Monday, 28 March 2016

లెఫ్టు బిహైండు పార్టీల మైండు లేని రాజకీయం - లెఫ్టోవరు వోట్ల కోసం!

          కాలం కలిసిరాకపోతే తాడే పామై కరుస్తాదంటారు,ఓడలు బళ్ళవుతాయంటారు,పువ్వులమ్మిన చోట రాళ్లమ్మాల్సి వస్తాదంటారు - ఈటన్నిటికన్నా దయనీయంగా పోలిక చెప్పడానికే కుదరనంత పరమ దరిద్రంగా ఉందండయ్యా భారద్దేశంలో వామపక్షాల దుర్గతి!తన రాజకీయ జీవితమంత వయస్సు లేని కన్హయ్యా కుమారుడికి నారాయణ గారు విమానాశ్రయానికి వెళ్ళి ఎదురేగి తోడ్కొని రావడం దగ్గిర్నించీ కారు డోరు తీసి పట్టుకుని హడావిడి చెయ్యడం వరకూ చేసిన మర్యాదలకి నిజంగా అతను ఉద్దరించిన ఘనకార్యం ఏమిటి?

          ఒకప్పుడు ఎట్టా వుండేవోళ్ళు?ఎట్టాంటోళ్ళు ఎట్టా అయిపోయారు!బెంగాలు కమ్యునిష్టులు "మిగతా భారద్దేశమంతా వందేళ్ళ తర్వాత ఆలోచించే విష్యాలు బెంగాలు ఇవ్వాళ ఆలోసిస్తాది" అంటే నోరెళ్ళబెట్టి చూసినోళ్లే దప్ప "ఠాట్!ఏంటి నీ గొప్ప?" అన్నోడు లేడు.ఎక్కద నలుగురు పోగయితే అక్కడల్లా ఈళ్ళ గొంతే ఇనపడేది.గత చరిత్ర గమనం గురించి ఏది ఎందుకు జరిగింది,ఏది ఎందుకు జరగలేదు,ఎట్టా జరిగితే బాగుండేది అని చిలవలు పలవలుగా కళ్ళక్కట్టినట్టు చెప్పి ఒప్పించి నమ్మించగలిగిన తెలివి అంతా యాడికి బొయ్యిందో పాపం!

          జరిగిన దాన్ని గురించి ఎందుకు జరిగిందో చెప్పడానికి ఏ చిలక జోస్యమూ అక్కర్లేదు,ఏ పాండిత్యమూ అక్కర్లేదు,ఫ్యూచరు గురించి చెప్పండ్రా అంటే మాత్రం గుడ్లు తేలేస్తారు - అబ్బే విప్లవం అంటే వీజీ కాదు అని డబ్బాయిస్తారు!సైన్సు ఫిక్షన్ రచయితల పాటి కూడా నిక్కచ్చిగా చెప్పలేరు గానీ వాళ్లు జరుగుతుందనుకున్నది జరక్కపోయినా జరగదనుకున్నది జరిగినా కవరప్ చేసుకోవడానికి పనికొచ్చే చారిత్రక తప్పిదాలకి కారణాలు మాత్రం భలేగా  వండి వారుస్తారులే!

          మీ లక్ష్యం ఏమిటయ్యా అంటే అందర్నీ వర్గరహితసమాజంలో నిలబెట్టడం అని చెప్పడం వరకూ ధీమాగానే చెప్తారు గానీ అదెట్టా ఉంటుందీ అని నిలదీస్తే మాత్రం నత్తినత్తిగా విసుక్కుంటారు, గట్టిగా అడిగితే అడ్దం తిరిగి నువ్వు విప్లవద్రోహివి అర్ధమయ్యే నటిస్తున్నావు అని మనకే పువ్వులు పెడతారు,అదేంటో!పోనీ అడిగేవోడు అర్ధమయ్యే ఎటకారం ఆడుతున్నాడని అనుకుందాం,తనకి తెలివితక్కువగా అనిపిస్తేఅనే గదా ఎటకారం ఆడేది ఎవడయినా - నీ తెలివైన సిద్ధాంతం గురించి ఇంకొంచెం తెలివిగా చెప్తే ఎట్టా ఉంటది!అసలు పూర్తిగా విడమరిచి చెప్తే ఎటకారం ఎందుఒస్తుందీ అంట!బుద్ధుడి లాంటి సన్నాసుల మాటల్నే నమ్మినవాళ్ళు వీళ్ళ మాటల్ని ఎందుకు నమ్మటం లేదు?ఇంతకుముందు ఎవరూ చెప్పని కొత్త సిద్ధాంతం అంటారు, కొత్తది గాబట్టే అర్ధం కాకనే గదా అడిగాం, పూర్తిగా తెలుసుకోకుండా పరిగెత్తుకుని పోయి అగ్గిలో దూకటానికి మనమేం వేముల రోహిత్ లాంటి ఎర్రిపప్పలమా?

         కాలేజీలో క్లాస్ పుస్తకాలు తప్ప ఇంకోటి చదవకుండా ర్యాంకులు తెచ్చుకుని ఘనమైన యూనివర్సిటీలో రీసెర్చి స్కాలరుగా చేరేవరకు పెద్ద ఉద్యోగం చెయ్యాలనే రంధి తప్ప ఇంకేమీ లేనివాడు వీళ్ళ పైత్యపు కబుర్లకి లొంగి ఎట్టా అయిపోయాడో చూదండి.కార్ల్ సగన్ లాగ సైంటిష్టు కావాలనుకున్న వాడు టెర్రరిస్టుల్ని సమర్ధించి గూండాగిరీకి కూడా దిగజారి కోర్టుకేసులో ఇరుక్కుని రాజీ చెసుకుందామనుకున్నప్పుడు కధ తిరిగిన ట్విస్టుకి తన చుట్టూ తను వూదుకున బుడగ బరెస్టయ్యి తను హీరోయిజం అనుకున్న వేస్టు బతుక్కి డెంటిస్టు కూడా కాలేనని తెలిసి బతుకంటే ఇంటరెస్టు పోయి ట్రూరెపెంటెన్సు పుట్టిన ట్వెంటీఫోరవర్సు కూడా గడవకముందే అన్రెస్టు ఎవరెస్టంత పెరిగి సెటైరు కోసం వీసీని ఉరితాళ్ళు అడిగిన మేతావి నిన్నటివరకూ తను జండాలా ఎగరేసిన గుడ్డనే ఉరితాడుగా వాడుకుని మోస్ట్ సింబాలిక్ చావు చచ్చాడు!రేపు ఈ కన్హయ్యా ఏ జఫ్ఫయ్యా అవుతాడో?

ఒకడేమిటో వాడి చావు చెబుతుందంటారు, వాడి బతుకులో ఉన్న కంఫ్యూజనే చావులోనూ ధగధ్ధగాయమానంగా ప్రకాశిస్తున్నది!రాసి కొట్టేసిన భాగం కొంత ఉందని తెలియని కాలంలో చదివిన ఆఖరి ఉత్తరం చదివి నేను చాలా ఫీలయ్యాను.కానీ,రాసి కొట్తేసిన భాగం చదివాక మళ్ళీ కంఫ్యూజన్ కూడా అదే స్థాయిలో మతి పోగొట్టేసింది.The letter purportedly written by Rohith Vemula, the Dalit scholar of University of Hyderabad, before he committed suicide, has been sent to the forensic lab for analysis as reports emerged about an entire paragraph that had been scratched off the note. On close examination, the portion of the note that Vemula, perhaps on second thoughts, decided to keep concealed, reads: "ASA, SFI, anything and everything exist for their own sake. Seldom the interest of a person and these organisations match. To get power or to become famous or to be important in between boundaries and to think we are up to changing the system, very often we overestimate our acts and find solace in traits. Of course I must give my credit to these both groups for making introducing me to wonderful literature and people. (sic)" According to media reports, this part of the letter is reflective of the sense of futility that the scholar felt in being associated with the student unions.చచ్చిపోయటప్పుడు విరక్తి కన్నా భావుకత్వం పొంగిపొర్లడ మేంటి?అంత ఘాటుగా యూనియన్లని ఉతికినవాడు ఎందుకు కొట్టేశాడు?కొట్టేసినవాడు పనిగట్టుకుని ఇది నేనే కొట్టేశాను అని పక్కన రాసి సంతకం చెయ్యడ మేంటి?ఈ రాసి కొట్టేయ్యడం, మళ్ళీ పక్కన నేనే కొట్టేశానని సంతకం చేసినవాడు అయితే పిచ్చివాడయినా అయి ఉండాలి,లేదంటే అతి మంచివాడయినా అయి ఉండాలి!మొదట మనసులో దాచుకోకుండా ఉన్న నిజాన్ని కక్కేశాడు,తర్వాత తీరిగ్గా ఆలోచించి కొట్టేశాడు.ఏమని ఆలోచించాడు?మరీ అంత దుర్మార్గంగా తిడితే తన ఫ్రెండ్సు రేపటి నుంచీ ఇలాంటి హీరోయిజం చూపించటానికి ఇబ్బంది పడతారని అనుకున్నాడు కాబోలు!అంటే,తను వేటికి విరక్తి పుట్టి చచ్చిపోతున్నాడో అవి తన ఫ్రెండ్సు ఆపకుండా చెయ్యాలని అనుకున్నాడు కాబోలు!అదీ గాక,తన శవాన్ని మొదట తన ఫ్రెండ్సే చూస్తారనీ,పోలీసులు ఈ పార్టు కొట్టేసింది తను కాదని తన ఫ్రెండ్సుని అనుమానిస్తారేమోనని జరగబోయేదాన్ని కూడా వూహించి తన చుట్టూ ఉన్నవాళ్లకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఒక రోజు క్రితం వరకు అంత ధైర్యంగా ఉన్నవాడు ఆ ఒక్క రోజులో అంత డీలా పడిపోవడం ఎవరివల్ల జరిగిందో వాళ్ళని తన  చావు వల్ల కూడా ఇబ్బంది పడనివ్వకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవటం - ఇంత గందరగోళపు చావు నేనెక్కడా చూళ్ళేదు?!

          ఆ చావే అంత గందరగోళంగా ఉంటే దీన్ని క్యాష్ చేసుకుని పాప్యులారిటీ పెంచుందామనుకున్న ఎరుపు కైపెక్కిన వాళ్ళ గందరగోళం మరింత గందరగోళంగా ఉంది.వాడు స్పష్తంగా "నేను ఆతమహత్య చేస్కుంటున్నాను.నా చావుకి ఎవరూ బాధ్యులు కారు." అని రాసిపెట్టి చచ్చిపోతే అది హత్య అనీ హంతకుల్ని శిక్షించాలనీ అల్లరి చహెశారు,చేస్తున్నారు,చేస్తారు.నిజంగా హంతకుల స్థానంలో ఎవర్నయిన అనిలబెట్టాలంటే  65464 మరియూ 6666 వాళ్లనే నిలబెట్టాలి!ఎందుకంటే,తన రాసి కొట్టేసిన భాగంలో ఎవరి గురించయినా నెగటివ్ ధోరణిలో రాశాదంటే అది వాళ్ల గురించే,మరి వాళ్ళని హంతకుల స్థానంలోకి ఎవరు తీసుకొచ్చి నిలబెదతారు?


          ఇప్పటివరకు రోహిత్ గురించి చర్చించిన వారిలో ఏ ఒక్కరికీ రోహిత్ స్టైపండ్ ఎందుకు ఆగిపోయింది అనే అనుమానం రాలేదు,ఎందుకని?మీడియా యూనివర్సిటీ అధికార్లని అడిగీతె “పేపరు వర్కు వల్ల జాప్యం” అనే ఒక ముక్క మాత్రమే బైటికి వచ్చింది.అధికార్లు విషయం వివరంగానే చెప్పే ఉంటారు,కానీ మొత్తం చెబితే రోహిత్ మీద సానుభూతీ తమ MRTP కొసెం సెన్సేషనూ పుట్టవని కాబోలు మీడియాలో ఎవరూ దానిగురించి ఎక్కువగా కవర్ చెయ్యలేదు.రోహిత్ అక్కడ రీసెర్చ్ వర్కుకి ఎన్రోల్ అయ్యాడు. రీసెర్చ్ వర్కు అంటే ఎన్రోల్ అవటం ఒక్కటేనా ముఖ్యం.వర్క్ చెయ్యాలిగా,చెసినట్టు రిపోర్ట్స్ ఇవ్వాలిగా.నెలవారీ ప్రోగ్రెస్ మదింపు చెయ్యాలని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏమిటో ఇక్కడ వివరంగా చదవవచ్చు.6వ సెక్షనులో అటెండెన్సుతో కలిపి రీసెర్చ్ వర్కుకి సంబంధించిన వివరాలు చూదొచ్చు,7వ సెక్షనులో స్కాలర్షిప్పులకి సంబంధించిన నెలవారీ మదింపు గురించిన నియమాలు చూడొచ్చు.స్కాలర్ షిప్ కూడా ఎన్రోల్ అయితే చాలు వర్క్ చేస్తున్నాడా లేదా అని చూడకుండా నెలనెలా ఇస్తూనే ఉంటారా తేరగా?వాళ్ళకి స్కాలర్షిప్ పేరుతో ఇచ్చేది ప్రజాధనం,కూర్చోబెట్టి మేపడానికి స్మృతి ఇరానీ గానీ జైట్లీ గానీ వాళ్ళ జేబులోనుంచి తీసి ఇవ్వరు కదా!అధికారంలో రాహుల్ గాంధీ ఉన్నా, హరగోపాల్ ఉన్నా,కంచె ఐలయ్య ఉన్నా తన జేబులోనుంచి ఇస్తాడా?ఆ రీసెర్చ్ వర్కుకి అటెండెన్సు ఉంటుంది,ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉంటాయి. కార్ల్ సేగన్ కొటేషన్లు చెప్తూ ప్రకృతిని గురించి చెప్పిన కబుర్లన్నీ గాలికొదిలేసి 24 గంటలూ ల్యాబులో ఉంటే ఉద్యమానికి టైము సరిపోవటం లేదని సైన్సు గూపు నుంచి ఆర్ట్స్ గ్రూపుకి మారాడు.ఇక్కడ కూడా ఈ ఉద్యమాల కోసం తిరుగుతూ అటెండెన్సు బొక్క పడి ఉండవచ్చు,ప్రోగ్రెస్ రిపోర్టులు సబ్మిట్ చెయ్యటం తనవైపునుంచే ఆలశ్యం అయి ఉండవచ్చు! ఇతను పేపర్లు స్బ్మిట్ చెయ్యడం అంటూ జరిగితే స్టైపండ్ ఆపటానికి వాళ్ళకీ దమ్ములు ఉండవు – కోర్టుకీడ్చి ముక్కుపిండి రెట్టింపు వసూలు చేసుకోవచ్చు,అవునా కాదా?బతుకులో బాధ్యత లేనివాడు చావుతో వీరాధివీరుడిగా కొనియాడబడుతున్నాడు?ఈ ముక్క నేను సారంగలో కామెంటుగా వేస్తే మొదట కొంతసేపు ఉంచారు,తర్వాత తీరిగ్గా ఒకరు రోహిత్ స్టైపండ్ ఎందుకు ఆగిపోయిందో అనుమానించండి అంటూ సులువుగా, హేళనగా ప్రశ్నిస్తున్న హరిబాబు గారు, రోహిత్ ఊపిరి ఎందుకు అర్ధాంతంగా ఆగిపోయిండి అనే మౌలిక ప్రశ్న కూడా ఈ దేశాన్ని అత్యున్నత స్థానం నుండి అణగారిన వెలివాడల వరకూ ప్రశ్నిస్తూనే ఉంది. అంటూ నాకు ఉబోస ఇచ్చాక వారి ఉబోసని ఉంచి నా కామెంటుని తీసేశారు,ఏమి నిష్పక్షపాతం ఈ ఎర్ర మేధావులది?అక్కడికి నేను జాలీదయా లేని కఠినుణ్ణీ,వీరు మాత్రమే కరుణామృతహృదయులైనట్టు,అంత జాలి ఉంటే నాచావు నన్ను చావనివ్వండి అన్న చచ్చినోడి వేదనని అరణ్యరోదన చెయ్యరు కదా, రంగరంగ,!

          ఇప్పుడు రాజద్రోహం కేసులో జైలుకెళ్ళొచ్చిన కన్హయ్యా కూడా ఇంకా రోహిత్ చావు కుట్ర కిందే లెక్కేస్తున్నాడు.పది రోజుల క్రితం సుశీల్ కుమార్ అనే సాటి విద్యార్ధిని తను అంతకుముందు వివేకానందుడితో సహా ఎవ్వర్ని బడితే వాళ్ళని గురించి తను వాడిన మాటల్తో పోలిస్తే చాలా చిన్న మాటని వాడితే అర్ధరాత్రి 3 గంతల టైములో నలభైమందిని పోగేసుకుని పోట్లాడగలిగిన వాడిమీద ఎగస్పార్టీ వాళ్ళు కుట్ర చెయ్యగలరా?కుట్ర అంటే పక్కన జేరి మాయమాటలు చెప్పి వీలు చూసుకుని చంపటం - ఆ ఆవకాశం ఉంటే గింటే ASAలో  ఉన్నవాళ్ళకే ఉంటుంది గానీ బయటివాళ్ళకి అతన్ని కుట్రపూరితంగా చంపటం సాధ్యమా!కుట్ర కేసు పెట్టాలన్నా ASA వాళ్లనే బుక్ చెయ్యాల్సి ఉంటుంది,ఏంటి వీళ్ళ బుర్ర తక్కువ వాగుడు!

          మనం బలానికి బూస్టూ వయాగ్రా వాడినట్టు వీళ్ళకి వూపు రావాలంటే ఎరుపు కనబడుతూ ఉండాలేమో!అందుకే ఇలా జనాన్ని విడదీసి ఒకడి మీదకి మరొకణ్ణి ఎగదోసి రక్తపుటేరులు పారిస్తున్నట్టున్నారు.ఇద్దరు సఖ్యంగా ఉన్నవాళ్లని విడదియ్యాలంటే ఏం చెయ్యాలి>ఇద్దర్లో దద్దమ్మ ఎవడో కనిపెట్టి,మెల్లగా వాణ్ణి బుట్టలో వేసుకుని,రెండోవాడి మీద అబద్ధాలు చెప్పి నమ్మించాలి!అది చాలు విన్నవాడు అవతలివాడు తనకి చేసిన ద్రోహానికి ప్రతీకారంగా చేస్తున్నట్టు తనని తనే జస్టిఫై చేసుకుంటూ అవతలి వాడిమీద దాడి చెయ్యటానికి!వాళ్లలో ఎవడు గెలిచినా పర్లేదు వీళ్ళకి,వీళ్ళు సృష్టించిన రెండు వర్గాల్లో ఒక వర్గం పూర్తిగా నశించిపోతే ఇంక అక్కడ మిగిలింది వర్గరహితసమాజమేగా!

          వాళ్ళేమి కోరుకుంటున్నాఓ మనకి స్పష్టంగానే తెలుస్తున్నది,కానీ వాళ్ళకి తెలుస్తున్నదా!టెర్రరిస్టుల్ని అమరవీరులుగా చిత్రించటానికీ, ఇంటికో టెర్రరిష్టుని పుట్టించమని దేశంలోని తల్లిదండ్రులకి విజ్ఞప్తుల్ని చెయ్యనివ్వటానికీ, ఈ దేశాన్ని ముక్కలు చెయ్యండని విదేశీయుల్ని ఆహ్వానించడానికీ, ప్రపంచ దేశాలు గుర్తించిన భారత భూభాగంలో విదదీయరాని భాగమైన కాశ్మీరు గురించి నోటికొచ్చినట్టు వాగడానికీ అనుమతిస్తేనే నిజమైన భావస్వాతంత్ర్యం, అంతేనా?వాళ్ళు భావస్వాతంత్ర్యాన్నే కోరుకున్నారు గాబట్టి అందులో తప్పేమీ లేదని కొందరు గోడమీదిపిల్ల్లులు వాదించదలుచుకుంటే వాళ్ళకి కూడా కలిపి ఈ మేధావులకి ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను.ఏ విధమయిన అనుమానమూ లేకుండా వాళ్ళు ఉగ్రవాదులని మీకు తెలుసు వాళ్ళు ఈ దేశాన్ని విచ్చిన్నం చెయ్యాలని దొంగతనంగా సరిహద్దులు దాటి వచ్చి ఈ దేశప్రజల్లో కొందర్ని హతమార్చడమూ మీకు తెలుసు..అయినా సరే,భావస్వాతంత్ర్యం పేరుతోనూ,మరొక రకం తిక్క విశ్లేషణ తోనూ ఇవ్వాళ ఒక ఉగ్రవాదిని నువ్వు అమరవీరుణ్ణి చేసి పొగిడితే రేపు పదిమంది పుట్టరా?నీ చేతల మూలంగానే ఇవ్వాళ్టి రోజున ఉగ్రవాదానికి నువ్వు సపోర్టు ఇస్తూ మళ్ళీ రేపటి రోజున ప్రభుత్వాన్ని ఉగ్రవాదాన్ని నిరోధించడంలో విఫలమైందని విమర్శిస్తావు - నువ్వు నోటికి తింటున్నది అన్నమా,గడ్డియా,మరొకటా?

          ఒక పిచ్చి డాక్టరు రోహిత్ చట్టం కావాలంటాడు,ఒక శర్మ హిందూ ఫాసిజం అంటాడు,ఒక రాజు    ఈ కుర్రాళ్ళని చూస్తుంటే మళ్ళీ నా కుర్రతనం వస్తునదంటాడు,ఒక భాస్కరుడు భావజాల యుద్ధం అంటాడు - ఏమిటి వీళ్ళ పాండిత్యం!రోహిత్ చట్టంలో ఎలాంటి సెక్షన్లు ఉండాలో స్పష్టత ఉందా?ఇంటికో యాకూబ్ మెమన్ పుడితే వాళ్ళు వీళ్ళని వొదుల్తారా?రోమిల్లా డప్పారు ఇన్నేళ్ళు వినిపించిన ఆర్య-ద్రవిడ సిద్ధాంతం దగ్గిర్నుంచీ కమ్యునిష్టులు చెప్పిన అబద్ధాలన్నీ ఒకటొకటిగా బయటపడుతుంటే ఇవ్వాళ వీళ్ళు చెప్పే కొత్త అబద్ధాల్ని ఎవడు నమ్ముతాడు?

          "If you can't explain it simply, you don't understand it well enough." - Albert Einstein.వీళ్లలో ఉన్న గందరగోళానికీ,ఈ తలాతోకా అలేని చెత్త వాగుడికీ కారణం అదే!ఇన్నాళ్ళూ నెహ్రూ వారసత్వం పుణ్యాన యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా చేరి చెప్పిన అబద్ధాలన్నీ బయటపడుతుంటే ఎట్లా సమర్ధించుకోవాలో తెలియని గనదర్గోళంలో ఉన్నారు వీళ్ళంతా!నేనో మీరో పనిగట్టుకుని తప్పులు పట్టనక్కర లేదు,కొంచెం బుర్రంటూ ఉపయోగిస్తే వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ మాటల్లో ఉన్న బేఖారీతనం!రాణి శీవశంకరశర్మ అనే ఒక దుర్బ్రాహ్మణుడు చూదండి ఎంత నీచంగా అవమానించాడో నన్ను!పనిగట్టుకుని సంభాసహణకి పిలిచి నేను అడిగిన ప్రశ్నలకి జవాబు ఇవ్వకుండా నన్ను హిందూ ఫాసిస్టు అంటున్నాడు,ఇలాంటి అధమసంస్కారం గలవాళ్ళు ఎంత ఎక్కువ ద్వేషం వెళ్ళగక్కితే అంత ఎక్కువ మేరకు హైందవధార్మికక్షాత్రం పదునెక్కుతుంది."Anger is an acid that can do more harm to the vessel in which it is stored than to anything on which it is poured". - Mark Twain.వీళ్ళలో ఉన్న అసహనమే వీళ్ళకి అంతటా ఉన్నట్టు కనబడుతున్నది.కానీ,గత నూరేళ్ళుగా వీళ్ళు వండివార్చిన ద్వేషపు ప్రభావం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజల్ని ఏమాత్రం కదిలించలేక పోయింది.ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్ధించి ఈ దేశాన్ని నిలువునా చీల్చినా,ఇన్ని దశాబ్దాలుగా మతకలహాల్ని రెచ్చగొట్టినా ఆ కొద్దిరోజులు గనదరగోళానికి గురయినా నిజం నిలకడ మీద తెలియటంతో జనం ఐకమత్యంగానే ఉన్నారు,ఉంటారు!


          శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గా,మస్తాన్ వలి దర్గా,షేక్ దావూద్ వలి దర్గా - నెల్లూరు జిల్లాలో ఈ మూడు అత్యంత ప్రముఖమైన దర్గాలు.వీటిని ముస్లిములతో పాటూ హిందువులు కూడా సందర్శిస్తారు - ఎంతో భక్తిగా!కడపలో పెద్ద దర్గా అని పిలుచుకునే అమీన్ పీర్ దర్గా ఉంది.ఈ దర్గాను స్థానికులు పెద్ద దర్గా అని పిలుస్తారు.ఇది మతాలకు అతీతంగా ఉంటూ హిందువులు,ముసిములు,క్రైస్తవులు నిత్యం సందర్శించడం వల్ల మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది.ఇవే కాదు,మొత్తం భారతదేశంలో  చాలా చోట్ల ఉన్నాయి,ఈ ప్రాంతాల్లో ఎక్కడా హిందువుల మధ్యా ముస్లిముల మధ్యా చిన్నపాటి గొడవలు కూడా లేవు.ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఇమాం బేగ్ బావి ఉంది.ఇది రామభక్తుడైన ఇమాం బేగ్ గారు యాత్రికుల సౌకర్యం కోసం కట్టించినది.అందువల్ల ఈ దేవాలయంతో ముస్లిములకు కూడా ఆధ్యాత్మికమైన అనుబంధం ఏర్పడింది.తిరపతి బాలాజీ అయితే బీబీ నాంచారు మూలంగా ముస్లిములకి కూడా ఇష్టమైన వాడే!మొన్నామధ్యన ఒక ముస్లిం కుర్రాడు వాళ్ళ నాన్న మొక్కుకుని బతికుండగా తీర్చలేకపోయాదని చెప్పి స్వామివారికి సువర్ణపుష్పాలు సమర్పించి వెళ్ళాడు.బహుశా ఇకముందు వీటిమీద కూడా సూడో సెక్యులరిష్టుల కన్ను పడితే వాటిని అట్లా ప్రశాంతంగా ఉండనివ్వరేమో?

          మీకా భయం అక్కర్లేదు!వెటి దగ్గిరకెళ్ళీ రాజకీయం చెయ్యదలుచుకుంటే హిందూ భక్తులూ,ముస్లిం భక్తులూ జాయింటుగా విరుచుకుపడి కీళ్ళు విరిగేలా తన్ని పంపిస్తారు.ఎందుకంటే ఇప్పుడు మీడియాకెమేరాల ముందు హడావిడి చేసేవాళ్ళూ,పత్రికల్లో విషపురాతలు రాసి పేరు తెచ్చుకుంటున్నవాళ్ళూ అసలు సమాజంలో కొస్తే ఎంతటి అనామకులంటే వీళ్ళ పక్కింటివాళ్ళకే వీళ్ళెవరో తెలియదు - నిజం!ఈ అయిదు ఖండాల భూమి మీద అంగుళం మేరలో కూడా దోపిడీ అనేది లేని ప్రపంచాన్ని సృష్టించే మహదాశయంతో ఉర్రూతలూగిపోతూ ఎప్పుడో స్థాపించబోయే వర్గరహితసమాజం గురించి చింకి లెక్చర్లు దంచుతూ యూనివర్సిటీ సెమినారు హాళ్ళలో వేముల రోహిత్ లాంటి పిచ్చపుల్లయ్యలతో చప్పట్లు కొట్టించుకునేవాళ్ళు తమ ఇంటిపక్కనే ఉన్న రేషన్ షాపులో జరుగుతున్న చిన్నపాటి దోపిడీని కూడా అరికట్టలేకపోతున్నారు, ఎందుకని?సిద్ధాంత బలం లేకనా,మంది చాలకనా,వాళ్ళ వీధివాళ్లకి వర్గరహితసమాజం అక్కర్లేకనా,వీళ్ళకి తగినంత వూపు రాకనా - ముహూర్తం బాలేకనా!రోమిల్లా ఆంటీ తన అబద్ధాల చరిత్ర అటకెక్కేసరికి "who cares now?" అంటూ తెల్లముఖం వేసి తోక ముడిచింది,ముగ్గు బుట్ట ముసిల్ది మురమ్నా మామ్మ మిగిలుంది తుక్కు రేగ్గొట్తించుకోవటానికి - ఆ తర్వాత నారాయణలూ సీతారాముళ్ళూ చేసుకోవాల్సింది చెక్కభజనె:-)

          కమ్యునిష్టులకి అసలు సంగతి తెలియడం లేదు,మోడీ వీళ్ళ వల్లే అధికారంలోకి రాగలిగాడు - నిజం!మీకు అనుమానంగా ఉంటే నేను ఎప్పుదో రాసిన చిత్రమైన గొప్పవాళ్ళు పోష్టులో మోదీ గురించి రాసిన విశ్లేషణ చదవండి.కమ్యునిష్టులకి నేనొక ఉబోస ఇస్తున్నా "ఇవ్వాళా రేపూ కూడా మోదీకి ంకా  బలం పెంచటానికి తప్ప మీ ప్రస్తుత రాజకీయ వ్యూహాలు మీకు మేలు చెయ్యవు" అని - వింటారా?వినరా!అది విన్నా వినకపోయినా మీకో ఝలక్ ఇది:

మీ పుర్రచెతిని అడ్డుపెట్టి హైందవసూర్యోదయాన్ని అడ్డుకోలేరు - ఎరుపు వెలిసిపోతే మిగిలేది కాషాయమే!

Friday, 11 March 2016

అవే దృశ్యాలు,అవే భావాలు,అవే మాటలు ,అవే స్మృతులు - అయినా ఎంత నిత్య నూతనం!

     మా అమ్మాయి పుట్టినప్పుడు నన్నసలు హాస్పిటల్ దరిదాపులకే పోనివ్వలేదు మా బంగారం కేకలు విని తట్టుకోలేనని, పాపాయినీ వెంటనే చూడనివ్వలేదు!తెల్లవారుఝామున, పక్కన ఎవరన్నా మాట్లాడుకుంటుంటే నీటిలో మునిగి వింటున్నట్టు అనిపించేటంత మాగన్ను నిద్రలో ఉన్నప్పుడు మా మామయ్య "ఇదుగోనయ్యా!నీ కూతురు, చూసుకో - కలవరిస్తున్నావుగా" అని కొంచెం విసురుగానే నా పక్కలో పడుకోబెడితే,ఆ విసురుకి గాబోలు కదిలి కాలు కొంచెం ఝాడించింది!ఇప్పటికీ ఆ సన్నివేశం గుర్తొస్తే పక్కటెముకల దగ్గిర అప్పటి మెత్తని కాలితాపు స్పర్శ తెలుస్తూనే ఉంటుంది - ఏమిటీ మహామాయ?తనని మొదటిసారి చూడగానే అధాట్న కాలంలో వెనక్కి వెళ్ళిపోయి నా చిన్నప్పటి నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది!చిన్నప్పుడు నన్ను ఇట్లా చూసిన మానాన్నకీ ఇట్లానే అనిపించి ఉండాలి!

     ఇంకా వెనక్కి వెళ్తే మా నాన్న పుట్టినప్పుడు వాళ్ళ నాన్న కూడా ఇట్లాగే అనుకుని ఉండాలి.ఇంకా వెనక్కి వెళ్తే...?మళ్ళీ మా అమ్మాయి మొదటిసారి మాటలు నేర్చినప్పుడూ అదే అనుభూతి!మామూలుగా అందరూ మొదట అమ్మా నాన్నల్ని "అమ్మా!" అనీ "నాన్నా!" అనీ పిలుస్తారు, కానీ మా బుజ్జిగాడు మమ్మల్ని అందరూ పిలిచే పిలుపుల్ని విని పట్టేసి నన్నేమో "హబాబూ!" అనీ మాధవినేమో "మాధీ" అనీ మొదలుపెట్టి తర్వాత "హరిబాబూ!","మాధవీ!" అని మా పేర్లతోనే పిల్చేది!తర్వాతెప్పుడో బాగా పెద్దయ్యాక తనే "అమ్మా","నాన్నా" అనడం నేర్చుకుంది గానీ మాకు మాత్రం మొదటి పిలుపులే నచ్చాయి - వీళ్ళు తేడా మనుషులు అనుకునేటట్టు ఉంటుందని పనిగట్టుకుని అట్లాగే పిలవమని ఒత్తిడి పెట్టలేదు గానీ ఇంకొంతకాలం అట్లానే పిలిస్తే బాగుండును కదా అని చాలాకాలం పాటు బెంగ అనిపించేది మాకు!

     ఈ మాటలు నేర్చుకున్నప్పటి ఒక సుదీర్ఘకాలం పాటు మా ఇద్దరి మధ్యనా జరిగిన హాస్యకదంబం ఎప్పటికీ నవ్వొస్తూనే ఉంటుంది.అన్ని మాటలూ తొందరగానే నేర్చుకున్నది గానీ "డాబా","డబ్బా" అనే రెండు మాటల విషయంలో మాత్రం చాలా టైము తీసుకుంది.ఎవరైనా తప్పులు చేస్తుంటే సరిద్దటం విషయంలో నా చాదస్తం మీకు తెలుసు కదా!నా పట్టుదల కొద్దీ ఎంత మెల్లగా స్పష్టంగా కూనిరాగం తీస్తూ తలని పైనించి కిందకి ఇట్లాగే చెప్పు అన్నట్టు ఆడిస్తూ "డబ్బా!" అనమని చూపిస్తే, అది కూడా అచ్చు నేను ఎంత దీర్ఘం తీశానో అంతే దీర్ఘంతో తలని కూడా నాలాగే ఆడిస్తూ "బడ్డా!" అని మాత్రమే అనేది:-)

     తను తొలిసారి కింద పదకుండా వూగుతూ వూగుతూ వొచ్చి మీద వాలిపోయి నడిచింది నాలుగడుగులే అయినా గొప్ప ఘనకార్యం చేసినట్టు నవ్వుతుంటే అప్పుడు కూడా తను కాదు నడక నేర్చుకున్నది నేను అన్న గర్వం!ఐశ్వర్యాలు కోరుకుని,వైభవాల కోసం ఆరాటపడి,అసహనాలతో రగిలిపోయి చూడటం లేదు గానీ మనలోనే ఉంది సుఖజీవనసారం!మనపక్కనుంచే మనల్ని రాసుకుంటూనే ఒక భోగయాత్ర నిరంతరం నడుస్తూనే ఉన్నది - ఐతే, చూడాలనుకుంటేనే కనబడే మార్మికత ఉంది అందులో!ఎవరు ఏ దృక్కోణంతో చూస్తే ఆ విధంగా కనబడే మార్మిక లోకం ఇది!నాకో కూతురు పుట్టటం, ఆ పాపాయి నడక నేర్చుకోవటం, అప్పుడు నా మనస్సులో పుట్టే ఆలోచనలూ అనుభూతులూ ఆనందాలూ నాకు మాత్రమే జరిగినవి అనుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు జరిగినవి నాకు మాత్రమే ప్రత్యేకంగా జరగడం లేదనీ, మానవసమూహం అనుబంధాలతో పెనవేసుకోవటం మొదలుపెట్టినప్పటి నుంచీ ప్రతి మనిషికీ జరుగుతున్నవేననీ తెలిసినప్పుడు అంత విచిత్రంగా అనిపిస్తుంది!జననం,బాల్యం,యవ్వనం,కౌమారం,వార్ధక్యం,మరణం - పునరపిగా నిరంతరం జరిగే ఈ దృశ్యాదృశ్య జీవన సంరంభం ఎప్పుడు ఆగుతుంది?అసలు ఆగుతుందా, ఎప్పటికీ ఆగదా!

     మనుషుల్ని కులాలుగా,మతాలుగా,జాతులుగా,ముఖ్యమంత్రులుగా,రిక్షావాళ్ళుగా విడగొట్టకుండా  హఠాత్తుగా వీళ్ళిప్పుడు ఏమి చేస్తూ ఉండి ఉంటారు అని ఆలోచిస్తే మనుషులు అతి మామూలుగా చేసే పనులు ఏమిటి?తొలిసారి తల్లి గర్భం నుంచి బొడ్డుతాడు తెగి జారిపడగానే ఉలిక్కిపడి గుక్కపట్టి ఏడవటం,తల్లి దగ్గిరకి తీసుకోగానే మళ్ళీ సంబాళించుకోవటం,తనకి పాలిస్తున్న తల్లిని గుర్తుపట్టటం,తల్లి మాటల్ని వింటూ మాటలు నేర్చుకోవటం, అమ్మ చంకన ఎక్కటమే కొండకొమ్ముల నెక్కినంత గొప్పగా అనిపించటం,అమ్మ ఎవరివైపు చూసి నవ్వితే వాళ్ళు మంచివాళ్ళనీ ఎవరివైపు కోపంగా చూస్తే వాళ్ళు చెడ్డవాళ్లనీ నేర్చుకోవటం,కొత్తగా నడక నేర్చుకున్న హుషారులో గడపల్ని చూస్కోకుండా పరిగెడుతుంటే "పడిపోతావు!" అనే వెనకనుంచి వినబడే ఆందోళనకి "ఈ మాత్రానికే?" అనుకోవటం,కొత్తసైకిలు కోసం నాన్నని అడగటం,కుదరదంటే "మా నాన్న పీనాసి" అనేసుకుని కొనిచ్చేవరకు అన్నం తిననని మారాం చెయ్యటం,కొనిస్తే అన్నీ మర్చిపోయి "మా నాన్న మంచోడు!" అనేసుకుని నవ్వుకోవటం,పరీక్షల్లో తప్పినప్పుడు తిడుతుంటే తల వేళ్ళాడేసుకుని నిలబడ్డం,డిస్టింక్షన్ కొడితే కాలరెగరెయ్యటం,ఫ్రెండ్సుతో క్లాసులూ టెస్టులూ ఎగ్గొట్టి మ్యాట్నీలకి చెక్కెయ్యటం,మనకి నచ్చిన హీరో హీరొయిన్ల గురించి వాళ్లు నచ్చని ఫ్రెండ్సుతో తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఆవేశపడిపోవటం,ఇంట్లోవాళ్ళు ఇక పెళ్ళి చేసెయ్యాలన్నప్పుడు మొదట బోల్డు కంగారు పడిపోయి పిదప తెగ సిగ్గుపడిపోయి ఆఖరికి ఉషారుగా రెడీ అయిపోవటం,పెళ్ళంటే తర్వాత వచ్చే పాలడబ్బాల ఖర్చులూ స్కూలుఫీజుల బరువులూ తెలియకపోవటంచేత పాలగ్లాసూ మల్లెపూలూ మాత్రమే గుర్తొచ్చి రోజుల తరబడి వాటి గురించి వీరలెవెల్ల్లో వూహించేసుకుని తీరా మొదటిరాత్రి తెల్లవారిన తర్వాత "ఓసింతేనా?దీని కోసమా ఇంత హడావిడి!ఈపాటిదానికి ఇవన్నీ అవసరమా?!" అని నవ్వుకోవడం,పెళ్ళి చేసి పంపించేటప్పుడు ఆడపిల్ల తలిదండ్రులు ఎంత ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయినా తెల్లారేసరికి "హమ్మయ్య, ఒక గండం గడిచింది.ఇంక అక్కడెట్లా ఉంటుందో!" అనుకుని పెళ్ళిలో జరిగిన తప్పులూ ఒప్పులూ కోపాలూ తాపాలూ విరగబాట్లూ సర్దుబాట్లూ చెప్పుకుంటూ నవ్వుకోవటం,పెళ్ళయ్యేవరకు పుట్టింట్లో మహారాణిలా పెరిగిన కొత్త పెళ్ళికూతురు రెండో రోజుకల్లా పుట్టింటికే ఎవరో చుట్టాలింటికి వచ్చినట్టు నాల్రోజులుండి వెళ్ళిపోవటం,కొత్త జంటలో ఒకరికొకరు ఇంకా కొత్తముఖాల్లాగే అనిపిస్తూ అందర్లో తిరిగేటప్పుడు జరిగే చిరు తగిలింతలు కూడా పెను పులకింతలై నునుసిగ్గుల మెరుపుల చిరునవ్వుల్ని పుట్టించటం,కాస్త పాతబడిపోగానే అవే కదలికలు "నలుగుర్లో ఉన్నామనే ఇంగితం కూడా లేకుండా ఇంకా ఏమిటీ మోటు సరసం?" అని విసుగు తెప్పించటం,పిల్లలు పుట్టుకురాగానే పాలడబ్బాల ఖర్చులూ స్కూలుఫీజుల బరువులూ మోస్తూ రోజూ పొద్దున్నే లంచ్ బాక్సులు సర్దేసుకుని సగం తిని సగం వదిలేసి ఉరుకులు పరుగులతో సిటీబస్సు అందుకుని చెమట్లు గక్కుతూ పోయి ఆఫీసులో పడి మళ్ళీ చెమట్లు గక్కుకుంటూ రాత్రి కొంపకి జేరి తిన్నామా పడుకున్నామా లేచామా అని ఒకటే హడావిడి పడుతూ తిట్టుకుంటూ విట్టుకుంటూ నెట్టుకుంటూ గానుగెద్దు జీవితం గడుపుతూ జుట్టులో తెల్లవెంట్రుకలు కనపడ్డాక "అప్పుడేనా?ఓర్నాయినో!ఏమీ ఎంజాయ్ చెయ్యనే లేదు, ఇప్పుడెట్లా?!" అని బెంగేట్టుకోవటం,తనకి తల నెరిసిందంటే అర్జెంటుగా పిల్లలకి పెళ్ళిళ్ళు  చెయ్యాల్సిన వయసొచ్చిందని గుర్తొచ్చి హడిలిపోవటం,అసలెంత నిలవెంత కొసరెంత ఇంట్లో ఎంత బ్యాంకులో ఎంత సంబంధా లెప్పుడు వెతకాలి ఏ సంబంధం ఖాయం చేసుకోవాలి నిశ్చితార్ధాని కెంత పెళ్ళిపనులు ఎప్పుడు మొదలెట్టాలి చుట్టాలెవరెవర్ని ఎట్లా ఎట్లా పిలవాలి ఆ ముహూర్తానికి ఏ పెళ్ళిమండపం దొరుకుతుంది అని ఎక్కాల పుస్తకంలో ఉన్న ఎక్కాలన్నీ కవరయ్యేలా లెక్కలు వేసుకుని చచ్చీచెడి శాయంగల విన్నపములై అన్నట్టు ఆ పని కాస్తా ముగించి "ఇంక నాపనయిపోయిందిరోయ్, దేవుడోయ్!" అని గావుకేక పెట్టి వాలుకుర్చీలో కూలబట్టం,పిల్లలు ప్రయోజకులై వాళ్ళ ఘనకార్యాలు చెప్తుంటే పొంగిపోతున్నప్పటి ఆనందంలో గభాల్న "నాన్న కూడా ఉంటే ఎంత బావుండేది!" అనిపించినప్పుడు చెమ్మగిల్లిన తడికన్నులతో నవ్వటం,మనవలూ మనవరాళ్లతో పోటీపడి పరిగెత్తలేనప్పుడు ఇంక మనకి చివరిబండి సిద్ధమయ్యిందని తెలిసిపోవటం,ఎప్పుడొస్తుందో తెలియని మలుపుకోసం ఎదురు చూట్టం - లీనమై బతికితే దేవుడు కూడా ఈర్ష్యపడేటంత సప్తవర్ణ సంశోభితమైన స్వరరాగ గంగాప్రవాహమే కదా మానవజీవితం!

     అక్కడా ఇక్కడా నిన్నా మొన్నా ఇదే జగన్నాటకం పదే పదే జరుగుతూనే ఉన్నా చిన్న చిన్న ఎదురుదెబ్బలు కూడా ఇంతకుముదు ఇంకెవరికీ తగలనట్టు హడావిడి చేస్తూ ఇప్పుడే తమకొకరికే ఇట్లా జరిగినట్టు అతిగా వూహించేసుకుని పెద్దలు చెప్పిన అనుభవసారమంతా మర్చిపోయి ఇప్పటివరకు చెప్పినదంతా పరగడుపైన వాళ్ళు తమ బతుకు పుస్తకాల్ని మధ్యలో మూసేస్తున్నారు - ఎంత పిచ్చివాళ్ళు వాళ్ళు?చావుని పొగిడేవాళ్ళు,చావుకి ఎదురు నడిచేవాళ్ళు, పనిగట్టుకుని చావుని కెలికేవాళ్ళు మంచివాళ్ళు కానేకాదు - చచ్చిపోవటానికి తప్ప ఇంకెందుకూ పనికిరాని వాళ్ళు!వాళ్ళ మాటల్లో ఒక్క మాట కూడా నిజం కాదు - అస్సలు నమ్మొద్దు, అటువైపు పోవద్దు!దేవుడు కూడా ముచ్చట పడి ఇక్కడ పుట్టి బతికి చూపించిన ఇంత గొప్ప బతుకును సగంలో ముగించి ఏం సాధిస్తావు నువ్వు?ఇవ్వాళ్టి పార్ధుడికి ఇప్పటి గీతాచార్యుడు యుద్ధం గురించి చెప్పడం లేదు, ఒక భోగయాత్రని గురించి చెప్తున్నాడు - చెవులు రిక్కించుకుని విను!

     ఈ విశ్వం మొత్తానికి నువ్వే కేంద్రబిందువు - అనుకో, పర్లేదు!నువ్వే నేననీ నేనే నువ్వనీ కూడా అనుకో, నేనేమీ అనుకోను!ప్రపంచమొక నిరంతర భోగయాత్ర!అవును, నీచుట్టూ నేనొక భోగయాత్రని కల్పించాను - చూడు!నడిచి,నడిపించు!భోగయాత్ర అంటే - గడప దాటి బైటికెళ్తే ఛస్తానని భయపడుతూ ఇంటిపట్టున కూర్చుని రేపటి కోసం దాచుకుని తింటూ ఎక్కడ కూర్చోబెడితే అక్కడ పీఠమేసుకుని కూర్చోవటం కాదు, రేపటి గురించి ఆలోచించని ధీరుడివై ఉన్నది సమస్తం మూటగట్టుకుని సామగ్రిని ఒంటెమీద కెక్కించి ఇల్లు వదిలి నీలాంటి భోగయాత్రికుల్ని కలుపుకుని వూళ్ళు పట్టుకు తిరగటం - సరికొత్త దేశదిమ్మరి తనం!

     నీ సాటివాడు బీడీ కాలుస్తున్నాడు,నీకూ కాల్చాలనిపించింది,జేబులు తడుముకున్నావు, లేదు!ఏం మొహమాట పడకుండా "అన్నా!నేనూ ఓ దమ్ము లాగనా?" అని సూటిగా అడిగెయ్యి.అతను కూడా "దాందేముంది తమ్ముడూ!పూర్తి బీడీయే తీసుకో!" అని కొత్తదే ఇస్తాడు.నీ సాటివాడు "అన్నా, దాహమేస్తుంది!ఓ గుక్క తాగుతానేం!" అని నీ నడుము కున్న సొరకాయ బుర్రని చనువుగా తీసుకుంటాడు.నువ్వు కూడా "ఒక్క గుక్కేం ఖర్మ,మొత్తం తాగేసినా పర్లెదు - వచ్చే చెలమ దగ్గిర నింపుదాంలే!" అంటావు.భోగయాత్రలో ఉన్న కిటుకే అది - ఖరీదుఅమ్మడం, కొనడం, లాభం, నష్టం, మోసం, ద్వేషం - ఇవేవీ ఉండవు, అంతా పంచుకొనుడే - "కలిసి నడుద్దాం. కలిసి మాట్లాడుకుందాం. కలిసి మెలిసి ఒకరి మనస్సు లొకరం తెలుసుకుందాం. మన పూర్వులు దేవీభాగాన్ని యెలా పంచుకునేవారో అలాంటి జ్ఞానాన్ని ఉపాసించుదాం!"నీ దగ్గిర లేనిది ఎదటివాడి దగ్గిర ఉంటే అడిగి తీసుకోవచ్చు - అయితే, అతను సంతోషంగా ఇస్తేనే తీసుకోవాలి. జులుం చేసి గుంజుకోవొద్దు. అటు వైపు నుంచి తీసుకున్న ప్రతి రూపాయికీ పది రూపాయలు చేసి ఇటు వైపు నుంచి ఇవ్వు - అదీ భోగయాత్రికుడి లక్షణం!

     కొందరుంటారు, తీసుకోవడానికి చూపించే తొందర ఇవ్వడానికి చూపించరు.ఒక వూరిలో ఒక బావి ఉంది.పొరుగూరి వాడొకడు అందులోకి జారిపడ్డాడు.పెద్ద లోతు కూడా లేదు.వాడు గట్టిగా ఎగిరితే వీళ్ళు చెయ్యి పట్టుకుని లాగెయ్యొచ్చు.కానీ,చెవుడేమో అనుకుని అరిచి చెప్పినా మూగేమో అనుకుని సైగలు చేసి చెప్పినా వెర్రి చూపులు చూస్తాడే తప్ప ఎగరడే!వాలకం చూస్తే పిచ్చోడిలా లేడు, వాడి ఖర్మకి వాణ్ణి వొదిలేద్దామా అంటే వీళ్ళంతా పాపం మంచి ముండా వాళ్ళు!ఆఖరికి ఒకడొచ్చి లటక్కన లాగేశాడు?!వీళ్ళందరికీ దిమ్మదిరిగి మైండు బ్లాంకయ్యింది.అనుమానమొచ్చి "బాబూ, నీ పేరు పండుగాడు కదూ!" అనడిగారు, వాడు కాదనేశాడు?మరీ కంగారెత్తిపోయి ఈసారి మొహమాటం లేకుండా అసలు డౌటు అడిగేశారు,"మేమందరం అంతసేపు తంటాలు పడ్డా లాగలేక పోయాం,మరి నువ్వు చేసిన ట్రిక్కు యేంటీ?" అని.దానికి వాడు మొహమంతా నవ్వు చేసుకుని "మీరేమన్నారు?నీ చెయ్యిటివ్వు లాగేస్తాం అని,కదా!నేనేమన్నాను?నా చెయ్యి పట్టుకో లాగేస్తాను అని, కదా!ఆడు మా వూరోడే. తీసుకోవటమే తప్ప ఇవ్వటం ఆడి జన్మకి చెయ్యడు" అన్నాడు.అటువంటి వాళ్ళు ఈ భోగయాత్రకి పనికిరారు!

     భోగ యాత్రిక లక్షణాలు వంటబట్టాలంటే నువ్వు తప్పకుండా చెట్లని చూసి నేర్చుకోవాల్సిందే!చెట్టు చేమలన్నీ ఎప్పట్నుంచో భోగయాత్రలోనే నడుస్తున్నాయి. నిరాడంబరంగా జీవిస్తూనే వైభవోజ్వలంగా ప్రకాశించదల్చుకుంటే అందుకో చక్కని రాజమార్గం ఉంది, చెప్పనా?చూడు...పచ్చగా ఎదిగే చెట్టుని చూడు!ఆ చెట్టులాగే సారవంతమైన నేలవంటి కఠినసత్యప్పు పునాదుల మీద నీతినియమాలతో నిండిన నీ ప్రవర్తన అనే ధృఢమైన కాండాన్ని నిలబెట్టి ఉంచు.అందుకోసం మొదట నీ జిజ్ఞాసల వేర్లని మహనీయుల బోధనల్లోకి వీలైనంత పొడుగ్గా సాగించి ఉంచు.అప్పుడిక విజృంభించి నలుదిక్కులకీ శాఖల్ని విస్తరించు.ఆ శాఖలు నీ హృదయంలో పొంగిపొర్లుతున్న సౌజన్యాన్ని ప్రతి కణుపులోనూ నిండుగా నింపుకున్న స్నేహామృత హస్తవారధులే కదూ!ఆత్మీయంగా కనబడే రూపం,మోహనంగా వెలిగే చిరునవ్వూ,సదా స్వాగతించే హస్తచాలనంతో నిలబడి నీకు దగ్గిరగా వచ్చిన ప్రతి మనిషినీ ప్రియభాసహణతో అలరించు.ప్రతి నిముషమూ నీకు పరిచయమౌతున్న అసంఖ్యాక జనసందోహం నుంచి సాధ్యమైనంత  తక్కువ సమయంలో వీలయినంత ఎక్కువమందిని నీకోసం ప్రాణమిచ్చే స్నేహితులుగా పెంచుకుంటూ ఎదుగు.ఐతే,నీ స్నేహానికి తగనివాళ్ళైన కొందరు చీడపురుగుల్ని మాత్రం అసలు దగ్గిరకే రానివ్వకు.అప్పుడు మొహమాట పడి మితిమీరిన చనువిస్తే తర్వాత నీకే ప్రమాదం!ఇతర్లని వెక్కిరించి ఆనందించే వాళ్ళనీ,తమ అవసరం కోసం మమకారం నటించే వాళ్ళనీ - వాళ్ళ బుద్ధి తెలిసిన మరుక్షణమే వాళ్ళతో నీకున్న అనుబంధాన్ని కత్తిరించేసి వాళ్ళని అంతటితో విస్మరించి పారెయ్యి.చిరుమొలకలుగా ఉన్నప్పట్నించీ తెగుళ్ళనీ,చీడపీడల్ని ఎప్పుడు హింసించటం మొదలుపెడితే అప్పుడు తడబడకుండా అడ్డుకోగలిగినవే నేడిలా మహావృక్షాలై నిలబడ్డాయని తెలుసుకో!అనునిత్యం జీవం తొణికిసలాడుతూ, స్నేహమధురవసంతాల చిగుళ్ళు తొడుగుతూ ఆప్తులందరికీ సతతతహరితంగా కనబడు.ప్రియమిత్రులకి నిరాఘాటంగా ఆతిధ్యపు నీడనిచ్చి, అవసరమై వచ్చి సహాయ మడిగితే బెట్టు చెయ్యకుండా చెయ్యాల్సిన త్యాగసముదాయాల్ని పండిన ఫలాలుగా అందించి నిగర్వంగా ఉండటాన్ని నేర్చుకో!

     భోగయాత్రలో కదలాలంటే కలివిడితనం ఉండాలె!పూనుకుని మాట కలుపాలె.మాటకి మాట కలుపాలె.కష్టం సుఖం కలబోసుకోవాలె.పగలల్లా కష్టపడాలె,రాత్రికోసం ఎదురుచూడాలె.రాత్రికి మంచి చోటు చూసుకుని డేరాలు బిగించి మజిలీ వేస్తారు చూడు, అప్పుడు మొదలవుతుంది కోలాహలం!రాత్రయింది గదాని కడుపునిండా పట్టించి ముసుగుతన్ని పడుకోవద్దు!నువ్వు వండిన వంటకం నువ్వు మాత్రమే తినకు - అదే అసలైన దరిద్రం!అక్కడ కోలాహలాగ్ని దగ్గిర తక్కిన భోగయాత్రికులు సందడి చేస్తుంటే నువ్విక్కడ ఒంటికాయ సొంటికొమ్ములా కూర్చుంటే కుదరదు!ఎదటివాడు తనని ముట్టుకుంటే తను మైలపడతాననే ఆలోచన మనస్సులోకి వచ్చిన వాడెవడయినా అస్పృశ్యుడే అవుతాడు!తనని ముట్టుకున్న ప్రతివాడికీ తననుంచి పవిత్రతని ప్రవహింపజెయ్యగలిగినవాడు మాత్రమే నిజమైన బ్రాహ్మణుడు కాగలడు!వెళ్ళు వెళ్ళు, అక్కడ వెలుగుతున్న కోలాహలాగ్ని దగ్గిర కెళ్ళు!ఈ మోసం,ద్వేషం,ఎక్కువ,తక్కువ,స్వార్ధం - అన్నింటినీ బైటికి తీసి కోలాహలాగ్నిలో తగలెయ్!ప్రతివాడినీ హృదయానికి హత్తుకో!కలం ఝళిపించి కొత్త పాట రాసెయ్!గొంతు పెకలించి కొత్త రాగం పాడెయ్!గజ్జె కదిలించి కొత్త చిందు వేసెయ్!చేతి కొద్దీ దరువెయ్!కాలి కొద్దీ ఎగిరెయ్!అలిసిపోయినా వెనకబడిపోకు, పక్కనే పానశాలలో సాకీ ఉంది!మధుపాత్ర నింపు, ఖాళీ చెయ్!అలుపు తీర్చుకుని మళ్ళీ వొచ్చిపడు!ఆడుతున్నవాళ్లకి చప్పట్లు కొట్టి వాళ్లని మరింత హుషారు చెయ్!పాడుతున్నవాళ్ళకి పక్కతాళం వేసి నువ్వు మరింత రెచ్చిపో!ఇప్పుడున్న గుడారం నచ్చకపోతే వెంటనే పక్కదాంట్లోకి వెళ్ళు!ఈ భోగయాత్రలో ఎవడికీ ఏ డేరానీ హక్కుభుక్తం రాసివ్వలేదు నేను!గొడవలొస్తే వెనక్కి తగ్గొద్దు!నువ్వు నాలుగు తిట్లు తిట్టు!నువ్వు నాలుగు తిట్లు తిను! ఏదయినా చెయ్యి గానీ, నువ్వు ఏడవొద్దు - ఎవర్నీ ఏడిపించొద్దు!

     ఏడుపే అసలైన చావు!అసలు చావనేది లేనే లేదు.నువ్వు చావనుకుంటున్నది చావు కాదు.నిన్నటి మీ తలిదండ్రులు ఇప్పటి మీ భార్యాభర్తలుగా బతికి ఉన్నారు.ఇప్పటి మీ భార్యాభర్తలు రేపటి మీ కొడుకూ కోడళ్ళలో కూతురూ అల్లుళ్ళలో బతికి ఉంటారు - కొత్తవాళ్ళకి చోటుకోసం పాతవాళ్ళని ఖాళీ చేయించే సత్రమిది, అంతే!ఈ గొలుసుకట్టును తెగనివ్వకు.నడుస్తున్న భోగయాత్రని ఆగనివ్వకు.ఏడుస్తూ బతికినా నవ్వుతూ బతికినా ఒకసారి చచ్చిపోయాక మళ్ళీ తిరిగి రావడం కుదరదన్నది సత్యం.యేది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!యేది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!!

Friday, 4 March 2016

అధికార పార్టీ కండువా రంగు మారడం తప్ప ఇదివరకటి తెలంగాణకీ ఇప్పటి తెలంగాణకీ తేడా ఏంటి?అంతా అప్పట్లాగే ఉంటే,మరి ప్రత్యేక రాష్ట్రం కోసం అంతగా ఎందుకు ఏడ్చారు!

     గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ చావుదెబ్బ తినడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కళ్ళు పత్తికాయల్లా చేసుకున్న వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది, ఇన్నాళ్లకి వాళ్ళ కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది - కొంచెం మామూలు స్థితికి వచ్చినాయి!అయితే,కొంచెం కళ్ళు నులుముకుని చూస్తే ఇవ్వాళ తెరాసలో మంత్రులుగానూ ఇంకా వీళ్ళకి తెలంగాణ పునర్నిర్మాణం అనే బృహత్కార్యాన్ని భుజాల మీద వేసుకుని తెలంగాణ భూఖండాన్ని ఉద్ధరించే మహాత్ములుగానూ అక్కడ కొలువుదీరి కనబడుతున్నవాళ్ళంతా ఒకప్పుడు టీడెపీ వాళ్ళే:-)

     అసలు ముఖ్యమంత్రి గారే నందమూరి తారకరామారవుకి భక్తుడు!చంద్రబాబుకి రహస్యమిత్రుడు కూడాను - ఇప్పటికీ!ఒక్క చంద్రబాబు తప్పిస్తే తెలంగాణ నుంచి దుష్ట దుర్మార్గ తెలంగాణ విధ్వంసక ప్రజాశత్రువు చంద్రబాబు ద్వారా ఎన్నికైన తెదెపా వాళ్ళంతా, వాళ్ళొక్కళ్ళేనా అన్ని పార్టీల్లోనూ ఉండి ఇప్పటివరకు ఉద్యమపార్టీని వ్యతిరేకించిన వాళ్ళంతా ఇప్పుడు తెరాస లోనే ఉన్నారు.మరి!యాభయ్యేళ్ళ నాటి పాతకధని మర్చిపోయి ఈ కొత్త కధలో పన్నెండేళ్ళుగా వీళ్ళు ఎవరినైతే బాబు పచ్చ పార్టీలో ఉండి తెలంగాణకి అన్యాయం చేశారని శాపనార్ధాలు పెట్టారో వాళ్ళంతా కండువా మార్చగానే మంచివాళ్ళు అయిపోతారా?కండువా రంగు మార్చటం కోసమా వీళ్ళు ఇంత గోల చేసింది?

     పోనీ ప్రాంతీయాభిమానం లెక్కల ప్రకారం సంస్కృతి గురించి గొప్పగా చెబుదాం అనుకుంటే బతుకమ్మని కులాలవారీగా చీల్చి భ్రష్టు పట్టించారు!బతుకమ్మ పరువు తియ్యటం పూర్తయ్యాక ఇప్పుడు సమ్మక్క మీద పడ్డారు.కొత్తగా నెత్తి కెత్తుకుంటున్న సమ్మక్క,సారక్కల గోలేంటో అర్ధం కాదు.వీళ్ళు కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి మా ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టిన మహారాణి అంటారు.తెలంగాణ భాషలో కాకుండా సంస్కృత పదాలతో నిండిపోయిన గ్రాంధికపు రాష్ట్రగీతంలో రుద్రమదేవిని పొగిడితే వీళ్ళు ఆంధ్రోళ్ళని తిట్టిన దానికన్నా పదింతలు తిట్టిన సమ్మక్క,సారక్కల భక్తులకి అది నచ్చటం లేదు.అందుకని, కొత్త కధల్లో ప్రతాపరుద్రుడికి  పశ్చాత్తాపం అనే ముసుగు తగిలిస్తున్నారు.వాళ్ళు ఎక్కడెక్కడివాళ్ళూ పోగయి మా సంప్రదాయాల్లో వేళ్ళు పెడుతున్నారు,మ మా కధల్ని గూడా మార్చేస్తున్నారు అని కోప్పడుతున్నారు.కొంచెం వైభవంగా బతికిన ఈ మధ్యకాలపు ధర్మప్రభువు గదాని నిజాముని పొగుడుదామంటే అక్కడ బలంగా ఉన్న నక్సలైట్లు ఒంటికాలిమీద లేస్తారు.నక్సలైట్లని తన్ని తగిలేద్దామంటే గిరిజనులు వాళ్ళు మా అన్నలంటారు - ఇదెక్కడి గోల!

    పోనీ పరిపాలన సమర్ధవంతంగా ఉంది అనుకుని సంతోషపడదామంటే సాక్షాత్తూ రాజధాని నడిబొడ్డునే ఉగ్రవవ్ద సంస్థలకి శాఖలు లేస్తుంటే వాటిని మూయించే దమ్ము లేదు.ముఖ్యమంత్రి గారు ఆర్భాటంగా మొదలెట్టిన గతకాలపు సాహసోపేత నిర్ణయాలన్నీ కొన్ని కోర్టు మొట్టికాయలతో కొన్ని జనాల చివాట్లతో అటకెక్కేసినాయి - అవి మళ్ళీ కిందకి దిగొచ్చే సూచనలు కూడా లేవు.కోర్టుల్ని ఆంధ్రా కోర్టులు గాబట్టి వాటిని కొట్టేసినాయి అని చెప్పుకుని కొంచెం పరువు నిలబెట్టుకున్నారు.కానీ పోలీస్ కమిషనరేట్ అని పోలీసుశాఖకి గాలి కొట్టబొతే ఎయిర్పోర్తు అధారిటీస్ గాలి తీసేసింది.అంతకిముందు జరిగిన వాటికి ఆంధ్రోళ్ళ మీద నెట్టేశారు,మరి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంకృత నిర్ణయాలని కూడా ఆంధ్రోళ్ళ మీద నెట్టెయ్యరు కదా:-(

     ఈ రెండేళ్ళలో చెప్పుకోదగిన గొప్పపని ఆయుత చండీయాగం తప్ప ఇనకేమీ కనబడ్డం లేదు.దాని మూలంగా కూడా అప్పటి వరకు పచ్చమీడియా పేరుతో ఏదో చేద్ద్దామని అంతు చూదబోయి ఏమీ చేయలేనని తెలిసి రాధాకృష్నతో కత్తు కలిపెయ్యడం ఒక్కటే గట్టి లాభం!మిగిలినవన్నీ మబ్బుల్లో నీళ్ళే.అయినా ఎందుకు వీళ్ళింత హ్యాపీగా ఫీలవుతున్నారు?ఆంధ్రప్రదేశ్ విభజనకి ముందు కూడా ఇలాగే తెలంగాణా ఇవ్వకుండా ఆంధ్రా వారు అడ్డుపడుతున్నారనీ కావూరి లగడపాటి లాంటివాళ్ళని దోషులుగా చిత్రీకరించి ఆంధ్రా వారినందరినీ తిట్టేవాళ్ళు. సాధారణంగా డబ్బున్న వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు తక్కువ అసూయ చెందేవాళ్ళు ఎక్కువ కనుక సోనియా కూడా తెలంగాణా వారి మాటలనే నమ్మి అంత పెద్ద బడా పారిశ్రామిక వేత్తలను కూడా కాదని పార్లమెంట్ లో 23 నిమిషాలు తలుపులు మూసి మూజువాణి ఓటుతో విభజన చేసారు. .విభజన కావాలా వద్దా అన్నది ప్రజల అభీష్టం ప్రకారం జరగాలి, కానీ వీళ్ళు అట్లాంటి రాజమార్గం ద్వారా కాకుండా వక్రమార్గం దవరా తెచ్చుకున్నారు,అది వాళ్ళకి కూడా స్పష్టంగా తెలుసు.ఈ రకమైన జరిగిన విభజన మొత్తం ఒక పక్కా ప్రణాళికతో నడిపించారు కొందరు వ్యూహకర్తలు - మొదటి వాదన,విడిపోతే రెండు ప్రభుత్వాలు,మరిన్ని పదవులు,మరిన్ని కాంట్రాక్టులు,మరిన్ని తాయిలాలు వస్తాయి అనేది.దానివల్ల ఎక్కువ నష్టం తనకే అని తెలిసిన చంద్రబాబు వ్యతిరేకించాడు - బాబుకి మాత్రం ప్రజలమీద ఏమంత ప్రేమ ఉంది గనక!కానీ చూడండి ఈయన్ని ఆయన అమరావతికీ ఆయన్ని ఈయన చండీయాగానికీ ఎంత ఆత్మీయంగా పిల్చుకున్నారో - తోడుదొంగలు!

     ఇక్కడ కూర్చుని "అండి" కన్నా "రి" ప్రశస్తం అని వాగేవాళ్ళకి మేళ్ళు చెయ్యటంకోసమో ,"చెప్పాలె" అనే గొప్ప ప్రయోగానికి బదులుగా ఇన్నాళ్లూ "చెప్పాలి" అనే తప్పుడు ప్రయోగం ఒప్పుగా చెలామణీ అయిందని అఘోరించే కుపండితులకి గందపెండేరాలు తొడగటం కోసమో కాదు విబజన జరిగింది.పైస్థాయిలో వాళ్లు ఆదాయాల్ని పంచుకోవడానికి సులువుగా ఉంటుందని!వీళ్ళకి దక్కేదల్లా మ్యాపులో విడిగా కొత్త రాష్ట్రంగా కనబడ్డమే.చంద్రబాబు మాటిమాటికీ తెలుగువాళ్ళని కలుపుతానని వాగుతున్నప్పుడల్లా వీళ్లకి ఇప్పటికీ తుమ్మితే వూడిపోయే ముక్కులా ఉన్న తెలంగాణ గురించి అంటున్నట్టు ఉలిక్కిపడేవాళ్ళు.ఇప్పుడా భయం పోయింది,అదీ వీళ్ళ ధీమా!వీళ్ళ దృష్టిలో ఎన్నికల్లో తెరాసా గెలుస్తూ ఉంటే చాలు తెలంగాణా బాగున్నట్టే.

గులాబి రంగు జిందాబాద్!పసుపు రంగు ముర్దాబాద్?

Monday, 29 February 2016

రిజర్వేషన్లు ఎవడు గట్టిగా అడిగితే వాడికల్లా ఇచ్చెయ్యటమేనా?కులాన్ని వెనకబడ్డదిగా గుర్తించండని పోట్లాడే బదులు ముందుకెళ్ళటానికి పోట్లాడొచ్చుగా!

          ఒకప్పుడు వీరశైవం ఉదృతంగా ఉన్నకాలంలో గ్రామాలలో ఒక తంతు నడిచేది.వీరశైవంలో అతి ముఖ్యమైనది లింగధారణ చేసిన ప్రతివాడూ శివరూపమే అన్న సూత్రీకరణ,ఇది మొదట్లో ఆ శైవమతం వరకు అందరూ సమానం అనుకోవడానికి పెట్టిన నియమం, మంచిదే పాపం!ఇక జంగమదేవరల్ని అపర మాహేశ్వరులు అని పిలిచేవాళ్ళు. వీళ్ళు భిక్షాటన కోసం గుంపులు గుంపులుగా వూళ్ళమీద పడేవాళ్ళు.మళ్ళీ వూళ్ళలోకి వెళ్ళాక వీధుల్ని కూడా వాళ్ళలో వాళ్ళు తీరుగా పంచుకునేవాళ్ళు.ఖర్మకాలి ఎవరైనా గృహస్థు వీళ్ళకి భిక్ష వెయ్యకపోయినా, లేక ఆలశ్యం చేసినా విపరీతంగా రెచ్చిపోయేవాళ్ళు.ఇంట్లో చొరబడి నానా భీబత్సం చేసేవాళ్ళు, అది చాలదనుకుంటే శంఖధ్వానం - వూళ్ళో ఉన్న అందరు జంగమదేవరలకీ ఆహ్వానం అన్నమాట!ఇంక చూసుకోండి,ఇవ్వాళ్టి మాఫియాలూ ఆకు రౌడీలూ కూడా చెయ్యనంత అల్లరి చేసేవాళ్ళు.వీరముష్టి అనే మాట కూడా వీళ్ళని చూసే పుట్టించారు."సాగినంత కాలం నా అంతవాడు లేడందురు, సాగకపోతే చతికిలబడుదురు" అన్న సుకవివాక్యం ప్రకారం మొదట్లో హవాహవాయి అన్నట్టు నడిచిన యవ్వారమే తర్వాత మొత్తం శైవమే వెనక్కి జరిగి వైష్ణవం ముందుకు రావడానికి కారణమైంది.

          ఇవ్వాళ రిజర్వేషన్ల కోటాలో వాటా కోసం జరుగుతున్న రగడలు చూస్తుంటే నాకు మళ్ళీ అదే వాతావరణం కనిపించి మళ్ళీ అదే పద్ధతిలో మొత్తం రిజర్వేషన్ల తంతు కూడా వీరశైవం మాదిరే అదృశ్యమైపోతుంది కాబోలు ననిపిస్తున్నది!నిన్నటి రోజున ఆంధ్రాలో కాపుల్ని బీసీల లిస్టులోకి ఎక్కించాలని రైలుబోగీలు తగలబెట్టి హింసాకాండ సృష్టించారు.అయిదు రోజులకి ముఖ్యమంత్రి హడావిడి ప్రకటన చెయ్యగానే ఆగిపోయింది.ఆపకపోతే వీళ్ళకిస్తే తమ వాటా తగ్గుతుందని బీసీల సంఘంవాళ్ళు ఆందోళన చెయ్యటానికి రెడీగా ఉన్నారు.ఇప్పుడు జాట్ కులస్థులు మొదలుపెట్టారు.ఎందుకొచ్చిన గోల అనుకుంటున్నారో ఏమో వీళ్ళకీ వాగుదానమో చెరువుదానమో చేసి చల్లబరుస్తారు లెండి!వీళ్ళు చల్లబడ్డాక ఇంకో కులంవాళ్ళు మొదలుపెడతారు - హనుమంతుడి తోకలాగ!రామాయణంలో కధాగమనానికి ఏ ప్రాధాన్యతా లేని ఒక విచిత్రమైన సన్నివేశం ఉంటుంది.ఒక వ్యక్తి స్వర్గారోహణ చేశాక కూడా అప్పుడప్పుడూ భూమి మీదకి వచ్చి తన శరీరాన్ని తనే తినివెళుతూ ఉండే  దివ్యపురుషుడి కధ ఒకటి ఉంది.అప్పుడది నాకు ఎందుకు రాశాడో,దాని ప్రయోజనమేమిటో అర్ధం కాని మిస్టరీ అనిపించింది గానీ ఇప్పుడు కొందరు రాజకీయనాయకులు అడుగంటిపోయిన పాప్యులారిటీని పెంచుకోవటానికి పరిష్కారం లేని/కుదరని సమస్యల్ని జనం మీదకి వదులుతూ కీర్తిభోజనుల మాదిరి బతకడం చూస్తుంటే వాల్మీకి అతని కాలంలోనూ ఇలాంటివాళ్లని చూసి మార్మిక రూపంలో అలా చెప్పిఉంటాడు అనిపిస్తున్నది!

అసలు రిజర్వేషన్లు ఎందుకు ప్రతిపాదించారు?


          అంబేద్కర్ గారు 1956 నాటికే తన సాటి దళిత మేధావుల గురించి పూర్తి నిరాశా నిస్పృహలకి లోనయ్యాడని మీకు తెలుసా?"on 18 March 1956 at Ramlila Ground, Agra he said with a heavy heart that, “The educated people have betrayed me. I was thinking that after education they will serve their society. But I find that a crowd of clerks had gathered around me, who are engaged in filling their belly”. This heart burning is a proof that educated and intellectual class is alienated from the society and is going away from its brotherhood."స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ళ లోపే,అంటే తను ఈ దేశపు విద్యావంతుల విచక్షణా జ్ఞానం మీదా సామాజిక బాధ్యత మీదా ఎన్నో ఆశలు పెట్టుకుని సంతో తెలివిగా పెట్టిన రిజర్వేషన్ల వ్యవస్థ గురించి అంత తొందరగా అంత నిస్పృహకి ఎందుకు గురయ్యాడు?ఎందుకంటే,గాంధీ యొక్క అహింసాయుత పోరాటం అనే వింత సిద్ధాంతం అతడికి తప్ప ఇంకెవరికీ అర్ధం కానట్టు అంబేద్కర్ రిజర్వేషన్ల విధానం ఎందుకు ప్రతిపాదించాడో అటు ప్రభుత్వంలో ఉండి అమలు చెయ్యాల్సిన పెద్దమనుషులకీ ఇటు దాని ఫలితాన్ని అందుకోవలసిన దళిత విద్యావంతులకీ అసలేమాత్రం అర్ధం కాలేదు!

          నిజానికి ఈ ప్రత్యేక రక్షణ(reservation) అనేది ఎవరికీ కవచాలు తొడిగి రక్షించటానికి ఉద్దేశించినది కాదు.అసలు దీని యొక్క ప్రాధమిక లక్ష్యానికి తగిన పదం ప్రత్యేక ప్రాతినిధ్యం!ఇప్పుడు ఎవరైతే ఈ రిజర్వేషన్ సౌకర్యాన్ని కోరుకుంటున్నారో వారు దాని అర్ధాన్నీ పరమార్ధాన్నీ తప్పనిసరిగా తెలుసుకోవాలి.దానికి పరిమితులు కూడా ఉన్నాయనేది గ్రహించాలి.అది ప్లాసిబో లాంటి సర్వరోగనివారిణి ఎన్నటికీ కాదు.అది ఒక వ్యక్తికి కొంత సౌకర్యం ఇస్తున్నా ఆ ఇవ్వడం అతనికి వ్యక్తిగతంగా ఇవ్వడం లేదు,కులపరంగా ఒక వ్యక్తికి మనం ఉద్యోగంలో గానీ శాసనసభ్యత్వంలో గానీ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామంటే ఆ వ్యక్తి తను నిలబడిన సమూహంలో తన కులానికి ఒక గొంతునీ,గుర్తింపునీ సాధించి ఆ కులానికి ప్రతినిధిగా నిలబడే అవకాశం కల్పిస్తున్నాము అని అర్ధం!కానీ ఈ దేశపు దళిత విద్యావంతులు ఆ గురుతరమైన బాధ్యతని నిర్వర్తించటంలో దారుణంగా విఫలమయ్యారు - అదే అంబేద్కర్ బాధకి కారణం!

          మొదటిసారి రిజర్వేషన్ వల్ల లాభం పొందినవాళ్ళు ఆ ప్రాతినిధ్యాన్ని ఇంకా పెంచటానికి,అంటే ఏ వెనుకబాటుతనాన్ని గుర్తించి తనకి అవకాశం కల్పించబడిందో అలాంటి మరిన్ని అవకాశాలను తన కులంలోని మిగిలిన వారికి కూడా దక్కే విధంగా కృషి చెయ్యాలి.కానీ వాస్తవంలో ఏమి చేశారు.తమకి ఉద్యోగం రాగానే తను ఎంత తొందరగా ప్రమోషన్ ఎట్లా కొట్టెయ్యాలి, ఎంత తొందరగా బంగ్లా,కారు,హోదా తెచ్చుకోవాలి అనే రంధిలో పడిపోయారు.అంబేద్కర్ వీళ్ళని చూసి బాధపడిన అప్పటికీ రిజర్వేషన్ ఫలాల్ని అనుభవిస్తూ డెబ్భయ్యేళ్ళు గదిచిన ఇప్పటికీ అదే పరిస్థితి.ఇవ్వాళ ఏ కులపరమయిన వెనుకబాటుతనం వల్ల తాము కొత్తగా సౌకర్యం పొందారో ఆ బుద్ధిమంతులకి తమ కులంలోని మిగిలిన వ్యక్తుల పట్ల సానుభూతి లేదు గానీ నిన్నెప్పుడో అగరకులాల వాళ్ళు మమ్మల్ని అణగదొక్కేశారు మొన్నెప్పుడో బ్రాహ్మణులు మమ్మల్ని చదువుకోనివ్వలేదు అని సొల్లుకబుర్లు చెప్పే డొల్లతనం పెరిగింది!కార్య కారణ సంబంధాన్ని బట్టి రాగద్వేషాల కతీతంగా చెప్పవలసి వస్తే రిజర్వేషన్ వ్యవస్థ అంబేద్కర్ తన అసంతృప్తిని వ్యక్తం చేసినప్పుడే విఫలమైపోయింది.

కమ్యూనల్ అవార్డు నుంచి రిజర్వేషన్ల వరకు!


          1933 ఆగస్టులో బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డోనాల్డ్ భారతదేశపు పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన కమ్యూనల్ అవార్డ్ చట్టానికి రూపకల్పన చేశాడు.ఇందులోని అతి ముఖ్యమైన అంశం ముస్లిములు,శిఖ్ఖులు,భారతీయ క్రైస్తవులు,ఆంగ్లో ఇండియన్లు,యూరోపియన్లు దళితులు - భిన్నవర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా ఎన్నికలు జరిపించటం.అంటే ఒక ప్రాంతంలో ఆయా వర్గాల జనసాంద్రతని బట్టి ఆయా ప్రాంతాలను ఆయా వర్గాలకు కేటాయిస్తారు.అన్ని పార్టీల వారూ ఆయా వర్గాలకి చెందిన వారినే అబ్యర్ధులుగా నిలబెడితే ఆయా వర్ణాల వారు మాత్రమే వోటు చేయాలి.ఈ అవార్డు భారతదేశపు నాయకుల మధ్యన వివాదాస్పదమైంది.అంబేద్కర్ ఎంతో ఉత్సాహంగా సమర్ధించినా మోహనదాసు ముస్లిముల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చెయ్యలేదు గానీ దళితుల్ని మాత్రం హిందువుల నుంచి వేరు చెయ్యటానికి వీల్లేదని పట్టుబట్టి నిరశన దీక్షకి తెగబడ్డాడు.ఎన్నో వాదోపవాదాల తర్వాత అంబేద్కర్ తనకి లోలోపల ఇష్టం లేకపోయినా గాంధీ వైపునుంచి వచ్చిన దళితుల్ని హిందువులలోనే ఉంచి వారికి కొన్ని సీట్లు దఖలు పరచటం అనే ప్లానుకి ఒప్పుకోవలసి వచ్చింది.దీనినే పూనా ఒప్పందం అంటారు.ఇదే స్వాతంత్ర్యాననతరం మరికొన్ని మార్పులు చేర్పులతో మరింత విస్తృతమై ఇప్పటి మోడల్ అయిన రిజర్వేషన్ వ్యవస్థ రూపు దిద్దుకున్నది.

          కులప్రాతిపదికన రిజర్వేషన్లు ఎందుకు ప్రతిపాదించారో తెలియాలంటే ముందు కులం అంటే ఏమిటో తెలియాలి.మిగతా దేశాల్లో ఎక్కడా ఇంత స్పష్టమైన కులవిభజన లేదు - కొంతమేర పోలికలు కనబడటమే తప్ప.అందువల్లనే ఈ కులవ్యవస్థ ఇక్కడ వివాదం కూడా అయ్యింది.కొందరు దీనిని హిందూధర్మంలో చెప్పబడిన చాతుర్వర్ణం లాంటివాటితో కలిపి బ్రాహ్మణులు చేసిన కుట్ర అంటున్నారు.ఈ హిందూమతంలో బ్రాహ్మణుల కున్న గౌరవాన్ని బట్టి మతానికి సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో వారికున్న ప్రాధాన్యతని బట్టి దీనికి "బ్రాహ్మణ మతం" అని పేరు కూడా పెట్టేశారు.కానీ చారిత్రక పరిశోధకులు ఎవరూ వీరు చెప్తున్న బ్రాహ్మణాధిక్యతకి సంబంధించిన పూర్తి ఆధారాల్ని చూపించలేకపోయారు.ప్రపంచంలో ఎక్కడ సంపద పుట్టినా అది భూమినుంచే వస్తుంది.అన్ని కాలాలలోనూ అన్ని అదెశాలలోనూ సంపద భూమినుంచి పుట్టిన వస్తువులను విపణి(మార్కెట్) దగ్గిర అమ్మడం వల్ల పుడుతుంది.

          ప్రపంచంలోని అతి ప్రాచీనమైన మానవ సమూహం అయి ఉండటం వల్ల ఈ సంపదని సృష్టించడం కూడా చాలా ముందుగానే మొదలుపెట్టారు.మొహెంజెదారో కాలం నాటికే ఇక్కడ గొప్ప ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణం జరిగింది.అప్పటికే దూరప్రాంతాలతో వాణిజ్యం ద్వారా విదెశీ మారక ద్రవ్యపు నిల్వల్ని సాధించారు.దానికి సాక్ష్యం ఆ కాలంలోని ఇతర ప్రాంతాల ప్రజలు వాడే నాణెములు,వస్తువులు అక్కడ దొరకటం.వ్యవసాయం కన్నా వీరు వ్యాపారం మీదనే ఎక్కువ ఆధారపడినారని తెలుస్తుంది.అయితే, వీరు చేసిన వ్యాపారానికి మూలమైనవి ఏమిటో తెలుసా - బొమ్మలు!అప్పటి కాలానికి అద్భుతం అనిపించేటంతటి నాణ్యమైన పనితనంతో హస్తకళాకృతులు తయారుచేసి అమ్మేవారు.ఇప్పుడు త్రవ్వకాలలో బయటపడిన వాటి నునుపుదనం చూసి వాటిని పరిశోధిస్తున్న నవీన కాలపు శాస్త్రవేత్తకి కళ్ళు తిరిగినంత పనయ్యింది, నిజంగానే!"కార్బన్ డేటింగ్ మెధడ్ ద్వారా టి కాలం తెలిసింది గాబట్టి నమ్ముతున్నాను గానీ లేకుంటే నమ్మలేను,ఎందుకంటే మా దేశంలో 18వ శతాబ్దిలో తయారయిన వాటిలో కూడా ఇంత నునుపుదనం చూడలేదు" అన్నాడు.ఇప్పుడు మనం ఆధునిక కాలంలో తెలుగునేలపై కనబడుతున్న హస్తకళానిపుణులకు వీరు ఆద్యులు.ఒక కళలో అంతగా ఆరితేరడానికి ఒక వ్యక్తి జీవితకాలం సరిపోదు.కొత్తది కనిపెట్టడం,శిష్యులకి నేర్పడం,గురువు నుంచి నేర్చుకోవడం,కొత్తది చేర్చడం అనే నిరంతర ప్రక్రియ ద్వారానే అది సాధ్యమవుతుంది.అందుకోసం దానిపట్ల ఆసక్తి ఉన్నవారందరూ వీలయినంత ఎక్కువకాలం ఒకచోట గడపాలి.కొన్ని తరాల పాటు జరిగిన అలాంటి సహజీవన పరంపర నుండి కులాలు స్థిరపడినాయి.ఇవ్వాళ తెలుగునాట మనం చూస్తున్న ప్రతి కులమూ ఒక వృత్తికి అనుసంధానించబడి ఉండటం ఆ వృత్తికి కావలసిన నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవటానికీ,ఆ వృత్తి మీద వచ్చే ఆదాయం మీద పట్టు సాధించడం కోసమే ఏర్పడింది.వ్యవసాయం కూడా లాభసాటి అయ్యాక వ్యవసాయానికి అనుబంధంగ ఉండే వృత్తులకి సంబంధించిన కులాలు వ్యవసాయదారులకి తమ నైపుణ్యాన్ని వస్తుసేఅవల రూపంలో ఇస్తూ పరస్పరాశ్రితులుగా ఉందే స్వయంపూర్ణ గ్రామ వ్యవస్థ ఒకటి ఉద్భవించింది.ఈ అన్ని సామాజిక దశలలోనూ ఇక్కడ పెరిగిన సంపద విదేశీయులకి ఈర్ష్య కలిగించిందంటేనే ఆ వ్యవస్థ ఎంత విజయవంతంగా నడిచిందో అర్ధమవుతుంది. ఎన్నిసార్లు ఎంతమంది దోచుకుపోయినా మళ్ళీ పుడుతూ ఉందేది అక్షయపాత్ర లాగ!

          ఆ అక్షయపాత్ర భిక్షాపాత్ర అయింది ఇంగ్లీషువాళ్ళ క్రూరమైన పరిపాలన వల్లనే!బాబరు నుంచి ఔరంగజేబు వరకు ఉన్న మొఘల్ ప్రభువులూ,నాదిర్ షా వంటి ఇతరులూ కూడా సంపదని తమ మూలస్థానాలకి తరలించుకుపోకుండా ఇక్కడే రాజ్యం చెయ్యాలనుకున్నారు గాబట్టి మౌలికమైన ఆర్ధిక చట్రాన్ని వారెన్నడూ ధ్వంసం చెయ్యటానికి ప్రయత్నించ లేదు.ఇవ్వాళ గోమాంసం తినటం హిందూమతోన్మాదులను వ్యతిరేకించటం కాబట్టి చేసి తీరతాం అంటున్నవాళ్ళకి ఔరంగజేబు కూడా గోవధ నిషేధ చట్టాలు చేశాడనేది తెలుసా!తన రాజ్యంలో పక్క రాజ్యం కన్నా ఎక్కువ సంపద పోగవ్వాలని కోరుకుంటాడే తప్ప ఏ ప్రభువూ సంపద పెంచే అవకాశాల్ని ధ్వంసం చెయ్యడు.ఇంగ్లీషు వాళ్ళకి ఈ దేశప్రజల పట్ల బాధ్యతా లేదు, ఈ దేశం నష్టపోతే ఏమి చెయ్యాలన్న బాధ కూడా లేదు - జండా ఎత్తేసి మరో చోట పాతుతాడు!

        స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఇంగ్లీషువాళ్ళ అడ్డగోలు పరిపాలన వల్ల మొత్తం భారదదేశమంతా వట్టిపోయిన గొడ్డులా తయారయింది.అలాంటి స్థితిలో హఠాత్తుగా స్వేచ్చావాయువులు పీల్చుకున్నప్పుడు ప్రతివాడూ తను బాగుపడటం గురించే ఆలోచిస్తే అప్పటికే ముందున్నవాళ్ళు ఇంకా ముందుకెళ్ళి అప్పటికి వెనకబడి ఉన్నవాళ్ళు ఇంకా వెనక్కి వెళతారు.ఆ సమయంలో రిజర్వేషన్లు పెట్టకుండా సర్వసమాంత్వం ఆశిస్తే సాయుధ పోరాటం ద్వారా వచ్చే విప్లవమే శరణ్యం!ఆ భీబత్సాన్ని నివారించడం కోసమే ఆనాడు అంబేద్కర్ లాంటి దేశభక్తులు రిజర్వేషన్ల వ్యవస్థని ప్రతిపాదించారు. అప్పటికే రిజర్వేషన్లని బలంగా వ్యతిరేకిస్తున్న ప్రతివాదుల నుంచి వస్తున్న ఎన్నో అభ్యంతరాల్ని పూర్వపక్షం చేసి మొండిగా నిలబడటం వల్లనే ఆనాడు రిజర్వేషన్ల వ్యవస్థ అమలులోకి వచ్చింది.అంబేద్కర్ దార్శనికతలో దోషం లేదు,కాకపోతే ఆయన సాటి దళిత మేధావుల యొక్క సమర్ధత గురించి ఎక్కువగా వూహించుకున్నాడు - అమాయకుడు!

అసలు ఎవరు ఎప్పుడు ఖచ్చితంగా రిజర్వేషన్లని ప్రారంబించారు?


         క్రీ.శ 1882లో హంటర్ కమిషన్ మొదటిసారి ఈ కోణంలో తన పనిని మొదలుపెట్టింది.అప్పట్లోనే జ్యోతిబా పూలే ఉచిత విద్య కోసం,ప్రభుత్వ ఉద్యోగాలలో కనీస ప్రాతినిధ్యం కోసం కృషి చేస్తున్నాడు.క్రీ.శ 1901లో కొల్హాపురి సంస్థాన ప్రభువైన చత్రపతి షాహుజీ మహరాజ్ తన రాజ్యంలో బ్రాహ్మణేతరులకి,వెనుకబడిన తరగతులకి రిజర్వేషన్లని ప్రారంభించాడు.ఈ మంచి మహారాజు ఉచితవిద్యని కులమతాల కతీతంగా అందరికీ అందించే ఉద్దేశంతో విద్యార్ధుల సౌకర్యం కోసమని వసతిగృహాలు కూడా తనే నిర్మించి అన్ని విధాల లోపరహితమైన విద్యావ్యవస్థని తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది.విద్య ముగిసిన తర్వాత ఉద్యోగలభ్యత విషయంలో కూడా శ్రద్ధ చూపించినట్టు తెలుస్తున్నది.ఇతను 1902లో అంటరానితనం లేని,కులభేదాలు లేని భారతదేశం గురించి ప్రతిపాదిస్తూ ఒక ప్రసంగం చేశాడు.అధికారికంగా ప్రభుత్వాల తరపు నుంచి రిజర్వేషన్లని ప్రతిపాదిస్తూ వచ్చిన మొదటి ప్రకటన ఇదే.

          భారతదేశంలొని అత్యంత దారుణమైన దురాచారం అంటరాని తనం.దీని ప్రారంభం ఎప్పుడో తెలియదు గానీ ఆనాటి నుంచీ ఈనాటి వరకూ ఎందరో మహానుభావులు ఎంత పోరాడినా ఇంకా వదలకుండా ఒక సమూహం మొత్తాన్ని కేవలం ఆ కులంలో పుట్టినందుకు ఇతర్లు ముట్టుకోవడానికే కూడా ఇబ్బంది పడే భయానకమైన పరిస్థితి కొనసాగుతున్నది.అలాంటి మానసికపరమయిన చొరవలేమిని తొలగించటానికి ప్రతిపాదించిన రిజర్వేషన్ల కోటాలో వాటా కోసం ఆ పరిస్థితి లేని కులాలు కూడా పోటీ పడటం దేనికి?ఇవ్వాళ రిజర్వేషన్ల కోటాలో వాటా పొందటం అనేది బలప్రదర్శన తంతు కింద తయారయిందే తప్ప నిజంగా రిజర్వేషన్ల కోటాలో వాటా వచ్చెయ్యగానే తమకి గట్ట్ మేలు జరుగుతుందనే గ్యారెంటీ ఉండి కాదు!

రిజర్వేషన్లలో ఆర్ధిక ప్రాతిపదిక ఎంతవరకు సబబు?


          పొరపాట్న కూడా రిజర్వేషన్లలో ఆర్ధికపరమైన వెసులుబాటును కల్పించడం గురించి గానీ  ఆర్ధిక స్థితిగతుల్ని బట్టి రిజర్వేషన్లని వర్తింపజెయ్యటం గురించి గానీ ఆలోచించకూడదు.ఎందుకంటే, మొదటి నంచి చెప్తున్నట్టు ఇది ఆర్ధిక స్వావలంబన కోసం ఉద్దేశించిన పధకం కాదు.ఈ మొత్తం రిజర్వేషన్ల వ్యవస్థని అంత గొప్ప దార్సనికత కలిగి ఉండి రూపుదిద్దిన అంబేద్కర్ దీనిని ఎందుకు వదిలేస్తాడు?

          ఒక కమ్మ కులానికి చెందిన వ్యక్తి బీదవాడైనా అతనిలో పుట్టుకకి సంబంధించిన ఆత్మన్యూనత ఉండదు.అట్లాగే మాదిగ కులానికి చెందిన వ్యక్తి అయితే ధనవంతుడైనా పుట్టుకకి సంబంధించిన నిరాదరణని ఎదుర్కొనే పరిస్థితి ఉంది గాబట్టి దానిని గుర్తించి ఆ కులానికి రిజర్వేషన్లు అనే వ్యవస్థని ప్రతిపాదించారు.ఒక వ్యజ్తిని గానీ సమూహాన్ని గానీ ఆర్ధిక స్వావలంబన వైపుకి నడిపించటానికి ఇతర మార్గాలు చాలా ఉన్నాయి - ఒక రకంగా ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి పౌరుడికీ చెయ్యాల్సిన సేవ అది!దానికోసం రిజర్వేషన్లని ఊపయోగించడం కంటే రిజర్వేషన్లని ఎత్తెయ్యడమే మంచిది.

రిజర్వేషన్లు కులాల కుమ్ములాటలను పెంచుతున్నాయనేది నిజమేనా?


          రిజర్వేషన్లని ప్రవేశపెట్టింది కులాల మధ్యన అంతరాల్ని తగ్గించడానికే!రిజర్వేషన్ల గురించి ఈ పాయింటు లాగి రిజర్వేషన్లని డుల్ల్లించటానికి చూసేది ఇప్పటికే ముందుకు పడిపోయిన వారు.ఆ కోటా లేకపోతే తమ కులం వాళ్ళతో సమస్తాన్ని నింపేసి మందబలాన్ని పెంచుకోవాలనుకునేవాళ్ళు.రిజర్వేషన్ల వల్ల ప్రతిభకి అన్యాయం జరుగుతుందనేది మరొక ఆరోపణ.ఇది కూడా దుర్మార్గమైన మాటే.ఎక్కడ రిజర్వేషన్లను ప్రతిపాదించినా మొదట ఆ వ్యక్తి ఆ ఉద్యోగానికి అర్హుడా కాదా అనేది చూస్తారు.బాగా డబ్బులున్న పైకులంవాడు 90% సాధించితే అదంతా అతని స్వయంప్రతిభయేననీ చూచిరాతలు రాసి ప్యాసవలేదనీ గ్యారెంటీ ఉందా?కాపీలు కొట్టటమే కాదు, ట్యూషన్లు పెట్టించుకునే వెసులుబాటును ఉపయోగించుకోవటం ద్వారా కూడా ఎక్కువ మార్కులు సాధించవచ్చును.కానీ సామాజికంగా ఆర్ధికంగా వెనుకబడిన వ్యక్తి 80% సాధించినా దానికి విలువ ఇవ్వకపోవడం అన్యాయమే కదా!

          అయితే పైన చెప్పుకున్నట్టు రిజర్వేషన్లు పొందినవారు వెనక్కి తిరిగి తన కులం గురించి ఆలోచించకుండా అప్పటికే ముందుకు పడ్డవారితో సమస్థాయిని ఆస్వాదిస్తూ కుక్షింభరులుగా మాత్రమే మిగిలిపోతున్నందువల్ల ఈ వాదనకి బలం వచ్చింది.ఇవ్వాళ మాలమహానాడు,మాదిగ దండోరా చేస్తున్నదేమిటి?రిజర్వేఅషన్ల కోటాలో వాటా తగ్గకుండా చూడ్డమో ఇంకా పెంచడమో తప్ప వారి వర్గానికి నిర్మాణాత్మకంగా చేస్తున్నది ఏమీ లేదు!ఆ సంస్థ లోని పైస్థాయిలోని వారు మాత్రం రాజకీయ ప్రాభవాన్నీ ఆర్ధిక స్వావలంబననీ పొందుతున్నారు.

         ఈ రిజర్వేషన్లు అనేవి వ్యక్తులు కేవలం ఆర్ధికంగా పైమెట్టుకు చేరటానికి ఉపయోగపడే నిచ్చెనమెట్లు కావని అర్ధమయితేనే అంబేద్కర్ ఎందుకంత బాధపడ్డాడో తెలుస్తుంది. అంబేద్కర్ బాధపడిన విధంగా కాకుండా దళిత విద్యాధికులు మరికొంత బాధ్యతా యుతంగా ప్రవర్తించి ఉంటే ఈపాటికే అంతరాల నిర్మూలన పూర్తయి అందరి అంగీకారంతో రిజర్వేషన్ల వ్యవస్థని రద్దు చెయ్యటం కూడా జరిగిపోయి ఉండేది.

ఈ రిజర్వేషన్లని ఎంతకాలం వరకు కొనసాగించాలి?


          తొలినాళ్ళలో చట్టసభల్లో ప్రవేశానికి సంబంధించిన రిజర్వేషన్లని 10 సంవత్సరాలు మటుకు ఉంచి తర్వాత మదింపు ద్వారా ఇక అనవసరం అనుకుంటే రద్దు చేసే ప్రతిపాదన ఉంది.అయితే ఎలాగూ వెసులుబాటు ఉంది కదాని మదింపుతో సంబంధం లేకుండానో తూతూ మంత్రపు మదింపుతోనో పొడిగించుకుంటూ వస్తున్నారు.విద్యా ఉద్యోగ విషయాలకి సంబంధించి ఆ సూచన కూడా లేదు.

          మొదట ఒక కులాన్ని కోటాలో చేర్చినపప్పటికి 20 సంవత్సరాల తర్వాత మదింపు చేసి ఆ కులం యొక్క ప్రాతినిధ్యం తగినంతగా ఉన్నదని నిర్ధారించి కోటా నుంచి తొలగించడం న్యాయమే.ఆ స్థానంలో ఆ వెసులుబాటుని కొత్త వర్గాలని ప్రోత్సహించడానికి ఉపయోగించవచ్చును.

          కానీ తమ కులాన్ని లిస్టులో ఉంచుకోవటం,వాటాని పెంచుకోవడం రాజకీయ బలప్రదర్శన స్థాయికి దిగజారిన ఇప్పుడు న్యాయాన్యాయాల గురించి ఆలోచించేదెవరు!


రిజర్వేషన్ల వల్ల ఆయా వర్గాలకి సిద్ధించిన నిజమైన ప్రయోజనం ఎంత?


          రిజర్వేషన్లు అనేవి పూర్తిగా ప్రభుత్వోద్యోగాలలో ప్రవేశించడానికి మాత్రమే ఉద్దేశించినవి.2014లో వేసిన ఒక అంచనా ప్రకారం 14 లక్షలమంది రిజర్వేషన్ల విధానం ద్వారా ఉద్యోగాలు దక్కించుకోగలిగారు.మూదవ,నాల్గవ తరగతి ఉద్యోగులలో కోటాను మించి 16% ఉంది.మొదటి,ఎండవ తరగతి ఉద్యోగులలో వెనుకబడిన తరగతుల వారు 8% నుంచి 12% వరకు ఉన్నారు.రిజర్వేషన్లు అనే మార్గం లేకుంటే వీరెవరూ అక్కడికి చేరుకోవటం దాదాపు అసాధ్యం.ఇంత సుదీర్ఘమైన కాలాన్ని బట్టి చూస్తే మరీ ఇంత తక్కువా అని దీని గురించి నిరాశ పడనక్కర లేదు.

          అసలు సమస్య,స్వాతంత్ర్యం వచ్చి డెబ్భయ్యేళ్ళు గడిచాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలకమైన స్థానాల్ని రిజర్వేషన్ల ద్వారా పొందినవారిలో ఎంతమంది తమ బుద్ధినీ కాలాన్నీ తమ కులానికి గౌరవమైన స్థానాన్ని కల్పించేటందుకు ఉపయోగించారు అని గనక ప్రశ్నించుకుంటే చాలా దయనీయమైన జవాబు వస్తుంది!దేశంలో ఉన్న సంపదనంతా దోచిపెట్టనక్కర లేదు, ఇప్పటివరకు పై స్థాయిలో తమ సుదీర్ఘమైన ఉద్యోగజీవితకాలంలో తమ కులానికి చెయ్యాల్సిన న్యాయమైన సహాయం చెయ్యడానికి అవసరమైనవన్నీ వారిచెంత ఉన్నాయి,కానీ వారినుండి వారి కులానికి అందినది శూన్యం.అసలైన విషాదం వీరు మెల్లమెల్లగా తమ కులానికి దూరంగా జరుగుతూ "ఉన్నత తరగతి దళితులు" అని పిలవాల్సిన పరిస్థితికి దిగజారిపోయారు.

          వీరి పతనానికి పరాకాష్ఠ ఖెయిర్లంజి కేసులో స్పష్టంగా తెలుస్తుంది.ఒక్కర్ని విడిచి మొత్తం దళిత కుటుంబాన్ని చంపేసిన  కేసులో దళిత ప్రజాసేవకులు,దళిత అధికారులు తమ స్వకులపు సోదర సోదరీల పట్ల కనికరం లేకుండా ప్రవర్తించారు,అధికారంలోకి రాగానే పరిపాలక మనస్తత్వంలోకి వెళ్ళిపోయారు!నిన్నటి రోజున ఏ రకమైన రాజ్యం తమ కులాన్ని వెనకబడేలా చేసిందో ఆ రాజ్యపు ఆదర్శాలని వీరు ఏమాత్రం సంకోచం లేకుండా ఆమోదించేశారు - మరి,గంభీరమైన దళిత భావజాలపుస్పూర్తి ఏమైనట్టు?

దళితులు బ్రాహ్మణుల వల్ల అణచబడి ఇంగ్లీషువాళ్ళ వల్ల పైకొచ్చారనేది నిజమేనా!


          నేను మీ జేబులో చెయ్యి పట్టి మీ పర్సు లాగితే నన్ను దొంగంటారు,నన్ను నడిబజార్లో పెట్టి పరువు తీస్తారు.అదే నేను తెలివిగా మాయకబుర్లు చెప్పి మీ అంతట మీరే మీ పర్సు తీసి నాకిచ్చేటట్టు చేస్తే మీరు నన్ను తిట్టలేరు,పైగా చూసేవాడు ఎవడయినా నేను చేస్తున్న మోసం గ్రహించి నన్ను తిడుతుంటే మీ వెర్రితనం ఎక్కడ బయటపడుతుందో అని నష్టం ఎటూ జరిగిపోయింది గాబట్టి పరువు నిలబెట్టుకోవాలని అనిపిస్తే మీరు నన్ను తిట్టడానికి బదులు నన్ను తిడుతున్న పెద్దమనిషినే "నా అంతట నేనిస్తే ఆయన్నెందుకు తిడతావు,నా నష్టం సంగతి నీకెందుకు?నీ సంగతి నువ్వు చూసుకో!" అని ఝాడించనూ గలరు:-)

          ఎంతమంది ఎన్నిసార్లు ఎంతమొత్తం దోచుకుపోయినా మళ్ళీ కూడదీసుకుని లేచి నిలబడగలిగిన కామధేనువు తొలిసారి ఈచుకుపోయిన గొడ్డులా అయింది ఇంగ్లీషువాళ్ళ వల్ల - గట్టి సాక్ష్యం బెంగాల్ కరువు!ఆ దెబ్బకి అప్పటి వరకు అప్రతిహతంగా సంప్రదాయిక వ్యవసాయం మీద ఆధారపడ్డ స్వయంపూర్ణ గ్రామ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది.ఏ ఉత్పాతం జరిగినా నిలవలో ఉన్నవాడు తొందరగా సర్దుకుంటాడు గదా. అలాంటి భూస్వాములు తట్టుకోగలిగారు గానీ ఏడాది మొత్తం రైతులకి పనిచేసి సంవత్సరానికి సరిపడే మొత్తాన్ని ఒకేసారి తీసుకుని అది వాడుకుంటూ నిక్షేపరాయుళ్ళ మాదిరి బతకటమే తప్ప నిలవ సొమ్ము లేని కులవృత్తుల వాళ్ళు పూర్తిగా అణగారిపోయారు.

          అలా అణగ్గొట్టిన వాడే ఇవ్వాళ వీళ్ళకి దేవుడయ్యాడు.ఈ పని చేసిన మాయామశ్చీంద్రుడు లార్డు మెకాలే.జనవరి 1835లో ఇతను భారతీయులకి సరికొత్త విద్యని అందించటానికి ఒక ప్రణాళికని సభ ముందుంచాడు.సభ చేత ఒప్పించాడు.అప్పటి వరకు ఇంగ్లీషువాళ్ళు ఇక్కడి రాజుల,జమిందార్ల ద్వారానే పనులు జరిపించుకునేవాళ్ళు సామాన్య ప్రజలతో సంబంధాలు లేకుండా.దీనివల్ల భూఖండం పరతంత్రంలో మగ్గుతున్నా మానవాత్మలు మాత్రం స్వతంత్రంగానే ఉన్నాయి."మొత్తం ఇండియన్,అరబిక్ సాహిత్యాన్నంతా కలిపినా ఒక యూరోపియన్ లైబ్రరీలోని ఒక అరకి తూగదు గదా" అనగలిగిన అజ్ఞానంతో బలిసిన అహంకారి ఈ ఉన్నత తరగతి దళితులకి కారణజన్ముడిలా కనపడుతున్నాడు.

          మరీ అట్లా తీసిపారేస్తే బాగుండదని కాబోలు రూటు మార్చి "ఈ నగరంలోనే స్థానికులలో కందరు ఇంగ్లీషు భాషలో రాజకీయ,ఆర్ధిక,సామాజిక అంశాలను గురించి ధారాళంగా చర్చిస్తూ ప్రసంగించగలిగిన వారు ఉన్నారు. " అని గిల్లి జోల పాడినట్టు  ఓ పొగడ్తను విసిరేశాడు.దానికి సాక్ష్యాలు కూడా ఉండటంతో "నిజానికి కొందరు హిందూ పండితుల ఇంగ్లీషు భాషా ప్రావీణ్యానికి సరితూగగలిగినవాళ్ళు యూరోపియన్ విద్యావంతులలో కూడా లేరు" అని ఒప్పుకున్నాడు.మరి,ఇతను ఈ కొత్త విద్యని ఇంగ్లీషుతో కలిపి అమలుపర్చకముందే కొందరు భారతీయులు అంత పాండిత్యాన్ని ఎట్లా సంపాదించారు?

          ఇంతకీ, ఇతనికి ఇంగ్లీషు భాష మొత్తాన్నీ,అంటే మిల్టను కవిత్వం దగ్గిర్నుంచీ వాళ్ళ జ్ఞానం మొత్తాన్నీ మనకి పరిచయం చేసి మనల్ని తమతో సమస్థాయికి తీసుకెళ్ళీ పక్కన కూర్చోబెట్టుకుని గౌరవించాలనే సదుద్దేశం ఎంతమాత్రం లేదు. చాలా సూటిగా అతని ఉద్దేశం "మనకీ మనం పాలిస్తున్న ప్రజలకీ మధ్యన ఒక దుబాసీ తరగతి:రక్తంలో రంగులో మాత్రమే భారతీయులుగా ఉంటూ అభిప్రాయాలలో,నీతులలో,బుద్ధులలో మనవలెనే ప్రవర్తించగలిగిన ఒక ప్రత్యేక తరగతి"ని సృష్టించటం.ఈ ప్రత్యేకమైన వారధుల ద్వారా స్థానిక భాషలలోనికి ఇంగ్లీషు భాషని ప్రవహింప జేయాలి."Macaulay’s Minute" అనబడే ఈ ప్రణాళికని పరిశీలించిన ప్రపంచ స్థాయిలో నిష్పక్షపాత బుద్ధి గల మేధావులందరూ నిర్ఘాంతపోయారు!పూలచెండులో కత్తిని దాచి చిరునవ్వులతో కానుకగా ఇచ్చినట్టు పరమ దుర్మార్గమైన సామ్రాజ్యవాదాన్ని ఒక జాతిని ఉద్ధరించేందుకు ఉద్దేశించిన సంస్కరణ వలె రూపం మార్చి చూపిస్తున్న ఈ నివేదికని అత్యంత ప్రమాదకరమైన రాజకీయ పత్రాలలో ఒకటిగా వారు గుర్తుపట్టారు - అందుకే ఆ దిగ్ర్భాంతి?!

          అక్కడ మెకాలే మహనీయుడు తన మేధోశక్తి నుపయోగించి ఒక ప్లాను వెయ్యగానే అప్పటి వరకు అజ్ఞానాంధకారంలో ఉన్న భారతీయులు ఈ కొత్తచదువును అమాంతం తలకెత్తుకోలేదు.ఆయన చేసిన ప్రసంగంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాడు - "అప్పటికే ఇంగ్లీషును ఇంగ్లీషువాళ్ళ కన్నా గొప్పగా మాట్లాదగలిగిన వాళ్ళు ఉన్నారు" అన్నాడు.వాళ్లు గాలిలోనుంచి పుట్టుకు రాలేదు కదా!

         అప్పటికి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న గంజాం కలెక్టరేట్ పరిధిలో 255 స్కూళ్ళు ఉన్నాయి.వాటిలో బ్రాహ్మణులు 808 మంది,వైశ్యులు 243 మంది,శూద్రులు 1003 మంది,ఇతర కులాల వారు 896 మంది,ముస్లిములు 27 మంది చదువుకుంటున్నారు.నెల్లూరు కలెక్టరేట్ పరిధిలో 804 స్కూళ్ళు ఉన్నాయి.వాటిలో బ్రాహ్మణులు 2466 మంది,వైశ్యులు 1641 మంది,శూద్రులు 2462 మంది,ఇతర కులాల వారు 432 మంది,ముస్లిములు 620 మంది చదువుకుంటున్నారు.సేలం కలెక్టరేట్ పరిధిలో 388 స్కూళ్ళు ఉన్నాయి.వాటిలో బ్రాహ్మణులు 783 మంది,వైశ్యులు 324 మంది,శూద్రులు 1674 మంది,ఇతర కులాల వారు 1410 మంది,ముస్లిములు 459 మంది చదువుకుంటున్నారు.మద్రాసు కలెక్టరేట్ పరిధిలో 844 స్కూళ్ళు ఉన్నాయి.వాటిలో బ్రాహ్మణులు 1186 మంది,వైశ్యులు 1119 మంది,శూద్రులు 7312 మంది,ఇతర కులాల వారు 3017 మంది,ముస్లిములు 1147 మంది చదువుకుంటున్నారు. సరాసరి చూస్తే శూద్రులు 45%,బ్రాహ్మణులు 23% చదువుకుంటున్నారు.

          క్రీ.శ 1800కు ముందు బెంగాలులో పరిస్థితిని గురించి ఆడం రిపోర్టు ప్రకారం దాదాపు ప్రతి పల్లెలో ఒక స్కూలు ఉంది.దాదాపు ప్రతి జిల్లాలోనూ 100 వరకు ఉన్నత విద్యని అందించే కళాశాలలు ఉన్నాయి.వీటినుంచి 10,8800 మంది ఉత్తీర్ణులై వస్తున్నారని చెప్పాడు.బెంగాలులో చెప్పుకోదగిన సంఖ్యలో మంచి కౌశలం గలిగిన వైద్యప్రవీణులు కూడా ఉన్నారు. క్రీ.శ 1811లో  మొత్తం ఇంగ్లాండు జనాభా 95,43,610 మందిలో సుమారు 75,000 స్కూళ్ళకి వెళ్తున్నారు. క్రీ.శ 1823లో మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తం జనాభా 1,28,50,941లో 1,57,195 మంది స్కూళ్ళకి వెళ్తున్నారు.

          ఇంగ్లాడులో క్రీ.17వ శతాబ్దం వరకు చదువు అంటే బైబిల్ చదవటం తప్ప మరొకటి లేదు.క్రీ.శ 1802 ప్రాంతంలో Joseph Lancaster,Andrew Bellలు కొత్తరకం విద్యావిధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. Alexander Walker తన గ్రంధం Note on Indian Educationలో అప్పటికి భారతదేశంలో Bramans చెప్తున్న చదువు గురించి "The children were instructed without violence and by a process peculiarly simple" అని అంటున్నాడు.

          అంతకు ముందు ఉన్న భారతీయుల స్కూళ్ళని నయాన,భయాన బలవంతంగా మూయించివేసిన తర్వాత ఇక మిగిలింది ఏమిటి?ఇవ్వాళ పరోపకారి పాపన్న కంటె ఎక్కువగా వీళ్ళు కీర్తిస్తున్న మెకాలె స్కూళ్ళు!ప్రపంచ స్థాయిలో అనేక విషయాలను గురించి నిష్పాక్షికమైన అభిప్రాయాల్ని చెప్పి సకలజనవంద్యుడైన Mark Twain చదువు - విద్య గురించి "I do not allow my schooling to interfere with my education" అన్నాడు.భారతీయ విద్యావ్యవ్స్థలో ఇంగ్లీషువాళ్ల మూలంగా జరిగిన మార్పు Indian Education System పోయి Macaulay Schooling System రావటం.

       భారతీయ దేహంలో ఆంగ్లేయాత్మని ప్రవేశపెట్టాలనుకున్న దార్శనికుడు మెకాలే కల ఎంతవరకు నెరవెరిందో తెలుసుకోవడానికి 2006,అక్టోబర్ 25వ తేదీన ఈ దేశపు రాజధానిలో జరిగిన ఒక ప్రత్యేకమైన పుట్టినరోజు పండుగ చాలు.

       అది కొత్తగా పుట్టగొడుల్లా పుట్టుకొస్తున్న డిల్లీ నగరపు సబర్బన్(శివారు) టవున్సులో ఒక టవునులో చిన్న అపార్టుమెంటు.ఇంటి యజమాని పేరు చందర్ భాను ప్రసాద్,పొట్టిగా,నవ్వుతూ నవ్విస్తూ ఉండే దళితకులానికి చెందిన సామాజిక కార్యకర్త, అతిధులు కూడా ఇతని లాంటి ప్రతిభాశాలురే - దళిత మేధావులు,విద్యావేత్తలు,విదేశీ పాత్రికేయులు.వారిప్పుడు ఒక అపూర్వ వ్యక్త్తి, ధామస్ బాబింగ్టన్,లార్డ్ మెకాలే, గొప్పదైన ఆంగ్లభాషను మొదట భారతదేశానికీ,తదుపరి ప్రపంచానికీ పరిచయం చేసి ఎందరి జీవితాలలోనో వెలుగులు నింపిన కారణజన్ముని పుట్టినరోజును జరుపుకుంటున్నారు.అయితే జరుగుతున్న పద్ధతి మాత్రం ఆ మహనీయుడు పరిచయం చేసిన పశ్చిమదేసపు ఆదర్శాల ప్రకారం కాకుండా భారతీయుల మూర్ఖపు సంప్రదాయాలనే అనుసరించింది.కలిపి కొట్టరా కావేటి రంగ అన్నట్టు విదేశీ స్కాచ్ విస్కీతో నంజుకోవటానికి స్వదేశీ పకోడీ ఉంది.ఈ పండుగలోని పతాక సన్నివేశం నూతనంగా చిత్రీకరించబడిన "ఆంగ్ల భాషా దేవత" యొక్క ఆవిష్కరణ మహెత్సవం!


          ఒక దళిత కవి బ్రహ్మణాధిక్యత వల్ల తమకు సంక్రమించబోయే అజ్ఞానాంధకారమును దరిచేరనివ్వక గొప్ప తెలివితేటలను,మంచి ఉద్యోగమును,తీరైన నడవడికను,సకల సంపదలను దయతో ప్రసాదించి జన్మాంతరమున English mokshaను కూడ ప్రసాదించగలుగు అత్యంత శక్తివంతమైన ఈ కొత్త దేవత మీద తను రచించిన కృతిని చదివి/పాడి వినిపించాడు.

 Oh Devi Ma, please let us learn English!
Even the dogs understand English.

         అప్పుడు చందర్ భాను ప్రసాద్ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు "ఆంగ్లదేవత చేత ఆశీర్వదించబడిన వారై, దళితులిక ఈ సరికొత్త గ్లోబలైజేషన్ యుగంలో తమ న్యాయమైన స్థానాన్ని పొందెదరు గాక!మనం భారతీయ విద్యని చదివి ఉంటే ఎక్కడ ఉండేవాళ్ళమో ఒక్కసారి ఆలోచించండి.ఆఫ్ఘనిస్థాన్ లాగో ఇవ్వాల్టి నేపాల్ లాగో ఉండేవాళ్ళం." కనుకొసల నుంచి కొంటెతనం మెరిపిస్తూ "ఇకనుంచి,పుట్టబోయే దళిత శిశువు లందరు తమ తల్లిదండ్రుల నుంచి మొదట వినాల్సిన మాటలు - ఏబీసీడీ. కాబట్టి,బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డ చెవిలో ఏబీసీడీ లని వినిపించాలి" అని చక్కిలిగింతలు పెట్టినట్టు నవ్వించాడు.

          మనల్ని కట్టుబానిసల్ని చేసుకోవటానికి తను చేసిన దుర్మార్గమైన పనికి -  మీ వెర్రితనం బయటపడుతుందని నన్ను తిట్టకుండా పొగుడుతున్న ఇందాకటి కధలోని మీలాగ - వీళ్ళు తనకి చేస్తున్న వీరపూజకి సమాధిలో ఉన్న మెకాలే ఆత్మ సంతృప్తిగా తలాడిస్తూ హాయిగా నవ్వుకుంటూ ఉండవచ్చు గానీ భారతమాత స్థానంలో ఈ విదేశీవనితని చూసి దేశభక్తి కొంచెం ఎక్కువగా ఉన్న మనలాంటి పిచ్చివాళ్ళకి మాత్రం మనస్సు చివుక్కు మంటుంది!వాళ్ళిప్పుడు మెకాలే తయారు చేసిన భారతీయ దేహంలో ఉన్న ఆంగ్లేయాత్మలు గనక మన బాధ వాళ్లకి హాయి, ఎక్కువగా ఏడ్చినా వాళ్లకి లోకువ కావడం తప్ప వాళ్ళలో మార్పు మాత్రం రాదు.అంబేద్కర్ ఏడ్చినా పట్టించుకోనివాళ్ళు ముందుగానే హిందూ మతతత్వ వాదులు అని ముద్ర కొట్టేసుకున్న మన మాట అస్సలు వినరు,  ఎందుకొచ్చిన గోల!

          ఇవ్వాళ చాలామంది గొప్పగొప్పవాళ్ళకి కూడా దేశభక్తి అంటే ఏమిటో,జాతీయత ఎలా ఉంటుందో తెలియడం లేదు పాపం!అంబేద్కర్ విద్యార్ధి సంఘంలో సభ్యులై ఉండి ఆయన ప్రవచించిన రాజ్యాంగం ప్రకారం నడుస్తున్న ప్రభుత్వం కొలువుదీరుతున్న భవనాన్ని నేలమట్టం చెయ్యాలని సంకల్పించి విఫలమైనవాణ్ణి మహావీరుడి కింద పరిగణించేవాళ్ళకి ఆ సందేహం రావడంలో ఆశ్చర్యం లేదు.ఈ దేశపు ప్రజల్ని 300 మందిని చంపిన యాకూబ్ మెమన్ లాంటి వాళ్లని ఇంటికొకణ్ణి పుట్టించి వాళ్ళ చేతుల్లో మళ్ళీ మళ్ళీ చస్తూ తరించమని ఈ దేశపు ప్రజలకే విజ్ఞప్తులు చెయ్యగలిగిన గాడిదకీ. ఆ గాడిదని సింహమని పొగుడుతున్నవాళ్ళకీ ఎంత విడమరిచి చెప్పినా అర్ధం కాకపోవడం విచిత్రం కాదు.

          అయినా మానవ ప్రయత్నంగా ఒక కధ చెబుతాను.అనగనగా ఒక మీర్ జాఫర్.ఇతని తాత అప్పటి వరకు అందరి మద్దత్తు ఉన్న తనని కాదని సిరాజ్ ఉద్దౌలాని బెంగాలుకి నవాబుని చేశాడు.అతని ఏడుపులోనూ కొంత న్యాయముంది లెండి!ఈ సిరాజ్ ఉద్దౌలా అప్పటి వరకు స్త్రీలోలుడని ముద్ర వేసుకుని స్వేచ్చావిహారిగా ఉండేవాడు.దానితో అందరూ తాత మీర్ ఖాశిం వైపుకే మొగు చూపుతాడని అనుకున్నారు.కానీ సిరాజ్ ఉద్దౌలా మనస్తత్వంలో ఒక రహస్యం ఉంది - రాజ్యం మీద ఆసక్తి లేక యవ్వనపు సరదా వల్ల అలా తిరిగినా ఒక బాధ్యతని తీసుకుంటే క్షణమాత్రపు సంకల్పంతో అన్ని రకాల ప్రలోభాల్నీ అణుచుకోగలిగిన నిగ్రహమూ ఉంది,అప్పగించిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడం కోసం ఎంతటి త్యాగానికనా సిద్ధపడే మహత్వమూ ఉంది!ఇతరులు గుర్తించకపోయినా తాత అది గుర్తించాడు.అందుకే అందరూ వ్యతిరేకిస్తున్నా సిరాజునే సార్వభౌముణ్ణీ చేశాడు. అధికారాన్ని ఆశించిన మీర్ జాఫర్ తనకి అన్యాయం జరిగిందనుకున్నాడు.సరిగ్గా ఇటువంటి సన్నివేశంలోనే దుర్యోధనుడికి శకుని కూటనీతిని బోధించి మయాద్యూతాన్ని ప్రయోగించి దుర్యోధనుణ్ణి సంతోష పెట్టాడు. మీర్ జాఫర్ ఆ కూటనీతినే పాటించి ఆంగ్లేయులతో చేతులు కలిపాడు.సోదరుడి తల తెగి కోట గుమ్మానికి వేళ్ళాడుతుండగానే తన తన మీదకి కిరీటం వచ్చింది. అధికారంలోని కొత్తదనం పోయాక మెల్లమెల్లగా పరిస్థితి బోధపడింది - తన రాజ్యాన్ని తను పరిపాలించుకునే స్వేచ్చ తనకి లేదనీ, తను ఇంగ్లీషువాళ్ళకి అలుసైపోయాననీ తెలిశాక మొదట్లో విసుక్కున్నాడు,తర్వాత గునిశాడు,తర్వాత పోట్లాడాడు - ఆఖరికి మరీ సిగ్గులేని బతుకు కష్టమనిపించి తిరగబడ్డాడు.దొరలకి చిరాకు పుట్టి అతన్ని వూడబెరికి అతని మేనల్లుడు మీర్ ఖాసిం అనేవాణ్ణి కుర్చీ మీద కూర్చోబెట్టారు.

          అక్కడ ఉన్న సిరాజ్ ఉద్దౌలా,మీర్ జాఫర్ అనే ఇద్దరిలో మొదటివాడిని కుల మత ప్రాంతాల కతీతంగా భారతీయుడన్న ప్రతివాడూ పొగుడుతున్నాడు.రెండవ వాడిని  కుల మత ప్రాంతాల కతీతంగా భారతీయుడన్న ప్రతివాడూ తెగుడుతున్నాడు.మొదటివాణ్ణి ఎందుకు పొగుడుతున్నారో తెలిస్తే అది దేశభక్తి.రెండవవాణ్ణి ఎందుకు తెగుడుతున్నారో తెలిస్తే అది దేశద్రోహం.ఇద్దరిదీ ఒకటే మతం,ఇద్దరూ ఒకే కుటుంబం లోనివాళ్ళు - అయినా వాళ్ళని సమర్ధించేవాళ్ళూ విమర్శించేవాళ్ళూ ఈ పోలికల్ని పట్టించుకోవడం లేదు,అవునా!మీర్ జాఫర్ కూడా వ్యక్తిగతంగా మంచివాడే అయ్యుందవచ్చు,తిన్నగా రాజ్యం చెయ్యనిస్తే ధర్మప్రభువే అయి ఉండేవాడేమో - కానీ ఒక చారిత్రక సంధ్యలో వీరెక్కడ నిలబడ్డారో దాన్ని బట్టి ప్రజలు నిండుమనస్సుతో ఇచ్చిన తీర్పు కదా అది! ఇప్పుడు నేను ఈ పెద్దమనుషులకి ఈ దేశప్రజల తరపున ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను - మా దేశపు సరిహద్దుల్ని దొంగచాటుగా దాతి వచ్చి మమ్మల్ని చంపుతున్నవాళ్లని పొగుడుతున్న మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి? మావి 300 ప్రాణాలు పోయినందుకు ఏడవకుండా మమ్మల్ని చంపిన ఒక పొరుగుదేశపు ఉగ్రవాది కోసం మీరు ఏడుస్తున్నప్పుడు మిమ్మల్నెవడో తంతున్నాడని మేమెందుకు మీకోసం ఏడవాలి?

అంబేద్కర్ సాటి దళిత మేధావుల్ని ఎందుకంత క్రూరంగా విమర్శించాడు?


          ఈనాడు మేము అణిచివేతకి గురయ్యామని వీరు పదేపదే నొక్కి వక్కాణించ నవసరం లేదు,అంబేద్కర్ కూడా అణిచివేతకి గురయిన వాడే!

Dr.AMBEDKAR (1891-1956)
B.A., M.A., M.Sc., D.Sc., Ph.D., L.L.D., D.Litt., Barrister-at-Law. 

Above single line and his lifetime struggle,reveals THE GREATNESS... .. . 

B.A.(Bombay University) Bachelor of Arts,
MA.(Columbia university) Master Of Arts,
M.Sc.( London School of Economics) Master Of Science, 
Ph.D. (Columbia University) Doctor of philosophy ,
D.Sc.( London School of Economics) Doctor of Science ,
L.L.D.(Columbia University) Doctor of Laws ,
D.Litt.( Osmania University) Doctor of Literature,
Barrister-at-Law (Gray's Inn, London) law qualification for a lawyer in royal court of England.

ALL THIS EDUCATION ACHIEVED BEFORE 1954 !!! HOW REMARKABLE!!! !! !

HE WON THE AWARD OF GREATEST INDIA !!! !! !
THE PERSON WHO SAT OUTSIDE THE CLASS,TO WHOM DRINKING WATER WAS DENIED ... .. . THE SAME PERSON HAS BECOME ... .. .
""" $$$ THE GREATEST INDIAN $$$ """

MOST EDUCATED INDIAN SCHOLAR !!! !! !

       అయినా ఆయన ఏనాడూ వీళ్ళ మాదిరి ఇంత అసహనం వెళ్ళగక్క లేదు. దేశాన్ని ద్వేషించ లేదు, బ్రాహ్మణాధిపత్యం గురించి సొల్లుకబుర్లు చెప్పలేదు.హిందూమతం తనకి అన్యాయం చేసిందనుకున్నప్పుడు హుందాగా బౌద్ధాన్ని స్వీకరించాడు.నిన్నటి రోజున నా తాతల్ని వీళ్ళ తాతలు అణిచివేశారు గాబట్టి ఈరోజు నేను వీళ్ళని ఓ పట్టు పడతాను అనుకోలేదు.తన వరకు తను ఉదారంగా ఆలోచించి నవభారత నిర్మాణంలో అన్ని వర్గాలూ తమ న్యాయమైన ప్రాతినిధ్యాన్ని అందుకోగలిగిన ఒక సామాజిక చట్రాన్ని నిర్మించి ఇచ్చాడు.ప్రతిరోజూ అంబేద్కర్ బోధనల్ని అధ్యయనం చేసే అంబేద్కర్ విద్యార్ధి సంఘం సభ్యులకి అంబేద్కర్ ప్రవచించిన రాజ్యాంగ వ్యవస్థని అవమానించే విధంగా పొరుగుదేశం నుంచి దొంగచాటుగా సరిహద్దుల్ని దాటివచ్చి ఇక్కడి అమాయకుల్ని చంపుతున్నవాళ్లని కీర్తించడం తప్పని తెలియదా?

          అంబేద్కర్ దళిత విద్యావంతుల నుంచి ఆశించింది చాలా తక్కువ. అప్పటికే జనాభా గణాంకాలు అన్నీ వివరంగా దొరికాయి గాబట్టి ఎంత విమర్శనాత్మకంగా చూసినా ఏ ఒక్క వర్గానికీ ఇబ్బంది లేనంత ప్రణాళికాబద్ధంగా చేసిన దాని ముఖ్య ఉద్దేశం - "నూటికి 10 మంది డాక్టర్లు,20 మంది ఇంజనీర్లు.30 మంది లాయర్లు ఉన్న కులం మీద దాడి చెయ్యటానికి గానీ ఆ కులం మీద పెత్తనం చెయ్యటానికి గానీ ఎవడూ ధైర్యం చెయడు"  అని!ఎంత రిజర్వేషన్లు అనే సపోర్టు ఉన్నా తాము ఇక్కడి వరకూ వచ్చింది తమ సొంత కష్టంతోనే, అయినా తమ సాటి కులస్తులకి తమ అధికార పదవుల నుపయోగించి చెయ్యదగిన న్యాయమైన సహాయం చెయ్యమని.

          అది 1956 జులై 31,మంగళవారం.సమయం సాయంకాలం 05 గంతల 50 నిముషాలు. డాక్టర్ అంబేద్కర్ న్యూఢిల్లీ అలిపుర్ 26,తన స్వగృహంలో ఉన్నాడు.తన పర్సనల్ సెక్రటరీ నానక్ చంద్ కట్టూ గారితో ఇలా అంటున్నాడు:"నానక్ చంద్,నా ప్రజలకి చెప్పు.ఏది నన్ను కష్తపెడుతున్నదో దేనివల్ల నేను విచారంగా ఉన్నానో మీకు తెలియదు.మొట్టమొదట నా మనస్సులో తోస్తున్న విషాదం నా లక్ష్యాన్ని చహెరుకోవదంలో నేను విఫల మయ్యాననై.నేను నా జీవితకాలంలో నావాళ్ళు అధికారం చెలాయించే వర్గంగా చూడాలనుకున్నాను,ఇతర కులాలతో రాజకీయాధికారాన్ని పంచుకుంటూ ఉంటారని బలంగా ఆశించాను.నేనిప్పుడు వృద్ధాప్యంతోనూ అనారోగ్యంతోనూ శిధిలమై ఉన్నాను. నేనేమి చేయగలిగానో దాని ఫలితాన్ని కొద్దిమంది విద్యావంతులు, తమలోని మోసపూరితమైన ప్రవర్తన ద్వారా పనికిమాలినవాళ్ళుగా నిరూపించుకున్న వాళ్ళు, తమ సాటివారు పడుతున్న బాధల పట్ల సహానుభూతి లేనివారు అనుభవిస్తున్నారు.వారు నా వూహాదృశ్యాన్ని చూసి కూడా తల తిప్పేసుకుని ముందుకెళ్ళి పోయారు;వారు కేవలం తమకోసం మాత్రమే జీవిస్తున్నారు.వారిలో ఒక్కరు కూడా సామాజిక సేవ చెయ్యటం లేదు.వారొక భ్రష్తమార్గంలో నడుస్తున్నారు.నేనిక వీళ్ళని మర్చిపోయి నా ధ్యాసని పల్లెల్లో ఉండి అవిద్యతో మగ్గిపోతూ ఆర్ధికస్తితిలో ఏ మార్పూ రాకుండా బతుకీడుస్తున్న నిర్భాగ్యుల మీదకి మళ్ళిస్తాను.కానీ ఆయుష్షు తక్కువ....నా సైన్యాధిపతులు,ఎవరినైతే ఉద్యమాన్ని పరుగులు పెట్టిస్తారని నమ్మానో వారంతా వాళ్ళలో వాళ్ళు నాయకత్వం కోసం,అధికారం కోసం కుమ్ములాడుకుంటున్నారు,తమ మీద ఎంత బరువైన బాధ్యత ఉందో తెలుసుకోకుండా...ఏమైతేనేం,అన్ని వైపుల నుంచి వచ్చిపడిన ఎన్నో తిట్లని భరించి నేను చేసింది ఎక్కువే, చచ్చేవరకు చేస్తూనే ఉంటాను. "

          ఇప్పుడు నానక్ చంద్ అంటున్నాడు "ఇలా మాట్లాడి,కన్నీరు చెమపల మీదకి కారుతుండగా,ఆయన నావైపు చూశారు,నేను కూడా ఏం చెయ్యాలో తెలియక కళ్ళనీళ్ళ పర్యంతమై ఆయన వైపు చూశాను."కొంచెం సంబాళించుకుని ముఖం మీద ఇంకా బాధ కదలాడుతూనే ఉన్నా తనకి తను చెప్పుకుంటున్నట్టు "హైర్యం తెచ్చుకో,నిరాశ పడకు,జీవితం ఒకరిఎజు కాకపోతే మరొకరోజు అంతం కావల్సిందే" అని గొణిగారు.కొంచెం సేపాగి,కన్నీళ్ళు తుడుచుకుని,చేతిని వెలుగు నింపుకున్న తన కల్లకు పైకెత్తి ఇలా న్నారు:"నా ప్రజలకి చెప్పు నానక్ చంద్!నేనేమి చేసినా,భయంకరమైన కష్టాల మధ్యన జీవితమంతా ప్రతికక్షులతో పోట్లాడుతూనే చెయ్యగలిగాను.అతి కష్టం మీద,ఈ భోగయాత్రని ఇప్పుడున్నచోటకి తీసుకు రాగలిగాను.ఈ భోగయాత్రని దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపకుండా ముందుకు పోనివ్వండి.ఒకవేళ నా ప్రజలు,నా దళపతులు,ఈ భోగయాత్రని ముందుకు తీసుకు వెళ్లలేకపోతే దాని నక్కడే వదిలేయండి.కానీ ఎట్టి పరిస్థ్తిలోనూ ఈ భోగయాత్రని వెనక్కి తిప్పకండి"

          సందేహం లేదు, అంతపనీ చేసేశారు - బండి ఎప్పుడో వెనక్కి తిరిగింది!ప్రతి కులానికీ మన కులం మీద వెనకబడ్డ కులం అనే ముద్ర పడితే గానీ ముందుకెళ్ళం అని రూఢిగా తెలిసిపోయినంత ముందుకెళ్ళింది ఈ దేశం.మొన్న కాపు సోదరుల ఉద్యమంలో జరిగిన విధ్వంసం ఖరీదు నాలుగు రత్నాచల్ బోగీలు,రెండు పోలీస్ స్టేషన్లు.నిన్న జాట్ సోదరులు తమని తాము వెనుకబడ్డ కులంగా దేశంలో అందరికీ తెలిసేలా చెయ్యటానికి జరిపిన విధ్వంసం ఖరీదు అక్షరాల 34 వేల కోట్లు!రేపు అడిగేవాడు రేంజి పెంచాలనుకుంటే 50 వేల కోట్ల వరకు పెంచినా పెంచొచ్చు.అమంగళం ప్రతిహత మగుగాక, అలాంటి సన్నివేశం జరగకూడదనే కోరుకుంటున్నాను, కానీ ఇవ్వాళ్టి రాజకీయ వాతావరణం చూస్తుంటే అలాంటివి జరగటానికే ఎక్కువ ఆస్కార ముంది.

          ఒకవేళ అలాంటిది గానీ జరిగితే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారికి ఈ దేశప్రజలందరి తరపున నేనొక విజ్ఞప్తి చేస్తున్నాను:"అయ్యా, ఇక మీరు మమ్మల్ని పరిపాలించవలసిన కష్టాతికష్టం మీకిక ఎంతమాత్రం లేదు.మామీద దయదల్చి మీరు గనక తప్పుకుంటే శ్రీమాన్ అఫ్జల్ గురు లాంటి సమర్ధులని ప్రభువులుగా చేసుకుని క్షేమంగా బతకదల్చుకుంటున్నాం.వారు మీకన్నా ఎంతో సమర్ధులు.సరిహద్దు భద్రతా విభాగం కళ్ళుగప్పి టెర్రరిస్టులని దేశం నడిమధ్యకి రప్పించగలిగారు.వెంట్రుకవాసిలో ప్లాను ఫెయిలైంది గానీ, లేకుంటేనా - ప్రపంచం కళ్ళింతలు జేసుకుని ఆయన్ని కీర్తించేది!సాక్షాత్తూ పార్లమెంటు భవనాన్ని పేల్చటం అనే ఘనకార్యం చేసి ప్రపంచంలోని వీరాధివీరుల్లో ఒకడిగా ప్రఖ్యాతిని పొందేవాడు?!చూడండి, ఏ మాత్రమూ పశ్చాత్తాపపడకుండా తన సహాయం కోరివచ్చిన ఎవరికయినా విధ్వంసం సృష్టించడంలో ఇప్పుడు చేసిన సహాయం అప్పుడూ చేస్తూనే ఉంటానని నిర్భయంగా చెప్తున్నాడు.అసమర్ధుడికి బార్యగా ఉండే కన్నా సమర్ధుడికి ఉంపుడుగెత్తెగా ఉంటే నన్నా ఎక్కువ సుఖపడ వచ్చనే కామన్ సెన్స్ ప్రకారం మీలాంటి వాళ్ళ పరిపాలనలో కన్నా అలాంటివాళ్ళ పరిపాలనలోనే మరింత క్షేమంగా ఉంటామని నేను బలంగా నమ్ముతున్నాను, కాబట్టి మీరు దిగిపోయి వారికి దారివ్వండి." - ఒక్క అక్షరంలో కూడా నేను వ్యంగ్యాన్ని జోడించ లేదు.

          చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ముందు జాగ్రత్త పడదల్చుకుంటే తక్షణం రిజర్వేషన్ల వ్యవస్థని రద్దు చెయ్యండి!ఉండి ఉద్ధరించింది ఏమీ లేదని అంబేద్కర్ మాటల సాక్షిగా డెబ్భయ్యేళ్ళ పాటు ఆ సౌకర్యం అనుభవించిన వారు నిర్ద్వంద్వంగా నిరూపించాక కూడా ఇంకా మొహమాటం దేనికి?దానికి బదులు మీరు చెయ్యాల్సినది చాలా చాలా చిన్న పని. కుల,మత,ప్రాంత,వర్గ భేదాలు లేకుండా ప్రతి పౌరుడీకీ న్యాయం చెయ్యగలిగిన సమర్ధవంతమైన పరిపాలన అందిస్తే చాలు - ఒక రకంగా ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి పౌరుడికీ చెయ్యాల్సిన సేవ నిక్కచ్చిగా చెయ్యండి చాలు

          ఒక్క రిజర్వేషన్లే కాదు, మొత్తం వ్యవస్థలన్నింటితో సహా అసలు స్వాతంత్ర్యమే విఫలమైనట్టు నాకు అనుమానంగా ఉంది.డెబ్బయ్యేళ్ళ తర్వాత ఇవ్వాళ మనం సాధించిన ఘనకార్యం మెకాలే కలలుగన్న భారతాన్ని ఆవిష్కరించటం.భూఖండానికి మాత్రమే స్వతంత్రం వచ్చింది, కానీ మానవాత్మలు మాత్రం పరతంత్రంలోకి వెళ్ళిపోయాయి..రాజమార్గంలో ఈ దేశం మీద శౌర్యం చూపించి యుద్ధం చేసి గెలిచిన న్యాయవిజేతని పొగిడినా కొంత నయం.అమాయకంగా ఈ దేశంలో పొట్టపోసుకుని బతకడానికి వచ్చిన వాణ్ణి చంపితే అన్యాయం అని ఆక్రోశించినా నయమే - కానీ ఇదేమిటి?ఈ దేశప్రధాని నామీద కుట్ర జరుగుతున్నదంటే ఒక్కడూ జాలిపడ లేదు,ఒక ఉగ్రవాది మీద ఎంతమంది అభిమానం చూపిస్తున్నారు!ఒక ఉగ్రవాదికి ఉన్న ఫాలోయింగులో సగం కూడా లేనివాడు ఈ దేశ ప్రధాని పదవికి అనర్హుడు!కాబట్టి, నేనిందాక పెట్టిన కండిషన్, మళ్ళీ రిజర్వేషన్ల అగ్గి ఏదీ రగలకపోయినా ఇప్పటికిప్పుడే ప్రధానమంత్రి తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని శ్రీమాన్ అఫ్జల్ గురు గారి అభిమానులకి అధికారం అప్పగించి వారు విశ్రాంతి తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను - ఇక్కడ సైతం ఒక్క అక్షరంలో కూడా నేను వ్యంగ్యాన్ని జోడించ లేదు.

          ఎందుకు పనిచెయ్యాలో అర్ధం కాకపోవడం వల్ల పనిచెయ్యనివాళ్ళు బద్ధకస్తులు,ఎందుకు పనిచెయ్యాలో తెలియకపోయినా పక్కవాడు చెప్పాడని పనిచేసేవాళ్ళు పిచ్చిపుల్లయ్యలు - అనగా పీడితులు,ఒకపని ఎట్లా చేస్తే అందరికీ మేలు జరుగుతుందో తెలిసి కూడా అట్లా చెయ్యకుండా తమ లాభంకోసమే పనిచేసేవాళ్ళు ఖచ్చితంగా దుర్మార్గులే!ఈ రిజర్వేషన్ల వల్ల పైకొచ్చినవాళ్ళంతా అట్లాంటివాళ్ళే నన్నది జగమెరిగిన సత్యం.యేది సత్యమో అదే శివమైనదీ అవుతుంది!యేది శివమో అదే సుందరమూ అవుతుంది!!

సత్యం శివం సుందరం!!!

Monday, 22 February 2016

నా జీవనపయనం లోకి మలయమారుతంలా వచ్చి ప్రళయాన్ని సృష్టించిన - ఆమె ఎవరు?

          ఆమెది క్లియోపాట్రా యొక్క ముక్కు, ఆమెవి పాలిన్ బోనపార్టే యొక్క కళ్ళు - ఆమెవి సౌందర్యరసాధిదేవత వీనస్ యొక్క వక్షోజాలు!శారీరకంగా చూసినా మానసికంగా చూసినా ఆమెలో స్త్రీత్వం కన్నా పురుషత్వమే ఎక్కువ. నేను ఆమెని మగతనం గల ఆడది అని పిలుస్తాను.

          నేను ఆమెని మొదటిసారి 1945 శీతాకాలంలో ఆమె పూర్వీకుల భవంతిలో కలిశాను.అప్పటికి ఆమె అప్పుడప్పుడే పాకడం నేర్చుకుంటున్న తొలిచూలు బిడ్డకి తల్లి - ఆ బిడ్డ పెద్ద ఏడుపుగొట్టు!చూసీ చూడగానే ముఖం మీద తెలియరాని సంతోషలేమి నీడలు పరుచుకుని ఉన్నప్పటికీ ఆమె చాల గుంభనైన అమ్మాయి అనిపించింది.ఆమె రెండో కొడుకు 1946 డిసెంబరులో పుట్టాడు - అతడొక అవాంచిత శిశువు?ఆ పిల్లాడికి ఒక దోషానికి పరిహారంగా సుంతీ చేయించాల్సి వచ్చింది.1947 కల్లా ఆమె సంతోషలేమి పాత్ర పూర్తిగా నిండిపోయి ఆ అదృష్టం ముఖం మీదకి కూడా ఎగదన్నుకొచ్చి ప్రకాశించసాగింది.

          ఆమె తండ్రి 1946 వేసవిలో ఒక చిన్న ఆస్టిన్ కారు ఇచ్చాడు.ఆమె నన్ను డ్రైవింగ్ నేర్పమని అడిగింది.మొదట్లో ఆమెని డ్రైవింగ్ పాఠాల కోసం పోలో గ్రౌండ్ వరకు తీసుకెళ్ళేవాణ్ణి.ఆమె నేర్చుకోవడంలో చాలా చురుకైనది.కానీ గర్భం ముదిరి ప్రసవపు రోజులు దగ్గిర పడటంతో డ్రైవ్వింగ్ ఆపేశాను.ఈ దశలో రోడ్డు మీదకి వెళ్ళడం కష్టం కాబట్టి ఆ రిస్కు నేను తీసుకోదల్చలేదని చెప్పేశాను.1946 డిసెంబర్ మధ్యలో రెండో కొడుకు పుట్టాడు.1947 ఫిబ్రవరి మధ్యకల్లా మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకోవటానికి సిద్ధమైపోయింది.ఈసారి రోడ్లమీదనే కన్నాట్ సర్కస్ వరకు వెళ్ళాం.ఆమెకి నేను ఒకటే చెప్పాను "నీ గురించి నువ్వు నీ కంతా తెలిసినట్టు వూహించుకో,కాన్సెంట్రేషన్ ముఖ్యం,నీకు ఆపోజిట్ దైరెక్షన్లో వస్తున్న కారు డ్రైవరుకి ఏమీ తెలియదని అనుకో,ధైర్యంగా నడుపు కారుని,కన్నాట్ సర్కస్ చుట్టూ ఒక రవుండ్ వేసిరా".సరిగ్గా అదే చేసి విజయవంతంగా తిరిగొచ్చింది.అంతటితో డ్రైవింగ్ లెస్సన్లు పూర్తయిపోయాయి.

          1947 జూన్ నెలకి ముందనుకుంటాను సినిమాకి తీసుకెళ్ళమని అడిగింది.అప్పటినుంచి నేను ఫ్ర్రీగా ఉన్నప్పుదల్లా సినిమాలకి వెళ్తుండేవాళ్ళం - కాకపోతే నేను ఫ్రీగా ఉండేది తక్కువ.

          రిడ్జి మీదుగా కీకారణ్యం లాంతి ట్రాఫిక్ మధయనుంచి నేను డ్రవ్ చేస్తుంటే చూస్తూ ఉందేది.ఆమెకి చిన్నగా ఉందే కార్లంతే చిరాకు,అందుకని నా పెద ప్లిమత్ కారులోనే వెళ్ళేవాళ్ళం.అడవులు,శిధిలగృహాలు ఎక్కడ ఉంటే అకక్డికి వెళ్ళడం ఆమె కిష్టం.కుతుబ్ మీనార్ దాటిన తర్వాత దూరంగ ఉండే చోట్లకి వెళ్ళడమంటే ఎక్కువ మక్కువ..ఒకరోజు,అలాంటి బేఫర్వా డ్రైవ్ మధ్యలో "నువ్వు నన్ను ప్రేమించటం లేదు" అనేసింది గబుక్కున బ్లేం చేస్తున్నట్టు.నే నన్నాను "నాకు తెలీదు, నేను దాని గురించి ఆలోచించ లేదు".1947 శీతాకాలం వచ్చేసరికి నావైపు నుంచి నేను చొరవ చెయ్యకపోయినా ఆమే నా గురించిన ప్రేమలో తలబంటిగా మునిగిపోయిందని నా కర్ధమైంది.నన్ను చూడగానే ముఖం వెలిగిపోతుండేది.ఆమె తన సొంత విషయాలు కూడా నాతో మాట్లాడుతూ ఉండేది.పెళ్ళయిన కొద్దికాలానికే తన భర్త తనని మోసం చెయ్యడం స్పష్టంగా తెలిసిందని చెప్పింది.తన కుటుంబం లోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించినా అంత గట్టిగా నిలబడి అతన్ని పెళ్ళి చేసుకుంటే అతను చేసిన ద్రోహంతో నిజంగా ఆమె చాలా షాకయ్యింది.మొదట్లో తన చీరలు,బ్లౌజులు,హ్యాండ్ బ్యాగులు మాయమైపోతుండేవి. నౌకర్ల పనేమో అనుకుందట, ఒక పార్టీలో అవి ఇద్దరాడవాళ్ళ వొంటిమీద చూసేవరకు.ఈ ఇద్దరూ తన భర్తతో చాలా స్నేహంగా తిరిగేవాళ్ళు.తన బుక్ షెల్ఫ్ నుంచి పుస్తకాలు కొట్టేసి తన భర్త ఏ ఆడవాళ్ళ కిచ్చాడో వాళ్ళు కూడా తనకు తెలుసునని చెప్పింది.

          వీటన్నింటితో ఆమె నామీద ఆమెకున్న అభిప్రాయం ఏమిటో, నానుంచి ఆమె ఏమి కోరుకుంటున్నదో చెప్పేసినట్తయింది.నెను నాకున్న రెండు ఇబ్బందుల్నీ ఆమెకి చెప్పాను:(1)పెళ్ళయిన ఆడవాళ్లతో వెధవ్వేషాలేసి గొడవల్లో ఇరుక్కోలేను(2)ఆమె తండ్రి పట్ల నాకున్న విశ్వాసం అడ్డం వస్తున్నది.నెం 1 అబ్జెక్షనుకి వెంఠనే జవాబు చెప్పేసింది.కొంతకాలం ముందునుంచే ఆమె భర్తకి దూరంగా ఉన్నానని చెప్పింది.ఇంకా ఇలా అనింది "అతను నన్ను ముట్టుకునే వూహని కూడా భరించలేకుండా ఉన్నాను".ఇంకో రహస్యం కూడా చెప్పింది "అదృష్టవశాత్తు అతను నపుంసకుడైపోయాడు,ఆదపిచ్చి మాత్రం మిగిలింది".నెం 2 అబ్జెక్షను గురించి కోపం కూడా తెచ్చుకుని "దీంతో మానాన్న కేమిటి సంబంధం?నేను మైనర్నా!" అని అడిగింది.

          అప్పట్నుంచీ తను నాదగ్గిరే ఎక్కువగా గడిపేది - తనకి సంబంధించిన విషయంలో నేను తన తండ్రి గురించి ఆలోచించటాన్ని వెక్కిరిస్తూ ఉండేది.అయినా నేను మృదువుగా తిరస్కరిస్తూ వచ్చాను, మానసికంగా నేను సిద్ధపడకపోవటం వల్లనో లేక నాలో అంత వూపు రాకపోవడం వల్లనో నాకే తెలియదు.

          1947 నవంబర్ 18న నన్ను తన రూముకి తీసుకెళ్ళి పెదాల మీద ముద్దుపెట్టి "నేను నీతో పడుక్కోవాలనుకుంటున్నాను.రేపు సాయంకాలం నన్ను అడవుల్లోకి తీసుకెళ్ళు" అని చెప్పింది.నేను నాకు ఆడవాళ్ళ విషయంలో అంత అనుభవం లేదని చెప్పాను."ఇంకా మంచిది" అనేసింది.అలా ఆ 19న,అంటే తన పుట్టిన రోజున,కారుని నగరానికి దూరంగా కారడవి వైపుకి పోనిచ్చి ఒక ఏకాంత ప్రదేశాన్ని చూసుకుని సెటిలయ్యాం.తిరిగి వచ్చేటప్పుదు నాకు ఇబ్బందిగా అనిపించిన తన రొమ్మ్ముల్లో ఉన్న పాల(పిల్లాడికి పాలివ్వటం ఎప్పుడో మానేసింది) గురించి చెప్పాను.తర్వాత తను దాని గురించి ఏదో చెయ్యటంతో ఆ సమస్య తీరింది.నాకు సెక్స్ గురించి ఏమీ తెలియదని కనిపెట్టేసింది, రెండు పుస్తకాలు ఇచ్చింది, వాటిల్లో ఒకటి డా.అబ్రహం స్టోన్ సెక్స్ గురించి రాసింది.రెండూ చదివినాక కొంచెం బాగుంది.

          ఆమె మరీ మదనపీడితస్వైరిణి కాదు,తరచుగా శృంగారం కూడా కోరుకోదు.కానీ శృంగార సమయంలో మాత్రం ఫ్రెంచ్ స్త్రీ కేరళనాయర్ స్త్రీ కలగలిసిపోతే ఎంత కళాత్మకంగా ఉంటుందో అంత కళాత్మకంగా ఉంటుంది.ఆమె పదే పదే ఒకే రకంగా తీగలు సాగుతున్నట్టు పెట్టుకునే ముద్దుల్ని ఇష్టపడుతుంది.శృంగారంలో తనకి కావలసినదాన్ని మాత్రమే తీసుకుంటూ ఇతరులకి కావలసినది ఇవ్వకుండా తప్పించుకోవటంలో మంచి నేర్పుని సాధించి ఉంది.అమె అసదృశ నారి.అది తన స్త్రీత్వాన్ని నిరూపించుకుని ఆత్మరక్షణ చేసుకోవటానికి ఒక ఆయుధం మాత్రమే.ఆమె పడక మీద ఉన్నంతసేపూ రసోద్రేకంతో చెలరేగుతూ అరుదైన నేర్పుతో మెలికలు తిరిగే నాగిని లాంటి భామిని.మేము ప్రేమికులుగా ఉన్న పన్నెండేళ్ళలో ఆమెతో అనుభవం నాకెప్పుడూ తనివి తీరనిదే.

          పోనుపోనూ అప్పుడప్పుడు నాతో ఉండే లావాటి చుట్టాలామె అంటే ద్వేషం పెంచుకునింది.ఎప్పుడు ఆ లావాటి చుట్టాలామె వచ్చేతప్పుడు నన్ను స్నేహంగా కావిలించుకున్నా,చెంప మీద ముద్దుపెట్టినా ఆ లావాటి చుట్టాలామె మీద ఈర్ష్యాసూయలతో దహించుకు పోతుండేది.అప్పుడప్పుడు ఆ చుట్టాలమ్మ్మాయి తననీ నా "ఆమె"నీ సినిమాకి తీసుకెళ్ళమని అడిగేది.అప్పుడు నా "ఆమె" తెలివిగా నేను ఆ లావాటి చుట్టాలమ్మాయి పక్కన కూర్చోకుండా ఉండాలని తను మధ్యలో కూర్చునేది.

          ఒకసారి ఆ చుట్టాలమ్మాయి రేపు వస్తుందనగా "ఆమె" నన్ను చీకటి పడ్డాక వనవిహారానికి తీసుకెళ్ళమనింది.కారులో "ఏమిటీ హడావిడి?నాకు చాలా పనుంది" అనడిగాను.ఆమె "ఆ రుబ్బురోలు ఇక్కడున్నంతకాలం నేను నీకు దూరంగా ఉంటాను.తను నిన్ను ముట్టుకున్నాక నువ్వు నన్ను ముట్టుకోవటం నాకు కంపరంగా ఉంది" అనింది.అప్పుడు నేను లావాటి అమ్మాయి మీద నాకు ఎలాంటి మోహమూ లేదని ఆమెకి చెప్పాను.తర్వాత తర్వాత 'ఆమె' లావాటి చుట్టాలమ్మాయి చేష్టలకి అలవాటు పడింది.

          అప్పుడప్పుడు ఆమె ఎలాగోలా తన భర్త ఉన్నప్పుడు నేను తన రూముకెళ్ళి వాళ్ళిద్దరితో మాట్లాడేలాగ చెయ్యాలని చూసేది.నేను నా కలాంటి దాగుడుమూతల మీద ఆసక్తి లేదని చెప్పాను.దాంతో ఆమె తన భర్తనే అప్పుడప్పుడు నా స్టడీ రూముకి తీసుకొస్తూ ఉండేది.

          ఆమె తన పిల్లల్ని వాళ్ళ తండ్రికి దూరంగా ఉంచటానికి ఎన్ని రకాల పద్ధతులు వీలయితే అన్నీ ప్రయత్నించేది.ఆమె నాతో వాళ్ళ మీద తండ్రి ప్రభావాన్ని ఏమాత్రం ఉంచగూడదనుకున్నట్టు చెప్పింది,ఎందుకంటే అది పిల్లల్ని పాడు చేస్తుందని ఆమె నమ్ముతున్నది.ఆమె నిర్ధారణగా చెప్పింది "నేను నా పిల్లలు అబద్ధాలకోర్లుగా పెరగాలని అనుకోవట్లేదు" అని.ఆమె భర్త మరో గదిలోకి మారడానికి ఇది కూడా ఒక కారణం.

          ఒకసారి తన భర్త నాకు చెప్పిన ఒక విషయం గురించి ఆమె దగ్గిర ప్రస్తావించినప్పుడు ఆమె "తను చెప్పినదాంట్లో ఒక్క మాట కూడా నమ్మొద్దు.నేను ఎంతో నష్టపోవాల్సొచ్చింది అది తెల్సుకోవడానికి" అనింది.

          అతనితో విడాకులు తీసుకోవటం గురించి తన తలిదండ్రుల కిద్దరికీ స్నేహితుడూ తనకి కూడా తన శ్రేయొభిలాషి అనిపించిన ఏ.సి.యన్.నంబియార్ అభిప్రాయం కోసం ఆయనకి ఒక ఉత్తరం రాసింది.ఆయన కొన్ని పరిస్థితుల్లో వూహాస్వర్గపు ఆదర్శాల నుంచి బయటపడి వాస్తవంతో రాజీ పడటం మంచిదని జవాబు చెప్పాడు.ఈ విషయంలో నేనూ ఆమెని ప్రోత్సహించలేదు,ఆమె తండ్రికి ఇబ్బంది గనక.

          ఒకరోజు, తనొక హిందువుని పెళ్ళి చేసుకున్నాననే వూహనే భరించలేకపోతున్నానని చెప్పింది.దానికి నేను "యుగాల తరబడి హిందూమతం సృజించిన పురుషశ్రేష్ఠుల కందరికీ ఇది గొప్ప కాంప్లిమెంటు" అన్నాను.

          నేను ఎప్పుడూ ఆమేని నా బెడ్రూముకి రప్పించుకోవాలని ప్రయత్నించలేదు,ఆహ్వానించలేదు.ఒకే ఒకసారి వచ్చింది.అప్పుడు అర్ధరాత్రి దాటింది.మంచి నిద్దర్లో ఉన్నాను,అర్ధరాత్రి వరకూ పని చేసున్నాను;పక్కన కూర్చుని ముందుకు వంగి మెత్తని ముద్దుతో నిద్ర లేపింది."ఏమిటి సంగతి?" అనడిగాను,ఆమె:"రావాల్సొచ్చింది!" అనింది. మనసులో ఆమె పడుతున్న ఆందోళన ఏమిటో నాకు తెలీదు.నేను చెప్పాను:"సరే,నిశ్శబ్దంగా పడుకుందాం - అనవసరంగా ఏమీ చెయ్యకు".ఆమె అలాగే ఉదయం 4 వరకు ప్రశాంతంగా గడిపింది,తర్వాత లేచి మేద మీదకి వెళ్ళిపోయింది.వెళ్ళే ముందర "నీకు ఇదివరకెప్పుడూ చెప్పలేదు గానీ ఒకసారి నేను  ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను.ఇకముందు మాత్రం అలాంటి ఆలోచనలు రావు.నువ్వు నాకు పోయిన సంతోషాన్ని తిరిగిచ్చావు" అనింది.

          ఒకసారి,మా ప్రేమజీవితపు తొలినాళ్ళలో,ఆమె "నిన్నుకూడేవరకు నాకు నిజమైన శృంగారం అంటే ఏమిటో తెలియదు" అనింది.పడక మీద రసోద్రేకపు తారాస్థాయిలో,ఆమె నన్ను గట్టిగా తనకేసి అదుముకుంటూ "ఓహ్, భూపట్, ఐ లవ్ యూ!" అనేది.ముద్దుపేర్లతో పిలవడం పిలిపించుకోవడం ఆమెకి ఇష్టం.ఆమె నాకు బందిపోటు భూపట్ పేరుని తగిలిస్తే నేను ఆమేకి అతని ప్రియురాలు పుత్లి అపేరు తగిలించాను.మేము ఒక్కళ్ళమే ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళం ఆ పేర్లతోనే పిలుచుకునేవాళ్ళం.ఆమె ప్రేమాతిరేకపు పరవశంలోని పలవరింతల గురించి ఒకసారి రెండు కవితలు చహ్దివాను,బైరన్ రాసిన డాన్ జువాన్ నుంచి:

          ?Man's love is a man's life, a thing apart, It is a woman's whole existence. In her first passion woman loves her lover; In all others all she loves is love".

          ఆమె దానికి,"సరే,ఎన్నిసార్లు చెప్పాలనిపిస్తే అన్నిసార్లు,పక్క మీద కాదు,నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి" అనీంది. నేను నా శక్తివంచన లేకుండా ఆమె ముచ్చట తీర్చాను.నిజానికి,అందులో పెద్ద్ద కష్టమేమీ లేదు,నేనప్పటికే ఆమెతో ప్రేమలో పీకలోతు కూరుకుపోయాను.

          ఒక సాయంకాలం,ఆమె మరీ వికలంగా కనబడింది.ఆమె నన్ను చూడగానే ఏడ్చెయ్యటం మొదలెట్టింది.నేను ఏం జరిగిందని అడిగాను.ఆమె తన డ్రెస్సింగ్ రూము నుంచి బయటికొచ్చి రోజూలాగే పాలు తాగబోయినప్పుడు,అందులో పొడి చేసిన గాజుముక్కలు కనిపించాయి.ఆ గాజుపొడి నురగ మీద తేలుతూ కనిపించింది.వెంటనే నోట్లోనే ఉన్న పాలని వూసేస్సింది.ఆమె తన భర్త దొంగలా తన బెడ్రూము వైపుకి తొంగి చూస్తూ పిల్లిలా జారుకోవడం గురించి చెప్ప్పింది.ఆఖరికి దుఃఖం తగ్గించుకుని, ఆమె తన చెతులతో నన్ను చుట్టుకుని గట్టిగా కావిలించుకుని "ఓహ్,మ్యాకీ,ఐ లవ్ యూ;నాకిప్పుడు నువ్వున్నావు - అదే సంతోషం" అనింది.

          మా మొట్టమొదటి విదేశయాత్రలో ఆమె మోంటె బ్లాంక్ కనుచూపు మేరలో ఉండగానే చాలా ఎగ్జైట్ అయింది.ఆమె మెత్తగా నాతో ,"క్వీన్ బీ అంటే నాకు చాలా ఇష్టం,గాలిలో తేలిపోతూ రొమాన్స్ చెయ్యాలనుంది" అనింది.నేను ఆమె నడిగాను,"నువ్వెప్పుడైనా డేగలా వినువీధి కెగిరి అక్కణ్ణించి ఈ ప్రపంచాన్ని చూస్తున్నట్టు కలగన్నావా>ఒకరోజు అలాంటి ఒక కలనుంచి మేల్కొన్నాక చూస్తే నేలమీద పడి ఉన్నాను,మంచం మీద నుంచి పడి ఎముకలు విరగ్గొట్టుకోకుండా".ఆమెకి తెలుసు నేను తన గాలి తీసేస్తున్నానని.లండన్ చెరాక,మొట్టమొదటి ఫ్రీ లంచ్ టైం దొరగ్గానే ఆమె కోరుకున్న ఒక చిన్న రెస్టారెంటుకి వెళ్ళాం. నేను తననే ఆర్దర్ చెయ్యమన్నాను.చేశాక,నేను కూడా అదే తీసుకుంటానాని చెప్పాను,అదనంగా ఒక ఆరు ఆయిస్టర్స్ చేర్చి.ఆమె తను కూడా అవి తీసుకునింది.ఆమె ఆర్డర్ చేసిన మెయిన్ డిష్ వీల్ చేప.ఆమె "ఇక్కడి కొచ్చిన దగ్గర్నుంచి,వీల్ తినడానికి నాలిక పీక్కుంటున్నాను" అనింది.నేను ఆమెని వాత్స్యాయన కామసూత్రాలు చదివావా అనడిగాను.ఆమె :లేదు,ఏం>: అని అడిగింది.నేను ఆమెకి వాత్స్యాయ్నుడు పెళ్ళికి ఆరునెల్లల ముందునుంచ్గి కొత్తజంతకి వీల్ వడ్డించమన్నాదని చెప్పాను.ఆమె రామాయణ మహాభారతాలు కూడా చదవలేదు.ఆమెకి రామాయణంలో తెలిసిందల్లా వాళ్ళ అమ్మమం చిన్నప్పుడు చెప్పిందే.ఎన్ని విధాల చూసినా,ఆమె ఈ దేశపు సంస్కృతికి సంబంధించిన మనిషి కాదు.

          ఆమెకి కృత్రిమగర్భనిరోధకసాధనాలు వాడటం ఇష్టముండదు.ఒకసారి యాభైల మొదట్లో నావల్ల ఆమె గర్భవతయ్యింది.ఆమె అబార్షన్ చేయించుకోవడానికి నిశ్చయించుకుంది.ఆమె తనకి తెలిసిన బ్రిటిష్ హై కమిషన్ డాక్టర్ దగ్గిరకి వెళ్ళింది:కాని అతను ఒప్పుకోలేదు.దాంతో ఆమె తబ పుట్టింటికి వెళ్ళి అక్కడ ఒక నమ్మకస్తురాలైన లేడీ డాక్తరును ఏర్పాటు చేసుకుంది.ఈ ప్రయాణంలో ఆమె రెండో కొడుకును కూడా తీసుకెళ్ళింది.ఒక పదిహేను రోజుల తర్వాత తల్లీకొడుకులు ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచీ ఉన్న మాట్లాడ్డానికి సంబంధించిన సమస్య ఒకటి పోయిందన్న శుభవార్తతో తిరిగొచ్చారు.ఇదివర్లో ఆ పిల్లాదు "R" పలకలేకపోయేవాడు,తల్లి విపరీతంగా ఆందోళన పడుతూ ఉండేది;తల్లి స్పీచ్ కరెక్షన్ ఎక్స్పర్ట్ కోసం చలా హడావిడి పడింది.తిరిగొచ్చిన రోజు కలవగానే,మందులూ పాడూ అక్కర్లేకుండానే పనైపోయిందని చెప్పింది.

          ఆమె తండ్రికి మా ఇద్దరి అనుబంధం గురించి తెలుసా?తెలుసనే చెప్పాలి.ఎప్పుడు ఆమెతో కలిసి డిన్నరుకు వెళ్ళాలన్నా,ఆమె ఎక్కడ ఉంటుందో తనకి తెలుసు.బయలుదేరటానికి సరిగ్గా పదిహేనునిమిషాలకి ముందు,ఆమె తయారై నా రూము కొచ్చి కూర్చుంటుంది.సరిగ్గా టైముకి ఆయన నా గదిముందు నుంచి వెళ్తూ ఆమెని పిలిచేవాడు.

          1958 శీతాకాలంలో అనుకోకుండా ఒక దృశ్యాన్ని చూడాల్సొచ్చింది.లంచ్ చేసిన్ వెంటనే,ఒక ముఖ్యమైన విషయం చెప్పటానికి వెళ్ళాను.ఆమె అప్పటికే తలుపు మూసేసుకుని ఉంది,నేను తలుపు తట్టాను;ఒక అయిదు నిమిషాల తర్వాత తలుపు సగం తెరిచి సందులోంచి తొంగిచూసింది.కర్టెన్లు కిందకి దించి ఉన్నాయి,పొడుగాటి అందమైన యువకుడు,గడ్డం ఉన్న - ఒక బ్రహ్మచారి - రూములో ఉన్నట్టు కనిపించింది.నేను "నేను నీకో విషయం చెప్పాలి;సరే,తర్వాత చెప్తాన్లే" అంటూ తిరిగొచ్చేశాను.దాంతో మా ఇద్దరి బంధం తెగిపోయింది.ఆమె అది కేవలం "యోగా" అనీ "ఆధ్యాత్మికం" మాత్రమే ననీ నమ్మించడానికి చాలాసార్లు ప్రయత్నించింది.నేను తన సమర్ధనలన్నీ అనవసరం అన్నట్టు ఉండిపోయాను.నెమ్మదిగా ఆమె నామీద కోపం పెంచుకోవడం మొదలుపెట్టింది.నిజం చెప్పాలంటే,చివరాఖరికి బద్ధశత్రువుగా మారింది - నాకెప్పుడూ విలియం కాంగ్రేవ్ కవిత  గుర్తుకొస్తూ ఉండేది.

"Heaven has no rage like love to hatred turned; 
nor hell a fury like a woman scorned."

          ఆ సన్నివేశం జరిగిన పదిహేను రోజుల కల్లా అమే నాకు ఇష్టంగా రాసిన ప్రేమలేఖల్ని వెతికి ఆమెకి తిరిగిచ్చేశాను.ఒక సంవత్సరం తర్వాత పాత అకాగితాల్లో కొన్ని దొరికినాయి.వాతిని కూడా తిరిగిచ్చేశాను ఆమెకి.

          ఆమె భర్త చనిపోయేముందు రెండేళ్ళలో ఆమె భర్తా ఆమే కొంత దగ్గిరయ్యారని కొందరిలో ఒక అపోహ ఉన్నది.ఎవరేమి అనుకున్నా,వాళ్ళ మధ్యన రగిలింది హృదయాలు తిరిగి కలవననతటి కలహాగ్ని.అతను జబ్బు పడినప్పుడు దయగా ఉండటం సేవలు చెయ్యటం నిజమే.ఈ కాలంలో జరిగిన కొన్ని సన్నివేశాలు - అతన్ని సమాధి చేసినప్పుడు,భర్త అస్థికల్ని తీసుకోవటం అన్నీ ఒక ప్రచారవ్యూహంలోని భాగాలు.అవన్నీ ప్రజల్ని నమ్మించడం కోసమే,ఎందుకంటే అప్పటికే తను పూర్తి స్థాయి రాజకీయ జంతువుగా మారిపోయింది.

నేను ఎవరు?
23rd June, 1977

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...