతచారి బాచ్ అడ్డుగోలు వాదనచేసేవారికి, హరిబాబు ను చూస్తే విసుగెత్తుతున్నాది.

   Delete
  7. మరో ఇద్దరిని మరిచి పోయారా?

   Delete
  8. శ్రీకాంత్ చారి గారి బేచ్ లో నన్ను కలిపినందుకు సంతోషం గా ఉంది.అర్ధవంతమైన చర్చలు చదివే అవకాశం కలుగుతున్నందుకు ఆయనకు కొండలరావు గారికి హరిబాబు గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.

   Delete
  9. This comment has been removed by the author.

   Delete
  10. శ్రీకాంత్ చారి,
   నా బ్లాగుకి నేను సుమన్ యెప్పుదూ కాదు!

   దైవదత్తమయిన అంశాల గురించిన చర్చలో నేను బెంజీను రింగును విశ్లేషించిన శాస్త్రజ్ఞుడు స్వయంగా నాకు కలలో కనబడిన మోదల్ని అనుసరించాను అని యెక్కడ చెప్పాడో తెలుసా?

   ఒక శాస్త్రజ్ఞుడు తన పరిశోధనని తనకి తనే డప్పు కొట్టుకోడు.ప్రతి పరిశోధననీ ఒక డాక్యుమెంటుగా ఒక ప్యానేల్ ముందు పెదతారు.ఆ ప్యానెల్ శాస్త్రజ్ఞుల సమూహం!దానిమీద ప్రశ్నలు వేస్తారు.ఒక సెమినార్ కూడా ఇవ్వాల్సి ఉండొచ్చు కొన్ని సందర్భాలలో!వారిముందు చెప్పిన విషయం అది.నేను దాన్ని సాక్ష్యంగా చూపిస్తే నువ్వు అతని దైరీ చదివినట్టు ముందురోజు నోటుబుక్కులో రాసుకుని ఉండొచ్చు(?!) అని నీ సొంత కల్పనలతో వాదించావు,గుర్తుందా?ఆ నోటుబుక్కు ఉంటే అతను దాన్ని కూడా వారిముందు పెదతాడు,దానిమీదా ప్రశ్నలు వేస్తారు,అతను వాటికీ సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.యెక్కడ యే పరిశోధన గుర్తించబడినా ఆ గుర్తించడానికి చేసే ప్రక్రియలో తను చెప్పిన విషయం అది!నిరూపించబడిన వాస్తవాన్ని నేను చెప్పి వాదిస్తే ఆధారం లేని నీ సొంత వూహల్తో నువ్వు వాదించావు,యేది శాస్త్రీయమైన వాదనా పద్ధతి?

   బెంజీను రింగు చాలా చిన్నవిషయం,అది పోనీ!నీకు ఇచ్చిన మరో ఉదాహరణ మెదడు పనిచేసే పధ్ధతికి సంబంధించిన సంక్లిష్టమైన ఉదాహరణ!కప్పలని ఎలా ద్రావనంలో ఉంచాలి,ఎలక్ట్రోడ్లని యెలా ఆటాచ్ చెయ్యాలి,యానోడుని దేనికి కలపాలి.క్యాధోడుని దేనికి కలపాలి అనే ఒక పూర్తి స్థాయి ప్రయోగాన్ని తను కలలో చూసింది చూసినట్టు చేశానని అతనే ఒప్పుకున్నాడు.ఆ పుస్తక రచయిత స్వయంగా ఆ సైన్సులో మంచి పరిజ్ఞామ ఉన్న వ్యక్తి!ఆ ప్రయోగం ఆ సబ్జెక్టు యొక్క చరిత్రలో అత్యంత కీలకమైనది.ఆ శాస్త్రజ్ఞుడు కూడా సాటి శాస్తర్జ్ఞుల ముందు తను తనకి కలలో కంబడిందని చెప్తే ఒప్పుకున్నారు.ఆ కల రాకుండా ఆ ప్రయోగం అలా చెయ్యాలనేది అతనికి తట్టే అవకాశం లేకపోవడం కూడా పచ్చి నిజం!

