Thursday, 10 September 2015

అలెగ్జాండరు పురుషోత్తముణ్ణి గెలిచాడనేది నిజమా!ఈ దేశపు నిజమైన చరిత్ర దేన్ని నిర్ధారిస్తుంది?

     మనం చిన్నప్పుడు మన పాఠ్యపుస్తకాలలో చదువుకున్న చరిత్ర ప్రకారం క్రీ.పూ326లో మాసిడోనియా ప్రభువైన అలెగ్జాండరు ఇప్పటి పంజాబు రాష్త్రంలోని జీలం నది వొడ్డున పురుషోత్తముడ్ని ఓడించాడనీ,కానీ ఓడిపోయినా పురుషోత్తముడి పరాక్రమానికి మెచ్చి గొప్ప ఔదార్యం గల నీతిమంతుడిగా అలెగ్జాండరు అతని రాజ్యం అతనికి తిరిగి ఇచ్చివేశాడనీ ఇప్పటికీ మనందరం యెంతో అమాయకంగా నమ్ముతున్నాము!ఈ అలెగ్జాండరు దండయాత్ర భారతదేశపు చరిత్రలో అతి ముఖ్యమైనదిగా కూడా మన చరిత్రకారులు వర్ణించారు!కానీ భారతదేశంలో కూడా అంతకు ముందే మహాజనపదాల పేరుతో 18 విస్తారమైన సామ్రాజ్యాలు ఉన్నాయి.ప్రతి సామ్రాజ్యంలోనూ తమ ప్రభువు యొక్క విజయ పరంపరలని గానం చెస్తూ కావ్యాలు రాయడం జరిగింది.ప్రతి రాజ్యానికీ తన సొంత కరెన్సీ ఉండేది.చరిత్ర రచన శిలా శాసనాల రూపంలో కూడా చేశారు.కానీ ఇప్పుడు మనం ఇంత ప్రముఖమైనదిగా చదువుకుంటున్న సంఘటన గురించి అసలు యే ప్రస్తావనా లేదు,యెందుకని?మన పురాణాలు 18 కావటం కాకతాళీయం కాదు,ఆ పురాణాలాలో ఆధ్యాత్మిక విషయాలు లేవు,ఆ పురాణాలలో ఆయా రాజవంశాల చరిత్ర రచించబడింది!

అలెగ్జాండరు యొక్క విజయయాత్ర

     అలెగ్జాండరు పురుషోత్తముల మధ్యన జరిగిన యుధ్ధానికి సంబంధించి మనం చదివిన విషయాలకు ఆధారాలు గ్రీకుల చరిత్రలో కన్నా ఆంగ్లేయులైన ఆధునిక చరిత్రకారుల ఉల్లేఖనాల నుంచే లభిస్తున్నది - కారణం యేమిటి?భారతదేశపు ప్రాచీన చరిత్రలో అలెగ్జాండరుని పురుషోత్తముడు ఓడించాడని చెప్పబడింది,గ్రీకు చరిత్రలో అలెగ్జాండరు పురుషోత్తముణ్ణి ఓడించాని చెప్పబడింది!గ్రీసు దేశపు చరిత్రకారులు ఒక గ్రీకు ప్రభువు విదేశీ రాజు చేతిలో ఓడిపోయాని రాసుకుంటారా,గ్రీకు ప్రభువు ఇతర్లని జయించాని రాసుకుంటారా?భారత దేశపు చరిత్రకారులు ఒక భారత ప్రభువు విదేశీ రాజు చేతిలో ఓడిపోయాని రాసుకుంటారా,భారత ప్రభువు ఇతర్లని జయించాని రాసుకుంటారా?బ్రిటిష్ చరిత్రకారులు మాత్రమే ఇతన్ని విశ్వవిజేతగా నిలబెట్టాలని చూశారు!గ్రీకుల వైపు నుంచి అలెగ్జాండరు తప్ప ఇంకెవరూ భారతదేశాన్ని గెలవాలనే ఉద్దేశంలో లేరు,వారి ముఖ్యశత్రువు పర్షియా - దాన్ని గెలిచారు,అందుకే ఇక ముందుకు వెళ్ళడానికి వ్యతిరేకించారు.!బ్రిటిషు చరిత్రకారుల కల్పనాత్మకపు విశ్లేషణయే తప్ప అలెగ్జాండరుకి సైతం ప్రపంచవిజేత కావాలనే కోరిక ఉన్నదనే గట్టి సాక్ష్యాలు లేవు.

