Saturday, 18 March 2017

వ్యక్తిగత మొక్కుల్ని ప్రభుత్వం తరపున తీర్చుకోవడంలో కేసీయార్ చేసింది ఖచ్చితంగా తప్పే!హజ్ యాత్రలతో పోల్చి హిందువులు పక్షపాతంగా ఉండటం ఎందుకు?

     ఒక వైపున పనిభారం,ఇంకోవైపున ఇస్లాం గురించిన వ్యాసపరంపరకు కావలసిన రీసెర్చిలో పడి ఒక ముఖ్యమైన విషయం గురించి రాద్దాం రాద్దాం అనుకుంటూనే ఒక చిన్న కామెంటుని మాత్రం ఫీలరుగా వొదిలి తర్వాత విషయం పాతబడి పోయి ఉంటుందని వొదిలేశాను.తీరా చూస్తే ఎప్పుడూ రాముడి మీద పజ్యాలు రాసుకుంటూ అంతే నాకు చాలు అని సరిపెట్టుకునే శ్యామలీయం ఒక పెద్ద నిరసన పోష్టు రాసెయ్యటం,దాని దగ్గిర ఎడాపెడా కామెంట్లతో పెద్ద చర్చ కూడా జరిగిపోయింది!

     మొదట వనం వారికి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను.ఆయన రామాయణ కధారచనకి సరళతరమైన అనువాదం కూడా చేస్తున్నారు.ఆ రాముడి పేరుతోనే రామరాజ్యానికి సంబంధించినదిగా చెప్తున్న ఒక పిట్టకధ ఉంది.ఇది అసలు వాల్మీకి రామాయణంలోనూ ఉత్తర రామాయణంలోనూ ఉందో లేదో నాకు తెలియదు.ఈ దేశంలో ప్రతిదాన్నీ రామ నామాంకితం చెయ్యటం పండితుల నుంచి పామరుల వరకు చేస్తూనే ఉంటారు.ఏదైనా నీతికధ చెప్పాలనుకుంటే దాన్ని తీకుకెళ్ళి రాముడికి తగిలిస్తే చాలు వినేవాళ్లకి ఎముక మూలగలోకంటా ఎక్కేస్తుందని చాలామందిలో ఒక మూఢనమ్మకం ఉంది!

     ఒకనాడు ఒక కుక్క ఒక పెద్దమనిషిని రాముడి దగ్గిరకి తీసుకొచ్చి నేరారోపణ చేసింది.తన పాటికి తన కుక్కబతుకేదో తను బతుకుతుంటే వుత్తి పుణ్యానికి తనని హింసించాదని ఆరోపణ.నేరం రుజువైంది,కానీ ధర్మశాస్త్రాలు అన్నీ మనుషుల కోసం రాసినవి గాబట్టి కుక్కని హింసించిన వాళ్లకి వెయ్యాల్సిన శిక్షలు లేకనో యేమో రాముడు ఆ కుక్కనే అడిగాడు,"ఏ శిక్ష వెయ్యమంటావో నువ్వే చెప్పు!" అని.దానికి కుక్క ఏదైనా ఒక అలయానికి ధర్మకర్తగా వెయ్యమంది.ఇదేమి తిరకాసో రాముడికే అర్ధం కాలేదు."భగవత్సేవకి నియోగించటం శిక్ష ఎలా అవుతుందబ్బా!" అని ఆయనకీ అనిపించి ఉండవచ్చు - కుక్కనే అడిగాడు.దానికి కుక్కగారు,"అయ్యా!గతజన్మలో నేనూ ఒక ఆలయానికి ధర్మకర్తనే.కక్కుర్తి కొద్దీ దేవుడి సొమ్ము సొంతానికి వాడుకున్నాను.అందుకే ఈ జన్మలో ఈ బతుకు దక్కింది.వీడికీ అదే జరిగీతే చెల్లుకుచెల్లు హళ్ళికిహళ్ళి అవుతుంది - నా కక్ష తీరుతుంది, వీడి రోగం కుదురుతుంది!" అని చెప్పింది.కధని కల్పించిన రచయిత ఇందులో చాలా నీతుల్ని ఎక్కించాడు - ఒక సామాన్యుడు చేసిన తప్పునే అసామాన్యుడు చేస్తే శిక్ష కూడా అధికంగా ఉంటేనే సమన్యాయం అవుతుంది,మందిసొమ్ముని సొంతానికి వాడుకోవటం ఎవరు చేసినా పాపమే - ఇత్యాదయః చాలా నీతుల్ని ఒక చిన్న కధలో ఇమిడ్చాడు!

     ప్రభుత్వాధికారిగా ఉన్నందువల్ల తమ ప్రభుత్వం చేసిన తప్పును సమర్ధించుకోవాల్సిన దుస్థితి వనం వారిది - దానికి నేను సానుభూతి వ్యక్తం చేస్తున్నాను!ఆయన రాస్తున్న రామాయణం చదివి ఆనందిస్తున్న నేను ఆయన్ని నేను క్రూరంగా విమర్శించలేను - కానీ అది ఖచ్చితంగా తప్పే!నేను కొత్తగా వాదనల్ని వింపించాల్సిన అవస్రం లేదు - శ్యామలీయం వ్యాసంలో చేసిన వాదనా జై గొట్టిముక్కల వ్యాఖ్యలలో చేసిన ప్రశ్నాపూర్వకప్రతిపాదనలూ చాలు.అసలు విషయానికి సంబంధించిన తీర్పు అయిపోయింది గానీ కొసరు విషయం మాత్రం - అక్కద కేసీయార్ చేసినదాన్ని ప్రముఖహిందూబ్లాగర్లు అరిభీకరంగా సమర్ధించటం - వింతగా అనిపించింది!

     ముస్లిముల హజ్ యాత్రకి ప్రభుత్వం డబ్బిస్తే అది సెక్యులరిజమా,హిందూ అలయానికి ఆభరనాలు ఇస్తే మతతత్వమా అనే సవాలు విసురుతున్నారు!అంటే ముస్లిములకి హజ్ యాత్రకి డబ్బివ్వతాన్ని వీఉ ఆనాడు వ్యతిరేకించి ఈనాడు హిందువుల ఆలయానికి ఆభరణాల్ని సమర్పించటాన్ని సమర్ధించటం ద్వారా వీరిని వీరు ఎక్కడ నిలబెట్టుకుంటున్నారు?హజ్ యాత్రకి డబ్బివ్వటం వల్ల ఏం జరిగిందో తెలుసా?1950ల నాడు హజ్ యాత్రికులు చాలా తక్కువమంది ఉండేవాళ్ళు.హజ్ యాత్ర మొత్తం హిందూ సంప్రదాయమే,ఇస్లాము మతం పుట్టకముందు అది హిందూ దేవాలయమే,ప్రవక్తగా మారకముంది అహ్మద్ ఖురేషీ కూడా మక్కా మందిరం చుట్టూ సవ్యదిశలోనే ఏడు ప్రదక్షినలు చేసేవాడు - అన్ని ఖురేషీ ప్రార్ధనా విధుల్నీ పాటించేవాడు!కొత్త మతాన్ని స్థాపించాక కూడా వాటినే కొనసాగించాడు,కానీ ప్రాధాన్యతని అత్గ్గించాడు.తప్పనిసరి తద్దినంగా సంవత్సరాని కొకసారి అని ఉంచేసి విగ్రహారాధనని తీవ్రంగా వ్యతిరేకించాడు.అంతర్జాతీయంగా షియా,సున్నీ అనే ప్రముఖమైన భెదాలతో పాటు అరబిక్ ఇస్లాం,ఇండిక్ లేదా వైదిక్ ఇస్లాం అనే మరొక విభజన కూదా తయారైంది ఉపఖండంలోని అన్ని ప్రభుత్వాలూ పోటీపడి హజ్ యాత్రలకి ప్రోత్సాహకాలు ఇవ్వటం వల్ల!

     పక్కనే ఉన్నా అరబ్బులు ఎక్కువగా హజ్ యాత్రకు అంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు కాదు,మనవాళ్ళు మాత్రం ప్రభుత్వం దబ్బిస్తున్నాది కదాని ఎగేసుకు పోయేవాళ్ళు.ఆ మధ్యన మక్కాలో మందిరానికి అతి దగ్గిరగా పేలుళ్ళు జరిగితే చాలామంది ఇండిక్  ఇస్లాం మేధావులు ఖంగారు పడ్డారు!ఆ పని చేసింది అరబిక్ ఇస్లామును పాటించేవాళ్లు,చేసింది  ఈ వైదిక పద్ధతులు నచ్చక!ఆ రకంగా హజ్ యాత్రలకి డబ్బివ్వటం వల్ల మంచికన్నా చెడే ఎక్కువ జరిగింది.మరి హిందువులు కూడా పులిని చూసి వాత పెట్టుకున్న నక్కలా ఇవ్వాళ అదే తప్పు చేసి రేపు అదే  రకం బురద నెత్తిన రుద్దుకోవాలా?సెక్యులరిజం అనే డొల్ల సిద్ధాంతాన్ని పాటించకపోతే పోనివ్వండి,సనాతన ధర్మం చేప్పే సర్వధర్మసమభావనకీ తూట్లు పొడవడం దేబికి? హిందూమతం మీద దాడి జరుగుతున్నది అనేది వాస్తవమే!కానీ ఆ బూచిని చూపించి కొత్తగా పక్షపాతం అలవాటు చేసుకోవడం అనవసరం - తమ్ముడు తనవాడైనా ధర్మమే చెప్పాలి!

తొక్కలో డెమోక్రసీ!తొక్కలో సెక్యులరిజం!తొక్కలో హిందూత్వం - ధర్మం అన్నిటికన్న ముఖ్యం!!

62 comments:

 1. వ్యాసం వ్రాసినతరువాత ప్రూఫ్ రీడింగ్ చెయ్యకుండా పబ్లిష్ చెయ్యకండి. చదవడం కష్టంగా ఉంటుంది.

  ReplyDelete
  Replies
  1. OK,I agree with you.Next Time I will correct that mistake.
   thanks for your suggestion!

   Delete
 2. హజ్ (తీర్థయాత్ర) అనేది ఇస్లాం మతం యొక్క అయిదు స్థంభాలలో ఒకటి. అయితే (ఆర్ధిక & శారీరిక) స్థోమత ఉన్నవారికే ఈ యాత్ర చేసే అవసరం ఉంటుంది.

  సూరా 3 శ్లోకం 97 (యూసుఫ్ అలీ తర్జుమా):

  In it are signs manifest; (for example) the Station of Abraham; whoever enters it attains security; pilgrimage thereto is a duty men owe to Allah those who can afford the journey; but if any deny faith Allah stands not in need of any of his creatures

  అనారోగ్యంతో ఉన్నవారు హజ్ చేయకూడదు. యాత్ర ఖర్చు సొంత ధనంతో భరించాలి తప్ప అప్పు చేసో ప్రభుత్వం రాయితీతో కాదు.

  ఉన్నత న్యాయస్థానం షేక్ భీకన్ తీర్పు (2012) కారం కేంద్ర ప్రభుత్వం హజ్ సబ్సిడీని ప్రతి ఏడూ తగ్గిస్తూ 202 వరకు పూర్తిగా ఎత్తేయాలి.

  ReplyDelete
  Replies
  1. 2022 వరకు పూర్తిగా ఎత్తేయాలి

   Sorry for the typo!

   Delete
  2. 2022 వరకు పూర్తిగా ఎత్తేయాలి

   Sorry for the typo!

   Delete
  3. 2022 ’’నాటికి‘‘ అనాలి. ఇంగ్లీషు, తెలుగు నుండి అనువదించేటప్పడు మన స్వంత భాషనే మనం మరచిపోతాం

   Delete
 3. 1. హిందువుల ఆలయానికి ఆభరణాల్ని సమర్పించటాన్ని సమర్ధించటం

  నేను కె.సి.ఆర్. ని సమర్ధించాను. ఆయన ఒకసారి వెంకన్నకు ఆభరణాలు ఇవ్వటం లో తప్పేమి లేదు. ప్రతి సంవత్సరం పోయి కోట్ల రూపాయల ఆభరణాలు ఇస్తే విమర్శలు చేయటం వేరే విషయం.

  2. ఎన్నికల సమయంలో ప్రజలకి ఇళ్ళు కట్టిస్తామని, బి.సి.లకి, యస్.సి.లకి ,మైనారిటిలకి, స్రీలకి ఇన్ని ఇన్ని కోట్లు అధికారంలోకి వస్తే కేటాయిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక అమలుచేస్తారే, దేవుడికి ఒక ఐదు కోట్ల వాగ్దానం చేసి(మొక్కునుమొక్కుకొని) గెలిచిన తరువాత ఇస్తే తప్పేలా అవుతుంది? ప్రజలకు చేసిన వాగ్దానాలు మీటీంగ్ లో ప్రజలకి చెపుతారు. దేవుడికి చేసిన వాగ్దానం దేవుడికి (మనసులో) చెప్పుకొన్నాడు. అందులో తప్పు పట్టటానికి ఎముంది?

  ప్రజల టాక్స్ డబ్బులను దేవుడికి ఖర్చు పెడుతున్నారని అనేవాళ్ళు, దేవుడు కూడా టాక్స్ కడుతున్నాడని తెలుసుకోవాలి. వేల కోట్ల దేవుడిని సొమ్ములను మాత్రం ప్రభుత్వలు తీసుకోని ఖర్చు చేసుకోవటం లేదా? ఇది ప్రభుత్వం దేవుడి పై వేసే ఒక రకమైనా టాక్స్ కాదా? దేవాలయాల సొమ్ము ఖర్చు చేసేటప్పుడు, వస్తువులపై విధించే పరోక్ష పన్నులు కూడా సామాన్య మానవుల వలే దేవుడు కడుతున్నాడు కదా!

  ReplyDelete
  Replies
  1. నేను,మీరు,నీహారిక,శ్యామలీయం - మనలో ఎవ్వరినా ఏ గుడికైనా వెళ్ళి అష్టోత్త్రం చేయించాలంతే పకక్వాళ్లని అడిగి దబ్బు తీసుకుని చేస్తామా?అయిదు రూపాయలు పెట్తి ప్రముదలో దీపం వెలిగించాలన్నా మ్న జేబు నుచే తియ్యాలి తప్ప ప్కక్వాళ్ళని అదగటం పద్ధతి కాదు,అవునా?

   దేవుణ్ణి మన కష్టార్జితాన్ని మనకి న్యాయంగా వచ్చేలా కోరుకోవాలి = అది మాత్రమే భక్తి!మొక్కులు చెల్లించుకున్నా పూజలు చేసినా మన కష్టార్జితం నుంచే దేవుడికి కానుకలు సమర్పించాలి - అది సంప్రదాయం!

   ప్రజలకి ఇచ్చే హామీలూ దేవుడికి కోరుకునే మొక్కులూ ఒకే క్యాటగిరీ కిందకి రావు.చెయ్యకూదని పని ఒక రాజకీయ నాయకుడు ఒక్కసారే చేసాడు లెమ్మని అంటే దేశంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికీ ఒక్కోసారి చేసే చాన్సు ఇవ్వాల్సి వస్తుంది - ఇస్తారా?

   Delete
  2. మీరు నేను వ్యక్తులం కనుక అష్టోత్త్రం చేయించాలంటే టికెట్ కొంటాం. కె.సి.ఆర్. వ్యక్తి కాడు. ఆయనా రాజకీయ వాదిగా, ఉద్యమనాయకుడిగా, ఒక వ్యవస్థ లో కీలక భాగం, కనుక ఆయన మొక్కులు కూడా ఆయన వ్యక్తిగతం కాదు. ఆ మొక్కులు తెలంగాణ ప్రాంత ప్రజలకోసమే. ఒక ఉదాహరణ ఇస్తాను. ఏ ప్రభుత్వోద్యోగి కూడా దేవాలయం లో పార్కింగ్ చేసినప్పుడు, అతని వాహనానికి పార్కింగ్ రుసుం అడగరు. కారణం దేవాలయం ఎండౌమెంత్ అనే ప్రభుత్వ శాఖ కిందకు వస్తుంది, పార్కింగ్ చేసినది కూడా ప్రభుత్వ వాహనం కాబట్టి పార్కింగ్ చార్జెస్ అడగరు. రేపు కె.సి.ఆర్. అష్టోత్త్రం చెల్లించాలంటే ప్రభుత్వ సిబ్బందే టికేట్ తెచ్చి ఇవ్వవచ్చు. అందులో తప్పేమి లేదు. ఐతే పూజ చేసేటప్పుడు పేరు,గోత్రం అడుగుతారు కాబట్టి అది వ్యక్తిగతం అంటారేమో! పేరు,గోత్రం అడగటమనేది ఆలయాలలోని హిందూ సాంప్రదాయం లో భాగం. కనుక కె.సి.ఆర్. పేరు,గోత్రం చెప్పాడు గదా,టికెట్ డబ్బులు కట్టకుండా పూజ చేయించుకొన్నాడు కదా! అని ఆ పూజను వ్యక్తిగత పూజగా భావించకుడదు కదా!

   2.

   Delete
  3. ప్రజలకి ఇచ్చే హామీలూ దేవుడికి కోరుకునే మొక్కులూ ఒకే క్యాటగిరీ కిందకి రావు

   ఏం దేవుడి కి పెళ్ళాం,పిల్లలు, మిత్రులు లేరా? వాళ్లకి ఖర్చులు లేవా? ఒక గృహస్థు ఇంటికి ఎమేమి అవసరమౌతాయో అవే ఖర్చూలు, అవసరాలు దేవుడికి ఉన్నాయి, బాబు. ఆయన మాములు మనిషిలా స్నానం (అభిషేకం) చేస్తాడు, దుస్తులు ధరిస్తాడు, తిండి తింటాడు (నైవేద్యం), పెళ్ళానికి పూలు కొనిస్తాడు ఇలా అన్ని చేస్తాడు. ఎన్నికలలో ఓట్ ఒక్కటి వేయనంత మాత్రాన ఆయనకి రాజకీయ నాయకులు/ప్రభుత్వాధినేతలు ఏ హామిలు(మీ దృష్టిలో మొక్కులు) ఇవ్వకుడదు అంటే ఎలా? మరి ఇదే ప్రభుత్వాధినేతలకు అవసరమైతే దేవుడి డబ్బులు వేలకోట్లలో తీసుకోవచ్చా?

   *ప్రతి రాజకీయ నాయకుడికీ ఒక్కోసారి చేసే చాన్సు ఇవ్వాల్సి వస్తుంది - ఇస్తారా?*

   ఇదే ప్రశ్న నన్ను అడిగేపదులు, ప్రతిపక్షం లో కె.సి.ఆర్. ను విమర్శించేవారు, నేను తెలంగాణ వస్తే దేవుడికి మొక్కులు చెల్లిస్తాననుకొన్నాను. డబ్బులు ఇవ్వండి అని ఎవరైనా కె.సి.ఆర్.ను అడిగినట్లు మీ దృష్టికి వచ్చిందా? లేదే! దేవుడి మీద నమ్మకం, మొక్కులు మొక్కునే భక్తి రాజకీయ నాయకులందరికి రాదు. ఒకవేళ ఎవరికైనా ఉన్నా కె.సి.ఆర్. లా చేసే వారు లేరు. మనరాజకీయ నాయకులందరు సూడో సెక్యులర్ మంత్రం వల్లేసుకొంట్టూ, దేవుడికి నగలు చేయించవచ్చు అని ధరియం చేసి ఆలోచించే సామర్ధ్యం కూడా లేని వారు. కె.సి.ఆర్. ఒక్కడే దేవుడికి నగలు ఇవ్వగలిగాడు. మిగతావారు సూడో సెక్యులర్ ప్రభావంచేత అది తప్పు అని వాదిస్తూ కూచొన్నారు. కనుక వాళ్ళు రేపు దేవుడికి నగలిస్తామనే ఆలోచన చేయలేరు.

   Delete
  4. శ్రీరామ్ గారూ, రెంటికీ తేడా ఉందండీ.

   రాజకీయ నాయకులు తమను గెలిపిస్తే ఇళ్ళు, ఫలానా కులాలకు రాయితీలు వగైరా పనులు చేస్తామని వాగ్ధానాలు చేయడం పరిపాటి. ఇవన్నీ ప్రజాధనంతోనే చేస్తామని వారు ప్రత్యక్షంగా చెప్పకపోయినా అదే తాత్పర్యం (implicit assumption). వారికి పడ్డ ఓట్లలో కొన్నయినా సదరు హామీల ఆధారంగా వచ్చాయని presume చేయవచ్చు.

   కెసిఆర్ గారు తెలంగాణ వస్తే ("తాము అధికారంలో వస్తే" కాదు) తిరుమల, బెజవాడ, అజమేర్ తదితర దేవాలయాలకు ఏవేవో మొక్కులు చెల్లించుకుంటానని సంకల్పించారు అది ఆయన సొంత విషయం. తమకు ఓటేసి గెలిపిస్తే సదరు మొక్కులు మీ డబ్బుతో తీర్చుకుంటానని ఎన్నికల హామీ పత్రంలో (manifesto) రాయలేదు సరికదా తన మొక్కుల ముచ్చట ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు.

   కెసిఆర్ తిరుమలలో ఆభరణాలు, ఆఙమేరులో చాదర్ వగైరా సమర్పించడాన్ని నేను తప్పు పట్టలేదు. అయితే పైని చెప్పిన విషయాల నేపథ్యంలో సదరు మొక్కులకు ప్రజాధనం వాడడానికి ఆయన ప్రజల ఆమోదం తీసుకోలేదు. అంచేత ఇది దుర్వినియోగం అవుతుంది.

   Delete
  5. @UG
   ఏం దేవుడి కి పెళ్ళాం,పిల్లలు, మిత్రులు లేరా? వాళ్లకి ఖర్చులు లేవా? ఒక గృహస్థు ఇంటికి ఎమేమి అవసరమౌతాయో అవే ఖర్చూలు, అవసరాలు దేవుడికి ఉన్నాయి, బాబు. ఆయన మాములు మనిషిలా స్నానం (అభిషేకం) చేస్తాడు, దుస్తులు ధరిస్తాడు, తిండి తింటాడు (నైవేద్యం), పెళ్ళానికి పూలు కొనిస్తాడు ఇలా అన్ని చేస్తాడు.

   hari.S.babu
   ఆ ఒక్కటీ మాత్రం బాకీ ఎందుకు/ఆయనకీ ఓటు హక్కు ఇవ్వండి - ఆ సగం దరిద్రం కూడా పోయి అంతా రంకుబొంకు అయిపోతుంది.సగం మంది అజ్ఞానంలో సగం మంది విజ్ఞానంలో ఉంటేనే గొడవ -అందరూ అజ్ఞానంలోనే ఉంటే అంతా ప్రసాంతమే,ఇస్లాము చెప్పేదీ ఇదే కదా!అప్పలాచార్య సన్నిధౌ ఆనాచార భయం నాస్తి అని ఒకాయన అంటే తిష్ఠంతి మూత్ర విసర్జనం అని మరొకాయన వెక్కిరించిన సంగతి గుర్తుకొస్తుంది నాకు :-)

   Delete
  6. సదరు మొక్కులకు ప్రజాధనం వాడడానికి ఆయన ప్రజల ఆమోదం తీసుకోలేదు.


   వచ్చే ఎన్నికల ప్రచారంలో మీ ముఖ్యమంత్రిని ఈ పాయింట్ చేర్చమనండి. నేను వెంకటేశ్వర స్వామికి 6కోట్లరూపాయల మొక్కులు చెల్లించాను. దానిని కాంగ్రెస్ వాళ్ళు,ప్రతిపక్షాలు నన్ను తప్పుపడుతున్నారు. మీరు తప్పనుకొంటే నాకు ఓటేయొద్దు. వెంకటేశ్వర స్వామికి మొక్కులు తీర్చటం ఒప్పనుకొంటే నాకు తప్పక ఓటేయండి అని ప్రజలను కోరమను. వచ్చే ఎన్నికలలో కె.సి.ఆర్. గెలుపు నగల బహుమతికి రెఫెరెన్స్ లా ప్రచారం చేయండి.


   Delete
 4. తెరాసా మంత్రులెప్పుడూ తెలంగాణా రాష్ట్రం అంటే ఒప్పుకోరు. తెలంగాణా రాజ్యం అనాలంట. మరి రాజ్యంలో రాజే కదా గొప్ప. వాళ్ళు మొక్కినా, మొత్తినా ప్రజలు నోరు మూసుకోని కూర్చోవాలి. లేదంటే వాళ్ళు తెలగాణా వ్యతిరేకులు. సీమాంధ్రుల చేతిలో కీలు బొమ్మలు. సమజైందా గోంగూరా??

  ReplyDelete
 5. కెసిఆర్ తన మొక్కులు తీర్చుకున్నది పన్నుల ఆదాయం నుండి కాదని, కామన్ గుడ్ ఫండ్ నుంచని, అంచేత తప్పు లేదని కొందరు వాదించారు.

  1. CGF కూడా ప్రజా ధనమే. అయితే వీటిని ఎలా వాడాలో అన్న విషయంపై కొన్ని నిబంధనలు ఉన్నాయి. సంపన్న దేవాలయాలలో హుండీ, ప్రసాదం విక్రయం లాంటి నిధులను తక్కువ సంపాదన ఉన్న దేవాలయాల అభివృద్ధి, అట్టడుగున ఉన్న పూజారుల సంక్షేమం లేదా భక్తుల సదుపాయం లాంటి వాటికి వాడడం ఒక ముఖ్యోద్దేశం. కెసిఆర్ మొక్కుకున్నది తిరుమల బాలాజీ, బెజవాడ కనకదుర్గ & అజమీర్ గరీబ్ నవాజు లాంటి అత్యంత సంపన్న దేవాలయాలలోనే.

  2. ఆయా దేవాలయాలకు ఉన్న కోట్లాది భక్తులలో కెసిఆర్ ఒకరు, ఆయనకు ఇతర భక్తులకు తేడా లేదు. తెలంగాణా వస్తే ఫలానా గుడిలో ఫలానా కానుక ఇచ్చుకుంటామని లక్షలాది మంది మొక్కుకుని ఉంటారు. అవన్నీ ఇప్పుడు CGF నిధులతో ఇవ్వమంటే ఇస్తారా?

  ReplyDelete
  Replies
  1. @ జై, ఇదనే అని కాదు కాని, దేవాలయాల విషయంలో నా అభిప్రాయం ఎమిటంటే, వాటి దగ్గర ఉన్న సొమ్మును మీద ప్రభుత్వ ఆధిపత్యం పోవాలి. హిందూ మత సంస్థలకు వాటిని స్వాధీనం చేయాలి. ఆ తరువాత టి.టి.డి. లాంటి మంచి టిం ఏర్పాటు చేసి, ఆ సొమ్ములతో విద్యా,వైద్యం, ఒకపూట భోజనం ఏర్పాటు చేయాలి. దీనివలన మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.వారిమీద ప్రభుత్వం వేసే ఆర్ధిక భారం తగ్గుతుంది. ఆంధ్రానే తీసుకోండి రూపాయి బియ్యం పథకం నడపడానికి తాగుడును ప్రోత్సహిస్తున్నారు. మధ్యతరగతి పై విపరీతమైన టాక్స్ లు వేస్తున్నారు. ఈ ప్రజోపపథకాల పీకి పారేసి, వాటి భారాన్ని ని దేవాలయాల కు,చర్చ్,మసీద్ మొదలైన ఆధ్యాత్మిక సంస్థలకు తరలించాలి. అప్పుడే మధ్యతరగతి బతికి బట్టకడుతుంది.

   దేవాలయాలను ప్రభుత్వం నుంచి విముక్తి చేయటానికి సుబ్రమణ్య స్వామి లాంటి వారు పోరాడుతున్నారు. ఈ పని చేస్తే రాజకీయ పార్టిలకు ప్రజల్ను అపీజెమంట్ చేయటానికి కొత్త నినాదాలు కావాలి. ఆ బాధలేవో అవే పడాలి.

   టిటిడి తరువాత,దేవాదాయ శాఖకు 900కోట్ల ఆస్థులు కలిగిన వి.ఆర్. కాలేజ్ పరిస్థితి ఎలా ఉందో చూడండి.

   http://www.zaminryot.com/2017/10032017/news15.html
   http://www.zaminryot.com/2017/10032017/news14.html

   వివేకా దొంగ ఏడుపుకు నారయణ డంగయ్యాడా?

   http://www.zaminryot.com/2017/17032017/news16.html
   http://www.zaminryot.com/2017/17032017/news14.html

   Delete
  2. మతపరమయిన విషయాలు ముఖ్యంగా ప్రార్థనా స్థలాలపై ప్రభుత్వ ఆజమాయిషీ ఉండకూడదని నేనూ అంటున్నాను.

   మతానికొక (లేదా "తెగ"కొక) "ధర్మ పరిషద్" ఏర్పాటు చేయాలి. సదరు పరిషత్తుకు ఆ మత పాలన వ్యవస్థ పూర్తిగా అప్ప చెప్పాలి. పరిషత్తు సభ్యులు ఆచారాలు, పురాణాలు లాంటి విషయాలలో ప్రావీణ్యం ఉన్నవారై ఉండాలి. వారికి రాజకీయాలు & వ్యాపారాలతో ఎటువంి సంబంధం ఉండరాదు. పరిషత్తులకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు (ఉ. ఆస్పృశ్యతపై నిషేధం) విధించవచ్చును. అయితే ఈ నిబంధనలు minimalistగా ఉండాలి తప్ప అనవసర జోక్యాలకు తావు ఇచ్చే విధంగా ఉండరాదు.

   గతంలో కేవీ రమణాచారి గారు ఇటువంటి ప్రతిపాదనను తీసుకొచ్చారు, కెసిఆర్ కూడా దీనికి సానుకూలమేనని విన్నాను.

   Delete
  3. దేవాలయాల సంపదపై వచ్చే ఆదాయాన్ని విద్యా, వైద్యం, భోజనంల తో పాటుగా యోగ, చిత్ర లేఖనం, ఆటలకొరకు ఖర్చు చేయటం,మంచి సంగీత కళాశాలలు పెట్టి అందులో నాదస్వరం వంటి వాయిద్యాలు, తోలుబొమ్మ లాటలు,ఉగ్గుకధలు మొదలైన వాటి కోర్స్లను ఊరూరా పెట్టి, ఆ విద్యార్ధులకు రాష్ట్రస్థాయిలో పోటిలు పెట్టి, బహుమతులిచ్చి ఒక కెరీర్ గా తీసుకొనేటట్లు ప్రోత్సహించి ఉండవచ్చు. ఈ కళాశాలలో పనిచేసేవారికి మంచి జీతాలు వచ్చేటట్లు చేస్తే ఎంతో మంది వాటిని కెరీర్ గా ఎన్నుకొని ఉండేవారు. మన వాళ్లు గత 30ఏళ్ళుగా ఇంజనీరింగ్,మెడికల్ పై ఫోకస్ పెట్టి ఎంతో మందిని తయారు చేశారు. అదే వందల ఏళ్ళుగా ఉన్న ఈ సంగీత,ఆటల రంగాలను సైన్స్ విద్య పేరుతో పూర్తి నిర్లక్షం చేసి ఇప్పుడు పిల్లలకు పోటి ఎక్కువైపోయి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

   బ్రిటీష్ ఏజెంట్ పెరియర్, ఆయన అనుచరులు (వీళ్ళ సంఖ్య తెలుగునాట కూడా తక్కువేమికాదు) బ్రాహ్మణ వ్యతిరేకోద్యమ సమయం లో హిందువులు పాటించే ప్రతిది తప్పు పట్టి హిందూ సంస్కృతిని నాశనం చేశారు. దాని వలన బ్రాహ్మణులతో పాటు ఇతర కులస్థులకు చాలా అన్యాయం జరిగింది. దేవాలయాల దగ్గర ఎంతో సంపద ఉంటే రాజకీయాలలో ఉన్న పెరియార్ వారసుల బాచ్ అంతా స్వాహచేశారు, ఆధునికతను ప్రోత్షహించే ప్రగతిశీల వాదులులా ఉపన్యాసాలుదంచే సినేమాలను తిసి, రాజాధికారాన్ని చేపట్టి, వేలకోట్ల దేవుడి డబ్బులను దిగమింగి,నయా జామీందారులుగా అవతరించారు.

   Tamilnadu Hindu Temple Loot

   https://storify.com/ranganaathan/tamilnadu-hindu-temple-loot

   Delete
 6. @UG SriRam:

  "కె.సి.ఆర్. వ్యక్తి కాడు. ఆయనా రాజకీయ వాదిగా, ఉద్యమనాయకుడిగా"

  ఉద్యమంలో ఎందరో ఎంతో చేసారు. అందరికీ ఏవో మొక్కులు ఉండే ఉంటాయి, అవన్నీ తెలంగాణా కోసమే. అంతెందుకు కెసిఆర్ చండీ యాగం కూడా తన తెలంగాణా మొక్కులలో భాగమే, దానిని ఆయన తన సొంత డబ్బులతో నిర్వహించారు కదా.

  "కె.సి.ఆర్. ఒక్కడే దేవుడికి నగలు ఇవ్వగలిగాడు"

  గాలి జనార్ధన రెడ్డి కూడా కిరీటం ఇచ్చారు కానీ సొంత డబ్బులతో.

  ReplyDelete
  Replies
  1. @జై, ఉద్యమంలో ఎంతో మంది పాల్గొని ఉండవచ్చు, అందరిని ప్రజలు ఎన్నికలలో గెలిపించారా? ముఖ్యమంత్రిని చేసారా? మనకి నచ్చినా నచ్చకపోయినా నాయకుడికే క్రెడిట్ వస్తుంది. నేను చెప్పవలసింది ఇంతక్రితమే చెప్పాను. దేవుడికి నగలు ఇవ్వటం విషయంపై ప్రజామోదం లేకపోతే, వచ్చే ఎన్నికలలో దానిపై చర్చకు పెట్టి, కె.సి.ఆర్.కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ప్రజాభిప్రాయం కూడగట్టమనండి. నాకు తెలంగాణ అంటే పెద్ద ఆసక్తి లేదు. హైదరాబాద్ ఒక్కటే నాకు తెలిసిన ఊరు. మూడు నెలల క్రితం పోతే అక్కడ రోడ్లు అమీర్ పేట, బంజారా హిస్ల్ మొదలైన ప్రాంతాలలో చాలా దెబ్బతిని ఉన్నాయి. ఎది ఎమైనా రాష్ట్ర విభజన వలన కోస్తా ఆంధ్ర అద్భుతం గా అభివృద్ది చెందబోతున్నాదని తెలుస్తున్నాది. ఇప్పటికే ఆ ఛాయలు తిరుపతి వంటి పట్టణంలో కనిపిస్తున్నాది. గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణం మొదలైన ప్రాంతాలు విభజనానంతరం మునుపటికన్నా పరిస్థితి మెరుగయ్యి అభివృద్ది దిశగా వెళుతున్నాయనుకొంటాను.

   Delete
  2. "మనకి నచ్చినా నచ్చకపోయినా నాయకుడికే క్రెడిట్ వస్తుంది"

   ఉద్యమంలో కెసిఆర్/తెరాస పాత్ర నేను తక్కువ చేయలేదు.

   మీకు తెలంగాణా గురించి పెద్ద ఆసక్తి లేదు. అంచేత తెలంగాణా ఆవిర్భావానికి చారిత్రిక అంశాలు ఏమిటో కారకులు ఎవరో లాంటి ప్రశ్నలను మీతో చర్చించడం అవసరం కాదని భావిస్తాను. హరిబాబు గారి టపా ఉద్దేశ్యం కూడా తెలంగాణా ఏర్పాటు కాదు కాబట్టి ఈ సంగతి ఇక్కడితో వదిలేద్దాం.

   Delete
 7. >>>>తెలంగాణా వస్తే ఫలానా గుడిలో ఫలానా కానుక ఇచ్చుకుంటామని లక్షలాది మంది మొక్కుకుని ఉంటారు. అవన్నీ ఇప్పుడు CGF నిధులతో ఇవ్వమంటే ఇస్తారా?


  ఎంతమందైనా మొక్కుకోవొచ్చు, ఎంతైనా సమ్ర్పిచుకోవొచ్చు. కానీ అవి గుళ్ళకి మాత్రమే మొక్కుకోవాలి, చర్చిలకి,మసీదులకి మొక్కరాదు. అంతేనా యు జి శ్రీ రాం?

  ReplyDelete
  Replies
  1. ఆ మాట అన్నది నేను కాదు. జై గొట్టిముక్కల

   Delete
  2. నేను అలా అనలేదండీ. గుళ్ళలో & *దర్గాలలో* కెసిఆర్ గారి *వ్యక్తిగత* మొక్కులను *ప్రజాధనంతో* తీర్చడాన్ని మాత్రమే వ్యతిరేకించాను.

   Delete
  3. ఎంతమందైనా మొక్కుకోవొచ్చు, ఎంతైనా సమ్ర్పిచుకోవొచ్చు.
   కానీ అవి గుళ్ళకి మాత్రమే మొక్కుకోవాలి, చర్చిలకి,మసీదులకి మొక్కరాదు. అంతేనా యు జి శ్రీ రాం?

   ఎవరు ఏ దేవుడికి మొక్కు కొంటారో, వాళ్లకి అవి చెల్లించుకొంటారో అది వాళ్ల ఇష్టం. ఐతే హిందూ సంస్థలకి ఇస్తే ప్రజలందరికి ఉపయోగపడతాయి. ఉదా||
   మా వీధిలో కూరలు,పండ్లు అమ్మే అతను ముస్లిం.సుమారు 70సం|| ల వృద్దుడు. అకస్మాత్తుగా ఆరోగ్యం బాగలేక తిరుపతి స్వింస్ కి వెళ్ళాడు.అక్కడ మూడు రోజులు ఉండి ఆపరేషన్ చేయించుకొచ్చాడు. ఆయనను ఎవ్వరు నువ్వు ముస్లింవి. హిందూ ధార్మిక సంస్థలో నీకు వైద్యం చేయము అని తిప్పిపంపలేదు. అదే అన్యమత ధార్మిక సంస్థలలో వారి మతం కాని వారికి ఉచితంగా సేవ చేయరు. సరికదా హిందువులైతే మతం మారమని ప్రోత్సహిస్తారు. క్రైస్తవ సంస్థలో హిందువులు పోతే మతం మారుతాడన్న ఆశ అన్నా వైద్యం చేస్తారేమ్మో గాని, అదే సాయిబులు పొతే వీడెలాగు మారడు అని మొదటనే గేటు దగ్గర నుంచి వెనక్కి పంపినా పంపుతారు.


   Delete
  4. * గుళ్ళకి మాత్రమే మొక్కుకోవాలి, చర్చిలకి,మసీదులకి మొక్కరాదు. అంతేనా యు జి శ్రీ రాం? *

   చర్చ్ దగ్గర లెక్కించలేనంత సంపద ఉంది. ఇంకా చర్చ్ లకు బీద భారతీయుల ధన సహాయం ఎందుకు? ప్రపంచం లో అటు కేపిటలిస్ట్ లను ఇటు కమ్యునిస్ట్ రష్యా దేశాలను అన్నిటికి అండగా నిలుస్తూ, పశ్చిమదేశాల ఆధిపత్యం ప్రపంచం మీద కొనసాగేటట్లు చూస్తూంట్టుంది. వ్యాపారం లో నష్టాలు వచ్చినప్పుడు కార్పోరేట్ కంపెనీలకు వాటికన్ చర్చ్ ధనసహాయం చేసి,వాటిని రక్షించి, ఒడ్డునపడేస్తుంది. అంతేనా వాటికన్ చర్చ్ చేయని వ్యాపారం లేదు.

   1. Gerald Posner – God’s Bankers (HBO)

   https://www.youtube.com/watch?v=aTXiSc0zVUA


   2. Wealth of Roman Catholic Church impossible to calculate

   http://news.nationalpost.com/news/wealth-of-roman-catholic-church-impossible-to-calculate

   2. How Rich Is the Catholic Church?

   Nobody really knows, because religious groups don’t need to follow regular accounting and disclosure rules

   The Catholic Church’s global spending matches the annual revenues of the planet’s largest firms, and its assets—huge amounts of real estate, St. Patrick's Cathedral, Vatican City, some of the world’s greatest art—surely exceed those of any corporation by an order of magnitude.*

   http://www.slate.com/articles/business/moneybox/2013/03/catholic_church_and_pope_francis_religious_institutions_are_exempted_from.html

   Delete

  5. Gerald Posner on the Vatican Bank- Russia Today TV

   https://www.youtube.com/watch?v=N6SjNq9JUCs

   Please read review comments on this book

   http://www.amazon.in/Gods-Bankers-History-Money-Vatican/dp/1416576592

   Delete
 8. శ్యామలీయం ప్రస్తావించిన శ్రీ పెవీఆర్కే ప్రసాద్ గారి గురించి నాకు ఒక విషయం తెలుసు.

  ఈయన స్వాతి వీక్లీలో తన జ్ఞాపకాలను చెప్పారు.చెన్నారెడ్దికి సంజయ్ గాంధీనుంచి పదవీఎగందం ఏర్పదితే అభిచార హోమం చేయించి సంజయ్ గాందీని చంపించినట్తు చెప్పుకున్నాడు!అబ్బెబ్బే,అది ఏదో అనుకోకుండానో అప్పటి పరిస్థితుల ప్రాబల్యం వల్లనో జరిగింది అనుకోవడానికి వీల్లేకుండా తర్వాత పీవీ నర్సింహారావుకు కూడా దీన్ని గురించి చెప్పి అప్పుదు చెన్నారెడ్దికి చేసిన సాయం మీకూ చెయ్యమంటారా అని అడిగినట్టూ ఆయన సానుకూలంగా స్పందించకపోవటం వల్ల రెందోసారి అటువంటి సాయం చెయ్యలేకపోయినట్టు స్పష్టంగా చెప్పాడు!

  హేతువాదులు సంజయ్ గాంధీ మరణాన్ని యాక్సిడెంట్ కింద చూడవచ్చు - కానీ చేయించిన పెద్దమనిషి మాత్రం అది యాక్సిదెంట్ కాదనీ తమ ప్రయోగం వల్లనే అది జరిగిందనీ నమ్ముతున్నాడు అనేది ఇక్కడ మనం పట్టించుకోవలసిన ముఖ్యవిషయం.అది తప్పు కాదని కూడా అనుకుంటున్నాడు.ఎంతమందినైనా ఎన్నిసార్లయినా మాంత్రికశక్తులతో చంపించటానికి సిద్ధంగానే ఉన్నాడు - ఇదేనా నిజమైన హిందూత్వం?

  చెన్నారెడ్ది ఎవరు?ఒకటి కన్న ఎక్కువ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ సభ్యుడు.ఆ పార్టీకి అన్ని రాష్త్రాల వ్యవహారాలనూ కంట్రోలు చెయ్యతానికి ఒక అధిష్ఠానం ఉంది.తన పార్టీ అధికారంలో ఉన్న రాష్త్రాలలో ముఖ్యమంత్రుల్ని మార్చుకునే అధికారం దానికి ఉంది.ఒకవేళ చెడ్ది పదవికి గండం ఏర్పడటంఅవతలివాళ్ళ పైరవీల వల్ల అయితే అతను కూడా దానికి అతీతుడు కాదు - తను కూడా పైరవీయే చేసుకోవచ్చు!అలా కాదనుకుంటే ఆ పార్టీ సభ్యులు అందరూ ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హులే కదా!అధిష్ఠానం అతన్ని మారిస్తే ఏదో భయంకరమైన ఉత్పాతం వస్తుందా?తను సంజయ్ గాంధీ ఒక్కణ్ణి అబిచార హోమంతో చంపేస్తే చెడ్డి ఆచంద్రతారార్కం పదవిలో ఉండగలడా?ఉన్నాడా?

  ఏ విధంగా చూసినా అహంకారమూ,ఆశ్రిత పక్షపాతమూ,అధికార్ దర్పమూ,పాండితీ గర్వమూ తప్ప సౌజన్యం కనిపిస్తుందా శ్రీమాన్ పెవీఆర్కే ప్రసాద్ గారిలో!ఇటువంటివారిని కూడా సాధు సజ్జనులు అని అందరూ పొగడాలి కాబోలు - కేవలం హిందువు అయినంత మాత్రాన!

  ReplyDelete
  Replies
  1. హరిబాబు గారూ,

   మీరు పీవీఅర్కే గారి నాహంకర్తా హరిఃకర్తా అన్న పుస్తకం ఒకసారి చదవండి. నేను స్వాతివీక్లీలో ఆయన రచనలు చదవలేదు - వీక్లీలు చదివే అలవాటు తక్కువ. అభిచారహోమోదంతం తమాషా మీరు చెబుతే వింటున్నాను. తనను పొగడవలసిందిగా పీవీఆర్కే గారు మిమ్మల్ని కోరుతున్నట్లుగా/కోరినట్లుగా తెలియదు.

   Delete
  2. పివీఆర్కే ప్రసాద్ గారికి హిందుత్వకు సంబంధం ఎమిటి? అసలికి ఈయన ప్రస్థావన ఇక్కడ, ఇప్పుడు ఎందుకు వచ్చింది.

   Delete
  3. సంబంధం ఉంది గనకనే ప్రస్తావించాను.మీరు దేవుళ్లకి పెళ్లాలు,పిల్లలు,కుటుంబాలు,ఆదాయలు,తలంటు స్నానాలు - మనుషులకి ఉందే అన్నీ గొదవలూ ఉన్నాయి.కేసీయార్ మొక్కుకోవటం అంటే ఆ ఫలానా దేవుడు అనబదే ఒక వ్యక్తితో కుదుర్చుకున ఒప్పందం కాబట్టి ఓటర్లకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడంతో పోలుస్తున్నారు.చేసిన వాగ్దానం నెరవేర్చకపోతేనే తప్పు అని వాదిస్తున్నారు.మీ వాదననే మరింత ముందుకి తీసుకెళ్ళే ఉదాహరణ అది.

   నిజంగా దేవుడు ఇవన్నీ అడిగాడా?ఎవరిని అడిగాడు?ఒకవైపున విశ్వమంతా ఆయన సృష్టియే అంటూ మళ్ళీ ఆయనకీ మొక్కుల ద్వారా వచ్చే డబ్బులు అవసరమే అనడం ఏంటి?మనం వస్తువుల వినిమయం కోసం ఏర్పాటు చేసుకున్నదె డబ్బు!ఈ విశాల్ సృష్టిలో డబ్బుతో పనిఉన్న మరొక జీవి లేదు.అట్లాగె గుడి గోపురాలూ,మొక్కులూ అవసరం లేదు మరే జంతువుకీ,అవునా?

   ఈ విగ్రహాలు,ఆలయాలు భక్తికి అవసరమైన ఏకాగ్రత కోసం ఏర్పర్చుకున్న రూపాలూ,భవనాలూ మాత్రమే, అవునా కాదా?మనం విలువైనవి అనేవి నిజంగా దేవతలకి మనం ఇస్తే తప్ప తీసుకోలేని అశక్తత ఉందా?

   తను చెన్నారెడ్డికి చేసిన సాయం పీవీకి కూడా చేస్తాననడం నా స్వకపోల కల్పితం ఎంతమాత్రం కాదు.అక్షరాలా చదివి చెప్తున్నదే! చదివినప్పుడె నాకు ఈ అనుమానాలు వచ్చాయి.ఒక ఐ.ఏ.యస్ ఆఫీసర్ ఒక ముఖ్యమంత్రి మరికొద్ది కాలం పదవిలో ఉండటం కోసం అట్లా చెయ్యాల్సిన అవసరం ఏమిటి అని నాకు వచ్చిన సందేహమే ఇప్పుడు బయట పెట్టాను.చదివి చాలాకాలం అయింది కాబట్టి ఆ వ్యక్తీ ఈ వ్యక్తీ ఒకరేనా మరొకరా అనేది కూడా నిర్ధారణగా చెప్పలేను.కానె చదవటం మాత్రం వాస్తవమే!

   అతని పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచి అతను ముఖ్యమంత్రి కాకుండా ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీయార్ ఇట్లా చెయగలగటం సాధ్యమా?కేసీయార్ మొక్కుకున్నప్పుడు అతను కేవలం వ్యక్తి మాత్రమే!ఇంద్ర టైపులో "అతను వ్యక్తి కాదు శక్తి" అన్నంత మాత్రాన అతనికి ఇతరుల కన్న ఏ ప్రత్యేకతా లేదు, రాదు.రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి కూడా సాంకేతికంగా ఒక యం.యల్.యే మాత్రమే. - అది ఖాయం!ఎక్కువమంది అతను మా నాయకుడు అని ఒప్పుకోవటం,ఆ ఒప్పుకోవటానికి అతను తన తెలివితేటలతో ఎక్కువమందిని గెలిపించగలగటం మాత్రమే అతను ముఖ్యమంత్రి అవటానికి కారణం - మొక్కుకుని ఇంట్లో కూర్చోకుండా ఈ కష్టమంతా ఏందుకు పడ్డాడు?

   ఒక హిందువు తన వ్యక్తిగత లక్ష్యాల్ని మొత్తం సమాజం యొక్క లక్ష్యాలుగా పులిమెయ్యటం కరెక్టయితే,ఒక ఐ.ఏ.యస్ ఆఫీసరు తనకి నచ్చిన వాడు మరికొద్దికాలం కొనసాగడానికి మాంత్రికహోమాలు చేసి అతని వ్యతిరేకుల్ని చంపించటం కరెక్టయితే, అలాంటి పనులు చెయ్యటానికి ఆ వ్యక్తుల పాప్యులారిటీ మరియు అతని రాజకీయపరమైన ఆధిక్యత వల్ల జనం నుంచి వచ్చిన అంగీకారం మాత్రమే చాలు అన్నది కరెక్టయితే అహ్మద్ ఖురేషీ తన మతవ్యాప్తి కోసం చేసిన యుద్ధాలూ,శత్రువులకి చేసిన అన్యాయాలూ కరెక్టే అవుతాయి - అతను కూడా వ్యక్తి కాదు మరి, ప్రవక్తగారు కదా!

   Delete
  4. రాజకీయ నాయకులు,ప్రభుత్వాలు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తూంటాయి.అవన్ని నెరవేరుస్తున్నాయా? లేదే! వాగ్దానం నెరవేర్చకపోతేనే తప్పు అని నేనలేదు. ఈ చర్చంతా ఆయన ఇచ్చాడు కనుక జరుగుతున్నాది. ఆయన వాగ్దానం చేసి ఇవ్వకపోయి ఉంటే చర్చే లేదు.

   2. నిజంగా దేవుడు ఇవన్నీ అడిగాడా?మనం విలువైనవి అనేవి నిజంగా దేవతలకి మనం ఇస్తే తప్ప తీసుకోలేని అశక్తత ఉందా?

   ఒకవైపున విశ్వమంతా ఆయన సృష్టియే అంటూ అనేది అద్వైత స్థితిలో ఉన్నవారు చెప్పినది. అది వాళ్లకు సరిపోతుంది. ఒక రమణ మహర్షి,యు.జి. లాంటివారికి. ఇక్కడ ప్రశ్న విశ్వమంతా ఆయన సృష్టియే అని మీకనిపించిందా? మీకాస్థితి కలిగిందా? అనేది. సాధారణంగా ఆస్థితి అందరికి రాదు. నేను అనే భావన ఉన్నంత వరకు దేవుడు భావన ఉంట్టుంది. దానిని సామాన్య ప్రజలు అర్థం చేసుకోవటానికి గుళ్ళు గోపురాలు పూజ విధానాలు ఏర్పాటు చేశారు. ఇంకా మీకు ప్రశ్నలు ఉంటే విశిష్టాద్వైత ఫిలాసఫి చదువుకోండి.

   Delete
  5. మళ్ళీ ఆయనకీ మొక్కుల ద్వారా వచ్చే డబ్బులు అవసరమే అనడం ఏంటి?

   సరే. కె.సి.ఆర్. 6కోట్ల నగలిచ్చినందుకు ఇంత ఆవేశపడిపోతున్నారు కదా! అలా ప్రభుత్వ సొమ్ము దేవుడికి ఇవ్వకుడదనుకొనే టప్పుడు, మరి ప్రభుత్వం కూడా దేవుడి సొమ్ము తీసుకోకుడదు. దేవుడిని డబ్బును పప్పుబెల్లాలా ఖర్చు చేస్తే ఆయనకు మటుకు ఎక్కడ నుండి వస్తుంది? వేలమంది ఉద్యోగులు టిటిడి లో పనిచేస్తున్నారు. వారికి జీతాలు ఎలా ఇస్తారు? తిరుపతిలో పట్టణంలో ఏ కొత్త కార్యక్రమం మొదలు పెట్టినా వెంకటేశ్వర సామి సొమ్మును, ప్రభుత్వాలు వాళ్ల ఇష్టమొచ్చినట్లు హారతి కర్పూరం లా ఖర్చు చేస్తూంటాయి. మునిసిపాలిటి,ప్రభుత్వాలు వేయవలసిన రోడ్లను 200కోట్ల తో టిటిడి నిధులను ఖర్చు పెట్టి వేస్తారు అసలికి టిటిడి చైర్మన్ గా ప్రభుత్వం ఎందుకు అధికారపార్టి వ్యక్తిని నియమించాలి? ఇలా చెప్పుకొంట్టు పోతే ఎన్నో వస్తాయి.

   Delete
  6. @UG SriRam22 March 2017 at 03:09
   విశ్వమంతా ఆయన సృష్టియే అని మీకనిపించిందా? మీకాస్థితి కలిగిందా? అనేది. సాధారణంగా ఆ స్థితి అందరికి రాదు.

   hari.S.babu
   అంటే, నిజంగా విశ్వమంతా దైవసృష్టి కాదన్నమాట!ఓరి నాయనోయ్,వ్యాసుడు కూడా అబద్ధమే చెప్తున్నాడా?విశ్వమంతా దైవసృష్టియే అని నేను ఒకానొక స్థితిలో ఉండి అలా నమ్మితేనే విశ్వమంతా దైవసృష్టి అవుతుందనియా మీ సూత్రీకరణ?
   @UG SriRam22 March 2017 at 03:09
   ఇంకా మీకు ప్రశ్నలు ఉంటే విశిష్టాద్వైత ఫిలాసఫి చదువుకోండి.

   hari.S.babu
   దీనిని దేవుడు స్వయంగా బోధించాడా?ఇది దానంతటది హఠాత్తుగా అవ్యక్తం నుండి వ్యక్తీకరించబడిన అధికారికమైన దైవవాక్యమా?ఇదొక్కటి మాత్రమే హిందువులకి సర్వసమ్మతమైన గ్రంధమా?

   Delete
  7. హిందుత్వ అనేది ఒక పొలిటికల్ ఫిలాసఫి. దానికి పి.వి.ఆర్.కె. ప్రసాద్ వ్యక్తిగత నమ్మకాలకి సంబంధం లేదు. ఇక హిందుత్వ నుంచి వచ్చిన రాజకీయ పార్టి బిజెపి గాని, ఇతర అనుబంధ సంస్థలు గాని అన్ని బహిరంగంగానే పనిచేస్తున్నాయి. ప్రజల మద్దతుతోనే అవి ఎన్నికలలో గెలుస్తున్నయి, మద్దతు లేకపోతే ఓడిపోతున్నాయి. నాకు గురుమూర్తి,సుబ్రమణ్య స్వామి ల అభిప్రాయాలు నచ్చుతాయి. మిగతా వారివి గురించి నాకు తెలియదు.


   *ఒక హిందువు తన వ్యక్తిగత లక్ష్యాల్ని మొత్తం సమాజం యొక్క లక్ష్యాలుగా పులిమెయ్యటం *

   వ్యక్తిగత లక్ష్యాల్ని సమాజం లక్ష్యాలుగా పులిమేయటం అని ఎక్కడికో పోతున్నారు. అసలికి హిందుత్వ వాదుల డిమాండ్లు తిప్పి కొడితే ఏమున్నాయి? అయోధ్య రామాలయం, విద్యాలయాల్లో సంస్కృతాన్ని ప్రవేశపెట్టటం ఇలాంటివేకదా? విదేశాలని జైయించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారా? లేదే. చాలామంది మేధావులు బిజెపి ప్రభుత్వాన్ని హిందూ రాజ్యమని గోల చేస్తూంటారు, వాళ్ళే మైనా మనుధర్మ శాస్రాన్ని రాజ్యాంగం లో చేర్చాలనే లక్ష్యం తో పని చేస్తున్నారా? లేదే! మనుధర్మ శాస్రమే లెక్కలేనన్ని సార్లు సవరించారు. కాని ఆ విషయం మేధావులు ఎప్పుడు మాట్లాడరు. ఇక మనకి లెక్కలేనన్ని దేవిదేవతలు ఉన్నారు. వారిని ఎవ్వరిని పూజించకుండా ఒక్క రాముడినే పూజించాలని ఎమైనా ఆర్డర్ జారిచేశారా? లేదే.

   హిందుత్వ వాదుల సోది అంతా తిప్పికొడితే మన డబ్బా మనం కొట్టుకోవాలనే. లేకపోతే ప్రపంచంలో ఎవ్వరు మనలను లెక్క చేయ్యరు. అందులో అసత్యమేమి లేదు. ప్రపంచంలో క్రైస్తవ,ఇస్లాం దేశాల ఆధిపత్యం కింద ఉన్నాయి. మనపోరాటం/మన డబ్బా మనం చేసుకోకపోతే/కొట్టుకోకపోతే ఎవ్వరు గుర్తించరు. పైగా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. Siva అయ్యాదురై విషయం లో అతనికి రావలసిన పేరు ను రాకుండా ఎంతో తతంగం నడచింది. ఆయన దానిని వెబ్ సైట్లో రాసి ఉన్నాడు.

   Delete
  8. 1. వ్యాసుడు అబద్దం చెపుతున్నాడని నేనలేదు. విశ్వమంతా దైవసృష్టి అనే భావన కలిగి ఉన్న వారు ప్రజలను,జంతువులను సైతం ఎప్పుడు సమదృష్టి తో చూస్తారు. ఆ విషయం లో వాళ్ళెంత అటెంటివ్ గా ఉంటారో చూడవలసినదే గాని మాటలలో చెప్పటం చాలా కష్టం. నాకైతే పుస్తకాలు చదివినపుడు ఆ భావన నిజ్మనిపిస్తుందే కాని, లోకంలో వ్యవహారానికి (ఆఫీసుకి) వెళ్ళినప్పుడు, ఎప్పుడు అనిపించలేదు.


   2. హిందువులకి సర్వసమ్మతమైన గ్రంథమా కాదా? అనేది కాదు ఇక్కడ చెప్పదలచుకొంది. ఆ ఫిలాసఫి గందరగోళం లేకుండా స్పష్టంగా అర్థం అవుతుంది. విశిష్టాద్వైత ఫిలాసఫి మూలాలు వేద, వేదాంత, హిందూ మత గ్రంథాలలోనే ఉన్నాయి. మీకు చదవాలనిపిస్తే చదవండి లేకపోతే వదిలేయండి.

   Delete
  9. @UG SriRam
   వ్యాసుడు అబద్దం చెపుతున్నాడని నేనలేదు.
   hari.S.babu
   ఒకానొక మానసిక స్థితిలో ఉండి మనం అనుకుంటేనే విశ్వం మొత్తం భవంతుడి సృష్టి అవుతందనీ,అలా అనుకోకపోతే కాదనీ అనటమే వింతగా ఉంది!హేతువాదం తీసి పక్కన పెట్టండి హిందువైన మీరు హిందువులకేనా ఇది చెప్తున్నది?

   మన నమ్మకాలతో భావాలతో దృష్టికోణాలతో సంబంధం లేకుండా గోచరం అయ్యేది మాత్రమే వాస్తవం - అది మోడర్న్ సైంటిఫిక్ ధియరీ అయినా యాన్షియంట్ ఫిలసాఫికల్ ధియరీ అయినా.హిందూ వేదాంతం మొత్తాన్ని ప్రభావితం చెయ్యగలిగిన వేదవ్యాసుడు విశ్వం మొత్తం దైవప్రచోదితమే అని బల్లగుద్ది చెప్తుంటే మనం అనుకుంటేనే అది నిజం అవుతుందని మీరొక స్వంత వ్యాఖ్యానం చేస్తున్నారు.నేను "విశ్వసృష్టిరహస్యం మేడీజీలో - ఫ్రం వేదవ్యాస టు హరిబాబు" ఆనె పోష్టులో చెప్పిన దాంట్లో ఒక్క చోట కూడా నా స్వంత వాక్యం చెప్పలేదు.అది రాయడానికి దాదాపు భాగవతం మొత్తం తిరగేసాను.ఎక్కడా మీరు చెబుతున్న ఈ సూత్రం నాకు తగల్లేదు.వ్యాసుడు చెప్పిన దానికి విరుద్ధంగా చెప్పటం అంటే వ్యాసుడు అబద్ధం చెప్పినట్టు కాదా?

   విశిష్తాద్వైత ఫిలాసఫీ వైదిక్ ధాట్ నుంచి పుట్టిన శాఖ మాత్రమే కదా!
   @UG SriRam
   విశ్వమంతా దైవసృష్టి అనే భావన కలిగి ఉన్న వారు ప్రజలను,జంతువులను సైతం ఎప్పుడు సమదృష్టి తో చూస్తారు. ఆ విషయం లో వాళ్ళెంత అటెంటివ్ గా ఉంటారో చూడవలసినదే గాని మాటలలో చెప్పటం చాలా కష్టం.
   hari.S.babu
   కేసీయార్ మిగిలినవారికన్నా ప్రత్యేకం అనటం వ్యక్తి కాదు శక్తి ఎట్సెట్రాలతో సప్పోర్టు ఇవ్వటం సమదృష్టి ఎట్లా అవుతుంది?

   Delete
  10. హరిబాబు గారూ,
   సృష్టి అంటే అర్థమేమిటంటే లేనిదాన్ని పుట్టించడం కాదు. ఉన్నదానినే పైకి తీసుకురావడం. ప్రళయంలో చేసేది అదే. ద్రవ్యాన్ని నాశనం చేయలేం, సృష్టించలేం. ఉన్నదాన్ని మరొక రూపులోకి మార్చగలం. ఇది సనాతన ధర్మం చెప్పిన విషయం. భగవద్గీతలో కృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు, ‘‘కృష్ణా, నీవెప్పటివాడి, నేనెప్పటివాడిని’’ అని. అప్పుడు కృష్ణుని సమాధానం, ‘‘నేను అనాది, నువ్వూ అనాది, ఈ ప్రకృతి కూడా అనాది’’, అని. కండిషనింగ్, వాసనలు ఇవన్నీ ఈ సృష్టిలోని ప్రతి అణువు డి.ఎన్.ఏ.లో, కంపోజిషన్లో వుంటాయి. ఆ కర్మానుభవాన్ని తొలగిస్తే జీవుడు దేవుడితో సమానం అవుతాడు. అలా చేయడానికే దేవుడు జీవుడికి ప్రళయం తరువాత ప్రకృతిని, జీవుడిని పైకి తీసుకువచ్చి ఒక రూపునిస్తాడు. జీవుడు, దేవుడు, ప్రకృతి ఒక త్రికం. దీనికి ఆది లేదు, అంతమూ లేదు. ఇదీ విశిష్టాద్వైతం చెప్పేదని నా భావన.

   ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి|
   వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసమ్భవాన్|| 13-20 ||

   ఈ భగవద్గీత శ్లోక భాష్యాన్ని చదవండి. మీకు ఆసక్తి వుంటే చర్చిద్దాం.

   Delete
  11. ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి
   వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసమ్భవాన్

   ఈ శ్లోకం చాలా స్పష్టంగ ప్రకృతి పురుషులని మాత్రమే(ఏవ) అనాది అని తెలుసుకో అంటోంది కదా. మీరేంటి జీవుడ్ని కూడ కలిపేసి త్రికం అంటున్నారు.

   హరిబాబు,
   చర్చకి సంబంధం లేని విషయం ఐనా ప్రస్థావన వచ్చింది కాబట్టి అడిగాను. అప్రస్తుతం అనుకుంటే తీసేయండి.

   Delete
  12. మన నమ్మకాలతో భావాలతో దృష్టికోణాలతో సంబంధం లేకుండా గోచరం అయ్యేది మాత్రమే వాస్తవం

   మీకర్థమయ్యే విషయంలా చెప్పలేకపోతున్నాను. మనం చూసేది అంతా చిన్నప్పటినుంచి మనకిచ్చిన జ్ణానం తోనే. There is no such thing as absolute reality. ఈ విడియోలో చర్చ వినండి

   You see nothing
   https://www.youtube.com/watch?v=dh8STH518XY-

   Delete
  13. @UG SriRam,
   పైన భగవద్గీత శ్లోకాన్ని కోట్ చేసిన అజ్ఞాత మీరే అన్న అనుకోలుతో రాస్తున్నాను. పైన కోట్ చేయబడిన శ్లోకం తాత్పర్యం అక్కడ ఇచ్చిన వివరణతో విభేదిస్తోంది. అది స్పష్టంగ జీవుడు అనాది కాదని చెప్తుంటే, వాఖ్యాత త్రికం అంటూ జీవుడు కూడా అనాది అనే వివరణ ఇస్తున్నారు. దాని గురించి నా ప్రశ్న.

   ఇకపోతే మీరిచ్చిన యూజీ లింక్ మామూలుగా ఇచ్చారో, లేక నా ప్రశ్నకి బదులుగా ఇచ్చారో తెలీట్లేదు. యూజీ గురించి నేను పదేళ్ళక్రితమే తెలుసుకున్నానండి. అయన బతికుండగా అప్పుడప్పుడూ బెంగుళూరు వచ్చేవారు. అప్పుడోకసారి కలవాలనుకున్నా గానీ కుదర్లేదు.

   Delete
  14. @UG SriRam
   మీకర్థమయ్యే విషయంలా చెప్పలేకపోతున్నాను.

   hari.S.babu
   దానికి కారనం మీలోని గందరగోళమే!

   విషయం కేసీయార్ అప్పుడెప్పుడో చేసిన సొంతమొక్కుల్ని ఇప్పుడు ఏం చేసినా అడిగేవాడు లేనంత మెజార్టీ ఉంది కాబట్టి ప్రభుత్వం తరపున తీర్చడానికి సం,బంధించినది.దీనికి వేదాంతానికీ అసలు సంబందమే లేదు!

   వారు చేశారు,వీరు చేశారు,ఇప్పుడు కేసీయార్ చేశాడు అనటం వల్ల్ల తప్పు ఒప్పు కాదు.రైటా రాంగా అన్నది మాత్రమే పాయింట్!

   అయిదేళ్లకి మారిపోయే శాసన సభ్యత్వం ఉన్నవాడికి ప్రజల ఆస్తుల్ని సొంతానికి వాడుకునే అధికారం ఎట్లా వస్తుంది?అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తే అది ఎందుకు వెక్కిరింత సామెతై కూర్చుంది!

   ఇదీ అంతే సార్!

   Delete
  15. Haribabu Suranenii22 March 2017 at 05:39

   గందరగోళానికి కారణం, ఈ వ్యాఖ్యలో నేను రాసిన ఆధ్యాత్మిక విషయానికి "విశ్వమంతా దైవసృష్టి అనే భావన కలిగి ఉన్న వారు ప్రజలను,జంతువులను సైతం ఎప్పుడు సమదృష్టి తో చూస్తారు" మీరు "కేసీయార్ మిగిలినవారికన్నా ప్రత్యేకం అనటం వ్యక్తి కాదు శక్తి ఎట్సెట్రాలతో సప్పోర్టు ఇవ్వటం సమదృష్టి ఎట్లా అవుతుంది" అని ప్రశ్నించారు. వాస్తవానికి నేనిచ్చిన పై సమాధానం కె.సి.ఆర్. ను దృష్టిలో ఉంచుకొని కాదు. అది పూర్తి ఆధ్యాత్మిక కోణం నుంచి ఇచ్చాను. మీరు దానికి కె.సి.ఆర్. ను ఎందుకు జతకలిపారో అర్థంకాక, మీకర్థమయ్యే విషయంలా చెప్పలేకపోతున్నాను అని రాశాను.

   సాధారణం గా నేను 97% హిందుత్వ/ రాజకీయాలు గురించే మాట్లడుతాను కాని ఆధ్యామికత గురించి పెద్దగా చర్చించను. దానిలో చర్చించి కొత్తగా తెలుసుకోవటానికి ఎమీ లేదు.

   Watch this also

   Nothing was born and nothing never dies
   https://www.youtube.com/watch?v=9GqYAPnrep8&t=142s

   Delete
  16. @Anonymous22 March 2017 at 06:50
   ఈ భగవద్గీత శ్లోక భాష్యాన్ని చదవండి. మీకు ఆసక్తి వుంటే చర్చిద్దాం.
   @Chaitanya22 March 2017 at 08:39
   చర్చకి సంబంధం లేని విషయం ఐనా ప్రస్థావన వచ్చింది కాబట్టి అడిగాను. అప్రస్తుతం అనుకుంటే తీసేయండి.

   hari.S.babu
   ఇందులో నాకు విభేదించడానికి గానీ వాదించుతూ చర్చించడానికి గానీ ఏమీ లేదు.విశ్వసృష్టిరహస్యం మేడీజీ పొస్టులో వీటికి వ్యాఖ్యానం కూడా చెప్పి ఉన్నాను.దేవుడే కాదు జీవుడూ శాశ్వతుడే,అది కూడా గీతలోనే ఉంది అనేది పోష్టు మొదట్లోనే చెప్పాను.గుణాలు మూడు.అయినా అవి మనుషుల్లో వ్యక్తీకరించబదే Random Assortment వల్ల దైవ-అసుర అనే రెండు ప్రతీఘాత శక్తులు ఎట్లా ఏర్పడతాయో కూడా చెప్పాను.అందులో చాలా విషయాలు చెప్పాను.ఆ ఒక్క పోష్టునూ అర్ధం చేసుకోగలిగితే దాదాపు సనాతన ధర్మం అంటే ఏమిటో అర్ధం అయినట్టే!చదివి చూదండి.

   Delete
  17. @Chaitanya ji,
   నేను భగవద్గీత చదవలేదు. కొన్ని ప్రజాదరణ పొందిన శ్లోకాలు వినటమే తప్ప నాకు దాని గురించి పెద్దగా తెలియదు. ఆ లింక్ కేవలం హరిబాబు నుద్దేశించి ఇచ్చాను.

   Delete
  18. @ చైతన్య...
   "అది స్పష్టంగ జీవుడు అనాది కాదని చెప్తుంటే"
   మీరు చదవిని ఏ భాష్యంలో ఈ శ్లోక అర్థం అలా వుందో చెప్పగలరా? జీవుడూ శాశ్వతుడే, ప్రకృతి శాశ్వతమే అని ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాది లో పురుష అంటే జీవుడు అని అర్థం. ముందు హరిబాబుగారు పైన చెప్పిన పోస్టు చదవండి. అది చదివిన తరువాత కూడా మీ అనుమానం తీరకపోతే, మీరు చదివిన భగవద్గీతా భాష్యం ఈ శ్లోకానికి సంబంధించినది తెలియజేయండి. ఆ తరువాత చర్చిద్దాం. మౌలికంగా పురుష అంటే దేవుడు అని మీరు అనుకోవడంలోనే పొరపాటు దొర్లినట్లుంది.

   Delete
 9. >>ఇటువంటివారిని కూడా సాధు సజ్జనులు అని అందరూ పొగడాలి కాబోలు - కేవలం హిందువు అయినంత మాత్రాన!

  ఇక మీకు పాకిస్తాన్ వీసా రెడీ చెస్తారు ఇప్పుడు ;-p

  ReplyDelete
 10. హరిబాబుకి భారతం వంటబట్టినట్టులేదు. తన తోటివారిని పైకెత్తాలంటే, శ్రీరాంలా అవటలివాడ్ని "నువ్వు ఇంతకు ముందు అలా చెశావ్, ఇలా చేశావ్, కాబట్టి నాలో తప్పు పట్టుకోకు" అని ఎదురు మాట్లాడాలి. అంతేగాని, మాలోకూడా తప్పుంది అనకూడదు హరిబాబూ...

  అంతా గమనిస్తూ, అందరి మాటలూ వింటోన్న దుర్యోధనుడు, భీముడు చేసింది అధర్మయుద్ధం కాదని పదే పదే శ్రీకృష్ణుడు చెప్పడాన్ని తట్టుకోలేకపోయాడు. లోలోపల రాజుకున్నాడు. శ్రీకృష్ణార్జునుల చెప్పిన మీదటే భీముడు అధర్మానికి పాల్పడ్డాడని తెలుసుకోగలిగినా చేయగలిగేదేమీ లేదని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. బాధను ఓర్చుకుంటున్నట్టుగా కింది పెదవిని పళ్ళ మధ్య కరిచి పెట్టుకుని గంభీరస్వరంతో ఇలా గర్జించాడు.‘‘కృష్ణా! చేసిన ఆధర్మాలు చాలవన్నట్టుగా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. తప్పు! నేనిలా నేలన కూలిపోవడానికి కారణం నువ్వే! నువ్వు చెప్పిన మీదటే అర్జునుడు సైగ చేస్తే భీముడు గదాయుద్ధం నీతిని నేలకి తొక్కి నన్నిలా తుత్తునియలు చేశాడు. ధర్మంగా పోరాడితే భీముణ్ణే కాదు, మిమ్మల్నందర్నీ నేను అవలీలగా మట్టి కరిపించేవాణ్ణి’’‘అవునా’ అన్నట్టుగా కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూడసాగాడు కృష్ణుడు.‘‘శిఖండిని అడ్డుపెట్టి భీష్ముణ్ణి నేల కూల్చావు. ద్రోణుణ్ణి చంపడానికి ధర్మరాజు చేత అబద్ధం ఆడించావు. రథచక్రం నేల కూలిపోయి కర్ణుడు నిస్సహాయ స్థితిలో ఉంటే అర్జునుని చేత చంపించావు. లేని చీకటిని కల్పించి, అస్తమించని సూర్యుని అస్తమించినట్టుగా చేసి సైంధవుణ్ణి కడతేర్చావు. భూరిశ్రవుణ్ణి కూడా అధర్మంగానే సంహరింపజేశావు. ఇన్ని చేసి, ఇన్ని పాపాలకు ఒడిగట్టిన నువ్వు ధర్మాధర్మాల గురించి మాట్లాడడం చిత్రంగా ఉంది. వద్దు కృష్ణా! వద్దు! దయచేసి నోరు మూసుకో! బాగుంటుంది’’ అన్నాడు దుర్యోధనుడు. ఆ మాటలకి కృష్ణుడికి కోపం వచ్చింది. ఎర్రగా కళ్ళు చేసుకుని దుర్యోధనునితో ఇలా అన్నాడతను.‘‘అవునవును! నేను చేసినవే అధర్మాలు. నువ్వు చేసినవి ధర్మాలు. ఏ ధర్మాన్ని అనుసరించి చిన్నప్పుడు భీమసేనునికి విషాన్నాన్ని తినిపించావు? ఏ ధర్మాన్ని అనుసరించి గంగాప్రవాహంలో అతన్ని పడద్రోయించావు? కుంతీదేవితో పాటుగా పంచపాండవుల్ని కడతేర్చాలని ఏ ధర్మాన్ని అనుసరించి లాక్షాగృహాన్ని దహియింపజేశావు? కపటద్యూతంలో పాండవుల సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నావే...అదే ధర్మాన్ని అనుసరించి చేశావు? నిండు కొలువులోకి ద్రౌపదిని ఈడ్పించి, వలువలూడ్పించినదే ధర్మం? మాట్లాడు’’

  ReplyDelete
 11. .‘‘వేదవేదాంగాలు చదువుకుని ధన్యుణ్ణయ్యాను. భూరిదక్షిణలిచ్చి అనేక యజ్ఞ యాగాలు చేశాను. అష్టైశ్వర్యాలతో తులతూగాను. మహారాజుగా మహోన్నతంగా జీవించాను. శత్రువుల్ని అనేకుల్ని నిర్మూలించాను. చాలిక. ఆప్త మిత్రులు, బాంధవులు, నా తమ్ములూ అరుగో...అక్కడ వీరస్వర్గంలో నాకోసం వేచి చూస్తున్నారు. వెళ్ళిపోతున్నాను. మీ దృష్టిలో నేను దుర్మార్గుణ్ణి కావచ్చు. ఇంకొకరి దృష్టిలో సన్మార్గుణ్ణి. అందులో అనుమానం లేదు. విజయం మీదనుకుంటున్నారు. కాని, కాదు. విజయం నాదే! నేను చేసిన పనులకు నాకు బాధ లేదు. పశ్చాత్తాపం లేదు. హాయిగా ఆనందంగా వెళ్ళిపోతున్నాను. మీరు చేసిన పనులకు మీరు క్షణక్షణం కుమిలిపోతూ కుళ్ళిపోతారు. తప్పదు’’ పూలవాన కురిసిందప్పుడు. దేవదుందుభిలు మ్రోగాయి. చల్లచల్లగా గాలి వీచింది. నేల సువాసనలు వెదజల్లింది. దుర్యోధనుడు నవ్వసాగాడు. పాండవులు తలలొంచుకున్నారు. తప్పు చేసినట్టుగా చేతులు కట్టుకుని నిల్చున్నారు.

  ReplyDelete
  Replies
  1. @Anonymous22 March 2017 at 03:18
   హరిబాబుకి భారతం వంటబట్టినట్టులేదు.......పూలవాన కురిసిందప్పుడు. దేవదుందుభిలు మ్రోగాయి. చల్లచల్లగా గాలి వీచింది. నేల సువాసనలు వెదజల్లింది. దుర్యోధనుడు నవ్వసాగాడు. పాండవులు తలలొంచుకున్నారు. తప్పు చేసినట్టుగా చేతులు కట్టుకుని నిల్చున్నారు.

   hari.S.babu
   దుర్యోధనుడికి పూలవానలు కురిపించిన ఈ పౌరాణికులు ఎవరో కాస్త చెబుదురూ!

   వేదవ్యాసుడు కూడా నూటికి నూరుపాళ్ళు గతితార్కికచారిత్రకభౌతీకవాద రచయితయే!అందుకే ఎవరి దృక్కోణాన్ని బట్టి వారి సమర్ధనలు ఎలా వుంతాయి అనేది జయేతిహాసంలో చక్కగా వర్ణించాడు!కవిత్రయం భాషలో స్వతంత్రించినా భావం వ్యాసుడిదే కదా!

   పైపైన చదివితే గందరగోళం తప్పనిసరిగా ఉంటుంది - పైన మీరు ఉదహరించిన భాగంలో చెప్పిన దాని ప్రకారం దుర్యోధనుడు కుట్రకి అబ్లై చనిపోయినవాడిగానే తోస్తాడు,ధర్మరాజు కపటి అని కూడా అనిపిస్తాడు.కానీ మధ్యలో ఒకచోట ధృతరాష్ట్రుడికి సంజయుడు "పితృపైతావహంగా మీ తరంలో సంక్రమించినవి కురు,జాంగల జనపదాలు మాత్రమే!ఇప్పుడు మీరూ మీ కుమారులూ అనుభవిస్తున్న కురు మాహాసామ్రాజ్యం సమస్తం పాండురాజు మరియూ పాండవుల పరాక్రమోపార్జితమే!" అని కుండ పగలేసి చెప్తాడు.దుర్యోధనుడు తన జన్మలో ఒక్క యుద్ధానికీ నాయకత్వం వహించి ఒక్క అడుగు భూమిని కూడా గెల్చుకురాలేదు!

   నిజంగా వాడు దేవదుందుభులు మోగించుకోవాల్సినంత గొప్పవాదయితే కన్న తల్లి "విజయోస్తు!" అని గర్వంగా అనకుండా "యతో ధర్మః అతతో జయః" అని ముదలకించి మాత్రమే ఎందుకు వూరుకుందో!అన్నిసార్లు ఎందుకు తిట్టిందో!

   అన్యాయంగా నా తొడలు విరగ్గొట్తారు,మీరు న్యాయంగా యుద్ధం చెయ్యలేదు,లేకపోతే ఇరగదీసేవాణ్ని అని ఇప్పుడు అంటున్నవాడికి మొదట అభిమన్యుణ్ణి చంపడం ద్వారా పాందవులకి అ అదారి చూపించింది తనేనని తెలియదా?

   ఏమి చిత్రమైన భారతం?దుర్యోధనుడి మీద పుషవర్షం కురొసినద్త!పాందవులు సిగ్గుతో తల దించుకున్నారట!ఇది రాసినవాడికి తల ఎక్కడుందో?!

   Delete
 12. చర్చిలు.మసీదుల మాదిరిగానే హిందూ ఆలయాలు కూడా ప్రభుత్వం యొక్క పెత్తనంకింద లేకుండా భక్తులు,ధర్మకర్తల నియంత్రనలోనే ఉందాలని నేనూ ఒప్పుకుంటాను.ఇతర మతసంస్థలకు భిన్నంగా హిందూ మతసంస్థలు విశాలభావంతో సేవలు చేస్తున్నాయనేది కూడా ఒప్పుకుంటాను.

  కానీ కేసీయార్ తను అధికారం వస్తుందో రాదో తెలియని కాలంలో వ్యక్తిగా ఉండి మొక్కుకున్న మొక్కుల్ని ముఖ్యమంత్రి అయ్యాక నేనిప్పుడు వ్యక్తిని కాదు శక్తిని అని తనకి తనే కితాబు ఇచ్చేసుకుని "లలలాం లలలాం లక్కీ చాన్సులే" అంటూ తను ఏం చేస్తే అది ఘనకార్యం అన్న పద్ధతిలో మోసేవాళ్ళు ఉన్నారు గదాని జనం డబ్బుతో తీర్చటం మాత్రం ఖచ్చితంగా తప్పే!

  ReplyDelete
 13. హరిబాబు, కె.సి.ఆర్. ముఖ్యమంత్రిగా కాక మునుపు ఉద్యమసమయంలో యం.పి.గా ఉన్నాడు. ఆయన వ్యవస్థలో ఎప్పుడూ భాగస్వామిగానే ఉంట్టు వచ్చాడు. మీరు వ్యక్తి అనుకోంటే ఇక చేసేదేమి ఉంది? ఆయన మీదృష్టిలో సజ్జనుడు కాకపోవచ్చు. మీకు రావణాసురిడిలా అగుపించవచ్చు. కనుక అతనేదో నక్క జిత్తులు వేసే రకంలా ఆంధ్రావారికి అనిపించవచ్చు. కాని ఒకటి గుర్తుంచుకోవాలసినది ఎమిటంటే ఉద్యమ సమయంలో ఆయన నక్క జిత్తులన్ని వేస్తున్నా, అతని ప్రాంత ప్రజలు వాటికి జేజేలు పలికారు. పూర్తిగా సమర్ధిస్తూ అండగా నిలచారు. దీని అర్థం ఎమిటి? ఆయన ఒకప్రాంత ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధి. అటువంటి వాడిని వ్యక్తి అని ఎలా అనగలం? శాసన సభ ఎన్నికలలో గెలిచి మరొక్కసారి ఒక శక్తిగా (వ్యవస్థ )నిరూపించుకొన్నాడు. పోని ఎన్నికలలో ఓడిపోయి ఉంటే మీవాదనకు కొంత బలం అన్నా ఉండేది.

  మీరు పదే పదే ఒకవేళ ముఖ్యమంత్రిగా కాక పోయి ఉంటే మొక్కులు ఎమి చేసి ఉండేవాడు అని అడుగుతున్నారు. మీరేసిన ప్రశ్న నాకేలా అర్థమైందంటే ఆయన సి.యం.కాకపోతే మొక్కులు చెల్లించేవాడా? ప్రభుత్వ సొమ్ము గనుక ఆయన డబ్బుకాదు గనుక 6కోట్లు ఇచ్చేశాడు అనే భావన స్పురిస్తున్నాది. ఇటువంటి ప్రశ్నలు ప్రజానాయకుల దగ్గరికి, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళని, సంపాదనకు ఉద్యోగం తప్పించి ఏ ఇతర ఆధాయం లేని మధ్యతరగతి ప్రజలకు మాత్రమే వస్తాయి. ప్రభుత్వం, ఆఫీసుల చుట్టు తిరిగే వారికి వారెంత సంపన్నులో తెలుసుకనుక వ్యక్తిగతం గా 10కోట్లు ఇచ్చినా ఆశ్చ్ర్యపోరు. ఆయన సి.యం. గా కాకపోయి ఉంటే ఇంతకన్నా ఎక్కువే వేసి దేవుడికి మొక్కులు చెల్లించి ఉండగలడు. కాకపోతే ఆ వార్త పేపర్లో ఇంత హంగామా చేస్తూ వచ్చి ఉండేది కాదు. రామాయణంలో రావణాసురుడికి శివభక్తి ఉంది. ఎన్ని ధర్మ దృష్టి అద్దాలు వేసుకొని చూసినా, భక్తి విషయంలో మాత్రం రావణుడి భక్తిని తక్కువ చేసిచూడగలమా? కె.సి.ఆర్.లో మీ కెనొ లోపాలు కనిపించవచ్చు కాని, అతని భక్తి ని,దేవుడి పై విశ్వాసాన్ని తక్కువగా అంచనా వేయలేము.
  టివి చర్చలలో వాడే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం,సెక్యులరిజం ఇటువంటి పదాలను కొద్ది సేపు పక్కనపెట్టి ఆలోచించి చెప్పు, దేవుడికి నగలు ఇవ్వటం ఎమైనా అనైతిక చర్యనా? అదేమైన అవినీతికి పాల్పడటమా? అంతకన్నా ఘోరమైన నేరమా? కె.సి.ఆర్. కాకుండా వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి వెంకటేశ్వర స్వామికి నగలు ఇస్తే ఇంత తీవ్రం గా వ్యతిరేకించే వాడివా?

  ReplyDelete
  Replies
  1. @UG
   టివి చర్చలలో వాడే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం,సెక్యులరిజం ఇటువంటి పడికట్టు పదాలను కొద్ది సేపు పక్కనపెట్టి ఆలోచించి చెప్పు, దేవుడికి నగలు ఇవ్వటం ఎమైనా అనైతిక చర్యనా? అదేమైన అవినీతికి పాల్పడటమా? అంతకన్నా ఘోరమైన నేరమా? కె.సి.ఆర్. కాకుండా వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి వెంకటేశ్వర స్వామికి నగలు ఇస్తే ఇంత తీవ్రం గా వ్యతిరేకించే వాడివా?

   hari.S.babu
   ఖచ్చితంగా!
   నేను నా వాదనలో డేమోక్రసీ,సెక్యులరిజం,రాజ్యాంగం లాంటివి ఎక్కడైనా వాదానా?హిందూత్వ అనేది పొలిటికల్ అని మీరే ఒప్పుకున్నారు - సంతోషం.ఈ ప్లిటికల్ హిందూత్వ మాత్రమే హిందువులకి రక్షణ ఇస్తుంది అంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా?జరిగినవాటినే రెండు విషయాల్ని చెప్తాను.యం.యఫ్.హుస్సేన్ భారతమాతని నగ్నంగా గీశాదన్నారు.చలా గొదవ జరిగింది - అతను దేశంలో ఉందలేని పరిస్థితి ఏర్పడింది.కానీ దామెర రామారావు ఆర్ట్ గ్యాలరీలో ఉన్న సరస్వతి బొమ్మ ఎప్పుదైనా చూసారా?సరస్వతి అనగానే మనకి ఫైవ్ పండిట్స్ తెలుగు గైడు మీద ఉన్న బొమ్మే గుర్తుకొస్తుంది,అవునా?కానీ దామెర రామారావు అనే హిందువు సరస్వతికి మొలకి ఒక తువ్వాలు మాత్రమే చుట్తి వక్షోజాల్ని అనాచ్చాదితంగా వదిలేశాడు!

   దామెర రామారావు వేసిన బొమ్మ నేను చూదలేదు గాబట్టి దామెర రామారావు బొమ్మని నేను పట్టించుకోలేదు చూసి ఉంటే దాన్ని కూడా వ్యతిరేకించేవాణ్ణిఅని పొరపాటున కూడా అనకండి.ఎందుకంటే,హుస్సేను మీద దాడి చెయ్యటానికి కాలం క్రితమే రామారావు ఆ బొమ్మ వేశాడు.ఇంకా, ఇద్దరూ ఒకే గురువు దగ్గిర విద్య నేర్వకపోయినా చిత్రకళ అనే దానికి ఉన్న సంప్రదాయాన్నే పాటించారు.ఆర్ట్ క్రిటిక్ అయిన ప్రతి ఒక్కడికీ యం.యఫ్.హుస్సేన్ చేసింది చిత్రకళా సంప్రదాయం ఒప్పుకుంటుందని తెలుస్తుంది!దామెర రామారవు అనే హిందువూ యం.యఫ్.హుస్సేన్ అనే ముస్లిమూ ఒకే రకమైన పని చేస్తే ఇద్దరికీ వేర్వేరు ప్రతిస్పందనలు ఎందుకు వచ్చాయి?యం.యఫ్.హుస్సేన్ మీద దాడి చేసినవాళ్ళలో ఆర్ట్ క్రిటిక్ ఎవరయినా ఉన్నారా?మోటవాడికి మొగలిపువ్విస్తే ఏం చెస్తాడో అది చేశారు ఆనాటి హిందూత్వవాదులు!హిందూతం మీద దాడి జరుగుతున్నది కాబట్తి హిందువులు పొలిటికల్ యూనిటీని అలవాటు చేసుకోవాలి,హిందువు అయినవాడు ఏం చేసినా సమర్ధించాలి అంటే మళ్ళీ మళ్ళీ అలాంటి పన్లే సిగ్గు లేకుండా చెయ్యాల్సి వస్తుంది.మీరు చెప్పినట్తు ముస్లిం,క్రైస్తవ మత సంస్థల్లా హిందూమతసంస్థలు సంకుచితంగా ఉండకుండా విశాలంగా ఆలోచించటానికి కారణం వాటికి మీరు చెప్పే పొలిటికల్ హిందూత్వం ఒంటబట్టకపోవటమే!

   అసలు తెలంగాణా తెచ్చుకోవడం అనేది ప్రజలకి సంబంధించిన విషయమా?కేసీయార్ ఒక్కడికి సంబంధించిన విషయమా?నేను సీమాంధ్హ్రుడిగా ఉండి కేఈయార్ మహాసయుణ్ణి తెలంగానవాడిగా నేనెప్పుడూ రావణుడిగానో,మరొకలానో చూడలేదే?తెలంగాణా ఏర్పాటు గురించి ప్రజల్ని మెప్పించగలిగీతే ఆ ఉద్దేశంతో నిలబెట్టిన వీరులు ధరావతులు కోల్పోకుండా అసెంబ్లీలో ధీమాగా వాదించి విదగొట్టుకోగలిగే బలం ఇచ్చేవాళ్ళు కదా!రాష్త్రం విడిపోయాక కూడా బొటాబొటీ మెజార్టీ రాబట్టే కదా వాళ్లనీ వీళ్లనీ లాక్క్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది?తెలంగాణా ప్రజలంతా కలిసి ఆయనకేదో అప్రస్తుతవీరవరేణ్యుడి స్థానం కట్టబెట్టేసినట్టు మాట్లాడుతున్నారే?అబద్ధం చెప్పినా గోడ కట్టినట్టు ఉండాలండీ!

   మతసంస్థల సంపదని వాడుకోవటం ఇప్పుడేమిటి రాజుల కాలంలోనే ఎక్కువగా జరిగేది.అశోకుడి మనవడు రాజ్యానికి రాబోయేముందు ఒక జైనమతపీఠం నుంచి అప్పు తీసుకుంటే పట్టాభిషేకం సమయానికి వచ్చిపడి తర్వాత్ రాజెవడో రెడ్డెవడో ముందు మా బాకీ చెల్లించమని కూర్చున్నారు.అది ఇచ్చాకే పట్తాభిషేకం జరిగింది!రాజ తరంగిణిలో కళణుడు ఒక రాజు కరువులో ఉండి ఆపద్ధర్మంగా ఒక గుడిలో మూలవిరాట్తు కింద ఉంచిన సంపదని తీసుకున్న సంఘటన గురించి చెబుతాడు.అప్పుడు సంశపారంపర్య రాజవంశావళి పరిపాలన ఉందేది.రాజు దైవమే అని నమ్మేవారు,ఖజానాలో పడిన మొత్తం సంపద రాజు యొక్క సొంత్ ఆస్తి అనే లెక్కలో ఉందేది కాబట్టి రాజు తనకి నచ్చిన ఆలయాలకి కానుకలు ఇచ్చినా తనకి నచ్చని ఆలయాలని కూలగొట్టేసినా చెల్లిపోయింది!

   కానీ ఇప్పుడు తెలంగాణా రాష్త్రం బొక్కసంలో ఉన్నదీ,ఎండోమెంట్సు వారి అధీనంలో ఉన్నదీ కేసెయార్ సొంత ఆస్తి కింద లెక్కెస్తారా?నూతన రాజ్యాంగం,ఆంగ్లోసాక్సాన్ డెమోక్రసీ అనేవాటిని తీసి పక్కన పెట్తండి,సనాతన ధర్మం నిర్వచించిన ప్రభుత్వ సంపద,వ్యక్తిగత వారసత్వ నియమాలకి అనుగుణంగానే చెప్పండి, చట్తబద్ధంగా తనది కాని సొమ్ము మీద కేసెయార్ పెత్తనం చెయ్యటం న్యాయమా?ఇప్పుడు కేసీయార్ చేసిన పని భవిష్యత్తులో మరొకరు చేసినా ఇబ్బంది లేకుండా ఉండాలంటే రాచరికానికి వెళ్ళిపోవటం తప్ప మరో మార్గం లేదు - అలాంటివి రాచరికంలోనే సాధ్యం!

   Delete
  2. @UG SriRam:

   అజమీర్ దర్గాలో చాదర్ కెసిఆర్ మొక్కులలో ఇంకొకటి, దీన్నీ ఆయన ప్రజాధనంతోనే తీర్చారు.

   మీరు దీన్ని కూడా సమర్థిస్తారా?

   Delete
  3. వాదన ఇప్పటికే ఎక్కువైంది. రండు ముక్కలు నా అభిప్రాయం చెప్పి వాదన ముగిస్తాను. ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు వెంకటేశ్వర సామికి నగలు ఇస్తే మీరు ఇంతగా వ్యతిరేకిస్తారా అని అడిగిన దానికి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. నాకర్థమైనంత వరకు మీ వ్యతిరేకత కె.సి.ఆర్. ఇవ్వటం పైనే. కె.సి.ఆర్. ఇక మీరు చెప్పినట్లు రాచరిక వ్యవస్థ లో దేవుడికి సొమ్ములిచ్చారు, అవసరమైనదనుకొన్నప్పుడు తీసివాడు కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అంత కన్నా ఎక్కువగా ప్రభుత్వాలు,రాజకీయ నాయకులు దేవుడి సొమ్మును, అప్పడాలు తిన్నట్టు తింట్టున్నరు. ఒక్క యం.యల్.ఏ. 900 కోట్ల ఆస్థిని ఎలా అనుభవిస్తున్నారో చూశాము. మొన్న ఈ మధ్యనే నెల్లురు రంగనాయకుల స్వామికి చెందిన భూమి నగర నడిబొడ్డులో ఉంది. దాని మార్కెట్ విలువ 50కోట్లు. 99సంవత్సరాల లీజు పై తీసుకొని, ఆనాటి కాల రేట్ ప్రకారం అత్యంత తక్కువ బాడుగ వెయ్యి రూపాయలు ఉండవచ్చేమో ఇంతకాలం చెల్లిస్తూ వచ్చారు. ఇది బయట పడిన సంగతి, వార్తలలో లేకుండా వేల కోట్లు దేవుడి సొత్తును స్వాహా చేసేవారెందరో ఉన్నారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలేమో ఆసాంతం దేవుడి సొమ్మును నాకేస్తూంటే. ప్రభుత్వం తిన్న సొమ్ములో సముద్రం లో నీటి బొట్టంత తిరికి కె.సి.ఆర్. దేవుడికిస్తే దానిని వందకోణాలో చూసి తప్పు పడుతున్నారు. ఈ రోజు కె.సి.ఆర్. ని తప్పు పడుతున్నారు. మీ లెక్క ప్రకారం భవిషత్లో, దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా గుళ్ళకు ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వకుడదు. పాపం వాళ్ళెమో, దేవాలయాల సొమ్మును ప్రభుత్వ పథకాలకు చట్టా బద్దంగ మింగ వచ్చు. ఈ పద్దతే కొనసాగితే దేవుడికి గోచి గుడ్డ కూడా మిగలనియ్యరు మన సెక్యులర్ పాలకులు. ఇదెక్కడి న్యాయం?

   ఒకపని చేయమనండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తిన్న దేవుడి సొమ్ములు,దేవుళ్ళకి చెల్లించి, కె.సి.ఆర్. ఇచ్చిన నగలను తీసుకుపోమ్మనండి. ఇకనుంచి దేవుడి వైపుకు ప్రభుత్వాలను రమ్మనకండి.

   2. హిందుత్వ పై సంఘ్ పరివార్ వాళ్ళకొక్కరికే కాపి రైట్ లేదు.ఏ రాజకీయపార్టి అయినా హిందుత్వను ప్రచారం చేసుకొని ఓట్లు గెలవ వచ్చు.

   * హిందూమతసంస్థలు సంకుచితంగా ఉండకుండా విశాలంగా ఆలోచించటానికి *

   విశాలంగా ఆలోచిస్తే అసలికె ఎసరు తెగూడదు కదా! తిరుపతి లో ఉండే పద్మావతి మహిళా యునివర్సిటి, యస్.వి. యునివర్సిటి, డిల్లిలో వెంకటేశ్వరా కాలేజి మొదలైనవన్ని టిటిడి విద్యాలయాలు. టిటిడి సంస్థలలో ప్రతి గరిలో వేంకటేస్వర స్వామి పోటొ ఉమంట్టుంది.టిటిడి వారేమో ఎంతో ఉదారతతో అన్ని మతాల వారికి చదువుచెపుతూ, ఉద్యోగాలు ఇచ్చారు. కాని అక్కడ 2007లో జరిగిందేమిటి? వీణా నోబుల్ దాస్ అనే ఒక క్రైస్తవ మహిళ పద్మవాతి యునివర్సిటికి ప్రినిసిపాల్ గా అయ్యి, యునివర్సిటి గదులలో ఉండే వెంకటేశ్వర స్వామి పోటొ లు తొలగించటమేకాక, క్రైస్తవ ప్రచారాం ప్రోత్సహిస్తున్నాదని కొందరు విద్యార్ధినులు తిరగబడి గోల చేశారు. ఆరోజుల్లో పేఫర్లలో వార్తలు వచ్చాయి. గత అనుభవాల దృష్ట్యా హిందువులు పాఠం నేర్చుకోవాలి. విశాలంగా ఆలోచిస్తున్నామంటే దానిని బలహీనత గా భావించి మతప్రచారం వరకు వచ్చేశారు. అదే ఎదైనా క్రైస్తవ విద్యాసంస్థలో హిందువులు చేరితే వారిని ప్రినిసిపల్గా ప్రమోషన్ ఇవ్వటం సంగతి దేవుడేరుగు. బొట్టుపెట్టుకొని రాకుడదు, చేతులకు గోరింటాకు పెట్టుకోకుడదు, ఇలాంటి ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇవన్ని క్రైస్తవ స్కూల్స్ లో చదివిన ప్రతివారికి తెలిసిన బహిరంగ రహస్యమే! ఎవరైనా అతిక్రమిస్తే వారిని సస్పెండ్ చేస్తారు.

   I was sacked over a multi-faith prayer, says Chennai teacher

   She claims the prayer was unacceptable for the school as 'it has a tacit Christian prayer in place'.

   http://www.ndtv.com/chennai-news/i-was-sacked-over-a-multi-faith-prayer-says-chennai-teacher-535746

   Delete
  4. @జై, ఆయన ఎంత ఇచాడో తెలియదు. నాకు అజ్మీర్ దర్గా దగ్గర ఎన్నికోట్ల ధనం ఉందో,రాజకీయ నాయకులు ఎలా బొక్కలు పెట్టి తింట్టున్నారో వాటి గురించి ఎమీ తెలియదు. చాలా మంది హిందువులు దర్గాలలో మొక్కులు చెల్లించటమనేది ఎప్పటినుంచో జరుగుతున్నాది. మీరు ప్రజాధనం అని నొక్కి వక్కాణిస్తున్నారు కాబట్టి, ఒకసారికైతే నాకు అభ్యంతరం లేదు.

   మీరిక్కడ ఒక విషయం గమనించాలి. 120కోట్ల జనాభాగల మనదేశం లో రాను రాను వ్యవస్థలన్ని కేంద్రీకృతం అవుతున్నాయి. ప్రజల దగ్గర ఉన్న డబ్బులన్ని అటు ప్రభుత్వం దగ్గరో,బాంక్ ల దగ్గరో,ప్రైవేట్ సంస్థల దగ్గరో, ఆధ్యాత్మిక సంస్థల దగ్గరో గుట్టలుగా పోగుపడుతున్నాయి. పోగుపడినంత త్వరగా వాటి పంపిణి సమాజంలోకి జరగటం లేదు.
   ఒక్క దేవాలయాల వంటి ఆధ్యాత్మిక సంస్థల ద్వారానే సామాన్య దిగువ మధ్యత్రగతి ప్రజలకు డబ్బులను తిరిగి రోటేషన్లో త్వరగా పంచగలుగుతున్నాము.

   ఉదా|| దేవాలాయాలనే తీసుకోండి. అక్కడ రోజు పూలు అవసరమౌతాయి. భక్తులు కొని దేవుడికిస్తారు. ఒక్కరోజు ఉంటాయి. మల్లీ పక్కరోజుకొత్త పూలతొ అలంకరిస్తారు. ఇక్కడ పూలకోసం బెంగుళూరు లో తోటలు వేయటం, వాటిని వేరే ఊరికి తరలించటం, పూలు అమ్మడం, కొనటం,దేవాలయానికి తీసుకు రావటం, పూజారి అలంకరించటం, పల్లకి ని మోసే వారు, భక్తులు,ఆలయ స్టాఫ్ వీరందరు ప్రత్యక్షం గానో పరోక్ష్యం గానో ఆర్ధిక కార్యకలాపాలలో పాల్గొంట్టున్నారు. ఈ మొత్తం ప్రక్రియ కి చాగంటి లాంటి వారి అవసరం కూడా ఉంది. ఈ రోజు దేవుడికి ఈ పూలు పెడితే మంచిదని చెప్పే వారి అవసరం కూడా ఉంది. ఒకప్పటి తో పోలిస్తే (15సంవత్సరాల క్రితం) ఇప్పుడు పూల మాలల వ్యాపారం ఎన్నో రేట్లు అభివ్రుద్ది చెందింది. ఎంతో మందికి జీవనోపాధి లభిస్తున్నాది. టెక్నాలజి పెరిగే కొద్ది, ఉద్యోగాల సంఖ్య తగ్గటమేకాని పెరిగేది పెద్దగా ఉండదు. టెక్నాలజి మారినంత త్వరగా ఉద్యోగ అవకాశాలను ప్రజలకి కల్పించటం ప్రభుత్వానికి,ప్రైవేట్ వారికి అయ్యేపనే కాదు.
   ప్రభుత్వాలు ఉచిత పథకాలపేరుతో డబ్బులను పంచేబదులు. దేవాలయాలకు కొద్దో గొప్పో ధనం ఇస్తే యంప్లాయ్ మెంట్ సృష్టించిన వారౌతారు.


   Delete
  5. @ జై, ప్రతి రాజకీయ పార్టి ఎన్నికలలో గెలిచినతరువాత ఉచిత పథకాల లిస్ట్ చదువుతున్నాది. అలాగే ఎన్నికల ముందు ప్రజలకు ఓట్ కింతా అని ఖర్చు చేస్తున్నాయి. అధికారంలోకి రావటం తిరిగి సంపాదిస్తున్నరు. రాను రాను రాజకీయాలాలో ఉండే వారికి ఏది ప్రజాధనమో, ఏది ప్రభుత్వ ధనమో, ఏదివ్యక్తిగతమో అనే సరిహద్దులు దాదాపు చెరిగిపోయాయి. ఈ ప్రజాధనమనేది టెక్నికల్ గా మనం వాదనకొరకు వాడుకోవలసిందే.

   Delete
  6. యూజీ శ్రీరాం,
   ఏం బాగుందండీ మీ తొక్కలో సపోర్ట్? రాముడే రామదాసుని క్షమించలేదు.తానీషాకి కల్లో కనిపించాడు గానీ రామదాసుకి దర్శన భాగ్యం కూడా ఇవ్వలేదు.మీకన్నా రాముడే నయం!

   Delete
  7. @UG SriRam:

   "ఒకసారికైతే నాకు అభ్యంతరం లేదు"

   ఒక్కసారే, ఇదే రకంగా తెలంగాణా మొక్కు. Anyway I got the answer I wanted, no further questions on this.

   Delete
 14. @UG రాను రాను రాజకీయాలాలో ఉండే వారికి ఏది ప్రజాధనమో, ఏది ప్రభుత్వ ధనమో, ఏదివ్యక్తిగతమో అనే సరిహద్దులు దాదాపు చెరిగిపోయాయి.


  ఇక ప్రతి పార్టీ మానిఫెస్టోలో మొక్కులకింత కేటాయిస్తాం అని పెట్టుకుంటారేమో

  ReplyDelete
  Replies
  1. దేవుళ్ళకు మొకుల బడ్జెట్ కేటాయిస్తే, ఆ దేవుడి భక్తులు మెచ్చి ఓట్లు వేస్తారనుకొంటే, మేనిఫెస్ట్లో తప్పక పెడతారు. మన రాష్ట్రాలలో చూస్తున్నాము కదా! ఒకవైపు ఉద్యోగాలకోసం తెలుగు మీడీయం తొలచ్గించి, ఇంగ్లీష్ మీడీయం స్కూల్స్ మాత్రమే ఉండాలని చట్టాలను మారుస్తూన్నారు. ఐలయ్య వంటి వారు కూడా అదే ఉత్తమమని చెపుతూన్నారు. మరో వైపు ఇవే ప్రభుత్వాలు ఊర్దు యునివర్సిటి లు కొత్తగా పెడుతున్నారు. దానివలన వారికి ఎమైనా ప్రత్యేక లాభం ఉందా? ఊర్దు లో చదివితే ఉద్యోగాలు వస్తాయా? వీటీకి నిధులు కేటాయిస్తూ ప్రోత్సహించటానికి కారణం ఓట్ల రాజకీయం తప్పించి ఏముంది?

   Delete
 15. Must watch

  Heated Debate Between Shashi Tharoor & Sugata Bose at the Kolkata Literature Meet 2017

  https://www.youtube.com/watch?v=-ukmFxtAokw

  ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది,అయితె భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు