Monday 1 February 2016

నీ ప్రేమ నాకు భవరాగ బంధమోక్షణం!శ్రీ రుక్మిణీనాధ, నీ ప్రేమ నాకు దివ్యౌషధం!

పల్లవి:నీ ప్రేమ నాకు భవరాగ బంధమోక్షణం!
            శ్రీ రుక్మిణీనాధ,నీ ప్రేమ నాకు దివ్యౌషధం!

చరణం 1:  ఆలుబిడ్డలు అన్నదమ్ము లైనాను
                   బ్బుదస్క ముంటేనె ఇష్టంగ వస్తారు
                   డబ్బు లేని కాలాన దూరంగ పోతారు
                   నన్ను మెచ్చనివారి రాకపోకలు లెక్కజెయ్యను
                   నువ్వు నాకు దూరమైతేనె నీరసించి అణగారి అల్లాడిపోతాను - హరిఓం!
||పల్లవి||
చరణం 2:  చచ్చీ చావక బతికే బానిసీడులు కొందరు
                   చచ్చీ చావక నిలిచే పుణ్యమూర్తులు కొందరు
                   మందిని చంపి పెరిగే ధూర్తజనులు కొందరు
                   కాలాని కెదురీది దేహధారు లెవ్వరు బతకలేరు
                   నువ్వు చూపిన దారిలో నడిస్తేను అందరి బంధువులై నిలుస్తారు- హరిఓం!
||పల్లవి||
చరణం 3:  తన్ను కాదన్నాదని ముఖాన్ని మైలజేసి పాడుజేసేది
                   తన పక్కకు రాలేదని ఇంకెవ్వరి పక్కకు పోనివ్వనిది
                   తను మెచ్చింది తనకే దక్కాలనేది సహజప్రేమ కాదు
                   మెచ్చినది పచ్చగ ఉండాలని కోరుకునేది గొప్పమనసు
                   బతికించేది తప్ప చంపిపాతరేసేది దౌర్జన్యప్రేమ నాకొద్దు నాకొద్దు - హరిఓం!
||పల్లవి||
చరణం 4:  గట్టిగ రాసిన పరిక్ష తన్నేసిందని చచ్చేటివాళ్ళు
                   మెచ్చిన పడుచు పక్కకు రాలేదని చచ్చేటివాళ్ళు
                   హెచ్చుగ భోగాలు ఒరిగిపడలేదని చచ్చేటివాళ్ళు
                   నీ తత్వ మెరుగలేరు నిన్నెన్నడు కనుగొనలేరు
                   నిన్ను నమ్మిన వాడెవ్వ డనాధ కాడు, నన్ను మాత్రమట్లు చావనీకు - హరిఓం!
||పల్లవి||
చరణం 5:  ఆకలిదప్పులకు మాడి చావనివ్వకు
                   ఆలుబిడ్డల దుఃఖము చూడనివ్వకు
                   తీర్చలేని అప్పుల బారిన పడనివ్వకు
                   రాకపోకల మర్యాదలందు లోటు రానివ్వకు
                   తిండీబట్టాఇల్లూపరువు లివ్వుచాలు నిన్ను పొగుడుకుంటు కాలం గడిపేస్తాను - హరిఓం!
||పల్లవి||
-----------------------------------------------------------------------------------------------------------------
(01/02/2016)

6 comments:

  1. ఆహా ! చక్కని తల్లి కి చాంగు భళా !

    ఇక్కడనూ పద్యాలు మొదలయ్యే యీ :)

    హతోస్మి :)

    ఎన్నేసి టపాల కని పదాలు కలిపేది జిలేబి :)


    హరి చరణములన నిదియే !
    హరిహరి యనుచు మురిసాడె హరి ఘన మురళీ !
    పరిపరి జెప్పెను లోకపు
    విరుపుల గనుమా జిలేబి విరివిగ రవళీ :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  2. ఇది ఏమి వృత్తం ? ఇలా అర్ధమయ్యే భాషలో వ్రాస్తే చదవబుద్ధి అవుతుంది. రుక్మిణీనాధుడు కూడా పామరుడే కదా ? బాగుంది.

    తిండీ బట్టా ఇల్లూ పరువులివ్వుచాలు నిన్ను పొగుడుకుంటు గడిపేస్తాను - హరిఓం!

    ReplyDelete
    Replies
    1. వృత్తమూ కాదు సరలరేఖా కాదు:-)
      ఛందస్సు జోలికే పోలేదు,శుద్ధ వచనం!

      Delete
  3. >>నన్ను మెచ్చనివారి రాకపోకలు లెక్కజెయ్యను
    simple and excellent

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...