వైదిక సాహిత్యం చంద్రుడికి సంబంధించిన
27 లేక 28 నక్షత్ర సమూహాలను,
ఖగోళ సంబంధమైన solstice,
equinox వంటివాటిని
గురించి చెప్తున్నది.కొందరు వైదిక సాహిత్యం గ్రహాలను గురించి చెప్పలేదు కాబట్టి
అప్పటివారికి గ్రహాలను గురించి తెలియదనీ గ్రీకుల నుంచి వచ్చిన ఖగోళ శాస్త్రం
చెప్పిన తర్వాతనే నేర్చుకున్నారని అనుకుంటున్నారు.కానీ అది నిజం కాదు.ఎందుకంటే,
భూమిమీదనుంచి
చూస్తున్నప్పుడు అస్పష్టంగా కనిపించే నక్షత్రాలను గుర్తు పట్టాలంటే ప్రకాశవంతమైన
నక్షత్రాల కన్న స్పష్టంగా కనిపించే గ్రహాలను గమనించడం చాలా అవసరం. అసలు అస్పష్టంగా ఉన్న
నక్షత్రాలను కూడా గమనించి అంత విస్తారమైన పరిశోధన చేసినవారికి అంత ప్రకాశవంతమైన
గ్రహాలు కనపడకపోవడమే విచిత్రమైన విషయం.
వైదిక సాహిత్యంలోని
ప్రాచీనమైనవని భావిస్తున్న బ్రాహ్మణాలూ ఉపనిషత్తులూ వేదాంగ జ్యోతిషం వంటి ఖగోళ
శాస్త్రాలూ గ్రహాల పేర్లను ఉదహరించ లేదు, నిజమే!గ్రహాలను గురించిన మొట్టమొదటి ప్రస్తావన
పూర్వ సామాన్య శకం రెండవ శతాబ్ది(200 BCE)లో రచించబడినదని భావిస్తున్న మహాభారతంలో
కనిపిస్తుంది.ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పూర్వ సామాన్య శకం మూడవ శతాబ్ది(300 BCE)లో పరిఢవిల్లిన
గ్రీకులు వృద్ధి చేసిన ఖగోళ విజ్ఞానం పరిచయం అయ్యేవరకు ఇక్కడి వారికి గ్రహాలను
గురించి తెలియదని భావించి ఉంటారు. అయితే, వైదిక ఋషులకి గ్రహాలను గురించి తెలుసు. కానీ,వాటిని ఖగోళ సంబంధమైన సాంకేతికత ప్రకారం కాక
వాచ్యంగా ఉదహరించారు. వేదాంగ జ్యోతిషం మొత్తం
సూర్య చంద్ర తారకా సమూహపు సాపేక్ష దూరాల మీద ఆధారపడినది కాబట్టి గ్రహాలను గురించి
చెప్పలేదు. ఇప్పటికీ గ్రహాల ప్రమేయం లేకుండానే సూర్యుడు, చంద్రుడు, 12 రాశులూ 27 లేక 28 నక్షత్ర సమూహాలూ మాత్రమే ఖగోళ జ్యోతిష శాస్త్రాల కాలగణనకు ప్రధానమైన ప్రమాణం అని చెప్పాలి.ఈ 27
లేక 28 నక్షత్ర సమూహాలు చంద్రుడు విశ్వాక్షం చుట్టూ పరిభ్రమిస్తూ రాశిచక్రాన్ని
27.3 రోజులలో పూర్తి చెయ్యడానికి సూచన మాత్రమే.దీనివల్ల ఏడాదికి చాంద్రమాసాలు 12
లేక 13 అవుతాయి. ఈ హెచ్చుతగ్గుల్ని సరిచెయ్యడానికే ఒకోసారి అధికమాసం ఒకోసారి
క్షయమాసం వస్తూ ఉంటాయి.
బ్రాహ్మణాలు ఇతరులు pleiades
అని పిలిచే
కృత్తికా సమూహాన్ని తూర్పు దిశలో ఉంచాయి. అధర్వణ వేదం(XIX 7.2) ఆయనాన్ని మఖ(Leo)
రాశికి
అనుసంధానించింది.అసలు ఈ నక్షత్రాలలో అతి ప్రకాశవంతమైనవి కూడా గ్రహాలతో పోలిస్తే
చిన్నగానూ అస్పష్టంగానూ కనబడతాయి.అలాంటప్పుడు అంత అస్పష్టమైన నక్షత్రాలనే
గుర్తించినవాళ్ళు వాటికన్న ప్రకాశవంతమైన గ్రహాలను గుర్తించలేకపోవడం అనేది
హాస్యాస్పదం! అసలు చంద్రుని కాంతియే
కొన్ని నక్షత్రాలను కప్పివేసి అస్పష్టం చేస్తున్నప్పుడు మొదట గ్రహాలను గురించి
వాటికి దగ్గరలోని నక్షత్రాలను గుర్తించడం తేలిక.బృహస్పతి(Jupiter) ఒక్కో నక్షత్రం వద్ద అయిదు
నెలలు ఉంటాడు, శని(Saturn) ఒక సంవత్సరం పాటు
ఉంటాడు.చంద్రకాంతి తగ్గిన రోజున గ్రహాన్ని గుర్తుపట్టి దాని సాయంతో అస్పష్టమైన
నక్షత్రాలను గుర్తించవచ్చును.
మహాభారతం మరియు ఇతర పౌరాణిక
కధలు ఈ 27 నక్షత్రాలను దక్ష
ప్రజాపతి కుమార్తెలనీ చంద్రుని భార్యలనీ చెబుతాయి.ఇక్కడ కదులుతున్న చంద్రగ్రహాన్ని
పురుషతత్వంతోనూ స్థిరమై ఉండి వేటినైతే చలిస్తున్న చంద్రగ్రహం స్పృశిస్తుందో వాటిని
స్త్రీతత్వంతోనూ పోల్చారు.అయితే,
యజుర్వేదంలోని
తైత్తిరీయ సంహిత(Taittiriya
Samhita II.3.5.1) ప్రజాపతికి ముప్పైముగ్గురు కుమార్తెలని పేర్కొంటున్నది.ఇక్కడ కూడా చంద్రుడు
వీరిలో రోహిణిని ఎక్కువ ప్రేమించాడని చెప్పటం వల్ల ఈ కధలో కూడా చెప్పదల్చుకున్న
ప్రధాన విషయం ఒకటే అని తెలుస్తున్నది - కానీ 27 కాస్తా 33 ఎట్లా అయ్యింది?ఉన్న 27 నక్షత్రరాశులకీ చంద్రగమనానికీ చాంద్రమాసాలకీ లెక్క సరిపోతుంటే వీటిని
నక్షత్రరాశులని అనుకుంటే కాలానికి సంబంధించిన అన్ని లెక్కల్నీ తిరగరాయాలి! పోనీ, వైదిక సాహిత్యంలో ఉద్ఘాటించిన 8 మంది వసువులూ 11 మంది రుద్రులూ 12 మంది ఆదిత్యులూ ఇద్దరు
అశ్వినీ దేవతలూ అయిన 33 అనుకుంటే
సరిపోతుందా!వసువులూ రుద్రులూ భూమికీ ప్రకృతికీ సంబంధించినవాళ్ళు - ఖగోళ గణితానికి
చంద్రుడి భార్యలుగా అంటుకట్టటం కుదరదే?ఇంకొక వైపున ఋగ్వేదం(VII.86.1;X.88.13)
సూర్యుడిని
కూడా నక్షత్రం అని చెప్పి విశ్వంలో ఉన్న 34 కాంతుల్లో సూర్యుడు అత్యంత ప్రముఖమైన కాంతిస్వరూపం అని చెప్తున్నది.ఇప్పుడు ఈ 34 నుంచి 27 నక్షరాలనూ సూర్యుడినీ చంద్రుడినీ విడదీస్తే మిగిలిన అయిదూ బుధుడు, శుక్రుడు, వరుణుడు/అంగారకుడు, గురుడు, శని అనే గ్రహాలకి లెక్క సరిపోతున్నది!
