Saturday 28 October 2017

నా తొలి పుస్తకం "శ్రీ రాఘవం!శ్రీ మాధవం!" పుస్తకం అమ్మకానికి సిద్ధం - ఇది నా రెండో అడుగు!

          ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక వ్యాఖ్యాత మిత్రులు నా మెదడులో ఒక విత్తనం నాటారు,"మీ భావాలు బాగున్నాయి,ఇలాంటి విషయాలు ఎక్కువమందికి తెలియాల్స్దిన అబసరం ఉంది - ప్రింటు రూపంలో తీసుకొస్తే బాగుంటుంది" అని.మొదట "ప్రపంచమొక నిరంతర భోగయాత్ర!" అని పేరు పెట్టి "అవే దృశ్యాలు..." అనే పోష్టుతో ఆగేటట్టు కొన్ని పోష్టుల్ని కలిపి కినిగె దగ్గిర ప్రయత్నించాను.కానీ అది కార్యరూపం దాల్చలేదు.తర్వాత మెల్లగా బ్లాగుల్లోకి వచ్చినప్పుడు శ్రీకారంతో మొదలుపెట్టాను,ఇక్కడ కూడా ఆదే చేద్దాం అనే కొత్త ఆలోచన పుట్టి పెరిగి పెద్దదై ఈ ప్రయత్నం మొదలుపెట్టాను.ఇక్కడా ఆదివిఘ్నం జరిగి నిరాశలో ఉంటే మిత్రులు JV publikaeshans గురించి ప్రస్తావించారు.అలా ఇప్పటికి ఒక రూపం తయారై వచ్చింది.
          మొదటి రోజుల్లో చాలా హుషారుగా అనిపించింది గానీ జ్యోతిగారు చెప్పిన వాస్తవాలు విన్నాక పుస్తక ప్రచురణ అంత లాభసాటి కాదని తెలిసింది.జనంలో చదివే అలవాటు పోయింది.అసలు ఈ తరానికి దేనిమీదా ఆసక్తి లేదు,ఎందుకో మరి!సరే,దిగాక ముందే నీరసపడటం దేనికి?నా పోష్టుల్లో ఉండే చదివించే లక్షణం మీద నమ్మకంతో బయలుదేరాను, ఒకవేళ పరిస్థితి నీరసంగా ఉంటే "మహామహుల పుస్తకాలే అమ్ముడుపోవటం లేదు, మనదేముంది?" అని అప్పుడే సరిపెట్టుకోవచ్చు:-)

          నా పోష్టుల్లో నేను ఎన్నుకుని ఇందులో ఉంచినవి 12 పోష్టులు.మొదటి అయిదూ రామాయణం గురించిన విమర్శలకి ప్రతి విమర్శలూ విశ్లేషణలూ.తర్వాత రెండూ అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం హిందువులు చేసిన, చేస్తున్న పోరాటం యొక్క చరిత్ర.తర్వాత నా కవితల్లోకల్లా మంచిదైన "నీ ప్రేమ నాకు భవరాగ బంధమోక్షణం" అనే ఎవరికి వారు పాడుకోవటానికి అనువైన కీర్తన. దాని తర్వాత విశిష్టమైనది 11వ వ్యాసం "విశ్వసృష్టిరహస్యం మేడీజీ - ఫ్రం వేదవ్యాస టు హరిబాబు!" అనేది. ఇందులో హిందూధర్మానికి సంబంధించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలని సింపుల్ లాంగ్వేజిలో చెప్పాను.

1. హిందూ ధర్మ ప్రహేళికలు - చారిత్రక విషాదం!
2. హిందూ ధర్మ ప్రహేళికలు - రామకధా వైభవం!
3. హిందూ ధర్మ ప్రహేళికలు - రామకధా విశ్లేషణం!
4. హిందూ ధర్మ ప్రహేళికలు - రామకధా విమర్శనం!
5. హిందూ ధర్మ ప్రహేళికలు - రామకధా విజృంభణం!
6. సచ్చా ముసల్మాన్లు అయోధ్యలో రామాలయం కట్టడాన్ని వ్యతిరేకించరు - శ్రీరామ జయం!
7. సీతమ్మ వారి పుట్టింట్లో యెంత వైభోగం?రాముల వారి నట్టింట్లో యెంత నైరాశ్యం!
8. నీ ప్రేమ నాకు భవరాగ బంధమోక్షణం!శ్రీ రుక్మిణీనాధ, నీ ప్రేమ నాకు దివ్యౌషధం!
9. బ్రహ్మకి ఆలయపూజావిధానం ఎందుకు లేదు?శివుణ్ణి లింగరూపంలోనే ఎందుకు పూజించాలి!
10. హర హర గంగే!హరిత సస్య తరంగ నూపుర మంగే!
11, విశ్వసృష్టిరహస్యం మేడీజీ - ఫ్రం వేదవ్యాస టు హరిబాబు!
12. శ్రీరాఘవం! దశరధాత్మజం! అప్రమేయం!

          చదివిన వారికి రుచి తెలిసి వూపు వస్తే మాత్రం ఫలితం అద్భుతంగా ఉంటుంది.తను అధికారంలోకి వస్తే రామాలయ్ నిర్మాణం చేస్తానని ఒకనాడు 2 సీట్లకే పరిమితమై హిందూ మతతత్వ పార్టీ అని అవమానించబడుతున్న స్థాయి నుంచి ఈనాటి స్థాయి వరకూ ఎదిగిన బీజేపీ తన ఉత్ధానానికి కారణమైన రాముణి మర్చిపోయి తన పార్టీకి చెందిన సన్యాసి ముఖ్యమంత్రి కూడా నిన్నటి కేరళ ఎన్నికల్లో బఫూనులా తయారై రేపటి ఎన్నికల్లో తను ప్రచారం చేసినా గెలుపు కష్టమై దిక్కులు చూడాల్సిన స్థితిలో నిలబడిన సమయంలో కూడా దానికి కారణం ఏమిటో తెలుసుకోలేని అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నది - అయోధ్యలో రామాలయం కడితే చూడాలని తపిస్తున్న రామభక్తుల్ని మోసం చేస్తున్నది,అయినా హిందువుల్లో బెజేపీ పట్ల కోపం రాకపోవడానికి ఆ లక్ష్యం కోసం జరిగిన ప్రయత్నాలకి సంబంధించిన చరిత్ర తెలియకపోవడమే కారణం అని నా నమ్మకం!

          168 పేజీల పుస్తకం ధర Rs.150/-గా నిర్ణయించటం జరిగుంది.ప్రతులకు జ్యోతి వలబోజు గారిని సంప్రదించవలసిన చిరునామా:<jyothivalaboju@gmail.com>నేను కడుపులో చల్ల కదలకుండా కూర్చుని రాసిన పోష్టులు కాబట్టి రాసేటప్పుడు నేను కులాసాగానే రాశాను గానీ ధూర్జటి ఫాంట్ వాడి పుస్తకానికి ఇంత చక్కని రూపం తీసుకొచ్చిన జ్యోతి వలబోజు గారి కష్టమే ఎక్కువ.పుస్తకం మంచి ఫలితాన్ని ఇస్తే నాకన్నా ఎక్కువ కష్టపడిన ఆమెకే క్రెడిట్ ఇవ్వాలి!

జై శ్రీ రాం!

10 comments:


  1. శుభాకాంక్షలతో

    నా తొలి పొత్తంబిదిగో !
    చేతలు నావి, వలబోజు చేవయు జేర్చన్
    రాతల ధూర్జటి ఫాంటున
    మీ తల పైకెత్త దగు సుమీ హిందువుగా !



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మీతొలి పుస్తకం "శ్రీ రాఘవం!శ్రీ మాధవం!" విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. చాలా మంది పాఠకులకు చేరువ అవుతుందని ఆశిస్తున్నాను. ముఖచిత్రం కూడా చాలా బాగుంది.

      Delete
  2. @KSC
    నీకసలు బుర్ర పనిచేస్తుందా? బ్లాగుల్లో యాడ్స్ పెట్టడం దేశద్రోహమా? మా అభిప్రాయాలు మేము వ్రాసుకోవడం నేరమా? ఏం వాగుతున్నావో నీకర్ధమవుతుందా?

    hari.S.babu
    నీకసలు తెలుగు చదవడం వచ్చా?నువ్వు ఎన్ని యాడ్స్ పెట్టుకుని ఎంత సంపాదిస్తే నాకెందుకు?నీ వ్యాపారం నువ్వు చేసుకో,బాగుపడు - నా మతాన్ని కెలికితే వూరుకోను,అంతే!నదెను నిన్ను తప్పు పట్టింది నువ్వు హిందూమతం గురించి అబద్ధాలు చెప్తున్నందుకు - అది అర్ధం కాకపోతే నా తప్పు కాదు.

    నీ ఫామిలీలో ఉన్నవాళు కూడా నీలాంటి గొట్టాంగాళ్ళు కావచ్చు,మా బంధువుల్లోనూ ఉన్నారు సరాసరి ముఖ్యమంత్రుల సేషీల్లోకే వెళ్ళి వాళ్ళతో సరిసాటిగా కూర్చుని మాట్లాడగలిగినవాళ్ళు ఉన్నారు.అంతెందుకు తెలంగాణ ముఖ్యమంత్రి మాకు దగ్గరి చుట్టమే!

    అక్కడ రుజువైన విషయం ఏంటి?"పొద్దున ఫోనులో శ్రీనివాసుని నిలదీసి అడిగి తను ఆ కామెంటు నేను వెయ్యలేదు అన్న అత్ర్వాతనే నువ్వు తప్ప ఇంకెవరూ వెయ్యలేరని శ్రీనివాసుకి తెలిసే అనామకం కామెంటు వేశావు!" - ఇది నీచత్వం కాదా?నువు ఫోనులో "నా బ్లాగుల విషయం మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు కాబట్టి ఆ కామెంటు మీరే వేశారనుకున్నాను" అన్నావు - చేసేది పరువు తక్కువ వ్యవహారం కాకపోతే ఆ దాపరికం దేనికి?ఎంతమంది తమ పోష్టుల్లొరె యాడ్స్ పెట్టుకోవటం లేదు,యాడ్స్ పోట్టుకున్నందుకు నిన్నెవరు తప్పు పడుతున్నారు ఇక్కడ?హిందూమతాన్ని తిడితే హిందువులు యెగేసుకుంటూ వస్తారని ఫైరింజను కొట్టు లాంటి యెదవ పని చేసినందుకు నిన్ను నేను తిట్టింది = యెదవపని చేస్తే తిట్టక ముద్దెట్టుకుంటారా?


    ఆ మొత్తం గొడవకి నెకువేసిన సిగ్గుని దులుపుకుని మళ్ళీ బేవార్సు పోష్టులు వెయ్యటానికి చాలినంత ధైర్యం పుంజుకోవటానికి ఇన్ని రోజులు పట్టిందా?

    ఇవ్వాళ నువు నామీద పడి యేడుస్తున్నట్టు జరిగిన గొదవలో నా ప్రమేయం చాలా తక్కువ,జరిగినది ఇది:ఒక ఆజ్ఞాత నీ గురించిన వివరాలతో ఒక కామెంటు వేశాడు,నేను దానికి కొనసాగింపు కామెంటు వేశాను(దాని తర్వాత నేను ఏమీ చెయ్యలేదు) - కామెంటు చాలా చిన్నది.ఇప్పుడు నువు వేసిన పోష్టులోలా చాటభారతం మొత్తొకోళ్ళ పురాణం ఏఅమీ రాయలేదు.అది శ్రీనివాసు గారి కంటపడింది,ఆయన నీకు చూపించాడు,ఆయన నేను వెయ్యలేదని అంటున్న నీకు మాతర్మ్ ఆయన మీదే ఆనుమానం రూఢి అయిపోయి ఆయన్ని బ్లేం చేస్తూ నువ్వు అనామక వ్యాఖ్య వేశావు.దానికి శ్రీనివాసు గారికి కోపం వచ్చి నువ్వు మొదటి కామెంటు ఆయన తప్ప ఇంకెవరూ వెయ్యలేరు అనుకున్నట్టుగానే ఆయన కూడా గుర్తిఉ పట్టి నిన్ను నిలదీశాడు.వ్యూహాత్మకంగా వేసిన అతి చిన్న కామెంటు తప్ప మీరిద్దరూ పోట్లాడుకోవటంలో నా ప్రమేయం ఏమీ లేదు.

    దీన్ని నువు ఎంత సాగదీసినా చంక నాకి పోయేది నీ పర్ఫువే తప్ప నాకు వచ్చే నష్టం ఏమె లేదు.ఈ పోట్లాట "నా బతుకు నీకు తప్ప ఇంకెవరికీ తెలియదు" అనే పాయింటు మీద మీ ఇద్దరి మధ్యన జరగడం వల్లనే నీ పరువు పోయింది- అది గుర్తుంచుకుంటే నిన్ను ఉదేశించి నేను వేర్సిన ఆఖరి వ్యాఖ్య చివర్న "దీన్ని సాగదీస్తే ఎవరికి నష్టం మాకా మీకా?" అని అడిగిన ప్రశ్న ఎందుకు వేశానో అర్ధం అవుతుంది.అది అర్ధమయి ఉంటే ఇప్పుడు ఈ పోష్టు కూడా వేసి ఉండేవాడివి కాదు కాదని నా అనుమానం.

    నన్ను మళ్ళీ మళ్ళీ కెలికితే నీకే నష్టం.నాకైతే ఆసక్తి పోయంది,నేను సాధించాలనుకున్నది సాధించాను.మిగిలినవాటితో నాక్లు పని లేదు.నీ పోష్టులకి గానె నీ వ్యాఖ్యలకి గానీ స్పందించే తీరిక నాకు లేదు.నువూ నెహారికా కేసులుపెట్టి ఇబ్బంది పెడతానని భయపదే పని లేదు.నా ఫీల్డు తమిళనాడులో ఉంది!

    నువ్వు హుందూమతాన్ని అవమానిచుతున్నావు గనకనే నేను నీ బ్లాగుకి రావాల్సి వచ్చింది - ఇప్పుడిక మళ్ళీ అదే పని చహెసిన నిన్ను పట్టించుకోను.నేనే కాదు మిగిలిన హిందువులు కూడా రారు.ఇంతము మించి నీకు నేను చెప్పాల్సింది యేమీ లేదు.

    ReplyDelete
  3. నిజమైన కలాలు ఎప్పుడో చచ్చిపోయాయి
    ..........................................
    నిప్పంటుకున్న సిరిమల్లె చెట్టు కింద
    నెత్తురు చింది క్షతగాత్రుడైన అమాయకుడి దీనాలాపన
    నీకెక్కడా వినిపించదు.
    చర్మ ఛక్షువులన్నీ పుట్టుకతోనే ఎవరో మూసేసినట్టు
    నెలవంకలేని ఆకాశంలో దారి తెన్ను తెలియక..
    దిక్కు తోచకుండా తిరుగుతున్నట్లు ప్రయాణాన్ని కూడా అందంగా నటిస్తావు..

    బ్రతుకు ఉన్మాదమే కాదు..బ్రతకనివ్వటమూ ఉన్మాదమే
    ఒక మరణంతో మరో మరణం చేసే చంపుడు తత్వంలో
    అపస్మారకంగా ప్రపంచం పడిఉంటే
    తెరచాపలు కానీ..దిక్సూచులు కాని..లెకుండా
    నువ్వు చేసే ప్రపంచ ప్రయాణమలొ నిన్నెవ్వరూ చంపనఖ్ఖరలేదు.
    చారిత్రక హీనత్వపు తప్పిదంగా నువ్వే చచ్చిపోతావు...

    జీవితం నీకెప్పుడూ బహుమతి కాదు..
    జీవితం నీకెప్పుడూ అందమైన సమాధే..
    దేశంలో సుఖంగా ఉంటూనే దేశాన్ని నువ్వే బహిష్కరించినట్టు
    నీ సకల సర్వస్వాలను ఒడ్డి జనం ముందున్న కాలిదారులను కూడా మూసేస్తావు
    .2

    నీ లోపల మందుపాతరలను పేర్చుకోని
    నువ్వు ప్రకటించిన అప్రకటిత బహిరంగ యుద్ధమంతా
    ఏ పిశాచాలను అందలాలెక్కించటానికి
    ఏ దుర్మార్గులచేతికి రాజ్యాంగాన్ని ఇవ్వటానికి..

    ఫకాలుమని నవ్వుతున్న విదేశీ కపాలాల చేతుల్లో
    నెత్తురు అంటుకున్న ఈ దేశపు మెతుకులకు
    దుహ్ఖంతో మాట్లాడటానికి..మాటలొస్తాయి..
    దుహ్ఖంతో పాడటానికి..అందమైన పాటలొస్తాయి.

    దేశపు జెండా లక్షోసారి రోడ్ల మీద అవమానించబడితే
    స్వేచ్చ పేరుతో శాస్వత దుహ్ఖంతో దేశం రోదిస్తుంటే
    స్వేచ్చా ..విముక్తి గీతాలు ..రాయాల్సిన నీ కలాలకు సిఫిలిస్ రోగం సోకినట్లు
    నీ ఒంటి నిండా పసుపు పచ్చని రోగ ద్రవమే ప్రవహిస్తూ ఉంటుంది
    3

    ఉగ్రవాదంతో రెక్కలొచ్చిన దుహ్ఖత్వపు కన్నీళ్ళతో
    దేశం అంతా సుదీర్ఘంగా ఏడుస్తుంటే
    సరిహద్దుల కావల శత్రువులకు కారిన రక్తాన్ని చూసి
    'అయ్యో"" అంటూ జాలి ఒలకపోస్తావు..

    దేశాన్ని తిట్టినవాడేమో దేవుడు
    దేశంకోసం ప్రాణాలిచ్చినవాడేమో దేశద్రోహి
    దేశం ముక్కలు కావాలి అన్నవాడేమో మహోన్నతుడు
    మనమంతా దేశం కొసం అన్నవాళ్ళంతా నేరస్థులు..

    దేవుడనేవాడు అబద్ధం..దేశం అబద్ధం
    వ్యవస్థ అబద్ధం..మనుషులు అబద్ధం
    మతొన్మాదం కూడా అబద్ధమే..హిందువులంటే కూదా అబద్ధమే
    మనువాదం మాత్రమే నిజం..హిందూ ఫాసిజం మాత్రమే నిజం

    హిందువు అన్నపదం లొనే ఎదో విక్రుతత్వం దాగున్నట్టు
    మాట్లాడే అన్ని మాటల్లోనూ తిరస్కారమే..
    హిందువుల నమ్మకాలను అన్నీటినీ ఎగతాళిచేస్తూ
    రాసే దొంగ కవిత్వాల్లోనూ అంతా క్రూరత్వమే
    4
    విషసర్పాలనీ కలిసి పన్నిన సర్పవ్యూహంలో
    దేశానికి దేశమే చిక్కుకోని విల విల లాడుతున్నా
    అయ్యో అనవు..ఇదేంటి అనవు..
    దేశాన్ని ప్రశ్నిస్తున్నా అంటావు..
    దేవుణ్ని ప్రశ్నిస్తున్నా అంటావు
    కాని ఉగ్రవాదాన్ని ప్రశ్నించవు..

    జిహాదీ ఉగ్రవాదానికి మతం లేదంటావు..
    కానీ కాషాయమంటే నే ఉగ్రవాదమంటావు..
    ఉగ్రవాదులని ఉరితీస్తే అయ్యో అని ఏడుస్తావు..
    రోహింగ్యాలకు మద్దతుగా దేశం తలుపులు తెరవాలంటావు
    కాశ్మీర్ హిందువుల మీద కవితలు రాయవు
    కానీ పాలస్తీనా మీద కవితలతో ఏడుస్తావు..

    మేధావుల పేరుతో గాడిదలు తిరిగే ప్రజాస్వామ్యంలో
    విదేశాలని జెండాలని మోస్తూ రకరాల ఇజాలపేరుతో
    దేశంలో స్వదేశీ రక్తాలన్నీ అవమానిచబడుతుంటే..
    మనిషి ప్రాణాలు ..నిప్పుల్లో పడ్ద చీపురుపుల్లలైపోతాయి
    5
    తరాలని మార్చే కలాలు ఎప్పుడో చచ్చిపోయాయి..
    తలరాతలు మార్చే కలాలెప్పుడో కూలిపోయాయి..
    కామధేనువును కూదా కోసుకు తింటాను అనేఅవాడొకడైతే
    కల్పతరువును ను నరికి కట్టెల అడితీలో అమ్ముకుంటా అనేవాడొకడు..

    ఇప్పుడున్నదంతా కలంపట్టుకున్న దొంగల కాలం..
    అభ్యుదయం పేరుతో ఉన్న దేశద్రోహుల కాలం
    శ్రీ శ్రీ ఇది.. విన్నావా..
    శ్రీ శ్రీ ..ఇది చూశావా..
    పదండి తోసుకు..పదండి..వెనక్కి..అంటూ
    ప్రజాస్వామ్యం పేరుతో వెనక్కి పరుగెత్తుతున్న రజాకార్ల రావణస్వామ్యం?

    దేశభక్తులంత అవమానించబడుతుంటే
    దేశద్రోహులంతా ప్రతేకరాయితీలతో ఆనందంగా ఉంటారు.
    దేశాన్ని ప్రేమిస్తూ బతికేవాడికి ఆఖరికి
    దేశమంటూ ఉంటుందో ఉండదో ఎవరూ చెప్పలేని దుర్మార్గం
    కత్తులని బంధువులుగా చెప్పుకు తిరిగేవాళ్ళెప్పుడూ
    ఆ కత్తులకే బలి అవుతారు...
    స్వేచ్చను నిర్వచించేవాడికి జీవితాంతం
    స్వేచ్చ ఎప్పుడూ దొరకదు గాక దొరకదు.

    ఉన్న ఒకేఒక్క జీవితంలో మనుషులు అందరూ విడిపోయాక
    ఇక మీరంతా ఎందుకు..
    స్మశానాలులుగా మిగిలిన దేశంలో మీ మేధావితనం
    ఏ దెయ్యాలు ఈ దేశాన్ని ఏలటానికి...
    మీ విక్రుతమైన రాతలన్నీ ఏ పిసాచాలని అలంకరించటానికి
    ......................................................................................
    JUST TO BE RELEASED
    "మీరొకప్పుడు బ్రతికుండేవారు" కవితాసంపుటిలోనుంచి
    #konakanchi #MeerokappuduBratikundeavaaru #Mantralipi #NeaneameeMaatlaadanu #TeluguPoetry #Telangana #TelanganaPoetry

    ReplyDelete
  4. శుభాకాంక్షలండీ హరిబాబు గారు. తప్పకుండా కొంటాను & చదువుతాను. మీ టపాలు కొన్ని నేను PDF రూపంలోకి మార్చుకుని ప్రింట్ చేసుకుని చదువుతున్నాను. పుస్తకరూపం చదువుకోవడానికి సులువు. అసలే దైవాంశ సంభూతులు మీరు :) పద్యం కట్టేసారు జిలేబి గారు :) బావుంది

    ReplyDelete
  5. "Today's indie developers are creating player experiences that rival those of AAA companies. Until recently, they lacked the tools, knowledge, and know-how to add AI-driven characters that have the same fidelity as the rest of the game. Now this has changed too, with the very best AI tools becoming accessible to every developer. "

    ఒక Augmented Realty with Artificial intelligence పుస్తకానికి ముందుమాటలో "Indie Developers" అని మనవాళ్ళ గురించి రాసిన అభిప్రాయం.ఇలాంటివి వింటున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో కదా!

    ReplyDelete
  6. Here are the two bookshops where శ్రీ రాఘవం!శ్రీ మాధవం! available. Those who are in hyderabad can buy at their shop or call them to get by post or chk their site and order online..

    Navodaya Book House
    Kachiguda
    ph: 040 24652387
    https://www.telugubooks.in/


    Telugu Book House
    Kachiguda
    ph: 040 65347374, 9247446497
    http://telugubookhouse.com/

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...