Friday 5 February 2016

చచ్చిపోయినవాడు నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను మొర్రో అని రాసిపెట్టినా ఇంకా అది హత్య అనీ హంతకుల్ని శిక్షించాలనీ అంటున్నారు - వీళ్ళకేం పిచ్చా వెర్రా:-)

     "ఒక్కడు కొట్టుకుంటే మూర్చ,ఇద్దరు కొట్టుకుంటే కుస్తీ,ముగ్గురు కొట్టుకుంటే మస్తీ,పదిమంది కొట్టుకుంటే దొమ్మీ - మరి ఒక్కడు వందమందిని కొట్టితే ఏమవుద్దిరా" అన్న చెత్తమాటని పంచ్ దయలాగుగా వెండితెరమీద ఎవడైనా హెరో వేషగాడు వేస్తే నువ్వు వాడి ఫ్యానయితే ఎగిరెగిరి గంతులేస్తావు ఈల వేస్తావు, అలా కాక ఆ వేషగాడు నీ అభిమాన హీరో కాకపోతే కిందపడి గిలగిలా కొట్టుకుంటావు గోల చేస్తావు.కానీ ఇదేంటి, యూనివర్శిటీ లెవెల్లోకి వచ్చేసరికి టీనేజి లవ్వులు పోయి ఒంట్లో కొవ్వు పెరిగేసరికి పోటుగాళ్ళ మాదిరి భావి భారత సమాజం మనకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నదనే కొత్త పిచ్చి తగులుకుని అందులో ఎవడికి నచ్చిన గ్రూపులో వాడు చేరి బయటకెళ్ళాక ఎటూ ఇవన్నీ వేస్ట్ అని తెలుస్తుంది గానీ ఇప్పటి మత్తులో మాత్రం కిందామీదా తెలియకుండా తన్నుకునే కుర్రసన్నాసుల గొడవని దేశం మొత్తానికి అంటిస్తున్నారు పనిలేక పిల్లితల గొరిగే కాంగ్రెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ?
      చూట్టానికి బావున్నాడు,చచ్చిపోయాడనగానే ఎవరికయినా బాధ కలిగించేట్టు ఉన్నాడు.అంటే చూట్టానికి బాగోకపోతే నీకు జాలి పుట్టదా యేంటి అని మీరడగొచ్చు.కానీ జనాలు ఫీలవడంలో ఆ తేడా అప్పుడప్పుడూ ఉంటుంది.జనంలో చూపులకి బావుండటమే అందం అనుకునే ధోరణి ఎక్కువ గనక బావుండని వాడు పోతే "ఇంత అనాకారిగా ఉన్నాడు,వీడు పోయినంతలో అందగాళ్ళకి కొదవేం రాలేదులే!" అనీ బావున్నవాడు చచ్చిపోతే "ఎంత బావున్నాడో,అక్కడొకడూ ఇక్కడొకడూ అన్నట్టున్న అందగాళ్ళలో ఒకడు తగ్గాడు గదా!" అనీ అనిపించటం సహజం.

      మొదట ఈ ఆత్మహత్య వ్యవహారంలో ఇతని కులం ప్రస్తావన ఎందుకొచ్చిందో చూద్దాం.ఆత్మహత్య తనెందుకు చేసుకుంటున్నాడో స్పష్టంగా తేల్చి చెప్పకపోయినా తన ఉత్తరం ద్వారా తనని ఎవరూ భయపెట్టలేదనీ ఆత్మహత్యకు ప్రేరేపించలేదనీ స్పష్టంగా తేల్చి చెప్పాడు.ఇప్పుడు వీళ్ళు దానికి బాధ్యులైన వారిని హంతకులుగా నమోదు చేసి శిక్షించమంటున్నారు.అలా చెయ్యాలంటే నిర్భయ చట్టంలో స్త్రీ మీద జరిగిన అత్యాచారం అనే క్యాటగిరీని తీసుకున్నట్టు ఒక దళితుణ్ణి భౌతికంగా ఏమీ చెయ్యకపోయినా మానసికంగా వేదనకి గురి చేసి అతని చావుకి కారణమయ్యారు అనే కోణంలో తప్ప ఇతరుల్ని నిందితులుగా నమోదు చెయ్యటం కుదరదు - అది ఖాయం!ఆ ఉత్తరంలో ఎవరి పేరునయినా ప్రస్తావించి ఉంటే అప్పుడు వాళ్ళని అరెస్టు చెయ్యొచ్చు.తల్లి పరంగా కులాన్ని అన్వయించి సర్టిఫికెట్ తీసుకున్నా ఇప్పుడు ప్రభుత్వాధికారులు అది సరయినది కాదనీ అలా ఇచ్చిన అధికార్లని విచారించి చర్యలు తీసుకోవాలనీ ప్రయత్నిస్తున్నట్టు వింటున్నాం.మామూలు పరిస్థితుల్లో అయితే కులనిర్ధారణకు తండ్రినే చట్టాలు ప్రామాణికంగా తీసుకుంటాయి - ఇప్పటికిప్పుడు మారిస్తే తప్ప!

      2016 జనవరి 30వ తేదీకి వేముల రోహిత్ చక్రవర్తి 27వ సంవత్సరం లోకి అడుగుపెట్టి ఉండేవాడు!కానీ గత జులై నెల నుంచీ అతనికి రావలసిన నెలవారీ స్టెయిఫండ్ 28,000 రాకపోవదం వల్ల జనవరి 17కు ఒక రోజు ముందు స్నేహితులతో నా పుట్టిన రోజుకి మీకు చిన్న ట్రీట్ కూడా ఇవ్వలేను అని చెప్పిన కొద్ది గంటల్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు.పోలీసులకి దొరికిన ఆఖరి ఉత్తరం ఒక మహాకవి రాసిన విషాదకావ్యంలా ఉంది!కొంత కవిత్వం కొంత పశ్చాత్తాపం కలిసి ఉంది - ఆఖర్లో స్టెయిఫండ్ వచ్చాక ఇంటికి పంపించాల్సిన డబ్బుల గురించీ స్నేహితుడు రాంజీకి తీర్చాల్సిన అప్పు గురించీ చెప్పే భాగం తప్ప!తండ్రి యేమో మా అబ్బాయి చాలా తెలివైన వాడు, ర్యాంక్ హొల్దర్! దళితుడని చెప్పుకుని రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగం తెచ్చుకోవాల్సిన ఖర్మ పట్ట లేదు అంటూ కులం మార్చినందుకు కొంత వ్యతిరేకంగా ఉన్నట్టు కనబడుతుంది.మావాడు చాలా ధైర్యస్థుడు,ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదు,విచారణ జరిపించాలి అంటున్నాడు.బహుశా ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా భ్రమింప జేస్తున్నారనే అనుమానం అతని మాటల్లో కనిపిస్తున్నది.ఏమో, ఎజెండాల కోసం  గెలుపు కోసం, అహాలు చల్లార్చుకోవటం కోసం, సంచలనం కోసం, ఫోకస్ కోసం పరమ క్రూరమైన రాజకీయాలు నడుసున్న ఈ కాలంలో ఏదయినా జరగొచ్చు!తండ్రి ఒక హాస్పిటల్ ఆవరణలో గార్దు.తల్లి టైలర్ అని చదివినట్టు గుర్తు - కాబట్టి పెద్దగా ఆదాయం ఉన్న కుటుంబం కాదు గనక నా వరకు నేను దళిత ముద్ర వేసుకుని స్టెయుఫండ్ తీసుకోవటం గురించి తప్పు పట్టలేను.జగన్ లాంటి వాళ్ళు నొక్కేస్తున్న కోట్లతోనూ 2జీ,3జీ,4జీ స్కాములతోనూ పోలిస్తే అది పెద్ద నేరమా!కానీ ఇతను తన బాల్యం గురించి "My birth is my fatal accident. I can never recover from my childhood loneliness. The unappreciated child from my past." అని మరీ నిర్వేదంగా అంటున్నాడంటే తలిదండ్రులు విడిపోవటం ద్వారా కలిగే మామూలు ఒంటరితనం కన్నా మరింత భయంకరమైన ఒంటరితనాన్ని దేన్నయినా అనుభవించాడా!

      మంచి మార్కులతో ప్యాసయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యామసులో సైన్సు స్టూడెంటుగా అడుగుపెట్టి తర్వాత ఆర్ట్స్ గ్రూపుకి మారిన రోహిత్ మొట్టమొదటి స్టూడెంట్ ఎన్నికల్లో ఏబీవీపెకి వోటు వేశాడట!అంటే, అప్పటివరకు చదువు తప్ప మరో సంగతి పట్టించుకోనివాడు అతి తక్కువ కాలంలో మొదట SFIలో ఉత్సాహంగా పాల్గొని తర్వాత ASAలోకి మారి అక్కడ కూడా మరింత నాయకత్వ లక్షణాలతో ఒక వెలుగు వెలిగి చివరాఖరికి ఎంత హఠాత్తుగా ఈ రాజకీయ ఉద్యమాల ప్రభావానికి గురయ్యాడో అంతటి అనూహ్యమైన నాటకీయ శైలిలో I feel a growing gap between my soul and my body. And I have become a monster. అనే అవగాహనకి వచ్చి బీజప్రాయంగా తను రాక్షసంగా మారడం పట్ల పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ అస్తమించడం అనే సంక్లిష్టతని అర్ధం చేసుకోవాలంటే మొత్తం అతని ప్రవర్తనని ఆది నుంచీ అంతం వరకూ పరిశీలించాలి!

      తొలిసారి అమాయకంగా ఏబీవీపీకి వోటు వేసిన నాటి నుంచీ ఆఖరి రోజు వరకూ నడిచిన ఆరు సంవత్సరాల జీవితంలో ఎంతో నాటకీయత ఉంది.అన్ని దశల్లోనూ అతనిలో విశిష్టంగా కనిపించేది భావ వ్యక్తీకరణలో అతని కున్న అద్భుతమైన ప్రతిభ - తెలుగుని ఎంతగానో ఇష్తపడిన ఇతనికి భాష మీద ఉన్న పట్టు!తెలుగునే కాదు ఇంగ్లీషుని ఉపయోగించినా భావ వ్యక్తీకరణ సామర్ధ్యమే అతన్ని అతి తక్కువ కాలంలో అగ్రగణ్యుణ్ణి చేసింది.ఆ రకంగా చూస్తే ఇదే యూనివర్సిటీలో ఇంతకుముందు జరిగిన అన్ని ఆత్మహత్యల కన్నా అన్ని విద్యాసంస్థలలో కలుపుకుని ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఆత్మహత్యల కన్నా ఇతని ఆత్మహత్య నిజంగా ప్రత్యేకమైనదే!దీనినుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి గనక, ఇప్పటికైనా క్రియాశీలంగా ఈ రకమైన ఆత్మహత్యల పరంపరని ఆపడానికి ప్రయత్నం జరిగి తీరాలనే గట్టి పట్టుదలతో ఉన్నాను గనక ఈ పోష్టు చాలా పెద్దగా ఉండవచ్చు.ఆసక్తిని కలిగించడానికి నేను మామూలుగా వేసే చెణుకులు కూడా ఉంకపోవచ్చు,అయినా కొంచెం ఓపిక చేసుకుని చదువుతారని ఆశిస్తున్నాను.అంత ఓపిక లేనివారు ఇక్కడితో చదవడం ఆపెయ్యవచ్చు - నాకు ఎంతమాత్రం అభ్యంతరం లేదు అనగా నాట్ ది స్లైటెస్ట్ అబ్జెక్షన్:-)

      ఇంతకు ముందు ఇతను చదివిన కొడిగెనహళ్ళి లోని ఆంధ్రప్రదేశ్ జూనియర్ రెసిడెన్షియల్ కాలెజిలో ఇప్పుడు  ప్రిన్సిపాల్  అయిన బి.కొండయ్య గారు 2004లో రోహిత్ అక్కద విద్యార్ధిగా ఉన్నప్పుడు లెక్చరర్ ఉద్యోగంలో ఉండేవారు.ఆయన రోహిత్ గురించి "అతను చాలా చురుకైన విద్యార్ధి.ఈ కాలేజిలో ప్రవేశం అంత సులభం కాదు,ఎందుకంటే మేము కేవలం పల్లెటూళ్లలో ఉన్న తెలివైన పిల్లల్ని మాత్రమే ఎంచుకుని ఎంట్రన్సు టెస్టు పెట్టి తీసుకుంటాం.అప్పట్లో రాజకీయాల గొడవ లేకుండా అందరితోనూ స్నేహంగా ఉండేవాడు." అని చెప్తున్నారు.ఇంక అతను ప్లస్ టూ లో 521/600 మార్కులు సాధించి 86% దగ్గిర నిలబడటం గురించి కూడా గుర్తు తెచ్చుకున్నారు.రోహిత్ అక్కడ BiPC చదివాడు.అతని కెమిస్ట్రీ లెక్చరర్ జె.వి.కృష్ణయ్య గారు మెయిన్ సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకోవడమే గాకుండా ఇంగ్లీషులో మంచి మార్కులూ తెలుగులో ఇంకా ఎక్కువ మార్కులూ తెచ్చుకున్నట్టు చెప్తున్నారు.సహజంగా అందరూ చేసేది ఏంటంటే ర్యాంకులు వాటిల్లోనే వస్తాయి గాబట్టి మెయిన్ సబ్జెక్టుల మీద ఎక్కువ దృష్టి పెట్టి ర్యాంకులు కలవడంలో ప్రాధాన్యత లేకపోవటంతో లాంగ్వేజి సబ్జెక్టుల్ని పెద్దగా పట్టించుకోరు - ఇతనిలాంటి నాలాంటి కొద్దిమంది తప్ప:-)

      హైదరాబాద్ యూనివర్సిటీలో కూడా రోహిత్ సహ విద్యార్ధిగా ఉండి ఆఖరి ఉత్తరంలో కూడా ప్రస్తావించబడిన అప్పటి సహ విద్యార్ధి రాంజీ చింతగడ "ఆ రోజుల్లో రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది కాదు.సైన్సు సహాయంతో ప్రపంచాన్ని మార్చడం గురించి ఎక్కువగా ఆలోచించేవాడు,ఒకరకంగా అప్పట్లో అతనొక టెక్నోక్రాట్" అని గుర్తు చేసుకున్నాడు.తనకి రావలసిన డబ్బు గురించిన ప్రస్తావనలో రాంజీ "40,000 రూపాయలు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడో నాకే అర్ధం కావట్లేదు.ఇచ్చేటప్పుడు నేను లెఖ్ఖ పెట్టుకోలేదు - అడిగినప్పుడల్లా 5000 గానీ 8000 గానీ ఇవ్వడమే తప్ప!" అంటున్నాడు.రవితేజ దొనేపూడి అనే హైదరాబాద్ యూనివర్సిటీ SFI శాఖకి మాజీ అద్యక్షుడు 2009లో జరిగిన వాళ్ళ మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ తొలి ఎన్నికల్లో అప్పటికి ABVPకీ SFIకీ మధ్య తేడా ఏమిటో తెలియకపోవటం వల్లనే రోహిత్ ABVPకి వోటు వేశాడని చెప్తున్నాడు.ఇతను కూడా రోహిత్ మాదిరిగానే సైన్సులో మాస్టర్స్ డిగ్రీ కోసం తనతో పాటు అదే సంవత్సరంలో జాయినయ్యాడు.రవితేజ "సైన్సు డిపార్టుమెంటులో ABVP ప్రభావం ఎక్కువగా ఉండటంతో స్నేహితులు చెప్పారు గాబట్టి వేసేశాడు" అంటున్నాడు. ఈ తొలినాటి రోజుల్లో అతను రాజకీయాల కన్నా సైన్సు గురించే ఎక్కువగా ఆలోచించేవాడట.రవితేజ "యూనివర్సిటీ క్యాంపసులో డస్ట్ బిన్స్ తగినన్ని లేకపోవటం గురించీ పరిశుభ్రత గురించీ ఎక్కువగా మాట్లాదేవాడు.ఒకసారి నన్ను కలిసినప్పుదు తెలుగులో ఒక సైన్సు మ్యాగజైన్ పెట్టి సైన్సు గురించి ప్రచారం చెయ్యాలనే ఐడియా ఉన్నట్టు చెప్పాడు." అని చెప్పటాన్ని బట్టి మొదట్లో అతనికి రాజకీయాల కన్నా సైంటిఫిక్ విషయాల పట్లనే ఆసక్తి ఎక్కువని తెలుస్తుంది.జులై 22,2010 నాటి తన ముఖపుస్తకం మీద "Me joined in hyd central uni. the environment here is fantastic………nice people around………feeling quiet (quite) happy………seeking for some good friends here." అని రాశాడు!

