తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యులకి రెండు నెలల క్రితమే వ్యక్తిగత సలహాని ఇవ్వాలనుకున్నాను.కానీ క్రియాశీల సభ్యులు ఎవరూ పరిచయం లేకపోవటంతో కుదరలేదు.ఎక్కడో దూరంగా చెన్నైలో ఉండి కేవలం పేపర్లలోని వార్తలు చదువుతున్న నాకే తెదెపాని కనుమరుగు చేసే ప్రమాదకరమైన దొంగాట కనిపిస్తుంటే పార్టీ వారు మాత్రం "ఇలాంటివి చాలా చూశాం,మా పార్టీని అంతం చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు!" అని బింకం ప్రదర్శించడం తప్ప వాస్తవాలని చూడడం లేదు.మీ పార్టీని భూస్థాపితం చెయ్యాలనే భాజపా ప్లాను తెలుసు కాబట్టే కేసీయార్ ఈసారి ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం అని కుండబద్దలు కొట్టి చెప్పగలిగాడు - మీరేమో ఎన్నికల తర్వాత కూడా "మరీ ఇరవై మూడేనా!మరీ ఇరవై మూడేనా!ఇదెలా జరిగింది?ఇదెలా జరిగింది?" అని ఆశ్చర్యపోయే అజ్ఞానంలో ఉన్నారు!వైకాపా వాళ్ళు "నువ్వు ఓడిపోవటం ఏంటయ్యా!" పేరుతో క్యామెడీలు చేస్తూ ఉన్నారు.
జగన్ చంద్రబాబు పైన చేసిన ఆరోపణలకి సానుకూలంగా స్పందించకపోవటమూ కొన్నిసార్లు భాజపా స్థానిక నాయకులు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడమూ చూసి భాజపా జగన్ ప్రభుత్వంతో విసిగి పోయిందనీ త్వరలోనే జగన్ ప్రభుత్వాన్ని ఏదో చేసేస్తుందనీ ఆ వెంటనే మిమ్మల్ని మళ్ళీ ఆదరించి మిత్రపక్షం చేసుకుని అధికారంలో కూర్చోబెడుతుందనీ మీలో కొందరు భ్రమలో ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది.ఒకవేళ మీరు అంత అమాయకంగా లేకపోతే మంచిదే, కానీ ఆ విధమైన ఆశలతో ఉంటే మాత్రం మీరు ఎప్పటికీ అధికారం చేపట్టలేరు.
భాజపా ఎప్పటికీ తెదెపాని మిత్రపక్షం చేసుకునే అవకాశం లేదు. అప్పుడప్పుడూ విమర్శించడాన్ని మాత్రమే మీరు చూస్తున్నారు.కానీ పోలవరం, అమరావతి పనుల్ని ఆపెయ్యడమూ ఇసుక కొరత సృష్టించడమూ, కరెంటు కోత, ప్రభుత్వ మద్యం విక్రయాలు అన్నీ ఒక క్యాలెండరు వేసుకున్నట్టు పక్కా ప్లానుతో జరుగుతున్నాయనే అనుమానం కూడా మీకు రావడం లేదు, అంత అమాయకత్వం దేనికి?అన్ని అభివృద్ధి పనుల్నీ ఆపేసింది ఆ పనుల వల్ల లబ్ధి పొందేది చంద్రబాబు/తెదెపా అనుకూల వర్గాలు కాబట్టి కాదా?వచ్చే ఎన్నికల నాటికి తెదెపాకి ఆర్ధిక సహాయం చేస్తారని అనుకున్న ప్రతి వాళ్ళనీ వ్యాపార పారిశ్రామిక ఉత్పాదక రంగాల నుంచి వెళ్ళగొట్టి ఆయా రంగాల్లో తమవాళ్ళని మర్రిచెట్లలా పాతడం కళ్ళముందు కనబడుతున్నా మీకు భయం వెయ్యడం లేదా?
మీరు అధికారంలో ఉన్నప్పుడే "ఈ ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద షూట్ చెయ్యాలి!" అంటే అతని వెంట్రుక కూడా పీకలేని వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి, అదీ ముష్టి 23 సీట్లతో 150+ సీట్లతో అధికారంలో ఉన్నవాణ్ణి తోక కత్తిరిస్తానంటే జనాలకి నవ్వు రాదూ!
