Wednesday, 4 July 2018

రాముడు దగుల్బాజీయా?సీత రావణుడి దగ్గిర ఉంటేనే సుఖపడేదా!

సీత గురించీ రాముడి గురించీ తమకున్న కసితో నోటికొచ్చింది కూసి నిలదీస్తే నేనొక్కణ్ణే కాదు సాక్షాత్తూ రాముడే సీతని అలా అన్నాడు అని రామాయణం నుంచి ఆ ఒక్క ముక్కనే ఉదాహరణ తెచ్చుకునేవాళ్ళు కధ అక్కడితో ఆగిపోయిందని అనుకుంటున్నారా?అసలు సీత ఎవరి దగ్గిర ఉంటే సుఖపడుతుందో తేల్చటానికి వీళ్ళూ వాళ్ళూ ఎవరు?సాక్షాత్తూ సీతయే అగ్నిపరీక్ష తర్వాత రాముడి దగ్గిరకే వెళ్ళింది కదా!మళ్ళీ మూర్ఖ ప్రజానీకం కారుకూతలు కూసేవరకు రాముడితో సుఖంగానే బతికింది కదా!

एतच्छ्रुत्वा शुभं वाक्यं पितामहसमीरितम् |
अङ्केनादाय वैदेहीमुत्पपात विभावसुः |
विधूयाथ चितां तां तु विअदेहीं हव्यवाहनः |
उत्तस्थौ मूर्तिमानाशु गृहीत्वा जनकात्मजाम् |
तरुणादित्यसंकाशां तप्तकाञ्चनभूषणाम् |
रक्ताम्बरधरां बालां नीलकुञ्चितमूर्धजाम् ||
अक्लिष्टमाल्याभरणां तथारूपामनिन्दिताम् |
ददौ रामाय वैदेहीमङ्के कृत्वा विभावसुः |


బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు విన్న తర్వాత అగ్నిదేవుడు సీతను తన స్వహస్తాలతో నేల మీదకి దించాడు.అగ్నిలో దూకడానికి ముందు ఆమె ధరించిన చీర గానీ అనసూయాదేవి ఇచ్చిన లేపనాలూ అలంకరణలూ గానీ చెక్కు చెదరకుండా రాముడి ముందు నిలబడి ఉంది!

अब्रवीत्तु तदा रामं साक्षी लोकस्य पावकः |
एषा ते राम वैदेही पापमस्यां न विद्यते |
नैव वाचा न मनसा नैव बुद्ध्या न चक्षुषा |
सुवृत्ता वृत्तशौण्डीर्यं न त्वामत्यचरच्छुभा |
रावणेनापनीतैषा वीर्योत्सिक्तेन रक्षसा |
त्वया विरहिता दीना विवशा निर्जनाद्वनात् |
रुद्ध चान्तःपुरे गुप्ता त्वच्चित्ता त्वत्परायणा |
रक्षिता राक्षसीभिश्च घोराभिर्घोरबुद्धिभिः |
प्रलोभ्यमाना विविधं तर्ज्यमाना च मैथिली |
नाचिन्तयत तद्रक्षस्त्वद्गतेनान्तरात्मना |
विशुद्धभावां निष्पापां प्रतिगृह्णीष्व मैथिलीम् |
न किंचिरभिधातव्या अहमाज्ञापयामि ते |
ततः प्रीतमना रामः श्रुत्वैवं वदतां वरः |
दध्यौ मुहूर्तं धर्मात्मा बाष्पव्याकुललोचनः |


ఇప్పుడు అగ్నిదేవుడు రామునితో ఇలా చెప్తున్నాడు,"ఈమె నీ సీతయే!ఆమెలో యే కళంకమూ లేదు.ఈమె నిత్యసౌశీల్యవతి.నీపట్ల ఎటువంటి అవిశ్వాసాన్నీ ప్రదర్శించలేదు.తను రావణుడిచే అపహరించబడింది.తన నివాసంలో కట్టుదిట్టమైన కాపలాతో బందీగా ఉంచబడింది.రాక్షసస్త్రీలు ఎన్నో ఆశలను చూపించారు, ఎంతగానో భయపెట్టారు.స్వయంగా రావణుడే ఆమెను చిత్రహింసలు పెట్టాడు.అయినా ఆమె నిన్నే మనస్సులో నిలుపుకున్నది.నిన్ను చూడడం కోసమే అన్ని కష్టాలనూ భరించింది.ఇంతటి పరుష వాక్యాతో బాధించక ఆమెని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను."

ఆ మాటలు విన్న రాముడు సంతోషంతో ముఖం విప్పారి ఇలా అంటున్నాడు:

एवमुक्तो महातेजा धृमानुरुविक्रमः |
उवाच त्रिदशश्रेष्ठं रामो धर्मभृतां वरः |
अवश्यं चापि लोकेषु सीता पावनमर्हति |
दीर्घकालोषिता हीयं रावणान्तःपुरे शुभा |
बालिशो बत कामात्म रामो दशरथात्मजः |
इति वक्ष्यति मां लोको जानकीमविशोध्य हि |
अनन्यहृदयां भक्तां मचत्तपरिवर्तिनीम् |
अहमप्यवगच्छामि मैथिलीं जनकात्मजाम् |
इमामपि विशालाक्षीं रक्षितां स्वेन तेजसा |
रावणो नातिवर्तेत वेल मिव महोदधिः |
प्रत्ययार्थं तु लोकानां त्रयाणाम् सत्यसंश्रयः |
उपेक्षे चापि वैदेहीं प्रविशन्तीं हुताशनम् |
न च शक्तः सुदुष्टत्मा मनसापि हि मैथिलीम् |
प्रधर्षयितुमप्राप्यां दीप्तामग्निशिखामिव |
नेय मर्हति चैश्वर्यं रावणान्तःपुरे शुभा |
अनन्या हि मया सीता भास्करेण प्रभा यथा |
विशुद्धा त्रिषु लोकेषु मैथिली जनकात्मजा |
न विहातुं मया शक्या कीर्तिरात्मवता यथा |
अवश्यं च मया कार्यं सर्वेषां वो वचो हितम् |
स्निग्धानां लोकनाथानामेवं च वदतां हितम् |
इत्येवमुक्त्वा विजयी महाबलः |
प्रशस्यमानह् स्वकृतेन कर्मणा |
समेत्य रामः प्रियया महायशाः |
सुखं सुखार्होऽनुबभूव राघवः |


రాముడు సీత ఎటువంటి పరిస్థితుల్లో రావణుడి లంకను చేరిందో ఎవరికీ తెలియదు గనక ప్రజలు ఆమె శీలాన్ని శంకిస్తారు గనకనే తాను ఆ విధంగా ప్రవర్తించానని చెప్పాడు.

నాకు తన స్వచ్చత గురించి తెలుసు.రావణుడైనా సరే తన అనుమతి లేకుండా తాకనైనా తాకలేడు.నిజానికి తను సంకల్పమమాతరంగానే రావణుణ్ణీ అతని పరివారాన్నీ లంకానగరాన్నె చుట్టూ ఉన్న సముద్రాన్నీ నాశనం చెయ్యగలిగినది!లోకమర్యాదను గౌరవించి తను తన సక్తిని చూపించలేదు.సూర్యుడికి కాంతి ఎలాగో నాకు సీత అలాగ!నేను మరోలా ప్రవర్తించి ఉంటే ప్రపంచమంతా "రాముడు కేవలం వ్యామోహంతోనే రావణుడు చెరబట్టిన సీతని ఏమాత్రం సందేహించకుండా స్వీకరించేశాడు" అని నిందలు మోపేది.ఇప్పుడు మీ అందరి ఆదేశం నాకు సంతృప్తిని కలిగించింది.నాకు ఇక ఏ సంకోచమూ లేదు.

రాముడి అనుమానం నిజమేనని ఎన్ని అగ్నిపరీక్షలు జరిగినా సీతని అవమానించి ఆనందించే అధములు పుడుతూనే ఉంటారని మళ్ళీ మళ్ళీ నిరూపితం అవుతూనే ఉన్నది.ఒక భయానకమైన అనుభవం ముగిసిపోయి ఇక అయోధ్యానగర మహారాణిగా సుఖసంతోషాలతో కలకాలం గడపటానికి కూడా  ప్రాప్తం లేకపోయింది సీతకి కేవలం రావణుడి అపహరణకి గురవటం వల్ల - మధ్యయుగాల నాటి రాజపుత్ర స్త్రీలు సతీసహగమనం వూరికే చేశారా!

ఒకరోజు రాముడు చారులని నగరంలో ఏమి జరుగుతున్నదో నివేదించమని కోరాడు.అప్పుడు భద్రుడనే చారుడు చెబుతున్నాడు:

हत्वा च रावणं युद्धे सीतामाहृत्य राघवः | 
अमर्षं पृष्ठतः कृत्वा स्ववेश्म पुनरानयत् ||
कीदृशं हृदये तस्य सीतासम्भोगजं सुखम् | 
अङ्कमारोप्य हि पुरा रावणेन बलाद्धृताम् ||
लङ्कामपि पुनर्नीतामशोकवनिकां गताम् | 
रक्षसां वशमापन्नां कथं रामो न कुत्सते ||
अस्माकमपि दारेषु सहनीयं भविष्यति | 
यथा हि कुरुते राजा प्रजा तमनुवर्तते ||
एवं बहुविधा वाचो वदन्ति पुरवासिनः | 
नगरेषु च सर्वेषु राजञ्जनपदेषु च ||


"రాముడు రావణుణ్ణి చంపి సీతని తెచ్చుకున్నాడు,అంతవరకు బాగానే ఉంది!కానీ,రావణుడు సీతని ఏమీ చెయ్యకుండా వదిలేశాదని రాముడు ఎట్లా అనుకున్నాడు?రావణుడు సీతని ముట్టుకున్నాడు,పట్టుకున్నాడు,ఇంట్లో పెట్టుకున్నాడు,ఇంతటి అందగత్తెని అంతటి కాముకుడు ఏమీ చెయ్యలేదంటే నమ్మాలా?అయినా రాముడు ఒక్క మాట మాట్లాడకుండా తెచ్చేసుకున్నాడు."యధా రాజా తధా ప్రజా!" అన్నట్టు మరి, మనం కూడా కొన్నాళ్ళు వేరేవాళ్లతో తిరిగిన మన పెళ్ళాల్ని కిక్కురుమనకుండా యేలుకోవాల్సిందేనా?" ఓ రాజా!ప్రతి గ్రామంలోనూ ఇవే మాటలు వినబడుతున్నాయి.

तस्यैतद्भाषितं श्रुत्वा राघवः परमार्तवत् | 
उवाच सर्वान्सुहृदः कथमेतन्निवेद्यताम् ||
सर्वे तु शिरसा भूमावभिवाद्य प्रणम्य च | 
प्रत्यूचू राघवं दीनमेवमेतन्न संशयः ||
श्रुत्वा तु वाक्यं काकुत्स्थः सर्वेषां समुदीरितम् | 
विसर्जयामास तदा सर्वांस्ताञ्शत्रुतापनः ||


భద్రుడు చెప్పినది విన్నాక రాముడు మిగిలిన చారులను కూడా ప్రతి గ్రామంలోనూ ఉందా అని అడిగాడు.వాళ్లు అవునని చెప్పలేక తలలు దించుకున్నారు.అప్పుడు రాముడు వాళ్లని ఎవరిళ్ళకి వారిని వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చాడు.(ఇది ఉత్తరకాండ 43వ సర్గ నుండి తీసుకున్న భాగం)

ఆ తర్వాత రాముడు తమ్ముళ్ళకికబురు పంపించాడు.వాళ్లు వచ్చేసర్కి కన్నీళ్ళతో నిండిన రాముడిముఖం గ్రహణం నాటి  చంద్రుడిలా ఉంది.అంత దుఃఖంలోనూ రాముడు వాళ్ళకి ఎదురేగి ఆసనాల్లో కూర్చందబెట్టి తను చెప్పేది శ్రద్ధగా వినమన్నాడు. (ఉత్తరకాండ 44వ సర్గ)

पौरापवादः सुमहांस्तथा जनपदस्य च | 
वर्तते मयि बीभत्सः स मे मर्माणि कृन्तति || ३||
अहं किल कुले जत इक्ष्वाकूणां महात्मनाम् | 
सीतां पापसमाचारामानयेयं कथं पुरे || ४||
जानासि हि यथा सौम्य दण्डके विजने वने | 
रावणेन हृता सीता स च विध्वंसितो मया || ५||
प्रत्यक्षं तव सौमित्रे देवनां हव्यवाहनः | 
अपापां मैथिलीमाह वायुश्चाकाशगोचरः || ६||
चन्द्रादित्यौ च शंसेते सुराणां संनिधौ पुरा | 
ऋषीणां चैव सर्वेषामपापां जनकात्मजाम् || ७||
एवं शुद्ध समाचारा देवगन्धर्वसंनिधौ | 
लङ्काद्वीपे महेन्द्रेण मम हस्ते निवेशिता || ८||
अन्तरात्मा च मे वेत्ति सीतां शुद्धां यशस्विनीम् | 
ततो गृहीत्वा वैदेहीमयोध्यामहमागतः || ९||
अयं तु मे महान्वादः शोकश्च हृदि वर्तते | 
पौरापवादः सुमहांस्तथा जनपदस्य च || १०||
अकीर्तिर्यस्य गीयेत लोके भूतस्य कस्य चित् | 
पतत्येवाधमाँल्लोकान्यावच्छब्दः स कीर्त्यते || ११||


ఓ లక్ష్మణా! నువ్వు మొత్తం ఎరుగుదువు నేను రావణుణ్ణి చంపి సీతను వెనక్కి తెచ్చుకున్నానని, కానీ అలా తెచ్చుకునే ముందు, ప్రజలు ఆమె శీలాన్ని శంకిస్తారని నాకు తెలుసు, కేవలం అందుకే, ఆమెను అగ్నిపరీక్షకు గురిచేశాను. ఆనాడు దివ్యపురుషులు అగ్నిదేవుడితో సహా ఆమె సౌశీల్యాన్ని మెచ్చుకుని నన్ను తనని స్వీకరించమని ఆజ్ఞాపించారు. వీటన్నిటికంటె, నా అంతరాత్మకు సీత మీద ఎటువంటి అనుమానమూ లేదు.అయినా,ప్రజలు మళ్ళీ మళ్ళీ మమ్మల్ని అవమానిస్తూనే ఉన్నారు.అపరిశుభ్రమైన చోట లక్ష్మీదేవి ఉండనట్టే ఏ రాణీ అయినా తనని సదా అనుమానించి ప్రశ్నించే ప్రజల మధ్య సంతోషంగా ఉండలేదు!

ఈ సమస్యకి రెండు రకాల పరిష్కారాలు ఉన్నాయి:

సీత మళ్ళీ పరీక్షకి సిద్ధం కావాలి.ఒకసారి జరిగింది కదా,ఆమె భర్తకి తెలుసు కదా అని సమర్ధించుకుంటే సరిపోదు.అది వాళ్లు చూడలేదు గనక నమ్మలేరు.పోనీ సీత నిరూపించుకోగలుగుతుంది గదాని సిద్ధపడితే ఆ ఉదాహరణ రాజ్యంలోని ఇతర స్త్రీలని ఇబ్బంది పెడుతుంది.

సీతని వదిలి వెయ్యాలి: సీతని అపవాదం నుంచి తప్పించడానికి ఇదే ఉత్తమమైన మార్గం లోకాపవాదం వల్ల కలిగే మనోవేదన నుంచి ఆమెను రక్షించడానికి.ఆమె ఇప్పుడు ఐదారు మాసాల గర్భిణి. ఈ సమయంలో భర్తకు దూరమయ్యే బాధను భరించడం కష్టమే, అయినా సీత మనోధైర్యం గొప్పది గనుక ఆమె తట్టుకోగలదు. ఇందులో కూడా ఒక ప్రమాదం ఉంది.దీన్ని ఉదాహరణగా తీసుకుని మిగిలినవాళ్లు తమ భార్యల్ని వెళ్ళగొట్టే అవకాశం ఉంది.కానీ రాజుగా నా విచక్షణను ఉపయోగించి ఆ స్త్రీలను కాపాడగలను.సీత విషయంలో మాత్రం నేను అలా చెయ్యలేను.

ఇప్పుడు సీతని వనంలో విడిచి వెళ్ళేటప్పుడు లక్షణుడు ఇలా చెబుతున్నాడు.
(47వ సర్గ)
वैदेह्या चोद्यमानस्तु लक्ष्मणो दीनचेतनः | 
अवाङ्मुखो बाष्पगलो वाक्यमेतदुवाच ह || १०||
श्रुत्वा परिषदो मध्ये अपवादं सुदारुणम् | 
पुरे जनपदे चैव त्वत्कृते जनकात्मजे || ११||
न तानि वचनीयानि मया देवि तवाग्रतः | 
यानि राज्ञा हृदि न्यस्तान्यमर्षः पृष्ठतः कृतः || १२||
सा त्वां त्यक्ता नृपतिना निर्दोषा मम संनिधौ | 
पौरापवाद भीतेन ग्राह्यं देवि न तेऽन्यथा || १३||
आश्रमान्तेषु च मया त्यक्तव्या त्वं भविष्यसि | 
राज्ञः शासनमाज्ञाय तवैवं किल दौर्हृदम् || १४||
तदेतज्जाह्नवीतीरे ब्रह्मर्षीणां तपोवनम् | 
पुण्यं च रमणीयं च मा विषादं कृथाः शुभे || १५||
राज्ञो दशरथस्यैष पितुर्मे मुनिपुङ्गवः | 
सखा परमको विप्रो वाल्मीकिः सुमहायशाः || १६||
पादच्छायामुपागम्य सुखमस्य महात्मनः | 
उपवासपरैकाग्रा वस त्वं जनकात्मजे || १७||


సీత నమ్మలేక నిలదీసినప్పుడు లక్ష్మణుదు ఏడవటం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయాడు.నగరంలోనూ జనపదాల్లోనూ నీ గురించి అపవాదం మొదలైంది.శ్రీరాముడే విని తట్టుకోలేకపోతున్నాడు.నాకు కూడా ఎక్కువ చెప్పలేదు.తనకి నీమీద ఎలాంటి అనుమానమూ లేదు.అది నాకూ తెలుసు.ప్రజాల్ ముందు నిన్ను శీలవతిగా నిలబెట్టి తను దోషరహితుడిగా నిలవటం కోసమే నిన్ను వదిలేస్తున్నాడు!నాకిచ్చిన ఆజ్ఞ దశరధునికి మిత్రుడైన ఈ వాల్మీకి మహాముని ఆశ్రమ సమీపంలో నిన్ను వదిలి రమ్మని.ఒకప్పుడు నువ్వు మునిజనసేవను గురించి పడిన ముచ్చటను గర్భిణితో ఉన్న భార్య కోరికను తీర్చే భర్త ఇచ్చే కానుకగా తీసుకోమన్నాడు.దుఃఖాన్ని తగ్గించుకుని ఋషిసేవ చేసి తరించు.

48వ సర్గ :
లక్ష్మణుడు చెప్పినది వినగానే సీత స్పృహ తప్పి పడిపోయింది.తిరిగి స్పృహలోకి వ్చ్చాక ఇలా అంటున్నది:
यथाज्ञां कुरु सौमित्रे त्यज मां दुःखभागिनीम् | 
निदेशे स्थीयतां राज्ञः शृणु चेदं वचो मम || ९||
श्वश्रूणामविशेषेण प्राञ्जलिः प्रग्रहेण च | 
शिरसा वन्द्य चरणौ कुशलं ब्रूहि पार्थिवम् || १०||
यथा भ्रातृषु वर्तेथास्तथा पौरेषु नित्यदा | 
परमो ह्येष धर्मः स्यादेषा कीर्तिरनुत्तमा || ११||
यत्त्वं पौरजनं राजन्धर्मेण समवाप्नुयाः | 
अहं तु नानुशोचामि स्वशरीरं नरर्षभ | 
यथापवादं पौराणां तथैव रघुनन्दन ||


నా తరపున మొదట ఆయనకు నమస్కారం చెప్పు,తర్వాత ఆయన ముగ్గురు తల్లులకీ నమస్కారాలు అందించు,,వారి యోగక్షేమాలు విచారించు,అప్పుడు ఆయనకు చెప్పు - ఈ సమస్యకి ఇదే పరిష్కారం అని తను అనుకుంటే, దీనివల్ల ప్రజలు నన్ను నమ్ముతారని భావిస్తే, నేను కూడా దీనిని సరైన పరిష్కారంగా ఒప్పుకుంటాను!ఏ జన్మలోనో ఏ జంటనో విడదీసి ఉంటాను,లేకుంటే ఇది నాకు సంప్రాప్తించే అవకాశం లేదు.ఇదివరకు,ఆయన పక్కన ఉన్నారు కాబట్టి, సంతోషంగా ఉందగలిగాను.ఇప్పుడు ఆయనతో గెంటించుకుని ఎట్లా సంతోషంగా ఉండగలను?ఈ భాగీరధిలో దూకి చచ్చే వీలు కూడా లేదు, అది ఆయన్ని నవ్వులపాలు చేస్తుంది.అది పుట్టినింటికీ మెట్టినింటికీ కీర్తికరం కాదు.నేను బహుశా భూమినుంచి పుట్టింది కష్టాలని భరించడానికే కాబోలు!

