Saturday, 14 July 2018

"రామాయణం మనకి ఎలా ఆదర్శం?" అనేది మనం కత్తి మహష్ లాంటి దగుల్బాజీల నుంచి నేర్చుకోవాలా!

     మొట్టమొదట అందరూ తెలుసుకోవాల్సిన విషయం కత్తి మహేష్ దగ్గిర్నుంచి ఇక్కడి అనామక వ్యాఖ్యాత వరకు ఎవరూ రామాయణం చదవ లేదు!

     వాలి వధ చెట్టు చాటు నుంచి దొంగఛాటుగా చెయ్యలేదు.ధనుష్ఠంకారం చేసుకుంటూ బయటికి వచ్చి యుద్ధం అపి చూస్తున్న వాలి గుండెల మీద బాణం నాటాడు.ఈ కుపండితులు రామాయణం చదవలేదు గాబట్టి చెట్టు చాటు నుంచి చంపటం అనే ఆ ఒక్క డౌటునే పట్టుకుని వేళ్ళాడుతున్నారు గానీ సాక్షాత్తూ వాలియే ఎన్నో ప్రశ్నలు వేస్తాడు "నన్నెందుకు చంపావు?" అంటూ.రాముడు అన్నింటికీ జవాబులు చెప్పాకనే నోరు మూసుకుని చచ్చాడు వాలి!

     riddles of rama పుస్తకంలో అంబేద్కర్ వాదన కూడా హుందాగా లేదు!రాముడు అక్రమసంతానం అయి వుండవచ్చు అనేలా మొదలుపెట్టాడు.దీని అర్ధం యేమిటి?రాముడు అక్రమసంతానం అయితే అవుగాక. దానికీ అతడి సుగుణాలకి గానీ దుర్గుణాలకి గానీ ఆ పుట్టుక కారణం అని అంబేద్కర్ చెబుతున్నట్టా?పుట్టుకని బట్టి ఆధిక్యత తెచ్చుకున్నారు అని బ్రాహ్మణుల్ని విమర్శించే అంబేద్కర్ రాముడిని అక్రమసంతానం అని ముద్రవేసి యేమి సాధించుదామని అనుకున్నాడు?ఆలోచించండి!

     కొంచెం హుందా అయిన భాషలో చేసినప్పటికీ అంబేద్కర్ విమర్శ కూడా నిష్పక్షపాతమైనది కాదు!ఒకరు చదవమంటే చదువుదామని ఈ భాగం తర్వాత ఆపేశాను గాబట్టి తర్వాత అంబేద్కర్ యేమి విశ్లేషణలు చేశాడో నాకు తెలియదు.

     ఇంక యుద్ధకాండలో వచ్చే అగ్నిప్రవేశం గురించి నేను చాలా వివరంగా చర్చించి ఉన్నాను.అంత పెద్ద విశ్లేషణ ఇప్పుడు అనవసరం. దానికీ ఉత్తర రామాయణంలోని సీతా పరిత్యాగానికి ఉన్న సంబంధం వల్ల ఆ సన్నివేశం ప్రక్షిప్తమని పండితులు అంటున్నారు.ఆ మొత్తం సన్నివేశం రెండు సర్గలలో ముగిసిపోతుంది.ఆ రెండు సర్గలలో వాల్మీకి రచనా సంవిధానానికి భిన్నమైన ఒక వింత కనబడుతుంది!ఆ సన్నివేశంలో దేవతలు/దివ్యపురుషులు కనబడి రాముణ్ణి దేవాధిదేవుడిగా కీర్తించటం జరుగుతంది - ఇది రావణ సంహారం కోసం అవసరమైన మానవత్వానికీ వాల్మీకి మిగతా అన్నిచోట్లా మానవుడిగానే చూపించటానికీ పూర్తి విరుద్ధం!కాబట్టి ఇది ఉత్తర రామాయణం రాసిన తర్వాత దానికి సంబంధం కలపటం కోసం ఇరికించినది అని కొందరు పండితుల వాదన!అయితే, అప్పుడు 24,000 శ్లోకాలలో వెయ్యింటికి ఒకచోట గాయత్రీ మంత్రాక్షరాలు వచ్చే లెక్కని ఎలా తేల్చాలి ఆనే అనుమానం నాకే వస్తున్నది!అది వాల్మీకి ముందుగానే ప్లాన్ చేసుకుని రాస్తే జరిగిందా లేక ఆ లెక్కని చూపించటం కోసం ఇతరులు ప్రక్షిప్తాలని చేర్చారా?దానికి జవాబు చెప్పడం అసాధ్యం!!

     అవి ప్రక్షిప్తాలా మొత్తం రామకధలో అంతర్భాగాలా అన్నదానితో సంబంధం లేకుండానే యుద్ధకాండలోనూ ఉత్తర రామాయణంలోనూ రాముడి ప్రవర్తనలో ఏ దోషమూ లేదని చెప్పవచ్చును!ఇక్కడ రాముడిలో తప్పులు పడుతున్నవారిలో ఏవరూ అలాంటి నిజదారాహరణం లాంటి ఘాతుకం తమకి జరిగితే రాముడు చేసినట్టు చెయ్యనక్కరలేదు - ఎటూ మిత్రుడు కత్తి మహేష్ సలహా ఇచ్చినట్టు భార్యల్ని తిరిగి తెచ్చుకోవటానికి యుద్ధాలూ గట్రా చెయ్యకుండా వారి భార్యలకి అక్కడే ఉండి సుఖపడమని వార్త పంపిస్తే సరిపోతుంది. వారి భార్యలకీ సంతోషం కలిగించినట్లవుతుంది.రాముడు రాజు,రాజధర్మం అట్లాగె ఉంటుంది.ఇవ్వాళ మంత్రుల మీద ఆరోపణలు వస్తే రాజీనామా చెయ్యమని గోల చెయ్యడం లేదా?కారణం యేమిటి?ప్రభుత్వం నడపాలని అనుకున్నవాడు దేనికైనా సిద్ధపదాలి, ప్రజల విశ్వాసం పొందడం ముఖ్యం అనేది వీటన్నిటికీ మూలకారణం!ఆరోపనలు బలమైనవి అని తెలుస్తున్నా పదవిని పట్టుకుని వేళ్లాడుతూ రాజీనామా చెయ్యనివాళ్లని దాని గురించి ఉతికి ఆరెయ్యని వాడు ఎవదన్నా ఉన్నాదా ఇప్పుడు రాముణ్ణి విమర్శిస్తున్నవారితో సహా?ఇప్పుడు నా బ్లాగులోని కొత్త పోష్టులో రామాయణం మూలప్రతినుంచి శ్లోకాలు ఎత్తి రాశాను.వాటి ప్రతిపదార్ధ తాత్పర్యాలు కావాలనే వదిలేశాను.సంస్కృతం నేర్చుకుని వాటిలో సీతని రాముడు అనుమానించి వెళ్ళగొట్టినట్టు ఉన్నదేమో చెప్పమనండి ఇక్కడి అనామకం గారిని!

     ఇంకా ప్రజల ఉద్దేశాల్ని చెప్పేవి చూస్తే వాళ్లు సీతని అనుమానిణారనేది కూడా అనుమానమే!వాళ్ల వాదన అంతా,"రేపెప్పుడన్నా మన పెళ్ళాలు తమ తిరుగుబోతు తనంతో కావాలనే ఎవడితోనో సుఖపడి వస్తే రాజుగార్ని ఆదర్సంగా తీసుకుని మారు మాట్లాడకుండా ఇంటికి తెచ్చేసుకోవాలా?" అనే విధంగా ఉన్నది.వాళ్ళ యేడుపంతా వాళ్ళ పెళ్లాల తిరుగుబోతుతనం గురించే!

     ఈ కధలో ఇప్పటికీ పనికొచ్చే విషయం ప్రజలకి ప్రభువు మీద తేలికతనం పుడితే రాజ్యం నడవదు - అరాచకం వస్తుంది అనేది.నిజంగా రాముడు సీత మీద అభిమానం లేకుండా అనుమానంతోనే గెంటేస్తే స్వర్ణసీతతో పనులు జరిపించుకోవాల్సిన అవసరం యేమిటి?రాముడు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఆడాళ్ళు కరువా!ఆ కామన్ సెన్సుతో కూడిన సందేహం కూడా రావడం లేదు కేవలం హిందూమతద్వేసం నిలువెల్లా నిండిన కుపండితులకి!

     సీత అగ్నిప్రవేశం నాటి రాముడి ప్రవర్తనకీ సీతా పరిత్యాగం నాటి రాముడి ప్రవర్తనకీ అతడు రాజు కావడమే కారణం!అతనొక మామూలు మనిషైతే మొదటి వనవాసమే దాపరించేది కాదు,ఇంక సీతాహరణమూ రామరావణయుద్ధమూ అగ్నిప్రవేశమూ సీతాపరిత్యాగమూ కూడా జరిగేవి కాదు కదా!రాజధర్మం ప్రకారం చేసినదాన్ని సామాన్యధర్మంతో అంచనా వెయ్యడమే బుద్ధి లేని పని.అయినా,గౌరవనీయుడైన వ్యక్తి నిష్పక్షపాత బుద్ధితో చేసిన విమర్శ అయితే పట్టించుకోవచ్చును గానీ చిట్ఫండ్ ఫ్రాడ్ కేసులో ఇరుక్కుని జనాలు తన్నడానికి వస్తే పారిపోయి తప్పించుకుని తిరుగుతూ బతికిన దగుల్బాజీ మాట్లాడే చవకబారు వాగుడుకి హిందువులు గోల చెయ్యడం కూడా అనవసరమే!

     P.S:అనామకుల వారు ఎలాగూ చెప్పేసారు గదారాముడి కధతో అవసరం లేకుండా చైనావాళ్లు బతికేస్తున్నారు గదా ఇక్కడ మాత్రం దేనికి అని,కానీ వాళ్లు సంస్కారవంతు!తమకి అవసరం లేనిదాన్ని గురించి వాళ్ళు పట్టించుకోవడం లేదు.వాళ్ళు చేసినవన్నీ మీరూ చేయగలరా?

     ఇది నేను "రామాయణం మనకి ఎలా ఆదర్శం?" అనే రచ్చబండ చర్చావేదిక పెట్టిన చర్చ దగ్గిర నేను కత్తి మహేష్ ఆరోపణలకి ఇచ్చిన సమాధానం.ఒక్క శంబూక వధ తప్పిస్తే మిగిలిన రెండు పాయింట్లకీ తిరుగులేని జవాబు ఇచ్చేశాను.భరద్వాజ గారు  I like this comment అనేశారు.ఇంతలో ఎప్పుడూ వారలా అన్నారు వీరలా అన్నారు అని ఉటంకించటం తప్ప సొంత అభిప్రాయాలు చెప్పని జై గొట్టిముక్కల గారు ఈసారి వీరావేశంతో నన్ను నిలదీశారు.

Jai Gottimukkala July 9, 2018 at 11:23 PM
@Haribabu Suraneni:
"అంబేద్కర్ విమర్శ కూడా నిష్పక్షపాతమైనది కాదు"

ఖచ్చితంగా కాదు.అభిప్రాయాలలో నిష్పక్షపాతం అన్నది ఒక భ్రమ. అంబేడ్కర్ అయినా వేరే ఎవరయినా తమతమ దృక్పథంతోనే (POV) రాస్తారు.

     ఇదివరకులా అన్నింటినీ గుదిగుచ్చి చాంతాడు పొడుగు వ్యాఖ్యలు వేసే అలవాటు తగ్గించుకోవడం వల్ల వచ్చిన తంటా ఇది.మనసులో అనుకున్నదే ఇది కూడా చెబితే బాగుండునని, నీహారిక లాంటివాళ్లకి బోరు కొడుతుందేమోనని వదిలేశాను.ఈయన కదిలించటంతో దానికి కూడా జవాబు చెప్పాను. ఏమని?

Haribabu SuraneniJuly 10, 2018 at 1:41 AM
     పుట్టుకతో తమకి వచ్చిన ఆధిక్యతని అడ్డం పెట్టుకుని మమ్మల్ని పుట్టుకని బట్టి అవమానించారు అని పోరాడుతున్న వ్యక్తి రాముడి పుట్టుకని గురించి అనుమానాస్పదమైన వ్యాఖ్యానం చెయ్యడం ఏ విధమైన నిష్పాక్షికత?

     అది వ్యక్తిత్వహననం కిందకి వస్తుంది!అంబేద్కర్ రామాయణాన్ని విమర్శించడం కోసమే ఆ పుస్తకం రాశాడని నాకు తెలుసు.నచ్చనిదాన్ని విమర్శించడం కోసం కూర్చున్నప్పుడు ప్రశంసలు కురిపించరనీ నాకు తెలుసు.కానీ తప్పులు పట్టడానికి ఎన్నుకున్న లాజిక్ ఎలా ఉండాలి?రాముడి మనస్తత్వాన్ని బట్టి అతని గునగణాలు నిర్ధారించాలి గానీ అతను అక్రమసంతానం అని నిరూపించాల్సిన అవసరం ఏమిటి?అంబేద్కర్ రాముడు అనే ఒక వ్యక్తిలో మంచిచెడుల్ని అంచనా వెయ్యడానికి పుట్టుక వల్ల వచ్చిన అక్రమసంతానం అనే విషయాన్ని లెక్కలోకి తీసుకుంటే బ్రాహ్మణులు పుట్టుకని బట్టి అధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడంలో తప్పు ఏముంది?

     తను ఏ ఉద్దేశంతో రామాయణాన్ని విమర్శించాలనుకున్నాడో దానికి విరుద్ధమైన వాదన సాక్షాత్తూ అంబేద్కరే చేస్తే అతను ఎవరిమీద దేనికోసం పోరాడుతున్నట్టు?చెప్పండి!

      నికి జైగారు I agree అనటంతో కత్తి మహెష్ లాంటి లేకివెధవల పైత్యకారి వాగుడుకే కాకుండా ఆంబేద్కర్ లాంటి సీరియస్ విమర్శకుల గంభీరమైన రామనిందకి కూడా ఘటశ్రాధం పెట్టేసినట్టే!ఇంక చెప్పడానికి ఏమీ లేదు.కానీ అది రచ్చబండ కదా!అక్కడున్నది నీహారిక కదా!

@ హరిబాబు,
"రేపెప్పుడన్నా మన పెళ్ళాలు తమ తిరుగుబోతు తనంతో కావాలనే ఎవడితోనో సుఖపడి వస్తే రాజుగార్ని ఆదర్సంగా తీసుకుని మారు మాట్లాడకుండా ఇంటికి తెచ్చేసుకోవాలా?"

(మీరు తిన్నగా సమాధానం చెప్పండి.మళ్ళీ రామాయణం అంత పొడుగు వ్యాసం వ్రాయకండి.)

నా మొదటి ప్రశ్న మీరయితే ఏం చేస్తారు ?

     చూశారుగా!బాపు గారు తెర మీద "భశుం" అన్న మాటని సినిమాస్కోపులో చూపించి ప్రేక్షక బాధితుడి చేత "ఇంత కంగాళీ అవకతవక సిన్మా నా జన్మలో చూళ్ళేదయ్యా!" అనిపించినట్టు ఇంత కంగాళీ అవకతవక ప్రశ్న నా జన్మలో ఎదుర్కోలేదండీ! 

     మళ్ళీ బ్రాకెట్టులో తిన్నగా జవాబు చెప్పండి అని హెచ్చరిక!తను పేస్టు చేసిన భాగం ఎవరి సమస్యని చూపిస్తుంది?తమ పెళ్ళాలు తిరుగుబోతులైతే అనేది సామాజికుల సమస్య కదా!రాజుగార్ని ఆదర్శం తీసుకుని ఉంచేసుకోవాలా అన్న డౌటుకి రాజధర్మం సామాన్యధర్మం వేరు వేరు వాటిని కలపినందువల్లనే రాముడు చేసినది తప్పని కత్తులకీ సుత్తులకీ అనిపిస్తున్నది అని బల్లగుద్ది చెప్పానే,ఇంకా నన్ను "మీరైతే యేం చేస్తారు?" అని అడిగితే నేను యే స్థానంలో నిలబడాలి?రాముడు చేసింది తప్పు కాదు అని చెప్పినప్పుడు నేను రాముడి స్థానంలో నిలబడితే రాముడు చేసినదే చేస్తాను కదా - అది కూడా చిలక్కి చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్తే ఈవిడకి అర్ధమవుతుందో కూడా తెలియట్లేదే నాకు!ఇక తను పేష్టు చేసింది సామాజికుల యేడుపు కాబట్టి ఆ స్థానంలో వాళ్ళల్లా నేనెందుకు యేడుస్తాను?వాళ్ళకి రాజధర్మం - సామాన్యధర్మం విషయంలో క్లారిటీ లేక యేడ్చారు!నేనయితే నాకున్న క్లారిటీ ప్రకారం నా యేడుపేదో నేను యేడుస్తాను.యేం చేస్తానో ఈవిడకి చెప్పాల్సిన అవసరం నాకేంటి?ఈవిడ నా చుట్టమా,పక్కమా,ఆరుస్తుందా తీరుస్తుందా?ఈ రంధిలో పడి బాపు గారి కార్టూను గుర్తొచ్చి కూడా నవ్వు రాలేదంటే ఆ ఒక్క ప్రశ్నతో ఆవిడ నన్ను పెట్టిన టార్చరు తెల్సుకోవచ్చు!విసుగునీ చిరాకునీ అణుచుకుని వీలయినంత క్లుప్తంగానే జవాబు చెప్పాను.

@neehaarika
నా మొదటి ప్రశ్న మీరయితే ఏం చేస్తారు ?

hari.S.babu

నేను రాసినదాన్ని అక్షరం పొల్లుపోకుండా కొటేషన్లలో పెట్టి అడుగుతున్నారు కాబట్టి అది ఖచ్చితంగా తిరుగుబోతుతనమే అవుతుంది కదా,కాబట్టి నాకు ఎటువంటి గందరగోళమూ లేదు - స్వీకరించను!

      ఇంతటితో ఆగితే నీహారిక ఎందుకవుతుంది,మొదటి ప్రశ్న కన్న రెండో ప్రశ్నలో పదింతల  అజ్ఞానం వెళ్ళగక్కింది:
నీహారికJuly 10, 2018 at 4:05 AM
2. మీరు చెప్పిందే కత్తి మహేశ్ చెపితే నగర బహిష్కరణ చేసారు. మీరు తిరుగుబోతుతనం అనికూడా అన్నారు.మీరు చెప్పిందీ అతను చెప్పిందీ ఒకటి కాదా ?
మీరు ఎలాంటివాళ్ళైనా జీవితాంతం భరించవలసిందేనా ? మీ నుండి తప్పించుకోడానికి మరో మనిషిని వెతుక్కుంటే తిరుగుబోతు అని అంటారా ? భరించలేని పరిస్థితిలో విడిపోవడమే పరిష్కారం అని రంగనాయకమ్మ కూడా చెప్పారు. సీత తన దగ్గరుండడం కొందరు భరించలేకపోయారు. రాజు కాబట్టి ప్రజల కోసం భార్యను విడువక తప్పలేదు.మీరు విడిచిపెడ్తే ఎవరూ ఏమీ అనరు.రాజు విడిచిపెట్టాడు కాబట్టి ఇపుడు విమర్శిస్తున్నారు.మీరేమో రాజు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లు ఇంట్లోకి తెచ్చుకోవాలా అని అడుగుతున్నారు.నాకు క్లారిటీ రావడం లేదు.

మీరు చెప్పేదీ, రాముడు చేసిందీ, కత్తి చెప్పిందీ ఒకటేలాగా ఉంది.ఎవడి దగ్గరుండాలో మీరెవరు నిర్ణయించడానికి ? సీతకి నిర్ణయాధికారం లేదా ? నేనయితే విడిచిపెడతాను అని మీరు అంటున్నారు. భర్తను వదిలి ఇంకొకరిని కోరుకున్నపుడే విడిపోయినట్లు కదా?

వాల్మీకి రామాయణం కాకుండా లవకుశ సినిమానే ప్రామాణికంగా తీసుకున్నా సీత తిరిగి అయోధ్యకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఒక విడిపోయిన జంట ఆరాధ్య దైవాలు ఎలా అయ్యారన్నది నా రెండవ ప్రశ్న!

     దీంతో నాకు పిచ్చ ఖోపం వొచ్చేసింది - ఎదురుగా ఉంటే ఆడదని కూడా చూడకుండా పీక పిసికి  చంపేసేవాణ్ణి!లేకపోతే ఈ దుర్మార్గం ఏమిటండీ?రాముడు చేసింది తప్పు కాదని సమర్ధిస్తున్న నన్నూ  రాముణ్ణి దగుల్బాజీ అంటున్న వెధవనీ ఒకే గాటన కట్టేసి మీరిద్దరూ అంటున్నది ఒకటే కదా అంటుంది - అయితే కన్ఫ్యూజన్ అన్నా కావాలి లేదంటే ఇంకాంగ్రువస్ కంబాట్ అయినా కావాలి.కామెంటు మొత్తం గందరగోళంతో కూడినటువంటి తిక్కతో నిండిపోయినప్పటికీ  "ఒక విడిపోయిన జంట ఆరాధ్య దైవాలు ఎలా అయ్యారన్నది నా రెండవ ప్రశ్న!" అన్న ఆఖరి వాక్యమూ ఆ ప్రశ్నా మాత్రం పిచ్చపిచ్చగా నచ్చేశాయి!ఆవిడ స్టయిలే అంత -  రామాయణంలో శూర్పణఖ అంత మిస్టీరియస్ వుమన్.`

Haribabu SuraneniJuly 10, 2018 at 6:10 AM
     మీరు గందరగోళంలో పడితే దానికి నా బాధ్యత ఏముంది?

     మీరు ఉదహరించిన భాగం సామాన్యప్రజల గొడవ!రాజధర్మం,సామాన్యధర్మం వేరుగా ఉంటాయనీ ఆ రెంటినీ ఒకే దృష్టితో చూడకూడదనీ కూడా చెప్పాను.ఇంకా క్లారిటీ రాలేదంటే అది నా తప్పూ కాదు,వాల్మీకి తప్పూ కాదు.

     మీరు అడిగినది రాముడి స్థానంలో నేను ఉంటే ఏమి చేస్తానని కాదు కదా!రాముడి స్థానంలో ఉంటే నేను కూడా రాముడు చేసిందే చేస్తాను.కత్తి మహెష్ దగుల్బాజీతనం అంటున్నది దానిని.దానిని వ్యతిరేకిస్తున్న నాకు అతను అన్నదే నేను అనటాన్ని అంటగడుతున్నారు - ఇది మర్యాద కాదు!రాజధర్మం ప్రకారం అది తప్పు కాదని చెప్పాను.ఇక సామాన్యులు తమ వీలుని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు!తన భార్య తిరుగుబోతు కాదు అని భర్త నమ్మినా లేదంటే తిరుగుబోతు అయినప్పటికీ తనకి వేరే గతి లేకపోయినా కూడా సుబ్బరంగా ఇంటికి తెచ్చుకోవచ్చు!మీరు పెట్టిన కండిషన్ ప్రకారమే ఆ అభార్య తిరుగుబోతు అవుతుంది కాబట్తి స్వీకరించను " అన్నాను.మీ వాదన ప్రకారమే చూసినా భర్త నచ్చక మరొకడితో వెళ్ళింది ఆమెకి ఉన్న స్వేచ్చ వల్లనే కదా!విడాకులు కోరాల్సిన బాధ్యత ఉన్నది అలా చెయ్యకుండా వెళ్ళిన ఆ భార్యకే కదా, భర్తకి ఆ గొడవలన్నీ దేనికి?

     నేను ఎలాంటివాడినైనా భరించాల్సిందేనని నేను అన్నానా?భరించలేకపోతే విడిపోవటానికి మార్గం ఉండగా కొంతకాలం మరొకడితో సుఖపడి బోరు కొట్టో అతను వదిలేస్తేనో నా దగ్గిరకి వచ్చింది యెవరు - తనే కదా!

చూడండి!నాకు ఆ సమస్య రాదు.మిగిలినవి కూడా ఇటువంటి ప్రశ్నలు అయితే ఇంక ఆపెయ్యండి.సమాజంలో అందరికీ వర్తించే నైతికపరమైన ప్రశ్నలని వ్యక్తుల్ని నిలదీసేటట్టు అడగటం క్షమించరానిది.ఈ ధోరణి ప్రశ్నలు ఆపండి

     అసలు రాముణ్ణి విమర్శించేవాళ్ళు గానీ హిందూమతంలో తప్పులు పట్టేవాళ్ళు గానీ మన జవాబుల కోసం ఎదురుచూడటం లేదు.గోగినేని బాబు చర్చలో ఎదటివాళ్ళు సరైన జవాబు చెబుతున్నారు అని అనుమానం రాగానే "మైక్ కట్ చెయ్యండి!మైక్ కట్ చెయ్యండి!" అని హడావిడి చేస్తాడు,ఎందుకనుకుంటున్నారు?తను చెబితే ఎదటివాళ్ళు వినడమే తప్ప ఎదటివాళ్ళు మాట్లాడటం సహించలేని మనస్తత్వం అతనిలో ఉంది!ఉతను కోరుకున్నట్టే మీడియా వాళ్ళు కూడా మైక్ కట్ చేస్తున్నారంటే అర్ధం ఏమిటి?ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం గోగినేని బాబు మాట్లాడుతున్నవాటిని మాత్రమే సహేతుకత ఉన్న మాటలుగానూ హిందువులు జవాబు చెపలేక అవస్థలు పడుతున్న అసమర్ధులుగానూ బైటికి వెళ్ళటానికి వాళ్ళ వంతు సహకారం అందిస్తున్నట్టు తెలియడం లేదా?వేదాలు నాలుగున్నయ్యో ఆరున్నయ్యో తెలియని వాడికి వేదాల్లో సైన్సు లేదని ఎలా తెలిసిందనే ప్రశ్న వెయ్యాల్సిన బాధ్యత యాంకరుకి లేదా?వాదనల వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు.రచ్చబండ దగ్గిర శ్యామలీయం అన్నట్టు - "ఒక వ్యక్తి మనకు ఆదర్శం కావటం అనేది మన సంస్కారం యొక్క స్థాయిని బట్టి కూడా ఉంటుంది. మన సంస్కారంలో ఉన్న చెడు హెచ్చు ఐతే మంచివాళ్ళు మనకు నచ్చరు. తద్విపర్యయమూ నిజమే." .క్రెడిబిలిటీ కోసం మేమూ హిందువులమే అని చెప్పుకుంటున్నప్పటికీ రాముణ్ణి దగుల్బాజీ అనేవాళ్ళు గానీ వేదాల్లో సైన్సు లేదనేవాళ్ళు గానీ హిందువులు కారని నేను వ్యాసపరాశరాదిషిర్దీసాయినాధపర్యంతం ఉన్న నా గురుపరంపర పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పగలను!

     ఇతర మతాలకిలా హిందూమతం బాప్తిజం,దావత్ లాంటివి పాటించటం లేదు గనక వీళ్ళ ఆటలు సాగుతున్నాయి.వీళ్ళలోఏ ఒక్కడయినా నేను హిందువుని అని చెప్పుకోవాలంటే హిందూమతాన్ని గౌరవించాలి.ఏదైనా సందేహం వస్తే పెద్దల్ని అడిగి అనుమానం తీర్చుకోవాలి - సద్విమర్శలు చేసేవాళ్ళ భాషా సంస్కారమూ వేరేగా ఉంటాయి, అంత ద్వేషం వెళ్ళగక్కుతూ రాముడి గురించి "దగుల్బాజీ!" అనే పదం వాడటానికి కూడా వెనకాడని వాడు హిందువెట్లా అవుతాడు?కొడుకే అనుకుంటే ఇప్పుడు తండ్రి కూడా మొదలుపెట్టాడు, ఇది ఇంతటితో ఆగుతుందనుకుంటున్నారా?మనం ఎన్ని ఆధారాలు చూపించినా ఎంత బలమైన వాదన వినిపించినా వాళ్ళు మారరు,మారరు గాక మారరు.

     శ్రీనివాసుడు గారు నాకు ఒక లింకు పంపించారు.అందులోని వాదన ఉత్తర రామాయణంలో వాల్మీకంతో కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి గాబట్టి అది ప్రక్షిప్తం కావచ్చుననేలా ఉన్నది.బహుశా మళ్ళీ మళ్ళీ జరుగుతున్న గొడవల్ని బట్టి అది ప్రక్షిప్తం గనక దానిని పట్టించుకోనవసరం లేదనే అభిప్రాయం చాలామందికి వస్తున్నది కాబోలు!అయితే, ఆ వ్యాసం చదివాక కూడా ఇన్నివేల యేళ్ళుగా జనం మనసులో ముద్ర వేసుకున్న కధని మర్చిపోయలా చెయ్యగలిగినంత బలం వాటికి లేదని నాకనిపిస్తున్నది!నేను పైన ఉదహరించిన రచ్చబండ దగ్గర చెప్పిన జవాబులో అగ్ని పరీక్షా సీతా పరిత్యాగమూ నూటికి నూరు శాతం ధర్మబద్ధమే అని నిరూపించాను.చెత్త వెధవలు చేస్తున్న తిక్క విమర్శలకి భయపడి ప్రక్షిప్తాల పేరుతో ఆ కధని దాచేస్తే సరిపోతుందని అనుకోకూడదు.అవతార పురుషుల కధల్ని మధ్యలో ఆపకూదదనే సంప్రదాయం ప్రకారమే ఉత్తర రామ చరిత్ర ఆవిర్భవించింది!అయోధ్యలో రాముడు సరయూ నదీప్రవేశం చేసిన తీర్ధం ఉన్నది కదా!వైకుంఠవాసుల అవతార పరిసమాప్తి అలాగే జరగాలని దివ్యపురుషులు తీర్మానించుకుని నడిపించిన లీలావినోదం అది!ఆ కధలో హిందువైన ప్రతివాడూ పులకించిపోవాల్సిన సనాతన ధర్మం ధగధ్ధగాయమానంగా వెలుగుతున్నదే తప్ప సిగ్గుపడి తల దించుకోవాల్సిన విషయం ఏదీ లేదు!

     ఏం తప్పు చేశాడండీ రామిడు?దావీదు మాదిరి ఆరు బయట సరిగంగ స్నానాలు చేస్తున్న మదవతిని చూసి మతి పోగొట్టుకుని తను రక్షించాల్సిన వాడైన తన సైన్యంలోనే పని చేస్తూ దేశం కోసం యుద్ధం చేస్తున్న మొగుణ్ణి చంపించి పక్కలోకి లాక్కున్నాడా?ఎవర్ని మోసం చేశాడు రాముడు?ఎవరి ఆస్తుల్ని దోచుకున్నాడు?అసలు సీతని బలవంతంగా యెత్తుకెళ్ళిన రావణుడు సొంత పెళ్ళాం మండోదరినే సుఖపేట్టలేదు సీతనెలా సుఖపెడతాడు?

     "రాముడు సీతని అడవిలో వదిలిరా అని లక్ష్మణునితో చెప్పినపుడు సీతని అడవిలో దింపివేస్తాడు. అపుడు సీత అయ్యో రామా ! నాకు చెపితే నేనే వెళ్ళిపోయేదానిని కదా నువ్వు అనవసరంగా నిందలో ఇరుక్కున్నావే అని అంటుంది. అంటే సీత కూడా రాముడికి నింద వస్తుందని ఊహించింది కదా ? అదే ఇపుడు జరుగుతున్నది. సీత అన్నదానినే నేను బలపరుస్తున్నాను. అప్పుడు జరిగింది అపుడు జరిగిపోయింది ఇపుడు మనం మార్చలేము.కనుక ఒప్పుకుంటే పోయేదేముంది ? మనవాళ్ళు అనవసరంగా ఆవేశపడిపోతున్నారు కానీ రాముడు ఒక మనిషి. జరిగింది జరిగినట్లు స్వీకరించడమే ! ఏ మతం లోనైనా లోపాలు సహజం. మా మతంలో లోపాలే లేవు అని సర్ది చెప్పుకోవడం ఎందుకు ?అనే కామెంటు ఒకటి నా బ్లాగు దగ్గిర పడింది.మొత్తం కామెంటు చదివితే హిందూద్వేషిలా అనిపించలేదు.ఇటువైపున పరిపూర్ణానంద స్వామి కూడా తీవ్రంగా స్పందించినట్టు చెబుతూ మధ్యేమార్గం కోసం రాజీ ప్రతిపాదన చేస్తున్నట్టు నాకు అనిపించింది.ఎటూ వేసింది అనామకంగా అవడంతో నాకు నచ్చిన భాగాన్ని మాత్రం ఇక్కడ చూపిస్తున్నాను - ఇలా హుందాగా అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిని నేనెప్పుడూ నిరాశ పర్చను.

     ఈ  వ్యాఖ్యాత కోరుకుంటున్నట్టే నేనూ సామరస్యాన్నే కోరుకుంటున్నాను.కానీ ఒంటి చేతి చప్పట్లలా హిందువులు మాత్రమే సామరస్యాన్ని కోరుకుంటుంటే ఉపయోగం ఏముంది?ఇది ఇప్పుడు మొదలైంది కాదు,మొదలు పెట్టింది హిందువులు కూడా కాదు.మధ్య యుగాల్లో ఈ దేశం మీద దాడులు చేసి ఇక్కడి రాజుల్ని వోడించి ఇస్లామ అనే కొత్త మతాన్ని పరిచయం చేసిన వాళ్ళు కూడా వాళ్ళ మతగ్రంధాల నియమాల ప్రకారం కొన్ని ఆలయాలని ధ్వంసం చేసి ఉండొచ్చు గానీ ఇంగ్లీషు వాళ్ళ మీద చేసిన మొదటి స్వాతంత్య్ర పోరాటంలో హిందువులతో పాటు భుజం భుజం కలిపి పోరాడిన సన్నివేశాన్ని బట్టి ప్రజల మధ్య మతపరమైన అగాధం లేదని తెలుసుకోవచ్చు!

     ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారం అప్పగించిన తొలిదశలో కూడా పరిపాలన చాలా న్యాయబద్ధంగా ఉండేది.చాలామంది కలక్టర్లూ ఇతర ప్రభుత్వాధికారులూ హిందూ దేవాలయాలకు ధర్మకర్తలుగా ఉండేవాళ్ళంటే మీరు ఇవ్వాళ నమ్మలేరు - కానీ అది నిజం!నాకిప్పుడు పేరు గుర్తు లేదు గానీ తమిళనాడులోని ఒక ప్తముఖమైన ఆలయంలో ఆగమ సంప్రదాయానికి సంబంధించిన వివాదం ఒకటి కోర్టుకి వెళ్ళింది.జడ్జి క్రైస్తవుడు!అయినా, అధ్యయనం చేసి న్యాయమైన తీర్పుని ఇచ్చాడు - ఇటువంటి క్రైస్తవులనిఏ హిందువు అవమానిస్తాడు?నేను బెజవాద లయోలా కాలేజిలో చదివిన మూడేళ్ళూ కాలేజీవాళ్ళు ఉషశ్రీని పిలిచి రామాయణం గురించి చెప్పించారే గానీ క్రైస్తవమతప్రచారం చేసుకోలేదు!

     మంచివాళ్లని ఎవరూ హింసించదం లేదు.కానీ ఆదినుంచీ రెండవరకం మతప్రచారకుల వల్లనే ఈ వాతావరణం ఏర్పడింది.సంఖ్యాపరంగా రెండవ వర్గానిదే పైచేయి కావడానికి ఎవరు బాధ్యత్ తీసుకోవాలి?మొదటి రోజుల నుంచే తమిళనాడులో తిరువళ్ళువార్ బైబిలుని కాపీ కొట్టి తిరుక్కురల్ రాశాడని చెప్పటం దగ్గిర్నుంచి ఎన్ని అబద్ధాలు చెప్పారో లెక్కలేదు!అన్ని లెక్కలూ తీస్తే క్రైస్తవమతంలో ఉన్న పెద్దమనిషి తరహా వ్యక్తులు కూడా నిర్ఘాంత పోతారు - మావాళ్ళు ఇని దారుణాలు చేశారా అని!

     ఒక విచిత్రం ఏమిటంటే, మొదటి తరం పాస్టర్లు బ్రాహ్మణులతో స్నేహం చేసి బ్రాహ్మణుల సహాయంతో వ్యాపించాలని చూశారు - సంస్కృతం చదివారు, కాషాయం కట్టారు, పేర్లతో సహా హిందూ సన్యాసుల వేషాలు వేశారు.ఇంకా విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఎవరయితే వీరిని తమని ఉద్ధరించటానికి దేవుడు పంపిన ఆత్మీయులుగా కనిపిస్తున్నారో ఆ కింది కులాల వారిని గురించి చాలా నీచమయిన అభిప్రాయం ఉండేది - అనాగరికులనీ క్రూరులనీ తొలినాటి క్రైస్తవుల నివేదికల్లో కనిపించిన వర్ణనలుq కింది కులాల వారిని గురించి ఉద్దేశించినవే!అయితే, బ్రాహ్మణులతో సయోధ్య చెడినాక అటువైపుకి వెళ్ళినప్పుడు మొదటిసారి ఆర్య,ద్రవిద పదాలను సృష్టించారు.తమ దేశాలలో నీగ్రోలని చూసిన కళ్లతో చూసి తెల్లగా ఉన్నవాళ్ళు ఆర్యులనీ నల్లగా ఉన్నవాళ్ళు ద్రవిడులనీ ఒక్క ముక్కలో తేల్చి పారేశారు.వాళ్ళు మొదలుపెట్టిన దాన్ని స్వతంత్రం వచ్చాక్ కమ్యునిష్టులూ హ్యూమనిష్టులూ అందుకుని కొనసాగిస్తున్నారు.ఆశ్చర్యం యేమిటంటే,ఇతరులకి సైన్సులో ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుందో చ్గెప్పి ఎడ్యుకేట్ చెయ్యాల్సినవాళ్ళు ఆర్య-ద్రవిద సిద్ధాంతం సైంటిఫిక్ ప్రపంచంలో కొన్ని దశాబ్దాల క్రితమే తిరస్కరించబడిందన్ని విషయాని మాత్రం చెప్పదం లేదు - 2018లో జరిగిన ఒక చర్చా కార్యక్రమలో ఒక హేతువాద అనఘం సభ్యుడు దీన్ని ప్రస్తావించదం చూస్తే  వాళ్ళే అప్డేట్ కావటం లేదేమో అనిపించింది!వీళ్ళంతా తాము చెప్తున్నవి అబద్ధాలని తెలిసే చెప్పారు - బ్రాహ్మణుడు,నల్లమేక,నలుగురు దొంగల కధని భారతీయుల మీద అధికారంలో ఉన్నవారి అందదండలతో చరిత్రనీ సైన్సునీ వక్రీకరించి ప్రయోగించారు, కొంతవరకు విజయం సాధించారు.

     బహుశా అటువైపు దృష్టి పెట్టకపోవటం వల్ల మీకు తెలియదేమో గానీ పైకి కనిపించని కుట్ర ఎప్పట్నించో జరుగుతున్నది.గణేశుడి మొహంలో పురుషుడి వృషణాలూ పురుషాంగమూ సూపర్ ఇంపోజ్ చేసి సెక్సిస్టు మతం పేరు పెట్టి వెక్కిరించడం దగ్గిర్నుంచి చాలా జరుగుతున్నాయి.అరవింద రావో మరొకరో చెప్పారని కాదు,ఆయన చెప్పక ముందు నుంచీ, నా చిన్నప్పటి నుంచీ నేను చూస్తూనే ఉన్నాను.ఆ పనులు చేసేవాళ్ళు ఫ్రీగా చెయ్యటం లేదు,డబ్బు కోసమే చేస్తున్నారు!వాళ్ళకి డబ్బు దేనికి ఇస్తున్నారు?ఈ కత్తి మహేష్ ఆ వ్యాఖ్యలు చేసిన సందర్భం ఏమిటి?గోగినేని బాబు మీద వచ్చిన విమర్శలకి సంబంధించి జరుగుతున్న చర్చ కదా!బాబు తెలివి యే స్థాయిలో ఉందో తెలుసా!"నాకు వేదాలు నాలుగున్నయ్యో ఆరున్నయ్యో తెలియదు గానీ వేదాల్లో సైన్సు లేదని తెలుసు!" అంటున్నాడు.మధ్యలో "కానీ" తీసేస్తే ఎలా ఉంటుంది?

     ఆ వ్యాఖ్యాత (అమాయకంగానే అంటూ ఉండొచ్చు) అంటున్నట్టు పోనీలే గదా ఒప్పేసుకుందాం అని పబ్లిక్ స్టేట్మెంటు ఇచ్చిన మరుక్షణం "మరి, అంత తెలివితక్కువ వాణ్ణి గొప్పోడని పొగుడుతున్నవాళ్ళు తెలివితక్కువ వాళ్ళు అవరా?ఇన్నేళ్ళూ దాచిపెట్టి మూసేసినది కుట్ర కాదా?అంత భయంకరమైన మతంలో ఉండటం దేనికి?" అనే వాదన లేవనెత్తుతారు!కత్తి  మహేష్ రంగనాయకమ్మని ప్రస్తావించాడు కదా. ఆమె చేసింది యేంటి?మీరు పిచ్చోళ్ళు గాబట్టి రాముణ్ణి అనుసరిస్తున్నారు.రండి దాన్ని వదిలి కమ్యూనిజం కోసం పోరాడండి అని చెప్పటం కోసం కాదా విషవృక్షం రాసింది?ఆమె రాముడు శూర్పణఖని లొట్టలేసుకుంటూ చూశాడనీ మళ్ళీ "అయ్యయ్యో నేనిలా లొట్టలేసుకుంటూ చూశానని జనానికి తెలిస్తే చెడ్డపేరొస్తుంది!" అనుకుని మళ్ళీ నార్మల్ అయిపోయాడనీ రాసింది."పాప్యులారిటీ కోసం పాకులాడే మనస్తత్వం రాముడికి ఉంటే ఆ పాప్యులారిటీని తెచ్చిపెట్టే రాజ్యాన్ని వొదిలి పొగడ్డానికి ఎవరూ లేని కారడవుల్లో అనామకంగా ఎందుకు బతుకుతాడు అనే కామన్ సెన్సు కూడా లేదా ఆవిదకి" అని మీరు జాలిపడేరు - అలా రాస్తేనే తన పని జరుగుతుందని పూర్తి తెలివిలో ఉండే రాసింది!

     చేసిన నిర్వాకం అంతా చేసి ఇప్పుడు కత్తి మహేష్ రామకీర్తనలు పాడడం వెనక ఉన్నది ఏమిటి?వెక్కిరింత!నిజంగా అంత భక్తి పొంగి పొర్లుతున్నవాడే అయితే  అసలు ఆ వ్యాఖ్యలు చేసేవాడే కాదు గదా! హిందువులు వాటిని వ్యతిరేకించిన వెంటనే క్షమాపణ చెప్పొచ్చు గదా, ఇంకెప్పుడూ అలా చెయ్యనని హామీ ఇవ్వొచ్చుగదా!అది మాత్రం చెయ్యడు - పిర్ర గిల్లి జోల పాడే ముదనష్టపు తెలిచి చూపిస్తున్నాడు.ఇతనొక్కడే కాదు చాలామంది ఉన్నారు,ఎవడయినా సరే మళ్ళీ ఇలా మాట్లాడితే హిందువులూ మళ్ళీ ఇలాగే స్పందించాలి - తప్పదు!ఏరోజు కారోజు బతుకుతెరువు కోసం పరుగులు పెట్టాల్సిన ఆవసరం ఉన్నప్పటికీ ఇటువంటి విషయాలను గురించి కొంత తీరిక చేసుకుని స్పందించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది!పదే పదే "మీ మతం గురించి మీరు ఎంత గొప్పగా చెప్పుకున్న్నా మాకు అభ్యంతరం లేదు,మా మతం గిరించి తప్పుగా మాట్లాదకండి!" అని చెప్తున్నా వాళ్ళకి అర్ధం కావడం లేదు.కత్తి రామాయణం అనే పేరుతో ఒక హిందువు తన భిప్రాయాలు చెప్పాడు.కనీసం మాటవరసకయినా కత్తి మహేష్ వాడిన మాటని కూడా ప్రస్తావించకుండా చాలా హుందాగా మాట్లాడాడు.అయితే, అక్కడ G.Anik KUmar అనే క్రైస్తవుడి వ్యాఖ్యలు చూస్తే అటువంటివాళ్ళకి హిందూమతం మీద ఎంత ద్వేషం ఉందో,దాన్ని వాళ్ళు కనీసం సభ్యరా సంస్కారాల చాటున దాచుకోవటానికి కూడా ప్రయత్నించడం లేదనీ మీకు అర్ధం అవుతుంది.

     ఒక హిందువు తన మతాన్ని ఇతరులు విమర్శిస్తుంటే కించపడి తన మతాన్ని సమర్ధించుకుంటున్న చోట అతను ఎలా మాట్లాడాడో చూడండి!Ramudu oka kshathriyudu ante oka Raju ( he is not a God ), Ravanasurudu oka bhrahman, ante   Ramanasurudini champina tharvathe Ramudu Devudetla avuthadu ????Did he created any men, animals, earth and world ??No, he just fight for himself not for the people, but after the death of Ravana some people get joy, ante antha chinna vishayanike devudaipothada ?? Atlanukunte, okka ramude kadu, mana swathantram kosam poradina vallandaru devulle, yes or no ??Devudante manam rasukune kathallo puttukochevadu kadu, atlaithe manam devunni creat chesinatlayithadi, ante manishi cheta tayarainavadu devudetla aithadu ??మొదలు పెట్టడమే అసలు రాముడు దేవుడు కాదని అంటూ కధకోని పాత్ర దేవుడెట్లా అవుతాడు అని బైబిలు కధల పోలిక తెచ్చి దేన్ని సృష్టించాడని చాలా గంభీరంగా మాట్లాడినవాడు చర్చలో చాలా నీచమయిన పదాలు కూడా వాడాడు.

     ఆఖరికి నేను కలగజేసుకుని రివర్స్ వెళ్ళడంతో తర్వాత నిశ్శబ్దం అయిపోయాడు.హిందువుల మీద ఇంత తీవ్రమయిన దాడి జరుగుతున్నా హందువులు  సెక్యులరిస్టుల ప్రశంసాపత్రాల కోసం చేతులు ముడుచుకుని కూర్చోవాలా!మాటకి మాట బదులు చెప్పడానికి కూడా ప్రభుత్వాల నుంచి అనుమతి పత్రాలు తీసుకోవాలా?జియ్యర్ స్వామిని పక్కన కూర్చోబెట్టుకుని యాదగిరి గుట్టకి ప్రదక్షిణాలు చేసే తెలంగాణ ముఖ్యమంత్రి ఒక పొగరుబోతు రాముణ్ణి కించపరుస్తుంటే చర్య తీసుకోవటానికి అంత సమయం ఎందుకు తీసుకున్నాడు?ఇంత సమయం తీసుకుని ఇప్పుడు ఉద్ధరించిన ఘనకార్యం ఏమిటి?కత్తి మహేష్ తప్పు చేశాడు గాబట్టి శిక్షని వేసినవాడు తప్పు చెయ్యని పరిపూర్ణానందస్వామికి కూడా అదే శిక్ష వెయ్యడానికి కారణం ఏమిటి?కత్తి రామాయణం వీడియో దగ్గిర కారుకూతలు కూసిన అనిల్ కుమార్ లాంటివాళ్లని సంతోషపెట్టటం కోసం ఒక హిందూ పీఠాధిపతిని అవమానించినవాడు హిందువులకి ప్రీతిపాత్రుడు ఎట్లా అవుతాడు?

     ఎన్నికల్లో మైనారిటీల వోట్లు స్వింగ్ ఫ్యాక్టర్ కింద ఉపయోగపడి ఓటమిని గెలుపు చెయ్యాలన్నా మెజారిటీ వర్గపు ఓట్లు కూడా తగినన్ని పడి మార్జిన్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఫలితాల్ని తారుమారు చెయ్యగలవు కానీ మెజారిటీ వర్గాన్ని అవమానించి దూరం చేసుకుంటే అది నిరాశనే మిగుల్చుతుంది - 2014లో కాంగ్రెసు తెలంగాణ విషయంలో అలాంటి లెక్కల్నే వేసుకుని యెట్లా బొక్కబోర్లా పడిందో చూసి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి పాతచింతతొక్కు సెక్యులరిస్టు ముద్రకోసం ఉభయతారకపు ఎత్తుగడలకి పోకుండా పరిపూర్ణానందస్వామికి విధించిన శిక్షనిరద్ధు చెయ్యాలి.లేదంటే 2019లో ప్రతిపక్షంలో కూర్చోవటానికి సిద్ధపడాలి!
జై శ్రీరాం!జై శ్రీరాం!జై శ్రీరాం!

23 comments:

  1. అసలు నీహారిక గారు తన ప్రశ్న లోనూ, మీరు మీ జవాబు లోనూ విస్మరించిన విషయం ఏంటంటే, సీత కోరి తనంతట తానుగా రావణుడితో వెళ్ళలేదు. రావణుడి చేత అపహరించబడింది. అంటే kidnap చేయబడిందన్నమాట.

    సీత అడవిలోని కృూరజంతువుల బారిన పడిందో, ఏ సమస్యలో చిక్కుకొందో, అసలు ప్రాణాలతో ఉందో లేదో రాముడికి తెలిసే అవకాశం లేదు. అయినా రాముడు సీత కోసం వెతకడం మానలేదు.

    రావణుడు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, భయపెట్టినా సీత లొంగదు, తన రాక్షసమాయతో రాముడు ఇకలేడని చెప్పినా సీత నమ్మదు. రావణుడి వంక కన్నెత్తయినా చూడదు. చివరకు హనుమంతుడు వచ్చి తను రాముని వద్దకు తీసుకొని వెళ్తానని చెప్పినా నిరాకరిస్తుంది.

    స్వయంగా రాముడు వచ్చి రావణుని సంహరించి తనను సగౌరవంగా అయోధ్యకు తీసుకొని వెళ్ళాలని చెప్తుంది. సముద్రం కూడా దాటి వచ్చి రాముడు యుద్ధం చేసి రావణుడిని సంహరించి తనను రావణుని చెర నుంచి విముక్తి చేస్తాడని నమ్మింది. అలా జరిగేంతవరకూ వేచి చూసింది.


    ఐనా, గట్టిగా ఓ యాభై సంవత్సరాల కింద వరకూ వితంతు పునర్వివాహం,
    ఓ ముప్పై సంవత్సరాల కింద వరకూ, విడాకులూ, ఓ పది సంవత్సరాల కింద వరకూ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కల్చరూ acceptable కావు. మరి ఇప్పుడో....

    మన జీవిత కాలంలోనే మన కళ్ళముందే ఎన్నో మారిపోతున్నాయి. మనమూ ఆమార్పులను ఇష్టంగానో, కష్టంగానో ఆహ్వానిస్తున్నాం. ‘అప్పటి కాలంలో, ఆ సమాజంలో అలా ఉండేది. ఇప్పుడు అలా ఉండాలంటే వీలవుతుందా?’ అని మనకు మనమే సర్దిచెప్పేసుకుంటున్నాం.

    మరి అదే లాజిక్ ప్రకారం రాముడు, సీత ఆ నాటి యుగ ధర్మాన్ని, రాజధర్మాన్ని బట్టి అలా చేసారని ఎందుకు అంగీకరించలేం? అంతేకాదు, సీత గాని, రాముడు గాని ఏం చేసినా,
    వారి ఇష్టప్రకారమే, మనస్ఫూర్తి గానే అన్నీ చేసారు గానీ, ఎవరిబలవంతం వల్లా కాదు.

    రామాయణం కల్పన అనుకొన్నా, చరిత్ర అనుకున్నా, ఆ నాటి కాలధర్మాన్ని బట్టి వారు చేశారు. ఇప్పటి కాలధర్మంతోనూ, న్యాయ సూత్రాలతోనూ రామాయణాన్ని judge చేయడం ముమ్మాటికీ తప్పు.




    .

    ReplyDelete
  2. ఒక్క ముక్క చెప్పి విరమిస్తాను.

    రామాయణం కల్పిత కథ అనుకుంటే, దానిని వ్రాసిన వ్యక్తి వాల్మీకి. అది మనకి నచ్చినా నచ్చకపోయిన ఆ కథను మనం మార్చటం కుదరదు. ఒకరు అదే కథను అడ్డదిడ్డంగా మార్చి వ్రాసి అసలు కథకుణ్ణి ఆక్షేపించటం దుర్మార్గమూ దుస్సంస్కారమూ తప్ప మరేమీ కాదు.

    రామాయణం నిజంగా జరిగినకథకు వాల్మీకి ఇచ్చిన కావ్యరూపం అనుకుంటే దానిని ఆయనే మొట్టమొదట గ్రంథస్థం చేయటం జరిగింది. తరువాత అనేకమంది తమతమస్వంత ప్రతిభతో ఆ కథకు మెరుగులు దిద్దాలనో, లేదా ఆ కథనే దిద్దాలనే తంటాలుపడి పోటీరామాయణాలో మరొకటో మరొకటో వ్రాసినా అవి వాల్మీకిని విడిచి ఆట్టే సాము చేయలేవు - మొదటి చారిత్రక ఆథారాన్ని అందించినది వాల్మీకి రామాయణమే కనుక. పైగా ఇతరులవన్నీ ఇటీవలివే, వాల్మీకితో పోల్చితే. మొదటి చరిత్రకారుడిని వదిలి వేరే ఆథారాలు సేకరించే అవకాశం కూడా లేని కాలానికి చెందిన వ్యక్తులు వాల్మీకాన్ని తప్పుపట్టనూ కూడదు, పట్టలేరు కూడా. అలా తప్పుపట్టం మూర్ఖత్త్వం తప్ప మరేమీ కాదు.

    వాల్మీకినో ఆయన తీర్చిదిద్దిన పాత్రలనో విమర్శపేరుతో అబాసుపాలు చేయాలనుకునే వారు, వారివారి సంస్కారలోపాలనో బుధ్ధిలవదుర్విదగ్ధతనో వెలిబుచ్చుకుంటున్నారు కాని మరేమీ కాదని నా అభిప్రాయం.

    నా అభిప్రాయం నచ్చని వాళ్ళతో వాదించే తీరికా, ఓపికా, ఆసక్తీ ఏమీ లేవు నాకు. వారిని నన్ను మన్నించమని కోరటం తప్ప ఏమీ చేయలేను.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్తున్నది ఇటీవలి (గత వందేళ్లలో రాసిన) కథలకు వర్తిస్తుంది. నా ఈ వ్యాఖ్య వాటి మునపటి (post-Valmiki & pre-Ambedkar) వెర్షన్ల గురించి.

      కాకపొతే వాల్మీకి రామాయణానికి సమాంతరంగా లేదా స్వతంత్రంగా మౌఖికంగా వచ్చిన సంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఉ. దండకారణ్యంలో కొందరు చెంచులు తాము రాముడి వంశస్తులమని, తమ పూర్వీకుల నుండి తమకు రామాయణం తెలిసిందని చెప్పుకుంటారు.

      విశాల భారత దేశంలో శ్రీరాముని విస్తృత పర్యటనల (నేపాల్ నుండి లంక వరకు) నేపథ్యంలో రాముని ప్రభావ నీడ ఉన్నంత మేరకు ఎన్నెన్నో జానపదాలు వచ్చాయి. వాటిలో కాలంతో పాటు & వలసల (ఉ. ఇండోనేషియా) మూలాన మార్పులు, కూర్పులు & చేర్పులు కూడా జరిగాయి.

      వీటన్నిటి వలన రామాయణానికి ప్రపంచ సాహిత్యంలో ఎక్కడా లేని ఒక ప్రత్యేకమయిన వైవిధ్యత ఏర్పడింది. వాల్మీకి రామాయణం స్థాయి ప్రామాణికం కాకపోయినా వీటిని కూడా సాంప్రదాయ సంపదగా (cultural capital) గుర్తిస్తే బాగుంటుంది.

      అక్షరాస్యత ఇటీవలే పెరిగింది. రామాయణ అధికారిక అనువాదాలు కూడా మరీ పాతవేమీ కావు. ఇంకోరకంగా చూస్తే ఈ జానపదాలు, పల్లె పాటలు & చిన్న చిన్న కథలు జనజీవనంలో రామాయణాన్ని పదిలంగా ఉంచాయి. The oral traditions may not be as accurate as the original epic but served an extremely important socio-cultural function.

      Delete
    2. జైగారూ, నేను వాల్మీకి రామాయణం గురించీ అది ఎందుకు ప్రామాణికమో అన్నదానిని గురించీ చెప్పాను. 1వ శతాబ్ద్రిలో వచ్చినదైనా 21వ శతాబ్ధిలో వచ్చినదైనా అనంతర రామాయణనామాభిదేయాల ప్రామాణికత ఎందుకు తక్కువ అన్నదీ చెప్పాను. గతవందేళ్ళలో వ్రాసినకథలకు మాత్రమే ప్రామాణికత ఎంత అన్నది ప్రస్తావించనేలేదు - అలాంటి విభజనలకు ఎలాంటి ప్రాతిపదికాలేదు. కాబట్టి మేధోవాదనలతో విషయంలో ప్రక్కదారులు చూపటానికి యత్నించకండి దయచేసి.

      దేశవిదేశాల్లో రామకథ మంచి ప్రాచుర్యం పొందినా అనేక కారణాలవలన స్థానికమైన కథాసంవిధానాలు వచ్చాయన్నది విదితమే. అంతమాత్రంచేత అవేవీ వాల్మీకం స్థాయికి రానూ రావూ - వాటి ఆధారంగా రాముణ్ణి సీతనూ అంచనా వేయనూ కూడదు.

      ముందే చెప్పాను చర్చకు దిగనని. కాబట్టి మీరైనా మరొకరైనా నా వ్యాఖ్యనుండి ఏవేవో అర్థాలూ పెడర్హాలూ ఆధునికమేధోవాదాలపేరుతో ఎలా పిండటం చేసినా ఇంక మాటలాడను. చెప్పదలచుకొన్నది చెప్పనే చెప్పాను.ఇంక స్పందించేందుకు ఆసక్తి లేదు. క్షమించండి.

      Delete
  3. శ్రీ పరిపూర్ణానంద స్వామి చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం - "మన పురాణాలలోని సత్యాసత్యాలకి క్రైస్తవుల దగ్గిర్నుంచీ హేతువాదుల దగ్గిర్నుంచీ సర్టిఫికెట్లు తెచ్చుకోనవసరం లేదు." అని బల్లగుద్ది చెప్పేశారు.అసలు చర్చలకి వెళ్ళకందని సలహా ఇచ్చారు.

    ఒకటి మాత్రం నిజం - వీళ్ళ వల్ల మంచే జరుగుతున్నది,హిందువులు మరింత సంఘటితమవుతున్నారు!శ్రీ పరిపూర్ణానంద స్వామి అంత గట్టిగా ప్రభుత్వానికి ఆల్టిమేటం ఇవ్వకపోతే ప్రభుత్వం అసలు రియాక్ట్ అయ్యేది కాదు.రియాక్టవడంలో కూడా కేసీయార్ తన అహంభావాన్ని చూపించాడు.ఈ పరిపూర్ణానంద నాకుఆల్టిమేటం ఇస్తాడా అనే పొగరుతోనే ఆయన్ని కూడా శిక్షించాడు.ఆ శిక్షని రద్దు చేయించుకుంటే గానీ హిందువులు గెలిచినట్టు కాదు.దానికోసం ప్రయత్నం జరుగుతున్నదా?

    ReplyDelete
  4. ఈ వివాదం గురించి రమణ దీక్షితులు గారి అభిప్రాయం ఏమిటో తెలుసుకుందామనే ఆలోచన మీడియాలో ఇంకా ఎవరికీ తట్టకపోవడం దురదృష్టం!

    ReplyDelete
  5. రామాయణ విషవృక్షాన్ని విమర్శించినవాల్లంతా దాదాపుగా అన్నమాట ఒక్కటే. అప్పుడెప్పుడో జరిగిన రామాయణం, అప్పటి సాంఘిక పరిస్థితులకు, ధర్మానికీ అనుగుణంగా ఉంటుంది. దాన్ని పట్టుకుని, ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్క్సిజమూ, ఫెమినిజమూ దృక్పదాలతో విశ్లేషన చేయడమేమిటీ? ఈకాలం సిద్దాంతాలకు అనుగుణంగాలేవని నిందించడమేమిటి అని. పైన పురుషహక్కుల కార్యకర్తలు రాసిన ఆర్టికల్ కూడా ఇవే ప్రశ్నలే వర్తిస్తాయి. కొంత మంది పవిత్రంగా భావించే వాటిని కించపరచడమెందుకు ? అని !!

    కారణం ప్రజలే ! ఇప్పుడంటే లేదు కానీ, ఒకప్పుడు స్త్రీలకు “సీత పాతివ్రత్యం” ఆదర్శం. సీతను రాముడు అగ్నిప్రవేశం చేయమంటాడు. అగ్నిప్రవేశం చేస్తుందేకానీ, రామున్ని శంకించదు. రాముడు సీతను అడవిలో వదిలేయమంటాడు, అయినా సీతమ్మ అవన్నీ భరిస్తుంది.

    ప్రజలు రాముడు ఇటువంటి పనులు చేసినా రామున్ని వెనకేసుకు వచ్చేవారు. ఈ కథ, సమాజములో స్త్రీల చుట్టూ ఒక సాంప్రదాయ సంకెళ్ళను ఏర్పరచింది. భార్యను తిట్టినా, కొట్టినా, అనుమానించి అవమానించినా ఆ భార్య సీతలా తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలే కానీ తిరగబడకూడదు. అదే సమయములో భర్త తన భార్య మీద అనుమానం వస్తే ఆమెను పరీక్షించవచ్చు. సరే, స్త్రీ సీతలా ఉంటే … పురుషుడు రాముడిలా ఉంటాడా ? అది కూడా జరగలేదు.

    విషయం ఏమిటంటే, బలవంతులకు నీతులు వర్తించవు. బలహీనుల మీదే నీతులు అమలవుతాయ్. అదే అతి పెద్ద సమస్య !!
    ఇప్పుడు మళ్ళీ సాంప్రదాయ వాదుల అభ్యంతరాన్ని పరిశీలిద్దాం !

    అప్పుడెప్పుడో జరిగిన ఇతిహాసాలను, అప్పటి సామాజిక పరిస్థితులకు అనుకూలంగా రాసిన వాటిని, ఇప్పటి సమాజములోని నీతులతో, నియమాలతో ఎలా పోలుస్తారు ? ఎలా వాటిని జడ్జ్ చేస్తారు అని !

    ఇలా పురాణాలను వ్యతిరేకిస్తూ రాసేవారు, ఎప్పుడో జరిగిన రామయణాన్ని, ప్రస్తుత సమాజములో భిన్న పరిస్థుతుల మధ్య, ధర్మాల మధ్య బ్రతుకున్న స్త్రీల మీద మాత్రం ఎలా రుద్దుతారని రివర్సులో ప్రశ్నించేశారు.

    రంగనాయకమ్మ ఏమిచేసిందంటే … ఆపాత సిద్దాంతాలనూ, ఆచారాలనూ ఈకాలం స్త్రీల మీద రుద్దడాన్ని వ్యతిరేకించింది, ఎదిరిస్తూ వీరంతా ఫాలో అవ్వమని చెప్పే రామాయణాన్ని, ఇప్పటి పరిస్థితులకు, సిద్దాంతాలకూ, ధర్మాల ప్రాతిపధికన “రామాయణవిషవృక్షాన్ని” రాసేసింది, She turned the tables !

    అలా రామాయాణాన్ని వ్యతిరేకించడం వలన వారు సాధించింది ఏముంది ? అని ప్రశ్నించుకుంటే … చాలా ఉంది అని చెప్పాల్సి వస్తుంది ! ఇప్పుడు మగానుభావులెవరూ స్త్రీకి సీత ఆదర్శం అనడం లేదు. స్త్రీ సీతలా ఉండాలని ఎవ్వరూ చెప్పడం లేదు ! ప్రస్తుతం స్త్రీల ఆదర్శం వేరే !!

    రాముడు చేసినట్టు నువ్వు చేస్తే, గృహహింస కింద లోపలేస్తారు. అంతే కాదు, రాముడు సీతను అడవికి పంపాడు … కానీ, ప్రస్తుతం గృహహింస చట్టం ప్రకారం అడవికెల్లే బాధ రాముడిదే కానీ సీతది కాదు. స్త్రీని ఆమె “వైవాహిక గృహం” (Matrimonial House) నుండి బయటకు పంపడం నేరం. కానీ, స్త్రీ కావాలంటే… తనను భర్త వేధిస్తున్నాడని చెప్పి, తన సొంత ఇంటిలోనుండి మగవాన్ని బయటకి పంపించొచ్చు !! పొరపాటున మగవాడు ఆ ఇంటికి ఇంకా EMIలు గట్రా కడుతూ ఉంటే… అతను బయట వేరే అద్దె ఇల్లు తీసుకొని, ఆ ఇంటికి అద్దె చెల్లిస్తూ, తనను తరిమేసిన ఇంటికి EMIలు కడుతూ బ్రతకాలి. అంతే కాదు మగవాన్ని తన ఇంటి దరిదాపులకి రాకుండా చేయొచ్చు. వస్తే జైలు శిక్ష గ్యారంటీ ! అంటే ప్రస్తుతం అడవికెల్లేది రాముడేగానీ, సీత కాదు !!

    ఇంత మార్పు ఎలా వచ్చింది ? మన సాంప్రదాయ వాదులు, పెద్దలు, పండితులూ సింపులుగా ఒప్పేసుకున్నారా ? లేదు. కొంత మంది పోరాడి, స్త్రీలు “రామాయణం” చేసే బ్రెయిన్ వాష్ నుండి బయటకి వచ్చేలా చేయగలిగారు. అందులో భాగంగా అనేక కథలు, కవితలు, నాటకాలు, సినిమాలు … ఇలా ఏ సాహిత్యం పడితే ఆ సాహిత్యములో తమ తిరుగుబాటును చొప్పించారు. “ఎందుకు ? మాకు మాత్రమే ఎందుకు ?” అంటు ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఒక్క సారి ఆడవారు ఆ “రామాయణం” అనే బ్రెయిన్ వాష్ నుండి బయటకి రాగానే … మిగిలినవన్నీ ఆటోమేటిగ్గా జరిగిపోయాయి. (ఇక్కడ రామాయణం అంటే రామాయణం అనే కాదు, ఈ తరహా రాతలన్నీ ! మనుధర్మముతో సహా !!)

    అంటే జరిగింది ఏమిటంటే … ఆడదంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటు కట్టుబాట్లనూ నీతులనూ చెప్పి, వారిని కట్టేయడానికి ప్రయత్నించిన సంప్రదాయ వాదుల్నీ, పెద్దరికం వెలగబెట్టే పెద్దల్ని … చేపను గరుకు రాయి మీద వేసి తోమి పొలుసులు పీకినట్టు, చాకలి వాడు మైల పడ్డ దుస్తుల్ని బండకేసి బాదినట్టు … విరగబాదిన తరువాత ఇవన్నీ జరిగాయి !!

    ReplyDelete
    Replies
    1. మీ వాదనలోని పులుముడు "సీతను రాముడు అగ్నిప్రవేశం చేయమంటాడు. అగ్నిప్రవేశం చేస్తుందేకానీ, రామున్ని శంకించదు. రాముడు సీతను అడవిలో వదిలేయమంటాడు, అయినా సీతమ్మ అవన్నీ భరిస్తుంది." అనే ఉటంకింపుతో మొదలైంది!మళ్ళీ మళ్ళీ మళ్ళీ అదే రామాయణం చదవని,అక్కడ యేమి ఉందో తెలుసుకోని - కనీసం తెలుసుకోవాలనుకోని మొండితనం!

      గుర్రం గుడ్డిదైనా దాణాకి తక్కువ లేదన్నట్టు రాజా రామ మోహన్ రాయ్ ఉద్యమం వల్ల జరిగినదీ,వీరేశలింగం పంతులు వల్ల జరిగినదీ,గురజాదాప్పారావు వల్ల జరిగినదీ - మొత్తం అన్ని సంస్కరణల్నీ ఆఖరుది జరిగిన యాభై యేళ్ళకి పుట్టిన రంగనాయకమ్మకి ఆ ఘనకార్యాలు చేసిన కీర్తిని ఆపాదించడంలో మీరు చరిత్రని ముందుకీ వెనక్కీ జరిపిన తీరు మాత్రం చాలా అద్భుతం - కొంపతీసి తమరు స్వైరిణి పాదరేణువు కాదు గదా!

      ఇంకా నయం, రంగనాయకమ్మని గార్గి, మైత్రేయిల పక్కన నిలబెట్టారు కాదు.పెళ్ళికి సంబంధించిన నియమాల్లో గానీ మంత్రాలలో గానీ ఇద్దరికీ సమానత్వాన్ని ఇవ్వబట్టే హిందూ వివాహ వ్యవస్థ ఇంత బలంగా నిలబడిందన్నది కూడా తెలియదు - కేవలం ఇందులోనుంచి బయటపడటం ఎలాగన్న రంధీ బయటపడ్డాక ప్రదర్శిస్తున్న విశృంఖలత్వపు నిర్లజ్జా తప్ప స్రీస్వేచ్చా సిద్ధాంతులు సాధించిన పురోగామి విజయం ఏమి ఉంది?

      ఈ మధ్యనే వోల్గా రాసిన "అశోకం" కధ చదివాను.మొగుడు ఎక్కడెక్కడి ఆడవాళ్లని యెత్తుకొచ్చి కామదాహం తీర్చుకుంటుంటే దాన్ని ఆపలేక ఆ మొగుడితోనే ఒక పూలతోట ఏర్పాటు చేయించుకుని మండోదరి తెలియకుండా పూలవాసనలు ఆస్వాదిస్తూ బతికిందన్న రచయిత్రి వర్ణనల ప్రకారమే మొగుణ్ణి మార్చలేని అసమర్ధురాలు అని తెలిసిపోతుంటే మళ్ళీ ఆ మండోదరి చేత సీతకి మా ఆయన యెత్తుకొచ్చాడని యేడవకుండా నువ్వూ నాలా పూలు ముడుచుకుని ఆనందంగా ఉండమని ఉచిత బోడి సలహా ఇప్పించిన అజ్ఞానపు సుగంధం విరజిమ్మింది కధ నిండా!అసలు విషవృక్షంలో రంగనాయకమ్మ విమర్శించింది ఏ రాముణ్ణి, ఏ సీతని?శూర్పణఖని చూసి లొట్టలేసుకున్నట్టు తను చూపించిన విషవృక్షపు రాముణ్ణీ రావణాసురుణ్ణి చూసి చెమటలు పట్టేటంత మోహానికి గురయినట్టునట్టు తను చూపించిన విషవృక్షపు సీతనీ కదా!అసలు వాల్మీకి రాముడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు కదా!ఆవిద ఎవరికి ఎవరిని చూపించి ఏమి సాధించింది?తను సృహ్టించిన రాముడు హిపోక్రైటే - ఇరగదీసెయ్యాల్సిందే!తను సృష్టించిన సీత కాముకియే - శిక్షించి పారెయ్యాల్సిందే!దేన్ని మీరు విమరించింది అంటున్నారో దాన్ని ఆమె ముట్టుకోనే ముట్టుకోలేదు,ఇంక ఆమె వల్ల జరిగిన ఘోరమైన అభ్యుదయం ఏమి ఉందో నాకైతే అర్ధం కావటం లేదు?!ఈ రకం అతి తెలివియే మీకు స్వేచ్చాప్రియత్వంతో కూడిన మహామేధావిత్వం కింద కనబడుతున్నది కాబోలు!

      దొందూ దొందే అన్నట్టు అదే రకం అజ్ఞానంలో ఉనవాళ్లకి అదే రకం సాహిత్యం నచ్చడంలో ఆశ్చర్యం లేదు గానీ అంతకుముందరే సంస్కర్తల వల్ల జరిగినవాటిని తర్వాతెప్పుడో పుట్టిన వాళ్లకి అంటగట్టడం మాత్రం ఎవ్వరూ సహించలేని విషయం.

      Delete
    2. Vishavriksham Is criticized because its illogical and is devoid of common sense.

      Some stuff out here

      http://vishapurugu.blogspot.com/?m=1




      Delete
    3. @Anon
      రాముడు చేసినట్టు నువ్వు చేస్తే, గృహహింస కింద లోపలేస్తారు. అంతే కాదు, రాముడు సీతను అడవికి పంపాడు … కానీ, ప్రస్తుతం గృహహింస చట్టం ప్రకారం అడవికెల్లే బాధ రాముడిదే కానీ సీతది కాదు. స్త్రీని ఆమె “వైవాహిక గృహం” (Matrimonial House) నుండి బయటకు పంపడం నేరం. కానీ, స్త్రీ కావాలంటే… తనను భర్త వేధిస్తున్నాడని చెప్పి, తన సొంత ఇంటిలోనుండి మగవాన్ని బయటకి పంపించొచ్చు !! పొరపాటున మగవాడు ఆ ఇంటికి ఇంకా EMIలు గట్రా కడుతూ ఉంటే… అతను బయట వేరే అద్దె ఇల్లు తీసుకొని, ఆ ఇంటికి అద్దె చెల్లిస్తూ, తనను తరిమేసిన ఇంటికి EMIలు కడుతూ బ్రతకాలి. అంతే కాదు మగవాన్ని తన ఇంటి దరిదాపులకి రాకుండా చేయొచ్చు. వస్తే జైలు శిక్ష గ్యారంటీ ! అంటే ప్రస్తుతం అడవికెల్లేది రాముడేగానీ, సీత కాదు !!

      hari.S.babu
      అన్ని కాలాలకీ అన్ని ప్రాంతాలకీ ఒకే ధర్మం అనె కాన్సెప్తుని అసలు సనాతన ధర్మమే ఒప్పుకోలేదు కదా,ఇంక మీరు చేపని బండకేసి రాచినట్టు ఆయాసపడాల్సిన అవసరం యేమిటి?

      ఒక పని చెయ్యాలా వద్దా అన్నప్పుడు మొదట వేదంలో రిఫరెన్స్ ఉంటే వేదాన్ని పాటించాలి,లేనప్పుడు పాటించడం కోసం శ్రుతీ,స్మృతీ అనేవాటిని యేర్పాటు చేసినది యేవరు?మీరు రప్పాడిస్తే చేసారా?లేదే!మీరూ విషవృక్ష రచయిత్రీ పుట్టకముందే అవన్నీ ఉన్నాయి గదా!ధర్మంలో మార్చకూడనివీ,మార్చుకోదగినవీ కూదా ముందే నిర్వచించి రెండవ రకం పట్ల స్వేచ్చని ఆది నుంచీ ప్రజలకి ఇచ్చింది సనాన ధర్మం.

      హిందూమాతంలో జరిగిన ఏ సంస్కరణా ఒక సంస్కర్త గట్టిగా ప్రయత్నం మొదలుపెట్టిన పది సంవత్సరాలకి యెక్కువ తీసుకోకుండానే ఉనికిలోకి వచ్చింది!విధవా పునర్వివాహం,స్త్రీవిద్య లాంటివన్నీ అతి తక్కువ కాలంలోనే సంఘంలో రూపు దాల్చాయి.కొత్త దారికి వెళ్లేటప్పుడు సమాజంలో ప్రకంపనలు సహజం - అది లేకపోతేనే ఆశ్చర్యపోవాలి!మీరు పట్టించుకోలేదో మరి పట్టించుకున్న నిర్లక్ష్యం చేసారో గానీ ఆ సంస్కర్తలు కూడా తమ సంస్కరణల కోసం సనాతన ధర్మం యొక్క సాహిత్యాన్నే ఆలంబన చేసుకున్నారు.నేనూ నా కోడీ నా కుంపటీ మనస్తత్వం నుంచి బయటపడి చారిత్రకంగా చూస్తే ప్రతి సంస్కర్త తన జీవిత కాలంలోనే ఆశించిన మార్పును సాధించి ప్రజల నుంచి గౌరవాదరాలు అందుకున్నారు.సహజంగానే హిందువులలో మారే లక్షణం ఉంది - మీరో మరొకరో ఉతికి ఆరేసేవరకు యెదురు చూడలేదు.

      Delete
    4. విషవృక్షములో రంగనాయకమ్మ వీమర్శించింది ఎందుకు ?

      రామాయణం ఇంఫ్లూయెన్స్ జనాల మీద తగ్గించడానికి. గోల్ అదే.

      రామాయణ విషవృక్షం లాజికలుగా ఉండదు. అందులో లాజిక్కులు వెతకడం వృధా అని నా ఫీలింగ్ కూడా. అసలు అది కొంత మందికి "సెన్స్‌లెస్" అనిపించినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. మరి అలాంటిది ఎందుకు రాయడం అంటే... నాకు తట్టిన సమాధానం ... "ధిక్కారం". నేను దాన్ని ధిక్కరిస్తున్నాను అని తెంపరితనముతో చెప్పడం. తద్వారా, రామాయణం పవిత్రం, దాని గురించి తప్పుగా మాట్లాడకూడదు విమర్శించకుడదు అనే భావాన్ని పోగొట్టడం. ఒక్కసారి ఆ భావం పోయిన తరువాత .. అందులో "స్త్రీల మీద" ఆపాదించినవన్నీ కూడ ఒక్కోక్కటీ దిక్కారానికే లోనవుతాయి.. నిదానంగా ! ఇది రామాయణం ఒక్కదానికే కాదు అన్ని రకాల మత గ్రంధాలు, సృతులు గట్రా గట్రా అన్నింటికీ వర్తిస్తుంది.

      ఇదంతా చదివి, అబ్బో అసలు సన్స్కరణలకు మూలం రంగనాయకమ్మే అన్నట్టు భలే చెప్పావుగా అనిపించొచ్చు. హరిబాబు అదే అడిగాడు.. కానీ నా ఉద్దేశ్యం అది కాదు. చాలా మంది కలెక్టివుగా చేసిన ఇలాంటి పోరాటాల ఫలితమే ఇది. ఏ ఒక్కరో చేసింది కాదు. కేవలం ఇక్కడ చర్చ రంగనాయకమ్మ రాసిన విషవృక్షం మీద కాబట్టి నేను ఆమెను సబ్జక్టుగా తీసుకొని రాస్తున్నాను అంతే.

      కొన్ని సిచ్యుయేషన్లు వివరిస్తాను చూడండి:

      1. ఒకామెను భర్త అనుమానించాడు. నీ పాతివ్రత్యం నిరూపించుకో అన్నాడు. పక్కనున్న జనాలు, రామయణములో "సీత" కంటే నువ్వేమన్నా తోపా, నీ శీలానికి ఇదే పరీక్ష అన్నారనుకోండి. ఆమె దాన్ని దిక్కరించగలగాలి. అంతే కానీ, రామాయణం రిఫరెన్సు గానే బిగదీసుకుని, దాన్ని వ్యతిరేకించడం తప్పు అన్నట్టు ఉండకూడదు. అక్కడ ఆమెకు ధైర్యం రావాలంటే.. రామాయనాన్ని అయినా సరే.. నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు దిక్కరించు అనే ధైర్యం ఆమెలో కలగాలి.

      2. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది. "ఇప్పట్లో రాముడిలా, సీతలా ఎవరుంటారు" అని. దానిలో హీరో కూడా నిజజీవితములో .. ఒకావిడతో అక్రమ సంబంద కోసం గోడదూకుతూ కాలుజారి పడి (పై అంతస్తునుండి) చచ్చాడు అని ఒక వార్త. అతను చేసిన పనిని సమర్ధించాల్సిన అవస్రం లేదు. అది రామాయణానికి దిక్కారమే అయినా మరొకటి అయినా అనవసరం. అలా ఎలా చెప్పగలం అంటే .. సింపుల్, కాస్త కామన్సెన్స్ + మనిషికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు + చట్టాలు. ఇవి చాలు.

      రామాయణం కథలా చదువుకోవచ్చు. రామున్ని దేవునిలా కొలవచ్చు. కానీ, ఒకరికి అన్యాయం రామాయణం వల్ల జరుగుతోంది అన్నప్పుడూ మాత్రం దాన్ని దిక్కరినడానికి వెనకాడ కూడదు. అలా వెనకాడ కూడదు అంటే.. రామాయణాన్ని కూడా దిక్కరించేలా ఎవరో ఒకరు రాయడం. అలా ఒకరు రాశారు.
      -------
      విశ్వవీక్షణం

      Delete
    5. @విశ్వవీక్షణం
      కొన్ని సిచ్యుయేషన్లు వివరిస్తాను చూడండి:

      1. ఒకామెను భర్త అనుమానించాడు. నీ పాతివ్రత్యం నిరూపించుకో అన్నాడు. పక్కనున్న జనాలు, రామయణములో "సీత" కంటే నువ్వేమన్నా తోపా, నీ శీలానికి ఇదే పరీక్ష అన్నారనుకోండి. ఆమె దాన్ని దిక్కరించగలగాలి. అంతే కానీ, రామాయణం రిఫరెన్సు గానే బిగదీసుకుని, దాన్ని వ్యతిరేకించడం తప్పు అన్నట్టు ఉండకూడదు. అక్కడ ఆమెకు ధైర్యం రావాలంటే.. రామాయనాన్ని అయినా సరే.. నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు దిక్కరించు అనే ధైర్యం ఆమెలో కలగాలి.

      2. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది. "ఇప్పట్లో రాముడిలా, సీతలా ఎవరుంటారు" అని. దానిలో హీరో కూడా నిజజీవితములో .. ఒకావిడతో అక్రమ సంబంద కోసం గోడదూకుతూ కాలుజారి పడి (పై అంతస్తునుండి) చచ్చాడు అని ఒక వార్త. అతను చేసిన పనిని సమర్ధించాల్సిన అవస్రం లేదు. అది రామాయణానికి దిక్కారమే అయినా మరొకటి అయినా అనవసరం. అలా ఎలా చెప్పగలం అంటే .. సింపుల్, కాస్త కామన్సెన్స్ + మనిషికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు + చట్టాలు. ఇవి చాలు.


      hari.S.babu
      మీరు కష్టపడి ఉటంకించిన రెండు ఉదాహరణలూ ఇమాజినరీ సిచ్యూయెషన్లు.అంటే హిందువులకి కామన్ సెన్సు లేదు గనక కాస్రకీ కూస్తకీ రామాయణాన్ని రిఫరెన్సు పట్టుకుని ప్రతి ఆడదానికీ శీలపరీక్షలూ అగ్నిపరీక్షలొ పెట్టేస్తారు అని మీకు మీరు వూహించుకుని ఇలా జరిగితే అలాంటి సిచ్యుయేషన్లో ఆ ఆడవాళ్లకి ధైర్యం చెప్పడానికి గానూ రామాయణం మీద గౌరవం తగ్గించడం అవసరం అన్నట్టు వాదిస్తున్నారు.అనాది కాలం నుంచీ చతిత్రలో సెతతో పోల్చి అగ్నిపరీక్షకి గురి చేసిన వాస్తవ సన్నివేశం ఒకటి చూపిస్తే బాగుండేది కదా,శాస్త్రీయమైన వాదనకి irrefutable evidence చాలా ముఖ్యం.అవి లేకుండా ఇమాజినరీ సిచ్యుయేషన్స్ చూపించడం తెలివైన వాదన కాదు.

      హిందువులకి లేదంటున్న కామన్ సెన్సు మీకు ఉందా అసలు!మీ వ్యాఖ్యలోని ఆఖరి వాక్యం ఒకసారి మీరే చదువుకోండి - మీ అగందరగోళం యేమిటో మీకే అర్ధం అవుతుంది."అతను చేసిన పనిని సమర్ధించాల్సిన అవస్రం లేదు. అది రామాయణానికి దిక్కారమే అయినా మరొకటి అయినా అనవసరం. అలా ఎలా చెప్పగలం అంటే .. సింపుల్, కాస్త కామన్సెన్స్ + మనిషికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు + చట్టాలు. ఇవి చాలు." అనేశాక ఆది నుంచీ తుది దాకా ముప్పాళ రంగనాయకమ్మనీ విషవృక్షాన్నీ ప్రస్తుతిస్తూ మీరు వేసినది సుత్తి కాదా?

      P.S:హిందువులకి కామన్ సెన్సు లేదు లెండి - ఉంటే ఆవిణ్ణి అసలు పట్టించుకునేవాళ్ళే కాదు!గణాచారి ఎంత ఛ్చెళ్ళు ఛ్చెళ్ళున కొట్టుకున్నా ఇతరులకి ఏమైనా నెప్పి ఉంటుందా?కాకపోతే కొందరు సాపేక్షమైన బాధని అనుభవించి బాధపడే అవకాశం ఉంది!రామాయణం మీద గౌరవం తగ్గించాలంటే వాల్మీకి రాముణ్ణి విమర్శించాలి!తను రూపం మార్చి రాసిన రాముడు వాల్మీకి రాముడు కాదు గదా!ఆమె విమర్శించింది విషవృక్షపు రాముణ్ణీ విషవృక్షపు సీతనీ కదా - మీరు చెబుతున్నటు ఆమె కొంతైనా విజయం సాధించింది అని చెప్పాలంటే హిందువులు రాముణ్ణి అభిమానించడం మానెయ్యాలి,లేదా తగ్గాలి.మరి అది జరిగిందా?లేదే!ఆమె కోరుకున్నదీ ఆమెకి దక్కిందీ హఠాతుగా జనసమ్మర్దంలో ఛెళ్ళు ఛ్గెళ్ళునతనని తను హింసించుకునే గణాచారికి వచ్చే ఫోకస్ మాత్రమే - అది చాలు ఆవిడకీఅ ఆవిద అభిమానులకీ.ఆవిడ దారిలోనే నడుస్తున్న కతి మహేర్ష్ కోరుకున్నది కూడా అలాంటి ఫోకస్ మాత్రమే - అందుకే రూటు మార్చి రామ కీర్తనలు పాడుతున్నాడు:-)

      Delete
  6. ప్రస్తుతం నేను నా గీ-మెయిలులోకి లాగిన్ అవ్వలేను. అందుకే అనోనిమసుగా పెట్టా.

    విశ్వవీక్షణం.

    ReplyDelete
  7. హరిబాబు గారు! ఈ నెల 27న ఈ శతాబ్దంలోనే అతిపెద్ద చంద్రగ్రహణం ఉంది కదా! మీకు తెలిసే ఉంటుంది. నా సందేహం ఏమిటంటే గ్రహణం సమయంలో మనకు అనాదిగా వస్తున్న ఆచారాలు ఆహారం తీసుకోకపోవడం,గర్భిణులు గ్రహణం చూడకుండడం ఇలాంటివి అన్నీ శాస్త్రీయమైనవేనా? లేదంటే మూఢనమ్మకాలా? నేను ఎందుకు అడుగుతున్నానంటే మన టీవీ చానెళ్ళు గ్రహణం వచ్చిందంటే చాలు రోజంతా వాయించేస్తారు అవన్నీ మూఢనమ్మకాలంటూ! మీరు తెలుపగలరు అని ఆశిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. I am not fully aware about this eclipse.And I need to check about it's full context.If I could know something valuable - I will share it here.

      Delete
  8. Thank you so much Haribabu garu

    ReplyDelete
  9. కొన్ని పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఈవాదనను నేను కొనసాగించలేను. మరెప్పుడైనా తప్పకుండా పెట్టుకుందాం దీన్ని.

    విశ్వవీక్షణం

    ReplyDelete
  10. ఒక అనామక కామెంటులో "యెదవలు మారేటప్పుడు" అనే మాట చూశాను.విశ్వవీక్షణం గారు కూడా తన ఇబ్బంది వల్ల అనామక వ్యాఖ్యల ద్వారానే వాదించారు.దీన్ని ఆయనకి అంటగడితే ఎట్లా ఉంటుంది?ఒకవేళ ఈ అనామకం ఆయన కాదు అనుకున్నప్పటికీ ఆ మాటకి అర్ధం యేమిటి?ఆ పదం హిందువులని ఉద్దేశించి వేసిందే కదా!

    ఇవ్వాళ సాయుధ పోరాటం ద్వారా వ్యతిరేకించేవాళ్లలో గట్టివాళ్ళని చంపేసి వర్గరహితసమాజం సృష్టించే అవకాశం లేదు,అవునా?ప్రజాస్వామ్యం అంటే యెన్నికల ద్వారా ఎక్కువ వోట్లు సంపాదించుకుని అధికారం చేపట్టటం.తమని యెదవలు అని తిట్టే యే గొట్టాం గాడికయినా హిందువులు వోటు వేస్తారా?వోట్లు తెచ్చుకోకుండా అధికారమూ రాదు,అధికారం రాకుండా తాము చెయ్యాల్నూన్నది చెయ్యలేరు.మరి ఈ మాటల వల్ల నష్టమే తప్ప లాభం లేదు - నోటి తీటతోనా సమాజాన్ని మార్చేది?

    సంఖ్యాపరమైన మెజారిటీ ఉన్న హిందువుల్ని యెదవలు అనే ధైర్యం సముద్రంలో కాకిరెట్టలా ఉన్న సంఖ్యాపరమైన మైనారిటీలకి యెట్లా వచ్చింది?షహీద్ భగత్ సింగ్ చెప్పాడు,ఏమని?నువ్వు ఏ ప్రజలని ఉద్ధరించాలని ప్రయత్నిస్తున్నావో ఆ ప్రజలకి నచ్చేటట్టు మెసులుకుంటూ సిద్ధాంతాన్ని గెలిపించాలని.లెనిన్ తను రష్యాని పట్టుకున్న వెంటనే "జాతుల స్వయంనిర్ణయాధికారం" గురించి మాట్లాడాడు,దాని అర్ధం ఏమిటి?బయలాజికల్ ధియరీ ప్రకారం మానవులు అంతా ఒకటే జాతి,మరి లెనిన్ జాతులు అన్నవి యేవి?ప్రతి ప్రాంతంలోనూ కొన్ని తరాల పాటు కొన్ని ఆత్మీయమైన విషయాలతో కూడిన సామూహిక వారసత్వాన్ని పంచుకుటూ వస్తున్నవాళ్లని కదా జాతి అని లెనిన్ పిలిచింది!ఆ సామూహిక వారసత్వంలో ఎక్కువ శాతం ఆధ్యాత్మికతకీ మతానికీ సంబంచినవే అని అతనికి తెలియదా?మరి నువ్వు హిందువుల్ని యెదవలని యెందుకు అంటున్నావు?

    ముందు నీ అహంకారాన్ని తగ్గించుకో!తర్వాత భాషలోకి మర్యాదని తెచ్చుకో!కాలం మారిపోయిందని తెలుసుకుని ఒళ్ళు దగ్గిర పెట్టుకుని మాట్లాడు - తెలిసిందా?

    ReplyDelete
  11. * సంఖ్యాపరమైన మెజారిటీ ఉన్న హిందువుల్ని యెదవలు అనే ధైర్యం సముద్రంలో కాకిరెట్టలా ఉన్న సంఖ్యాపరమైన మైనారిటీలకి యెట్లా వచ్చింది? *

    దానికి కారణం స్వాతంత్రపోరాట సమయంలో బ్రిటీష్ వాడి సహాయ సహకారాలు మైనారిటి లకు ఉండటం. వారి మనసులను గెలుచుకోవటానికి గాంధి విశ్వ ప్రయత్నం చేస్తూ వారితో మెత్తగా వ్యవహరించటం. ఆ విధానం తప్పని అంబేడ్కర్ ఎమి చెప్పారంటే

    Appeasement VS Settlement - Ambedkar
    ********************************************

    Settlement means laying down the bounds which neither party to it can transgress. Appeasement sets no limits to the demands and aspirations of the aggressor. Settlement does.
    It seems to me that the Congress has failed to realize two things. The first thing which the Congress has failed to realize is that there is a difference between appeasement and settlement, and that the difference is an essential one.

    Appeasement means buying off the aggressor by conniving at his acts of murder, rape, arson and loot against innocent persons who happen for the moment to be the victims of his displeasure. On the other hand, settlement means laying down the bounds which neither party to it can transgress. Appeasement sets no limits to the demands and aspirations of the aggressor. Settlement does.

    The second thing the Congress has failed to realize is that the policy of concession has increased Muslim aggressiveness, and what is worse, Muslims interpret these concessions as a sign of defeatism on the part of the Hindus and the absence of the will to resist. This policy of appeasement will involve the Hindus in the same fearful situation in which the Allies found themselves as a result of the policy of appeasement which they adopted towards Hitler. This is another malaise, no less acute than the malaise of social stagnation. Appeasement will surely aggravate it. The only remedy for it is a settlement. If Pakistan is a settlement, it is a proposition worth consideration. As a settlement it will do away with this constant need of appeasement and ought to be welcomed by all those who prefer the peace and tranquillity of a settlement to the insecurity due to the growing political appetite shown by the Muslims in their dealings with the Hindus.

    DR. BABASAHEB AMBEDKAR : WRITINGS AND SPEECHES VOL8
    Page No: 270

    https://www.mea.gov.in/Images/attach/amb/Volume_08.pdf


    ReplyDelete
    Replies
    1. సెటిల్ చెయ్యాలంటే వాళ్లకి "ఈ దేశం నాది.ఇక్కడ నాకు స్వేచ్చ ఉంది!" అనే ధీమాని ఇవ్వాలి.అంబేద్కర్ సెటిల్మెంట్ అప్పీజ్మెంట్ అనే రెండు మాటలకీ తేడా ఏంటో చెప్పిన దాన్ని బట్టి చూస్తే కాంగ్రెసు ఎప్పుడూ ముస్లిముల్ని గానీ దళితుల్ని గానీ సెటిల్ చెయ్యాలని అనుకోలేదని స్పష్టం అవుతున్నదిది.గొడవ చేసినప్పుడు తాయిలం ఇస్తే చాలు అనే ధోరణిలో వాళ్ళకి అనంతకాలపు పరాయితనాన్నే ఇచ్చింది!

      కాంగ్రెసు వాళ్ళకి చేసిన అన్యాయం ఏమిటో కూడా వాళ్ళకి తెలియటం లేదు.వాళ్లని ఈ దేశంలో సెటిల్ చెయ్యాల్సిన బాధ్యతని వదిలేసి వాళ్లని main productive sphereకి కావాలనే దూరం చేసి ఎప్పటికీ పైకి వచ్చే వీలు లేకుండా మైనారిటీ పంజరానికి మాత్రం పరిమితం చేసి వోటుబ్యాంకు(పెంపుడు చిలక)లా వాడుకుంది!



      ఎప్పటికైనా ఈ చిలకపలుకుల్ని వదిలేసి మైనారిటీ ముద్రని తొలగించుకోవాల్సిందే!ఆఫ్రో అమెరికన్ దళిత సాహిత్యం అక్కడి క్రైస్తవం మీద చేసిన తిరుగుబాటు సాహిత్యం,దానిని ఇక్కడ హిందూయిజానికి అప్లై చెయ్యదమే వాళ్ళు చేసిన పొరపాటు.అక్కడ వెయ్యేళ్ళ పాటు నడిచీన్ చీకటి యుగాన్ని అంతం చేసుకోవడానికి వారు స్పూర్తిని పొందింది హిందూమతం నుంచే నేది వారిలోనే కొందరు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు - సంతోషం!

      Delete
  12. See how propaganda going on against India. Beware and condemn.

    India: deleting Muslims
    Emma Ruby-Sachs - Avaaz

    Dear friends,

    In a few days, India will delete as many as 7 million Muslims in Assam State from its master list of “citizens” because they speak the wrong language and worship the wrong God.

    Husbands, wives, and children could be torn apart and left to rot in prison camps.

    This is how genocides begin - how the nightmare of the Rohingya began. But it’s all unfolding quietly -- if we raise a massive alarm calling for the UN Secretary-General and key governments to intervene - we can stop this horror before it starts. Add your name with one click:

    Raise the Alarm

    To the UN Secretary General and the whole international community:
    We urge you to issue an early warning about the publication of the National Register of Citizens (NRC) in Assam State in India -- which could lead to mass violence, ethnic cleansing, and the transfer of minority Muslims to prison camps for life. As global citizens we ask that the UN and other concerned governments work with India and Bangladesh to ensure there is scrutiny over the NRC process, that it complies with human rights standards, and that no one is left stateless.

    Raise the Alarm

    The Assam government has already begun quietly building another new prison camp and deploying troops.

    Like the Burmese regime that attacked the Rohingya, the government claims they’re acting against illegal immigrants from Bangladesh. But the vast majority of the people targeted are just poor, illiterate Muslim citizens without "proper" documentation. They’ve never needed it before!

    António Guterres, the Secretary General of the UN, has pledged to fight on behalf of those who can't: “I will raise my voice. I will take action. I will use my rights to stand up for your rights.” We need to hold him to those words because right now the Bengali Muslims in India have no one to speak for them on the global stage -- except us. Sign the petition and together we can stop a road to genocide in Assam:

    Raise the Alarm

    The rise of virulent Hindu nationalism in India is behind this aggressive move to render millions of Muslims stateless and vulnerable. History teaches us that these movements know no limits except the ones citizens set for them. Let’s draw a line in Assam, and send a message to governments everywhere - we’re watching.

    With hope and determination,

    Emma, Nate, Ricken, Antonia, Flora, Alice, Wissam, Danny and the entire Avaaz team

    More information:

    More than 7 million people, including 2.9 million married women, asked to prove citizenship as part of massive exercise (Al Jazeera)
    https://www.aljazeera.com/indepth/features/assam-counts-citizens-muslims-fear-left-180530080633948.html

    Stateless in Assam (The Indian Express)
    https://indianexpress.com/article/opinion/national-register-of-citizens-5030603/

    Assam CM: No fundamental rights for those failing NRC tests (Times of India)
    https://timesofindia.indiatimes.com/india/assam-cm-no-fundamental-rights-for-those-failing-nrc-test/articleshow/62344296.cms?from=mdr

    The dark side of humanity and legality: A glimpse inside Assam's detention centres for 'foreigners' (Scroll.in)
    https://scroll.in/article/883936/assam-citizens-register-detention-centres-for-foreigners-offer-a-glimpse-of-the-looming-tragedy

    With final NRC draft to be released in 20 days, Assam witnessing rise in suicides (NewsClick)
    https://newsclick.in/final-nrc-draft-be-released-20-days-assam-witnessing-rise-suicides

    Assam seeks 150 companies of central forces ahead of next NRC publication (The Economic Times)
    https://economictimes.indiatimes.com/news/politics-and-nation/assam-seeks-150-companies-of-central-forces-ahead-of-next-nrc-publication/articleshow/64394147.cms

    ReplyDelete
  13. హిందువులలో ఎప్పుడైనా రెండు కులాలవాళ్ళు కలిసి ఉన్నారా? ఉంటే హిందూ మతాన్ని కూల్చడానికి కత్తి మహేశ్ లాంటివాళ్ళు అవసరం లేదు. గోదావరి జిల్లాల్లో కాపులూ, శెట్టిబలిజలూ కలిసి ఉన్న ఒక్క గ్రామాన్నైనా చూపించండి. హిందూ మతం అనేది ఎవరూ కూల్చలేని మహావృక్షం అని అప్పుడు నేను ఒప్పుకుంటాను.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...