     ఆ కాలంలో పురుషోత్తముడి రాజ్యం చాలా చిన్నది,భౌగోళికంగా విదేశీయులు భారతదేశానికి ప్రవేశించే కీలకమైన చోట ఉన్నది,అంతే!ఈ పురుషోత్తముడి గురించి ప్రముఖ రాజవంశాల చరిత్రలలో గానీ ఇతర ప్రస్తావనలలో గానీ పేర్కొన లేదు.మహా జనపదాలకి ఉన్న అనేకానేక సామంత రాజ్యాల మాదిరిగానే యేదో ఒక రాజ్యానికి సామంతుడై ఉండవచ్చు,ఈ యుధ్ధం ప్రస్తావనలో మాత్రమే ఇతని పేరు కనబడుతున్నది!మనం చదువుకుంటున్న ఇవ్వాళ్తి చరిత్రకారులు చెప్తున్నట్టు భారతదేశపు చరిత్రలో కల్లా అతి ముఖ్యమైన సంఘటన కూడా కాదు ఆనాటి వాళ్ళకి,ఈ యుధ్ధంలో అలెగ్జాండరు పురుషోత్తముడి చేతిలో ఓడిపోవటమే భారతదేశపు చరిత్రలో ప్రముఖంగా పేర్కొనబడక పోవటానికి కారణం - అప్రధానమైన విషయాలు చరిత్ర రచనలోకి యెక్కిస్తారా యెవరైనా?వచ్చాడు,ఓడాడు,వెళ్ళాడు - అంతకన్నా అధ్భుతం జరగలేదు!

     యుధ్ధంలో పురుషోత్తముడే గెలిచాడనేటందుకు తటస్థులు కొందరు ఉదహరించిన చారిత్రక వాస్తవాల కన్నా ముందుగా ఇప్పుడు ప్రచారంలో ఉన్న కధలోని వైరుధ్యాలని చూపిస్తాను.పురుషోత్తముణ్ణి ఓడించి ఆ రాజ్యాన్ని తనకి ఇవ్వమని అలెగ్జాండరుతో ఒప్పందం కుదుర్చుకున్న తక్షశిల రాజు అంభి మీకు గుర్తున్నాడనుకుంటాను!సహజంగా అలెగ్జాండరుతో విజయయాత్రకి బయలుదేరిన ఇతరులు ప్రాధమిక లక్ష్యమైన పర్షియా మీద గెలుపుతో వెనక్కి తిరగాలని అనుకోవటం వల్ల అలెగ్జాండరు కూడా ఇక వెనకి వెళ్ళిపోయే వాడో యేమో గానీ అంభితో ఒప్పందం ఖరారు చేసుకోవడం వల్లనే అతను పురుషోత్తముడి రాజ్యం మీదకి వచ్చాని స్పష్తంగా తెలుస్తున్నది గదా!మరి,గెలిచాక పురుషోత్తముడు యెంత వీరోచితంగా పోరాడినా అంభితో తను చేసుకున్న ఒప్పందాన్ని భగ్నం చేసేటంత అమర్యాదకరమైన పని యెందుకు చేస్తాడు?ఇక్కడ ఇంకో క్యామెడీ కూడా ఉంది!యుధ్ధం తర్వాత పురుషోత్తముడికి తన సొంత రాజ్యం మాత్రమే దక్కలేదు,అంబి రాజ్యం కూడా కలిసింది - యేమి వింత?గొప్ప పధకం వేసి నది దాటి చుట్టు తిరిగి వచ్చి వెనకనుంచి దాడి చేసి యుధ్ధంలో గెలిచిన వాడు తన చేతిలో ఓడిపోయిన వాడికి  తను యేవరితోనైతే గెలిచాక పురుషోత్తముడి రాజ్యాన్ని ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడో ఆ రాజ్యాన్ని కూడా ఓడిపోయిన రాజుకి దఖలు పర్చేశాడట!

