Wednesday, 15 October 2014

ఒక పాత జోకును ఒక కొత్త ఫోటోతో రిమిక్స్ చేస్తే - గాంధీఇజం!

               అనగననగా ఒక వూళ్ళో ఒక రాజకీయ నాయకులుం గారు మహోత్సాహంతో తన రాజకీయ జీవితంలోని తొలి వుపన్యాసంలోనే నభూతోనభవిష్యతి అన్నంత గొప్పగా ఇరగదీద్దామని ప్రాంతీయ , జాతీయ , అంతర్జాతీయ విషయాలన్నిటి పైనా అవగాహన కల్పించుకుని ఒకానొక శుభముహూర్తంలో రాజు వెడలె రవి తేజము లలరగ అన్నట్టు బయలు దేరారు. ఇంకా రాజకీయ జీవితంలో అగ్రభాగానికి చేరుకోలేదు గాబట్టి దేవుడి కొద్దీ పత్రి అని తనకి తగ్గట్టుగా అన్ని హంగులూ కూర్చుకుని మైకు ముందుకు రాగానే ప్రాణం వుసూరు మనిపించింది. అంగబలం లేకపోవటంతో  ప్రేక్షకుడు వొకే వొక్కడు దొరికాడు మరి!
               మన సినిమా హీరోలు ప్రేక్షకులే నా దేవుళ్ళు అన్నట్టుగా ఆ యేక ప్రేక్షక వక్త కూడా తన దేవుణ్ణే అడిగాడు యెంతో గొప్పగా ప్రిపేరయి వచ్చాను, తీరా చూస్తే నువ్వొక్కడివే వున్నావు - యేం చెయ్యమంటావు అని. ఆ అమాయకుడు "అయ్యా,నేను గొడ్ల సావిట్లోకి గొడ్లకి మేతెయ్యాలని యెళ్ళా ననుకోండి ఒక్కటున్నా పది వున్నా పని పూర్తి చేసుకునే వస్తా గందా" అని లాజిక్కు లాగాడు! సూచన అర్ధమయి పోయింది, మేధావి గదా? ఇక తన సిలబసు తను ఫాలో అయిపోయాడు.

               అంతా అయిపోయాక ఫీడు బాకు అడిగాడు, ప్రతి మనిషీ తన కష్టానికి ప్రతిఫలం కోరుకంటాడు గదా పాపం! వక్త గారి విజృంభణకి గట్టిపిండం కాబట్టి తట్టుకుని నిలబడ్డాడో, మరి శోష వచ్చినా తన మాట చెప్పాలి గాబట్టి తేరుకున్నాడో గానీ చెప్పాడు, "అయ్యా,నేను గొడ్ల సావిట్లోకి గొడ్లకి మేతెయ్యాలని యెళ్ళా ననుకోండి పది గొడ్లకి యేసే మేత వొక్క గొడ్డుకి యెయ్యను,అట్టా యెయ్యగూడదని నాకు తెలుసు గానీ మీకు తెలవనట్టుంది " - అని?

P.S:సరిగ్గా మోహన దాసు కరమ చందు గాంధీ చేసింది గూడా ఇదే!పెళ్ళాం మొగుడి మీద అలిగి తిండి మానేసి మొగుడికి జాలి పుట్టించి సాధించుకునే వ్యక్తిగత స్థాయిలో జరిగే తింగరి తనాన్ని మొత్తం ఒక జాతిని మరొక జాతి పీడిస్తున్నప్పుడు ఆ దురన్యాయాల్ని సామాజికంగా ప్రతిఘటించే సీరియస్ వ్యవహారంలోకి లాక్కొచ్చాడు?
______________________________________________________
(ఫొటో గూగుల్ సౌజన్యం)

11 comments:

  1. Wonderful.....
    anthe kada.....antha kanna MKG chesindemi ledu kadaa....

    ReplyDelete
  2. ఫోటో బాగుంది, ఇంతకీ ఎ పార్టీ వారిదో? CPM?

    Good post mixing humor & message (I may not share your opinion about Gandhi but that is a different matter).

    ReplyDelete
    Replies
    1. యే పార్టీ వారిదో నాకూ తెలియదండీ.గూగుల్ లో కనిపించగానే ఇదివరకు విన్న ఆ పాత జోకు కళ్లముందు కనబడినట్టయింది!

      Delete
  3. అంత పెద్ద విషయాన్ని ఇంత చిన్న కధలో బలే చెప్పారండి....

    ReplyDelete
    Replies
    1. జోకు పాతదే నండీ,చదివి నవ్వుకుని చాలా కాలమయింది!కాని మన పొలిటీషియన్లు ఆ జోకును కూడా నిజం చెయ్యగలరని ఫోటో చూడగానే అనిపించింది!రెంటినీ కలిపాను నేను, అంతే!!

      Delete
  4. అవున్నిజమే గాంధేయవాదాన్నికాకుండా, చేతల్ని నమ్ముకున్న వారుకొందరున్నారు. వాళ్ళనే నక్సలైట్లంటారు. వాళ్ళుకూడా భగవద్గీతలో చెప్పినట్లుగానే ధర్మాన్ని రక్షించడానికి పోరాటమే (కురుక్షేత్ర యుధ్ధమే) దారి అని నమ్మి, ఆచరిస్తున్నారు. కానీ ప్రజలే అది అర్ధంకాక అన్నా హజారే నిరశన దీక్షను support చేశారు.


    గాంధీ మాలా, మాదిగల సంక్షేమానికి కృషిచేసాడు - కాబట్టి బ్రాహ్మణులు ఆయన్ని disown చేశారు.
    వర్ణాశ్రమ ధర్మాలని సమర్ధించాడు - కాబట్టి మల, మాదిగ మేధావులు ఆయన్ను disown చేశారు.
    ఆయన హిందూ పుటక పుట్టాడు - కాబట్టి ముస్లిం మేధావులు disown చేశారు.
    (నౌరోలీ) అల్లర్ల నేపధ్యంలో వినిపించిన ఒకే ఒక్క sane voice గాంధీది - అందుకుగానూ హిందువులు ఆయన్ను disown చేశారు.
    మనలా కులమనే కుష్టుతో, మతమనే 'సుఖ'వ్యాధితో కుళ్ళిపోని కొందరు చాతగాని సన్నాసులు (ఇక్కడ మనం నెల్సన్ మండేలా, మార్టిన్ లూధర్ మరియు ఐన్శ్టైన్ లను గుర్తుతెచ్చుకోవాలి) మాత్రమే ఆయన్ను గుర్తించారు.


    గాంధీ ఒక మతాన్ని స్థాపించుకొనుంటే, రాముణ్ణి, మహమ్మద్‌నీ, ఆయా భజన సంఘాలు defend చేస్తున్నట్లు, గాంధీనీ కొందరు defend చేసేవారు.


    I don't expect this comment to be published but if it makes a dent in the blog admin's thought process (which it surely does -the non publishing of this comment shall prove), I shall feel succeeded.

    ReplyDelete
  5. కొందరు ఇలీటిస్టుల passtimeగా ఉన్న స్వతంత్య పోరాటాన్ని, గాంధీ అందరిదీ చేశాడు. ఆయన ఎంతైతే తీవ్రతలో (హింస నుంచి అహింసకు మార్చాడుకదా దృక్పధాన్ని) మార్పు తీసుకొచ్చాడొ, అంతకన్నా ఎక్కువమార్పు విస్తృతిలో తీసుకొచ్చాడు (ప్రజలందరినీ పోరాటంలో భాగస్వామ్యం చేశాడు). He prepared everybody to fight for our situation and had made that damn freedom precious to everybody. Without him sir, the freedom struggle would have the drawing room topic of a few elites. In my opinion he was the first to realize the power of the masses.


    అలాగని ఆయన వల్ల జరిగినదంతా మంచేకాదు. ఆయనవల్ల కొన్ని పొరపాట్లు జరిగాయి. And they did happen not because he was evil, but he was ignorant and a little bit pedantic. The best part about Gandhi is that you would gain knowledge of this flaws just be reading his own biography which happens to have been authored. Rarely do we see such innocence in people.

    భారతీయ ఆత్మని గాంధీలానే ప్రభావితం చేసిన రాముడి characterలో తప్పులు వెదగ్గలరా? వెదకలేరు. ఎందుకంటే రాముడు religious figure కాబట్టి, మనోభావాలు గాయపడతాయి కాబట్టి, మతం మొదలయ్యేచోట మన తర్కం, మన causality అంతమౌతాయికాబట్టి. so let's gather to bang Gandhi ALONE.

    ReplyDelete
    Replies
    1. ఐకొనొక్లాస్ట్ గారూ,
      పైన మీరు వుదహరించిన పాయింట్లను నేను "కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?! (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ)" అనే టపాలో ప్రస్తావించాను!

      ref:http://harikaalam.blogspot.in/2014/09/blog-post_6.html

      గాంధీ రాజకీయ రంగంలో ప్రవేశించే నాటికి వున్న స్థితీ,అతని లిమిటేషన్స్,అతను చరిత్ర మీదా ప్రజల మీదా చేసిన ట్రిక్ అన్నీ ప్రస్తావించాను,చదివి చూడండి.

      Delete
    2. @iconoclast
      అది నావైపు నుంచి కాంగ్రెసు చారిత్రకంగా ఈ దేశంలో యే స్థానాన్ని ఆక్రమించి యేమి చేసిందనే పరిశీలనాత్మకమయిన 6 వ్యాసాల్లో రెండవది.మొదటి భాగానికి అడుగున ఒక లింకు ఇచ్చాను.ఒకదాని కొకటి కొనసాగింపుగా అన్నీ పూర్తయితే గానీ ఈ దేశపు రాజకీయాల్లో ఇప్పుడు వున్న గందరగోళం అర్ధం కాదు.

      Delete
    3. The best part about Gandhi is that you would gain knowledge of this flaws just be reading his own biograph....
      >>
      I have read his autobiography very long back.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...