          ఇతనితో పాటు సస్పెండయిన అయిదుగురిలో ఒకతను సుంకన్న వేల్పుల.అతను "నాకు ఈ పుస్తకం ఆ పుస్తకం అని తేడా లేదు ఏది దొరికినా చదువుతాను" అని రోహిత్ అన్నట్టు గుర్తు చేసుకున్నాడు.అలా అతను చదివిన వాటిల్లో ముఖ్యమైనవి బి.ఆర్.అంబేద్కర్ రచనలు,కార్ల్ మార్క్స్ రచనలు!

      2011 నాటికి 22 సంవత్సరాల రోహిత్ కొత్తగా పరిచయమైన భావజాలం అతన్ని ఆకర్షించడమే కాక్ నిష్క్రియాత్మకంగా ఉండనివ్వకపోవటంతో స్టూదెంట్ పాలిటిక్సులోకి ప్రవేశించాడు.అందుకోసం తన Ph.D సబ్జెక్టుని కూడా మార్చుకున్నాడు.జీవశాస్త్ర పరిశోధకుడిగా పేరు తెచ్చుకోవాలనుకున్న రోహిత్ మారిన రాజకీయ దృక్పధం వల్ల రోజంతా ప్రయోగశాలాలో గడపటానికి ఇష్టపడక సోషల్ డిపార్టుమెంటుకి మారాడు.2012లో రోహిత్ SFIలో చేరాడు,కాలేజి రోజుల నాటి పాత మిత్రుడు రాంజీ అప్పటికే అందులో ఉన్నాడు.SFI సభ్యుడైన శేఖర్ "ఆ సంవత్సరమే ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నాడు.జీవితంలో కేవలం చదువుకోవటం కన్నా చెయ్యాల్సిన ఘనకార్యాలు చాలా ఉన్నాయి అంటుండేవాడు.2012లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా అతన్ని ప్రభావితం చేసినాయి" అంటున్నాడు.డిసెంబర్ 16న న్యూడిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ గురించి "A nation where 545 elected members (with 33% women candidates) failed to take a stand on the side of a girl child…… A nation where politicians behave as elected brokers, where no one does any work without a commission…. A nation where students feel shy, timid and embraced (embarrassed) of raising their voice against an odd thing….. A nation where educated intellectuals run for money like machines…… In a nation like our’s, death could be the only thing which can rescue us …." అని ప్రతిస్పందించాడు!

      రోహిత్ స్నేహితుల్లో ఒకడైన విజయ్ "ఒకసారి తనకి చిన్నప్పటినుంచీ కమ్యునిష్టులంటే అభిమానమని చెప్పాడు.వాళ్ళ వూళ్ళో అతని ఇంటికి దగ్గిర్లోనే CPI ఆఫీసు ఉండేదట.తరచుగా వాళ్ళ ప్రసంగాలు వినటం వల్లనే అతను కమ్యునిజాన్ని ఇష్టపడి SFIలో చేరానని అన్నాడు" అని చెప్తున్నాడు.కాబట్టి రోహిత్ అత్మహత్యని హత్యగా మలిచి హంతకుల్ని శిక్షించాలి అని ఉద్యమం చేసేవాళ్ళు అతని హంతకుల లిస్టుని అతని చిన్నప్పుడు అక్కడ ప్రసంగాలు దంచిన CPI నాయకుల నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుంది!

      ASA సభ్యుడైన జమీర్ "రోహిత్ SFIలో చేరినప్పుడు పెద్ద ప్రత్యేకంగా కనపడలేదు,కానీ ఇంగ్లీషులో,ముఖ్యంగా మాటల పొందికలో మంచి ప్రతిభ చూపించేవాడు - అతను డిజైన్ చేసిన పోస్టర్లలో మాటలు తక్కువగా ఉన్నా ఎఫెక్టు చాలా గొప్పగా ఉండేది.దానితో అతి తక్కువ కాలంలో SFIలో పాప్యులర్ అయిపోయాడు" అంటున్నాడు.2013లో యూనివర్సిటీ ఆవరణలో జరిగిన యం.వెంకటేష్ అనే విద్యార్ధి ఆత్మహత్య చాలామందిని కదిలించింది."దానికి వ్యతిరేకంగా SFI,ASAలు సంయుక్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో రోహిత్ కూడా పాల్గొన్నాడు.ఆ తరవాత రెండు ఎన్నికల్లో SFI తరపున ప్రచారం చేసినా 2014 నాటికి ASA వైపుకి జరిగాం నేనూ రొహిత్.అయితే SFI పట్ల మాకున్న అభిప్రాయాల్లో చాలా తేడా ఉంది.నాకేమో వాళ్లది కేవలం మానిప్యులేషన్ మాత్రమే అనిపించేది.రోహిత్ మాత్రం SFI వాళ్లతో చాలా సుదీర్ఘంగా కులాన్ని పట్టించుకోకుండా వర్గాన్ని మాత్రమే పట్టుకు వేలాడటం గురించి వాదించేవాడు" అని రాంజీ అంటున్నాడు.

      నిజమే, పిచ్చి కుదిరితే గానీ పెళ్ళీ కుదరదు పెళ్ళి కుదిరితే గానీ పిచ్చి కుదరదన్నట్టు మురమ్నా ఏమో "బుద్ధుడూ చాలడు, అంబేద్కరుడూ పనికిరాడు, మార్క్సు మాత్రమే సమర్ధుడు" అంటుంది,ఐలయ్య ఏమో "కమ్యునిష్టులు గొప్పకి పోకుండా అంబేద్కర్ ప్రవచనాల్ని ఒప్పుకుని ఎన్నికల్ని సీరియస్సుగా తీసుకుని సిగ్గు పడకుండా కులసమీకరణల్ని వాడుకుని ఎట్లాగోట్లా ముందు జాతీయ స్థాయిలో అధికారం తెచ్చుకుని అప్పుడు పైనుంచి కమ్యునిజాన్ని రుద్దవచ్చు కదా" అని ఉభయచర కమ్యునిష్టులకి ఉబోస లిస్తున్నాడు.వర్గాన్ని వదిలేస్తే ఆ సిద్ధాంతం పిడకలేరుకోవటానికి కూడా పనికిరాదాయె మరి!సాయుధ పోరాటం కాన్సెప్టు వదిలేస్తే పిల్లులు కూడా భౌ భౌ మని మొరుగుతాయి వాళ్ళని చూస్తే,ఇంకెష్లా:-)వాళ్ళు వర్గాన్ని వదిలేసి కులాన్ని కావిలించుకోరు వీళ్ళు కులాన్ని వదిలేసి వర్గాన్ని కావిలించుకోరు.ఇద్దరిలో ఎవరో ఒకరు తమ మూర్ఖత్వాన్ని తగ్గించుకుని ఇద్దరూ కలిసి ప్రయత్నించనంత కాలం కులదోపిడీ,వర్గదోపిడీ రెంటిలో ఏదీ పోదు - మీకు నమ్మకం లేకపోతే నేను స్టాంపు పేపరు మీద రాసిమ్మన్నా రాసిస్తా!

      రోహిత్ ASAలో చేరడం వాళ్లకి ఒక సహజ నాయకత్వం వికసించిన మేధావిని సమకూర్చి పెట్టింది!"ASAకి అతను తెచ్చిన గొప్ప ఆయుధం ఇంగ్లీషు.అతను చేరక ముందు తెలుగుకి మాత్రమే పరిమితమైన ASA రోహిత్ అలవాటు చేసిన ఇంగ్లీషుతో మంచి వూపు తెచ్చుకుంది" అని ఉమామహేశ్వర్ అంటున్నాడు.ఇతనికే రోహిత్ అతని రూములో ఆత్మహత్య చేసుకుని ఆఖరి ఉత్తరంలో క్షమాపణ చెప్పింది."కమ్యునిష్తు సిద్ధాంతంలో దొరకని సాంత్వన అతనికి అంబేద్కర్ బొధనల్లో లభించింది.కమ్యునిష్టులు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా కనీసం క్యాంపస్ వరకూ అయినా కులాన్ని కొంచెం కూడా పట్టించుకోకుండా మొత్తానికి తిరస్కరించడంతో దళితులు ఎందుకు అణిచివేయబడ్డారు,కులనిర్మూలన ఎందుకు అవసరం అనే విషయాలకి సంబంధించి పూర్తిగా అంబేద్కర్ మార్గమే సరైనదని అతనికి అనిపించింది" అని అంటున్నాడు సుంకన్న.ఈ రకమైన అవగాహనతో అప్పటి నుంచి అతనొక సహజ కవచ కుందల శోభితుడిన వీరయోధుడిలా మారిపోయాడు.ఇతనితో పాటు సస్పెండ్ అయినవారిలో ఒకడైన విజయ్ "పోట్లాట అంటూ వస్తే ఏమాత్రం వెనక్కి తగ్గేవాడు కాదు,అది ఒకరకంగా బలహీనతగా కూడా తయారై ఉండవచ్చు.చిన్న చిన్న విషయాలకి కూదా ఆవేశం తెచ్చుకునే వాడు" అని అంటున్నాడు.రోహిత్ తన ముఖపుస్తకం మీద తన గురించి తను "A small time sociology student, with uncontrollable reactive reflexes :)" అని వర్ణించుకున్నాడు!

      కాబట్టి అతని హంతకుల లిస్టులో ప్రముఖ ముద్దాయిలుగా అంబేద్కర్ గారినీ కారల్ మార్క్సు గారినీ కూడా చేర్చాలి.ఇంకా గతంలో అతనితో పోట్లాడి అతనిలో పోట్లాడటాన్ని ఒక బలహీనతగా మార్చిన ప్రతి ఒక్కడినీ హంతకుల లిస్టులో చేర్చాలి.పైగా అతను నిర్భయ ఉదంతం జరిగిన సందర్భంలో వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం వారు వీరని తేడా లేకుండా ఒక్కణ్ణి కూడా మినహాయించకుండా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న ఈ దేశంలోని రాజకీయ నాయకు లందర్నీ హంతకుల లిస్టు లోకి ఎక్కించి వురి తియ్యాలి!

          "అంబేద్కర్ గురించయినా పూలే గురించయినా చర్చకి దిగితే తనే గెలుస్తానని గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉండేవాడు రోహిత్.ఎవరయినా అతనితో చర్చ మొదలుపెదితే ఆపడం కష్టం - ఒక్కోసారి కోపం కూడా వచ్చేది" అంటున్నాడు విజయ్.శేషయ్య "మేమూ ఇంగ్లీషు మాట్లాదతాం.కానీ రోహిత్ ఇంగ్లీషు లెవెల్ చాలా పెద్దది!ఆఖరి ఉత్తరాన్ని చూడండి ఎంత గొప్పగా రాశాడో, అతని రచనలతో ASAని కొత్త ఎత్తులకి ఎక్కించాడు" అని అంటున్నాడు.అతని రచనా వ్యాసంగం విస్తరించిన మరొక రంగస్థలం ముఖపుస్తకం.అక్కడ తనకి ఎక్కువగా నచ్చిన కొటేషన్లలో "Never be a spectator of unfairness or stupidity. Seek out argument and disputation for their own sake; the grave will supply plenty of time for silence…." అనే కొటేషన్ అతనికి నచ్చిందని చెప్పాడట!

          చిన్నతనం నుంచీ జీవశాస్త్ర పరిశోధకుడు అవ్వాలనే కలలతో పెరిగి యూనివర్సిటెకి వచ్చేవరకూ క్లాసు పుస్తకాలు తప్ప ఇతరాలు ముట్టుకోకుండా ర్యాంకులు తెచ్చుకుని యూనివర్సిటెకి అడుగుపెట్టి అక్కడ పరిచయమైన కొత్త భావజాలం ప్రభావానికి గురయి సంటిస్టు కావడం కన్నా ఇతరమైన ఘనకార్యాలు చేయడం గొప్ప అనుకుని కొంచెం అరిందాతనం వచ్చేసరికి దానితోనే ఉబ్బితబ్బిబ్బైపోయి తానొక్కడే ఈ పద్మవ్యూహాన్ని చేదించి విజయవంతంగా బయటకు రాగలనని భ్రమపడి మితిమీరిన ఆవేశంతో ముందుకు దూకి ఆఖరి నిమిషంలో అది పద్మవ్యూహం కాదనీ నైరాశ్యపు చలిగుబుళ్ళు ఈచుకున్న ఒక నైరూప్య చిత్రమనే కఠినసత్యం బోధపడి అస్మదీయుడి వలె కనిపిస్తూ చాటుదెబ్బలు కొట్టగలిగిన పొంచి ఉన్న రాహువు వంటి అసలైన ఆజ్ఞాతశత్రువు బలమెంతో తెలిసి నిశ్చేష్టుడై ఒక అప్రస్తుతవీరవరేణ్యుడు చేసిన ఆయుధవిసర్జన - రోహిత్ ఆత్మహత్య!

            SFIలో ఉన్నప్పుడూ ASAలో ఉన్నప్పుడూ బహిరంగ ముద్దులు,బీఫ్ ఫెస్టివల్స్,మెమన్ ఉరితీతకు వ్యతిరేకంగా చేసిన ప్రదర్సనలు లాంటి ఎన్నో సంచలనాత్మకమైన కార్యక్రమాలలో ఏమాత్రం సంకోచం లేకుండా పాల్గొన్నాడు.ASAలోకి వచ్చాక హిందూత్వ భావజాలాన్ని సంస్కరణ శీలమైన వివేకానందుడి బోధనలతో సహా ఉతికి ఆరేస్తూ ముఖపుస్తకంలో తన పాండిత్యాన్ని ప్రదర్శించాడు,ఆఖరికి చిన్నప్పుడు ప్రసంగాలు విని ఇష్టపడ్డానని చెప్పుకున్న కమ్యునిష్టుల్ని కూడా వదలకుండా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ ఆగ్రహం వెళ్ళగక్కాడు - అయినా ఆనాడెవరూ అతని మీద దాడి చేసి ఉరికి ప్రేరేపించ లేదు.పైగా ఐతనే ABVP వాళ్ళ బ్యానర్లు చింపి పోగులు పెట్టి "కాషాయ రంగు కనపడింది,కోపమొచ్చింది - చింపాను" అని వాళ్లతోనే వాగ్యుద్ధానికి దిగి నదురూ బెదురూ లేకుండా మాట్లాడాడు.ఇవ్వాళ యూనివర్సిటీలో బలంగా ఉన్న ఇంకో విద్యార్ధి సంస్థ   ABVPకి చెందిన నాయకుడితో అతని రూముకే వెళ్ళి బలవంతంగా క్షమాపణ పత్రం రాయించుకోగలిగాడు.శిక్షపడినప్పుడు వైస్ చాన్సలర్ దగ్గిర కెళ్ళి బతిమలాడుకోలేదు.పైన, వైస్ చాన్సలర్ గార్కి రాసిన ఉత్తరంలో కూడా దళిత విద్యార్ధులకు ఉరితాళ్ళు,విషం,కారుణ్యమరణం కానుకలుగా ఐవ్వండి అని వ్యంగ్యాలు విసిరాడే తప్ప రాజీ కోసం ఆలోచించి వెనకడుగు వెయ్యలేదు.మరి అప్పటి వరకు అంత ధైర్యంగా ఉన్నవాడు అంత హఠాత్తుగా పశ్చాత్తాపంతో రగిలిపోతూ ప్రపంచం నుంచి ఎందుకు నిష్క్రమించాడు?

          ఆ దురదృష్టకరమైన రోజున ఆత్మహత్య చేసుకుని ఈరోజు అందరి సానుభూతినీ పొందుతున్నాడు గానీ 2016 జనవరి 18న హైకోర్టుకు హాజరయ్యేందుకు సమన్లు అందుకుని ఉన్నాడు.ఆ కేసు పూర్తిగా తనకి ప్రతికూలమైనదే,నిర్దోషిగా బయటపడే అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే అతనితో పాటు 5గురు విద్యార్ధుల్ని యూనివర్సిటీ ప్రోక్టొరల్ కమిటీ సస్పెండ్ చేసింది కూడా అతను మరొక విద్యార్ధి సంస్థ అయిన ABVPలో సభ్యుడైన సుశీల్ కుమార్ రూముకే వెళ్ళి భౌతికదాడి చేశారని నిర్ధారించుకోవటం వల్లనే!దాని మూలం తెలియాలంటే యాకూబ్ మెమన్ ఉరి కరెక్టా కాదా అని తేల్చుకోవాలి.అప్పటి వరకు ఒక సామాజిక సిద్ధాంతానికి కట్టుబడి అంబేద్కర్ మార్గంలో పోరాడుతున్న వీరకిశోరంలా కనబడిన రోహిత్ అప్పటి నుండి ఒక టెర్రరిస్టును సమర్ధించటానికి "ఒక వీరుడు మరణిస్తే వేలాదిమంది ప్రభవింతురు" అని భగత్ సింగు లాంటివాళ్ళకి వాడాల్సిన గొప్ప వాక్యాన్ని అధమాధమ స్థాయికి దిగజార్చిన తన వైఖరిని నైతికంగా సమర్ధించుకోలేక తప్పు మీద తప్పు చేస్తూ నడిచి  ఆఖరి క్షణాల్లో ఒకనాడు రాంజీకి SFI గురించి బోధపడిన "ఇదంతా మానిప్యులేషన్ మాత్రమే" అన్న సత్యమే తనకూ ASA గురించి బోధపడినందువల్ల కాళ్లకింది భూమి కదిలిపోయి ఆ భూకంపం ధాటికి తట్టుకోలేక తనను తనే అంతం చేసుకున్నాడు గనక అక్కడి నుంచి మొదలుపెడితే అతని వివేకభ్రష్టత్వం పూర్తిగా గోచరిస్తుంది.

