Friday 23 March 2018

చంద్రుడు బుధుడి ఇంట్లో ఉండటం,గురువు పైకి చూడటం,శని వంకర చూపు చూడటం - అంతా ట్రాష్, గోగినేని బాబు ఈజ్ ఆల్వేస్ రైట్!

గోగినేని బాబు గొప్ప మేధావి!మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పోరాడుతున్న గొప్ప మానవవాది!అప్పట్లో ఒక చిన్నపిల్లని సొంత తల్లే దేవతని చేసి ఒక ఆశ్రమం పెట్టి వ్యాపారం చెయ్యాలనుకున్నప్పుడు అప్రస్తుతవీరవరేణ్యుడిలా పోరాడి ఆ పిల్లని ఆధ్యాత్మిక వ్యాపారానికి బలి కాకుండా కాపాడిన మంచి మనిషి!అయితే,అప్పట్లో నేనూ మీడియాలో జరుగుతున్న హడావిడిని చూశాను గానీ అప్పుడు ఇతని గురించి మాత్రం ఎక్కువ తెలియలేదు - ఇప్పుడు చూస్తే తెలుగు చానల్స్ అన్నింటిలోనూ కనబడుతున్నాడు - పుష్కరాల గురించీ గ్రహణాల గురించీ జ్యోతిషం గురించీ ఎదటివాళ్లని జవాబు చెప్పలేని చిక్కు ప్రశ్నలతోనూ తప్పులు పట్టలేని విశ్లేషణలతోనూ అదరగొడుతున్నాడు!

తనకి అహంభావం చాలా ఎక్కువ, దాచుకోను కూడా దాచుకోవడం లేదు.ఏ విషయం గురించయినా ఫుల్ క్లారిటీ ఉండి ఎదురుగా ఎవరున్నా సరే వాదనలో నేనే గెలుస్తాను అన్న ధీమా ఉన్నవాడికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, నిజమే!ఎదటివాళ్ళు తాము సపొర్ట్ చెయ్యదలుచుకుంటున్న అంశం మీద ఇతను తన వాదనని సమర్ధించుకోవడానికి చేసినంత రీసెర్చి చెయ్యకుండా వచ్చి ఇతని జిత్తులమారి తనానికి బలి కావడం వల్ల పదే పదే గెలవడం అలవాటైపోయినప్పుడు ఆత్మవిశ్వాసం ఆత్మస్తుతి కింద మారడం కూడా సహజమే - అందుకు నేను కూడా మినహాయింపు కాదు.

కానీ నేను సత్యానికి కటుబడి వాదిస్తున్నాననె ధీమాతో నన్ను నేను పొగుడుకుంటే అతను తన పాప్యులారిటీని చూపించి పొగుడుకుంటున్నాడు - "నాది ఇంటర్నేషనల్ లెవెల్!మీది గల్లీ లెవెల్!" అనీ "పోపుని అరెస్ట్ చెయ్యాలని వాళ్ళ కాంగ్రెగేషను దగ్గిరే డిమాండు చేశాను" అనీ "సౌదీ అరేబియా రాజుని నీకిక్కడేం పని అని గద్దించాను!"అని చెప్పుకోవడమే తప్ప ఆ విజృంభణ వల్ల అతను సాధించింది ఏమిటి?పోప్ అరెస్టయ్యాడా?సౌదీ అరేబియా రాజు హోదా ఏమైనా తగ్గిందా?ఏమీ జరగ లేదు!

నాకు మీడియా ఎక్స్పోజరు అక్కర్లేదు అంటున్నప్పుడు ఇంత ఎక్కువ ఎక్స్పోజరు ఎలా వస్తున్నది?జ్యోతిషం శాస్త్రీయమా కాదా అని తేల్చుకోవడానికి సుప్రీం కోర్టులో కేసు వేసినది శ్రీనివాస గార్గేయ కాదని చెప్పి కేసు వేసిన వ్యక్తి వివరాలు చెప్పడం అద్భుతమే కావచ్చు!శ్రీనివాస గార్గేయ ఆ కేసు తనే వేసినట్టు చెప్పుకుంటే అవతలి వ్యక్తి చెప్పిన అబద్ధాన్ని యెత్తి చూపించడం కూడా కరెక్టే,నైతిక విలువలు లేని వ్యాపారం చెయ్యడాన్ని ఖండించితే మెచ్చుకోవాల్సిందే.కానీ ఇతరులకి  తెలిసే అవకాశం లేదని నిర్లక్ష్యం చేశాడో,తనకి తెలిసిందే నిజం అన్న అహంకారం వల్ల ఎక్కువ తెలుసుకోకుండా వదిలేశాడో గానీ కొన్ని ముఖ్యమైన విషయాల్లో తను కూడా అబద్ధాలు చెప్తున్నాడు!

అతని వాదనాశైలిలోనూ కొన్ని స్ఖాలిత్యాలు ఉన్నాయి - ఆ వాదనల్ని మైండులో ప్రిపేర్ చెసుకుంటున్నప్పుడు "this logic will definitely bunk my opponents!They are not so brilliant like me - this is enough.I am great!" అని చెప్పేసుకుంటున్నాడు గాబట్టి అతనికి తెలియడం లేదు కాబోలు!ప్రస్తుతం అతని ముందు కూర్చుని వాదిస్తున్నవాళ్ళకి వాటిని పట్టుకోగలిగిన పాండిత్యం లేదు.శబ్దాన్ని చూపించండి,కాంతిని రుచి చూపించండి అని నిలదీసి ఏ శక్తి అయినా దాన్ని రిసీవ్ చేసుకోగలిగిన సెన్సరీ ఎలిమెంట్స్ ద్వారానే తెలుసుకోగలం అని సూత్రీకరణలు కూడా తనే చెప్పి ఇతర్ల అజ్ఞానాన్ని పోగొట్టి ఘనకార్యం చేస్తున్నట్టు మురిసిపోతున్న ఇతను దేవుడి విషయంలో కూడా అదే వర్తిస్తుందని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు?కాంతిని వినలేనట్టే శబ్దాన్ని చూడలేనట్టే దేవుణ్ణి కూడా మొండి బండ కుతర్కాలతో తెలుసుకోలేము కదా!కాంతిని గ్రహించటానికి కన్ను ఉన్నట్టే శబ్దాన్ని గ్రహించటానికి చెవి ఉన్నట్టే దైవం గురించి తెలుసుకోవటానికి బుద్ది ఉంది.దాన్న్ని ఉపయోగించాల్సిన పద్ధతిలో ఉపయోగిస్తే దేవుణ్ణి చూడవచ్చు - నేను చూస్తున్నాను కదా!నాకు దొండకాయ కూర అంటే చాలా అసహ్యం!"దేవుడా!జీవితంలో ఒక్కసారి కూడా దొండకాయ కూర తినకుండా చూడు!" అని దేవుడికి దణ్ణం కూడా పెట్టుకున్నాను,ఏం లాబ్ఘం?మా బంగారానికి దొండకాయ వేపుడు చాలా ఇష్టం, చేస్తుంది, తింటూన్నాను - నాలాగా ఎందరో!అదృష్టం బాగుండి భార్యకి కూడా దొండకాయ ద్వేషం ఉంటే వాళ్ళు దొండకాయని తప్పించుకోగలుగుతారు గోగినేని బాబు దేవుడితో సంబంధం లేకుండా బతికినట్టు - అలా అందరికీ కుదిరి చావదే,నేను నా దురదృష్టం ఇంతే అని సరిపెట్టుకుంటున్నానే గానీ దేవుడు ఉన్నాదని నమ్మేవాళ్ళంతా అజ్ఞానులే అంటున్న గోగినేని బాబు లాగ దొండకాయ తినేవాళ్ళంతా దుష్ట దుర్వార నీచ నికృష్ట కబంధులు అని హుంకరించటం లేదే!నేను చెప్పిన జవాబుకి అతడు వాడుతున్న లాజిక్కునే వాడాను - జస్ట్ కామన్ సెన్సుని మాత్రమే వాడాను!

సనాతన ధార్మిక సాహిత్యం అత్యంత విస్తారమైనది.మానవ జాతి ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అనెది ఇప్పటికీ రూఢి కాలేదు.క్రీ.శ 2003లో చెప్పిన తొలి మానవ జాతి ఆవిర్భావం రెండులక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో జరిగిందనీ మూడుసార్లు ఫెయిలయ్యి ఆలుగోసారి 80,000 సంవత్సరాల క్రితం ఒక గుంపు భారతదేశం చేరిందనీ ఇక్కడి నుంచే మానవులు అన్ని ఖండాలకీ వెళ్ళడం వల్ల సకల నాగరికతలకీ భరతఖండమే పుట్తినిల్లు అనే నిర్ధారణ కూడా పూర్తి యదార్ధం కాదు.ఎందుకంటే,కంభంపాటి అస్త్యనారాయణ లాంటివారు రాసిన ఆంధ్రుల చరిత్ర గురించిన పుస్తకాల్లో పెద రావూరు,చిన రావూరు లాంటి తెలుగు ప్రాంతాల్లో అయిదు లక్షల సంవత్సరాల క్రితమే మానవ నివాసాలు ఉన్నట్టు శిలాజాల ద్వారానూ అక్కద దొరికిన పనిముట్లని విశ్లేషించడం ద్వారానూ నిర్ధారించి చెప్పారు.ఇంకా వెనక్కి వెళ్తే ఉత్తర దేశంలోని భీం బైట్కా గుహాల్లో ఏడు లక్షల సంవత్సరాల క్రితం మనుషులు గీసిన బొమ్మలు కనిపిస్తునాయి - ఇవన్నీ ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ఫలితాలే!

సనాతన ధార్మిక స్సహిత్యంలోని కొన్ని వర్ణనలూ సంఘటనలూ కధాంశాలూ భ్హూమి మీద ఇపుడు విడి ఖండాలుగా కనబడుతున్న ఒకప్పటి ఏకఖండం గురించి ఆధునికులు చెబుతున్న pan geo,Gondwana లాంటి విషయాలు వారికీ తెలుసునని నిరూపిస్తున్నాయి.వాస్తవానికి అవి కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితపు సంగతులు - అప్పటికి మానవావిర్భావం జరగలేదని ఆధునిక శాస్త్రవిజ్ఞానం చెబుతున్నది.కేవలం రెండు వందల యేళ్ళ్ళ క్రితం నుంచే తప్పటడుగుల దశని దాటి కుదురైన నడకను నేర్చుకుంటున్న ఆధునిక  పాశ్చాత్య విజ్ఞానశాస్త్రం ఇచ్చిన మిడి మిడి జ్ఞానంతో కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే "అధాతో విశ్వ జిజ్ఞాసా అధాతో బ్రహ్మ జిజ్ఞాసా"" ఆనె సంకల్పం చెప్పుకుని "కేనేషితం ప్రతతి?" వంటి నిగూఢమైన ప్రశ్నలని తనకి తానే వేసుకుని చాలా ప్రశ్నలకి ఖచ్చితమైన జవబౌలు సాధించిన ప్రాచీన భారతీయ విజ్ఞానశాస్త్రం యొక్క ప్రతిపాదనల్ని తప్పు పడుతున్నాడు - అనంతమైన సాగరాన్ని తన బుడి బుడి అడుగులతో కొలవాలని చూస్తున్నాడు!

భగవద్గీత 10వ అధ్యాయం 10వ శ్లోకంలో "దదామి బుద్ధి యోగం" అని చెప్పిన దాన్ని బట్టి  దేవుణ్ణి చూడాలనే ఆలోచన కూడా మనంతట మనం ప్రయత్నిస్తే రాదు,జన్మజన్మల పుణ్యవిశేషం తగిన స్థాయికి చేరితే ఆయన సంతృప్తి పడి దయ తల్చి ఇస్తే తప్ప రాదు.గోగినేని బాబుకి అసలు చూడాలనే కోరికయే లేనప్పుడు "నాకు చూపించండి,అప్పుడే ఉన్నాదని నమ్ముతాను!" అని మనల్ని వేధిస్తే మనం అతనికి చూపించడం ఎట్లా సాధ్యం?ఇతరులు కూడా ఆతన్ని మార్చుదామని తపన పదకుండా అతని విధికి అతన్ని వదిలెయ్యడమే ఉత్తమం!

ఇతను చెప్తున్నవాటిలో నాకు తెలిసిన అతి పెద్ద అబద్ధం రాశుల గురించి గ్రీకుల నుంచి తెలుసుకున్నారనీ అంతకు ముందు మనవాళ్ళకి రాశుల గురించి ఏమీ తెలియదనీ దబాయించి మరీ చెప్పడం.గ్రీకుల వైభవం వారు చెప్పుకున్న చరిత్ర ప్రకారమే క్రీ.పూ 776 నుంచి మొదలవుతుంది.అప్పటికప్పుడు హఠాత్తుగా మొదలవదు కదా అని వెనక్కి వెళితే  క్రీ.పూ 1200 నుంచి క్రీ.పూ 1000కి మధ్యలో చిన్న స్థాయిలో మొదలై ఉండవచ్చు.అయితే మొదటి ఒలింపిక్స్ జరిగిన క్రీ.పూ 776 నాటికి ఇతరులకి తెలిసేటంత స్థాయిలో గుర్తింపు పొంది వారు కూడా ఆ సంవత్సరాన్నే తమ చరిత్రలో మొదటి సంవత్సరం అని చెప్పారు.అంటే,విద్య గానీ వ్యాపారం గానీ ప్రాభవం గానీ ఇప్పుడు మనం తెలుసుకోవాలనుకుంటున్న రాశుల గురించిన జ్ఞానం గానీ శైశవ దశలోనే ఉండి ఉండాలి - చరిత్రకారులు చెప్తున్న విషయం కాబట్టి నమ్మి తీరాలి.

గోగినేని బాబుకి గ్రీకుల పట్ల ఉన్న భక్తి వల్ల "వారు ఎంతటి సంక్లిష్టమైన విషయాలను కూడా అత్యంత వేగంగా అర్ధం చేసుకుని మరింత వేగంగా సూత్రీకరణలు చెయ్యగలిగిన అఖండప్రజ్ఞానిధులు!" అని తీర్మానిస్తే తప్ప ఇపుడు గ్రెకుల నుంచి వచ్చినదిగా చెప్పబడుతున్న రాశిచక్రం అప్పటికే ఏర్పడి ఉండటానికి వీల్లేదు.Yavanesvara (149/150 CE),Sphujidhvaja (269/270 CE) వంటి గ్రీకుల రచనలుగా చెప్పనడుతున్న జోడియాక్ క్యాలెండర్లు సుమారు క్రీ.పూ 550 నుంచి క్రీ.పూ 330 మధ్యన రాసినవిగా కనబడుతున్నాయి.

అతనికి తెలియదో లేక తెలిసినా తన ఆత్మీయల చిక్కుల్నీ ఇబ్బందుల్నీ లోపాల్నీ నష్టాల్నీ చూపించడం ఇష్టం లేక చెప్పడం లేదో గానీ ఆనాటి గ్రీకు రాశి చక్రాన్ని క్రైస్తవం పెరుగుతున్న తొలి దశ లోని అంధ యుగం మింగేసింది!అంధయుగం పోయి వెలుగు యుగం వచ్చి టాలెమీ కాలం తర్వాత కొత్త విషయాలు తెలుస్తున్నప్పుడు మర్చిపోయిన పాత విషయాల్ని గుర్తు చేసుకుని పేర్చిన రూపమే ఇప్పటి గ్రీకో రోమన్ జోడియాక్ చక్రం.కానీ క్రీ.పూ 3000 నాటి రుగ్వేద కాలానికే ఇక్కడి మేధావులు ఉండవలసిన అన్ని అంశాలతో కూడిన క్యాలెండరును తయారు చసేశారు - రాశిచక్రపు వివరాలతో సహా!

"సూర్యుడు నక్షత్రం అని తెలియదా నవగ్రహాల్లో చేర్చారు?నవగ్రహాల్లో భూమిని ఎందుకు చేర్చలేదు, మర్చిపోయారా?" అని తెలివినీ వెక్కిరింతనీ జోడించి అమాయకమైన ముఖంతో ప్రశ్నలు వేస్తున్నాడు - ఇతని కంటె అజ్ఞానులైన ఇతని అభిమానులు భలే ప్రశ్నలు వేస్తున్నాదని మురిసి ముక్కలయ్యేటట్టు.కానీ ప్రాచీన భారతీయ విజ్ఞానులు అక్కడ ఉదహరించిన "గ్రహం" ఆనె మాటకి ఆధునిక శాస్త్రవేత్తలు పెట్టిన "planet" ఆనె మాటకి ముడిపెట్టుకుని కన్ఫ్యూజ్ అవుతున్నది "పురాణం,చరిత్ర వేరు వేరు.ప్రతి మాటకీ ఒక నిర్దిష్టమైన అర్ధం ఉంటుంది.ఒక అర్ధాన్ని డిఫరెంట్ అర్ధాలు వచ్చే మాటల్ని ఒకే ఇన్సిడెంట్ గురించి వాడితే ఎవరైనా మీలాగే కన్ఫ్యూజ్ అవుతారు" అని సుభాషితాలు చెప్తున్న తనే అని తెలియదు పాపం!

ప్రాచీన భారత్తీయుల దృష్టిలో భూమి నుంచి చూస్తే ఆకాశంలో కదులుతూ కనపడుతున్న వాటినే నవగ్రహాలలో చేర్చారు.సూర్యుడు అనే నక్షత్రమూ, చంద్రుడు అనే భూమి యొక్క ఉపగ్రహమూ, సౌరమండలంలో కంటికి కనబడుతున్న అయిదు గ్రహాలూ కలిసిన ఏడింటినీ మొదట ఒక గ్రూపులో అనుకున్నారు.సూర్యుని యొక్క కక్ష్య చంద్రుని యొక్క కఖ్యతో intersect అవుతున్న రెండు nodal pointsనీ రాహు కేతువులు అన్నారు.అవి imaginary mathmatical points మాత్రమే కనుక చాయాగ్రహాలు అన్నారు.కాల గననాన్ని నిర్దేశించటానికి అవసరమైన ఈ తొమ్మిదింటిని మాత్రమే పట్టించుకుని పనిలేని వేతనశర్మలా ఇతను లెక్కపెట్టి చెప్తున్న లక్షా తొంభై మిలియన్ల పనికిరాని వాటిని ఉన్నాయని తెలిసి కూడా ఈ లిస్టులో చేర్చలేదు, అంతే!

సనాతనధార్మికులు వేదసాహిత్యాన్ని అర్ధం చేసుకోవడానికి అనుపలబ్ది అనే సూత్రం చెప్పారు.దాని అర్ధం నువ్వు ఒక విషయం గురించి అనంతమైన వైదిక సాహిత్యంలో ఫలానా చోట ఉండొచ్చునని నీకు నువ్వే అంచనా వేసుకుని నీకు దొరికిన ఒక మూల వెదికి అక్కడ లేకపోతే మొత్తం వైదిక సాహిత్యంలో ఎక్కడా లేదని తీర్మానించకూడదు అని.ఎందుకంటే,ఇవ్వాళ వైదికయుగం అని అనుకుంటున్న కాలం ఆ సాహిత్యం మొత్తం అపుడు పుట్టిన కాలం కాదు,కొన్ని లక్షల సంవత్సరాల వెనక నుంచి గురుశిష్యపరంపర ధారణ చేసుకుంటూ వచ్చిన దాన్ని గ్రంద్జస్థం చేసిన కాలం మాత్రమే!గురుశిష్యపరంపరలో నడిచిన జ్ఞానప్రవాహం యొక్క స్వరూపం ఎలా ఉంటుందొ తెలుసా!ప్రతి విషయానికి సంబంధించి ఒక సూత్రం, దాని విశ్లేషణ,వాస్తవ జీవితంలో ఉపయోగించాల్సిన విధానం ఉంటాయి కదా - మొదటి తరం గురువు సూత్రాన్ని మాత్రం చందస్సులో బిగించి మొదట శిష్యులతో దాని కంఠస్థం చేయించి అప్పుడు మిగిలిన రెండింటినీ తను వివరించి చెప్పేవాడు.శిష్యుల్లో ఆచార్యత్వాన్ని స్వీకరినంచినవాళ్ళు కూడా తర్వాత తరపు శిష్యులకి మొదట సూత్రాల్ని కంఠస్థం చేయించి వివరణల్మి చెప్పేవాళ్ళు.వేదాల్లో ఒక అక్షరాన్ని కూడా మార్చకూడదన్నది కూడా అందుకే.ఆ శ్లోకాల్లోని ప్రతి పదానికీ ఒక కోడింగ్ ప్యాటర్న్ ఉంటుంది.ఆ కోడింగ్ ప్యాటర్న్ అలా ఉన్నది అలా ఉంటేనే దాన్ని డీకోడ్ చేసి విశ్లేషణని కొనసాగించటం కుదురుతుంది.

వేదకాలంలో రాశులను గురించి మనవాళ్ళకి తెలియదు గ్రీకులు కనుక్కున్న తర్వాతనే వాళ్ల నుంచి నేర్చుకున్నాక పుట్టిన సాహిత్యంలోనే కనబడుతున్నాయి అని బల్లగుద్ది చెప్తున్న గోగినేని బాబు వాటి గురించి ఎక్కడ వెతకాలో అక్కడ వెతకలేదు.లేని చోట వెతికి అక్కడ లేవు గాబట్తి వాళ్ళకి రాశుల గురించి తెలియదని వదరుతున్నాడు.`ఋగ్వేదంలో దీర్ఘతమసుడు చెప్పీన సూక్తాల(RV I.140 – 164)లో స్పష్టమైన  వివరణలు ఉన్నాయి.`ఋగ్వేదకాలం, క్రీ.పూ 4,000 నుంచ్గి క్రీ.పూ 1500 మధ్య అని ఇప్పటికే నిర్ధారంచారు.మరి గ్రీకుల నాగరికత క్రీ.పూ 700 నుంచే మొదలైందనేది కూడా నిర్ధారణ అయ్యింది - మరి నిన్నటి గ్రీకులు చెప్తేనే మొన్నటి వైదీక ఋషులకి రాశుల గురించి తెలిసింది అని ఇతను ఎట్లా చెప్తున్నాడు?

పోనీ ఈయన అహాన్ని చల్లార్త్చడానికీ ఈయన మాటని నిలబెట్టడానికీ వైదిక కాలంలో ప్రిమిటివ్ నాలెడ్జి మాత్రమే ఉంది,గ్రీకులు ఆ నాలెడ్జిని డెవలప్ చెసుకోవడానికి సహాయం చేశారు అని అనుకోవడానికి కూడా వీల్లేదు.360 డిగ్రీల చక్రం గురించి చెప్పాడు.(RV I.140 – 164) దగ్గిర రాశులకి సంబంధం ఉన్న 12, 24, 36, 48, 60, 72, 108, 432, 720 వంటి సంఖ్యల మధ్యన ఉన్న సంబంధాల్ని కూడా వివరించాడు.720 అంటే ఏమిటో తెలుసా ప్రతి డిగ్రీ దగ్గిర ఒక జంట అస్తిత్వాలు ఉంటాయి.దీన్ని సగం చేస్తే 360 వస్తుంది కదా!(RV I.155.6) దగ్గిర "With four times ninety names (caturbhih sakam navatim ca namabhih), he (Vishnu) sets in motion moving forces like a turning wheel (cakra)." అని చెప్పాడు.మరొక చోట ముగ్గురు సోదరులను గురించి చెబుతాడు.వారి వర్ణనలని బటి చూస్తే 12 రాశులనీ నాలుగేసి చొప్పున మూడు భాగాలు చేసినప్పుడు మొదటి నాలుగు రాశులూ సూర్య తత్వాన్నీ రెండవ నాలుగు రాశులూ వాయు తత్వాన్నీ మూడవ నాలుగు రాశులూ అగ్నితత్వాన్నీ ప్రదర్శిస్తాయనీ తెలుస్తుంది.మరి ఇవన్నీ ఇతనికి ఎందుకు కనిపించలేదు?

అందరికీ అన్నీ మేమే నేర్పాం అనడం సాంస్కృతిక సామ్రాజ్యవాదం అని మాటిమాటికీ చిలకపలుకులు పలికే ఇతనికి కేవలం సైంటిస్టులే కాదు ప్రపంచంలో అనేక దేశాల నాగరికతల్నీ చరిత్రల్నీ తులనాత్మకమైన అధ్యయనం చేసిన ప్రతి మేధావీ భరతఖండమే సకల నాగరికతలకూ మాతృభూమి అని ఒప్పుకోవడం తెలియదా?ఒకవేళ మన దేశపు గొప్పదనం సందేహాస్పదం అయితే అప్పుడు తప్పు పట్టవచ్చు గానీ అందరూ ఒప్పుకున్న మన గొప్పని మనం చెప్పుకుంటుంటే ఇతనికి కంటగింపు దేనికి?అక్కడెక్కడో ఏదో యూనివర్సిటీలో జ్యోతిషం సబ్జెక్టుని తీసేశారు,ఇక్కడ కూడా ఆర్ట్స్ గ్రూపులో చేర్చారు, ఎంటర్టెయిన్మెంట్ కింద చేర్చారు అంటాడు ఎక్కడైనా బోటనీ,జువాలజీ,కెమిస్ట్రీ,ఫిజిక్స్,ఇంజనీరింగ్ సబ్జెక్టుల్ని మాత్రమే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నారు.ఇతని లెక్కన ఆర్ట్స్ గ్రూపులో ఉన్న ఎకనమిక్స్,సైకాలజీ లాంటివి కూడా జ్యోతిషం లాంటివేనా?తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నట్టుంది ఇతని వ్యవహారం.

క్రీ.శ 550 నాటి వరాహమిహిరుడు ఇప్పటి ఇరాన్ ప్రాంతం నుంచి భారతదేశానికి వలస వచ్చి ఉజ్జయినిలో స్థిరపడిన కుటుంబం లోనివాడే!మ్లేచ్చులు,యవనులు అనే పదాల్ని మనవాళ్ళు తిట్ల కింద  వాడుతున్నారని ఎర్ర మేధావులు ఎగిరెగిరి పడతారు గానీ వాళ్లు కూడా మనవాళ్ళే.యయాతికి దేవయాని వల్ల ఇద్దరూ శర్మిష్ఠ వల్ల ముగ్గురూ కొడుకులు పుట్టారు - యదు,తుర్వసు,ద్రుహ్యు,అను,పూరు అనే వాళ్లనుంచి వరస ప్రకారం యదు వంశం,యవన(Turkish)వంశం,భోజ వంశం,మ్లేచ్చ(Greek)వంశం,పౌరవ వంశం పెరిగి భూమి సమస్తానికి వ్యాపించి సనాతనధర్మాన్ని విశ్వవ్యాప్తం చేశారు.ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు అప్పటి వరకు ఇక్కడ పోగుపడిన జ్ఞానరాశిని తీసుకువెళ్ళి అక్కడ తమ ప్రజ్ఞతో దానిని పెంచారు.తిరిగి ఇక్కడి వారికి పరిచయం చేశారు.ఇక్కడి వారు కూడా ఈ మధ్యన పెంచిన జ్ఞానరాశికి దానిని కూడా జత చేశారు.ఇప్పటి హిందూద్వేషుల వలె వారు వీరిని కానీ వీరు వారిని కానీ ద్వేషించలేదు,అవమానించలేదు - అందరిదీ ఓకే కుదురు అన్నది తెలుసు గనక వసుధైవకుటుంబభావన వారిలోనూ వీరిలోనూ మారాకులు వేసి పెరిగింది!

గోగినేని బాబు లాంటివాళ్ళు గ్రహాల్ని గురించి మొదట గ్రీకులే చెప్పారు అంటున్నారు గానీ ఆ గ్రీకులు వాటికి ఉన్న ఉపగ్రహాల గురించి ఏమి చెప్పారు?అదే వైదిక సాహిత్యం "yamagraha is luminous and together with dhooma and parivesha has crossed over to jyeshta the bright asterism ruled by Indra." అని చెప్తున్నది!మనాళ్లు వాటిని ఎట్లా చూస్తే స్పష్టంగా కనపదతాయో లెక్కలు కూదా వేసి చెప్పారు.the location of Dhooma, the upagraha of Mars can be obtained by adding 4 rashis  – 13 degrees and 20 minutes to the true rashi- degree-minute position of the Sun in a given day.పెట్టిన గడ్డి చాలునా?Parivesha, the upagraha of Moon can be obtained by adding 6 rashis to Vyatipada (the upagraha of rahu) which is already obtained by deducting 12 rashis from Dhooma!ఇవేవీ గ్రీకుల రచనలలో కనపడటం లేదు - ఎందుకు?చెప్పొచ్చేదేమిటంటే ఆదాన ప్రదానాలు రెండు వైపులకీ జరిగీనప్పటికీ ఏవరు ముందు తెలుసుకున్నారు,ఎవరి సిద్ధాంతం సమగ్రం అనే కొలతలతో నిష్పక్షపాతంగా కొలిస్తే త్రాసు భారతీయుల వైపుకే దిగుతుంది - UNDERSTAND!

"When the Gemini ascendant is occupied by a lonely Mars, not receiving any aspect and the 9th house is occupied by Saturn with its aspect falling on the 3rd house of siblings, there will be 4 brothers and 2 sisters having long life. The native will be in a high profile job from his 18th to 48th year of his age. He will enjoy great popularity and Raja yoga in the period of the 6th and 11th lord Mars." - ఈ ప్రిడిక్షన్ Gary Sobers విషయంలో ఎంత ఖచ్చితంగా సరిపోయిందో ఎలుసా!Gary Sobers is the famous cricketer of West Indies having the same planetary combination of Mars and Saturn.  He was the 5th child out of 6. He was at the peak of his career between 1954 and 1974 (18th  - 38th year when he ended his cricketing career ) but continued to enjoy popularity during  the said period of Nadi. దీన్ని అశాస్త్రీయం అంటున్న గోగినేని బాబు ఆధునిక విజ్ఞానశాస్తం తనకి నేర్పిన శాస్త్రీయతతో ఇటువంటి ప్రిడిక్షన్ చెయ్యగలడా?

అందరికీ అన్నిసార్లూ ఇంత ఖచ్చితమైన ఫలితం వస్తుందనే గ్యారెంటీ లేదనేదీ నిజమే.అయితే అది చెప్పేవాడి ప్రజ్ఞని బట్టి ఉంటుంది.చదివే శాస్త్రం ఒకతే అయినా నేర్పే గురువు ఒకరే అయినా అందరు శిష్యులూ ఒకే స్థాయి పాండిత్యాన్ని సాధించలేరు కదా!అవే సైన్సు పుస్తకాలు అదే టీచర్లూ అదే రకం ఎగ్జామ్సూ అయినా కొందరికే నోబుల్ ప్రైజులు ఎందుకు వస్తున్నాయి అని అడిగితే గోగినేని బాబు ఏమి జవాబు చెబుతాడు?దానికి ఆయన చెప్పిన అవాబే దీనికీ సరిపోతుంది!