     Marshal Gregory Zhukov అనే రష్యన్ యుధ్ధనీతి విశారధుడు ఈ యుధ్ధాన్ని గురించి ప్రస్తావిస్తూ అలెగ్జాండరు నేతృత్వంలో మాసిడోనియన్లు భరతఖండంలో జరిగిన యుధ్ధంలో దారుణంగా పరాజితులయ్యారని ప్రస్తావించాడు!Following Alexander’s failure to gain a position in India and the defeat of his successor Seleucus Nikator, relationships between the Indians and the Greeks and the Romans later, was mainly through trade and diplomacy. Also the Greeks and other ancient peoples did not see themselves as in any way superior, only different.” - ఇదీ అతను నిష్కర్షగా తేల్చి చెప్పిన విషయం, ఇంకా అనుమానంగా ఉందా?అలెగ్జాండరు యుధ్ధంలో ఓడిపోతేనే అంబి రాజ్యాన్ని కూడా పురుషోత్తముడికే దఖలు పర్చడం తార్కికంగా సరయినది అవుతుంది!ఆ యుధ్ధంలో తగిలిన గాయాలతోనూ ఆ ఓటమి వల్ల కలిగిన మనోవ్యధతోనూ మరణించడం జరిగిందనేది యదార్ధంగా తోస్తున్నది!యెన్ని అబధ్ధాలు?యెంత కపటం?అంతా వక్రీకరణలూ పులుముడు వ్యాఖ్యానాలూ!

     ఈ మొత్తం కట్టుకధలో ప్రస్తావించబడిన నలుగురు వ్యక్తుల కాలాలు ఇలా ఉన్నాయి:సాండ్రకోట్టస్ పేరుతో మగధ రాజుని వ్యవహరించారు.మన దేశపు చరిత్రలో చంద్రగుప్తుడనే పేరుతో ఇద్దరు ఉన్నారు.వారిలో ఒకరు క్రీ.శ 320లో జీవించి ఉండి భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగాన్ని సృష్టించినదిగా వర్ణించబడిన గుప్తవంశ స్థాపకుడైన గుప్తవంశపు చక్రవర్తి.మరొకరు క్రీ.పూ320లో మౌర్యసామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుడు.దండయాత్ర జరిగిందని చెప్పబడుతున్న క్రీ.పూ 326లో మగధను పాలిస్తున్నది నందవంశం!ఈ ఇద్దరు చంద్రగుప్తులలో యే ఒక్కరికీ ఆ యుధ్ధంతో సంబంధమే లేదు!అలెగ్జాండరూ ఇద్దరు చంద్రగుప్తులూ కాకుండా ఆ కధలో వినబడుతున్న మరొక వ్యక్తి సెల్యూకస్ నికటోర్ - అలెగ్జాండరు సైన్యాధిపతులలో ఒకడు!పురుషోత్తముణ్ణీ గెలిచిన అలెగ్జాండరు ఇతన్ని తన ప్రతినిధిగా నియమించాని చెప్పారు,కానీ అలెగ్జాంరు తర్వాత బాబిలోనియాతో కలిపి అలెగ్జాంరు రాజ్యాన్ని పరిపాలించి క్రీ.పూ305 నుంచి క్రీ.పూ300 వరకూ రెండు సంవత్సరాల పాటు అప్పుడు మగధ ప్రభువైన మౌర్య చంద్రగుప్తుడితో పోరాడి ఓడిపోయి తన కూతురు హెలీనాని ఇచ్చి వివాహం చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు!ఈ నలుగురికీ సంబంధించి ఇప్పటి చరిత్రలో ఉన్న గందరగోళాన్ని పోగొట్టుకోవాలంటే విశ్వనాధ సత్యనారాయణ కూర్చిన పురాణ వైర గ్రంధమాల వరుస కధల్లోని చంద్రగుప్తుని స్వప్నం అనే ఐదవ కధనీ హెలీనా అనే పదవ కధనీ చదివి తీరాలి!

     నిజానికి కమ్యునిష్టు పైత్యకారులు విశ్వనాధకి కాలాన్ని వెనక్కి తిప్పాలనుకున్న దురద అంటగట్టినా కొత్త కొత్త సాహితీరూపాలలో తన ప్రతిభ చూపించడంలో మిగతా రచయితల కన్నా చాలా ముందు నడిచాడు!ఆయన వచన రచనలన్నీ సరళ గ్రాంధికంలోనే ఉంటాయి,అయినా పాషాణ పాక ప్రభువని పేరు వచ్చింది!పద్యాలు మాత్రం కొంచెం ముందువెనుకలు సరిచూసుకుని చదివితే తప్ప అర్ధం కావు - పద్యాల్లో Colloquial Tongue వాడాడు మరి!ఇక కిన్నెరసాని పాటలు యెంత లలితంగా ఉంటాయో చదివితే తెలుస్తుంది.శ్రీశ్రీ కాబోలు తెలుగు సాహిత్యమంతా తగలబడిపోయి ఒక్క విశ్వనాధ సాహిత్యం మాత్రం మిగిలితే చాలు తెలుగువాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు అంటే వెటకారంగా అన్నాడేమో అనుకున్నా - కాదు నిజంగా మెచ్చుకోలుగానే చెప్పి ఉంటాడని పురాణవైరగ్రందమాల అన్ని భాగాలూ చదివితే అనిపిస్తుంది!కధ కన్నా పీఠిక శ్రధ్ధగా చదవాలి!శ్రీశ్రీ తన సాహిత్యంలో చాలా చోట్ల విశ్వనాధని ప్రస్తావించినా అక్కడ వెటకారం కన్నా నాకు అంతర్లీనంగా గౌరవంతో కూడిన హాస్యధోరణి ఉందనిపిస్తుంది!

     పురాణవైరగ్రందమాల అంతా మగధ రాజవంశావళి అని చెప్పవచ్చు!ఒక్కో కధలో ఒక వంశంలోని చివరి రాజు అంతరించి మరొక అంశంలోని మొదటి రజు రాజ్యస్థాపన చెయ్యటం వర్ణిస్తాడు.మంచి రాజులూ చెడ్ద రాజులూ అని గుర్తు పట్టేటంత స్పష్టంగా రాజుల్లో ఉన్న రెండురకాల్నీ చూపిస్తూ పాత్రలని జీవమున్న వ్యక్తులుగా తీర్చిదిద్దాడు.భాష సరళ గ్రాంధికంలో ఉండి మామూలు తెలుగు చదవటం వచ్చిన ప్రతివాడికీ చక్కగా అర్ధమవుతుంది.కధాకధనం విషయాని కొస్తే కళ్ళు చెదిరే సంవిధానం కనబడుతుంది!ఆ రాజులూ సైన్యాధ్యక్షులూ యుద్ధం కోసం ఎలా పథకాలు వేశారు, సైన్యాన్ని ఎలా సమీకరించారు, అవతలి వారి వ్యూహాలని కనిపెట్టి వారికన్నా ముందుగా తాము ఎలా సంసిద్ధమయ్యారు– ఇలాంటివన్నీ మనం ఇపుడు యుద్దాలు చేయడం లేదు కాబట్టి అచ్చంగా అలాగే ఉపయోగించుకోలేక పోవచ్చును, కానీ ఒక అధికారి తన తోటివారితో, క్రిందివారితో, ప్రత్యర్థులతో, తనకి సహాయపడాలని వచ్చే సహృదయులతో, తనని దెబ్బతీయాలని వచ్చే వంచకులతో – ఎవరితో ఎలా మెలగాలో చక్కగా అర్థం చేసుకోగలిగే సన్నివేశాలూ ఉన్నాయి ఈ నవలల్లో. కొన్ని జీవితానుభవాన్ని రంగరించి చెప్పే అర్ధవంతమైన  కొటేషన్లు చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది!వాటిలో ఒకటి చెప్పుకుందాం.“.. ఈ ఆకాశమేమి? ఈ సముద్రమేమి? ఈ దిక్కులేమి? ఈ దేశములేమి? ఈ జనమందరు నిట్లు పుట్టుచుండుట యేమి? ఎవనికి వాడీ సృష్టి నంతయు యేదో తలక్రిందులు చేయుచున్నాననుకొనుట యేమి? వాడు తలక్రిందులు సేయుట యంతయు కలిపి ముప్పది నలుబది ఏండ్లు, కాదా యరువది ఏండ్లు. ఇంకను వీలు మిగిలినచో వంద ఏండ్లు. అంతకంటే మించి లేదు కదా! దాని కొరకు వాని యారాటమెంత? ఈ అనంత కాలములో వందేండ్లే సూక్ష్మాతి సూక్ష్మమైన కాలము. పాతికేండ్లు, పరక ఏండ్లు లోకము నానిపట్టికొని సంతోషించెడి వారి సంగతి నింక నేమి చెప్పవలయును? అందరును లోకమున కుపకారము చేయవలయుననెడి వారే. ఎవ్వడును తాను తరించెడి వాడు లేడు. ఇతరులను తరింప చేయవలయుననెడి వాడే. పెద్దలు లోక మజ్ఞాన దూషితమని చెప్పుదురు. ఆ యజ్ఞానము వేయివిధములుగా నుండవచ్చును. సర్వ విధములైన యజ్ఞానములలో మకుటాయమానమైన యజ్ఞానము పరులను తరింపజేయువలయునన్నది. అది నిజముగా లోకోపకార బుద్ధి కాదు. స్వోపకార బుద్ధి!ఇలాంటివి చదివినపుడు.. అరే, చిన్నప్పుడే ఈయన రచనలు చదవకుండా ఈ విషయాలన్నీ మనం జీవితంలో బోలెడంత సమయం వృథా చేసి కష్టపడి నేర్చుకున్నాం కదా అని దిగులేస్తుంటుంది నాకు. :) 

వేయిపడగల విశ్వనాధుడు తెలుగువాళ్ళ జ్ఞానపీఠం!

28 comments:

  1. ఒక్క పాఠం పాఠశాల లో పెట్టడానుకి ప్రయత్నించండి ...కాషాయీకరణ అని ఎర్రలొస్తారు ...వారుమాత్రం ఎర్ర రంగు నింపేశారు ...ఉదాహరణ:బొండుమల్లెలు 10 వ తరగతి తెలుగు వచన భాగం(పాత సిలబస్) .
    ఇలా ఎర్ర మరకలు తూడిస్తె సగం పాఠాలు తొలగించాల్సిందే!!
    ఇక చదివే అవకాశం ఎలా వస్తుంది!
    కొనబోతే కోఠీ లోని నవొదయ లో విశ్వనాధ సత్యనారాయణ గారి పుస్తకాలు దొరకలేదు! :(

    కాస్త పుస్తకాలు దిరికే చోటు సూచించ గలరు.

    ReplyDelete
    Replies
    1. కాస్త పుస్తకాలు దిరికే చోటు సూచించ గలరు.
      >>
      ఈ పుస్తకాలు ఇప్పుడు షాపుల్లో దొరకవండి,లైబ్రరీల్లో ప్రయత్నించండి!

      Delete
    2. https://www.facebook.com/nandyalsrinivas.reddy/posts/1053006581418545

      Delete
  2. ఈ విడియో చాలా ఏళ్ల క్రితం చూశాను. మీరు రాసింది చదివిన తరువాత నెట్ లో వెతికి ఇస్తున్నాను. పాకిస్తాన్ మేధావుల చర్చ కూడా మీ వాదనకు అనుకూలంగా ఉంది.

    https://www.youtube.com/watch?v=LMXsn9GFoa4


    SriRam

    ReplyDelete

  3. హరిబాబుగారూ
    కామెంట్ రాయకుండా ఉండలేకపోతున్నాను.
    బ్రిటిష్ వారి భావదాసులు, కమ్యూనిస్ట్ భాజాలాధిపతులు కలసి దేశ చరిత్రని ఎంతగా వక్రీకరించారంటే
    1. 1857 ప్రథమస్వాతంత్ర్య సంగ్రామాన్ని స్వతంత్రం తరవాత కూడా సిపాయిల తిరుగుబాటుగానే చరిత్ర పుస్తకాలలో మనమంతా చదువుకునేటంతగా.
    2.సరస్వతీ నది అన్నది పుక్కిటి పురాణమని కొట్టిపారేసేటంతగా, నాసా సరస్వతి నది పుట్టుపూర్వోత్తరాలు పారిన ప్రదేశం చెబుతున్నా వినిపించుకోలేనంతగా.
    3.బాబరు హిందువుల పుఱ్ఱెలను గుట్టగాపోస్తే ’బాబరు చక్రవర్తి’ మతసామరస్యం చూపేడన్నంతగా.
    4.ఔరంగజేబు పరిపాలనను పొగిడేటంతగా
    5.నేటికి కోహినూర్ వజ్రం చోరీ సొత్తు బ్రిటిష్ రాని కిరీటం లో ఉన్నదని ప్రజలకు తెలినీయనంతగా..
    ఎన్నని చెప్పను ఎంతని చెప్పను.......ఉన్నదంతా వక్రీకరణే.

    ReplyDelete
  4. హైదరాబాద్ నవాబు హిందూ ఆడపిల్ల వ్యక్తురాలైతే పన్ను వసూలు చేశాడు, దీనిని రొమ్ము పన్ను అనేవారు, ఈ పన్ను గురించి చరిత్రకి ఎందుకు ఎక్కించలేకపోయారో?

    భారతీయ నౌకాదళం తిరుగుబాటు గురించి చరిత్రలో కనపడదేం?

    ReplyDelete
    Replies
    1. అదేమిటండి మీరిలా అంట్టున్నారు. రొమ్ము పన్నువేస్తే తెలంగాణ పులులు తిరగబడలేదా? వాళ్ల నైజాం నవాబు బెస్ట్ అని చెప్పుకొంటారు గదా!

      Delete
    2. నాటి కాలంలో కాళోజీ,దాశరథి మొదలైనవారు తిరగబడే ”నీ గోరీ కడతం కొడకో నైజాము సర్కరోడా” అన్నారు, నాటి కాలంలో కాగితం పులులు అప్పుడులేవు కదండీ...

      Delete
    3. ఉషా డాని అనే రచయిత, ఆంధ్రజ్యోతి పేపర్లో "నీ గోరీ కడతం కొడకో నైజాము సర్కరోడా” గద్దర్ ని ముస్లిం లు క్షమించరు అని రాశాడు.

      Delete
    4. @sarma:

      1940 బడ్జెట్ ప్రకారం నిజాం ప్రభుత్వం సాంవత్సరిక ఆదాయం 9 కోట్లు. ఇందులో భూమి శిస్తు, అమ్మకం పన్ను, అబ్కారీ & రైల్వే 7.5 కోట్లు కాగా మిగిలన 1.5 కోట్లు అడవులు, తంతి తపాలా, రిజిస్ట్రేషన్, పెట్రోల్ సర్చార్జీ వగైరాల నుండి వచ్చేది.

      మీరు చెప్తున్న పన్ను కానీ అటువంటి ఇతర శిస్తులు (బడి పన్ను/శవం పన్ను వగైరా) ఏవీ రాష్ట్ర ప్రభుత్వం విధించలేదు. కొందరు స్థానిక భూస్వాములు తమ తమ ఇలాకాలలో ఇష్టం వచ్చినట్టు వసూళ్లు చేయడమే కాక వెట్టి చాకిరి & ఉచిత సేవ కూడా చేయించుకునే వారు. కేవలం 19 మంది భూస్వాములు సాలీనా 5.5 కోట్లు "పన్నుల" రూపంలో వసూలు చేసేవారు. మరో 90 భూస్వాములు ఏడాదికి 4.5 కోట్లు దండుకునేవారు. ఈ ధనంలో దమ్మిడీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళేది కాదు.

      నిజాం ఇటువంటి 82 రకాల అక్రమ పన్నులను నిషేదిస్తూ జారీ చేసిన ఫర్మానా వెట్టి నిషేద ఫర్మానాకు మల్లె ఆచరణకు నోచుకోలేదు.

      "బండెనక బండి కట్టి" అనే పాత రాసిన అజ్ఞాత కవి ఎవరో కానీ ఖచ్చితంగా కాళోజీ దాశరధి గార్లు కాదు. సాయుధ పోరాట సమయంలో "ఎ బండ్లె వస్తవు కొడుకో నా కొడుక ప్రతాప్ రెడ్డి" అంటూ స్థానిక భూస్వామి (ఉ. జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి) పేర్లతో పాడేవారు. ఇటీవల కాలంలో మాభూమి సినిమా కోసం ఈ వాక్యాన్ని మార్చడమే కాక మరో చరణం (సుట్టుముట్టు సూర్యాపేట, నట్ట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు, దాని పక్క గోలుకొండ, గోలుకొండ ఖిల్లా కింద నీ గోరి కడతం కొడుకో నైజాము సర్కరోడా) చేర్చారు.

      చివరిగా పైని చెప్పినవన్నీ 30% భూమికి సంబందించిన జాగీర్దారీలలో అందునా 3 జిల్లాలలకు (కరీం నగర్, వరంగల్ & నల్గొండ) మాత్రమె పరిమితం. మిగిలిన 13 జిల్లాలలో & దివానీ వ్యవస్తలోని భూములలో పరిస్తితి చాలా మెరుగు.

      Delete
    5. @జై, మీ తెలంగాణ చరిత్ర ఇంకా ఆంధ్రావారికి ఎందుకు కావాలి? మీకు కోపమొచ్చినపుడు నైజాంను తిట్టుకొంట్టూ పాటలు రాసుకొన్నారు. ఇప్పుడు ఆయన పై మోజుపెరిగి అబ్బే అదంతా అబద్దం అని వాదిస్తున్నారు. మీ చరిత్ర లో నిజానిజాలు మాకెందుకు? ఆ డేట మీ తెలంగాణోళ్లకు ఇచ్చుకో!

      Delete
    6. మీకు అక్కర లేకపోతె మానె, శర్మ గారికి ఆసక్తి ఉంది కనుకే వ్యాఖ్య రాసారు.

      Delete
    7. శర్మ గారు,

      మీరు తప్పుగా విన్నారు.

      రొమ్ము పన్ను విధించింది ఇప్పటి కేరళ ప్రాంతంలోని అప్పటి ట్రావన్‌కోర్ మహారాజులు, నిజాంలు కారు.

      ఈ లింకు చూడండి.

      http://www.thehindu.com/news/cities/Kochi/200-years-on-nangelis-sacrifice-only-a-fading-memory/article5255026.ece

      Delete
  5. Hari Babu Garu and other interested persons in true Indian History, there is a book release at The Park Hotel, Somajiguda, Hyderabad on 11A AM, 13th Sep by Sri Venkaiah Naidu, Central Minister - the book name is "The Chronology of Ancient India: Victim of Concoctions and Distortions" by Sri Vedveer Arya, which discusses the true colour of our Historians if you are interested please attend, Conducted by Facebook Group "Indian History Real Truth". https://www.facebook.com/photo.php?fbid=1637263079848763&set=pcb.851171981638596&type=1&theater

    ReplyDelete
  6. వక్రీకరణలతో నిండిన చరిత్ర పేరిట చలామణీ అవుతున్న చెత్త చాలానే చదువుతున్నాం మనం. ఒక ఉదాహరణ చెప్పాలంటే శ్రీ కొమర్రాజు వేంకట లక్ష్మణరావుగారి 'మహమ్మదీయ మహాయుగము' అనే పుస్తకంలో అక్బర్ ది గ్రేట్ నిజంగా ఎటువంటివాడో వివరంగా చదవుకోవచ్చును. శ్రీ కె.ఎమ్. మున్షీగారు కూడా మన భారతదేశ చరిత్రను యథాతధంగా రచించవలసిన అగత్యం గురించి ఆవేదన పడ్డారు.

    ReplyDelete
  7. Excellent post Hatibabu garu, thank you for the same.

    Shri Viswanatha has been inspired by the works of eminent historian Pandit Kota Venkatachalam. They are contemporaries and they both lived in Vijayawada, hence know each other. Pandit Venkatachalam garu worked tirelessly for over four decades, to reconstruct our history, to set right the distortions. He has authored about fifteen books which are highly acclaimed. Some of his books are available on the net.

    ReplyDelete
  8. Haribabu garu,

    In continuation to my above comment, attached herewith is a link you may find interesting.

    Kavisamrat Sri Viswanatha Satynnarayana in Preface to The Plot in Indian Chronology by Pandit Kota Venkata Chelam

    http://trueindianhistory-kvchelam.blogspot.com/2010/07/kavisamrat-sri-viswanatha-satynnarayana.html

    ReplyDelete
  9. If possible, please search and download a book written by Veer Savarkar '6 Glorious Epochs of Indian History'

    ReplyDelete
  10. మంచం మీద ఉన్నవారు కూడా లేచివచ్చి బాబరునీ, అక్బర్ నీ విమర్శించేస్తున్నారు.1992 బాబ్రీ కూల్చివేతలో చనిపోయి గుట్టలుగా పడిన శవాల మీద చిల్లర ఏరుకున్నవారికి పట్టం కట్టారు కదా ? రామాయణం ముందు ఏ చెత్త అయినా దిగదుడుపే !




    ReplyDelete
    Replies
    1. అమావాస్య ఎఫెక్ట్ బానే ఉన్నట్లుంది :)

      Delete
    2. పిచ్చి తగ్గదు :)

      Delete
    3. తమిళులకి అమావాస్య మంచిరోజు అట, మీకేమీకాదు తగ్గిపోతుందిలెండి. మై హూ నా ??

      Delete
  11. చదివిన సంస్కృతాలు,చరిత్ర చాలు, కొత్తగా చరిత్ర సృష్టించడానికి ప్రయత్నిస్తే అందరికీ మంచిది !

    ReplyDelete
    Replies
    1. చరిత్ర సృష్టించటానికి మేమైనా నందమూరి వంశాస్థులమా? లేక బాలయ్య బాబులమా?

      Delete
    2. చరిత్ర సృష్టించాలంటే నందమూరి వంశస్థులే అవసరం లేదు ఎవరయినా సృష్టించవచ్చు. కావలిసినదల్లా కాస్తంత ధైర్యం, కాస్తంత సమయస్పూర్తి, గెలుపోటములపట్ల సమభావం, ఇంకొన్ని తెలివితేటలు,చావంటే భయం లేకపోవడం. ఇవేవీ లేనివారు ముస్లింలను విమర్శించడానికి సరిపోరు.

      Delete
    3. అబ్బబ్బ .... ఎమి చేప్పారు. మాంచి స్వింగ్ లో ఉన్నారు. మీ బదులు చదివితే ఈ రోజు అమవాస్య అని తెలియని వారికి కూడా అమ్మవాస్య అని తెలిసిపోతుంది.

      Delete
    4. అమావాస్య అయినా పౌర్ణమి అయినా నేనెపుడూ మంచి స్వింగ్ లో ఉంటాను.
      Thank you ...Thank you !

      Delete
    5. This comment has been removed by the author.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...