Monday 28 March 2016

లెఫ్టు బిహైండు పార్టీల మైండు లేని రాజకీయం - లెఫ్టోవరు వోట్ల కోసం!

          కాలం కలిసిరాకపోతే తాడే పామై కరుస్తాదంటారు,ఓడలు బళ్ళవుతాయంటారు,పువ్వులమ్మిన చోట రాళ్లమ్మాల్సి వస్తాదంటారు - ఈటన్నిటికన్నా దయనీయంగా పోలిక చెప్పడానికే కుదరనంత పరమ దరిద్రంగా ఉందండయ్యా భారద్దేశంలో వామపక్షాల దుర్గతి!తన రాజకీయ జీవితమంత వయస్సు లేని కన్హయ్యా కుమారుడికి నారాయణ గారు విమానాశ్రయానికి వెళ్ళి ఎదురేగి తోడ్కొని రావడం దగ్గిర్నించీ కారు డోరు తీసి పట్టుకుని హడావిడి చెయ్యడం వరకూ చేసిన మర్యాదలకి నిజంగా అతను ఉద్దరించిన ఘనకార్యం ఏమిటి?

          ఒకప్పుడు ఎట్టా వుండేవోళ్ళు?ఎట్టాంటోళ్ళు ఎట్టా అయిపోయారు!బెంగాలు కమ్యునిష్టులు "మిగతా భారద్దేశమంతా వందేళ్ళ తర్వాత ఆలోచించే విష్యాలు బెంగాలు ఇవ్వాళ ఆలోసిస్తాది" అంటే నోరెళ్ళబెట్టి చూసినోళ్లే దప్ప "ఠాట్!ఏంటి నీ గొప్ప?" అన్నోడు లేడు.ఎక్కద నలుగురు పోగయితే అక్కడల్లా ఈళ్ళ గొంతే ఇనపడేది.గత చరిత్ర గమనం గురించి ఏది ఎందుకు జరిగింది,ఏది ఎందుకు జరగలేదు,ఎట్టా జరిగితే బాగుండేది అని చిలవలు పలవలుగా కళ్ళక్కట్టినట్టు చెప్పి ఒప్పించి నమ్మించగలిగిన తెలివి అంతా యాడికి బొయ్యిందో పాపం!

          జరిగిన దాన్ని గురించి ఎందుకు జరిగిందో చెప్పడానికి ఏ చిలక జోస్యమూ అక్కర్లేదు,ఏ పాండిత్యమూ అక్కర్లేదు,ఫ్యూచరు గురించి చెప్పండ్రా అంటే మాత్రం గుడ్లు తేలేస్తారు - అబ్బే విప్లవం అంటే వీజీ కాదు అని డబ్బాయిస్తారు!సైన్సు ఫిక్షన్ రచయితల పాటి కూడా నిక్కచ్చిగా చెప్పలేరు గానీ వాళ్లు జరుగుతుందనుకున్నది జరక్కపోయినా జరగదనుకున్నది జరిగినా కవరప్ చేసుకోవడానికి పనికొచ్చే చారిత్రక తప్పిదాలకి కారణాలు మాత్రం భలేగా  వండి వారుస్తారులే!

          మీ లక్ష్యం ఏమిటయ్యా అంటే అందర్నీ వర్గరహితసమాజంలో నిలబెట్టడం అని చెప్పడం వరకూ ధీమాగానే చెప్తారు గానీ అదెట్టా ఉంటుందీ అని నిలదీస్తే మాత్రం నత్తినత్తిగా విసుక్కుంటారు, గట్టిగా అడిగితే అడ్దం తిరిగి నువ్వు విప్లవద్రోహివి అర్ధమయ్యే నటిస్తున్నావు అని మనకే పువ్వులు పెడతారు,అదేంటో!పోనీ అడిగేవోడు అర్ధమయ్యే ఎటకారం ఆడుతున్నాడని అనుకుందాం,తనకి తెలివితక్కువగా అనిపిస్తేఅనే గదా ఎటకారం ఆడేది ఎవడయినా - నీ తెలివైన సిద్ధాంతం గురించి ఇంకొంచెం తెలివిగా చెప్తే ఎట్టా ఉంటది!అసలు పూర్తిగా విడమరిచి చెప్తే ఎటకారం ఎందుఒస్తుందీ అంట!బుద్ధుడి లాంటి సన్నాసుల మాటల్నే నమ్మినవాళ్ళు వీళ్ళ మాటల్ని ఎందుకు నమ్మటం లేదు?ఇంతకుముందు ఎవరూ చెప్పని కొత్త సిద్ధాంతం అంటారు, కొత్తది గాబట్టే అర్ధం కాకనే గదా అడిగాం, పూర్తిగా తెలుసుకోకుండా పరిగెత్తుకుని పోయి అగ్గిలో దూకటానికి మనమేం వేముల రోహిత్ లాంటి ఎర్రిపప్పలమా?

         కాలేజీలో క్లాస్ పుస్తకాలు తప్ప ఇంకోటి చదవకుండా ర్యాంకులు తెచ్చుకుని ఘనమైన యూనివర్సిటీలో రీసెర్చి స్కాలరుగా చేరేవరకు పెద్ద ఉద్యోగం చెయ్యాలనే రంధి తప్ప ఇంకేమీ లేనివాడు వీళ్ళ పైత్యపు కబుర్లకి లొంగి ఎట్టా అయిపోయాడో చూదండి.కార్ల్ సగన్ లాగ సైంటిష్టు కావాలనుకున్న వాడు టెర్రరిస్టుల్ని సమర్ధించి గూండాగిరీకి కూడా దిగజారి కోర్టుకేసులో ఇరుక్కుని రాజీ చెసుకుందామనుకున్నప్పుడు కధ తిరిగిన ట్విస్టుకి తన చుట్టూ తను వూదుకున బుడగ బరెస్టయ్యి తను హీరోయిజం అనుకున్న వేస్టు బతుక్కి డెంటిస్టు కూడా కాలేనని తెలిసి బతుకంటే ఇంటరెస్టు పోయి ట్రూరెపెంటెన్సు పుట్టిన ట్వెంటీఫోరవర్సు కూడా గడవకముందే అన్రెస్టు ఎవరెస్టంత పెరిగి సెటైరు కోసం వీసీని ఉరితాళ్ళు అడిగిన మేతావి నిన్నటివరకూ తను జండాలా ఎగరేసిన గుడ్డనే ఉరితాడుగా వాడుకుని మోస్ట్ సింబాలిక్ చావు చచ్చాడు!రేపు ఈ కన్హయ్యా ఏ జఫ్ఫయ్యా అవుతాడో?

ఒకడేమిటో వాడి చావు చెబుతుందంటారు, వాడి బతుకులో ఉన్న కంఫ్యూజనే చావులోనూ ధగధ్ధగాయమానంగా ప్రకాశిస్తున్నది!రాసి కొట్టేసిన భాగం కొంత ఉందని తెలియని కాలంలో చదివిన ఆఖరి ఉత్తరం చదివి నేను చాలా ఫీలయ్యాను.కానీ,రాసి కొట్తేసిన భాగం చదివాక మళ్ళీ కంఫ్యూజన్ కూడా అదే స్థాయిలో మతి పోగొట్టేసింది.The letter purportedly written by Rohith Vemula, the Dalit scholar of University of Hyderabad, before he committed suicide, has been sent to the forensic lab for analysis as reports emerged about an entire paragraph that had been scratched off the note. On close examination, the portion of the note that Vemula, perhaps on second thoughts, decided to keep concealed, reads: "ASA, SFI, anything and everything exist for their own sake. Seldom the interest of a person and these organisations match. To get power or to become famous or to be important in between boundaries and to think we are up to changing the system, very often we overestimate our acts and find solace in traits. Of course I must give my credit to these both groups for making introducing me to wonderful literature and people. (sic)" According to media reports, this part of the letter is reflective of the sense of futility that the scholar felt in being associated with the student unions.చచ్చిపోయటప్పుడు విరక్తి కన్నా భావుకత్వం పొంగిపొర్లడ మేంటి?అంత ఘాటుగా యూనియన్లని ఉతికినవాడు ఎందుకు కొట్టేశాడు?కొట్టేసినవాడు పనిగట్టుకుని ఇది నేనే కొట్టేశాను అని పక్కన రాసి సంతకం చెయ్యడ మేంటి?ఈ రాసి కొట్టేయ్యడం, మళ్ళీ పక్కన నేనే కొట్టేశానని సంతకం చేసినవాడు అయితే పిచ్చివాడయినా అయి ఉండాలి,లేదంటే అతి మంచివాడయినా అయి ఉండాలి!మొదట మనసులో దాచుకోకుండా ఉన్న నిజాన్ని కక్కేశాడు,తర్వాత తీరిగ్గా ఆలోచించి కొట్టేశాడు.ఏమని ఆలోచించాడు?మరీ అంత దుర్మార్గంగా తిడితే తన ఫ్రెండ్సు రేపటి నుంచీ ఇలాంటి హీరోయిజం చూపించటానికి ఇబ్బంది పడతారని అనుకున్నాడు కాబోలు!అంటే,తను వేటికి విరక్తి పుట్టి చచ్చిపోతున్నాడో అవి తన ఫ్రెండ్సు ఆపకుండా చెయ్యాలని అనుకున్నాడు కాబోలు!అదీ గాక,తన శవాన్ని మొదట తన ఫ్రెండ్సే చూస్తారనీ,పోలీసులు ఈ పార్టు కొట్టేసింది తను కాదని తన ఫ్రెండ్సుని అనుమానిస్తారేమోనని జరగబోయేదాన్ని కూడా వూహించి తన చుట్టూ ఉన్నవాళ్లకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఒక రోజు క్రితం వరకు అంత ధైర్యంగా ఉన్నవాడు ఆ ఒక్క రోజులో అంత డీలా పడిపోవడం ఎవరివల్ల జరిగిందో వాళ్ళని తన  చావు వల్ల కూడా ఇబ్బంది పడనివ్వకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవటం - ఇంత గందరగోళపు చావు నేనెక్కడా చూళ్ళేదు?!

          ఆ చావే అంత గందరగోళంగా ఉంటే దీన్ని క్యాష్ చేసుకుని పాప్యులారిటీ పెంచుందామనుకున్న ఎరుపు కైపెక్కిన వాళ్ళ గందరగోళం మరింత గందరగోళంగా ఉంది.వాడు స్పష్తంగా "నేను ఆతమహత్య చేస్కుంటున్నాను.నా చావుకి ఎవరూ బాధ్యులు కారు." అని రాసిపెట్టి చచ్చిపోతే అది హత్య అనీ హంతకుల్ని శిక్షించాలనీ అల్లరి చహెశారు,చేస్తున్నారు,చేస్తారు.నిజంగా హంతకుల స్థానంలో ఎవర్నయిన అనిలబెట్టాలంటే  65464 మరియూ 6666 వాళ్లనే నిలబెట్టాలి!ఎందుకంటే,తన రాసి కొట్టేసిన భాగంలో ఎవరి గురించయినా నెగటివ్ ధోరణిలో రాశాదంటే అది వాళ్ల గురించే,మరి వాళ్ళని హంతకుల స్థానంలోకి ఎవరు తీసుకొచ్చి నిలబెదతారు?


          ఇప్పటివరకు రోహిత్ గురించి చర్చించిన వారిలో ఏ ఒక్కరికీ రోహిత్ స్టైపండ్ ఎందుకు ఆగిపోయింది అనే అనుమానం రాలేదు,ఎందుకని?మీడియా యూనివర్సిటీ అధికార్లని అడిగీతె “పేపరు వర్కు వల్ల జాప్యం” అనే ఒక ముక్క మాత్రమే బైటికి వచ్చింది.అధికార్లు విషయం వివరంగానే చెప్పే ఉంటారు,కానీ మొత్తం చెబితే రోహిత్ మీద సానుభూతీ తమ MRTP కొసెం సెన్సేషనూ పుట్టవని కాబోలు మీడియాలో ఎవరూ దానిగురించి ఎక్కువగా కవర్ చెయ్యలేదు.రోహిత్ అక్కడ రీసెర్చ్ వర్కుకి ఎన్రోల్ అయ్యాడు. రీసెర్చ్ వర్కు అంటే ఎన్రోల్ అవటం ఒక్కటేనా ముఖ్యం.వర్క్ చెయ్యాలిగా,చెసినట్టు రిపోర్ట్స్ ఇవ్వాలిగా.నెలవారీ ప్రోగ్రెస్ మదింపు చెయ్యాలని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏమిటో ఇక్కడ వివరంగా చదవవచ్చు.6వ సెక్షనులో అటెండెన్సుతో కలిపి రీసెర్చ్ వర్కుకి సంబంధించిన వివరాలు చూదొచ్చు,7వ సెక్షనులో స్కాలర్షిప్పులకి సంబంధించిన నెలవారీ మదింపు గురించిన నియమాలు చూడొచ్చు.స్కాలర్ షిప్ కూడా ఎన్రోల్ అయితే చాలు వర్క్ చేస్తున్నాడా లేదా అని చూడకుండా నెలనెలా ఇస్తూనే ఉంటారా తేరగా?వాళ్ళకి స్కాలర్షిప్ పేరుతో ఇచ్చేది ప్రజాధనం,కూర్చోబెట్టి మేపడానికి స్మృతి ఇరానీ గానీ జైట్లీ గానీ వాళ్ళ జేబులోనుంచి తీసి ఇవ్వరు కదా!అధికారంలో రాహుల్ గాంధీ ఉన్నా, హరగోపాల్ ఉన్నా,కంచె ఐలయ్య ఉన్నా తన జేబులోనుంచి ఇస్తాడా?ఆ రీసెర్చ్ వర్కుకి అటెండెన్సు ఉంటుంది,ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉంటాయి. కార్ల్ సేగన్ కొటేషన్లు చెప్తూ ప్రకృతిని గురించి చెప్పిన కబుర్లన్నీ గాలికొదిలేసి 24 గంటలూ ల్యాబులో ఉంటే ఉద్యమానికి టైము సరిపోవటం లేదని సైన్సు గూపు నుంచి ఆర్ట్స్ గ్రూపుకి మారాడు.ఇక్కడ కూడా ఈ ఉద్యమాల కోసం తిరుగుతూ అటెండెన్సు బొక్క పడి ఉండవచ్చు,ప్రోగ్రెస్ రిపోర్టులు సబ్మిట్ చెయ్యటం తనవైపునుంచే ఆలశ్యం అయి ఉండవచ్చు! ఇతను పేపర్లు స్బ్మిట్ చెయ్యడం అంటూ జరిగితే స్టైపండ్ ఆపటానికి వాళ్ళకీ దమ్ములు ఉండవు – కోర్టుకీడ్చి ముక్కుపిండి రెట్టింపు వసూలు చేసుకోవచ్చు,అవునా కాదా?బతుకులో బాధ్యత లేనివాడు చావుతో వీరాధివీరుడిగా కొనియాడబడుతున్నాడు?ఈ ముక్క నేను సారంగలో కామెంటుగా వేస్తే మొదట కొంతసేపు ఉంచారు,తర్వాత తీరిగ్గా ఒకరు రోహిత్ స్టైపండ్ ఎందుకు ఆగిపోయిందో అనుమానించండి అంటూ సులువుగా, హేళనగా ప్రశ్నిస్తున్న హరిబాబు గారు, రోహిత్ ఊపిరి ఎందుకు అర్ధాంతంగా ఆగిపోయిండి అనే మౌలిక ప్రశ్న కూడా ఈ దేశాన్ని అత్యున్నత స్థానం నుండి అణగారిన వెలివాడల వరకూ ప్రశ్నిస్తూనే ఉంది. అంటూ నాకు ఉబోస ఇచ్చాక వారి ఉబోసని ఉంచి నా కామెంటుని తీసేశారు,ఏమి నిష్పక్షపాతం ఈ ఎర్ర మేధావులది?అక్కడికి నేను జాలీదయా లేని కఠినుణ్ణీ,వీరు మాత్రమే కరుణామృతహృదయులైనట్టు,అంత జాలి ఉంటే నాచావు నన్ను చావనివ్వండి అన్న చచ్చినోడి వేదనని అరణ్యరోదన చెయ్యరు కదా, రంగరంగ,!

          ఇప్పుడు రాజద్రోహం కేసులో జైలుకెళ్ళొచ్చిన కన్హయ్యా కూడా ఇంకా రోహిత్ చావు కుట్ర కిందే లెక్కేస్తున్నాడు.పది రోజుల క్రితం సుశీల్ కుమార్ అనే సాటి విద్యార్ధిని తను అంతకుముందు వివేకానందుడితో సహా ఎవ్వర్ని బడితే వాళ్ళని గురించి తను వాడిన మాటల్తో పోలిస్తే చాలా చిన్న మాటని వాడితే అర్ధరాత్రి 3 గంతల టైములో నలభైమందిని పోగేసుకుని పోట్లాడగలిగిన వాడిమీద ఎగస్పార్టీ వాళ్ళు కుట్ర చెయ్యగలరా?కుట్ర అంటే పక్కన జేరి మాయమాటలు చెప్పి వీలు చూసుకుని చంపటం - ఆ ఆవకాశం ఉంటే గింటే ASAలో  ఉన్నవాళ్ళకే ఉంటుంది గానీ బయటివాళ్ళకి అతన్ని కుట్రపూరితంగా చంపటం సాధ్యమా!కుట్ర కేసు పెట్టాలన్నా ASA వాళ్లనే బుక్ చెయ్యాల్సి ఉంటుంది,ఏంటి వీళ్ళ బుర్ర తక్కువ వాగుడు!

          మనం బలానికి బూస్టూ వయాగ్రా వాడినట్టు వీళ్ళకి వూపు రావాలంటే ఎరుపు కనబడుతూ ఉండాలేమో!అందుకే ఇలా జనాన్ని విడదీసి ఒకడి మీదకి మరొకణ్ణి ఎగదోసి రక్తపుటేరులు పారిస్తున్నట్టున్నారు.ఇద్దరు సఖ్యంగా ఉన్నవాళ్లని విడదియ్యాలంటే ఏం చెయ్యాలి>ఇద్దర్లో దద్దమ్మ ఎవడో కనిపెట్టి,మెల్లగా వాణ్ణి బుట్టలో వేసుకుని,రెండోవాడి మీద అబద్ధాలు చెప్పి నమ్మించాలి!అది చాలు విన్నవాడు అవతలివాడు తనకి చేసిన ద్రోహానికి ప్రతీకారంగా చేస్తున్నట్టు తనని తనే జస్టిఫై చేసుకుంటూ అవతలి వాడిమీద దాడి చెయ్యటానికి!వాళ్లలో ఎవడు గెలిచినా పర్లేదు వీళ్ళకి,వీళ్ళు సృష్టించిన రెండు వర్గాల్లో ఒక వర్గం పూర్తిగా నశించిపోతే ఇంక అక్కడ మిగిలింది వర్గరహితసమాజమేగా!

          వాళ్ళేమి కోరుకుంటున్నాఓ మనకి స్పష్టంగానే తెలుస్తున్నది,కానీ వాళ్ళకి తెలుస్తున్నదా!టెర్రరిస్టుల్ని అమరవీరులుగా చిత్రించటానికీ, ఇంటికో టెర్రరిష్టుని పుట్టించమని దేశంలోని తల్లిదండ్రులకి విజ్ఞప్తుల్ని చెయ్యనివ్వటానికీ, ఈ దేశాన్ని ముక్కలు చెయ్యండని విదేశీయుల్ని ఆహ్వానించడానికీ, ప్రపంచ దేశాలు గుర్తించిన భారత భూభాగంలో విదదీయరాని భాగమైన కాశ్మీరు గురించి నోటికొచ్చినట్టు వాగడానికీ అనుమతిస్తేనే నిజమైన భావస్వాతంత్ర్యం, అంతేనా?వాళ్ళు భావస్వాతంత్ర్యాన్నే కోరుకున్నారు గాబట్టి అందులో తప్పేమీ లేదని కొందరు గోడమీదిపిల్ల్లులు వాదించదలుచుకుంటే వాళ్ళకి కూడా కలిపి ఈ మేధావులకి ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను.ఏ విధమయిన అనుమానమూ లేకుండా వాళ్ళు ఉగ్రవాదులని మీకు తెలుసు వాళ్ళు ఈ దేశాన్ని విచ్చిన్నం చెయ్యాలని దొంగతనంగా సరిహద్దులు దాటి వచ్చి ఈ దేశప్రజల్లో కొందర్ని హతమార్చడమూ మీకు తెలుసు..అయినా సరే,భావస్వాతంత్ర్యం పేరుతోనూ,మరొక రకం తిక్క విశ్లేషణ తోనూ ఇవ్వాళ ఒక ఉగ్రవాదిని నువ్వు అమరవీరుణ్ణి చేసి పొగిడితే రేపు పదిమంది పుట్టరా?నీ చేతల మూలంగానే ఇవ్వాళ్టి రోజున ఉగ్రవాదానికి నువ్వు సపోర్టు ఇస్తూ మళ్ళీ రేపటి రోజున ప్రభుత్వాన్ని ఉగ్రవాదాన్ని నిరోధించడంలో విఫలమైందని విమర్శిస్తావు - నువ్వు నోటికి తింటున్నది అన్నమా,గడ్డియా,మరొకటా?

          ఒక పిచ్చి డాక్టరు రోహిత్ చట్టం కావాలంటాడు,ఒక శర్మ హిందూ ఫాసిజం అంటాడు,ఒక రాజు    ఈ కుర్రాళ్ళని చూస్తుంటే మళ్ళీ నా కుర్రతనం వస్తునదంటాడు,ఒక భాస్కరుడు భావజాల యుద్ధం అంటాడు - ఏమిటి వీళ్ళ పాండిత్యం!రోహిత్ చట్టంలో ఎలాంటి సెక్షన్లు ఉండాలో స్పష్టత ఉందా?ఇంటికో యాకూబ్ మెమన్ పుడితే వాళ్ళు వీళ్ళని వొదుల్తారా?రోమిల్లా డప్పారు ఇన్నేళ్ళు వినిపించిన ఆర్య-ద్రవిడ సిద్ధాంతం దగ్గిర్నుంచీ కమ్యునిష్టులు చెప్పిన అబద్ధాలన్నీ ఒకటొకటిగా బయటపడుతుంటే ఇవ్వాళ వీళ్ళు చెప్పే కొత్త అబద్ధాల్ని ఎవడు నమ్ముతాడు?

          "If you can't explain it simply, you don't understand it well enough." - Albert Einstein.వీళ్లలో ఉన్న గందరగోళానికీ,ఈ తలాతోకా అలేని చెత్త వాగుడికీ కారణం అదే!ఇన్నాళ్ళూ నెహ్రూ వారసత్వం పుణ్యాన యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా చేరి చెప్పిన అబద్ధాలన్నీ బయటపడుతుంటే ఎట్లా సమర్ధించుకోవాలో తెలియని గనదర్గోళంలో ఉన్నారు వీళ్ళంతా!నేనో మీరో పనిగట్టుకుని తప్పులు పట్టనక్కర లేదు,కొంచెం బుర్రంటూ ఉపయోగిస్తే వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ మాటల్లో ఉన్న బేఖారీతనం!రాణి శీవశంకరశర్మ అనే ఒక దుర్బ్రాహ్మణుడు చూదండి ఎంత నీచంగా అవమానించాడో నన్ను!పనిగట్టుకుని సంభాసహణకి పిలిచి నేను అడిగిన ప్రశ్నలకి జవాబు ఇవ్వకుండా నన్ను హిందూ ఫాసిస్టు అంటున్నాడు,ఇలాంటి అధమసంస్కారం గలవాళ్ళు ఎంత ఎక్కువ ద్వేషం వెళ్ళగక్కితే అంత ఎక్కువ మేరకు హైందవధార్మికక్షాత్రం పదునెక్కుతుంది."Anger is an acid that can do more harm to the vessel in which it is stored than to anything on which it is poured". - Mark Twain.వీళ్ళలో ఉన్న అసహనమే వీళ్ళకి అంతటా ఉన్నట్టు కనబడుతున్నది.కానీ,గత నూరేళ్ళుగా వీళ్ళు వండివార్చిన ద్వేషపు ప్రభావం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజల్ని ఏమాత్రం కదిలించలేక పోయింది.ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్ధించి ఈ దేశాన్ని నిలువునా చీల్చినా,ఇన్ని దశాబ్దాలుగా మతకలహాల్ని రెచ్చగొట్టినా ఆ కొద్దిరోజులు గనదరగోళానికి గురయినా నిజం నిలకడ మీద తెలియటంతో జనం ఐకమత్యంగానే ఉన్నారు,ఉంటారు!


          శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గా,మస్తాన్ వలి దర్గా,షేక్ దావూద్ వలి దర్గా - నెల్లూరు జిల్లాలో ఈ మూడు అత్యంత ప్రముఖమైన దర్గాలు.వీటిని ముస్లిములతో పాటూ హిందువులు కూడా సందర్శిస్తారు - ఎంతో భక్తిగా!కడపలో పెద్ద దర్గా అని పిలుచుకునే అమీన్ పీర్ దర్గా ఉంది.ఈ దర్గాను స్థానికులు పెద్ద దర్గా అని పిలుస్తారు.ఇది మతాలకు అతీతంగా ఉంటూ హిందువులు,ముసిములు,క్రైస్తవులు నిత్యం సందర్శించడం వల్ల మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది.ఇవే కాదు,మొత్తం భారతదేశంలో  చాలా చోట్ల ఉన్నాయి,ఈ ప్రాంతాల్లో ఎక్కడా హిందువుల మధ్యా ముస్లిముల మధ్యా చిన్నపాటి గొడవలు కూడా లేవు.ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఇమాం బేగ్ బావి ఉంది.ఇది రామభక్తుడైన ఇమాం బేగ్ గారు యాత్రికుల సౌకర్యం కోసం కట్టించినది.అందువల్ల ఈ దేవాలయంతో ముస్లిములకు కూడా ఆధ్యాత్మికమైన అనుబంధం ఏర్పడింది.తిరపతి బాలాజీ అయితే బీబీ నాంచారు మూలంగా ముస్లిములకి కూడా ఇష్టమైన వాడే!మొన్నామధ్యన ఒక ముస్లిం కుర్రాడు వాళ్ళ నాన్న మొక్కుకుని బతికుండగా తీర్చలేకపోయాదని చెప్పి స్వామివారికి సువర్ణపుష్పాలు సమర్పించి వెళ్ళాడు.బహుశా ఇకముందు వీటిమీద కూడా సూడో సెక్యులరిష్టుల కన్ను పడితే వాటిని అట్లా ప్రశాంతంగా ఉండనివ్వరేమో?

          మీకా భయం అక్కర్లేదు!వెటి దగ్గిరకెళ్ళీ రాజకీయం చెయ్యదలుచుకుంటే హిందూ భక్తులూ,ముస్లిం భక్తులూ జాయింటుగా విరుచుకుపడి కీళ్ళు విరిగేలా తన్ని పంపిస్తారు.ఎందుకంటే ఇప్పుడు మీడియాకెమేరాల ముందు హడావిడి చేసేవాళ్ళూ,పత్రికల్లో విషపురాతలు రాసి పేరు తెచ్చుకుంటున్నవాళ్ళూ అసలు సమాజంలో కొస్తే ఎంతటి అనామకులంటే వీళ్ళ పక్కింటివాళ్ళకే వీళ్ళెవరో తెలియదు - నిజం!ఈ అయిదు ఖండాల భూమి మీద అంగుళం మేరలో కూడా దోపిడీ అనేది లేని ప్రపంచాన్ని సృష్టించే మహదాశయంతో ఉర్రూతలూగిపోతూ ఎప్పుడో స్థాపించబోయే వర్గరహితసమాజం గురించి చింకి లెక్చర్లు దంచుతూ యూనివర్సిటీ సెమినారు హాళ్ళలో వేముల రోహిత్ లాంటి పిచ్చపుల్లయ్యలతో చప్పట్లు కొట్టించుకునేవాళ్ళు తమ ఇంటిపక్కనే ఉన్న రేషన్ షాపులో జరుగుతున్న చిన్నపాటి దోపిడీని కూడా అరికట్టలేకపోతున్నారు, ఎందుకని?సిద్ధాంత బలం లేకనా,మంది చాలకనా,వాళ్ళ వీధివాళ్లకి వర్గరహితసమాజం అక్కర్లేకనా,వీళ్ళకి తగినంత వూపు రాకనా - ముహూర్తం బాలేకనా!రోమిల్లా ఆంటీ తన అబద్ధాల చరిత్ర అటకెక్కేసరికి "who cares now?" అంటూ తెల్లముఖం వేసి తోక ముడిచింది,ముగ్గు బుట్ట ముసిల్ది మురమ్నా మామ్మ మిగిలుంది తుక్కు రేగ్గొట్తించుకోవటానికి - ఆ తర్వాత నారాయణలూ సీతారాముళ్ళూ చేసుకోవాల్సింది చెక్కభజనె:-)

          కమ్యునిష్టులకి అసలు సంగతి తెలియడం లేదు,మోడీ వీళ్ళ వల్లే అధికారంలోకి రాగలిగాడు - నిజం!మీకు అనుమానంగా ఉంటే నేను ఎప్పుదో రాసిన చిత్రమైన గొప్పవాళ్ళు పోష్టులో మోదీ గురించి రాసిన విశ్లేషణ చదవండి.కమ్యునిష్టులకి నేనొక ఉబోస ఇస్తున్నా "ఇవ్వాళా రేపూ కూడా మోదీకి ంకా  బలం పెంచటానికి తప్ప మీ ప్రస్తుత రాజకీయ వ్యూహాలు మీకు మేలు చెయ్యవు" అని - వింటారా?వినరా!అది విన్నా వినకపోయినా మీకో ఝలక్ ఇది:

మీ పుర్రచెతిని అడ్డుపెట్టి హైందవసూర్యోదయాన్ని అడ్డుకోలేరు - ఎరుపు వెలిసిపోతే మిగిలేది కాషాయమే!

8 comments:

  1. ఎర్ర (ఎర్రి) పార్టీలకు సామాజిక అవగాహన సున్నా. కారంచేడు దమనకాండను "రైతు కూలీలపై భూస్వాముల దౌర్జన్యం" అంటూ తెగ బాధ పడ్డారు. ముద్దాయిలలో అత్యంత శాతం అగ్ర వర్ణాలకు చెందిన కూలీలేనన్న విషయం వీరికి తెలీలేదు పాపం. బాదితులను పరామర్శకు పెద్దకుల నాయకులను పంపిస్తే కాలిన దళితులు బడితెలు తీసినా వీరికి బుద్ధి రాలేదు.

    ReplyDelete
  2. ఎదుగుదల అన్ని రకాలుగా ఎప్పుడో ఆగిపోయిన పార్టీ ఎర్ర పార్టీ. ఉన్నవాళ్ళంతా సీతారాం లూ నారాయణలూ, రాఘవుళ్ళూ, ఛటోపాధ్యాలూ, ముఖోపాధ్యాలూ:) అందరూ దళితులు, పీడిత వర్గాలకోసం పోరాడ్తామంటారు, వాళ్ళనించి ఒకళ్ళనీ నాయకుడిగా ఎదగనివ్వరు, చిత్రం. ప్రస్థుత ఎన్నికల తరవాత కన్నయ్య ఎర్రపార్టీలకి చీకటి జెల్లకొట్టి కాంగ్రెస్ లో చేరబోతున్నాడు. :)

    మతసహనం వీరికేం తెలుసు? ఇదిగో ఇదీ మత సహనం

    https://kastephale.wordpress.com/2014/05/26/%E0%B0%B6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%87%E0%B0%AA%E0%B0%82%E0%B0%95%E0%B0%AC%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2-88/

    ReplyDelete
  3. హరిబాబు గారు ఆఖరి చురక చాలా బావుంది. కాషాయం వీరి అనారోగ్యానికి మంచి ఘాటయిన కషాయం ఇవ్వాలనే ఆశిద్దాం :). నేను ఏ రాజకీయ పార్టీలను సమర్థించను. కానీ ఇలాంటి ధోరణి రోజురోజుకి వెగటు పుట్టిస్తోంది. ఈ భాజాపా రాజ్యాధికారం చేబట్టాక దేశం లో వింత పోకడలు చూస్తున్నాము. ఇంత వితండ వాదన, హిందూ మత దూషణ ఎప్పుడూ వినలేదు. అది social media వలన కూడా కావచ్చు. JNU, HCU రాజకీయం చూసాక మతిపోయింది !! ఈ విషయం మీద కొందరు FB లో కాశ్మీర్ కోసం పోరాడితే తప్పేంటి అంటూ దేశం కోసం ప్రాణాలు అర్పించే జవాన్ లని దూషించటం చేస్తున్నారు. దేశం బావుండాలి అంటే ఇలాంటివి ఖండించాలి. ఇంక సారంగ వారి గురించి. వారి సంగతి చెప్పనే అక్కర్లేదనుకోండి. అమెరికా నుంచి వచ్చే పత్రిక కదా కాస్త డయాస్పోరా కథలు చదువుదామని మొదలు పెట్టిన నాకు ఈ ఎర్ర రంగు ధోరణి నెమ్మదిగా అర్ధం అయింది. వారు ఒక్కోసారి మన వ్యాఖ్యలలో సగం మాత్రమే ప్రచురిస్తారు కూడా!! No ethics !! ఎవరు కామెంటుతారా దూషణ మొదలు పెడతాం అన్నట్టు ఉంటారు.
    -చంద్రిక

    ReplyDelete
  4. హరికాలం లో ఈ వారం స్పెషల్ ప్రశ్న

    కొండలరావు మగనా? మాడానా? ఎలా చెపుతారు? ఒకవేళ మగవాడైతే దానిని శాస్రీయంగా ఎలా నిరూపిస్తారు? నిరూపించలేకపోతే మాడాగా నిర్దారణకు రావచ్చా?

    మగవారు కాకపోతే మాడాలే అవ్వాలని ఎమైనా రూల్ ఉందా? ఈ రూల్ ఉంటే దానిని ఎవరు చేశారు? సైన్స్ ఒప్పుకొంట్టుందా?

    మీసం, బట్టతల(ఆడవారికి బట్టతల ఉండదు కదా)ఉన్నవారిని మగవాడిగా పరిగణించ వచ్చా? మీ అభిప్రాయం ఎమిటి?

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by a blog administrator.

      Delete



  5. హరిబాబు గారు !

    హన్నా! మీ బ్లాగు జిలేబి వదన లో లేక పోవటమా ! అలరెడి బ్లాగు ఆల్రెడీ ఉన్నదండోయ్ :) కొత్త టపా కొట్టి చూడుడు ! టపా తప్పని సరిగా టప్పని కనబడును :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...