Wednesday 28 October 2015

కులకర్ణి మీద శివసేన రంగు పులమటం నిజంగా తప్పేనా?పాకిస్తాను అంత అమాయకమైన దేశమా!అయితే భారత్ విషప్రచారం చేస్తున్నదా?!


     పాకిస్తానం ఒక దుర్మార్గమైన దేశం,ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నదని వారి పట్ల యెన్ని చీకటి వార్తల్ని ప్రపంచ మీడియా వ్యాపింపజేసినా ఒక కాంతిరేఖ విరుస్తున్నది అక్కడి నుంచి - ప్రపంచంలోని పెట్టుబడుల మదుపుదార్ల కందరికీ ఇప్పుడు పాకిస్తాను బంగారు గుడ్లు పెట్టే బాతు!



     కలయా, నిజమా, వైష్ణవ మాయా అని అనుకోకండి!నిజమే, ఇప్పుడు నూట అరవై మిలియన్ల జనాభాలో ముప్పై మిలియన్ల మంది 10,000 - 15,000 డాలర్ల సంపాదనతో ఉన్నారు.వస్తుసేవల మార్కెట్ యేర్పడితే కొనుగోలుదారులుగా వీరు మంచి లాభాలని తెచ్చిపెడతారు.యూరోపియన్ మార్కెట్లు మొత్తం యెదగడానికి అవకాశం లేక ముసలివైపోయినాయి,ఈ కుర్ర మార్కెట్ ప్రపంచంలోని పెట్టుబడి దారులందర్నీ విపరీతంగా ఊరిస్తున్నది.ఇంకా ఆర్ధికపరమైన స్థిరత్వం,పేదరిక నిర్మూలన,ఉపాధి కల్పన వంటి విషయాల్లో అధ్భుతమైఅన యెదుగుదల కనపడుతున్నది.2001లో 1.8% ఉన్న ఆర్ధీక పరమైన యెదుగుదల గత నాలు సంవత్సరాలకి 7% అయింది.పాకిస్తాన్ ఆర్ధికానికి అతి ముఖ్యమైన మాన్యుఫాక్చరింగ్,ఎగుమతుల రంగాలో ఈ అయీదేళ్ళలో రెట్టింపు వృధ్ధి కనపడుతున్నది.భౌగోళికంగా పాకిస్తాన్ ఇండియాకీ ఇరాన్,ఆఫ్ఘనిస్తాన్ లాంటి మధ్యా అసియా దేశాలకి నడుమన ఇరుక్కుని ఉంది కనుక యెటు నుంచి యెటు వెళ్ళాలన్నా ఈ దేశపు పోర్టుని తగలాల్సిందే,ఈ దేశాన్ని దాటాల్సిందే!

     పాకిస్తాన్ అనే పదానికి అర్ధం "పవిత్ర భూమి" అని!దక్షిణాసియాలోకల్లా అత్యంత ప్రాచీన మానవ నాగరికతలు ఉధ్భవించిన భూమి ఇది.పంజాబు లోని సోన్ లోయలో పాత రాతియుగానికి చెందిన మానవ సమాజపు ఆనవాళ్ళు ఉన్నాయి.వైదిక సంస్కృతికి సంబంధించిన హరప్పా,మొహంజదారో నగరాలు ఈ దేశంలోనే ఉన్నాయి.క్రీ.పూఒ 2500 నుంచి క్రీ,పూ 500 వరకు వైదిక సంస్కృతిలో ఉండి క్రీ,పూ 519 నాటికి పర్షియన్ల అధిపత్యం కిందకి వెళ్ళీంది.క్రీ,పూ 185 వరకూ మౌర్యసామ్రాజ్యంలో భాగంగా ఉండి బాక్ట్రియా పరిపాలకుదైన డెమెట్రియస్ అనే గ్రీకు ప్రభువు ఆధీనం లోకి వెళ్ళీంది.క్రీ,పూ 165 నుంచి క్రీ.పూ 150 మధ్యన మినాందర్ కాలంలో మంచి వైభవాన్ని చూసింది.ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తక్షశిల విశ్వవిద్యాలయం ఈ దేశం లోనిదే!క్రీ.శ 6వ శతాబ్దం నుంచి ఇక్కడ మెల్లమెల్ల్లగా ఇస్లాం వ్యాపించటం మొదలైంది.అప్పటి వరకూ బౌధ్ధులుగా,హిందువులుగా ఉన్న ఈ ప్రాంతపు ప్రజల్ని ఇస్లాము వైపుకి నడిపించటంలో సూఫీ వేదాంతులు ప్రముఖ పాత్ర వహించారు.క్రీ.శ 711లో ముహమ్మద్ బిన్ క్వాసిం సింధ్ నుంచి ముల్తాన వరకు గల ప్రాంతాన్ని ఆక్రమించుకున్న నాడు మొదటిసారిగా పాకిస్తాను ఆవిర్భావం జరిగిందని పాకిస్తాన్ ప్రభుత్వపు అధికారిక చరిత్రలో ఉన్నది.క్రీ.శ 975 నుంచి క్రీ.శ 1187 వరకు గజనీ సామ్రాజయంలో,క్రీ.శ 1206 నుంచి క్రీ.శ 15266 వరకు ఘోరీల సామ్రాజ్యంలో,తర్వా త లోడీ సామ్రాజ్యంలో భాగమై క్రీ.శ 1526 నుంచి క్రీ.శ 1857 వరకు మొఘల్ సామ్రాజ్యంలో భాగమై ఉంది.క్రీ.శ 1857లో జరిగిన సిపాయి తిరుగుబాటు వైఫల్యం అనంతరం బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ద్వారా ఇంగ్లాడు రాణి అధీనంలోకి వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం పనిగట్టుకుని చేసిన విభజించి పాలించటం అనే వ్యూహానికి గురయి అప్పటివరకూ కలిసిమెలిసి బతుకుతున్న హిందువులు,ముస్లిముల మధ్యన విభేదాలు క్రమక్రమంగా పెరిగి ముస్లిముల ప్రయోజనాల్ని కాపాడటానికి క్రీ.శ 1901లో ద్విజాతి సిధ్ధాంతంతో పుట్టిన అఖిల భారత ముస్లిం లీగ్ క్రీ.శ 1930 కల్లా మరింత బలోపేతమై 1940లో పాకిస్తాన్ నిర్మాత అయిన మహమ్మదాలీ జిన్నా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మార్చి 24 నాడు పాకిస్తాన్ ప్రతిపాదనగా పిలువబదే లాహోరు ప్రతిపాదన చేసింది!ఆ తరవాత రెండవ ప్రపంచ యుధ్ధానంతరం బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని సంకల్పించుకోవడంతో క్రీ.శ 1947  ఆగస్టు 14న పాకిస్తాన్ ఒక సార్వభౌమాధికారం గలిగిన స్వతంత్ర దేశంగా అవతరించింది!

     1947లో దేశానికి స్వతంత్రం వచ్చాక పాకిస్తాను ఆవిర్భావానికి కారణమైన ముహమ్మద్ అలి జిన్నాయే తొలి గవర్నర్ జనరలుగా,తొలి దేశాధ్యక్షుడిగా,పార్లమెంటుకి తొలి స్పీకరుగా వ్యవహరించారు.లియాకత్ ఆలి ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.అయితే 1956లో జరిగిన రాజ్యాంగ సవరణ ద్వారా ఇస్కందర్ అలి మిర్జా అధికారికంగా తొలి దేశాధ్యక్షుడిగా గుర్తించబడుతున్నారు.ఇతని పాలనాకాలం కేవలం రెండేళ్ళు మాత్రమే!ఈ కాలమంతా అంతర్గతంగా రాజకీయపరమైన అస్థిరత్వాలు,అంతర్జాతీయ సంబంధాలలో ఒడిదుడుకులతో గడిచింది.1958లో దేశంలో అశాంతి పెచ్చరిల్లి పోవడంతో మార్షల్ లా ప్రవేశపెట్టి రాజ్యాంగాన్నీ,పార్లమెంటుతో సహా అన్ని రాజ్యాంగసంస్థల్నీ రద్దు చేసి తొలిసారి పాకిస్తాను రాజకీయాల్లోకి సైనిక పాలన రావటానికి కారకుడయ్యాడు.ఇతనిచే చీఫ్ మార్షల్ లా అడ్మినిస్ట్రేటర్ పదవిలో నియమితుదైన జనరల్ అయూబ్ ఖాన్ కేవలం 20 రోజులో ఇతన్ని పదవీచ్యుతుణ్ణి చేసి ప్రవాసానికి పంపించాడు.1962లో అధ్యక్ష తరహా పాలనని వ్యవస్థీకరించిన తర్వాత 1965లో భారతదేశంతో రెందవ యుధ్ధం జరిగేవరకు పాకిస్తాను అనూహ్యమైన అభివృధ్ధిని సాధించి యుద్ధం తర్వాత పరిస్థితి దిగజారి ఇతని ప్రాభవం తగ్గుతూ వచ్చి 1967లో యాహ్యా ఖాన్ అధ్యక్షుడయ్యాడు.1970లో తొలిసారి సైనిక పాలన నుంచి ప్రజాస్వామ్యబధ్ధమైన పరిపాలనకు మారడానికి యెన్నికలు జరిగినా తూర్పు పాకిస్తానుకు చెందిన ఆవామీ లీగ్ గెలవటంతో సైన్యం అధికారాన్ని అప్పగించటానికి నిరాకరించింది.దీనితో ప్రజల నుంచి వచ్చిన నిరసన వెల్లువ బెంగాలి ముక్తి వాహిని అధ్యక్షతన పోరాడి భారత్ సహకారంతో బంగ్లాదేశ్ అవతరించింది.ఈ కాలంలో జరిగిన ప్రాణనష్తం 300,00 నుంచి 3 మిలియన్ల వరకూ ఉండొచ్చుననై అంచనా వేసారు.అక్కడి విమోచనోద్యమాన్ని పశ్చిమ పాకిస్తానులో అంతర్యుధ్ధంగా పరిగణించి అందులో భారత్ ప్రమేయం ఉండటం వల్ల చిన్న చిన్న దాడులతో మొదలై 1971 నాటికి యుధ్ధం తీవ్రరూపం దాల్చింది.ఆ యుధ్ధంలో ఓటమి తర్వాత జుల్ఫికర్ అలి భుట్టో అధికారంలోకి వచ్చి 1972 నుంచి 1977 వరకూ పాకిస్తాను ప్రజానీకం ఒకింత ప్రజాస్వామ్యాన్ని అనుభవించేఅటట్టు చేశాడు.ఈ కాలంలోనే పాకిస్తానులో వామపక్ష భావజాలం తొలినుంచీ నామమాత్రంగా ఉన్న తన పలుకుబడిని యెక్కువగా పంచుకోగలిగింది.1977లో మళ్ళీ వామపక్ష భావజాలం కలిగిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైన్యం రంగంలోకి దిగి 1978 నుంచి మళ్ళీ జియా ఉల్ హక్ అధ్యక్షుడుగా సైనిక పాలన మొదలైంది.ఇతని నేతృత్వంలో 1978 నుంచి 1088 వరకు ఇతను పాటించిన ఆర్ధిక ఇస్లామీకరణ విధానంతో మళ్ళీ అభివృధ్ధి పధంలో పయనించింది.1988లో జియా విమాన ప్రమాదంలో మరణించడంతో బెనజిర్ భుట్టో తొలి మహిళా ప్రధానిగా యెన్నికైన తర్వాత ఒక దశాబ్దం పాటు ఒకరి మీద మరొకరు పైచేయి సాధించాలనే రాజకీయ కుమ్ములాటల వల్ల అభివృధ్ధి వేగం మందగించి అతి త్వరగా భయానక స్థాయికి దిగజారింది.ఈ కాలమంతా తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవటానికి భారతదేశంతో ఘర్షణలకి దిగటం,అవినీతి,కుడి-యెడమ భావాల మధ్య సంఘర్షలు తప్ప యే విధమైన ప్రగతి లేని చీకటి రాజ్యం.దీని ఫలితంగా అఖండ ప్రజాదరతో నవాజ్ షరిఫ్ అధ్వర్యంలో 1997లో పాకిస్తాన్ ముస్లిం లీగ్ ప్రభుత్వం యేర్పడింది.కానీ 1999లో కార్గిల్ యుధ్ధంలో ఓడిపోవడం వల్ల మళ్ళీ పర్వెజ్ ముషారఫ్ రక్తరహితవిప్లవంతో అతన్ని కూలదోసి సైనిక పాలన తీసుకొచ్చాడు.ఇతను పాకిస్తానుని 1999 నుంచి 2001 వరకు చీఫ్ ఎగ్సెక్యూటివ్ హోదాలోనూ,2001 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగానూ పరిపాలించాడు.ఇతని కాలంలో జరిగిన ఆర్ధిక సంస్కరణలు సత్ఫలితాల నివ్వటం వల్ల మరోసారి అభివృధ్ధి వూపందుకుంది.తొలిసారిగా ఇతని కాలంలో నేషనల్ అసెంబ్లీ తన అయిదేళ్ళ పదవీకాలాన్ని పూర్తి చేసుకోగలిగింది!

     కానీ 2008లో సరిగ్గా యెన్నికల సమయంలో బెనజిర్ భుట్టో హత్యకు గురి కావడంతో సానుభూతి పవనాల సాయంతో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిచి యౌసఫ్ రజా గిల్లాని ప్రధానిగా ప్రభుత్వాన్ని యేర్పాటు చేసింది.ఇంపీచ్మెంటు చేస్తామని బెదిరించడంతో ముషారఫ్ రాజీనామా చేసి అసిఫ్ ఆలి జర్దారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.న్యాయవ్యవస్థతో యేర్పడిన కలహాలు పెద్దవై 2012లో గిల్లాని ప్రభుత్వం పడిపోయింది.ముషారఫ్ టెర్రరిజం మీద చేసిన యుధ్ధం వల్ల అంతర్గత అంచనాల ప్రకారమే పాకిస్తాన్ ఆర్ధిక రంగం మీద 67.93 బిలుయన్ డాలర్ల బరువు పడింది.,మూడు మిలియన్ల మంది నిరాశ్రయూలయ్యారు.ఈ పరిణామాలన్నీ కలిసివచ్చి మళ్ళీ 2013లో జరిగిన యెన్నికల్లో నవాజ్ షరిఫ్ పధ్నాలుగేళ్ళ తర్వాత మూడవసారి దేశప్రధానిగా తిరిగి అధికారంలోకి వచ్చాడు.

     ఇంత సుదీర్ఘమైన పాకిస్తాను రాజకీయ చరిత్రలో అధికారంలో యెవరు ఉన్నా తమ అంతర్గత వైఫల్యాలను కప్పి పుచ్చుకోవటానికి భారత్ మీద విషం కక్కడం లోనూ యే కొంచెం ఆర్ధికం పుంజుకున్నా భారత్ మీద యుధ్ధం చేసి నవ్వులపాలవడం లోనూ ఆ తర్వాత ఆర్ధికంగా దేశాన్ని భ్రష్టు పట్టించడం లోనూ మాత్రం అందరూ ఒక్కలాగే ప్రవర్తిస్తూ వస్తున్నారు!ఇట్లాంటి రాజకీయ వాతావరణంలో కనీసం పునరాలోచన కూడా లేకుండా కొనసాగుతున్న ప్రభుత్వంలో చెప్పుకోదగిన కాలం పాటు భాగస్వామి అయిన కసూరి భారత్ అన్ని సాక్ష్యాధారాలతో ఆ దేశాన్ని టెర్రరిస్టు దేశంగా ప్రకటించాలని డిమాండు చేస్తున్న తరుణంలో ఈ దేశపు నడిబొడ్డున "మా దేశం చాలా అమాయకమైనది,మేము గొప్ప శాంతికాముకులం,మాలో కొందరు ఉద్యోగులు ప్రసంగాలని మార్చటం లాంటివి చెయ్యటం వల్లనే అభాసు పాలవుతున్నాం" అని ఒక పంచరంగుల ముఖచిత్రాన్ని తమ దేశానికి కట్టబెట్టాలని ప్రయత్నిస్తుంటే దాన్ని వ్యతిరేకించటానికి బదులు వ్యతిరేకించిన వాళ్ళని హిందూ మతోన్మాదులుగా ముద్ర వేస్తున్నారు ఈ దేశంలో లౌకికత్వానికీ వసుధైక కుటుంబ భావనకీ అధికారిక పేటెంటును తమకు తామే ఇచ్చేసుకున్న కొందరు బుద్ధిమంతులు - ఇక్కడ మన దేశంలో మన పరువు తీస్తుంటే ఇప్పుడు చూస్తూ వూరుకుని తర్వాతేప్పుడో తీరిగ్గా మనం మరో పుస్తకం రాసి వాళ్ళ దేశం వెళ్ళి మసి పూయించుకుని వస్తే పోతుంది గదా,,ఈ కొంచానికి అంత తీవ్రంగా రియాక్టు కావాలా,పుస్తకం చదవకపోతే చాలుగా లాంటి వాదనలతో అతన్ని ప్రోత్సహించడం అంటే భారత్ పాకిస్తాను మీద చేస్తున్నది అబధ్ధపు ప్రచారం అనిపిస్తుందనే పాటి ఆలోచన కూడా లేదా?మాతృదేశపు పరువుని బద్నాం చేసుకుని పరదేశం కుట్రకి జై కొట్టడం యేమిటి?మీడియా - అది స్వదేశీ అయినా వీదెశీ అయినా సంచలనం కోసం యెంత దుర్మార్గాని కయినా తెగిస్తున్న సంగతి కొన్ని లక్షల సార్లు చూసి కూడా వీరికి జ్ఞానోదయం కావటం లేదా?కార్గిల్ యుధ్ధానికి కారకుడైన నవాజ్ షరీఫ్ వామపక్ష భావజాలం అనుకూలుడే.అంటే పాకిస్తానులో ఉన్న కమ్యునిష్టులు భారత్ మీద యుధ్ధం చేసి గెలవటానికి ప్రధానుల్ని ప్రోత్సహిస్తూ తమ దేశభక్తిని చాటుకుంటున్నారు.భారత్ లోని కమ్యునిష్టులు ఇప్పుడు పాకిస్తానులో ఉన్నది వామపక్ష భావాలు ఉన్నవాడు గాబట్టి ఆ బాదరాయణ సంబంధంతో పాకిస్తానుని చెడ్డపేరు నుంచి తప్పించడం కోసం దేశభక్తిని "high-end-limit","low-end-limit" పేరుతో బూతుమాట కింద దిగజార్చి  శివసేనకి యెటూ మతతత్వపు ముద్ర ఉంది కాబట్టి దొరికిందిరా ఛాన్సని మిగతావాళ్లకి సెక్యులరిజం పోజులు కొడుతూ పాకిస్తాను కుటిలయత్నాన్ని నిరసించినందుకు వీళ్ళు వాళ్లని విమర్శిస్తూ "పాకిస్తాను నిజంగానే అమాయకమైన దేశం,మా దేశమే లుచ్చా,పాకిస్తాను మీద విషప్రచారం చేస్తున్నది" అని తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలన్నంత గొప్ప హృదయవైశాల్యాన్ని చూపిస్తున్నారు,ఇదే ఈ రెండు దేశాల్లో వర్గరహితసమాజాన్ని స్థాపించడానికి వారికి దొరికిన దగ్గరి దారి కాబోలు!

సెక్యులరిజం యెక్కువైతే,కమ్యునిజం ముదిరితే దేశభక్తి కూడా బూతుమాట అవుతుంది కాబోలు!

3 comments:

  1. హరిబాబు గారూ, ఆ ఇంకేదో కసూరి మీదే చల్లితే పోలా? ఈ ఘటనలో నాకయితే భాజపా-శివసేన కుమ్ములాటే కనిపిస్తుంది. ఒకప్పుడు బాల థాకరే ధరించిన "హిందూ హృదయ్ సామ్రాట్" కిరీటాన్ని గోద్రా అనంతరం మోడీకి మారడం, విధాన సభ ఎన్నికలలో తమకు చేయిచ్చి భాజపా సొంతంగా గద్దెనెక్కడం & తాజాగా సురేష్ ప్రభు జంపు ఇవేవీ శివసేనకు గిట్టడం లేదు.

    ReplyDelete
    Replies
    1. జై గారూ
      శివసెన పాకిస్తానుకి సంబంధించి భాజపాతో స్నేహంగా ఉన్నప్పటి రోజుల్లో కూడా ఇదే ఆదిరిగా ప్రవర్తించిందని మీకూ తెలుసు కదా!కుమ్ములాతలు ఉన్న మాట నిజమే కానీ అవి లేకపోయినా ఆ పార్టీ ఇలాగే ప్రవర్తిస్తుంది,అందులో అనుమానమే లేదు.

      ఇంకొకటి కూడా ఆలోచించండి,ఆ పుస్తకంలో నుంచి నేను ఉదహరించిన ఒక ఉదాహార్ణ చదివారు కదా దీఎనికి సంబంధించిన గత పోష్టులో.అలాంతి వాదనలతో ఉన్న పుస్తకం మనదేశంలో పబ్లిష య్యి మనం యేమాత్రం నిరసన తెలియ జెప్పకక్పోతే భారత్ చేస్తున్నదంతా విష ప్రచారం అయిపోతుందనేది పట్టించుకోకపోతే యెట్లా!

      నాకయితే ఆ పుస్తకాన్ని ఇక్కదే పబ్లిష్ చేయించుకోవాలనుకున్న్న దాని వెనక కుట్రయే కనబడుతున్నది.ప్రభుత్వం తనకు తానుగా పర్మిషన్ ఇవ్వకపోతే ప్రబుత్వంలో కాంగ్రెసు ఉన్నా భావస్వేచ్చ కింద గోల చేస్తారు,ఇప్ప్పుడు భాజపా ఉంది.తెలుసుకోవలసిందీ నిరసన ప్రదర్సించాలిసందీ ప్రజలే.

      పాకిస్తాన్ ప్రజలు చాలా మంచివాళ్ళు.వాళ్ళ గురించి మరుసటి పోష్టులో చెప్తాను.కానీ పాకిస్తాను ప్రభుత్వం దానికి భిన్నమైనది,కాబటి నిరసన ప్రదర్శిస్తే పాకిస్తాను ప్రజల్ని అవమానించినట్టు కాదు.

      అది గ్రహించాలి అందరూ.

      Delete
  2. < "పాకిస్ధాను అంత అమాయకమైన దేశమా?"

    ఈరోజు పేపర్లో వచ్చిన పాకిస్ధాన్ పూర్వ అధ్యక్షుడు ముష్రఫ్ వెల్లడించాడంటున్న సమాచారం చూస్తే పాకిస్ధాన్ అంత అమాయక దేశం కాదనే అనుకోవాలి (Deccan Chronicle, Hyd, Page-9). కాశ్మీర్లో పోరాడటానికి LeT తదితర ఉగ్రవాద సంస్ధలకి 1990ల్లో పాకిస్ధానే ట్రెయినింగ్ ఇచ్చి సపోర్ట్ చేసిందనీ, తాలిబన్ కి కూడా పాకిస్ధాన్ ట్రెయినింగ్ ఇచ్చిందనీ, తాలిబన్, హఖాని, బిన్ లాడెన్, జవహరి ఆరోజుల్లో తమకి హీరోలనీ, అప్పటి పరిస్ధితుల్ని అర్ధం చేసుకోవాలనీ ముష్రఫ్ అన్నారట.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...