Tuesday, 12 July 2016

సాంకేతికాంశాలతో రచయిత పెరుమాళ్ మురుగన్ పట్ల చూపించిన సానుభూతిని శ్రీమాన్ కోర్టువారు ఇతని అబద్ధాల వల్ల కులటలుగా ముద్రపడే మహిళల పట్ల ఎందుకు చూపించలేదు?

     పెరుమాళ్ మురుగన్ నవలలో చెప్పిన ఆచారం అక్కడి దేవాలయంలో నిజంగా ఉందా?లేదని దాన్ని విమర్శిస్తున్నవారి వాదన!ఆ సంప్రదాయం అక్కడ లేకుండా పెరుమాళ్ కల్పించినదే అయితే అది ఖచ్చితంగా అతని తప్పే అవుతుంది!అదే నిజమయితే, వారి వాదన నిజం కావడం వల్లనే పెరుమాళ్ మురుగన్ అప్పట్లో వెనక్కి తగ్గాడనేది కూడా మనం అర్ధం చేసుకోవచ్చు.రొమిల్లా దప్పార్ పులిమిన "ఆర్యుల దాడి - ద్రవిడుల అణచివేత" పులుముడు అబధం అని తేలడానికి దశాబ్దాలు పట్టింది - గట్టిగా లెక్కిస్తే ఒక శతాబ్దం!ఈ మధ్యనే ఒక తెలుగు రచయిత "ఆకాశ దేవర" కధ ఇదే రకం ఇతివృత్తంతో రాసినట్టు చదివాను.కాకపోతే ఆ కధలో ఉన్నది వ్యంగ్యం అనీ వాస్తవంగా జరిగిన కధ కాదనీ తెలిసిపోతూనే ఉంటుంది.కానీ పెరుమాళ్ చేసింది అది కాదు.వూరి పేరు చెప్తున్నాడు,దేవాలయం పేరు చెప్తున్నాడు,అక్కడ ఆ సంప్రదాయం ఉందని చెప్తున్నాడు,ఆ సంప్రదాయం వల్లనే కధలోని పాత్ర ఆ సంక్షోభానికి గురయిందని గట్టిగా చెప్తున్నాడు.ఆ ఆలయంలో ఆ సంప్రదాయం లేకపోతే అది ఖచ్చితంగా అతని తప్పే!ఇప్పుడితను చెప్పింది ఖండించకుండా వూరుకుంటే ఆ అబద్ధం నిజమైపోతుంది!

     దేశంలో ఇవ్వాళ ఉన్న అసంఖ్యాకమైన దేవాలయాల్లో అన్నీ కేవలం దర్శనం చేసుకుని వచ్చేవి మాత్రమే  కాదు.కొన్ని ఆలయాల్లో ప్రత్యేక ప్రయోజనాల కోసం పూజలు జరుగుతాయి.వాటిల్లో 90% సంతాన సాఫల్యత కోసమే జరుగుతున్నాయి,తర్వాత ఎక్కువగా జరిగేవి వివహ ప్రాప్తి కోసం,ఆ తర్వాత సర్పదోష నివారణ లాంటివి తక్కువ ప్రాధాన్యతతో జరుగుతున్నాయి.ఈ మురుగన్ వెనక నిలబడి అతన్ని సమర్ధిస్తున్న వాళ్ళ వాదనని ఒప్పుకుంటే అలా అన్ని దేవాలయాల్లోనూ ఎక్కడ సంతానసాఫల్యత కోసం చేసిన పూజలు ఫలించి తమకి పిల్లలు పుట్టారని చెప్పినా మురుగన్ మరియూ అతన్ని సమర్ధించే మేధావులూ,ఈ అసమగ్రమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులూ వాటి వెనక కూడా మురుగన్ అంత గట్టిగా నొక్కి చెప్పిన పరపురుష సంభోగమే కారణం అని అంటున్నట్టు కాదా?

     మొదట రెలీజయినప్పుడు ఎవరూ మాట్లాడలేదు ఇంగ్లీషు వెర్షన్ వచ్చాకే గొడవ చేస్తున్నారు అనటం కూడా తప్పే!మద్రాసులో ఉన్నా తమిళం ఒక్క ముక్క కూడా రాని నాలాంటివాళ్ళు తమిళప్రతి రాగానే చదివి అర్ధం చేసుకోవటం కుదరదు కదా!ఎవరయినా చదివి అందులో ఉన్న కంటెంటు అర్ధం అయ్యాకే రెస్పాండ్ అవుతారు,జరిగింది కూడా అదే.అందులో దురుద్దేశాలూ,కుట్రా అంటగట్టే బదులు వాస్తవం అతను చెప్పినట్టు ఉందా అని చూస్తే చాలదా?అప్పుడు విమర్శించలేదు,ఇప్పుడు విమర్శిస్తున్నారు కాబట్టి అందులో కుట్ర ఉంది అనే వాదనలో పస లేదు.

     పెరుమాళ్ మురుగన్ రాసింది చరిత్రను ప్రతిబింబించే నవల అని చెప్తూ అతను వర్ణించిన ఆచారం ఆ దేవాలయంలో ఏనాడైనా పాటించబడిందా లేదా అనే విషయాన్ని కోర్టు ఎందుకు వదిలేసింది?అసలు పిటిషన్ వేసిన వ్యక్తి ముఖ్యమైన వాదన "ఆ ఆలయంలో లేని ఆచారాన్ని ఉన్నది అని చెప్పి ఆలయాన్నీ ఆ అలయదర్శనం ద్వారా పిల్లల్ని కన్న ఆడవాళ్లని అవమానించాడు" అని అయితే పాతబూతు పురాణాల్ని సాక్ష్యం చూపించి సాహిత్యంలో బూతు ఇదివరకే ఉందిగా అనేస్తే సరిపోతుందా?పిటిసనర్ ఒక విషయం గురించి ప్రస్తావిస్తే కోర్టువారు మరొక విషయం గురించి తీర్పు చెప్పడం ఏంటి?వీపు మీద తంతే మూతి పళ్ళు రాలినట్టు లేదూ!

     ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా అలాంటి ఆచారం అక్కడ ఉంటే,ఉందని నిరూపిస్తే అప్పుడు మాత్రమే పెరుమాళ చేసింది కరెక్ట్ అవుతుంది!లేని పక్షంలో కోర్టు ఇచ్చిందే తప్పుడు తీర్పు!పరమ వాస్తవికంగా చిత్రవిచిత్రమైన సనివేశకల్పనతో ఎంత అద్భుతమైన రచనావిన్యాసం చూపించినా సరే,ఒక ఆలయ చరిత్రని రూపుమార్చి రాస్తే చూస్తూ వూరుకోవడమేనా?

     ప్రాచీన కాలంలో మన దేశంలో చాలాచోట్ల ఇలాంటి ఆపద్దర్మ ఆచారం ఉందని ప్రస్థావిస్తారు చరిత్రకారులు.తాపీధర్మారావుగారు కూడా ఉదాహరణలు ఇచ్చినట్టున్నారు.అయితే, అలాంటి ఆచారాలు గతకాలంలో కొన్ని చోట్ల ఉండటం వేరు,ప్రత్యేకంగా ఒక వూరి పేరునీ,ఒక ఆలయాన్ని ప్రస్తావించి అక్కడ లేని ఆచారాన్ని ఉన్నట్టు చెప్పటం నిజమే అయిన పక్షంలో పెరుమాళ్ తన వూరికి వెళ్ళి తన గ్రామస్తులకి ఏ సమాధానం చెప్పగలడు?మొదట నా దగ్గిర ఆధారాలు ఉన్నాయి అని పుస్తకావిష్కార్ణల్లో దబాయించి చెప్పి చూపించమన్నప్పుడు ఆధారాలు అడిగినప్పుడు చూపించలేకపోయాడు కదా!అప్పటి వరకు ఉన్నదున్నటు రాసిన చరిత్ర అని బుకాయించి ఆధరాలు లేవని తెలిశాక ఇది కేవలం ఫిక్షన్ మాత్రమే అని అడ్డం తిరిగడం ఏ రకమైన భావస్వేచ్చ?తాపీ ధర్మారావు గారు చూపించినట్టు ఆధారాలు చూపించలేకనే గదా అప్పుడు క్షమాపణ చెప్పి బయటపడ్డాడు,అది కొడా కోర్టు పట్టించుకోలేదు - ఎందుకని?ముఖచిత్రం మీద ఆ ఆలయం బొమ్మ ఎందుకు పెట్టినట్టు?అయితే, నేనిప్పుడు ఏదయినా మసీదు చుట్టూరానో,దర్గా చుట్టూరానే ఇలాంటి కల్పననే చేస్తే కోర్టులూ,ఈ పెరుమాళ్ సమర్ధకులూ నన్ను సమర్ధిస్తారా?నాకు కూడా పెరుమాళ పరిస్థితియే దాపరిస్తే ఎటువైపు నిలబడతారు!

     చదువరుల్లో కొందరికి నచ్చని పుస్తకాన్ని నిషేధించటం అవసరమా కాదా అనే జనరల్ విషయాలతో నిండిన సాంకేతిక అంశాలని మాత్రమే కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్టు తీర్పు పూర్తిపాఠం చదివాక కూడా స్పష్టంగా తెలుస్తున్నది.రచయిత ఏదో ఆ దంపతులు లేక మరి కొందరు తప్పనిసరి చేస్తున్నట్టు కూడా కాదు,పుస్తకంలో నుంచి ఎత్తి చూపించిన భాగాల్ని కొన్నింటిని చూసినా అక్కడ ఆచారం పేరుతో విచ్చలవిడి వ్యభిచారం జరుగుతున్నట్టు నవల మొత్తంలో చాలా చోట్ల వర్ణించినట్టు తెలుస్తున్నది - అది కూడా సభ్యసమాజం ఆమోదించాల్సిన ఆధునికత కిందకి వస్తుందా?కోర్టువారి ఆందోళన అంతా పబ్లిషర్లకి జరిగే నష్తము,రచయితకి కలిగే దుఃఖము గురించి తప్ప నవలలో అంత ధాటిగా ఒక వూరి పేరు చెప్పి,ఒక ఆలయం పేరు చెప్పి చిలవలు పలవలుగా అక్కడ లేని ఆచారం ఉన్నట్టు వాస్తవికంగా రాయడం వల్ల అక్కడ సంతానవతులైన తల్లులకి జరిగే సామాజిక పరమైన అవమానం ఎందుకు గుర్తుకు రాలేదో!అక్కడి తల్లుల సంతానసాఫల్యతకి కారణాల్ని తెలుసుకోవడానికి ఇప్పుడు వారిని కోర్టు గదిలో ప్రదర్శించే బదులు వైద్యశాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకోవచ్చు కదా!

     "స్రీ,పురుషుల సంగమం లేకుండా పిల్లలు పుట్టరు" అనే ఒక అందరికీ తెలిసిన సత్యాన్నీ "అప్పటివరకూ పిల్లలు పుట్టలేదంటే వాళ్ళ మగాళ్ళు పిల్లల్ని పుటించలేనివాళ్ళు కాబోలు!" అనే అనుమానాన్నీ "అప్పటివరకూ గర్భం దాల్చనివాళ్ళు హఠాత్తుగా ఆ రోజు తర్వాత గర్భం దాల్చారంటే అక్కడ ఏవరో ఒకరు కారణం అయి ఉండాలి" అనే నిర్ధారణనీ కలిపి ఆలోచించడం వల్లనే ఈ సోకాల్డ్ శాస్త్రీయతా గర్వితులు పెరుమాళ మురుగన్ పక్కన నిలబడి వాదించగలుగుతున్నారు!వేరే ఎవరి ద్వారానూ కాకుండా భార్యాభర్తలు పవిత్రంగా ఉన్న సందర్భాలలో కూడా సుదీర్ఘకాలం పాటు పిల్లలు పుట్టకపోవటానికీ ఇంక పుట్టరేమోనని నీరసపడిపోయిన కాలంలో "దేవుడు వరమిచ్చినట్టు" పిల్లలు పుట్టటానికీ చాలా కారణాలు ఉంటాయి - అవన్నీ వైద్యశాస్త్రపరమైన జ్ఞానం ఉన్నవాళ్ళు ఒప్పుకునే కారణాలే!పురుషుడి వీర్యం మొత్తం శుక్రకణాలతోనే నిండి ఉండదు.కొంత అనవరసమైన జిగట కూడా ఉంటుంది.పురుషుడి నుంచి విడుదలైన వీర్యంలోని అతి సూక్ష్మమైన వీర్యకణాలు విడుదలయిన చోటు నుంచి స్త్రీ గర్భాశయపు గోడకి అతుక్కుని ఉన్న అండాన్ని ముట్టడించి చొచ్చుకుపోవడానికి అవసరమైన ప్రయాణం కోసం ఆ జిగట యంత్రాలలో వాడే కందెన తైలంలా ఉపయోగపడుతుంది.వీర్యం ఎక్కడ విడుదలైందో అక్కడే ఫలదీకరణ జరిగిపోదు,అది కొంత దూరం ప్రయాణించాలి,అక్కడ వెలుగు ఉండదు,వీర్యకణాలకి కళ్ళు ఉండవు,దారి చూపించే నాధుడు ఉండడు - అలా పాకుంటూ పోవడమే!విడుదలైన వీర్యంలో ఒకే వీర్యకణం ఉంటే చాలదు.విడుదలయిన వీర్యంలో తగిన మోతాదులో వీర్యకణాలు లేకపోయినా, ఏ రకమైన బలహీనత వల్లనయినా ఈ వీర్యకణాలలో ఏ ఒక్కటీ అండాన్ని చేరుకోలేకపోయినా ఆ పురుషుడు పూర్తి స్థాయి మగతనం ఉన్నా అతనెప్పటికీ తండ్రి కాలేడు!మగవాడి దేహం బలంగా ఉండటానికీ అతని వీర్యకణాలు అండాన్ని చేరుకోగలిగినంత బలంగా ఉండటానికీ ఏ సంబంధమూ లేదు.

     పెళ్ళయిన కొత్తల్లో ఈ రకమైన లోపాలు మొదలై ఎంతకాలమైనా సాగవచ్చు,ఎందుకు పుట్టా
యో తెలియని లోపాలు  కొంతకాలం తర్వాత ఎలా వచ్చాయో అలానే పోవచ్చు!ఈలోపు దంపతులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు,మానవ ప్రయత్నంగా డాక్టర్ల చుట్టూ తిరుగుతారు, దైవానుగ్రహం కోసం గుడి గోపురాలు చుట్టి వస్తారు - ఆఖరికి  ఆ లోపం పోయి గర్భం దాల్చగానే అంతకుముందు వెళ్ళిన డాక్టరుకి హస్తవాసి అంటగడతారు,దణ్ణం పెట్టుకున్న దేవుడికి మహత్యం అంటగడతారు!పైన చెప్పిన సంతానలేమి రావటానికీ పోవటానికీ కొన్నిచోట్ల దైహిక కారణాలు కాకుండా మానసిక కారణాలు కూడా కారణం అవుతాయి.
-----------------------------------------------------------------
infertility
About 25% of all infertility is caused by a male problem, and in 40-50% of cases it is the main cause, or a contributing cause.

It is sometimes hard to know whether the male factor problem is the only cause, or just a contributing cause to the infertility. Part of the problem is that numbers are just numbers

What matters is not really how many or how fast they swim - but whether they can fertilize the female partner's eggs. This is really a biochemical issue at the molecular level.

Causes
There are a number of causes for male infertility, but they all affect quantity and/or

quality of sperm. These causes include:

The sperm's exit route is blocked (from birth, by scarring from infection, past vasectomy,

etc.)
Retrograde ejaculate (semen is ejaculated backwards, into the bladder)
Sperm production in the testes is low or absent (there can be many causes for this finding)

Low sperm count, also called oligospermia, is the most common cause of male infertility. Complete lack of sperm, called azoospermia, is much less common, affecting less than 1% of the population. Low sperm count is diagnosed when the number of sperm falls below 20 million in a milliliter of semen. (Normal range is between 20 million and 120 million per milliliter of semen.) When sperm count is too low, sperm has a much lower chance of reaching and fertilizing the egg, leading to infertility.

Treatment
Treatment approaches for male infertility varies greatly, depending on the severity of the sperm problem. In mild cases, artificial insemination (or intrauterine insemination, IUI) may be enough. In an IUI cycle to address male infertility, semen sample is prepared and concentrated in the laboratory before it is injected directly into the uterus. Higher concentration and direct injection alone can sometimes overcome male infertility.

Low sperm count is one of the reasons for infertility. We detail out the different ways to increase sperm count, what to include in your diet and which habits to follow. 

These are natural ways to pump up your sperm count and increase your chances of fertility. 
- Zinc deficiency 
- Excessive smoking and drinking 
- Tight underpants 
- Overweight 
- Exhaustion 
- Stress 
- Sperm disorders can affect your sperm count, the quality of the sperm and the movement. If sperms are not ejaculated often, their mobility goes haywire. Sperm disorder affects the shape of the sperm too. In terms of ejaculation and infertility, erectile dysfunction, failure to ejaculate or even premature ejaculation can be a problem during sex and also for conceiving. 

Normal sperm count: 
The normal volume varies from 1.5 to 5.0 milliliter per ejaculation. 
The sperm count varies from 20 to 150 million sperm per milliliter. 
At least 60% of the sperm should have a normal shape and show normal forward movement (motility). 

Vitamins that can increase sperm count: 

1) Vitamin B: Sources of Vitamin B: Cheese, eggs, milk, yoghurt, fortified cereals, spinach, legumes, whole grains and nuts. 

2) Zinc: Sources of zinc: Oysters, sesame and sunflower seeds, ginger, wheat germ, red meat, dark chocolate, watermelon seeds and pumpkin seeds. 

3) Selenium: Sources of Selenium: Shellfish, liver, fish, sunflower seeds, crabs, prawns, lobsters, and cereals made from rice, wheat and oats. 

Ways to Increase Sperm Count: 

1) Indulge in sex and masturbation less often. 
2) Avoid processed and unhealthy food choices. 
3) Practice yoga to reduce Stress and improve health. 
4) Avoid wearing tight underwear to avoid overheating the testicles 
5) Get sufficient sleep 
6) Lose weight to balance the hormones 
7) Avoid sitting for long hours. 
8) Get a good body massage to improve circulation. 

Yoga exercises to improve fertility: 

1) Agnisaar kriya 
2) Halasana 
3) Setubandhasana 
4) Dhanurasana 
5) Ashwani Mudra 
6) Bhastrika Pranayam
-----------------------------------------------------------------
     ఉదాహరణకి గతకాలంలోనూ ఈ ఆధునిక కాలంలోనూ కొంతమందికి వైద్యులు మొదట ఎవర్నయినా దత్తు తీసుకోమనే సలహా ఇవ్వటమూ,వాళ్ళు దత్తు తీసుకున్న కొంత కాలానికి సహజమైన పద్ద్ధతిలోనే పిల్లలు పుట్టటమూ కూడా జరుగుతూనే ఉన్నాయి.ఒకప్పుదు తీర్ధయాత్రలకి వెళ్ళమని చెప్పటం కూడా గాలిమార్పు వల్ల వాళ్ళ దేహాల్లో మార్పులు జరిగ్ పైన చెప్పిన లోపాలు వాటంతటవె పోవడం కూడా జరుగుతున్నవే!అలాంటి ప్రతి కేసులోనూ ఈ మేధావులు పెరుమాళ్ మురుగన్ బల్లగుద్ది చెప్పిన అపరిచితుల అక్రమ నిర్వాకమే కారణమని నిర్ధారించి చెప్యున్నట్టా?.దంపతులకి కొంతకాలం పిల్లలు పుట్టకుండా ఉండి వైద్యుడి దగ్గిరకి వెళ్ళకుండా ఏదయినా ఒక గుడికి వెళ్ళి మొక్కుకుని పైన చెప్పిన మానసిక కారణాల వల్లనో, మరేదైనా ప్రాకృతికమైన మార్పుల వల్లనో వచ్చిన ప్రతి గర్భం వెనకా పెరుమాళ్ మురుగన్ చెప్పిన అనామకులతో అక్రమ సంభోగమే కారణం అని తేల్చి చెప్పాలని ఈ మిడిమిడి జ్ఞానపు హేతువాద మూర్ఖులు ఎందుకింత తొందర పడుతున్నారు?

     సంతానలేమి అనే విషయం చుట్టూ ఉన్న ఈ శాస్త్రీయమైన విషయాలు పై మూడు వాక్యాల్నీ పట్టుకు వేళ్ళాడుతూ పెరుమాళ్ మురుగన్ జరుగుతున్నదే రాశాడు కాబట్టి అతన్ని విమర్శించటం అన్యాయం అంటున్న మేధావులకీ, ఈ అసమగ్రమైన తీర్పు ఇచ్చిన న్యాయమూరులకీ తెలుసా!అసలు తెలుసుకోవలసిన అవసరం లేదా?తీర్పుకి సంబంధించిన విషయంలో అతి ముఖ్యమైన "దంపతులకి కొంతకాలం పాటు పిల్లలు పుట్టకుండా తర్వాత హఠాత్తుగా పుట్టుకొచ్చిన సందర్భాలు" గురించి చర్చించకుండా ఎందుకు వదిలేశారు?అలాంటివి ఈ భూప్రపంచంలో ఎక్కడా జరగలేదని వీరు నిర్ధారించి చెప్పగలరా?అలా జరిగిన ప్రతి సందర్భంలోనూ ఇక్కడిలాగే ఎవరో ఒక పరాయి మగాడు పుణ్యం కట్టుకున్నట్టు అర్ధం చేసుకోవాలా?ఇదేనా శాస్త్రీయంగా అలోచించి వ్యతిరేకుల ఆంగ్లోసాక్సన్ మొరాలిటీని ఖండించే ఆధునికుల తెలివైన వాదన!

     తీర్పు నిర్దుష్టంగా ఉండాలంటే అన్ని విషయాలనీ సాకల్యంగా పరిశీలించాలి,అసలు ఆరోపణ ఆ ప్రాంతంలో కొంతకాలం పాటు వంధ్యత్వపు శోకాన్ని అనుభవించిన ఆడవాళ్ళు హఠాత్తుగా తల్లులవడానికి ఆ ఆలయంలోని రధోత్సవం 14వ రోజున అక్కడ జరిగిన అనామక వ్యక్తులతో జరిగిన సంభోగమే కారణం అని రచయిత చెప్తున్న విషయం అయినప్పుడు కోర్టు దానిని కూడా పట్టించుకు తీరాలి!పర పురుషుడి అవసరం లేకుండా దంపతుల మధ్యనే ఇలాంటి సమస్య కారణాంతరాల వల్ల సహజ పద్ధతిలోనే పరిష్కారం అయ్యి పిల్లలు పుట్టడం వైద్యశాస్త్రపరంగా సంభవమే అయినప్పుడు రచయితా అతన్ని సమర్ధిస్తున్న మేధావులూ,ఈ తీర్పు నిచ్చిన న్యాయమూర్తులే తప్పు చేస్తునట్టు!


     ప్రతిదానికీ భావస్వేచ్చ, ప్రజాస్వామ్యం అనే ముతకపదాల్ని తుంపులు తుంపులుగా వదిలి ఆదర్శవాదులుగా పోజులు కొట్టేవాళ్ళకి ప్రజాస్వామ్యం యొక్క పునాదీ వైభవం మెజారిటీ ప్రజల ఆశల్నీ ఆకాంక్షల్నీ గుర్తించి వారి ఒప్పుదలయే అధికారలో నిలదొక్కుకోవడానికి ఉన్న ఏకైక మార్గం అని నిజంగానే తెలియదా!కొద్దిమంది తమ ఎజెండాల దంతమందిరాల్లో కూర్చుని ఇచ్చే తీర్పులు మెజారిటీ ప్రజల సంప్రదాయాల్ని కించపరిచేవిగా ఉన్నా,అందులో శాస్త్రీయత లేకపోయినా నెత్తిన పెట్టుకోవాలా?అదే న్యాయం,ఆధునికత అని తీర్మానించితే,  మేధావుల నుంచి పెరుమాళ ఎలాంటి రక్షణ తీసుకున్నాడో అలాంటి రక్షణ నాకూ వస్తుందనే గ్యారెంటీ ఉంటే నేను కూడా ఏదో ఒక చర్చి చుట్టూరానో దర్గా చుట్టూరానో ఇలాంటి రంజైన కధ అల్లడానికి సిద్ధంగా ఉన్నాను!

పదిమంది ఎనభైమంది మనోభావాల్ని గాయపర్చటం డేమోక్రసీ కాదు డెమనోక్రసీ!

Monday, 11 July 2016

చెరిగిపోని చరిత్రలో కరిగిపోని కన్నీటిచుక్క - పేరిందేవి!

పేరిందేవి!

విభుని కూడనైన కూడకయే విధవ యయ్యె!!
తనవారి రాజ్యకాంక్షకు తన మాంగల్యమే బలియయ్యె!!!

వయసుకు చిన్నదైనా ఒక్క కన్నీటిబొట్టు రాల్చలేదు.
పినతండ్రిని వరుసతో పిల్చి మరీ తిట్టింది,
చీరెసారె లివ్వాల్సిన చేతితోనే ముండకోకనూ ఇవ్వమని!
సిగ్గుపడి మొగం దించుకుని నిలుచుండేటట్లు చేసింది?! 

"నువు విధవ్వి, దీపాలార్పడమే తెల్సు నీకు!
దీపమెట్టేవేళ బిడ్డలు గల తల్లులు నిన్ను తలవరు - నన్ను తలుస్తారు,
నా ఉసురు తగిలి నీపేర్న నాల్గుమణుగుల నల్లపూసలు తెగుతాయి చూడు!"మన్న
బాలికావధువు శాపానికి నల్ల నాగులేరు గజగజలాడింది!
"నాయుడూ నీమూతికి మీసముంటే నా ముంజేతికి మీసముంది"
అన్న నాయకురాలు నాగమ్మ కూడా బిత్తరపోయంది,
సిగ్గుపడి సంధి కొడంబడింది -  
చిన్నారి పేరిందేవి ధాటిగల మాటలకు జడిసి!

అనపోతు చావువార్త విన్న బాలచంద్రునికి వెర్రిపుట్టి
సంధి చెడింది,నాల్గుమణుగుల నల్లపూసలు తెగినవి,
నల్ల నాగులేటి నీరెర్రబారింది!
    
కళ్ళుమూసుకుని తలిస్తే చాలు
కాటికి కాళ్ళు చాపుకున్నవాడికయినా కండల్ని పొంగించగలిగిన వీరాధివీరులు
తమను తామే చంపుకున్న తీరును చూసి భూతరాట్కంబమొకటే పకపక నవ్వింది!

నాపసాని ఏడుగడియల మంత్రిత్వం ఇంత చేసింది!
ఆపలేని బ్రహ్మనాయుని మంత్రాంగం యాడబోయింది?
నాయుడూ నాగాంబా సన్నాసులై బిలముల జొచ్చినారు.
కోటపేటలు అన్నీ మంటిగలిసి,,
అన్నదమ్ములు కూడ మింటికరిగి
రాజొక్కడు ఒంటిగ మిగిలినాడు!

అంతేరా, నాయనా!
ఆది జంగమదేవర ఢమరుకం మోగించినాక
నువ్వెంత?నీ తెలివెంత?నీ హజమెంత?
నీ వైభవాల మైకం,నీ స్థగిణీల మాంగల్యం,నీ కోటపేటల గట్టిదనం -
ఏదీ మిగలదు,అంతా భస్మమే!!

శివోహం!శివోహం!శివోహం!

Monday, 4 July 2016

చలం తలలోని మెదడును ఉపయోగించి రాసిన బ్రాహ్మణీకం మోకాలిలోని మెదడును మాత్రమే ఉపయోగించేవాళ్ళకి అర్ధం కాకపోవటం సహజమే కదా - శ్రీనివాసా!

         "నువ్వు గొప్పవాడివని నాకు తెలుసు గానీ నిన్ను పొగడ్డానికి మాత్రం మనస్కరించటం లేదు?!" - ఈ ముక్కని మీ గురించి మీతోనే ఎవరయినా అన్నారనుకోండి - అతను మిమ్మల్ని తిడుతున్నాడో,పొగుడుతున్నాడో,నిందాస్తుతితో ఎటకారం చేస్తన్నాడో ఒక పట్టాన అర్ధమయి చావదు,కదూ!కొందరంతే,"ఇన్నాళ్ళూ మాకర్ధం కానివి మీరు మాట్లాడారు,,ఇప్పుడు మీకే కాదు మూగకు మాటొచ్చినటు మాకు కూడా అర్ధం కాకుండా మాట్లాడే తెలివి వచ్చేసింది - కాబట్టి  మీరు మాట్లాడొద్దన్నా వూర్కోం.వింటున్న మీకే కాదు,మాట్లాడుతున్న మాకు కూడా అర్ధం కానంత గొప్పగా మాట్లాడగలం!ఏమనుకున్నారో?" అని వార్నింగులు ఇచ్చి మరీ చెత్త మాట్లాడుతూ ఉంటారు."ఒరేయి శాస్త్రీ!ఇదంతా కలంతోనే రాశావుట్రా?" అనే కొంటె బొమ్మల బాపు కార్టూనులోని కవికుంజరంలా వాళ్లు దేంతో ఆలోచించారో మనం కూడా దాంతోనే ఆలోచిస్తే తప్ప వాళ్ళ మనసు లోపలి అసలు గోలేంటో మనకి అర్ధమయి చావదు!మనమేమో తలలో ఉన్న మెదడుతో అలోచించేవాళ్ళం,వాళ్ళేమో మోకాలిలో ఉన్న మెదడుతో ఆలోచిస్తూ ఉంటారు - కాబట్టి అధాట్న వాళ్ళు రాసినవి చదవగానే మనలాంటివాళ్ళకి గందరగోళం అనిపించటం సహజం.

  మనకి అప్పుడప్పుడు బోరు కొడుతుంది!యెందుకు బోరు కొడుతుందని అడక్కండి,ఇప్పుడు మీరు అడిగినా సరే, బోరు గురించి గంభీరమైన విషయాలు చెప్పి మిమ్మల్ని బోరు కొట్టించే ఉద్దేశం నాకు లేదు:-)బోరు కొట్టినప్పుడు మనం సవాలక్ష పన్లు చేస్తాం - ఒకే రకం బోరు కైనా ఒక్కో మనిషి ఒక్కో ఆల్టర్నేటివ్ చూసుకుంటాడు.కానీ కుక్కలకి మాత్రం ఏ రకమయిన బోరు కయినా ఒకటే కాలక్షేపం - హాయిగా తోక వూపుకోవటం!అన్ని కుక్కలకీ అన్ని బోరులకీ ఓకే పరిష్కారం - ఈ తోక వూపుడు కార్యక్రమం!అలాగే ఇంగ్లీషువాళ్ళకీ, తర్వాత కమ్యూనిష్టులకీ, ఆ తర్వాత స్త్రీవాదులకీ,ఇంకా తర్వాత దళితులకీ ఈ దేశంలోని అన్ని సమస్యలకీ బ్రాహ్మణులే కారణం అనే వాదన చాలాకాలం ముంచీ కాలక్షేపంతో కూడిన ఆనందాన్ని కలిగిస్తున్నది. వారి అపరిమతమైన ఆనందానుభూతిని భగ్నం చేసే క్రూరత్వం నాకు లేదు - అమ్మతోడు,నిజం!మోకాలి లోని మెదడుతో ఆలోచించేవారి పాండిత్యాన్ని అర్ధం చేసుకోలేక తలలోని మెదడుతో ఆలోచించేవారికి ఏర్పడిన గందరగోళాన్ని తగ్గించడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తున్నాను. అసలువారి పాండిత్యాన్ని అవమానించేటంత స్థాయిలో సమ్యక్-జ్ఞానం గానీ వారిని తలతో ఆలోచింపజెయ్యగలిగిన సమర్ధత గానీ నాకు లేవు గాబట్టి శ్రీనివాసుడు లాంటివారిలా వారిని మార్చడానికి నేను పొరపాటున కూడా ప్రయత్నించను - ఆకాశంలో ఎర్రగా ఉన్న సూరీణ్ణి సూడంగానే అక్కడేదో మర్దరు జరిగిపోయిందన్నట్టు బులబులాగ్గా కతలల్లేస్కుంటా కూసింత కలాపోసన జేస్కోకపోతే మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటాది సెప్పండి!ఆళ్ళట్టాగే మాట్టాడాల,మన్లాంటోళ్ళం ఫుల్లుగా నవ్వుకోవాల - అద్గదీ సంగతి:-)

     అసలు ఈ తోకను వూపే దృశ్యం పోలికలోనే వారికి పెద్ద కుట్ర కోణం కనబడవచ్చు కాబట్టి ముందుగానే  నావైపునుంచి నేను కొన్ని విషయాలు స్పష్టం చేస్తాను.కేవలం పెర్స్పెక్టివ్ డిఫరెన్స్ అనే వారికి నచ్చిన వాదనా పద్ధతికి పనికొస్తుందనే ఈ తోక వూపే కుక్క వుదాహరణ తెసుకున్నాను తప్ప హెచ్చార్కె గారిని కించపరిచే ఉద్దేశం నాకెంతమాత్రమూ లేదు.ఈ కాలంలో పుట్టిన ముప్పాళ్ళ రంగనాయకమ్మకి నచ్చిన మార్క్సీయ భావజాలం ప్రకారం రాయని ఆ కాలంలో పుట్టిన వాల్మీకి చేసిన తప్పునే చలం కూడా చేశాడు గాబట్టి తిడితే చలాన్నే తిడతాను తప్ప హెచ్చార్కె గారిని పల్లెత్తు మాట కూడా అనను.

     సనాతనులకి ఈ పెర్స్పెక్టివ్ డిఫరెన్సుల గోల లేదు.ఒకే విషయం గురించి ఒక్కోడూ ఒక్కోమాట చెప్తున్నప్పుడల్లా "ఏకం సత్ విప్రాని బహుధా వదంతి" అని సర్ధి చెప్పేసుకుని అప్పటికి ఏది బెస్టుగా పనికొస్తుందో దాన్ని పాటించేసేవాళ్ళు!అదే అలవాటు చొప్పున ఏ ప్రాంతం నుంచి ఏ మతస్థుడు వచ్చినా చక్కగా ఆతిధ్యమిచ్చి ఇళ్ళూ గుళ్ళూ కట్టుకునే చోటిచ్చి "నీ నిష్ఠ నువ్వు పాటించుకో, నా నిష్ఠ నేను పాటించుకుంటా"నని చెప్పేసి "వసుధైక కుటుంబ భావన"ని అతి ప్రాచీన కాలంలోనే వూహించి,బోధించి,సాధించి సుమారు అరవై వేల సంవత్సరాల వెనకటి కాలం నుంచి ఇప్పటికీ స్వయంచాలిత గడియారంలా తప్పుల్ని సరిదిద్దుకుంటూ తనలో కలిసిన సమస్తాన్నీ తనవెంట లాక్కుపోయే జీవనదీప్రవాహంలా కాలాలు దాటుకుని నడుస్తూ ఉన్న ఈ సనాతన ధర్మానికి కట్టుబడినవారు తమ చుట్టూ ఎన్ని సంక్షోభాలు చెలరేగుతున్నా చలించకుండా ప్రశాంతజీవనం సాగిస్తూనే ఉన్నారు!"ఇప్పటి సమస్య యేంటి?దానికి పరిష్కారం యేంటి?ఏది ప్రశాంతంగా ముందుకు నడిచహెతందుకు ఉత్సాహపరుస్తుంది?" - అంతకు మించి సనాతనులు ఈ పెర్స్పెక్టివ్ డిఫరెన్సుల గనదరగోళంలో పడరు.మనోభావాలు దెబ్బతినడం అంటే యేంటో వారికి తెలియదు!ఎటొచ్చీ మెకాలే మహానుభావుడు మనకి ఇంగ్లీష్ నేర్పకపోయుంటే బ్రాహ్మల చేతుల్లో చచ్చిపోయి ఉండేవాళ్ళం అని నమ్ముతున్న వాళ్ళకి బ్రాహ్మలు చెప్పిన ప్రతిదాన్నీ మరో వైపు నుంచి చూసి ఆ కుట్రకోణాన్ని అర్ధం  చేసుకోవాల్సిన అవసరం ఉంది గాబట్టి ఈ పెర్స్పెక్టివ్ ఔట్లుక్ అనేది పుట్టుకొచ్చింది.తలలోని మెదడుతో ఆలోచించే మనం ఇట్లా సూటిగా "కుక్క తోకని వూపుతుంది" అనేస్తే మోకాలిలోని మెదడుతో ఆలోచించేవారికి అందులో కుట్ర ఉన్నట్టు కనపడుతుంది.ఆ కుట్రని తను కనుక్కుని మిగిలిన మోకాలిలోని మెదడుతో ఆలోచించేవారిని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు మన గ్రూపులో చేరకుండా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా డిఫరెంట్ పెర్స్పెక్టివ్ చాలా అవసరం.

     మీకు బోరు కొట్టినా సరే మరోసారి కుక్క-తోకని-వూపటం అనే దృశ్యాన్ని మీ కళ్ళముందు ఉంచబోతున్నాను.ఇప్పుడే కాదు,ఈ పోష్టు నిండా ఈ దృశ్యాని మీ కళ్ళ ముందు నుంచి పోనివ్వకండి!కనుక్కోగలిగిన వాడికి ఈ ఒక్క దృశ్యంలోనే సమస్త విద్యల్నీ సుబోధకంగా అర్ధం చేసుకోగలిగిన పాండిత్యం వస్తుంది - కాలభైరవస్వామి దీక్ష అంటారు దీన్ని!ఉదాహరణకి "కుక్క తోకని వూపుతుంది" అన్న  సిద్ధాంతంలో బ్రాహ్మణుల కుట్రని కనుకున్న పెద్దమనిషి తనని ఆ కుట్రనించి కాపాడుకోవటానికి చేసే వ్యూహాత్మక మేధోవికసన సంభరితమైన విశ్లేషణ ఎలా ఉంటుంది అనేది మనకి తెలియాలంటే మనం కూడా కాసేపు తలలోని మెదడుతో కాకుండా మోకాలిలోని మెదడుతో ఆలోచించాలి - మరో దారి లేదు!వారొక వేళ తమలో తాము చెప్పుకోవడానికయితే అట్టే శ్రమపడనకరలేదు.కానీ అందరితో ఒప్పించాలంటే కొంచెం శ్రమ పడాలి గదా, మనకి కూడా వారి విశ్లేషణ నమ్మదగ్గదే అనిపించాలి గదా!లేకపోతే మనం తాటాకులు కట్టేస్తాం,అవునా?కుక్క తోకని వూపుతుంది అనే ప్రతిపాదనలోని కుట్రని తప్పించుకోవాలంటే తోకయే కుక్కని కదిలిస్తుంది అని నిరూపించగలిగితే చాలు!ఆర్య - ద్రవిడ ఆక్రమణ తిరగమోత సిద్ధాంతాన్ని వండి వార్చటానికి రొమిల్లా ధాపర్ గారు ఎంత కఠోరంగా శ్రమించారో గుర్తు చేసుకుని ఉత్తేజితులై తోకయే కుక్కని కదిలిస్తుంది అన్న దానికి సాక్ష్యంగా తెచ్చుకోవడానికి కుక్క యొక్క ప్రతి కదలికనీ నిశితంగా పరిశీలించాలి.లించగా లించగా హఠాత్తుగా ఒక విషయం పత్యేకంగా కనిపిస్తుంది - కుక్క ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే తోకని కదిలిస్తుంది - నడిచేటప్పుడు,పరిగెత్తేటప్పుడు తోకని కదిలించదు:కొన్ని కుక్కలయితే తోకని కాళ్ళమధ్యన ఇరిక్కించుకుంటాయి!హమ్మయ్య, తలలోని మెదడుతో ఆలోచించేవాళ్ళని వాదనలో గెలవటానికి ఒక తిరుగులేని సాక్ష్యం దొరికేసిందోచ్!

     "పైన టైటిలు యేంటి?ఈ కుక్క తోక వూపడు గొడవ యేంటి?హరిబాబుకి మెంటల్ వచ్చేసిందా?ముద్రగడ గురించిన వార్తలు మరీ ఎక్కువగా ఫాలో అయ్యాడా?" అని మీరు అనుకుంటే అది శానా తప్పు.ముందే చెప్పాను విషయం కాంప్లికేటెడ్,జాగత్తగా ఫాలో అవ్వాలని!కొన్ని విషయాల్ని సూటిగా చెప్పలేం.అసలే నేను కబాలి గాణ్ణి  దానికి తోడు "చుట్టూ చుట్టి వచ్చావా?చూపుడువేలితొ గుచ్చావా!" అనే మూడ్ ఆవహించి ఉంది - రివోల్టిస్తే పిచ్చెక్కిస్తా:-) ఆదికాలం నుండీ ప్రపంచంలోని ఆలోచనాపరులు "తలలోని మెదడును ఉపయోగించి ఆలోచించేవాళ్ళు","మోకాలిలోని మెదడును ఉపయోగించి ఆలోచించేవాళ్ళు" అని రెండు రకాలుగా విడిపోయి ఈ జగన్నాటకంలో ఎవరి పాత్రని వారు పోషిస్తూ కాలచక్రం ఆకులకి బంకలా అతుక్కుని తాము అతుక్కున్న ఆకు నేలకి తగిలి తమని నలిపినప్పుడు ఏడుస్తూ పైకి వెళ్ళి చిటారుకొమ్మన తమని నిలబెట్టినప్పుడు ఇకిలిస్తూ మల్లాగుల్లాలు పడుతున్నారు.అయితే,ఈ త.మె.ఉ.ఆ గాళ్ళు మహా ముదుర్లు,తమ ఆకు కొంచెం  కిందకి వెళ్ళబోతుందని తెలియంగానే వెంఠనే ఎలర్టయ్యి అసుంటా పక్కకి జరిగి నలుగుడును తప్పించుకుంటున్నారు.పైగా అమాయకులైన మో.మె.ఉ.ఆ గాళ్ళు తప్పించుకోలేక అవస్థలు పడుతుంటే క్రూరంగా కేరింతలు కొట్టి ఆనందిస్తున్నారు - దాంతో కొందరు శ్రీనివాసుడు లాంటి మంచి త.మె.ఉ.ఆ గాళ్ళు ఎట్లాగయినా మో.మె.ఉ.ఆ గాళ్ళని రకషిద్దాం అని ఎంత ప్రయత్నించినా హెచ్చార్కె లాంటివాళ్ళు ఇంకా మొండికెత్తిపోతున్నారే తప్ప శ్రీనివాసుడు ఆశించిన మార్పు రావడం లేదు.దాంతో తన శ్రమ వృధా అవుతున్నందుకు విసుక్కుని అశాంతికి లోనవుతున్న శ్రీనివాసుడు తరహా అజ్ఞానులకి హెచ్చార్కె లాంటి జ్ఞానుల ఆంతర్యాన్ని బోధపర్చాలంటే ఇంత పెద్ద ఉపోద్ఘాతం/మొదటిసుత్తిదెబ్బ చాలా అవసరం.ఇట్నించి నరుక్కొస్తే పని జరగనప్పుడు అట్నించి నరుక్కు రమ్మన్నారు పెద్దలు, విన్లేదూ!

     వ్యూహాలన్నీ దిట్టంగా వేసి,సైన్యాన్ని చక్కగా మొహరించి,శంఖం వూదేశాక ఇంక రంగంలోకి దిగాలి కదా  - ఇప్పుడు దిగుదాం!ఎక్కడో ఒకచోట తను గందరగోళంలో ఉన్నట్టు చెప్పిన హెచ్చార్కె గారు మొదట "అన్న ద్వేషం"లో ఏమి చెప్పదలుచుకున్నారు?ప్రధాన విషయం బ్రాహణీకం నవలని చలం కధలోని విలన్ పాత్రకి అంటగట్టిన బ్రాహ్మణేతరోద్యమాన్ని అవమానించటానికీ బ్రాహ్మణుల్ని పొగడటానికీ రాస్తే ఇప్పటి వరకూ విమర్సకులెవరూ కనుకోలేని ఆ పరమసత్యాని తను కనుక్కున్నానని నవలలోని కొన్ని భాగాల్ని ఉటంకించి నిరూపించటం.కానీ వ్యాసం మొదలుపెట్టింది తన బాల్యపు అనుభవాలతో - బహుశా తన బ్రాహ్మణ ద్వేషానికి మూలకారణాల్ని చెప్పడం ద్వారా ముందరి వాదనకి బలం చేకూరుతుందని భావించి ఉండవచ్చు!అదంతా నాకు అనవసరం అనిపించినా రచయిత రాసేశాడు గనక,అచ్చులోకి వచ్చేసింది గనక చదవటం నుంచి తప్పించుకోలకపోయాను.కానీ అప్పటి వరకూ వాళ్ళింట్లో స్వేచ్చగా తిరిగిన ఈయనని  ఆ బ్రాహ్మణూడు ఒక్కసారిగా అట్లా మందలించడం,దానికి మనసు విరిగిపోయి ఈయన బ్రాహ్మణద్వేషి అయిపోవడం మరీ సినిమాటిక్ మెలోడ్రామా అనిపిస్తున్నది నాకు.సరే,ఆయన సొంతగొడవ ఆయనది,ఆయన అనుభూతులు ఆయనవి,ఆయన అర్ధం చేసుకునే పద్ధతి అది - వాట్ని గురించి యేమీ విమర్శించను!కానీ,"హిస్టారికల్ బుద్ధా" అనే పరమ వాస్తవికమైన గ్రంధంలో బుద్ధుడి కాలానికి కూడా మనుషులు పుట్టిన కులంలోనే అంటుగట్టుకుపోకుండా కులాన్ని మార్చుకునే వీలు ఉండేదనీ,వృత్తులకి అనుబంధంగా కులాలు యేర్పడినాయనే చారిత్రక పరిశోధనల వాసన లేని ఒక మామూలు మధ్యతరగతి కుటుంబీకుడిగా ఉన్న బ్రాహ్మణుణ్ణి తన జ్ఞానపు పరిధికి మించిన ప్రశ్న అడిగితే ఏమి చెబుతాడు?ఈ హెచ్చార్కె గారినే తనకి తెలియని విషయం గురంచి ఎవరయినా చెప్పి తీరాల్సిందేనని రెట్టించి అడిగితే యేమి చేప్తాడు?

     సకలకళావల్లభుడు అనే పదానికి శ్రీరమణ గారు అన్ని ప్రక్రియల మీదా రెట్ట వేసిన పిట్ట అనే సరదా అనువాదం చేశాడు.అట్లాగే ఈయన కూడా బీఫ్ వివాదం నుంచి మహిషాసురుణ్ణి మూలవాసీల దేవుడని అంటూ వచ్చిన కరపత్రం వరకు గల అన్నింటి మీదా విరుచుకు పడ్డాడు.ప్రపంచంలో తొలిసారిగా వ్యవస్థీకృతంగా వ్యవసాయం,పశుపోషణ మొదలు పెటింది భారతీయ సనాతనులే - అది కూడా గోజాతితోనే మొదలైంది!అప్పటి నుంచి భారతీయుల సామాజిక జీవితం మొత్తం గోమాతను దేహమాత,దేశమాత,దేవమాత తదాదిగా గల పంచమాతృకలలో ఒక మాతగా చేసుకుని పోషిస్తున్నారు, రక్షిస్తున్నారు!గోవునే ఎందుకు పూజించాలి,గేదెనీ మేకనీ ఎందుకు పూజించరాదు అని మహా రౌద్రంగా అడుగుతున్నవారు వాటికి ఒక్కరోజునైనా తిండి పెట్టి పోషించి రక్షించిన దాఖలాలు ఉన్నాయా?ఇప్పటి నుంచీ గేదె భక్తులూ మేక భక్తులూ వాట్ని కూడా రక్షించి పూజించుకోవచ్చు కదా!ఎవరు వద్దన్నారు?మహిషాసురుణ్ణి పొగుడుకుంటూ వేసిన కరపత్రం గురించి స్మృతి ఇరానీ గొంతు వణకటం గురించి మాత్రమే పట్టించుకుని వ్యంగ్యాలు విసురుతున్న ప్రబుద్ధులు మరి అందులో దుర్గను సెక్స్ వర్కర్ అనటం గురించి ఎందుకు మర్చిపోతున్నారు?ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోయినా అంతా తెలిసినట్టు మాట్లాడగలిగిన ప్రజ్ఞ మోకాలిలోని మెదడుతో ఆలోచించేవాళ్ళకి సహజ లక్షణం కాబోలు!

     కరపత్రంలో దుర్గని సెక్స్ వర్కర్ అన్నదాన్ని సమర్ధించటానికి చివరి వాక్యంలో "ఇప్పుడు కరపత్రంలో తమ మూలవాసి రాజుని మోసగించి చంపిన స్త్రీని వాళ్ళు ఏదో అన్నారని అంతగా వూగిపోయి డిప్రేవిటీ అంటూ అరుస్తారా?ఇదంతా ప్రజాస్వామ్యం కిందకి వస్తుందా?" అని అడుగుతున్న ఈ పెద్దమనిషికి ప్రజాస్వామ్యం యొక్క మౌలిక లక్షణం మెజార్టీ అభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన ఉండటం అని నిజంగానే తెలియదా?అధికారం మెజార్టీ పౌరుల అభిప్రాయాన్ని ప్రతిబింబించటం ప్రజాస్వామ్యానికి మొదటి లక్షణం అయినప్పుడు ఆ మెజార్టీ ప్రజల సంస్కృతిని అధిక్షేపించటం ప్రజాస్వామ్యబద్ధమైనది అని  కేవలం తోకయే కుక్కని కదిలిస్తుంది అని వాదించగలిగిన మోకాలిలోని మెదడుతో ఆలోచించేవాళ్ళు మాత్రమే చెయ్యగలరు!తెలంగాణ వాళ్ళు అధికారికంగా ఇవ్వాళ మా ప్రాంతాన్నేలిన గొప్ప రాణి అని రుద్రమదేవి గురించి  మురుసుకుంటున్న కాకతీయులంటే సమ్మక్క సారక్కల అభిమానులకి ద్వేషం!వీళ్ళలో ఎవడయినా  ఇప్పటికిప్పుడు మేడారం నడిబొడ్దున నిలబడి కాకతీయుల్ని కీర్తిస్తూ మాట్లాడి క్షేమంగా వెనక్కి తిరిగి రాగలడా?

     సరే,పిట్టకధలుగా చెప్పిన అప్రస్తుత విషయాల్ని ఇంతటితో వదిలి వ్యాసంలోని ముఖ్యవిషయం సంగతి చూద్దాం.ఇన్నేళ్ళుగా ఏ గొప్ప విమర్సకుడికీ తోచని ఒక కొత విషయం ఈయన కనిపెట్టేశాడు - చలం బ్రాహ్మణీకం అనే నవలని బ్రాహ్మణుల్ని పొగడ్డానికీ విలన్ అయిన రామయ్యనాయుడికి అంటగట్టిన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని విమర్శించటానికీ రాశాడని!అదేదో మహద్రచన అయినట్టు దాన్ని ప్రశంసించిన కుహనా ఫెమినిస్టులూ,దాన్ని ఆధారం చేసుకుని కేంద్ర సాహిత్య సత్కారాలు అందుకున్నవాళ్ళంతా అది కాకతాళీయంగా చెయ్యలేదనీ వారు కూడా చలం వంటి కుట్రదారులేననేందుకు తన దగ్గిర  సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నాడు.తన వాదనని బలంగా నిరూపించే ఆధారాలు నవలలోనే వున్నాయంటున్నాడు!మొదటి ఆధారంగా ఇతరత్రా మంచివాడు అని చెప్పి, రామయ్యనాయుడు సుందరమ్మకి సాయం చెయ్యడానికే వెళ్ళినట్టు చెప్పి,ఆమె కులం ఏమిటో తెలిశాక "బ్రాహ్మణ స్త్రీని అలా చయాలనిపించిన విపరీత మనస్తత్వం వల్ల అలా చేశాడట" అని చలం మాటల్ని చెప్పి దానికి తను "మరో మాటలో బ్రాహ్మణవ్యతిరేకోద్యమ మనస్తత్వంతో అలా చేశాడు అని చెలం పలు విధాలుగా ఎస్టాబ్లిష్ చేశాడు" అనే వాదన చేస్తున్నాడు.రెండవ ఆధారంగా చివరి సన్నివేశంలో రామయ్యనాయుడు తనని మోసం చేశాడని తెలిసి నిర్ఘాంతపోయి చస్తూ చస్తూ చూసిన కోపపు చూపుకి తనలోని గిల్ట్ వల్ల  భయపడి వెనక్కి వెనక్కి జరిగి బుడ్డి దీపం అంటుకుని రామయ్యనాయుడు చచ్చిపోయే సనివేశాన్ని బ్రాహ్మణీకపు మహత్యాన్ని ఉగ్గడించటానికే అట్లా రాశాడనే వాదన   చేస్తున్నాడు.

     మొదటి వాదనలోని ఔచిత్యం గురించి తెలుసుకోవడానికి సాహిత్యసృజన విషయం పక్కకి పెట్టి వాస్తవ సమాజంలోని సామాన్యుల నుంచి మహనీయుల వరకు ఏ వ్యక్తిని తీసుకున్నా ఏ ఒక్క వ్యక్తిలోనూ 100% మంచీ 100% చెడూ ఉండటం లేదని తెలుస్తుంది!అయినా సరే,పట్టువదలని విక్రమార్కుడిలా  ఎవరయినా 100% మంచివాడి కోసం గానీ 100% చెడ్డవాడి కోసం గానీ గడ్డివామిలో సూదిని వెతికినంత దీక్షగావెతికి పట్టుకోదల్చుకుంటే రెండే రెండు చోట్లు ఉన్నాయి - పిచ్చాసుపత్రులు,అధమస్థాయి రచయితల సాహితీరూపాలు.ఆ రెండు క్యాటగిరీలనీ సమాజం ఎక్కువ కాలం భరించలేదు!అందుకే మొదటి రకం వ్యక్తుల్ని నాలుగ్గోడల మధ్యన ఉంచడం,రెండవ రకం వ్యక్తుల్ని తొందరగా మర్చిపోవడం జరుగుతున్నది.ఒక అత్యున్నత భావశిఖరం మీద నిలబడి తమ చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి ఏ రకం వ్యక్తిత్వాల్ని అలవర్చుకుంటే ఇప్పటికన్నా మెరుగ్గా బతకవచ్చునో అలాంటి వ్యక్తిత్వాన్ని కధానాయకుడికీ ఏ రకం వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే జీవితం దుఃఖభాజనం అవుతుందో అలాంటి వ్యక్తిత్వాన్ని ప్రతినాయకుడికీ ఆపాదించి మొత్తం సమాజానికి దిశానిర్దేశంగా పనికొచ్చే సాహిత్యాన్ని సృజించగలిగిన రచయితలు రూపుదిద్దిన పాత్రలు అజరామరంగా ఉండటానికి కారణం మంచిచెడుల మేలుకలయికగా అల్లిన వాటి నిర్మితిలోని వాస్తవికతయే!ఆ లక్షణాన్నే తపు పట్టినవాడు సాహితీ విమర్శకి దూరంగా ఉంటే తనకీ ఇతర్లకీ చాలా ఉపకారం చేసినవాడవుతాడు.

     ఈ రోజున ప్రపంచంలో క్రౌర్యానికి పరాకాష్టగా నిలబడిన అడాల్ఫ్ హిట్లర్ రాజకీయ జీవితం సమసమాజాన్ని వూహించే బాత్ సోషలిస్టు పార్టీలో మొదలైంది!ఆర్యులు గొప్పవాళ్ళని అనుకోవటంలోనూ,ప్రపంచాన్నంతా ఆర్యులతో నింపెయ్యాలని అనుకోవటంలోనూ,దాన్ని సాధించటంలోనూ తప్పు లేదు - స్నేహపూర్వకమైన శాంతియుత మార్గంలో సాధించి ఉంటే వసుధైకకుటుంబభావనని నిజం చేసి చూపించిన చరితార్ధుడుగా మిగిలి ఉండేవాడు!కానీ,దాన్ని కొంచెం వంకర తిప్పి యూదు జాతితో మొదలుపెట్టి తనకి నచ్చని వాళ్ళని అంతం చెయ్యడం ద్వారా సాధించాలనుకోవడం వల్లనే అది తప్పుగా మారింది, అవునా?అట్లాగే రామయ్యనాయుడు సుందరమ్మని అనుభవించటం తప్పు లేదని తనని తను జస్టిఫై చేసుకోవటానికి బ్రాహ్మణ వ్యతిరేకతని మెలితిప్పి వాడుకున్నాడు అని మాత్రమే చెలం ఎస్టాబ్లిష్ చేశాడు.దీని గురించి నేను సారంగలో కలగజేసుకుని చెప్పింది ఇది:"నేను బ్రాహ్మణీకం సొంతంగా చదివి ఉన్నాను.చాలా కాలమైంది.కానీ ఇప్పుడు ఈ ప్రస్తావనల వల్ల మళ్ళీ గుర్తు చేసుకోగలిగాను. హెచ్చార్కె గారి అసలు వ్యాసం నేను చదవలేదు, లింకులుగా ఇచ్చిన ప్రతివిమర్శ మాత్రమే చదివినా కధలో ఆ బ్రాహ్మణ స్త్రీకి మహత్యం అంటగట్టినట్టు అప్పుడు చదివేటప్పుడూ అనిపించలేదు,ఇప్పుడు కూడా చలం నాయుడు చెడగొట్టింది ఒక బ్రాహ్మణ స్త్రీని గాబట్టి నాయుడు పాత్రని చంపాడని అంటే ఒప్పుకోవడం కష్టం.కధలోని విషయం సూటిగా చెప్పాలంటే ఒక కష్టంలో ఉన్న వ్యక్తిని ఆ కష్టాన్ని గట్టేక్కిస్తానని కబుర్లు చెప్పి మోసం చెయ్యడం ఎట్లా ఉంటుందో బొమ్మకట్టినట్టు అతి దగ్గిర్నుంచి చూపించటం, నాయుడి శూద్రత్వాన్ని ఆ స్త్రీ బ్రాహ్మణత్వాన్ని మాత్రమే పట్టించుకోకుండా మన చుట్టూ చూస్తే ఎక్స్ప్లాయిటేషన్ యొక్క పిక్చర్ ఇదే కదా!చలం చేసిన అసలైన ట్రిక్ మోసం చేసేవాడు తనకి తను ఇచ్చుకునే జస్టిఫికేషన్ ఎట్లా ఉంటుందో విప్పి చూపించటం!నాయుడు ఒకప్పుడు తను బ్రాహ్మల వల్ల అన్యాయానికి గురై ఆ కులం మీదనే ద్వేషం పెంచుకుని,ఇక్కడ కనబడుతున్నది బ్రాహ్మణస్త్రీ గాబట్టి రేప్/బలాత్కారం/కపటసంభోగం చెయ్యడంలో ఎలాంటి తప్పూ లేదని అనుకోవడమే కధలోని మెలిక!నాయుడి స్థానంలో హిట్లర్ అనే మరొక వ్యక్తిని నిలబేడితే చరిత్రలో అతడు చేసిందీ ఇదే కదా! మొదట యూదుజాతి మీద దుష్ప్రచారం చేసి అలాంటి యూదుల్ని కాన్సెంట్రేషన్ క్యాంపుల్లో ఉంచటం,గ్యాస్ చాంబర్లలఒ చంపడం తప్పు కాదనే జస్టిఫికేషన్ తెచ్చుకున్నాకనే ఆపని అంత ధీమాగా చెయ్యగలిగాడు!హెచ్చార్కె గారు ఆ కోణాన్ని పట్టించుకుని ఉంటే బాగుండేది,ఎజెండా,ఐడియలాజికల్ న్యారోనెస్ మనస్సులో సుడులు తిరుగుతునవాళ్ళు సాహిత్యవిమర్శ వైపుకి పోకుండా ఉంటే మంచిది!" - నిజానికి తలలోని మెదడుతో ఆలోచించగలిగిన వాళ్ళకి ఈ ఒక్క విశ్లేషణలోనే హెచ్చార్కె గారి రెండు వాదనలకీ కలిపి జవాబులు దొరుకుతాయి:-)

     బ్రాహ్మణ వ్యతిరేక వుద్యమం అనగానే అందరికీ మొదట గుర్తుకొచ్చేది తమిళుడైన పెరియార్.కానీ క్రీ.శ 1879లో పుట్టి క్రీ.శ 1973లో చనిపోయిన ఇతనికన్నా రెండు దశాబ్దాల ముందరే తెలుగువాడైన వెలమ కులానికి చెందిన ముద్దు నరసింహం తొలిసారిగా బ్రాహ్మణాధిక్యత మీద రణభేరి మోగించాడు.ఇతని వివేకవర్ధిని వ్యాసాలు వీరేశలింగం పంతులు,గురజాడ అప్పారావు వంటి చాలామందిని హిందూ సమాజంలో విప్లవాత్మకమైన సంస్కరణల్ని తీసుకురావటానికి ఉత్సాహపరిచాయి.ఇప్పుడు దొరకడం లేదు గానీ వాటిని చదివిన వారు ప్రశంసించిన తీరు చూస్తుంటే ఆ చిచ్చరపిడుగే ఈ చిచ్చరపిడుగై పుట్టాడా అని అనుమానంగా ఉంది:-)అయితే ముద్దు నరసింహం దగ్గిరనుంచి పేరియార్ వరకు ఉన్న బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమ సారధులు ఎవరూ పూర్తిగా హిందూమతాన్ని ద్వేషించలేదు -కాలదన్నుకుని పోలేదు!కేవలం బ్రాహ్మణులకి జరుగుతున్న అధికమైన గౌరవ మర్యాదల పట్ల ఈర్ష్యా, పౌరోహిత్యపు అవసరాల కోసం బ్రాహ్మలకి ఇస్తున్న సంభావనల ఖర్చు గురించిన లోభితనమూ మాత్రమే నాకు కంబడుతున్నది నాకు వారి వాదనలలో.ఎందుకంటే బ్రాహ్మణాధిక్యతని ఎదిరించటానికి వారు కష్టపడి కనుక్కున్న బ్రహ్మాండమైన సొల్యూషన్లు రెండు!స్వసంఘపౌరోహిత్యం:యజ్ఞోపవీతాన్ని విశ్వబ్రాహ్మణులు,వైశ్యుల వంటి కులాల వారు కూడా ధరిస్తున్నప్పటికీ,వారికి శాస్త్రాన్ని అనుసరించి చేసేదీ తమకు వైదిక పద్ధతిన చేసుకునేదీ బ్రాహ్మణులే!అలా కాకుండా ప్రతి కులంలోనూ కొందరు వేదం చదివి పౌరోహిత్యపు విధి విధానాల్ని తెలుసుకుని తమ కులానికి తామే వైదిక కర్మల్ని చేయించగలిగే యేర్పాటు.అసలు వైదిక కర్మలు అక్కరలేదు అనటం లేదు,ఉండాలి!కానీ,బ్రాహ్మల ద్వారా కాకుండా తమకు తామే లాగించేసుకోవాలి!ఇది పెద్ద తల్నొప్పి యవ్వారం అని మీకూ తెలుసు - తలలోని మెదడుతో ఆలోచించే బుద్ధిమంతులు గనక!మొదట్లో బులపాటానికి చవగ్గానే చేసినా తర్వాత్తర్వాత వీళ్ళూ చెట్టెక్కి కూచోరని గ్యారెంటీ యేమిటి?వేదజ్ఞానార్హత:ఈ పౌరోహిత్యాలతో సంబంధం లేకుండా వేదాధ్యయనం మీద అధికారం వల్లనే బ్రాహ్మణులు చెట్టెక్కి కూర్చున్నారని అనుకుని వేదాధ్యయనం కోసం పోటీ పడటం.ఇది కూడా చెత్త సొల్యూషనే,ఎందుకంటే ఒక అకంసాలికి తన వృత్తిలో నైపుణ్యం కావాలంటే సీనియర్ల దగ్గిర చేరి ఆ వృత్తికి సంబంధించిన మెళకువలు నేర్చుకుంటే పొట్ట గడుస్తుంది గానీ సంగీతము చేత బేరసారము లుడిగెన్ అన్నట్టు శుష్క యజుర్వేదాలు చదివితే యేమొస్తుంది?

     నిజానికి చారిత్రకంగా పరిశీలించి చూస్తే అన్ని వృత్తుల మీదా అందరూ కుల వ్యవస్థ ద్వారా మోనాపలీ సాధించుకోవటం పూర్తయ్యాక ఇక మిగిల్న పౌరోహిత్యాన్ని వృత్తిగా తీసుకుని బ్రాహ్మణ కులం ఏర్పడిందనేది వాస్తవం.ఆ డిమాండ్లు/సొల్యూషన్లు అనబడే సూత్రీకరణల తింగరితనం వల్ల ఎంత గొప్పగా మొదలైందో అంత వేగంగా బ్రాహ్మణ వ్యతిరేక వుద్యమం చల్లారిపోయింది.వీరేశలింగం పంతులు గానీ గురజాడ అప్పారావు గానీ అందులోని మెయిన్ కంటెంటుని వదిలి సంస్కరణలకి ఉపయోగించుకున్న కాలానికే అది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంది.ఈయన రామయ్యనాయుడు పేరును బట్టి ప్రస్తావించిన త్రిపురనేని రామస్వామి చౌదరి స్థాపించిన సూతాశ్రమం ఆయన పోగానే మూతబడింది.ఇంకా చలం నాటికి బలంగా ఉన్నది అంటాడు చూడండి చోద్యం గాకపోతేనూ!తన కాలానికి బలంగా ఉన్నా ఉండకపోయినా ఆ మంచివారిలో ఎవరినీ చెలం అవమానించలేదు కదా,హిట్లర్ మాదిరి ఆ సిద్ధాంతాన్ని తన దురద తీర్చుకోవటానికి రామయ్యనాయుడు సపోర్టు తెచ్చుకోవడాన్ని తప్పు పట్టటం మొత్తం బ్రాహ్మణ వ్యతిరేక వుద్యమాన్ని తప్పు పట్టటం అని మోకాలిలోని మెదడును ఉపయోగించి ఆలోచించగలిగే వాళ్ళు మాత్రమే అనగలరు!ఈ లెఖ్ఖన పౌలస్త్యబ్రహ్మమనుమడు అని చెప్పి సీతాపహరణం చేయించినందుకు బ్రాహ్మలంతా ఇకనుంచీ వాల్మీకిని దుమ్మెత్తి పొయ్యాలా, బాఘానే ఉంది సంబడం:-)

     గిరీశాన్నీ,లుబ్ధావధాన్లనీ బ్యాపనోళ్ళని చెప్పి వెక్కిరించినందుకు గురజాడ అప్పారావును కూడా ఉతికి ఆరెయ్యాలి,సంస్కర్తగా ఎందుకు కీర్తిస్తునట్టు?అన్నట్టు గురజాడ మధురవాణితో సుకుమారంగా చెప్పించకపోతే సున్నితహృదయుడిగా కనబడే సౌజన్యారావులో ఉన్న యాంటీనాచ్చి ఉద్యమంలోని మూర్ఖత్వం కూడా మనకు తెలిసేది కాదనుకుంటాను!ఒక సాహిత్యరూపంలోని పాత్రచిత్రణ వాస్తవికంగా ఉందా లేదా అనేది తెలుసుకోవటానికి లక్షణగ్రంధాలూ అలంకారిక శాస్త్రాలూ మొత్తం తిరగెయ్యడం అనవసరం - జస్ట్ కామన్ సెన్సు చాలు!నేను వేసిన మొదటి కామెంటులో ఉన్నది అర్ధమయ్యి శ్రీనివాసుడు గారు ఇచ్చిన అసలు ఈ సీరియల్ గొడవకి అంకురార్పణ చేసిన "అన్నద్వేషం - బ్రహ్మద్వేషం" వ్యాసం చదివాను.అక్కడే నా ఫైనల్ ఒపీనియన్ చెప్పాను.అది ఇలా ఉంది:ఇప్పుడు “అన్నద్వేషం-బ్రహ్మద్వేషం” వ్యాసం చదివాను.ముఖ్యంగా బ్రాహ్మణీకం గురించిన రెండు పేరాగ్రాఫులూ స్పష్టంగా చదివాను.హెచ్చార్కె గారు పక్షపాతమే చూపించారు విశ్లేషణలో. సుందరమ్మకి వచ్చిన కోపానికి కారణాన్ని చలం ఎస్టాబ్లిష్ చేసిన తీరు కూడా నేను పైన ఇచ్చిన విశ్లేషణనే బలపరుస్తున్నది,గమనించండి! సుందరమ్మకి వచ్చిన తీవ్రమిన కోపానికి ఉన్న మోటివ్ ఆమె కేవలం బ్రాహ్మణస్రీ అవడం వల్ల అని చలం చెప్పాడా?తన అసహాయతని ఉపయోగించుకోవడం కన్నా మరొక బాధ ఉంది.తన కొడుకు ప్రాణం గురించి కదా అంతకి సిద్ధపడింది.ఇప్పుడు ఇతను తాపీగా నేను డాక్టర్ని కాదు అని చెప్తే అక్కడున్నది దళితస్త్రీ అయినా అంత కోపమూ వస్తుంది కదా!అసలు కధ చదివి చాలా కాలమయినా,హెచ్చార్కె గారి విశ్లేషణ ఆ కధకి అన్యాయమే చేసిందనే నా అభిప్రాయాన్ని మార్చుకునేటందుకు తగిన కారణం కనపడటం లేదు.చలం జస్టిఫికేషన్ గురించి చెప్పటానికే ఆ కధ రాశాడు.జస్టిఫికేషన్ అనే పాయింటుని బలంగా చెప్పడానికి నాయుడికి ఉన్న బ్రాహ్మణ ద్వేషం ఒక ఉపాంగం మాత్రమే!చలం బ్రాహ్మణుడే కావచ్చు,కానీ బ్రాహ్మణీకం అనే పేరుకి కూడా సుందరమ్మ యొక్క బ్రాహ్మణీకం ఆమే యొక్క పవిత్రతని కాపాడలేకపోయింది అనే వ్యంగ్యసూచన!రచయిత వ్యంగ్యం కోసం వాడుకున మరొక చిన్న మాట “నాయుడు ఆమె కోపంలో దెయ్యాన్నీ మహిషాసుర మర్దిని చూడటం” అనేది.శ్రీశ్రీ విప్లవకవి,కమ్యూనిజానికి సపోర్టుగా నిలబడి జంధ్యాన్ని ఎంపేశాడు.కానీ తన కవిత్వంలో పురాణ కధల,పాత్రల పోలికల్ని తీసుకోలేదా?మెయిన్ పాయింటు మనస్సులో నిశ్చయించుకున్నాక కధకుడు గానీ కవి గానీ వాతావరణాన్ని సృష్టించడానికి పోలికలూ,సన్నివేశ కల్పనలో చేసే చమత్కారాలూ ఎక్కడినుంచయినా తీసుకోవచ్చు,అది రచయిత లందరూ చేస్తున్నదే కదా!మెయిన్ పాయింటు ముఖ్యం!ఒక్కోసారి శిల్పం రీత్యా అవసరమయితే మెయిన్ పాయింటుకి వ్యతిరేక ధోరణిలో కూడా మెయిన్ పాయింటుని బలంగా ఎక్కించవచ్చు.కవి నిరంకుశుడు.కదకుడు నియంత.ముమ్మాటికీ హెచ్చార్కె గారు బ్రాహ్మణీకం కధని సరిగ్గా అర్ధం చేసుకోలేదనే నాకనిపిస్తున్నది.స్వస్తి!"ఈ కధకి ఫలశృతి ఏమిటి?బ్రాహ్మణ స్త్రీని ఆశించిన అబ్రాహ్మణుడు మాడిపోతాడని చెప్పడమేగా?" అని అంత భీకరంగా గర్జించి మిగిలిన వాళ్ళు చలం బ్రాహ్మణీకపు మహత్యానికి గురయి రామయ్యనాయుడు చచ్చిపోయాడని ఎక్కడయినా నొక్కి వక్కాణించాడా అని నిలదీస్తే "అయ్యయ్యో అవి చలం మాటలే" అని మళ్ళీ ఆ వాక్యాన్ని యధాతధంగా కాపీ/పేస్టు చేసిన మొద్దబాయికి అదే వాక్యంలో రామయ్యనాయుడు కాలి బూడిదై చావటానికి ముందే సుందరమ్మ చచ్చిపోయినట్టు చలం స్పష్టంగా చెప్పి ఉన్నాడని అర్ధం కాకపోతే,నాకర్ధం కానిదంతా తప్పే అన్న నత్కీరుడి లాజిక్ ప్రకారం ఆలోచిస్తే అది ఖచ్చితంగా చలం తప్పే!ఇది చదివేవాళ్ళు అందరూ తలలోని మెదడుతో ఆలోచించేవాళ్ళు మాత్రమే ఉండరు,మోకాలులోని మెదడును మాత్రమే ఉపయోగించేవాళ్ళు కూడా చదివే అవకాశం ఉండొచ్చు,వాళ్ళకి కూడా అర్ధం అవ్వాలంటే ముప్పాళ రంగనాయకమ్మలా సుత్తి రాయాలి అని తెలుసుకోలేకపోయాడు చలం - పాపం!

     కధలో చలం మాటలివి "ఈ లోకపు సంకుచిత వాసనల్ని, శరీరపు స్వల్ప బంధనాల్ని తెంచుకున్న ఆమె(సుందరమ్మ) ఆత్మ అతిక్రమించి వూర్ధ్వలోకాల జ్వలించే మహాశక్తులతో - బ్రాహ్మణ తేజస్సుతో సంబంధం కల్పించుకుంది...(రామయ్య) ఇంకో కాలు వెనక్కి వేశాడు.ఆమె కళ్ళలోంచి జవ్లించే వెలుగును భరించలేక భగ్గున మండిపోయినాడు.నిలువునా కాలిపోయినాడు.భస్మమైనాడు.వెనుకనే మందే దీపం అతని పంచె కంటుకుందా?అతని శరీరం లోంచి కాళ్ళమధ్య నించి లేచిందా మంట.... బ్రాహ్మణ కడపటి మహత్యం బ్రాహ్మణీకం ఈ కలియుగాన సుందరమ్మతో అంతమైంది" అని ముక్కస్య ముక్కగా యెత్తి రాసేటప్పుడైనా తలలోని మెదడుతో చదివి అర్ధం చేసుకుని ఉంటే రామయ్యనాయుడు కాలిపోకముందే సుందరమ్మ ఆత్మ వూర్ధ్వలోకాలని చేరినట్టు చెప్పడం ద్వారా ఆమెకి మహత్యాలు అంటగట్టలేదని అర్ధమై ఉండేది.

     నన్ను చంపి పోగులు పెట్టినా సరే తలలోని మెదడును మాత్రం చచ్చినా ఉపయోగించనని భీష్మించుకుని ఉన్న హెచ్చార్కె లాంటివాడు తలలోని మెదడును మాత్రమే ఉపయోగించగలిగిన శ్రెనివాసుడు చేసిన వాదనల్ని చచ్చినా ఒప్పుకోడు:-)అలా ఒప్పించాలనే దురద హరిబాబుకి మాత్రం పిసరంత కూడా లేదు,ఎందుకంటే హరిబాబు పుట్టేటప్పుడు బ్రహ్మలోకంలో ఒక విచిత్రం జరిగింది.ఆడాళ్ళు చెయ్యాల్సిన సృష్టికార్యం తన మొగుడు చెయ్యడం ఆడంగి పని అనిపించిందో యేమో తిక్క పుట్టి పని చెడగొట్టడానికి గీర్వాణి కొంచెం గోముగా చూసేసరికి ఆ చూపు పవరుకి అంతటి చతుర్ముఖుడూ ఢమాల్న పడిపోయి నన్నొక మాన్యుఫాక్చరింగ్ డిఫెక్టుతో బూమ్మీదకి వదిలేశాడు.అదేమిటంటే,తలలోని మెదడుతో పాటు మోకాలిలోని మెదడు కూడా ఫుల్ విగరుతో ఉండటం - ఇంకోళ్ళూ ఇంకోళ్ళూ అయిన గోగూర కట్ట గాళ్ళు అయిఉంటే ఈ రెండు మేదళ్ళూ కలిసి పంబ రేగిస్తుంటే చిన్నప్పుడే పిచ్చెక్కిపోయేవాళ్ళు.నేను చిచ్చరపిడుగును కదా,అందులోని సులుసూత్రం కనిపెట్టి మోకాలిలోని మేదడును మామూలప్పుడు జోకొడుతూ ఇలాంటి త.మె.ఉ.ఆ గాళ్ళ సాహితీసృజన చదివినప్పుడు దాన్ని నిద్ర లేపడం నేర్చ్గుకున్నా - అబ్బో,చాలా కష్టం లేండి!అసలు నేను ప్రత్యేకంగా లేపనక్కర్లేదు,తనలాంటివాళ్ళ కోసం ఆబగా,కక్కుర్తిగా ఎదురు చూస్తూ ఉంటుందేమో పాపం వెంఠనే గుర్తుపట్టేసి చాలా అనందిస్తుంటుంది.మరీ అదే పనిగా దాన్ని మెళకువగా ఉంచితే ప్రమాదం గదాని ఎక్కువగా ఇలాంటువాళ్ళవి నేను చదవడం లేదు.కానీ శ్రీనివాసుడు గారు ఇరికంచడంలో తప్పనిసరై ఇరుకుపోయా:-)

     బ్రాహ్మణీకం సరిగ్గా అర్ధం కాకపోవటానికి చలం ఏమైనా సంస్కృతంలో రాశాడా?కనీసం విశ్వనాధ సత్యనారాయణ టైపు గ్రాంధికం కూడా వాడలేదే!ఎంతసేపూ చలం సెటైర్లుగా వేసిన విశేషణాల్ని పేరు పేరునా ఉటంకించి ఇవి పొగడ్తలేగా అని ఇతర్న్లని దబాయిస్తున్నాడు గానీ "ఈ కలియుగాన సుందరమ్మతో బ్రాహ్మణీకం అంతమైపోయింది" అని బల్లగుద్ది చెప్తున్నా పట్టించుకోడు.పైగా చలం ఈ నవల్లోనూ ఇతర చోట్లా బ్రాహ్మణుల్ని విమర్శించాడు గదా పొగడాలనుకునవాడు అంత క్రూరంగా ఎందుకు విమర్శిస్తాడు అంటే దానికి చెప్పిన రీజనింగు ఇది.ఆ ముక్క చదువుతుంటే "ఆహ్హహ్హహ్హా!ఓహ్హొహ్హొహ్హో!!" అని పగలబడి నవ్వాలని తెగ సర్దా పుట్టేసింది.
------------------------------------------------
హెచ్చార్కె
“చెలం ఈ కథలోనే కాదు, చాల చోట్ల బ్రాహ్మణ కుటుంబాల లోని చాదస్తాల్ని గేఌ చేశారు. అది ఆ కులం బాగు పడ్డానికి పనికొచ్చే మాటలు. పనికొచ్చాయి కూడా. ఇవేవీ ‘బ్రాహ్మణత్వా’న్ని గేఌ చేయడం కాదు. బ్రాహ్మణత్వం అంటే కులాల్లో బ్రాహ్మణులు పవితృలని…”
హరిబాబు
అంటే చలం బ్రాహ్మణుల్ని “ఇప్పుడు మీరు పాటిస్తున్నది నిజమిన పవిత్రత కాదు,నిజమిన పవిత్రతని అలవాటు చేసుకోండి” అని గేలి చెయ్యడమో గడ్డి పెట్టడం కూడా మీకు నచ్చలేదు,అదీ యే పాయింటు మీద?ఆ విమర్శల్ని పట్టించుకుని సంస్కరించుకున్నదుకు!

అంటే,మీరు తిట్టడానికి పనికొచ్చేటట్టు బ్రాహ్మల్ని అట్లాగే ఉంచకండా బ్రాహ్మల్ని గేలి చీసి మంచివాళ్ళుగా మార్చెయ్యడం వల్ల చలం కూడా తప్పే చేఅశాదనన్మాట,బాగుంది వరస!
------------------------------------------------
     ఇందులో ఉన్న కిరికిరి యేంటో కొందరికి చదవగానే అర్ధమై ఉంటుంది,కదూ!బ్రాహ్మలు దుర్మార్గులై ఇతర కులాల్ని(మమ్మల్ని) అణిచేశారు,అందుకే మేము ద్వేషిస్తున్నాం అంటున్నాడు,మరి చలం తిట్ల వల్ల బ్రాహ్మణులు తమ దుర్మార్గాల్ని వొదులుకుంటే ఈయనకి కొత్తగా పుటుకొచ్చే నెప్పి యేంటి?"పొరపాట్న చలం తిట్ల వల్ల బ్రాహ్మలు మంచోళ్ళయిపోయిఉంటే ఇప్పుడు మేమెవర్ని తిట్టాలి?" అన్న యేడుపు కనబడింది నాకు ఇందులో.చిన్నప్పుడు చూసిన గోపాలరావు గారి అమ్మాయి సినిమాలో మోహన్ బాబు పాత్ర చాలా తమాషాగా ఉంటుంది.అందులో హీరో చంద్రమోహన్ హీరోయిన్ జయసుధని యెప్పుడు చూసినా గోపాలరావు అనే ఆసామీ ఇంట్లోనుంచి బయటికొస్తూ అక్నబడ్డంతో తను గోపాలరావుగారి అమ్మాయి అనుకుని పేమించేస్తాడు.ఈ క్యామెడీ ఆఫ్ ఎర్రర్సులో మోహన్ బాబు బహుశా హీరోయినుకి అన్నగా చెల్లిలికి ద్రోహం జరిగిందనో మరో కారణంతోనో హీరోని చంపాలని చూస్తూ ఫెయిలవుతూ నవ్వు పుటిస్తూ ఉంటాడు.ఆఖరికి కధలోని కంఫ్యూజన్ అంతా విడిపోయాక వాళ్ళ నాన్నని భుజం మీద గోకుతూ "ఇపుడు నేనెవర్ని చంపాలి?" అనడుగుతాడు అమాయకంగా.వాచికం మీద మంచి పట్టున్న మోహన్ బాబు చక్కిలిగింతలు పెట్టించేటంత గొప్పగా చెబుతాడు.అటువైపు నాన్న పాత్రలో ఉన్నవాడు నాగభూషణం - అబ్బో,ఇంక చూస్కోండి!"నన్ను చంపరా పీడా వొదుల్తుంది" అంటాడు.కళ జీవితాన్ని అనుకరిస్తుంది అంటారు,ఆ దర్శకుడు తన జీవితంలో అలాంటివాడిని ఎక్కడో చూసి ఉంటాడనుకుంటే అది నిజమేననిపిస్తుంది గానీ ఇప్పుడు హెచ్చార్కె గారు అచ్చు మోహాన్ బాబులా మాట్లాడుతూ అప్పుడప్పుడు జీవితం కూడా కళని అనుకరిస్తుందని అనిపిస్తూ అంతకన్నా పదింతలు నవ్వు తెప్పిస్తున్నాడు,అందుకన్నమాట "ఆహ్హహ్హహ్హా!ఓహ్హొహ్హొహ్హో!!"లు:-)

     బ్రాహ్మణుల్ని చలంలా సంస్కరించడం కోసం తిట్టటం తప్పు,హెచ్చార్కె లాంటివాళ్లకి బ్రాహ్మల మీద ఉన్న కసితీరేలా మాత్రమే తిట్టాలి,అంతే!చలం అన్యాపదేశంగా ప్రస్తావించిన బ్రాహ్మణులలోనూ మంచివాళ్ళున్నారని  పొరపాటున కూడా ఒప్పుకోకూడదు,అది బ్రాహ్మణుల పట్ల రగిలిపోతూ ఉండాల్సిన ద్వేషాగ్ని చల్లారుస్తుంది.ఇదీ హెచ్చార్కె గారి ఈ వ్యాస పరంపరలో పరుచుకుని ఉన్న మోకాలిలోని మెదడుతో ఆలోచించేవాళ్ళు మాత్రమే చెయ్యగలిగిన విశ్లేషణల లోని కొన్ని అర్ధవంతమయిన విషయాలు!!"రామాయణం కథలంటే ఖోపం. అన్నీ తప్పుడు ధర్మాలని. వీరత్వం కోసం కొట్టుకు చావడాలని." అనీ "ఐ రిపీట్ సర్, రామాయణ ధర్మమధర్మమే" అనీ సారంగలో కామెంట్లుగానూ "భారతం అంటే నాకు చాల అభిమానం.ప్రపంచంలో అంత గొప్ప ఎపిక్ స్టోరీ లేదని అనుకుంటాను.అందులో అడుగడుగున వచ్చే గోబ్రాహ్మణ పూజ అంటే పరమ అయిస్టం" అని చివరి వ్యాసంలోనూ అంటున్నాడు - అంటే ఇంకా డైలెమ్మా నుంచి బైటపడలేదు కాబోలు - పాపం పాపం!!నేను సారంగలో ఈ కధలో రామయ్యనాయుడు చేసినదానికీ అడాల్ఫ్ హిట్లర్ చేసినదానికీ చెప్పిన పోలికలు అర్ధమయితే చలం బ్రాహ్మణీకం నవలలో ఏమి చెప్పదల్చుకున్నాడో చాలా తేలిగ్గా అర్ధమవుతుంది.చివరిలో కలవరింతలాగ మహిషాసుర మర్దిని గుర్తు చేస్తూ కలగాపులగంగా చేసిన వర్ణన చలం యొక్క మామూలు రచనాశైలియే - ప్రత్యేకంగా సుందరమ్మకి మహత్యాలూ ంటగట్టానికి వ్హేసిన ట్రిక్కు కాదు.చలం రచనాశైలి ఇక్కడే కాదు "బుజ్జిగాడు" అని రమణాశ్రమం నుంచి అనుకుంటాను,ఒక పిచ్చుకని గురించి దైరీలా రాసే చోట కూడా చిన్నప్పుడు మనం రేడియోలో విన్న క్రికెట్ కామెంటరీలా యమా ఫాస్టుగా ఉంటుంది.రాసి,కొట్టేసి,తుడిచి,మళ్ళీ రాసినట్టు ముతక పద్ధతిలో కాకుండా కళ్ళముందు దృశ్యాల్ని చూస్తూ చూసిన దాన్ని చూసినట్టు బోమ్మ కట్టించడం చలానికి చాతనయినట్టు తెలుగుభాషలోనే కాదు ప్రపంచంలోని యే భాషారచయితకీ కుదిరిచావలేదు - ఎందుకనో!అది శ్రీశ్రీ చెప్పిన "అనుభవించి పలవరించడం",బ్రాహ్మలు మంచివాళ్లయ్యేందుకు తిట్టడం కూడా సహించలేని హెచ్చార్కె లాంటి మోకాలిలోని మెదడుతో మాత్రమే ఆలోచించేవాళ్లకి ఎప్పటికీ అర్ధం కాదు.

     ఈయన నిజంగా రామాయణ భారతాలు సొంతంగా చదివాడా?కనీసం చాలా తేలిక భాషలో రాసిన ఉషశ్రీ అనువాదమయినా చదివాడా!నాకయితే చదవలేదనే అనిపిస్తుంది.చదవటం, చదవకపోవటం, చదివినా అర్ధం కాకపోవటం, చదవకుండానే తిట్టిపొయ్యాలనే దురద పుట్టటం లాంటివాట్ని అటుంచితే నాక్కూడా అర్ధం కానిది - గోబ్రాహణ పూజ అసయ్యం అంటూనే కిరస్తానం ఐలయ్య దగ్గిర్నుంచీ గజస్నానం మురమ్నా వరకూ అది బ్రాహ్మణకులాధిపత్యాన్నీ గోబ్రాహ్మణ పూజనీ ఉగ్గడించటం కోసమే వ్యాసుడు కుట్రపూరితంగా రాశాడని బల్లగుద్దిచెప్తున్న  బారతాన్ని ఎట్లా ఇస్టపడుతున్నాడు?ఈ దైలెమ్మాని ఆయన ఎంత తొందరగా వొదుల్చుకుంటే అంత మంచిది!ఈ స్టేటుమెంటు మీకు అర్ధం కావాలంటే నా పోష్టు మొదట్లో ఇచ్చిన స్టేటుమెంటు తప్పనిసరిగా అర్ధం చేసుకోగలగాలి - స్వభావరీత్యా ఈ రెండూనూ మోకాలిలోని మెదడుతో ఆలోచించగలిగిన వాళ్ళు మాత్రమే విరజిమ్మగలిగిన మెచ్చుతునకలు!

     హెచ్చార్కె గారిని నేను మోకాలిలోని మెదడుతో మాత్రమే ఆలోచించగలిగిన వాళ్ళల్లో చేర్చటాన్ని నకారాత్మక వ్యంగ్యవైభవం కింద తీసుకుని తనని అవమానిస్తున్నానని కించపడవలసిన పనిలేదు.భారతజాతికే తలమానికమైన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి కాపు జాతికే హంవీర చూడామణి ముద్రగడ పద్మనాభం వరకు ఎంతోమంది లబ్ధప్రతిష్ఠులు ఉన్నారు!దళిత మేధావి కంచె ఐలయ్య గారు,మార్క్సిస్టు మేధావి మురమ్నా లాంటి ఎందరో మొక్కవోని పట్టుదలతో కుడియెడమల డాల్కత్తులు మెరయగ వీరంగాలు వేస్తూ ఎంతో పాప్యులారిటీ తెచ్చుకుంటున్నారు.తలలోని మెదడుతో ఆలోచిస్తే పాప్యులారిటీ రాదు.పాప్యులారిటీ తెచ్చుకోవాలంటే మోకాలిలోని మెదడుతొనే ఆలోచించాలి.కాకపోతే అసహనాన్ని తట్టుకోగలగాలి,ప్రశాంతత ఉండదు,నిరంతరం ద్వేషాగ్నిని ప్రజ్వలింపజేస్తూ ఉండాలి - అయితే ఇప్పటికే వాటికి అలవాటుపడిపోయారు గాబట్టి కొత్తగా పడాల్సిన కష్టం ఏమీ లేదు 

     కుక్క తోకని కదిలిస్తుంది అనే బ్రాహ్మణుల కుట్రని ఎదుర్కోవడానికి క్నాదు, తోక కుక్కని కదిలిస్తుంది అని వాదించగలిగినవాళ్ళు కొందరయినా ఉండాల్సిందే!మొత్తానికి ఈ పోష్టుకి ఫలశృతి ఏంటయ్యా అంటే "కత్తి గొప్పదా?కలం గొప్పదా?","విత్తు ముందా?చెట్టు ముందా?","గుడ్డు ముందా?పిల్ల ముందా?" లాంటి తింగరి డిస్కషన్ల లిస్టులోకి మరో కొత్త టాపిక్ వచ్చి పడింది.


కుక్క తోకని కదిలిస్తుందా?తోక కుకని కదిలిస్తుందా?హ్హిహ్హిహ్హీ!!

Tuesday, 10 May 2016

ఓ రామ - నీ నామ మెంతో రుచి,ఎంతో రుచి రా!

                          సీ||మోటు నిషాదుడు మౌనివరుడు పోవు
                              మార్గాన క్రూరత్వ మావహించి

                              జోడుకూడిన జంట క్రౌంచములందు పో
                              తును కూల్చగా యాడుదాని బాధ

                              మనసును కదిలించి మరిమరి వేధించి
                              శాపమై.నిందయై - కావ్యధార

                              గంగయై పొంగి - లోకాన మరల నిట్టి
                              ఘాతుకమును చేయ కుండునట్టి

                         తే||సాధు సజ్జనులను పెంచు దీక్ష తోడ
                             గిరులు ఝరులు ఉండువరకు నిలిచిపోవు
                             రామకధను తీరిచి దిద్దినాడు మౌని,
                             సాహితీమూర్తు లందు శాశ్వతుడు గాగ!
(17.07.2015)
------------------------------------------------------------------------------------------------------------------------------
          రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు. 

తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం
నారదం పరిపప్రచ్చ వాల్మీకి ర్ముని పుంగవం

స హత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందనః
ఋషిభిః పూజిత స్సమ్యగ్ యథేంద్రో విజయీ పురా

విశ్వామిత్ర స్స ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం
వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవ మబ్రవీత్

తుష్టావాస్య తదా వంశం ప్రవిశ్యస నిశాంపతేః
శయనీయం నరేంద్రస్య త దాసాద్య వ్యతిష్ఠత

వనవాసం హి సంఖ్యాయవాసాంస్యా భరణాని చ
భర్తార మనుగఛ్చంత్యై సీతాయై శ్వశురో దదౌ

రాజా సత్యం చ ధర్మశ్చ రాజా కూలవతాం కులం
రాజా మాతా పితా చైవ రాజ అహితకరో నృణాం

నిరీక్ష్య స ముహూర్తం తు దదర్శ భరతో గురుం
ఉటజే రామ మాసీనం జటావల్కల ధారిణం

యది బుద్ధిః కృతా ద్రష్టు మగస్త్యం తం మహామునిం
అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశః

భరత స్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమచ ప్రబో
మృగరూప మిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి

గఛ్ఛ శీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలం
వయస్యం తం కురు క్షిప్రమితో గత్వాద్య రాఘవ

దేశకాలౌ ప్రతీక్షస్వ క్షమమాణః ప్రియాప్రియే
సుఖదుఃఖ సహః కాలే సుగ్రీవ వశగో భవ

వంద్యాస్తే తు తపస్సిద్ధాః తపసా వీతకల్మషాః
స్రష్టవ్యాశ్చాపి సీతాయాః ప్రవృత్తిం వినయాన్వితై

స నిర్జిత్య పురీం శ్రేష్ఠాం లంకాం తాం కామరూపిణీం
నిక్రమేణ మహాతేజా హనుమాన్ మారుతాత్మజః

ధన్యా దేవా స్స గంధర్వా స్సిద్ధాశ్చ పరమర్షయః
మమ పశ్యంత యే నాధం రామం రాజీవలోచనం

మంగళాభిముఖీ తస్య సా సదాసీ న్మహాకపీః

ఉపతస్థే విశాఅక్షీ ప్రయతా హవ్యవాహనం

హితం మహార్థం మృదుపూర్వ సంహితం
వ్యతీత కాలాయతి సంప్రతి క్షమం

నిశమ్య తద్వాక్య ముపస్థిత జ్వరః
ప్రసంగ హనుత్తరమే తద బ్రవీత్

ధర్మాత్మా రక్షసాం శ్రేష్ఠః సంప్రాప్తోయం విభీషణః
లంకైశ్వర్యం ధృవం శ్రీమానయం ప్రాప్నోత్యకంటకం

యో వజ్రపాతాని సన్నిపాతానన చుక్షుభే వాపి చచాల రాజా
స రామబాణాభిహతో భృశార్తశ్చచాల చాపం చ చముమో చ వీరః

యస్య విక్రమ మాసాద్య రాక్షసా నిధనం గతాః
తం మన్యే రాఘవం వీరం నారాయణ మనామయం

న తే దదృశిరే రామం దహంత మరివాహినీం
మోహితాః పరమాస్త్రేణ గాంధర్వేణ మహాత్మనా

ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలీ
బద్ధాంజలి పుటా చేద మువాచాగ్ని సమీపతః

చలనా త్పర్వతేంద్రస్య గణా దేవాశ్చ కంపితాః
చచాల పార్వతీ చాపి తదాశ్లిష్టా మహేశ్వరం

దారాః పుత్రాః పురం రాష్ట్రం భోగాఛ్ఛాదన భాజనం
సర్వమేవావిభక్తం నో భవిష్యతి హరీశ్వర

యామేవ రాత్రిం శతృఘ్నః పర్ణశాలాం సమావిశత్
తామేవ రాత్రిం సీతాపి ప్రసూతా దారకద్వయం


ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీ బీజసంయుతం
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే

          నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు రామాయణంలో ప్రక్షిప్తాలు ఉన్నాయనీ,వాటిని తొలగించితే గానీ వాల్మీకి రామాయణం శుద్ధంగా ఉండదనీ పండితులు చాలా చర్చలు చెయ్యడం జరిగిందని విన్నాను.అప్పట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు.తర్వాత నిజం అయినా అయ్యుండొచ్చు అనిపించింది.కొన్ని తరాల పాటు చెప్పుకుంటూ వస్తున్న కధలో ఎక్కడో అక్కడ ఎవరో ఒకరికి తన పాండిత్యం కూడా అందులో ప్రదర్శించుదామనే దౌర్బల్యం ఉన్నవాళ్ళు కలిపితే కలిపి ఉండవచ్చు అనుకున్నాను.కానీ,ఈ గాయత్రీ రామాయణం గురించి తెలిశాక మాత్రం అలా జరిగి ఉందటానికి వీల్లేదు కదా అనిపిస్తున్నది.ప్రక్షిప్తాలతో సహా అందరూ కలిపి 24,000 శ్లోకాలకి అమర్చిన తర్వాత ఈ వరస రావడం తర్కానికి అందనిది - వాల్మీకి ముందుగానే అనుకుని చేస్తే తప్ప మామూలుగా అయితే ఇలా కుదరడం అసంభవం!రామాయణంలో వాడిన చందస్సు అనుష్టుప్ చందస్సు, పాత్రల పేర్లలో ఉన్న మార్మికత చూస్తే అపురూపం, యోగశక్తి జ్ఞానచక్రాల గుండా ప్రయాణం చేసేటప్పుడు సాధకుడికి కలిగే అనుభూతుల్ని కధాకధనంలో కనిపించే మలుపుల్లో వర్ణించి చెప్పటం:శివధనుర్భంగం జరిగినప్పుడు వర్ణించినది సాధకుడి మనస్సులో తొలిసారి దైవసంస్పర్శ జరిగినప్పటి అంతర్లోకపు భీబత్సాన్నే - వీటిల్లో దేనిని మనం కాకతాళీయంగా రాశాడని చెప్పగలం?ఇదీ అంతే,నిన్న గాక మొన్న చదివినవి ఇవ్వాళ్టికి మర్చిపోయేవాళ్ళు ఇంతకాలం గుర్తుంచుకునే విధంగా ఒక కధని చెప్పినవాడు మహామేధావి!అట్లాంటివాడి కవిత్వంలో తప్పులు వెదకటం,తన పైత్యం కొంత చేర్చటం కుదిరే పని కాదు!

          మంత్రాలలో గాయత్రీ మంత్రం శ్రేష్ఠమైనది అయితే ఆ గాయత్రిని ఇముడ్చుకున్న రామాయణం కూడా శ్రేష్ఠమైనదే అవుతుంది.సనాతన ధర్మంలో నిర్లక్ష్యం చెయ్యకూడని అవమానించకూడని అత్యంత మౌలికమైనవి మూడు - విశ్వామిత్ర గాయత్రి, ఈశావాస్యోపనిషత్తు ప్రధమ శ్లోకం, శ్రీ చక్ర యంత్రం!భరద్వాజ గాయత్రి,వశిష్ఠ గాయత్రి దాదాపు గాయత్రి,గణేశ గాయత్రీ మంత్రాలు అన్నీ ఒకే నిర్మాణం కలిగి ఉంటాయి.కానీ విశ్వామితుడు ప్రవచించిన సవితృ గాయత్రిలో భావం గొప్పది.వెలుగుని ఆహ్వానించటం!అంతటా నిండిపోవాలనుకోవటం!అందరికీ కోరుకోవటం - అందుకే గాధేయుడు విశ్వామిత్రు డయ్యాడు!!పశ్చిమ దేశాల వారు భౌతికమైన వాస్తవికతని గుర్తించి ప్రగతిశీలంగా ఉంటే మనవారు ఆధ్యాత్మికత పేరుతో సమాజాన్ని వెనక్కి నడిపిస్తున్నారని మేకాలే సృష్టించిన కొందరు రెటమతం చూపిస్తున్నారు గానీ వాస్తవికతని మన ప్రాచీనులు ఎప్పుడూ మరిచిపోలేదు.అలా మరిచిపోయి ఉంటే ఇలా మిగిలి ఉండేది కాదు.

          రామాయణం మొత్తం ఒక ఎత్తు సుందరకాండ ఒక ఎత్తు!మిగతా కాండల్లో ప్రత్యక్షంగా కనబడే రాముడు ఈ కాండలో పరోక్షంగా కనబడతాడు.మిగతా రామాయణ కధకి రాముడు నాయకుడైతే సుందరకాండలో జరిగే కధకి వాగ్విదాంవరుడైన కపిశ్రష్ఠుడు హనుమంతుడు అనుచర స్థానం నుంచి నాయకుడై యెదిగి తన విశ్వరూపం చూపిస్తాడు.ఇక్కడి విజృంభణ అంతా ఇంత గొప్పగా చూపించినవాడు రాముణ్ణి కలవగానే మళ్ళీ అనుచర శ్రేష్ఠుడిగా ఒదిగిపోతాడు!జగత్సుందరియైన సీతకీ పుంసాం మోహనరూపుడైన రాముడికీ ఆనందం కలిగించటం కొసం కపిసుందరుదైన హనుమంతుడు ఒక దుష్కర కార్యాన్ని నెత్తిమీద వేసుకుని అపజయం అంచుల వరకూ వెళ్ళి నిరాశపడి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి మళ్ళీ కూడదీసుకుని తనకి తనే జీవితాశని రగిలించుకుని రెట్టించిన పట్టుదలతో అదృష్టం కూడా తోడై కార్యసాఫల్యత వైపుకి ప్రయాణించిన దృశ్యాలని వాల్మీకి భూతద్దంలో పెట్టి చూపించి వర్ణించాడు.మాటిమాటికీ చావుని గురించి కొటేషన్లు రాసుకుని పులకించిపోతూ నాకు ఉరితాళ్ళు కావాలి,నన్ను చంపండి,నన్ను చంపండి అని అఘోరించేవాళ్ళు ఇలాంటివి చదవనే చదవరు గానీ సుందరకాండలో తొమ్మిది అతి ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి.ఛందస్సు రీత్యా వాటిని శ్లోకాలు అని వూరుకోవచ్చును గానీ వాటిలోని భావం కూడా గొప్పదే గనక మంత్రాలే అవుతాయి.శ్రీ రామాయణ మహామాలా నవరత్న మంత్రావళి అని పిలిచే తొమ్మిది శ్లోకాల్నీ అర్ధం తెలుసుకుని ప్రతి రోజూ జపిస్తూ ఉంటే ఒక సంవత్సరం తర్వాత అంతకు ముందరి జీవితానికీ అప్పటి జీవితానికీ తేడా మీకే తెలుస్తుంది.

శ్లోకం:-తతో రావణ నీతాయా సీతాయాః శత్రుకర్షణః
       ఇయేవ పదమన్వేష్టుం చారణా చరితే పధిః
భావం:-రావణునిచే అపహరించబడిన సీతను వెదకటానికి శత్రుకర్షణుడైన హనుమంతుడు చారణులు సంచరించే ఆకాశమార్గాన్ని యెన్నుకున్నాడు.
సారం:-ఈ శ్లోకం గాయత్రీ మంత్రంలోని 12వ అక్షరంతో సంవదిస్తుంది.గాయత్రీ మంత్రంలో ప్రశంసించబడిన దైవం సూర్య భగవానుడు.సూర్యుడు ఆకాశానికి అధిపతి.సూర్యదేవుని అనుగ్రహ ప్రాప్తికి నిర్దేశించబడిన రత్నం మాణిక్యం.మాణిక్యం రామావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యధాతవ
       ధృతి ర్దృష్టి ర్మతి ర్ధాక్ష్యం స్వకర్మసు నసీదతి
భావం:-ఓ వానరేంద్రా!నీకు విజయం సాధించటానికి తోడ్పడే నాలుగు ప్రధాన లక్షణాలు - జ్ఞాపకశక్తి,మేధస్సు,పట్టుదల,నేర్పు ఉన్నాయి.అందుచేత నీవు తప్పక విజయం సాధిస్తావు.
సారం:-ఈ మంత్రంలో నిక్షిప్తమైన విజయ రహస్యం మనస్సుకు సంబంధించినది.మనస్సును ప్రభావితం చేసే గ్రహం చంద్రుడు.చంద్రునికి ప్రీతిపాత్రమైన రత్నం ముత్యం.ముత్యం కృష్ణావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖం
       అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తకః
భావం:-ఐశ్వర్యానికి మూలం ఉత్సాహం.అదే అపరిమితానందానికి హేతువు.నిజానికి అన్ని యత్నాలకూ చోదకశక్తి ఇదే.విజయరహస్యం కూడా ఇదే.
సారం:-ఈ మంత్రం హనుమంతునిలోని ఆశావాదాన్ని వివరిస్తుంది.ఋణం,ఒత్తిడి మొదలైన మానసిక వ్యధలకు అంగారక గ్రహమే కారణం.అంగారకుడు శుభకరుడైతే అన్నిరకాల వ్యధల నుండి దూరం చేసి సర్వశుభాల నిస్తాడు.అంగారకునికి ప్రీతిపాత్రమీన్ రత్నం పగడం.పగడం నృసింహావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ జనకాత్మజాయై
       నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః
భావం:-రామ లక్ష్మణులకు నమస్కారం.దేవి జనకాత్మజకు నమస్కారం.ఉద్ర,ఇంద్ర,యమ,వాయు,చంద్ర,సూర్య మరుద్గణాలకు నమస్కారం
సారం:-ఈ ప్రార్ధన చేసిన మరునిముషంలోనే హనుమంతుడు అశోకవనంపై దృష్టి సారించడం జరిగింది.అందువల్లనే దీనిని పండితులు కార్యసాఫల్యమంత్రంగా గుర్తించారు.మనస్సుబు సరైన సమయంలో సరైన మార్గంలో నడిపించటానికి నిర్దిష్టమైన గ్రహం బుధుడు.బుధుడు శుభకరుడైతే సునిశిత భావాలు అవసర సమయంలో స్ఫురిస్తాయి.బుధునికి ప్రీతిపాత్రమైన రత్నం పచ్చ.పచ్చ బుద్ధావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-ప్రియాన్న సంభవేత్ దుఃఖం అప్రియాత్ అధికం భయం
       తాభ్యాం హి వియుజ్యంతే నమస్తేషాం మహాత్మానం
భావం:-మనకు కలిగే దుఃఖాలన్నింటికీ మూలకారణం - వస్తువులతో గానీ,వ్యక్తులతో గానీ,విషయాలతో గానీ మనకు గల అనుబంధాల నుండి ఎక్కడ వియోగం కలుగుతుందోనని భయపడటం.అలాంతి భయాలకూ,దుఃఖాలకూ అతీతులైన మహాత్ము లందరికీ నేను నమస్కరిస్తున్నాను.
సారం:-ఈ మంత్రం సీతాదేవి మనకు చేస్తున్న జ్ఞానోపదేశం వంతిది.వేదాంత విషయాలకు సంబంధించిన గ్రహం గురుడు.గురునికి ప్రీతిపాత్రమైన రత్నం పుష్యరాగం.పుష్యరాగం వామనావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-రామః కమల పత్రాక్షః సర్వ సత్వ మనోహరః
       రూప దాక్షిణ్య ప్రసూతో జనకాత్మజే
భావం:-ఓ జనకాత్మజా!రాముని నేత్రాలు మిక్క్లి అందమైనవి.తామర పూరేకుల వంటివి.ఏ వ్యక్తి అయ్నా,ఎ ప్రాణి అయినా మోహ పరవశుడయ్యే అద్భుత సౌందర్యవంతు డాయన.విశిష్ట లక్షణాలతో,ఉత్తమ గుణాలతో ఆయన జన్మించాడు.
సారం:-ఈ శ్లోకంలో హనుమంతుడు రాముని వ్యక్తిత్వాన్ని వర్ణించడంలో చూపించిన నిజాయితీని గమనించిన తర్వాతనే సీతాదేవికి ఆయన పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగింది.అందువల్లనే పండితులు దీనిని సుందరకాండ కంతటికీ ప్రకాశవంతమైన సన్నివేశంగా తీర్మానించి ఈ శ్లోకాన్ని వజ్రంతో సంవందించారు.శుక్రునికి ప్రీతిపాత్రమైన రత్నం వజ్రం.వజ్రం పరశురామావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-జయత్పతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః
       దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణః
భావం:-మహాశక్తిశాలి అయిన రాముడికి జయం.మహావీరుడైన లక్ష్మణునికి జయం.ఎవరి చేతలు సకల జనులకూ శుభాలు కలగజేస్తాయో అట్టి కోసల దేశానికి రాజయిన రాముడికి నేను దాసుణ్ణి.
సారం:-ఈ శ్లోకంలోని జయజయ ధ్వానాలు లంకానగరవాసులకు హెచ్చరిక వంటివి.అప్పటివరకు సీతాదేవి పైన తన దుష్ప్రభావాన్ని చూపించిన సని ఆమెను వదలి రావణుని పీడించటం మొదలైంది.ఈ మంత్రంతో శనీశ్వరుడు సీతారాములకు శుభకరుడుగా మారాడు.శనీశ్వరునికి ప్రీతిపాత్రమైన రత్నం నీలం.నీలం కూర్మావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం మమ
       యది రాస్త్యైక పత్నీత్వం శీతోభవ హనూమతః
భావం:-ఓ అగ్నిదేవా!నేనే గనుక నాభర్త పట్ల అనుకూలవతి నైతే,నేనే గనుక విధి ననుసరించి వివాహమైన భార్యనే అయితే హనుమంతుడికి ఏ బాధా కలిగించవద్దు.
సారం:-జానకీదేవి ప్రార్ధనాపూర్వకంగా స్మరించిన ఈ మంత్రప్రభావం వల్లనే హనుమంతుడికి అగ్నితాపం దరిచేరలేదు.కాలిన గాయాలు,కుష్ఠు మదలైన వాటినుండి ఉపశమనం కొరకు జ్యోతిష్కులు రాహుజపాన్ని సూచిస్తారు.రాహువుకు ప్రీతిపాత్రమైన రత్నం గోమేధికం.గోమేధికం వరాహావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-నివృత్త వనవాసంచ త్యయాసార్ధ మరిందమం
     అభిషిక్త మయోధ్యాయాం క్షిపుంద్రక్షసి రాఘవం
భావం:-ఓ పూజ్యమాతా!నీ భర్త అసమాన వీరుడు.శత్రువులను సంహరించగలడు.అతడు విజయాన్ని సాధిస్తాడు.నీవు తిరిగి ఆయనను కలుసుకొనగలవు.మీరు మీ రాజ్యానికి వెళ్ళి అయోధ్యా సింహాసనాన్ని అధిష్ఠిస్తారు.
సారం:-ఈ మంత్రం సీతాదేవి హృదయానికి మిక్కిలి ఆనందం కలిగించింది.దీనినే మరల రాముని ఎదట చెప్పినప్పుడు ఆయనకూ అంతటి ఆనందాన్ని కలిగించింది.భవిష్యత్తులో జరగబోయే శ్రీరామ పట్టాభిషేకాన్ని హనుమంతుదు తన మనస్సులో ముందుగానే జరుపుకున్నాడు.కారాగార వాసం,బంధనం మొదలైన వాటినుండి విముక్తి కొరకు జ్యోతిష్కులు కేతుజపాన్ని సూచిస్తారు.కేతువుకు ప్రీతిపాత్రమైన రత్నం వైడూర్యం.వైడూర్యం మత్స్యావతార సూచకమైన రత్నం.

          వీటిలోని విశేషం ఏమిటంటే ప్రతి శ్లోకమూ నవగ్రహాలలో ఒక గ్రహానికి,నవరత్నాలలోని ఒక రత్నానికి అనుసంధానించబడి ఉంటుంది.దశావతారాలలో ఇంకా రాని కల్క్యావతారాన్ని వదిలేసిన వాటిలో ఒక అవతారంతో కూడా ఆ శ్లోకాలకి సంబంధం ఏర్పరచారు పండితులు - అందులో మాయా, మోసం ఏమీ లేవు.వాటన్నిటికీ ఉన్న సారూప్యతలని బట్టే ఆ సంబంధాన్ని కల్పించారు.కాబట్టి వీటిని ప్రతిరోజూ జపిస్తే నవగ్రహ పూజా,దశావతార స్మరణా కూడా చేసినట్టే!అయితే,ప్రతి శ్లోకానికీ భావం కూడా గొప్పదే,బ్రతుకు మీద ఆశని పుట్టించే మంచిమాటలు ఇవన్నీ!ఉదాహరణకి విజయానికి అవసరమయిన నాలుగు లక్షణాలూ నీకు ఉన్నాయి కనక విజయం సాధిస్తావు అని లక్షణాల లిస్టు చెప్పి హనుమంతుణ్ణి పొగొడుతున్నప్పుడు కవి ఈ లక్షణాలు మీలో ఉంటే మీరూ విజయం సాధిస్తారు అని చెప్తున్నాడు.సీత ద్వారా వాల్మీకి ఏమి చెప్పాడో దాని విస్తృత రూపమే గౌతమ బుద్ధుడి ద్వారా ప్రచారంలోకి వచ్చిన బౌద్ధమత సారం!వీటిని నేను చాలాకలం నుంచి జపిస్తున్నాను.ఫలితం కనబడుతున్నది.అందుకే ఇక్కడ భావంతో సహా ఉంచాను.నిత్యానుష్ఠానంలో వీటిని చేర్చుకుంటే ఫలితం తప్పకుండా మిమ్మల్ని సంతృప్తి పరుస్తుంది!

          సుందరకాండలో ఉన్న అద్భుతం ఇదైతే,తర్వాత వచ్చే యుద్ధకాండలో ఆదిత్యహృదయం అనే మరొక అద్భుతం ఉంది!కొందరికి ఇవన్నీ చాద్స్తంగా అనిపించవచ్చు,ఇన్ని మంత్రాలు,ఇన్ని చోట్ల ఇంత గట్టిగా నొక్కి చెప్పటం అవసరమా అని,తప్పు లేదు!దేహం దృఢంగా ఉంచుకోవాలంటే వ్యాయామం చెయ్యాలి.జిం నిర్వాహకులు వెళ్ళిన ప్రతివాడికీ ఒకే ఓక్ డంబెల్సో,ఒకే ఒక బుల్వర్కరో ఇచ్చి సరిపెట్టెయ్యటం లేదు గదా!వెళ్ళిన వాళ్ళు కూడా మొక్కుబడిగా ఏదో ఒకటి ట్రై చేసి వచ్చెయ్యటం లేదు - ఓ నాలుగో అయిదో రకాలు వాడుతున్నారు.ఇదీ అంతే,ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండాలన్నా నేను దృఢంగా ఉండాలి అనే సంకల్పం ఒక్కటే సరిపోదు - ప్రాక్టీసు చెయ్యాలి!లేప్పోతే మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటాది, యావంటావ్ సెగట్రీ?

ఆదిత్య హృదయం


తతఓ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతే దృష్ట్వ అయుద్దాయ సముపస్థితం

దైవతశ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణం
ఉపాగమ్య బ్రవీద్రామ మగస్త్యో భగవాన్ ఋషిః

రామ రామ మహాబాహో శ్రుభు గుహ్యం సనాతనం
యేన సర్వా నరీన్ వత్సః సమరే విజయిష్యసి

ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శతృ వినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం

సర్వ మంగళ మంగళ్యం సర్వపాప పణాశనం
చింతాశోక ప్రశమన మాయుర్వధన ముత్తమం

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః

ఏష బ్రహ్మాచ్ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమస్యోమో హ్యపాం పతిః

పితరో వసవ స్సాధ్యాః హ్యశ్విన్యౌ మరుతో మమః
వాయు ర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః

ఆదిత్య స్సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణ సదృశో భాను ర్హిరణ్యరేతా దివాకరః

సూర్యారాధన ప్రారంభం

హరిదశ్వ స్సహస్రార్చి స్సప్త స్సప్తి మరీచిమాన్
తిమిరోర్మధన శ్శంభు స్త్వష్టా మార్తాండ అంశుమాన్

హిరణ్యగర్భ శ్శిశిర స్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భో అదీతే పుత్ర శ్శంఖ శ్శిశిర నాశనః

వ్యొమనాధ స్తమోభేదీ ఋగ్యజుస్సామ పారగః
ఘనవృష్టి రపాంమిత్రో వింధ్యవీధీ ప్లవంగమః

అతపీమండలీ మృత్యుః పింగళ స్సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా రక్తస్సర్వ భవోద్భవః

నక్షత్ర గ్రహతారాణా మధిపో విశ్వభావనః
తేజసామపితేజస్వీ ద్వాదశాత్మ న్నమోస్తుతే

నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః
జ్యోతిర్గణానాం పతయే దివాధిపతయే నమః

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమోనమః
నమోనమః సహస్రాంశో ఆదిత్యాయ నమోనమః

నమ ఉగ్రాయ వీరాయ పాండురాయ నమోనమః
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమోనమః

బ్రహ్మేశానచ్యుతేశాయ సూర్యాయాదిత్య వర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నా యామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమ స్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే

నాసయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరివిష్ఠితః
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవచ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః

సూర్యారాధన సమాప్తం

ఏవ మాపత్సు కృచ్చేషు  కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్నో వసీదతి రాఘవ

పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పితం
ఏత త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవ ముక్త్వా తధాగస్త్యో జగామచ యధాగతం

ఏతఛ్చృత్వా మహాతేజా నష్టశోకో భవత్తధా
ధారయమాన్ సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్ష మవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వయత్నేన మహతాం వధే తస్య ధృతో భవత్

అధ రవిరవద న్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహ్ర్ష్యమాణ!హ్
నిసిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్య గతో వచస్త్వరేతి

          సూర్యారాధన ప్రారంభం,సూర్యారాధన సమాప్తం అనేవాటికి మధ్యలో ఉన్న పధ్నాలుగు శ్లోకాలూ మూడుసార్లు చదవాలి.ఇది పని చేస్తుందా లేదా అనే సందేహం అక్కర్లేదు,నాకు పని చేస్తున్నది.ఇదివరలో బ్లాగుల్లో హిందూమతం మీద జరుగుతున్న చర్చల్లో అంత దూకుడుగా వెళ్ళేవాణ్ణి కాదు.సరదాగా కప్లెట్ కామెంట్లతో సరిపుచ్చేవాణ్ణి,అన్యాపదేశంగా జోకులు వెయ్యటంతో సరిపెట్టేవాణ్ణి,విసుగుపుట్టి మధ్యలో ఆపేసేవాణ్ణి!గట్టిగా నిలబడి వాదించినవి చాలా తక్కువ!కానీ ఇప్పుడిప్పుడు గట్టిగా నిలబడుతున్నాను, ఎక్కడ నిలబడినా నేనే గెలుస్తున్నాను, అది ఆదిత్యహృదయం నిత్యానుష్ఠానంలో చేర్చిన తర్వాతనే జరుగుతున్నది.వ్యక్తిగత జీవితంలో కూడా విజయాల శాతం పెరిగింది.ఇక్కడ వ్యక్తిగత జీవితంలో విజయం ఎంతశాతం అవసరం అనే దాని గురించి ఒక మాట!అప్పు అనేది లేకుండా,చెయ్యకుండా,చెయ్యాల్సిన అవస్రం లేకుండా బతకగలిగితే చాలు.బడుగు జీవులైనా,మధ్యతరగతి జీవులైనా,కోట్లకి పడగేత్తిన వాళ్లయినా సరే - శ్రీరస్తు,శుభమస్తు,ఐశ్వర్యమస్తు!

          వాల్మీకి ద్వారా మనకి తెలిసిన రామాయణం అనే ఒక కధ గురించి ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా "మరల నిదేల రామాయణంబనగ..." అన్నట్టు ఇంకా చెప్పటానికి ఎంతో మిగిలి వుందనిపిస్తుంది!కవిత్వం,నాటకం,యక్షగాం,హరికధ,బుర్రకధ,సినిమా,టెలివిజన్ - అన్నిరకాల కళారూపాలూ శ్రీరామకధను స్పర్శించి పరు గడించి పులకించాయి.రామాయణాన్ని తిట్టినా పేరొస్తుందనేదానికి అప్పటివరకూ స్వీట్ హోం లాంటి సంసారపక్షపు నవల్లు రాసుకునే ఒక అనామక రచయిత్రి రామాయణ విషవృక్షంతో ఒక్కసారిగా అంత పేరు తెచ్చుకోవడమే నిదర్శనం:-(

ఈ వాట్సప్ సింగిల్ పేరాగ్రాఫ్ రామాయణం కూడా అలాంటిదే:
Student:Please tell us something about raaamaayanam in the simplest way!
Teacher:It is said that the Raamaayanam is happening in your body.Your soul is Rama,Your mind is Seeta,Your breath or lefe-force is hanumaan,Your awareness is lakshmana and Your ego is Raavana. When Seeta(Mind) was stolen by Raavana(Ego), then Raama(Soul) got restless. Now the soul(Raama) cannot reach the mind(Seeta) on its own, It has to take the help of the praana(Hanumaan).When the mind(Seeta) got reunited with the soul(Raama) and the ego(Raavana) vanished - everything goes healthy to the Body!This is the real significance of the story of raama.

          ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే రామాయణానికి ఉన్న సార్వజనీనతని నాస్తికులూ కమ్యునిష్టులకి కూడా వర్తించేటంత basic levelకి కుదించి చెప్పటం!నువ్వు నాస్తికుడివైనా,కమ్యునిష్టువైనా - ఒక లక్ష్యం పెట్టుకుని నిజాయితీగా దాన్ని సాధించటానికి పోరాడుతుంటే నీ మనస్సులో ఈ రామాయణం జరిగి తీరాల్సిందే!నువ్వు రామద్వేషివైనా సరే అబద్ధాలూ,పులుముడులూ లేకుండా నువ్వు గనక సత్యానికి కట్టుబడితే నీ జీవితప్రయాణం కూడా రామాయణమే అవుతుంది.

రామాయణం నచ్చినవాళ్ళు చచ్చినా చావనట్టే!
రామాయణం నచ్చనివాళ్ళు పుట్టినా పుట్టనట్టే!
జై శ్రీరాం!

Thursday, 5 May 2016

సంప్రదాయబద్ధంగా కనబడే నిత్యా మీనన్ సంప్రదాయం మీద విసురుతున్న సవాళ్ళు?!

     నేను పాతివ్రత్యం,ఏకపత్నీవ్రతం అనే కాన్సెప్టుల్ని గుడ్డిగా నమ్మను!ప్రాక్టికల్ ఆలోచనా ధోరణి ఉన్నవాళ్ళు ఎవరయినా సరే - నూటికి నూరుపాళ్ళు పాతివ్రత్యం ప్రదర్శించే ఆడదీ,నూటికి నూరుపాళ్ళు ఏకపత్నీవ్రతం పాటించే మగాడూ వాస్తవంగా ఉండరని ఒప్పుకోవాలి."నీతి కట్టె లాంటిది,కోర్కె మంట లాంటిది - అందుకే రాజరాజు కొంపకి నిప్పంటుకుంది!" అన్నాడు కవిత్వంతో అమృతం కురిపించిన కవి బాలగంగాధర తిలక్,నూటికి నూరుపాళ్ళు నిజమే!

     "గంగ నిజాంగ దీప్తులెగయంగ" వచ్చి సుతీక్ష్ణుడి వొళ్ళో కూచుని మోహం చూపించడం అనే దృశ్యాన్ని మనకి చూపించేటప్పుడు సంస్కృతంలో వ్యాసుడు గానీ తెనిగించిన కవిత్రయపు కవి గానీ కంగారు పడలేదు,ఎందుకని?అష్టవసువుల శాపవిమోచనం అనేది అర్ధవంతమైన కారణమే కావచ్చు,కానీ నిజాంగదీప్తులతో వచ్చి మోహం ప్రదర్శించింది అని రాస్తున్నప్పుడు,"ఛా!కల్మషహారిణి చేత వ్యామోహపు భాష మాట్లాడించటమా?" అని ఇద్దరిలో ఎవరూ సందేహపడలేదు - వింతగా లేదూ!

     పంచమహాపతివ్రతల్లో ఒకరిగా నిలబెట్టాలని పవిత్రతకి మారుపేరుగా చూపించాలనుకున్న తన కధానాయిక సీత యొక్క అంగాంగ సౌందర్యాన్ని వర్ణిస్తున్నప్పుడు వాల్మీకి ఎందుకు సిగ్గుపడలేదు?కాళిదాసు కూడా శ్యామలాదండకంలో శ్రీమాతని నఖశిఖపర్యంతం అణువణువునీ వర్ణించుతూ "హేమకుంభోపమోత్తుంగ వక్షోజ భరావనమ్రే","లసద్వృత్త గంభీర నాభీ సరిత్తీర..." లాంటి పదాలతో ఎందుకు అంత భీబత్సంగా విజృంభించాడు?

     మహామేధావి అంబేద్కర్ గారు ఒకేఒక పొరపాటు పని చేశాడు,ఆ ఒక్కపనీ చెయ్యకుండా ఉంటే ఎంత బాగుండేది!"రిడ్డిల్స్ ఆఫ్ రామ" అనే పుస్తకం రాశాడు.అందులో రాముడు అక్రమసంతానం అని నిరూపించాలని ఎంతో శ్రమించాడు - ప్రమాదో ధీమతామపి అని ఇన్నాళ్ళూ దీన్ని గురించి ప్రస్తావించకూడదనుకున్నాను,కానీ ఇప్పుడు తప్పటం లేదు.మహాభారతంలో పాండవుల జననమూ రాముడి జననం లాంటిదే.పాండురాజుకి సంతాన యోగ్యత లేదు,కానీ సంతానం కావాలి!వరాలూ,దేవతలూ,సద్యోగర్భాలూ అందమైన కల్పనలుగా తీసుకుంటే పాండురాజు అనుమతితో వేరెవరితోనో సంతానాన్ని కన్నది.అనుమతి అనగానే పురుషుడు అధికుడు గాబట్టే అనుమతి తీసుకున్నాది అని అర్ధం పీకితే ఒక దణ్ణం పెట్టి వూరుకోవడం తప్ప నేను చెయ్యగలిగినది లేదు. సంప్రదాయ ప్రకారం వివాహం యొక్క ముఖ్యమైన ఉద్దేశం సంతానం.ఆ అసంతానలేమిని పోగొట్టుకోవడానికి ఇవ్వాళ్తి వాళ్ళు సంతాన సాఫల్యతా కేంద్రాల చుట్టూ తిరుగుతూ లక్షలకి లక్షలు తగలెయ్యడం దగ్గిర్నుంచీ సర్రోగేట్ మదర్సుని వెతుక్కోవడం వరకూ పడరాని పాట్లు పడుతున్నట్టే వాళ్ళు కూడా కొన్ని ఎడ్జస్టుమెంట్లు చేసుకున్నారు. మాంసం తింటున్నామని ఎముకలు మెదలో వేసుకు తిరగనట్టే సాహిత్యరూపం కాబట్టి కొన్ని కల్పనల్ని చేశారు.ఇవ్వాళ వేరే విధంగా పిల్లల్ని కన్నవాళ్ళు మేము ఫలానా సర్రోగేట్ మదర్ని వాడుకుని పిల్లల్ని కన్నాం అని డప్పు వేసుకోవటం లేదు,అవునా?ఇదంతా స్త్రీకి గర్భధారణ మీద ఉన్న అధికారానికి గౌరవం ఇవ్వటమే కదా!ఎవరితో కన్నా వాళ్ళు కౌంతేయులు అయ్యారు,పాండురాజ నందనులు అయ్యారు.ఇక్కడే బ్లాగుల్లో మరొకచోట ఒకాయన క్షేతర బీజ ప్రాధాన్యం అనే మాట వాడగానే బూతులకి కూడా లంకించుకున్నారు - హైందవద్వేషం వాళ్ళలో మినిమం సంస్కారాన్ని కూడా పోగొట్టేసింది కాబోలు!ధర్మ,అర్ధ,కామ,మోక్షములకు సంబంధిన యే కార్యాన్ని అయినా నా భాగస్వామితోనే చేస్తాను అనేది వివాహంలో స్త్రీ పురుషులిద్దరూ చెయ్యాల్సిన ప్రమాణం.అది వివాహ జీవితంలో ఉండాల్సిన పవిత్రతకి సంబంధించిన ముఖ్యమైన సూత్రం.ఎవరు తప్పినా తప్పే!సడలింపు కావాలంటే రెండవ భాగస్వామి అనుమతి తప్పనిసరి!సంతానానికి క్షేత్రమే ప్రధానం అంటే తల్లికే ప్రాధాన్యత ఇచ్చారు!పిల్లలు లేనివాళ్ళు పిలల్ల కోసం పదే తాపత్రయాన్ని మనచుట్టూ చూస్తూ కూడా అలాంటి సన్నివేశాల చుట్టూ ద్వేషపాండిత్యాన్ని ప్రదర్శించటం నిజంగా క్రూరత్వమే!"పాతివ్రత్యం గురించి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళకు,ఇద్దరు ముగ్గురితో సంబంధం కలిగి ఉండేవాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ సాంప్రదాయబద్ధంగా పెరిగినవాళ్ళకు అదో ఘోరమైన నేరం!"మూడు పెళ్ళిళ్ళు చెసుకుని గాంధీ అనే పెట్టమారి మొగుడితో పాలేరు పని చేయించుకున్న రంగికి సీత యొక్క పాతివ్రత్యం అర్ధం కాలేదంటే ఆశ్చర్యం లేదు,కానీ అంబేద్కర్ గారు కూడా ఇలా బొక్కబోర్లా పడ్డాడంటే ఇబ్బందిగా అనిపిస్తున్నది.


     రామాయణంలో వాల్మీకి సీతని అలా వర్ణించడానికి చాలా లెక్క ఉంది."మాలిని 22" సినిమాలో నిత్యా మీనన్ బదులు పీటీ ఉష లాంటి ఫిగర్ని పెట్టి ఉంటే రాంగు క్యాస్టింగు కింద డైరెక్తర్ ముక్కచివాట్లు తిని ఉండేవాడు! విలన్ అన్నిసార్లు రేప్ చెయ్యడు,చేసినా మనకి విలన్ మీద జాలివేస్తూ క్యామెడీ సినిమా అయి ఉండేది:-)సినిమా అట్టర్ ఫ్లాపు అయ్యి ఉండేది.రామాయణంలో సీత అందం కూడా అంతే."సీతే జగత్సుందరీ!" అని వూరికే చెప్పి వూరుకోలేదు.రాముడు శివధనుస్సు విరవటానికి ముందు సీతకోసం చాలా యుద్ధాలు జరిగినాయి!మీరు సినిమాల్లో చూసినట్టు ఒక హాలూ,జరీ బుటేదారీ అల్లికల డ్రస్సుల్లో రాజులూ కనక సింహాసనాలూ లాంటి హడావిడితో అంతా ఒకే సీనులో జరిగిపోలేదు సీతా స్వయంవరం!శివధనుస్సుని ఒక బహిరంగ స్థలంలో పెట్టి చాటింపు వేశాడు.ఎవరయినా ఎప్పుదయినా వచ్చి అ చాలెంజిని టేకప్ చెయ్యవచ్చు.అది ఎత్తలేకపోతేనేం సీత లాంటి అందగత్తెని వదులుకుంటామా అని విదేహ మీదకి సైన్యసమేతంగా యుద్ధాలకే వచ్చారు.దణ్ణం పెట్టి తప్పుకోవాలనిపించే చప్పచప్పటి అందం కాదు సీతది,మగాళ్లని పిచ్చెక్కించే అందమే!సీత అట్లా లేకపోతే రావణాసురుడు అంతగా పిచ్చెక్కిపోడు గదా!

     కధ చదివిన మగ పాఠకుల మీదకి వాల్మీకి ఒక చాలెంజిని విసురుతున్నాడు!ఫర్ సప్పోజ్,మిల్కీ వైట్ తమన్నా రేపో మాపో పెళ్ళి చేసుకోబోతున్నదట!పెళ్ళి చేసుకున్న సంవత్సరంలోనే భర్త వ్యాపారంలో ఆస్తినంతా పోగొట్టుకుని ఒక మధ్యతరగతి ఇల్లాలిగా మీ ఇంటిపక్కనే కాపరం పెట్టిందనుకోండి.సంవత్సరం లోపే ముసలిదైపోదు,అదే అందం.మీరు బాగా డబ్బున్నవాళ్ళు - అనుకోండి!మీరేం చేస్తారు?నిన్నటి దాకా బట్టలిప్పి చూపించింది గాబట్టి తప్పు లేదనుకుని ఆ బుక్కా పకీరు వెధవతో ఏం సుఖపడతావు నా దగ్గిరకి రా  అని ప్రపోజ్ చేస్తారా? ఆమె ఒప్పుకోకపోయినా కిడ్నాప్ చేసి మీ కోరిక తీర్చుకుంటారా!వాల్మీకి సీతని అలా వర్ణించటం వెనక ఉన్న లెక్క ది.అందులో తిక్క ఎంతమాత్రమూ లేదు:-)

     సనాతన ధర్మాన్ని అనుసరించేవాళ్ళకి ఏ సందేహమూ రాదు,అక్కడ అన్నీ స్పష్టంగానే ఉంటాయి.పూర్తిగా ఆధునికంగా ఆలోచించేవాళ్ళకీ గందరగోళం ఉండదు - వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు స్పష్టంగా నిర్వచించుకుని ఉంటారు.ఎటొచ్చీ ఆధునికత పేరుతో "నేను రంకు చేస్తాను,కానీ నన్ను స్వైరిణి అనరాదు" అని సంప్రదాయవాదుల నుంచి తమకు మినహాయింపులు కోరుకునేవాళ్ళకి మాత్రమే ముతప్పాళ కురంగీన్యాకమ్మ తరహా సాహిత్యం నచ్చుతుంది!ఈ సంప్రదాయాన్ని ధిక్కరిస్తున్నామంటూనే మళ్ళీ ఈ సంప్రదాయవాదుల నుంచి మెచ్చుకోళ్ళు కోరుకోవడమనే గందరగోళం వాళ్ళలో ఉంది.తమలోకి తాము చూసుకుని తమ గందరగోళాన్ని తగ్గించుకుని అటోఇటో జరిగితే గొడవే ఉండదు కదా,ఎందుకీ దిక్కుమాలిన యేడుపు?

     నేనింతవరకూ చదవలేదు గానీ "సామాన్య" అనే ఒక విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివిన, ఓ IAS Officerగారి సతీమణి, దేశంలోని అనేక ముఖ్యమైన పట్టణాలలో నివాసం ఉన్న రచయిత్రి ఆంధ్రజ్యోతిలో "కమలిని" అని ఒక కధ రాశారు.దానిమీద లెఫ్టిస్టుల రంగసాని సారంగలో కల్పన అనే ఆవిడ భోరున ఏడ్చెసింది ఖదలో కమలిని రంకు చేసి మొగుడికి సారీ చెప్పటం ఆవిడకి నచ్చలేదట!అందుకని "సారీ సామాన్య, నేనే కాదు తమ మీద తమకు గౌరవం ఉన్న ఏ ఆడపిల్లా నీ కమలిని మాటలను క్షమిస్తుందనుకోను" అంటూ ఆక్రోశిస్తున్నది.ఇక్కడ వింతేమిటంటే నా బ్లాగులో "లాడెనుకి నేనూ,నాకు లాడెనూ" అని దీర్ఘాలు తీసిన నీహారిక "పాతివ్రత్యం,నైతికం,కట్టుబాటు అనేవి ఏ యుగంలోనైనా తప్పనిసరి.సమాజం మనుగడే వాటిపై ఆధారపడి నడుస్తున్నపుడు ఆధునిక మహిళల ఆత్మగౌరవం దెబ్బతిన్నంతమాత్రాన వాటివిలువ తగ్గిపోదు" లాంటి ఆణిముత్యాల్ని వెదజల్లటం!

     రాముణ్ణీ సీతనీ వెక్కిరిస్తూ శూర్పణఖని ప్రశంసించడమా,ఇక్కడిలా పాతివత్యాన్ని సమర్ధించడమా - ఏది నీహారిక యొక్క అసలు రూపం?వీటిల్లో ఏదీ కాకుండా నరసింహకిలా ఆరు రూపాలు ఉన్నాయా!ఈ ఆధునికంగా ఉంటూ సంప్రదాయంతో ఘర్షణపడెవాళ్ళలో ఉండే గందరగోళం అంతాఇంతా కాదు.శివ బాహుబలి అవంతికని రేప్ చేసేశాడని గోలపెట్టింది తెలుగావిడే!ఆవిడ మరి సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చూడలేదా?ఆ సినిమాలో నిత్యామీనన్ "లడ్డూ కావాలా!" అని అడగటంలో చూపించిన రెచ్చగొట్టుడం గురించి గొడవచేయ్యలేదెందుకు?పట్టపగలు అందరూ అటూఇటూ తిరిగే వరండాలోనే ఒక ఆడది మగాణ్ణి రొమ్ముల్ని గట్టిగా అతనికేసీ అదుముతూ కావిలించుకుని కుర్రాడే కంగారుపడి కాఫీగ్లాసుని వొదిలేసేలా చెయ్యడం తప్పని అనిపించలేదా?ఇదివర్లో మగాడు ఏమయినా చెయ్యొచ్చు గానీ ఆడది సంసారపక్షంగా ఉండాలి అనేది తప్పు,ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం ఆడది ఏమయినా చెయ్యొచ్చు గానీ మగాడు సంసారపక్షంగా ఉండాలి అనెది ఒప్పు - గొప్ప చదువులు చదివి  ఈ ఆడవాళ్ళు నేర్చుకున్నది ఇది!

     సహజీవనం గురించి మణిరత్నం తీసిన ఓకే బంగారం సినిమాలో నిత్యామీనన్ క్యారెక్తర్ ఏంటి?మొదట్లో వీరవనితలా "ఆ పెళ్లొకటి చేసుకుంటే ఆ తాడొకటి వేసుకుంటే అన్నీ చేసేసుకోవచ్చా..దాంతో లైసెన్స్‌ వస్తుందా, లేకపోతే రాదా?" అనే ఒక్క డైలాగు గొప్పగా చెప్పడం సరే,తర్వాత చేసిన గొప్ప నటన ఏంటి?నేను చూసిన ట్రైలర్స్ మరియూ పాటలు అన్నింటిలోనూ చేసిన గొప్ప నటన ఏమిటి?దుప్పటిలో హీరోకి అతి దగ్గిరగా ఉండి హస్కీగా మూలగడం,చెంపలు చెంపలకి రాస్తూ పరవశించి పోతూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటిమసీని అత్యంత వాస్తవికంగా ప్రదర్శించటం!ఆ సీన్లని బట్టే, తెర మీద చూపించకపోయినా వాళ్ళ సహజీవనం పూర్తయ్యేసరికి జరగాల్సినవి అన్నీ చాలాసార్లు జరిగిపోయే ఉంటాయని నేను బల్లగుద్ది చెప్పగలను!లడ్డులాంటి పిల్ల అంత దగ్గిరగా కదుల్తూ దుప్పట్లో దూరి హస్కీగా మూలుగుతుంటే అస్ఖలితంగా ఎవడు ఉండగలడు?మణిరత్నం వాళ్ళని పెళ్ళి పేరుతో కలిపాడు గాబట్టి సరిపోయింది,లేకుంటే?ఒక విశృంఖలతని చాలాకాలం చూసి మొదట అరుంధతి తర్వాత వశిష్ఠుడు ఏర్పరచినది వివాహ వ్యవస్థ!దీన్ని కాదంటే ఒకప్పటి గుంపులో గోవిందా వాతావరణమె గతి – ఎందుకొచ్చిన గోల?వెనక్కి నడిచి మళ్ళీ అరుంధతికి ముందరి కాలానికి వెళ్ళి చేసేది ఏముంటుంది?మళ్ళీ అది బాగా లేదనుకుని ఇటే రావాలిగా!తాళి,కట్టుబాటు,సింబల్స్ లేకుండా వాళ్ళు చేసిన దేమిటి?దాంపత్యమూ సహజీవనమే కదా!సహజీవనం నుంచి దాంపత్యం లోకి ప్రయాణించారు వాళ్ళు – ఇందులో విప్లవాత్మకత యేముంది?

     ఈ నిత్యా మీనన్ అరిచి గింజుకున్నా ఎక్స్పోజింగు చెయ్యను,ఖాళీగా ఉంటాను గానీ అసభ్యతకి చోటివ్వను అని మొండిగా చెప్పేసి ఒళ్ళు చూపించకండా ఉండటం వల్ల కాబోలు ఎంత పొగిడినా అదోరకంగా అనుకోరులే అని ఒక సేఫ్ జోన్ ఏర్పడిపోయినట్టుంది చాలామంది మగాళ్ళకి.కానీ నిత్యా మీనన్ నటన ద్వారా చూపించే అసభ్యత చాలా డేంజరస్!ఓకే బంగారం దగ్గిర్నుంచీ సన్నాఫ్ సత్యమూర్తి వరకూ ఆపాత్రలన్నీ నెగిటివ్ టోన్ ఉన్నవే,కానీ మనకి వాటిల్లో పాజిటివ్ టోన్ ఉన్నట్టు అనిపిస్తుంది,ఎందుకని?ఈ రెండు సినిమాలే కాదు,మాలిని22లో అయితే నిజంగా నరేష్ అనే నటుడు నిత్యా మీనన్ అనే నటిని రేప్ చేస్తున్నాడేమో అనిపించేతంత సహజంగా ఉంది తన నటన – బాబోయ్!ఇంక నరేష్ పాత్ర మీద పగ తీర్చుకునే సీన్లలో అయితే ఆ కళ్ళు హర్రర్ మూవీ చూపించేశాయి:-(

     సరే,అది రేపిస్టుల్ని భయపెట్టే ఎఫేక్టు అని సర్దుకుపోవచ్చు,సన్నాఫ్ సత్యమూర్తిలో ఈ అమ్మాయి చేసిన పాత్ర ఏంటి?అప్పటికే తను ఒక మగాదితో ఉడాయించాలనేటంతగా ప్రేమలో ఇరుక్కుని హీరోని “లడ్డూ కావాలా?” అని రెచ్చగొడుతూ బిగియార కౌగలించుకోవడం అనే విచ్చలవిడితనం కూడా సంసారపక్షంగా ఉండే ఈ నిత్యా మీనన్ చెయ్యడం వల్ల ఏమాత్రం ఎబ్బెట్టుగా కనిపించలేదు – బాహుబలిలోని హీరో హీరొయిన్ల మధ్యన జరిగిన రొమాన్సు కూడా రేప్ మాదిరి ఫీలయిన ఆధునిక మహిళలకి కూడా!!ఓకే,సత్యమూర్తి సినిమా ధీం అంతా కొంచెం సీరియస్ టోనులో నడుస్తుంది గాబట్టి రిలీఫ్ కోసం దైరెక్టర్ చేసిన జిమ్మిక్కు లెమ్మనుజుందామా?కానీ నాకెందుకో ఇక్కడ సంసారపక్షంగా కనిపిస్తూ పరాయి మొగాణ్ణి ఒక ఆడది గట్టిగా కావిలించుకుంటే కిక్కురుమనకుండా వూర్కుని శివ బాహుబలి తనకి నచ్చి పెళ్ళి చేసుందామనుకున్న అమ్మాయితో కొంచెం దురుసుగా ఉండటానికి రేప్ అని పేరుపెట్టి హడావిడి చెయ్యటం వెనక ఒక ప్లాన్/ఎజెండా ఉన్నట్టు రూఢిగా తెలుస్తున్నది.

     అప్పటికాలంలో ఆడాళ్ళు అందరూ పవిత్రంగా ఉంటే తప్పు చెయ్యాలనుకున్న ఒక్క మగాడికీ,ఇప్పటికాలంలో మగాళ్ళు అందరూ సంసారపక్షంగా ఉంటే తప్పు చెయ్యాలనుకున్న ఒక్క ఆడదానికీ సహచరులు యెట్లా దొరుకుతారో!మఖలో పుట్టి పుబ్బలో మాడిపోయినట్టు అంతరించిపోయిన జీవజాతుల్ని వదిలేస్తే విజయవంతంగా మనుగడ సాగిస్తున్న ప్రతి జీవజాతిలోనూ లైంగిక ద్వైరూపకత(Sexual Dimorphism) ప్రస్ఫుటంగా ఉన్నది.కొన్నింటిలో మగవి అందమైన ఆలంకారాల్ని సమకూర్చుకుని హొయలు చూపిస్తే కొన్నింటిలో ఆడవి సొబగుల్ని సమకూర్చుకుని బులిపిస్తున్నాయి - ఎవరు ఎన్ని పాట్లు పడినా ఒళ్ళో పెట్టనా దళ్ళో పెట్టనా అన్నట్టు కంగారు పడకుండా జతగూడాల్సినవి జతగూడి పిల్లల్నికని జాతిని పెంపొందించుకోవటానికి పడుతున్న తంటాలు!మనుషుళ్లో అది ఆడవాళ్ళు అందంగా ఉండటం,మగవాళ్ళు ధృఢంగా ఉండటం అనేలాగ కుదిరింది!అన్ని జీవజాతుల్లోనూ ఉన్నదే జరిగితే ఈ కొత్తరకం ఆడవాళ్ళు మాకన్యాయం జరిగినదని యేడవటం దేనికి?అయితే,ఇదంతా ఏకపక్షమా అంటే బాక్సింగు నేర్చుకున్న వీరనారులూ ఉన్నారు,మొహమాటంగా ఉండే హరిబాబులూ ఉన్నారు:-)

     సనాతన ధర్మంలో ప్రాచీన సాహిత్యాన్ని చూస్తే ఈ పవిత్రంగా ఉండటం గురించిన నిషేధాలు తక్కువే!జుదాయిజం నుంచి పుట్టిన అబ్రహామిక్ మతాల మాదిరి ఇక్కడ "ఇది పవిత్ర వాక్యం,దీన్ని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే" అని ఒత్తిడి పెట్టే యేకైక గ్రంధం అంటూ ఏదీ లేదు.శృతి,స్మృతి - ఈ రెండూ కూడా ఒకే విషయానికి సంబంధించి ప్రాంతాని కొకరీతిగా చెప్పే పాఠాంతరాలతో ఉన్నాయి.అంటే,ఒక ప్రాంతంలో యేదయినా సమస్య వస్తే అక్కడి పెద్దలు సమయానికి తగిన పరిష్కారాన్ని చెప్పేవారు!పరిష్కారం సమస్యని రద్దు చేస్తేనే గదా అందర్నీ మెప్పించగలిగేది,అప్పుడు "మాకూ ఇలాంటి తవ్వాయి వొస్తే?" అని గుంజాటన పడేవాళ్ళ కోసం దాన్ని కూడా గ్రంధస్తం చేసేవాళ్ళు.అందుకే,ఇక్కడ దేన్ని గురించి కూలంకషంగా తెలుసుకోవాలన్నా ఆచార్యుడు/భాష్యకారుడు అనే మధ్యవర్తి అవసరం తప్పనిసరి.స్త్రీ పురుషుల మధ్యన ఉండాల్సిన నిబద్ధత గురించి బలంగా చెప్పిన మొదటి ఆఖరి గ్రంధం రామాయణమే!అంతకు ముందరి సాహిత్యం - వైదిక మంత్రాలలో గానీ,తర్వాతి కాలపు భారతేతిహాసం లాంటివాటిల్లో గానీ ఒకరికొకరు నిబద్ధంగా ఉన్న సీతారాముల వంటి జంట మరొకటి లేనే లేదు!ఆయా పాత్రల్లో బహుపత్నీత్వం,బహుపతీత్వం,స్వేచ్చా శృంగారం అనేవి యే దాపరికమూ లేకుండా కనబడతాయి.ఆయా పాత్రల్ని వర్ణించే రచయితలు కూడా అలాంటి ప్రస్తావనలు చేసేటప్పుడు సహజంగా జరుగుతున్నవాటిని వర్ణించే మామూలు వర్ణనలే చేశారు తప్ప నిషేధించబడినవాటిని చెప్తున్నట్టు అనిపించదు,మరి ఈ ఆధునిక మదనికా రదనికల "నొక్కేశారు,తొక్కేశారు,నీతుల్ని రుద్దేశారు" అనే గొడవకి కారణ మేమిటి?

     మతపెద్దలు ఆమోదించి సర్వులూ పాటించినట్టు కనబడే రామాయణ మహాభారతాల వంటి కధాత్మక సాహిత్యరూపాల తర్వాత మనుస్మృతి,కామసూత్రం,అర్ధశాస్త్రం వంటి తార్కిక గ్రంధాలలో కూడా వివాహం - పవిత్రత వంటివి నిషేధాజ్ఞల రూపంలో లేవు!మనుస్మృతి అనగానే "నస్రీ స్వాతంత్ర మర్హతి" అన్నాడని గోల చేసేవాళ్ళు మొత్తం శ్లోకంలో ఉన్న అర్ధాన్ని చెప్పడం లేదు."చినప్పుడు తండ్రి,యుక్త వయస్సులో సెదరులు,పెళ్ళయ్యాక భర్త,వృద్ధాప్యంలో కొడుకులూ స్త్రీకి రక్షణ ఇచ్చి తన కోరికల్ని తీర్చాలి - వొదిలెయ్యకూడదు" అని మగాళ్ళకి చెప్పడంలో తప్పేముంది?వాత్స్యయనుడైతే "పారదారికం","వేశ్యాధికరణం" అని రెండు అధ్యాయాలు రాశాడు - వాటిలోని ప్రతిపాదనలు ఇప్పటి ఆధునికులకి కూడా చెమట్లు పట్టించేటంత విప్లవాత్మకమైనవి!పారదారికం అంటే,ఒక స్త్రీకి భర్త ద్వారా సంతృప్తి లేకపోతే మరొక పురుషుడు ఆమెని సంతృప్తి పరచవచ్చును అంటున్నాడు!సింగిల్ పన్నా దైలాగు చెప్పి వూరుకోలేదు,ఒక అధ్యాయమే రాశాడంటున్నాను గదా!అందులో ఉన్నదంతా మొగుడికి తెలియకుండా దాన్ని సాగించుకోవడం కోసం ఉపాయాలూ,మధ్యవర్తులూ,రాయబారాలూ - అబ్బో, ఎందుకు లెండి మిమ్మల్ని చెడగొట్టటం:-)

     చాణక్యుడు యేకంగా విడాకుల ప్రస్తావన స్త్రీ వైపునుంచి వస్తే వెంటనే ఇచ్చెయ్యమన్నాడు,ఇందులో రెండు పాయింట్లు ఉన్నాయి.మొదటిది వివాహక్రతువు యొక్క ఉద్దేశం స్త్రీకి రక్షణా,సౌకర్యమూ,సంతోషమూ ఇవ్వటానికి కాబట్టి స్త్రీ సంతోషపడని వివాహం  వివాహమే కాదనేది,రెండవది,ఒకసారి విడాకుల ప్రస్తావన వచ్చాక వాళ్ళిద్దర్నీ కలిపి ఉంచితే బలవంతుడైన మగవాడు భార్య విడాకులు కోరుకోవటం అవమానంగా భావిస్తే ఆడదాని ప్రాణానికి ప్రమాదం తలపెట్టవచ్చును అనేది - ఇట్లా ప్రాచీన ధార్మిక సాహిత్యమంతా ఆడవాళ్ళకే సౌకర్యాలు అమర్చారు.ఇంక గాధాప్తశతి,శుకసప్తతి లాంటివి కట్టుతప్పిన శృంగారాన్ని కూడా రొమాంటిసైజ్ చేసి వర్ణిస్తాయి.ఈ రకమైన వాటిననిట్నీ కలిపి చూస్తే మొత్తం సాహిత్యంలో వీళ్ళు హైలైట్ చేసి చెప్పే పతివ్రతల కధలు చాలా తక్కువ శాతాన్ని ఆక్రమిస్తాయి.కోర్కెకి ప్రాధాన్యత ఇచ్చి నీతిని పట్టించుకోనివాళ్ళు,నీతికి ప్రాధాన్యత ఇచ్చి కోర్కెల్ని అణుచుకునేవాళ్ళు అప్పుడూ ఉన్నారు,ఇప్పుడూ ఉన్నారు,ఎప్పుడూ ఉంటారు!

     అయితే ధర్మంలో తప్పు లేనప్పుడు సమాజంలో కనపడుతున్న అసమానతలు ఎందుకు ఉన్నాయి?అసమానతలకి ఆస్కారమిస్తున్న ధర్మాన్ని విమర్శిస్తే తప్పేమిటి?ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు!వీటిని తప్పించుకుని తిరగడం ఇంకెంతో కాలం సాధ్యపడదు.ఒక మనిషిలో స్వార్ధం ముదిరితే అతను నీతుల్ని లెక్క చెయ్యడు,ఇతరుల్ని మోసం చెయ్యడానికి తప్పుడు సమర్ధనలు కనిపెట్టి అయినా తన కోరికల్ని తీర్చుకుంటాడు.ఒకప్పుడు అసలెవరికీ విధించని అపవిత్రతకి సంబంధించిన శిక్షలు ఇప్పుడు ఆడవాళ్ళకే విధించడం ఎప్పుడు మొదలైంది?బ్రాహ్మణుల వల్లనే వచ్చిందనడానికీ ఆధారాలు లేవు,బ్రాహ్మణుల పొడయే తగలని ఆదివాసుల సంస్కృతిలోనూ పురుషాధిక్యత ఉంది కదా!ఇంటిపెద్దగా పురుషుడు మాత్రమే ఉండి అతని కష్టార్జితమైన ఆస్తి వారసత్వంగా సంక్రమించేటప్పుడు ఏర్పడే గందరగోళాలకి తరుణోపాయంగా పురుషుడు ఎన్ని సానివాడల్ని సందర్శించినా పర్లేదు గానీ స్త్రీలు మాత్రం భర్తతో తప్ప పరపురుషుడితో సంగమించరాదనే నియమం పెట్టారు.కానీ ఇవ్వాళ స్త్రీలు కూడా ఆర్జనపరులుగా ఉన్నారు.దానిమూలంగా ఆస్తి మీద స్త్రీలకు కూడా వాటా వస్తున్నది!ఎప్ప్పుడైతే స్త్రీలు ఇల్లు దాటి సమాజంలోకి వచ్చి కలివిడిగా తిరగడం మొదలుపెట్టారో ఇన్నాళ్ళూ మంగవాళ్ళు తమ స్ఖాలిత్యాలకి చెప్పుకునే కలివిడితనం వీళ్ళకీ వచ్చింది.చెడిపోయే అవకాశాలు ఇద్దరికీ సమానంగా ఉన్నప్పుడు క్షమించడం అనేది యేకపక్షంగా ఎందుకు ఉండాలి అనే ప్రశ్నని సామాన్యగారు మగవాళ్ళకి వేస్తున్నారు!అందులో తప్పేమీ లేదు.మరొక కోణంలో ఆమె స్వేచ్చని కావాలని తప్పు చెయ్యటానికి వెసులుబాటుగా ఉపయోగించుకోవడం గురించి ఆడవాళ్ళకి హెచ్చరిక కూడా చేస్తున్నారు,ఇందులోనూ తప్పు లేదు!

     హిందూ సమాజం సంస్కరణకి వ్యతిరేకం కాదు.అందుకు సాక్ష్యం సంస్కరణ కోసం ఉద్యమించిన  యే సంస్కర్తా చంపబడకపోవటం,తన జీవితకాలంలోనే విజయం సాధించటం!నిత్యనైమిత్తికాలతో సతమతమయ్యే సామాన్యులు అజ్ఞానంతోనో వ్యామోహంతోనో  దురాచారాల్ని కొంతకాలం పాటించినా సంస్కర్తలు ఎప్పుడైతే అసలు ధర్మసూత్రాలలో ఉన్నదేమిటో చెప్పినప్పుడు బుద్ధిగా విని తమను తాము సంస్కరించుకున్నారు.స్వార్ధంతో ఆ నియమాల్ని పెట్టినవాళ్ళు,వాటివల్ల వెసులుబట్లు పొందుతున్నవాళ్ళు తప్పకుండా వ్యతిరేకిస్తారు,వ్యతిరేకించారు కూడా!కానీ సంస్కరణ ప్రయత్నాలు ఫలవంతమయ్యాయనేది వాస్తవం.ఈరోజు రెండు అతిచిన్న ఇబ్బందికరమైన అవశేషాలకి గురికావడం తప్పిస్తే హిందూ మహిళల పరిస్థితి మెరుగ్గానే ఉంది.ఆ రెండు ఇబ్బందులనే సామాన్య గారు తన కధలో ప్రస్తావించారు.ఆ దోషాలు కూడా తొలగించాల్సిందే.మరి,గొడవ ఎందుకొచ్చింది?ప్రత్యేకించి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చినా ఆగకుండా ఆమెమీద వ్యక్తిగతమైన దాడికి తెగబడటానికి వెనక ఉన్న రహస్యమేమిటి?

     మనుషుల ప్రవర్తనని శాసించే విషయంలో ఆధ్యాత్మికం వేరు,సామాజికం వేరు!సామాజికస్థాయిలో గౌరవం పొందాలన్నా అవమానించబడాలన్నా రాజ్యాంగమూ ప్రభుత్వమూ లాంటివాటితో సంబంధం ఉంటుంది.అక్కడ మైనార్టీలకి ప్రత్యేక హక్కులూ అవీ ఉంటాయి.అయితే,ఈ మైనార్టీలకి ఇచ్చే రిజర్వేషన్లు ఎక్కడ ఇస్తున్నారు,ప్రత్యేక సదుపాయాలు ఎక్కడ చేస్తున్నారు?ఉపాధి,సంపాదన,ప్రాతినిధ్యం,అధికారం వంటివాటికి కొన్ని పరిమితుల్లోనే ఇస్తున్నారు తప్ప  నేరాలు చేసి శిక్షనుంచి తప్పించుకునే వెసులుబాట్లని కల్పించడం లేదు - నూటికి లక్షమంది అడిగినా అలా ఎవరూ కల్పించరు!ఆధ్యాత్మికానికి ఈ ఉపాధి అవకాశాలతో సంబంధం లేదు కాబట్టి మైనార్టీల గురించి ఆలోచించాల్సిన ఆవసరం దానికి లేదు.ఈ తేడాలు ఒక ధర్మాన్ని సమాజంలోని ప్రజలతో పాటించేటట్లు చెయ్యడానికి సంబంధించినవి,కానీ అసలు యేది ధర్మం అనేది తేల్చాలి అంటే మాత్రం రెండు చోట్లా మెజార్టీ ప్రజలు దేన్ని సమర్ధిస్తే అదే ధర్మం!ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య గారి కమలిని కధని చదివితే అందులో ఇంత గొడవ చెయ్యాల్సిన అంశం యేదీ లేదు, మరెందుకు వీళ్ళు సామాన్య గార్ని క్షమించడం లేదు?

     ఇలా గందరగోళంలో చిక్కుకున్న రచయిత్రికీ,అదేరకం అయోమయంతో ఉన్న వనజ గారికీ నేను చెప్పేది ఒక్కటే - ఆవిడ కధలో మహాభారతం నుంచి ఒక కొటేషన్ వాడారు!ఈ దేశంలో కొందరికి ఎర్రకామెర్ల రోగం పట్టింది.వాళ్ళు హిందూమతంలో మంచి ఉందంటే చచ్చినా ఒప్పుకోరు.ఇదే సారంగలో అర్జున విషాదయోగానికీ ట్రోజన్ల కధకీ ఒకాయన పోలిక తీసుకురాబోయినందుకే ఇంకొకాయన "వీళ్ళనందుకు ప్రస్తావిస్తున్నారు!వీళ్ళు యే ఉత్పత్తి శక్తులకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు?" అని వాంతులు చేసుకున్నాడు.నేను కమ్యునిజం గురించి నాలుగు ప్రశ్నలు వేసేసరికి అబ్బెబ్బెబ్బె నేను కమ్యునిష్టుని కాదు, జాతస్యహిందువుని అని మరోసారి మరోరకంగా వాంతులు చేసుకున్నాడు.అక్కడ ఇలాంటివాళ్ళ కామెంట్లే పడతాయి!ఇంక రచయిత్రి సంస్కారవంతులని భావించి విజ్ఞప్తులు చేసిన సారంగ ఎడిటర్లూ ఎడ్మిన్లూ ఆమెరికాలో ఉండి రెండు చేతులా ఆర్జిస్తూ దేశానికి సంబంధించిన విషయాల్లో మాత్రం హిందూమతాన్ని విమర్శించే కమ్యునిష్టులకి పక్కలేసే గాండ్లసంగులు!హిందూమతాన్ని విమర్శించే వ్యాసాలూ,కామెంట్లనే వారు ప్రచురిస్తారు.మరీ బాగుండదని కల్లూరి భాస్కరం గారిలాంటి వాళ్ళని ఆదరిస్తారు గుడ్విల్ కోసం కాబోలు!వాళ్ళెందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలిసింది గాబట్టి మీరు కంగారు పడకుండా మీ సాహితీసృజనని ఎప్పట్లాగే కొనసాగించండి.

     వీళ్ళంతా ఈ రాజ్యాలూ,యుద్ధాలూ,నీతులూ బ్రాహ్మలే పెట్టారు అని అంటున్నది మాటవరసకి నిజమే అని ఒప్పుకున్నా వాటిని అందరూ ఒప్పుకుని పాటించడం వల్లనే సంప్రదాయంగా స్థిరపడినాయి.ఆ ధర్మాలు అట్లా ఉన్నాయి గాబట్టి మాకు స్వైరిణులు అనే పేరు వస్తున్నది ,కనక ఆ ధర్మమే చెడ్దది అనే హక్కు వీళ్ళకి లేదు గాక లేదు!అసలు ధర్మాన్నే తప్పు పట్టేవాళ్ళని తలమీద చెయ్యేసి నొక్కేసినా తప్పు లేదు!


వెసులుబాటు కోసం వేసే ఎత్తులు విప్లవమూ కాదు,కట్టుబాటు కోసం పెట్టే ఒత్తిడి నియంతృత్వమూ కాదు!

Wednesday, 4 May 2016

అనేక విధాలుగా తనను తనే అర్చించుకంటాడు మానవుడు,అతని ఆత్మపూజకు నామాంతరమే అతను పూజించే దేవుడు!

సీ||యోగీంద్ర మానసాంభోరుహ ప్రాణనా
       యక!భోగీంద్ర శయన!సహేంద్ర

       వాశిష్ఠ సహృదవారిజ లోచనా
       నందకారక!శార్జ నందక ఘన

       పాంచజన్య ఢమరుకా శూలపాణీంద్ర!
       మాల్యాద్రి గరుడాద్రి మలయ వింధ్య

       సాహ్యాద్రి కాశీ ప్రయాగ క్షేత్ర
       భూజేంద్ర శక్తి సంపూరకాయ!

తే.గీ||కమల సంభవ గౌరీంద్ర పర్యవేష్ఠి
          త ప్రళయకాల వటపత్ర డోల లోల
          నాయ!భోగ యాత్రాను సంధాయక!ద్వి
          బాహు రపరో హరి!సమర బ్రాహ్మణాయ!
(01/05/2016)
-----------------------------------------------------------------------------------------------------------------
అహం బ్రహ్మాస్మి!
-----------------------------------------------------------------------------------------------------------------

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...