Friday, 2 June 2017

చెప్పేది ఏమిటో, చెప్పెయ్యి సూటిగా - సుత్తి లేకుండా!

ఎందుకు పుట్టామో తెలియదు!
ఎందుకు తింటున్నామో తెలియదు!
ఎందుకు పెరుగుతున్నామో తెలియదు!

ఎందుకు మాట్లాడుతున్నామో తెలియదు!
ఎందుకు నడుస్తున్నామో తెలియదు!
ఎందుకు పోట్లాడుతున్నామో తెలియదు!

ఎందుకు చదువుతున్నామో తెలియదు!
ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నామో తెలియదు!
ఎందుకు విసుక్కుంటున్నామో తెలియదు!

ఎందుకు సంపాదిస్తున్నామో తెలియదు!
ఎందుకు కొంటున్నామో తెలియదు!
ఎందుకు అమ్ముతున్నామో తెలియదు!

ఎందుకు దాస్తున్నామో తెలియదు!
ఎందుకు ఖర్చు చేస్తున్నామో తెలియదు!
ఎందుకు మిగుల్చుతున్నామో తెలియదు!

ఎందుకు స్నేహం చేస్తున్నామో తెలియదు!
ఎందుకు వైరం చూపిస్తున్నామో తెలియదు!
ఎందుకు శాంతంగా ఉండలేకపోతున్నామో తెలియదు!

ఎందుకు ప్రేమిస్తున్నామో తెలియదు!
ఎందుకు పెళ్ళి చేసుకుంటున్నామో తెలియదు!
ఎందుకు విడిపోతున్నామో తెలియదు!

ఎందుకు మనం రచనలు చేస్తున్నామో తెలియదు!
ఎందుకు చదివి మెచ్చుకుంటున్నామో తెలియదు!
ఎందుకు ఇతర్ల కెర్తికి కుళ్ళుతున్నామో తెలియదు!

ఎందుకు పోలింగ్ బూతుల్లో ఓటేస్తున్నామో తెలియదు!
ఎందుకు మంత్రులుగా చట్టసభల్లోకి వెళ్తున్నామో తెలియదు!
ఎందుకు ఎన్నికల్లో ఓడిపోతున్నామో తెలియదు!

ఎందుకు బతికున్నామో తెలియదు!
ఎందుకు చచ్చిపోతున్నామో తెలియదు!
మరి, తెలిసింది ఏమిటి?

Wednesday, 26 April 2017

గానగంధర్వుణ్ణి తను కూర్చిన పాటల్ని పాడినందుకు కోర్టుకీడ్చిన ఇసైజ్ఞాని తను కూర్చడానికి రాగకర్తల నుంచి అనుమతి తీసుకున్నాడా?

          ముఖే ముఖే సరస్వతీ అన్నట్టు ఒక మనిషి నుంచి ఒక మనిషికి వ్యాపించే భావాల మీద, రాగాల మీద ఏ ఒక్క మనిషికీ కాపీరైటు లేదు. మనకి తెలిసిన ప్రతి విషయమూ ఇంకొకరి నుంచి తెలిసిందే అవుతుంది - మన తలిదండ్రులు నేర్పితేనే మనకి మాటలు వచ్చాయి! అయినా కొందరు నాకు తెలిసిందీ, నేను పాడందీ, నేను కూర్చిందీ నా సొంతమే అంటున్నారు!సార్వజనీనమైన కళమీద సొంతహక్కుల కోసం సాటి కళాకారుల మీద కేసులు కూడా వేస్తున్నారు, ఏమి చిత్రం?

          ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ సంగెతం ఉంది,ప్రతి సంగీతంలోనూ రాగాలు ఉన్నాయి,ప్రతి రాగానికీ స్వరాలు ఉన్నాయి - చిత్రంగా అన్ని  రకాల సంగీత రీతుల్లోనూ ఉన్న స్వరాలు ఏడు మాత్రమే!ఆ స్వరాల వెనక గణితం ఉంది - ఫ్రీక్వెన్సీ,డిలే అనే రెండింటి మిళాయింపుని ఒక స్థిరాంకంగా తీసుకుని దాన్ని మెట్లు మెట్లుగా పెంచితే మిగిలిన స్వరాలు ఏర్పడతాయి.షడ్జమం అనేది ఇక్కడ బేసిక్,రిషభం దానికంటే ఒక యూనిట్ పెంపు(కానీ పెంపులో ఒక నిష్పత్తి ఉంటుంది, అది లాగరథమిక్ స్కేల్) - ఇట్లా లెక్క ప్రకారం స్వరాలను ఏర్పరచారు. వారెవరో ఈనాటివారికి తెలియనే తెలియదే!వారు పేటెంటు హక్కుల కోసం ఆ పని చేశారా?ఆ స్వరాలని గాత్రంలో పలికించినా వాద్యం మీద పలికించినా లెక్క ఒకటే కాబట్టి నాదరమ్యతలో తేడా వుండదు!"నీ లీల పాడెద దేవా...!" పాటలో యస్.జానకి ఆలాపనా సన్నాయి ఆలాపనా ఒకే స్థాయిలో పలకడమే దానికి నిదర్శనం."షడ్జమం మయూరో వదతి" శ్లోకం ప్రకారం అవి ఆయా జంతువుల గొంతునుడి వచ్చే ఏకసూత్ర ధ్వనులు.అలాంటి విశ్వజనీనమైన సంగీతం మీద తనకి మాత్రమే పేటెంట్ హక్కులు ఉన్నాయనటం స్వరజ్ఞాని యొక్క అజ్ఞానం మాత్రమే!

          విశ్వనాధ సత్యనారాయణ గారి పురాణ వైర ఫ్రంధమాలలో "వేదవతి" కధ ప్రత్యేకమైనది!అందులో వేదవతి అనే ఆ నవలానాయకి దేహం సంగీతానికి విపరీతంగా ప్రతిస్పందిస్తుంది - ఎంతగా అంటే స్వరబద్ధమైన సంగీతం వింటూ ఉంటే క్షణ క్షణానికీ జీవశక్తులు ఉత్తేజితమై కొద్ది మిమిషాల్లోనే పూర్ణచందుడిలా తళుకులీనుతుంది,కర్ణకఠోరమైన సంగీతం వింటూ ఉంటే క్రుంగి కృశిస్తుంది!ఆ నవలలో భగవంతుడి మీద పగతో రగిలిపొయే జయధ్రధుడి వారసత్వంలో వచ్చే ప్రతినాయకుడి పేరు నిమేషధారి,వాడో మాంత్రికుడు.వాడు ఆయుష్షుని నిమిషాల లెక్కన పెంచుకోగలిగినవాడు.దాన్ని సాధించడానికి వేదవతిని కిడ్నాప్ చేసి వేదనాదం వినిపించి ఆమేనుంచి ఆయుష్షును నిమిషాలుగా గహిస్తాడు!అలా ఆయుష్షును పెంచుకున్నాక ఆమెకి పాశ్చాత్య సంగీతాన్ని వినిపిస్తాడు - తప్పించుకోవడానికి శక్తి కూడా లేనంత నీరసించి పోతుంది వేదవతి.కల్పన బాగుంది కదూ - ఇప్పటి హాలీవుడ్ సినిమాల వాళ్ళకి కూడా రాని యెన్నో చిత్రవిచిత్రమైన కల్పనలు ప్రతి పురాణ వైర కధలోనూ ఉంటాయి - ఆయన్ని వెనక్కి నడిచేవాడు అని వెక్కిరించారు!అసలు విషయం యేమిటంటే ఈమెని వెతకడానికి బయలుదేరినవాళ్ళలో ఒక జానపదుడు ఉంటాడు,ఆ పాత్రకి విశ్వనాధ పెట్టిన పేరు టికటిక!నిమేషధారి తన స్థావరంలో లేని సమయంలో ఈ జానపదుడు  ఆ దగ్గిరలో తిరుగుతూ పాడిన జానపద గీతాలలో వైదిక సంగీతం వినబడి కృశించిన వేదవతి తేరుకుని నిండు తేజస్సును సమకూర్చున్నట్టు విశ్వనాధ వారు కల్పన చేశారు.ఆ వెంటనే తప్పించుకుంటుందో,లేక టికటిక ఆమెను కనిపెట్టటం జరిగి కధ కొంచెం నడిచాక తప్పించుకుంటుందో నాకు గుర్తు లేదు.అయితే ఇక్కడ విశ్వనాధ చెప్పదల్చుకున్న విషయమే ముఖ్యం - సంగీతం ఎవడబ్బ సొమ్మూ కాదు!

          ఇళయరాజా గురించి సినిమా పరిశ్రమలో తరచుగా కొన్ని మాటలు వినబడతాయి - ముక్తసరిగా మాట్లాడతాని,మాటిమాటికీ ట్యూన్లు మార్చడానికి విసుక్కుంటాడని,ఇలాంటివి చాలావరకు వినయాన్ని కాకుండా పాండితీగర్వాన్ని సూచించే లక్షణాలు!ఆ సహజమైన అహంభావంతోనే బాలసుబ్రమణ్యం మీద కేసు వేసి ఉండవచ్చును.కొందరు కాపీరైటు ఉల్లంఘనలకి ఇతరేతర వ్యక్తుల నుంచి గట్టి స్పందన కోసం చేశాడంటున్నారు గానీ నాకు మాత్రం ఈ పనిలో పాండితీగర్వానికి సంబంధించిన దుర్మార్గమే కనబడుతున్నది.యెందుకంటే,గానగంధర్వుణ్ణి తను కూర్చిన పాటల్ని పాడినందుకు కోర్టుకీడ్చిన ఇసైజ్ఞాని ఆ పాటల్నితను కూర్చడానికి ముందు రాగకర్తల నుంచి అనుమతి తీసుకున్నాడా?

Wednesday, 19 April 2017

కాంగ్రెసు ముక్త భారత్ అంటే కాంగ్రెసును బయటెక్కడా కనిపించకుండా తనలోకి లాక్కొవడమా?

          మొదటిసారి ఈ "కాంగ్రెస్ ముక్త్ భారత్!" అన్న నినాదం మోదీగారి నోటినుంచి వచ్చినప్పుడు నేను ఎగిరి గంతేశాను!అసలు మోదీ అమ్నస్సులో ఈ నినాదం ఎప్పుడు పుట్టిందో!స్కూలు రోజుల నాడు పుట్టిన ఈ లక్ష్యంతోనే ఆవేశపడి ఇన్ని దశాబ్దాల తర్వాత ప్రధాని అయ్యాడా?లేక అనుకోకుండా ప్రధాని ఈ మధ్య కొత్తగా పుట్టిన వెర్రా ఇది!ఎందుకంటే,ఒకానొకప్పుడు ఈ రకమైన భావజాలం ఉన్నవాళ్లని గాంధీని చంపిన దేశద్రోహులుగా ముద్రవేసి వారి మాతకి విలువ లేకుండా చేసిన కలాంలోనూ,లోక్సభలో కేవలం 2 సీట్లు మాత్రమే ఉండి బిక్కుబిక్కుమంటున్న కాలంలోనూ,అద్వానీ గారు రదహయాత్రతో అప్రతిహతంగా రామబహ్క్తులను భాజపా అవిపుకు వోటుబ్యాంకుగా మారుస్తున్న కాలంలోనూ,వాజపేయి గారు కాంగ్రెసుకి అఖిల భారత్ భ్రష్టాచారీ కాంగ్రెసు అని పేరు మార్చుకోమని చురకలు వేసినప్పుడు గానీ ఎవరికీ తట్టని కొత్త వూహ కదా ఇది!

          హఠాత్తుగా అద్వానీ కేసు ముందుకు రావడంలో పైకి కనబడుతున్నది నిజమని మీరు నమ్ముతున్నారా?నాకైతే రివర్స్ గేరులో హిందువుల్ని రెచ్చగొట్టడానికి భాజపా ఆడుతున్న నాటకం అనిపిస్తున్నది!ముస్లిములని వోటుబ్యాంకుగా ఉపయోగించుకోవాలనుకున్న కాంగ్రెస్ పారీ,హిందూ వ్యతిరేక భావజాలపు కమ్యునిష్టు పార్టీ ఏమాత్రం బలంగా లేవు.ముస్లిం మతపెద్దలు మొదటినుంచీ సయోధ్య వైపుకే మొగు చూపుతున్నారు.రాజకీయంగా తాము కగజేసుకోకుండా ఇరుపక్షాల మతపెద్దల్నీ ఒక్కచోట కూర్చోబెడితే చాలు!అయితే.ముస్లిములు పరిహారం అడుగుతారు - 1000 కోట్లు కావచ్చు,లేక 3000 కోట్లు కావచ్చు!అది ఇవ్వకుండా రప్పించుకోవాలనే ఎఉగడలతోనే హిందూ మతతత్వ శక్తులు పావులు కదుపుతున్నాయి

          ప్రతి ఒక్క చతుర్యుగం తర్వాత జలప్రళయం జరిగే లెక్కని చూసుకున్నా యుగాల వెనకటి రాముడి ఆనవాళ్ళక్ ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో సాక్ష్యాలు పట్టుకోవటం దాదాపు అసాధ్యం.మసీఎదును సాక్ష్యాలు పట్టుకోవటం దాదాపు దుర్మార్గమే.అది ఒప్పుకుని ముస్లిములతో స్నేహపూర్వకమైన చర్చల ద్వారా గుడి కట్టడం మర్యాదస్తులైన ప్రతి ఉక్కరూ కోరుకుంతూన్నారు.కానీ భజపాను శాసించే శక్తులు మర్యాదకి కాకుండా సమర్ధతకి పెద్దపీట వేస్తున్నాయి - అదే గుడి కట్టడానికి అసలైన ప్రతిబంధకం. 

          కానీ అక్కడ అసలు సయోధ్య ద్వారా కాకుండా హిందువుల్ని ఇంకా ఇంకా రెచ్చగొట్టి తమకి నిరంకుశామైన అధికారం సాధించుకోవాలని భాజపా వ్యూహం.అది ఫలిస్రే దేశం మళ్ళీ రాజుల కాలంలోకి వెళ్ళీపోవడం ఖాయం - నిజంగా అది జరుగుతుందా?ప్రపంచ స్థాయిలోనే భాజపా అతి పెద్ద రాజకెయ పార్టీఅ ని అంకెల ద్వారానే సష్టంగా తేలిపోయింది.ఇది హఠాత్తుగా జరిగినదీ కాదు,దానంతటదిగా జరిగిపోయిందీ కాదు.ఎప్పటినుంచో కమలమే సకలం కావాలి,కాంగ్రెసు ముక్త భారతాన్ని సాధించాలి అనే వ్యూహం పనిచెయ్యడం ద్వారానే జరిగింది.కానె ఆ వ్యూహం ఇదివరకు కాంతెసు ఆ స్థాయికి రావడానికి ఉపయోగంచిన పద్ధతియే కదా!వ్యాపించటానికి కాంగ్రెసు పద్ధతినే పాటిస్తే కాంగ్రెసుని అనుకరించినట్టే కదా!భాజపా కూడా అచ్చం కాంగ్రెసులాగే మారిపోయినట్టే కదా!సీసా మీద లేబుల్ మార్చినంత మాత్రాన జిన్ను రమ్ము అవుతుందా?

          తమిళనాట జయలలిత మరణం తర్వాత జరిగిన,జరుగుతున్న,జరగబోతున్న సంఘటనల వెనక భాజపా ప్రమేయం అందరికీ తెలిసిన విషయమే - అది కాంగ్రెసు నీచమైన శవరాజకీయమే!నిన్న జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆదిత్యనాధ్ తప్ప మిగిలిన వాళ్ళు ముఖ్యమంత్రులు కావటం కాంగ్రెసు మార్కు రాజకీయం ద్వారా కాదని యే భాజపా అభిమాని అయినా గుండెల మీద చెయ్యేసుకుఇ చెప్పగలడా!కాంగ్రెస్ ముక్తభారత్ అంటే బయటెక్కడా కాంగ్ర్సెసుని కనబడకుండా చేసి అద్దంలో చూసుకుంటే తనలోనే కాంగ్రెస్ కనబడేటట్టు తయారుకావడం అనుకుంటున్నాడా మోదీ!


అద్వానీ కేసుకీ రాముడ్ గుడికీ లంకె పెట్టి హిందువుల్ని రెచ్చగొట్టడం అమానుషం!

Tuesday, 4 April 2017

శ్రీరాఘవం దశరధాత్మజం అప్రమేయం!

దేవుడు దేవుడిలా ఎక్కడో ఉండి
ఇక్కడి మనుషుల్ని శాసించకుండా
మనిషై పుట్టి పెరిగి మనం పడుతున్న 
కష్టాలనే తను కూడా అనుభవించి
ధర్మం తప్పకుండానే కష్టాల్ని అధిగమించి
సఖుడై, గురువై, మార్గదర్శకుడైన
మొదటి అవతారపురుషుడు రాముడు!

చైత్ర శుద్ధ నవమి నాడు
కౌసల్యా దశరధులకు తనయుడై జన్మించి
శ్రీమహాలక్ష్మి అంశయైన సీతకు ప్రాణనాధుడై
ఆదిశేషుని వంటి లక్ష్మణుడికి అన్నయై
వానర శ్రేష్ఠుడైన సుగీవుడికి మిత్రుడై
పరమశివుని అంశయైన ఆంజనేయుడికి ప్రభువై
శరణు కోరిన విభీషణుడికి రక్షకుడై
ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని కలగజేసిన
మర్యాదాపురుషోత్తముడైన శ్రీరాముడు

అయోధ్యలో దశరధనందనుడై జన్మించి,
మిధిలలో జనకరాజపుత్రి సీతని పరిణయమాడి,
తండ్రిమాట కోసం అయోధ్యానగరం విడిచి
దండకారణ్యంలో పధ్నాలుగేళ్ళు గడిపి,
రావణుడు చెరబట్టిన సీతను సాధించడానికి
కిష్కింధ చేరి సుగ్రీవుడితో స్నేహం చేసి,
ఆంజనేయుడు ఆనవాళ్ళు కనిపెట్టి చెప్పగానే
రామసేతువు నిర్మించి లంకను చేరి,
దుష్టుడైన దశకంఠ రావణుణ్ణి సంహరించి
సాధు సజ్జనులకు ఆనందం కలిగించిన శ్రీరాముడు
మీకు సమస్త సుఖాలనూ ఇవ్వాలని ఆశిస్తూ -
శ్రీరామనవమి శుభాకాంక్షలు!

Monday, 27 March 2017

లేవండర్రా బడుద్ధాయిలూ!బారెడు పొద్దెక్కింది - ఇంకా లేవకపోతే ఎట్లా?

అసలు కవిత్వం:
---------------
పొడుపు మలపైన విచ్చుకున్న 
నటరాజు కుడికంటి చురుకు చూపులు
నులివెచ్చని కరుకు తూపులై గుచ్చుకుని,

రేరాజు పంచిన వెన్నెల కొంచెం
సూరీని చాటున తీగలై సాగితే
అల్లుకుని కప్పుకున్న జలతారు
దుప్పటి కరిగి కరిగి చిద్రుపలై,

అటుకాస్త ఒత్తిగిలి ఇటుకాస్త ఒత్తిగిలి
పనిపాట్లకి వేళయిందని గురుతొచ్చి
మంచుముత్యాల కలనేత చిగురాకుపచ్చ ౙరీచీరను

చెదిరీ చెదరనంత సుతారంగ సవరించుకుని
లేచి నిలబడి ఒళ్ళు విరుచుకునింది భూమిదేవి -
అల్లరి పిల్లల్ని పనుల్లోకి తరమాలి గద!

కొసరు మద్యం:
--------------
సీ||
మేలు జరుగుగాక మేదినిపై గల
సకల భూతములకు - స్వస్తి భవతు!

రక్షించబడుగాక రమణులున్,వృద్ధులు,
శిశువు లనాధలున్ - స్వస్తి భవతు!

కలియుగాక సఫలకర్ములై దేశదే
శాల పౌరజనులు - స్వస్తి భవతు!

నశియించిపోవలె నీచులున్,దుర్మతులు
శాంతమార్గముననె - స్వస్తి భవతు!

తే||
చెలుల కిష్టులౌ మగలార - స్వస్తి భవతు!
చదువు చెప్పు గురువులార - స్వస్తి భవతు!
సమత పెంచు నాయకులార - స్వస్తి భవతు!
సేద్యమొనరించు సైరికా - స్వస్తి భవతు!
(సీర్లు!సీర్లు!)

Saturday, 18 March 2017

వ్యక్తిగత మొక్కుల్ని ప్రభుత్వం తరపున తీర్చుకోవడంలో కేసీయార్ చేసింది ఖచ్చితంగా తప్పే!హజ్ యాత్రలతో పోల్చి హిందువులు పక్షపాతంగా ఉండటం ఎందుకు?

     ఒక వైపున పనిభారం,ఇంకోవైపున ఇస్లాం గురించిన వ్యాసపరంపరకు కావలసిన రీసెర్చిలో పడి ఒక ముఖ్యమైన విషయం గురించి రాద్దాం రాద్దాం అనుకుంటూనే ఒక చిన్న కామెంటుని మాత్రం ఫీలరుగా వొదిలి తర్వాత విషయం పాతబడి పోయి ఉంటుందని వొదిలేశాను.తీరా చూస్తే ఎప్పుడూ రాముడి మీద పజ్యాలు రాసుకుంటూ అంతే నాకు చాలు అని సరిపెట్టుకునే శ్యామలీయం ఒక పెద్ద నిరసన పోష్టు రాసెయ్యటం,దాని దగ్గిర ఎడాపెడా కామెంట్లతో పెద్ద చర్చ కూడా జరిగిపోయింది!

     మొదట వనం వారికి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను.ఆయన రామాయణ కధారచనకి సరళతరమైన అనువాదం కూడా చేస్తున్నారు.ఆ రాముడి పేరుతోనే రామరాజ్యానికి సంబంధించినదిగా చెప్తున్న ఒక పిట్టకధ ఉంది.ఇది అసలు వాల్మీకి రామాయణంలోనూ ఉత్తర రామాయణంలోనూ ఉందో లేదో నాకు తెలియదు.ఈ దేశంలో ప్రతిదాన్నీ రామ నామాంకితం చెయ్యటం పండితుల నుంచి పామరుల వరకు చేస్తూనే ఉంటారు.ఏదైనా నీతికధ చెప్పాలనుకుంటే దాన్ని తీకుకెళ్ళి రాముడికి తగిలిస్తే చాలు వినేవాళ్లకి ఎముక మూలగలోకంటా ఎక్కేస్తుందని చాలామందిలో ఒక మూఢనమ్మకం ఉంది!

     ఒకనాడు ఒక కుక్క ఒక పెద్దమనిషిని రాముడి దగ్గిరకి తీసుకొచ్చి నేరారోపణ చేసింది.తన పాటికి తన కుక్కబతుకేదో తను బతుకుతుంటే వుత్తి పుణ్యానికి తనని హింసించాదని ఆరోపణ.నేరం రుజువైంది,కానీ ధర్మశాస్త్రాలు అన్నీ మనుషుల కోసం రాసినవి గాబట్టి కుక్కని హింసించిన వాళ్లకి వెయ్యాల్సిన శిక్షలు లేకనో యేమో రాముడు ఆ కుక్కనే అడిగాడు,"ఏ శిక్ష వెయ్యమంటావో నువ్వే చెప్పు!" అని.దానికి కుక్క ఏదైనా ఒక అలయానికి ధర్మకర్తగా వెయ్యమంది.ఇదేమి తిరకాసో రాముడికే అర్ధం కాలేదు."భగవత్సేవకి నియోగించటం శిక్ష ఎలా అవుతుందబ్బా!" అని ఆయనకీ అనిపించి ఉండవచ్చు - కుక్కనే అడిగాడు.దానికి కుక్కగారు,"అయ్యా!గతజన్మలో నేనూ ఒక ఆలయానికి ధర్మకర్తనే.కక్కుర్తి కొద్దీ దేవుడి సొమ్ము సొంతానికి వాడుకున్నాను.అందుకే ఈ జన్మలో ఈ బతుకు దక్కింది.వీడికీ అదే జరిగీతే చెల్లుకుచెల్లు హళ్ళికిహళ్ళి అవుతుంది - నా కక్ష తీరుతుంది, వీడి రోగం కుదురుతుంది!" అని చెప్పింది.కధని కల్పించిన రచయిత ఇందులో చాలా నీతుల్ని ఎక్కించాడు - ఒక సామాన్యుడు చేసిన తప్పునే అసామాన్యుడు చేస్తే శిక్ష కూడా అధికంగా ఉంటేనే సమన్యాయం అవుతుంది,మందిసొమ్ముని సొంతానికి వాడుకోవటం ఎవరు చేసినా పాపమే - ఇత్యాదయః చాలా నీతుల్ని ఒక చిన్న కధలో ఇమిడ్చాడు!

     ప్రభుత్వాధికారిగా ఉన్నందువల్ల తమ ప్రభుత్వం చేసిన తప్పును సమర్ధించుకోవాల్సిన దుస్థితి వనం వారిది - దానికి నేను సానుభూతి వ్యక్తం చేస్తున్నాను!ఆయన రాస్తున్న రామాయణం చదివి ఆనందిస్తున్న నేను ఆయన్ని నేను క్రూరంగా విమర్శించలేను - కానీ అది ఖచ్చితంగా తప్పే!నేను కొత్తగా వాదనల్ని వింపించాల్సిన అవస్రం లేదు - శ్యామలీయం వ్యాసంలో చేసిన వాదనా జై గొట్టిముక్కల వ్యాఖ్యలలో చేసిన ప్రశ్నాపూర్వకప్రతిపాదనలూ చాలు.అసలు విషయానికి సంబంధించిన తీర్పు అయిపోయింది గానీ కొసరు విషయం మాత్రం - అక్కద కేసీయార్ చేసినదాన్ని ప్రముఖహిందూబ్లాగర్లు అరిభీకరంగా సమర్ధించటం - వింతగా అనిపించింది!

     ముస్లిముల హజ్ యాత్రకి ప్రభుత్వం డబ్బిస్తే అది సెక్యులరిజమా,హిందూ అలయానికి ఆభరనాలు ఇస్తే మతతత్వమా అనే సవాలు విసురుతున్నారు!అంటే ముస్లిములకి హజ్ యాత్రకి డబ్బివ్వతాన్ని వీఉ ఆనాడు వ్యతిరేకించి ఈనాడు హిందువుల ఆలయానికి ఆభరణాల్ని సమర్పించటాన్ని సమర్ధించటం ద్వారా వీరిని వీరు ఎక్కడ నిలబెట్టుకుంటున్నారు?హజ్ యాత్రకి డబ్బివ్వటం వల్ల ఏం జరిగిందో తెలుసా?1950ల నాడు హజ్ యాత్రికులు చాలా తక్కువమంది ఉండేవాళ్ళు.హజ్ యాత్ర మొత్తం హిందూ సంప్రదాయమే,ఇస్లాము మతం పుట్టకముందు అది హిందూ దేవాలయమే,ప్రవక్తగా మారకముంది అహ్మద్ ఖురేషీ కూడా మక్కా మందిరం చుట్టూ సవ్యదిశలోనే ఏడు ప్రదక్షినలు చేసేవాడు - అన్ని ఖురేషీ ప్రార్ధనా విధుల్నీ పాటించేవాడు!కొత్త మతాన్ని స్థాపించాక కూడా వాటినే కొనసాగించాడు,కానీ ప్రాధాన్యతని అత్గ్గించాడు.తప్పనిసరి తద్దినంగా సంవత్సరాని కొకసారి అని ఉంచేసి విగ్రహారాధనని తీవ్రంగా వ్యతిరేకించాడు.అంతర్జాతీయంగా షియా,సున్నీ అనే ప్రముఖమైన భెదాలతో పాటు అరబిక్ ఇస్లాం,ఇండిక్ లేదా వైదిక్ ఇస్లాం అనే మరొక విభజన కూదా తయారైంది ఉపఖండంలోని అన్ని ప్రభుత్వాలూ పోటీపడి హజ్ యాత్రలకి ప్రోత్సాహకాలు ఇవ్వటం వల్ల!

     పక్కనే ఉన్నా అరబ్బులు ఎక్కువగా హజ్ యాత్రకు అంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు కాదు,మనవాళ్ళు మాత్రం ప్రభుత్వం దబ్బిస్తున్నాది కదాని ఎగేసుకు పోయేవాళ్ళు.ఆ మధ్యన మక్కాలో మందిరానికి అతి దగ్గిరగా పేలుళ్ళు జరిగితే చాలామంది ఇండిక్  ఇస్లాం మేధావులు ఖంగారు పడ్డారు!ఆ పని చేసింది అరబిక్ ఇస్లామును పాటించేవాళ్లు,చేసింది  ఈ వైదిక పద్ధతులు నచ్చక!ఆ రకంగా హజ్ యాత్రలకి డబ్బివ్వటం వల్ల మంచికన్నా చెడే ఎక్కువ జరిగింది.మరి హిందువులు కూడా పులిని చూసి వాత పెట్టుకున్న నక్కలా ఇవ్వాళ అదే తప్పు చేసి రేపు అదే  రకం బురద నెత్తిన రుద్దుకోవాలా?సెక్యులరిజం అనే డొల్ల సిద్ధాంతాన్ని పాటించకపోతే పోనివ్వండి,సనాతన ధర్మం చేప్పే సర్వధర్మసమభావనకీ తూట్లు పొడవడం దేబికి? హిందూమతం మీద దాడి జరుగుతున్నది అనేది వాస్తవమే!కానీ ఆ బూచిని చూపించి కొత్తగా పక్షపాతం అలవాటు చేసుకోవడం అనవసరం - తమ్ముడు తనవాడైనా ధర్మమే చెప్పాలి!

తొక్కలో డెమోక్రసీ!తొక్కలో సెక్యులరిజం!తొక్కలో హిందూత్వం - ధర్మం అన్నిటికన్న ముఖ్యం!!

Wednesday, 15 February 2017

యుద్ధాల సంగతి సరే, శాతవాహనుల కాలంలో సమాజం ఎట్లా ఉండేది?

     తొలి శాతవాహనుల్లో శ్రీముఖ శాతకర్ణి రాజ్యాన్ని స్థాపించి నిలబెట్టినా 1వ శాతకర్ణి మహా బలంతో పరాక్రమించి ప్రస్తుతం మనం చూస్తున్న భారతదేశంలోని అన్నివైపులకీ వ్యాపించి "దక్షిణాపధపతి" అనే బిరుదు సంపాదించాడు.ఉత్తరం వైపున ఖారవేలుణ్ణి కూడా జయించి మగధ వరకూ వ్యాపించాడు!తూర్పున నర్మద వరకూ వ్యాపించి శకుల నుంచీ గ్రీకుల నుంచీ జరుగుతున్న దండయాత్రల్ని నిరోధించి దేశాన్ని సుస్థిరంగా నిలబెట్టాడు.రెండు అశ్వమేధాలూ ఒక రాజసూయం చేసిన ఘనుడు!

    మలి శాతవాహనుల్లో తన పూర్వీకులు పోగొట్టుకున్న భూభాగాల్ని శకుల నించి మళ్ళీ సాధించి నిలబెట్టిన క్రీ.శ 1వ శతాబ్ది నాటి గౌతమీపుత్ర శాతకర్ణి ప్రముఖుడు.బౌధ్ధులకి చెప్పుకోదగిన రీతిలో దానాలు చేసి మతాతీతంగా వ్యవహరించాడు.బ్రాహ్మణుడు కావటం వల్ల "యేక బ్రాహ్మణ" అనే బిరుదును సాధించాడు!

    రాజు దైవాంశసంభూతుడనే మూఢనమ్మకాలు లేకుండా ధర్మశాస్త్రాల కనుగుణంగా కడుచక్కని పరిపాలన సాగించారు అందరు శాతవాహన ప్రభువులు.రాజుకు సలహాలు ఇవ్వడానికి మంత్రిమండలి అనే ఒక సలహాదారుల బృందం ఉండేది,రాజ్యం పెద్దది కావడంతో భాగాలుగా విభజించి పరిధిని బట్టి ప్రాంతాలకు "రాజ","మహాబోజ","మహారధి" నామాలతో అధిపతుల్ని నియమించారు.సమాజం లోని ప్రజానీకం నాలుగు తరగతులుగా వర్గీకరించబడి ఉంది - పైన చెప్పుకున్న అదిపతులు పైస్థాయిలోని ప్రభు వర్గం,దానికి కింది అంతరువుగా అమాత్యులూ మహామాత్రులూ వంటి ఉద్యోగశ్రేణులూ తమ వ్యాపారకౌశలంతో రాజ్యపు సంపద పెంచే ప్రజ్ఞ వుండి సమాజంలో మంచి పరపతి గల్గిన వణిక్ప్రముఖులూ, మూడవ సామాజిక అంతరువులో ఇప్పటి మధ్యతరగతి కుటుంబాలతో పోల్చదగిన వైద్యులూ కవిగాయక శిఖామణులూ రైతులూ కుమ్మర్లూ కమ్మర్లూ,అన్నిటికన్నా కింది అంతరువుల్లో ప్రధాన వృత్తులకి అనుబంధమైన వృత్తి పనివాళ్ళయిన వడ్రంగులూ జాలర్లూ వంటివాళ్ళు వుండేవాళ్ళు!స్త్రీలు విద్యావంతులు కావడమే కాకుండా యెలాంటి అభ్యంతరమూ యెదుర్కొనకుండా మతసంబంధమైన కార్యక్రమాలకి అధ్యక్షత వహించగలిగేవాళ్ళు, అప్పటికి చిన్నవాళ్లయిన కొడుకుల కోసం రాజ్యాన్ని రక్షించి యుధ్ధాలు చేసి అశ్వమేధాలు చేసిన శౌర్యప్రతాపాలను పుణికి పుచ్చుకున్న గొప్ప రాణులు చాలామంది ఉన్నారు!ప్రభువులే తమ గురించి తాము "గౌతమీపుత్ర","వాసిష్ఠీపుత్ర","కౌశికీపుత్ర" అని చెప్పుకుంటూ తమ తల్లుల పేర్లని గౌరవసూచకంగా భావించారు గదా!

    వ్యవసాయం,వ్యాపారం రెంటినీ సమానంగా సంరక్షించడంతో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లిన కాలమది!వ్యాపారస్థులకీ అన్ని రకాల వృత్తుల వారికీ ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సంఘాలు వుండేవని తెలుస్తున్నది - అవి మొత్తం ఆ వర్గానికి చెందినవారి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉండేవి.ఇక్కడి తీరప్రాంతానికి చెందిన సుపార, కళ్యాణి వంటి ప్రముఖమైన రేవుపట్నాల నుండి  ఈజిప్టు, రోము వంటి దూర దేశాలతో ఖండాంతర వ్యాపారం కూడా జరిగింది. పైఠాన్,నాసిక్ లాంటి మహారాష్ట్ర నగరాలు ఈ కాలంలో ఈ సంపదతో పెరిగినవే!ఆ రకంగా ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికన్ పౌరుల వలె భౌతికజీవనంలో అత్యున్నత స్థితిని శాతవాహనుల కాలంలోని మన పూర్వీకులు అనుంభవించారు!

   ఇక ఆధ్యాత్మికంగా చూస్తే స్వయంగా బ్రాహ్మణులైనా సర్వధర్మసమభావనతో ఇతర మతాల్ని కూడా ఆదరించారు - దాదాపు వీరి రాజ్యంలోని అందమైన గుహాలయాలన్నీ బౌధ్ధుల విహారాలూ స్థూపాలతో నిండిపోయాయి!అసలైన అధ్భుతమూ సహిష్ణుతకి పరాకాష్ఠగా చెప్పుకోవలసిన విషయం శకులూ గ్రీకులూ కుషానుల వంటి విదేశీయుల్ని కూడా హిందూమతంలోకీ బౌధ్ధమతంలోకీ ఆహ్వానించి కలిపేసుకోవటం ఆనాడే జరిగిందంటే ఇవ్వాళ ఘర్ వాపసీ అనే చిన్న విషయానికే కొందరు శాంతిభద్రతలకి సంబంధించిన సమస్యల్ని కూడా సృష్టిస్తున్నారంటే ఆనాటి మనవాళ్ళని చూసి మనం పొంగిపోకుండా ఉండలేము గదా!

    ఒకప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు ఉదయంలో విన్నవాళ్లకి శాలివాహన శకం పేరుతో సంవత్సరం చెప్పడం గుర్తుండే ఉండాలి - దాని ప్రారంభకులు శాతవాహనులే!ఇవ్వాళ క్రీ.శ అనేది యెందుకు విశ్వవ్యాప్తమైన కాలమానంగా గుర్తించబడుతున్నది?యెక్కడికి వెళ్ళినా తమ సంస్కృతి గొప్పది కావటం వల్లనే తాము గొప్పవాళ్ళమైనామనే అహంకారంతో తమవైన వాటిని అక్కడి స్థానికుల మీద రుద్దెయ్యటం వల్ల జరిగింది!మన ప్రభుత్వం అధికారికంగా ఆకాశవాణిలో వినిపించే ఆ రెండు కాలమానాల్లో శక సంవత్సరం మొత్తం భారతదేశానికి సంబంధించినదయితే శాలివాహన శకం మనం ఉన్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినది.మనం కూడా నిజాయితీతో కూడిన వ్యాపారంతో సరిపెట్టుకోకుండా దుర్మార్గంగా వ్యాపించి ఉంటే ఇవ్వాళ ప్రపంచ మంతటా క్రీ.శ బదులుగా శాలివాహన శకం ప్రకారం సంవత్సరాల్ని చెబుతూ ఉండేవాళ్ళేమో!ఇవ్వాళ ప్రపంచం సంగతి దేముడెరుగు మనవాళ్ళకి మన సంస్కృతిని గురించి చెప్పటానికే సందేహించవలసి వస్తున్నది!ప్రాదేశికంగా ఉత్తర దక్షిణ భారతాలను కలుపుతూ ఉన్న భూమిని పరిపాలించటం వల్లనూ, అంతకి ముందర చాలాకాలం నుంచి మౌర్యులకి విధేయులుగా వుండినందువల్లనూ ఆర్యసంస్కృతి దక్షిణానికి విస్తరించటానికీ ఆ రకంగా దేశమంతా సాంస్కృతికంగా యేకత్వాన్ని సాధించటానికీ శాతవాహనులే కారణమైనారు!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...