Monday, 2 July 2018

అంతా తెలిసిపోయింబని అనుకునంటున్నప్పుడే అసలు నాకేమీ తెలియదని అపించడం ఎందుకో!

ఎందుకో?
అంతా తెలిసిపోయింబని అనుకునంటున్నప్పుడే
అసలు నాకేమీ తెలియదని అనిపించడం ఎందుకో!

ఎందుకో?
అందరూ డబ్బుకోసమే చేరారని తెలిసి కూడా
అందర్నీ ఆత్మబంధువులని మోసపోవడం ఎందుకో!

ఎందుకో?
డబ్బుతో కొనలేనివి ఉన్నాయని తెలిసి కూడా
డబ్బుతోనే అన్నింటినీ కొనడం కోసం వెంపర్లాట ఎందుకో!

ఎందుకో?
ద్వేషాన్ని విత్తితే ద్వేషమే కాస్తుందని తెలిసి కూడా
ద్వేషాలు పెంచుకుని మళ్ళీ మళ్ళీ నాశనమైపోవడం ఎందుకో!

ఎందుకో?
తమలోని అజ్ఞానాన్ని తొలగించుకోకుండా
తమ కష్టాలకి ఇతరుల్ని నిందించడం ఎందుకో!

ఎందుకో?
అసలు నాకేమీ తెలియదని తెలిశాక కూడా
అంతా నాకే తెలుసునన్న అహంకారం ఎందుకో!

ఎందుకో?
అంతా మిధ్య అని తెలిశాక కూడా
అన్నింటి మీద మోహం పెరగడం ఎందుకో!

ఎందుకో?
ఎందుకో!

7 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. How Nice a Revenge?
      no Words to Applaud!

      Delete
    2. రివెంజా? ఎంత మాట !
      నాకంత సీన్ లేదు !
      మీ కవిత్వం చూసిన తరువాత అలాంటివే ఇంకో నాలుగైదు యాడ్ చేసి, నేనూ కవినే అన్న బిల్డప్ ఇద్దామన్న దురద తప్ప మరేమీలేదు.

      Delete
    3. భలేవారే!
      ఎక్కద కొట్టాలో అక్కడ కొట్టారు!హాలా బాగా చెప్పారు!
      మీరూ కవే - రెచ్చిపొండి!

      Delete
  2. కాంగ్రెస్ పార్టీకి సంబందించినవి తప్ప మరే వాటికి రెస్పాండ్ కాకూడదు అన్న నియమాన్ని (నాకు నేను పెట్టుకున్నది) ఉల్లంఘించిన మీదట, కాస్త సెల్ఫ్ కంట్రోల్ తెచ్చుకునే వరకూ కొంత కాలం మౌనం.

    ReplyDelete
    Replies
    1. మనిద్ద్దరి మధ్యన జరిగిన వాదన చాలా బాగుంది సార్!బ్లాగుల్లో ఈ మధ్యకాలంలో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం తప్ప ఇంత మంచి చర్చ జరగలేదు - నిజం!మీరు కాంగ్రెసు పార్టీని సమర్ధించిన తీరు నాకు నచ్చింది. ఇంకో నాలుగు చర్చలు ఇలాంటివి పడితే బ్లాగులు మళ్ళీ కళకళలాడుతాయి.మొత్తానికి మీరు నాలోని కాంగ్రెసు ద్వేషాన్ని కొంత తగ్గించారు - ధాంక్స్!

      Delete
    2. https://m.facebook.com/story.php?story_fbid=190602068304421&id=100020638864721

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...