ఇప్పుడు భాజపా వేస్తున్న వ్యూహం ఇంతవరకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చరిత్రలో ఏ పార్టీ కూడా వెయ్యనిది,మీరేమో లోగడ మీరు చేసిన సాహసాల్ని చూసుకుని మురిసి ముక్కలవుతున్నారు.మొన్నటి ఎన్నికల్లో కూడా మిమ్మల్ని మీరు అతిగా వూహించుకుని దెబ్బ తిన్నారు!"చంద్రబాబు వాళ్ళనీ వీళ్ళనీ కలుపుకోకుండా ఒంటరి పోరు చేసినప్పుడల్లా ఓడిపోయాడు, ఈసారి కూడా అలాగే ఓడిపోతాడు!" అనేది మూఢనమ్మకంలా ఉన్నా సరే నిజం అయిందా లేదా?దానంతటది నిజం అయిందా?లేదు వాళ్ళు ఎంత లాఘవంగా ప్రచారం చేసి దాన్ని జనంలోకి ఎక్కించి నిజం చేశారు!
వాళ్ళేమో మీ పార్టీ గెలుపోటముల చరిత్రని మీకన్నా ఎక్కువ స్టడీ చేసి కనిపించిన ప్రతి లోపాన్నీ ఉపయోగించుకున్నారు, మీరేమో "జగన్ జైలు కెళ్తాడు!" పాటతోనే సరిపెట్టేశారు - ఎంత నిర్లక్ష్యం?ఎన్నికల తర్వాత ఆంధ్రలో జరుగుతున్న పరిపాలన మొత్తం ఆ రెండు పార్టీల ఉమ్మడి వ్యూహం అని మీకెందుకు తెలియడం లేదు?నేను జరుగుతాయనుకున్న రెండింటిలో ఒకటి నిజం కానున్నదని వార్తలు బయల్దేరాయి.అది పోలవరాన్ని కేంద్రం చేపట్టాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.మీరు 90 శాతం చేసిన దాన్ని తను పూర్తి చేసి ఆ క్రెడిట్ పునాదితో ఆంధ్రని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనుకుంటున్న పార్టీకి మిమ్మల్ని మిత్రపక్షం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి?
భాజపా ఆంధ్రను పట్టుకోవటానికి వేసుకున్న నాలుగంచెల ప్లానులో ప్రత్యేక హోదా ఇవ్వకపోవటమూ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని అమలు చెయ్యకుండా ఏడ్పించటమూ మొదటి అంచె - అది విజయవంతం అయ్యింది కదా, మొన్నటి ఎన్నికల్లో మిమ్మల్ని దించేసింది రెండవ అంచె - మీరు మళ్ళీ గెలుస్తారనే భరోసాతో సీట్లిచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేల హైలెవెల్ కరప్షన్+బ్యాడ్ పెర్ఫార్మెన్స్ వల్ల అది కూడా విజయవంతం అయ్యింది కదా,జగన్ని ఎందుకూ పనికిరానివాణ్ణి చెయ్యటం మూడో అంచె - కేసుల భయం వల్ల జగన్ సహకరించటంతో అది కూడా విజయవంతం అవుతున్నది కదా,ఈ దశ మీకు ఎన్నికల్లో నిలబెట్టటానికి దమ్మున్న క్యాండిడేట్లు మిగలకుండా పోయి ఎన్నికల ఖర్చులు భరించలేని స్థితికి మీ పార్టీ వెళ్ళేవరకూ ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా నడుస్తుంది.ఇప్పుడు మీరు రోజువారీ నిరసనలు ఎన్ని చేసినా ఫలితం ఉండదు.మీరిప్పుడు రోజుకోసారి ప్రస్తావిస్తున్న పనులు లేక అల్లాడుతున్న కూలీల ఆక్రందనలు జగన్ని ఏమాత్రం భయపెట్టటం లేదు, ఎందుకని?ప్రతి ఎన్న్నికల బూత్ దగ్గిరా ఓటింగ్ అనేది జరిగినట్టు హడావిడి కనిపిస్తే చాలు మొత్తం రాష్ట్ర ప్రజలు మీకే వోటు వేసినా మీరు గెలవటం అసాధ్యం - మొన్న కేసీయార్,మోదీ, జగన్ అంత భారీ మెజార్టీతో గెలిచింది ఈవీయం ట్యాంపరింగ్ ద్వారానే!ఈవీయంలు పెట్టటం కుదరని ప్రతి చోటా కేసీయారుకి ఎదురు తన్నడం మీకు తెలియదా?