   అంగీకరించబడిన వాస్తవాలతో నేను వాదించాను!నీ స్వకపోల కల్పిత వాదనలతో నువ్వు రెచ్చిపోయావు!

   Delete
  11. హరిబాబు

   మీ వాదనకి అక్కడే సమాధానాలు ఇవ్వబడినవి. కావాలంటే మళ్ళీ అక్కడే మీ వాదాన్ని వినిపించండి. కేవలం ఉత్తిపుణ్యానికి నా పేరెత్తారు కాబట్టే నేను సమాధానం చెప్పాల్సి వచ్చింది. బావిలో కప్ప కూడా తన్ను మించినవారు లేరనుకుంటుంది! అదీ వాస్తవమే... బావి పరిథి వరకు!! మళ్ళీ చెప్తున్నాను, మీ బావికి మీరే సుమన్. ఎంతైనా స్వోత్కర్ష చేసుకోండి, ఫరవా లేదు!

   స్వస్తి.

   Delete
  12. జవాబులు చెప్పావు,చెప్పలేదని అనలేదు!కానీ ఆ రకం జవాబులు కరెక్టా!చూదు అక్కద నీకు నువ్వే నేఅను గెలిచాను అని దప్పు ఒత్టుకున్నావు!క్నదల రావు కర్రా విరక్కుండా పామూ చావ్కుండా "నేను అన్నీ చదువుతాను,తర్వాత నా అభీప్రాయం చెప్తాను" అని ఆపేశాడు,సైన్సు గురించి తెలిసిన వాళ్ళు గానేఎ,నేను చెప్పిన విసహయాల్ని అర్ధం చేసుకోగలిగిన వాళ్ళు జడ్జి చెయ్యాలి గానేఎ కొందల రావుకి యేమి తెలుస్తుంది?కాబట్టి చర్చ అకడ్తో ఆగిపోయింది!మళ్ళీ మొదలెట్టే ఓపిక నాకు లేదు.

   Delete
  13. ప్రజలో వాస్తవికంగా వాదించిందెవరు?నిజాలని సాక్ష్యంగా చూపించినా నాకు "నేల విదిచి సాము చెయ్యటం" అంటగట్టి మోదరేషను కోసం అడిగిన పెత్తందారేఎ సుమన్ యెవరు?ఇక్కడ నేను బ్లాగు యజమానిగా మొండిగా యేమైనా మాట్లాడుతున్నానా?

   Delete

 4. Chess - Innovation from India to the world.

  Chess History
  http://www.uschess.org/content/view/7326/28/

  ReplyDelete
 5. well written post. the narrow minded sub regional satraps are inflicting irreparable damage to the telugu people. even though your views are balanced, i want to see an unbiased critique on the casteist agenda of the present ap rulers.

  ReplyDelete
 6. at last i got a comment related to this post,thank you sir!the casteist agenda is so complicated that I can't simplify inro a single post.But i will try.

  ReplyDelete
 7. ప్రజ చర్చల కోసం ఏర్పాటుచేసారు.

  వాదన వేరు చర్చ వేరు.
  వాదన మనిషి స్వభావాన్ని తెలియచేస్తే చర్చ బుద్ధి కుశలతని తెలుపుతుంది.
  వాదన చేసే పద్ధతి ఒక వ్యక్తి పెరిగిన వాతావరణాన్ని తెలియజేస్తుంది.
  వాదనలో అజ్ఞానాన్నీ చర్చలో జ్ఞానాన్నీ మారకం చేసుకుంటాం.

  కొండలరావు గారు ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు.