          బీఫ్ ఫెస్టివల్స్ నిర్వహించటం లాంటి చెత్తపనులకు ఎక్కువసేపు ల్యాబరేటరీలో గడపాల్సిన సైన్సు గ్రూపును వదిలి ఆర్ట్స్ గ్రూపుకి మారడమే అతని మొదటి తప్పు!అయినా యాకూబ్ మెమన్ ఉరితీతకు తెలిపిన నిరసనకు ముందరి కార్యక్రమాలకి సమర్ధించుకోవడానికి ఎంతో కొంత సబబైన కారణాలు ఉంటే ఉండవచ్చు గానీ యాకూబ్ మెమన్ ఉరికి ప్రతీకారంగా ప్రతి ఇంటి నుంచీ ఒక యాకూబ్ మెమన్ లాంటి ఉగ్రవాదిని పుట్టించమని విజ్ఞప్తి చెయ్యడం మాత్రం సమర్ధనీయం కాదు.1993లో జరిగిన పేలుళ్ళకి 2015లో శిక్ష పడింది - అంత సుదీర్ఘకాలం పాటు ఈ దేశపు సర్వోన్నత న్యాయస్థానం అన్ని రకాల సాక్ష్యాధారాల్నీ పరిశీలించి అంబేద్కర్ రచించిన రాజ్యాగం ప్రకారమే విధించిన శిక్షని వ్యతిరేకించినవాళ్ళు అంబేద్కర్ వాదులు ఎట్లా అవుతారు?అతడేదో అమాయక బీద ముస్లిం అయినట్టూ దేశంలో ఉన్న బ్రాహ్మణులంతా కత్తులు తీసుకుని అతని కుత్తుకని కోసినట్టూ అల్లల్లాడిపోతూ తాటిచెట్టెందుకు ఎక్కావంటే దూడగడ్డి కొసమన్నట్టు ఇప్పటి వరకూ ఉరి తియ్యబడిన వాళ్ళలో ఎక్కువమంది దళితులు గనక గతంలోని ఉరిశిక్షల్ని వ్యతిరేకించినట్టుగానే ఇప్పుడూ మేము వ్యతిరేకించాము అంటున్నారు గానీ మెమన్ ఉరిశిక్షకి సంబంధించిన నిజాలు ఇవి:నిజానికి ఈ పేలుళ్ళు జరిపించింది ముస్లిముల మనోభావాల్ని పట్టించుకోకుండా అయోధ్యలో బాబ్రీ మసీదుని కూలగొట్టడానికి ప్రతీకారంగా చేశామని చెప్పుకుంటారు గానీ వీళ్ళు బాంబులు పేల్చటానికి పనిముట్లుగా వాడుకున్నది చదువూ సంధ్యా లేని బీద ముస్లిముల్నే అని వీళ్ళకి నిజంగానే తెలియదా!అప్రూవరుగా మారి తనంతట తను లొంగిపోయాడంటారు గానీ అతని అరెస్టు మాత్రం అనుకోకుండా అతను దొరికిపోవటంతో జరిగింది.పేలుళ్ళ ద్వారా తాము ఆశించినంత ఫలితం రాలేదు.పాకిస్తాన్ గడ్డ మీద ఎక్కువ కాలం ఉంటే పాకిస్తానుకీ అంతర్జాతీయ సమాజం నుంచి చివాట్లు వస్తాయి,అప్పటికే వస్తున్నాయి!దాంతో మారుపేరుతో నేపాల్ వెళ్ళాడు.అక్కడికి ఒక మిత్రుణ్ణి రప్పించుకుని తను అమాయకుణ్ణి అని చెప్తే ఇండియాలో నమ్ముతారా అని వాకబు చేస్తే అతను తనపేరు కూడా నిందితుల లిస్టులో ఉందని ఉన్న విషయం చెప్పాడు.దానితో నిరాశపడి చేసేది లేక బొంబాయి మీదుగా కరాచీకి వెళ్ళిపోదామనుకున్నాడు.ఎయిర్ పోర్టులో చెకింగు దగ్గిర తన బ్రీఫ్ కేసులో ఉన్న తాళాల గుత్తి తుపాకీ ఆకారంలో కనబడటంతో ఎయిర్ పోర్టు అధికార్లు బ్రీఫ్ కేస్ తెరిచి చూస్తే ఇండియన్ పాస్పోర్టు కనబడింది.అసలు మనిషి ఫలానా అని తెలియగానే వాళ్ళు సిబీఇకి అప్పగీంచారు.అసలు నిజం ఇదయితే ఇండియాలో ఉన్న యాకూబ్ అభిమానులు "అతను లొంగిపోదామని వస్తే భారత పోలీసులు అబద్దాలు చెప్పి పట్టుకున్నారు.తనంతట తను లొంగీపోయి కేసు విచారణలో సహకరించిన సజ్జనుణ్ణి ఉరితియ్యడం అన్యాయం, ఇతన్ని ఉరి తీస్తే టైగర్ ఎట్లా దొరుకుతాడు" అని తలాతోకా లేని మాటలు మాట్లాడుతున్నారు.తనంతట తను లొంగిపోదామనుకుంటే నేపాల్ నుంచి డిల్లీకి వస్తాడు గానీ కరాచీ ఎందుకు వెళ్ళాలనుకుంటాడో ఈ కోడిమెదడు మేతావులు చెప్పగలరా?అప్పటికి కొన్నేళ్ళుగా దావూద్ ఇబ్రహీం వంటివారితో సంబంధాలు ఉండి స్వయంగా అండర్ వరల్డ్ డాన్ అయిన టైగర్ మెమన్ తమ్ముడై ఉండి, బాంబులు పేల్చటానికి అయిన ఖర్చునంతా తనే పెట్టుకుని ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలో నిర్దేశించుకుని మనుషుల్ని కూడా మాట్లాడుకుని ఆర్గనైజ్ చేసి, ఇంకో రెండు గంటల్లో తన మూలంగా అంతమంది చస్తారని తెలిసి కూడా పశ్చాత్తాపం లేకుండా తన ప్రాణం రక్షించుకోవడానికి పాకిస్తాన్ పారిపోయిన వాడిని పెద్దమనిషిగా కలరు పులమడానికి అన్ని కట్టుకధలు అల్లుతున్నవాళ్ళు నిజంగా పెద్దమనుషులేనా!పట్టుబడినాక కూడా తన ఒక్కడి ప్రాణమే విలువైనదన్నట్టు తనకోసమే లాయర్లని పెట్టుకున్నాడు గానీ తనిచ్చిన పదివేల కోసం తను పెట్టమన్నచోట బాంబులు పెట్టి అమాయకంగా దొరికిపోయి ఉరిశిక్షకి గురయిన కడుబీద ముస్లిముల ప్రాణాల్ని గురించి ఏమాత్రం పట్టించుకోని స్వార్ధపరుణ్ణి మంచివాడని అనటం నిజంగా అమాయకత్వమేనా?ఆ బీద ముస్లిముల గురించి పట్టించుకుని నిజానిజాలు తెలుసుకుని కింది కోర్టులు వీళ్ళ తరపున గట్టిగా వాదించినవాళ్ళు ఎవరూ లేకపోవటం వల్ల తొందరపాటుతో వేసిన ఉరిని రద్దు చేసిన సుప్రీంకోర్టు కేవలం ఇతనికి ఉరి వేసినందుకే దుర్మార్గమైపోయింది వీళ్ళ దృష్టిలో - ఏమిటీ వికటత్వం?

          2015 జులై 30న అంటే యాకూబ్ మెమన్ ఉరిని గురించి రోహిత్ తన ముఖపుస్తకంలో Black Day for Indian Democracy Shame on Judiciary and government for hanging yakub memom అని పోష్టు చేశాడు - ఏమిటి దీనర్ధం?రోహిత్ ఫేస్ బుక్ పోష్టుల్ని దశల వారీగా చూస్తుంటే నాకు "ఆకాశంబు నందుండి, శంభుని శిరంబందుండి, శీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి, పవనాంధో లోకమున్ జేరె గంగా కూలంకష - పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్!" అన్న భర్తృహరి సుభాషితం గుర్తొచ్చి ఎంతో జాలిగా అన్పించింది!బయాలజీ సైంటిస్టు కావాలని యూనివర్సిటీలో చేరి బుద్ధిగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని తన కలల్ని నెరవేర్చుకోవడానికి అన్ని అవకాశాలూ ఉండి కూడా తన్ను మాలిన ధర్మం చందాన తల్లి పట్ల తన బాధ్యతని గాలికొదిలి మొన్నటి రోజున సాటివాళ్లలో హీరో అనిపించుకుని నిన్నటి రోజున తొండ ముదిరి వూసరవెల్లి అయినట్టు రౌడీగా కూడా మారి ఇవ్వాళ్టి రోజున జీరోగా మిగిలాడు - ఈ ముగింపుని ముందే తెలుసుకుని ఉంటే ఈ చెత్త రాజకీయాల్లోకి వచ్చి ఉండేవాడు కాదు గదా?!

          ఆగస్టు 3న వీళ్ళు MIM యాకూబ్ మెమన్ మృతికి సంతాపసూచకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని చేసిన పనుల్ని అవహేళన చేస్తూ ABVPకి చెందిన సుశీల్ కుమార్ తన ముఖపుస్తకం మీద వీళ్ళని "గూన్స్" అని పిలుస్తూ ఒక పోష్టు వేశాడు.అప్పటికే వివేకానందుణ్ణి గురించి కూడా Vivekananda is an apologist of Caste system, misogynistic and a fake intellectual. He is an overrated, half-witted person who has no scientific references to his rants, there was no actual n original ideas or knowledge production from this guy. I am surprised and disappointed at the kind of institutionalised celebration of his birthday in HCU అనేటంత ముదురు కామెంట్లు వేసినవాడు ఈ చిన్నమాటకే విపరీతంగా కోపం తెచ్చుకున్నాడు.అదేమిటో ఈ రోహిత్ ఒక్కడే కాదు,కంచె ఐలయ్య లాంటివాళ్ళు కూడా ఇదే వరస, మా భావజాలంలో ప్రజాస్వామ్యం పగలబడిపోతున్నది, మేము హిందువుల్లాగ పెత్తందార్లం కాము అంటూనే తమకు నచ్చినవాటిని మిగతావాళ్ళు కూడా చచ్చినట్టు మెచ్చుకు తీరాల్సిందేనని పట్టుబట్టటం, తమకు నచ్చనివి అసలు తమ కంటికే కనబడకూడదని వీరంగాలు వేస్తూ ఇతర్ల మీద పెత్తనాలు చెయ్యటం - ఇదేమి ప్రజాస్వామ్య స్పూర్తియో వీళ్ళ పిండాలు పిల్లులకి బెట్ట?!

          ఆగస్ట్ 3న సుశీల్ కుమార్ తన ఫేస్ బుక్ పోష్టు అప్డేట్ చేస్తే అదే రోజు రాత్రి రోహిత్ ఒక పెద్ద బృందాన్ని వెంటబెట్టుకుని సుశీల్ కుమార్ రూముకి వెళ్ళి గొడవ చేసి బలవంతంగా అతనితో క్షమాపణ పత్రం రాయించుకున్నాడు.అయితే ఆగష్టు 4,2016న సుశీల్ కుమార్ అతని సోదరుడు విష్ణు సాయంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయినయి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకున్నాడు.అక్కడ అది మెడికో లీగల్ కేసుగా నమోదు చెయ్యటంతో క్రిందటి రోజు రాత్రి రోహిత్ బృందం అతని పైన భౌతికంగా దాడి చేశారని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది!అయితే సుశీల్ పేషెంటుగా ఉండగానే సుశీల్ బంధువు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా యూనివర్సిటీ ప్రోక్టొరల్ కమిటీ విచారణ జరిపి ఇరువర్గాలనూ మందలించి వొదిలెయ్యాలని తీర్మానించింది.హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాక తన వైపు నుంచి వాదన వినకుండా తన పరోక్షంలో విచారణ జరపడం అన్యాయం అని తనకు న్యాయం జరిపించమని సుశీల్ బండారు దత్తాత్రేయ గారిని కలిశాడు.ఆయన యూనివర్సిటీ విషయాల్లో జోక్యం చేసుకోవటం దేనికని భావించి కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీకి ఒక లేఖ రాసి సుశీల్ అభ్యర్ధనను కూదా జత చేసి పంపించారు. కేంద్రం నుంచి యూనివర్సిటీకి తగిన చర్య తీఎసుకోవటం కోసం సూచన పంపించారు.ఈలోపు సుశీల్ తల్లి తన కొడుకు మీద జరిగిన దాడి గురించి కేసు వెయ్యటం జరిగింది.దానితో విషయం తీవ్రతని బట్టి రెండవ సారి సుశీల్ కూడా హాజరయిన ప్రోక్టొరల్ కమిటీ 5గురు విద్యార్ధుల్ని సస్పెండ్ చేసింది.ఈ మొదటి సస్పెన్షన్ చాలా తీవ్రమైనది.

          అపెండిసైటిస్ అనగానే చాలా సిల్లీగా తీసిపారేస్తున్నారు కేజ్రీవాల్ దగ్గిర్నుంచి ప్రతి ఓక్కరూ.దీని చరిత్ర ఇది:మనిషి ఆహారాన్ని వండుకు తినటం నేర్చుకోక ముందు మాంసాన్ని అన్ని మాంసాహార జంతువుల లాగే పీక్కు తినేవాడు,కందమూలా లయితే కోతుల మాదిరిగా కొరుక్కు తినేవాడు.ఈ కఠినమైన ఆహారాన్ని జీర్ణం చేసుకునేటందుకు కొన్ని రకల బాక్టీరియా జీర్ణవ్యవస్థలో కుదురుకుని ఉండి సహాయపడుతూ ఉండేది.అయితే తర్వాతి కాలంలో మారిన ఆహారపు అలవాట్ల వల్ల ఆ భాగం ఆవసరం తగ్గిపోయి కుంచించుకుపోయి అవశేషంగా ఉండిపోయింది.మనిషి శరీరంలో ఇలాంటి అవశేషాంగాలు చాలా ఉన్నాయి.ఆ శరీర భాగం ఎటూ ఉంది గనక ఆ బాక్టీరియా కూడా అపెండిక్స్ లోనే ఉండి  రక్తం ద్వారా ఆ భాగం లోకి చేరిన ఆహారం మీద బతికేస్తున్నది.వెనకటి కాలంలో అవి ఉపయోగకారులే అయినా ఇప్పుడు గనక అవి రీరం లోని ఇతర భాగాల లోకి వ్యాపిస్తే హానికరమైనవి అవుతాయి.సాధారణంగా డాక్టర్లు ఇతర రోగాల కోసం పొట్టను కోసినా కుట్లు వేసేటప్పుడు ఈ అపెండిక్సుని కత్తిరించి తీసేస్తారు - భవిష్యత్తులో సమస్య రాకుండా!పొట్ట మీద బలంగా దెబ్బ తగలనిదే లోపలెక్కడో ఉన్న అపెండిక్స్ చిట్లే అవకాశం లేదు.అపెండిక్స్ పగిలి బాక్టీరియా వ్యాపించినప్పుడు వెంటనే అపరేషన్ చెయ్యకపోతే మనిషి ప్రాణానికి ప్రమాదమే - 24 గంటల కడుపు నెప్పి అంటారు దీన్ని!మెడికల్ ర్రిపోర్టులో భుజం మీద దెబ్బ తగిలినట్టుగా కూడా ఉంది - అంత దుర్మార్గం చేసిన వాడు సూయిసైడ్ చేసుకునేసరికి ట్రాజిక్ హీరో లెక్కన పేరు తెచ్చుకుంటున్నాడు!

          మొదటి సారి సస్పెండ్ చెయ్యటం కాంగ్రెస్ పార్టీ నియమించిన యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయాల ప్రకారం జరిగింది.రెండు నెలల క్రితం భాజపా ప్రభుత్వం నియమించిన కొత్త వైస్ చాన్సలర్ సెప్టెంబర్ 7న జరిగిన ఈ కథినమైన శిక్షని తగ్గించి కేవలం ఆర్నెల్ల పాటు హాస్టల్ నుంచి మాత్రమే బహిష్కరిస్తూ చదువులు కొనసాగించుకోవటానికి వీలుగా క్లాసులకి హాజరు కావటానికీ లైబ్రరీకి వెళ్ళడానికీ అనుమతులు ఇచ్చి గుంపుగా తిరగటాన్ని మాత్రమే నిషేధించారు.సెప్టెంబర్ 7న కథినమైన శిక్షని వేసిన పాత వైస్ చాన్సలర్ మీద కాకండా శిక్షల్ని సవరించిన కొత్త వైస్ చాన్సలర్ మీద ఉద్యమం చేయ్యడం లోని మతలబు ఏంటి?

          ఈ మతలబు వల్ల తొలిసారి రోహిత్ గందరగోళానికి గురయ్యాడు.స్కాలర్ షిప్ ఆగిపోవడంతో ఇంటికి డబ్బు పంపటానికి అప్పులు చేస్తున్నప్పుడు ఆర్ధికం మెదడులో ప్రమాద ఘంటికల్ని మోగించి ఉంటుంది.ఇంకో వైపున సుశీల్ తల్లి వేసిన కేసు కూడా బలమైనదే!మామూలుగా అయితే రోహిత్ లాంటి ఉద్యమవీరులకి తమ మీద ఇలాంటి కేసులు పడితే ఉత్సాహం పుడుతుంది.వీర భగత్సింగు లెవేల్లో కోర్టు హాలులో ఉపన్యాసాలు దంచగలిగే సువర్ణావకాశం తలుపు తడుతున్న సమయంలో రోహిత్ లాంటి భాషాపరశేషభోగి దాన్ని వొదులుకుని ఆత్మహత్య చేసుకోడు!రోసస్పెన్షన్లు పూర్తిగా ఎత్తేసినా ఉద్యమం ఉధృతం చేస్తున్న వాళ్ళు ఆ ప్రసక్తినే తీసుకు రావటం లేదు గానీ సుశీల్ నమ్మకంగా చెప్తున్నాడు రోహిత్ రాజీ ఫార్ములాతో వచ్చాడని!ఆందోళన విరమించుకోవడం ద్వారా ఆ కొంచెం సస్పెన్షన్ కూడా ఎత్తేయించుకుని సుశీల్ కేసు వాపస్ చేసుకునేలా ఒప్పందం జరిగి ఉండవచ్చు.అయితే తను చేసిన రాజీ ప్రయత్నాల గురించీ సుశీల్ సానుకూలంగా స్పందించటాన్నీ మిగిలిన వాళ్లకి చెప్పినప్పుడు వాళ్ళు బయటపెట్టిన ఒక విషయం రోహిత్ ఆశల్ని నీరుగార్చేసింది.వీళ్ళకి పై స్థాయిలో ఉన్న పెద్దలు ఈ ఆందోళనని ఇంకా పెంచి కేంద్రం లోని భాజపా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టమని సూచించారట!ASA లోకి వచ్చేటప్పుడు రాంజీకి SFI గురించి బోధపడిన నిష్ఠురసత్యమే ఇప్పుడు ASA గురించి మనవాడికి బోధపడింది.కళ్ళు తెరుచుకున్నాయి కానీ బతకటానికి పనికొచ్చే దారులన్నీ మూసుకుపోయి ఒకే ఒక్క దారి మిగిలింది - వీరమరణం లాంటి గౌరవప్రదమైన ఓటమి!

          రోహిత్ తన ఆఖరి ఉత్తరంలో రాసి కొట్టేసిన భాగాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా సేకరించి టైమ్స్ ఆఫ్ ఇండియా జనవరి 22న ప్రచురించింది."ASA,SFI వాటి ఉనికిని చాటుకోవడం కోసమే పనిచేస్తున్నాయి.ఆయా సంస్థల సిద్ధాంతాలు అందులో పనిచేసే వ్యక్తుల ప్రయోజనాలు భిన్నంగా ఉన్నాయి.అధికారం చలాయించడం కోసం,ప్రచారంలో ఉండడం కోసం,తమ ప్రాముఖ్యత చాటుకోవడం కోసం మాత్రమే పనిచేస్తున్నాయి.పైగా సమాజంలో మార్పుకోసమే పనిచేస్తున్నామంటూ తమను తాము మభ్యపెట్టుకుంటూ ఉంటున్నాయి" అని రోహిత్ రాసి కొట్టేసి తనే దాన్ని కొట్టేసినట్టు పక్కన నోట్ పెట్టి సంతకం చేశాడు!ఈ రాసి కొట్టేసి తనే కొట్టేశానని చెప్పడం వెనక ఉన్న చిదంబర రహస్యమేమిటో మరి?

          రోహిత్ సుశీల్ మధ్య జరిగిన రాజీ వ్యవహారం నిజమే అయితే ఈ కొట్టేసిన భాగంలో రోహిత్ వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం రోహిత్ ప్రతిపాదించిన రాజీకి ఒప్పుకోని ASA సహచరుల్ని కూడా హంతకుల లిస్టులోకి ఎక్కించాలి.కొత్తగా తెలిసిన రోహిత్ కుటుంబ వివరాల ప్రకారం తండ్రి మణికుమార్ ఇంటర్ చదివి ఒక హాస్పటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వడ్డెర కులస్థుడు.తల్లి రాధిక మాల కులంలో పుట్టినా దత్తత ద్వారా అంజనీదేవికి పెంపుడు కూతురుగా పెరిగింది.ఒక పాత సినిమాలో "సంతానమే లేక" అని ఒక హాస్యగీతం ఉంది - మీరెవరయినా విన్నారా?అప్పట్లో పిల్లలు పుట్టకపోతే పూజలూ పునస్కారాలూ తీర్ధయాత్రలూ చెయ్యమని చెప్పేవాళ్ళు!వాటిలోనే ఒక వింతయిన పరిష్కారం ఎవర్నయినా దత్తత తీసుకోమనటం.ఈ పరిష్కారాలు కొన్నిచోట్ల పని చేసేవి కూదా!దత్తత తీసుకుంటున్నప్పుడు నిస్సంతుగా ఉన్నవాళ్లకి కొంతకాలమయ్యాక పిల్లలు పుట్టేవాళ్ళు.అసలు పిల్లలు పుట్టనప్పుడు గారాబంగా పెరిగిన మొదటి సంతానం పరిస్థితి తర్వాత తమకంటూ సొంతంగా పిల్లలు పుట్టాక దయనీయంగా తయారయ్యేది.దానినే కవిగారు "సంతు గలిగిందంటేను చిన్ని పాపాయి గతి శ్రీమతే రామానుజాయ నమః" అని కామిడీగా చెప్పారు.పాట యొక్క శైలి హాస్యసోరకంగా ఉందటం వల్ల మనకి నవ్వొచ్చినా అనుభవించినవాళ్లకి నరకమే కదా - అలాంటి బాధల్నే రాధిక అనుభవించి ఉంటుంది!రాధిక పెంపుడు తల్లి వడ్డెర కావడంతో వడ్డెర కులస్థుడికే ఇచ్చి పెళ్ళీ చేశారు.తీరా రాధిక కులం తెలిశాక అబద్ధం చెప్పి మాలదాన్ని నాకంటగట్టారు అని ఆ ప్రబుద్ధుడు విడాకు లిచ్చేశాడు.పైకి వాచ్యంగా చెప్పకపోయినా తన కులం గురించీ తన గురించీ గొప్పగా చెప్పుకుని కొడుకు కులాన్ని మార్చడం గురించి తిరస్కారంగా మాట్లాడినందువల్ల విడాకులకి కారణం అదే అయ్యుండాలి - నిజమేమిటో ఎవరూ చెప్పడం లేదు,మన కనవసరం గూడా!రాధిక పెంపుడు తల్లి అంజనీ దేవిని చూశాను, తెలుగు రాకనో చాలామందికి లాగ స్టయిలు కోసమో అంతా ఇంగ్లీషులోనే మాట్లాడటం కొంచెం విచిత్రంగా అనిపించింది నాకు.

          2012లో రమెష్ బాయ్ డి.నాయికా వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సాధారణ అరిస్థితిలో బిడ్డలు తండ్రి కులాన్ని స్వీకరిస్తారనే విషయాన్ని ఒప్పుకుంటూనే తల్లి పుట్టుక కారణంగా "జీవితమంతా  అవమానాలకు,తలవంపులకు,తిరస్కారాలకు(Deprivation,Indignities,Humiliation,Handicaps) లాంటివాటికి గురయిన పక్షంలో పిల్లల్ని దళితులుగా గుర్తించవచ్చు" అని స్పష్టంగా ఉండటం వల్ల రోహిత్ దళితుడేనని నా అభిప్రాయం.నా దృష్టిలో ఈ విషయానికి అసలు ప్రాధాన్యత లేదు.అతనికి వస్తున్న స్కా;లర్ షిప్ మెరిట్ స్కాలర్ షిప్ అంటున్నారు.అది క్యాన్సిల్ అయ్యే ప్రమాదం లేదు.ఇప్పుడు రోహిత్ దళితుడని ఒప్పుకోవటం వల్ల వీళ్ళు ఉఢృతం చెయ్యాలనుకుంటున్న ఉద్యమానికీ ఏ విధంగానూ లాభం ఉండదు.ఎవరిమీదయినా ఆట్రాసిటీ కేసు పెట్టటం కోసం మాత్రం పనికొస్తుంది - కానీ ఎవరిని హంతకులుగా నిర్ధారించాలి?కర్ణుడి చావుకి మల్లే చిన్నప్పుడు ఇంటి పక్కన ఉన్న పార్టీ ఆఫీసు నుంచి ప్రసంగాలు దంచిన CPI నాయకుల నుంచి రోహిత్ రాజీ ప్రతిపాదనని ఒప్పుకోకుండా అతనికి విరక్తిని కలిగించిన ASA సహచరుల వరకూ అందరి బాధ్యతా ఎంతో కొంత ఉంది కదా!

          రోహిత్ బృందం దాడిచేసిన సుశీల్ కుమార్ కూడా వెనకబడిన కులానికి చెందినవాడే.రోహిత్ ఆత్మహత్యను దళితుల మీద అగ్రవర్ణ హిందువుల దాడిగా చూస్తే మరి సుశీల్ కుమార్ మీద జరిగిన దాడిని ఎలా చూడాలి?ఈ గందరగొళం వల్ల సరళతరం చేసిన కాస్తపాటి సస్పెన్షన్ ఎత్తేశాక కూడా చదువును కొనసాగించకుండా ఇప్పుడు ఆందోళన చేస్తున్న విద్యార్దులు మూర్ఖంగా ఇంకా ముందుకెళితే ప్రతి ఒక్కరి నుంచీ ఈ ప్రశ్న రావడం ఖాయం!హైదరాబాద్ యూనివర్సిటీలో ఈ విద్యార్ధులు పొందుతున్న ఏ సౌకర్యమూ వైస్ చాన్సలర్ గానీ యూజీసీ చైర్మన్ గానీ విద్యాశాఖ మంత్రులు గానీ వారి జేబుల్లో నుంచి ఖర్చుపెడితే రావటం లేదు.రోహిత్ హక్కుగా పొందుతున్న 30000 ఎక్కడ నుంచి వస్తున్నాయి?భారతదేశపు పౌరులుగా ఉన్న ఈ దేశప్రజలు కట్టిన పన్నుల నుంచే కదా - ఈ దేశప్రజల ఉమ్మడిసొమ్మును అనుభవిస్తూ ఈ దేశప్రజల మీద బాంబులు పేల్చి చంపినవాణ్ణి ఉరితీస్తే "Black Day for Indian Democracy Shame on Judiciary and government" అని వ్యాఖ్యానించినా ఏమీ చెయ్యకూడదా?వివేకానందుణ్ణి "fake intellectual" అన్న పండితులు సుశీల్ వాడిన "గూన్స్" అన్న చిన్నమాటను పట్టుకుని బృందంగా వెళ్ళి ఉద్ధరించిన ఘనకార్యం ఏమిటి?"గూన్స్" అన్న మాటకి వీళ్ళు తగిన వాళ్ళే అని నిరూపించుకోవటం కాదా!

         మార్క్సిష్టు భావజాలం గల హరగోపాల్ ఇదివరలో 21 మంది విద్యార్ధుల్ని ఇప్పటికన్నా కఠినమైన శిక్షలు వేసినప్పుడు ఆందోళన చెయ్యలేదు - ఎందుకని?కొందరిని ఇఇక్కడ సస్పెండయినా ఇంకో చోట జాయినయ్యే వీలు లేకుండా ఇతర యూనివర్సిటీలో అడ్మిట్ కాకుండా నిషేధించటం లాంటి క్రూరమైన శిక్షలు కూడా వేశారు గదా!నిజానికి ఇవ్వాళ కులపిచ్చి చదువు రానివాళ్లలో కన్నా చదువుకున్నవాళ్ళలోనే ఎక్కువ ఉంది.స్టూడెంట్లకే కాదు ప్రొఫెసర్లకీ ఉంది కులపిచ్చి - ఒప్పుకుందాం!అయితే ఒక కులపిచ్చి ఉన్న ప్రొఫెసర్ మీద చర్య తీసుకోవాల్సిన మంత్రిగారు కులసమీకరణల ప్రకారమే ఎన్నికవుతున్నప్పుడు నిష్పక్షపాతంగా అతనెలా  వ్యవహరించగలుగుతాడు?ఇవ్వాళ ప్రతి రాజకీయ పార్టీ ఫలానా నియోజక వర్గంలో ఏ కులం వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఆ కులంవాణ్ణి అభ్యర్ధిగా నిలబెడుతున్నది,వాళ్ళు ఢంకా మీద దెబ్బ గొట్టినట్టు గెలుస్తున్నారు, గెలుపోటముల విశ్లేషణలు చెసే మీడియా మేధావులు కూడా ఫలానా నొయోజకవర్గంలో ఫలానా కులస్థులు ఎక్కువ ఉండటం గమనించి కూడా వేరే కులంవాణ్ణి నిలబెట్టటం వల్లనే ఫలానా పార్టీ ఆ స్థానంలో వోడిపోయినట్టు బల్లగుద్ది చెప్తున్నారు.ఈ రకంగా తమ కులం వల్లనే గెల్చినవాళ్ళు కులరహితులుగా ఉండగలరా?రాజకీయ పార్టీలు ఏ ప్రాంతంలోనైనా ఏ అబ్యర్ధినైనా అర్హతల్ని బట్టి గాక అక్కడ ఒక కులం ప్రభావశాలి అని తీర్మానించి ఆ కులం నుంచి నిర్ణయిస్తే ఆ కులంవాళ్ళు సిగ్గుపడిన రోజున ఆ ప్రాంతం కులపిచ్చికి దూరమయినట్టు - అప్పటివరకు ఎన్ని ఉపన్యాసాలు దంచినా కులపిచ్చి పోదు!

          దళితులు అధికారం లోకి వచ్చి కులరహిత సమాజం స్థాపించితే గానీ అసమానతలు తొలగవు అని చెప్తున్న కంచె ఐలయ్య దళిత అనుకూల ప్రభుత్వం రావాలంటే దళితులు తమ కులాల వాళ్ళకే వోటు వెయ్యాలని సూచిస్తూ ఎడంచెయ్యి తీసి పుర్రచెయ్యి పెట్టమన్న తలతిక్క పరిష్కారాలు చెప్తున్నా మేధావి అని గౌరవిస్తున్నారు.ఒక కంచె ఐలయ్య వందమంది యాకూబ్ మెమన్ లాంటి ఉగ్రవాదుల కన్నా ప్రమాదకారి!కుల రహిత సమాజం ఏర్పడాలి అంటాదు,తన కురుమ గొల్ల కులం విశ్వవ్యాప్తం కావాలి అంటాడు - రెంటికీ అస్సలు పొసగదు కదా!కుల రహిత సమాజం కావాలంటే కులాంతర వివాహాలు చేసుకోవాలి - అప్పుడు కురుమ గొల్ల కులం ఉనికిలోనే ఉండదు!లేదంటే ప్రతి కురుమ గొల్ల పురుషుడూ పదిమంది కురుమ గొల్ల స్త్రీలని పెళ్ళాడి ప్రతి స్త్రీ నుంచి పదిమంది సంతానాన్ని కనాలి.వీళ్ళందర్నీ పెరిగి పెద్దయ్యే లోపు చావకుండా పోషించటానికి దారులు కొట్టటం దగ్గిర్నుంచి హవాలా కుంభకోణాల వరకూ ఏ దిక్కుమాలిన పనయినా సరే చేసి విపరీతంగా డబ్బు సంపాదించాలి!అప్పుడు కురుమ గొల్ల కులం విశ్వవ్యాప్తమవుతుంది దళితులకి రాజ్యాధికారం దానంతటదే వచ్చేస్తుంది.వినేవాడు ఉంటే పంది పురాణం చెప్తుందన్నట్టు చెలరేగిపోతున్నాడు - వినేవాళ్ళు ఎలా వింటున్నారో పిడకలేరుకోవటానికి కూడా పనికిరాని ఈ పోచికోలు కబుర్లు?