మీరు ఆశిస్తున్నట్టు జగన్ని జైలుకి పంపించి మీకు అధికారం వచ్చేలా చెయ్యటానికి భాజపా తెలివితక్కువ పార్టీ కాదు.భాజపా ఫాలో అవుతున్నదని నేను వూహించిన ప్యాటర్న్ ఇది.మీ పార్టీకి బలమైన అబ్యర్ధులు మాయమైపోయి వనరులు కుంచించుకుపోయాయని తెలిసే వరకు జగన్ ప్రభుత్వాన్ని ఏమీ చెయ్యదు - పత్రికా ప్రకటనలకి మించి క్రియాత్మక ఆందోళనలు చెయ్యటం లేదు స్థానిక భాజపా నాయకులు కూడా, లాక్కోలేకా పీక్కోలేకా అవస్థలు పడాల్సిన సన్నివేశాలు జరక్కుండా కేంద్రం ముందు జాగ్రత్త హెచ్చరికలు చేసింది కాబోలు!మీ పార్టీ పరిస్థితి/దుస్థితి వాళ్ళకి వీలిచ్చే స్థాయికి తగ్గాక అప్పుడు చిన్న చిన్న గొడవలు చేసి శాంతి భద్రతల పేరుతో రాష్ట్రపతి పాలన పెడతారు.పోలవరం ఓ నాలుగు నెలల్లో పూర్తి చేసి రిబ్బన్ కట్ చేస్తే ఆ తర్వాత ఎన్నికల్లో మీరు దాన్ని గురించి చెప్పుకునే వీలు ఉండదు.రాష్ట్రపతి పాలన కాబట్టి మీరు కూడా నోరెత్తడానికి వీల్లేదు.రాష్ట్రపతి పాలన సమయంలో రాష్ట్రానికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉండి కూడా వాటిని సాధించలేని మీ అసమర్ధతనీ వైకాపా అరాచకత్వాన్నీ ఫోకస్ చేసి లాభపడుతుంది!
ఇప్పటికి మీకు అర్ధమై ఉండాలి జగన్ ప్రభుత్వం మీమీద చేస్తున్న రౌడీ పనులు భాజపాకి కూడా ఆనందాన్ని కలిగించేవేనని.చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం టీడీపీకి లాభం కలగడమే తప్ప భాజపాకి వీసమెత్తు లాభం కూడా ఉండదు.అలాంటప్పుడు భాజపా మీకు అనుకూలం ఎట్లా అవుతుంది?కుండెడు మట్టీ చెంబుడు నీళ్ళూ ఇచ్చిన నాటినుంచే భాజపా మీ చుట్టూ ముళ్ళకంచెలు పేర్చడం బయటివాళ్ళం మాకు తెలుస్తున్నది గానీ మీకు మాత్రం తెలియలేదు - ఇప్పటికీ అయోమయంలోనే ఉన్నారు!ఈ చక్రవ్యూహాన్ని పోలవరం పనుల్ని కేంద్రం తీసుకుంటుందనే నిర్ణయం ఖరారు అయ్యేలోపున బద్దలు కొట్టడం మీకు సాధ్యపడుతుందా!నేను మీకు ఇద్దామనుకున్న సలహా అదే, కానీ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదా అని సందేహిస్తున్నాను.
తెలుగుదేశం రామారావు హయాంలో ఎన్నికల ప్రచారం ఎఫెన్సివ్ పద్ధతిలో జరుగుతూ ఉండేది.తనకి భాష మీద వున్న పట్టు గొప్పది కాబట్టి అసభ్య పదాలు వాడాల్సిన అవసరం లేకుండానే ఎదిరి పక్షాల్ని ధాటిగా విమర్శిస్తూ ఉంటే తనతో పోలిస్తే మంచి తెలుగు అంటే ఏంటో తెలియని కాంగ్రెసువాళ్ళు అదే స్థాయిలో ప్రతిదాడి చెయ్యలేకపోయేవాళ్ళు!వూహించని ఓటములు N.T.Rకీ తప్పలేదు గానీ గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికల ప్రచారంలోనూ పరిపాలనలోనూ ఉన్న స్టైల్ ఒకేలా ఉండేది. ఒకసారి గెల్చాక మాత్రం పరిపాలన డిఫెన్సివ్ పద్ధతిలో జరుగుతూ ఉండేది.దానికి కారణం మర్యాదల పట్ల రామారావు కున్న పట్టుదల - అది పీవీ నర్సింహారావుకు పోటీ పెట్టకపోవడంలో బయటపడింది కదా!
చంద్రబాబు నాయుడు దీనికి పూర్తి వ్యతిరేకం - ఎన్నికల ప్రచారం డిఫెన్సివ్ పద్ధతిలో జరుగుతూ ఉండేది .ఎన్నికల ప్రచారంలో తన సమర్ధత గురించి చెప్పుకోవడం తప్ప ఇతరుల బలహీనతల్ని వాడుకోవటం CBN ఒక్కసారి కూడా చెయ్యలేదు. మోదీ, జగన్, కేసీయార్ దిగజారిన స్థాయి ఇంకెవరూ దిగజారలేనంతటిది! ఒకసారి గెల్చాక మాత్రం పరిపాలన ఎఫెన్సివ్ పద్ధతిలో జరుగుతూ ఉండేది. దానికి కారణం ఇతరులు ఆర్ధిక వ్యవస్థని ఛిన్నాభిన్నం చేసిన తర్వాత తను రావటం - అయితే గతంలోనూ ఇప్పుడూ దాన్నొక చాలెంజిగా తీసుకుని పోరాడి అతి తక్కువ కాలంలో వ్యవస్థని అభివృద్ధి వైపుకు నడిపించటం తారీఖులూ గణాంకాలూ కూడా ఉన్న చారిత్రక సత్యం!
విచిత్రం ఏమిటంటే, CBN యొక్క పెర్ఫార్మెన్స్ రికార్డ్ కనపడినా నిన్నటి ఎన్నికల్లో "బాబు తోడు లేకుండా ఒంటరిగా పోటీ చేసినప్పుడల్లా ఓడిపోవటం!" కాక వైకాపా ప్రచారం చేసిన మూఢనమ్మకం లాంటి మరో వాస్తవం "రెండుసార్లు వరస ఎన్నికల్లో గెలవకపోవటం!" అనేది పదే పదే ఎట్లా జరుగుతున్నది? CBN నేతృత్వంలో ఓడిపోయిన అన్ని ఎన్నికల్లోనూ అలవాటైన డిఫెన్సివ్ పద్ధతికి బదులు ఎఫెన్సివ్ పద్ధతి ఫాలో అయితే తెలుగుదేశం గెలిచి ఉండేది.అప్పుడు వయ్యస్సార్ ఇప్పుడు వైయస్జే పాదయాత్రలూ బుగ్గల రుద్దుడు యాత్రలూ చేసి ఫోకస్ తమనుంచి మళ్ళిపోకుండా చూసుకున్నారు.CBN చేస్తున్న అభివృద్ధి వెనక్కి పోయి అక్కడ జరుగుతున్న హడావిడికి కవరేజి ఇచ్చిన మీడియా వల్ల వాళ్ళు నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళు గెలవటం ఖాయం అనే ముద్ర జనంలో పడిపోయింది.అలా ఎఫెన్సివ్ స్ట్రాటజీ ఫాలో అవుతుంటే అధికారంలో ఉన్నాం, అభివృద్ధి చేస్తున్నాం అనే ధీమాతో అలవాటైన డిఫెన్సివ్ పద్ధతినే ఫాలో అయ్యారు, ఓడిపోయారు!ఒకసారి CBN పాదయాత్రని గుర్తుకు తెచ్చుకోండి - అది కూడా పైన నేను చెప్పిన ప్యాటర్న్ CBNకు అనుకూలం అవడం వల్లనే దాని ఫలితాన్ని అది ఇచ్చింది!
తెదెపా క్రియాశీల సభ్యులు అందరూ ఎన్నికల స్ట్రాటజీల్ని తమ వైపునుంచి చూసి ఫాలో అవుతున్నారు.కానీ ఇటు వైపు నుంచ్బి చూస్తే ఓటర్లు తాము వోటు వేసిన పార్టీ అధికారంలోకి వస్తే పొంగిపోవడమూ రాకపోతే కుంగిపోవడమూ జరుగుతుంది - గుర్రప్పందాల్లో గెలుస్తుందనుకున్న గుర్రం మీదే అందరూ పందాలు కాస్తారు కదా!నిన్నటి ఎన్నికల్లో మోదీ, కేసీయార్, జగన్ ముగ్గురూ కలిసికట్టు దాడి చేస్తుంటే ఎఫెన్సివ్ దాడి చెయ్యాల్సింది పోయి డిఫెన్సివ్ పద్ధతిని కూడా సమర్ధవంతంగా ఉపయోగించుకోలేదు.కేసీయార్ హైదరాబాదులో ఆస్తులున్నవాళ్ళని బెదిరించి వైకాపాలోకి పంపిస్తున్నట్టు ఆ దాడికి గురవుతున్న వ్యక్తి సాక్షాత్తూ CBN సమక్షంలోనే expose చేసినా దానికి కనీసం remidial action కూడా తీసుకోలేదు - ప్రజల్లో మీకు గెలుపు గుర్రం ఇమేజి ఎట్లా వస్తుందనుకున్నారు?
