Thursday, 5 May 2016

సంప్రదాయబద్ధంగా కనబడే నిత్యా మీనన్ సంప్రదాయం మీద విసురుతున్న సవాళ్ళు?!

     నేను పాతివ్రత్యం,ఏకపత్నీవ్రతం అనే కాన్సెప్టుల్ని గుడ్డిగా నమ్మను!ప్రాక్టికల్ ఆలోచనా ధోరణి ఉన్నవాళ్ళు ఎవరయినా సరే - నూటికి నూరుపాళ్ళు పాతివ్రత్యం ప్రదర్శించే ఆడదీ,నూటికి నూరుపాళ్ళు ఏకపత్నీవ్రతం పాటించే మగాడూ వాస్తవంగా ఉండరని ఒప్పుకోవాలి."నీతి కట్టె లాంటిది,కోర్కె మంట లాంటిది - అందుకే రాజరాజు కొంపకి నిప్పంటుకుంది!" అన్నాడు కవిత్వంతో అమృతం కురిపించిన కవి బాలగంగాధర తిలక్,నూటికి నూరుపాళ్ళు నిజమే!

     "గంగ నిజాంగ దీప్తులెగయంగ" వచ్చి సుతీక్ష్ణుడి వొళ్ళో కూచుని మోహం చూపించడం అనే దృశ్యాన్ని మనకి చూపించేటప్పుడు సంస్కృతంలో వ్యాసుడు గానీ తెనిగించిన కవిత్రయపు కవి గానీ కంగారు పడలేదు,ఎందుకని?అష్టవసువుల శాపవిమోచనం అనేది అర్ధవంతమైన కారణమే కావచ్చు,కానీ నిజాంగదీప్తులతో వచ్చి మోహం ప్రదర్శించింది అని రాస్తున్నప్పుడు,"ఛా!కల్మషహారిణి చేత వ్యామోహపు భాష మాట్లాడించటమా?" అని ఇద్దరిలో ఎవరూ సందేహపడలేదు - వింతగా లేదూ!

     పంచమహాపతివ్రతల్లో ఒకరిగా నిలబెట్టాలని పవిత్రతకి మారుపేరుగా చూపించాలనుకున్న తన కధానాయిక సీత యొక్క అంగాంగ సౌందర్యాన్ని వర్ణిస్తున్నప్పుడు వాల్మీకి ఎందుకు సిగ్గుపడలేదు?కాళిదాసు కూడా శ్యామలాదండకంలో శ్రీమాతని నఖశిఖపర్యంతం అణువణువునీ వర్ణించుతూ "హేమకుంభోపమోత్తుంగ వక్షోజ భరావనమ్రే","లసద్వృత్త గంభీర నాభీ సరిత్తీర..." లాంటి పదాలతో ఎందుకు అంత భీబత్సంగా విజృంభించాడు?

     మహామేధావి అంబేద్కర్ గారు ఒకేఒక పొరపాటు పని చేశాడు,ఆ ఒక్కపనీ చెయ్యకుండా ఉంటే ఎంత బాగుండేది!"రిడ్డిల్స్ ఆఫ్ రామ" అనే పుస్తకం రాశాడు.అందులో రాముడు అక్రమసంతానం అని నిరూపించాలని ఎంతో శ్రమించాడు - ప్రమాదో ధీమతామపి అని ఇన్నాళ్ళూ దీన్ని గురించి ప్రస్తావించకూడదనుకున్నాను,కానీ ఇప్పుడు తప్పటం లేదు.మహాభారతంలో పాండవుల జననమూ రాముడి జననం లాంటిదే.పాండురాజుకి సంతాన యోగ్యత లేదు,కానీ సంతానం కావాలి!వరాలూ,దేవతలూ,సద్యోగర్భాలూ అందమైన కల్పనలుగా తీసుకుంటే పాండురాజు అనుమతితో వేరెవరితోనో సంతానాన్ని కన్నది.అనుమతి అనగానే పురుషుడు అధికుడు గాబట్టే అనుమతి తీసుకున్నాది అని అర్ధం పీకితే ఒక దణ్ణం పెట్టి వూరుకోవడం తప్ప నేను చెయ్యగలిగినది లేదు. సంప్రదాయ ప్రకారం వివాహం యొక్క ముఖ్యమైన ఉద్దేశం సంతానం.ఆ అసంతానలేమిని పోగొట్టుకోవడానికి ఇవ్వాళ్తి వాళ్ళు సంతాన సాఫల్యతా కేంద్రాల చుట్టూ తిరుగుతూ లక్షలకి లక్షలు తగలెయ్యడం దగ్గిర్నుంచీ సర్రోగేట్ మదర్సుని వెతుక్కోవడం వరకూ పడరాని పాట్లు పడుతున్నట్టే వాళ్ళు కూడా కొన్ని ఎడ్జస్టుమెంట్లు చేసుకున్నారు. మాంసం తింటున్నామని ఎముకలు మెదలో వేసుకు తిరగనట్టే సాహిత్యరూపం కాబట్టి కొన్ని కల్పనల్ని చేశారు.ఇవ్వాళ వేరే విధంగా పిల్లల్ని కన్నవాళ్ళు మేము ఫలానా సర్రోగేట్ మదర్ని వాడుకుని పిల్లల్ని కన్నాం అని డప్పు వేసుకోవటం లేదు,అవునా?ఇదంతా స్త్రీకి గర్భధారణ మీద ఉన్న అధికారానికి గౌరవం ఇవ్వటమే కదా!ఎవరితో కన్నా వాళ్ళు కౌంతేయులు అయ్యారు,పాండురాజ నందనులు అయ్యారు.ఇక్కడే బ్లాగుల్లో మరొకచోట ఒకాయన క్షేతర బీజ ప్రాధాన్యం అనే మాట వాడగానే బూతులకి కూడా లంకించుకున్నారు - హైందవద్వేషం వాళ్ళలో మినిమం సంస్కారాన్ని కూడా పోగొట్టేసింది కాబోలు!ధర్మ,అర్ధ,కామ,మోక్షములకు సంబంధిన యే కార్యాన్ని అయినా నా భాగస్వామితోనే చేస్తాను అనేది వివాహంలో స్త్రీ పురుషులిద్దరూ చెయ్యాల్సిన ప్రమాణం.అది వివాహ జీవితంలో ఉండాల్సిన పవిత్రతకి సంబంధించిన ముఖ్యమైన సూత్రం.ఎవరు తప్పినా తప్పే!సడలింపు కావాలంటే రెండవ భాగస్వామి అనుమతి తప్పనిసరి!సంతానానికి క్షేత్రమే ప్రధానం అంటే తల్లికే ప్రాధాన్యత ఇచ్చారు!పిల్లలు లేనివాళ్ళు పిలల్ల కోసం పదే తాపత్రయాన్ని మనచుట్టూ చూస్తూ కూడా అలాంటి సన్నివేశాల చుట్టూ ద్వేషపాండిత్యాన్ని ప్రదర్శించటం నిజంగా క్రూరత్వమే!"పాతివ్రత్యం గురించి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళకు,ఇద్దరు ముగ్గురితో సంబంధం కలిగి ఉండేవాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ సాంప్రదాయబద్ధంగా పెరిగినవాళ్ళకు అదో ఘోరమైన నేరం!"మూడు పెళ్ళిళ్ళు చెసుకుని గాంధీ అనే పెట్టమారి మొగుడితో పాలేరు పని చేయించుకున్న రంగికి సీత యొక్క పాతివ్రత్యం అర్ధం కాలేదంటే ఆశ్చర్యం లేదు,కానీ అంబేద్కర్ గారు కూడా ఇలా బొక్కబోర్లా పడ్డాడంటే ఇబ్బందిగా అనిపిస్తున్నది.


     రామాయణంలో వాల్మీకి సీతని అలా వర్ణించడానికి చాలా లెక్క ఉంది."మాలిని 22" సినిమాలో నిత్యా మీనన్ బదులు పీటీ ఉష లాంటి ఫిగర్ని పెట్టి ఉంటే రాంగు క్యాస్టింగు కింద డైరెక్తర్ ముక్కచివాట్లు తిని ఉండేవాడు! విలన్ అన్నిసార్లు రేప్ చెయ్యడు,చేసినా మనకి విలన్ మీద జాలివేస్తూ క్యామెడీ సినిమా అయి ఉండేది:-)సినిమా అట్టర్ ఫ్లాపు అయ్యి ఉండేది.రామాయణంలో సీత అందం కూడా అంతే."సీతే జగత్సుందరీ!" అని వూరికే చెప్పి వూరుకోలేదు.రాముడు శివధనుస్సు విరవటానికి ముందు సీతకోసం చాలా యుద్ధాలు జరిగినాయి!మీరు సినిమాల్లో చూసినట్టు ఒక హాలూ,జరీ బుటేదారీ అల్లికల డ్రస్సుల్లో రాజులూ కనక సింహాసనాలూ లాంటి హడావిడితో అంతా ఒకే సీనులో జరిగిపోలేదు సీతా స్వయంవరం!శివధనుస్సుని ఒక బహిరంగ స్థలంలో పెట్టి చాటింపు వేశాడు.ఎవరయినా ఎప్పుదయినా వచ్చి అ చాలెంజిని టేకప్ చెయ్యవచ్చు.అది ఎత్తలేకపోతేనేం సీత లాంటి అందగత్తెని వదులుకుంటామా అని విదేహ మీదకి సైన్యసమేతంగా యుద్ధాలకే వచ్చారు.దణ్ణం పెట్టి తప్పుకోవాలనిపించే చప్పచప్పటి అందం కాదు సీతది,మగాళ్లని పిచ్చెక్కించే అందమే!సీత అట్లా లేకపోతే రావణాసురుడు అంతగా పిచ్చెక్కిపోడు గదా!

     కధ చదివిన మగ పాఠకుల మీదకి వాల్మీకి ఒక చాలెంజిని విసురుతున్నాడు!ఫర్ సప్పోజ్,మిల్కీ వైట్ తమన్నా రేపో మాపో పెళ్ళి చేసుకోబోతున్నదట!పెళ్ళి చేసుకున్న సంవత్సరంలోనే భర్త వ్యాపారంలో ఆస్తినంతా పోగొట్టుకుని ఒక మధ్యతరగతి ఇల్లాలిగా మీ ఇంటిపక్కనే కాపరం పెట్టిందనుకోండి.సంవత్సరం లోపే ముసలిదైపోదు,అదే అందం.మీరు బాగా డబ్బున్నవాళ్ళు - అనుకోండి!మీరేం చేస్తారు?నిన్నటి దాకా బట్టలిప్పి చూపించింది గాబట్టి తప్పు లేదనుకుని ఆ బుక్కా పకీరు వెధవతో ఏం సుఖపడతావు నా దగ్గిరకి రా  అని ప్రపోజ్ చేస్తారా? ఆమె ఒప్పుకోకపోయినా కిడ్నాప్ చేసి మీ కోరిక తీర్చుకుంటారా!వాల్మీకి సీతని అలా వర్ణించటం వెనక ఉన్న లెక్క ది.అందులో తిక్క ఎంతమాత్రమూ లేదు:-)

     సనాతన ధర్మాన్ని అనుసరించేవాళ్ళకి ఏ సందేహమూ రాదు,అక్కడ అన్నీ స్పష్టంగానే ఉంటాయి.పూర్తిగా ఆధునికంగా ఆలోచించేవాళ్ళకీ గందరగోళం ఉండదు - వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు స్పష్టంగా నిర్వచించుకుని ఉంటారు.ఎటొచ్చీ ఆధునికత పేరుతో "నేను రంకు చేస్తాను,కానీ నన్ను స్వైరిణి అనరాదు" అని సంప్రదాయవాదుల నుంచి తమకు మినహాయింపులు కోరుకునేవాళ్ళకి మాత్రమే ముతప్పాళ కురంగీన్యాకమ్మ తరహా సాహిత్యం నచ్చుతుంది!ఈ సంప్రదాయాన్ని ధిక్కరిస్తున్నామంటూనే మళ్ళీ ఈ సంప్రదాయవాదుల నుంచి మెచ్చుకోళ్ళు కోరుకోవడమనే గందరగోళం వాళ్ళలో ఉంది.తమలోకి తాము చూసుకుని తమ గందరగోళాన్ని తగ్గించుకుని అటోఇటో జరిగితే గొడవే ఉండదు కదా,ఎందుకీ దిక్కుమాలిన యేడుపు?

     నేనింతవరకూ చదవలేదు గానీ "సామాన్య" అనే ఒక విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివిన, ఓ IAS Officerగారి సతీమణి, దేశంలోని అనేక ముఖ్యమైన పట్టణాలలో నివాసం ఉన్న రచయిత్రి ఆంధ్రజ్యోతిలో "కమలిని" అని ఒక కధ రాశారు.దానిమీద లెఫ్టిస్టుల రంగసాని సారంగలో కల్పన అనే ఆవిడ భోరున ఏడ్చెసింది ఖదలో కమలిని రంకు చేసి మొగుడికి సారీ చెప్పటం ఆవిడకి నచ్చలేదట!అందుకని "సారీ సామాన్య, నేనే కాదు తమ మీద తమకు గౌరవం ఉన్న ఏ ఆడపిల్లా నీ కమలిని మాటలను క్షమిస్తుందనుకోను" అంటూ ఆక్రోశిస్తున్నది.ఇక్కడ వింతేమిటంటే నా బ్లాగులో "లాడెనుకి నేనూ,నాకు లాడెనూ" అని దీర్ఘాలు తీసిన నీహారిక "పాతివ్రత్యం,నైతికం,కట్టుబాటు అనేవి ఏ యుగంలోనైనా తప్పనిసరి.సమాజం మనుగడే వాటిపై ఆధారపడి నడుస్తున్నపుడు ఆధునిక మహిళల ఆత్మగౌరవం దెబ్బతిన్నంతమాత్రాన వాటివిలువ తగ్గిపోదు" లాంటి ఆణిముత్యాల్ని వెదజల్లటం!

     రాముణ్ణీ సీతనీ వెక్కిరిస్తూ శూర్పణఖని ప్రశంసించడమా,ఇక్కడిలా పాతివత్యాన్ని సమర్ధించడమా - ఏది నీహారిక యొక్క అసలు రూపం?వీటిల్లో ఏదీ కాకుండా నరసింహకిలా ఆరు రూపాలు ఉన్నాయా!ఈ ఆధునికంగా ఉంటూ సంప్రదాయంతో ఘర్షణపడెవాళ్ళలో ఉండే గందరగోళం అంతాఇంతా కాదు.శివ బాహుబలి అవంతికని రేప్ చేసేశాడని గోలపెట్టింది తెలుగావిడే!ఆవిడ మరి సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చూడలేదా?ఆ సినిమాలో నిత్యామీనన్ "లడ్డూ కావాలా!" అని అడగటంలో చూపించిన రెచ్చగొట్టుడం గురించి గొడవచేయ్యలేదెందుకు?పట్టపగలు అందరూ అటూఇటూ తిరిగే వరండాలోనే ఒక ఆడది మగాణ్ణి రొమ్ముల్ని గట్టిగా అతనికేసీ అదుముతూ కావిలించుకుని కుర్రాడే కంగారుపడి కాఫీగ్లాసుని వొదిలేసేలా చెయ్యడం తప్పని అనిపించలేదా?ఇదివర్లో మగాడు ఏమయినా చెయ్యొచ్చు గానీ ఆడది సంసారపక్షంగా ఉండాలి అనేది తప్పు,ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం ఆడది ఏమయినా చెయ్యొచ్చు గానీ మగాడు సంసారపక్షంగా ఉండాలి అనెది ఒప్పు - గొప్ప చదువులు చదివి  ఈ ఆడవాళ్ళు నేర్చుకున్నది ఇది!

