Tuesday, 4 November 2014

మార్క్సిజం తెలియకపోతే పుట్టిన వాళ్ళం పుట్టినట్టే వుంటామా?

     మార్క్సు గారు చెప్పిన వ్యక్తిగత ఆస్తి రద్దు నాకు వేదాంతులు చెప్పే అహం వొదులుకోమనటం లాగా వినపడుతుంది, అదేమిటో!వేదాంతం చెప్పే గురువులు "సాధన చేయుమురా నరుడా,సాధ్యము కానిది లేదురా" అని యెంత వూదరగొట్టినా నరమానవుడి కెవడికీ అహాన్ని వొదులుకోవటం సాధ్యపడ లేదు.మార్క్సుగారు చెప్పిన వ్యక్తిగత ఆస్తి రద్దు కూడా అంతే.మార్క్సుగారు చెప్పిన చాలా అంశాలు మతాచార్యులు చెప్పే మాటల్లాగే ఆకుకీ పోకకీ అందకుండా వుంటాయి.ఈ వ్యక్తిగత ఆస్తి రద్దునే తీసుకోండి - ఆయన ఫ్రెండు యెంగెల్సు గారు పెద్ద జమీందారు కొడుకు.

      మార్క్సుగారు ఆ "దొసో కొపిత్యేలో" రాసి జనంలోకి వొదిలిన తర్వాతయినా యెంగెల్సు గారు తన ఆస్తిని వొదులుకున్నాడా? పుస్తకం రాస్తుండగానే వొదులుకుని వుంటే మాత్రం మార్క్సుగారి పుస్తకం బయటికి రాకపోయుండేది!మార్క్సుగారు తన భార్యకే గాక తన పనిమనిషికి పుట్టిన పిల్లలకి గూడా బాధ్యుడై వాళ్ల నందర్నీ పోషించడానికి మేజోళ్ళూ బూట్లూ అమ్ముకుంటున్నప్పుడు మిత్రుడిగా అప్పులు తీర్చి ఆదుకోకపోయుంటే అప్పులు యెక్కువై అప్పుల వాళ్ళ చేత జైలుకు తరమబడి అక్కడే మగ్గుతూ వుందే వాడు కదా!ఇంతకీ తెలుగులో ఇంత నిజాయితీగా చెప్తున్న ఈ రచయిత్రి పేరున ఆస్తులు యేమీ లేవు గదా?వుంటే సిధ్ధాత ద్రోహం కాదా!

      మావూళ్ళో ఒక మహానుభావుడు వున్నాడు. పేరు గూడా చెప్తాను.పొన్నం వీర రాఘవయ్య చౌదరి.ఈయన విశిష్టత యేమిటంటే అంత కుగ్రామమలో పుట్టి కమ్యునిష్టు కావడమూ, అనామకంగా వుండిపోకుండా కంకి గుర్తు పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా యెదగటం. చాలా మంది వున్నారు గదా ఇలాంటి గొట్టాలు అనుకోవచ్చు మీరు, కానీ కమ్యునిష్టుగా వుంటూనే కమ్యునిష్టు అయిన వాడు మాట్లాడగూడని బూతు మాట మాట్లాడినా కమ్యునిష్టుగానే చెలామణీ అవుతూ వుందటం?ఒక పనిమీద మేము వాళ్ళింటికి వెళ్ళి తనతో మాట్లాడే అవకాశం కోసం యెదురు చూస్తున్నాం. ఈలోపు వాళ్లబ్బాయి అతనితో మాట్లాడుతుండగా వాళ్ళిద్దరి సంభాషణా మా చెవిన పడింది,మామూలు మనిషిని గనక కళ్ళు తిరిగినంత పనయింది?!అదే గొప్పవాళ్లయితే మీడియా ముందు దిగ్భ్రాంతి పడేవాళ్లేమో?

      తమ పొలాల్లో పనులు జరుగుతున్నాయి, పనులూ, కూలీలూ వాటికి స్మబంధించిన విషయం."అంతెందుకు కూలీ, దండగ?" - అని ముదలకిస్తున్నాడీ రైతుకూలీ సంక్షేమానికి కట్టుబడ్డ పార్టీకి సంబంధించిన పెద్దమనిషి!"కూలీలు రారు నాన్నా, మిగతా వాళ్ళు అంతే ఇస్తున్నారు" అని కొడుకు అంటే "యెందుకు రారు గట్టిగా మాట్లాడాలి" అని ఆ కమ్యునిష్టు పితృదేవుడు కమ్యునిష్టు కాని కొడుకుని గద్దిస్తున్నాడు.అంతగా కమ్యునిజంతో మమేకమయిన మనిషి మిగతా వాళ్ల కన్నా తన పొలంలో కూలీల్ని అయిదు రూపాయలు తక్కువకి పని చేయించుకోవాలనుకుంటున్నాడే ఆ మనిషి పుట్టినట్టా?పుట్టనట్టా?పుట్టగానే చచ్చిపొయినట్టా?

      ఇంకో వెయ్యేళ్ళ తర్వాత అయినా - ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్లనుకున్నట్టు విప్లవం భూమి అంతటా పరుచుకున్నాక కూడా యే ఇద్దరు వ్యక్తుల మధ్య నయినా అమ్మకం, కొనుగోలు లాంటి ట్రాన్సాక్షన్ జరిగితే యెవడో ఒకడు నష్టపొవటం ఖాయం!అమ్మేవాడు అవసరపడి అమ్ముతున్నాడని తెలిస్తే కొనేవాడు తక్కువకి కిట్టించుకోవాలని చూస్తాడు.కొనేవాడికి ఈ వనరు చాలా అవసరం అని తెలుసుకుంటే అమ్మేవాడు చెట్టెక్కి కూర్చుంటాడు.దీనికోసం మార్క్సిజమే చదవాలా?ఒక వూరి కరణం మరో వూరి కాపు అనే సామెత ఈనాటిదా?!

      మరీ ముఖ్యంగా హిందూ ధర్మానికి సంబంధించిన చాలా విషయాలు మార్క్సిజంలో చెప్పే విషయాల కన్నా గొప్పగా వుంటాయి.వుదాహరణకి దేవీ భాగం విషయాన్నే తీసుకుంటే మార్క్సు చెప్పిన అదనపు విలువని సమాజ పరం చేసి సంపదని అందరూ సమానంగా పంచుకోవడం మనవాళ్ళు పాతకాలం లోనే సాధించారని అర్ధ మవుతుంది!

3 comments:

  1. ఊరుకొద్దురు మీరు మరీనూ..!
    ఫలానా సుబ్బిగాడి కోడి కుయ్యకపోతే లోకానికి తెల్లారదని సుబ్బిగాడి బందువులు, భజన పరులూ ఎంత ఊరంతా టముకేసుకుంటే మాత్రం నిజం అవుతుందా?? ఆలెక్కన, ఆయన కంటే ముందు పుట్టినోల్లు ముఖ్యంగా ఇమాన్యుయెల్ కంట్ (Immanuel Kant), హెగెల్ పుట్టినట్టే ఉండిపోయాడా? అదే నిజమయితే మార్క్సిజం అనేది అసలు ఉండేదా? వాటినుండేకదా "పక్కోడి సొమ్మును ఎలాంటి గిల్టీ ఫీలింగు లేకుండా అనుభవించడం ఎలా" అనే మహా ఫిలాసఫీకి ఆవిష్కరణ జరిగింది.

    ReplyDelete
    Replies
    1. స్పందించినందుకు ధన్యవాదాలు!ఇంకా పూర్తి కాలేదు?మొదట యెంతో కొంత మ్యాతరు పబ్లిష్ చేసేద్దాం అనై మొదలెట్టేశా.ఆ ముగ్గుబుట్టముసిల్దాని సంగతేంటో ఆవిద గారి పంఖాల గొప్పేమిటో తేల్చుకుందామని మాచెడ్డ హుషారుగా వుంది నాకు.యెవరయినా వస్తేనా!

      Delete
  2. పుట్టినవాళ్ళం పుట్టినట్టే ఉండిపోతే నష్టమేముంది? అది చాలా హాయి గదా! మళ్లీ ఆ ఒరిజినల్ స్థితికే తిరిగివెళ్ళమనీ, మధ్యలో అంటుకున్నవాటిని వదిలించుకోమనే గదా అన్ని సిద్ధాంతాలూ చెప్పేది?

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...