ఋగ్వేదం ఒక చోట(I.163.2)
అశ్వమేధ యాగంలోని
యజ్ఞాశ్వాన్ని సూర్యునితో పోలుస్తున్నది, మరొక చోట(I.162.18) 34 భాగాల కింద విభజించటం గురించి
చెబుతున్నది,మరొక చోట(I.162.19) ఋతువులు లేక కాలావధుల ప్రకారం విబజించినట్టు చెబుతున్నది -
అంటే అశ్వమేధ యాగంలోని యజ్ఞాశ్వపు 34 దేహభాగాల్ని వర్ణించే మంత్రాలు గుర్రం దేహంలోని
మాంసఖండాల్ని గాక నభోమండలంలోని కాలాన్ని శాసించే 34 నక్షత్రాలను సూచిస్తున్నాయనేది
తెలిస్తే ఇన్ని దశాబ్దాల శతాబ్దాల హిందూద్వేషుల మలినబుద్ధికి అసహ్యం వేస్తుంది! అనంతకాలం లోని ఒక సంవత్సరం అశ్వం యొక్క ప్రాణం అయితే 34
నక్షత్రాలను అశ్వానికి ఉన్న 34 ప్రాణనాడులతో అనుసంధానించి పూజించే ప్రక్రియని తమ
కోడి మెదడు పులుముడు తెలివిడితో ఆయా మాంసఖండాల్ని అగ్నిలో వెయ్యటం కింద మార్చి
చెప్తున్నారు హిందూద్రోహులు.
ఈ 34లో చంద్రుణ్ణి చలనాధిపతి
అనుకుంటే సూర్యుడు కూడా నక్షత్రం అవుతున్నాడు గాబట్టి చంద్రుడికి ముప్పైముగ్గురు
భార్యలనే లెక్క కూడా సరిపోతుంది.ఇంతకు ముందరే నేను చంద్రవరుడికీ సూర్యవధువుకీ జరిగిన, జరుగుతున్న, జరగబోయే, జరిగే కళ్యాణ మహోత్సవం
కధ చెప్పాను కదా - చదివారా?కధ బాగుంటుంది, చదవండి!ఈ కధలన్నిట్లో చంద్రుణ్ణే ఎందుకు పురుషుణ్ణి
చేశారు?సూర్యుడికేం
తక్కువ?ఎందుకంటే,
అందర్లోకీ
చురుకైన వాడు కాబట్టి!ఋగ్వేదం(I.105.10) స్వర్గంలో ఉన్న అయిదు ఎద్దుల్ని గురించి
చెప్తున్నది - ఇవి అయిదు గ్రహాలే అయ్యే అవకాశం ఉంది! సూర్యుడికి చెప్తున్న
ఏడు గుర్రాలు సూర్యగ్రహం(Sun), చంద్రగ్రహం(Moon), బుధగ్రహం(Mercury), శుక్రగ్రహం(Venus), వరుణ/అంగారకగ్రహం(Mars), గురుగ్రహం(Jupiter), శనిగ్రహం(Saturn) అయ్యే అవకాశం కూడా ఉంది!
తైత్తిరీయ బ్రాహ్మణం(I.V.2) Those who sacrifice here
attain(naksate) heaven beyond. This is the nature of the Nakshatras(Naksatranam
naksatratvam). అని చెప్తుంది.ఎక్కడ sacrifice
అని
చూసినా "బలి, జంతుబలి - బొమ్మాళీ
ఇదిగో ఇక్కడ జంతుబలి గురించే ఉంది,
అబద్ధం చెప్తున్నారు
ఈ బ్యామ్మర్లు, పట్టేశాన్!" అని
రెచ్చిపోయేవాళ్ళ కోసం కొంత అదనపు సమాచారం ఇస్తున్నాను.ప్రతి నక్షత్రానికీ ఒక resident deity ఉంటాడు/ఉంటుంది, అంతే కాదు, ఒక వైదిక ఋషికి కూడా సంబంధం ఉంటుంది.ఋగ్వేదం(X.22.10) "the secret of the peoples of the seers who have the
power of the nakshatras(guha yadi kaveenaam visam nakshatrsavasam)" అని
ప్రస్తావిస్తుంది.అంటే, నక్షత్రాలు కాంతితో
ప్రకాశిస్తే ఋషులు జ్ఞానంతో ప్రకాశిస్తారు కాబట్టి ఇద్దరూ సమానులే అని చెప్పడం
అబద్ధం ఎట్లా అవుతుంది?ఋగ్వేదం (X.68.11) చాలా స్పష్టంగా Like a dark horse ornamented with pearls,
our fathers(the seers) made the nakshatras. They placed the darkness in the
night and light in the day. Brhaspathi broke open the rock and found the
rays(cows) అని ప్రకటిస్తుంది! ఇక్కడ
ఆకాశాన్ని 34 కాంతివంతమైన నక్షత్రాలను అలంకరించుకున్న నల్లని గుర్రంతో పోల్చారు,కాలంలో అర్ధవంతమైన భాగం అయిన సంవత్సరాన్ని కూడా
గుర్రంతో పోల్చారు, అశ్వమేధ యాగంలోనూ
గుర్రాన్ని చూపిస్తున్నారు, వీటన్నిటికీ వేగమూ
చలనమూ అనే సంబంధం కనబడుతూనే ఉంది అయినా సరే ఆ అర్ధం తీసుకోకుండా బలీ తిండీ అంటుంటే
ఎవడు చెప్పగలడు? తిండియావ, అదీ గుర్రం మాసం రుచి మీద యావ ఉన్నవాళ్ళు తప్ప
వీటన్నిటి మధ్యనా చంపి తినే సంబంధం ఎట్లా వూహించగలరు? ఒక
పక్క వేదం ఎక్కడ పడితే అక్కడ జీవహింస మహాపాపం అంటుంటే వేదప్రోక్తమైన యజ్ఞకర్మలో
జంతుబలిని వేదం మీద గౌరవం ఉన్నవాళ్ళు ఎట్లా అనుమతిస్తారు?
ఇక్కడ ఇంకొక తిరకాసు కూడా ఉంది, ఎవరూ అడక్కపోయినా నేను పట్టించుకున్నాను - నక్షత్రాలని సృజించినది
కూడా వైదికఋషులే అనడం ఎంతవరకు సత్యం?బ్రహ్మ సృష్టి చెయ్యగలిగినది కూడా వేదం ద్యోతకం అయిన తర్వాత వేదం ప్రకారమే
కాబట్టి వేదం ద్యోతకం అయినవారికి సృజించే శక్తి ఉండటం కూడా సంభవమే. దీని కోసమే
ఈనాటి హిట్లర్ వంటివాళ్ళు ఆనాటి సోమకుడిలా వేదాలను ఎత్తుకుపోయారు, నేర్చుకోవటం కోసం అహరహం తపించిపోయారు. అదీ గాక, నక్షత్రాలను వీరు అక్కడ ఉంచకపోయినా అవి అక్కడ
ఉన్నాయని కనుక్కుని వాటి ఉపయోగం ఏమిటో తెల్సుకుని అవసరానికి ఉపయోగించుకోగలగడం
కూడా ఒక రకమైన సృష్టియే కదా! Jupiter అని పిలవబడే గురుగ్రహం ఒక్కటే క్రమం తప్పని చలనాన్ని నమోదు చేస్తున్నది, మిగిలిన వాటి చలనాల్లో స్థిరత్వం తక్కువ, గురుగ్రహం మిక్కిలి కాంతివంతమైనది - కాబట్టి cosmic law మీద అధిపత్యం ఉన్న దేవగురువు
స్థానం ఇచ్చారు - వైదిక
సాహిత్యపు ఖగోళ నియమాల్లోనూ పామరులకి విజ్ఞానశాస్త్రాన్ని అందించే పురాణ కధల్లోనూ!