     సహజీవనం గురించి మణిరత్నం తీసిన ఓకే బంగారం సినిమాలో నిత్యామీనన్ క్యారెక్తర్ ఏంటి?మొదట్లో వీరవనితలా "ఆ పెళ్లొకటి చేసుకుంటే ఆ తాడొకటి వేసుకుంటే అన్నీ చేసేసుకోవచ్చా..దాంతో లైసెన్స్‌ వస్తుందా, లేకపోతే రాదా?" అనే ఒక్క డైలాగు గొప్పగా చెప్పడం సరే,తర్వాత చేసిన గొప్ప నటన ఏంటి?నేను చూసిన ట్రైలర్స్ మరియూ పాటలు అన్నింటిలోనూ చేసిన గొప్ప నటన ఏమిటి?దుప్పటిలో హీరోకి అతి దగ్గిరగా ఉండి హస్కీగా మూలగడం,చెంపలు చెంపలకి రాస్తూ పరవశించి పోతూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటిమసీని అత్యంత వాస్తవికంగా ప్రదర్శించటం!ఆ సీన్లని బట్టే, తెర మీద చూపించకపోయినా వాళ్ళ సహజీవనం పూర్తయ్యేసరికి జరగాల్సినవి అన్నీ చాలాసార్లు జరిగిపోయే ఉంటాయని నేను బల్లగుద్ది చెప్పగలను!లడ్డులాంటి పిల్ల అంత దగ్గిరగా కదుల్తూ దుప్పట్లో దూరి హస్కీగా మూలుగుతుంటే అస్ఖలితంగా ఎవడు ఉండగలడు?మణిరత్నం వాళ్ళని పెళ్ళి పేరుతో కలిపాడు గాబట్టి సరిపోయింది,లేకుంటే?ఒక విశృంఖలతని చాలాకాలం చూసి మొదట అరుంధతి తర్వాత వశిష్ఠుడు ఏర్పరచినది వివాహ వ్యవస్థ!దీన్ని కాదంటే ఒకప్పటి గుంపులో గోవిందా వాతావరణమె గతి – ఎందుకొచ్చిన గోల?వెనక్కి నడిచి మళ్ళీ అరుంధతికి ముందరి కాలానికి వెళ్ళి చేసేది ఏముంటుంది?మళ్ళీ అది బాగా లేదనుకుని ఇటే రావాలిగా!తాళి,కట్టుబాటు,సింబల్స్ లేకుండా వాళ్ళు చేసిన దేమిటి?దాంపత్యమూ సహజీవనమే కదా!సహజీవనం నుంచి దాంపత్యం లోకి ప్రయాణించారు వాళ్ళు – ఇందులో విప్లవాత్మకత యేముంది?

     ఈ నిత్యా మీనన్ అరిచి గింజుకున్నా ఎక్స్పోజింగు చెయ్యను,ఖాళీగా ఉంటాను గానీ అసభ్యతకి చోటివ్వను అని మొండిగా చెప్పేసి ఒళ్ళు చూపించకండా ఉండటం వల్ల కాబోలు ఎంత పొగిడినా అదోరకంగా అనుకోరులే అని ఒక సేఫ్ జోన్ ఏర్పడిపోయినట్టుంది చాలామంది మగాళ్ళకి.కానీ నిత్యా మీనన్ నటన ద్వారా చూపించే అసభ్యత చాలా డేంజరస్!ఓకే బంగారం దగ్గిర్నుంచీ సన్నాఫ్ సత్యమూర్తి వరకూ ఆపాత్రలన్నీ నెగిటివ్ టోన్ ఉన్నవే,కానీ మనకి వాటిల్లో పాజిటివ్ టోన్ ఉన్నట్టు అనిపిస్తుంది,ఎందుకని?ఈ రెండు సినిమాలే కాదు,మాలిని22లో అయితే నిజంగా నరేష్ అనే నటుడు నిత్యా మీనన్ అనే నటిని రేప్ చేస్తున్నాడేమో అనిపించేతంత సహజంగా ఉంది తన నటన – బాబోయ్!ఇంక నరేష్ పాత్ర మీద పగ తీర్చుకునే సీన్లలో అయితే ఆ కళ్ళు హర్రర్ మూవీ చూపించేశాయి:-(

     సరే,అది రేపిస్టుల్ని భయపెట్టే ఎఫేక్టు అని సర్దుకుపోవచ్చు,సన్నాఫ్ సత్యమూర్తిలో ఈ అమ్మాయి చేసిన పాత్ర ఏంటి?అప్పటికే తను ఒక మగాదితో ఉడాయించాలనేటంతగా ప్రేమలో ఇరుక్కుని హీరోని “లడ్డూ కావాలా?” అని రెచ్చగొడుతూ బిగియార కౌగలించుకోవడం అనే విచ్చలవిడితనం కూడా సంసారపక్షంగా ఉండే ఈ నిత్యా మీనన్ చెయ్యడం వల్ల ఏమాత్రం ఎబ్బెట్టుగా కనిపించలేదు – బాహుబలిలోని హీరో హీరొయిన్ల మధ్యన జరిగిన రొమాన్సు కూడా రేప్ మాదిరి ఫీలయిన ఆధునిక మహిళలకి కూడా!!ఓకే,సత్యమూర్తి సినిమా ధీం అంతా కొంచెం సీరియస్ టోనులో నడుస్తుంది గాబట్టి రిలీఫ్ కోసం దైరెక్టర్ చేసిన జిమ్మిక్కు లెమ్మనుజుందామా?కానీ నాకెందుకో ఇక్కడ సంసారపక్షంగా కనిపిస్తూ పరాయి మొగాణ్ణి ఒక ఆడది గట్టిగా కావిలించుకుంటే కిక్కురుమనకుండా వూర్కుని శివ బాహుబలి తనకి నచ్చి పెళ్ళి చేసుందామనుకున్న అమ్మాయితో కొంచెం దురుసుగా ఉండటానికి రేప్ అని పేరుపెట్టి హడావిడి చెయ్యటం వెనక ఒక ప్లాన్/ఎజెండా ఉన్నట్టు రూఢిగా తెలుస్తున్నది.

     అప్పటికాలంలో ఆడాళ్ళు అందరూ పవిత్రంగా ఉంటే తప్పు చెయ్యాలనుకున్న ఒక్క మగాడికీ,ఇప్పటికాలంలో మగాళ్ళు అందరూ సంసారపక్షంగా ఉంటే తప్పు చెయ్యాలనుకున్న ఒక్క ఆడదానికీ సహచరులు యెట్లా దొరుకుతారో!మఖలో పుట్టి పుబ్బలో మాడిపోయినట్టు అంతరించిపోయిన జీవజాతుల్ని వదిలేస్తే విజయవంతంగా మనుగడ సాగిస్తున్న ప్రతి జీవజాతిలోనూ లైంగిక ద్వైరూపకత(Sexual Dimorphism) ప్రస్ఫుటంగా ఉన్నది.కొన్నింటిలో మగవి అందమైన ఆలంకారాల్ని సమకూర్చుకుని హొయలు చూపిస్తే కొన్నింటిలో ఆడవి సొబగుల్ని సమకూర్చుకుని బులిపిస్తున్నాయి - ఎవరు ఎన్ని పాట్లు పడినా ఒళ్ళో పెట్టనా దళ్ళో పెట్టనా అన్నట్టు కంగారు పడకుండా జతగూడాల్సినవి జతగూడి పిల్లల్నికని జాతిని పెంపొందించుకోవటానికి పడుతున్న తంటాలు!మనుషుళ్లో అది ఆడవాళ్ళు అందంగా ఉండటం,మగవాళ్ళు ధృఢంగా ఉండటం అనేలాగ కుదిరింది!అన్ని జీవజాతుల్లోనూ ఉన్నదే జరిగితే ఈ కొత్తరకం ఆడవాళ్ళు మాకన్యాయం జరిగినదని యేడవటం దేనికి?అయితే,ఇదంతా ఏకపక్షమా అంటే బాక్సింగు నేర్చుకున్న వీరనారులూ ఉన్నారు,మొహమాటంగా ఉండే హరిబాబులూ ఉన్నారు:-)

     సనాతన ధర్మంలో ప్రాచీన సాహిత్యాన్ని చూస్తే ఈ పవిత్రంగా ఉండటం గురించిన నిషేధాలు తక్కువే!జుదాయిజం నుంచి పుట్టిన అబ్రహామిక్ మతాల మాదిరి ఇక్కడ "ఇది పవిత్ర వాక్యం,దీన్ని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే" అని ఒత్తిడి పెట్టే యేకైక గ్రంధం అంటూ ఏదీ లేదు.శృతి,స్మృతి - ఈ రెండూ కూడా ఒకే విషయానికి సంబంధించి ప్రాంతాని కొకరీతిగా చెప్పే పాఠాంతరాలతో ఉన్నాయి.అంటే,ఒక ప్రాంతంలో యేదయినా సమస్య వస్తే అక్కడి పెద్దలు సమయానికి తగిన పరిష్కారాన్ని చెప్పేవారు!పరిష్కారం సమస్యని రద్దు చేస్తేనే గదా అందర్నీ మెప్పించగలిగేది,అప్పుడు "మాకూ ఇలాంటి తవ్వాయి వొస్తే?" అని గుంజాటన పడేవాళ్ళ కోసం దాన్ని కూడా గ్రంధస్తం చేసేవాళ్ళు.అందుకే,ఇక్కడ దేన్ని గురించి కూలంకషంగా తెలుసుకోవాలన్నా ఆచార్యుడు/భాష్యకారుడు అనే మధ్యవర్తి అవసరం తప్పనిసరి.స్త్రీ పురుషుల మధ్యన ఉండాల్సిన నిబద్ధత గురించి బలంగా చెప్పిన మొదటి ఆఖరి గ్రంధం రామాయణమే!అంతకు ముందరి సాహిత్యం - వైదిక మంత్రాలలో గానీ,తర్వాతి కాలపు భారతేతిహాసం లాంటివాటిల్లో గానీ ఒకరికొకరు నిబద్ధంగా ఉన్న సీతారాముల వంటి జంట మరొకటి లేనే లేదు!ఆయా పాత్రల్లో బహుపత్నీత్వం,బహుపతీత్వం,స్వేచ్చా శృంగారం అనేవి యే దాపరికమూ లేకుండా కనబడతాయి.ఆయా పాత్రల్ని వర్ణించే రచయితలు కూడా అలాంటి ప్రస్తావనలు చేసేటప్పుడు సహజంగా జరుగుతున్నవాటిని వర్ణించే మామూలు వర్ణనలే చేశారు తప్ప నిషేధించబడినవాటిని చెప్తున్నట్టు అనిపించదు,మరి ఈ ఆధునిక మదనికా రదనికల "నొక్కేశారు,తొక్కేశారు,నీతుల్ని రుద్దేశారు" అనే గొడవకి కారణ మేమిటి?

