Tuesday 14 July 2015

యేమిటి తెలంగాణ వాదులు ఆంధ్రావాళ్ళ పట్ల చూపించే ఔదార్యం?సంపద పెంచిన వాళ్ళని దొంగలంటూ పెట్టిన చేతిని కొరకడమా ఔన్నత్యం!

నాకింతవరకూ గుండు మధుసూదన్ అనే తెలంగాణ వ్యక్తితో యెక్కడా సంభాషణ జరగలేదు!మొదట్లో తను పద్యకవిత్వం రాయడం తెలిసి ఆ పోష్టులు కుతూహలం కొద్దీ చూశాను గానీ మితిమీరిన గ్రాంధికం నిండిన తన కవిత్వం  నాకు నచ్చలేదు!నేను కూడా పద్యాలు రాయగలను,రాస్తున్నాను - పనిగట్టుకుని పుంఖాలు పుంఖాలుగా పద్యాలు రాయాలనే దురద నాకు లేదు.నాకు నేను చెప్పాలనుకున్న భావాన్ని జనానికి పాయింటు యెక్కే విధంగా ఉంటే చాలు.భాష విషయంలో నేను పూర్తి లిబరల్.తేలిగ్గా అర్ధం కావాలి,వ్యర్ధపదాలు ఉండకూడదు - ముఖ్యంగా బోరు కొట్టించకూడదు!

కానీ ఆయన కవిత్వంలో ఇవేవీ లేకపోవడంతో ఆ తర్వాత అటుకేసి వెళ్ళడం మానుకున్నాను.ఇవ్వాళ బ్లాగుల్లో జై గొట్టిముక్కల,శ్రీకాంత్ చారి,గుండు మధుసూఒదన్ త్రయం గురించి తెలియని వారెవరు?మొత్తం తెలంగాణ ఉద్యమమంతా వీరు భుజస్కంధాల మీద మోసినట్టు ఫీలయ్యి బ్లాగుల్ల్లో హడావిడి చెయ్యటమే తప్ప తెరాసా పార్టీ సభ్యులో కారో రెలీదు,ఉద్యమమలోని యే సంఘటనలోనైనా ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు యేమయినా ఉన్నాయా అంటే అనుమానమే!జై అయితే అప్పటిదాకా వీరావేశంతో వాదిస్తున్నవాడల్లా నేను సూటిగా ఒక ప్రశ్న వేసేసరికి "నేను ఉద్యమానికి అంచున మాత్రమే ఉన్నాను" అనేసి తప్పుకున్నాడు,ఒక ఉద్యమ భావజాలాన్ని ఒప్పుకున్నాక అంచున ఉండడం మధ్యన ఉండటం కుదురుతుందా?జవాబులుగా ఇట్టాంటి జోకుల్ని వెయ్యగలిగిన కేతిగాళ్ళు మేధావులుగా చెలామణీ అయ్యారు తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని!

నాకు ఆంధ్రా తెలంగాణ ప్రజల మధ్యన యే తేడా కనిపించలేదు.నాకే కాదు చాలామందికి కనిపించవు - వీళ్ళకి మాత్రమే కనిపిస్తాయి.దానికో రహస్యమైన లెఖ్ఖ్కుంది!ఆఫ్రికా ఖండంలోని జనాన్నీ ఇండియాలోని జనాన్నీ,వైదిక సంస్కృతినీ ఇతర సంస్కృతుల్నీ అదీ ఇదీ అని గాకుండా ప్రపంచంలో యే రెండు వర్గాల ప్రజల్ని పోల్చి చూసినా వారిలో కొన్ని సారూప్యతలూ కొన్ని వైవిధ్యాలూ ఉంటాయి.ఆ ప్రజల్ని కలవనివ్వకుండా ఉంచడం ద్వారా గానీ విడదీసి యెడంగా ఉంచడం ద్వారా గానీ లాభం పొందాలనుకునేవాడు వాళ్ళలోని వైవిధ్యాల్ని మాత్రమే చూస్తాడు,వాటిని వైరుధ్యాలుగా ప్రచారం చేసి వాళ్ళమధ్య విభేదాల్ని పెంచుతాడు!అదే వాళ్లని కలిపి ఇరువర్గాలకీ మేలు చెయ్యాలనుకున్న వాదు వాళ్లలోని సారూప్యతల్ని చూస్తాడు,వాటి సహాయంతో వారిమధ్య ఐక్యతని పెంపొందించటానికి ప్రయత్నిస్తాడు!నేను విడదియ్యటం ద్వారా లాభం పొందాలనుకోవటం లేదు గాబట్టి నాకు ఈ రెండు ప్రాంతాల ప్రజలూ ఒక్కలాగే కనిపిస్తారు!వాళ్ళు విడగొట్టి ప్రయోజనం పొందాలనుకుంటున్నారు గాబట్టి తేడాల గురించే మాట్లాదతారు?!

వాళ్ళ రాష్ట్రం వాళ్ళు తెచ్చుకున్నారుగా ఇంకా యెందుకు తిడుతున్నారు వీళ్ళు మనల్ని అని చాలామందికి ఒక అమాయకమైన అనుమానం వస్తున్నది,కానీ ఈ ధోరణి ఇకముందు కూడా ఉంటుందనేది పచ్చి నిజం!కారణం లేని ద్వేషంతో అనంతకాలం వరకూ మనమీద పడి యేడుస్తూ ఉండే పొరుగు రాష్ట్రం తయారయింది - కాంగ్రెసు అనే ఒక నీచ నికృష్ఠ కమీన్ కుత్తే లాంటి పార్టీ చేసిన విభజన వల్ల.ఆ యేడుపుకి అంతూ ఉండదు,మన అశాంతికి పొంతూ ఉందు!యెందుకంటే,విభేదాలని సరి చేసే యే ప్రయత్నాన్నీ సాగనివ్వకూడదనేది ఆ విభేదాల్ని సృష్తించిన వాళ్ళ మొదటి అవసరం  - ఆ విభేదాలు మాయమైపోతే వాళ్ళ లాభమూ పోతుంది గనక వాళ్ళెప్పటికీ ఆ విభేదాల్ని తగ్గించే ప్రయత్నాల్ని సజావుగా సాగనివ్వరు?! రాష్ట్రం సాధించుకున్నాక గూడా ఆంధ్రావాళ్లని తిట్టడానికి ఇదే అసలు కారణం!యేడుపుకి కారణం తెలిస్తే దానికి పరిహారం చేసుకుని యేడుపుని ఆపవచ్చు.కారణం లేని యేడుపునీ,యేడుపు కోసం యేద్చేవాళ్లనీ యేవరాపగలరు?

ఆరునెల్లకోసారి అధాట్న వచ్చి హడావిడి చేసే పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడిన మాటలు పూర్తిగా అర్ధం లేనివి!తను గందరగోళంలో ఉండి ఆ గందరగోళాన్ని అక్కడ వెదజల్లడం తప్ప పట్టించుకోవాల్సిన సరుకంటూ యేమీ లేదు. తను ఇదివరకు మాట్లాడిన వాటిల్లో కొన్నయినా మంచిమాటలు ఉన్నాయి - ఇప్పుడదీ లేదు.ఆర్టికిల్ 8 వొద్దన్నవాడు వూరుకున్నాడా, రెండు రాష్ట్రాలకీ సంధానకర్తగా ఒక ఐ.యే.యస్ ఆఫీసర్ని పెట్టి ఆ ఆఫీసర్ని ప్రధానమంత్రికి అతికించమన్నాడు,అది తెలంగాణ ప్రభుత్వం మీద కేంద్రం పెత్తనం చెయ్యడం కాదా?విభజన బిల్లులో ఉన్నదే నయం కదా తీసుకెళ్ళి పధానమంత్రి కుర్చీకి కట్టెయ్యడం కన్నా!అది నాకు నచ్చలేదు,ఆ ఒక్క పాయింటు మీద ఫుల్ పోష్టు యేమి వేస్తాంలే అని చూస్తుంటే "ఆంధ్రోళ్లు అనొద్దు.. ఆంధ్రా ఎంపీలకు పౌరుషం లేదా?" అనే ఆయన పోష్టులో అదే పాయింటు కనబడటంతో అక్కడ కామెంటుగా వేశాను..పబ్లిష్ చెయ్యటం,దాన్ని పరామర్శిస్తూ జవాబు చెప్పటం,ఆయన అలవాటు చొపున "స్వస్తి" అనటం అన్నీ జరిగిపోయినాయి..కానీ "ఇదంతా మా ఔదార్యమే.. మీ హక్కు కాదు..!!" పోష్టు చూశాక్ మాత్రం వూరికే ఉండలేకపోతున్నాను,సరయిన జవాబు చెప్పి తీరాల్సిందేననిపించింది!యెంత విషం కక్కుతున్నారు చదువు సంస్కారం,విచక్షణ యేదీ లేదా వీళ్ళకి అనిపించింది! 

మధ్యలో నీహారిక ఉరఫ్ ఆకుల ధన ఉదయ లక్ష్మి అనే ఒకావిడ యేదో పుడింగిలాగా వెళ్ళి ఒక తింగరి కామెంటు వేసింది!కేసీఆర్ ముఖ్యమంత్రవుతాడు అని అప్పుడే చెప్పిందట,కానయితే రాజమార్గం వదిలి దొడ్డిదారిన వెళ్తాడని వూహించి అఘోరించలేదట! అందుకనే కేసీఆర్ అంటే ఒక సైడున లవ్వూ ఒక సైడున హేటూ నట!యేదో ఒక వైపు నుంచే చూసి అఘోరిస్తే పొయ్యేదానికి రెండు వైపుల్నించీ చూట్టం దేనికి?కాసేపు పొగట్టం కాసేపు తిట్టటం చేసి జనానికి తిక్క పుట్టించటం దేనికి?అంతా మెంటల్ తెలివి!కేసీఆర్ గారూ మా వూళ్ళో మీ జండాలు నాలుగు కనపడుతున్నాయి,ఇక్కడ కూడా పోటీ చేయండీ అని కూడా అఘోరించగలదు!ఒక మాట కాదు ఒక తీరు కాదు,ఒక విధానం లేదు ఒక సిధ్ధాంతం లేదు - యెందుకీ బహురూపుల సంత?బాబు దొంగ అని తెలిసినా మీరు బాబుని సమర్ధిస్తున్నారు అని వరూధిని బ్లాగులో అంత భీకరంగా నన్ను విమర్శించి ఇక్కడ "సి.బి.ఐ ఒకవైపు సతాయిస్తుంటే" అని కునిష్ఠి పెద్దరికం చూపిస్తూ సమ్యమనం కోసం బతిమిలాడుతున్నది - యెవర్ని?

రోజుకోసారి తన కృతకభాషాపాండిత్యంతో ఆంధ్రోళ్ళని తిడుతూ పుంఖాలు పుంఖాలుగా పద్యాలు రాస్తూ సరస్వతీ దేవికి కూడా తన ద్వేషగీతాలకి రికార్డింగు డ్యాన్సు చేసే దుస్థితి కల్పించిన వాడు ఈ పుచ్చొంకాయ పాండిత్యానికి మురిసి ముక్కలై తిట్టడం మానేస్తాడా?తనదైన శైలిలోనే స్వస్తి వాక్యాలతో గడ్డి పెడుతూ జవాబు చెప్పాడు:"తెలంగాణులు సంయమనం పాటించడం వల్లనే ఇక్కడ తెలంగాణలో ఆంధ్రవాళ్ళు హాయిగా శాంతియుతంగా జీవించగలుగుతున్నారు. తెలంగాణులు అమాయకులు. కుడుమంటే పండుగ అంటారు. ఎవరైనా నవ్వుతూ మాట్లాడితే వాళ్ళు మంచివాళ్ళనుకుంటారు. లోపల ఒకటి పెట్టుకొని బయటికొకటి మాట్లాడరు! ఏదైనా అసమ్మతి ఉంటే ముఖం ముందటే చెప్పేస్తారు. పై పై మెరుగులతో మాట్లాడరు. వాళ్ళకు ప్రేమించడం తెలుసు...ద్వేషించడం తెలియదు. ఒకవేళ ద్వేషిస్తే జీవితకాలం ద్వేషిస్తారు. మొదటే క్షమాగుణం కలిగి వుంటారు. తాము చూపినది అకారణ క్షమ అని తెలిస్తేమాత్రం వాళ్ళంత కఠినులు ఉండరు. ఆ కఠినత్వం వాళ్ళు తమను మోసం చేసిన వారిపై చూపిస్తారు. అంతే కానీ, సంయమనం కోల్పోరు. వాళ్ళు సంయమనం కోల్పోయేవాళ్ళే అయితే అరవై ఏండ్లు ఆంధ్రవారిని భరించేవాళ్ళేకారు. కాబట్టి మీరు సంయమనం గురించి మమ్మల్ని హెచ్చరించనవసరంలేదు." అని.అయినా తెలంగాణ కోడలినని చెప్పుకునే ఈ మనిషి కనీసం తెలంగాణ గురించి మాత్రమే ఆలోచించి మెట్టినింటిలో ప్రశాంతంగా ఉండకుండా ఇంకా ఆంధ్రా గురించి ఆందోళన పడుతూ సామరస్యం కోసం వాళ్ళని ప్రాధేయపడట మేమిటి?

దానికి నేను చెప్పిన జవాబు ఇది:"ఆంధ్రావాళ్లని మీరు భరించిందేమిటి?విభజనకి ముందు సమైక్య రాష్ట్రంలో హైదరాబాదు ఆదాయం యెంతో తెలుసా? అప్పటి రాష్ట్రంలో ఉన్న రాయలసీమ,తెలంగాణ, ఆంధ్ర అనే మూడు ప్రాంతాల ఒక్కో ప్రాంతం నుంచీ యెంత వస్తుందో ఒక్క హైదరాబాదు నుంచే వాటికి దీటుగా వచ్చేది!అందుకేగా మీరు కూడా హైదరాబాదు తెలంగాణ గుండెకాయ అని దాన్ని యూటీ చెయ్యడానికి ఒప్పుకోనిది!మొహమాటం లేకుండా చెప్పాలంటే మేధావుల దగ్గిర్నుంచి చిన్నపిల్లవాడి వరకూ హైదరాబాదు ఆదాయంలో సింహభాగం ఆంధ్రా పారిశ్రామికవేత్తల నుంచీ వ్యాపారవేత్తల నుంచీ వస్తున్నదని చెప్తాడు!ఇవ్వాళ విభజన అనంతరం మీ ముఖయ్మంత్రి కూడా వాళ్ళని పొమ్మనకపోగా వాళ్ల సేవలు మాకు కావాలి అంటుండదం మీకు తెలియదా?మాకు తెలియదా?యాభయ్యేళ్ల క్రితం నిజాము కట్టిన కట్టడాల గురించి కూడా చరిత్రలు చెప్పేవాళ్లకి విభజన సమయంలో యే ప్రాంతపు ఆదాయం యెంతో లెఖ్ఖలు తెలియవా? 

ఆదాయం పెంచగల సత్తా వున్నవాళ్ళు గనకనే ఇవ్వాళ్టికీ అక్కడనుంచి మీరు వాళ్లని కదిలించలేకుండా వున్నారు,అవునా కాదా?పొరపాటున మీరు తన్ని తగిలేస్తే తెలంగాణ ఆదాయంలోనే ఒక పెద్ద బొక్క పడుతుంది,అది తెలుసా మీకు? మాటల్ని పొదుపుగా వాడటం మీకే మంచిది! ఒక మాటతో సరిపోయేచోట పదిమాటలు మాట్లాడితే ఒకమాతతో సరిపెట్టినప్పటికన్నా వాటిలో యే నాలుగో అయిదో తప్పుడు మాటలు వస్తాయేమో ఇరుక్కుపోతాం అనే వివేకంతోనన్నా తక్కువగా మాట్లాడటం నేర్చుకోండి!మీరు ఆంధ్రావాళ్లని భరించేదేమిటి?వాళ్ళు మొట్టమొదట అక్కడ అడుగుపెట్టినప్పుడు సాటి తెలంగాణ వాడయితే 10 ఇస్తాడు, వాళ్ళు ఇక్కడ భూములు కొనడానికి లిటిగేషను ఉంది గనక ఆంధ్రావాడికి అమ్మ్మితే 30 ఇస్తాడు అనే విధమైన తెలివిని అప్పటి స్థానికులు చూపించడం వల్లనే తెలంగాణా వ్యాపారవేత్తలు అప్పట్లో వ్యాపార పారిశ్రామిక రంగాల్లో ప్రవేశించలేకపోయారు - నిజమైన చరిత్ర చదవండి తెలుస్తుంది! అప్పట్లో ఆ పోటీని తట్టుకుని యెదిగిన మీ తెలంగాణా ప్రాంతపు పెద్దమనిషే తన జీవితానుభవాల్ని చెప్తూ "ఆంధ్రావాళ్ళు పోటీపడి భూములకి విపరీతంగా రేట్లు పెంచెయ్యడంతో మాలో చాలామంది వెనకబడి పోయారు" అని తను చూసినదాన్నే చెప్పాడు. ఇప్పటికయినా మీ అనుబవాల నుంచి పాఠాలు నేర్చుకుంటే యెదుగుతారు తప్ప మమ్మల్ని విమర్సిస్తే లాభమేమిటి? తెల్లారి లేచి నోరు తెరిస్తే చాలు సామాన్యుల్ని మేమేమీ అనట్లేదు మమ్మల్ని దోచుకున్నవాళ్ళనే తిడుతున్నాం అని మీరు యెవరినయితే తిడుతున్నారో ఇవ్వాళ కూడా మీ ముఖ్యమంత్రీ మీరూ వాళ్ళనే నెత్తిన మోస్తున్నారు మా తెలంగాణ వృధ్ధిలోకి రావడానికి మీరే సాయం చెయ్యాలె అని - అది యెక్కుతుందా! పెట్టిన చేతిని కొరుకుతున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? 

మరోసారి మీ మాటల్ని సరిచూసుకోవడానికి ఇవ్వాళ తెలంగానలో యేమి జరుగుతుందో చెప్తాను,"నిన్నటిదాకా మా తెలంగాణాని దోచుకున్నారు అని యెవరిని తిట్టారో యెవరి దోపిడీని బూచిగా చూపించి తెలంగాణాకి వీరివల్ల జరిగిన అన్యాయానికి ప్రతిగానే మేము రాష్తం విడగొట్టుకోవాలనుకున్నాము అని చెప్పారో ఇవ్వాళ్టికీ వాళ్ళు అక్కడే ఉన్నారు,ఆ దోపిడీ దారులు లేనిదే తెలంగాణా అభివృధ్ధిపధంలో పయనించదు అని నిష్కర్షగా మీ ముఖ్యమంత్రియే స్వయంగా అంగీకరించాక కూడా ఆంధ్రావాళ్ళు దుర్మార్గులని అంటున్నారంటే మరొకరు వాదించి రుజువు చెయ్యాల్సిన అవసరం లేకుండా మీ వాదన అబధ్ధమని మీరే ఒప్పుకుంటున్నట్టు" - అర్ధమయిందా?ఇవ్వాళ్టికీ మీకు రాష్ట్రపు ఆదాయం పెంచటానికి ఉపయోగపడుతున్న వాళ్ళని దొంగలని అనడం పెట్టిన చేతిని కొరకదం అనికాక మరేమని అంటారో మీరు చెప్పండి నేను వింటాను! 

ఇవ్వాళ మిమ్మల్ని నిలవలో ఉంచింది వాళ్ళ కష్టమే,కావాలంటే మీ ముఖ్యమంత్రినే అడగండి?!గణాంకాలతో సహా సాక్ష్యాలు ఉన్నాయి గనకనే హైదరాబాదు ఆదాయంలో మా వాటా మాకు పంచమని అడిగాం.సూది మొనమోపినంత కూడా ఇవ్వమన్న దుర్మార్గం మీదే! ఇప్పుడు ఇద్దరూ కలిసి చర్చించుకుని న్యాయంగా పంచుకోమని చెప్తున్న షెడ్యూలు 10లో ఉన్న వాట్ని కూడా లుంగజుట్టి లాగేసుకోవాలనుకుంటున్న అసలైన దోపిడీ మీదే!! 

దాన్ని కప్పుకోవటానికి మాకు దుర్మార్గం అంటగడుతున్నారు - మోసాలతోనూ గయ్యాళితనంతోనూ అబధ్ధాలతోనూ నిర్మిస్తున్నారా తెలంగాణని!మొగుణ్ణీ కొట్టి మొగసాలకి యెక్కడం అనేది మీకే వర్తిస్తుంది,మాకు కాదు?!"

వాళ్లని నిందిస్తున్నట్టున్న నా రాతలు ములుకుల్లా తగిలాయంటున్నాడే గానీ వాళ్ళు అన్న మాటల్ని ప్రస్తావిస్తే మాత్రం దానికి మాత్రం జవాబు ఇవ్వడం లేదు ఆ బ్లాగు యజమాని!తిరపతి సన్నివేశం ఒక్కటే మహా దుర్మార్గం కాబోలు,దానికి ముందు వాళ్ళు చేసినవి చరిత్రలో రికార్దు కాలేదనా ఆ ధైర్యం?

మరో మేతావి జై గొట్టిముకల రంగంలోకి దిగి "ఆదాయం మా ప్రాంతం నుండి వచ్చిందని టెక్కులు పొయెబదులు వాళ్ళను మీ రాష్ట్రానికి రమ్మనండి వస్తారేమో చూద్దాం.అని ఇంత పొడుగున చాలెంజి చేస్తున్నాడు,మరి యెప్పుడో నేనే "వాళ్ళు యెక్కడికెళ్తారన్నది మాకనవసరం వాళ్ళు తెలంగాణని దోచుకున్నారని యాగీ చేసింది మీరు గాబట్టి మీ ముఖ్యమంత్రిని వాళ్ళింకా అక్కడెందుకున్నారని మీరు నిలదియ్యగలరా?" అని తననే చాలెంజి చేశాను గదా?దాన్ని టేకప్ చేసి వాళ్ళ ముఖ్యమంత్రిని నిలదీసి వాళ్ళు తేలంగాణని దోచుకున్నారని చెప్తున్న వాళ్లందర్నీ పేరు పేరునా తేలంగాణ నుంచి తరిమి కొట్టగలరా?తెవాదు లందరికీ ఇది నా చాలెంజ్.

నన్ను చాలేంజి చేసిన ఆ జై గొట్టిముక్కలకి నేను చేస్తున్న ఓపెన్ చాలెంజి ఇది,యాక్సెప్ట్ చేస్తాడా?

24 comments:

  1. గుండు గారి బ్లాగ్ పట్టించుకోవడం వృధా , ఆయనివన్ని ఎత్తి పోతల పధకాలు .
    నమస్తే తెలంగాణా లో నిజంగా ఏముందో ఆయనకీ కూడా తెలియదు , జస్ట్ కాపీ పేస్టు చేసేస్తారు అంతే ..
    జై గారి తో వాదన కాస్త అర్ధవంతంగా ఉంటుంది .
    దయచేసి గుండు గారిని పట్టించుకోకండి .

    ReplyDelete
  2. సోదరా హరిబాబు గారూ,

    మీ వ్యాసంలో "కేతిగాళ్ళు", "నీచ నికృష్ఠ కమీన్ కుత్తే", "పుడింగి", "పుచ్చొంకాయ", "రికార్డింగు డ్యాన్సు చేసే దుస్థితి", "చవిటిపర్ర", "మేతావి" లాంటి వాటి జోలికి నేను పోను. మీ రచనా శైలి మీది, మారిస్తే చిచ్చర పిడుగు బిరుదు ఏమి కావాలి?

    శ్రీకాంత్, మధుసూదన్, నీహారిక గార్ల గురించి మీరు రాసినదానికి వాళ్లకు సమాధానం చెప్పనిపిస్తే చెప్తారు, వాళ్ళిష్టం. నా గురించి మాత్రమె నేను చెప్పగలను.

    నేను ఉద్యమం అంచులో ఉన్నానని నేనెప్పుడూ అనలేదు. తెరాస సభ్యత్యం ఉంటేనే ఉద్యమంలో ఉన్నట్టనే అపోహ మీకుందేమో నాకు లేదు. నేను తెలంగాణా కోసం చేసిందేమిటో అక్కర ఉన్న వారికి తెలుసు. I see no reason why I should explain my contribution to every Tom, Dick & Harry!

    రాష్ట్రం వచ్చాక కూడా ఆంధ్రులను తిడతారు అన్నారు. రాకముందు & వచ్చాక కూడా నేను ఎవరినీ తిట్టలేదు కనుక నాకు ఈ "అభియోగం"తో సంబంధం లేదు.

    మాజీ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఆదాయం సగం కంటే ఎక్కువన్న మీ "వాదన" సరికాదని అక్కడే ఆధారాలు ఇచ్చాను, మీరు దీన్ని చూడలేదేమో? గణాంకాలతో సహా సాక్ష్యాలు ఉన్నాయన్నారు కదా అవేవో ఇస్తే చదివి తరిస్తాను.

    పోనీ ఆంద్ర పెట్టుబడిదారుల వల్లే తెలంగాణా ఆదాయం బాగుండిందని ఒకవేళ (వాదన కోసం మాత్రమె సుమా) ఒప్పుకున్నా, వారికి తగినంత లాభం ముట్టింది కనుక చెల్లుకు చెల్లు అవుతుంది.

    ఇంకో అడుగు ముందుకేసి చెల్లు కాలేదు, ఇంకా అవశేష ప్రతిఫలం ఉంటుందని కూడా వాదన కోసం అనుకున్నా, దాని ద్వారా ఆంధ్రకు హక్కు ఎలా వస్తుందో నాకయితే అర్ధం కావడం లేదు. వస్తే గిస్తే సదరు పెట్టుబడిదారుడికి హక్కు రావాలి కానీ ఆంధ్రకు ఎందుకు?

    ఆయన తన "హక్కు"ను మీకు ధారాదత్తం చేసాడా? అలా చేయడానికి మీరు వారి తాత చుట్టాలు కాదే?

    ఆంద్ర పెట్టుబడిదారులు తెలంగాణాను దోచుకోవడమే ఉద్యమానికి ప్రధమ లేదా ఏకైక కారణమని నేనెప్పుడూ యాగీ చేయలేదు. To paraphrase Bertie Wooster, you must be thinking of a different chap.

    I don't take up challenges that don't concern anything I said or did just to satisfy some guy's ego, gotcha!

    ReplyDelete
    Replies
    1. నేను మీ అందరినీ అడుగుతున్నది ఒకటే - మీరు యెవరినయితే మా సంపద నతా దోచుకున్నారని తిట్టారో వాళ్ళ వల్లే మేము అన్యాయమై పోయామని అన్నారో వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు కదా,మీ ముఖ్యమంత్రియే ఇప్పటికీ మీరు ఇక్కడే ఉండాలి అని అంటుంటే ఆ దోపిడీ అనే కారణం అబధ్ధమా కాదా అని మాత్రమే.అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పకుండా అడగని వాటికి చెప్తూ అదేదో సినిమాలో "వాడు చెప్పిన జవాబులు కరెక్టే నువ్వు ప్రశ్నలు మారిస్తే సరిపోతుంది" అన్నట్టూ జవాబు చెప్పేవాళ్ళని "కేతిగాళ్ళు" అని కాక యేమని అనాలి?కందకి లేని దురద లాగ "బాబుని దొంగ అయినా సమర్ధిస్తున్నారు" అని నన్ను అంత ఘాట్టిగా విమర్శించి మళ్ళీ తనే "పాపం సి.బి.ఐ మూలంగా ఇబ్బంది పడుతూ" అని జాలి నటించే నీహారిక పుడింగి కాదా/అయినా అదేమయినా అనకూడని మాత కాదే?అందరూ ప్రతి చోటా ప్రతివాళ్ళకీ వాడుతున్న మాటే గదా!

      Delete
    2. దయచేసి నేను ఎవరినీ తిట్టలేదని గమనించండి. ఆంద్ర పెట్టుబడిదారులనే ఎవరినీ వెళ్ళగొట్టాలని ఎప్పుడూ అనని నేను ఇప్పుడు మీకోసం అలా ఎందుకు అంటాను?

      మీరు లెక్కలు ఉన్నాయన్నారు కనుక వాటిని చూడాలని కుతూహలంగా ఉంది.

      PS: నా వ్యాఖ్యలో ప్రతీ అంశం ప్రస్తుత టపా నుండే
      PPS: మధుసూదన్, శ్రీకాంత్, నీహారిక గార్ల పక్షాన నేను వకాల్తా పుచ్చుకోలేదు. This does not mean I endorse what you say about them.

      Delete
    3. వ్దిలెయ్యండి,మీరు అంచున వున్నాను అనై అన్నప్పుదే నేను అంచున వుండటం మధ్యన ఉండతం యేమిటి అని ప్రతి కామెంటు వెయ్యడం కూడా నాకు గుర్తుంటే అసలౌ అనలేదనటం అన్యాయం!నాకో అలవాటు ఉండేది అప్పట్లో ప్రతి కామెంతునీ నా హార్డ్ డిస్కులో దాచుకోవతం,వెతికి చూసి ఆ లింకు చూపిస్తే గుర్తు తెచ్చుకుంటారా?

      Delete
    4. ఈ బటాచోర్ గాడు గోపి వాటం చూపిస్తున్నాడు. వీడొక మేధావి , కల్లు కొండయ్య వీడి ఇంటర్వ్యు ని తీసుకోవటం. ఆంధ్రా పారిశ్రమిక. వేత్తలను తెలంగాణాలో ఎందుకుంచుకొన్నారు? సీరియస్ గా సూటి ప్రశ్న వేస్తే సమాధానం లేదు సన్నాసి గాడి దగ్గర.

      Delete
    5. "వెతికి చూసి ఆ లింకు చూపిస్తే"

      సరే ఎదురు చూస్తాను.

      Delete
  3. పెట్టుబడి దారులు బలిసిన కొద్దీ ఈ దేశం లో రాష్ట్రాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.

    క్రెడాయ్ గ్రిడాయ్ అని రియల్ ఎస్టేటు భూతాలు పెరిగేకొద్దీ జిల్లాకో రాష్ట్రం మండాలానికో రాజధాని తయారౌతాయి.
    మధ్యలో వచ్చి మధ్యలో పొయే జీవులం బుర్ర పాడు చేసుకోవడం వృధా!
    Actually Telangana state happened because of Capitalist's strategy ...capitalists got 2 new states to invest more ang get more and more profits.
    Just in next 15 to 20 years we can witness few more states getting decided ....and many more SLUMS also get created.
    Just forget this divisive dramas pease.

    ReplyDelete
    Replies

    1. Getting divided* ...... at the end it's Please ...
      Just typing mistakes.

      Delete
  4. ఆయనంతేనండి అదో కామెడీ క్యారెక్టర్. తెలంగాణా ఉద్యమం జరిగేటప్పుడు ఎన్ని షాప్లు వాళ్ళు నెట్స్ పెట్టుకోలేదు (వీళ్ళు వేసే రాళ్ళూ నుంచి కాపాడుకోవటానికి ). మా ఫ్రెండ్ కి జరిగిన సంగతి చెప్తాను వినండి. ఎవరో ప్లాట్స్ (రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు ఆంధ్రావాడే) వేస్తే ఒక ప్లాట్ కొన్నాడు. కొనే టప్పుడు మొత్తం రిజిస్ట్రేషన్ కాగితాలు అన్ని చూపారు. వీళ్ళు సైట్ చూడాటానికి వెళ్ళినప్పుడు ఏమి గొడవ లేదు. బాగుంది అని తీసుకున్నాడు. తీసుకున్న కొన్నాళ్ళకి ఆ స్థలం అమ్మిన రైతులు ఎదురు తిరిగారు. మా దగ్గర తక్కువ కొని ఎక్కువకి అమ్ముకుంటున్నావని. సరిగ్గా ఈ టైములో తెరాస నాయకులు రంగంలో దిగి రైతుల చేత మళ్ళీ ఆ స్థలం అక్రమిమ్ప చేసారు. వాళ్ళకు నిజంగా తెలియదా వీళ్ళు ఏమి చేస్తారో. రిజిస్టర్ అయిన స్థలానికి మళ్ళీ కొంత డబ్బు ఇచ్చి సర్దుబాటు చేసారు. కొన్నాక తప్పదు కదా. ఈ గుండు మధుసూదన్ లాంటి వాళ్ళు మాత్రం తెలంగాణా వాళ్ళకి ఏ కల్మషం ఉండదు దివి నుంచి భువికి దిగిన సాదు మూత్రులు అంటారు. తిరుపతి సంగటన చెప్తున్నారు ఎన్ని సార్లు రాస్తోరోఖో చేయలేదు వీళ్ళు ఉద్యమం ముసుగులో వాళ్ళు అన్ని చేస్తారు విగ్రహాలు ద్వంసం చేస్తారు కానీ మనం మాత్రమె తెలంగాణా సంస్కృతిని నాశనం చేసేవాళ్ళము. ఎన్ని సార్లు సినిమా షూటింగ్ అడ్డుకోలేదు. మళ్ళీ వీళ్ళు శాంతి కాముకులు మనం దుర్మార్గులం. అయన బ్లాగ్లో ఒక్క పోస్ట్ అయిన ఆంధ్రా వాళ్ళను తిట్టకుండా ఉంటుందా?

    ReplyDelete
  5. i think this Gottimukkala himself is an andhra sur name. May be http://wikiedit.org/India/Gottumukkala/206064/

    ReplyDelete
  6. జై ఆంధ్రప్రదేశ్‌14 July 2015 at 10:25

    మీ పోస్టు బావుంది హరిగారూ.
    తెలంగాణా అభివృద్ధిలో వెనుకబడిందంటూ కొందరు దరిద్రులు తమ రాజకీయ దారిద్రాన్ని తెలంగాణా తల్లి నెత్తిపై రుద్ది నానా యాగీ చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నారు. మళ్లీ వాళ్లే ఈ రోజు భారతదేశంలోనే ధనిక రాష్ట్రమంటూ తెలంగాణా గురించి చెప్తున్నారు. ఇది చాలు వారు ఎలాంటివారో. . .
    సరే జరిగింది నిజానికి మన మంచికే జరిగింది. నేను విభజనకు ముందు కూడా అందరూ సమైక్యం కోసం పోరాడుతుంటే వద్దు విభజన వలననే ఆంధ్రప్రదేశ్‌కు మంచిదని వాదించాను. ఉద్యోగస్తుడినైనప్పటికీ అందరూ సమ్మెలో పాల్గొన్నా నేను దూరంగా ఉన్నాను. నా ఆలోచనలు ఈ రోజున కార్యరూపం దాల్చుతుంటే నాకు చాలా ఆనందం. నా ప్రక్కనుండి సమ్మె చేసిన వారందరికీ ఉక్రోషం కలుగుతోంది.
    విభజన జరుగకుంటే . . .
    విజయవాడకూడా ఒక నగరమేనని గుర్తించేవారమా?
    విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ద్వితీయ శ్రేణి నగరాలు హైదరాబాదు నీడలో కుంగి కృశించిపోతున్నాయనేవిషయాన్ని గుర్తించేవారమా?
    మనకూ మెట్రో వంటి అభివృద్ధి ఫలాలు కావాలని ఆకాంక్షించేవారమా?
    ప్రఖ్యాత విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు ఎన్నింటినో హైదరాబాదు మహమ్మారి మింగేస్తుంటే ఆహా ఓహో అంటూ ఆనందించిన మనం హైదరాబాదు మనది కాదన్నాకే తెలుసుకున్నాము. మనకేమీ లేవని, మనమెక్కడో ఉన్నామని.
    మన తీరప్రాంతం చక్కని అభివృద్ధి వనరు అని గుర్తించేవారమా?
    ఇంకా ఎన్నో చెప్పొచ్చు.
    దయచేసి నిజమైన తెలంగాణా వాదికంటే వాదం ముసుగులో ఎగిరిపడే వె. . లకి (వాడకూడదనిపించినప్పటికీ పెద్దలు శ్రీ చంద్రశేకరరావుగారు లతుక్కోరు, ఇంకా ఎన్నో పదాలు అలవాటుచేసేసారు) బుద్దిరాదు. ఎప్పటికీ ఆంధ్రోళ్లను తిడుతూ కాలక్షేపం చేసేస్తుంటారు. బాధ ఏమంటే దాని పర్యవసానాన్ని అనుభవించేది మన తెలంగాణా బిడ్డలే అని.

    ReplyDelete
    Replies
    1. అవును ఇది మాత్రం నిజం .
      విదిపోయాకే నాకు అర్ధం అయింది మనం ఎంత వెనకబడి ఉన్నామో .. అందుకే నేను కూడా విభజన ని సమర్ధించాను . ఈ భూములు రేట్స్ పెరగడం వల్ల సంపద విభజన జరిగి , కొంచెం లో కొంచెం అయినా పేదరికం తగ్గుతుంది .
      వ్యక్తిగతంగా, దేశం కూడా చిన్న భాగాలుగా విడిపోతే తప్ప మన దేశం బాగుపడదు . యూరోపియన్ దేశాల్లా .
      కేంద్రం లో ఎవడు ఉన్నాడో కూడా తెలియదు , ఎలాంటి వెధవలు నాయకులూ అవుతున్నారో మనం చూస్తున్నాం కదా, అదే దేశం చిన్న బాగాలు గా అయితే మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారో మనకి చక్కగా అర్ధం అవుతుంది . భవిష్యతు లో దేశ విభజన ఉద్యమాలు వస్తే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను .
      :venkat

      Delete
    2. హరిగారూ! అన్యాయానికి బలవ్వడం చేత ఈ పై Anonymous తో ప్రస్తుతానికి ఆంధ్రులంతా ఏకీభవించే మూడ్ లో ఉన్నారు. కానీ ఈ వ్యాఖ్య వల్ల మీకు పొటెన్షియల్ లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది. వ్యాఖ్యలక్కూడా బ్లాగరుదే బాధ్యత అని ఒక లీగల్ క్లాజ్ ఉంది. కనుక వెంటనే డిలీట్ చేయండి.

      Delete
    3. ఆయ్యా,

      ఎమిటా లీగల్ ప్రాబ్లెంస్? పైన రాసిన దానిలో అంత అభ్యంతరకరమైనది ఎముదో అర్థం కావటం లేదు. రాజకీయ నాయకులేమో నోటి కి అదుపు కేకుండా టి.వి. లో, అసెంబ్లిలో తిట్టుకోవచ్చు. బ్లాగులో మాత్రం పదం రాయాలంటే వంద సార్లు ఆలోచించాలా? నీకు కోర్ట్ కేసులు గురించి ఎమైనా తెలుసా? ఒక చిన్న కేసును ఫైల్ చేయాలంటే ఎంతో తతంగం ఉంట్టుంది. స్థలం ఆక్రమిస్తే కోర్ట్ కెళ్లితే అది తేలేటప్పటికి 40 ఏళ్లు పడుతుంది. డబ్బులు ఖర్చు పెట్ట్కొని అదే పనిగా తిరిగితే 40 ఎళ్లు. బ్లాగుల్లో రాసే కమెంట్లపై కోర్ట్ కెళ్లితె 100 ఏళ్లు కూడ పట్ట వచ్చు.

      బ్లగుల్లో కామెంట్లు రాసి పోలిస్ కేసుపెట్టి జైల్లో వేసె పనైతే ఊర్లో ఉండె ముష్టి వాళ్ల చేత కామెంట్లు రాయించి జైలి కి పంపితె సరి వాళ్లకి తిండైనా దొరుకుతుంది.

      Delete
  7. మిత్రులు పోష్టు బాగుందని ప్రశంసించినందుకు సంతోషం.యెందుకంటే హడావిడిగా రాసినట్టు ఉన్నా రాయడానికి చాలా టైము తీసుకున్నాను!గొట్టిముక్కల యెత్తి చూపించిన ప్రతి మాటతో సహా ప్రతి పదమూ ఆలోచించి రాసిందే!గొట్టిముక్కల ఆ బ్లాగులో "వాళ్లని మీ ఆంధ్రాకి తీసుకుపోతారా" అని నన్ను చాలెంజి చేసినందుకే ఇక్కడ చాలెంజి చేశాను తప్ప అతను తన జవాబులో చెప్పినట్టు "ఫలానా జై అనే వ్యక్తి ఆంధ్రావాళ్ళని తిట్టాడు" అనే లాజిక్కు నేను వాదలేదు.ఆఖరి వాక్యం జాగ్రత్తగా చదివితే అతనికి కూడా అర్ధమవుతుంది!యే ఒక్క మాటకీ పదేళ్ళ తరవాతయినా సరే "అయ్యో,ఆ మాట వాడకుండా ఉంటే బాగుండేది కదా" అనే దుస్థితి నాకు రాదు!కాంగ్రెసుని ఇంకో పది బూతుల్ని కలిపి తిట్టినా యేమాత్రం సంకోచపడను నేను."కాంగ్రెసుని ద్వేషించడం నా జన్మహక్కు" అని యెపుడో తెగబడి చెప్పాను.

    ఇప్పటి వర్కూ అంతా మాకే కావాలి,మా ప్రాంతంలో పెట్టుబడులు పెట్టటం మీ వెర్రిపుల్లాయి తనం కింద తేల్చెయ్యడ మొక్కటే కాదు - నన్ను బాధపెడుతున్నవి చాలా ఉన్నాయి.తెలుగువాళ్ళు తెలుగుకన్నా ఇతర భాషల్ని పెద్ద చెయ్యడం అనే కామన్ పాయింటు గురించి ఇద్దరు తెలుగు కవులు తమదైన సైలిలో విమర్శిస్తే ఒకర్ని "ఔట్సైదర్" అనీ ఒకర్ని "ఇన్సైదర్" అనీ ముందుగానే గోద కట్టి పుష్పవిలాపం లాంటి సుకుమారమైన భావాలతో కవిత్వం చెప్పిన మహాకవిని దుర్మార్గుదని తిట్టేశారు!

    ఇవ్వాళ మనం బ్లాగుల్లో రాస్తున్నట్టుగానే ఒకపుడు యెవడి మాందలికంలో వాడు మాట్లాడితే యెవడికీ పూర్తిగా అర్ధం కాదు గాబట్టి కామన్ తెలుగు అనేదాన్ని ప్రతిపాదిస్తే "రెండున్నర జిల్లాలోళ్ళు రెండున్నర కులాల భాషని మామీద రుద్దాలని చూస్తున్నారు" అని యాగీ చేసిన పెద్దమనిషి అయినా సరే ఆ కాళోజీనీ వాళ్ళ ప్రాంతం వాడే అయిన పోతన్నని నేను కానీ మీరు కానీ ఇప్పటికీ మాకు "ఔట్సైదర్" అని అనటం లేదు!

    అప్పటి పరిస్థితిని బట్టి కాళోజీ కామన్ తెలుగుని వ్యతిరేకించడం ఒక ఓషియోపొలిటికల్ అనాలిసిస్ మాత్రమే అనుకుని సర్దుకుపోతున్నామే తప్ప కాలోజీని దుర్మార్గుదని మనం అనటం లేదు!

    ఈ మధ్యనే గోరేటి వెంకన్న తెలంగాన పదిజిల్లాల గురించి బ్రీత్లెస్ పాట రాస్తే వినీ వినగానే ప్రజలో ఒక సీరియస్ చర్చ మధ్యలో పనిమాల మెచ్చుకున్నాను నేను!

    అదేనిన్నటి రోజున "నమో అనమో జనని ఆంధ్రపదెశ్ నమః" పాటని ఆంధ్రా బ్లాగర్లు తమ బ్లాగుల్లో పోష్టులుగా వేసి ముచ్చత పడుతుంటే ఒక్కరు కూడా నోరు విప్పి బాగుందనై అనలేదు,మనకేనా ఈ దురద?

    విభజన చట్టంలో పదో సెడ్యూలు అనేది యెందుకు ఉంది?ఇద్దరూ కూర్చుని పంచుకోమని పెట్ట్టిన 140పైచిలుకు కంపెనీల్ని లుంగజుట్టి లాక్కుపోవాలనుకోవటం న్యాయమా?

    అడిగిన యే ప్రశ్నకీ సూటిగా జవాబులు చెప్పలేరు గానీ "కేతిగాళ్ళు" అన్నందుకు రోషపడుతున్నారు?!

    అవును నేంప్పటికీ చిచ్చరపిడుగునే,యెప్పటికీ అట్లాగే ఉంటాను - బ్లాగులెకంలో నేనున్నంతకాలం ఆంధ్రాని గానీ ఆంధ్రప్రాంతం వాళ్లని గానీ ఒక్క మాట అననివ్వను,యాదాద్రి నృసింహుడే నాకు సాయమొస్తాడు!

    ReplyDelete
    Replies
    1. నేను ఆంధ్రులను తిట్టారని మీరన్నా అనకపోయినా నాకు అప్రస్తుతం. నేను తిట్టలేదు కనుక ఈ టపాలో సదరు "తిట్ల" గురించిన అంశాలకు నాకు సంబంధం లేదని అన్నాను.

      మీరు ఎటువంటి భాష వాడినా, అదీ మీ సొంతబ్లాగులో, నాకు ఉక్రోషం లేదు. వాటి జోలికి పోననడం ఆక్షేపణ కాదు.

      పదో షెడ్యూల్ తరహా అరెంజేమెంట్లు గత పునర్వ్యవస్తీకరణ చట్టాలలో కూడా ఉన్నవే. ఉ. చత్తీస్గడ్ ఆవిర్భావ చట్టంలో ఎనిమిదో షెడ్యూల్, హర్యానా చట్టంలో పదహారో షెడ్యూల్ వగైరా.

      మా ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం "మీ" తప్పు కాదు. లాభాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం పెట్టుబడి సహజ లక్షణం. లాభావకాశాలు ఉన్నప్పుడు వీడు కాకపొతే ఇంకొకడు వస్తాడు. రేప్పొద్దున ఆంధ్రలో అవకాశాలు వచ్చినప్పుడు ఆంధ్రులే కాదు ఎవరయినా వెళ్ళొచ్చు.

      ఆశించిన ప్రతిఫలం ముట్టిన వ్యక్తి తానేదో ఉద్దరించానని అనుకోడు. ఒకవేళ అనుకున్నా సదరు క్రెడిట్ వ్యక్తికే తప్ప ఆయన "సొంత ప్రాంతీయులకు" ఏమీ preference ఉండదు.

      Delete
    2. చాలా విషయాలు చక్కగా చెప్తారు గాబట్టి మీకు తెలియదనుకోను.ప్రతిసారీ "ప్రతిఫలం ముట్టింది గాబట్టి పట్టించుకోనక్కర లేదు" అనీ "అది ఆ వ్యక్తులక తప్ప వారి సొంత ప్రాంతీయులకు ఉందదు" అని ఈ మధ్యనే కొత్తవాదం మొదలు పెట్టారు గాబట్టి కొంత విప్లంగా చెప్తాను.

      ఒకచోట ఒక వ్యక్తి పరిశ్రమ కానీ వ్యాపారం కానీ మొదల్ పెట్టాదంటే లాభం వస్తుందని గ్యారెంటీ ఉంటేనే పెడతాడు!అదీ "పెద్దమనుసుల ఒప్పనదం" మెలిక వల్ల 10కి 30 పెట్టిన వాడు తప్పకుండా 50 ఆశిస్తాడే తప్ప 35తో సరిపెట్టుకోద్డు.కానీ పెట్టుబడి పెట్టిన మొదటి సంవత్సరమే లాభాల్లో పరుగులు పెట్టగలిగిన వ్యవహారం యెక్కదయినా నడుస్తుందా?ఒకప్ప్డు అమెరికాలోనూ అక్కడక్కడా బంగారు గనుల తవ్వకాలు జరిగేవి చార్లీ చాప్లిన్ ఒక సినిమా కూడా తీసాడు.మొదట వేసుకున్న ప్లాను తేడా రాకుండా అమలు జరిగితే 2సం|| గానీ తేడా వస్తే 5సం||గానీ పట్టవచ్చు.ఈ మొదటి విడత లాభాన్నంతా అతను సొంతానికి వాడుకుంటే 6సం|| పెట్టుబడి తమరు ఇస్తారా?ఒక సంవత్స్రరపు లాభం నుంచే మరో సంవత్సరపు పెట్టుబడిని కూడా తెస్తేనే బడ్డీ కొట్టు వాడయినా బిజినెస్సు కంటిన్యూ చేస్తాడు,అవునా కాదా?

      అక్కడి లాభాలు అక్కడే పెట్టుబడి పెట్టి అఘోరించటం వల్లనే ఆ యెదుగుదల జరిగింది గనక కేవలం దాన్ని బూచిగా చూపించి దోపిడీ అని ముద్ర వేసి ఇంత చేశారు గనక మీరు అన్నా అనకపోయినా అది మావాళ్ళ వెర్రిబాగులతనమే!ఇది మన రాజధాని అనుకుని సంపద పెంచటం పట్ల అంత వీరావేశం చూపించతం అప్పటివాళ్ళ దేబెతనమయితే మన కష్టానికి లెఖ్ఖ ప్రకారమే యెంతొస్తే అంత తీసుకుందాం అని అనుకోకపోవటం ఇప్పటివాళ్ళ దేబెతనం,పోనివ్వండి మీరు మా బాధ గురువులు!

      మరోసారి న అఖరైవాక్యం చదవండి.నేను రిఫరెన్సుగా ఇచ్చిన బ్లాగులో మీరు నాకు "వాళ్ళని మీ రాష్ట్రానికి తరలించుకు పొగలరా?" అని చాలెంజి చేసిన దానికి ప్రతిగానే మీకూ నేను చాలెంజి చేశాను.మీరు ఆంధ్రావాళ్ళని తిట్టారు గాబట్టి మిమల్ని చాలెంజి చేస్తున్నానై ఉందా అక్కడ?

      2.ఆశించిన ప్రతిఫలం ముట్టిన వ్యక్తి తానేదో ఉద్దరించానని అనుకోడు. ఒకవేళ అనుకున్నా సదరు క్రెడిట్ వ్యక్తికే తప్ప ఆయన "సొంత ప్రాంతీయులకు" ఏమీ preference ఉండదు.

      మామూలు లెఖ్కల ప్రకారం ఉండదు గానీ మీ ప్రాంతీయవాద సిధ్దాంతం ప్రకారం ఆ మనిషి యే ప్రాంతం వాడయితే ఆ ప్రాంతానికి రూపాయల్లో లాభం ఉందకపోయినా గుర్తింపుకి సంబంధించిన క్రెడిట్ అయినా ఉంటుంది.అలా ఉండకపోతే మీ ప్రాంతం ఆధారిత సిధ్ధాంతమే తప్పు అవుతుంది మరి?!

      Delete
    3. వ్యాపారం అన్నాక రిస్క్ రిటర్న్ రెండూ ఉంటాయి. రెంటినీ బాలెన్స్ చేసుకుంటూ పోయేవాడే సఫలం అవుతాడు.

      పెట్టుబడి ఎక్కడ ఎలాంటి రంగాలలో పెట్టాలన్నది ఆపర్త్యూనిటీ కాస్ట్ (అవకాశాల బేరీజు) బట్టి నిర్ణయిస్తారు. వచ్చిన అవకాశం జారవిడుస్తే వేరొకడు తన్నుకుపోతాడు. "మన రాజధాని" అంటూ సెంటిమెంటులు పెట్టుకుంటే కొంప కోల్లెరవుతుంది.

      "మావాళ్ళ వెర్రిబాగులతనమే"

      వాళ్ళు మీవాళ్ళని మీరు కాదు అనాల్సింది, వాళ్ళు అనాలి. అలా ఒక్కడు అన్నాడా? You can't own someone who does not agree to your owning them.

      మీరు చాలెంజ్ ఎందుకు చేసినా నా జవాబు ఒక్కటే. I don't take up challenges that don't concern anything I said or did just to satisfy some guy's ego, gotcha!

      "మీ ప్రాంతీయవాద సిధ్దాంతం"

      ఇక్కడ "మీ" అంటే నేను కాను కనుక నాకు అనవసరం.

      Delete
    4. పెట్టుబడి ,వ్యాపారం గురించి తాగి ముసుగేసుకొని పడుకొనే సోమరిపోతుల దగ్గర నుంచి పాఠాలు నేర్చుకొనే దుస్థితిలో ఆంధ్రా వాళ్లు లేరు. నీ క్లాసు కొండిగాడికి తీసుకో. ఆంధ్రా పెట్టుబడి దారులు మూలాలను మరచే వారైతే, వాళ్ల కంపెనిలలో ఆంధ్రా ఉద్యోగులే ఎందుకు ఉంటారు? ఉద్యమ సమయంలో మీ నాయక సన్నాసుల ఆరోపణ అదే కదా! తెలంగాణ లో ఉండే ఆంధ్రా కంపెనిలలో ఆంధ్రోళే ఉంట్టున్నారని కె.సి.ఆర్. ఆరోపించలేదా? ఇందుమూలంగా చెప్పేది ఎమిటంటే ఆంధ్రా పారిశ్రామిక వేత్తలు మూలాలని మరచిపోలేదు. ప్రతి వాడు ఎదో ఒక party తరపున ఎన్నికలలో నిలబడతాడు. ఫాక్టరిలను తరలించకుండా తెలంగానలో వ్యాపారం చేస్తే ఎన్నికలాప్పుడు పట్టుకొంటాం. బుద్దిచెపుతాము.
      మా వాళ్లు అంతవరకు వెళ్లరు. తమిళ నాడులోని తెలుగు వారితో ఎప్పుడొ టైప్ లు పెట్టుకొని నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటానికి పయత్నాలు ప్రారంభించారు. కర్ణాటకలొ పెట్టుబడిని పెంచుతారు.

      Delete
  8. Haribabu
    see this
    మీ ప్రశ్నలు పంపాల్సిన మెయిల్ ఐ.డి - kondalarao.palla@gmail.com
    ప్రశ్నలు నాకు అందాల్సిన చివరి తేదీ - 10-7-2015 అర్ధరాత్రి 12 గం.ల వరకు.
    ఆ తరువాత ప్రశ్నలు స్వీకరించబడవు.
    today is 15-7-2015 is it a mistake? :)

    ReplyDelete
  9. http://ratnaalaveena.blogspot.in/2015/07/blog-post_23.html#!/tcmbck

    ఇది మందు సుదనుడి పైత్యానికి నా రెప్లయ్. వాడెలాగూ నా వ్యాఖ్య ప్రచురించడు కాబట్టి, ఇక్కడ పెడుతున్నాను.:


    నాకు బాగా గుర్తు. ఈ ఎత్తిపొతల పేజీలోనే, ఇంతకు ముందు బాబు కాల్ డాటా కోసం ఫోన్ ఆపరేటర్లని బెదిరించాడని వేశారు. మరి ఈ రోజు సుప్రీం కోర్టులో తెలంగాణా ప్రబుత్వమే తమని బెదిరించిందని ఆపరేటర్లు చెప్పారు. ఈ బూతులెంట్ర బాబు. ప్రపంచంలో పత్రికలలో బూతులురాసుకునేది ఒకటుందంటే అది నీ అవస్తే తేలంగానా బజానా మాత్రమే. ఎమన్నా అంటే అది మా శార్ధం అంటారు. అందుకే...

    సిగ్గు లేదు, ఎగ్గు లేదు .. చెప్పు తీసి తన్నండి..
    మంచితనం వీళ్ళకి సరిపోదు ఇకనైనా మానండి..
    గడ్డితినే నాయాళ్ళని నడ్డి విరగ తన్నండి..
    చచ్చైనా మన పరువును కాపాడుకుందాం రండి..

    ReplyDelete
  10. బల్లే తెలివైనోళ్ళు తెలంగాణోళ్ళు!!అనుకున్నది సాధించటానికి యెంత నీచమైన మాటలైనా మాట్లాడగలరు.మా ప్రాజెక్టులు పూర్తి చెయ్యలేదు,మా నేలని మా రైతుల్ని ముంచ్చేసారు అని గోల గోల చేశారు - లెక్కలు దీస్తే భీమా,నెట్టెంపాడు,కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్తు లన్నీ 70 నుంచీ 85 శాత వరకూ పూర్తయిపోయినై,మరి దేనికి గోల చేసినట్టు?

    అరె, నీ చెతుల్లో లక్ష కోట్లు ఉన్నా అరెకరం భూమిలో ఇల్లు కట్టాలన్నా పునాదుల దగ్గిర్నుంచి స్లాబు పూర్తయ్యేదాకా నాలుగు నెలలన్నా పట్టదా?

    ప్రాజెక్తుల పనులంటే యెడ్డెం తెడ్డెంగా అడావిడిగా చేస్తారా?సిమెంటు పన్లు వర్షాకాలంలో చెయ్యరు!రోళ్ళు పగిలే రోహిణిలో పన్లు జేయిస్తే లేబర్ కాకుల్లా మాడి చస్తారు!యేడాదిలో ఆ ప్రాజెక్టు మీద యెన్ని రోజులు పని జరుగుద్ది?ఇలాంటి సాగలాగుడు యవ్వ్వారం ఒక్క తెలంగాణ ప్రాజేక్టుల కేనా జరిగేది - కాదే!దఫా దఫాకీ నిధులు రెడీగా ఉంచుకున్నా అనుకోని అవాంతరాల వల్ల గూడా పన్లు ఆగుతాయి గదా!

    నీళ్ళ పంపకాల విషయంలో యెక్కువ అన్యాయం జరిగింది రాయల సీమకి!అది వాళ్ళకీ తెలుసు,అయినా సరే రాయల సీమకి నష్టం జరిగితే మాకేంటి నెప్పి అనే రకాలు.

    ఇవ్వాళ ఆపరేటర్లు ఏమాత్రం తడుముకోకుండా తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తుందని చెప్తుంటే ఇన్ని రోజులూ ఆంధ్రా వాళ్లే బెదిరిస్తున్నారని బొంకారు.

    sసిగ్గు లేని మంద!

    ReplyDelete
    Replies
    1. ఎప్పడి ప్రాజెక్టులు ఎప్పుడు కట్టారు? నిజాం కాలం డిసైన్ చేసిన రాజోలీబండకే ఇంకా నిర్ణీత జాలం దక్కడం లేదు కానీ బడాయికి మాత్రం తక్కువ లేదు.

      ప్రాజెక్టులు కట్టగానే సరిపోదండీ నీళ్ళు ఇవ్వాలి. అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో (అదీ అనేక షరతులతో మాత్రమె సుమా) తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా లేని సిద్దాంతాలతో చేసిన కేటాయింపులు సక్రమమూ కాదూ న్యాయమూ కాదు.

      రాయలసీమకు నీటి పంపకాలలో అన్యాయం జరిగిందా? ఎంత & ఎందుకు రావాలి, ఎంత వచ్చింది కూడా చెప్పండి విని తరిస్తాను. ఒకవేళ సీమ మీద అంత ప్రేమ పొంగుకొస్తుంటే డెల్టాకు తగ్గించి ఇవ్వండి ఎవరన్నా వద్దన్నారా?

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...