శ్లో||ఫలాని గ్రహచారేణ సూచయంతు మనీషిణ
కో వక్తా తారతమ్యస్య తమేకం వేధసం వినా?
భా||మనీషులైనవారు గ్రహచారాన్ని గమనించి ఫలితాను సూవ్హనమాత్రంగానే చెప్పగలరు.ఖచ్చితమైన ఫలితం బ్రహ్మదేవునికి మాత్రమే సాధ్యం.అయితే, జ్యోతిషం అభాసుపాలు కావటానికి డబ్బు యావతో పంచె కట్టి పిలక పెట్టి జంఝం చూపించి వేళ్ళు ముడవటం తెరవటం లాంటి యాక్షను చాలు జనాన్ని నమ్మించడానికి అని మనీషులు కానివాళ్ళు కూడా జ్యోతిష్కుల వేషం కట్టడమే కారణం - అటువంటివాళ్ళని ఉతికి ఆరెయ్యదం మంచిదే!అతని మాటల్లో "నీ జిప్పు వూడిపోయింది పెట్టుకోమంటే నా పక్కవాడికి చెప్పకుండా నాకు చెబుతున్నావు గాబట్టి నువ్వు వాడికి కూడా చెప్పేవార్కు నేను నా జిప్పు పెట్టుకోను అనడం తప్పు!" అన్న పాయింటు నాకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. అయితే, తన్ జిప్పు కూడా వూడిపోయే ఉందని తెలియదు పాపం - బుచికి బుచికోయమ్మ బుచికి!

కృష్ణస్వామి లాంటి వాళ్ళు ఎందుకు జవాబులు చెప్పలేక తడబడి పారిపోయారో తెలియదు గానీ రాశులు,గ్రహాలు,గృహాలకి సంబంధించి నేను చదివి తెలుసుకున్న ఈ కొంచెం జ్ఞానానికే జ్యోతిషంలో చెబుతున్న మానవరూప నవగ్రహాలకీ సౌరమండలంలోని గోళాకారపు నవగ్రహాలకీ పేర్లూ లక్షణాలూ కలుస్తున్నాయే తప్ప ఇవీ అవీ ఒకటి కావని తెలుస్తున్నది! ఇక్కడ ఆయా గృహాలలో ఉంటాయని చెబుతున్న గ్రహాలు మనిషి జీవితంలో ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించే కొన్ని అంశాలకి ప్రతిరూపం కల్పించి గణితశాస్త్రం ప్రకారం నిర్ధారించిన స్థిరాంకాలు.జ్యామెట్రీలో పై ఒక స్థిరాంకం,కదా!అలాగే ఇవి కూడా ఆ మనిషి జన్మించిన రేఖాంశలూ అక్షాంశాలూ జన్మతిధితో కలిసి అతని జీవితం మీద ప్రభావం చూపించే శక్తులకి ప్రతిరూపాలు.

1st: SELF, e.g. physical attributes, personality, fame & well being.
2nd: RESOURCES, e.g. family, wealth & status.
3rd: EFFORTS, e.g. younger siblings, actions, speech & courage.
4th: INTERESTS, e.g., mother, education, inner harmony & home.
5th: CREATIVITY, e.g. children, romance, speculation & trading.
6th: OPPOSITION, e.g. enemies, fixity of views, debts, health & conflict.
7th: PARTNER, e.g. husband/wife, foreign trips & leisure.
8th: ENDINGS, e.g. obstacles, death, inheritance, fathers income & beliefs.
9th: SUPPORT, e.g. father, guidance, higher thought, fortune & foreign things.
10th: CAREER, e.g. public persona, professional activities & fame.
11th: GOALS, e.g. elder brother, friends, plans, hopes, ideals & income.
12th: SEPARATION, e.g. grandfather, losses, far away places & prison.

మొదటి అంశం మనిషి యొక్క జీవితంలో అతి ముఖ్యమైనది కాబట్టి సకల జీవరాశులకీ ముఖ్యమైన సూర్య గ్రహపు లక్షణాలు ఈ అంశం యొక్క లక్షణాలతో కలుస్తున్నాయి గనక ఆ అంశానికి సూర్యుడికి సంబంధం కలిపి చెప్పారు.ఆరవ అంశంలో ఉండే నిగూఢమైన అంశాలకి అవే లక్షణాలను ప్రతిబింబించే శనితో కలిపారు.మిగిలినవి కూడా ఇలాంటి సంబంధాన్నే కలిగి ఉంటాయి.శని నెమ్మదిగా కదులుతాడు కాబట్టి మందుడు అన్నారు.ఇవి కూడా అందరు మనిషుల వ్యక్తిత్వంలో చాలా తక్కువ స్థాయిలో ప్రభావం చూపిస్తాయి కానీ కొందరిలో మిగిలిన వాటితో కలిసినప్పుడు  మాత్రం అవే జీవితానికంతటికీ ముఖ్యమైనవిగా ఆ మనిషిని ప్రభావితం చేస్తాయి.ఇవి సూటిగా ప్రభవాన్ని చూపించవు గనక వీటికి సంబంధించిన శనిది వక్రదృష్టి అన్నారు.ఇతనికేమో సనికి మెల్లకన్నా అని వెక్కిరించాలని అనిపిస్తున్నది - ఇతరుల పట్ల వారు అజ్ఞానంలో ఉన్నారని జాలి పడుతూనే మర్యాద ఉట్టిపడుతున్న ముఖంతో వెక్కిరించటం ఇతని జన్మగత సంస్కారం కాబోలు!

ఇతను నమ్ముతున్న మోడ్రన్ సైన్సులో కూడ ఐలాంటి పోలికలు ఉన్నాయి.సైకాలజీలో స్టాటిక్/స్ట్రక్చరల్ సైకాలజీ,డైనమిక్ సైకాలజీ అని రెండు ఉన్నాయి.డైనమిక్ సైకాలజీ ఎదిగుతున్న దశలలో మనస్తత్వం ఎలా మారుతుంది అన్నది చెబుతుంది.స్ట్రక్చరల్ సైకాలజీ దశలతో సంబంధం లేకుండా మొత్తం మనిషి యొక్క మూర్తిమత్వం ఎలా నిర్మించబడి ఉంటుంది అనే వివరాలతో నిండి ఉంటుంది.ఇందులో తరచు వినబడే సాంకేతిక పదాలు ఇడ్,ఇగో సూపర్ ఇగో,కాన్షస్,సబ్ కాన్షస్ వంటివి.ఇడ్(ఇదం) అంటే మనిషిలోని పశువాంచల సమాహారం.చూసిన ప్రతిదాన్నీ కోరుకునే లక్షణం.ఇగో(అహం) అనేది ఇడ్ యొక్క ప్రతిపాదనల్ని లాభమా నష్టమా అని బేరీజు వేసి లాభం అనుకుంటే ఒప్పుకోవడం,నష్టం అనుకుంటే తిరస్కరించడం చేస్తుంది.ఇడ్ వలె మనిషి పుట్టిన క్షణం నుండి ఉనికిలో ఉండదు.బయటి సమాజం విధించే శిక్షలూ సన్మానాల్ని నింపుకున్న సూపర్ ఇగో దీని మీద పెత్తనం చెయ్యడం మొదలు పెట్టాక సూపర్ ఇగోకీ ఇడ్ ప్రచోదనలకీ మధ్యవర్తిలా పనిచేస్తుంది.

ఈ మూడింటి కలయిక వల్లనే మనిషి మనస్తత్వం ఏర్పడుతుంది.ఈ మూడంటితోనూ వర్తమానంలో జరిగే అన్ని సంగతులకీ ఆ మనిషి ప్రవర్తించే పద్ధతులకి సంబంధించిన మొత్తం నిర్మితిని కాన్షస్ మైండ్(చేతన) అంటారు.అయితే,ఒకప్పుడు ఎంతో ప్రధానమై ఆ మనిషిలో విపరీతమైన స్పందనల్ని రగిలించిన సన్నివేశాల తాలూకు ప్రభావం కాలం గడిచే కొద్ది మర్చిపోయినప్పటికీ వర్తమానంలో వాటికి సంబంధం ఉన్న సంఘటన జరిగినప్పుడు గుర్తుకు వచ్చి ఆ మనిషినే ఆశ్చర్యపరుస్తాయి.అటువంటి జ్ఞాపకాల సమాహారమైన సబ్ కాన్షస్(అంతశ్చేతన) బలమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు సృజనాత్మక రంగాలలో ఎక్కువ కనిపిస్తారు.మామూలు వ్యక్తులలో చేతనకీ అంతశ్చేతనకీ మధ్య అతి ఇరుకైన నడవా ఉంటే సృజనాత్మక వ్యక్తులలోఅది విశాలమైన రహదారిలా ఉంటుంది.

అంతశ్చేతన యొక్క ప్రభావాన్ని చెప్పటానికి మనోవైజ్ఞానికులు ఒక పోలిక కూడా చెబుతారు.ఒక బీకరులో అంచు వరకు నీళ్ళు ఉన్నాయనుకోండి.అందులో ఒక క్యూబ్ ఆకారంలో ఉన్న మంచుగడ్డ వేశామనుకోండి.మంచు గడ్డ నీటిలో మునగటానికీ బైటికి కనబడటానికీ 3:1 నిష్పత్తి ఉంటుంది,అవునా?ఆ పోలికలో మన మనస్సులోని చేతన మనకు తెలుస్తుంది గానీ మనలోనే ఉన్నప్పటికీ మన చేతన ఎల్లప్పుడూ  అంతశ్చేతన వల్ల ప్రభావితం అవుతూనే ఉన్నప్పటికీ ఎప్పుడో తప్ప దాని ఉనికి మంకు తెలియదు.ఇది మనోవైజ్ఞానికులు చెప్పిన పోలికయే కదా అని ఈ పెద్దమనిషి కనిపించిన ప్రతి మనిషి శరీరంలోనూ బీకరు కోసం, అందులో ఉన్న నీళ్ళ కోసం, వాటి మీద తేలుతున్న మంచుగడ్డ కోసం ఎక్కడ వెతుకుతాడు?


తన  కొవ్వును చూసుకోలేని idiot మతానికి కొవ్వు పట్టిందని అంటున్నాడు -Shit! 

44 comments:

  1. వివేకానందుడు చెప్పినట్లు గోగినేని బాబు అనే వాడు బావిలో కప్ప లాంటోడు. సముద్రం గురించి నూతిలో కప్పకి ఎంత చెప్పినా అర్ధం కాదు. పోనీ సముద్రం అంటే ఇంత ఉంటుంది అని చెప్పినా చెప్పే వాడిని వెర్రి వాడి కింద జమకడుతుంది తప్ప తన తప్పు తెలుసుకోదు. అలాంటి నూతిలో కప్పలతో వాదించి ఉపయోగం లేదు. అలా వదిలేయడం, దాని అజ్ఞానం చూసి జాలి పడడం తప్ప మనం ఏమీ చెయ్యలేము.

    ReplyDelete
    Replies
    1. వీరిని పట్టించుకోనక్కరలేదండీ. కానీ పట్టించుకోకపోతే ప్రతీ టీవీ లోకి వచ్చి పట్టించుకునేలా చేసుకుంటారు. ఇతను మాట్లాడే నాలుగు ఆంగ్లమాటలు విని యువత పెడద్రోవన పట్టే అవకాశం ఉన్నది.

      Delete
    2. >>వివేకానందుడు చెప్పినట్లు గోగినేని బాబు అనే వాడు బావిలో కప్ప లాంటోడు

      అవునా?? అట్టాగన్నాడా? మరి జోతిష్యం చెప్పే/వినే వాళ్ళ గురించి ఏమన్లేదా రెడ్డప్పా??

      >>యువత పెడద్రోవన పట్టే అవకాశం ఉన్నది

      కాదా మరి? గ్రహణమొచ్చిందని పని మానేసుకు కూర్చునే విణ్ణాణం వాల్లకి దూరంవ్వట్లా??

      Delete
    3. వింటే వినండి... లేకపోతే మానెయ్యండి... అది మీ ఇష్టం... ఎదర గొయ్యి ఉందని చెప్పడం మా వంతు.. వినకపోతే మీ ఖర్మం.. గ్రహణం రోజున సూర్యుణ్ణి నల్ల కళ్ళద్దాలు పెట్టుకునే చూడమని సైన్స్ ఎందుకు చెపుతుంది? అది కూడా అజ్ఞానమే అందామా? మీ దృష్టిలో మనవాళ్ళు ప్రాచీన కాలంలో ఏది చెప్పినా అది నాన్సెన్సే... బానిస బ్రతుకులు ఇంకెంత కాలం... ఇప్పటికయినా నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి...

      Delete
  2. నేనూ ఈ హేతువాదుల మీద టపా పెట్టే ప్రయత్నంలో ఉన్నాను. వీరు దేవుడిని నమ్మకపోతే నమ్మనక్కరలలేదు. ఆ విషయాన్నీ అందరితో నమ్మించాలనుకోవడంలో ఉంటోంది తలనొప్పి. పైగా పెద్ద పెద్ద పండితులతో కాదు ఇతని వాదన. చిన్న చిన్న వారితోటే వాదన. అన్నిటికీ సైన్స్ అంటారు. అందుకే స్వామి పూర్ణానంద మంచి ప్రశ్న వేశారు. చూద్దాం ఏమి సమాధానం చెబుతారో.
    https://youtu.be/dPYm8rt2cbM
    హిందువుల గురించే ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, భారత దేశం లో ఎక్కువ అదే కదా అంటున్నారు. అదే నోటితో మళ్ళీ సెక్కులరిజం అంటారు. తలా తోకా లేవు వాదనలో. ప్రతి ఇంటర్వ్యూ లో హిందూ ‘సాములు ‘ అంటూ వెక్కిరించే వేమూరి రాధాకృష్ణ గారే అన్నారు ఇతని ఇంటర్వ్యూ లో ‘ పుష్కరాల గురించి స్టూడియోలో ఇంత ధైర్యం గా మాట్లాడుతున్నాము అంటే హిందూమతంలో సహనం ఉంది. అదే వేరే దేశంలో అయితే మనల్ని స్టూడియోలోంచి బయట పడగానే వేసేస్తారు’ అని .

    ReplyDelete
    Replies
    1. karl sagan himslef believed in aliens.But Once He requested Govt. when so many awkward news were spreading to put aan end to all those gossips by starting an investigation.Govt. sincerely started the investigation under a well-known scientist.He could not get any single evidence to claim the existence of aliens.But this idiot is expecting aliens to be - how funny it is!

      Delete
    2. Do one thing Chandrika, Can you track source of his funding for his events.

      Delete
  3. ప్రతి కాలంలోనూ సూడో-ఇంటెలెక్చుయల్స్ ఉంటూనే ఉంటారు కదా.

    అవునూ పైన ఒక పేరాలో “ ...... అలెగ్జాండర్ చనిపోయిన క్రీ.పూ.1200 తర్వాత ....... “ అన్నారేమిటి? అలెగ్జాండర్ మరణం క్రీ.పూ. 323 లో కదా 🤔.

    ReplyDelete
    Replies
    1. @
      విన్నకోట నరసింహా రావు
      అవునూ పైన ఒక పేరాలో “ ...... అలెగ్జాండర్ చనిపోయిన క్రీ.పూ.1200 తర్వాత ....... “ అన్నారేమిటి? అలెగ్జాండర్ మరణం క్రీ.పూ. 323 లో కదా

      hari.S.babu
      గ్రీకు చరిత్ర గురించిన ఒక వెబ్ పేజిలో చూసినట్టు గ్ర్తు.వాళ్ళ్ అచరిత్రకి సంబంధించిన మొదటి తేదీ మాత్రం క్రీ.పూ 776,అయితే అప్పటికప్పుడు పుట్టి అప్పుడే అంత వైభవం రావడం కష్టం కదా అని అంతకు ముందరి చరిత్ర గురించి తవ్వుతుంటే ఈ ముక్క కనపడింది.అలెగ్జాందరు మరణం క్రె.పూ 323 అనుకున్నప్పటికీ గ్రీకుల చరిత్రని క్రీ.పొ 1000 కన్న వెనక్కి సాగదియయలేము కదా.ఆ పాయింటు మాత్రం కరెక్టే.ఇప్పుడు మళ్ళీ వెదికే ఓపిక్ అలేదు.పోష్టులో అలెగ్జాందరు రెఫరెన్స్ తీసేస్తే సరిపోతుంది.తీస్తాను.

      పొరపాటును ఎత్తి చూపినందుకు కృతజ్ఞతలు!

      Delete
  4. ప్రాచీన భారత దేశంలో సైన్సు లేదని ఎవ్వడూ అనడు. దానికి కులం, మతం అంటగట్టి చంపేశారు. అందుకే మనకు ఇప్పటికీ మాపూర్వీకులు గొప్ప పనులు చేశారంటామేగానీ.. మేము అంతకన్న గొప్పవి చేశామని చెప్పుకోడానికి ఏమీలేదు. గోగినేనైనా.. ఇంకొకడెవడైనా ఆ సైన్సుకి మతం, కులం రనంగు పులిమి వ్యాపారాలు చేసుకు బతికే సన్నాసుల పైన యుద్ధం చెయ్యాలి.. ఆఫ్కోర్స్.. వాళ్ళనేమన్న అంటే.. హిందూ వ్యతిరేకులని ముద్రలు పట్టుకొచ్చే ధగుల్బాజీ శిష్యులుకూడా ఎప్పుడూ ఉంటారు లేండి.

    ReplyDelete
    Replies
    1. @
      bluecake
      ఆ సైన్సుకి మతం, కులం రనంగు పులిమి వ్యాపారాలు చేసుకు బతికే సన్నాసుల పైన యుద్ధం చెయ్యాలి.

      hari.S.babu
      యోగా చెయ్యమంటే ఇది హిందూ యోగులు/ఋషులు కనిపెట్టింది,ఓం అనమంటున్నారు కాబట్టి మేము చెయ్యం,చేసినా ఓకారం బదులు ఇంకోటి కూస్తాం అంటే అది యోగాకి మతాన్ని పులిమినట్టు కాదు గాబోలు తమ దృష్టిలో!

      "దానికి కులం, మతం అంటగట్టి చంపేశారు." నిన్నటి వరకో లేదా ఒక నిముషం క్రితం వరకో అసలు యాస్ట్రాలజీ సైన్సే కాదు అని మీరు కూడ అనుకుని ఉండాలి.ఇప్పుడు అది సైన్సు అయితే అయి ఉండవచ్చు,కానీ మతం రంగు పులిమారు అంటున్నారు.గ్యారీ సోబర్సు హిందువా?జ్యోతిషం హిందువులకి మాత్రమే పనిచేస్తుంది,ఇతర మతస్థులకి పనిచెయ్యదు అని ఏ సిద్ధాంతి చెప్పాడు మీకు?అట్లా చెప్పినప్పుడు గదా దానికి మేము మతం రంగు పులిమామని మీరు అనాల్సింది!గ్యారీ సోబర్సు గురించి అతను ఎన్నవ వాడుగా పుట్టాడు అనెది అతని జాతకం చూస్ చెప్పినది కాదు.ఆ రెండు గ్రహాల కలయిక జరిగినప్పుడు పుట్టే జాతకుడి గురించిన జనరల్ ప్రిడిక్షన్.అతను పుట్టినప్పుడు గ్రహస్థితి అదేలా ఉందటమూ అతని జీవితంలో ఆ అంశాలు కలవటమూ జరిగింది,ఆ గ్రహస్థిత్కి అట్ల అజరుగుతుందన్నది లేక్క ప్రకారమే నిజమయింది,అవునా!ప్రాచీన భారతీయ విజ్ఞాన్ శాస్త్రం/సనాతన ధార్మిక సాహిత్యం ఏది చెప్పినా అందరినీ ఉద్దేశించి చెప్పిందే తప్ప ఇవి హిందువులు మాత్రమే పాటించాలి అని అనలేదు కదా!

      "ఇప్పటికీ మాపూర్వీకులు గొప్ప పనులు చేశారంటామేగానీ.. మేము అంతకన్న గొప్పవి చేశామని చెప్పుకోడానికి ఏమీలేదు." అంటున్నారు,అసలు అపప్టివాళ్ళు సాధించిన వాటిని ఒప్పుకోవడానికే ఏడుస్తున్నారు,ఇంక ఇప్పటి విజయాలు మీకెక్కద కనపడతాయి?అయిన అదేనిగురించి "అంతకన్న గొప్పవి చేశామని" వేటి గురించి చెబుతున్నారు మీరు?కార్లూ విమానాలూ కనిపెట్టారు,నిజమే!కానీ వాటి వల్ల వస్తున్న కాలుష్యం సంగతి ఏమిటి?యభయ్యేళ్ళ క్రిందటి నుంచహె గోల పెడుతున్నదీ వాళే కార్లనీ విమానాల్నీ తయారు చేస్తున్నదీ వాళ్ళే,తయారీ ఆపలేనప్పుడు కనీసం కాలుష్యం తగ్గించాలి కదా,అదీ చెయ్యలేక చేష్టలుడిగి చూస్తున్నదీ వాళ్ళే,అవునా?కొంచెం వివరంగా చెప్పండి దేనితో పోటీ పడటం లేదో?జెనెటిక్ కోడ్ మొదత కనుక్కున్నది హర గోవింద్ ఖురానా!అదొక్కతే కాదు ఇద్దరు బోసులూ ప్రపంచ స్థాయిలో ప్రముకహ్ శాస్తరవేత్తలే!ఇప్పటికీ నాసా సెర్న్ లాంటి చోట్ల మనవాళ్ళు చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉన్నారు - ఇవన్నీ కట్టుకదలు కాదుగా.

      జ్యోతిషం అనేది సంస్కృతంలో ఉంది గాబట్టి వేదాల్లో ఒక భాగం కాబట్టి అవి హిందువులకి సంబంధించినవి కాబట్టి ఇతరులు వాటిని హిందూమతానికి అంటగట్టేశారు.అది సైన్సు అని ఒప్పుకుంటే గొడవే లేదు కదా,హిందూ సైన్సు అని మేము అనటం లేదు కదా ఇస్లామిక్ సైన్సు లాగ!

      నాకు తెలియక అడగటం లేదు,తెలిసే అడుగుతున్నాను - మీరు డబ్బు ఎలా సంపాదిస్తున్నారు?మీరొక ఉద్యోగం చేస్తుంటే మీ యజమనైకి మీ శ్రమ/తెలివి ఆనె దాన్ని అమ్ముతున్నారు,అవునా?మీరూ నేఅనే కాదు, ప్రతి మనిషికీ జీవనం గదవాలంటే డబ్బు కావాలి.డబ్బు కవాలంటే ఒక వస్తువును తయారు చహెసి అమ్మాలి,లేద సేవ చెసి ప్రతిఫలం తీసుకోవాలి.ఇవవే చెయ్యకుండా ఏ మనిషినా బతకగలడా - న్యాయం ఆలోచించి జవాబు చెప్పండి.

      ఒక వైద్యుడు వైద్యం ఫ్రీగా చెయ్యడం లేదు,ఒక ఇంజనీరు ఫ్రీగా ఇల్లు కట్టడం లేదు,ఒక కూలీ ఫ్రీగా మీ సామాన్లు మొయ్యడం లేదు.మరి ఒక జ్యోతిష్కుడు ఫ్రీగా ఎందుకు జాతకం చెప్పాలి?దేన్నీ అమ్మకుండా ఈ ప్రపంచంలో డబ్బు పుట్టదు - అది నూటికి నూరు పాళ్ళ నిజం!వీటిని మాత్రమే అమ్మాలి అని అనడం నియంతృత్వం - అది ఎవడూ ఒప్పుకోడు కూడా,అవునా?ఒక మనిషి దేఎన్ని అమ్మగైలిగితే దాన్ని అమ్మి డబ్బు సంపాదించడం తప్పు అంటే అతని మరణాన్ని కోరుకుంటున్నట్టు లెఖ్క!కస్టమర్ని మోసం చెయ్యనంతవరకు ఏ వ్యాపారమూ తప్పు కాదు - ఇంతకు మించి నేను చెప్పగైగింది లేదు

      Delete
    2. ప్రాచీన కాలంలో సైన్సా? ఎక్కడ. పోనీ హిందువులు తమ సైన్సు పుస్తకాలు దులిపి ప్రస్తుతం మన సైంటిస్టులు మల్లగుల్లాలు పడుతున్న ఏదో ఒక సమస్యను solve చేసి చూపించొచ్చుకదా? అది మాత్రం అవ్వదు. సైంటిస్టులు solve చేశాక మాత్రం తగుదునమ్మా అని ఏదో శ్లోకం పుచ్చుకొని "మాకిది ఎప్పుడో తెలుసు" అని ఎచ్చులు పోతుంటారు - హరిబాబు లాగా.

      ఇంతకీ హరిబాబు చెప్పేదేమిటంటే... అసత్యాల్ని ఖండించేవారు ధైర్యంగా, confident గా ఉండకూడదు. వాళ్ళు నంగినంగిగా మాట్లాడుతూ, inferiority complexతో బాధపడాలి. సరే! బాబు గోగొనేని "సన్నాసుల"మీద యుధ్దం చెయ్యడం లేదనే అనుకుందాం. మరి చిచ్చరపిడుగు, కొదమ సింహం ఏంచేస్తున్నాడు? హిందూ దేవాలయాల పోస్టులు పెట్టుకుంటూ పరవశిస్తున్నాడా? ఈయన చెయ్యడు చేసేవాళ్ళు "ఇలాగే" మాట్లాడాలంటూ సణుగుతాడు. ఆలోచనా తరంగాలు అంటూ ఒక మూర్ఖుడు నానా చెత్త రాస్తున్నాడు. వాడూ అహంభావే! వాడేదో "ఉచ్చా"టన ప్రక్రియను తలుచుకున్నంతనే ప్రయోగించగల మహానుభావుణ్ణని విర్రవీగుతుంటాడు. వాడిని చిచ్చరపిడిగుగారు యుద్ధం చెయ్యరే? వాడి పిలకమీద ఒకటి పీకితే హరిబాబు గారి చిచ్చరపిడుగాయితనం (pun intended) బయటపడుతుంది. బ్లాగులకు పట్టిన దరిద్రం ఈ హరిబాబూ, ఆ రౌడీశర్మ.


      @Jagadeesh: I pity your students man. I wonder what trash you are filling their brains with. వివేకానందుడే బావిలో కప్ప. ఇక నువ్వైతే మరీనూ. అప్పుడెప్పుడో సముద్రంలోని నీటిపై చంద్రుడి ప్రభావం అని ఒక పోస్టుపెట్టావు చూడు. అలాంటీ మాంఛి కామెడీ పోస్టు మరోసారి పెట్టొచ్చుగా?

      Delete
    3. @ketan
      ఇంతకీ హరిబాబు చెప్పేదేమిటంటే... అసత్యాల్ని ఖండించేవారు ధైర్యంగా, confident గా ఉండకూడదు. వాళ్ళు నంగినంగిగా మాట్లాడుతూ, inferiority complexతో బాధపడాలి.
      Hari. S. babu
      No no no, we Hindus should not counter even his lies about Hindus learnt about zodiac from greeks
      If we give counter we become Hindu fanatics according to you - am I right?

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. So Mr. Ketan also gets confidence by spreading lies. That's why he likes GB - birds of the same feather flock together!

      Delete
    6. @కేతన్
      మేడం కేక

      Delete
    7. @ Ketan < వివేకానందుడే బావిలో కప్ప >
      వివేకానందుడు బావిలో కప్ప అయితే నువ్వు ఏమైనా మహా జ్ఞానివా? ఈ ఒక్క స్టేట్మెంట్ చాలదా ప్రపంచంలో అతి గొప్ప మూర్ఖుడివి నువ్వే అని చెప్పడానికి.ప్రపంచం ఆయనని ఎలా గుర్తించిందో అది కూడా తెలియదా? ఏమి రేషనిష్టులురా మీరు? అసలు మీకు బుర్రలేదు. ఉన్నా అది మోకాలులో ఉందేమో!

      Delete
  5. మీకు గొగినేనిగారంత సీన్ లేదు గాని పై మీ ఆర్టికల్ లో మీ అహంకారం,అహంభావం తోనికిసలాడుతున్నాయి.మీకే అంతుంటే ఆయనకు ఎంతుండాలి?

    ReplyDelete
    Replies
    1. అతను ఎందులో ఎక్కువ?పాప్యులారిటీ ఎక్కువ,అంతేనా?
      నాకు అహంకారం ఉందని నువ్వు ఇప్పుడే కనుకున్న కొత్త నిజం కాదు గదా!
      నేను చిచ్చరపిడుగ్ని అని ఎప్పుడో చెప్పుకున్ననౌ గదా!

      Delete
    2. @
      Anonymous23 March 2018 at 21:26
      మీకే అంతుంటే ఆయనకు ఎంతుండాలి?

      hari.Sbabu
      అబద్ధాలు చెప్తున్న అతనికే అంతుంటే నిజాలు చెప్తున్న నాకు ఎంతుండాలి?

      Delete
  6. @ketan
    Well! I didn't read your post

    hari.S.babu
    Then why you started commenting on without any fact/ref/ to support your argument

    while you are talking trash,you are calling my posts as trash!So,You thinkm you are very humane and I am not - what humanit lies in supporting a man who is spreading lies in the ame of struggle aginst blind beliefs?

    You already had a well built openion on what I am saying and you believe all this is hindu-crap and that too You are not even in a mood to think positive about our religion.So I am leaving you now.But can you prove any of my posts or any of my arguments in this post are wrong with impartial refrences/satistics?

    I am a abiology student - M.Sc zoology with Animal physiology as a main subject.I know what is real science and If you had doubts I can explain you the concepts.
    about genetics, oragnic evolution and ecology.So what?THe scientists who framed those theories are also thiests and do you hate them like you are hating me?

    For your information Sir Izac Neuton, whom you call as father of the modern science is a practicing astrologder - Find facts about modern science you respect(I think it is not respect you have now,just a level of hero worship which MAKES you to feel happy for hating hinduism)!

    You are calling me near psycho - Thanks.It is your intellectual standard.Why I am a psycho?Is it for proving that GB is telling lies about greek-indian contribution to astrology.who told you we are not praising greeks?It is your implied thought even without readingg my post -am I responsible for your ignorance!

    The current hindu zodiac is the synthesis of earlier concepts and thevrecent concepts borrowed from greko babilonoan scientists.

    who is dumb here?The person who is speaking without any facts/proofs and having poor knowledge on which he tries to support - that is YOU and BLUECAKE!

    P.S:I am leaving you now.But can you prove any of my posts or any of my arguments in this post are wrong with impartial refrences/satistics?

    ReplyDelete
  7. @Ketan

    సైన్సు అనేది ఎప్పుడూ ఉంది. కాకపోతే.. పని చెయ్యడం చాతగాని కొందరు బద్దకిస్టులు దానికి మతం రంగు పులిమి అక్కడితో ఆపేశారు. ఉదాహరణకి.. చంద్రుది ప్రభావం భూమి మీద ఎలా ఉంటుంది అని చెప్పేది సైన్సు. చంద్రుడ్ని దేవుడ్ని చేసి పరిశొధనలకు పులుస్టాప్ పెట్టేది మతం. సైన్సు ఎప్పుడూ తనని తాను పరిశోధించుకుంటూ ముందుకెల్తుంది.. మతం తను చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోడానికి నానా తంటాలు పడుతుంది.

    చంద్రుడి మీదకి మనిషి కాలుపెడుతున్నాడు అని ఎప్పుడైతే తెలిసిందో... సాధువులు, సన్నాసులు, పూజారులు ఎంత గగ్గోలుపెట్టారో మనం చూశాం

    ReplyDelete
  8. >>ఒక వైద్యుడు వైద్యం ఫ్రీగా చెయ్యడం లేదు,ఒక ఇంజనీరు ఫ్రీగా ఇల్లు కట్టడం లేదు,ఒక కూలీ ఫ్రీగా మీ సామాన్లు మొయ్యడం లేదు.మరి ఒక జ్యోతిష్కుడు ఫ్రీగా ఎందుకు జాతకం చెప్పాలి?

    Simple. They above are all paying tax

    ReplyDelete
  9. @You>>who is dumb here?The person who is speaking without any facts/proofs and having poor knowledge on which he tries to support - that is YOU and BLUECAKE!

    @Me నేను చాలా క్లియర్గా అడిగాను. రాండంగా 10 పుట్టిన రోజులు ఇస్తాను అని, వారికి 100% కర్రెక్ట్ జ్యోతిష్యం చెప్పమని.. దాని గురించి మాట్లాడకుండా ఎందుకు తప్పించుకుంటున్నావ్?

    ReplyDelete
    Replies
    1. Can you give me a detailed account of a theory/concept/instrument which was coming from the modern science that gives 100 percent result.

      Try to think of reason and with minimum common sense.

      Delete
    2. నేను ఒక పోష్టు రాస్తున్నాను దీని గురించే.ఎవరికీ అంత తెలివి లేదనో ఏమో గోగినేని బాబు తను కూడా కొన్న్ని అబద్ధాలు చెప్తున్నాడు.వాటిల్లో ఒకటి రాశులను గురించి గ్రీకులు చెప్పేవరకు మన ప్రాచీనులకి అసలు రాశులు అంటే ఏమిటో తెలియాద్ట!పైన్ అవేదాల్లో లేవు,తర్వాత గ్రీకుల నుంచి నేర్చుకున్నాల్కనే వాటిని తీసుకుని వాదేసుకుంటున్నారు అని దబాయిస్తున్నాడు.నాకు అనుమానం వచ్చి వెతికితే ఱ్గ్వేదం లోనే ఉన్నాయి.దీర్ఘతమసుడు చాలా వివరమైన విశ్లేషనతో అన్ని అర్కాల గణీత్శాస్త్ర నియాలను చెప్పాడు.చారిత్రకంగ అచూస్తే వైదిక కాలం ఎంత్ ముందుకి లాగిన అక్రీ.పూ 15ఊ కన్న ఇవతలికి ఉందటానికి వీల్లేదు.గ్రీకు నాగరికాత్ వాళ్ళు ఝమాయించి చెప్పుకున్న దాన్ని బట్టే క్రీ.పూ 1000 కన్న వెనక్కి జరపటానికి వీల్లేదు.ఏమిటీ విచిత్రం?తెలివి ఉండే మాట్లాడుతున్నాడా!దీనికి తోడు ఎదటివాళ్ళని గద్దించటం "నీకేం తెలుసు?అన్నీ నాకు తెలుసు!" అని.😍

      Delete
  10. Madam,
    Do you require so many fake ids like blue cake,ketan etc for fighting a cause.

    ReplyDelete
  11. ఇన్నిసార్లు వచ్చారు గానీ ఏదేదో పొంతాన్ అలేని కబుర్లు చెప్పేస్తూ సొల్లు వాగడం తప్ప మాట్లాడే విషయానికి సమబంధించి ఒక్క విలువైన విషయం చెప్పి చావలేదు - పైన నాకు మానసిక రోగం ఆపాదించడం ఒకటి!నువ్వు దేన్నయితే గొప్పదని నమ్మి ఆ వెలుగులో దేవుడు లేడని నమ్ముతున్నానని మాకు కహానీలు వినిపిస్తున్నావో ఆ సైంటిస్టులలో నూటికి తొంభై శాతం ఆస్తికులే - - భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు అని నమ్ముతున్నవాళ్ళే - అదయినా తెలుసా కేతన్ మరియొ బ్లూకేక్ అనే అజ్ఞానఖనులకి?

    ఇక మీరు ఇక్కడ జామెంట్లు వెయ్యటం అనవసరం - అవి పబ్లిష్ కావు.

    ReplyDelete
  12. This comment has been removed by the author.

    ReplyDelete
  13. @bluecake
    Not bragging Haribabu. ........... I am willing to help you if only you are ready to help yourself.

    hari.S.babu
    చెయ్యి ఖాళీ లేదు పొమ్మంటే బిచ్చగాడు కూడా ఒక్క నుమిషం అక్కడుండడు!ఆపాటి రోషం కూడా లేదేరా నీకు?

    పోష్టు చదవలేదు అని నువ్వే చెప్పుకున్నావు - అదేదో గొప్పలాగ,పోష్టులో నేను ఏం రాశానో కూడా తెలియదు,పోనీ నువ్వు దేన్ని విమర్శిస్తున్నావో నీకు తెలుస్తున్నదా?కేతనూ నువ్వూ ఒకరే కావచ్చు,కాకపోవచ్చు - కానీ మీకే ఒక రోగం పట్టి కుళ్ళుతున్నారు అదయినా తెలుసా నీకు?

    మూఢనమ్మకాల మీద పోరాడటానికి అబద్ధాలు చెప్పాలా?క్రీ,పూ నాలుగు వేల యేళ్ళ నాటి వైదిక ఋషులకి క్రీ,పూ 576 యేళ్ళ నాటి గ్రీకులు చెప్పకపోతే రాశుల గురించి ఏమీ తెలియదని మైండు దొబ్బిన కబుర్లు చెప్పినా మాట్లాడకుండా వూరుకోవాలా?

    ఇదె నేను ఇక్కడ ప్రస్తావించిన విషయం.పోష్టు మొత్తం చదివే వోపిక లేక యేదూస్తున్నారు గాబట్టి చిన్న కామెంటి వేశాను.అందులోనూ పాయింటు అర్ధం కాలేదా?

    తెలుగు చదవటం సరిగ్గా రాని రోగం,రాసింది అర్ధం చేసుకునే తెలివి లేని రోగం - ముందు నీ రోగాల్ని సరి చేసుకో పో!

    కారుకూతలు కుయ్యడం తప్ప నువు వాదించే విషయానికి సంబంధించి నీ వాదన నిజమే అని చెప్పడానికి ఒక్క ఆధారమైనా చూపించగలిగావా?లేదు!ఉత్త సొల్లు వాగావు.ఇదేఅనా నీకు తెలిసిన scientific mwthod?నాకు నేర్పే అద్భుతమైన ప్రజ్ఞ ఉంటే అది నీ జవాబులోనే చూపించి ఉండేవాదివి గదా!

    పోరా కుక్కా,నా బ్లాగు నుంచి నేను ఎక్కడికో పారిపోతున్నానని డప్పు కొట్టుజోవటంలోనే తెలుస్తుంది నువ్వెంత చప్రాసి గాడివో.సైన్సులో తప్పులు ఉండొచ్చునట,అది తన ద్స్స్ని గొప్పదనమట, సైన్సుతప్పుల్ని సరిచేసుకుంటూ ఎదుగుతుందట - మళ్ళీ ఓ పది ర్యాండం తేదెలు తను ఇస్తే వాటికి జ్యోతిషం మాత్రం 100% కరెక్టూగా చెప్పాలట,అట్లా నూటికి నూరు శాతం కరెక్తయితేనే జ్యోతిషం సైన్సని నమ్ముతాట్ట - ముండమోపు తెలివి!

    పొమ్మని మొహం మీదే తలుపేసినా ఇంకా ఇక్కదే తచ్చాడుర్తున్నారు - సిగ్గు లేని మంద.

    ReplyDelete
  14. Mr.Bluecake,
    Shall I copy/paste your coment from the mail box as an evidence?Go to hell!Hell with your scientific temperament.You showed your level here already.Please stop this nonsense.

    ReplyDelete
  15. GB-i mean gogineni babu not in touch with Edgarcayce books.

    joyd.

    ReplyDelete
  16. నాన్నా కేతనూ: నీలాంటి బుర్రలేని పనికిమాలిన సరుకులని వాయించి చివరికి పేరు చెప్పుకోడానికి కూడా సిగ్గుపడేలా చేశారు చూడు; అదే హరిబాబూ శర్మా బ్లాగులకి చేసిన మేలు.

    బ్లూ కేకూ: ముందు చంద్రుడిమీద మనిషి నిజంగానే కాలు మోపాడని సైంటిఫిక్ గా (తొక్కలో బీబీసీ నాసా వీడియోలు కాదు) నిరూపించమ్మా. తరవాత ఇద్దువుగాని నీ లెక్చర్లు.

    ప్రతీ వెధవా సైన్సు గురించి వాగేవాడే.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. బ్లూ కేకూ: ముందు చంద్రుడిమీద మనిషి నిజంగానే కాలు మోపాడని సైంటిఫిక్ గా (తొక్కలో బీబీసీ నాసా వీడియోలు కాదు) నిరూపించమ్మా. తరవాత ఇద్దువుగాని నీ లెక్చర్లు.

      hari.S.babu
      కార్ల్ సగన్ గురించి పోష్టు వేస్తున్నప్పుడు నేను చాలా మెటీరియల్ కలక్ట్ చేశాను.నా పోష్టుకి మరీ సంబంధం లేని టాపిక్కు కదా అని వదిలేశాను.తను గొప్ప అని చెప్పుకునే సైన్సులో ఉన్న బొక్కలే తనకి తెలియదు.నాకు మానసిక రోగం అంటగడుతున్నాడు - నేనా వీళ్ళకి జంకేది?

      Delete
  17. ఒరే పిచ్చ...! దమ్ముంటే.. నువ్వు నీ అబ్బకే పుట్టుంటే నేను అన్నాను అన్న పోష్టు పబ్లిష్ చేసి చూపించరా సోడా బుడ్డీ..

    ReplyDelete
    Replies
    1. is this your level?Do you have any guts to answer the questions?ఈ బజారు భాషని పబ్లిష్ చేస్తే ఎవరికి నష్టం?నీకా?నాకా?అసలు విషయం గురించి మాట్లాదే సత్తా ఉంటే నాకు నేర్పేటంత గొప్ప శాస్త్రీయాత్ నీకుంటే చూపించమని అడిగాక నువ్వు చూపిస్తున్నది ఇది!మీ వాంతుల్ని దోసిట పట్టి పొయ్యడానికి నా బ్లాగు ప్రసూతి వార్డు కాదు.ఫో ఫో!

      Delete
    2. హా హా! అంతేగానీ.. నువ్వు నీ పందుల మందకి హీరో అని చెప్పుకోడానికి నేను పెట్టాను అన్న పోష్టు పబ్లిష్ చెయ్యలేవు.. ఇక వెల్లి మీ అమ్మని నీ ఒరిజినల్ తండ్రి గురంచి ఎంక్వైరీ చేసుకో పోరా సోడాబుడ్డీ

      Delete
    3. @bluecake27 March 2018 at 19:11
      హా హా! అంతేగానీ.. నువ్వు నీ పందుల మందకి హీరో అని చెప్పుకోడానికి

      hari.S.babu
      ఈ బజారు భాషని ప్రదర్శించే చెత్త కామెంట్ల కోసమేన "నీకు దమ్ముంటే..నీకు దమ్ముంటే.."అ అని సవాళ్లు విసురుతున్నది.ఒకసారి బిచ్చగాడి పోలిక తెచ్చాక కూడా నువ్వింక ఐక్కదే తచ్చాడుతున్నావంటే నీది ఎంత సిగ్గూ శరం లేని బతుకో తెలియడం లేదా?

      నేను ఆ పోష్టు ఎందుకు తీసేశానో తెలుసా!అతను సంతృప్తిగా లేదణ్నాడు, నీలాంటివాళ్ళు ఇప్పటికన్న పదింతలు కుళ్ళి చచేతంత పెంచి మళ్ళీ వేద్దామన్ రైఅర్స్ టొ డ్రాఫ్ట్ చేశాను.అయినా నేను, నా బ్లాగు,నా పోష్టు,నా ఇష్టం - నీకేంటి అబ్జెక్షన్!

      ఇలాంటి బజారు భాష నీ అసలు పేరూ వూరూ చెప్పి మాట్లాదగలవా?ఎందుకురా ఈ అద్గుల్బాజీ కామెంట్లు వెయ్యలేదూ,వెయ్యలేదు అని యాడవటం?పబ్లిష్ చేసిన అచెయ్యకపోయిన అహరిబాబు చదివి యేడుస్తాడు గద ఆనే శాడిజం ఉందేమో!నేను నీకన్న అముదురు శాడిస్టుని.నీలాంటివాళ్ళకి న అబ్లాగుకి రాకుండ ఔండలేని,వచ్చి చదవలేవి,చదివి ఆనందించలేని పోష్టులు అని తెలిసాఎ మరింత పంతం రగిలి వేస్తున్నాను ఈ పోష్టుల్ని.ఈ ఏడుపు మొత్తం నేను వేస్తున్న ప్రశ్నలకి జవాబు చెప్పటం చాత్గాక య్గాద్న్నుకొస్తున్న ఏమె చెయ్య్యలేని తనం నుంచి వస్తున్నదని నాకే కాదు నీ కామెంట్లని చదువుతున్న ప్రతి ఒక్కడికీ తెలిసిపోతుంది.

      ఇంక ఐంకా నా శాడిజానికి బలి కాకుండా ఉండాలంతే ఈ బ్లాగు వైపుకి రాకుండా జాగ్రత్త పడు - అది నీ ఆరోగ్యానికే మంచిదినేనెటూ ఈ తరహ అపోష్టుల్ని ఆపను.ఆపను గాక ఆపను - అది ఖాయం!వస్తాను,కుళ్ళుతాను అంతే నీ ఇష్టం - నాకు సాంబంధం లేదు.

      గుడ్ బై ఫరెవర్ మిత్ర్ ద డియరెస్ట్ ఎనిమీ!

      Delete
  18. మీ బ్లాగు లో పోస్ట్ లకు ఇంతకు ముందు లేబుల్స్ ఉండేవి. అవి కనపడటం లేదు. మళ్లీ ఇంకొకసారి పెట్టేది.

    నన్ను ఒకతను కుల వ్యవస్థ పై ప్రశ్నలు వేస్తున్నారు. మీరు ఇంతకు ముందు రాసిన పోస్ట్ లింక్ లు ఇవ్వండి.

    Thanks in advance.

    ReplyDelete
  19. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  20. ప్రత్యేక హోదా అనేది విభజన బిల్లులోని ఒక అంసం అమాతరమే.విభజన బిల్లులోని 9,10,11వ షెడ్యూలు అతి ముఖ్యమైనవి.వాటిలో సమైకయ్రాష్తంలోని పెద్ద పెద్ద ప్రభుత్వసాఖల్ని విదగొట్తి పంచాల్సి ఉంది.వాటిని విదగొట్తటం అంతే బహ్వనాల్ని ముక్కలు చెసి ఇవ్వదం కాదు ఆస్తుల్ని మదింపు చేసి పంచదం.ఇక్కడే ఉంది కాంగ్ర్సువాళ్ళు పెట్టిన అసలైన మెలిక.ఆంధ్రా వాళ్లు మమ్మల్ని దోచేశారు అనన్ నినాదంతో ఉద్యమం చేసినవాళ్ళు ఈ మొత్తంలొ ఒక్క నయాపైస కూడా ఆంధ్రాకి ఇవ్వకుండా మొత్తం దోచెయ్యాలని అనుకుంటున్నారు.అదేదో సినిమాలో పేద్రాయుడి గెటప్పులో ఆలీ "వాడి పాదైపోయిన సైకిలుకి నువ్వు రిపేరు చెయ్యి,నీ పెళ్ళానికి వాడు కడుపు చేస్తాడు!" అనన్ స్టెయిల్లో తెలంగాణ సరిహద్దు లోపల ఉన్న సమస్తం మావే అమి ఆల్రెడీ కొందరు అంటున్నారు.తెలుగుదేశంతో అష ఆందరూ ప్రత్యేఅకహోదా ఒక్కదాన్నే పట్టించుకుంటున్నారు గానీ వీటి వైపు ఆసల్లు తొంగి చూదటం లేదు.వాటిల్లో అమనకి న్యాయంగా రావలసినవి తెచ్చుకోగలిగితే బాగుంటుంది.

    కానీ అందులో న్యాయం ఉన్నప్పటికీ ఒప్పుకుంటే పంపకాల్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ వూరుకున్నాదనే మాట వస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రికి.ఆయనా తతిమ్మా ఉద్యమనేతలూ ఆంధ్రా మీద దయ చూపించి విభజన బిల్లులోని అన్ని చిక్కుముళ్ళనీ పరిష్కరించుకోవదానికి సుముఖం అయ్యేవరకు ఎవరూ ఆంధ్రాని కష్తాల నుంచి గట్టెక్కించలేరు - ఆంధ్ర ప్రజల బతుకులు ఇవ్వాళ తెలంగాణ ప్రజల ఔదార్యం మీద ఆధారపడి ఉన్నాయి!తెలంగాన ప్రబువు దయదల్చి విభజన చిక్కులౌంచి ఆంధ్రని బయతపడేస్తే ప్రత్యేకహోదా అనేది వెంట్రుక ముక్క్క కింద తీసెయ్యొచ్చు - అని నేను భావిస్తున్నాను.

    తెలంగాణలో మీసాల సుహాసిని చెత్త పలుకుల బెదిరింపు సాక్షిగా తెరాస వైపుకి మొగ్గిన సెటిలర్లూ మరియూ ఆంధ్ర ప్రజల పట్ల ఔదార్యం అగ్లవారూ తెదెపాకి బలం పెంచితే వారి ఒత్తిడి వల్ల తప్ప తెలంగాణ మాంధాత్ ప్రబువు మరో విధాన సామరస్యానికి రాడు.అంతవరకు ఆంధ్రకి సాయం చెయ్యాలని ఉన్నా ఇవ్వాల అధికారంలో ఉన్న బీజేపీ గానీ రేపు అధికారంలోకి వస్తే గిస్తే కాంగ్రెసు గానీ ఏమీ చెయ్యలేదు - ఇది సత్యం!

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారూ, తొమ్మిది పది షెద్యూలు సంస్థల ఆస్తులు & అప్పుల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు నిజమే.

      కాకపొతే కొన్ని విషయాలు గమనించాలి:

      1. ఆస్తులు అప్పులు రెండిటికీ ఒకే ఫార్ములా ప్రకారం వాటాలు తేలాలి
      2. ఇది ఉమ్మడి విషయాలకు (ఉ. హెడ్ ఆఫీస్) మాత్రమే వర్తిస్తుంది. ఆర్టెసీ డిపోలు ఎక్కడివి అక్కడికే చెందుతాయి కానీ బస్ భవన్ విలువ రెండు రాష్ట్రాలు పంచుకోవాలి.
      3. మీరు అన్నట్టుగానే స్థిరాస్తుల విభజన భౌతికంగా కాక, బాలెన్స్ షీట్ ప్రకారం ప్రస్తుత విలువను పంచుకుంటారు.
      4. అకౌంటింగ్ పద్దతి (original cost minus depreciation) ప్రకారం ఆస్తులు లెక్కిస్తారు, ఇది బజారు విలువకు పోలిస్తే అత్యల్పంగా ఉంటుంది.
      5. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు తెలిసిందే, దాదాపు అన్నీ తీవ్ర నష్టాలే. అప్పుల భారమే తప్ప పెద్దగా ఆస్తులు ఉండవు.
      6. ఆస్తులు అప్పులు అన్నటినీ చూసాక ఎక్కువెక్కువ కొన్ని వందల కోట్లు రావొచ్చు.
      7. ఇది కూడా ప్రభుత్వానికి కాదు ఆయా సంస్థలకు వస్తుంది. వీటిలో ఏవీ ప్రభుత్వానికి డివిడెండ్ ఇచ్చే పరిస్థితిలో లేవు.

      Delete
  21. See answer to your doubt on sarada kaburlu blog

    https://kastephale.wordpress.com/2018/03/29/శర్మ-కాలక్షేపంకబుర్లు-18-అ/

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...