Tuesday 19 February 2019

ఎప్పుడో ఆదాము నిషిద్ధ ఫలం తిన్నందుకు ఇప్పటికీ పుట్టిన ప్రతి శిశువునీ జన్మపాపం అంటించి శిక్షించటం న్యాయమా?

నేను ఈ మధ్య వరకు క్రైస్తవులు జన్మపాపం అంటున్నది దేవుని ఆజ్ఞను ధిక్కరించడమో లేకపోతే సెక్సు గురించి తెలుసుకుని సిగ్గు పడటమో అనుకునే వాణ్ణి!ఎందుకంటే, మనకి తెలిసిన కధ ప్రకారం సాతాను జియ్యరు పండును తినిపించాక యెహోవా దేవుడు వాళ్ళని చూట్టానికి వచ్చినప్పుడు ఆదామూ హవ్వా సిగ్గుతో మొలల్ని కప్పుకుని కనపడ్డారనీ దాన్ని బట్టే యెహోవా దేవుడు వాళ్ళు నిషిద్ధఫలాన్ని తిన్నారని తెలుసుకుని విపరీతమైన కోపంతో మండిపడి ఈడెన్ తోట నుంచి వెళ్ళగొట్టేస్తాడని ఉంటుంది కదా!తర్వాత తరాల్లో దావీదు ఉచ్చనీచాలు మరిచి నిస్వార్ధంగా రాజ్యం తరపున యుద్ధం చేస్తున్న సైనికుడి భార్య మత్సిబాతో లైఫ్‌టైం ఎంజాయిమెంటుకి తన మొగుణ్ణి చంపించడం, లోతు కూతుళ్ళు తండ్రితో సంగమించడం లాంటివే రక్షకుడి వంశం నిండా పరుచుకుని ఉంటాయి, వాటికి శిక్షలూ పడతాయి.బహుశః దానికి సిగ్గుపడి రక్షకుడికి కూడా దాన్ని తగిలించడానికి ఇబ్బందిపడి జీససు దైవపుత్రుడని కల్పించి ఉంటారని నా అనుమానం!సహజంగానే ఈ పోలికల వల్ల ఆదాముని ఈడెన్ తోట నుంచి గెంటెయ్యడంలో తప్పు లేదనిపిస్తుంది.కానీ క్రైస్తవ్యంలో ఇవ్వాళ మనుషులందరూ పుట్టుకతోనే మోస్తున్న పాపం "ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడం " అట!

ఇదెక్కడి విడ్డూరం?మర్దరో మానభంగమో దోపిడీయో వ్యభిచారం చెయ్యటమో అక్రమసంబంధం పెట్టుకోవటమో పాపం అంటే ఒక మాదిరి, దేవుడి ఆజ్ఞను ధిక్కరించటం అన్నది కూడా బలమైన కారణమే - అసలు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకున్నందుకే యెహోవా దేవుడు ఆదామునీ హవ్వనీ అన్ని చావు తిట్లు తిట్టి మెడ పట్టి ఈడెన్ తోట నుంచి గెంటేశాడా!

నమ్మట్లేదా?సాక్ష్యం చూపించాలా!తప్పదా?చూపించందే వూరుకోరా?సరే!నాకేం భయం?

"యెహోవా యుద్ధనీతి vs శ్రీరాముని యుద్ద నీతి పార్ట్ -1 " అనే ఒక క్రైస్తవ మతప్రచారకుడు పెట్టిన వీడియో దగిర"Neelam Sundar Vijaya Kumar 2 weeks ago వినాయకుడి గొంతు కోయడానికి కారణం శివుడి సెక్స్ కోరిక. ...సాంబశివ రావు బ్రదర్ కు మరొక్క సారి వందనాలు" అంటూ మొదలవుతున్న కామెంటుని ఫాలో అవ్వండి!

సారుకి బైబిలు కన్న హిందూ గ్రంధాల మీదనే మంచి పట్టు ఉన్నది.దానికి తోడు "కనీసం వినే హిందూ సోదర సోదరీలు గ్రహిస్తే చాలు." అనే హమదాశయంతో ఉన్నారు.వారి జిజ్ఞాసకీ హిందువులని ఉద్ధరించాలనే ప్రేమకీ చాలా ముచ్చటేసింది! కానీ ఒక హిందువు "4.54 బిలియన్ ఇయర్స్ క్రితం స్రృష్టి జరిగితే 6000సం"క్రితం వచ్చి నేను స్రృష్టి చేశాను అంటాడా భాష కొక పేరగల ఆ బేవర్స్ ఎలోహిం, యాహ్వే, జెహోవా,యహోవ గాడ్డ్." అని రెచ్చిపోతుంటే సారు "6000 సం క్రింద సృష్టి ఆవిర్భావం జరిగింది అని ఎక్కడుందో కాస్త చెప్పురా." అని మళ్ళీ మళ్ళీ నిలదీస్తుంటే పాపం హిందూ గ్రంధాల్ని చదవడంలో మునిగిపోయి బైబిలు చదవడం తగ్గించి ఉంటారని జాలిపడి "బైబిల్ ప్రకారం భూమి వయసు 6000 కాదు బాబోయ్ అని మీరు నెత్తి నోరు కొట్టుకుంటే సరిపోతుందా! బైబిల్ పూర్తిగా చదివిన ఎవరికైనా 6000 అని సులభంగా తెలిసిపోతుంది. మీ దేవుడు యహోవా 6 రోజుల్లో సృష్టి పూర్తి చేసి 6 వ రోజు మీ ఆదామును సృష్టించాడు. ఆదాము పుట్టిన 130 సం. రాలకు సేతు పుట్టాడు. సేతు 912 సం. రాలకు చనిపోయాడు అప్పటికి సృష్టి వయసు 130+912+6=1048. తర్వాత నోవా 14 సం. రాలకు పుట్టాడు అప్పటికి 1062 అయింది. ఆదిమకాండం 7:6 ప్రకారం ప్రళయం వచ్చే సమయానికి నోవా వయసు 600 సం. అంటే క్రీ.పూ. 1662 లో ఒక మహా ప్రళయం వచ్చి జీవరాశి చాలా అంతరించిపోయింది. ఆ తర్వాత అబ్రహం క్రీ. పూ. 2300-2500 సం. రాలకు పుట్టాడు. కాబట్టి 2018(ఈ సం)+1662(ప్రళయ సమయానికి సృష్టి వయసు)+2400=6080 సం. ఇది మాకు అర్థం అయిన లెక్క. కాదు అని మీరు చెబితే మేము ఎలా ఒప్పుకునేది. అదీకాక బైబిల్ ప్రకారం భూమి ముందు పుట్టి సూర్యుడు నక్షత్రాలు తర్వాత పుట్టాయి. అంటే సూర్యుని వయసు నక్షత్రాల వయసు ఇంకా తక్కువ. ఇక కాదు బాబోయ్ అని మీరు చెబుతున్నారు కదా మీ లెక్క మాకు చూపండి."  అనే కామెంటు వేసి  నేను  సాయం చేశాను.

దానికి సారు "ఆదికాండము 5: 3. ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. ఆదాము పుట్టిన తరువాత అని బైబుల్ లో లేదు. అది బహుశః మీ కరుణాకర్ వెర్షన్ అయి ఉండవచ్చు. ఆ 130 సంవత్సరాలు అనేది ఆదాము తోటలో నుంచి బయటకు వచ్చిన తరువాత. ఆదాముకు తినవద్దన్న పండు తినేంతవరకు చావు అన్న శాపం లేదు. కాబట్టి ఆదాము ఏదేను తోటలో ఎన్ని సంవత్సరాలు జీవించాడు అనేది తెలియదు. లక్షలు కావొచ్చు కోట్ల సంవత్సరాలు కావొచ్చు. ఆదికాండము 2: 16. మరియు దేవుడైన యెహోవాఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; 17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. బైబుల్ ప్రకారం సృష్టి మొదలై 6000 సంవత్సరాలు అనేది మూర్ఖుల మూర్ఖత్వం మాత్రమే." అని జవాబిచ్చి మొత్తానికి హిందూ గ్రంధాల అధ్యయనంలో పడి బైబిలుని మర్చిపోలేదని నిరూపించారు, శభాష్!

ఇక్కడే నాకు మొదటి షాక్ తగిలింది -  "17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను." అనేది చదవగానే మొదట తల దిమ్మెక్కిపోయింది,తర్వాత ఒళ్ళు జలదరించింది, తర్వాత రోమాలు నిక్కబొడుచుకున్నాయి, ఆఖర్న చక్కిలిగింతలు పెట్టినంత నవ్వొచ్చింది.అనుకోకుండానే "వార్నీ!మంచీ చెడూ తెలియడమే పాపమా? ఇదెక్కడి దరిద్రం!మరి, తెలియకపోవడం మంచి అనీ తెలియడం చెడు అనీ అనుకుంటే అది తెలిసేటట్టు చేసే పండుని అక్కడ ఉంచడం దేనికి?" అనిపించింది - అదే అక్కడ ఉంచాను.

ఆయన పదిమందితో ఒక్కసారి పోరాడగలిగిన అసహాయ శూరుడు కదా, ఇతర్ల దాడితో కొంతసేపు దారి తప్పారు, మళ్ళీ ఈ లైను దగ్గిరకి రావడానికి కొంత టైము పట్టింది.ఆ సైడ్ ట్రాక్ దగ్గిర కూడా నేనే ఉన్నాను.సారు హిందూ పౌరాణిక పాండిత్యం వెలార్చిన మొదటి కామెంటులోని "శివుడు దేవుడే అని అంటారు గానీ జ్ఞానం లేని దేవుడు. ఎందుకంటే భూత వర్తమాన భవిష్యత్తు తెలియని దేవుడు." అనే ముక్కకి "mee devudiki bhavushyattu telisae siluva meeda neeligi chschchaadaa? Chastaanani mundae telistae tappinchukovalani enduku choosaadu! Oe tandree, naa tandree ani gukkapatti aedchaadugaa :-()" అని కొంచెం ఘాటు రిటార్టు ఇచ్చాను.దానికి సారు కూడా "యేసుక్రీస్తు చనిపోక ముందే తాను చనిపోయి 3వ రోజున తిరిగి లేస్తాను అని చెప్పారు. ఆయన దేవుడు మరియు మనుష్యుడు కాబట్టి ఆయనలో మనిషి ఆ బాధను బట్టి అలా వేడుకున్నారు కాని ఏమన్నారు నీ చిత్తమే సిద్దించునుగాక అన్నారు. లూకా సువార్త 22: 43. తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చితమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. మత్తయి సువార్త 20: 18. ఇదిగో యెరూష లేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి 19. ఆయనను అపహసించు టకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును." అని దీటుగానే స్పందించారు.

నిజానికి  బైబిలులోని ఈ భాగాన్ని ఓకసారైనా చదివి ఉంటే కొంత అర్ధమై మౌనంగా ఉండిపోయేవాణ్ణేమో! కానీ, ఆయన అంత వివరమైన జవాబు చెప్పేసరికి దాన్ని చదవగానే చాలా డౌ వచ్చాయి.
"why all that unnecessary crucifixion and resurrection drama?

The king just asked prove yourself as Messiah! If he was real Messiah with great knowledge and 
efficient to do miracles like walking on water to save others can definitely win in the court of law and be a winner! 

The king ordered crucifixion because Jesus could not prove himself in the court of law before the king, is it not?"
అంత పాండిత్యం గల మనిషి కూడా ఎందుకో ఇంత సూటి ప్రశ్నలకి జవాబు చెప్పడం మానేసి "మీ కరుణాకర్ లేకపోతే ఇంకో కటారి కాకపోతే మీనాక్షిల 6000 సం థియరీ గురించి నీ రెస్పాన్స్ ఏంటి? ఒక్కొక్కటిగా నరుక్కుంటూ వొద్దాం." అని వాదనని వూహించని కొత్త మలుపు తిప్పాలని ప్రయత్నించారు.

దానికి మెయిన్ పాయింటు మీద కుతూహలం ఎక్కువ ఉండటం వల్ల "First we complete this topic of Sin of Adam is descending to all the human beings like a hereditary disease concept.

I really got shock just by seeing that numbered statement which declares that knowing what is good and bad is the main cause to threw the couple from Eden, and that was the sin according to yahova,bible and christianity!Upto now I thought it is related to sexual flirting because of little knowledge about it. The main reason god knew about their crime is covering their genitals.

But now it is clear from the text you pasted here from the Bible itself is really absurd! If knowing good and bad is the real sin, It is meaningless to declare that the sin is congenital - why because, we are learning what is good and what is bad from our parents!

Moreover I am not having any relation with karunakar. You also answered in a way that those times starts from the point coming out of Eden and you are not discarding the time scales yourself, and you are unable to give a number for the time spent by the first couple in Eden! I am very thankful if you could tell me about it, because I knew very little about bible.

The questions I am asking from the text what you pasted from bible here only.I am not interested in that.All my curiosity about that janmapaapam aroused just now, after seeing the statement made by you. 

So, I request you to enlighten me about the sin of Adam." అని మళ్ళీ మెయిన్ ట్రాక్ మీదకి తీసుకొచ్చాను.

దానితో సారు నా జిజ్ఞాసకు ముచ్చటపడి "బ్రదర్ చాలా అయోమయంలో ఉన్నట్లుంది మీరు. దేవుడు తన రూపంలో సృజించారు ఆడమును. అంటే అప్పుడు ఆడముకు చెడు తెలీదు ఒట్టి మంచి మాత్రమే తెలుసు. ఆడం చెడు తెలుసుకోడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఆ పండు తిన్న దినాన చేస్తావు అని హెచ్చరించారు. ఇక్కడ చావు అంటే శరీరం నుండి ప్రాణం బయటకు పోడం కాదు. ఆత్మ నిరంతరం చావడం. ఈ విషయం హిందూ ధర్మంలో తెలియదు. దేవుడు చెప్పినట్లే జరిగింది. ఆదికాండము 3: 19 నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. హిందూ ధర్మంలో మానవుడి సృష్టి మట్టి నుండి అని తెలియదు. అసలు ఎలా సృజించబడ్డాడు అనడానికి ఒక్కో పురాణంలో ఒక్కో రకంగా చెప్పబడింది. అలాగే దేవుళ్ళు కూడా సృష్టించబడ్డారు." అని ఆదాము వృత్తాంతాన్ని మరింత విశదం చేశారు.

కొన్ని సెకండరీ డౌట్స్ తీరాయి గానీ మెయిన్ డౌట్ అలాగే ఉండి పోయింది,అదీ గాక సారు నాకు ఆయన చెప్పినది అర్ధం కావడం లేదని పొరపాటు పడుతున్నారని భావించి "No, I am not interested about comparing bible and Hindu scriptures. What you told about Adam that he is pure when he was created by Yahova is very clear to me. You confirmed that Yahova did not want man to become a sinner and that also was very clear to me. 

My question is why then yahova put that fruit there? If there is no such fruit in that garden that corrupts the man - where is the chance of man becoming a sinner?

Why he put that fruit in the first place if he don't want man to become a sinner? Why he warned unneccessarily after putting it there? And,the first pair lived very innocently over very long period before Satan seducing them, is it not?

They did not commited the sin readily! From the first day to the last day before the temptation came from Satan, they lived obedient life. So, my question is why yahoma created Satan and tempted the first couple?

If Satan is also created by yahova, the real criminal that seduced Adam is YAHOVA himself, is it not?" అని నిలదీశాను.

ఆయన వైపు నుంచి కొంత విరామం రావడంతో కామెంట్లని చదువుతుంటే ముక్కల ముక్కల యవ్వారం మొత్తాన్ని ఒకచోట చేర్చి అడిగితే క్లారిటీ వస్తుందనిపించి: "బ్రదర్, నేను గందరగోళంలో ఉండటం నా అజ్ఞానం వల్ల కాదు.మీరు పైన ఉటంకించిన "17."వ ఆదికాండం 2 వల్ల కలిగినది.తమాషా ఏమిటంటే నా గందరగోళాన్ని గుర్తించి మీరు జవాబు ఇచ్చాక రెండు గందరగోళాలు తయారయ్యాయి.

నా మొదటి గందరగోళం ఏమిటో చెప్తాను వినండి:నేను హిందువుని అని తెలియడం వల్లనో ఏమో మీరు "హిందూధర్మంలో మానవుడి సృష్టి మట్టి నుండి అని తెలియదు." అని అంటున్నారు.కానీ మట్టి నుంచి మనిషి వచ్చాడనే కాదు, ఆ మట్టి అక్కడికి ఎలా వచ్చిందనేది కూడా హిందూధర్మంలో ఉంది."ఈశ్వరు డధిష్ఠించిన ప్రకృతి అంశంతో మహత్తత్త్వం పుడుతుంది. మహత్తత్త్వం అంశంతో అహంకారం పుడుతుంది. అహంకారం అంశంతో శబ్దతన్మాత్ర పుడుతుంది. శబ్దతన్మాత్ర అంశంతో 1.ఆకాశం పుడుతుంది. ఆకాశం అంశంతో స్పర్శ తన్మాత్ర పుడుతుంది. స్పర్శతన్మాత్ర అంశంతో 2.వాయువు పుడుతుంది. వాయువు అంశంతో రూపతన్మాత్ర పుడుతుంది. రూపతన్మాత్ర అంశనుండి 3.అగ్ని పుడుతుంది. అగ్ని అంశంతో రసతన్మాత్ర పుడుతుంది. రసతన్మాత్ర అంశనుడి 4.జలం పుడుతుంది.జలాంశం నుండి గంధ తన్మాత్ర పుడుతుంది. గంధ తన్మాత్ర అంశతో 5.పృథ్వి పుడుతుంది. వీటన్నిటి కలయిన వల్ల పదునాల్గు భువనాల స్వరూపమైన విరాడ్రూపం ఉద్భవిస్తుంది." - ఇంత వివరణ బైబిలులో ఉందా?అదీకాక బైబిల్ ప్రకారం భూమి ముందు పుట్టి సూర్యుడు నక్షత్రాలు తర్వాత పుట్టాయి.ఇక్కడి విషయానికీ దానికీ సంబంధం లేదు గనక దాని గురించి తర్వాత మాట్లాడదాం.

విషయానికి వస్తే నాకు బైబిలు పరిజ్ఞానం తక్కువ.అయితే తక్కువ తెలియడం విముఖత వల్ల మాత్రం కాదు.ఆ కొంచెం తెలియడం కూడా ఆసక్తి వల్లనే.నేను ఇదివరకు అనుకున్నది యేమిటంటే బైబిలు పాపం అంటున్నది "లైంగిక విశృంఖలత!" అని.ఎందుకంటే, ప్రధమ జంట యహోహా కనబడగానే తమ మొలల్ని ఆకులతో కప్పుకున్నారనీ దానివల్లనే దేవుడు వాళ్ళు నిషిద్ధఫలం తిన్నట్టు గుర్తుపట్టాడనీ  ఈడెను నుంచి ఆ కామాతురత గురించే వెళ్ళగొట్టాడని నేను అనుకున్నాను.అందులో తప్పేమీ లేదు కదా!

కానీ మీరు ఇక్కడ చూపించిన వాక్యం ఏమి చెబుతున్నది?"మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష  ఫలములను" తినడమే YAHOVA అంత కోపం తెచ్చుకుని ఈడెన్ అనే ఒక అత్యద్భుతమైన తోట నుంచి మనిషిని వెళ్ళగొట్టటానికి కారణం అని ఉంది, అవునా?"ఇక్కడ చావు అంటే శరీరం నుండి ప్రాణం పోడం కాదు.ఆత్మ నిరంతరం చావడం." అని మీరు చెప్తున్న చావు కానీ "నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు." అని చెప్తున్న బతుకు కానీ ఆ పండు తిన్నాక ఏది మంచి ఏది చెడు అనేది తెలియడం వల్ల వచ్చి పడినవే కదా!

"దేవుడు తన రూపంలో సృజించారు ఆడమును. అంటే అప్పుడు ఆడముకు చెడు తెలీదు ఒట్టి మంచి మాత్రమే తెలుసు. ఆడం చెడు తెలుసుకోడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఆ పండు తిన్న దినాన చేస్తావు అని హెచ్చరించారు." అని మీరు బల్లగుద్ది చెప్పడంతో నా గందరగోళం పదింతలు పెరిగింది!

వార్నీ!మంచీ చెడూ తెలియడమే పాపమా? ఇదెక్కడి దరిద్రం!మరి,తీలియకపోవడం మంచి అనీ తెలియడం చెడు అనీ అనుకుంటే అది తెలిసేటట్టు చేసే పండుని అక్కడ ఉంచడం దేనికి?

What you told about Adam that he is pure when he was created by yahova is vey clear to me.

You confirmed that Yahova did not want man to become a sinner and that also was very clear to me.

My question is why then Yahova put that fruit there?If there is no such fruit in the garden which corrupts man - where is the chance of man becoming a sinner?

Why he put that fruit in the first place if he don't want man to become a sinner?Why he warned unneccessarily after puting it there?

They did not commited the sin readily! From the first day to the last day before the temptation came from Satan, they lived obedient life.

So, my question is why yahova created satan  and tempted the first couple?

If Satan is also created by yahova, the real criminal that seduced Adam is YAHOVA himself, is it not?

ఇది ఈడెను తోటలో జరిగిందని బైబిల్ చెప్తున్న కధ మీద నాకు ఏర్పడిన మొదటి గందరగోళం.ఇంక రెండవ గందరగోళం మనిషి ఈడెన్ తోట నుంచి నెట్టివేయబడ్డాక మానవజాతి మీదకి ఆదాము చేసిన పాపం జన్యుపరమయిన రోగంలా సంక్రమించడం గురించి.

ఆదాముకి పండు తిన్నాక కదా మంచీ చెదూ తెలియడం జరిగింది, అది పాపం గనక శిక్ష వేశాడు - బాగనే ఉంది!మనకి పెరిగి పెద్దయ్యాక కదా మంచీ చెడూ తెలుస్తున్నది! 

యహోవా మంచి చెడులను తెలియజెప్పే పండును తిని ఘోరమయిన నేరం చేసిన ఆదాముకి మంచి చెడులు తెలిశాక శిక్ష వేసి ఆ నేరం చెయ్యని తర్వాత తరాల మనుష్యులకి  మాత్రం మంచి చెడులు తెలియక ముందే ఆ పాపాన్ని అంటించి శిక్షించడం న్యాయమా?

If knowing good and bad is sin, You simply do not teach your kids about it and make them as pure as Adam before eating that Fruit - then that kid definitely wins death! 

YOU GOT MY POINT?"అని కొంచెం సుదీర్ఘమైన కామెంటు వేశాను.

అబ్బ!మొత్తానికి నా మితిమీరిన అజ్ఞానానికి విసుక్కుని ఆగిపోకుండా కొంచెం కాలాతీతం అయినా, "I got your point and I will try to clear your doubts. You too should receive it with clear mind without any hindrance.
మొట్టమొదటగా మీ ఓపికకు నా జోహార్లు.

మట్టి ఎలా సృష్టించబడింది అనడానికి చాలా దీర్ఘమైన వివరణ ఇచ్చారు. చాలా సంతోషం. నేను చెప్పింది మట్టి ఎలా తయారయ్యింది ఎక్కడెక్కడ ఉంది అన్నది కాదు. మానవ సృష్టి దేని చేత చేయబడింది అని.

సనాతన ధర్మం ప్రకారం ఋగ్వేదం 10-90-12 మరియు మనుస్మృతి 1-31 ప్రకారం బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు, భుజముల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైస్యులు, పాదముల నుండి సూద్రులు సృష్టించబడ్డారు. 

దీన్లో మట్టి నుండి మానవుడు సృష్టించబడ్డాడు అన్న ప్రస్తావన ఎక్కడా కనపడలేదు. చాలా విషయాలు గోల్ గోల్ గుమాయించి చెప్పడం వల్ల అసత్యం ఎప్పటికీ సత్యం కాదు కానేరదు అన్న విషయం ప్రజలు తెలుసుకోవాలి.

సైతాను దేవుడి చేత సృష్టించబడడం ఏంటి? హిందూ మతంలో శని అంటే సైతాను కూడా ఒక దేవుడే. శని మా జోలికి రావద్దని మనుష్యులే కాదు దేవుళ్ళు కూడా పూజ చేస్తారు. కానీ క్రైస్తవ్యంలో శని/ సైతాను మానవుడికి దేవుడికి కూడా శత్రువు.

సైతాను ఆవిర్భావం గురించి చెప్తాను: దేవుడు సైతాను ను సృజించలేదు. ఏవో కొన్ని లక్షల్లో లేక కోట్ల కోట్ల సంవత్సరాల లేక (ఇంకా ముందు అనేది తెలియదు) క్రిందట దేవుడు దేవదూతలను సృజించారు. వారిలో ప్రధాన దూత పేరు లూసిఫార్. ఈ లూసిఫార్ దేవుడ్ని ఎల్లప్పుడూ స్తుతిస్తుండే వాడు. కానీ ఒకసారి మనసులో ఒక దుర్భుద్ధి కలిగింది. దేవుడికే ఇంత ఘనత,నేను కొంచెం మాత్రమే తక్కువ కదా దేవుని కంటే ఎక్కువ ఎందుకు కాకూడదు అనుకున్నాడు. 

దేవుడు సర్వజ్ఞాని కదా. ఈ లూసిఫార్ మదిలో పుట్టిన ఆలోచన బట్టి పాతాళమునకు త్రోయబడ్డాడు.

యెషయా 14: 12
తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?
యెషయా 14: 13
నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును
యెషయా 14: 14
మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?
యెషయా 14: 15
నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.

ఇది సింపుల్ గా సైతాను కథ. ఆ దేవదూత సైతాను గా మారి దేవుడికి విరోధి అయ్యాడు.

మిగతా విషయాలు మళ్ళీ." అని సవిస్తరమైన తొలి జవాబు ఇచ్చారు.

అదేంటో! ఇంత విస్తారమైన జవాబుతో పాత డౌట్లలో ఒకటి కూడా తీరలేదు, కొత్త డౌట్లు పుట్టుకొచ్చాయి.ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇదివరకటి కంటే కంగారు పడాల్సిన విషయాలు చాలా కనపడ్డాయి.అసలు చివరి రోజు వరకు అంత విధేయత చూపించిన ప్రధమజంటని  తను పాతాళానికి తొక్కేసినా తప్పించుకుని ఈడెను తోటలోకి వచ్చి అంత కుట్ర చేసి ప్రధమజంటని చెడగొట్టిన సైతానుని పల్లెత్తు మాట అనకుండాఆ త్రాష్టుడి మీద చూపించాల్సిన కోపాన్ని అమాయకంగా వాడి మాయకబుర్లకి లొంగిపోయిన ప్రధమజంట మీద చూపించాడేమిటి YAHOVA GOD?తప్పు ఒకరిదీ, శిక్ష ఒకరికా - ఇదెక్కడి న్యాయం?బహుశా, ఈ సైతానును ఏమీ చెయ్యలేక పిచ్చెక్కిపోయి ఆ పిచ్చిలో ప్రధమజంటని శిక్షించాడా అనిపించింది!వెంటనే అక్కడ అదే కామెంటు వేశాను "so Satan is more powerful than yahova?" అని.

అటు బైబిలు మీద గానీ ఇటు హిందూ గ్రంధాల మీద గానీ ఏదో ఒకదాని మీద శ్రధ్ధ చూపించకుండా రెంటినీ కలిపి మింగడం వల్ల మతి చలించినటుంది!లేకపోతే మట్టీ గిట్టీ, చెట్టూ చేమా అన్నీ పుట్టిన five basic elements గురించి చెప్పాక కూడా ఇంకా నేను మట్టి ఎట్లా వచ్చిందని అడగలేదు మనిషి ఎట్లా వచ్చాడని అడుగుతున్నానని అంటాడేమిటీ? దానికోటి తగిలించాను, "when I explained how five elements came and I confirmed that all this universe was made up of all those elements,still you are unable to understand the Concept and again talking the same meaningless talk that Hindu scriptures did not say anything about how man came.

You are unable to clear a very simple and basic doubt about the main concept of janmapaapam, and you are trying to misinterpret hindu scriptures! 

First concentrate on that point and complete that task as early as possible. You are not aware about one thing, if you try to answer me with genuine and rational way your christian belief system might crumble down into dust!" అని.


మాటిమాటికీ ఇలా పక్కదార్లు డేకుండా పాయింటు మీదనే ఉంచాలని, "you are thinking that I am a layman about Christianity! When I am asking questions about your Bible, why you dragged hindu scriptures here? I already hinted you that we will see it later. Please do not go out of the topic and stick to give a rational answer about the "Sin of Adam was carried by generations of generations like a congenital disease" concept only." అనే కామెంటు ఒకటి వేశాను.

అప్పుడు, తీరిగ్గా అసలైన ఫినిస్షింగ్ టచ్ ఇచ్చాను:"మీరు ఈ జవాబు పూర్తి స్పృహలోనే ఉండి రాశారా?ఎందుకంటే, ఏదో ఒక 500 పదాలతో కూడిన పెద్ద వ్యాసంలో వస్తే పోనీలే అనుకోవచ్చు గానీ ఇంత చిన్న జవాబులోనే మీరు పరస్పర విరుధ్ధమైన విషయాలని గుదిగుచ్చారు, గమనించండి:
"1.సైతాను దేవుడి చేత సృష్టించబడడం ఏంటి?
2. హిందూ మతంలో శని అంటే సైతాను కూడా ఒక దేవుడే. 
3.శని మా జోలికి రావద్దని మనుష్యులే కాదు దేవుళ్ళు కూడా పూజ చేస్తారు. 
4.కానీ క్రైస్తవ్యంలో శని/ సైతాను మానవుడికి దేవుడికి కూడా శత్రువు.
5.సైతాను ఆవిర్భావం గురించి చెప్తాను: దేవుడు సైతాను ను సృజించలేదు. 
6.ఏవో కొన్ని లక్షల్లో లేక కోట్ల కోట్ల సంవత్సరాల లేక (ఇంకా ముందు అనేది తెలియదు) క్రిందట దేవుడు దేవదూతలను సృజించారు. 
7.వారిలో ప్రధాన దూత పేరు లూసిఫార్. 
8.ఈ లూసిఫార్ దేవుడ్ని ఎల్లప్పుడూ స్తుతిస్తుండే వాడు. 
9.కానీ ఒకసారి మనసులో ఒక దుర్భుద్ధి కలిగింది. 
10.దేవుడికే ఇంత ఘనత,
11.నేను కొంచెం మాత్రమే తక్కువ కదా, దేవుని కంటే ఎక్కువ ఎందుకు కాకూడదు అనుకున్నాడు. 
12.దేవుడు సర్వజ్ఞాని కదా. 
13.ఈ లూసిఫార్ మదిలో పుట్టిన ఆలోచన బట్టి పాతాళమునకు త్రోయబడ్డాడు."

కేవలం 13 వాక్యాలలోనే మీరు ఎన్నిసార్లు కప్పగంతులు వేశారో చూడండి!

"1.సైతాను దేవుడి చేత సృష్టించబడడం ఏంటి?", "5.సైతాను ఆవిర్భావం గురించి చెప్తాను: దేవుడు సైతాను ను సృజించలేదు.","6.ఏవో కొన్ని లక్షల్లో లేక కోట్ల కోట్ల సంవత్సరాల లేక (ఇంకా ముందు అనేది తెలియదు) క్రిందట దేవుడు దేవదూతలను సృజించారు." - దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?ఇది చాలదన్నట్టు "2. హిందూ మతంలో శని అంటే సైతాను కూడా ఒక దేవుడే. " అని హిందూమతం నుంచి పోలికలు తీసుకొస్తున్నారు.అసలు మానవుడు ఎలా వచ్చాడో చెప్పలేకపోయాయనీ "చాలా విషయాలు గోల్ గోల్ గుమాయించి చెప్పడం వల్ల అసత్యం ఎప్పటికీ సత్యం కాదు కానేరదు అన్న విషయం ప్రజలు తెలుసుకోవాలి." అనీ  మీరు అసత్యం అంటున్న హిందూమతగ్రంధాలనే దీనికి సాక్ష్యం తేవడం ఏంటి?బైబిలు కూడా అసత్యమే అని మీరు చెప్పదల్చుకున్నారా?

"4.కానీ క్రైస్తవ్యంలో శని/ సైతాను మానవుడికి దేవుడికి కూడా శత్రువు." ఇది మరో బాంబు!YAHIVA దేవుడు సర్వశక్తిమంతుడని మీరే అంటున్నారు,మళ్ళీ YAHIVA దేవుడికి ఒక శత్రువు వున్నాడంటున్నారు,అప్పుడు మనసులోని ఆలొచన గ్రహించగలిగిన దేవుడు ఈడేను తోటలో ఆదాము హవ్వల్ని మోసం చేస్తున్నప్పుడు ఎందుకు ఆపలేకపోయాడు?పాతాళంలో ఉండాల్సిన సైతాను ఈడేను తోటలోకి ఎలా రాగలిగాడు?YAHIVA దేవుడి జైలునుంచి కూడా తప్పించుకు రాగలిగినంత సమర్ధుడా సైతాను?

బాబూ!మొదట మీ బైబిలు విషయం పూర్తిగా తేల్చాక మా గ్రంధాల సంగతి చూద్దాం, సరేనా?" అని.

మళ్ళీ కొత్త డౌట్లు వచ్చేలా ఇంకో కామెంటు వేస్తే నేను కూడా దారి తప్పడం బోరు కొట్టేసి అన్ని సందేహాల్నీ గుదిగుచ్చి ఒక కామెంటు వేశాను.
----
అటు బైబిలు మీద గానీ ఇటు హిందూ గ్రంధాల మీద గానీ ఏదో ఒకదాని మీద శ్రధ్ధ చూపించకుండా రెంటినీ కలిపి మింగడం వల్ల మతి చలించినట్టుంది!లేకపోతే మట్టీ గిట్టీ, చెట్టూ చేమా అన్నీ పుట్టిన five basic elements గురించి చెప్పాక కూడా ఇంకా నేను మట్టి ఎట్లా వచ్చిందని అడగలేదు మనిషి ఎట్లా వచ్చాడని అడుగుతున్నానని అంటారేమిటీ?

అదేంటో! ఇంత విస్తారమైన జవాబుతో పాత డౌట్లలో ఒకటి కూడా తీరలేదు, కొత్త డౌట్లు పుట్టుకొచ్చాయి.ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇదివరకటి కంటే కంగారు పడాల్సిన విషయాలు చాలా కనపడ్డాయి.అసలు చివరి రోజు వరకు అంత విధేయత చూపించిన ప్రధమజంటని  తను పాతాళానికి తొక్కేసినా తప్పించుకుని ఈడెను తోటలోకి వచ్చి అంత కుట్ర చేసి ప్రధమజంటని చెడగొట్టిన సైతానుని పల్లెత్తు మాట అనకుండాఆ త్రాష్టుడి మీద చూపించాల్సిన కోపాన్ని అమాయకంగా వాడి మాయకబుర్లకి లొంగిపోయిన ప్రధమజంట మీద చూపించాడేమిటి YAHOVA GOD?తప్పు ఒకరిదీ, శిక్ష ఒకరికా - ఇదెక్కడి న్యాయం?బహుశా, సైతానును ఏమీ చెయ్యలేక పిచ్చెక్కిపోయి ఆ పిచ్చిలో ప్రధమజంటని శిక్షించాడా అనిపించింది!

"మంచీ చెడూ తెలియడమే పాపమా? ఇదెక్కడి దరిద్రం!మరి,తెలియకపోవడం మంచి అనీ తెలియడం చెడు అనీ అనుకుంటే అది తెలిసేటట్టు చేసే పండుని అక్కడ ఉంచడం దేనికి?" అనే నా మొదటి సందేహానికి మీరు సమాధానం చెప్పడం లేదు,కొంచెం దానిమీద దృష్టిని పెట్టండి.

"దేవుడు తన రూపంలో సృజించారు ఆడమును. అంటే అప్పుడు ఆడముకు చెడు తెలీదు ఒట్టి మంచి మాత్రమే తెలుసు. ఆడం చెడు తెలుసుకోడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఆ పండు తిన్న దినాన చేస్తావు అని హెచ్చరించారు." అని మీరు చెప్పిన తర్వాత కూడా "My question is why then Yahova put that fruit there?If there is no such fruit in the garden which corrupts man - where is the chance of man becoming a sinner?" అని మళ్ళీ అడిగాను, చూశారా?

"They did not commited the sin readily! From the first day to the last day before the temptation came from Satan, they lived obedient life.

So, my question is why yahova created satan  and tempted the first couple?

If Satan is also created by yahova, the real criminal that seduced Adam is YAHOVA himself, is it not?" అని అంత సూటైన ప్రశ్నలు వేసినా మీరు నా సందేహం తీర్చకుండా ఏమిటేమిటో కొత్త డౌట్లు వచ్చే కామెంట్లని వేసుకుంటూ పోతున్నారు, ఇది మీకు భావ్యమా?

ఆదాముకి పండు తిన్నాక కదా మంచీ చెదూ తెలియడం జరిగింది, అది పాపం గనక శిక్ష వేశాడు - బాగనే ఉంది!మనకి పెరిగి పెద్దయ్యాక కదా మంచీ చెడూ తెలుస్తున్నది!

మరి, YAHOVA GOD మంచి చెడులను తెలియజెప్పే పండును తిని ఘోరమయిన నేరం చేసిన ఆదాముకి మంచి చెడులు తెలిశాక శిక్ష వేసి, ఆ నేరం చెయ్యని తర్వాత తరాల మనుష్యులకి  మాత్రం మంచి చెడులు తెలియక ముందే ఆ పాపాన్ని అంటించి శిక్షించడం న్యాయమా?" అనేది అత్యంత కీలకమైన సందేహం!దీన్ని కూడా మీరు పట్టించుకోవడం లేదు.
----
ఇంక నీలం సుందర గొఱ్ఱె మళ్ళీ వచ్చి చర్చని కొనసాగించే అవకాశం లేదు - వస్తే గనక నాకు పండగే!ఇప్పటికే అవతలివాడు గందరగోళంలో ఉండి ప్రశ్నలు వేస్తున్న అమాయకుడు కాదు,మన పుస్తకంలోని తప్పుల్ని మనచేతనే చెప్పిస్తున్న తెలివైనవాడు అని తెలిసిపోయిందని నా అనుమానం!

అజ్ఞానంతో అమాయకత్వం కలిస్తే జాలిపడి వదిలేసేవాణ్ణి,కానీ మైండుకి ఎంత కొవ్వు పడితే శివుణ్ణి గురించి అంత నీచమైన మాటలు వాడటానికి సాహసిస్తాడు! Bathshebaని David లొంగదీసుకోవటంతో మొదలై David కొడుకు తండ్రి అనుభవించిన ఆడవాళ్ళతో బహిరంగ శృంగారం చెయ్యటం నుంచి మామా కోడళ్ళ సరసాల వరకు House of David పేరు చెప్పి ఏ కుటుంబానికి చెందినవాడి పాదాలని వీళ్ళు ముద్దులు పెట్టుకుని ఇతర్ల చేత కూడా ముద్దులు పెట్టించాలని చూస్తున్నారో ఆ ఇల్లొక వ్యభిచార కూపం అని మనకి తెలియదని వాళ్ళ ధైర్యం!నాతో సహా వీళ్ళతో పోట్లాడుతున్న ప్రతి ఒక్కరికీ తెలిసి కూడా వాటిని ప్రస్తావించటానికే సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నందుకు మనం లోకువవుతున్నట్టుంది చూస్తుంటే!

Bathshebaని seduce చేసిన వెంటనే David వేసిన మొదటి ఎత్తుగడ Uriah యుద్ధంలో చచ్చేలా చూడమని ఇతర్లకి కబురు పెట్టటం కాదు - Uriahని ఇంటికొచ్చెయ్యమని కబురు పెట్టాడు, ఎందుకుట?ఎందుకంటే, Uriah గనక ఇంటికొచ్చేసి ఒక్క రాత్రి గడిపితే చాలు Bathshebaకి David చేసిన గర్భానికి అతన్ని కారకుణ్ణి చెయ్యటానికట!కానీ సైనికుడు యుద్ధ సమయంలో ఇంటి ముఖం చూడకూడదనే వీరధర్మానికి కట్టుబడి Uriah రాజాజ్ఞని కూడా  ధిక్కరించి రణరంగంలోనే ఉండిపోయాడు.ఒకసారి కాదు, చాలాసార్లు అదే తంతు నడిచాక గతి లేక Joabకి కబురు పెట్టి Uriahని చంపించాడు.అత్యున్నత నైతిక సంప్రదాయానికి కట్టుబడిన Uriah వీళ్ళ దృష్టిలోనూ YAHOVA GOD దృష్టిలోనూ అనామకుడైపోయాడు,అత్యంత నీచమైన పాపకార్యం చేసిన David వీళ్ళకీ YAHOVA GODకీ ప్రీతిపాత్రుడయ్యాడు.

తమ మతంలో ఉన్న బొక్కల్ని పూడ్చుకోవటం కుదిరే పని కాదని తెలిసి ఇసక తక్కెడ-పేడ తక్కెడ పద్ధతిలో దొందూ దొందే కదా, ఏ రాయైతేనేం పళ్ళూడగొట్టుకోవటానికి అని చెప్పి పబ్బం గడుపుకోవాలనే బిజినెస్ ప్లానుతో మన పురాణ కధలకి కూడా బొక్కలు పెట్టటానికి తయారయ్యారు.వీళ్ళ తుక్కు రేగ్గొట్టటానికి మిగిలిన కట్టుకధల కన్న ఈడెను తోట పిట్టకధ మనకి బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధాన్ని ఇస్తుంది!

ఇంతకీ ఈడెను తోటలో జరిగింది ఏమిట్ట!నా సొంత మాటల్తో చెబితే మార్చి రాశాడని వాళ్ళూ వీళ్ళూ ఏడ్చి చావకుండా ఈ గొఱ్ఱె మనముందు పరిచిన అధికారికమైన వచనం ఉంది కదా!

"ఆదికాండము 2: 16. మరియు దేవుడైన యెహోవాఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; 17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.

దేవుడు తన రూపంలో సృజించారు ఆడమును. అంటే అప్పుడు ఆడముకు చెడు తెలీదు ఒట్టి మంచి మాత్రమే తెలుసు. ఆడం చెడు తెలుసుకోడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఆ పండు తిన్న దినాన చేస్తావు అని హెచ్చరించారు.

 క్రైస్తవ్యంలో మానవుడికి దేవుడికి కూడా శత్రువు సైతాను ఆవిర్భావం గురించి: ఏవో కొన్ని లక్షల్లో లేక కోట్ల కోట్ల సంవత్సరాల లేక (ఇంకా ముందు అనేది తెలియదు) క్రిందట దేవుడు దేవదూతలను సృజించారు.వారిలో ప్రధాన దూత పేరు లూసిఫార్.ఈ లూసిఫార్ దేవుడ్ని ఎల్లప్పుడూ స్తుతిస్తుండే వాడు.కానీ ఒకసారి మనసులో ఒక దుర్భుద్ధి కలిగింది.దేవుడికే ఇంత ఘనత,నేను కొంచెం మాత్రమే తక్కువ కదా, దేవుని కంటే ఎక్కువ ఎందుకు కాకూడదు అనుకున్నాడు.దేవుడు సర్వజ్ఞాని కదా.ఈ లూసిఫార్ మదిలో పుట్టిన ఆలోచన బట్టి పాతాళమునకు త్రోయబడ్డాడు.

దేవుడు చెప్పినట్లే జరిగింది. ఆదికాండము 3: 19 నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.

ఆదికాండము 5: 3. ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను."

మనం పట్టిన బొక్కని కప్పుకోవటానికి ఆ నీలం సుందర గొఱ్ఱె "ఆదాము ఏదేను తోటలో ఎన్ని సంవత్సరాలు జీవించాడు అనేది తెలియదు. లక్షలు కావొచ్చు కోట్ల సంవత్సరాలు కావొచ్చు" అని చెప్పింది నిజం కాదు.ఈ సమర్ధన లోని అసలైన క్యామిడీ ఏమిటంటే, మానవజాతిని తామరతంపరగా పెంచడానికి ఆదామునీ హవ్వనీ సృష్టించి పాపం తెలియకుండా ఉండటానికి ఈడెను తోటలో ఉంచితే ఆ తోటలో ఉన్నంతకాలం వాళ్ళకి సంతానమే కలగలేదు!

Genesis 5:5 states clearly that “all the days that Adam lived were 930 years.” We know, of course, that “days” and “years” already were being counted by the time of Adam’s creation because in Genesis 1:14 (day four of the Creation week) God mentioned both in His discussion of their relationship to the heavenly bodies. Therefore, however long Adam and Eve may have been in the garden, one thing is certain: they were not there for any time period that exceeded Adam’s life span of 930 years. But there is additional information that must be considered as well. Genesis 4:25 explains that Seth was born after Cain slew Abel. Since the biblical account makes it clear that Seth was born outside the garden, and since Genesis 5:3 informs us that Adam was 130 years old when Seth was born, it is obvious that Adam and Eve could not have been in the Garden of Eden any longer than 130 years!

ఆ పండు తిని అక్కడినుంచి వెళ్ళగొట్టించుకుని రాకపోయి ఉంటే నీలం గొఱ్ఱె విశ్లేషణ ప్రకారం ఇప్పటికీ ఆ తోటలో వాళ్ళిద్దరే లింగులింగుమంటూ తిరుగుతూ ఉండేవాళ్ళు కాబోలు!మరి, పండు తినడం మంచికి జరిగిందా, చెడుకి జరిగిందా?

బైబిలు మొత్తం ఒకే భాగం కాదు, Book of Creation, Book of Exodus, Book of Psalms అని ఉన్నవాటిలో అతి ముఖ్యమైన ఆదికాండలోనే ఇన్ని బొక్కలు ఉంటే ఈ బొక్కల కొనసాగింపు లయిన మిగిలిన బుక్కుల్లో ఇంకెన్ని బొక్కలు ఉన్నాయో! కామన్ సెన్సు ఉన్న తొమ్మిదేళ్ళ కుర్రాడు కూడా నమ్మడే, ఎద్దుల్లా పెరిగిన వీళ్ళు ఎట్లా నమ్ముతున్నారు?

1."వార్నీ!మంచీ చెడూ తెలియడమే పాపమా? ఇదెక్కడి దరిద్రం!మరి, తెలియకపోవడం మంచి అనీ తెలియడం చెడు అనీ అనుకుంటే అది తెలిసేటట్టు చేసే పండుని అక్కడ ఉంచడం దేనికి?"

2."అసలు చివరి రోజు వరకు అంత విధేయత చూపించిన ప్రధమజంటని  తను పాతాళానికి తొక్కేసినా తప్పించుకుని ఈడెను తోటలోకి వచ్చి అంత కుట్ర చేసి ప్రధమజంటని చెడగొట్టిన సైతానుని పల్లెత్తు మాట అనకుండాఆ త్రాష్టుడి మీద చూపించాల్సిన కోపాన్ని అమాయకంగా వాడి మాయకబుర్లకి లొంగిపోయిన ప్రధమజంట మీద చూపించాడేమిటి YAHOVA GOD?తప్పు ఒకరిదీ, శిక్ష ఒకరికా - ఇదెక్కడి న్యాయం?"

3."YAHIVA దేవుడు సర్వశక్తిమంతుడని మీరే అంటున్నారు,మళ్ళీ YAHIVA దేవుడికి ఒక శత్రువు వున్నాడంటున్నారు,అప్పుడు మనసులోని ఆలొచన గ్రహించగలిగిన దేవుడు ఈడేను తోటలో ఆదాము హవ్వల్ని మోసం చేస్తున్నప్పుడు ఎందుకు ఆపలేకపోయాడు?పాతాళంలో ఉండాల్సిన సైతాను ఈడేను తోటలోకి ఎలా రాగలిగాడు?YAHIVA దేవుడి జైలునుంచి కూడా తప్పించుకు రాగలిగినంత సమర్ధుడా సైతాను?"

ఇంత ముఖ్యమైన ప్రశ్నలు ఇన్ని శతాబ్దాల నుంచి ఏ ఒక్క గొఱ్ఱెకీ రాలేదంటే ఆశ్చర్యమే!విచిత్రం ఏమిటంటే మళ్ళీ వెర్షను మారిస్తే తప్ప ఇప్పటి వెర్షను ప్రకారం ఈ ప్రశ్నలకి జవాబు చెప్పటం అసాధ్యం.మతమార్పిడి చెయ్యాలని వచ్చినవాళ్ళ ముందు ఈ ప్రశ్నల్ని ఉంచి వీటికి జవాబులు చెప్పమంటే చాలు - మనం అరిచి గోల చెయ్యనక్కర్లేదు, పాస్టర్లు పరుగో పరుగు!

"ఆదాముకి పండు తిన్నాక కదా మంచీ చెదూ తెలియడం జరిగింది, అది పాపం గనక శిక్ష వేశాడు - బాగనే ఉంది!మనకి పెరిగి పెద్దయ్యాక కదా మంచీ చెడూ తెలుస్తున్నది!మరి, YAHOVA GOD మంచి చెడులను తెలియజెప్పే పండును తిని ఘోరమయిన నేరం చేసిన ఆదాముకి మంచి చెడులు తెలిశాక శిక్ష వేసి, ఆ నేరం చెయ్యని తర్వాత తరాల మనుష్యులకి  మాత్రం మంచి చెడులు తెలియక ముందే ఆ పాపాన్ని అంటించి శిక్షించడం న్యాయమా?" అనేది అత్యంత కీలకమైన సందేహం!


కధ కంచికి మనం ఇంటికి!చర్చ చిదంబరానికి క్రైస్తవం ఇక కంచికి!!

6 comments:

  1. హరిబాబుగారూ, ఈ పోస్టుకు సంబంధంలేదుగానీ ఈ మధ్య సారంగలో ఒక గ్రంథచౌర్య విషయం గురించి వ్రాస్తున్నాను. నిస్సిగ్గుగా చెహోవ్ కథని కాపీ కొట్టిన కథను గొప్పగా మెచ్చుకుంటూ సమీఓించారు. నేను వాళ్ల దొంగతనాన్ని ఎత్తి చూపిస్తే సమాధానం లేదు. అలాగే, ఉగ్రవాదులపై దాడి చేయడం అమానవత్వం అని ఒక కవిత వ్రాసారు, దానికీ స్పందించాను కానీ సమాధానం లేదు. ఈ లంకెలు యిస్తున్నాను. మీకు ఆసక్తి కలిగితే స్పందించగలరు...

    సారంగ, దాని సారథి, దానిలో వ్రాసే శీర్షిక, రచయిత అందరూ ఈ మధ్య ఒక గ్రంథచౌర్యం విషయమై కుక్కిన పేనుల్లాగా సమాధానం యివ్వడంలేదు.
    ఈ మధయి ఒక శీర్షికలో ఆంధ్రావారు తెలంగాణా భాషని సర్వనాశనం చేసారని వ్రాసారు. దానిని నేను ఖండిస్తూ ఓ యుద్ధం చేసాను.
    **1954-55 నాటికే వలసదారుల ప్రభావానికి లోనై తెలంగాణ భాష కనుమరుగైపోతుండడం**
    తెలంగాణా భాష కనుమరుగైపోవడం, అజంత పదాలేవీ నోరుతిరగకపోవడానికి కారణం 1954-55 నాటి వలసదారులా? ఎవరా వలసదారులు? వాళ్లల్లో క్రీ.శ. 1400 నుండి పాలించి, మాతృభాషకు బదులుగా ముందు ఫారసీ లోను, తరువాత ఉర్దూలోను పరిపాలన నడిపి, బోధనా మాధ్యమాన్ని ఉర్దూనే ప్రధానం చేసి, పరిపాలనను ప్రజల నుండి దూరం చేసిననవాళ్లుే ఉన్నారా, లేరా? వలసదారుల పరిపాలన పోయి నాలుగేళ్లయింది కదా? సమగ్ర భాషా నిఘంటువులతో బాటు దృశ్య, శ్రవణ, ముద్రణా మాధ్యమాలన్నింటిలోను తెలంగాణా భాషే పెట్టుకోవడానికి ఎవరైనా వలసదారులు అడ్డంపడ్డారా? ప్రస్తుతం అవే కదా సాధారణ ప్రజానీకంతో సహా అందరి పలుకుబడులను నిర్దేశించి, ప్రభావితం చేస్తున్నది. ప్రాంతీయ రేసిజాన్నే పెంచి ప్రోత్సహించే తీరులేనే విశ్లేషణలు సాగిస్తూ దాన్నే పట్టుకు వ్రేలాడి, అక్కసుతో మాత్రమే విషయాన్ని చూస్తే ఎప్పటికీ అమ్మనుడిని కాపాడలేరు.‘‘
    దాని లంకె... https://magazine.saarangabooks.com/%e0%b0%9c%e0%b0%ae%e0.../

    తరువాత, ఈ మధ్య ఓ పదిహేనురోజుల క్రితం పందెం అనే కథ నందగిరి ఇందిరాదేవిగారు వ్రాసారు, అతి గొప్ప తాత్త్విక కథ అని పరిచయం చేసారు . ఆ కథలో రెండు మూడు వాక్యాలు చదవగానే అది అనువాద కథ అని నాకు స్ఫురించింది. అంత ప్రాథమిక పరిశీలన లేనివాళ్లు కథా సమీక్షకులు ఎలా అయ్యారో నాకు అర్థంకాలేదు. నేను వెదికితే అదే కథను *ది బెట్* అనే పేరుతో అన్టన్ చెహోవ్ 1889 లో వ్రాసారని కనబడింది. మొత్తం కథ చదివాను. పేర్లు, కాలవ్యవధి, స్థలం లాంటివి తప్పితే మిగతా ప్రతి వాక్యమూ తెలుగులోకి అనువదించి తన కథగా రచయిత్రి 1941 లో గృహలక్ష్మి అనే పత్రికలో అచ్చువేసుకున్నారు. ఈ దారుణాన్ని వాళ్ల దృష్టికి తీసుకువెళితే ఇంతవరకూ సమాధానం లేదు. కనీసం ఏమాత్రం లజ్జ లేకుండా ఆ సమీక్షని అలాగే వుంచి ఆ కథ, తాత్త్వికత రచయిత్రిదే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.

    ఈ గ్రంథచౌర్యం గురించి ఇద్దరు ముగ్గురు తెలంగాణా రచయితలకు చెప్పాను. వారు దారుణం అన్నారే గానీ ఏమీ స్పందించలేదు.
    దయచేసి ఈ విషయంలో మీకు స్పందించాలని అనిపిస్తే గ్రంథచౌర్యాన్ని అరికట్టే ప్రయత్నం చేయగలరు.

    https://magazine.saarangabooks.com/%e0%b0%9c%e0%b1%80%e0.../

    ఆ పత్రికలో దాదాపు నేనొక్కడినే ఆ అసంబద్ధ, రేసిస్టు, దురభిమాన, విద్వేష వ్యాసాలకు బదులు వ్రాస్తున్నది. మిగతా వ్యాఖ్యాతలందరూ దాదాపు భజంత్రీలే. ఒంటరి పోరాటం చాలా కష్టంగా వున్నది.

    ఈ కవిత ఉగ్రవాదంపై పోరాటాన్ని తప్పుపడుతూ వ్రాసినది.

    https://magazine.saarangabooks.com/%e0%b0%a8%e0%b0%b2%e0%b0%ad%e0%b1%88-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a3%e0%b0%be%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%bf%e0%b0%97%e0%b0%be/#comment-3809

    ReplyDelete
    Replies
    1. Arguing with saaranga people is waste of time and mind. Filthy mud bloods and dirty muggles!

      Delete
    2. I can do a post after visiting the links and understanding the content.

      Delete
  2. శ్రీనివాసుడు గారు,

    మీరిక్కడ ఇచ్చిన లింక్స్‌లో కంటెంట్, దానిపై మీ వాదన చదివాను. గ్రంధచౌర్యం గురించి బొత్తిగా డొంక తిరుగుడుగా ఉన్నాయి అక్కడి వారి వాదనలు. వేరొకరి రచన నుంచి స్పూర్తి పొందటానికీ, మక్కికి మక్కీ కాపీ కొట్టటానికీ తేడా తెలీకుండా శ్రీశ్రీ చలం అంటూ మాట్లాడుతున్నారు. కాదు తేడా తెలీనట్లు నటిస్తూ మాట్లాడుతున్నారు. శ్రీశ్రీ తన ఆత్మకథలో తన ఏఏ కవితలు అంత్ర్జాతీయంగ ప్రచరించిన ఏ కవితల నుంచి ప్రేరణ పొదినవే, అనుకరణో తనే చెప్పాడు. కమ్యూనిస్ట్ అయ్యుండి తన

    మరొ ప్రపంచం మరో ప్రపంచం,
    మరో ప్రపంచం పిలిచింది ..

    అనే కవితకి, ఆది శంకరుని

    భజగోవిందం భజగోవిందం
    గోవిందం భజ మూడమతే

    ప్రేరణ అని చెప్పుకున్నాడు, శంకరుడు మూడోసారి ఆ పదబంధాన్ని తిరగేసి వేసి మరింత అందంగ చెప్పాడని అన్నాడు. వీళ్ళెమో శ్రిశ్రి ని, చలాన్ని అడ్డంపెట్టుకుని, కనీసం ఇప్పటికైనా అది ఓ ప్రసిద్ద రచయత రచనకి అనువాదమని చెప్పండి అనే మీ సలహా పాటించటానికి కూడ సిద్దంగ లేరు. ఆయనేవరో మహిళని ప్రట్టుకుని కాపీ కొట్టిందంటారా అంటుంటే నవ్వొచ్చింది.

    ఇక ఆంధ్రా వలసవాదులు తెలంగాణ భాష కనుమరుగైపోయాయనే వాదనకి మీరు అమాయకంగా వివరణ ఇస్తూ అంధ్రులకి ముందే ఉర్దూని నెత్తికెక్కించిన పాలనలోనే తెలంగాణ తెలుగు కనుమరుగవ్వటం, అజంత పదాలు నోరు తిరగకపోవటం మొదలైందని చూపించే పని పెట్టుకున్నారు. ఇవనీ తెలంగానవాదులకి తెలియక కాదు, వారి ద్రుష్టిలో ఆ మార్పులన్నీ వాళ్ళ భాషా సౌందర్యాన్ని పెంచాయని చెబుతున్నారుగా, కేవలం ఆంధ్రుల తెలుగే వాళ్ళ భాషా సౌందర్యాన్ని కలుషితం చేసింది. వారి వాదన క్లియర్గానే ఉంది మీరే అర్థం చేస్కోక వాదించే పని పెట్టుకున్నారు.

    నాకు ఉగ్రవాదం పై పోరాటం మీద కవిత మొత్తం అభ్యంతరకరంగా అనిపించలేదు కానీ పంక్తులు తేడాగ అనిపించాయి. ఐనా అలాంటి కవిత కొత్తవేం కాదు, ఫేసుబుక్కు నిండా అవే. నేను రైటిస్టుని కాను కాని, అలాగని లెఫ్టిస్టుని కూడా కాను. సంకుచిత ద్రుష్టి రెండు వైపులా కావాల్సినంత ఉందని అనిపిస్తుంది. కామెంట్లో మీరన్న " దయచేసి ఒకనైనా మీ ఏకపక్ష, పరిమిత అవగాహన, ఉద్వేగ చోదిత స్పందనల వల్లనే సామాన్యుడిలో ఉన్మాదం పెరుగుతోందని గ్రహించండి." అనే మాటతో ఏకీభవిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. ఇలాంటివాళ్లని చూసినప్పుడల్లా నాకు Dark Knight సినిమాలోని జోకర్ వీళ్ళకన్న చాలా సిన్సియర్ అనిపిస్తుంది.తను స్పష్టంగా చెబుతాడు, "నాకు ప్రపంచం ప్రశాంతంగా ఉంటే ఇష్టం ఉండదు. ఆ ప్రశాంతతని చెడగొట్టటమే నాకిష్టం!" అని.ఆ పాత్ర మాట్లాడిన ప్రతి వాక్యాన్నీ ఎంత కెలికి చూసినా ఒక్క తప్పు కూడా పట్టుకోలేరు.కానీ వీళ్ళకి ఆ క్యారెక్టరుకి తను నమ్ముతున్న అరాచకత్వపు భావజాలం పట్ల ఉన్న సిన్సియారిటీలో వెయ్యోవంతు కూడా లేదు.అంత లుచ్చా పనులు చేస్తూ కూడా మేము ప్రగతి కాముకులం అని డబ్బా కొట్టుకుంటారు.నాకు వాళ్ళని గురించి తల్చుకున్నప్పుడల్లా అసహ్యం కన్న జాలే ఎక్కవగా కలుగుతూ ఉంటుంది!

      Delete
  3. నెనరులు హరిబాబు గారూ, Anonymous గారూ.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...