Saturday, 17 October 2015

అప్పుడు వాడు మనమీదకి టెర్రరిస్టుల్ని పంపాడు!ఇప్పుడు వాడు మనమధ్యనే తన పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నాడు?అప్పుడూ ఇప్పుడూ మనమే యెర్రిపప్పలం?!

     శివసేన పుట్టిందే తెలంగాణ వాదుల విభజన వాదానికి మాతృక అని చెప్పదగ్గ మరాఠా ప్రాంతీయాభిమానంతో!నా ప్రాంతం నాకు మాత్రమే సొంతమైనది,ఇతర ప్రాంతాల వాళ్ళు రెండో తరగతి పౌరులుగా అణిగిమణిగి పడివుండాలే తప్ప పైకెదిగే సమర్దత ఉన్నా ప్రధమశ్రేణికి వెళ్ళి నా ప్రాంతీయుల మీద పెత్తనం చెయ్యకూడదు,నా ప్రాంతం నాకు మాత్రమే అధికారాన్ని ఇవ్వాలి - ఇలాంటి భావాలతో పుట్టింది.మన గురించి మాట్లాడుతున్నాడు,మనకి అన్యాయం జరిగిందంటున్నాడు,మనకోసం పోట్లాడతానంటున్నాడు,కాబట్టి ఇతన్ని అధికారంలోకి తీసుకొస్తే ఇతను మనకి నిజంగా మేలు చేస్తాడేమో చూద్దాం అనే అమాయకత్వం ఉన్నవాళ్ళు ఇలాంటివాళ్ళ బుట్టలో తేలిగ్గా పడతారు - అదీ సహజమే!కానీ ఆ భావాల్ని జనం మీద రుద్దుతున్న వాళ్ళకి నిజంగా కావలసింది ప్రజల శ్రేయస్సు కాదు, తమ మాట చెల్లుబడి కావడమే.తమకు జై కొడితే తమ ప్రాంతానికి జై కొట్టినట్టే అని నియంతలు చెప్పే సుభాషితాల్లోని అంతఃసూత్రం - ఆత్మానుభవం అయితే గానీ తత్వం బోధపడదు యెంతటి జ్ఞానుల కైనా!ముంబాయికి సంబంధించినంత వరకూ వాళ్ళు యేమి చెసినా చెల్లుతుంది.వాళ్ళ కిష్టం లేనివాళ్ళతో మనవాళ్ళని క్రికెట్ ఆడనివ్వరు!వాళ్ళ కిష్టం లేనివాళ్ళు తీసిన సినిమాల్ని చూనివ్వరు!అలాంటప్పుడు పోయి పోయి ఈ సుధీంద్ర కులకర్ణి 2015 అక్టోబర్ 12వ తేదీన మాజీ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖుర్షిద్ మహ్ముద్ కసూరి రాసిన "Neither A Hawk Nor a Dove: An Insider's Account of Pakistan's Foreign Policy" పుస్తకాన్ని పట్టుబట్టి ముంబయి లొనే యెందుకు ఆవిష్కరించాలనుకున్నాడు?బహుశా అతనికీ సంచలనమే కావాలి కాబోలు - రోగీ పాలే కోరాడు,వైద్యుడూ పాలే ఇచ్చాడు లాగుంది యెవ్వారం!

     ఈ సుధీంద్ర కులకర్ణి చరిత్ర యేమిటో తెలుసా?1996 వరకూ బారత కమ్యునిష్టు(మార్క్సిస్టు) పార్టీ సభ్యుడిగా ఉండి హఠాత్తుగా జ్ఞానోదయమై "నాలాంటివారు మిధ్యాప్రపంచంలో విహరిస్తున్నారు.లేటుగా నైనా మార్క్సిష్టు మోడల్ ఇండియాకి సరిపడదని తెలుసుకున్నాను - నిజానికి ప్రపంచంలో యే మూలకీ ఈ మోడల్ సరిపడదని నేననుకుంటున్నాను" అని నిర్ద్వంద్వంగా ప్రకటించేసి భారతీయ జనతా పార్టీ లోకి దూకేశాడు!మొదట్లో అటల్ బిహారీ వాజపేయి గారికి ప్రసంగాల విషయంలో సహాయం చేస్తూ ఉండేవాడు.ఢిల్లీ-లాహోరు బస్సు యాత్రలోనూ ఇతను ఉన్నాడు.తర్వాతి కాలంలో అద్వానీ గారికి బాగా దగ్గిరయ్యాడు.కానీ "భారత్ వెలిగి పోతోంది" అన్న ఇతని ప్రచార వ్యూహం భాజపాని గెలిపించలెకపోవటంతో పార్టీ నుంచి తప్పుకున్నాడు.2008లో జరిగిన ఒక స్టింగ్ ఆపరేషన్ ఆ తర్వాత "నోటుకి వోటు" కుంభకోణంగా ముదిరి అందులో ఇతని ప్రమేయం కూడా ఉందని తెలిసి 2011లో ఒన్నాళ్ళు జ్యుడిషియల్ రిమాండులో ఉన్నాడు.ఇప్పుడు "అబ్సర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్" కాలమిస్టుగా జర్నలిస్టు అవతారం యెత్తాడు.మూలం కమ్యునిష్టు పార్టీలో ఉన్నా శాఖలు భాజపాలో ఉన్నా ప్రస్తుతం మీడియా వాడు గనక తప్పకుండా సంచలనాన్ని ఆశించే ఈ కార్యక్రమం యేర్పాటు చేసి ఉంటాడు!

     పుస్తకాన్ని రాసిందెవరు?మాజీ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి!యేమి రాశాడో తెలుసా - పాకిస్తాన్ భారతదేశంతో శాంతినే కోరుకున్నదట!కానీ అటువైపున ఉన్న కొందరు భారత్ వ్యతిరేకులు,ఇటువైపున ఉన్న కొందరు పాకిస్తాన్ వ్యతిరేకుల వల్ల శాంతికి విఘాతం యేర్పడుతున్నదని - ఇందులో కొత్తేముంది?అయితే శివసేన బయటి నుంచి గొదవలు చెయ్యటం తప్ప ప్రభుత్వంలో గానీ విదేశాంగ శాఖలో గానీ పాకిస్తాన్ ద్వేషులు యెవరూ లేరు.పాకిస్తాన్ వైపు నుంచి మాత్రం ప్రభుత్వంలో భారత్ వ్యతిరేక వర్గం ఉండటం వల్లనే సమస్యలు కొనసాగుతున్నాయనేదీ అందరికీ తెలిసిన విషయమే,మరి ఈ పుస్తకంలో ఉన్న ప్రత్యేకత యేమిటి?ఒక పాకిస్తానీ రాయటం!అయితే పాకిస్తానులో ఆవిష్కరించ్కుకోవాలి గదా ఇక్కడ యెందుకు ప్రోత్సహించటం?అదే కమ్యునిష్టు మూలాలు వాళ్ళ ప్రత్యేకత!మనం విశాల హృదయంతో ఆలోచిస్తున్నాం అని నిరూపించుకునే అవకాశం ఉందీ అంటే చాలు,యెంత నీచపు పనైనా సరే మొండిగా చేసి చూపిస్తారు!అదే తమకి నాన్-సెక్యులర్ అని అనిపిస్తే చాలు దాన్ని పీకి పాకం పెట్టి వ్యక్తిగత నైతిక విలువల దగిర్నుంచి సామాజిక న్యాయాల వరకూ అన్నీ ఈ ఒక్క సన్నివేశంతో భ్రష్టు పట్టిపోయినాయని అల్లరి చేస్తారు.ఇదే కసూరి ఇదే పుస్తకాన్ని పాకిస్తాన్ నడిబొడ్డున ఆవిష్కరించుకోగలడా?లేదు,అక్కద జరిగితే అతనికి వచ్చే నిరసన మోతాదుని వూహించుకుంటే ఇప్పడ శివసేన చూపించిన నిరసన చాలా చాలా సభ్యతాయుతమైన నిరసన!

     ఈ విషయాలు తన దేశంలో చెప్పుకోలేని దిక్కుమాలిన తనం తనది,మనకెందుకండీ వాడిమీద ఐంత ఆప్యాయత ఒలకబోసే అతి మనస్తత్వం?ఈ పెద్దమనిషి అక్కడ విదేశాంగ మంతిగా ఉన్నాడు అంటే మన దేశం మీదకి టెర్రరిష్టుల్ని వొదిలే వ్యూహాలలో ఇతడూ భాగస్వామీ అని కూడా అర్ధం కావదం లేదా?వృధ్ద వేశ్యా పతివ్రతా అన్నట్టు మనకి నీతిసూత్రాలు చెప్పాడు,మనతో చప్పట్లు కొట్టించుకున్నాడు!ఇందులోని అతిగొప్ప వాస్తవాల్లో మచ్చుకి ఒక్కటి చూదండి - "2005లో పర్వెజ్ ముషారఫ్ ఇక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే సందర్భంలో ఒక ఇబ్బందికరమీన సన్నివేసం యెదురైంది ఆయనకి.తను చదువుతున్న ప్రసంగం భావమేమిటో తెలియకుండానే భారతదేశం మీద విమర్సల్ని గుప్పించే ఆ ప్రసంగాన్ని చదివేశాడు.కానీ 2004లో తన ప్రభుత్వమే తీసుకున్న కొన్ని నిర్నయాలకి అది విరుధ్ధమ అని అతనికి అప్పుడు తెలియదు.దానికి కారణం మునీర్ అక్రం అనే ఒక భారతద్వేషి అసలు ప్రసంగానికి బదులుగా ఆఖరి నిముషంలో ఈ ప్రసంగాన్ని ఇవ్వడం.",ఇంకా మీకు అనుమానంగా ఉందా మనం యెర్రిపప్పలమైనామని?!

శివసేన ఇప్పటి నిరసన మాత్రం నాకు నిజంగా నచ్చింది - శభాష్!

46 comments:

  1. మీ పోస్టు నాకు నచ్చలేదనుకోండి, అప్పుడు నేను మీకూ, మీ పోస్టును publish చేసిన కూడలివారికీ నల్లరంగు పూయొచ్చా? లేదా గుడ్డలూడదీసి ఊరేగించొచ్చా? అలా చేయడమే సభ్యతా? అసలు సభ్యతని మీరెలా నిర్వచిస్తారుసార్?! మళ్ళీ మీరో self proclaimed రచయిత!!!

    నాకు అర్ధమైనంతవరకూ తస్లీమానస్రీన్ మీద ఓవైసీ చర్యను సథ్యతగా పరిగణించేంత ష్తాయికి దిగజారినవారుమాత్రమే శివసేన చర్యను సభ్యతాపూర్వకమైనదిగా పరిగణించగలరు.

    ReplyDelete
  2. భారత్-పాక్ ల మధ్య గిల్లికజ్జాలకి ఇకనైనా తెరపడాల్సి ఉంది. ఆ ప్రయత్నం ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరి వల్ల మొదలుకావాల్సి ఉంది. మారడం కోసం మనం ఇప్పటికిప్పుడు చనిపోయి పునర్జన్మెత్తలేం. బతికున్నవాళ్ళమే మారాలి. ఏదో ఒక వయసులో, ఎంత ఆలస్యమైనా, ఒకేసారి కాకపోతే క్రమక్రమంగా నైనా! ఆ పని సుధీంద్ర మరియూ ఆ మాజీమంత్రీ చేస్తే మెచ్చుకోవాలి తప్ప విమర్శించకూడదు. ఇహపోతే శివసేన చరిత్ర అంతా తెలిసీ మీరు వాళ్ళని మెచ్చుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. దాన్తో పోలిస్తే మన TRS చాలా పవిత్ర సాధుజంతువు. దావూద్ ఇబ్రహీమ్ పబ్లిక్ లో తిరగలేడు. అదొక్కటే తేడా.

    ReplyDelete
  3. @ketan18 October 2015 at 04:03
    నాకు అర్ధమైనంతవరకూ తస్లీమానస్రీన్ మీద ఓవైసీ చర్యను సథ్యతగా పరిగణించేంత ష్తాయికి దిగజారినవారుమాత్రమే శివసేన చర్యను సభ్యతాపూర్వకమైనదిగా పరిగణించగలరు.
    My ans:మన దేశం మీదకి టెర్రరిష్టుల్ని వదలటంలో అతని భాగస్వామ్యం ఉందా లేదా?ఉంది కదా!మరి అదే మనిషి మనకి మా పాకిస్తాను చాలా మంచిది,శాంతిని కోరుకుంటున్నది అనే ఇమజిని పంచరంగులతో ఆవిష్కరిస్తున్నాడు - దాని సంగతేమిటి!అతని వాదన నిజమైతే మన విదేశాంగ శాఖ విఫలమైందా?అతను తన కధనంలో నేను ఫైన ఉదహరించిన లాంటివి మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ యెన్నిసార్లు జరిగి ఉంటాయి?తను పదవిలో ఉన్నప్పుడు తన దేశం తరపున టెర్రరిస్టుల్ని సరిహద్దుల్లో సైన్యం కాపలాతో ఇండీయా లోకి తరిమే పని జరిగింది కదా!

    ఇప్పుడు ఈ పుస్తకంలో అవన్నీ అసలు జరగనే లేదు అని చెప్తున్నాడా?అలా చెప్తే మీరు నమ్ముతారా?

    తస్లిమా నస్రీన్ మీద జరిగిన దాడి ఆమె మతం మీద చేసిన దాడికి ముస్లిం చాందసులు చేసిన దాడి!ఇక్కడి విషయం రెండు దేశాల మధ్య జరుగుతున్న ప్రచ్చన్న పోరాటం యొక్క ఒక ముఖాన్ని దాచిపెట్టటానికి జరుగుతున్న ప్రయత్నం,ఆలోచంచండి.ఇన్నేళ్ళుగా వాళ్ళ దేశంలో యెగదొయ్యాల్సిన ద్వేషాన్నంతా యెగదోసి మన దేశంలో విధ్వంసాలకి కారణమైన వాళ్ళే ఇవ్వాళ పాకిస్తాను మంచి దేశం అనే ఇమాజి తెచ్చుకోవటానికి మనం ఉపయోగపడాలా>

    ReplyDelete
    Replies
    1. మీరు చదివిన సమాచారం ప్రభావంలో మీరు మీదేశం గొప్ప ఉదార బుధ్ధిగలదని అనుకుంటున్నాను. అది నిజమే అయ్యుండొచ్చుకూడా. కానీ పాకిస్తాన్ వాళ్ళుకూడా అలాగే ఆలోచిస్తారన్న విషయం మీకు ఇక్కడ తట్టడంలేదు. మీలోని దేశభక్తే, వాళ్ళలోనూ ఉంటుంది. అక్కడి పత్రికలూ దాన్నే వండివార్చుతాయి.


      మనం నిజాలమీద అంతటి obsession కలిగున్న వాళ్ళమైతే మొత్తం అన్ని తెలుగు పేపర్ల ఎడిటర్ల మొహాలూ నల్లబడుండేవి. జరిగిందంతా కేవలం రాజకీయం. ఉన్న భావజాలలన్నింట్లో అత్యంత సంకుచితమైనది మెజారిటీకి నచ్చుతుంది. This is just Sivasena trying to out do BJP. బీజెపీ కంటే మేం మరింత అసహన పరులం (కాబట్టి మేం మిమ్మల్ని ఉధ్ధరిస్తాం) అని శివసేన చెప్పాలనుంకుంటొంది. We are readily falling in their trap.

      Delete
    2. మాటలని మాటలతో ఎదిరించడమనేది ఒక cultural evolution స్థాయి. కుక్కలుకూడా మొరిగాకనే కరవడానికి దిగుతాయి. వీళ్ళకి ఆయన రాసినదాన్ని ఖండిస్తూ మరొక పుస్తకం రాయకపోవడం చాతగాదుకాబట్టే ఇలాంటి దుందుడుకు చర్యలు.

      Delete
    3. అయినా సివసేన ఎప్పుడూ మెజారిటీ appeasement politicsతో బ్రతికింది (కాంగ్రెస్ minority appeasementతో బ్రతికినట్లుగా). ఒక దశాబ్దమంతా మదరాసీల మీద (అంటే దక్షణదివాళ్లమీద అని ఉత్తరాదోళ్ళ భావం) పడేడ్చారు. తరువాతి దశాబ్దం సిఖ్ఖులమీద. ఆ తరువాత బీహారోళ్ళమీద. consistent గా ముస్లిములమీద ఏడవడం ఒకటుంది మళ్ళీ. వీళ్లకి అసలు ఎవరితోనైనా పొసగుతుందా? క్రికెటర్‌ను పట్టుకొని ఇండియాకన్న మహారాస్ట్రే ముందు అన్నప్పుడు ఏమయ్యాయి మన దేశభక్త తలలు? వాళ్ళు ముస్లిం ద్వేషులైనంతమాత్రాన వాళ్ళెం చేసినా మనం గంగిరెద్దు అవతారాలెత్తవలసిందేనా?

      Delete
  4. @mahojas
    your openion:భారత్-పాక్ ల మధ్య గిల్లికజ్జాలకి ఇకనైనా తెరపడాల్సి ఉంది. ఆ ప్రయత్నం ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరి వల్ల మొదలుకావాల్సి ఉంది.

    My openion:సాంకేతికంగా ఇప్పుడు భారతదేశం ప్రపంచవేదికల మీద యెక్కడ బడితే అక్కడ పాకిస్తాను మనదేశంలోకి టెర్రరిస్తుల్ని వొదులుతున్న విషయంలో సాక్ష్యాధారాలు కూడా సేకరించి వాదిస్తున్నది,అది తెలుసా మీకు?మరి,ఈ పుస్తకంలోని విషయం వాటిపట్ల యేమయినా చెప్తుందా?చెప్పేవన్నీ నేను ఉదాహరణ ఇచ్చినట్టు "మా పాకిస్తాను ప్రభుత్వం చాలా మంచిది.మాలో కొందరు HARDLINER INDIAN HATERS ఉన్న్నారు,వాళ్ళే మామీద వస్తున్న అపార్ధాలకి కారణం" అని చెప్పుకోవటం కాదా!

    ఇది అర్ధమయితే దానికి తప్పనిసరిగా నిరసన తెలియజెయ్యాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది!లేనప్పుడు తస్లిమ అనస్రీన్ పోలికలూ గాంధీమార్గం,శాంతియుత ధర్నాలు,నల్లజెండాలు,ప్లయ్కార్డులు మాత్రమే సరయిన నిరసనలుగా కనిపిస్తాయి.నాకు నేను యెప్ప్పుడూ సెల్ఫ్ ప్రొక్లైమెడ్ రచయితగా చెప్పుకోలేదే?అందరి మాదిరిగానే నా భావాలు నేను చెప్తున్నా.అవి మీకు నచ్చిన భావజాలం పరిధిలోకి ఇమడవచ్చు,ఇమదకపోవచ్చు!

    యే దేశమయితే ఆ దేశాన్ని టెర్రరిస్టు దేసంగా ప్రకటించాలని అంతర్జాతీయ వేదికల మీద డిమాండు చేస్తున్నదో ఆ దేసం లోపల తమ దసం మంచిదే అని ప్రచారం చేసుకోవటం ఆమోదయోగ్యంగా కనిపిస్తున్నదంటే అర్ధం యేమిటి?డిమాండు చేస్తున్న దేశం అతిగా స్పందిస్తునదనే కదా,కాదా?నాకు లోకజ్ఞానం తక్కువ లెండి - ప్రతిస్పందన తీవ్రంగా ఉన్నది నిజమే కానీ అసలు నిరసన తెలియజెయ్యకూదదా?!

    నిరసన తెలియజెయ్యడం వరకూ కరెక్తే కదా!

    ReplyDelete
    Replies
    1. ఇది నిరసన 'తెలియజెయ్యడమే'నయితే, యుధ్ధాన్నికూడా నిరసన తెలియజెయ్యడంగానే ప్రకటించవచ్చు. మీరు కావాలనే ఇలాంటి వాదనలు చేస్తారో, లేక నేను (నాలాగే మరొకొందరు) తేడానో అర్ధంవ్వదు నాకు. ఇప్పుడు మీ అభిప్రాయాల మీద నిరసన తెల్పాలంటే నేను ఏం చేస్తే బాగుంటో, మర్యాదగా, సభ్యతగా ఉంటుందో చెప్పండి ప్లీజ్.

      Delete
  5. హరిబాబు గారు,

    వాళ్ళు చేశివసేనసింది నీచమైన చర్య అని ఒకరు, శివసేన నీచమైన రాజకీయాలు చేసేదే కావచ్చు కానీ ఈ విషయం లో వారిని సమర్ధిస్తున్నానని మీరు వాదనలు చేసుకుంటున్నారు కానీ నాకు మాత్రం ఈ విషయం లో కుట్ర కనపడుతున్నది. ఒక పాకిస్తానీ వ్యక్తి తను రాసుకున్న పుస్తకాన్ని తన దేశం లో విడుదల చేసుకోక ప్రత్యర్ధి దేశంలో విడుదల చేయాలనుకోవడం ఏమిటి? అది కూడా శివసేన లాంటి సంస్థలున్న ప్రదేశంలోనే విడుదల చేయటం ఏమిటి? దీని వెనుక మీకు కుట్ర కనపడడం లేదా? ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వేచ్చ పాకిస్తాన్ లోనే కాదు, భారతదేశం లో కూడా లేవు అని ఇతర దేశాలకు వెల్లడి చేయడం కోసమే ( ఇలా జరుగుతుందని ముందే వూహించి ) ముంబాయి లో పుస్తకావిష్కరణ పెట్టుకున్నాడని నాకు అనిపిస్తున్నది. ఆ ప్రయత్నం లో సఫలీకృతుడయ్యాడు కూడా. మన దేశాన్ని ప్రపంచ దేశాల ముందు తలదించుకునే లాగా చేయాలనే ప్లాను ఇది అనిపిస్తున్నది. నార్మల్ గా అయితే శివసేన చేసింది నిస్సందేహం గా తప్పే, కానీ ఈ కుట్రదారుల పట్ల అది చాలా తక్కువ నిరసనే.

    ReplyDelete
    Replies
    1. @Unlnown
      I think You didn't got my main point,It is the same you are with
      ఈ విషయాలు తన దేశంలో చెప్పుకోలేని దిక్కుమాలిన తనం తనది,మనకెందుకండీ వాడిమీద ఐంత ఆప్యాయత ఒలకబోసే అతి మనస్తత్వం?ఈ పెద్దమనిషి అక్కడ విదేశాంగ మంతిగా ఉన్నాడు అంటే మన దేశం మీదకి టెర్రరిష్టుల్ని వొదిలే వ్యూహాలలో ఇతడూ భాగస్వామీ అని కూడా అర్ధం కావదం లేదా?వృధ్ద వేశ్యా పతివ్రతా అన్నట్టు మనకి నీతిసూత్రాలు చెప్పాడు,మనతో చప్పట్లు కొట్టించుకున్నాడు!

      Delete
    2. పాకిస్తాన్ భారతదేశాన్ని మించిన వైరుద్ధ్యాల పుట్ట. ఆ దేశమంతా ఒకే వ్యక్తి కాదు. (నిజానికి ఏ దేశమూ అలా ఉండదనుకోండి). పాకిస్తాన్ సమస్య ఏంటంటే - అక్కడ ప్రజలంతా భారతదేశంతో సఖ్యాన్ని కోరుతున్నప్పటికీ ఆ ఆకాంక్షని అణిచివేసే శక్తులు అక్కడ తాలిబాన్, అల్ ఖైదా, ఐ.ఎస్. ఇంకా వాటి అనుబద్ధ సంస్థల రూపంలోనూ, ముఖ్యంగా పాకిస్తానీ సైన్యం రూపంలోనూ బలంగా ఉన్నాయి. పాకిస్తాన్ లో అందరూ వాళ్ళకి భయపడతారు, అధ్యక్షుడూ, ప్రధానమంత్రితో సహా! నేనిక్కడ చెప్పొచ్చేదేంటంటే పాకిస్తాన్ యొక్క సివిల్ డిస్పెన్సేషన్ భారతదేశపు సివిల్ రెజీమ్ మాదిరి సర్వస్వతంత్రమైనది కాదు. అది సైన్యానికి సబార్డినేట్. కనుక భారతదేశం మీద ప్రత్యక్షంగానో, పరోఽక్షంగానో జరిగే దాడులకి అక్కడి సివిల్ ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు. అన్నిసార్లూ కాకపోయినా అప్పుడప్పుడు పాకిస్తానీ సివిల్ ప్రభుత్వంలో ఇండియాలో మాదిరే మంచి మేధావులూ, సెక్యులర్ తత్త్వవేత్తలూ (మంచి సెన్సిబుల్ పీపుల్) సభ్యులుగా ఉంటారు. ఉదాహరణకి చాలాకాలం క్రితం ఆ దేశానికి చెందిన మాజీ మంత్రి (పేరు జ్ఞాపకం లేదు) ఒకరు ఓ భారతీయ మేగజీన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనగా చదివాను : "Nationalism is an outdated concept of which we are all simultaneously guilty and victims." (జాతీయవాదం ఓ కాలం చెల్లిన భావన. మనమందరం ఆ తప్పు చేస్తున్నాం. మళ్లీ మనమే దానికి బలైపోతున్నాం)

      కానీ తమ దేశం కోరి కోరి వెళ్ళి ఇరుక్కున్న విచిత్ర పరిస్థితుల మధ్య ఈ పాకిస్తానీ మేధావులు నిస్సహాయులు. Details తెలిసినప్పుడు మనం ఎవరినీ ద్వేషించలేం.

      Delete
    3. @mahojas
      your openion:Nationalism is an outdated concept of which we are all simultaneously guilty and victims.

      My comment:This s not correct!మతప్రాదిపదికన విడిపోయి సైన్యం యొక్క క్రూరమైఅన్ అధికారం కొ=ఇంద అణిగిపోయి ప్రజాస్వామ్యపు వాసన కూడా గిట్టని పాకిస్తాను మంత్రివర్గంలో ఉన్న వ్యక్తికి జాతీయత కాల్మ్ చెల్లినదిగా అనిపించతంలో అసహజం యేమీ లేదు.మనం అతని అభిప్రాయాన్ని గౌరవించనఖ్ఖర లేదు!జాతీయత,దేసభక్తి ప్రతి ఒక్కరికీ అవసరమే.అవి లేకుండా కేవలం చట్టాలతోనూ శాసనాల తోనూ యే దేశప్రజల్నీ యెక్కువ కలం పట్టి ఉంచలేడు యెంతటి నియంత అయినా!

      Delete
    4. సర్ ! అది నా అభిప్రాయం కాదు. పాకిస్తాన్ లో కూడా డిఫరెంటుగా ఆలోచించేవాళ్ళున్నారని చెప్పడానికి నేను ఉదాహరించిన ఒక ఉదంతం మాత్రమే. అతని అభిప్రాయంతో మనం ఏకీభవించనక్ఖర్లేదు. కానీ ఆ విభేదం ఓ మేధావిగా అతన్ని గౌరవించడానికి అడ్డురాదు, నాకైతే!

      Delete
    5. @haribabu,

      పేట్రియాటిజం అంటే ఏమిటీ ?
      నా దేశం ప్రపంచములోని అన్ని దేశాల కన్నా గొప్పది, ఎందుకంటే నేను ఇక్కడ పుట్టాను కాబట్టి అని చెప్పడమే. ఈ బూమ్మీద మనకు దేశం అనేది హై ఎండ్ లిమిట్. నా ఇళ్ళు అనేది లో ఎండ్ లిమిట్. కానీ, చాలా వరకూ మనం లో ఎండ్ లిమిట్స్ నే ఫాలో అవుతూ ఉంటాం. హై ఎండ్ లిమిట్స్ ఎప్పుడో పాకిస్తానుతో యుద్దం జరిగినప్పుడో, పాకిస్తానుతో క్రికెట్ మ్యాచ్చు జరిగినప్పుడో ఫాలో అవుతూ ఉంటాం. నిజంగా డేశం అనేదాని మీద మనకు అంత ప్రేమ ఉంటే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక్క పనిచేయకూడదు, చట్టానికి వ్యతిరేకంగా ఒక్క పని చేయకూడదు, సమాజానికి వ్యతిరేకంగా ఒక్క పనీ చేయకూడదు. చివరకి రోడ్డు పక్కన ఉమ్మి వేయడం, అంతర్జాలములో బూతులు తిట్టుకోవడం కూడా ఉల్లంఘనలే !

      మళ్ళి దేశ భక్తి అనే దానికి వద్దాం. మఱ్ఱిపూడిగారు చెప్పింది నిజం. పాకిస్తానులో కూడా చాలా మంది ఇండియా అంటే అభిమానించే వాల్లు ఉన్నారు. పాకిస్తాను పనికి మాలిన రాజకీయాలని ఎండగట్టే వాల్లు ఉన్నారు. కమ్యూనిష్టులు ఏమీ చేయరని తిడుతూ ఉంటారు కదా ! పాకిస్తానులో కూడా కమ్యూనిజాన్ని సమర్ధించే వారు పాకిస్తానీ తీవ్రవాదాన్ని, మత ఛాందస్త్వాన్నీ ఎండగడుతూనే ఉంటారు. ఎలా అయితే ఇండియాలో మత ఛాందసత్వాన్ని ఎండగట్టే వారిని మెజారిటీయులు దేశ ద్రోహులు అని చిత్రీకరిస్తుంటారో, పాకిస్తానులులో కూడా ఇలాంటి పనులె చేస్తూ ఉంటారు. అయినా వారు తగ్గరు. వారు చేసే పనిని వారు చేస్తూనే ఉంటారు.

      Delete
    6. పాకిస్తాను అంటే ద్వేషముతో విడిపోయింది, సైనిక పాలన అని ఏవేవో చెప్పారు కదా ! అమెరికన్ రచయితలు కొంత మంది ఈ పేట్రియాటిజం గురించి ఏమన్నారో చూడండి !

      Diogenes, Greek philosopher, circa 360 BC

      "I am a citizen of the world."

      Albert Einstein, scientist (1879-1955)

      "Nationalism is an infantile disease. It is the measles of mankind."

      Emma Goldman, American anarchist, 1908

      "Conceit, arrogance and egotism are the essentials of patriotism. Let me illustrate. Patriotism assumes that our globe is divided into little spots, each one surrounded by an iron gate. Those who have had the fortune of being born on some particular spot consider themselves nobler, better, grander, more intelligent than those living beings inhabiting any other spot. It is, therefore, the duty of everyone living on that chosen spot to fight, kill and die in the attempt to impose his superiority upon all the others.

      "The inhabitants of the other spots reason in like manner, of course, with the result that from early infancy the mind of the child is provided with blood-curdling stories about the Germans, the French, the Italians, Russians, etc.

      "When the child has reached manhood he is thoroughly saturated with the belief that he is chosen by the Lord himself to defend his country against the attack or invasion of any foreigner. It is for that purpose that we are clamoring for a greater army and navy, more battleships and ammunition..."