నక్షత్రాలకీ గ్రహాలకీ వైదిక
ఋషులతో సంబంధం ఉంటుందనే విషయంలో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే, Big Dipper అని ఇతర్లు పిలిచే సప్తర్షి
మండలం లోని ఋషుల గురించి తెల్సుకుంటే చాలు
అన్ని సందేహాలూ తీరుతాయి.వ్యక్తులుగా నక్షత్రాలతో సంబంధం స్పష్టం కాకపోయినా కొన్ని
ఋషిగణాలకి సామూహికంగా నక్షత్రాలతో ఉన్న సంబంధం వల్ల ఆయా ఋషిగణాలకు సంబంధించిన
వ్యక్తులకి కూడా ఆయా నక్షత్రాలతో సంబధం ఉన్నట్టే లెక్క.ఆ విధంగా చూస్తే బృహస్పతి
అంగిరస గోత్రీకుడు కాగా Kavi,
Usana, Sukra అనే మిగిలిన ముగ్గురూ భృగు గోత్రీకులు. సప్తర్షులను ఎలుగుబంటిని గుర్తు చేస్తూ
Rukshas/ఋక్షజులు అని కూడా
అంటారు!బృహస్పతిని గురుడు అని మనం పిలుస్తుంటే ఇతర్లు Jupiter అని గుర్తించితే శుక్రతారని Venus అని ఇతర్లు గుర్తించారు. చూశారా, ఇప్పటికి దేవతల రాజగురువు బృహస్పతి అయితే శుక్రుడు
రాక్షస గురువు ఎందుకయ్యాడో తెలుస్తున్నది! గబుక్కున
తెలియకపొతే నేను కొంచెం విడమరిచి చెప్తాను చదివి తెలుసుకోండి. ఫలిత జ్యోతిషంలో
గురుగ్రహం జాతకుల జీవితాల మీద ధనాత్మక ప్రభావం చూపిస్తే శుక్రగ్రహం ఋణాత్మక
ప్రభావం చూపిస్తుంది - ఒక మనిషి తన జీవితకాలంలోనే వైభవాన్ని చూస్తున్నప్పుడు
స్వర్గంలో ఉన్నట్టూ దరిద్రాన్ని అనుభవిస్తున్నపుడు నరకంలో ఉన్నట్టూ భావిస్తాడు కదా!
గురుగ్రహం ఒకసారి కక్ష్యని
పూర్తి చెయ్యడానికి 12 సంవత్సరాలు పడుతుందనే విషయాన్ని
బట్టియే 5X12=60 సంవత్సరాల
కాలచక్రాన్ని ప్రతిపాదించారు.చైనీయుల 60 సంవత్సరాలకీ 28 నక్షత్రాల
క్యాలెండరుకీ వైదిక సాహిత్యంలోని ఖగోళ శాస్త్రమే పునాది. ఇది బాబిలోనియన్
ఖగోళశాస్త్రంలో కనిపించని ప్రత్యేకత - కాబట్టి గ్రీకులు చెప్పేవరకు మన ప్రాచీనులకు
గ్రహాల గురించి తెలియదనటం అశాస్త్రీయం. సంప్రదాయ హిందూ ఖగోళశాస్త్రంలో ప్రతి
నక్షత్రానికీ/గ్రహానికీ ఒక ఋషిపరంపర అనుసంధానించబడినట్టే ఒక ప్రధానదైవతం కూడా
అనుసంధానించబడి ఉంటుంది!Jupiterకి వైదిక సాహిత్యంలో అత్యంత
శక్తివంతుడైన ఇంద్రుణ్ణి అధిపతిగా చెప్పారు. ఇది రోమన్లు జూపిటర్
వర్షాలు కురిపించే దేవుడని చెప్తున్నదానితో సరిపోతుంది. అయితే, ప్రాచీనులు గ్రహాలను దేవతల పేర్లతో సూచించారు తప్ప
రెంటికీ అభేదం చెప్పలేదు. వైదిక దేవతలని ఆ గ్రహాలకి మాత్రమే పరిమితం చెయ్యకూడదు, అట్లాగే గ్రీకో రోమన్ దేవతలకి గ్రహాల్తో సంబంధం
ఉందని అనుకోకూడదు. ఇవన్నీ కొన్ని వివరాలు కలుస్తూ కొన్ని వివరాలు వేరౌతూ ఉన్న
జ్ఞాన శకలాలు - పొలికలను చూసి అన్నీ ఒకటే అనుకోవడమూ తప్పే, తేడాలను చూసి అసలు సంబంధం లేదనుకోవడమూ తప్పే!మన
ప్రాచీనులు నక్షత్రాల చుట్టూ అల్లిన పురాణ కధలకు అర్ధం మన పూర్వ ఋషులకు మాత్రమే
సాధ్యమైన అద్భుతం - వీటికి చెప్పాల్సిన హేతుబంద్ధమైన వ్యాఖ్యానం కోసం వీటికి
సంబంధం లేని చోట్ల వెదకడం వల్లనే కొన్ని కధలు అర్ధం లేనివి గానూ కొన్ని కధలు
అసభ్యమైనవి గానూ అనిపిస్తున్నాయి!
హిందూ పురాణాలు గ్రహాలకీ
దేవతలకీ కలిపిన సంబంధం ఇట్లా ఉంటుంది:Vishnu - Mercury, Brhspati - Jupiter - indra, Skanda(Son of Shiva) -
Mars, Sukra - Venus, Yama - Saturn, అంటే ఒక కధలో Mercury యొక్క చలనాన్ని గానీ విశేషాన్ని గానీ స్వభావాన్ని గానీ సూచిస్తూ ఉండే పాత్రలో
విష్ణువుని ప్రవేశపెట్టి కధ నడిపిస్తారు. భృగువులు
దైత్యులకీ అంగిరసులు దివ్యులకీ గురుత్వం వహించి నడిపిస్తారని ఇదివరకు చెప్పాను కదా, వీళ్ళిద్దరికీ మొదట్లో ఒకరినొకరు గెలవాలనే స్థాయిలో
విరోధం ఉండేది కాదు."తారా శశాంకం", "శశాంక విజయం" అనే శృంగార కలహం జరిగాక దేవదానవుల మధ్యన పరస్పరారోహణావరోహణ
పర్వం మొదలయ్యింది!చంద్రుడు, బృహస్పతి, తార - ముగ్గురూ దేవతలే!వాళ్ళ మధ్య జరిగినది నిషిద్ధ
శృంగారం!ఇప్పటి పొలిటీషియన్ల మాదిరి శుక్రుడు చంద్రుడి పక్షం వహించడంతో అది కాస్తా
దేవతలకీ దానవులకీ పీటముడి అయి కూర్చుంది!
