Wednesday 15 February 2017

యుద్ధాల సంగతి సరే, శాతవాహనుల కాలంలో సమాజం ఎట్లా ఉండేది?

     తొలి శాతవాహనుల్లో శ్రీముఖ శాతకర్ణి రాజ్యాన్ని స్థాపించి నిలబెట్టినా 1వ శాతకర్ణి మహా బలంతో పరాక్రమించి ప్రస్తుతం మనం చూస్తున్న భారతదేశంలోని అన్నివైపులకీ వ్యాపించి "దక్షిణాపధపతి" అనే బిరుదు సంపాదించాడు.ఉత్తరం వైపున ఖారవేలుణ్ణి కూడా జయించి మగధ వరకూ వ్యాపించాడు!తూర్పున నర్మద వరకూ వ్యాపించి శకుల నుంచీ గ్రీకుల నుంచీ జరుగుతున్న దండయాత్రల్ని నిరోధించి దేశాన్ని సుస్థిరంగా నిలబెట్టాడు.రెండు అశ్వమేధాలూ ఒక రాజసూయం చేసిన ఘనుడు!

    మలి శాతవాహనుల్లో తన పూర్వీకులు పోగొట్టుకున్న భూభాగాల్ని శకుల నించి మళ్ళీ సాధించి నిలబెట్టిన క్రీ.శ 1వ శతాబ్ది నాటి గౌతమీపుత్ర శాతకర్ణి ప్రముఖుడు.బౌధ్ధులకి చెప్పుకోదగిన రీతిలో దానాలు చేసి మతాతీతంగా వ్యవహరించాడు.బ్రాహ్మణుడు కావటం వల్ల "యేక బ్రాహ్మణ" అనే బిరుదును సాధించాడు!

    రాజు దైవాంశసంభూతుడనే మూఢనమ్మకాలు లేకుండా ధర్మశాస్త్రాల కనుగుణంగా కడుచక్కని పరిపాలన సాగించారు అందరు శాతవాహన ప్రభువులు.రాజుకు సలహాలు ఇవ్వడానికి మంత్రిమండలి అనే ఒక సలహాదారుల బృందం ఉండేది,రాజ్యం పెద్దది కావడంతో భాగాలుగా విభజించి పరిధిని బట్టి ప్రాంతాలకు "రాజ","మహాబోజ","మహారధి" నామాలతో అధిపతుల్ని నియమించారు.సమాజం లోని ప్రజానీకం నాలుగు తరగతులుగా వర్గీకరించబడి ఉంది - పైన చెప్పుకున్న అదిపతులు పైస్థాయిలోని ప్రభు వర్గం,దానికి కింది అంతరువుగా అమాత్యులూ మహామాత్రులూ వంటి ఉద్యోగశ్రేణులూ తమ వ్యాపారకౌశలంతో రాజ్యపు సంపద పెంచే ప్రజ్ఞ వుండి సమాజంలో మంచి పరపతి గల్గిన వణిక్ప్రముఖులూ, మూడవ సామాజిక అంతరువులో ఇప్పటి మధ్యతరగతి కుటుంబాలతో పోల్చదగిన వైద్యులూ కవిగాయక శిఖామణులూ రైతులూ కుమ్మర్లూ కమ్మర్లూ,అన్నిటికన్నా కింది అంతరువుల్లో ప్రధాన వృత్తులకి అనుబంధమైన వృత్తి పనివాళ్ళయిన వడ్రంగులూ జాలర్లూ వంటివాళ్ళు వుండేవాళ్ళు!స్త్రీలు విద్యావంతులు కావడమే కాకుండా యెలాంటి అభ్యంతరమూ యెదుర్కొనకుండా మతసంబంధమైన కార్యక్రమాలకి అధ్యక్షత వహించగలిగేవాళ్ళు, అప్పటికి చిన్నవాళ్లయిన కొడుకుల కోసం రాజ్యాన్ని రక్షించి యుధ్ధాలు చేసి అశ్వమేధాలు చేసిన శౌర్యప్రతాపాలను పుణికి పుచ్చుకున్న గొప్ప రాణులు చాలామంది ఉన్నారు!ప్రభువులే తమ గురించి తాము "గౌతమీపుత్ర","వాసిష్ఠీపుత్ర","కౌశికీపుత్ర" అని చెప్పుకుంటూ తమ తల్లుల పేర్లని గౌరవసూచకంగా భావించారు గదా!

    వ్యవసాయం,వ్యాపారం రెంటినీ సమానంగా సంరక్షించడంతో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లిన కాలమది!వ్యాపారస్థులకీ అన్ని రకాల వృత్తుల వారికీ ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సంఘాలు వుండేవని తెలుస్తున్నది - అవి మొత్తం ఆ వర్గానికి చెందినవారి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉండేవి.ఇక్కడి తీరప్రాంతానికి చెందిన సుపార, కళ్యాణి వంటి ప్రముఖమైన రేవుపట్నాల నుండి  ఈజిప్టు, రోము వంటి దూర దేశాలతో ఖండాంతర వ్యాపారం కూడా జరిగింది. పైఠాన్,నాసిక్ లాంటి మహారాష్ట్ర నగరాలు ఈ కాలంలో ఈ సంపదతో పెరిగినవే!ఆ రకంగా ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికన్ పౌరుల వలె భౌతికజీవనంలో అత్యున్నత స్థితిని శాతవాహనుల కాలంలోని మన పూర్వీకులు అనుంభవించారు!

   ఇక ఆధ్యాత్మికంగా చూస్తే స్వయంగా బ్రాహ్మణులైనా సర్వధర్మసమభావనతో ఇతర మతాల్ని కూడా ఆదరించారు - దాదాపు వీరి రాజ్యంలోని అందమైన గుహాలయాలన్నీ బౌధ్ధుల విహారాలూ స్థూపాలతో నిండిపోయాయి!అసలైన అధ్భుతమూ సహిష్ణుతకి పరాకాష్ఠగా చెప్పుకోవలసిన విషయం శకులూ గ్రీకులూ కుషానుల వంటి విదేశీయుల్ని కూడా హిందూమతంలోకీ బౌధ్ధమతంలోకీ ఆహ్వానించి కలిపేసుకోవటం ఆనాడే జరిగిందంటే ఇవ్వాళ ఘర్ వాపసీ అనే చిన్న విషయానికే కొందరు శాంతిభద్రతలకి సంబంధించిన సమస్యల్ని కూడా సృష్టిస్తున్నారంటే ఆనాటి మనవాళ్ళని చూసి మనం పొంగిపోకుండా ఉండలేము గదా!

    ఒకప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు ఉదయంలో విన్నవాళ్లకి శాలివాహన శకం పేరుతో సంవత్సరం చెప్పడం గుర్తుండే ఉండాలి - దాని ప్రారంభకులు శాతవాహనులే!ఇవ్వాళ క్రీ.శ అనేది యెందుకు విశ్వవ్యాప్తమైన కాలమానంగా గుర్తించబడుతున్నది?యెక్కడికి వెళ్ళినా తమ సంస్కృతి గొప్పది కావటం వల్లనే తాము గొప్పవాళ్ళమైనామనే అహంకారంతో తమవైన వాటిని అక్కడి స్థానికుల మీద రుద్దెయ్యటం వల్ల జరిగింది!మన ప్రభుత్వం అధికారికంగా ఆకాశవాణిలో వినిపించే ఆ రెండు కాలమానాల్లో శక సంవత్సరం మొత్తం భారతదేశానికి సంబంధించినదయితే శాలివాహన శకం మనం ఉన్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినది.మనం కూడా నిజాయితీతో కూడిన వ్యాపారంతో సరిపెట్టుకోకుండా దుర్మార్గంగా వ్యాపించి ఉంటే ఇవ్వాళ ప్రపంచ మంతటా క్రీ.శ బదులుగా శాలివాహన శకం ప్రకారం సంవత్సరాల్ని చెబుతూ ఉండేవాళ్ళేమో!ఇవ్వాళ ప్రపంచం సంగతి దేముడెరుగు మనవాళ్ళకి మన సంస్కృతిని గురించి చెప్పటానికే సందేహించవలసి వస్తున్నది!ప్రాదేశికంగా ఉత్తర దక్షిణ భారతాలను కలుపుతూ ఉన్న భూమిని పరిపాలించటం వల్లనూ, అంతకి ముందర చాలాకాలం నుంచి మౌర్యులకి విధేయులుగా వుండినందువల్లనూ ఆర్యసంస్కృతి దక్షిణానికి విస్తరించటానికీ ఆ రకంగా దేశమంతా సాంస్కృతికంగా యేకత్వాన్ని సాధించటానికీ శాతవాహనులే కారణమైనారు!

12 comments:

  1. >>నిజాయితీతో కూడిన వ్యాపారంతో సరిపెట్టుకోకుండా దుర్మార్గంగా వ్యాపించి ఉంటే ఇవ్వాళ ప్రపంచ మంతటా క్రీ.శ బదులుగా

    వెంకటేష్ సినిమాలు చూసే వాళ్ళకి ఒక వింత అనుభవం ప్రతి సినిమాలో ఎదురౌతుంది. సినిమా ఎంత మంచిగా వున్నా, ఎక్కడో ఒక చోట డైరక్టర్ని బతిమాలో, బెదిరించో ఒక కోతి డాన్స్ వేస్తాడు. అంత చండాలమైన స్టెప్ ప్రతి సినిమాలో ఖచ్చితంగా ఉంటుంది.

    హరిబాబు కూడా కంటెట్ అంతా బాగా పెట్టి, ఎక్కడో ఒక చోట మనోళ్ళు అమాయకంగా నోట్లో ఏలేసుకోని బజ్జుకుంటే, బ్రిటీష్ వాళ్ళే ఒచ్చి దోచుకెళ్ళారు అంటాడు. అంతేగానీ మన ఎధవ బిహేవియర్ చచ్చినా ఒప్పుకోడు

    ReplyDelete
    Replies
    1. చరిత్రలో ఓ అంటే ఢం తెలియకుండా అసొల్లు వాగుడు వాగితే నీ పరువే పోద్ది!

      లార్డు అని పిలిపించుకునే క్లైవు గడి మూలం ఏంటి?చిల్లర దొంగతనాలు చహేసే గాలి వెధవ - ఇక్కడికొచ్చి వాడు చేసిన ఘనకార్యం ఏంటి?ఫోర్జరీల దగ్గిర్నుంచి డబ్బులు ఎగ్గొట్టటం వరకు ఎన్ని చహెశాడు?అక్కడి కెళ్ళాక వాడి మీఅద్ విచారన వస్తే , "ఇప్పటికీ అక్కడ "పోగుపడి ఉన్న సంపదతో పోలిస్తే నేను దోచుకున్నది చాలా తక్కువ,అందుకే అది తప్పని నేననుకోలేదు!" అన్నాడు.అప్పటి లెక్కల్ని ఇప్పటికి మారిసతె వాడొక్కడూ కొట్తేసినది కొన్ని లక్షల కోట్లలో ఉంటుంది - అది నీకు తెలుసా?మన రాజులు మన సంప్రదాయం ప్రకారం దత్తత తీసుకుంతే అది చెల్లదనటానికి వాళ్ళెవరు?వీళ్ళూ లొంగతం వీళ్ళ్ బలహీనత కొద్దీ లొంగారు అనుకుంటే మరి నువ్వు మర్యాదస్తులు అనుకునే అదే ఇంగ్లీషోళ్ళు ఆస్ట్రేలియాలో స్టోలెన్ జనరేషన్స్ పేరుతో జరిపిన ఘనకార్యం సంగతి కూడా నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది - అజ్ఞాన కుక్షి!

      ఏమిటి నువ్వు చెప్పే ఎదవ బిహేవియర్?ఏమి తెలుసు నీకు చరిత్ర గురించి?నేను పైన చెప్పిన చరిత్రలో సగమైనా తెలిస్తే నీనుంచి ఇలాంటి కుళ్ళు కామెంటు రాదు - మూసుకుపోరా గూట్లే?!

      Delete
    2. పిచ్చోడ్ని పిచ్చోడంటే ఏమైతదో తెలిసిందా???

      Delete
    3. Dear Mr Anonymous16 February 2017 at 04:57
      I got a bitter lesson VERY LONG BACK by the comments like above Anonymous15 February 2017 at 09:34 that there were lot of idiots are also reading my blog and I am not having any repentance about it!

      LET THEM SHOW THEIR REAL CONTENT,WHAT ELSE THEY HAD?

      Delete
    4. Then don't publish them

      Delete
  2. Hari Babu Garu,

    Please note this points.

    1) There is a lot of controversial regarding the origin of "Saka" and "Vikrama".

    2) There are a around one dozen of Vikramadityas.

    3) As per traditional Historians Satavahanas - Anhras ruled from 9/8th to 4th Cen BC and then Guptas (Andhrabruthyas)came.

    4) Same time in South they had (Another branch) thier own kingdoms.

    5) It is very wrong to mention Satavahanas defeated Kharavela as he belongs to 12th Cen BC.

    6)As per Sri Vedveer Arya there is a common error of 660 years in the world history - Greek, Rome histories date is also wrong. Even the dates of Jesus (some doubt and if he is real person) and Mohammad dates are pushed back. Salivahana date also pushed back.

    7) As there are two Vikrama (718 BC - Karithikadi - Gujarati new year and Chaitradi 57 BC) and two Saka (581 BC and 78 AD) eras existed. Actually these are created by our Astronomers and there is a Gap of 137 years between first Vikrama and Saka era & the same is mainted in last erars.

    8) The entire history of Vijayanagara was cut by our historians from one thousand years to 300 years. There are three Sri Krishna Devarayas (Poet Allasani peddana dated 9th Cen AD) and two major attacks by Turks - first in 6th cen AD - they are not muslims and probably they are Magas/Sun god worshipers second in 13th Cen AD - Muslims. Although Mohhamud born is 1st cen BC but the Muslim religion did not suddenly spread and took 8/9 hundread years time.

    9)There are two Akbars (9th Cen AD and 15/16 th Cen AD) and two Aurgangajebs. Even the date of Chenghiskhan date pushed back - 6th Cen AD.

    10) Last but not least. Even Kakatiya rule was also reduced. There are two Rudramadevis - one is daughter of Ganapati deva and other is Widow of Ganapati Deva!!! There is no need to mention there are two or three Ganapati devas and Prataparudras. The same Turks attacked Warangal in 6/7th Cen and 13/14th Cen AD up to Madurai. Our First Telugu poet "Nananaya" date is also pushed back - 661 years as Rajendra Chola rule in Rajamahendra ended in 399 AD.

    Recently Sri Vedveer Arya article "The Epoch of The Saka Era" has been published in the annual Journal of the Epigraphical Society of India "Studies in Indian Epigraphy" volume XLII, 2017.

    If you are intersted please through this article = http://itihasabharati.blogspot.in/2016/05/vijayanagaraa-greatest-south-indian.html

    Also download the AAP - Chronology of Ancient India from Google Play store - https://play.google.com/store/apps/details?id=com.glt.chronology

    ReplyDelete
  3. Another point is that the Great Alexandar 3 (10/9th Cen BC) of Greece date is also pushed back 660 years and neither he met Chandra Gupta Maurya of (16th Cen BC) or Gupta Chandra Gupta (3rd Cen BC. Intersentigly his original name is "Iskindar" / In hindi film he was called as Sikandar and he is half Persian (Father) and half Greek (Mother), which is hide by Western Historians.

    ReplyDelete
    Replies
    1. I have written about alexander very long back.I know the distortions of the history about his conquest(?) of porus!I will check my ld post and will give you the link.

      Delete
    2. దొరికింది, ఇక్కడ చదవండి.అలెగ్జాండరు పేరుతో మనం వింటున్న కధలోని సాండ్రకోటస్ పేరుతో చేసిన వర్ణనలకి సరిపోయే వ్యక్తులు ఇద్దరూ అతని కాలానికి సంబంధించినవాళ్ళు కారు.అతను ఇక్కడ ప్రతినిధిగా ఉంచాడంటున్న సెల్యూకస్ అతని తర్వాత అతని రాజ్యానికి అక్కడ రాజై తర్వాత కాలంలో మగధ మీద దాడి చేసి ఓడిపోయి తన కూతురు హెలీనాని అప్పటి చహంద్రగుప్తుడికి ఇచ్చి పెళ్ళి చేసి వెనక్కెళ్ళిపోయాడు.

      Delete
  4. Recently there is some controversary between Christians and Muslims regarding Khuran is older than Muhhamud as a manuscript is discovered which is estimated around 6th cen AD and predated before the birth date of Muhhamud (Actually Muhhamud birth date is wrong and should be pushed back). http://www.rawstory.com/2015/08/carbon-dating-suggests-worlds-oldest-koran-is-even-older-than-the-prophet-muhammad/

    ReplyDelete
  5. Hari Babu Garu

    Yes, I also know the above information. Modern scholars claim Alexander met Chandra Gupta Mourya and Traditional Scholars - Sri Kota Venkatachalem wrote he is Gupta Chandra Gupta.

    But what I wrote is latest information (Mr. Vedveer Arya whome cracked the original Saka era ( two saka dates first is 583 BC and second is 78 AD = Difference of 661 years simultaneously two Vikrama Eras (718 BC - month begins with Kartika masa and 57 BC - Chaitradi Vikrama - His full name is Sri Harsha Vikramaditya and the Great Pulakesi 2 (It is said that his son was defeated and Pulakesi returned back from Vanaprasta ashrama and fought with Sri Harsha Vikramaditya) stopped him in South India and there is an agreement made that Sri Harsha withdraw his army) also gave another interest information regarding entire World History Greek, Roman, Persian and Chinese The date of Christ, Muhhamud as well as Alexander the Grate date also pushed back).

    ReplyDelete
  6. హరప్పాయే అయోధ్య
    ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి
    "ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి"
    Click here For English Book: A Tribute to the Ancient world of India
    ఈ గ్రంధమును పరిశోధకుడు రచయిత శ్రీ జనార్ధన ప్రసాద్ వేదములు, రామాయణము, భారతము, మనుస్మృతి, మొదలయిన వివిధ సంస్కృత గ్రంధములు శోధించి, మరియు వివిధ చరిత్ర పుస్తకములను చదివి వ్రాయడమయినది.

    ఈ పుస్తకములో మొత్తమునకు 49 అధ్యాయములతో 215 పేజీలు కలవు. మరియు 240 సంస్కృత శ్లోకములు, 22 మ్యాప్ లు, 57 చిత్రములు ఈ పుస్తకములో చోటుచేసుకున్నవి.

    ఈ పుస్తకము యొక్క ప్రధాన ఉద్ధేశ్యము మనయొక్క పురాణేతిహాస, వేద రచనలలో గల వ్యక్తులకు, స్థలములకు చారిత్రకత కల్పించడమే. రామాయణమునకు 2300 బీసీ కాలముగా ఈ గ్రంధరచయిత అభిప్రాయపడుతున్నారు. మరియు ప్రస్తుతము పంజాబులోనున్న రావి నది పూర్వపు సరయూ నది అని, ప్రస్తుత సింధునది పూర్వపు సరస్వతీ నది అని, ప్రస్తుత ఘగ్గర్ నది పూర్వపు గంగా/దృషద్వతి నది అని వివిధ ఆధారములతో మనముందుంచుతున్నారు.

    అలాగే ప్రస్తుత మొహ్హంజో దారో పూర్వపు లంకా నగరమని, ప్రస్తుత హరప్పా పూర్వపు అయోధ్య అని, ప్రస్తుత గన్వేరీవాలా పూర్వపు మత్స్య రాజ్య రాజధాని అయిన వైజయంతమని చెబుతున్నారు. పూర్వ సమాజములో మునులు, ఋషులు, బ్రహ్మచారులు, వానప్రస్తులు, రాజన్ లు, అగ్నలు, అర్యములు, వైశ్వానరులు, మారుతులు, దేవీదాషుశేలు, సూతులు, తదితర వర్గములవారు సామరస్యపూర్వకముగా జీవించేవారని, బ్రహ్మప్రజాపతి సమాజమునకు మూలవిరాట్టు అని చెబుతున్నారు. వేల సంవత్సరాల వీరి చరిత్రలో ఎన్నో విదేశీ సంస్కృతులు, జాతులు గుర్తించలేని విధముగా సమ్మిళితమయిపోయారని, ప్రస్తుత సమాజమునకు పూర్వము సనాతన ధర్మ సమాజమునకు పోలిక చాలా తక్కువ అని చెబుతున్నారు. ​
    http://www.vedabhumi.co.in/3114314931203134309831363112-3117313431203108313631193137312230933137-30773093314931273120-31283137311831343074310031223135.html

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...