  చర్చించేటపుడు "నాకు ఇలా అనిపిస్తోంది","నేను పొరపడి ఉండవచ్చు"వంటి పదాలు వాడతారు.
  వాదనలలో "మీరెందుకు అలా అనుకుంటున్నారు ? ""కాస్త వివరంగా చెప్పగలరా ?" అని అడుగుతారు.
  ఇవేవీ పనిచెయ్యకపోతే "నేను మీతో ఏకీభవించలేను" అని మర్యాదగా సున్నితంగా చెపుతారు.

  ఇవన్నీ ఎందుకు చెపుతున్నానంటే మీరు గెలిచే వాదనల సంఖ్య పెరిగే కొద్దీ మీకున్న స్నేహితుల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోగలరని ఆశ!

  ReplyDelete
  Replies
  1. బ్లాగులో జరిగేవన్ని 99%వాదనలే. వ్యక్తిగతం గా ఏ మాత్రం తెలియని వారు, ఇతరులు రాసినదానిని వాదన గా నే పరిగణనిస్తారు గాని చర్చలు గా పరిగణించరు. బుద్ది కుశలతను మెచ్చుకొనే మూడ్ లో ఉండరు. బుద్ధి కుశలత ఉన్నవారు ఇతరులు చెప్పే మంచి పాయింట్ ను అంగీకరించాలి. అది బ్లాగులో ఎక్కడా చూడం.

   Delete
 8. మూరెడు మల్లెపూలు 20 రూపాయలయితే ఎకరం మల్లెతోటకి ఎన్ని రూపాయలొస్తాయి ? 5 నుండి 10 మంది కలిసి ఒక ఎకరాన్ని సాగుచేస్తారని చెప్పారు. పొలం అమ్మాలనే ఉద్దేశ్యం లేనపుడు ఎకరం కోటి రూపాయలు చెపుతారు.పవన్ అన్న ,మోడీ బాబాయ్ ఇద్దరూ ఇద్దరే !(September born) రాష్ట్రానికో,దేశానికో ఉపయోగపడే పనిచేస్తారేమో అని ఎదురుచూడడమే !

  ReplyDelete
  Replies
  1. మొడి గురించి మీ ఫీడ్ బాక్ ఎవరికి కావాలి? బార్ గర్ల్ ను ఇంటికి పంపిటం, భారత ప్రజలకు మోడి చేసిన గొప్పసేవ. అది కూడా అట్లా ఇట్లా కాదు. మళ్ళి లేవలేనంత గా చావు దెబ్బకొట్టాడు. ఆయనను, ఈ దేశ ప్రజలు రాబోయే వెయ్యేళ్ళ కు పైగా గుర్తుంచుకొంటారు

   Delete
  2. ఒక మహిళమీద గెలుపుని వెయ్యేళ్ళు గుర్తుంచుకుంటారన్న మాట ! అదే మగవాడిని తిరిగి దెబ్బ కొడితే ఎన్నేళ్ళు గుర్తుంచుకోవాలో ఆలోచించుకోండి !

   Delete
  3. ఆడ -మగ అని రిజర్వేషన్ ఏల ... అంతా సమానం అని కామెంటితే!!

   Delete
 9. కుట్ర కుట్ర హరిబాబుని గుంపులో కలిపేసుకోవాలనే కుట్ర జరుగుతోంది :)

  ReplyDelete
  Replies
  1. హరిబాబుగారు మా గుంపులో చేరకుండా చూసుకోవలిసిన బాధ్యత మీదే !
   మీదంతా రాముడి బేచ్..మాది సీత బేచ్ !

   Delete
  2. సీత బాచ్ కాదు సుత్తి బాచ్. ప్రవీణ్ గూగుల్ ప్లస్ అకౌంట్ లో గాని బ్లాగులో గాని, ఒక్కడైనా వ్యాఖ్య రాసినట్లు చూశారా? ఆయన ఖ్యాతి దశ దిశల వ్యాపించి పోయింది. పైగా పోటొ పెట్టుకొని రాస్తాడు. ఆయన వ్యాఖ్యలు చదివితే, ఎవరైనా పిల్లనిచ్చే వారుకూడా వెనక్కి వెళ్ళతారు. అది మీ రిపుటేషన్. ఇటువంటి బాచ్ ని చేరదీసి పెంచుపోషించే కొండల రావు కి వీళ్లందరి కన్నా ఎక్కువ తిక్క ఉండాలి. కాని పైకి కనపడనీయడు. దివి నుండి భువికి దిగిన దీనజనోద్దరుడైనట్లు, సమాజం, పేదలు, హక్కులు పదాల ముసుగులో పిచ్చి ని దాచుకొంటాడు.

   Delete
  3. గుంపులో చేరాలో వద్దో తేల్చుకోవలసినవాడు హరిబాబు, గుంపులో చేరిపోతే హరిబాబు హీరో అవడు జీరో అవుతాడు :) జీరో చెయ్యలనేదే కుట్ర :)

   Delete
  4. సీతది సుత్తి కొడవలి బేచ్...
   అజ్ఞాతలది నక్సలైట్,ఉగ్రవాదుల బేచ్....
   నక్సలైట్లనూ,ఉగ్రవాదులనూ ఆదరించేది సుత్తీ కొడవలే కదా ?
   మళ్ళీ ధన్యవాదాలు !

   Delete
  5. సీత .... సుత్తి కొడవలి ... అడవుల్లో తిరిగిందనా!!

   ఏమో గాని మరి మీరేంటి ప్రతి బ్లాగులో నీ.....నీ... హారిక అని సొంతమై పోతావు !! సీత లక్షణం ఇది కదే .... రాములోరి వెంట నీ ... నీ... శూర్పనఖ అని వెంటపడ్డది సీత కాదు సూర్పనఖ.
   కనుక నీది సుత్తి కొడవలి బాచ్ ఏమో గాని సీత ది కాదు.

   Delete
  6. 6000 కి పైగా ఉన్న తెలుగుబ్లాగుల్లో నేను కమెంటేది 6 బ్లాగులు కూడా ఉండవు. అందరినీ సొంతం చేసుకుంటున్నానా ? ఊహే ఎంత అందంగా ఉంది ? నిజమైతే ఎంత కమ్మదనమో ?

   సీతది సుత్తి కొడవలి బేచ్ కాకపోతే రాముడు వదిలేయడంలో తప్పులేదు, ఎంత మిధిలానగరపు రాకుమారి అయినా కష్టపడటానికి ఇష్టపడకపోతే విడాకులు తప్పవు కదా ?

   Delete
  7. సొంతం అవ్వడానికి సొంతం చేసుకోవడానికి తేడా ఉంది .... అదే సీత కి శూర్పనఖ కి తేడా ...
   కమ్మదానం(పాలమొఇరు జిల్ల లో ఒక చిన్న గ్రామం) నర్సిం హ

   Delete
  8. ఎవర్నిబడితే వాళ్ళని సొంతం చేసుకోడానికి కుదరదండీ ! అదే రామాయణం !
   నాకు సీతయినా శూర్పణఖ అయినా మండోదరి అయినా ఒక్కటే !ప్రతి కేరక్టర్ లో గొప్పదనం కనబడుతుంది.

   Delete
 10. ఛెద పురుగుల లక్షణం ఆశ్రయమివ్చిన చెట్టుని నాశనం చేయడం.
  ఆ చెద పురుగులే చీదరించుకునే కమ్మీల తో చర్చ దానికి మీ అడ్వర్టైస్మెంటు ... ప్రజ లో ఆ కామెంటు ఈ టాపిక్కు అని ....
  ఎవ్వరి వీలుని బట్టి వారు అలా సమయాన్ని గడుపుతారు ....మీరు ఇలా కానియ్యండి ....
  :)
  People come online just to say but never listen .... !!
  That too commies never expect them to understand your points in any discussion ....

  ReplyDelete
 11. సీతెప్పుడూ రాముడి బేచే,సీత కి వేరే బేచ్ ఉండదు :). సీత పేరుచెప్పి హరిబాబుని పడెయ్యాలనేగా కుట్ర.

  ReplyDelete
  Replies
  1. హరిబాబు గారేమైనా రావణాసురుడా ఈజీగా పడిపోడానికి ?
   నేను పడెయ్యాలనుకున్నా బంగారం ఒప్పుకోవద్దూ ?

   Delete
  2. నేను పడెయ్యాలనుకున్నా బంగారం ఒప్పుకోవద్దూ ?
   ??
   మా బంగారం దాకా యెందుకులే నేనే చెప్తా విను!
   అసలు నేనే పడను గాక పడను,మాధవీ చరణ చారణ చక్రవర్తిని?!

   Delete
  3. మీ బంగారం గురించి ఎవరడిగారు ? మా ఆయనా బంగారమే !

   Delete
  4. అంటే మీ ఇద్దరూ బంగారం కాదా?

   Delete
  5. మీ ఆయన బంగారమేమిటి? అయితె గీతే ఆయన మహాత్ముడన్నా అయ్యుండాలి లేక నీ దెబ్బకు ఏళ్లు పూళ్లుకోలుకోలేని అభాగ్యుడన్నా అయ్యుండాలి.

   Delete
 12. హరిబాబు గారూ, సుదీర్ఘమయిన వ్యాసం! షరా మామూలుగా మీ రచనా వేగం & విశాలమయిన wide canvas దృష్ట్యా పూర్తిగా అర్ధం చేసుకోవడం కష్టం అయింది.

  చాంతాడంత వ్యాఖ్య రాయకుండా ఒకటిరెండు విషయాలు మాత్రమె ప్రస్తావిస్తాను.

  1. మీరు ప్రస్తావించిన వారు అందరూ సమానం కాదు. ఉ. కళింగ కేక అనే బ్లాగు ఒక వ్యక్తి అభిప్రాయాన్ని మాత్రమె సూచిస్తుంది, వాటికి బహుళ జనాదరణ ఉందని అనుకోలేము. వివిధ వ్యక్తుల/సంస్థల ఆలోచనలను సమానంగా చూడకపోవడమే ఉత్తమం. It may be better to focus energy on those forces whose impact is high instead of considering everyone equally.

  2. భూసేకరణ చట్టంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఎక్స్పైర్ అయింది కనుక ఇప్పుడు చెల్లదు. 2013 చట్టం ప్రకారం భూమిని తీసుకోవడం ఆంద్ర ప్రభుత్వానికి అంగీకారం లేదు. అంచేత ప్రస్తుతానికి (పవన్ కళ్యాణ్ అదృష్టం కొద్దీ) ఈ అంశం మరగున పడ్డట్టే.

  ReplyDelete
 13. @jai
  కళింగ కేక అనే బ్లాగు ఒక వ్యక్తి అభిప్రాయాన్ని మాత్రమె సూచిస్తుంది, వాటికి బహుళ జనాదరణ ఉందని అనుకోలేము.

  ans:నేను కూడా అంతకన్నా యెక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదుగా!ఇటువంటి ధోరణులు తప్పు అని మాత్రమే చెప్పాను.వారు ఒకనాడెప్పుడో వారి ప్రాంతానికి చెదిన గజపతుల్ని ఓడించిన ఒకనాటి మరో ప్రాంతానికి చెందిన రాజు గురించి అలా మాట్లాడ్డితే ఆ ధోరణి పెరిగితే ఇవ్వాళ అదే గజపతుల యుధ్ధం మూలంగా ఓడిపోయిన మరో ప్రాంతపు వ్యక్తులు గజపతుల మీద కూడా అదే విధంగా మాట్లాడే అవకాశం ఉంది అని హెచ్చరిచి వొద్లేశాను,అంతే కదా!

  ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు