Tuesday 30 September 2014

శభాష్ దీపికా!నువ్వు నాకు నచ్చావ్!!

            యే భాష అయినా కానివ్వండి, సినిమా వాళ్ళు సభ్యతాసభ్యతల్ని మర్చిపోయి చాలా కాలమయింది!కమల్ హాసన్,ప్రకాష్ పడుకొనె లాంటి వాళ్ళ సంతానం సినిమాల్లోకి వచ్చినా మంచి పాత్రలు చేసి గౌరవప్రదంగా నడుచుకుని తంద్రుల గౌరవాన్ని మరింత పెంచటం లాంటి సుత్తి విషయాల్ని పట్టించుకోకుండా తాము కూడా తమ అందాల్ని ఆరబోస్తూ మార్కెట్ పరంగా లాభసాటి సరుకుగా మారిపోతున్నారు.సరుకుగా యెప్పుడయితే మారారో వాళ్ళ వ్యక్తిత్వాన్ని గురించి యెవడూ ఆలోచించడనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు.ఆ మతిమరుపు వల్లనే దీపికా పడుకొనె కి ఆ ఇబ్బందికరమయిన పరిస్థితి దాపరించింది!


          అడుసు తొక్కనేల?కాలు కడుగనేల?దీపిక పడుకొనె కి అంత కోపం యెందు కొచ్చింది?తను చేసింది తప్పు కాదనే అనుకుంటున్నదా?నా దృష్టిలో ఖచ్చితంగా తప్ప్పే!యెందుకంటే ఆ ఫొటో తీసిన సందర్భం ఆవిడ నటించిన సినిమాలోని దృశ్యం కాదు, సినిమాల్లో మేము రోజూ చేసేది అదే కదా అని సమర్ధించుకోవటానికి!ఒక పబ్లిక్ ఫంక్షన్ లో తను అలా కనపడింది అంటే అప్పుడు తన ఇష్టాపూర్తిగా వేసుకున్న డ్రెస్సే కదా అది!ఒక సరుకుగా మారిన తను ఆ ఫంక్షన్ కి వచ్చే సినిమా వాళ్ళ దృష్టిలో పడాలనే కదా అలా వెళ్ళింది?జరగాల్సిన హాని జరిగిపోయాక పరువు పూర్తిగా పోయాక యెంత కోపగించుకున్నా ముళ్ళకంప మీద పడిన బట్తని గుంజినట్టే!ఆ స్థలానికి ఆ కాలానికి దొరికిపోయిన ఆ దీపిక మీద నాకు జాలి తప్ప ఆ దీపికని విమర్శించాలని కూడా లేదు నాకు!రేపు అదే పరిస్థితిలో కాల్ హాసన్ గారమ్మాయి కూడా నిలబడొచ్చు,అలా ఇంకెన్నడూ జరగదని చెప్పలేం?!యేది యేమయినా ఆ ఫొటో/వీడియో పబ్లిష్ చేసిన జర్నలిష్టు ఒక చిన్న కుదుపునైనా తీసుకు రాగలిగాడు, సత్యమేవ జయతే అమీర్ సాబ్ కూడా కేవలం నిర్మాతల్ని తప్పు పట్టి ప్రయోజనం లేదు లెండి, మాలాంటివాళ్లం కూడా అంతో ఇంతో కారణమే అని వొప్పుకునేలాగ చేశాడు!

           నేను శభాష్ అని మెచ్చుకుంటున్న దీపిక మరో సెలెబ్రిటీ, దీపిక పల్లికల్ - స్క్వాష్ ఆటలో మేటి!డిసెంబర్ 2012 నాటికే WSA rankingsలో టాప్ 10లోకి యెగబాకగలిగింది!2006లో ప్రొఫెషనల్ కరీర్ మొదలు పెట్టి యెన్నో యెత్తు పల్లాల్ని చూసి ఆఖరికి 2011 సెప్టెంబర్ లో ఇర్విన్ లో మొదటి WISPA టైటిల్ గెలుచుకోవడంతో అందరికీ తెలియడం మొదలయింది!


          చూశారుగా యెంత అందంగా వుందో!బాలీవుడ్ మహారాజాల కళ్ళు పడకుండా వుంటాయా?ఈ అందాల్ని తెరమీద ఆరబోస్తే యెన్ని కోట్ల లెక్కన గిట్టుబాటవుతుందో గదా అని తెగ ఆశపడ్డారు, పాపం!కానీ ఈ అమ్మాయికి ఆరకమయిన దురద లేకపోవడంతో కుదరదని చెప్పేసింది.వూరికే చెప్పి వొదిలెయ్యటం కాదు, తను ఒక వర్ధమాన క్రికెట్ ఆతగాణ్ణి ఇష్తపడుతున్నది - అతని అభిప్రాయం కూడా దానికి వ్యతిరేకంగానే వుండటంతో తను యెప్పటికీ తెరమీద కనబడే చాన్స్ లేదని ముఖం మీద తలుపేసేసింది. ఈ అమ్మాయి గురించే నేను చెప్పింది:

శభాష్ దీపికా!నువ్వు నాకు నచ్చావ్!!

3 comments:

  1. తన అందాల్ని గుట్టుగా వుంచుకోవాలో, లేక బహిరంగంగా ఆరబోయాలో అది మగువల ఇష్టం. అందాల్ని అమ్ముకునే సినీ ఇండస్ట్రీలో వుండి, అందాల్ని అమ్ముకుంటూ కూడా ఫోటో గ్రాఫర్ ను తప్పు పట్టడం వింతగా వున్నది. అదే అందాల్ని సినిమాలో సినిమా ఫోటోగ్రాఫర్ తీస్తే తప్పులేదు. కానీ పబ్లిక్ ఫంక్షన్ లో ఒక ఫోటో గ్రాఫర్ తీస్తే అపరాధమయ్యింది. అంత ఫోటో తీయకూడదు అనుకున్న వ్యక్తి నిండైన దుస్తులుతోఫంక్షన్ కు వస్తే ఎవరైనా వద్దంటారా? నేనిక్కడ ఫొటోగ్రాఫర్ ను సమర్ధిచండం లేదు. వాడు చేసింది తప్పే. కానీ ఒకడు తప్పు చేయడానికి అవకాశం ఇచ్చేవారిది మొదటి తప్పు అవుతుంది. మీరు చెప్పిన రెండవ దీపిక ప్రవర్తన చూడండి ఎంత హూందాగా వుందో. అటువంటి మహిళలకే అధిక గౌరవం లభిస్తుంది.

    ReplyDelete
  2. మొదట్లో నాకూ ఫొటోగ్రాఫర్ చేసింది తప్పేమో అనే సందేహం వుండడం వల్లనే ఇంత లేటుగా పోష్టు వేశా.కానీ ఫొటోగ్రాఫర్ చేసింది కొచెం తప్పుగా అంపించినా అది వాళ్ళ వృత్తిలో భాగం.తమ కెమెరా కంటికి కనబడినదాన్ని ప్రజల ముందు వుంచటం వాళ్ళ విధి.యేమయినా ఒక కుదుపు కుదిపాడు అందర్నీ!

    ReplyDelete
  3. నా దృష్టిలో ఈ వ్యవహారం మొత్తం ఒక nonsense.

    Clevage మీద zoom చేసి ఆ చిత్రాలను publish చెయ్యడం ఒక cheap publicity stunt. దాన్ని వ్యక్తిస్వేఛ్ఛ మీద చేసిన దాడిగానే పరిగణించాలి. నాకు black dog బ్రాండు విస్కీ తాగడం ఇష్టం. I do so WHEN I wish to do so. That doesn't mean it gives you/someone a right to force me to drink. నాకిష్టమైనప్పుడు నేను ఆపనిచేస్తానుతప్ప మీకిష్టమైనప్పుడు కాదు.

    ఇహపోతే దీపిక సంగతి. ఈమొత్తం విషయం ఏవిధంగా women empowerment అవుతుందో నాకు అర్ధంకాలేదు. I think she was just employing an 'appeal to emotion' strategy by relating this issue with feminine rights. ఆమె చేసినపనిని ఆమె తన వ్యక్తిస్వేఛ్ఛగా సమర్ధించుకొనుంటే aptగా ఉండేది.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...