          ఈ కమినిష్టు దళితిష్టు మేధావులు ఎంత ఛండాలంగా ప్రవర్తించగలరో సాతులూరి చలపతి రావుకి పడిన ఉరిశిక్షని తప్పించటానికి ఆడిన నాటకాన్ని బట్టి తెలుసుకోవచ్చు.1993లో చిలకలూరి పేటలో కొందరు దళితులు ఒక ఆర్టీసీ బస్సుని తగలబెడితే అందులో ఉన్న 23 మంది ప్రయాణీకులు చనిపోయారు.నిందితుల్లో సాతులూరి చలపతి రావు, గంటెల విజయవర్ధన రావు అనే ఇద్దరికి ఉరిశిక్ష పడింది.ఇంక చూసుకోండి!దళిత ప్రజా సంఘాల నుంచి మానవ హక్కుల సంఘాల లోని మేధావు లంతా రంగం లోకి దిగి జరగరాని ఘోరం జరిగిపోయినట్టు ఆందోళన పడిపోయి రాష్త్రపతి నుంచి క్షమాబిక్ష రాబట్టుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.వీళ్ళకి చచ్చిపోయిన 23 మంది కోన్ కిస్కా గొట్టాం గాళ్లలా కనిపించి ఉంటారు, నిందితులు అంత ఘోరం చేసినా వాళ్ళు దళితులు గాబట్టి ఉరి తీయటం అమానుషం అని వీళ్ళ వాదన.కొన్ని గంటల్లో ఉరిశిక్ష అమలు జరుగుతుందనగా ప్రఖ్యాత రచయిత్రి మహాశ్వేతాదేవిని కూడా కలుపుకుని ఆఖరుసారిగా మళ్ళీ అప్పటి రాష్త్రపతి శంకర్ దయాళ్ శర్మ గారిని కలిస్తే ఆయన "నేను బాగా ఆలోచించాకనే రెండుసార్లు తిరస్కరించాను,వెళ్ళి రండి" అని చెప్పి పంపించేశాడు.అది రాత్రి 9 గంతలకు జరిగింది.ఇక నిరాశతో కార్లు ఎక్కబోతూ ఉండగా ఒక మహిళా న్యాయవాది "సుప్రీం కోర్టు జడ్జి ఇంటికి వెళ్ళి రాష్ట్రపతి మన పిటిషన్ గురించి సానుభూతితో పరిశీలిస్తామని చెప్పారని అబద్ధం చెబుదాం.విషయం పరిశీలనలో ఉంది కాబట్టి ఉరిని ఒక వారం వాయిదా వెయ్యమని అడుగుదాం"   అనేసరికి రాత్రి పది గంటల కల్లా ఒక సుప్రీం కోర్టు జడ్జి ఇంటికి వెళ్ళి అంత పచ్చి అబద్ధమూ తడుముకోకుండా చెప్పేశారు.ఆయన నేను ఒక్కణ్ణీ నిర్ణయం తీసుకోలేను.కనీసం ఇద్దరయినా ఉండాలి అంటే అప్పటికప్పుడు ఈ బృందం మరో జడ్జి ఇంటికి వెళ్ళి ఆయనకీ అబద్ధం చెప్పి తీసుకొచ్చారు.ఇద్దరు న్యాయమూర్తులూ కలిసి చర్చించుకుని ఏప్రిల్ 5వ తేదీ వరకు ఉరి తియ్యవద్దని ఆదేశాలు జారీ చేశారు.అప్పుడు వీళ్ళు కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఆదేశాలు చూపిస్తే ఆయన ఆంధ్రప్రదేశ్ హోం సెక్రెటరీకి చెప్పాడు.ఆయన గోదావరి జిల్లా కలెక్టరుకి చెప్పాడు.ఆయన చెప్పగా రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ఉరిని ఆపేశారు.ఇంకా వీళ్ళ నాటకాలు అయిపోలేదు -ఇప్పుడు జరిగింది ఉరిని వాయిదా వేయించడమే కదా!మళ్ళీ ఉరి తీసే సమయానికి దేవెగౌడ ప్రభుత్వం కూలిపోయింది.రాష్ట్రపతి దానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉండటంతో మళ్ళీ ఈ బృందం సుప్రీం కోర్టు జడ్జిలను కలిసి ప్రస్తుతం రాష్త్రపతి బిజీగా ఉండటం వల్ల నిర్ణయం తీసుకోలేకపోతున్నారని మరో అబద్ధమాడి ఇంకో మూడు నెలలు వ్యవధి అడిగి సాధించుకున్నారు.ఆ గడువు ముగిసే సమయానికి శంకర్ దయాళ్ సర్మ పదవీకాలం ముగిసి కే.ఆర్.నారాయణన్ రాష్ట్రపతి అయ్యారు.ఆయనకి "మీరు దళితులై ఉండి దళితుడికి క్షమాబిక్ష పెట్ట్టకపోతే ఎలా?"అని పొడి వేసి యావజ్జీవ శిక్షగా మార్పించారు.వీళ్ళు అంత కాలం పాటు దేశాధినేతలతో ప్రధాన న్యాయమూర్తులతో అబద్ద్ఘాలు చెప్పి ప్రాణాలు రక్షించినవాడు కనీసం సమసమాజ స్థాపన కోసం పాటుపడుతున్న నక్సలైట్ యోధుడు అయినా బాగుండేది - ఎవరినో ఒకరిని చంపాలనే వెర్రి ఆవేశం తప్ప వాళ్ళని చంపడానికి సరైన కారణం కూడా లేకుండా 23 మంది ప్రాణాల్ని అగ్నికీలలకి ఆహుతి చేసిన దుర్మార్గుడి కోసం చేశారు అన్ని నీచమైన పనుల్ని!ఒకే ఒక ప్రశ్న,"బ్రాహ్మణులు పుట్టుకని బట్టి కొన్ని కులాల్ని అణిచివేయ్యటానికి కులవ్యవస్థని ఉపయోగించుకోవటం అన్యాయం" అంటున్న ప్రబుద్ధులు మరి ఒక నేరస్థుణ్ణీ పుట్టుకని బట్టి అన్ని నీచమైన పనులు చేసి ఎందుకు రక్షించారు?

          వీళ్ళకి సిగ్గూ శరమూ ఉండవా అని అడక్కండి, ఆ అవకాశం రాదు.ఎందుకంటే,వీళ్ళు తెలివైన వాళ్ళకి దూరంగా ఉంటారు - కొంచెం కొత్తగా కనబడితే చాలు ఎంత చెత్తనైనా నెత్తికెత్తుకునే దేభ్యం మొహాలే వీళ్ళకి దొరుకుతారు - రోహిత్ లాంటివాళ్ళు!ఎదటివాళ్ళు తెలివైన వాళ్ళు అని తెలిస్తే వాళ్లకి దూరంగా ఉందటం వీళ్ళు తీసుకునే జాగ్రత్త.కాబట్టి దొరికిపోయి సిగ్గుపడాల్సిన అవసరం వీళ్ళ కెప్పుడూ రాదు.వీళ్ళు ఎప్పుడూ పాడే పాట "ఈ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ వల్లనే ఎంత ప్రయత్నించినా మీరు ముందుకెళ్ళలేకపోతున్నారు.దీన్ని ఇట్లా అమిర్చి పెట్టింది బ్రాహ్మణులే.బ్రాహ్మణాధిపత్యాన్ని కూలదోసి దళిత రాజ్యం స్థాపిస్తే గానీ మీ సమస్యలు తీరవు" అని. ఎక్కడ లేదు నిచ్చెన మెట్ల అమరిక?మన చుట్టూ ఉన్న Eco System యెట్లా ఉంది!ప్లాంక్టాన్ దగ్గిర్నుంచి మహావృక్షాల వరకూ క్లోరోఫిల్ ఉన్న స్వయంపోషకాలు,వీటిని తిని బతికే శాఖాహారులు,వీటిని తిని బతికే మాంసాహారులు -ఇదొక పిరమిడ్.కింద ఉన్న స్వయంపోషకాలు 1000 ఉంటే వాటిపైన 100 శాఖాహారులు వుంటాయి,మళ్ళీ ఈ శాఖాహారుల మీద ఆధారపడిన 10 మాంసాహారులు ఉంటాయి.మాంసాహారులు లేకపోతే శాఖాహారులు కింద వరస నంతా నాకేసి స్వయంపోషకాలు పూర్తిగా మాయమైపోయి వీటిని తిని బతికే శాఖాహారులు  కూడా మాయమై పోతాయి  అంతా శూన్యం!అందుకే ఒకటి పెరిగితే మరొకటి దీన్ని తగ్గిస్తూ ప్రకృతి ఎప్పుడూ సమతౌల్యాన్ని పాటిస్తుంది.సమ సమాజం అంటే మనుషుల్ని అతిగా పెరిగిన కొమ్మల్ని కత్తిరించి క్రోటను మొక్కల్లా ఒకే లెవెల్లోకి తీసుకొచ్చి నిలబెట్టడం కాదు ప్రకృతి చేస్తున్నట్టే అన్ని అర్గాల మధ్యనా సమతౌల్యాన్ని సాధించటం - తమ వర్గరహితసమాజం కాన్సెప్టుని ఒప్పుకోనివాళ్లని వర్గశత్రువులుగా ప్రకటించేసి సాయుధపోరాటంతో వాళ్లని చంపేసి మిగిలిన వాళ్ళకి ఇదే వర్గరహితసమాజం అని మోళీ చెయ్యాలని చూసేవాళ్లకి ఇదెప్పటికీ అర్ధం కాదు!

          అసలు కులవ్యవస్థ బ్రాహ్మణులు అందరికన్నా పైన ఉండి నిర్మించినది కాదు.వాళ్ళు కూడా అందులోని ఒక భాగమే!కులవ్యవస్థ అనేది రాజ్యం ఏర్పడి వ్యవసాయం,వ్యాపారం బాగా వృద్ధి అయ్యాక అవి లాభసాటిగా మారిన తర్వాత ఆయా వృత్తులకి సంబంధించిన ఆదాయం మీద మోనాపలీ కోసం కొన్ని తరాల పాటు ఒకే వీధిలో నివసించటం వాళ్లలో వాళ్లే పెళ్ళిళ్ళు చేసుకోవటం లాంటి పద్ధతుల ద్వారా నడిచిన వ్యవహారం.సొంతంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే వృత్తుల్ని ఆధారం చేసుకుని మిగిలిన కులాలు సర్దుకున్నాక బ్రాహ్మణులకి ప్రత్యేకంగా ఆదాయం తెచ్చిపెట్టే వృత్తి ఏదీ లేకపోవటంతో జీవిక కోసం మిగిలిన కులాల మీద ఆధారపడాల్సి వచ్చింది.నాలుగు వర్ణాల్లోనూ బ్రాహ్మణ వర్ణమే బ్రాహ్మణ కులంగా ఏర్పడి మిగిలిన ఏ వర్ణమూ కులంగా మారకపోవటమే దీనికి సాక్ష్యం!మొదట్లో దానశాసనాల ద్వారా భూమికి హక్కుదారులై వ్యవసాయం చేసినా తర్వాతి కాలంలో మిగిలిన కులాలకి వ్యవసాయాన్ని ఇచ్చేసి యాచనకీ కర్మకాండకీ సెటిలై పోయిన తెలివి తక్కువ వాళ్ళు బ్రాహ్మణులు!వీళ్ళు ఏ స్వార్ధమూ లేకుండా వైదిక వాజ్మయాన్ని దాచకపోతే ఇవ్వాళ గొప్పగా చెప్పుకోవడానికి మనకి గుండుసున్నా మిగిలి ఉండేది - దానికి కూడా తిట్లు తింటున్నారు వీళ్ళు!బుద్ధుడి కాలం గురించి నిక్కచ్చిగా వర్ణించిన హిస్టారికల్ బుద్ధ రచయిత కులవ్యవస్థ పూర్తి ఆకారం తీసుకున్న అప్పటి కాలంలో కూడా కులాలు స్థిరంగా లేవనీ ఒక కులం నుంచి ఇంకో కులానికి మారడం కూడా ఉన్నదనీ చెప్పాడు - నమ్మాలి!

          కులాలు అంతరించిపోతాయి అని ఎవ్వరూ భ్రమల్లో మునిగి తేలకండి.ఎందుకంటే ప్రతి కులానికీ ఒక చరిత్ర,గొప్పదనం,సాహిత్యం ఉన్నాయి!"ఆఖరి చర్మకారుని మీద దాక్యుమెంటరీ" అని కొన్ని నెలల క్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ఒక కధ చదివాను.అందులో విదేశాల్లో మంచి పొజిషనులో ఉన్న ఒక మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తి తమలో తరతరాల నుంచీ వస్తున్న సంగీతకళకి సంబంధించిన వారసత్వాన్ని చాలా అత్మీయంగా కొనసాగిస్తుండటం గురించి రాశారు.అలా తమ కులంలోని ఒక విశిష్టతని గురించి గర్విస్తున్న వాళ్ళు కాల్పనిక వ్యక్తులు కాదు - వాస్తవ వ్యక్తులే!నేనయితే కులాలు మాయమై పోవాలని కోరుకోవడం లేదు.నదీనాం సాగరో గతిః అన్నట్టు కులానికి సంబంధించిన సామాజిక న్యూనతా భావం లేకపోతే అన్ని కులాలూ గొప్పవే.కులాలు మాయమై పోవడం కాదు ప్రతి కులమూ జవజీవాలతో తొణికిస లాడుతూ ఉండాల్సిందే!

          అంతకుముందు కాంగ్రెసు ఒక పదేళ్ళు పరిపాలించి దేశపు ఆర్ధికశక్తిని ఛిన్నాభిన్నం చేసేటంత స్థాయిలో కుంభకోణాలు చేసి అవినీతితో గబ్బు పట్టిపోయి అప్పటికే జనం ఛీకొడుతున్నారనీ మళ్ళీ అధికారం  హుళక్కేయేనని తెలిసిపోయినా, అంతకు పదేళ్ళ క్రితమే  తెలంగాణ ఇస్తానని వాగుదానం చేసినా దాన్ని ఇన్నేళ్ళూ మతిమరుపు చెరువులో కలిపేసి, ఇప్పుడు వస్తే ఇస్తానంటున్న భాజపాకి ఆ చాన్సు దక్కనివ్వకూడదనీ తనకి వాళ్ళు ఇవ్వటానికి పెట్టిన కండిషన్ అయిన ఆర్టీకిల్ మూడు ప్రకారం బిల్లును నెగ్గించుకోవడానికి తగిన మెజార్టీ కూడా లేని దిక్కుమాలిన స్థితిలో ఉన్నానని తెలిసితెలిసీ ఎన్నికలకి ముందే తెలంగాణ ఇచ్చిపారెయ్యాలని తీర్మానించేసుకుని, అదృష్టం కలిసొస్తే ఆ ఒక్క మంచిపనితోనే  పదేళ్ళ పాతతప్పులన్నీ దేశం మొత్తం జనం మర్చిపోయి తనకి మళ్ళీ అధికారం కట్టబెట్టవచ్చుననే దురాశతో పరమ దౌర్భాగ్యమయిన పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొడితే - ఆ విబఃజన వల్ల ఫలితం అనుభవించే వాళ్ళే గాకుండా వీళ్ళు అంత సొంపుగా చేసిన విభజన తంతుని చూసిన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకీ అంతకుముందుకన్నా మూడింతలు కాలిపోయి కాంగ్రెసుని కొనవూపిరితో మాత్రం మిగిల్చి అటువైపున ఉన్న మోదీకి గుజరాత్ రాస్ట్రాన్ని అవినీతికి అతీతంగా పరిపాలించిన మంచిపేరూ ఆయన సమకూర్చుకున్న ప్రచారవ్యూహమూ కలిసొచ్చి అఖండమైన మెజార్టీ వచ్చినప్పటి నుంచీ ఈ దేశపు వామపక్ష మేధావుల్లోనూ కాంగ్రెసు పార్టీలోనూ ఇంకా వీరిద్దరి మిత్రపక్షాల లోనూ అసహనం తెగ పెరిగిపోయింది.