పాతవీ కొత్తవీ కలుపుకుని ఒక
పదహారు వెర్షన్లు ఉంటాయేమో ఈ కధకి. విశృంఖలత్వాన్ని విమర్శించే నీతిఖద వెర్షన్
ఉంది, తారని తిరుగుబాటు తత్వానికి
ప్రతీకను చేసిన ఫెమినిస్టు వెర్షన్ ఉంది, ముసలి బృహస్పతీ పడుచు తారా అంటూ బాల్యవివాహ వెర్షన్ కూడా ఉంది, ఆధునిక కాలపు హిందూద్వేషులకి కావ్యరచనాశక్తి ఉండి
ఉంటే హిండూ గిబ్రమామిక్ కిచిడీ వెర్షన్ కూడా వచ్చి ఉండేది!ఇంతకీ మూలకధ చాలా
చిన్నది - బృహస్పతి(Jupiter) యొక్క భార్య(the star)ను సోముడు(moon) ఎత్తుకెళ్ళి దాచేశాడు, రాక్షస గురువైన శుక్రుడు(Venus) చంద్రుడి పక్షం వహిస్తే
దేవతల్లో ముఖ్యుడైన రుద్రుడు/స్కందుడు(Mars) గురుడి పక్షం వహించారు.తారకి బుధుడు(Mercury) అనే కొడుకు పుట్టాడు.అసలు పుట్టడం చంద్రుడికే అయినప్పటికీ ఈ బుధుడికి గురుడూ చంద్రుడూ
కూడా తండ్రులే అయ్యారు. ఆకాశంలో The
Jupiter, The Moon, The Venus, The Mars, The Mercury, The Stars ఎప్పుడెప్పుడు ఎలాగెలాగ
కనిపిస్తాయో చూస్తే అసలు చిక్కుముడి విడిపోతుంది, చూద్దామా!Jupiter అత్యంత స్థిరమై
నభోమండలాన్నీ నక్షత్రలోకాన్నీ/తారాసమూహాన్నీ పరిపాలించే స్వర్గదైవతం!కళ్ళు
మిరుమిట్లు గొలిపే కాంతిని వెదజల్లుతూ చంద్రుడు ప్రకాశించడం వల్ల నక్షత్రాలు కాంతి
తగ్గి మసకబారిపోతున్నాయి - అంటే చంద్రుడు తారను తీసుకెళ్ళి దాచేశాడు.Venus ఎప్పుడూ సూర్యుడికి దగ్గిరగానే
ఉంటూ ఉదయసంధ్యలోనూ సాయంసంధ్యలోనూ మాత్రమే కనిపిస్తుంది - అంటే శుక్రుడు దేవతల్లో
చంద్రుడి పక్షానికి రావడం.Mars
రాత్రుళ్ళు
మాత్రమే కనిపించడం అంటే గురుడి పక్షాన చేరడం.Mars కాంతిలో venus కన్న కొంచెం తగ్గి ఉండి
చంద్రగ్రహానికీ శుక్రగ్రహానికీ దగ్గిర్లో తచ్చాడుతూ ఉంటుంది!
వైదిక సాహిత్యంలో కనిపిస్తున్న
తారాశశాంకం కధ గ్రహాలను గురించి మనవాళ్ళకి గ్రీకులు చెప్పాకనే తెలిసిందనే వాదనను
పూర్వపక్షం చేస్తున్నది!ఇతర దేశాల వాళ్ళు Morning Star, Evening Star, Night Star అని పిలుస్తూ కొన్ని
నక్షత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చినట్లుగానే The Sun, The Moon, The Jupiter, The Venus, The Mars, The Mercury, The
Stars అనేవి
ఎలా సంచరిస్తూ ఎప్పుడెప్పుడు ఎలా కనబడతాయి అనే దానికి సన్నివేశ కల్పనతో కూడిన
కధారూపాన్ని ఇవ్వడం ఆ జ్ఞానాన్ని కొన్ని వందల వేల తరాల పాటు గురుశిష్యపరంపర ధారణ
చేసి అధ్యయన స్వాధ్యాయాలను కొనసాగించడానికి చేసుకున్న ఏర్పాటు.ఇవ్వాళ modern psychology అద్భుత జ్ఞాపకశక్తిని
సంతరించుకోవడానికి రెండు ముఖ్యమైన చిట్కాలను చెప్తున్నది.తరచుగా మర్చిపోయే అవకాశం
ఉన్న పదాన్ని గుర్తుంచుకోవడానికి దాన్ని మనకు అత్యంత ప్రీతిపాత్రమైన మరొక పదంతో
కలపాలి.మనకు ప్రీతిపాత్రమైన పదాన్ని మనం మర్చిపోవడం అసాధ్యం కాబట్టి దానితో సంబంధం
కలుపుకున్న అసలు పదం కూడా గుర్తు వచ్చి తీరుతుంది!లేదా మనం తరచు మర్చిపోతున్న
పదాన్ని అంత ప్రీతిపాత్రం కాని మరొక పదంతో సంబంధాన్ని కలుపు కునేటప్పుడు కొన్ని అదనపు చిట్కాలు పాటించాల్సి వస్తుంది.మొదటి
టెక్నిక్ అందరికీ తేలిగ్గానే అర్ధం అవుతంది గానీ రెండవ టెక్నిక్ ఒక ఉదాహరణ చెప్తే
అర్ధం అవుతుంది - గవాస్కర్ అనే వ్యక్తి ముఖం గుర్తుండి పేరును
మర్చిపోతున్నారనుకోండి - మనస్సులో గవాస్కర్ని గవ్వలస్కర్టు తొడుక్కున్నట్టు
వూహించుకోండి!ఇక్కడ మనం వూహించుకునే దృశ్యం ఎంత అసంబద్ధంగా అంత మంచిది, నేను చెప్పింది నమ్మలేకపోతే ధారణా బ్రహ్మ రాక్షస
గరికిపాటి నరసింహా రావు గారిని అడిగి తెలుసుకోవచ్చు.మన పూర్వీకులు అనేక శాఖలూ
సూక్తాలూ మంత్రాలూ ఉన్న వైదిక వాజ్మయాన్ని ఒక్క అక్షరం కూడా గ్రంధస్థం చెయ్యకుండా
కొన్ని లక్షల సంవత్సరాలు గుర్తుంచుకోగలిగారంటే దాని వెనక ఎంత ప్రజ్ఞ ఉందో
ఆలోచించుకోండి!
ఇప్పుడు మనం పాటిస్తున్న
విగ్రహారాధన వైదిక సాహిత్యంలోని చతుర్వేదాలలో ఎక్కడా లేదు.శివకేశవుల కన్న అగ్ని
ప్రముఖంగా కీర్తించబడింది!అగ్ని చేతనే సృష్టి చలనానికి అవసరమైన శక్తులన్నీ
నడుస్తున్నాయనే గమనికయే వైదికఋషుల్ని అంత ఎక్కువ స్థాయిలో అగ్నిని ప్రస్తుతించేలా
చేసింది.సనాతన ధార్మిక కార్యాచరణలో యజ్ఞం ప్రముఖ పాత్ర వహించడానికి కారణం కూడా
అదే!అయితే, అధర్వణ వేదంలో
గృహస్థులు చెయ్యాల్సిన వ్రతవిధానం మొదట కలశప్రతిష్ఠ చేసి ఆ వ్రతానికి అధిదేవతకు
చెయ్యాల్సిన కైంకర్యాలను కలశానికి చేసేలా రూపొందించారు. ఇప్పటికీ వ్రతాల్లో
పటాల్ని కానీ మూర్తిని కానీ అక్కడ పెట్టినా కలశం తప్పనిసరిగా ఉంచడం అది వైదిక
ప్రోక్త విధి కాబట్టే!అయితే, అగ్ని సకల దేవతా
స్వరూపం అనేది తిరుగులేని సత్యం.అందుకే ఒక్క హిందువులలోనే కాక బౌద్ధులు, జైనులు, యూదులు, క్రైస్తవులు, ముస్లిములు మొదలైన అన్ని మతాల దైవపూజలో దీపారాధన
ఉన్నది.
విశ్వంలో అగ్ని ప్రజ్వరిల్లని
చోటు లేదు, సూర్యచంద్రగ్రహతారకాదులు
అగ్ని స్వరూపాలే!అగ్ని మానవశరీరంలో అల్ప ప్రమాణంలో ఉంటుంది, కానీ దాని ప్రభావం మాత్రం అనల్పం. అగ్నిని
పరికించినపుడు, దాన్ని ఎన్నో రకాలుగా
ప్రాణానికి పర్యాయపదంగా భావించవచ్చు. అసలు మీరు బ్రతికి ఉన్నారా లేదా అని
నిర్థారించడానికి మీ శరీరంలో వెచ్చదనం ఇంకా మిగిలి ఉందా లేక మీ శరీరం
చల్లబడిపోయిందా అన్నది ముఖ్య సూచిక.మన సంస్కృతిలో ఈ అగ్ని అనే మూలకాన్ని రెండు
ముఖాలు కలిగి చాలా పౌరుషంగా ఉండే పొట్టేలు వాహనంగా గలిగిన అగ్నిదేవుడుగా
భావిస్తాము. ఈ రెండు ముఖాలూ ఒకటి జీవితాన్ని ప్రసాదించడానికీ, రెండవది జీవితాన్ని హరించడానికీ ప్రతీకలు. మనలో
అగ్ని జ్వలించకుండా మనకి ప్రాణం నిలబడదు. కానీ, మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఈ అగ్ని పట్టుతప్పి, అన్నిటినీ హరిస్తుంది.
అది మన శరీరాన్ని దహించినపుడు దాన్ని దహనము అంటాము. అదే అగ్నిని మనకి తినడానికి
అయోగ్యంగా ఉండేవాటిని ఉడికించి కాల్చి రుచికరంగా, తినడానికి వీలుగా చేసేందుకు వినియోగిస్తున్నాము. అలా అగ్నికి మన శరీరం బయటా, లోపలా ఎన్నో ప్రమాణాలున్నాయి. మన శరీరంలో మండే
అగ్నులని ఒకసారి గమనిద్దాము. అందులో ఒకటి జఠరాగ్ని. 'జఠరం' అంటే ఉదరము, పొట్ట లేదా జీర్ణక్రియ. మీరు తింటున్నదాన్నంతటినీ
మీ పొట్టలో ఏమాత్రమైనా అగ్నిలేకుండా
దాన్ని జీర్ణం చేసుకోలేరు. ఇక్కడ ఆహారం ఇంధనంగా పనిచేస్తోంది, దాన్ని మీరు విడగొట్టి దానిలో నిబిడీకృతమైన శక్తిని
మీ అవసరానికి తగ్గట్టు వెలువరించడానికి. మీ జఠరాగ్నికి ఇంధనం సరిగా సమకూర్చి
జాగ్రత్తగా పోషిస్తే, అది పునరుత్పత్తి
అగ్నిగా మారుతుంది. ఈ జీర్ణక్రియ,
పునరుత్పత్తీ
రెండూ జఠరాగ్నిమీద ఆధారపడి ఉన్నాయి.
ఈ సంస్కృతిలో, మనుషుల జీవితాలకు సంబంధించి ఏ ముఖ్య ఘట్టం జరిగినా
అది అగ్ని చుట్టూనే జరుగుతుంది. అగ్ని లేకుండా, ఏ పూజలూ లేవు, ఏ పెళ్ళిళ్ళూ లేవు అసలు
ఏ ముఖ్యమైన సంఘటనలూ జరుగవు. అగ్నిని అనేక రూపాలుగా, మార్గాలుగా వినియోగించడం ఈ సంస్కృతిలో స్థిరపడిపోయింది.అగ్ని చుట్టూ, జతకూడడమూ, సంభాషించుకోడమూ చాలా ఎక్కువగా వృద్ధిని కలిగిస్తాయి. కారణం, ఎక్కడ అగ్ని ఉంటుందో, అక్కడ ఆకాశం ప్రభావం ప్రబలంగా ఉంటుంది. మీరు ఎప్పుడు అనువైన వాతావరణం
సృష్టించాలనుకున్నా, మీరు ముందుగా
చెయ్యవలసింది నూనె దీపమో, నెయ్యి దీపమో
వెలిగించడం. ఇది భారతీయ జీవన సరళిలో ఒక ముఖ్య భాగం.కొవ్వొత్తులకి ఈ రకమైన ప్రభావం
ఉండదు,ఒక నూనె దీపంతో మీరూ మీ
కుటుంబసభ్యులూ లాభంపొందేలా ఒక ఆకాశక్షేత్రాన్ని సృష్టిస్తున్నారు. ఇంట్లో ముఖ్యంగా
పసిపిల్లలూ, గర్భిణులూ, రోగులూ,ఉన్నప్పుడూ, మామూలుగా అందరి
ఆరోగ్యానికీ ఇంట్లో నూనె దీపం వెలిగించడం ఆవశ్యకం. ఆ అగ్ని మీ ఆరోగ్యానికీ, పుష్టికీ మీలోని జఠరాగ్నిని ప్రజ్వలనం చేయడమే గాక, చిత్తాగ్నిని రగిల్చి ఆకాశాన్ని అందుబాటులోకి
తెస్తుంది. మీలోని వివేకజ్ఞానము ప్రజ్వలిస్తూ ఉండడం చాలా ముఖ్యం. ఒక్క భౌతిక
అగ్నులే మండుతూ, మీ వివేకము
జ్వలించనపుడు జీవితం దుర్భరమై,
భయానకంగా
రూపుదిద్దుకుంటుంది. జఠరాగ్ని అత్యధికమై, చిత్తాగ్ని నామమాత్రంగా ఉన్నపుడు మనుషులు మూర్ఖాతిమూర్ఖమైన పనులు చేస్తుంటారు.
చంద్రుడు భూమి మీద కలిగించే
ఓషధి సంబంధమైన ఋతు ప్రభావాల్లో అంగారకగ్రహం(Mars) యొక్క పాత్రను వివరించే రహస్యాలు కుమార సంభవం కధలో ఇమిడి ఉన్నాయి.పార్వతి
కోరుకున్న శివుని వీర్యం అగ్ని ద్వారా కృత్తికా షట్కానికి చేరి షణ్ముఖుడై
ప్రభవించడం ఉగ్రరీతిన కనిపించే అరుణ తార Mars తన పరిభ్రమణ వల్ల భూమి మీద నుంచి చూస్తే Mars లోనయ్యే మార్పులకీ భూమిని యుద్ధాలకీ సేద్యాలకీ సన్నద్ధం చెయ్యడంలో Mars యొక్క ప్రాముఖ్యతను సూచించే
విషయాల్ని కధగా మలిస్తే అది కుమారసంభవం అవుతుంది!
మనం భూమి మీదనుంచి చూసినప్పుడు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు భూమి
చుట్టూ దాదాపు వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఈ ఊహాజనిత కక్ష్య
వెంబడి పన్నెండు నక్షత్రాల గుంపులను గుర్తించారు. ఈ నక్షత్రాల గుంపులు ఒక్కొక్కటి
ఒక్కో ప్రత్యేకమైన ఆకారంలో కనిపిస్తాయి. ఆ ఆకారాలను బట్టి వాటికి 01.మేషం, 02.వృషభం, 03.మిథునం, 04.కర్కాటకం, 05.సింహం, 06.కన్య, 07.తుల, 08.వృశ్చికం, 09.ధనుస్సు, 10.మకరం, 11.కుంభం, 12.మీనం అని పేర్లు
పెట్టారు.
సూర్యగ్రహం(Sun),చంద్రగ్రహం(Moon),బుధగ్రహం(Mercury),శుక్రగ్రహం(Venus),వరుణ/అంగారకగ్రహం(Mars), గురుగ్రహం(Jupiter),శనిగ్రహం(Saturn) అనే ఏడు గ్రహాలూ నక్షత్ర సూక్తం పేర్కొన్న ఇరవై ఏడు
నక్షత్రాలూ మేషాది మీనపర్యంతం ఉన్న పన్నెండు రాశులూ భూమి మీద నుంచి గమనించగలిగి
వుండి వాటి స్థానచలనాల యొక్క సంబంధాల వల్ల కాలాన్ని లెక్కించటానికి వీలు పడుతుంది
గనక వీటిని గురించి విస్తరించి చెప్పారు పూర్వ ఋషులు.అంత మాత్రాన పూర్వఋషులకి ఈ
కొన్ని నక్షత్రాల గురించి తప్ప మిగిలిన వాటిని గురించి తెలియదని ఎట్లా చెబుతారు?సూర్యుడు మేషాది మీనపర్యంతం ఉన్న ఈ రాశి చక్రాన్ని
చుట్టి రావడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది. అంటే సూర్యుడు ఒక సంవత్సరకాలంలో
పన్నెండు రాశుల్ని దాటి మొదటికి వస్తాడన్నమాట. అంటే ఒక్కో నక్షత్ర రాశిలోనూ దాదాపు
ఒక్కో నెల ఉంటాడు. ఇది సౌర మానం.ఇక చంద్రుడు నెల రోజుల్లోపే (ఇంకా చెప్పాలంటే 27-28 రోజుల్లోనే) రాశి చక్రాన్ని
చుట్టి వస్తాడు. ఈ 27 రోజుల స్వల్ప కాలంలో
చంద్రుడు ఎప్పుడు ఏ రాశిలో ఉన్నదీ గుర్తించేదెలా? అనేదొక సమస్య. ఈ సమస్యను తీర్చడానికన్నట్లు రాశి చక్రం చుట్టూ తిరిగేటప్పుడు
చంద్రుడు ఒక్కో రోజు ఒక్కో నక్షత్రానికి దగ్గరగా వస్తాడు. ఇలాంటి నక్షత్రాలను ఇరవై
ఏడింటిని గుర్తించారు. అవి:01.అశ్విని(ఆశ్వయుజ మాసం -
07), 02.భరణి, 03.కృత్తిక(కార్తీక మాసం - 08), 04.రోహిణి, 05.మృగశిర(మార్గశిర మాసం - 09), 06.ఆర్ద్ర, 07.పునర్వసు, 08.పుష్యమి(పుష్య మాసం - 10), 09.ఆశ్లేష, 10.మఘ(మాఘ మాసం - 11), 11.పుబ్బ(పూర్వ ఫల్గుణి), 12.ఉత్తర(ఉత్తర ఫల్గుణి)( ఫాల్గుణ
మాసం - 12), 13.హస్త, 14.చిత్త(చైత్ర మాసం - 01), 15.స్వాతి, 16.విశాఖ(వైశాఖ మాసం - 02), 17.అనురాధ, 18.జ్యేష్ఠ(జ్యేష్ట మాసం - 03), 19.మూల, 20.పూర్వాషాఢ(ఆషాఢ మాసం - 04), 21.ఉత్తరాషాఢ, 22.శ్రవణం(శ్రావణ మాసం - 05), 23.ధనిష్ఠ, 24.శతభిషం, 25.పూర్వాభాద్ర(బాధ్రపద మాసం - 06), 26.ఉత్తరాభాద్ర, 27.రేవతి! చంద్రుడు రాశి చక్రం
వెంబడి గల ఈ 27 నక్షత్రాలను ఒక్కసారి
చుట్టి వచ్చాడంటే 12 రాశుల రాశి చక్రాన్ని
చుట్టి వచ్చినట్లే. ఈ 27 నక్షత్రాల పరిధి 12 రాశులలో పరుచుకుని ఉంటుందన్నమాట. ఒక్కో నక్షత్ర
పరిధిని నాలుగు భాగాలు (పాదాలు)గా విభజిస్తే మొత్తం 108 పాదాలవుతాయి. ఈ 108 నక్షత్ర పాదాలు 12 రాశులలో ఉన్నాయని
గుర్తుంచుకుంటే ఒక్కో రాశిలో 108/12
= 9 నక్షత్ర
పాదాలున్నట్లు సుళువుగా ఊహించవచ్చు.
పౌర్ణమి రోజున చిత్రా నక్షత్రం
చంద్రుడికి దగ్గరగా వచ్చిన నెల చైత్ర మాసం అవుతుంది.పౌర్ణమి రోజున జ్యేష్ఠా
నక్షత్రం చంద్రుడికి దగ్గరగా వచ్చిన నెల జ్యేష్ఠ మాసం అవుతుంది. కృష్ణపక్షం 14 రోజులూ శుక్లపక్షం 14
రోజులూ ఒక
అమావాస్య ఒక పౌర్ణమి కలిపి నెలకు 30 రోజులు అనేది లెక్క. పంచాంగ గణనం ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంబావు రోజులు తేడా
ఉంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా
చిన్నది. ఇదే మాదిరిగా చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇందువల్ల
ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం కావడం జరగకుండా పోతుంది.
అటువంటప్పుడు సూర్యసంక్రాంతి లేకుండా పోయిన చాంద్రమాసానికి అధికమాసం అని
పేరుపెట్టారు. ఇలా అధికంగా వచ్చే అధికమాసం శుభకార్యాలకు, ముఖ్యమైన దైవకార్యాలకు పనికిరాదని నిషేధించారు.
సూర్యుని చుట్టూ భూమి
చుట్టివచ్చే కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. కాని ఈ భ్రమణం వల్ల నెలలు ఏర్పడవు.
నెలలను కొలవడానికి చంద్ర భ్రమణమే మూలం. భూమి చుట్టు చంద్రుని ప్రదక్షిణాకాలాన్ని
నెల అంటారు. దాన్నే చాంద్ర మాసమని అంటారు. ఆ విదంగా ఏర్పడిన 12 చాంద్ర మాసాలను
కలిపి ఒక సంవత్సరం అని అనలేము. సూర్యుడు మేషం, వృషభం వంటి 12 రాశులలో ఒక్కో రాశిలో ఒక్క నెల సంచరించడాన్ని సౌర మాసం అని
అంటారు. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోనికి ప్రవేశించ డాన్ని రాశి సంక్రమణం
అంటారు. ఈ సంక్రమణం ప్రతి నెలలోను జరుగుతుంది. కాని మనం మకర రాశి సంక్రమణాన్ని
మాత్రమే మకర సంక్రాంతిగా గుర్తిస్తున్నాము. ఒక్కో రాశిలో ఒక నెలపాటు తిరగాల్సిన
సూర్యుడు రెండు నెలల పాటు ఒకే రాశిలో వుండటం వల్ల ఏర్పడేదే అధిక మాసం. ఇందులో
మొదటి నెలలో రవి సంక్రాంతి వుండదు. దాన్నే అధిక మాసం అంటారు. అధిక మాసము చంద్ర
మానము ద్వారానే వస్తుంది. చాంద్ర మానం అంటే చంద్ర కళలను (తిథులను) ఆదారంగా ఒక నెల
రోజులను లెక్కించడము. సూర్యుడు ఏడాదిలో 12 రాశుల చక్రాన్నిపూర్తి చేస్తే చంద్రుడు
రోజుకు ఒక నక్షత్రం చొప్పున నెలకు 27 నక్షత్రాల దగ్గరే వుంటాడు. అనగా 12 x 27 = 354 రోజులు. సూర్యుడి చుట్టు భూమి తిరగడానికి
365 రోజులా, 6 గంటలు, 11 నిముషాలు 31 సెకెండ్లు పడుతుంది. చంద్రునికైతె
354 రోజులె పడుతుంది. వీరిద్దరి మధ్య సుమారు 11 రోజులు తేడా ఉంది. ఈ వ్యత్యాసం
వల్ల భూమి సూర్యుని చుట్టు 19 సార్లు తిరిగితే చంద్రుడు 235 సార్లు
తిరుగుతున్నాడు. దాని వలన 19 సంవత్సరాలకు, ఏడాదికి 12 మాసాల చొప్పున 238 మాసాలు రావలసి వుండగా 235 మాత్రమే వస్తున్నాయి.
అనగా చంద్రుడు 7 నెలలు అధికంగా తిరుగు తున్నాడని అర్థం. ఆ లెక్కన ప్రతి ముప్పై
రెండున్నర సౌర మాసాలకు ఒక చంద్ర మాసం అధికంగా వస్తుంది. ఈ విషయాన్ని మొట్టమొదట
గ్రహించిన వారు భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞలే. ఈ అధిక మాసము ఎప్పుడూ చైత్రమాసము నుండి
ఆశ్వయుజమాసము మధ్యలోనే వస్తుంది. ఒక సారి అధిక మాసము వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి
వస్తుంది. ఆ తర్వాత 34, 34, 35,
28 నెలలకు
వస్తుంది. అధిక మాసం ముందు వచ్చి ఆతర్వాత నిజ మాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని మైల
మాసం అని అంటారు. అనగా ఈ అధిక మాసంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు.
సౌరమాస పరిధిలో చాంద్రమాసం
ఇమిడినపుడు అది అధికమాసం అని అర్థమవుతున్నది. కానీ దీనికి విరుద్ధంగా కూడా
జరుగుతుంటుంది. అంటే ఒక చాంద్రమాస పరిధిలో సౌరమాసం సంభవించడం. మరొక విధంగా
చెప్పాలంటే అమావాస్య నుండి అమావాస్య వరకు గల సమయం లోపల, సూర్యుడు రెండు రాశులు దాటుతాడు. ఇది చాలా అరుదు. 141 ఏళ్ళకొకసారి
సంభవిస్తుంటుంది. వెనువెంటనే 19 ఏళ్ళకు మరలా ఇటువంటిది జరిగి తిరిగి 141 ఏళ్ళ తరువాత మళ్ళీ
జరుగుతుంది. దీనిని క్షయ మాసం అని పిలుస్తారు. 1823 లో వచ్చిన స్వభాను నామ సంవత్సరం
తరువాత 141 ఏళ్ళు గడిచిన పిదప 1964 లో వచ్చిన క్రోధి నామ సంవత్సరంలో క్షయ మాసాలు సంభవించాయి. 1964
తరువాత మళ్ళీ
కేవలం 19 ఏళ్ళ దాటగానే 1983 లో రుధిరోద్గారి నామ సంవత్సరంలో మరో క్షయ మాసం సంభవించింది.
ఇక మనెవ్వరి జీవిత కాలాలలో మనము క్షయ మాసాన్ని చూడబోము. ఎందుకంటే తరువాయి క్షయ
మాసం సంభవించబోయేది 141 ఏళ్ళ తరువాత 2124 లోని తారణ నామ సంవత్సరంలోనే.
ఇంగ్లీషువాళ్ళు మనమీద రుద్దిన
గ్రిగేరియన్ క్యాలెండరు 15వ శతాబ్దంలో
రూపొందించబడింది.అది కూడా అరబిక్ క్యాలెండరును కాపీ కొట్టి తయారు చేసుకున్నదే!ఆ
అరబిక్ క్యాలెండరు మళ్ళీ మన అద్గ్గిరుంచి కాపీ కొట్టి అది కూడా సరిగ్గా చెయ్యలేక
తప్పులు వస్తుంటే పానశాల రచయిత ఉమర్ ఖయ్యాం భారతీయుల ఖగోళ విజ్ఞానం నుంచి
నేర్చుకుని సర్దుబాట్లు చేశాక ఏర్పడిన నమూనా!కానీ వాళ్ళందరికీ ఆ విజ్ఞానాన్ని
అందించిన ఈ ప్రాచీన భారతీయ ఋషుల లెక్కలు మాత్రం ఒక్కసారి కూడా తప్పు
కాలేదు!గ్రీకుల ఖగోళ విజ్ఞానం మనవాళ్ళు నేర్పినదే, వాళ్ళు దాన్ని కొంత అభివృద్ధి చేశాక మనకు చెబితే దాన్ని కూడా తీసుకుని
అదివరకటి జ్ఞానరాశికి కలిపారు మనవాళ్ళు!మన లెక్కల ప్రకారం దిన వార మాసాలు
చంద్రుణ్ణి బట్టి ఏర్పడి సంవత్సరం సూర్యుణ్ణి బట్టి ఏర్పడితే ఇంగ్లీషువాళ్ళ లెక్క
ప్రకారం అన్నీ సూర్యుణ్ణి బట్టే ఏర్పడతాయి.
తమాషా ఏంటంటే, "జనవరి తర్వాత ఫిబ్రవరియే ఎందుకురావాలి?Sunday తర్వాత Monday మాత్రమే ఎందుకు వస్తుంది?Sunday తర్వాత Friday ఎందుకు రాకూడదు?" అనే రకం ప్రశ్నలకి వాళ్ళకన్న
మనకే ఎక్కువ తెలుసు!1999 నుంచి 2001 మధ్యన Y2K పేరుతో ఎంత భయోత్పాతం సృష్టించారో ఇప్పుడెంతమందికి
గుర్తుంది?మన దగ్గిర్నుంచి
కొట్టేసి రంగులు మార్చి హంగులు చేర్చి మళ్ళీ మనకే తమ సొంత ఆవిష్కరణల పేరున
ప్రదర్శనకి పెడుతున్నారు,పైన వాళ్ళు నేర్పాకే
మనకి నాగరికత అబ్బిందని పోజులు కొడుతున్నారు!
ఇవ్వాళ మన సంస్కృతి గురించి మనం
చెప్పుకోవటానికి కూడా ఇంగ్లీషు వాడకపోతే ఎవరికీ అర్ధం కాని పరిస్థితి ఉంది.మనకి
ఆరు ఋతువులు మూడు కాలాలు ఉంటే వాళ్ళకి ఋతువులా కాలాలా అని తేడా తెలియని నాలుగు
సీజన్స్ మాత్రమే ఉన్నాయి.మనకి ఏ ఋతువు ఎప్పుడు వస్తుందో తెలియటానికి ఒక నక్షత్రం
దిజ్మండలం మీద కనపడటమూ భూమి మీద వాతావారణంలోని మార్పులూ సాక్ష్యం అయితే వాళ్ళకి
సూర్యోదయం జరిగి రోజు మారటమే సాక్ష్యం.ఆ లెక్కకీ ఈ లెక్కకీ పోలికే లేదు,దీన్ని బట్టి దాన్ని దాన్ని బట్టి దీన్ని
తెలుసుకోవటం కుదిరే పని కాదు.మన సంప్రదాయం మీద గౌరవం ఉంటే గ్రిగేరియన్
క్యాలెండరుని పూర్తిగా మర్చిపోతే తప్ప మన కాలగణనం అర్ధం కాదు.మన కాలగణనానికి
సంబంధించి తప్పనిసరిగా అర్ధం చేసుకోవలసిన వాటిలో ఇంగ్లీషు ప్రమేయం లేకుండా చెప్తే
అర్ధం కానివి నాలుగు విషయాలు ఉన్నాయి.equnox,solstice అనే జంట గురించి మొదట చెప్తాను.solstice అంటే అయనసంధి అని చెప్పవచ్చు.మన
సంవత్సరాలకు 12 మాసాలు, 6 ఋతువులు 3 కాలాలు 2 అయనాలు ఉన్నాయి.
ఈ ఆయనాలను గురించి తెలుసుకోవాలంటే
తన చుట్టూ తను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడితో సహా ఈ భూమి తన చుట్టూ
తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సౌరమండల నమూనాని మర్చిపోయి భూమి విరాట్
పురుషుడి కటిస్థలం దగ్గిర విశ్వాక్షం మీద స్తిరంగా ఉండే భూలోకానికి పైన ఉన్న
భువర్లోకంలో సూర్య చంద్ర గ్రహ తారకాదులు విశ్వాక్షం చుట్టూ వలయాకారంలో పరిభ్రమించే
దృశ్యాన్ని వూహించుకోవాలి.అలాంటి అమరికలో మిగిలిన అన్నీ ఒకే రకమైన గమనాన్ని
చూపిస్తే సూర్యుడు మాత్రం కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు పయనించడం, తరువాత దక్షిణం వైపు నించి ఉత్తరం వైపుకి పయనించడం
జరుగుతూ ఉంటుంది. సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నపుడు
దక్షిణాయనం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయనం అని అంటారు. సూర్యుడు
పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి. సూర్యుడు
సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు, మరో ఆరు నెలలు ఒక వైపు అనగా ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు."చైత్ర మాసం --
ఉత్తరాయనం -- వసంత ఋతువు, వైశాఖ మాసం --
ఉత్తరాయనం -- వసంత ఋతువు, జ్యేష్ట మాసం --
ఉత్తరాయనం -- గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం -- ఉత్తరాయనం
+ దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, శ్రావణ మాసం
--దక్షిణాయనం -- వర్ష ఋతువు, భాద్రపద మాసం
--దక్షిణాయనం -- వర్ష ఋతువు, ఆశ్వయుజ మాసం
--దక్షిణాయనం -- శరత్ ఋతువు, కార్తీక మాసం
--దక్షిణాయనం -- శరత్ ఋతువు, మార్గశిర మాసం
--దక్షిణాయనం -- హేమంత ఋతువు, పుష్య మాసం -- దక్షిణాయనం
+ ఉత్తరాయణం -- హేమంత ఋతువు, మాఘ మాసం -- ఉత్తరాయనం
-- శిశిర ఋతువు" అనే మాసాలకీ ఆయనాలకీ, ఋతువులకీ ఉన్న సంబంధం ప్రకారం జనవరిలో ఉత్తరాయణ ప్రారంభం, మార్చి 21న Vernal equinox అన్న పేరున్న పగలూ
రాత్రీ సమానమై ఉండే వసంత విషువత్,
జూన్ 21న Summer solstice అన్న పేరున్న దీర్ఘమైన పగలు ఉండే పూర్వ
దక్షిణాయణ సంధి, జూలై నెలలో దక్షిణాయణ
ప్రారంభం,సెప్టెంబర్ 23న Autumnal
equinox అన్న
పేరున్న పగలూ రాత్రీ సమానమై ఉండే శరద్ విషువత్, డిసెంబర్ 21న Winter
solstice అన్న
పేరున్న హ్రస్వమైన పగలు ఉండే పూర్వ ఉత్తరాయణ సంధి వస్తాయి. గ్రెగేరియన్ క్యాలెండరు ప్రకారం జనవరి 15 నుండి జూలై 15 వరకు
ఉత్తరాయణం అని జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయణం అని అంటారు. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయణం
ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణ ప్రారంభాన్ని సూచించే సూర్యుని మకర రాశి ప్రవేశమే మకరసంక్రాంతి!
కూర్మపురాణం వంటి పురాణాలూ
సూర్యసిద్ధాంతిక వంటి శాస్త్రగ్రంధాలూ భూమి చుట్టూ చంద్రుడు తిరగడం, సూర్యుడి చుట్టూ భూమి తిరగడం అనే సౌరమండల
నిర్మితిని విశ్వానికి ఆపాదిస్తుంటే మత్స్యపురాణం, బ్రహ్మాండ పురాణం వంటివి పధ్నాలుగు లోకాల విరాట్పురుష నిర్మాణం ప్రకారం
విశ్వాన్ని చూపిస్తున్నాయి.మత్స్య పురాణం చంద్రుడి వృద్ధి క్షయాలూ
కిరణాలూ సూర్యుడి వలెనే ఉంటాయని చెప్తుంది.అయితే చంద్ర రధానికి తారకలతో ఏర్పడిన
మూడు చక్రాలు ఉంటాయి.కాడికి చెరొకవైపున అజ-శతమఖ-వృష-వాజి-నరాశ్మ-సప్తధాతు-
హంస-వామ-మృగ-నామములు గల పది తెల్లని గుఱ్ఱాలు ఉంటాయి. కుజ బుధ గురు శుక్ర శనులను తారాగ్రహములని జ్యోతిఃశాస్త్రం
చెప్తుంది.కాలనిర్ణయాన్ని ప్రభావితం చేసే సూర్యచంద్ర ద్వయమూ బుధ(Mercury)-గురు(Jupiter)-శుక్ర(Venus)-శని(Saturn)-వరుణ(Mars) గ్రహతారపంచకమూ రాహుకేతు గ్రహఛాయద్వయమూ మేషాదిమీన ద్వాదశ రాశులూ అశ్విన్యాదిరేవతి సప్తవింశతి తారకలూ కలిపితే శింశుమార చక్రము. దీని అమరిక మొత్తానికి ధ్రువతార ప్రధాన
కేంద్రం.
“ఈ సూర్యచంద్రాది గ్రహములును
జ్యోతిర్గణములును అన్నియు వాతమయములగు పగ్గములతో ఆయా అమరికలతో ధ్రవునితో బిగింపబడి
కంటికి కానరాని ఆ వాయవ్య పాశముల బలమున ఆ ధ్రువుడు ఉన్నంత కాలమును అతనిని
ప్రదక్షిణించుచు అంతరిక్షమున సంచరించుచుండును. నదీ ప్రవాహజలమందలి నౌకను ఆ జల
మెట్లు వహించునో అట్లే ఈ వాయుశక్తి ఈ దేవ గృహముల (జ్యోతిర్గణముల)ను అంతరిక్షమున
వహించుచుండును. ఇవియే కాదు. తారలన్నియు-మరీచులు -అవియు ధ్రువునితో
నిబద్దములై తా మతని చుట్టు తిరుగుచు ధ్రువుడును తిరుగుట కవకాశము నిచ్చుచున్నవి. ఇవన్నియు
వాయుమయ చక్రముచే ప్రేరితములయి కొరవిని గిరగిర త్రిప్పుటచే ఏర్పడు చక్రమువలె
తిరుగుచుండును.” అని
శ్రీ మత్స్యమహాపురాణమున ఖగోళ వ్యవస్థయందు సూర్కది గ్రహరథాది స్వరూప శిశుమార స్వరూప
ప్రతిపాదనను నూట ఇరువదియైదవ అధ్యాయము వివరిస్తున్నది.
ప్రాచీన వైదిక సాహిత్యంలో కనిపించే సౌరమండల విరాట్పురుష నిర్మితులు ఆధునిక వైజ్ఞానిక శాస్త్రంలోని సూర్యకేంద్రక, భూకేంద్రక సిద్ధాంతాల మాదిరి ఒకదానినొకటి ఖండించుకున్నట్టు కనిపిస్తాయి.కానీ ఈ రెండు ప్రాచీన భారతీయ సిద్ధాంతాలు సృష్టిని బింబ, ప్రతిబింబ రూపాలలో చూసే విధంగా పరస్పరాశ్రితమై ఉంటాయి.అంటే, కాలగనణానికి సంబంధించిన తిధి, వార, మాస,ఋతు, ఆయనాదులను ఏ నమూనాతో లెక్క కట్టినా ఒకే విలువ వస్తుంది!
అయ్యా నమస్కారం నా పేరు మళ్లీ కిరణ్ మాది నెల్లూరు. నాది ఒక చిన్న ప్రశ్న జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి నిర్దిష్ట కాలపరిమితి ఉదాహరణ సూర్య మహర్దశ ఆరు సంవత్సరముల ని అలాగే చంద్ర మహర్దశ 10 సంవత్సరములు ఈవిధంగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నిర్దిష్ట కాలపరిమితి ఇచ్చి ఉన్నారు. దీనికి ఏమైనా నిర్దిష్టమైన ఎటువంటి శాస్త్ర ప్రమాణం ఉన్నదా? ఇలా మహర్దశ సమయం నిర్దిష్టమైన సమయము నిర్ణయించడానికి శాస్త్రంలో ఏదైనా కొలమానం ఉన్నదా? 9030191949
ReplyDeleteఅలాంటి ప్రశ్నలు మీకు దగ్గర్లో ఉన్న జ్యోతిష్కులను అడగాలి స్వామీ!ఇవన్నీ ఖగోళశాస్త్రం గురించి తెలుసుకుని రాస్తున్న వ్యాసాలు.
Delete