Thursday, 2 July 2015

అయ్యయ్యో బ్రహ్మయ్యా!అన్యాయం చేశావేమయ్యా?ఇచ్చిన పుణ్యం యేమైందయ్యా!తెలంగాణలోనూ ఖాళీబొచ్చెయేనా?

     దానవీరశూరకర్ణ సినిమాలో అప్పటిదాకా దేవుళ్ళ పాత్రల్లో ప్రశాంత వదనంతో కరుణ ఒలికించే సంభాషణలతో దైవత్వాన్ని చూపించిన నందమూరి తారక రామారావు దుర్యోధనుడనే దుష్టుడి పాత్రలో చాంతాడు పొడుగు దుష్టసమాసాల్ని కరకరా వేడి వేడి సమోసాల్లా నమిలి వూసేసినా నాకు మాత్రం ధూళిపాళ శకుని వేషంలో కొట్టిన డవిలాగులే మజ్ఝారే అనిపిస్తాయి!రామారావు గెటప్పుల్లోనే కాదు మూడు వేషాల్ల్లోనూ ఆపాదమస్తకం చాలా గొప్పగా వేరయిటీ చూపించాడు.దుర్యోధనుడిగా "సోదరా దుశ్శాసనా.." దగ్గిర్నుంచి "వందిమాగధులారా కర్ణమహారాజును కర్ణపేయముగా కీర్తింపుడు" అనే వరకూ పెంకులెగిరిపోయే గొంతుతో క్షణం కుదురుగా నిలవకుండా నిలువెల్లా ఆవేశంతో వూగిపోతే పక్కనే కర్ణుడిగా మహావినయంగా లోగొంతుకతో "మహాదాతా!నా రక్తాన్ని రంగరించి మీ యశోరక్షణకు నా సమస్తం ధారపోస్తాను!" అని సుకుమారంగా చెప్తుంటే కళ్ళు మూసుకుని వింటున్నా మాట్లాడుతున్నది దుర్యోధనుడనీ కర్ణుడనీ తేడా తెలిసేటంత గొప్పగా చేసిన స్వరవిన్యాసం నిజంగా అధ్భుతమే!అటు రారాజు లోని అహంభావాన్నీ ఇటు అప్పటివరకూ ఉన్న స్థితి నుంచి లేవనెత్తి ఒక్కసారిగా రాజుని చేసిన వ్యక్తిపైన ఆ గౌరవాన్ని అందుకున్న వ్యక్తికి ఉండే కృతజ్ఞతనీ ఒకే నటుడు ఒకే సన్నివేశంలో చూపించడం ప్రపంచ చలనచిత్ర చరిత్రలో యే భాషలోనూ యెవ్వరూ చెయ్యని సాహసకృత్యమే!

          కానీ సినిమా అంతా ఒక్క నటుడే కనిపిస్తే బోరు కొట్టి చచ్చేవాళ్ళం కదా!కానీ ఆ విజృంభనకి తట్టుకుని అతనికి దీటుగా నిలబడితేనే కదా మరొక నటుడు కూడా మెప్పించగలిగేది?అలాంటి అధ్భుతాన్ని ధూళిపాళ సునాయాసంగా చేసేశాడు.ముఖ్యంగా మయసభలో అవమానానికి ప్రతీకారంగా అందరూ యుధ్ధం చేసి ఓడించి పగ తీర్చుకోవాల్సిందే నని గట్టిగా అరుస్తున్నప్పుడు,"దానివలన మనకొరుగు ప్రయోజనమేమి?వచ్చిన మచ్చ మాసిపోవునా?పరాభవావమానము సమసిపోవునా?మీ వూహ సరికాదు!వాడు పేరుకు ధర్మజుడే కాని పనువేపరి, జూదరి, వ్యసనపరుడు!వానినా మిషతోనే హస్తినకు రావించి వారి సమస్తమూ హరించి నీవూ నీ శతసోదరులూ వారి దీనత్వమును చూసి పగులబడి నవ్వవలె!అనాయాస మరణమూ దానివలన ప్రాప్తించు అమరలోక నివాసమూ ఆ పాండవహతకుల కంత సులభంగా లభించరాదు,తాము చేసిన తప్పులకు తామే వగచి వగచి కృశించి కృశించి నశించవలె!!" అనే పార్టు అతను చెప్పిన తీరు నాకు మహాధ్భుతంగా అనిపిస్తుంది.శకుని పాత్రలో ధూళిపాళ ద్వారా కొందవీటి వెంకట కవి గారు యెన్నో రాజకీయ సత్యాలు చెప్పారు!"వజ్రాన్ని వజ్రంథోనే ఖోయవలె,ముల్లును ముల్లుథోనే థీయవలె" అని నొక్కి వక్కాణించుతున్న సన్నివేశాన్ని జాగ్రత్తగా పట్టి చూస్తే ఇవ్వాళ్టి రాజకీయ నాయకులంతా ఆ మహానుభావుడి నుంచి ఉప్పుదేశం పొందినవారుగా కనిపించటం లేదూ!

             కాకపోతే ఆ శకుని మామకి తను విసిరిన పాచికలు తను చెప్పినట్టు వినే అదృష్టం ఉంది,ఇప్పటివాళ్ళకి ఆ అదృస్టం లేదు,అంతే!అప్పుదు రారజు ఉన్న పరిస్త్యితి కూడా బయటపడి యుధ్ధం చెయ్యగలిగిన పరిస్థితి కాదు!యెందుకయ్యా యుధ్ధం చేస్తున్నావు అంటే జవాబు చెప్పలేడు?మాసభలో జరిగిన అవమానం బయటికి చెప్పుకోలేదు,అంతకు ముందు ంచీ యెన్నివిధాల అంతం చెయ్యాలని కుత్రలు చేసినా అవన్నీ రహస్యంగానే చేశాడు,దేసంలోకల్లా గొడ్డుమోతు భూమికి రాజుగా పంపిస్తే అక్కడ కూడా సిరిసంపదలతో తులతూగుతుంతే చూడలేక ఇప్పుడు బయతపడి యే కారణం చెప్పగలడు?సరిగా ఇలాంటి పరిస్థితిలో నిలబడిన వాళ్ళు ఇన్ని వేల సంవత్స్రాల తర్వాత కూడా సరిగ్గా అలాంటి మాయాద్యూతాలకే తెగబడుతున్నారంటే ఆ కధ కల్పితమే అయినా ఆ కధకుది క్రాంతదర్సిత్వం యెంత గొప్పది?వ్యాసుదు యే పాత్రలో యే లోపాలు పెట్టాడో ఆ లోపాలకి అంతిమంగా యెలాంతి ఫలితాన్ని అనుభవించారని ఆ కధలో చూపించాడో చరిత్రలో యెన్నొసార్లు అలాంతి లోపాలు ఉన్నవాళ్ళు అలాంతి ఫలితాన్నే పొందారు అనేది గమనిస్తే మనం మహాభార్తం తప్పనిసరిగా చదివితీరాలనిపిస్తుంది - కొందరు బౌధ్ధిక చత్వారం గలవాళ్ళకి తప్ప!శ్రధ్ధగా చదివి అర్ధం చేసుకుంటే అటువంతి ధోరణులు క్నబడుతున్నప్పుడు గుర్తుపట్టి మళ్ళీ అలంటి వినాసనం జరగకుండా జాగ్రత్తపడవచ్చును కదా!

     యెప్పటి కెయ్యది ప్రస్తుతమో దానితో సరిపెట్టుకునే ప్రాప్తకాలజ్ఞత సార్వకాలిక సత్యాల్ని అవగతం చేసుకోనివ్వదు.ఇవ్వాళ కాంగ్రెసు పార్టీ దుస్థితిని చూస్తే జాలి కన్నా అసహ్యం కన్నా భయంకరమైన దుస్థితి యేది ఉన్నా ఆ స్థితి కన్నా హీనంగా ఉంది, యెందుకని?ఒకనాటి మహానుభావులు అందులో చేరి వారి సత్ప్రవర్నతో పార్టీకి కూడా గౌరవాన్ని తెచ్చిపెడీతే ఆ సార్వకాలీక్ యససూ నిచ్చే ప్రజాసేవాపధం నుంచి తప్ప్పుకుని మాయాద్యూతాలను నమ్ముకున్న దుర్మార్గులకి ఆవాసం కావదం వల్ల ఈ దుస్థితి దారించింది!సమస్య ఇదీ అని తెలిసినా పరిష్కారం లేని తప్పులు  అలవాటుగా చేస్తూ చేస్తూ వచ్చి నిన్నటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో నూరవ తప్పును కూడా యేదో ఘనకార్యం చేస్తున్నంత ధీమాగా చేసిపారేసి కాలపురుషుడు విసిరిన సుదర్శనం దెబ్బకి కూలిన శిశుపాలుడి గతి పట్టింది నేదు కాంగ్రెసుకి?!

         సోనియా యేమో నేను మాటిచ్చాను ఇచ్చి తీరాలంటుంది!ఇక్కడి వాళ్ళకేమో ఇవ్వాలని లేదు - వచ్చిన వాడు హైదరాబాదులో ఉన్న తమ వ్యాపారాల్ని(?) తిన్నగా చేసుకోనివ్వడేమోననే స్వార్ధంతో కూడిన భయం లాంటి బెంగ?గట్ట్టిగా తాము అడ్డుపదుతున్నట్టు కనిపించకుండా లేఖలు ఇచ్చి నాకభ్యంతరం లేదని అన్నా ప్రతిపక్షంలో ఉన్నవాడు తాము ఇస్తే అడ్డుకోలేడని తెలిసినా కాలం గడిపేటందుకు అతని మీదకి తోసేసి ఆఖరి వరకూ నాటకాలు ఆడారు?ఇవ్వడం తప్పనిసరి అని తెలిశాక మళ్ళీ వాళ్ళే రెండుగా చీలి ఒక సగం ఇవ్వమనీ ఒక సగం వద్దనీ అయోమయం సృష్టించారు!నిజాయితీగా ఇవ్వదల్చుకుంటే అవన్నీ నిజంగా అవసరమా?ఇవ్వాళ అక్షరాస్యత పెరిగిందనీ,పత్రికల్లో పడిన వార్తలు మారుమూల పల్లెలకీ తెలిసీపోయి చాయ్ బంకుల దగ్గిర కబుర్ల ద్వారా నిన్నటి రోజుల్లోలా కాకుండా ఇవ్వాళ్టి వోటర్లు చైతన్యవంతులయ్యారనేది కూడా తెలుసుకోకుండా యెంత తెలివితక్కువగా చేశారు రాష్త్ర విభజనని, మెంటల్ మంద?23 జిల్లాల ప్రజల భవిష్యత్తుని అనంతకాలం వరకూ వెంటాడే సమస్యలతో ఇస్తూ కూడా మరీ ముఖ్యంగా ప్రతిదానికీ పోట్లాడుకు చావడానికి మాత్రమే పనికొచ్చే విధంగా విభజన బిల్లుని తయారు చేసి కూడా లాభం ఆశించారంటే వీళ్ళకన్నా వెనకతి కాలంలో కూర్చున్న కొమ్మని నరుక్కున్న దేవయ్య కూడా తెలివైనవాడే గదా?! 

        కనీసం ఆ లాభాన్ని పక్కవాడితో పంచుకుందామనే పాటి ఔదార్యం కూడా లేదు - లాభమంతా మనకే రావాలి,అందుకే పుచ్చుకున్నవాడు కూడా గర్భశత్రువై పోయాడు!అడిగీన వాడు ఇస్తానని మాటిచ్చాక గూడా తొమ్మిదేళ్ళు యేడిపిస్తుంటే మనసులో తిట్టుకోడా?కాలం తనకి వాటంగా కలిసి వచ్చినప్పుదు తను చావుదెబ్బ కొట్టడా?యేళ్ళు పెరిగినా బుధ్ధి పెరగని గాడిదలకి రాజకీయమెందుకు?అస్త్రసన్యాసం చేసి పరువుగా రాజకీయ రంగం నుంచి నిష్క్రమిస్తే ఇప్పటికయినా ఒక తెలివైన మంచిపని చేసినట్టు ఉంటుంది - కానీ అది కూడా చెయ్యరు!ఘటశ్శ్రాధ్ధం తంతు కూడా తమకు తామే జరిపించుకునే వరకూ కాంగ్రెసు పతనాన్ని యెవ్వరూ ఆపలేరు కాబోలు?!

       శకుని మామ "ఔరా,అల్లుని పరాభమునకు మామ శకుని చెల్లించిన పరిహార మిదా - ఘురే! ఘురే! యని భారతెతిహాసమున నా చరిత్ర సువర్ణాక్ష్రములతో లిఖించబడవలె" నని ఆశించాడు - ఫలితం సాధించాడు గాబట్టి తన చరిత్రని సువర్ణాక్షరాలతో రాసినా తప్పు లేదు!కానీ ను ఆడిన మాయాద్యూతం వికటించి తననే ఒకవైపు ఇప్పటికే "0" తో నిలబడి మరొక వైపు రేపటికి "0"తో నిలబెడుతున్న చరిత్రని మాత్రం రక్తాక్షరాలతోనే లిఖించవలె!

కాంగ్రెసు తాను చేసిన తప్పులకు తానే వగచి వగచి కృశించి కృశించి నశించవలె!

9 comments:

  1. ఆంధ్రుల వేదనకు అక్షర రూపమిస్తున్న మీకు అభినందనలు

    ReplyDelete
  2. "...కాంగ్రెసు తాను చేసిన తప్పులకు తానే వగచి వగచి కృశించి కృశించి నశించవలె..."

    మీకు అసలుకోణం తెలుసో తెలీదో నాకు తెలీదు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు కాంగ్రెస్ క్రుంగిపోవడం బహుశా జరగదు. ఎందుకంటే ఓడిపోతామని వాళ్ళకి ఎన్నికల ముందే తెలుసు. వాళ్ళ దృష్టి దాని మీద కాదు. డబ్బు మీదే. అదంతా కావాల్సినంత పోగేసుకుని ఎక్కడెక్కడో దాచేసుకుని, ఆ చీకటి డీలింగ్స్ వివరాలన్నీ చివరి ఏడాదిలోపల ఫైళ్ళలోంచీ, కంప్యూటర్లలోంచి సుబ్బరంగా డిలీట్ చేసేసి హ్యాపీగా ఉన్నారు కాంగ్రెస్ అధిష్ఠానం. వాళ్ళమీద కేసులు పెట్టడానిక్కూడా ఏ సాక్ష్యమూ దొరక్క అల్లాడిపోతోంది భా.జ.పా. ప్రభుత్వం. ఇహపోతే కాంగ్రెస్ కార్యకర్తలూ, స్థానిక నాయకులూ పార్టీ ఫిరాయించేసి హ్యాపీగా ఉన్నారు. అంచాత చెప్పొచ్చేదేంటంటే అక్కడ వగచేవాడూ లేడు. కృశించేవాడూ లేడు. మనమే వాళ్ళు చేసిన వెధవపన్లకి వగచి వగచి క్రుంగి కృశించి నశించిపోవాలి తప్ప!

    ReplyDelete
    Replies
    1. కాంగ్రెస్ ఏ తప్పు చేసింది? తాను తెలంగాణా ఇవ్వను అని సోనియా చెప్పలేదు, సోనియా తెలంగాణా ఇవ్వదని ఆంధ్రా చానెల్‌లు ప్రచారం చేసాయి. తాను తెలంగాణా ఇవ్వను అని చెప్పి తెలంగాణా ఇచ్చుంటే అది మోసం అనుకోవచ్చు కానీ....

      Delete
    2. రామాయణ మంతా విని..
      పోష్టు మొత్తం చదవ్వు?
      యెట్లా చెప్పు నీతో!
      అరటిపండు ఒలిచిపెట్టినా దిక్కులు చూసే రకం నువ్వు?
      నీకర్ధమయ్యేతట్టు చెప్పటం కష్టమబ్బా.

      Delete
    3. దోచుకున్నది దాచుకోగలిగారు కానీ ఇంకా దోచుకోవడం కుదరదు గదా!పార్టీ వొదిలిపోయిన వాళ్ళంతా ఇంక ఇక్కడ వుండి దోచుకోవదం కుదరదని తెలిసే గదా సార్ ఖాళీ చేసింది!"ఓయినోళ్ళు అందరూ మంచోళ్ళే,ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులే" అని మూగమనసుతో పులకించడానికి వీల్లేకుండా అయిపోయింది గదా!బొమ్మలు చింపేసేటంత కసిగా ఉన్నారు పోయినోళ్ళ మీద?

      Delete
    4. If you are so aware, why do you need to find fault in the Congress? BJP, which had been advocating the bifurcation since 1997, has won four seats in Andhra. Only the party which agreed with BJP's proposal was made villain.

      Delete
    5. Because Congress doesn't enjoy the media support like BJP and TDP does...

      Delete
  3. మీరు మీ ఊపునీ, ఆవేశాన్ని కాస్త తగ్గించుకుని వాక్యాల్ని విడగొట్టి అర్థమయ్యే సైజులో శైలిలో పెట్టవలసిందిగా నా ప్రార్థన.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...