          దీనికి తోడు అన్ని విశ్వ విస్యాలయాల్ల్లోనూ ఉన్న వామపక్ష బావజాలం ప్రభావంతో ఉన్న ఎమినెంట్ ప్రొఫెసర్ల బండారం బయటపడి మెడలు పట్టి గెంటించుకునే దిక్కుమాలిన స్థితి దాపరించింది.రోమిల్లా ధపార్ అత్యుత్సాహంతో ఒక జీవిత కాలం పాటు ప్రచారం చేసిన "స్థానికులైన ద్రవిడుల మీద నూతనులైన ఆర్యుల దాడి" సిద్ధాంతం డుల్లిపోయింది.అయోధ్య కేసులో సాక్ష్యానికి వెళ్ళిన వాళ్ళని అలహాబాద్ హైకోర్టు అడిగిన మామూలు ప్రశ్నలకే సరైన జవాబులు చెప్పలేక నీళ్ళు నమిలారు.మెల్లమెల్లగా వారిని అర్హత లేకుండా అధిష్టించిన ఆచార్యపెఠాల నుంచి లాగిపారెయ్యటం మొదలయ్యింది.అదేమని గట్టిగా వ్యతిరేకించడానికి గొంతు పెగలటం లేదు, కొత్త తప్పులు నయటపడతాయేమోనని భయం కాబోలు - కిక్కురుమనకుండా తప్పుకోవలసి వస్తున్నది పాపం!ఇన్ని దశాబ్దాల పాటు దేశం మొత్తం మీద అక్కడొక వోటు ఇక్కడొక వోటు అన్నట్టున్న వామపక్షాలు ఇంతకాలం బతికి బట్టగట్టడానికి ఎలాంటి పీఠాధిపతులే కారణం గనుక భవిష్యత్తుని తల్చుకుని మరింత బెంగ పట్టుకుంది!

          మోదీ ఒక్కడే కాదు అమాయకంగా తమకి మంచి భవిష్యత్తుని కోరుకుని భాజపాకి అనుకూలంగా వోటు వేసిన ప్రతివాడూ వీళ్ళ దృష్టిలో కరుడు గట్టిన మతతత్వవాది ఐపోయాడు.అప్పటి వరకూ స్సవిత్రి గురించి సొల్లుకబుర్లు చెప్పే సరదామనుషులు కూడా ఎర్రబడిపోయారు.దేశంలో ఎక్కడ ఏం జరిగినా అది మోదీయే పురమాయించి చేయిస్తున్నట్టు ఆవేశంతో వూగిపోతున్నారు.ఎప్పటిదో అయిన గోద్రా అల్లర్లని ఇప్పటికీ కధలు కధలుగా సంవత్సరం గడిచింది రెండు సంవత్సరాలు గడిచాయి అని లెక్కలు చెప్పి బుర్రలు తింటున్నవాళ్ళు మాల్డా గురించి నోరైనా మెదపరేం!సైద్ధాంతికంగా విభేదించినా ఈ దేశప్రజలకి ప్రతింధి కాబ్ట్టి కనీస మర్యాదల్ని పాటించాలి.ఒకప్పుడు పి.వి.నరసింహా రావు గారికి దౌత్యపతంగా ఒక సున్నితమైన సమస్య వచ్చింది.దానికి ఆయన వాజపేయి గారిని ఎన్నుకున్నాడు.నా పార్టీలో ఇంతమంది ఉండగా ప్రతిపక్షం వాణ్ణి ఎన్నుకోవటం దేనికని ఆయనా అనుకోలేదు,ఈ పని నేను చేస్తే అధికార పక్షం మంచిపేరు కొట్టేస్తుంది గాబట్టి నేనెందుకు వెళ్ళాలని ఆయనా అనుకోలేదు - ఇద్దరూ హుందా అయిన వాళ్ళు గనక!కానీ ఈ మధ్యనే ఒక కాంగ్రెసు పెద్దమనిషి మోదీ అధికారంలో ఉన్నంత వరకు భారత పాకిస్థాన్ సంబంధాలు మెరుగు పడవు అని వాగేశాడు - ఇంతకుముందు అద్భుతంగా విరగబడిపోతున్నట్టు, అయినా ఏం మెరుగుపడాలి?ఇన్ని దశాబ్దాలుగా చర్చలతో ఏమి సాధించారని మెరుగుపడటానికి!ఇలా ఉంది వీళ్ళ మనస్తత్వం - కనీసపు ఆలోచన కూడా పోయిన వెర్రితనం!

          నిర్భయ చట్టం లాగ రోహిత్ చట్టం రావాలని కోరుకుంటున్నవాళ్ళు అందులో ఉండాల్సిన అంశాల గురించి చెప్తే బాగుండేది!రోహిత్ మాదిరే అర్ధరాత్రి ఎవడి రూముకైనా వెళ్ళి అపెండిక్సు బద్దలయ్యేట్టు చితకబాదినా MIM చేతిలో తన్నులు తిని పాముకు పాలు పోశాం అని వగచే కాంగ్రెసువారి మాదిరి కుయ్యోమొర్రో అని వూర్కోవాలే తప్ప సుశీల్ కుమార్ చేసీంట్టు కోర్టులో కేసు వేసి ఆత్మహత్యలకి ప్రేరేపించకూడదనే విధంగా ఉంటాయేమో అందులోని సెక్షన్లు!

          ఏ కాలంలో అయినా మనిషికి ఏమి కావాలి?తన కడుపు తను నింపుకునే ఆర్జన!ఒకనాడు భారతదేశంలో ఏర్పడిన కులవ్యవస్థ ఇతర దేశాలలోని బానిసల వ్యవస్థ కంటే భిన్నంగా ఏ కులాని కా కులానికి వారి వృత్తి మీద అధిపత్యాన్ని కట్టబెట్ట్టి ఆదాయం పట్ల భరోసా నిచ్చింది కులవృత్తికి సాటిరాదని వారికి వారే గర్వంగా చెప్పుకున్నారే, ఇంకా ఇంగ్లీషు వాళ్ళు చెప్పిన తప్పుల తదక చరిత్రని నమ్ముతూ అప్పుడెప్పుడో మమ్మంల్ని విద్యకి దూరం చేశారు బ్రాహ్మణులు అందుకే ఇవ్వాళ మేము వెనకబడిపోయాము అంటారు గదా - ఒక మగ్గం పనివాడు తన పని తను చహెసుకోవటానికి మధుచ్చంద సూక్తంతో ఏమి పని?వ్యవసాయం చెయ్యటానికి వేదం చహ్ద్వాల్సిన పని లేదు కదా!వృత్తి విద్యలో నైపుణ్యం కావాలంటే తండ్రి దగ్గిరో మరొకరి దగ్గిరో సహాయకుడిగా చేరి నేర్చుకోవాలి - వీళ్ళ కవసరం లేఎని చహ్దువులు నేర్పలేదని ఏడుస్తారేనంటి?ఇంగ్లీషు వాళ్ళు వచ్చేవరకూ ముస్లిం పరిపాలకులు కూడా ఆర్ధిక మూలాన్ని ఏమాత్రం మార్చలేదు,ఔరంగజేబు కూడా గోవధ నిషేధాన్ని పాటించాడంటే ఎవరయినా నమ్మగలరా?ఇంగ్లీషు వాళ్ళు తమ కొత్తరకం ఆర్ధిక విధానాలతో కొన్నివేల ఏళ్లుగా ఉన్న వ్యవస్థని బద్దలు గొట్టారు.దాని తర్వాతనే భారతీయ సమాజం సంక్షోభానికి గురవడం మొదలైంది.ఇవ్వాళ అమ్న కళ్ళముందున్న సమస్యకి నిన్నటివాళ్లని తిట్టి ఉపయోగ మేమిటి?

          ఇవ్వాళ్టి కులాల కుమ్ములాటలకీ నిరుద్యోగానికీ సంబంధం ఉంది.ఈ నిరుద్యోగానికీ ఇప్పుడు మనం అనుసరిస్తున్న విద్యావిధానానికీ సంబంధం ఉంది.విద్యా ఉపాధి రంగాలలో మూడు ముఖ్యమైన మార్పుల్ని చేస్తే పరిస్థితి కొంత మెరుగు పడవచ్చు.మొదటిది ప్రాదమిక విద్య మాతృభాషలోనే జరగాలి.రోహిత్ వీర విక్రమోపేతమైన విజృంభణకి అతనికి తెలుగు భాష మీద ఉన్న గట్టి పట్టు కారణం అని మీకూ తెలుసు!ఇంగ్లీషు వ్యామోహాన్ని వదులుకుని ప్రపంచంలో ఉన్న ప్రముఖమైన భాష లన్నిట్నీ నేర్పి మన కుర్రాళ్ళని ఎక్కడైనా బతకగలిగే విధంగా తీర్చిదిద్దాలి.రెంవది ప్రతి డిగ్రీకి ఒక ఉపాధిని తప్పనిసరిగా లింకప్ చెయ్యాలి.ప్యూర్ సైన్స్,క్లీన్ ఆర్ట్స్ అనే చెత్త కోర్సులు అనవసరం.వీలుంటే వీటిని మిగతా వాటికి బ్యాక్ ఎండ్ సబ్జక్టులుగా మారిస్తే మంచిది.మూవది ఉపాధి రంగాన్ని ఒకే పెద్ద పిరమిద్ మాదిరిగా కేంద్రీకరించి ఉంచకుండా పది చిన్న చిన్న పిరమిడ్లుగా విగొట్టి వికేంద్రీకరించాలి.వీటివల్ల విద్యలోనూ ఉపాధిలోనూ పోటీ తగ్గి మనుషుల మధ్య పరస్పర సహకారం పెరుగురుంది.

          కులరహిత సమాజం కోరుకునే దళితబ్రాహ్మణశ్రేష్ఠులు అది సాధించాలంటే కులాంతర వివాహాలు చేసుకోవడాన్ని సమర్ధించాలి.కానీ రిజర్వేషన్ల కోటాలో వాటా కావాలంటే కులం శుద్ధంగా ఉండాలి గాబట్టి పైకెదిగిన కులాల వారికన్నా దానివల్ల జరిగబోయే కులసంకరాన్ని మార్పుని వ్యతిరేకించిన ఒకప్పటి బ్రాహ్మణుల కన్నా ఇవ్వాళ అణగారిన కులనేతలే గట్టిగా వ్యతిరేకిస్తారు!రిజర్వేషన్లు ఎత్తెయ్యనిదే కులాల కుమ్ములాటలు పోవు - అది సత్యం!కులాల కుమ్ములాటలు పోనిదే హిందువులు ప్రశాంతంగా ఉండలేరు - అది పరమసత్యం!!హిందువులు ఐక్యంగా ఉండనంతకాలం దేశానికి భద్రత ఉండదు - అది నిష్ఠుర సత్యం!!!

          ఋగ్వేదంలో ఒకచోట దేవీభాగం అనే అద్భుతమైన విషయం గురించిన ప్రస్తావన ఉంది. ఆ భావన లోని గొప్పదనాన్ని గుణదోషాల మధ్య తారతమ్యాలు తెలిసిన ఒక మంచి కమ్యునిష్టు మేధావి "వర్గరహితసమాజం అనే భావనకి మన పూర్వులు చాలా కాలం క్రితమే ఎంతో దగ్గిరగా వెళ్ళినట్లు తెలుస్తున్నది" అని ప్రశంసించారు.

శ్లో|| సంగచ్చద్వం సంవదద్వం
       సంవో మనాసి జానతాం
       దేవీభాగం యధా పూర్వే
       సంజా నానా ఉపాసతే!

          ఋగ్వేదం లోని ఈ మంత్రం యొక్క సారాంశ మిది - "కలిసి నడుద్దాం.కలిసి మాట్లాడుకుందాం.కలిసి మెలిసి ఒకరి మనస్సు లొకరం తెలుసుకుందాం.మన పూర్వులు దేవీభాగాన్ని యెలా పంచుకునేవారో అలాంటి జ్ఞానాన్ని ఉపాసింధుదాం!"దేవీభాగం అంటే - పసిపిల్లలకూ, దంతాలు లేని వృద్ధులకూ మెత్తని మాంసం మొదట ఇవ్వాలి.తర్వాత దౌహృదులకి - రెండు హృదయాలు ఉండే గర్భవతులకి రెట్టింపు మాంసం ఇవ్వాలి.అలా వారందరికీ పంచగా మిగిలిన మాంసాన్ని యువతీ యువకులకీ, జవసత్వాలు గలిగి సంపద పెంచే ఇతరులకీ పెట్టాలి.ఇటువంటి మంచి విషయాలు తెలుసుకుంటే విద్యార్ధుల కైనా ఉద్యోగార్ధుల కైనా ఆత్మహత్య చేసుకోవాలని అనిపించదు, జీవితం మీద ఆశ పుదుతుంది!


సర్వే జనాః సుఖినో భవంతు!

34 comments:

  1. పోస్ట్ ఎన్నో వివరాలతో ఎంతో విశ్లేషణతో అద్భుతంగా రాశారు హారిగారు, ధన్యవాదాలు. నా అనుమానం కూడా ఇదే - రోహిత్ గొడవతో ప్రయోజనం పొందుదామని, గొడవని పెంచి సజీవంగా ఉంచాలని ఆ రాజకీయ పార్టీలు సమస్య పరిష్కారం కాకుండా చూశాయి. విద్యార్థులు చస్తే వాళ్ళకెందుకు, వాళ్ళ ప్రయోజనాలు ముఖ్యం కాని. వీళ్ళకు వంత పాడేందుకు ఈ సూడో మేధావులు, మీడియా ఎలాగూ రెడీ గానే ఉన్నాయి. ఇంకేం, అన్నిటికీ పాపాల భైరవుడు మోడీ అని మోత లేపడానికి వాళ్ళకు మంచి అవకాశంగా రోహిత్ ఆత్మహత్య పనికి వచ్చింది.

    ReplyDelete
  2. Many of the media reports talk about the five reminders the HRD ministry sent to the university about the action taken on Dattatreya's letter, as a proof of government's intentions to punish Rohit/dalits. I have worked in the Central secretariat in Delhi for 7 long yars and I know this for sure - Central ministers and elected representatives like MPs are categorized as VIPs and any requests/correspondence from them has to be properly acknowledged and be given replies. In every ministry they have a special section that deals with the VIP correspondence. The reason is - there have been many instances in the past where the representation/requests from elected representatives have been confined to trash, for which the officers were given stern warnings, and in some rare cases punishments. The elected representatives can move privilege motions against the concerned departments which can have serious consequences. As many of us know, these privilege motions are within the exclusive purview of the legislature and the courts can not intervene in them. To be fair to our elected representatives, they rarely use this privilege to deliver punishments - most of the time they serve warnings or administer reprimand.

    ReplyDelete
  3. Nagewara rao
    Many of the media reports talk about the five reminders the HRD ministry sent to the university about the action taken on Dattatreya's letter

    haribabu
    అసలు ఆ వ్యవహారం మొత్తం పెద్ద ఫార్సు.గొడవని మీడియాలో సాగదియ్యటానికే తప్ప వాటివల్ల ఏమీ కాదు.అదంతా సాంకేతికంగా కరెక్తే అని తెలిశాక్ ఇప్పుడు కంచె అయిలయ్య ఆ లెటర్ పాడ్ మీద రాయాల్సింది ఈ లెటర్ పాడ్ మీద రాశాదేమిటి అని కొత్త పాట ఎత్తుకున్నాడు.ఆరున్నొక్క రాగానికైనా శృతి ఉంటుందేమో గానీ వీళ్ళ మతి లేని ఏడుపుకి గట్టి పాయింతే లేకుండా పోయింది:-)

    మతి లేమి మాటా శృతి లేని పాటా:-(

    ReplyDelete
  4. కూతురుకు కులాంతర వివాహం చేశాడని మంత్రినే వెలేశారు

    http://www.andhrajyothy.com/Artical?SID=204009

    బాలాసోర్(ఒడిశా): అన్య కులానికి చెందిన వ్యక్తితో కుమార్తెకు వివాహం జరిపించిన ఓ మంత్రిని ఆ కులపెద్దలు ఊరినుంచి బహిష్కరించారు. అంతేకాదు అతనికి అండగా నిలిచిన వారిని సైతం వెలేశారు. సాక్షాత్తూ ఓ మంత్రినే వెలివేశారనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒడిశా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి(గిరిజన సంక్షేమ), క్రీడలు, యూత్ సర్వీస్ శాఖా మంత్రి సుదమ్ మరాండీ సంతాల్ గిరిజన తెగకు చెందిన వారు. డాక్టరైన తన కుమార్తె సంజీవనిని బిజూ జనతాదళ్ స్టూడెంట్ నాయకుడు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సునీల్ సరంగికి ఇచ్చి గతనెల 31 భువనేశ్వర్‌లో ఘనంగా వివాహం జరిపించారు. ఈ పెళ్లికి అతిరథ మహారధులందరూ హాజరయ్యారు. అంతవరకు బాగానే ఉన్నా.. తర్వాతే అసలు కథ మొదలైంది. మంత్రి తన కుమార్తెకు కులాంతర వివాహం జరిపించిన విషయం తెలుసుకున్న ఆ తెగ పెద్దలందరూ శుక్రవారం బంగ్రిపోసి పట్టణంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెగపెద్ద మాట్లాడుతూ సంతల్ తెగలో కులాంతర వివాహాలకు తావులేదని తేల్చిచెప్పారు. ఇది ముమ్మాటికీ కుల కట్టుబాట్లను వ్యతిరేకించడమేనని ముక్తకంఠంతో ఆక్షేపించారు. మంత్రి చేసిన తప్పునకు శిక్షగా అతడిని కులం నుంచి, ఊరునుంచి వెలివేశారు. అంతేకాదు అతనికి అండగా నిలిచిన మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన ముగ్గురు గ్రామస్తులను కూడా వెలేశారు. దేశంలో సంతల్ తెగ మూడో అతిపెద్ద గిరిజన తెగ. జార్ఖండ్, పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశాలలో వీరు నివసిస్తుంటారు.


    మంత్రి మరాండీ గిరిజన నాయకుడు. గతంలో ఎంపీగానూ పనిచేశారు. 2014లో ఆయన బీజేడీలో చేరారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. విచిత్రం ఏంటంటే.. గతంలో మాజీ మంత్రి చైతన్య ప్రసాద్ మాంఝీ ఇద్దరు కుమార్తెలు కులాంతర వివాహం చేసుకున్న సమయంలో మరాండీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు గిరిజనులు కులాంతర వివాహం చేసుకుంటే వారిని కులం నుంచి, గ్రామం నుంచి బహిష్కరించాలని స్వయంగా ఆయనే ఆ తెగ పెద్దలను కోరారు. అయితే భవిష్యత్తులో అదే తన తలకు చుట్టుకుంటుందని ఊహించలేకపోయారు. ప్రస్తుతం ఆయన బహిష్కరణకు గురవడంతో ఆయనతోపాటు కుటుంబ సభ్యులంతా తలలపట్టుకున్నారు

    ReplyDelete
  5. హరి బాబు గారు

    ఈ వ్యాసం చాలా బాగా రాశారు. పై వార్త ఈ టపాకు ఉపయోగపడుతుంది. మీ బ్లాగు లో టపాలకు లేబుల్ పెట్టండి. ఉదా|| కమ్యునిజం,రంగనాయకమ్మ, నెహ్రు .... పాత టపాలు చూసేటప్పుడు సులభంగా ఉంట్టుంది.

    ReplyDelete
  6. UG SriRam
    మీ బ్లాగు లో టపాలకు లేబుల్ పెట్టండి.
    haribabu
    లేబుల్ ఎలా పెట్టాలి?అడ్మిన్ మెనూతో నాకంతగా పరిచయం లేదు.ఏదో ఒక ఆలోచన రాగానే టపా తయారు చెయ్యడమే తప్ప ఈ అడ్మిన్ ప్యానెల్ ఏ సౌకర్యాలు ఇస్తుందో తెలీదు.

    నిజమే,ఓకేలాంటి విషయానికి సంబంధించినవి గ్రూప్ అయితే విజిటర్లకి చూడటమూ సులువే!

    ReplyDelete
    Replies
    1. After login to blog, left side menu will show below

      1 Overview 2 Posts 3 Pages 4 Comments
      5 Google+ 6 Stats 7 Earnings 8 Campaigns
      9 Layout 10 Template 11 Settings

      click on Layout option. Now you can see sidebar-right-1 -> Add a Gadget
      click on Add a Gadget button. U will find Lables, Blog Archives etc .,





      Delete
  7. Superb, apart from your detailed, investigative ability in analysing various issues re: R, i'm amazed at yr knowledge n command of pure n social sciences, anthropology, myths etc! Hearty congrats!

    ReplyDelete
  8. Nice article... why dont you publish one book?

    ReplyDelete
  9. చాలా క్రొత్త విషయాలు తెలుసుకున్నాను. కృతజ్ఞతలు. ముఖ్యంగా మీ పదునైన పదప్రయోగాలకీ,తర్కపటిమకీ నేను అభిమానిని. మీ వాక్యాలు కొన్ని మరీ పొడవుగా ఉంటాయన్నదొక్కటే నాకున్న ఫిర్యాదు.

    ReplyDelete
  10. చాలా క్రొత్త విషయాలు తెలుసుకున్నాను. కృతజ్ఞతలు. ముఖ్యంగా మీ పదునైన పదప్రయోగాలకీ,తర్కపటిమకీ నేను అభిమానిని. మీ వాక్యాలు కొన్ని మరీ పొడవుగా ఉంటాయన్నదొక్కటే నాకున్న ఫిర్యాదు.

    ReplyDelete
  11. >>>కులరహిత సమాజం కోరుకునే దళితబ్రాహ్మణశ్రేష్ఠులు అది సాధించాలంటే కులాంతర వివాహాలు చేసుకోవడాన్ని సమర్ధించాలి.<<<<

    వర్ణ సంకరం చేయవద్దని భగవద్గీత లో వ్రాసాక వర్ణ సంకరం ఎలా చేయగలరండీ ? కులాలు పోవాలంటే ముందు భగవద్గీత ని నమ్మవద్దు అని చెప్పాలి. ఎవరు చెపుతారు? భగవద్గీత మీదే ప్రమాణం చేస్తూ దానినే నమ్మవద్దని అనలేము. అసలు కులాల మూలం అక్కడనుండే వచ్చినపుడు మీరు అస్సలు ప్రస్థావించనే లేదు. అసలు వ్యాసుడికి ఇచ్చిన భగవాన్ ఋషి: అవార్డు రద్దు చేయాలి లేదా కులాలు మతాలు రద్దు చేయాలి.

    ReplyDelete
    Replies
    1. కులాల మూలం అక్కడనుండే వచ్చినపుడు మీరు అస్సలు ప్రస్థావించనే లేదు.

      ఇది బ్లాగు. ఇక్కడ రాసేవి వ్యాసాలు. అప్పటికి హరిబాబు చాలా పెద్ద వ్యాసాలు రాస్తాడు. ఇంకా ఆయనను కులాల మూలాలు రాయలేదు అంట్టున్నారు, ఒక వ్యాసంలో ఎన్ని విషయాలు రాస్తారు? అలా రాసిన చదివేవారికి ఆసక్తి ఉంట్టుందా? కులాల ములాలు తెలియని అంత అమాయకులు బ్లాగుల్లో ఈ రోజుల్లో ఎవరు ఉన్నారు? మిమ్మల్నే తీసుకోండి బ్లాగులు,ఫేస్ బుక్,గూగుల్ ప్లస్, సారంగా, వాకిలి, తలుపు ఇలా కనిపించిన ప్రతిదాని లో రాసినది చదివి కామెంట్ లు రసూంటారు కదా!ఇంతవరకు కులాల మూలాలు మీకు తెలియనట్లు పిచ్చి ప్రశ్న ను వేసి ఎమి తెలుసుకోవాలనుకొంట్టున్నారు?దాని గురించి హరిబాబు రాసినంత మాత్రాన, పరిష్కారం చూపినంత మాత్రాన కులాలు పోయే పనే ఐతే చరిత్ర లో హరిబాబు కన్నా మిన్నగా రాసినవారు, సమాజం లో ప్రజలతో తిరుగుతు కుల నిర్మూలన కొరకు ప్రయత్నించిన వారు ఎందరో ఉన్నారు. కులాలు ఎమైనా పోయయా?

      చూడు చిట్టి, ప్రశ్నించే ముందు కొంచెం బుర్రను వాడాలి. మంచి ప్రశ్న ఎదో పిచ్చిప్రశ్న ఎదో తెలుసుకొని అడగాలి. తీరిక ఉంది, ఇంట్లో పని లేదు గనుక సోషల్ మీడీయాలో కనిపించిన వారి ప్రశ్నిస్తూంటే, వెర్రివారికి కింద జమకడతారు.

      Delete
    2. neehaarika
      వర్ణ సంకరం చేయవద్దని భగవద్గీత లో వ్రాసాక వర్ణ సంకరం ఎలా చేయగలరండీ ? కులాలు పోవాలంటే ముందు భగవద్గీత ని నమ్మవద్దు అని చెప్పాలి.....

      haribabu
      నేను ఆ మాట చెప్పింది కంచె ఐలయ్య లాంటి "దళితబ్రాహ్మణశ్రేష్ఠులు" అని పిలువంబడువారికి!కులరహిత సమాజం గురించి వాదిస్తున్నవారికే నా సలహా వర్తిస్తుంది,మీకు ఏ అర్ధం తోస్తే ఆర్ధం చెప్పుకుంటూ పోతే ప్రతిదానికీ తోక్ విశ్లేషణలు చెయ్యడం నాకు కష్టం.

      పోస్టు మొత్తం చదివి అర్ధం చేసుకుంటే బావుండేది.కులాలు ఎలా పుట్టాయో క్లుప్తంగా చెప్పాను.అది చరిత్రని చదివి చెప్పిందే తప్ప నా సొంత విశ్లేషణ కాదు.కులవ్యవస్థ పూర్తిగా ఏర్పడిందని చెప్తున్న బుద్ధుడి కాలంలో కూడా మనుషులు ఒక కులం నుంచి ఇంకొక కులానికి మారడం ఉండేదని హిస్టారికల్ బుద్ధా రచయితని ప్రస్తావించి చెప్పాను.కులాలు పోతాయనే భ్రమలు వదలండి అని నా మాటగా నేను చెప్పాను.ఇంక భగవద్గీత మీదా వ్యాసుడి మీదా అక్కసు వెళ్ళగక్కడం దేనికి?

      కులరహిత సమాజం కోసం కులసంకరానికి సిద్ధపడితే ఎవరికయినా మొదట గీతలో చెప్పిన కులస్త్రీలకి జరిగే అవస్థకి సంబంధించిన దృశ్యమే కనిపిస్తుంది. డిల్లీలో సిఖ్ఖుల వూచకోత అనంతరం ఏమి జరిగిందో తెలుసా!నేను విన్నది అప్పటి వరకు పరువుగ అబతికిన పంజాబీ నవ వధువులు టూరిస్టులకి అద్దెభార్యలుగా మారారని - నిజమో కల్పనో మరి! అట్లాంటి వాటికి కూడా సిద్ధపడితేనే కులరహితసమాజం ఆవిర్భవిస్తుంది - అవ్వాబువ్వా కావాలంటే కుదరదుగా:-)

      కొంచెం అర్ధవంతమైన వ్యాఖ్యలు వెయ్యకూదదూ,ప్లీజ్!

      Delete
    3. @Anonymous,

      హరిబాబు రాసినంత మాత్రాన, పరిష్కారం చూపినంత మాత్రాన కులాలు పోయే పనే ఐతే చరిత్ర లో హరిబాబు కన్నా మిన్నగా రాసినవారు, సమాజం లో ప్రజలతో తిరుగుతు కుల నిర్మూలన కొరకు ప్రయత్నించిన వారు ఎందరో ఉన్నారు. కులాలు ఎమైనా పోయయా?

      అంతేనంటావా పొట్టీ ? ఇంట్లో తిని కూర్చోక ఈ మాత్రం దానికి ముద్రగడ నిరాహార దీక్షకి ఎందుకు చేస్తున్నట్లూ ? నువ్వు ఏడవలేకపోతే నేను ఏడవలేను అని చెప్పు అంతేగానీ ఏడ్చేవాళ్ళని ఏడవనివ్వు. హరిబాబు గారు కూడా కులాలుపోతాయని అనడం లేదు కనుక ఎంత పొడుగు వ్యాసం వ్రాసినా అర్ధవంతమైనది కాదు కాబట్టి ఆయన పనిలేకే వ్రాసారంటావా ? ఈ వ్యాసం నుండి ఏమి నేర్చుకోవాలో తెలుసుకోవడం బెటర్ అంటావా ? "అత్తారింటికి దారేది" సీరియల్ చూడడం బెటర్ అంటావా ? నువ్వు ఏది చెపితే అది చేస్తా !

      Delete
    4. @ హరిబాబు,

      మీ మగజాతి మొత్తానికి ఒకటే చెడ్డ అలవాటు ఉంది.వేరు లేకుండా చెట్టు లేదు. మీరు పై పై మందులు వేస్తానంటారు.మేము వేర్లను బాగుచేయాలంటాము.వేరు జోలికి వెళితే చెట్టు చచ్చిపోతుందని మీ భయం. అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు.కులాలు పోవాలంటే వర్ణ సంకరం జరగాల్సిందే !

      ఒక వ్యాసం వ్రాసినపుడు కంక్లూజన్ ఇవ్వాలి. వర్ణ సంకరమా ? కుల మతాల రద్దా ? మీ ఓటు ఎటు ?

      Delete
    5. హరిబాబుగారు,
      పైన వాచస్పతిగారి అభిప్రాయమే నాదీను. వాక్యాలే కాదు, అసలు పోస్టులే చాలా పొడవుగా ఉంటాయి. మీరు చెప్పాలనుకుంది పెద్ద విషయమైనప్పుడు, లేదా విపులంగా సోదహరణంగా చెప్పాలనుకున్నప్పుడు, దాన్ని ఒక సీరీస్‍గా రాయండి. దాని వల్ల విషయాలు కుప్పలుగ పోగుపడి హెవీ ఐపోకుండా ఉంటాయి. సీరీస్‍లో టపాకొక ప్రస్తావన పైన ప్రాముఖ్యత ఇస్తూ వివరిస్తూపోవచ్చు. కుదిర్తే పాతబ్లాగరు తాడేపల్లిగారి టపాల తీరుని పరిశీలించగలరు. చెప్పాలనుకున్న విషయానికి తగ్గ శైలి, బాష, ప్రెసెంటేషన్ ఉండేవి ఆయన టపాలలో. ఆయన వాదనని వ్యతిరేకించేవారు కూడ మెచ్చుకునేలా ఉంటుంది ఆయన ప్రెసెంటేషన్.

      ఇక ఈ పోస్ట్‌లో మీ లేటెస్ట్ కామెంట్ ఆశ్చర్యం కలిగించింది.
      "కులరహిత సమాజం కోసం కులసంకరానికి సిద్ధపడితే ఎవరికయినా మొదట గీతలో చెప్పిన కులస్త్రీలకి జరిగే అవస్థకి సంబంధించిన దృశ్యమే కనిపిస్తుంది" - గీతలో చెప్పిన కులస్త్రీల అవస్థ, లేకపోతే మీరు చెప్పిన పంజాబీ వధువుల అవస్థ ఐనా వచ్చేది ఆ కులంలో మగవాళ్ళు భారీస్థాయిలో నశించినప్పుడు. అది గతిలేని పరిస్థితి. కానీ ఒక కులం వారు ఇష్టపడి ఇంకో కులం వారిని చేస్కుంటే అది పై అవస్థలకి దారి తీయదు.

      Delete
    6. neehaarika
      ఒక వ్యాసం వ్రాసినపుడు కంక్లూజన్ ఇవ్వాలి. వర్ణ సంకరమా ? కుల మతాల రద్దా ? మీ ఓటు ఎటు ?

      haribaabu
      అందుజే పూర్తిగా చదవమన్నది!
      -------------------
      కులరహిత సమాజం కోరుకునే దళితబ్రాహ్మణశ్రేష్ఠులు అది సాధించాలంటే కులాంతర వివాహాలు చేసుకోవడాన్ని సమర్ధించాలి.కానీ రిజర్వేషన్ల కోటాలో వాటా కావాలంటే కులం శుద్ధంగా ఉండాలి గాబట్టి పైకెదిగిన కులాల వారికన్నా దానివల్ల జరిగబోయే కులసంకరాన్ని మార్పుని వ్యతిరేకించిన ఒకప్పటి బ్రాహ్మణుల కన్నా ఇవ్వాళ అణగారిన కులనేతలే గట్టిగా వ్యతిరేకిస్తారు
      ------------------
      మొత్తం పోష్టు కాదు,నువ్వు నేను రాసిన వాక్యంలోని ఒక సగాన్ని మాత్రమే లాగి పీకి పాకం పెడుతున్నావు.రెండో సగంలో ఉన్నది ఏమిటి?

      ఈ కులాలన్నిట్నీ బ్రాహ్మణులు మానెత్తి మీద రుద్దారు అంటున్న దళిత సిద్ధాంతులు ఎటు వైపు ఓటు వేస్తారో తేల్చుకుని రా!-

      Delete
    7. neehaarika
      మీ మగజాతి మొత్తానికి ఒకటే చెడ్డ అలవాటు ఉంది.
      haribabu
      ఒక్క వాక్యాన్ని కూడా సరిగ్గా అర్ధం చేసుకోకుండా ఉన్న కంక్లూజన్ కూడా పట్టుకోలేక బోడి వ్యంగ్యాలు కురిపించటం మీ ఆడజాతి లక్షణమా:-)

      Delete
    8. తెలంగాణా రావాలంటే సోనియా ఇస్తే గానీ రాలేదు. కులాలు పోవాలన్నా సోనియమ్మే రావాలా ? సర్లెండి వేచి చూద్దాం !
      వాళ్ళనీ వీళ్ళనీ అడగమంటున్నారు కానీ వ్యాసకర్తగా కులమతాలు రద్దు చేయాలి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ? మనం అనుకుంటే జరిగిపోతాయా అంటే చర్చే అనవసరం !

      Delete
    9. భగవద్గీతని తప్పుబట్టడం నా ఉద్దేశ్యం కాదు.భగవద్గీతని మార్చలేం కానీ కనీసం చదువు,ఉద్యోగ విషయాల్లోనైనా కులమత ప్రసక్తి రాకుండా చట్టాలు చేయాలి. ఇది పనికిమాలిన బుర్ర తక్కువ పని అంటే మీ మేధస్సుకో నమస్కారం !

      Delete
    10. Anonymous8 February 2016 at 01:29
      ఇక ఈ పోస్ట్‌లో మీ లేటెస్ట్ కామెంట్ ఆశ్చర్యం కలిగించింది.

      మీరు చెప్పిన పంజాబీ వధువుల అవస్థ ఐనా వచ్చేది ఆ కులంలో మగవాళ్ళు భారీస్థాయిలో నశించినప్పుడు. అది గతిలేని పరిస్థితి. కానీ ఒక కులం వారు ఇష్టపడి ఇంకో కులం వారిని చేస్కుంటే అది పై అవస్థలకి దారి తీయదు.

      haribabu
      అది కేవలం ఉదాహరణ మాత్రమే.ఇవ్వాల మనం చూస్తున్న వరకట్నం అనేదానికి ముందు కన్యాశుల్కం ఉందేది.గురజాడ నాటకంలొ అసలు గొడవంతా ఉబ్ధావధాన్లుకి ద్వితీయకళత్రంగా వచ్చే ఆడపిల్లని తక్కువ రేటుకి తెచ్చుకోవటానికే!అప్పుడు ఆడపిల్లని పెళ్ళి చేసుకోవాలంటే మగపిల్లవాడి తరపు వాళ్ళు ఆడపిల్ల తండ్రికి దబ్బివ్వాలి.ఇప్పుడు మగపిల్లవాడి తరపు వాళ్ళు ఆదపిల్లల అతండ్రుల నుంచి వసూలు చేస్తున్ననత దుర్మార్గంగా అప్పుడు ఆడపిల్ల్లల తలిదండ్రులు ఉందేవాళ్ళు.అగ్నిహోత్రావధాన్లు పాత్ర అదే కదా!అంతే ఒకసారి ఆదపిల్లకి విలువ ఏర్పడింది,ఒకసారి మగపిల్లాడికి విలువ ఏర్పడింది.కానీ తమాషా ఏమిటంటే అసలు ఆ క్రయవిక్రయాల మధ్యన రెండు రాకాల పద్ధతుల్లోనూ నష్టపోయింది ఆడవాళ్ళే!

      అన్నీ ఆలోచంచకుండా కులరహితసమాజం,కులసంకరం అంటే మళ్ళీ నష్టపోయేది ఆడవాళ్ళే కావచ్చు - అది మరోరకకంగా జరగవచ్చు!ఇప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నది పురుషపుంగవులే కదా!

      నీహారిక లాంటివాళ్లకి కూడా వాళ్ల గురించి పట్టించుకోకుండా ఆద్రాబాద్రాగా కులసంకరం చేసెయయ్దం ఈష్టమే అయితే నాకూ అభ్యంతరం లేదు - కందకి లేని దురద కత్తిపీటకా:-)

      Delete
    11. neehaarika Q1:వాళ్ళనీ వీళ్ళనీ అడగమంటున్నారు కానీ వ్యాసకర్తగా కులమతాలు రద్దు చేయాలి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ?
      haribabu A1:రెడ్దొచ్చె మొదలాడు అన్నట్టు మళ్ళీ మొదటికొస్తే ఇంక నేను చెప్పేది ఏముంటుంది?కులాల్ కుమ్మూఆతలు ఇవ్వాళ్తి ఉపాధి కల్పనలో ఒన్న కంద్రీకరణ వల్ల వస్తున్నాయి.ఈ ఉపాధి కల్పన లోని వైరుధ్యం అనేది ఇప్పటి విద్యావ్యవస్థ లోని దోషం ఉందని చెప్తూ రెంటినీ పూర్తిగా మారిస్తే గానీ పోవనీ చెప్పాను,చెప్పలేదా?

      neehaarika Q2:చదువు,ఉద్యోగ విషయాల్లోనైనా కులమత ప్రసక్తి రాకుండా చట్టాలు చేయాలి. ఇది పనికిమాలిన బుర్ర తక్కువ పని అంటే మీ మేధస్సుకో నమస్కారం
      haribabu A2:అలాంటి చట్టాలు చేస్తే ఇప్పుడు రిజర్వేషన్ల కోసం ప్రత్యేక వేదికలు పెట్టుకుని వెనుకబాటుతనం కోసం పోరాడుతున్న కులవీరులు ఒప్పుకుంటారా?నువ్వు న అమేధస్సుకి వెయ్యి నమస్కారాలు పెట్టినా ఏమి ఉపయోగం!

      Delete
    12. అవును, కన్యాశుల్కాల కాలంలో కానీ, వరకట్నాల కాలంలో కానీ నష్టపోయింది ఆడవాళ్ళే. ఎందుకంటే అవి వారి ప్రమేయం, వారి ఇష్టాలతో సంబంధం లేకుండా రుద్దబడిన మగవాళ్ళ వ్యవహారం కాబట్టి. కానీ కులాంతర వివాహాలనేవి వారు కోరి ఇష్టపడి చేసుకునేవేగా. దాంట్లో ప్రమాదమేముంది, వారు నష్టపోయేది ఏముంది.

      కులసంకరం మనం చేయటం ఏమిటండీ, మనం చేసేది చేయించేది ఏముంది. కులాంతర వివాహం ఇష్టపడ్డవాళ్ళ వల్ల అది జరుగుతుంది అంతే. దాన్ని సమర్థించటం అంటే దానికి అడ్డుపడకపోవటం. అదీ కులరహిత సమాజానికి ఓ దారి అనుకుంటే ప్రోత్సహించటం (ప్రభుత్వాలు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి వీటికి).

      Delete
    13. ఇపుడు చర్చ మళ్ళీ మొదలుపెట్టాలి.రోహిత్ అమ్మా నాన్నలది కులాంతర వివాహమే,తన పుట్టుక గురించి అసంతృప్తిగా ఉన్నట్లు అతనే వ్రాసాడు కాబట్టి కులాంతర వివాహాలవల్ల గానీ నగదు ప్రోత్సాహాల వల్ల గానీ ప్రయోజనం లేదు.భగవద్గీత ని మార్చి వ్రాయడం సాధ్యపడదు.ఆత్మహత్యలను,వర్గపోరాటాలను నిరోధించాలంటే విద్య,ఉద్యోగ రంగాలలో కుల మత ప్రశక్తి లేకుండా రద్దు చేయడం ఒక్కటే మార్గం !
      ఈ పరిష్కారం అందరి మదిలోనూ ఉన్నది.ధైర్యం చేసి ముందడుగేసే నాయకుడే లేడు.

      Delete
    14. Anonymous8 February 2016 at 02:29
      కులసంకరం మనం చేయటం ఏమిటండీ, మనం చేసేది చేయించేది ఏముంది. కులాంతర వివాహం ఇష్టపడ్డవాళ్ళ వల్ల అది జరుగుతుంది అంతే.

      haribabu
      కులసంకరం,వర్ణసంకరం గురించి ఆవేశపడుతున్నది నేను కాదు,నీహారిక.పోష్తులో నేను దాన్ని గురించి ప్రస్తావించినది - కంచె ఐలయ్య గారు కులరహితసమాజం కోరుకుంటూనే తన కురుమగోల్ల కులం విశ్వవ్యాప్తం కావాలనడం గురించి మాత్రమే!రెందూ ఏకకాలంలో ఎలా సాధ్యపడతాయి అనేది నా సందేహం.అంతకు మించి ఈ గొడవలో నాకు ఆసక్తి లేదు!ఇంకా రిజర్వేషన్లలో వాటా కావాలంటే కులాలు శుద్ధంగా ఉండాలి కదా అనేది మాత్రమే నా వాదన,ఇంకా నన్ను కులసంకరం గురించి మాట్లాడానని సాగదీస్తే నేనేమి చెయ్యగలను?

      ఇష్టాపూర్తిగా వివాహాలు జరిగితే సమస్యలు ఉందవు నిజమే!బహిరంగ ముద్దుల కార్యక్రమానికీ ఇష్టాపూర్తిగానే వచ్చారు అమ్మాయిలు కూడా,కానీ ఏమైంది?సంవత్సరం తర్వాతో రెందేళ్ళ అత్ర్వాతో ఆ కార్యక్రమ నిర్వాహకులు ఒక బ్రోతల్ కేసులో ఇరుక్కుని కనపడిందీ, ఉత్సాహంగ పాల్గొన్నవాళ్లలో కొందర్ని అందులోకి దించింది.అలా జరగదని రూలేమైనా ఉందా?

      తమిళనాడులో ఆమధ్యన ఒక పురుషాగ్రణి తాళితెంపుడు కార్యక్రమం పెడితే కొందరు విప్లవ మహిళలు అత్యుత్సాహంతో పాల్గొని పటపటా తమ తాళిబొట్లని తెంచేశారు.అది జరిగింది ఉదయం.అదే పెద్దమనిషి అదే రోజు సాయంకాలం ఒక పెళ్ళికి హాజరై సంప్రదాయ బద్ధంగా పెళ్ళికూతురికి తాళి ప్రదానం చేశాడు!

      అలా కూడా జరగొచ్చు అనాలోచితంగా చేస్తే అని నా ఉద్దేశం,ఇంతకు మించి నేను చెప్పగలిగింది లేదు.నీహారిక మొదలుపెట్టాలన్న రోహిత్ తలీదండ్రుల ప్రస్తావనతో ఉన్న చర్చ పట్ల నాకు ఆసక్తి లేదు.

      Delete
    15. *తమిళనాడులో ఆమధ్యన ఒక పురుషాగ్రణి తాళితెంపుడు కార్యక్రమం పెడితే *

      అతను వీరమణి అయ్యుంటాడు. తలతోకలేని సిద్దాంతం తో టివి లో రాద్దాంతం చేస్తూంటాడు. ఆయన పార్టి అధినేత కొడుకు స్టాలిన్ ఇంట్లో తాళ్లి బొట్టు కట్టి పెళ్ళి జరుపుకొంటే, ఈయన పోయి ద్రవిడ సిద్దాంతం చెప్పి ఎందుకు తాళి తెంపించలేకపోయాడో మరి. పెరియార్ పెద్ద నాయకుడైనట్లు డబ్బా కొడుతూంటాడు. అందరు దేశ స్వాతంత్రం కొరకు పోరాడితే ద్రవిడ నాయకులు కుల పోరాటాలు చేశారు :)

      Delete
    16. కులరహిత సమాజం కోసం కులసంకరం గురించి ప్రస్థావించింది నీహారికగారే. కానీ ఆ ప్రస్తావనలో సమస్యలుంటాయనే హెచ్చరిక మీదే కదా. మీరు ప్రస్థావించిన ఆ సమస్యల గురించే నేను చర్చించాను. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇష్టపడి తీసుకునే నిర్ణయాల్లో తప్పులు తప్పటడుగులు ఎప్పుడూ ఉంటాయి. అందుకని అలా నిర్ణయాలు తీస్కోవటం రిస్కని డిస్కరేజ్ చేయలేం కదా.

      ఇక రోహిత్ అమ్మానాన్నల వివాహం గురించి చర్చించాలని నాకూ ఆసక్తి లేదు. బ్లాగ్‍కర్తగా మీకు ఆసక్తి లేని విషయాల పైకి చర్చని మళ్ళించటం నా అభిమతం కాదు. కానీ నీహారికగారు లేవనెత్తి వారి కేస్ ద్వారా కులాంతర వివాహాల వల్ల ఉపయోగం లేదని కంక్లూషన్ కూడ తీసారు కాబట్టి చిన్న విషయం చెప్తాను. రోహిత్ అమ్మానాన్నలది ఒకరి కులాల గురించి ఒకరికి స్పష్టమైన అభిప్రాయంతో చేస్కున్న వివాహం కాదు. రోహిత్ తండ్రి అతని తల్లిది తన కులమే అనుకుని చేస్కున్నాడు. కాదని తెలిసాక గొడవలు పడ్డారు. ఇది ఏ రకంగానూ కులాంతర వివాహం కాదు.

      Delete
    17. Anonymous8 February 2016 at 23:07
      కానీ ఆ ప్రస్తావనలో సమస్యలుంటాయనే హెచ్చరిక మీదే కదా. మీరు ప్రస్థావించిన ఆ సమస్యల గురించే నేను చర్చించాను. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇష్టపడి తీసుకునే నిర్ణయాల్లో తప్పులు తప్పటడుగులు ఎప్పుడూ ఉంటాయి. అందుకని అలా నిర్ణయాలు తీస్కోవటం రిస్కని డిస్కరేజ్ చేయలేం కదా.

      haribabu
      వ్యక్తిగత చొరవతో వాళ్ళంతట వాళ్ళు ఇష్టపడితే ఎవ్వర్నీ దిస్కరేజి చెయ్యలేం,ఆ అరకంగా చొరవ చూపినచడానికి ప్రోత్సహించినా తప్పు లేదు.కానీ మరొక కామెంటులో ప్రస్తావించినట్టు దాన్ని కులరహితసమాజం ఏర్పరచడం అనే పేరుతో బహిరంగ ముద్దుల కార్యక్రమం మాదిరిగానో తాళితేంపుదు కార్యక్రమం లాగానో చెస్తే?నేను హెచ్చరించినది అలాంటి వాటి గురించి,అనాలోచితంగా/అన్నీ ఆలోచించకుండా అనే మాట ప్రతి చోటా వాడాను కొంచెం పరిశీలించండి.

      Delete
  12. neehaarika
    ఒక వ్యాసం వ్రాసినపుడు కంక్లూజన్ ఇవ్వాలి. వర్ణ సంకరమా ? కుల మతాల రద్దా ? మీ ఓటు ఎటు ?

    వ్యాసకర్తగా కులమతాలు రద్దు చేయాలి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ? మనం అనుకుంటే జరిగిపోతాయా అంటే చర్చే అనవసరం

    చదువు,ఉద్యోగ విషయాల్లోనైనా కులమత ప్రసక్తి రాకుండా చట్టాలు చేయాలి. ఇది పనికిమాలిన బుర్ర తక్కువ పని అంటే మీ మేధస్సుకో నమస్కారం !

    haribabu
    కూతురుకు కులాంతర వివాహం చేశాడని మంత్రినే వెలేశారు

    http://www.andhrajyothy.com/Artical?SID=204009

    P.S:అక్కడ ఆ పని చేసింది అగ్రకులం వారు కాదు కదా!నిమ్నకులాల వారే ఆ మనస్తత్వంలో ఉంటే అగ్రకులం వాణ్ణి నేను కులాంతర వివాహాల్ని సమర్ధించినా ప్రయోజనం ఏముంది?

    నేను పెళ్ళి చేసుకున్నదీ ఇష్టపడే,కాకపోతే మనస్సు మేనమామ కూతురు మీద పడింది.మరో కులం అమ్మాయిని ఇష్టపడి ఉంటే?కులాంతరమే అయిఉండేదేమో!

    ReplyDelete
  13. ఇక్కడ ఒకరిద్దరు కాంగ్రెస్, కమ్యూనిస్టుల మాదిరే - ఈ ఆత్మహత్య వ్యవహారాన్ని కులానికి ముడిపెట్టి అసలు టాపిక్ ని ప్రక్కతోవ పట్టిస్తున్నట్లు తోస్తోంది. నా మట్టిబుఱ్ఱకి అర్థమైనంతవరకూ - ఇది ఒక యువ, అపరిణత ఓవరాక్షన్ కేండిడేటు ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కుని, "అందులోంచి బైటపడలేనేమో" ననే నిస్సహాయ నిస్పృహా మనఃస్థితి ఆవరింౘగా, భవిష్యత్తు అంధకార బంధురంగా గోచరించి కృంగిపోయి చేసుకున్న ఓ ఆత్మహత్య తాలూకు వ్యక్తిగత వ్యవహారం.

    ReplyDelete
  14. This comment has been removed by the author.

    ReplyDelete
  15. We can understand the mindset of these union from the below article.

    http://www.sakshi.com/news/opinion/we-spend-three-hours-with-rohits-friends-in-hcu-310685

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...