      ఇంకా చాలా మంది చాలా చెప్పారు ఒక సారి ఈ ఆర్టికల్ చూడండి.

      http://progressive.org/anti-patriotic-quotes--july-4#sthash.f7NrnDWH.dpuf
      ----------------------------------
      Patriotism: Virtue or Sin?
      Is patriotism good or bad? Or is it neither?


      https://www.psychologytoday.com/blog/here-there-and-everywhere/201306/patriotism-virtue-or-sin

      Delete
    7. small typo, not american writers, it's famous writers in the above comment.

      Delete
    8. @usravelli
      analysis1:పేట్రియాటిజం అంటే ఏమిటీ ?
      నా దేశం ప్రపంచములోని అన్ని దేశాల కన్నా గొప్పది, ఎందుకంటే నేను ఇక్కడ పుట్టాను కాబట్టి అని చెప్పడమే. ఈ బూమ్మీద మనకు దేశం అనేది హై ఎండ్ లిమిట్. నా ఇళ్ళు అనేది లో ఎండ్ లిమిట్. కానీ, చాలా వరకూ మనం లో ఎండ్ లిమిట్స్ నే ఫాలో అవుతూ ఉంటాం. హై ఎండ్ లిమిట్స్ ఎప్పుడో పాకిస్తానుతో యుద్దం జరిగినప్పుడో, పాకిస్తానుతో క్రికెట్ మ్యాచ్చు జరిగినప్పుడో ఫాలో అవుతూ ఉంటాం.
      analysis2:కమ్యూనిష్టులు ఏమీ చేయరని తిడుతూ ఉంటారు కదా ! పాకిస్తానులో కూడా కమ్యూనిజాన్ని సమర్ధించే వారు పాకిస్తానీ తీవ్రవాదాన్ని, మత ఛాందస్త్వాన్నీ ఎండగడుతూనే ఉంటారు. ఎలా అయితే ఇండియాలో మత ఛాందసత్వాన్ని ఎండగట్టే వారిని మెజారిటీయులు దేశ ద్రోహులు అని చిత్రీకరిస్తుంటారో, పాకిస్తానులులో కూడా ఇలాంటి పనులె చేస్తూ ఉంటారు. అయినా వారు తగ్గరు. వారు చేసే పనిని వారు చేస్తూనే ఉంటారు.

      haribabu:
      answer1:మీరు కమ్యునిష్టు అవునో కాదో నాకు తెలియదు గానీ దేశభక్తి యేమిటి అని నన్ను అడిగి మరీ ఇలా పొడిపొడిగా యే విధమైన ఆత్మీయతనీ ఉండనివ్వకుండా మొండిగా బండగా కర్కశంగా దేశభక్తిని కుళ్ళ్బొడిచేశారు,ఇంక మీకు నేను దేసబక్తిని గురించి యెలా చెప్పగలను?న అవల్ల కాదు!

      తన దేశం మీదకి యుధ్ధానికి వచ్చిన పెట్టుబడిదారీ దేశాల దాడి నుంచి తట్టుకోవటానికి వార్ కమ్యునిజం పేరుతో ప్రజల్నీ అష్తకష్టాల్కి గురిచేసిన లెనీన్ బహుశ "High end limit-low end limit" తర్కం తెలియని పిచ్చివాడు కాబోలు!లేదా దాన్ని బాగా అర్ధం చేసుకున్న గట్టివాడు అయ్యుండాలి,అంతేనా?

      దేశమును ప్రేమించుమన్నా అన్న గురజాడకి మీ లాజిక్ అర్ధం గాకనే ఆ పిచ్చిపాట రాశాడు,కదూ?

      తమ దేశాధ్యక్షులు చేసే యుధ్ధాలకి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసనలు తెలుపుతూనే "వియ్ అమెరికన్స్,గ్రేట్!" అనుకునే అమెరికన్లని అదగండి చెప్తారు - మీకర్ధమయ్యే భాషలో చెప్పటం మీరిప్పటికే హిందూ మతతత్వ వాదిగా ముద్ర వేసిన నాకు సాధ్యపడదు.

      answer2:మరి వారలా చేస్తూనే ఉంటారు అని తెలిసినా వారి పన్లకి మనదేశంలో నిరసన తెలపకుండా వారి పుస్తకాల్ని ప్రశాంతంగా ప్రచురించుకుంటూ కొని చదువుతూ ఉండటం వల్ల ఈ రెండు దేశాల మధ్యనా శాంతికి బాతలు వెయ్యటం కుదురుతుంది అని గ్యారెంటీ ఇవ్వగలరా మీరు?

      ఇక్కడ మన దేసం కొన్ని సంవత్స్రాలుగా తమ దేశంలోనే ప్రభ్త్వ సహాయంతో టెర్రరిస్టు క్యాంపుల్ని నడుపుతున్నది,వాళ్ళని ఈ దేశంలోకి పంపి ఇక్కడ దాడులు చేయిస్తున్న్నది అని అంతర్జాతీయ వేదికల మీద పాకిసానుని టెర్రరిస్టు దేశంగా ప్రకటించమని అడుగుతున్నది.అదంతా మన దేశం పాకిస్తాను మీద చేస్తున్న అబధ్ధపు ప్రచారమని మీరు అంటున్నారా?నేను మిమల్ని దేశద్రోహి అని ముద్ర వెయ్యను లెండి,మీ నిజమైన అభిప్రాయం చెప్పండి!మీ అభిప్రాయం యేదయినా ఆ పుస్తకంలో అతను చెప్పిన "మా అదెశం నిజంగా అంత దుర్మారగమైనది కాదు,మేము నిస్సహాయులం" అని చెప్పుకున్నా ఆ వాదనకి నిరసన చెప్పకపోతే భారత దేశంలోని చాలామంది పాకిస్తాను మంచిదే అనుకుంటున్నారు,భారత ప్రభుత్వమే అన్యాయంగా పాకిస్తాను మీద విషం కక్కుతున్నదేమో అనే అభిప్రాయం యేర్పడదా?

      P.S:మీరు చెప్పండి దేసభక్తి అంతే యేమిటో.

      Delete
  6. మహోజస్ గారి వ్యాఖ్యల తో ఏఖిభవించను. పాకిస్థాన్ తో భారత్ కు మిత్రత్వం అనేది జరిగే పని కాదు. అది వీలయ్యి ఉంటే ఎప్పుడో మనదేశాలు మిత్రుతుగా మాజరి ఉండేవి. సుధీంద్ర కులకర్ణి వంటి డుబాకోరులు ఇటువంటి డ్రామాలు వంటి వేస్తారు. ఇంకా కొందరు ఉన్నారు అమన్ కి ఆశా బాచ్ వాళ్లు వీళ్లు కూడా పాకిస్థాన్ తో స్నేహం పునరుద్దరించాలని నాటకాలు చేస్తూ, మీడియాలో రాస్తు, డిల్లి 5 నక్షత్రాల హోటల్స్ లో సెమినార్లు నిర్వహిస్తూంటరు.
    వీటన్నిటికి తెరవేయాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ తో స్నేహం లేకపోతే మనదేశానికి పోయేది ఎమిలేదు. పాకిస్తాన్ దగ్గర మనకివ్వటానికి ఉన్నది ఎమిటి? పాకిస్థాన్ పై ఆధారపడటానికి భారత్ దగ్గరలేనిది ఎమిటి?


    దేశ విభజన సమయం లో పంజాబి వారు కాందిశీకులు గా డిల్లి కి వచ్చి స్థిరపడ్డారు. వీరే రాజకీయ నాయకులు గా, ప్రభుత్వ అధికారులు గా కేంద్రం లో డిల్లి లో చక్రం తిప్పటం, వారికి పాకిస్థాన్ తో గల అనుబంధం కారణం గా దేశ రాజకీయాలలో పాకిస్థాన్ తో సయోధ్యకు పెద్దపీఠ వేయడం జరిగింది. వీరి కారణం గా ఈశాన్య రాష్ట్రాలకు ప్రాముఖ్యత నివ్వలేకపోయాము. నమో ప్రభుత్వం ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వటం మొదలుపెట్టింది. ఆ ర్సాష్ట్రాల మీదు గా మయన్మార్ వరకు వేసే రోడ్డు దేశం లో విప్లవాత్మక మార్పులను తేబోతున్నాయి. పనిలో పని గా పాకిస్థాన్ వారిని పట్టించుకోకపోతే సగం గోల పోతుంది. ఇప్పుడు భారత్ లో నివసించే పంజాబీ లకు పాకిస్థాన్ లో భందువులు లేరు. జనరేషన్ మారిపోవటం వలన కొత్తతరం వారికి పాకిస్థాన్ పై ముందరి తరం వారిలా నోస్టాల్జిక్ ఫీలింగ్స్ లేవు. పాకిస్థాన్ కు ప్రాముఖ్యత తగ్గించవలసిన సమయం.

    భారత దేశం అగ్ర రాజ్యంగా మారుతున్న ఈ సమయం లో మనప్రత్యేకత గురించి అరబ్బు దేశాలు సైతం ప్రసంసిస్తున్న ఈ సమయంలో పాకిస్థాన్ కు స్నేహ హస్తం చాచటం అనవసరం.

    ReplyDelete
  7. http://saudigazette.com.sa/saudi-arabia/it-is-time-for-arabs-to-take-off-their-hats-to-indians/

    To all conceited and arrogant Arabs who take pride in the glorious history of Arab civilization, it is time you took off your hats to Indians after having treated them with discrimination and having looked down upon them for decades.Indians today run America and the world. While the US imports oil from the Gulf, it imports minds from India. Fifteen percent of start-up companies in Silicon Valley, south of San Francisco which is home to hundreds of technology companies such as Google, Apple, Facebook, etc., are owned by Indians, who, by the way, constitute the largest percentage of immigrants in the San Francisco Bay Area. Their number exceeds that of the British, Chinese, Taiwanese and Japanese combined, who own companies in that area.


    ReplyDelete
  8. వాళ్ళు చేసింది నీచమైన చర్య అని ఒకరు, శివసేన నీచమైన రాజకీయాలు చేసేదే కావచ్చు కానీ ఈ విషయం లో వారిని సమర్ధిస్తున్నానని మీరు వాదనలు చేసుకుంటున్నారు కానీ నాకు మాత్రం ఈ విషయం లో కుట్ర కనపడుతున్నది. ఒక పాకిస్తానీ వ్యక్తి తను రాసుకున్న పుస్తకాన్ని తన దేశం లో విడుదల చేసుకోక ప్రత్యర్ధి దేశంలో విడుదల చేయాలనుకోవడం ఏమిటి? అది కూడా శివసేన లాంటి సంస్థలున్న ప్రదేశంలోనే విడుదల చేయటం ఏమిటి? దీని వెనుక మీకు కుట్ర కనపడడం లేదా? ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వేచ్చ పాకిస్తాన్ లోనే కాదు, భారతదేశం లో కూడా లేవు అని ఇతర దేశాలకు వెల్లడి చేయడం కోసమే ( ఇలా జరుగుతుందని ముందే వూహించి ) ముంబాయి లో పుస్తకావిష్కరణ పెట్టుకున్నాడని నాకు అనిపిస్తున్నది. ఆ ప్రయత్నం లో సఫలీకృతుడయ్యాడు కూడా. మన దేశాన్ని ప్రపంచ దేశాల ముందు తలదించుకునే లాగా చేయాలనే ప్లాను ఇది అనిపిస్తున్నది. నార్మల్ గా అయితే శివసేన చేసింది నిస్సందేహం గా తప్పే, కానీ ఈ కుట్రదారుల పట్ల అది చాలా తక్కువ నిరసనే.

    ReplyDelete
  9. >>ఒక పాకిస్తానీ వ్యక్తి తను రాసుకున్న పుస్తకాన్ని తన దేశం లో విడుదల చేసుకోక ప్రత్యర్ధి దేశంలో విడుదల చేయాలనుకోవడం ఏమిటి?
    సింపుల్. మనదేశ మార్కెట్ పెద్దది. ఎలాగూ శివసేన వూరుకోదు అని అన్నారు కాబట్టి ఫ్రీ పబ్లిసిటీ.

    మీకున్న తెలివితేటలు శివసేనకెందుకులేవు? వాళ్ళకి కావలిసింది మనదేశాన్ని ఇతర దేశాలముందు తలదించుకునేలా చేయడం అని శివసేనకి తెలియదంటారా? మరి వాళ్ళని అలానే వొదిలేస్తే మనకి మంచి పేరు వొచ్చేది కదా? ఆ తర్వాత లాహోర్ కి వెళ్ళి శివసేన అక్కడ ఒక పుస్తకం రిలీజ్ చేస్తే, వాల్లు మనకు తారు పూస్తే, అప్పుడు మనకు ఇంకా సపోర్ట్ వొచ్చేదికదా? ఈ ఆలోచన శివసేనకి రాకపొయ్యివుంటే.. వాళ్ళకి పబ్లిసిటీ పిచ్చి అన్నా వుండుండాలి. అలాకాకపొతే మనదేశానికి తలవొంపులు తెద్దామని పాకిస్తాన్ తో కలిసి ఈ పని శివసేనే చేసుండాలి. ఎందుకంటే ఈ కాష్టం రగులుతూనే వుండడం పాకిస్తాన్ కి ఎంత అవసరమో, బి జే పి, శివసేన లాంటి సంస్థలకి, చైనా, అమేరికా లాంటి దేశాలకి(వాళ్ళ ఆయుధాలు అమ్ముడుపోవాలంటే) కూడా అంతే అవసరం.

    ReplyDelete
  10. నా వుద్దేశ్యం, యెవడైతే వాళ్ళ పుస్తకాలకి, సినిమాలకి పుబ్లిసిటీ కావాలనుకుంటాడో వాడు కొన్ని సంస్థలకో, కుల, మత సమాజాల నాయకులకో డబ్బిచ్చి, వాళ్ళతోనే వీళ్లకి వ్యతిరేకంగా గొడవలు చేపిచ్చుకుంటారు. దెబ్బకి ప్రపంచమంతా 24/7 పబ్లిసిటీ.

    ReplyDelete
    Replies
    1. U've nailed man!!

      ఒకానొక వ్యాఖ్యాత అంటారూ... ఇది శివసేన రభస చేస్తుందని ముందుగా తెలిసే ఈ తెంపరితనానికి ఆయన దిగాడూ అని. దాన్ని బట్టి ఈ క్రింది విషయాల్లో ఒకటి లేదా అన్ని నిజమయ్యుండాలని నాకనిపిస్తుంది.

      1) శివసేన గురించి ఆయన ఊహ సరైనదనీ శివసేనే రుజువు చేసేసింది.
      2) ఆయనలా ఎక్స్పెక్టు చేస్తున్నాడని ఎక్స్పెక్టు చేసే తెలివితేటలు మన మూకకు లేదు. మనకు రియాక్టవడం తెలిసిందేగానీ మర్యాద మన సాంప్రదాయం కాదు.

      Delete
  11. వూసరవెల్లి గారేమో "దేశభక్తి" అనే మాటనే బూతుమాట కింద లెక్కేశారు!బ్లూకేక్ గారేమో పుస్తకానికి పాప్యులారిటీ కోసం శివసేన వాళ్ళకి కూడా యెంతో కొంత ముట్టజెప్పేసి ఉంటారు అని కనిపెట్టేశారు,ఇంక దేన్ని విమర్సించాలి?దేన్నీ విమర్శించనఖ్ఖర లేదు!ఇక్కద హిందూ మతాన్నీ అక్కద ఇస్లామునీ విమర్శంచి చాలా మంచిపన్లు చేసినా కసూరి గారు ఇక్కడ పుస్తకాన్ని పబ్లిష్ చేసుకోవటాన్ని సమర్ధిస్తూ శివసేననీ హరిబాబునీ విమర్శించినా వీరు మాత్రమే చెయ్యాలి,కదూ!అనామకంగ వ్యాఖ్యలు చెయ్యడానికి వొదిల్తే ఈ పాటికి "చిచ్చర పిడుగూ నువ్వు రెచ్చిపో?!" టైపులో వందల కొద్దీ కామెంట్లు వర్షంలా కురిసి ఉండేవి!ఈ దేశంలోనే పుట్టి తమ ఎజెండాకి విరుధ్ధంగా ఉన్న చరిత్రని మాయం చేసినా ఒక్క మాట ఆనకూడదు,యెనందుకంటే "దేశభక్తి" అనే దాన్ని బూతు కింద తేల్చేసారు గదా,బలే వ్యూహాత్మక ముందుచూపు?బహుశా మళ్ళీ చారిత్రక తప్ప్పిదాలు చెయ్యకుండా ఉండటానికేమో!

    ReplyDelete
  12. >> ఇంక దేన్ని విమర్సించాలి?
    నువ్వే నిజం హరిబాబు. మనం విమర్శించడానికి యేదో ఒకటి వుండితీరాలి కాబట్టి, శివసేనకి దేశభక్తి ఎక్కువే వుందనుకుందాము. నాది తప్పే. మరి నువ్వు ఆ లైన్ వరకే తీసుకోని ఆపైది వొదిలేసావేంటి?

    హిందువులకి(ఆపేరుతో బి జె పి కి / సన్నాసులకి) నచ్చనివి చేసెవాళ్ళందరూ పాకిస్తాన్ వెళ్ళిపోవాలని తీర్మానించేసిన వాళ్ళకి, నీకు పెద్ద తేడా కనిపించదు. ఎందుకంటే నిన్ను విమర్శించిన వాల్లనందరినీ హిందు వ్యతిరేకులుగానో, కమ్యునిస్టులుగానో, దేశ భక్తిని బూతుగా మాట్లాడేవాల్లుగానో నీకు నువ్వే తీర్మానించేస్తావ్.

    >>అనామకంగ వ్యాఖ్యలు చెయ్యడానికి వొదిల్తే
    నిజమే! ఇప్పటికల్లా నిన్ను విమర్శించిన వాళ్ళని రైల్లల్లో పాటలు పాడుకునేవాల్లగానో, అడుక్కున్నే వాల్లగానో తీర్మానించేసి వుండేవాల్లు.

    ReplyDelete
    Replies
    1. మీరు కూడా మీ వ్యఖ్యలోని కొంత పార్టుని బులబులాగ్గా వొదిలేసారేం?
      ముఖ్యంగా ఈ భాగం
      --------------------------------
      voosaraveLLi:కమ్యూనిష్టులు ఏమీ చేయరని తిడుతూ ఉంటారు కదా ! పాకిస్తానులో కూడా కమ్యూనిజాన్ని సమర్ధించే వారు పాకిస్తానీ తీవ్రవాదాన్ని, మత ఛాందస్త్వాన్నీ ఎండగడుతూనే ఉంటారు. ఎలా అయితే ఇండియాలో మత ఛాందసత్వాన్ని ఎండగట్టే వారిని మెజారిటీయులు దేశ ద్రోహులు అని చిత్రీకరిస్తుంటారో, పాకిస్తానులులో కూడా ఇలాంటి పనులె చేస్తూ ఉంటారు. అయినా వారు తగ్గరు. వారు చేసే పనిని వారు చేస్తూనే ఉంటారు.

      bluecake:మరి వాళ్ళని అలానే వొదిలేస్తే మనకి మంచి పేరు వొచ్చేది కదా? ఆ తర్వాత లాహోర్ కి వెళ్ళి శివసేన అక్కడ ఒక పుస్తకం రిలీజ్ చేస్తే, వాల్లు మనకు తారు పూస్తే, అప్పుడు మనకు ఇంకా సపోర్ట్ వొచ్చేదికదా?
      --------------------------------
      యేమి చెప్తుంది?మీరు పాకిస్తానుని విమర్శిస్తున్నారు,అవునా కాదా?అంటే విమర్శించినా సమర్ధించినా మీరు మాత్రమే చెయ్యాలి.మీకు నచ్చిన వాళ్ళు మీకు నచ్చని వాళ్ళని మాత్రమే విమర్శించాలి.అదే మీ నిర్వచనం ప్రకారం అసలైన "సర్వమానవసౌభ్రాతృత్వం+లౌకికతత్వం",మీకు నచ్చనిదంతా మతమౌఢ్యం - ఇందియాలో అయితే హిందూ మతతత్వం,పాకిస్తానులో అయితే ముస్లిం మతతత్వం,అవును కదూ!

      P.S:నేను నా బ్లాగులో అనామకంగా యెందుకు కామెంటుతాను అని అనిలదీసిన తర్వాత కూడా నాకౌ దాన్నే అంతగట్టిన మూర్ఖత్వం మొదట మీది!దానికి పడాల్సిన తిట్లు పదకపోతే బ్యాలెన్సు కాదు గదా?

      Delete
    2. బాఉగారు అంత హింటిచ్చినా మీరు ఆయన్ను చిచ్చరపిడుగు అంటూ కొనియాడకపోవడం కొండుకచో గుర్తించకపోవడం కడు ఆక్షేపణీయము. మీ చిరునామా తెలిపిన యెడల మేము ఇంకుతో సిధ్ధముగా ఉండెడివ్ వారమని తెలియజేసుకొనుచున్నాము.

      ఇట్లు
      రౌడీసేన.

      Delete
    3. >>విమర్శించినా సమర్ధించినా మీరు మాత్రమే చెయ్యాలి
      నేను ముందే చెప్పా సుబ్బారావ్! నీకు వ్యతిరేకమైన వాల్లందరికీ నువ్వు పాకిస్తానును సమర్ధించేవాల్లు అని ఒక టాగ్ తగిలించేస్తావ్. అది నీ నేచర్ అన్నా కావాలి. లేక పొతే హెల్యూజినేషన్ రోగం ఫైనల్ స్టేజ్లో అన్నా వుండాలి.

      పొనీ నేను చెప్పిన ఆ కామెంట్ లో తప్పుంది అని చెప్పగలవా?

      P.S:అస్సలు నేను ఆ బూతులు మాట్లాడిన అనామకుడ్ని యెమన్న అంటే, అది నేను కాదు, నేను కాదు అంటూ తెగ బుజాలు తడుముకుంటావ్ ఎందుకబ్బా??

      Delete
    4. @ketan
      ఇంకా ఇంకు యేంటహే. యాసిడ్ రెడీ చేసుకో. అప్పుడే నీకు దేశభక్తి విపరీతంగా వుంది అని మేము సర్టిఫికేట్ ఇస్తాం.

      Delete
    5. bluecake:అస్సలు నేను ఆ బూతులు మాట్లాడిన అనామకుడ్ని యెమన్న అంటే, అది నేను కాదు, నేను కాదు అంటూ తెగ బుజాలు తడుముకుంటావ్ ఎందుకబ్బా??

      haribabu:నేను క్లారిఫికేషన్+డిస్క్లెయిమర్ ఇచ్చాక గూడా "హరిబాబూ ఆ అనామకం నువ్వేనని నాకు తెలుసు" అన్నవాళ్ళకి తామెవరో తెలియదా?అనామకపు మందలో మీరు లేరని గ్యారెంటీ ఉందా?మాట అన్నప్పుడు అన్నారని అంటే అది గింజుకోవడమా?మీరు దయ ఉంచి అనామకుల బూతు వ్యాఖ్యలకి రెపాండ్ కాకండి అని రెక్వెస్ట్ చేసినా వినకుండా రెచ్చిపోయి మీరు వేరేవాళతో బూతులు తిట్టించుకుంటే అది కూడా నా తప్పేనా!

      Delete
    6. bluecakae:ఇంకా ఇంకు యేంటహే. యాసిడ్ రెడీ చేసుకో. అప్పుడే నీకు దేశభక్తి విపరీతంగా వుంది అని మేము సర్టిఫికేట్ ఇస్తాం.

      haribabu:నిజమే,వర్గచైతన్యం యెక్కువగా ఉన్న కొద్దిమంది, మెజార్టీ ప్రజల కోరికల్ని పెట్టుబడిదారీ ఆర్ధిక విధానంలోని విషఫలాలుగా లెక్కగట్టి, పెట్టుబడిదారీ ఆర్ధికం తనలోని వైరుధ్యాలకి తనంతట తనే కూలిపోతుందని భయపెట్టి, అలా భయపడిన వారికి తరుణోపాయంగా వర్గరహితసమాజమనే మోక్షమార్గాన్ని చూపించి, దాన్ని వ్యతిరేకించిన వాళ్లకి వర్గశత్రువులని పేరు పెట్టి సాయుధపోరాటం పేరుతో పెద్దమొత్తంలో లేపెయ్యటం నచ్చిన వాళ్ళకి ఈ చిన్నా చితకా రంగులు పులమటం లాంటి బూర్జువా నిరసనలు సిల్లీగా అనిపిస్తాయి కాబోలు?!

      Delete
    7. బూతుల్లో ఉన్న వెరైటీ ఏమంటే, ఒక్కటి తిడితే నొప్పి, తరువాత కామన్. ఇమ్మీడియట్టుగా జీవుడు దున్నపోతు చర్మం మోడ్ లోకి వెల్లిపోతాడు. బూతుల వాన కురిసినా చలించడు అన్నమాట. అందుకె తెలివైనోడు వాదనతోనె గెలవాలి అనేది. ఒకసా పరస్పరం తిట్టుకున్నాక ఇద్దరు వెధవలు తిట్టుకుంటున్నారు అనే అంటారు ఎవరైనా. కాబట్టి, తిట్ల జోలికి వెల్లరు. వెల్లిన తరువాత ఎవరెక్కువ తిట్టారు, ఎవరు తక్కువ తిట్టారు లాంటి లెక్కలుండవు. తిట్టుకున్నారంతే.

      Delete
    8. >>నేను క్లారిఫికేషన్+డిస్క్లెయిమర్ ఇచ్చాక గూడా "హరిబాబూ ఆ అనామకం నువ్వేనని నాకు తెలుసు అన్నవాళ్ళకి తామెవరో తెలియదా?

      అది ఆపోస్టుతోనే ఐపొయింది. నువ్వు మళ్ళీ నిన్నే అన్నట్టు ఎందుకు ఫీల్ అయ్యావో నాకు తెలియదు.


      >>మీరు దయ ఉంచి అనామకుల బూతు వ్యాఖ్యలకి రెపాండ్ కాకండి అని రెక్వెస్ట్ చేసినా వినకుండా

      నువ్వు వాడి బూతులు పూర్తిగా ఎంజాయ్ చేసి, అప్పటికీ వాడి బూతులు తీసెయ్యకుండా తిరిగి నాకు సుద్దులు చెబితే నెనెంటి, చాలామంది డౌట్ పడ్డారు అది నువ్వే అని. కాకపోతే వీళ్ళ కామెంటులు మాత్రం చిచ్చర పిడుగు వేగంతో డిలీట్ చేసేసావ్.

      ఇక పాయింటుకి వొస్తే, ఇక్కడ నువ్వు, నేను ఎవడు గొప్ప అన్న విషయం కాదు. నేను చెప్పింది తప్పా అని అడిగాను. నువ్వు మాత్రం భారీ నందమూరి డవిలాగులు అందుకున్నావ్. ఇప్పటికైనా చర్చ దారిలో పెడదాం.

      Delete
    9. @usaravelli
      వెల్లిన తరువాత ఎవరెక్కువ తిట్టారు, ఎవరు తక్కువ తిట్టారు లాంటి లెక్కలుండవు. తిట్టుకున్నారంతే.

      haribabu:మరింక వాళ్ళెవరో నన్ను బూతులు తిట్టారు,లేకపోతే నేను చాలా మంచోణ్ణీ అని డప్పు కొట్టుకోవటమెనందుకు?

      @bluecake
      నువ్వు వాడి బూతులు పూర్తిగా ఎంజాయ్ చేసి, అప్పటికీ వాడి బూతులు తీసెయ్యకుండా తిరిగి నాకు సుద్దులు చెబితే నెనెంటి, చాలామంది డౌట్ పడ్డారు అది నువ్వే అని. కాకపోతే వీళ్ళ కామెంటులు మాత్రం చిచ్చర పిడుగు వేగంతో డిలీట్ చేసేసావ్.

      hari babu:పైన మీ అన్నాయి క్లారిఫికేషను ఇచ్చాడుగా,ఇద్దరు తిట్టుకుంటే తిట్టుకున్నారంతే అని,మీ దురద కొద్దీ తిటించుకున్న కామెంట్లని నేనెందుకు డెలిట్ చేస్తాను?వాణ్ణొక రెండు తిట్టి తిరిగి తిట్టించుకునే దురద లేకపోతే అసలు రెస్ప్నాడ్ అవ్వవుగా!

      Delete
    10. @blluecake
      ఇక పాయింటుకి వొస్తే, ఇక్కడ నువ్వు, నేను ఎవడు గొప్ప అన్న విషయం కాదు. నేను చెప్పింది తప్పా అని అడిగాను. నువ్వు మాత్రం భారీ నందమూరి డవిలాగులు అందుకున్నావ్. ఇప్పటికైనా చర్చ దారిలో పెడదాం.
      haribabu:సాంకేతికంగా అమన దేశం యెన్నో ఆధారాలు పోగేసి యే దేశాన్నయితే అంతర్జాతీయ వేదిక మీద నేర్స్తురాలిగా నిలబెడుతున్నదో అదే దేసం నుంచి "మా దేశం మీరనుకున్నంత దుర్మారగమైనది కాదు" అనే వాదన మన దేశం నడీబొడున చేస్తుంటే దానికి నిరసన తెలియ చెయ్యకూడదా?మళ్ళీ "bluecake:మరి వాళ్ళని అలానే వొదిలేస్తే మనకి మంచి పేరు వొచ్చేది కదా? ఆ తర్వాత లాహోర్ కి వెళ్ళి శివసేన అక్కడ ఒక పుస్తకం రిలీజ్ చేస్తే, వాల్లు మనకు తారు పూస్తే, అప్పుడు మనకు ఇంకా సపోర్ట్ వొచ్చేదికదా?" అంటున్నావు!

      నువ్వూ పాకిస్తానుని విమర్శిస్తున్నావు,అంటే నువ్వు విమర్శిస్తే రైటు,శివసేన నిరసన తెలిపితే అది దాని మతోన్మాదం,అంతేనా? మన దేశం నడిమధ్యన ఇన్నాళ్ళూ మన దేశం మీదకి టెర్రరిస్టుల్ని పంపి అల్లర్లు సృష్టించిన వాడు తమ దేశం గురించిన పంచరంగుల ముకహ్చిత్రం ఆవిష్కరించుకుంటూన్నా నీకు నెప్పి పుట్టలేదు గానీ శివసేన వాళ్ళూ వాడి మ్ముఖానికి సిరా పులిమితే నీ ఆత్మబంధువ్కి యాసిడ్ పూసిననత బాధగా ఉంది కదూ!కమ్యునిష్టులు తమ ఎజెండా నచ్చని వాళ్ళని వర్గశత్రువు ముద్ర వేసి మిలియన్ల మందిని చంపినా అది వాళ్ళు సమర్ధించుకోగలరు కాబట్టి అది న్యాయం!పొరపాటున అదెక్కడ దేసభక్తి కిందకి వస్తుందో అని దేసభ్క్తిని కూడా "హైహ్ ఎండ్ లిమిట్-లో ఎండ్ లిమిట్" అని తీసిపారేశాక ఇంక చర్చ యెలా సాగుతుంది?

      P.S:చర్చ అంటూ యేమీ లేదు.సాంకేతికంగా మన దేశంలో ఆ పుస్తకంలోనే యెందుకు పబ్లిష్ చెయ్యాలనుకున్నాడు?నువ్వు మరో పుస్తకం రాస్తే సరిపోయేది గదా అంటున్నావు కదా,పుస్తకంలో ఉన్న విషయం అబధ్ధాలు అని తెలిశాక గూఒడా శివసేన నిరసన నచ్చని నీఎలాంటి వాళ్ళు ఉన్నప్పుడు యెన్ని పుస్తకాలు రాస్తే అసలు విషయం తెలుస్తుంది?

      గొప్ప మర్యాదస్తులు - అందరూ రెచ్చిపోయి తిట్టుకుంటే యెవర్నీ తప్పు పట్టకూడదంటూనే మీరూ బూతులు వాడారని ఒప్పుకుంటూనే పత్త్తిత్తు డయలాగులు భలేగా చెప్తున్నారు,మూసుకుపోండి!

      ఇక ముందు మీరు కామెంట్లు వేసినా ఇక్కడ ఉందవు - చెప్పలేదంటనకపొయ్యేరు?!

      Delete
    11. @ketan20 October 2015 at 09:13
      బాఉగారు... Roudisena ....

      No dude you cannot claim "Rowdi Sena" tag !!
      Malakpet Rowdi blog owners has Copy Right...... Yes MalakpetRowdis are staunch "RIGHT" ...
      :D

      Delete
  13. మొదట్లో హిందూ ముస్లిముల మధ్య గొడవలు మొదలైనప్పుడు దేశమంతా ఆ మానసిక విభజనకి బాధపడింది. కానీ అందులో ఓ మంచి Business prospect ఉందని ఉభయపక్షాల వ్యాపార/ రాజకీయ / సైనిక మేధావులూ త్వరలోనే కనిపెట్టారు. ఫలితంగా ఈ గొడవలు అంతూ పొంతూ లేకుండా పెరిగిపోతున్నాయి. అలాగే ఈ రోజు తెలుగువాళ్ళ మధ్య వచ్చిన విభజనకి అందరం బాధపడుతున్నాం. కానీ ఇందులో కూడా మంచి Business prospect ఉందని కొంతమంది కనిపెడుతున్నారు. ఉదాహరణకి తెలంగాణలో చూడండి - AP అని ఉన్న నంబర్ ప్లేట్లన్నీ TS అని మార్చాలంటూ ఆదేశాలంట. దేశంలో ఎక్కడా లేని నిబంధన. 1 కోటీ 50 లక్షల నంబర్ ప్లేట్లు ఒక్కసారిగా మారిస్తే కొన్ని వందల కోట్ల వ్యాపారం. అందులో ఆ ఆదేశాలు జారీ చేసినవాడికి ఎంతో కొంత వాటా ఉండదనుకోలేం. ఇలాగే అన్నీని!

    ReplyDelete
  14. #UG SriRam18 October 2015 at 10:25#

    Dude!! when reading from bottom-to-top, I could not figure where in the context this fits.

    The majority of the software folk constitute are equivalent of sweat shot labor if the silicon city. Majority of these these Indian pigs couldn't even speak English and if you are imagining them to be the policy/decision makes, welcome to reality dude!!!

    #We fucking Indians are not good at architecting things (according to statistics) we are just the peasants of the software field.#

    ReplyDelete
    Replies
    1. "couldn't even speak English "
      Slave spotted .....
      China ...Russia never cares English .... IT industry has nothing ....nothis to do with ENGLISH .... If one has concept and core skils nobody cares is he speak English or a Deaf&Dumb .....
      But your slavery of English ..... Limit less!!
      Ketan is a Waste fellow (your comment sounds same )

      Delete
  15. @ketan
    #We fucking Indians are not good at architecting things (according to statistics) we are just the peasants of the software field.#

    haribabu:భారతీయులకి ఇబ్బంది కలిగించబోయే విధంగా శాసనాలు చెయ్యబోతున్న్నారని తెలిసి మైక్రోసాఫ్ట్ అధినేత గొడావ్ చెయ్యటం నీకు తెలుసా?అక్కద్ అకొని చోట్ల చట్టసభల్లో సభ్య్లుగా కూడా యెన్నికవుతున్నారు,వ్యాపార సంస్థలూ ఉన్నాయనేది అబధ్ధమా!

    వాళ్ళేమో తమ దేశపు ప్రాభవం పెరగటానికి యే చిన్న అవకాశాన్నీ వొదులుకోవటం లేదు!మనమేమో మనల్ని మనం కించపరుచుకోవటానికి యే చిన్న అవకాశాన్నీ వొదులుకోవటం లేదు?

    ReplyDelete
  16. @Marripoodi Mahojas19 October 2015 at 23:24
    మొదట్లో హిందూ ముస్లిముల మధ్య గొడవలు మొదలైనప్పుడు దేశమంతా ఆ మానసిక విభజనకి బాధపడింది. కానీ అందులో ఓ మంచి Business prospect ఉందని ఉభయపక్షాల వ్యాపార/ రాజకీయ / సైనిక మేధావులూ త్వరలోనే కనిపెట్టారు.

    haribabu:మహోజస్ గారూ,
    మీరంటే నాకు చాలా గౌరవం.నా పొస్టులో మీరు వేసిన ప్రతి అభిప్రాయాన్నీ శ్రధ్ధగా చౌవుతాను.కొందరిలా అక్కడ నిరసన తెల్పింది శివసేన గాబట్టీ ఇక్కడ దాన్ని సమర్ధిస్తున్నది హరిబాబు గాబట్టి విమర్శించి తీరాలనే దురద మీకు లేదని అనుకుంటున్నాను.

    1.కొన్ని దశాబ్దాల పాటూ మా జాతి వేరు,మాకు వేరే దేశం కావాలి అని గొడవ చేసిన వాళ్ళ ప్రమేయం యేమీ లేదంటారా?అవి కొందరి సైనిక వ్యాపార వ్యూహాల ప్రకారం నడిచిన స్క్రీన్ ప్లే అని ఒప్పుకున్నా పాత్రధారులూ గాత్రధారులూ అమాయకులు అనుకుంటే "మానవ ప్రయత్నం వల్ల కాదు దైవ నిర్ణయాల వల్లే అన్నీ జరుగుతాయి" అనే రకం వ్యాపార మిధ్యావాదం కిందికే వస్తుందేమో,ఆలోచించండి!

    2.పూర్తిగా టెక్నికల్ ప్రశ్న:దేశభక్తి,హిందూ మతోన్మాదం,ఆధిపత్య ధోరణి,శివసేన అరాచకపు ప్రవర్తనా లాంటి చెత్త మాటల ప్రభావం లేకుండా ఒక జవాబు చెప్పండి.భారత్ కొన్ని దశాబ్దాలుగా ఆ దేశంలో ప్రభుత్వ సహాయ సహకారాల తోనే టెర్రరిస్టు క్యాంపులు నడుస్తున్నాయనీ సరిహద్దులో ఒక చోట కాల్పులు జరుపుతూ మరొక చోటు నుంచి టెరరిస్టుల్ని సరిహద్దులు దాటించటం లాంటి దుండగాలు చేస్తున్నదనీ చెప్తున్నది,అది నిజమా అబధ్ధమా?అది నిజమే అయిన పక్షంలో అవి జరిగే నాడు ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కసూరి గారికి ఆ విషయాలు తెలియకుండా ఉంటాయా!తను సర్వీసులో ఉండగా ఈ దేశం మీదకి టెర్రరిస్టుల్ని వొదిలే కార్యక్రమలో పాల్గొన్న వాడు సర్వీసు ముగిశాక "మా దేశం చాలా అమాయకమైనది,శాంతిని స్థాపించడానికి భారత్ సహకారం మాకు అవసరం" అనే విధంగా సుభాషితాలు చెప్పడాన్ని మీరెలా అర్ధం చేసుకున్నారు?ఇంతకీ శివసేన మసి పూసింది విదేశీయుదైన కసూరికి కాదు స్వదేశీయుడైన కులకర్ణికి,అవునా?దాన్ని బటి వాళ్ళు అనాలోచితంగా చెయ్యలేదని యెవరికి పుయ్యాలో యెందుకు పుయ్యాలో స్పష్తంగానే ఉన్నారని తెలియడం లేదా?నిన్నటి రోజున టెరరిస్టుల్ని పంపించే నాడు వాటికి బలయి మౌనంగా అఘోరించిన యెర్రిపప్పలమూ మనమే!ఇవ్వాళ మన దేశమే అంత మంచి పాకిస్తానుని బద్నాం చేస్తున్నదని తెలిసేటట్టు వాడికి గుడ్విల్ సాధించి పెట్టటానికి తహతహలాడుతూ యెర్రిపప్పలమైనదీ మనమే, కాదంటారా?

    ఫ్.శ్:కొన్ని పూర్వ ప్రతిపాదిత భావాలతో నాకు మూర్ఖత్వాన్ని అంటగటకుండా కొంచెం పారదర్శకంగా ఆలోచించి జవాబు చెప్ప్పండి.మీ అభిప్రాయం నిజంగానే నాదే తప్పు అనిపించేలా ఉంటే ఈ పోష్టుని తీసేస్తాను.కామెంట్ల కోసం నేను పోష్టులు వెయ్యటం లేదు.

    ReplyDelete
  17. హరిబాబుగారూ! మీకు నాయందు వ్యక్తం చేసిన గౌరవానికి కృతజ్ఞతలు. నేనూ మీ బ్లాగు కోసం ఆత్రంగా ఎదురుచూసే పాఠకుల్లో ఒకణ్ణి. దేశ విభజన వ్యాపారం కోసమో, స్వదేశీ గేలరీల కోసమో జరిగిందని కాదు నా అభిప్రాయం. కానీ ప్రస్తుతం అది అలా ఉపయోగపడుతోందని మాత్రమే. నేనింతకుముందటి వ్యాఖ్యల్లో చెప్పినదానికన్నా ఎక్కువ చెప్పడానికేమీ లేదు. మీరు వేసిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. అవన్నీ నిజమే. కానీ ఆ ఒక్క వ్యక్తీ అందుకు బాధ్యత వహించలేడు.

    మనవైపునుంచే ఒకడు అలాంటి పుస్తకమే భారత్ ని సమర్థిస్తూ వ్రాసి పాకిస్తాన్ లో విడుదల చెయ్యబోతే అందుకు అక్కడి ప్రభుత్వ/ప్రజాసంస్థలు అంగీకరిస్తాయా? అనే ప్రశ్న ఉంది. ఖచ్చితంగా అంగీకరించరు. నిజమే. But India is not Pakistan. This is a free open society. It is the United States of Asia. ఇక్కడ ఎవరైనా భారత్ ని విమర్శించి క్షేమంగా ఉండొచ్చు బయటివాళ్ళు కూడా! పాకిస్తాన్ పరిస్థితి అది కాదు. అదో మిలిటరీ సమాజం. దాన్తో మనల్ని, మనతో వాళ్ళనీ పోల్చి వంతులు పోకూడదు.

    ఈ పుస్తక విడుదల ప్రయత్నాల పట్ల మనకున్న ప్రత్యేక ఆందోళనకి ఓ కారణం ఉంది. ఇంటా బయటా ఎవరి మద్దతుకీ నోచుకోక, ఒక్క ప్రేమపూరితమైన మాట కూడా హిందూసమాజం గురించి మాట్లాడేవాళ్ళు లేక మానసికంగా కాంప్లెక్సులో రగిలిపోతూ ఉన్న సమాజం మనది. ఇలాంటి పరిస్థితుల్లో మనవాళ్ళ మనసుల్ని చదవకుండా అలాంటి ప్రయత్నం చేయడం కసూరిగారి పరంగా ఆయన వరకూ తప్పే. He has apparently, like several others, over-estimated our broad mind.

    But democratic societies do have and should have a different way to disagree on controversial points. డెఫినిట్ గా ఇది (శివసేనది) మాత్రం పద్ధతి కాదు.

    ReplyDelete
  18. ఇంకో మాట చెప్పాలనుకున్నాను సర్! హిందూ సంస్థల ఉద్దేశాల్ని నేను విమర్శించే ప్రశ్నే లేదు. నేనూ హిందువునే కనక. అయితే ఇలాంటి ఇష్యూస్ తలెత్తినప్పుడు ప్రపంచానికి ఆధ్యాత్మిక పెద్దన్నలమైన మన ప్రతిస్పందనలు నాన్-హిందూస్ కంటే కాస్త డిఫరెంట్ గా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటానంతే!

    ReplyDelete
  19. @mahojas
    ఇంటా బయటా ఎవరి మద్దతుకీ నోచుకోక, ఒక్క ప్రేమపూరితమైన మాట కూడా హిందూసమాజం గురించి మాట్లాడేవాళ్ళు లేక మానసికంగా కాంప్లెక్సులో రగిలిపోతూ ఉన్న సమాజం మనది.

    haribabu:ఇది నాకు యేమాత్రం కొరుకుడు పడని అభిప్రాయం.హిందువులు మానసికంగా కాంప్లెక్సుతో రగిలిపోతున్నారా?ఇంటా బయటా ఒక్క ప్రేమపూరితమైన మాటకు కూడా నోచుకోని స్తితిలో ఉందా హిందూసమాజం!యెక్కడయితే మోదీ మీద గోద్రా అల్లర్లకి తనే పనిగట్టుకుని "హిందువులు తమ గాయాలకు ప్రతీకారం తీర్చుకునే మనస్తత్వంలో ఉన్నారు,వారికి అవకాశం కల్పించండి" అని చెప్పి మరీ కార్ణమయ్యాడని అల్లరి చేశారో(ఆఖరికి మోదీ నా కారు కింద ఒక కుక్కపిల్ల పడినా నేను బాధపడనా అన్న మాతకి అదుగో మోదీ ముస్లిముల్ని కుక్కపిల్లతో పోల్చాడు అనేతంత సిల్ల్లీగా మాట్లాడారు) అక్కడా,ఇంకా దేసమంతటా ముస్లిములు కూడా భాజపాకే మళ్ళీ మళ్ళీ వోటు వేస్తుంటే గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉన్నారు,కళ్ళు తెరుచుకుని చూడండి!

    1947 ఆగస్టు నుంచీ నెహ్రూ హయాము నుంచీ మతపరమయిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.హిందువుల్ని చంపటంలో ముస్లిములు తక్కువాఎమీ తినలేదు,అయితే హిందువులు మూస్లిముల మీద దాడి చేస్తే హిందూ మతతత్వ వాదపు అహంకారంతో చేసినవి అనీ,అదే ముస్లిములు హిందువుల మీద ముస్లిములు చేస్తే అంతకు ముందు హిందువులు చేసిన దాడికి ప్రతీకారమనే యేకపక్షపు విశ్లేషణలు చేశారు.అంటే ముస్లిములు హిందువుల మీద దాడి చేసినా హిందువులే కారణం,యేమి నిష్పక్షపాత వైఖరి?ఇప్పుడు కూడా దాద్రీ సంఘటన హైలైట్ అయినంతగా ఒక చోట ముస్లిముల ప్రార్ధనా స్థలం ముందు కేవలం హారన్ మోఎగించినందుకు అతని ప్యాంటు వూడదీసి ముస్లిమా కాదా అని చూసి చేసిన ఘాతుకం సంగతి యేంటి?రెండూ ఒకే రకపు సంఘటన అయినా ఒకటే యెందుకు ఇంతగా హైలైత్ అయ్యింది?

    గత అరవయ్యేళ్ళ నుంచీ యెనత సహనంతో ఉన్నా పదే పదే "హిందువులు అంటే మతతతవవాదులు" అనే బ్రాండు కొట్టేశారు,అటువైపు కొందరు తమకి పొలిటికల్ ప్లాట్ఫాం కోసం తమకు పనికొచ్చే యే చిన్న అవకాశాన్నయినా సరే కోతిపుణ్దు బ్రహ్మరాక్షసి చేస్తున్నారు.ఈ రెండు నాతకాల నిజస్వరూపం ఇవ్వళహిందువులకే కాకుండా ముస్లిములకి కూడా తెలిసిపోయింది.అది పదే పదే ముస్లిముల వపు నుంచి కూడా మార్పు తెల్లుస్తున్న ఇప్పుడు హిందువులు గొప్ప్ ఆత్మవిశ్వాసంతో ఉన్నారని నేననుకుంటున్న్నాను.మీరు పొరపాటు పడుతున్నారేమో?!

    అశాంతితో రగిలిపోతునదెవరు?పోయిన పట్టు మళ్ళీ దక్కించుకోవలనుకున్న వాళ్ళు!

    ReplyDelete
    Replies
    1. గూగుల్ లో Hindu అని కొట్టి చూడండి. హిందువుల పట్లా, హిందూయిజమ్ పట్లా ఎంత విషం కక్కబడుతోందో వందలాది సైట్ల ద్వారా తెలుస్తుంది. ఇది కేవలం ఆన్-లైన్ విషం కాదు. వాస్తవ ప్రపంచంలో ఉన్నదే ఆన్-లైన్ లో reflect అవుతోంది. ఆ విధమైన negative చిత్రీకరణతో హిందువులు విసిగి ఉన్నారు. చాలా క్షోభిల్లి ఉన్నారు. మతపరంగా, జాతిపరంగా చేయబడే విమర్శల విషయంలో చాలా సెన్సిటివ్ గా తయారయ్యారు. ఆ ధోరణి దేశానికి సంబంధించి కూడా పాకింది. అదీ నేనంటున్నది.

      పాకిస్తాన్ లాంటి పొరుగుదేశాలతో మనం శాంతి సాధించడం చాలా అవసరం. పొరుగున అశాంతి పెట్టుకుని ఆ రకమైన చిల్లర మల్లర ప్రాంతీయ గొడవల్లో తలమునకలయ్యే ఏ దేశమూ ప్రపంచాన్ని శాసించగల Super power కాజాలదు. ఉదాహరణకి, పాత సోవియట్ యూనియన్ కి పొరుగుదేశాలన్నీ మిత్రులే. అలాగే యు.ఎస్. కి ఆ చుట్టుపక్కల దేశాలన్నీ మిత్రులే. వాళ్ళ గురించి నిద్ర మానుకుని ఆలోచించాల్సిన అవసరం యు.ఎస్.కి లేదు. కనుక అది ఇతర ఖండాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పథకాలు వెయ్యగలదు. ఇండియా పరిస్థితి అలా లేదు. భూటాన్ తప్ప ఇండియా చుట్టూ అందరూ ద్రోహులూ, శత్రువులే, హిందూ నేపాల్ తో సహా!

      రెండు తరాల క్రితం గుంటూరులో నడింపల్లి నరసింహారావుగారని ఓ నాయకుడు ఉండేవాడు. మంత్రిగా కొంతకాలం ఉన్నారు కూడా! అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగల calibre ఉన్న మనిషి. అలాటిది గుంటూరు లోకల్ మునిసిపల్ పాలిటిక్స్ లో మునిగిపోయి ఆ రాగద్వేషాల మూలాన పైకి రాలేక అనామకంగా కన్నుమూశాడు. ఒక దేశంగా ఇండియా పరిస్థితి కూడా అలాగే ఉంది.

      Delete
  20. @mahojas
    ఇంకో మాట చెప్పాలనుకున్నాను సర్! హిందూ సంస్థల ఉద్దేశాల్ని నేను విమర్శించే ప్రశ్నే లేదు. నేనూ హిందువునే కనక.
    haribabu:మీ గురించి నాకు అలాంటి ఒపీనియన్ యెప్పుడూ లేదు.ఒక రకంగా మీ జవాబు చూశాక నా పోస్టు డెలిట్ చెయ్యాల్సిన వస్రం లేదని తెలిసింది.హిందువుల ప్రతిస్పందన ఉన్నతంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారని మొదటి నుంచీ అర్ధమవుతూనే ఉంది.కానీ యెలా ఉండాలి?దీని గురించి తెలుసుకోవాలంటే కొంచెం మూలానికి వెళ్ళాలి.అసలు పాకిస్తాన్ పట్ల మనం యెలా ప్రతిస్పందించాలి అన్నది కాదు ముఖ్యం,పాకిస్తాన్ మనల్ని యెలా చూస్తున్నది అనేది తెలుసుకోవాలి.ముఖ్యంగా పాకిస్తాను అనే నా మాటకి పాకిస్తాను ప్రభుత్వం కాదు పాకిస్తాను పౌరసమాజం యెలా చూస్తున్నది అనేది తెలుసుకోవాలి,యెందుకంటే మనం కూడా సామాజికులమే గనక!.ప్రస్తుతం ఆ అపని మీదే ఉన్నాను.నాకు పూర్తిగా అర్ధం కాగానే ఒక పూర్తి టపా వేస్తాను.
    WE WILL MEET THERE!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...