     మతపెద్దలు ఆమోదించి సర్వులూ పాటించినట్టు కనబడే రామాయణ మహాభారతాల వంటి కధాత్మక సాహిత్యరూపాల తర్వాత మనుస్మృతి,కామసూత్రం,అర్ధశాస్త్రం వంటి తార్కిక గ్రంధాలలో కూడా వివాహం - పవిత్రత వంటివి నిషేధాజ్ఞల రూపంలో లేవు!మనుస్మృతి అనగానే "నస్రీ స్వాతంత్ర మర్హతి" అన్నాడని గోల చేసేవాళ్ళు మొత్తం శ్లోకంలో ఉన్న అర్ధాన్ని చెప్పడం లేదు."చినప్పుడు తండ్రి,యుక్త వయస్సులో సెదరులు,పెళ్ళయ్యాక భర్త,వృద్ధాప్యంలో కొడుకులూ స్త్రీకి రక్షణ ఇచ్చి తన కోరికల్ని తీర్చాలి - వొదిలెయ్యకూడదు" అని మగాళ్ళకి చెప్పడంలో తప్పేముంది?వాత్స్యయనుడైతే "పారదారికం","వేశ్యాధికరణం" అని రెండు అధ్యాయాలు రాశాడు - వాటిలోని ప్రతిపాదనలు ఇప్పటి ఆధునికులకి కూడా చెమట్లు పట్టించేటంత విప్లవాత్మకమైనవి!పారదారికం అంటే,ఒక స్త్రీకి భర్త ద్వారా సంతృప్తి లేకపోతే మరొక పురుషుడు ఆమెని సంతృప్తి పరచవచ్చును అంటున్నాడు!సింగిల్ పన్నా దైలాగు చెప్పి వూరుకోలేదు,ఒక అధ్యాయమే రాశాడంటున్నాను గదా!అందులో ఉన్నదంతా మొగుడికి తెలియకుండా దాన్ని సాగించుకోవడం కోసం ఉపాయాలూ,మధ్యవర్తులూ,రాయబారాలూ - అబ్బో, ఎందుకు లెండి మిమ్మల్ని చెడగొట్టటం:-)

     చాణక్యుడు యేకంగా విడాకుల ప్రస్తావన స్త్రీ వైపునుంచి వస్తే వెంటనే ఇచ్చెయ్యమన్నాడు,ఇందులో రెండు పాయింట్లు ఉన్నాయి.మొదటిది వివాహక్రతువు యొక్క ఉద్దేశం స్త్రీకి రక్షణా,సౌకర్యమూ,సంతోషమూ ఇవ్వటానికి కాబట్టి స్త్రీ సంతోషపడని వివాహం  వివాహమే కాదనేది,రెండవది,ఒకసారి విడాకుల ప్రస్తావన వచ్చాక వాళ్ళిద్దర్నీ కలిపి ఉంచితే బలవంతుడైన మగవాడు భార్య విడాకులు కోరుకోవటం అవమానంగా భావిస్తే ఆడదాని ప్రాణానికి ప్రమాదం తలపెట్టవచ్చును అనేది - ఇట్లా ప్రాచీన ధార్మిక సాహిత్యమంతా ఆడవాళ్ళకే సౌకర్యాలు అమర్చారు.ఇంక గాధాప్తశతి,శుకసప్తతి లాంటివి కట్టుతప్పిన శృంగారాన్ని కూడా రొమాంటిసైజ్ చేసి వర్ణిస్తాయి.ఈ రకమైన వాటిననిట్నీ కలిపి చూస్తే మొత్తం సాహిత్యంలో వీళ్ళు హైలైట్ చేసి చెప్పే పతివ్రతల కధలు చాలా తక్కువ శాతాన్ని ఆక్రమిస్తాయి.కోర్కెకి ప్రాధాన్యత ఇచ్చి నీతిని పట్టించుకోనివాళ్ళు,నీతికి ప్రాధాన్యత ఇచ్చి కోర్కెల్ని అణుచుకునేవాళ్ళు అప్పుడూ ఉన్నారు,ఇప్పుడూ ఉన్నారు,ఎప్పుడూ ఉంటారు!

     అయితే ధర్మంలో తప్పు లేనప్పుడు సమాజంలో కనపడుతున్న అసమానతలు ఎందుకు ఉన్నాయి?అసమానతలకి ఆస్కారమిస్తున్న ధర్మాన్ని విమర్శిస్తే తప్పేమిటి?ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు!వీటిని తప్పించుకుని తిరగడం ఇంకెంతో కాలం సాధ్యపడదు.ఒక మనిషిలో స్వార్ధం ముదిరితే అతను నీతుల్ని లెక్క చెయ్యడు,ఇతరుల్ని మోసం చెయ్యడానికి తప్పుడు సమర్ధనలు కనిపెట్టి అయినా తన కోరికల్ని తీర్చుకుంటాడు.ఒకప్పుడు అసలెవరికీ విధించని అపవిత్రతకి సంబంధించిన శిక్షలు ఇప్పుడు ఆడవాళ్ళకే విధించడం ఎప్పుడు మొదలైంది?బ్రాహ్మణుల వల్లనే వచ్చిందనడానికీ ఆధారాలు లేవు,బ్రాహ్మణుల పొడయే తగలని ఆదివాసుల సంస్కృతిలోనూ పురుషాధిక్యత ఉంది కదా!ఇంటిపెద్దగా పురుషుడు మాత్రమే ఉండి అతని కష్టార్జితమైన ఆస్తి వారసత్వంగా సంక్రమించేటప్పుడు ఏర్పడే గందరగోళాలకి తరుణోపాయంగా పురుషుడు ఎన్ని సానివాడల్ని సందర్శించినా పర్లేదు గానీ స్త్రీలు మాత్రం భర్తతో తప్ప పరపురుషుడితో సంగమించరాదనే నియమం పెట్టారు.కానీ ఇవ్వాళ స్త్రీలు కూడా ఆర్జనపరులుగా ఉన్నారు.దానిమూలంగా ఆస్తి మీద స్త్రీలకు కూడా వాటా వస్తున్నది!ఎప్ప్పుడైతే స్త్రీలు ఇల్లు దాటి సమాజంలోకి వచ్చి కలివిడిగా తిరగడం మొదలుపెట్టారో ఇన్నాళ్ళూ మంగవాళ్ళు తమ స్ఖాలిత్యాలకి చెప్పుకునే కలివిడితనం వీళ్ళకీ వచ్చింది.చెడిపోయే అవకాశాలు ఇద్దరికీ సమానంగా ఉన్నప్పుడు క్షమించడం అనేది యేకపక్షంగా ఎందుకు ఉండాలి అనే ప్రశ్నని సామాన్యగారు మగవాళ్ళకి వేస్తున్నారు!అందులో తప్పేమీ లేదు.మరొక కోణంలో ఆమె స్వేచ్చని కావాలని తప్పు చెయ్యటానికి వెసులుబాటుగా ఉపయోగించుకోవడం గురించి ఆడవాళ్ళకి హెచ్చరిక కూడా చేస్తున్నారు,ఇందులోనూ తప్పు లేదు!

     హిందూ సమాజం సంస్కరణకి వ్యతిరేకం కాదు.అందుకు సాక్ష్యం సంస్కరణ కోసం ఉద్యమించిన  యే సంస్కర్తా చంపబడకపోవటం,తన జీవితకాలంలోనే విజయం సాధించటం!నిత్యనైమిత్తికాలతో సతమతమయ్యే సామాన్యులు అజ్ఞానంతోనో వ్యామోహంతోనో  దురాచారాల్ని కొంతకాలం పాటించినా సంస్కర్తలు ఎప్పుడైతే అసలు ధర్మసూత్రాలలో ఉన్నదేమిటో చెప్పినప్పుడు బుద్ధిగా విని తమను తాము సంస్కరించుకున్నారు.స్వార్ధంతో ఆ నియమాల్ని పెట్టినవాళ్ళు,వాటివల్ల వెసులుబట్లు పొందుతున్నవాళ్ళు తప్పకుండా వ్యతిరేకిస్తారు,వ్యతిరేకించారు కూడా!కానీ సంస్కరణ ప్రయత్నాలు ఫలవంతమయ్యాయనేది వాస్తవం.ఈరోజు రెండు అతిచిన్న ఇబ్బందికరమైన అవశేషాలకి గురికావడం తప్పిస్తే హిందూ మహిళల పరిస్థితి మెరుగ్గానే ఉంది.ఆ రెండు ఇబ్బందులనే సామాన్య గారు తన కధలో ప్రస్తావించారు.ఆ దోషాలు కూడా తొలగించాల్సిందే.మరి,గొడవ ఎందుకొచ్చింది?ప్రత్యేకించి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చినా ఆగకుండా ఆమెమీద వ్యక్తిగతమైన దాడికి తెగబడటానికి వెనక ఉన్న రహస్యమేమిటి?

     మనుషుల ప్రవర్తనని శాసించే విషయంలో ఆధ్యాత్మికం వేరు,సామాజికం వేరు!సామాజికస్థాయిలో గౌరవం పొందాలన్నా అవమానించబడాలన్నా రాజ్యాంగమూ ప్రభుత్వమూ లాంటివాటితో సంబంధం ఉంటుంది.అక్కడ మైనార్టీలకి ప్రత్యేక హక్కులూ అవీ ఉంటాయి.అయితే,ఈ మైనార్టీలకి ఇచ్చే రిజర్వేషన్లు ఎక్కడ ఇస్తున్నారు,ప్రత్యేక సదుపాయాలు ఎక్కడ చేస్తున్నారు?ఉపాధి,సంపాదన,ప్రాతినిధ్యం,అధికారం వంటివాటికి కొన్ని పరిమితుల్లోనే ఇస్తున్నారు తప్ప  నేరాలు చేసి శిక్షనుంచి తప్పించుకునే వెసులుబాట్లని కల్పించడం లేదు - నూటికి లక్షమంది అడిగినా అలా ఎవరూ కల్పించరు!ఆధ్యాత్మికానికి ఈ ఉపాధి అవకాశాలతో సంబంధం లేదు కాబట్టి మైనార్టీల గురించి ఆలోచించాల్సిన ఆవసరం దానికి లేదు.ఈ తేడాలు ఒక ధర్మాన్ని సమాజంలోని ప్రజలతో పాటించేటట్లు చెయ్యడానికి సంబంధించినవి,కానీ అసలు యేది ధర్మం అనేది తేల్చాలి అంటే మాత్రం రెండు చోట్లా మెజార్టీ ప్రజలు దేన్ని సమర్ధిస్తే అదే ధర్మం!ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య గారి కమలిని కధని చదివితే అందులో ఇంత గొడవ చెయ్యాల్సిన అంశం యేదీ లేదు, మరెందుకు వీళ్ళు సామాన్య గార్ని క్షమించడం లేదు?

     ఇలా గందరగోళంలో చిక్కుకున్న రచయిత్రికీ,అదేరకం అయోమయంతో ఉన్న వనజ గారికీ నేను చెప్పేది ఒక్కటే - ఆవిడ కధలో మహాభారతం నుంచి ఒక కొటేషన్ వాడారు!ఈ దేశంలో కొందరికి ఎర్రకామెర్ల రోగం పట్టింది.వాళ్ళు హిందూమతంలో మంచి ఉందంటే చచ్చినా ఒప్పుకోరు.ఇదే సారంగలో అర్జున విషాదయోగానికీ ట్రోజన్ల కధకీ ఒకాయన పోలిక తీసుకురాబోయినందుకే ఇంకొకాయన "వీళ్ళనందుకు ప్రస్తావిస్తున్నారు!వీళ్ళు యే ఉత్పత్తి శక్తులకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు?" అని వాంతులు చేసుకున్నాడు.నేను కమ్యునిజం గురించి నాలుగు ప్రశ్నలు వేసేసరికి అబ్బెబ్బెబ్బె నేను కమ్యునిష్టుని కాదు, జాతస్యహిందువుని అని మరోసారి మరోరకంగా వాంతులు చేసుకున్నాడు.అక్కడ ఇలాంటివాళ్ళ కామెంట్లే పడతాయి!ఇంక రచయిత్రి సంస్కారవంతులని భావించి విజ్ఞప్తులు చేసిన సారంగ ఎడిటర్లూ ఎడ్మిన్లూ ఆమెరికాలో ఉండి రెండు చేతులా ఆర్జిస్తూ దేశానికి సంబంధించిన విషయాల్లో మాత్రం హిందూమతాన్ని విమర్శించే కమ్యునిష్టులకి పక్కలేసే గాండ్లసంగులు!హిందూమతాన్ని విమర్శించే వ్యాసాలూ,కామెంట్లనే వారు ప్రచురిస్తారు.మరీ బాగుండదని కల్లూరి భాస్కరం గారిలాంటి వాళ్ళని ఆదరిస్తారు గుడ్విల్ కోసం కాబోలు!వాళ్ళెందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలిసింది గాబట్టి మీరు కంగారు పడకుండా మీ సాహితీసృజనని ఎప్పట్లాగే కొనసాగించండి.

     వీళ్ళంతా ఈ రాజ్యాలూ,యుద్ధాలూ,నీతులూ బ్రాహ్మలే పెట్టారు అని అంటున్నది మాటవరసకి నిజమే అని ఒప్పుకున్నా వాటిని అందరూ ఒప్పుకుని పాటించడం వల్లనే సంప్రదాయంగా స్థిరపడినాయి.ఆ ధర్మాలు అట్లా ఉన్నాయి గాబట్టి మాకు స్వైరిణులు అనే పేరు వస్తున్నది ,కనక ఆ ధర్మమే చెడ్దది అనే హక్కు వీళ్ళకి లేదు గాక లేదు!అసలు ధర్మాన్నే తప్పు పట్టేవాళ్ళని తలమీద చెయ్యేసి నొక్కేసినా తప్పు లేదు!


వెసులుబాటు కోసం వేసే ఎత్తులు విప్లవమూ కాదు,కట్టుబాటు కోసం పెట్టే ఒత్తిడి నియంతృత్వమూ కాదు!

27 comments:

 1. సాహో నరుడా. మీకింత ఓపిక, పరిజ్ఞానము ఇచ్చిన భగవంతుడికి ప్రణామములు. ఈ వ్యాసంలో ఒక రాయితో కనీసం ఒక ఇరవై పిట్టలు సులభంగా కొట్టేసారు. మీరు పూనుకొన్న మహాయజ్ఞం సఫలిక్రుతమగు గాక, మీకు విజయం సిద్దించాలని భగవంతున్ని ప్రార్థిస్తూ....సెలవు

  ReplyDelete
 2. రంగనాయకమ్మ రామాయణం... :-)
  అప్పుడెప్పుడో ... పురుష హక్కుల కార్యకర్తలు ఎందుకు పురాణాలను తప్పుపడుతున్నారు అని వివరిస్తూ...
  ద్రౌపది - మొదటి ఫెమినిస్ట్ అని ఆర్టికల్ రాశాను. దానికి కొనసాగింపుగా ఇక ఏమీ రాయలేదు...
  ఇప్పుడు రాయాలనిపిస్తోంది ...

  ReplyDelete
 3. చివరి వాక్యం చాల బావుంది హరిబాబు గారు. చెత్తగాంగుల్ని దుమ్ము దులిపేశారు. సారంగతో నేనూ విసిగిపోయాను - ఎర్ర గాంగ్ దానిని భ్రస్టు పట్టిస్తున్నారు.

  ReplyDelete
 4. నిత్యా మీనన్ ఒళ్ళు చూపించకండా ఉండటం ...


  చూపించటానికి నిత్యామీనన్ దగ్గర ఏముంది కబాలి? శిల్పా షెట్టి, శ్రీదేవి, టాబు లా మంచి పొడగరా? పొందికైన ఆకారం గలదా? అందమైన నడుము,బొడ్డు, కాలి పిక్కలు, చేతి రెట్టలు గలదా? పొట్టి గా భూమికి జానేడు ఉండదు నిత్యామీనన్. వేసుకొన్న హై హీల్స్ తీస్తే అమ్మడి అసలు రంగు బయటపడుతుంది. అందమైన కన్నులతో, దేవుడిచ్చిన రెండు కేరళా కొబ్బరికాయలతో యక్స్ పోజింగ్ చేయను అని "పతివ్రతా బ్రాండ్" మార్కెటింగ్ చేసుకొంట్టు బండిలాకోస్తున్నాది నిత్యా మీనన్. అన్ని ఉన్నా యక్స్పోజింగ్ చేయకుండా మాట మీద నిలబడి నెట్టుకొచ్చింది ఒక్క సౌందర్యే!

  ReplyDelete
  Replies
  1. Anonymous5 May 2016 at 21:45
   చూపించటానికి నిత్యామీనన్ దగ్గర ఏముంది కబాలి?
   haribau
   ఈ పిలుపు నన్ను ఉద్దేశించినదేనా?ఇది పొగడ్తయా:-)తెగడ్తయా:-(

   నిత్యామీనన్ వెర్సస్ సౌందర్య పోలికలు మరుయూ భేదములు విశ్లేషణ బాగున్నది!

   Delete
  2. నేనది రాశానే అనుకో, అప్పుడు నువ్వేమి చేయాలి? కొంచెం క్రియేటివ్ గా ఆలోచించి, మీరన్నది నిజమే, నిత్యామీనన్ నాభి ప్రదర్శన చేస్తే, బూడిద గుమ్మడికాయకి బొక్క పెట్టినట్లు ఉంట్టుంది అని ఊహించుకొని రాయవచ్చుఆ యువతి పొట్టిది అగుటం మూలాన, నడుముదగ్గర ఒంపులు (కర్వ్స్) ఎమిలేక, ఆ నడుము భాగం గుమ్మడి కాయల ఉంట్టుంది అని సమర్ధించుకోవచ్చు. అది వదిలేసి ఇది పొగడ్తయా? తెగడ్తయా? అనడగటం ఏందయ్య? చంద్రం.

   కబాలి అంటే నంబియార్ లా విలనా, రజని లా హీరో గా అర్థంచేసుకోవాలా అనే సందేహం లో పడ్డావు. ఈ కాలంలో మంచి చెడు కాదు ముఖ్యం. పాపులరా? డిమాండ్ ఉందా? లేదా? అనేదే ముఖ్యం. కబాలి ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కనుక నువ్వు పొగడ్తగానే అన్వయించుకోవాలి.

   Delete
  3. ఇవ్వాళ్టికి నీతో కలిపి ముగ్గురితో క్లాసులు పీకించుకున్నాను:-(
   చెరికో తప్పూ దొరకబుచ్చుకుని మా బంగారాలు ఇద్దరూ కుడి యెడమలు వాయించేశారు.హమ్మయ్య!వలప్క్షం లేదు,ఇంకే సైడూ మిగల్లేదు గదా అనుకున్నా:-)
   మెయిల్ బాక్సులో తత్తళాంగు తకధిమితోం అని నువ్వు నా బుర్రమీద ఘటవాయిద్యం మోగించేశావ్!లేచిన వేళావిశేషం కాబోలు?
   క్యొలో ఇంక ఏంతమంది ఉన్నారో వారికీ ముందే ఒక __/\__

   Delete
 5. "గుడ్విల్ కోసం కాబోలు" ------
  అయ్యయ్యో యెంత మాట అంత మాట ?!
  స'రంగు'ల వారి రేంజ్ (రంగే అని range టైపు చేస్తే అలా వచ్చింది - మిషినీకి కూడా తెలిసిస్పోయినట్లుంది కదూ? - :) ) అది కదా ! వారు కవిత అంటే కవిత, కధంటే కధ, వ్యాసమంటే వ్యాసం. విలువ అంటే విలువ. కాదంటే కాదు. అంతే కదా? అదే కధ. అదీ కధ. 'హరి'కధ. పడవ వారిదే కదా? ఆ మాత్రం విలువలు లేకపోతే ఎలా? జ్ఞాన సముద్రాన్ని ఈదాలంటే మీరు ఆ పడవనేక్కాల్సిందే. కాకపొతే బజార్లో మీకొక విలువనేది ఉండాలి. వలువలు చూసి ఎక్కనిస్తారు మరి పడవని. తప్పేముంది? ప్రతి అడ్డ గీతా నిలువు గీత ప్రక్కన నిలబెట్టే అడ్డా కాదది. ఎలాగండీ ఆ ఫోరం లోకి పోరంబో'కుల' ప్రవేశం? రాజు కానప్పుడూ నీ రంగో, నువ్వు దూరంగా ఉండయ్యో సారంగా.........

  ReplyDelete
 6. ఉన్నది ఒకటే. ఆడా మగా మధ్యన బుచికోయమ్మ బుచికి. సారంగలో వచ్చేవన్నీ ఫాల్తు తవికలు రచనలు.

  ReplyDelete
 7. స్వైరిణుల లిస్ట్ లో ఇక నుంచి వనజ వనమాలిని కూడ వేసుకొండి.

  చాగంటి గారిని ఒరేయ్ ఒరేయ్ అని సంభోదించే ( ఇల్లాలి అసహనం సారంగ పత్రికలో) ఓసేయ్ వనజ నోరు మూసుకోవే అని, ఎందుకు సంభోదించకుడదో మీలో ఎవరైనా చెప్పగలరా?

  ReplyDelete
  Replies
  1. ఆయనా కొన్ని విపరీతపు కబుర్లు చెప్తున్నాడు లెండి,పుష్కరాల తైములో నదిలోంచి మట్టి తీసుకొచ్చి గట్టుమీద వెయ్యాలి,లేకపోతే కొత్త పాపాలు తగులుకుంటాయి అని భయపెట్టాడు!ఇప్పుడు కూడా భర్త లోదుస్తులు ఉతికితే భార్యకి పుణ్యం అని చెప్పడం కూడా ఓవరే!

   Delete
  2. చాగంటి గారు చెప్పింది విని ఆడోళ్ళు గుడ్డలు ఉతికేస్తారా? అలా అనటం నేరమా? పెద్ద ఘొరమా? ఆయన కొన్ని వేల గంటల ఉపన్యాసాలు ఇచ్చి ఉంటాడు. ఎక్కడో ఒక ముక్క తీసుకొచ్చి ఆయనని ఒరేయ్ ఒరేయ్ వనజ వనమాలి అనటం లో లేకిబుద్ది (cheep mentality) దాగి ఉంది. ఆయన పరమ చాదస్థుడైనట్లు వీళ్ళు చాలా ప్రొగ్రెసివ్ అయినట్లు ప్రొజెక్ట్ చేసుకోవటం. మోహం దాహం,లయనం మలయాళ సినేమాల ప్రేక్షకుడికి, ప్రోగ్రెసివ్ ముసుగులో అక్రమ సంబంధాల కథలకు రివ్యూలు రాసే వనజ వనమాలికి తేడా ఏమి లేదు. అక్కడికి ఆమే ఎదో పెద్ద పుడింగి అయినట్లు ఆయనను విమర్శించటం.

   అంతగా వనజ వనమాలి విమర్శించాలనుకొంటే ఆమె ఇష్టపడే ఫెమినిస్ట్ లైన ఓల్గ ను విమర్శించుకోమను. రైట్ వింగ్ భావజాలాన్ని విమర్శిస్తూ పుస్తకాలు రాసిన ఓల్గ, అందరు అవార్డ్ వాపసిలు ఇస్తున్న తరుణంలో, రైట్ వింగ్ ప్రభుత్వం ఇచ్చే కెంద్ర సాహిత్య అకాడేమి అవార్డ్ ను బుద్ది లేకుండా ఎలా తీసుకొందో? తీసుకొందేపో! ఆంతలోనే బిజెపి ప్రభుత్వం కేంద్రం లో అధికారం లోకి వచ్చిన తరువాత అసహనం పెరిగిందని కామెంట్ చేస్తుంది. రెంటాల కల్పన ఆమెకి అవార్డ్ వచ్చినందుకు అభినందిస్తూ పోస్ట్ రాస్తుంది. ఇది ఈ రచయితల నిజాయితి. నిజాయితి లేని ఇటువంటి రచయితలను ఒక్కమాట అనలేని వనజా వనమాలి రంగనాయకమ్మను విమర్శిస్తుందా?

   Delete
  3. గతంలో రెంటాల కల్పన రాసిన తన్ హాయి ని నవలను, నిహారిక ఇదొక పుచ్చు కథ అని విమర్శిస్తే వనజ వనమాలి వెనకేసు కొచ్చింది. ఏముంది ఆ నవలలో? మడ్డర్ సినేమా కథ. నవల కనుక హీరోయిన్ పాత్రను జస్టిఫై చేసుకొంట్టూ పడరాని పాట్లు పడటం. ఈవిడ రివ్యూలు రాసి కథానాయకి పాత్రని ఎలా అర్థం చేసుకోవాలో పాఠకులకు వివరించటానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

   Delete
  4. కమ్యునిస్ట్ లు, ఫెమినిస్ట్ లు ప్రజల అజ్ణానం మీద బతుకుతూంటారు. బ్లాగులో వి.శేఖర్ ను తీసుకో, పగలు రాత్రి అబద్దాలను రాస్తూంటాడు. వాడికి తాళం వేస్తూ తిరుపాలు,మూల. ఆయన ఫాలోయర్స్ లో ఒకరు వనజ వనమాలి. ఆ అబ్బద్దాల బ్లాగులు చదివే వారికి ఎమి తెలివితేటలు ఉంటాయి?

   సోనియా పై స్వామి,మోడి పోరాడుతూంటే వీడు అరవింద్ కెజ్రివాల్ పోరాడుతున్నట్లు వార్తలను వక్రీకరించి రాస్తున్నాడు. సిగ్గన్నా లేదు. అవుట్ లుక్ పత్రిక సర్వేను ఎవరైనా నమ్ముతారా? ఆ చెత్త కమ్యునిస్ట్ సానుభూతి పత్రిక లో వచ్చే అబ్బద్దాలను నిలదీస్తే ఎన్ని సార్లు క్షమాపణలు చెప్పుకోలేదు. గత పార్లమెంట్ సమావేశాలలో ఆ పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా ఒక రోజు సభ స్థంబించి పోయింది. ఒక మీటీంగ్ లో రాజనాథ్ సింగ్ హిందూ రాజ్యం వచ్చిందంట్టు మాట్లాడడని కమ్యునిస్ట్ లు గోల చేస్తే , ఆయన ఖండించి, ఆ వార్తను ప్రచూరించిన అవుట్ లుక్ ను ఆధారం చూపించవలసినది గా వివరణ అడిగితే, ఆ పత్రిక వాడు హోం మంత్రి ఆ మాట అనలేదని క్షమాపణ చెప్పాడు. రాస్తే ఎన్నో వస్తాయి.
   ప్రజలలో నాలుగు ఓట్లు తెచ్చుకోలేని దొంగవెధవలు, బ్లాగులో రోజు రొద.

   థూ థూ...

   Delete
 8. ఈ సోషల్ మీడియా వచ్చాక మరీ జనం ఎంత వేలం వెర్రి గా తయారయ్యారు. వీడియో లు, సూక్తులు(quotes) కరపత్రాలు పంచినట్లు పంచడం ఎక్కువయింది. ఆ మధ్య ఎక్కడ పడితే అక్కడ చాగంటి గురువు గారి, ఆ ‘తలా ‘ ‘ తోక’ లేని ఆ రెండు నిమిషాల వీడియో కన్పించింది. ఆ వీడియో కింద వ్యాఖ్యలు వ్రాసేవారు, forward చేసేవారు ఈయన మొత్తానికి మన చేతికి చిక్కారు అన్నట్లు మాట్లాడారు. 42 రోజుల (42x2 = 84 గంటలు = 5040 నిముషాలు) రామాయణం వంటివి వినే ఓపిక వీరికి ఉండదు. రెండు నిమిషాలలో ఆయన ఏంటో మేము గ్రహించేసాం అని చెప్పేస్తున్నారు ఇటువంటి వారు. ఆయన ప్రవచనం retire అయిన వారి కన్నా young generation ఎక్కువ వింటున్నారు . ఆయన చెప్పినట్లు ఆయన ప్రవచనం ఏ విధమైన ప్రయోజనం ఇవ్వకపోతే ఎవరైనా వారి సమయాన్ని వృధా చేసుకుని ఎందుకు వింటారు? ఆయనేమి దేవుడు కారు. ఆరు శత్రు లను జయించాలి అనుకొనే మాములు మానవులే. కాకపోతే ఆయనకి సామాన్యులకి తేడా ఆయన ఆరు శత్రులను జయించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. మనము అటువంటి ఆయనలో లోపాలు ఎంచే ప్రయత్నం చేస్తున్నాము. మన దౌర్భాగ్యం ఏంటంటే ఎప్పుడు ఎదుటివాడిలో మంచి అనేది కాకుండా చెడునే ఎక్కువ చూడటం దాని గురించే మాట్లాడటం !! ‘ఒరేయ్ ఒరేయ్ ..కాస్తైనా మారండి రా ..బాబూ! ‘ అని వ్రాయడం లోనే తెలిసి పోతోంది ఎవరు మారాలో!! - చంద్రిక

  ReplyDelete
  Replies
  1. అమ్మా చంద్రిక గారూ, పండ్లున్న చెట్టుకే కదా ఎక్కువ రాళ్ళ దెబ్బలు తగిలేది! ఒక్కవేలు చూపి యొరులను నిందింప వెక్కిరించు నిన్ను వేళ్ళు మూడు అన్నసంగతి తెలియనివారు ఏదోదో‌ అంటారు. అవ్యక్తుల మాటలకు చాగంటి వారు నొచ్చుకొంటారనుకోను.

   Delete
  2. ‘ఒరేయ్ ఒరేయ్ ..కాస్తైనా మారండి రా ..బాబూ! ‘ అని వ్రాయడం లోనే తెలిసి పోతోంది ఎవరు మారాలో!!

   వనజ వనమాలి ఎమి మారదు. అందుకే లేకిబుద్ది చూపించుకొంది అని రాసాను. అందరు ఫెమినిస్త్ ల వలే ఆమే చేసేదే సరి అయినది అనే భావం ఆమే లో బలంగా ఉంది. లేకపోతే అంత నోటిదూల ఎందుకుంట్టుంది?


   సారంగలో ఇంకొక వెధవ నాగరిక దేశాలలో అలా మాట్లాడితే చాగంటి గారిని జైల్లో పెట్టేవారట. ఈ వెధవ హైదరాబాద్ దాటి ప్రయాణం చేసి ఉండడు,ప్రపంచం అంతా తిరిగి చూసినట్లు, ఆ దేశాల పరిస్థితులు తెలిసినట్లు రాస్తాడు. ఎవా నాగరిక దేశాలు , నాలుగు పేర్లు రాయి అని ప్రశ్నిస్తే జవాబే లేదు. వాడొక బ్రాహ్మణ ద్వేషి. వాడు రాసిన టపాలు చూస్తే మిథునం సినేమా పైన, జీతాల కోసం అర్చకులు సమ్మేచేస్తే వాళ్లను తప్పూపడుతూ రాశాడు. పైకి చెప్పరు గాని, వీళ్ల ఏడుపు ఏమిటంటే బ్రాహ్మణుడన్న వాడు కనపడకుండా పోవాలి. తిండి తిప్ప లు లేకుండా విషం మింగి చావాలి. అప్పుడే అభ్యుదయ,ఫెమినిస్ట్ వాదుల కలలు సాకారమౌతాయని వాళ్ల ప్రగాడ నమ్మకం. వీళ్లంతా చాగంటి పరమ చాంధసుడైనట్లు ముస్లిం ముల్లా లా ప్రొజెక్ట్ చేద్దామను కొన్నారు. దానికి వనజ వనమాలి నేను సైతం అంట్టు ఎగిరి గంతేసింది. ఒరేయ్ ఒరేయ్ అంట్టు రాళ్లు విసిరేసింది.


   // అర్ధభాగంకి ఆయనెప్పుడైనా అలా చేసాడో లేదో ! అమ్మ కన్నా చేసాడో లేదో ! ఒరేయ్ ఒరేయ్ ..కాస్తైనా మారండి రా ..బాబూ! //

   ఓ వనజ వనమాలి! మీ ఇళ్లలో లా మొగాళ్ళు 365 రోజులు పెళ్ళాలతో చేయించుకొని సుష్ట్టుగా తిని ఏపని అంట్టుకోకుండా రిలాక్స్ కారు.
   ఎంతో కొంత సాంప్రదాయం పాటించే వారైతే, భార్య బయట చేరితే నెలకి మూడూ రోజుల చొప్పున సంవత్సరానికి 36 రోజులు వంటచేస్తూనే ఉంటారు. పనిమనిషి రాకపోతే గుడ్డలు కూడా ఉతుకుతారు. అమ్మకు ఎందుకు చేయం. మా నాన్ననే తీసుకో బ్రతికి ఉన్నపుడే కాదు, అమ్మ చనిపోయి 25ఏళ్ల తరువత కూడా ఆయన 80ఏళ్ల పై వయసులో మోకాళ్ళు వంగలేకపోయినా తద్దినాన్ని కష్టపడిపెట్టేవాడు.