కొందరు భావించినట్టు వాల్మీకి సీతను రహస్యంగా ఉంచి కాపాడలేదు.ఆశ్రమవాసులకి ఆమె ఎవరో చెప్పాకనే తగిన సేవలు చెయ్యమని పురమాయించాడు.

तासां तद्वचनं श्रुत्वा वाल्मीकिरिदमब्रवीत् | 
सीतेयं समनुप्राप्ता पत्नी रामस्य धीमतः ||
स्नुषा दशरधस्यैषा जनकस्य सुता सती | 
अपापा पतिना त्यक्ता परिपाल्या मया सदा ||
इमां भवत्यः पश्यन्तु स्नेहेन परमेण ह | 
गौरवान्मम वाक्यस्य पूज्या वोऽस्तु विशेषतः ||

ఇక చివరి సన్నివేశమైన 96వ సర్గలో కూడ వాల్మీకి సీతను ప్రశంసించి తిరిగి స్వీకరించమని శ్రీరాముణ్ని కోరాడు.

97వ సర్గలో:
వాల్మీకి చెప్పినది విన్న శ్రీరాముడు ఇలా అంటున్నాడు:
वाल्मीकिनैवमुक्तस्तु राघवः प्रत्यभाषत | 
प्राञ्जलिर्जगतो मध्ये दृष्ट्वा तां देववर्णिनीम् || १||
एवमेतन्महाभाग यथा वदसि धर्मवित् | 
प्रत्ययो हि मम ब्रह्मंस्तव वाक्यैरकल्मषैः ||
प्रत्ययो हि पुरा दत्तो वैदेह्या सुरसंनिधौ | 
सेयं लोकभयाद्ब्रह्मन्नपापेत्यभिजानता | 
परित्यक्ता मया सीता तद्भवान्क्षन्तुमर्हति ||
जानामि चेमौ पुत्रौ मे यमजातौ कुशीलवौ | 
शुद्धायां जगतो मध्ये मैथिल्यां प्रीतिरस्तु मे ||
अभिप्रायं तु विज्ञाय रामस्य सुरसत्तमाः | 
पितामहं पुरस्कृत्य सर्व एव समागताः ||
आदित्या वसवो रुद्रा विश्वे देशा मरुद्गणाः | 
अश्विनावृषिगन्धर्वा अप्सराणां गणास्तथा | 
साध्याश्च देवाः सर्वे ते सर्वे च परमर्षयः ||


ఆర్యా!మీరు చెప్పినది నేను నమ్ముతున్నాను,సీత సౌశీల్యమూ తెలుసు,వీళ్ళు నా బిడ్డలేననీ ఎరుగుదును.అయినా,ప్రబుధర్మం ప్రకారం సీత ప్రజల ముందు తాన్ సౌశీల్యాన్ని నిరూపించుకోకుండా స్వీకరించలేను.

సీత ఈసారి చేసిన ప్రతిజ్ఞ భూకంపాన్ని సృష్టించి ఆమెను భూమాత ఒదిలోనికి చేర్చింది.రాజు దయాహీనుడైనప్పుడు ఆ రాజు చేత పాలించబడే భూమి యొక్క సారం తగ్గుతుందనే ఋషివాక్యాన్ని అక్కడి భూకంపం వల్ల నెర్రెలు విచ్చిన నేల నిజం చేసి చూపించింది.అయితే ఆ దయాహీనత్వం రాముడిది కాదు, అయోధ్యా నగర ప్రజలది!

అయోధ్యా నగర ప్రజలే కాదు,పాలితులు ఏ కాలంలోనైనా ఏ ప్రాంతంలోనైనా పాలకుల పట్ల క్రూరంగానే ఉంటారు.శ్రీరాముడి విషయమే తీసుకోండి - వనవాసం వెళ్తున్నప్పుడు మేమూ వస్తామన్నారు,వనవాసం ముగించుకుని రాగానే సంబరాలు చేసుకున్నారు,కొంచెం తప్పు దొరకగానే అపవాదంతో అవమానించారు.బహుశా సీత వనవాసినిగా ఉన్నప్పుడు తమతో పోల్చుకోవటం వల్ల పుట్టిన జాలి రాణివాసంలో ఉన్నప్పుడు పోల్చుకోవటం వల్ల ఈర్ష్యగా మారింది కాబోలు!"ఒక స్త్రీని, వేశ్య అయినా సరే, కంట కన్నీరు ఉబికేటట్టు ఎవరూ పరుషవాక్యాలతో అవమానించకూడదు!" ఆనె ఋషివాక్యాన్ని విస్మరించి అగ్నిపునీత సీతనే అవమానించారు అయోధ్యా నగర ప్రజలు!

“Let he who is innocent, cast the first stone.” అని క్రీస్తు అన్నాడు!మంచివాళ్లు అసలు రాళ్లు విసరనే విసరరు కదా,విసిరేవాళ్లు తాము పరిశుద్ధులమనే అహంతో ఉంటే మళ్ళీ మళ్ళీ విసురుతారు - అలా విసరడం వల్లనే తాము మంచివాళ్లమవుతామనే చావుతెలివి ఉంటే మరింత బలంగా విసురుతారు!రుజువు లేకుండా, కారణం లేకుండా, పశ్చాత్తాపం లేకుండా వాళ్ళు సీతని చెయ్యని తప్పుకి శిక్షించారు! రాముణ్ణి కూడా సీతకి సహాయం చెయ్యలేని నిస్సహాయ స్థితికి నెట్టేశారు.ఒకవేళ రాముడు సీతకి సహాయం చేస్తే పక్షపాత బుద్ధిని ఆపాదించడమనే మరొక దుర్మార్గం మొదలయ్యేది!

అసలు ఒక స్త్రీ శీలాన్ని శంకించడమే మహాపాపం!దానికి తోడు ఆమెని తన శీలాన్ని నిరూపించుకోమని ఒత్తిడి పెట్టడం మరీ క్రూరత్వం - అది మాతృనిందతో సమానమైన ఘోరమైన నేరం!సీతని దూషించే సాహసం సాధుసజ్జనుదు ఎవడూ చెయ్యడు - తనే స్వయాన దగుల్బాజీ అయితే తప్ప రాముణ్ణి దగుల్బాజీ అని యెవడూ అనలేడు!!

అసలు యుద్ధకాండలోని 115 నుంచి 118 సర్గలలో వర్ణించబడిన సీత అగ్నిప్రవేశం ప్రక్షిప్తమని కొందరు పండితులు ఎప్పటినుంచో చెబుతున్నారు.అది నిజమే కావచ్చు.ఇక్కడ తప్ప దేవతలు కధలో ప్రవేశించి సన్నివేశంలో పాత్రధారులై కధని నడిపించటం రామాయణం మొత్తంలో ఎక్కడా అరగదు!అసలు రామావతారం యొక్క ముఖ్యమైన ఉద్దేశమే ఏ విధమైన దైవత్వం లేకుండా మానవుల మధ్యన మానవుల వలె సంచరించి మానవులు అనుభవించే అన్ని కష్టనష్టాలనూ అనుభవిస్తున్నప్పటికీ అన్ని కష్టనష్టాలలో కూడా ధర్మాన్ని వదలకుండా నడుచుకోవటం ఎట్లా అనేదాన్ని మానవులకి చూపించడం కదా!ఈ దృష్టితో పరిశీలిస్తే పుత్రకామేష్ఠి వంటి చాలా ముఖ్యమైన సన్నివేశాలు ఎన్నో ప్రక్షిప్తాలే అవుతాయి!వీరి వాదన ప్రకారం, వాల్మీకి తర్వాత కాలపు పండితులు శ్రీరాముడి దైవత్వాన్ని నిరూపించే సదుద్దేశంతో చేసిన ప్రక్షిప్తం హిందూద్వేషులకి సీత కష్టాలకి తాము జాలిపడుతున్నట్టు నటిస్తూ ఆమె తరపున వకాల్తా తీసుకుని రాముణ్ణి పురుషాధిక్యత మూర్తీభవించిన దుర్మార్గుదని చిత్రీకరిస్తూ హిందువులను అవమానించడానికి పనికివస్తున్నది కాబట్టి వాటిని తొలగించడమే మార్గం.కానీ అది కుదురుతుందా!ద్వేషించేవాళ్ళు అప్పుడు ఇంకా రెచ్చిపోతారు.ఇప్పటి రూపంలో ఉన్న 24 వేల శ్లోకాలకీ వెయ్యేసి శ్లోకాలకి ఒకచోట శ్లోకం మొదటి అక్షరం స్థానంలో ఉన్న గాయత్రీ మంత్రంలోని అక్షరాలకీ సంబంధం ఉండటాన్ని బట్టి ప్రక్షిప్తాలని ఒప్పుకోవడం కూడా కష్టమే.ఇంతకీ దానివల్ల కలిగిన ధర్మతత్వనిరూపణం మంచిదే కదా!రాముడు సామాన్యుడే అయితే అసలు ఆ కష్టాలు వచ్చేవి కాదు,సామాన్యులకి ఆ పరీక్షలు ఎవరూ పెట్టరు.రాముడు, సీత ఇద్దరూ రాజవంశీయులు. రాజు ప్రజల ముందు సచ్చరిత్రుడిగా ఉండాలనే రాజనీతిని పాటించారు,కష్టాలని భరించారు,కీర్తిని పొందారు.సీత కోసం యేడుస్తున్నాం అంటూ సీతకి ఇష్టమైన రాముణ్ని తిట్టడం దేనికి?

శ్రీరాముడి నిజస్వరూపం తెలుసుకోవాలంటే వాల్మీకి రామయణం కనన్ తులసీదాసు రామచరితమానసం చదవాలి!భవిష్యోత్తర పురాణంలో పరమశివుడే తులసీదాసు వాల్మీకి యొక్క అవతారం అని చెప్పాడు!

वाल्मीकिस्तुलसीदासः कलौ देवि भविष्यति ।
रामचन्द्रकथामेतां भाषाबद्धां करिष्यति ॥
భవిష్యోత్తర పురాణం, ప్రతిసర్గ, 4.20వ సర్గ.


కలియుగంలో బ్రహ్మర్షి వాల్మీకి తులసీదాసు రూపంలో జన్మించి ప్రజలకి అర్ధమయ్యే తేలికైన భాషలో శ్రీరామచరీతమానసం రచించి శ్రీరాతత్వాన్ని గానం చేస్తాడు.అది శ్రీరాముని కధలలో సర్వశ్రేష్ఠమైనది అవుతుంది!

संभु कीन्ह यह चरित सुहावा। बहुरि कृपा करि उमहि सुनावा॥
सोइ सिव कागभुसुंडिहि दीन्हा। राम भगत अधिकारी चीन्हा॥2॥
भावार्थ:-शिवजी ने पहले इस सुहावने चरित्र को रचा, फिर कृपा करके पार्वतीजी को सुनाया। वही चरित्र शिवजी ने काकभुशुण्डिजी को रामभक्त और अधिकारी पहचानकर दिया


దివ్యమైన శ్రీరామచరితమానసం తొలిసారి పరమశివుని మనస్సులో ప్రబహ్వించింది.తొలి శ్రోత పార్వతీ దేవియే!దానిని మరల మరల తమ తమ పుణ్యవిశేషం చేత కాకభుశుండి వంటి పరమ భాగవతోత్తములు విన్నారు.తుదకు తులసీదాసు యొక్క అసమాన ప్రతిభ చేత సర్వులకూ తెలిసింది! 
ఇది శివ వాక్యం :
अति बिचित्र रघुपति चरित जानहिं परम सुजान।
जे मतिमंद बिमोह बस हृदयँ धरहिं कछु आन॥49॥


రఘురాముని లీలావినోదం అత్యద్భుతమైనది!అత్యున్నతమైన పాండిత్యం గలవారు మాత్రమే వాటిని గ్రహించగలరు.మూఢులు అజ్ఞానం చేత వాటికి విపరీతమైన అర్ధాలు తీసుకుంటారు.

निज भ्रम नहिं समुझहिं अग्यानी। प्रभु पर मोह धरहिं जड़ प्रानी॥
जथा गगन घन पटल निहारी। झाँपेउ भानु कहहिं कुबिचारी॥1॥
चितव जो लोचन अंगुलि लाएँ । प्रगट जुगल ससि तेहि के भाएँ ॥
उमा राम बिषइक अस मोहा । नभ तम धूम धूरि जिमि सोहा ॥
बिषय करन सुर जीव समेता । सकल एक तें एक सचेता ॥
सब कर परम प्रकासक जोई । राम अनादि अवधपति सोई ॥
जगत प्रकास्य प्रकासक रामू । मायाधीस ग्यान गुन धामू ॥
जासु सत्यता तें जड़ माया । भास सत्य इव मोह सहाया ॥


“మూర్ఖులు తమ అజ్ఞానాన్ని తెలుసుకోలేరు; తమ అజ్ఞానాన్ని తొలగంచుకోవటానికి బదులు, శ్రీరాముడికే కళంకాన్ని ఆపాదిస్తారు. వీరి ధోరణి మేఘావృతమైన ఆకాశాన్ని చూసి మేఘాల చాటున దాక్కున్న సూర్యుడు అసమర్ధుడని వాదిస్తారు.కంటిని వేలితో నొక్కి చూస్తే ఇద్దరు చంద్రులు కనబడతారు, వేలిని తీస్తే ఒక్క చంద్రుడే కనబడతాడు.

P.S:తమ లోపాల్ని తొలగించుకోవటానికి బదులు ఇతరులకి లోపాల్ని ఆపాదించి ఆనందపడే అజ్ఞానులని వారి కంటినెప్పికి వారిని వదిలివెయ్యదమే ఉత్తమమని దీని అర్ధం - శివవాక్యం తు కర్తవ్యం!ఇటువంటి పనుల వల్ల పాప్యులారిటీని కోరుకునేవారికి ఇటువంటి పనుల వల్ల పాప్యులారిటీ రాకుండా చెయ్యడమే ఉత్తమమైన మార్గం!

5 comments:

  1. ఓ అజ్ఞాత4 July 2018 at 08:38

    మనోడికీ కావల్సింది పబ్లిసిటీ, ఈ మధ్య టీవీల్లో, పేపర్లలో కనపడి చాలాకాలం అయ్యింది కదా, అందుకే ఇది.
    మీరంతా ఇలా ప్రతిస్పందించడం గట్రానే వాడికి కావల్సింది. కాకపోతే మరీ పబ్లిసిటీకి కక్కుర్తి పడితే తనకే నష్టం. జగనన్న చుట్టూ తిరుగుతున్నాడు కదా, కళ్యాణ్ మీదో, చంద్రబాబు మీదో ఇలాంటివి చేస్తే ఎదోక పదవో, ఎక్కడో ఒక సీటో ఇచ్చేవాడు. ఇలాంటి వాటివలన అవి దూరం అవుతాయి.
    ఐనా ఏమో మరి చెప్పలేము, ఎక్కడో ఏదో లాభం ఉండే ఉంటుంది, జగన్నన్న సీట్ ఇవ్వనన్నాడెమో, లేదా జగనన్న పదవిలోకి వచ్చేదాకా ఆగలేకున్నాడేమో? తనకే తెలియాలి.

    ఒకప్పుడు బ్లాగుల్లో వీడి పిచ్చిరాతలు, ఆ మలక్స్పేట వీడ్ని రెచ్చగొట్టించి మరీ తిట్టించుకోవడం, మళ్ళీ మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని వీళ్ళ బ్యాచ్ నెలలు తరబడి ఏడవడం, ఇద్దరికీ బాగా టైం పాస్ అయ్యేది. వీడు సినిమాళ్ళోకి పొయ్యాక ఆ ప్రవీణ్ గాడ్ని పట్టుకొని, ఆ మలక్స్పేట వాడ్ని రెచ్చగొట్టించి, వాడి చేత మలక్స్పేట వాళ్ళమ్మని ఏదోకటి అనిపించుకోవడం ఆ తరువాత మళ్ళీ ఒక నెల ఏడుపు టపాలు, మళ్ళీ ప్రవీణ్ణి కెలకడం, ఇదే పని. అలా తల్లిని తిట్టీంచుకోవడం ఏమి సునకానందమో.
    ఇప్పుడు కత్తికి కావల్సింది ఆ మలక్స్పేట బ్యాచ్ లాంటి బ్యాచ్. దొరికిందా, ఇంక తెలుగు ఛానెళ్ళు అన్నీ కంపెత్తిపోవాల్సిందే. ఈ ధౌర్భ్యాగ్యం ఇంతటిలో ఆగితే చాలు బాబు.


    ReplyDelete
  2. Haha, guess somebody started crying here.

    పై అజ్ఞాతకి

    తిక్క సన్నాసీ, తల్లులని తిట్టింది కత్తి గాడు కాదు ప్రవీణ్ గాడు. కత్తిగాడికి మలక్పేట గ్యాంగు రంగు పడెలా చేసాకే ఫేస్ బుక్కుకి వెళ్ళిపోయాడు. పోయి ఆ పోస్టులు చదువుకుని రా పో.

    ReplyDelete
  3. హెచ్చరికో హెచ్చరిక!

    కత్తి మహేష్ అను హిందూమతద్వేషికి పట్టిన గతే భండారు వారి బ్లాగు దగ్గిర "తెలుగులో మంత్రాలు సెప్పిచ్చు!" అని పుచ్చుతెలుగులో కూసిన అనామకులకీ పట్టడం ఖాయం - ముసుగు తీసి ఎదురెదురు నిలబడి వాగితే!

    మన పెద్దలు గురువుల్లో రెండు రకాలని చెప్పారు - బోధ గురువులు,బాధ గురువులు.మొదటి రకం వాళ్లు చక్కగా పక్కన కూర్చోబెట్టుకుని వాత్సల్యంతో నేర్పితే రెండో రకం వాళ్ళు మనల్ని బాధ పెట్టీ విసిగించీ కోపం తెప్పించీ పట్టుదలని పెంచీ అమూల్యమైన జీవితపాఠాల్ని అతి తక్కువ కాలంలో నేర్పి మనల్ని మరింత ధృఢంగా తయారుచేస్తారు.

    నిజానికి కత్తి మహేష్,కేతన్, బ్లూకేక్ లాంటివాళ్లకి హిందువులు కృతజ్ఞతలు చెప్పాలి!నాలాంటివాడు మీరు కక్కుతున్న విషం వల్లనేరా హిందువులు ఒక్కటి అవుతున్నది అని పదే పదే చెప్తున్నా వినకుండా మళ్ళీ మళ్ళీ హిందూమతం మీద విషాన్ని కక్కుతూ హిందువుల్లో ఐకమత్యాన్ని పెంచుతున్నందుకు నండుమనస్సుతో ధన్యవాదాలు చెప్పాలి!

    హిందువులారా పారా హుషార్, హోషియార్!

    ReplyDelete
  4. 1. Missed the above comments lol ...

    2. బోధ గురువులు vs బాధ గురువులు - Intereting, Haribabu garu

    ReplyDelete
  5. https://www.pgurus.com/sitaram-led-cpim-to-observe-ramayan-month-in-kerala/
    On the surface, it appears as though a lot is changing after Sitaram Yechury became the Communist Party of India-Marxist (CPI(M)) General Secretary. In the only state that the party is in power, the Kerala state committee decided to observe Ramayan month from July 17! The party is conducting a convention on July 25th on Ramayan and the decided to go to the booth level observing Ramayan month by taking classes on Ramayan. The party’s student wing Student Federation of India (SFI)’s former President and now party’s state committee member Shivadasan has been given charge of this surprising mission.

    As per the reports in Malayalam media, the party will assign teachers and Sanskrit experts to conduct classes across the state to explain and debate on Ramayana. For the past three years, CPI(M) has been conducting rallies across the state on Sri Krishna Jayanthi. All these attempts were done by the Left party which once preached atheistic philosophy to prevent the growth of RSS, which grew in the state through Sri Krishna Jayanthi rallies for the past five decades.

    For the past few months, the CPI(M)’s ideological leaders were recruiting and finding Sanskrit teachers for this purpose. The party’s state committee member and former SFI President Shivadasan was coordinating with CPI(M) teachers wing on how to conduct Ramayan Month and daily reading of Ramayan and explaining the contents to the common public in Malayalam language. There are debates going on inside the party to present different versions of Ramayan.

    Till the 1980s, the CPI(M) card holding members were not allowed to visit temples. However, in those days the leaders’ wives used to go including the party General Secretary EMS Nampoothripad’s wife Arya Antharjanam. Slowly leaders also used to visit temples and offer prayers. Then the party found that RSS and Congress leaders are heading the temple committees and changed the rule that the party members should also enter into temple committees. This was after a long debate that temples are the mass point areas and party should enter into these points.

    In Kerala, mid July to mid August is observed as Ramayan Month and in all temples and in Hindu homes Ramayan is recited in the evenings. Elder people will recite Ramayan on all days and explain the content in Malayalam language to younger generations. Now CPI(M) has found that this is a mass programme and wanted to enter into this arena too. According to party insiders, the CPI(M) is planning to launch this project through some of their frontal organisations.

    Recently after conducting annual Sri Krishna Jayanthi rallies, the party also found good catch words for Lord Shri Krishna. Red banners were used to put pictures of Lord Sri Krishna and even depicted him as a mass Yadav leader and even called him a revolutionary leader of shepherd community!!!

    The Left party is planning to give apt slogans on this Ramayan month project. Whether they will at last shout Jai Shri Ram at last is to be wait and watch.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...