మొన్నటి ఎన్నికల్లో మోదీ మీకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం అసలు ఏమాత్రం ప్రభావం చూపించలేదు కాబట్టి దాని పట్టించుకోనక్కర లేదు.కానీ జగన్ గెలుపులో 90 శాతం కేసీయార్ ఎత్తుగడలే పని చేసాయి.అతను "బాబు వోడిపోతాడు!" అన్నది జోస్యం కాదు,"నేను బాబుని ఓడిస్తాను!" అని చేసిన హెచ్చరిక - ఎఫెన్సివ్ స్ట్రాటజీ పాటించేవాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది.జగన్ "ఈ ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద నిలబెట్టి షూట్ చెయ్యాలి!" అన్నప్పుడు నాతో సహా అందరికీ అతనొక హీరోలా కనిపించాడు, నిజం! అప్పుడు బాబు స్థానంలో మోదీ గానీ కేసీయార్ గానీ ఉండి ఉంటే తెల్లారేసరికి జగన్ చచ్చి శవమై ఉండేవాడు. CBN పిరికివాడిలా కనిపించాడు - అరెస్ట్ చెయ్యలేదు, కనీసం తత్తరపడి క్షమాపణ చెప్పేలా మోరల్ బ్లాక్ మెయిల్ చేసి కార్నర్ చెయ్యలేదు,అతన్ని అచ్చోసిన ఆంబోతులా వదిలేసింది బాబు సర్కారే!
ప్రజలు వోటు వెయ్యడం అనేది మినహాయిస్తే ఇప్పటి రాజకీయాలు కూడా చాణక్యుడి రాజనీతినే పాటిస్తున్నాయి.అప్పటి యుద్ధాల స్థానంలో ఎన్నికలు వచ్చాయి - అంతే తేడా! యుద్ధమయినా ఎన్నికైనా గెలుపుని తెచ్చిపెట్టేది వ్యూహాలే.ఎఫెన్సివ్ వాడాల్సిన చోట డిఫెన్సివ్ వాడటం ఎంత ప్రమాదకరమో డిఫెన్సివ్ వాడాల్సిన చోట ఎఫెన్సివ్ వాడటం కూడా అంతే ప్రమాదకరం.ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కేసీయార్ చేసిన అలాంటి పొరపాటే,కేసీయార్ ఇచ్చిన వార్నింగుని ఉద్యోగులు ఖాతరు చెయ్యకపోవటం అంటే సమ్మె మొదలైందే బీజేపీ ఎఫెన్సివ్ ఎటాక్ అని తెలుస్తున్నది.అన్ని లెక్కలూ వేసుకోకుండా ఎఫెన్సివ్ ఆడటానికి భాజపా తెలివితక్కువది కాదు.ఇప్పటికే కేసీయార్ పొజిషన్ వీక్ అని అందరికీ తెలుసు - దీనితో అతన్ని ఇంకొంచెం వీక్ చేసి వెన్వెంటనే ఫిరాయింపుల కౌంటర్ తెరిస్తే కేసీయార్ పని జాటర్ ఢమాలే!
మొన్నటి ఎన్నికల తర్వాత నాకో వూగిసలాట వచ్చింది - బీజేపీ మొదట జగన్ పనిపట్టి తర్వాత కేసీయార్ వైపుకి వెళ్తుందా, మొదట కేసీయార్ పనిపట్టి తర్వాత జగన్ వైపుకి వస్తుందా అని.ఇప్పుడు ఆ సందేహం తీరిపోయింది - కేసీయార్ని లేపేసి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక తర్వాత మంచి ముహూర్తం చూసుకుని జగన్ని లేపేసి ఆంధ్రలో ప్రభుత్వ ఏర్పాటు చేస్తుంది.మరి, మీ సంగతి యేంటి?మీలో కొందరికి ఏదో ఒక రోజున భాజపా మీకు అనుకూలమై మళ్ళీ మీరు ఆంధ్రలో అధికారం చేపట్టటానికి సహాయపడుతుందనే భ్రమలో వున్నారు.అది కేవలం మూఢనమ్మకం మాత్రమే - అసలు వైకాపా ప్రచారం చేసి జ్ఞానికి ఎక్కించిన "తోడు లేకుండా ఒంటరిగా పోటీ చేసినప్పుడల్లా ఓడిపోవటం!", "రెండుసార్లు వరస ఎన్నికల్లో గెలవకపోవటం" లాంటి మూఢనమ్మకాల్నీ తొలగించుకోకపోతే CBN తర్వాత పార్టీ బతికి బట్ట కట్టటమే చాలా కష్టం.
ఒక రాజకీయ పార్టీలో సామాన్య కార్యకర్త అయినంత మాత్రాన నాయకులు ఏది చెబితే ఏది చేస్తూ పోవడం కాదు, ఇలాంటి కఠిన వాస్తవాల్ని తెలుసుకోవాలి.క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో పై స్థాయి వారికి చెప్పేటప్పుడు వాస్తవాలే చెప్పాలి.ఇప్పుడే CBN కూడా "బీజేపీకి దూరం కావడం వల్లనే నష్టపోయాం!" అనే ప్రకటన ఇవ్వడాన్ని బట్టి తెదెపా పై స్థాయి నాయకులు మళ్ళీ బీజేపీ సహాయం ఆశిస్తున్నట్టు నాకు అనిపిస్తున్నది.కానీ మొన్నటి రోజున దూరం కావడం మీవైపునుంచి మొదలు కాలేదు.హోదా ఇవ్వకపోవడం అంటే సాంకేతికపరమైన కారణాలు ఉన్నాయి,బాబు-జైట్లీ ప్లానులో ఎలాంటి ఇబ్బందీ లేదు.కానీ దాన్ని కూడా ఇవ్వకుండా పొమ్మనకుండా పొగబెట్టిన తర్వాతే కదా CBN బీజేపీకి దూరం జరగాలన్న నిర్ణయం తీసుకున్నది!సరిగ్గా ఎన్నికల సమయానికి దేశంలోని నాన్ బీజేపీ పార్టీల నాయకులు ఆంధ్రలో మీరు గెలుస్తారనీ దానితో జాతీయ స్థాయిలో మోదీకి చెక్ చెప్పొచ్చుననేటంత హుషారుగా వున్నారు, అప్పుడే మర్చిపోయారా?
బీజేపీ వైపు నుంచి చూస్తే మీకు సహాయం చేసినందువల్ల బీజేపీకి వచ్చే లాభం ఏమిటి?మీకు సహాయం చేసి మిమ్మల్ని అధికారంలో ఉంచాలనుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎందుకు ఏడిపిస్తారు?ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఏం జరుగుతుంది?CBN పేరు మార్మోగిపోతుంది!తెదెపాకి ఆంధ్రలో ప్రత్యామ్నాయం అంటూ లేనంత బలపడుతుంది!ఇందులో భాజపాకి లాభం ఏముంది?CBN తర్వాత లోకేశ్ ముఖ్యమంత్రి అవుతాడు - భాజపా ఎప్పటికీ మీకు పక్కతాళం వేస్తూ ఉండాల్సిందేనా?ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీకి పక్కతాళం వెయ్యడానికి ఒప్పుకోవడం అంటే ఆ జాతీయ పార్టీకి అవమానం కాదా!
చాలామంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు కూడా బీజేపీ జగన్ని జైలుకి పంపించడం ద్వారా తప్పిస్తుందని అనుకుంటున్నారు.అలా ఎప్పటికీ చెయ్యదు.ఎందుకంటే, అలా చేశాక రెడ్డి కులస్థులు బీజేపీకి వోటు వెయ్యరు - తెదెపా నాయకుల్లో కూడా రెడ్లు ఉన్నారు.కానీ, అతడు నేరాలు రుజువై వెళ్ళినా సాటి కులస్థుల్లో ప్రతి ఒక్కరికీ "అయ్యో!విజయ్ మాల్యాని పట్టుకున్నారా?నీరవ్ మోదీని జైల్లో పెట్టారా?మనోడు కదా, చూసీ చూడనట్టు పోకూడదా!" అనిపించటం సహజం.కాబట్టి బీజేపీ అంత భీబత్సం చెయ్యదు.తమకు అధికారం గ్యారెంటీ అని క్లారిటీ వచ్చేవరకు జగన్ని ఇప్పటిలాగే పరిపాలించనిస్తుంది.పనిలో పని అతడి ద్వారా మిమ్మల్ని బలహీనం చేస్తుంది.పొజిషన్ తమకు 100% అనుకూలం అనుకంటే అప్పుడే ఎన్నికలని తెస్తుంది, లేదంటే రాష్ట్రపతి పాలన పెడుతుంది.
ఇప్పుడు జగన్ పరిపాలన అస్సలు బాగోలేదు.ఒకరు చెప్పాల్సిన పని లేకుండా జనం పోల్చి చూసుకుని అర్ధం చేసుకుంటున్నారు, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో జగన్ ఫ్యాన్ల తొలినాటి హడావిడి తగ్గి మౌనం దాల్చటమే అందుకు గట్టి సాక్ష్యం.కానీ బీజేపీ తను అధికారం కోరుకుంటున్నప్పుడు ఎప్పటికీ ఇలా ఉండనిస్తుందని గ్యారెంటీ ఏమిటి?కేంద్రంలో అధికారం నడుపుతున్న పార్టీకి మీకున్న గుడ్విల్ క్యాంపెయిన్ బ్యాంకును తన ఖాతాలో వేసుకోవడం ఎంత సేపు?
నేను మీకు ఇవ్వాలనుకుంటున్న సలహా ఏమిటంటే,మీరు ఇప్పుడున్న 23 మంది ఎమ్మెల్యేలతోనూ రాజీనామా చేయించి అప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో మళ్ళీ ఆ 23 మందినీ తిరిగి గెలిపించుకోవాలి!కొంచెం షాకింగ్ అనిపించొచ్చు, మిమ్మల్ని నేను ఇంకా నష్టపెట్టటానికి అతి తెలివి చూపిస్తున్నానని కూడా అనిపించొచ్చు.యే రాజకీయ పార్టీలోనూ సభ్యుణ్ణి కాదు గాబట్టి వాస్తవ పరిస్థితిని గురించి అవగాహన లేకుండా వూహల్ని పేనుతున్నానని కూడా అనిపించొచ్చు!
కానీ, మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ఆ 23 మందితో ఏమి సాధించగలిగారు?మున్ముందు అసెంబ్లీ సమావేశాల్లో ఆ 23 మందితో ఏమి సాధించగలుగుతారు?CBN అంతటి సీనియర్ నాయకుణ్ణి మీ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే ఎట్లా అవమానిస్తున్నారో చూశారు కదా!స్పీకర్ ఒకప్పుడు మీ పార్టీ వాడే కదా, అయినా మీకు గౌరవం, మర్యాద లేవు.మీరివ్వాళ చేస్తున్న ఆందోళనలకి వాళ్ళు ఈషణ్మాత్రం భయపడటం లేదు.మీరేమో మీ డిఫెన్సివ్ మెంటాలిటీలో ప్రజల ముందు ఇవన్నీ ఏకరువు పెట్టి వాళ్ళని మెప్పించితే చాలునని అనుకుంటున్నారు.ఎన్నికలు మామూలుగా రావడానికి ఇంకా నాలుగేళ్ళ పైనే ఉంది.బీజేపీ పెట్టబోయే ఒకే దేశం ఒకే ఎన్నిక కూడా దాని వెసులుబాటును బట్టి పెడితే రెండేళ్ళకిపైనే పడుతుంది.
ఏది ఏమైనా వాళ్ళు తెస్తే వచ్చే ఎన్నికల వల్ల వాళ్ళకే లాభం!వాళ్ళు మీమీద చేస్తున్న భౌతిక దాడులు ఆగాలంటే వాళ్ళు మీకు భయపడటం తప్ప మరో దారి లేదు.ఈవీయం ట్యాంపరింగ్ ద్వారా 175 సీట్లకీ 151 తెచ్చుకున్న వాళ్ళకన్న కన్న పేపరు బ్యాలెట్లతో 23 సీట్లకి 20 తెచ్చుకున్నా మీరే గొప్ప అవుతారు కదా!ఇదివరకే చెప్పాను కదా పేపర్ బ్యాలెట్ కోసం ఒక్కో సీటుకీ ఓ వందమంది చేత డమీ నామినేషన్లు వేయించితే సరిపోతుందని.మీకు కొంత డబ్బు కర్చు కావచ్చు, ఎన్నికల వ్యయం ఉంటుంది. కానీ 175 సీట్లని గెలవటానికి పెట్టే ఖర్చుతో పోలిస్తే 23 సీట్ల కోసం పెట్టేది నామమత్రమే, అవునా?కానీ, లాభాలు చాలా ఎక్కువ. మరీ 175కి 23 తెచ్చుకున్న ఆత్మన్యూనత పోతుంది కదా, ఆ ఒక్కటి చాలదా!అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికలకి పనిచేసే టీం లాగా ప్రశాంత్ కిశోర్ ఉన్నప్ప్పటికీ జగన్ గెలుపులో కేసీయార్ ప్రమేయమే ఎక్కువ.అందుకే జగన్ అంతగా అంటకాగుతున్నాడు. ఇప్పుడు కేసీయారూ బీజేపీ రెండూ కూడా ఆర్టీసీ సమ్మెని ఉపయోగించుకునే రంధిలో ఉన్నాయి.సలహా నచ్చితే వెంటనే పాటించండి!
నచ్చకపోతే?ప్రాక్టికాలిటీ ఉన్న పాయింట్లని గుర్తుంచుకుంటే చాలు.
చాలా బాగా విశ్లేషణ చేసారు. అందుకే తెలంగాణాలో టిడిపి, కాంగ్రెసుని మడతెట్టే పని కేస్యార్ చేసేంత వరకు కామ్ గా ఉండి ఆ రెండు పార్టీలు చతికిలబడ్డకా రంగంలోకి దిగి కేస్యార్ కి చెక్ పెట్టడం జరుగుతుంది. ఆయితే ఇక్కడ జగన్ తెలివైనవాడైతే ఈ వ్యూహం ఆంధ్రలో పారకుండా ఉండడానికి టిడిపిని బలహీనం చేయడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే బిజెపి కష్టపడకుండా ప్రతిపక్షంని బలహీనపరిచే పని అధికార పార్టీ తీసుకుంటే ఆ తర్వాత వారు ఎంటర్ అవడానికి ప్లాన్లో ఉన్నారు. అదే ప్రతిపక్షం బలంగా ఉన్నంత కాలం ఆటస్దలంలో బిజెపికి ప్లేసు దొరకదు. ఒక వేళ అధికార పార్టీని కబలించడానికి ప్రయత్నం చేస్తే జనాల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది. చూడాలి ఏం జరుగుతుందో..
ReplyDeleteYou are right in getting the point!
Deleteఉప ఎన్నికలు సాధారణం అధికారపార్టీ కి అనుకూలం గా ముగుస్తాయి.కారణం, రాష్ట్ర స్థాయి లో అధికార మార్పిడి జరగదు కాబట్టీ, అధికారం లో ఉన్న పార్టీ కి ఓటేస్తే పనులు అవుతాయని జనాల అభిప్రాయం, పరిమితమైన స్థానాలలో పోటీ చేసినపుడు డబ్బు వెదజల్లి అధికార దుర్వినియోగం తో గెలవటానికి అధికార పక్షానికి ఉండే అవకాశం. అధికారపార్టీ మీద వ్యతిరేకత బలం గా ఉంటేనో, ప్రతిపక్షానికి అనుకూలం గా wave ఉంటేనో తప్పితే..ప్రతిపక్షానికి రిస్క్ ఎక్కువ.
ReplyDeleteఇంకో రెండేళ్లకు ycp కి వ్యతిరేక wave ఉందని confirm అయితే, అప్పుడు ఆలోచించవచ్చూ
If TDP is waiting for time, more damage will awaits!JGN is very definitive in both terrorizing and removing assets from TDP.
Deleteif tdp resin now only cbn and nbk will win in byelection
Deleteఎటూ పంచాయితీ ఎన్నికల్లో ఈవీయం కాక్ పేపర్ బ్యాలెట్ వస్తుందని అంటున్నారు.తెదెపా అంతర్గత వర్గాలు కూడా వాటికోసమే ఎదురు చూస్తున్నారు కాబోలు!అయితే, గ్రామ సచివాల్య పదవుల్ని జగన్ తెలంగాణలో కేసీయార్ సకలజనులసర్వేని ఉపయోగించుకుని ఏయే ప్రాంతాల్లో ఏయే కుటుంబాలు ఎవరికి మద్దతు ఇస్తాయో లెక్కలు తీసి మోసం చెయ్యడానికి ఉపయోగించుకోవడానికే కట్టబెట్టారని ఒక వార్త వింటున్నాను.తెలుగు తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండాలి.అతి నమ్మకంతోనే మొన్నటి ఎన్నికల్లో మరీ ఘోరమైన ఓటమిని చూశారు.
Delete"if tdp resin now only cbn and nbk will win in byelection"
ReplyDeleteEven they also lose. THey will get enough time to spend with maaLok(esh)am and enjoy beer and girls.
:-)
Delete