   Delete
  3. CORRECTION

   ఏపని అంట్టుకోకుండా రిలాక్స్ అవుతారేమో!

   Delete
  4. ప్రజలో గానీ మరొక చోట గానీ మొదట్లో నేనూ అంత దూకుడుగా చర్చల్లో పాల్గొనలేదు.అన్యాపదేశపు కప్లెట్ కవుంటర్లు తప్ప.గట్ట్టిగా నిలబడి వాదించినది తక్కువ!ఒకటి మాత్రం నిజం,మనం గట్టిగా నిలబడి ఎదురు ప్రశ్నిస్తే జవాబులు చెప్పలేక తడబడుతున్నారు - అంటే,ఇన్నాళ్ళూ వాళ్ళు మనం జవాబు చెప్పకపోవటాన్ని వీక్నెస్ కింద లెక్కగట్టి హడావిడి చేశారు గదా!చంద్రీ గారు చెప్పింది కరెక్ట్,ఇవ్వాళ్టి కుర్రాళ్ళు ఆధ్యాత్మికతని నిర్లక్ష్యం చెయ్యడం లేదు.

   మనం కూడా టైం వేస్టనుకోకుండా కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్లని నోరుమూయించాలి.
   ఇంతకాలమూ వాళ్లు మాట్లాదేది మాత్రమే అక్కడ వినబడుతూ మన ప్రతిస్పందన బలహీనంగా ఉందటం వల్లనే వాళ్ళకి ఆ మాత్రమన్నా గుర్తింపు వచ్చింది,కొందరు తెలివైన వాళ్ళు కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి హిందువులు జవాబు చెప్పలేకపోయారు గాబట్టి వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అనుకోవడమూ జరిగింది.ఇక మీదట ఆ దారిని మూసెయ్యడం కోసమయినా మనం గట్టిగా ఉండాలి.సారంగని నేను వదిలే పసక్తి లేదు:=)

   Delete
  5. నమస్కారం @ శ్యామలీయం గారు !! నిజమే మీరు చెప్పింది. చాగంటి వారు ఇవేవి పట్టించుకోరు. చాగంటి గారు ప్రభుత్వ సలహా దారు కావటం ఒకటి ఇటువంటి వీరిని చాలా బాధ పెడ్తున్న విషయం!! అందుకే ఈ మధ్య వీరి అందరి కన్ను చాగంటి గురువు గారి మీద పడ్డది!! సాక్షి టీవీ వారు రాంగోపాల్ వర్మ పుట్టినరోజు చేసేసారు. టీవీ 9 వారు జాఫర్ తో ముఖాముఖి చేసారు. అంత భక్తి తో కొలిచిన గోపన్న కి కాకుండా రాముడు తానీషా కి కన్పించినట్లు - మా లాంటి వారికీ చాగంటి వారిని చూసే అవకాశమే రాలేదు. కానీ ఈ జాఫర్ కి పూర్వ జన్మ ఫలం కాకపోతే ఏంటి? అటువంటి వారితో అరగంట గడిపాడు. పండిన చెట్టుకే రాళ్ళూ వేయటం ఒక్కటే కాదు వీరి బాధ ఏంటంటే ఆ చెట్టే పండిన పండ్ల విత్తులతో పెద్ద అడవినే తాయారు చేస్తుందని :)!!
   @ హరి బాబు గారు - అందుకే వీళ్ళ టార్గెట్ కూడా యువతే !! యువత ని రెచ్చగొట్టి పక్క దార్లు త్రోక్కించే ప్రయత్నాలు బాగా చేస్తున్నారు. సరిగ్గా చూసారంటే మన బఫూన్ పప్పు బెంగళూరు కాలేజి కి వెళ్లి స్వచ్చ భారత్ పనిచేస్తోందా అంటూ మొదలు పెట్టాడు. పని చేస్తోందనగానే ఏం చేయాలో పాలు పోలేదు యువరాజా వారికి. వెంటనే HCU, కి వెళ్లి మంచి నీళ్ళు తాగాడు. అక్కడి నుండి ఇంటికెళ్ళి భోజనం చేసి JNU కి వెళ్ళాడు. ఆ సారంగ పత్రిక లో చూసింది ఏంటంటే ఇటువంటి వారందరికీ హిందూ ధర్మం అన్నా బ్రాహ్మణ కులం అన్నా చిరాకు. వీలైనంత మటుకు వారి ఇష్టం వచ్చినట్లు వ్రాయటం వారి చౌకబారుతనం చెప్తోంది. అబ్దుల్ కలాం బాబాల దగ్గరికి వెళ్తారని చెప్తూ ఆయన భౌతిక కాయానికి అంత్య క్రియలు కాకుండానే , ఆ మహనీయుడి మీద జుగుప్సాకరమైన కవితలు, వ్యాసాలు వ్రాసిన పత్రిక. అంత కంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ డయాస్పోరా రచయితలందరూ కూడా అక్కడే ఏదో ఒక వ్యాసం కథో వ్రాస్తారు. ఇంత చెత్త లో ఆ రచనలెందుకు వస్తాయో నాకు మిలియన్ డాలరు ప్రశ్న!!
   - చంద్రిక

   Delete
  6. ఆ ‘తలా ‘ ‘ తోక’ లేని ఆ రెండు నిమిషాల వీడియో లింకు + వనజ వనమాలి పోస్టు లింకు షేర్ చెయ్యగలరు

   Delete
  7. This comment has been removed by the author.

   Delete
  8. అంబేద్కర్‌ విగ్రహానికి వాస్తు పరిశీలన!

   http://tinyurl.com/h253dfc

   * పదే పదే చొక్కా విప్పి జంధ్యాన్ని ప్రదర్శించే గవర్నర్‌ *

   గద్దర్ చొక్కా విప్పి గళం వినిపిస్తే అభ్యుదయం. మా శరీరం మాఇష్టం, మాకు నచ్చిన దుస్తులు ధరిస్తాం అని మిడ్డిలు,మినిలు వేసుకొని తిరిగితే ఆధునీకత. వీళ్లకు అభ్యంతరం ఎక్కడా చదవం. పైగా గల్లి నుంచి డిల్లి వరకు వెనకేసుకొచ్చే వారే.

   అదే హిందూ మతధర్మ ప్రకారం దేవాలయాలను సందర్సించుకొనేటప్పుడు గవర్నర్ చొక్కా విప్పితే ఆధునికత వెనక్కు నడుస్తోంది అని గగోలు పెడుతున్నారు. హిందూ ద్వేషులైన ఈ కమ్యునిస్ట్ మతస్థులకు హిందువు మత సంప్రదాయలతో పనేమిటి? ఈ అభ్యుదయ వాదులు ఇఫ్తార్ విందుకు టోపిలు పెట్టుకొని తిండితినే రాజకీయ, ప్రభుత్వాధినేతలను ఎప్పుడైనా విమర్శించారా?
   ఇకనుంచి వీళ్లు విమర్సిస్తే, మా మతం తో మీకు పనేమిటి?
   మీ సంగతి మీరు చూసుకోండి అని వీళ్ల ఆరోపణలను తిప్పి కొట్టాలి.

   Delete
 9. Correction

  ఏపని అంట్టుకోకుండా రిలాక్స్ అవుతారేమో!

  ReplyDelete

 10. ఇక్కడ యేదో అగ్గి బరాటా జరుగు చున్నది !

  చాగంటి వారి మీద గయ్యాళి తనమా !

  ఎవరండీ వారు ?

  జిలేబి

  ReplyDelete
 11. ఆధునిక మహిళలకి ఆత్మగౌరవం లేదు గాగడిద గుడ్డు లేదు. ఆత్మగౌరవం ఉన్న వాళ్లు ఎవరైనా ప్రభుత్వం దగ్గర ముష్టి ఎత్తుకోవటం చేస్తారా? హక్కులు అని వాళ్లు గోల చేసేదాని లక్ష్యంవెనుక అసలు రహస్యం మాకు తేరగా డబ్బులు ఇవ్వండి అనే కదా! మీదగ్గర లేకపోతే మొగుడిదో, అత్తామామలదో, అన్నదమ్ములదో ఇప్పించండి. ఇంతకు మిమిచ్ ఆధునిక మహిళ సాధించింది ఎమిలేదు.

  ReplyDelete
 12. మస్తు జెప్పిండ్రు

  ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు