Monday, 6 July 2015

హమ్మయ్య, నా చదరంగం సైటుని ముఖపుస్తకానికి అనుసంధానించేశా!

ఇదివరలో నేను చదరంగం ఆధారంగా ఒక వెబ్ పేజి తయారు చేశానని చెప్పాను గదా!దానికి మిత్రులు "అశోక్ కృష్ణ" కొన్ని అదనపు ఆకర్షణల్ని చేరిస్తే బాగుంటుందని చెప్పారు.చాలా శ్రమ తీసుకుని అమూల్యమైన సూచనలు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు!వాటిలో ముఖ్యమైనవి 1.ప్రతివారూ అన్నిచోట్లా వెంటనే రిజిస్టర్ అవడానికి ఉత్సాహం చూపకపోవచ్చు గాబట్టి ఒక ట్రయల్ గేం ఉంచమన్నారు.2.ఇవ్వాళ సోషల్ మీడియా ప్రోత్సాహం లేకుండా యేదీ ముందుకెళ్ళదు గనక ముఖపుస్తకానికి కలపమని ఒక సలహా ఇచ్చారు.

ఆ రెండూ ఇప్పటికి పూర్తయినాయి.మీకు గనక ముఖపుస్తకం అకవుంటు ఉంటే మళ్ళీ ఇక్కడ అన్ని వివరాలూ యేకరువు పెట్టనక్కర లేకుండా రిజిస్ట్రేషన్ ఫారం లోని "from facebook" బటన్ నొక్కితే తిన్నగా మీ ముఖపుస్తకం వివరాలు ఇక్కడికి వాటంతటవే సర్దుకుంటాయి.మీరు పాస్ వర్డ్ మాత్రం పూర్తి చేస్తే చాలు.అట్లాగే లాగిన్ అవ్వాలనుకున్నా లాగిన్ విండోలో ఇప్ప్పుడు యెడమ పక్కన ముఖపుస్తకం లోగో మీద క్లిక్ చేస్తే చాలు,ఇదివరకె మీరు ముఖపుస్తకం తెరిచి ఉంటే అమాంతం ఈ సైటులోకి కూడా వేళ్ళిపోవచ్చు. ఇది ముఖపుస్తకం వారు ఇచ్చిన సౌకర్యమే గాబట్టి సెక్యూరిటీ గురించి కూడా మీరు వర్రీ కానక్కర లేదు!

చదరంగం ఆట కొంచెం తెలిసిన వారు ఇక్కడ తమ ఆటను మెరుగు పరుచుకోవచ్చు.ఈ సైటు మెంబర్ల నుంచి ఆటలో ప్రత్యర్ధిని యెంచుకుని అవతలివారితో ఆడవచ్చును.తద్వారా ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారం కూడా అవుతుంది - బాగా పాప్యులర్ అయితే?!చదరంగం చుట్టూ చాలా సైటులు ఉన్న్నాయి కానీ దీని ప్రత్యేకత ఆని సులువుగా ఆడగలిగేలా చెయ్యటం.ఆట బల్ల మిగతా సైట్ల కన్నా తేడాగా 3డిలో కనిపిస్తుంది.ఆట గురించి యెక్కువ వివరాలూ చరిత్రా లాంతివాటికి పోకుండా పూర్తిగా ఆట ఆడానికి సంబంధించిన విషయాల గురించే యెక్కువ దృష్తి పెట్టాను.చదరంగం ఆటకి సంబంధించిన ప్రత్యేకమయిన యెత్తులు - కోట కట్టడం,ఎన్ పసాంట్,చెక్మేట్,పాన్ ప్రమోషన్ లాంటివన్నీ చాలా సహజంగా వచ్చేటట్లు చేశాను!

కాకుంటే అడోబ్ అప్లికేషన్ ప్యాకేజిలో ఉన్న ఫ్లాష్ ప్లేయరు మీ కంప్యూటరులో ఉంటేనే ఆదగలరు.ఒకవేళ మీ కంప్యూటరులో ఫ్లాష్ ప్లేయరు ఉందా అలేదా అని మీరు చెక్ చేసుకోనక్కర లేదు.అది లేకపోయినట్లయితే ఆ స్థానంలో మెకు ఒక లింకు కనబడుతుంది.ఆ ఇంకు వల్ల ప్రమాదం యేమీ లేదు.అది అడోబ్ వారి అధికారికమైన వెబ్ పేజి కాబట్టి దానిద్వారా వైరస్ పాకుతుందేమో అనే సందేహం కూడా అక్కర లేదు.

ఆట గురించి గానీ సైటు గురించి గానీ సందేహాలు వస్తే అక్కడ హెల్ప్ మెనూ ఉంది.చదరంగం వచ్చిన వారూ,నేర్చుకోవాలనుకునే వారూ ఇక్కడ ప్రవెశించి ఆడి చూసి తమ అభిప్రాయాలను చెప్పగలరు.సైటు ఒక మోస్తరుగా పాప్యులర్ అయినా చాలు నా ఆశయం నెరవేరినట్టే!నా అసలైన ప్రయత్నమంతా దీని చుట్టూ ఒక యాండ్రాయిడ్ యాప్ కూడా తయారు చెయ్యాలని!యాండ్రాయిద్ మెమరీ తక్కువ కాబట్టి డాటా స్తోరేజి కోసం ఒక శాసతమైన చోటు యెట్లాగూ ఉండాలి కదా!వెబ్ పజిగా దీని ప్రయోజనం దీఎనికి ఉన్నా నా అసలైఅన లక్ష్యం దీన్ని యాండ్రాయిడ్ యాప్ చెయ్యాలనే.




10 comments:


  1. ఇదేమిటో మరీ సాయిన్సు ఆర్టికల్ లా గుంది ఒక్క ముక్కా అర్థం కావడం లే

    జిలేబి

    ReplyDelete
  2. అనవసరమైన సుత్తి తగ్గించేశాను జిలేబీ - మరీ అంత క్రూరంగా కొట్టాలా?

    ReplyDelete
  3. Replies
    1. Thanks,All with your blessings and encouragement!

      Delete
  4. చాలా రోజుల నుండి అడగాలనుకొంట్టున్నాను స్వైరిణి అంటే అర్థం ఎమిటి? అలాగే పిపీలికం అంటేను..

    ReplyDelete
    Replies
    1. దీనికి ఇన్నిరోజులు వెయిట్ చెయ్యాలా?

      వాత్స్యాయనుడు ఒక మగవాడు యెంతోమంది స్త్రీలని కూడటాన్ని గోధేనుకం అన్నాడు.నిజానికి గోవు పదాన్ని ఆవుకి వాడేస్తాం కానీ అది యెద్దుకే ఎక్కువ కలుస్తుంది.ఆవు అనే అర్ధం రావాలంటే ధేనువు అని వాడాలి!ఆలమంద కంతటికీ ఒక యెద్దు చాలన్నట్టు ఉండే పధ్ధతి అది!

      ఇదే రకం మనస్తత్వం ఆడవాళ్ళలో ఉంటే వాళ్ళకి "స్వైరిణి" అని పేరుపెట్టాడు.అంటే ఒక ఆడది ఒక్క మగాడికే అంకితం కాకుండా తన కంటికి నచ్చితే చాలు పెళ్ళీ పెటాకులు అనే బంధాల్లో ఇరుక్కోకుండా టెంపర్వరీగా కలిసి ఉండతం.రాముడికి చాలా తెలివైన పదజాలంతో శూర్పనఖ ఇచ్చిన ఆహ్వానం అదే!

      ఆ స్వైరవిహారం పట్ల ఇప్పుడిప్పుడు ఆదవాళ్లలో పెరుగుతున్న మోజే ఇవ్వాళ ఆ శూర్పణఖకి అభిమానుల్ని సంపాదిచి పెడుతున్నది,కాలమహిమ!

      ఇక పిపీలికం అంటే అతి చిన్నదైన ఒక పురుగు.ఇక అంతకన్నా చిన్నది ఉండటానికి వీల్లేదు అనే అర్ధంలో విశేషణంగా తప్ప యే పురుగు జాతికీ ఇది నామవాచకంగా ఉన్నట్టు లేదు.

      ఈ మధ్య ఈ రెండు మాటలకీ బ్లాగుల్లో బాగా గిరాకీ పరిగింది గదూ?!

      Delete
  5. "పిపీలికం" అనే పదం చీమ గురించి మాత్రమే వాడతారనుకున్నానే !

    ReplyDelete
    Replies
    1. మన కంటికి కనబడే వాటిల్లో చీమయే చిన్నది గాబట్టి గోవు లాగే కామన్ అయిపోయింది,అది విశేషణమే!

      Delete
  6. Replies
    1. pipīlikā—ants Madhya 24.270, Antya 8.51
      pipīlikā—ant Antya 11.41
      pipīlika-ādīnām—of small ants SB 5.22.2

      so,మొదటి అర్ధం చీమ అనేది ఒకటి కాదు అనీ చీమలు అనే బహువుకి కలుస్తున్నది.మూడో అర్ధం అన్నిరకాల చిన్నవైన చీమలకి వర్తించేవిధంగా ఉంది.ఆలోచించంది.సంస్కృఋతంలో ప్రతి పదానికీ ఒకటి కన్నా యెక్కువ అర్ధభేదాలు ఉంటాయి!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...