యాకూబ్ మెమన్ అనబడే ఒక ముస్లిముని యెందుకు ఉరితీశారు?250 మంది చావుకి కారణమైన కుట్రలో భాగమయ్యాడని!మరి రధయాత్ర సమయంలో 1000 మంది చావుకి కారణమైన అద్వానీకి శిక్ష పడిందా?అబ్బే,అతను నేరం చెయ్యలేదు గదండీ అంటారా?2003లోనే కోర్టులు అద్వానీ సహా 7గురు నాయకులు మసీదు విధ్వంసానికి కారణమయ్యారని నిర్ద్వందంగా తీర్పులు ఇచ్చాయి.17 యేళ్ళ పాటు విచారణ జరిపి లిబర్హాన్ కమిటీ రిపోర్టు 2009లో సభకి సమర్పించబడింది.అందులోనూ నిందితుల్లో ఒకడిగా అద్వానీ పేరు ఉంది.ఇదే అద్వానీ హవాలా కుంభకోణంలో ఇరుక్కుని చాలా హుందాగా తనకు తనే అధికార పదవుల్ని త్యజించి కోర్టు నిర్దోషిగా తీర్పు ఇచ్చాకనే మళ్ళీ క్రియాశీల రాజకీయాలలో అడుగుపెట్టాడు,మరి మసీదు విధ్వంసానికి కారణమైన కేసులో యెందుకు మొండిగా చట్టానికి లొంగడం లేదు?
యాకూబ్ మెమన్ నేరస్థుడని నిర్ధారించినదీ ఈ దేశపు కోర్టులే!అద్వానీ నేరస్థుడని నిర్ధారించినదీ ఈ దేశపు కోర్టులే!అయినా ఒకరు ఉరితీయబడ్డాడు,మరొకరిమీద చార్జిషీటు కూడా దాఖలవ్వ లేదు,యెందుకని?వీళ్ళని ముస్లిములు యెట్లా నమ్ముతారు?అందుకే కాంగ్రెసుకి దూరమైన వాళ్ళు భాజపా వైపుకి కాకుండా ములాయం లాంటివాళ్ళ వైపుకి జరిగారు!ఒకానొకప్పుడు కేవలం 2 సీట్లతో ఉన్న స్థాయి నుంచి ఇప్పుడు అధికారం చేపట్టేవరకూ యెదగటానికి మాకు అధికారమిస్తే రామాలయం కడతామన్న వీళ్ళ మాటని హిందువులు నమ్మటం వల్ల కాదా?అది కాకుంటే వీళ్ళలో యేమి చూసి జనం వోట్లు వేశారు?నాయకులు కొందరు నైతికంగా ఉన్నతులు కావచ్చు,కాంగ్రెసు కన్నా మంచి పరిపాలన అందిస్తారు అన్న విశ్వాసం నాలాంటి వాళ్లలో ఉంటే ఉండొచ్చు!కానీ భాజాపాకి ఇప్పటి బలం కేవలం ఆ రెండు కారణాల వల్లనే వచ్చిందా?
అయోధ్య సమస్యని కోర్టు బయట శాంతియుతంగా పరిష్కరించుకోవడంలో ముస్లిములు పూర్తి సహాయ సహకారాలు అందించటానికి సిధ్ధంగా ఉన్నారు - కాకుంటే వాళ్ళ మర్యాదకి భంగం కలగకూడదనే పట్టుదల,అంతే!అయినా నూటికి 85% హిందువులు ఉన్న ఈ దేశంలో ముస్లిములతో మాట్లాడేదేమిటి అని మొండిగా ఉన్న విశ్వ హిందూ పరిషత్ మాట వింటూ సభలో బిల్లు పెట్టి మందబలంతో నెగ్గించుకుని గుడి కట్టెయ్యాలని చూస్తున్నదే తప్ప ముస్లిములతో సయోధ్యని కోరుకోవడం లేదు,యెందుకని?రెండు సభల్లోనూ పూర్తి మెజార్టీ ఇస్తేనే కానీ కట్టలేం అని చెప్తున్నారు,నిజంగా అది సాధ్యపడుతుందా?అసలు ఒకసారి బలప్రయోగంతో కూల్చినందుకే ఇన్ని సంవత్సరాలుగా ముంబై బాంబు ప్రేలుళ్ళూ,గోద్రా రైలు ఘటనా,గోద్రా అల్లర్లూ లాంటివి జరుగుతుంటే మందబలంతో ఆ పని చేస్తే ఇప్పటికన్నా ప్రమాదం కాదా?
ఇప్పుడు రామ్ లల్లా యెలా ఉన్నాడో తెలుసా?మసీదు కూలుస్తున్న హడావిడిలో కొందరు గబగబా లోపలి కెళ్ళి ఆ విగ్రహాలను బయటికి తీసుకొచ్చి ఒక తాత్కాలిక విడిదిలో చాలా నిరాడంబరంగా ఉంచారు.పాపం అప్పటి వరకూ అన్నిరోజులు మసీదు లోపలి కెళ్ళి పూజలు చేసిన ఆత్మీయత వల్ల కాబోలు ఆ పూజార్లకి కూడా బాధగా అనిపించిందట మసీదుని పడగొడుతుంటే!ఆ ప్రాంతమంతా ఇప్పుడు కేంద్రప్రభుత్వం అధీనంలో ఉంది.చుట్టూ పసుపుపచ్చని బద్దీలతో ఫెన్సింగ్ కనబడుతుంది.సెక్యూరిటీ చెక్ పోష్టుగా ఉన్న ఒక నడవా దాటి లోపలికి వెళ్ళాలి.సందర్సకుల నుంచి స్వాధీనం చేసుకున్న పెన్నులూ,క్యామెరాలూ చిందరవందరగా పడి ఉంటాయి.2000 మందికి పైగా పహరా కాస్తూ ఇసుక బస్తాలతో ట్రెంచీలతో ఆలయాన్ని కాకుండా యుధ్ధభూమిని తలపించేటట్టు ఉంటుంది!అలాంటి మార్గంలో భయం పుట్టకుండా వుండేందుకు మరింత భక్తితో రామ్ లల్లాని తలుచుకుంటూ సుమారు 200 అడుగులు వేస్తే ఒక చిన్న బోర్డు కనబడుతుంది.ఆ తర్వాత ఒక తెల్లని టార్పాలిన్ కింద గాలికి చుట్టూ ఉన్న దిట్టమైన ముఖమల్ తెరలు వూగుతుండగా నేనెక్కడుంటే అదే వైకుంఠం అన్నట్టు దర్శనమిస్తాడు ఆనాటి పధ్నాలుగేళ్ళ వనవాసాన్నీ నవ్వుతూ గడిపేసిన రామ్ లల్లా!ఆ టార్పాలిన్ బుల్లెట్ ప్రూఫ్,వాటర్ ప్రూఫ్,ఫైర్ ప్రూఫ్ కాబట్టి ప్రస్తుతానికి రామ్ లల్లా క్షేమంగానే ఉన్నట్టు లెఖ్ఖ.అతి సాహసంతో కరసేవకులు చేసిన దుర్మార్గం రాముడినే ఆలయహీనుడిగా చేసింది?!

ఆసేతు శీతనగం ఉన్న దేశంలోని కోటానుకోట్ల రామభక్తులందర్నీ మోసం చేస్తూ కూడా అంత ధీమాగా ఉన్న పార్టీ తిప్పి తిప్పి కొడీతే అయిదు కోట్లు కూడా లేని ఆంధ్రోళ్ళని మోసం చెయ్యడం పెద్ద బ్రహ్మవిద్యా?!నోరు తెరిస్తే ప్రత్యేకహోదా అని పేరు చెప్పి ఇస్తే తమిళ్నాడూ కర్ణాటకా అభ్యంతరం చెప్తాయి,హోదా కన్నా యెక్కువే ఇస్తాం అనే సొల్లు కబుర్లు చెప్పటమే తప్ప ఈ పదిహేను నెలల్లో ఇవ్వాల్సినవే ఇవ్వలేదు కదా?పదడిగితే యెనిమిదీ అయిదడిగితే రెండూ ముష్టి పారేసి సరిపెట్టటం రాజ్యాంగబధ్ధంగా యెన్నికైన వాళ్ళు చెయ్యాల్సిన పనేనా?హక్కుగా ఉన్నదేదో ఇస్తే మా బాగు మేం చూసుకుంటాం గానీ అదనంగా నువ్విచ్చే ముష్టి మాకు దేనికయ్యా?బీహారు యెన్నికల కోసం బీహారుకి ఇవ్వడానికి వచ్చిన చేతులు కలిసి పోటీ చేసి మిత్రపక్షంగా ఉన్న వాళ్లకి ఇవ్వడానికి మూగసైగలు తప్ప చేతులు రావడం లేదంటే,యేంటి కధ?ఆంధ్రోళ్ళు పిచ్చిపుల్లయ్యలని అనుకుంటున్నారా?సొల్లుకబుర్లు కాదు గట్టిమేలు చేసి చూపించాలి - అప్పుడే నమ్ముతాం మిమ్మల్ని!బోడిగుండుకీ మోకాలికీ ముడిపెడుతున్నానని అనుకోకండి - రామాలయం కట్టడం విషయం లోనూ,మసీదు విద్వంసానికి కారణమైన అస్మదీయుల్ని కోర్టుకి అప్పగించకుండా ఉండటం లోనూ,ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం లోనూ ఉన్నది ఒకటే మనస్తత్వం - మా వోటుబ్యాంకు మాకు సురక్షితంగా ఉంది కదా అన్న అహంకారం?!
అయోధ్య రాముణ్ణే మోసం చేసినోళ్ళకి ఆంధ్రోళ్ళని మోసం చెయ్యడం ఓ లెఖ్ఖా?!