Sunday, 12 July 2015

బాహుబలి సినిమా చూసేశానోచ్!రాజమౌళి ఇరగదీసేశాడహో!

వెండితెర అధ్భుతం!నింగినుంచి జారుతున్నదా అన్నంత యెత్తునుంచి జారుతున్న ఒక జలపాతం,శివుని జటాజూటం నుంచి ఉప్పొంగి దూకే దివిజ గంగ ఇంత తెల్లగా ఉంటుందేమో అనిపించే కళ్ళు చెదిరేటంత ధవళ సౌందర్యం అతి దగ్గరి నుంచి కనిపిస్తే చూడాలని తహతహ లాడే వాళ్లకీ కొయ్యబొమ్మలు మెచ్చు కళ్లకు కోమలుల సౌరెక్కునా అన్నట్టు ఇప్పటిదాకా తక్కువ రకం అందాలకి అలవాటు పడిపోయి ఇంతకన్నా గొప్ప అందం ఉండదని మైండులో ఫిక్సయిపోయిన దిక్కుమాలిన స్థితిలో ఉన్న సగటు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో ఒక మహాధ్భుతమైన సౌందర్య పుష్పం ఒక్కసారిగా వెయ్యిరేకులతో విచ్చుకుంటే చూసి తట్టుకోగలిగిన వాళ్లకి బాహుబలి చూడటం ఒక అదృష్టం!నిజమే - సినిమాలో యెన్నో గొప్ప అంశాలు ఉన్నాయి, అందరూ అనుభవమున్న వాళ్ళే గనక నటీనటుల నటన అధ్భుతంగా ఉంది, అంత సుదీర్ఘమయిన సమయం తీసుకుని చెక్కారు గనక పాత్రల రూపురేఖలూ గొప్పగానే ఉన్నాయి< కధ రాజమౌళి చాలాసార్లు చెప్పినట్టు చందమామ కధే, పాతకాలం రాజులు సింహాసనం మీద యెవరు కూర్చోవాలనే పంతాల కోసం ఒకరినొకరు మోసం చేసుకోవడాలతో కూడిన పాత యెంటీవోడి కత్తి ఫైటింగుల సిన్మాల నాటి రొడ్డకొట్టుడు మామూలు కధ!కానీ వాటికన్నా ప్రత్యేకంగా ఉండి ఇవ్వాళ సినీమా చూసి వచ్చాక నన్ను వెంటాడుతున్నదీ మీరు చూసి బయటి కొచ్చాక మిమ్మల్ని వెంటాడబోయేదీ ఆ జలపాతపు సౌందర్యమే!

తను ఇప్పటికే చందమామ కధల నుంచే ఇన్స్పైర్ అయ్యానని చెప్పేశాడు గనక కధ గురించి చెప్పడానికి పెద్దగా యేమీ లేదు. సినిమా అంతా ఎంజాయ్ చేస్తూ చూసి  ఇంటికొచ్చాక తీరిగ్గా కూర్చున్నాక ఇంతకీ బాహుబలులు యెంతమందీ అని మా ఫ్రెండుకి డౌటొచ్చేసింది!ఇక్కడ కధ చెప్పినా మీకు చూసేటప్పుదు ఖచ్చితంగా డౌట్లొస్తాయి!యెందుకంటే మొదట అనుకున్న కధని పూర్తిగా తీస్తే యేకబిగిన చూడాలంటే ఐదారు గంటలు పడుతుందని చాలామటుకు సీన్లని నరికేసి అత్యవసరమైన వాట్ని కూడా ఒకే సినిమాగా చెప్పలేమని రెండు పార్టులుగా తీశారు గాబట్టి ఇప్పుడొచ్చిన డౌట్లన్నీ తీరాలంటే రెండో పార్టు వరకూ ఆగాల్సిందే!ఫాంటసీ కధ గాబట్టి రీజన్ అడిగే దమ్ము యెవడికీ లేదు.అడిగిన వాడు గొట్టం గోవిందరాజులే!దీనెమ్మా జీవితం మన చుట్టూ ఉన్న లైఫులో మాత్రం యేది రీజను ప్రకారం జరుగుతాంది!?కొందరు మొదటి సగం స్లో అనీ,రెండో సగంలో వార్ సీన్లు సాగదీశాడనీ,, మొదటి పార్టుని మరీ హఠాత్తుగా ఆపేశాడనీ వంకలు పెట్టారు గానీ నాకు మాత్రం అవి కూడా పెద్ద తప్పులని అనిపించలేదు.కామెడీ కోసం కుప్పిగంతులు వెయ్యకుండా,అక్కర్లేని తిగరి హీరోయిజానికి బిల్డప్పులిచ్చే పంచ్ దైలాగుల మోత లేకుండా,అవేవీ లేకపోతే సినిమా హిట్టవ్వదేమో అనే మూఢనమ్మకాన్ని బద్దలు గొడుతూ బోరు కొట్టించని మంచి సినిమా ఇది!

ఒకటి మాత్రం నిర్మొహమాటంగా చెప్తాను.ఈ సినిమాలో చూసిన యుధ్ధపు దృశ్యాల్లో కొన్నిట్ని నేను టీవీలో "300","హెలెన్ ఆఫ్ ట్రాయ్" లాంటి ఇంగ్లీషు సినిమాల్లో యెప్పుడో చూసేశాను.అవి కాపీ సీన్లని నాకు తెలుసు,అయినా సరే కధలో చక్కగా ఇమిడ్చి మంచి కాంబినేషన్ కలిపి తీశాడు గాబట్టి అంత చక్కగా కాపీ కొట్టగలిగినందుకైనా మెచ్చుకోవాల్సిందే!కాపీ కొడుతుండగా ఇన్విజిలేటరుకి దొరికిపోయి డిబారయిన వాడికీ పట్టుబడకుండా కాపీ కొట్టి ర్యాంకు తెచ్చుకోగలిగిన వాడికీ తేడా లేదూ?! 

సినిమాకి వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుదూ నేనూ మా ఫ్రెండూ చెప్పుకున్న కబుర్లతో సహా ఈ బాహుబలి సినిమా చూడటం నిజంగా ఒక మంచి అనుభవమే నాకు మాత్రం!వాడు మొదట సత్యంలో పనిచేసి మహీంద్రా వాళ్ళ కిందకి వెళ్ళాడు.ఇప్పుడు మహీంద్రా పరిస్థితి యేం బాగులేదట!నష్టాల్లో ఉండి వచ్చే నెల నుంచి జీతాల్లో కోత మొదలవబోతుందట.అదివరలో యెక్కడ విన్నా మహీంద్రా పేరు చెవుల్లో హోరెత్తిపోతూ వినబడేది బ్రాండ్ వేల్యూ తగ్గిందా?ఆ ఒక్క కంపెనీకే సమస్య వస్తే జరిగే నష్టం కన్నా ఆ ఫీల్దు మొత్తం ఎఫెక్టయితే చిన్నా చితకా కంపెనీలయితే బోర్డులు తెప్పెయ్యడమే గదా?అందులో పనిచేసేవాళ్ళ పరిస్థితి యేంటి?వెళ్ళేటప్పుదు ఇలాంటి కబుర్లయితే వొచ్చేటప్పుడు మావోడికి హుషారొచ్చేసి ఫ్రెండ్సుకి ఫోన్లు చేసి మౌత్ పబ్లిసిటీ మొదలెట్టేశాడు.గుంటూరోడయ్యుండీ  పుట్టి పెరిగిన మాతృనగరం గుంటూరునే భయంకరంగా అవమానించే లెవెల్లో "గుంటూరు డబ్బా ధియేటర్లలో మాత్రం చూడకురోయ్,బెజవాకో హైదరాబాదుకో వొచ్చి మాంచి సౌండెఫెక్ట్సుతో అదరగొట్టే పెద్ద హాల్లో చూడ"మని ఉబోసలు కూడ పారేస్తున్నాడు.అదేంట్రా మీ వూరినే అట్టా చిన్నబుచ్చుకుంటావు అంటే మా బుంటూరోళ్ళం అంతేరా తమ్ముడు తనోడయినా ధర్మం మాట్లాడే టైపు అని సెల్ఫుడబ్బా కొట్టేసుకుని మా గుంటూరు ముండ కెక్కువా ముత్తయిదువకి తక్కువా అనేస్తున్నాడు!ఒరేయి బాపనోడివి నువ్వు బూతులు మాట్టాడితే యెట్టారా అని పైకి అన్నా గానీ మైండులో మాత్రం సుప్రభాతాల్లో కూడా బూతులు రాసింది వాళ్ళే గదా అనుకున్నా లోపల్లోపల:-)ఇప్పటి దాకా మెయిన్ లైనుకి పక్కకుండిపోయి వెనకబడిపోయిందిరా, ఇప్పుడు డైరెక్టుగా రాజధానిలో కలిసింది గాబట్టి కొంచెం ముందుకెళ్తుందేమోలే అన్నాడు!ఆ సినిమాకి తెగే టిక్కెట్లలో ఓ పదిశాతమయినా నీమూలంగా తెగేట్టు ఉన్నాయి.యెస్సెమ్మెస్ సాక్ష్యాలు జాగ్రత్త్తగా ఉంచి రెవెన్యూలో వాటా అడుగు అని జోకేస్తే నిజమే అడుగుతానని ఐడియా ఇచ్చినందుకు నాకు షేక్ హ్యాడిస్తున్నాడు మా గుంటూరు శాస్తుర్లు!ఒరేయి సమైక్య రాష్ట్రాన్ని బోడి ఆంధ్రప్రదేశ్ అన్నాడురా ఒక గాడిద,ఆ బోడి తెలంగాణ కెందుకు మీవాణ్ణీ చెన్నై రమ్మను అంటే నిజమే,ఈసారి ఫోన్లో కలిసినప్పుదు చెప్పాలి అని వాడూ ఒప్పుకున్నాడు?!

సినిమా గురించి ఆపేసి ఈ జోకులన్నీ యేంత్టని దౌటు రావొచ్చు,మీరు కూడా ఒంటికాయ సొంతికొమ్ములాగా వెళ్ళాను,చూశాను,వొచ్చాను అని కాకుండా నలుగురితో కలిసి సరదాగా వెళ్ళిరండి - ఇంటి దగ్గిర్నుంచి బయల్దేరి మళ్ళీ ఇంతికొచ్చేవరకూ బోరు కొట్టకుండా ప్లాను చేసుకుని వెళ్ళండి అని చెప్పదల్చుకున్నా!

మనవాళ్ళు గోప్పగా అప్పుడప్పుడూ కొన్ని అధ్భుతాల గురించి చెప్తారే అల్లాగ - వానలో తదవని వాడూ బాహుబలి చూడని వాడూ,చూసి నచ్చలేదన్న వాడూ వేస్ట్ క్యాండిడేట్ కింద లెఖ్ఖ!మా ఐద్దరితో పాటు హాలు దగ్గిర మరో తెలుగు కుర్రాడు కలిశాడు - నిన్ననే చూసి మళ్ళీ మావాణ్ణి చాన్సుంటే నాకూ టిక్కెట్టు తీసుకోమన్నాడంట!పైకి యేమడుగుతాం గానీ సినిమా చూశాక ఇప్పుడు మాత్రం కుర్రాడు ఖచ్చితంగా తమన్నా కోసమే వచ్చుంటాడు!రెండు పాటల్లో రాఘవేంద్రుణ్ణి మరిపించేశాడు రాజమౌళి!?

10 comments:

  1. ఎవరీ బాహుబలి? రాజమౌళి, ఏంటీ ఇరగదీసింది? అర్ధం కాలా.....

    ReplyDelete
    Replies
    1. మూడేళ్ళ నుంచీ సినిమా అంటే యే కొంచెం ఆసక్తి ఉన్నవాడయినా యెప్పుడు పూర్తవుతుంది?అసలేం తీస్తున్నాడు?ఒక సినిమాకి ఇంత తైము ఇవ్వడానికి ప్రభాసు కేమయినా పిచ్చా అని జ్వరం తెచ్చేసుకుంటుంటే మీరు యే లోకంలో ఉన్నారు సార్!

      Delete
    2. పిచ్చేం కాదు. చూడండి:

      https://pallibatani.wordpress.com/tag/prabhas-bahubali-tamil-nadu-distribution-rights/

      Delete
  2. మన వాళ్ళకి యుద్ధం అంటే గాలిలో రెండు బాణాలు గుద్దుకుని కిందపడిపోవటం అలానే ఒక 5 నిముషాలు కత్తులతో ఆడుకోవటం మాత్రమే తెలుసు కదండీ అందుకనే అలా అంటున్నారు. నాకు అయితే యుద్ధ సన్నివేశం ఒక్క నిమిషం కూడా సాగదీసాడు అని అనిపించలేదు. చాలా చక్కగా formation, వ్యూహాలు, యంత్రాలు, రానా కత్తుల రధం, గద అయితే హైలైట్. జానపద చిత్రాల్లో అంతకంటే కథ ఏమి ఉంటుంది. జానపద చిత్రాల్లో జగదేకవీరుని కథ, చిక్కడు దొరకడు, పాతాళ భైరవి తప్ప దాదాపు ఇలాంటి కథలతో వచ్చిన సినిమాలే లేకపోతే పురాణాలూ నుంచి వచ్చినవి. తీసుకున్న కథని చక్కగా చెప్పాడా లేదా అనేది చూడాలి. మన వాళ్ళకి ఇలా 2 భాగాలుగా చూపించటం కొత్త. అందుకే సగంలో ఆపాడు అంటున్నారు. కానీ రాజమౌళి ఒక కొలిక్కి తెచ్చి ఆపాడే తప్ప అర్ధంతరంగా ఆపలేదు. రెండో భాగం చూడాలి అని ఉత్సుకత పెంచాలి కదా. ఇంత భారీగా ఉంటుంది అని అంచనాలు పెంచుకుని వెళ్ళానో అంత భారీగా ఉంది సినిమా. ఒక్క తమన్నా పాత్ర తప్ప అన్ని నచ్చాయి నాకు. అంత అందమైన అనుష్కని అలా చూపించి భయపెట్టి బాధపెట్టటం రాజమౌళికే చెల్లింది. రెండో భాగం చూడాలని ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా.

    ReplyDelete
  3. "మళ్ళీ "ఇంతి"కొచ్చేవరకూ"

    ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి
    ఇంతుల సంగతి పూబంతుల సంగతి

    Just for fun :)

    ReplyDelete
    Replies
    1. నేను వొదిలేసిన అచ్చుతప్పు తెచ్చిన తంటా అది!
      జోకు పడిపొయ్యాక సరిచేసినా ఫలిత మేముంది?

      Delete
  4. దేవతా వస్త్రాల సెంటిమెంట్ ఆట మొదలెట్టేసారు.

    ReplyDelete
  5. నాకు కూడా నచ్చలేదు..గ్రాఫిక్ ఎఫెక్ట్ తో బాటు మంచి సంభాషణలు వాటిని ఎన్టీవోడు లాగ పలికే నాయకుడు..చక్కటి సంగీతం ఉంటేనే ఇలాటి ఇతివృత్తం గల సినిమాకి అందం..

    ReplyDelete
  6. లుక్కులో మా కాకినాడ ముందు గుంటూరూ, విజయవాడా రెండూ తీసికట్టే. కానీ నిజం చెప్పాలంటే విజయవాడ మీద గుంటూరు చాలా బెటరు. బెజవాడకి సైజే తప్ప అందం చందం లేవు.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...