Saturday, 28 July 2018

సమూహం పెట్టిన నియమాల్ని స్వసుఖం కోసం ధిక్కరిస్తే నువ్వూ ఒక జంతువువే కదా - మానవుడా!ఓ మానవుడా!!

మానవుడా!ఓ మానవుడా!!
రెండు కాళ్ళ మీద నిలబడి నడుస్తున్నా
నువ్వూ ఒక జంతువువే కదా - 
మానవుడా!ఓ మానవుడా!!

మానవుడా!ఓ మానవుడా!!
రెండు చేతుల్తో పనిముట్లని వాడుతున్నా
నువ్వూ ఒక జంతువువే కదా - 
మానవుడా!ఓ మానవుడా!!

మానవుడా!ఓ మానవుడా!!
రెండు చెవుల్తో విని ఒక్క నోటితో మాట్లాడుతున్నా
నువ్వూ ఒక జంతువువే కదా - 
మానవుడా!ఓ మానవుడా!!

మానవుడా!ఓ మానవుడా!!
తిండిని కుండలో దాచుకుని గుర్తుంచుకు తింటున్నా
నువ్వూ ఒక జంతువువే కదా - 
మానవుడా!ఓ మానవుడా!!

మానవుడా!ఓ మానవుడా!!
దాచుకున్న సొత్తుకి కాపలా కోసం ఇంటిని కట్టుకున్నా
నువ్వూ ఒక జంతువువే కదా - 
మానవుడా!ఓ మానవుడా!!

మానవుడా!ఓ మానవుడా!!
స్వార్జితాన్ని వారసత్వ హక్కుగా చేస్తూ పెళ్ళిని కనిపెట్టినా
నువ్వూ ఒక జంతువువే కదా - 
మానవుడా!ఓ మానవుడా!!

మానవుడా!ఓ మానవుడా!!
సంపద కోసం పోటీలో భద్రత కోసం నీతులు రాసుకున్నా
నువ్వూ ఒక జంతువువే కదా - 
మానవుడా!ఓ మానవుడా!!

మానవుడా!ఓ మానవుడా!!
సమూహం పెట్టిన నియమాల్ని స్వసుఖం కోసం ధిక్కరిస్తావేం
నువ్వూ ఒక జంతువువే కదా - 
మానవుడా!ఓ మానవుడా!!

మానవుడా!ఓ మానవుడా!!
ప్రకృతిలో భాగమైన నువు సంస్కృతిని నిర్మించుకున్నావు గానీ
నువ్వూ ఒక జంతువువే కదా - 
మానవుడా!ఓ మానవుడా!!

11 comments:

  1. Excellent poem combining difficult concepts like evolution, social contract, rule of law & property, hats off to Haribabu!

    ReplyDelete
    Replies
    1. Thank you Jai!
      Generally you put yourself away from poetic stuff - appraisal from you is great!

      Do you know how I got this Idea?When I am reading a technical stuff about arigin of human beings more than 2,5,7 lakhs of years,suddenlt first two lines came into me as a flash!

      Actually "మానవుడా!ఓ మానవుడా!!" is taken from Sri Sri,but by duplicating it before and after each main idea I have avoided plagiarism.

      Once again Thanks!

      Delete
    2. ఒక్క చిన్న పేజీలో ఇన్ని క్లిష్టమయిన విషయాలు చెప్పడం ఒక ఎత్తు. వాటిని మనసుకు హత్తుకొనే మాటలతో తేలిగ్గా అర్ధమయేటట్టుగా కూర్చడం బంగారానికి గుబాళింపు వచ్చింది. Really a great piece of work!

      నేను ఇప్పుడిప్పుడే డార్విన్ థియరీ గురించి కొంత కొంత తెలుసుకోవడం మొదలు పెట్టాను. నా ఈ అభ్యాస ప్రక్రియకు మీరు ఈ కవిత్వం ద్వారా దారి చూపించారు. Thanks a lot.

      Delete

  2. గేంది భై గిట్ల పాటల్లోకి పోయుర్రి ?


    జిలేబి

    ReplyDelete
  3. స్వార్జితాన్ని వారసత్వ హక్కుగా చేస్తూ పెళ్ళిని కనిపెట్టినా

    ఆస్థి కోసం కాదండి పెళ్ళి. అది ఇప్పటి పెట్టుబడిదారి వ్యవస్థలో అలా అనిపించవచ్చు. పెళ్ళి, పిల్లలు అనేవి వృధాప్యంలో ఎవరైనా చూడటానికి, ఆ రోజుల్లో ఓల్డ్ ఏజ్ హోంస్ లేవు. మగవాళ్ళ కన్నా ఆడవారు ఎక్కువ కాలం బ్రతుకుతారు. వాళ్ళ కోసం ఎదో ఒకటి సంపాదించి ఇచ్చి పోయేవారు.

    ReplyDelete
    Replies
    1. @UG SriRam
      పెళ్ళి, పిల్లలు అనేవి వృధాప్యంలో ఎవరైనా చూడటానికి, ఆ రోజుల్లో ఓల్డ్ ఏజ్ హోంస్ లేవు.

      hari.S.babu
      మీరు పొరపాటు పడుతున్నారు.వానప్రస్థం అనే మాట ఉంది కదా!దాని అర్ధం ఏమిటి?ముసలివాళ్ళయ్యాక పిల్లలతో సేవలు చేయించుకోవాలని అనుకోవటమే సంప్రదాయ విరుద్ధమైన విషయం!ఎప్పుడైతే కుటుంబపెద్ద పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి ఇంక చాలు అనుకున్నాడో ఆ క్షణమే దంపతులిద్దరూ అరణ్యాల దారి పట్టేవాళ్ళు - అప్పటికే గురువులు ఉంటే వారి ఆశ్రమంలోనో లేదంటే కొత్తగా ఏర్పాటు చేసుకునో దైవచింతనలో కాలం గడుపుతూ ఉండేవాళ్ళు.

      మీరు సహజమనుకుంటూ ఇవ్వాళ నడుస్తున్న పిల్లలతో సేవలు చేయించుకుంటూ గడపటమూ సరిగ్గా చూట్టం లేదని కోర్టులకి కూడా వెళ్ళడమే తప్పు!వినగానే క్రూరంగా అనిపించవచ్చు.కానీ సమస్య మూలానికి వెళ్ళి చూస్తే నేనెందుకలా అంటున్నానో అర్ధమవుతుంది.ఎందుకంటే, వీళ్ళని చూట్టం లేదని విసుకుంటున్నవాళ్ళ వయస్సు ఎంత?వాళ్ళకి పిల్లలు లేరా?ఆ పిల్లలు ఏ వయస్సులో ఉన్నారు?తమ పిల్లల్ని పోషించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయాన్నీ వాళ్ళకోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బునీ వీళ్ళ కోసం కూడా ఖర్చుపెట్టటం రెట్టింపు కష్టం కాదా!

      పిత్రార్జితాలు ఉండి బాగా కూడబెడితే అటు తల్లిదండ్రుల్నీ ఇటు పిల్లల్నే కాదు అత్త మామల్ని కూడా తెచ్చి నెత్తిన పెట్టుకోవచ్చు! కానీ కొడుకులు పిల్లల్ని చూసుకోవాల్సిన బరువుని మోస్తుంటే ముసలాళ్ళు మమ్మల్ని చూట్టం లేదని అనటం ముమ్మాటికీ తప్పే!

      వివాహం యొక్క ముఖ్యమైన ఉద్దేశమే వారసత్వం హిందూ మత గ్రంధాల ప్రకారం కూడా.వంశం అంతరించి పోకూడదు అంతే అప్పటి వరకు సంపాదించినది అనామకులకి వెళ్ళకూడదనే కదా!

      Delete
    2. హరిబాబు గారూ,

      వానప్రస్థం అన్నది సార్వత్రికనియమం కాదు. అది వైరాగ్యనిష్ఠగల ముముక్షువులకేను.

      పూర్వం ఇప్పటిలాగా చిన్నిచిన్ని కుటుంబాలు కాక ఉమ్మడికుటుంబాలు హెచ్చు. అలాగే ఇప్పటిలాగా ఇన్ని ఉద్యోగాదులూ లేవు - కులవృత్తులూ వ్యవసాయమూ - గ్రామజీవనమూ హెచ్చుభాగం ప్రజలది. అందుచేత అన్ని కుటుంబాల్లోనూ మూడు నాలుగుతరాల వాళ్ళు ఉండటమూ అందరినీ కుటుంబం సమానంగా తగినట్లు అదరించటమూ ఉండేది.

      రోజులు మారి ఇప్పటికి రెండవబిడ్డ వద్దు -చదువు చెప్పించలేము కదా అన్నట్లుగా దిగజారింది ఆధునిక నాగరిక జీవనం. ఇంక ముసలివాళ్ళకు ఆదరణా పోషణా ఎలా లభిస్తాయి లెండి. అందుకే వృధ్ధాశ్రమాల సంస్కృతి మొదలయ్యింది. ఆ వృధ్ధాశ్రమాల్లోనూ జేర్పించటానికి తాహతులేక అమానుషంగా వృధ్ధులనుఅక్షరాలా బయటకు నెట్టేసే దారణమైన రోజులూ వచ్చాయి, చూదాం ముందేమి రానున్నదో.

      ప్రస్తుతానికి నేటి సంపాదనాపరు లంతా ముందుముందు తమకు వృధ్ధాశ్రమాల్లో సేదతీరటానికి అవసరమైనంత సొమ్మును విడిగా దాచుకొనక తప్పదు.

      యావద్విత్తోపార్జన సక్తః
      తావన్నిజ పరివారో రక్తః।
      పశ్చాజ్జీవతి జర్జర దేహే
      వార్తాం కోపి న పృఛ్ఛతి గేహే॥

      Delete
  4. సార్ మగ వాళ్ల కన్నా ఆడవారు ఎక్కువ కాలం బ్రతికి ఇంకా కష్టపడుతూనే ఉంటారు పాపం.

    ReplyDelete
  5. సార్ బాగుంది పోయెమ్.వివాహం ముఖ్య ఉద్దేశ్యం వంశాన్ని కొనసాగించడమే..
    మానవుడా అంటే కేవలం పురుషుడేనా?పురుషుడు,స్త్రీ ఇద్దరిని ఉద్దెశించినట్లూ అనుకోకూడదా...సార్ తెలీకనే అడుగుతున్నా..

    ReplyDelete
    Replies
    1. Yes,The word is generic and applies to both men and women,Thanks for the positive openion!

      Delete
  6. శ్రీనివాసుడు గారూ,

    మీరిచ్చిన లింక్ పోస్ట్ మాత్రమే వస్తోది నను లాగిన్ అవకపోతే.నేను లాగిన్ అయ్యి ఆ లింకుకి వెళ్తే Sorry, this content isn't available right now అని వస్తోంది.కాబట్టి నేను కామెంట్ల ద్వారా జరుగుతున్న చర్చలో ప్రవేశించడం కుదరదం లేదు.భగవంతుడు అన్న పదం చుట్టూ అల్లిన పోష్టులో నా కామెంట్లకి అతనిచ్చిన రెస్పాన్స్ చూశాక వాడొక సంస్కారం లేని నికృష్టుడు అని తెలిసిపోయింది.మొదట్లో వాడు చెప్పిన థాంక్ యూలు వ్యంగ్యం అని నాకు తెలిసిందని వాడికీ తెలిసిపోయింది.వాడు నాతో చర్చించనని అన్నది ఆ కొన్ని కామెంట్లలోనూ నా గురుంచి తెలియదం వల్ల కాదా?దద్దమ్మల్ అముందు రెచ్చిపోయి తెలివైనవాళ్ళ ముందు తోక ముడిచే కుక్కలతో నేను వాదనకి దిగను సార్!

    దళితులు తాగి చెడిపోతున్నారని అంటూనే మళ్ళీ హీరో కల్లు మన కల్చర్ అంటే మెచ్చుకోవదంలోనే తెలుస్తుంది ఆ బుర్ర ఒక చవిటిపర్ర అని.ఇలాంటివాళ్ళు మాటలకి లొంగరు సార్!రజనీయే మరో సినిమాలో అంటాడు "శిశువా,కొందరు చెబితే వింటారు,కొందరు తంతే వింటారు!" అని - వీళ్ళు ఆ తైపు.

    మీరూ పట్టించుకోకుండా ఉంతేనే మంచిది.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...